Alleges
-
రష్యన్ మహిళకు వింత అనుభవం : రీల్ తెచ్చిన తంటానేనా?
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన మహిళాప్రయాణీకురాలికి చేదు అనుభవం ఎదురైంది. రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారాకు బోర్డింగ్ పాస్‌పై ఒక పాస్‌పోర్ట్ అధికారి ఫోన్ నంబర్‌ను రాసి ఇవ్వడంతో పాటు మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు కాల్ చేయాలని పేర్కొన్నాడన్న ఆరోపణలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దినారా సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన బోర్డింగ్ పాస్‌పై అతని ఫోన్ నంబర్‌ను రాసి, నెక్ట్స్ టైం వచ్చినపుడు సంప్రదించాలని పేర్కొన్నట్టు దినారా వీడియోలో ఆరోపించింది. దీనికి సంబంధించిన బోర్డింగ్ పాస్‌ను కూడా చూపించింది. ‘‘అరే యార్, ఈ ప్రవర్తన ఏమిటి?" అంటూ ప్రశ్నించింది. అంతేకాదు దీనిపై ఇది సరి అయినదేనా అంటూ పోల్ కూడా నిర్వహించింది.అయితే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. అటు అధికారులనుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol)అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా గతవారం ఇండియన్ భర్త కావాలంటూ ఇటీవల ఆమె చేసిన రీల్‌ను కొంతమంది గుర్తుచేసుకున్నారు. బహుశా అందుకే సదరు ఆ అధికారి అలా చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, దినారా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని QR కోడ్‌తో పాటు, "లుకింగ్ ఫర్ ఏ ఇండియన్ హస్బెండ్" అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసింది. గోడపై పోస్టర్ అతికిస్తున్న ఈ చిన్న క్లిప్‌కు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol) భారతదేశంలో పర్యటిస్తూ తన అనుభవాలతో వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంద్వారా పాపులర్ అయింది దినారా. ప్రస్తుతం స్వదేశానికి వెళ్లి పోయింది. మాస్కో నుండి ఇన్‌స్టా స్టోరీలను పోస్ట్ చేస్తోంది. -
ఎన్ఆర్ఐ అభిజిత్‌ది హత్యా? ఆత్మహత్యా? పోలీసుల ప్రకటన ఆంతర్యం ఏమిటి?
అమెరికాలో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన 20 ఏళ్ల భారతీయ విద్యార్థి పరుచూరి అభిజిత్‌ది హత్యకాదని అమెరికా పోలీసులు తేల్చారు. హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు తమ ప్రాథమిక విచారణలో హత్య అని అనుమానించేందుకు ఆధారాలేవీ లేవని చెప్పినట్లు న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు. అభిజిత్ అకాల మరణంపై విచారాన్ని వ్యక్తం చేసిన కాన్సులేట్, అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు అన్ని ఏర్పాటు చేశామని, ఈ విషయంలో స్థానిక అధికారులతో పాటు భారతీయ-అమెరికన్ కమ్యూనిటీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ ఎక్స్( ట్విటర్) పోస్ట్‌లో పేర్కొంది. దీంతో అభిజిత్ ఆత్మహత్య చేసుకున్నాడా?అనే అనుమానాలు తలెత్తెతున్నాయి. అదే నిజమైతే అభిజిత్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అసలు డెడ్ బాడీ అడవిలోకి ఎలా వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తమ తనయుడు అభిజిత్‌ను మార్చి 11న యూనివర్శిటీ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని కారులో అడవిలో వదిలివెళ్లారని ఆరోపించిన సంగతి తెలిసిందే. చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులు చాన్నాళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు అతని సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అదే రోజు గుర్తించడం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిజిత్ భౌతిక కాయానికి స్వస్థలం బుర్రిపాలెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఏడాది (2024) ప్రారంభం నుండి, అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు తొమ్మిది మంది మరణించడం విషాదం. Deeply saddened to learn about the unfortunate demise of Mr. Abhijeeth Paruchuru, an Indian student in Boston. Mr. Puruchuru’s parents, based in Connecticut 🇺🇸, are in direct touch with detectives. Initial investigations rule out foul play. @IndiainNewYork rendered… — India in New York (@IndiainNewYork) March 18, 2024 -
గొప్పగా మాట్లాడి వస్తే ఇలాగేనా చెక్ చేసేది ?
న్యూఢిల్లీ: పాక్ బాలికల విద్య, హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసఫ్జాయ్లాగా తానేమీ స్వదేశం వదిలిపోలేదని, సొంత కశ్మీర్లో హాయిగా ఉన్నానంటూ బ్రిటన్ పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన కశ్మీర్ యువతి యానా మిర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్రిటన్ నుంచి విమానంలో తిరిగొచ్చాక ఆమె బ్యాగులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనిఖీచేయడమే ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. బ్రిటన్‌లో భారత్ గురించి గొప్పగా ప్రసంగించిన నాలాంటి వ్యక్తిని ఇలాగేనా అవమానించేది?. ఖరీదైన లూయిస్ విట్టన్ బ్రాండ్ షాపింగ్ ఖాళీ సంచులు తెచి్చనందుకే బిల్లులు ఎగ్గొట్టిన దొంగలా చూస్తున్నారు. నన్ను వాళ్లు ఇండియా మీడియా యోధురాలిగా భావిస్తే మీరేమో ఇక్కడ నన్ను బ్రాండ్ స్మగ్లర్లా భావించి పరువు తీస్తున్నారు’’ అని అధికారులతో స్వరం పెంచి మాట్లాడారు. అధికారులతో వాగ్వాదం తాలూకు వీడియోను స్వయంగా కెమెరాతో షూట్‌చేసి ‘ఎక్స్’లో షేర్చేశారు. దీనిపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘ అంతర్జాతీయ ప్రయాణికుల బ్యాగులను స్కానింగ్ చేయడం సర్వసాధారణం. గౌరవం చట్టాలకు అతీతం కాదు. బ్యాగ్ స్కానింగ్‌కు ఆమె ఒప్పకోలేదు’ అని అన్నారు. -
రాహుల్, ప్రియాంక మధ్య విబేధాలు? బీజేపీ సందేహం వెనుక ఏముంది?
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా శుక్రవారం ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనలేకపోయారు. తాను యాత్రకు గైర్హాజరు కావడం వెనుక అనారోగ్యమే కారణమని, ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే ఈ ప్రయాణంలో భాగమవుతానని ప్రియాంక తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ యాత్ర ప్రారంభమై 34 రోజులు దాటింది. ఈ నేపధ్యంలో ప్రియాంకా గాంధీ తొలిసారిగా దీనిలో పాల్గొనబోతున్నారనే ప్రకటన వెలువడింది. అయితే ఇంతలోనే ఆమె ఈ యాత్రకు గైర్హాజరు కావడంపై బీజేపీ సందేహం వ్యక్తం చేసింది. అన్నాచెల్లెళ్ల మధ్య బేధాభిప్రాయాలే దీనికి కారణమని బీజేపీ ఆరోపించింది. ప్రియాంక గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే ఆసుపత్రిలో చేరినట్లు తెలియజేశారు. ఆమె తన పోస్ట్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉత్తరప్రదేశ్‌కు ఎప్పుడు చేరుకుంటుందానని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అయితే అనారోగ్యం కారణంగా నేను ఈరోజే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిన వెంటనే, నేను ఆ ప్రయాణంలో భాగమవుతాను. చందౌలీ-బనారస్‌లో జరిగే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనబోయే నేతలకు, కార్యకర్తలకు, నా ప్రియమైన సోదరునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. सबको अपने स्वास्थ्य का ख़्याल रखना चाहिए। जब यात्रा 2.0 शुरू हुई तब भी प्रियंका वाडरा वहाँ से नदारद थीं, और आज जब राहुल की यात्रा उत्तर प्रदेश पहुँची है, तब भी प्रियंका वहाँ नहीं रहेंगी। पार्टी पर मिल्कियत के लिए भाई-बहन के बीच ना पटने वाली ये खाई अब सर्वविदित है। pic.twitter.com/26KaPOBeYY — Amit Malviya (@amitmalviya) February 16, 2024 మరోవైపు డీహైడ్రేషన్, వికారం కారణంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ప్రియాంక గాంధీ తన ఆరోగ్య వివరాల గురించి చేసిన ట్వీట్‌కు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందించారు. ప్రియాంక గాంధీ పోస్ట్‌పై ఆయన వ్యాఖ్యానిస్తూ ‘ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. యాత్ర 2.0 ప్రారంభమైనప్పుడు కూడా ప్రియాంక వాద్రా కనిపించలేదు. రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకున్నప్పుడు కూడా ప్రియాంక హాజరుకావడం లేదు. పార్టీ నాయకత్వం కోసం అన్నాచెల్లెళ్ల మధ్య ఏర్పడిన ఈ పూడ్చలేని అగాధం ఇప్పుడు అందరికీ తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ యాత్ర 2024, జనవరి 14న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుంచి ప్రారంభమైంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. అయితే మార్చి మొదటి పక్షంలోనే ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఇది తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల గుండా వెళుతూ, ఫిబ్రవరి 16 నుండి 21 తేదీల మధ్య రాయ్‌బరేలీ అమేథీల గుండా ముందుకు వెళుతుంది. ఫిబ్రవరి 22, 23లలో యాత్రకు విశ్రాంతినివ్వనున్నారు. ఈ యాత్ర పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఫిబ్రవరి 24, 25 తేదీలలో తిరిగి ప్రారంభం కానుంది. -
'నన్ను వేధిస్తున్నాడు..' ఎమ్మెల్యేపై మహిళా పోలీసు ఆరోపణలు
చిక్కమంగళూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది ఓ మహిళా పోలీసు. కక్షపూరితంగా తనను బదిలీ చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె తన వాట్సాప్ స్టేటస్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ఈ వ్యవహారంలో ఆమెపై చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కర్టాటకకు చెందిన మహిళా పోలీసు లత. చిక్కమంగళూరు జిల్లాలోని కాడూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఎస్. ఆనంద్ తనను వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో హెల్మెట్ లేని కారణంగా కాంగ్రెస్ కార్యకర్తకు జరిమానా విధించింది మహిళా పోలీసు లత. ఈ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆనంద్ అప్పట్లో తనతో వాగ్వాదానికి దిగాడని ఆమె తెలిపింది. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఎన్నికల అనంతరం మహిళా పోలీసు లత కాడూరు స్టేషన్ నుంచి టరికేరి స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీపై అధికారి లత నిరసన వ్యక్తం చేశారు. తనను కక్షపూరితంగా బదిలీ చేయడంపై లత.. ఎమ్మెల్యేకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ ఘటనల అనంతరం లత.. తనను ఎమ్మెల్యే ఆనంద్ వేధిస్తున్నాడని వాట్సాప్ స్టేటస్ పెట్టారు. తనకు ఏమైనా.. ఎమ్మెల్యేనే కారణమని పేర్కొంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఆమెను సస్పెండ్ చేశారు. ఇదీ చదవండి: 'మణిపూర్ సమస్యకు సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం..' -
కాస్త అదానీతో మాట్లాడి భారత్, చైనా.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను,,
కాస్త అదానీతో మాట్లాడి భారత్, చైనా.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించమంటున్నార్సార్! -
వెకిలిగా నవ్వాడు.. ఆ స్పర్శతో తొలిసారి నగ్నంగా ఫీలయ్యా: నటి
Emily Ratajkowski Alleges Robin Thicke: ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ చేస్తున్నప్పడు సింగర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రముఖ అమెరికన్ మోడల్ ఎమిలీ రటాజ్కోవ్స్కీ ఆరోపించింది. 2013లో ‘బ్లర్డ్ లైన్స్’అనే మ్యూజిక్ వీడియో షూట్ సమయంలో సమయంలో అమెరికన్ సింగర్ రాబిన్ తికే తాగి సెట్స్‌పైకి వచ్చాడు. 'అంతేకాకుండా నా చాతిని (వక్షోజాలను) టచ్ చేశాడు. ఓ వ్యక్తి స్పర్శను నేను వెంటనే పట్టిగట్టాను. ఎవరా అని వెనక్కి తిరిగి చేస్తూ..రాబిన్ వెకిలిగా నవ్వుతూ కనిపించాడు. వెంటనే నేను అక్కడి నుంచి పరిగెత్తాను. అప్పుడు మొదటిసారి నేను నగ్నంగా ఉన్నట్లు అనిపించింది' అంటూ పేర్కొంది. ఈ మ్యూజిక్ వీడియోలో ఎమిలీతో పాటు మరో ఇద్దరు మోడల్స్ సైతం నగ్నంగా కనిపించారు. షూటింగ్ వరకు నగ్నంగా ఉన్నా తానెప్పుడూ అలా ఫీల్ అవ్వలేదని, రాబిన్ చర్యలతో సిగ్గుతో సెట్ వెనకాల దాక్కున్నట్లు ఎమిలీ ఆరోపించింది. కాగా ఇటీవలె ఈమె రాసిన ‘మై బాడీ‘అనే పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాబిన్‌పై ఎమిలీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్ రాబిన్ ఇంత వరకు స్పందించలేదు. చదవండి: నా కొడుకు అమ్మాయిలతో తిరగొచ్చు..డ్రగ్స్ తీసుకోవచ్చు! -
Gandhi Hospital: అత్యాచారం కేసు.. పురోగతి సాధించిన పోలీసులు
సాక్షి, హైదారబాద్: సంచలనంగా మారిన గాంధీ ఆసుపత్రి అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గాంధీ ఆసుపత్రిలో తనతోపాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్త్ జోన్ పోలీసులు 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. 10 అంతస్తుల గాంధీ ఆస్పత్రిలోని 379 గదులతో పాటు డ్రైనేజితో మొదలుకొని అన్ని చోట్ల ఏదీ వదలకుండా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్‌లో గాంధీ ఆస్పత్రి సీసీ పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు... బాధితురాలు ఈ నెల 12న గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తిరిగిన దృశ్యాలు కనిపించాయి. చిరిగిన దుస్తులతో నీరసంగా కనిపించడంతో ఆస్పత్రి చుట్టుపక్కల నిర్మానుష్య ప్రాంతాల్ని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. -
వారి వల్ల రూ. 400కోట్ల నష్టం- జియో
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీలపై మరోసారి దాడికి దిగింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలపై తీవ్ర ఆరోపణలతో డిపార్టమెంట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గడప తొక్కింది. వీటి కారణంగా ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందని ఆరోపిస్తూ డాట్‌కు ఫిర్యాదు చేసింది. ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా మార్చిలో అవసరమైన లైసెన్స్ ఫీజును జమ చేయలేదంటూ జియో టెలికాం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. గత త్రైమాసికంలో ముందస్తు లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లింపు కారణంగా ప్రభుత్వానికి రూ .400 కోట్ల నష్టం వచ్చిందని పేర్కింది. దీనిపై డాట్ సంబంధిత చర్యలు తీసుకోవాల్సిందిగా జియో కోరింది. లైసెన్సులను ఏకపక్షంగా నిర్ణయించడం, తక్కువ లైసెన్స్ ఫీజులను అనుమతించడం లాంటి చర్యలు నిబంధనల ఉల్లంఘనగా ఉందని తన లేఖలో పేర్కొంది. లైసెన్సు ఉల్లంఘన (టెలికాం సర్వీసు ప్రొవైడర్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని, ఫైనాన్షియల్ పెనాల్టీలు, లేదా లైసెన్స్ రద్దు లేదా లైసెన్స నిలిపివేయడం చేయాలని కోరింది. ఆర్థిక జరిమానాగా రూ.50 కోట్ల జరిమానా విధించాలని డిమాండ్ చేస్తోంది. లైసెన్స్ ఫీజు చెల్లించడంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లైసెన్సు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించాయంటూ ముకేష్ అంబానీ నేతృత్వంలోని జియో పిటిషన్ దాఖలు చేసింది. 2016-17 నాటికి అంచనా వేసిన స్థూల రాబడి ఆధారంగా చెల్లించిన ఫీజు, లైసెన్స్ నిబంధనలకు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు కంటే తక్కువగా ఉందని పేర్కొంది ఫిర్యాదు ప్రకారం, ఎయిర్టెల్ జనవరి-మార్చి 2017 నాటికి రూ. 950 కోట్ల లైసెన్స్ ఫీజుగా చెల్లించింది. అక్టోబర్-డిసెంబరు 2017 వరకు ఎయిర్టెల్ చెల్లించిన 1,099.5 కోట్ల లైసెన్స్ ఫీజుతో పోలిస్తే ఇది రూ. 150 కోట్ల తక్కువ. అదేవిధంగా, వోడాఫోన్ రూ. 550 కోట్లు చెల్లించింది, ఇది మూడవ త్రైమాసికంలో చెల్లించిన రూ. 746.8 కోట్ల లైసెన్స్ ఫీజుతో పోలిస్తే రూ. 200 కోట్లు తక్కువ . అలాగే మూడవ త్రైమాసికంలో చెల్లించిన రూ.609 కోట్లతో పోలిస్తే ఐడియాఈ క్వార్టర్లో రూ.60కోట్లు తక్కువ చెల్లించింది. కాగా నిబంధనల ప్రకారం, టెలికం ఆపరేటర్ ఆశించిన ఆదాయాల ఆధారంగా జనవరి-మార్చి కాలానికి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, కానీ అదే ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో చెల్లించిన రుసుము కన్నా తక్కువగా ఉండకూడదు. -
వాళ్లిద్దరు నన్ను టార్చర్ పెట్టారు
ఇండోర్: ఇప్పటికే పలు కేసుల్లో కటకటాలపాలైన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూజీ, ఆయన కుమారుడు నరయాన్ సాయి మరోసారి చిక్కుల్లో పడ్డారు. తనను మానసికంగా శారీరకంగా చిత్ర హింసలు పెట్టారని ఆశారం కోడలు, నరయాన్ భార్య జానకీ(38) ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నరయాన్ నుంచి విడిపడి వేరుగా ఉంటున్న ఆమె తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు భద్రత కల్పించాలని కోరింది. తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని లేదనంటే చంపేస్తామంటూ ఆశారాం తరుపు బంధువులు కూడా బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. అయితే, బెదిరిస్తున్నవారి పేర్లు మాత్రం స్పష్టంగా బయటపెట్టలేదు. ఇప్పటికే తండ్రి కొడుకులు పలువురిపై లైంగిక దాడులు చేశారనే కేసులో జైలులో ఉంటున్నారు. -
కూలీ పనులు చేసుకునే బాలికల పై అత్యాచారం
-
న్యాయం కోసం భార్య పోరాటం
-
పోలీస్ స్టేషన్ మెట్లెక్కి భర్తపై ఫిర్యాదు
-
మహిళల పట్ల కొనసాగుతున్న వరకట్న వేధింపులు
-
కాంగ్రెస్,టిడిపిలు కుమ్మక్కు