చిక్కమంగళూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది ఓ మహిళా పోలీసు. కక్షపూరితంగా తనను బదిలీ చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె తన వాట్సాప్ స్టేటస్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ఈ వ్యవహారంలో ఆమెపై చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కర్టాటకకు చెందిన మహిళా పోలీసు లత. చిక్కమంగళూరు జిల్లాలోని కాడూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఎస్. ఆనంద్ తనను వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో హెల్మెట్ లేని కారణంగా కాంగ్రెస్ కార్యకర్తకు జరిమానా విధించింది మహిళా పోలీసు లత. ఈ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆనంద్ అప్పట్లో తనతో వాగ్వాదానికి దిగాడని ఆమె తెలిపింది. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే.. ఎన్నికల అనంతరం మహిళా పోలీసు లత కాడూరు స్టేషన్ నుంచి టరికేరి స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీపై అధికారి లత నిరసన వ్యక్తం చేశారు. తనను కక్షపూరితంగా బదిలీ చేయడంపై లత.. ఎమ్మెల్యేకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ ఘటనల అనంతరం లత.. తనను ఎమ్మెల్యే ఆనంద్ వేధిస్తున్నాడని వాట్సాప్ స్టేటస్ పెట్టారు. తనకు ఏమైనా.. ఎమ్మెల్యేనే కారణమని పేర్కొంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఆమెను సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: 'మణిపూర్ సమస్యకు సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం..'
Comments
Please login to add a commentAdd a comment