Kashmiri woman
-
గొప్పగా మాట్లాడి వస్తే ఇలాగేనా చెక్ చేసేది ?
న్యూఢిల్లీ: పాక్ బాలికల విద్య, హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసఫ్జాయ్లాగా తానేమీ స్వదేశం వదిలిపోలేదని, సొంత కశ్మీర్లో హాయిగా ఉన్నానంటూ బ్రిటన్ పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన కశ్మీర్ యువతి యానా మిర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్రిటన్ నుంచి విమానంలో తిరిగొచ్చాక ఆమె బ్యాగులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనిఖీచేయడమే ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. బ్రిటన్‌లో భారత్ గురించి గొప్పగా ప్రసంగించిన నాలాంటి వ్యక్తిని ఇలాగేనా అవమానించేది?. ఖరీదైన లూయిస్ విట్టన్ బ్రాండ్ షాపింగ్ ఖాళీ సంచులు తెచి్చనందుకే బిల్లులు ఎగ్గొట్టిన దొంగలా చూస్తున్నారు. నన్ను వాళ్లు ఇండియా మీడియా యోధురాలిగా భావిస్తే మీరేమో ఇక్కడ నన్ను బ్రాండ్ స్మగ్లర్లా భావించి పరువు తీస్తున్నారు’’ అని అధికారులతో స్వరం పెంచి మాట్లాడారు. అధికారులతో వాగ్వాదం తాలూకు వీడియోను స్వయంగా కెమెరాతో షూట్‌చేసి ‘ఎక్స్’లో షేర్చేశారు. దీనిపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘ అంతర్జాతీయ ప్రయాణికుల బ్యాగులను స్కానింగ్ చేయడం సర్వసాధారణం. గౌరవం చట్టాలకు అతీతం కాదు. బ్యాగ్ స్కానింగ్‌కు ఆమె ఒప్పకోలేదు’ అని అన్నారు. -
ఫేస్బుక్లో ఉగ్ర ఎర
శ్రీనగర్: ఫేస్బుక్ ద్వారా యువకుల్ని రెచ్చగొడుతూ ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న కశ్మీరీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ప్రధానంగా ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కోసం పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆరోపణలపై కశ్మీర్లో ఒక మహిళను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉత్తర కశ్మీర్‌లోని బందీపూర్‌కు చెందిన షాజియా(30) అనే మహిళ ఫేస్బుక్ వేదికగా జిహాద్ కోసం పనిచేయాలని, ఆయుధాలు చేతపట్టాలని యువకులు లక్ష్యంగా పోస్టులు పెట్టిందని పోలీసులు గుర్తించారు. ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ ఆధారంగా ఆమెను కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అనంత్‌నాగ్‌కు చెందిన ఇద్దరు యువకులకు ఆమె ఆయుధాలు, తుపాకీ మేగజీన్లు అందించినట్లు విచారణలో తెలిసింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షాజియా ఇన్మార్ఫర్‌గా నటిస్తూ పోలీసుల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని మిలిటెంట్లకు చేరవేసినట్లు భావిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. మిలిటెంట్లను పట్టుకోవడంలో సాయపడతానని చెప్పి ఆమెనే పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించేదని తెలిసింది. షాజియా ప్రవర్తనపై అనుమానంతో కొన్నాళ్లుగా పోలీసులు ఆమెపై నిఘా పెంచారు. షాజియా నుంచి పోలీసులు గ్రెనేడ్లు, ఇతర ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆమె ఇద్దరు సోదరుల్ని కూడా అరెస్ట్ చేశారు. సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి.. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన సీఆర్పీఎఫ్ శిబిరంపై ఆదివారం జరిగిన మిలిటెంట్ల దాడిలో ఒక హవల్దార్ మరణించగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సాయుధులు శిబిరంపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసిరారని అధికారులు తెలిపారు. కశ్మీర్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాకపురా అనే ప్రాంతంలో ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. -
నాన్నను చూసి వస్తాను.. అనుమతివ్వండి!
ఆమె తండ్రి పాకిస్థాన్‌లో చావుబతుకుల మధ్య ఉన్నాడు. 80 ఏళ్ల ఆయనను ఒక్కసారి చూసి వచ్చేందుకు ఓ కూతురు తపిస్తోంది. ఇందుకు అనుమతి ఇవ్వాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఆమెనే ఇరామ్ సయర్. ఆమె భర్త ఓ మాజీ కశ్మీర్ మిలిటెంట్. పాకిస్థాన్‌లోని రావల్పిండికి చెందిన ఈ దంపతులు 2012లో నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం కశ్మీర్లో నివాసముంటున్నారు. అయితే నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చేసమయంలో వీరి పాస్‌పోర్టు, ఇతర పత్రాలను నేపాల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సాంకేతికంగా ఈ దంపతులు ఇటు భారత్‌గానీ, అటు పాకిస్థాన్‌గానీ చెందిన వారు కాకపోవడంతో రావాల్పిండిలోని తన తండ్రిని చివరిసారి చూసుకొని రావడానికి ఆమె అనుమతి లభించడం లేదు. ఇదే విషయమై ఇరామ్ సయ్యర్ తాజాగా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీని కలిసి విన్నవించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మెహబుబా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రాజ్‌నాథ్ శ్రీనగర్‌కు రానున్నారు. ఇరామ్ భర్త సయర్ అహ్మద్ లోన్ 2001లో మిలిటెంట్‌గా మారి ఎల్వోసీ దాటి కశ్మీర్ చేరుకున్నాడు. 2007లో రావల్పిండికి చెందిన ఇరామ్ను పెళ్లిచేసుకున్నాడు. సయర్ ఇటీవల మిలిటెంట్ నుంచి పరివర్తన చెందాడు. మెహబూబా ప్రభుత్వం మాజీ మిలిటెంట్లకు పునరావాస పథకం ప్రకటించడంతో అతను తిరిగి కశ్మీర్ వచ్చి నివసిస్తున్నాడు. అయితే 80 ఏళ్ల తన తండ్రి కిడ్నీ, గుండె సంబంధ వ్యాధులతో చికిత్స పొందుతున్నాడని, చావుబతుకుల మధ్య ఉన్న ఆయనను చివరిచూసి వచ్చేందుకు మానవతా దృక్పథంతో అనుమతి ఇవ్వాలని సీఎం మెహబాబాను కోరినట్టు ఇరామ్ సయర్ తెలిపారు.