cop
-
వాడీవేడిగా ‘కాప్’ సదస్సు
బాకు/న్యూఢిల్లీ: భూతాపంలో పెరుగుదలను కట్టుదిట్టంచేసి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రపంచదేశాలు ఒక్కతాటిమీదకొచ్చే ఐక్యరాజ్యసమితి చర్చావేదిక ‘కాప్’సదస్సు సోమవారం అజర్బైజాన్ దేశంలో ఆరంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా నిధులు సమీకరించడం, వెచ్చించడంసహా గత ఉమ్మడి కార్యాచరణ పటిష్ట అమలుపై సభ్యదేశాల మధ్య నెలకొన్న స్పర్థ సమసిపోవాలని ఆతిథ్య అజర్బైజాన్ దేశం ఈ సందర్భంగా కోరింది. నవంబర్ 22వ తేదీదాకా జరిగే కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 29వ సమావేశాలు అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో సోమవారం ప్రారంభంకాగా సభ్యదేశాల అగ్రనేతలు, ప్రతినిధి బృందాలు, పెద్దసంఖ్యలో పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. శిలాజఇంధనాల అతివినియోగం దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్న బాధిత గ్లోబల్ సౌత్ వర్ధమాన దేశాలకు కాలుష్యకారక సంపన్న దేశాలు రుణాలకు బదులు అధిక గ్రాంట్లు(నిధులు) ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ మళ్లీ తెరమీదకు తెచ్చారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి వాతావరణమార్పుల విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి సీమన్ స్టియెల్ ప్రారంభోపన్యాసం చేశారు.‘‘అత్యధిక కర్భన ఉద్గారాలను వెదజల్లుతున్న దేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు కాలుష్యాన్ని తగ్గించుకోలేకపోతే భారీమూల్యం చెల్లించుకోకతప్పదు. సరకు రవాణా గొలుసులు తెగిపోకుండానే కాలుష్యాన్ని తగ్గిస్తూ వస్తూత్పత్తిని కొనసాగించే సమర్థ చర్యల అమలుకు దేశాలు కంకణబద్దంకావాలి. లేదంటే ప్రపంచ ఆర్థికవ్యవస్థ కునారిల్లుతుంది. వాతావరణ పరిరక్షణకు నిధుల సమీకరణకు నవ్య మార్గాలను చూపించండి. ఇది ప్రతి ఒక్కదేశం బాధ్యత’’అని చెప్పారు. ఏమిటీ కాప్?వాతావరణాన్ని కాపాడేందుకు ప్రపంచదేశాలు ఒకచోట చేరి చర్చించే అంతర్జాతీయ కూటమి వేదికే కాప్. ఐరాస వాతావరణ మార్పు కూటమి(యూఎన్ఎఫ్సీసీసీ) కార్యనిర్వాహక విభాగాన్నే కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్)గా పిలుస్తారు. వాతావరణ మార్పు ఒప్పందం అమలు, భవిష్యత్ కార్యాచరణ, కాలుష్యాల కట్టడి, శిలాస ఇంథనాల వాడకాన్ని కనిష్టానికి దించడం, వాతావరణమార్పుల దు్రష్పభావాల బారినపడిన పేదదేశాలకు నిధులు ఇచ్చేందుకు సంపన్న, కాలుష్యకారక దేశాలను ఒప్పించడం వంటి కీలక బాధ్యతలను కాప్ చూస్తుంది. అయితే భారీ నిధులిస్తామంటూ సమావేశాలప్పుడు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్న సంపన్న దేశాలు తర్వాత నిధులివ్వకుండా ముఖంచాటేస్తున్నాయి. దీంతో సంపన్న దేశాల సంయుక్త ప్రకటనలు కార్యాచరణకు నోచుకోక కాగితాలకే పరిమితమవుతున్నాయి. పారిశ్రామికయుగం మొదలుకాకముందునాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని కాప్ కోరుకుంటోంది. కానీ అది ఈఏడాది ఏకంగా 3 డిగ్రీ సెల్సియస్ దాటి రాబోయే అతివృష్టి, అనావృష్టి, తుపాన్లు, వరదలు, కరువులు వంటి అనూహ్య వాతావరణ పరిస్థితులను సర్వసాధారణం చేసేస్తూ భావి తరాలకు భవిష్యత్తేలేకుండా చేస్తోంది. దారుణ దిశలో పయనిస్తున్నాం: కాప్ అధ్యక్షుడు కాప్29 అధ్యక్షుడు ముఖ్తార్ బాబాయేవ్ మాట్లాడారు. ‘‘మానవ కార్యకలాపాలు, అధికంగా శిలాజ ఇంధనాల వినియోగంతో భూతాపోన్నతి ఏటా 3 డిగ్రీసెల్సియస్ అధికమవుతోంది. ఈ పెడపోకడ ఇలాగే కొనసాగితే వందల కోట్ల ప్రజానీకం దారుణకష్టాల కడలిలో కొట్టుకుపోకతప్పదు. నూతన సమ్మిళిత లక్ష్యం(న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్–ఎన్సీక్యూజీ)ని సాధించాలంటే 2009లో ఏటా 100 బిలియన్ డాలర్ల నిధులివ్వాలన్న కాలంచెల్లిన నిధుల లక్ష్యాన్ని సవరించుకోవాల్సిందే. సమస్య తీవ్రత, విస్తృతిని దృష్టిలో ఉంచుకుని సభ్యదేశాలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, భూతాపం కట్టడిలో మెరుగైన భాగస్వామ్య పాత్ర పోషించాలి’’అని ముఖ్తార్ పిలుపునిచ్చారు. అయితే వర్ధమానదేశాలు తమ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు గరిష్టంగా 6.85 ట్రిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఐరాస వాతావరణవిభాగం చెప్పడం గమనార్హం. -
తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..
తండ్రిని చంపిన వాడిని హతమార్చేందుకు పోలీసుగా మారి పట్టుకోవడం వంటి ఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం. ప్రతికారం తీర్చుకోవడానికి ఎలాంటి పాట్లు పడి హీరో పైకి వచ్చి విలన్ని చంపుతాడో చూసి హ్యాపీగా ఫీలవ్వుతాం. అంతే కానీ ఇదే ఘటన రియల్ లైఫ్‌లో జరిగితే..ఔను మీరు వింటుంది నిజమే. ఓ మహిళ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం పోలీసుగా మారింది. మరీ ఆ హంతకుడిని పట్టుకుని హీరోలా శిక్షించిందా అంటే..ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. బ్రెజిల్లో రోరైమాలోని గిస్లేనే సిల్వా డి డ్యూస్ అనే 35 ఏళ్ల మహిళ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసుగా మారింది. దారుణ హత్యకు గురైన తండ్రికి ఎట్టకేలకు న్యాయం జరిగేలా చేసింంది. అందుకోసం ఆమె 25 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. చివరికి నిందితుడిని పట్టుకుని తన కుటుంబం పడ్డ బాధకు తెరపడేలా చేసింది. అసలేం జరిగిందంటే..సదరు మహిళా పోలీసు అధికారి తండ్రి జోస్ విసెంటే ఫిబ్రవరి 1999లో జస్ట్ 20 పౌండ్ల అప్పు కోసం కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటన స్థానిక బార్లో చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోస్ సూపర్ మార్కెట్ యజమాని. ఆయన స్థానిక బార్లో తన స్నేహితుడితో కలిసి పూల్ ఆడుతున్న సమయంలో ఈ దిగ్బాంతికర ఘటన జరిగింది. తన తండ్రి మార్కెట్‌కి సంబంధించిన సరఫరదారుడు రైముండో అల్వెస్ గోమ్స్ చేతిలోనే హత్యకు గురయ్యాడు. నిజానికి గోమ్స్ తన అప్పు చెల్లించాలని డిమాండ్ చేయగా ఫ్రీజర్‌తో సరిపెట్టుకోమని సూచించాడట జోస్. అయితే అందుకు గోమ్స్ నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో గోమ్స్ క్షణికావేశంలో తుపాకీతో జోస్ తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో అక్కడికక్కేడే చనిపోయాడు జోస్. అయితే 2013లో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి గోమ్స్‌ని పట్టుకుని 12 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. అయితే ఆ తీర్పుపై అప్పీలు చేస్తూ జైలు శిక్షను తప్పించుకున్నాడు. 2016లో అతని చివరి అప్పీల్‌ను తిరస్కరణకు గురై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే గోమ్స్ పట్టుబడకుండా తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇదంతా జరిగినప్పుడూ జోస్ కూతురు డ్యూస్‌కు తొమ్మిదేళ్లు. అప్పుడే ఆమె నిశ్చయించుకుంది ఎలాగైన తన తండ్రిని హతమార్చిన వాడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపించాలని తీవ్రంగా నిశ్చయించుకుంది.అందుకోసం బోయా 18 ఏళ్ల వయసుకే న్యాయశాస్త్రం అభ్యసించింది. తర్వాత పోలీసు దళంలో చేరింది. తన తండ్రిని హతమార్చిన వాడిని ఎలాగైన న్యాయస్థానానికి తీసుకురావలన్న సంకల్పంతో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించింది. నిందితుడి ఆచూకీకై అలుపెరగని పోరాటం చేసింది డ్యూస్. చివరికి నిందితుడు బోయా విస్టాకు సమీపంలో ఉన్న నోవా సిడేడ్ ప్రాంతంలోని ఒక పొలంలో దాక్కున్నట్లు గుర్తించి సెప్టెంబర్ 25న అరెస్టు చేసింది. 60 ఏళ్ల వయసులో గోమ్స్‌ని జైలుకి పంపిచాను. అంతేగాదు అతడితో నా కారణంగానే నువ్వు ఇక్కడ ఉన్నావు అని అతడి చెంప పగిలేట్టు చెప్పగలిగాను అని ఉద్వేగంగా చెప్పింది డ్యూస్.తన తండ్రిని హతమార్చిన వాడిని పట్టుకుని సంకెళ్లు వేసిన క్షణంలో డ్యూస్కి కన్నీళ్లు తన్నుకుంటూ వచ్చేశాయి. నిజాయితీపరుడైన తండ్రిని కోల్పోవడంతో తన కుటుంబం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో మర్చిపోలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన అమ్మ ఎట్టిపరిస్థితుల్లోనూ సరైన మార్గంలోనే పయనించండి అదే మీకు మంచి చేస్తుంది అనేది. అదే ఇవాళ నిజమయ్యింది అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చింది డ్యూస్. సెప్టెంబర్ 26, 2024న అల్వెస్ గోమ్స్ నేరారోపణకుగాను 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిజం నిప్పులాంటిది అంటే ఇదే కదూ..!. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
భేష్ సుకన్య మేడమ్..! నాటి రాజుల పాలన..
ఆమె ఆగ్రా ఏసిపి అర్ధరాత్రి 12 తర్వాత రైల్వేస్టేషన్ దగ్గర నిలబడి హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది ‘ఒంటరి ప్రయాణికురాలిని.. హెల్ప్ చేస్తారా?’ అని పోలీసులు ఎలా స్పందించారు? మహిళల రక్షణ విషయంలో పోలీసు అధికారుల ఇలాంటి ప్రయత్నాలు ఎలాంటి హెచ్చరికలు పంపుతాయి? రెండు మూడు రోజుల క్రితం. ఆగ్రాలోని రైల్వేస్టేషన్ దగ్గర ఒక మహిళ నిలుచుని ఉంది. తెల్ల షర్టు, బ్లాక్ జీన్స్ ధరించి ఉంది. చేతిలో చిన్న బ్యాగ్ ఉంది. అప్పటికి రాత్రి ఒంటి గంట. ఉత్తర ప్రదేశ్ హెల్ప్‌లైన్ 112కు కాల్ చేసింది. ‘నేను ఒంటరి ప్రయాణికురాలిని. ట్రైన్ మిస్ అయ్యాను. నాకు సాయం చేయగలరా?’ అని అడిగింది. అవతలి వైపు పోలీసుల స్పందన ఎలా ఉంటుందో చూసింది. ఆ పోలీసులు వెంటనే స్పందించారు. ‘మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి లేదా ఏదైనా జనం ఉండే చోట ఉండండి. మా వాళ్లు మీ కాంటాక్ట్‌లోకి వస్తారు’ అని చెప్పారు. మరికొన్ని క్షణాల్లోనే మరో ఫోన్. ‘మేం బయలుదేరాం. మీ లైవ్ లొకేషన్ పెట్టండి’ అని. ‘భేష్. మీరు రానక్కర్లేదు. నేను ఆగ్రా ఏసీపీ సుకన్య శర్మను’ అని ఫోన్ పెట్టేసింది.ఆ తర్వాత ఆటోను పిలిచింది. ఎక్కడకు వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కింది. ‘డ్రైవర్ భయ్యా... ఒంటరి మహిళలు ఈ టైమ్‌లో ఆటో ఎక్కడం సేఫేనా’ అని అడిగింది. ఆటోడ్రైవర్ ‘ఏం పర్లేదమ్మా. పోలీసులు ఆటోడ్రైవర్ల అన్ని వివరాలు తీసుకుంటున్నారు. ఖాకీ షర్ట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దంటున్నారు. మీకేం ఇబ్బంది లేదు’ అని ఆమె కోరిన చోట దించాడు. అప్పుడు ఆమె తనెవరో చెప్పి ‘స్త్రీలు మెచ్చే విధంగా ఉన్నావు. ఇలాగే అందరూ వ్యవహరించాలి’ అని అభినందించింది. పూర్వం ఎలా పాలన జరిగేదో చూడటానికి రాజులు మారు వేషాలు వేసేవారు. ఇలా అధికారులు కూడా సామాన్యుల్లా వ్యవహరించి తిరిగితే లోపాలు తెలిసి సమస్యలు దృష్టికి వచ్చి స్త్రీలకు మరింత రక్షణ ఏర్పాట్లు చేయవచ్చు. భేష్ సుకన్య మేడమ్.(చదవండి: పెప్పికో మాజీ సీఈవో ఇంద్రా నూయి పేరెంటింగ్ టిప్స్) -
కోల్‌కతా కేసు: సందీప్ ఘోష్, అభిజిత్ సంభాషణపై అనుమానాలు!
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తోపాటు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోండల్‌ను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. తాజాగా ఈ ఇద్దరిని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపర్చింది. హత్యాచార ఘటన జరిగిన గంటల వ్యవధితో సందీప్ ఘోష్.. అభిజిత్ మోండల్‌తో మాట్లాడారని సీబీఐ కోర్టుకు వెళ్లడించింది. ఈ కేసుతో వీరికి సంబంధం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది.వారిని విచారించాలని అసవరం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో కోర్టు వారిని సీబీఐ కస్టడీలో భాగంగా రిమాండ్లకు ఆదేశించింది. ఈ కేసును కోర్టు సెప్టెంబర్ 17వరకు వాయిదా వేసింది.‘‘ఈ కేసులో రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయింది. మేము సేకరించిన కాల్ రిక్డార్డుల ప్రకారం ఘటన జరిగిన గంటల వ్యవధితో సందీప్ ఘోష్, మండల్ మాట్లాడుకున్నారు. ఈ ఘటనలో వారికి సంబంధం ఉన్నట్లు అనుమానం ఉంది. ఈ కేసులో నిజాలు వెలికితీయాలంటే వారిని విచారించాలి. బెంగాల్ పోలీసులకు, సీబీఐకి మధ్య విభేదాలు లేవు. మేము నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాం. మాకు మోండల్ ఓ పోలీసు అధికారిగా కనిపించటం లేదు.. ఆయన మాకు ఒక అనుమానితుడిగా కనిపిస్తున్నారు. హత్యాచారం కేసులో మోండల్ కాదు.. కానీ ఈ కేసులో నిజాలు కప్పిపుచ్చే పెద్ద కుట్రలో పాత్ర పోషించి ఉండవచ్చని అనుమానం కలుగుతోంది’ అని సీబీఐ కోర్టుకు వివరించింది. హత్యాచార ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడం వంటి కారణాలతో తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోండల్ సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు.. ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవకతవకల పాల్పడిన కేసులో సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా హత్యాచార ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను సీబీఐ సందీప్‌పై మోపింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు.చదవండి: ‘టీ’ తాగాలంటూ దీదీ ఆహ్వానం.. వద్దని ఖరాఖండిగా చెప్పిన డాక్టర్లు -
హ్యాకింగ్.. ‘పోలీస్’ షేకింగ్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల వ్యవధిలో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన రెండు కీలక యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడం కలకలం సృష్టిస్తోంది. సైబర్ నేరగాళ్లు తెలంగాణ పోలీస్‌కు చెందిన హాక్ ఐ యాప్‌తోపాటు పోలీస్ అంతర్గత విధుల్లో అత్యంత కీలకమైన టీఎస్‌కాప్ యాప్‌ను సైతం హ్యాక్ చేశారు. వీటి నుంచి హ్యాకర్లు పోలీస్ శాఖకు సంబంధించిన కీలక డేటాను, ఫొటోలను చేజిక్కించుకుని.. డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్ నేరగాళ్లకు సంబంధించిన కేసులను పరిష్కరించే పోలీసులు తమ సొంత యాప్‌లు హ్యాక్ గురైన విషయాన్ని గుర్తించడంలో మాత్రం ఆలస్యం జరిగింది. హాక్ ఐ యాప్ హ్యాకింగ్ గురైన తర్వాత వారం రోజులకు టీఎస్‌కాప్ యాప్ హ్యాక్ అయిందని.. రెండింటి హ్యాకింగ్ ఒకే హ్యాకర్ కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. హాక్ ఐ యాప్ హ్యాకింగ్‌కు గురవడంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పటికే ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌శాఖకు సంబంధించిన కీలక యాప్‌ల హ్యాకింగ్ నిజమేనని.. రెండింటిని హ్యాక్ చేసింది ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అన్నది తేల్చాల్సి ఉందని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కీలక వ్యవహారాలన్నీ అందులోనే.. తెలంగాణ పోలీసుల రోజువారీ విధుల్లో టీఎస్‌కాప్ యా ప్ది ప్రధాన భూమిక. 2018లో ప్రారంభించిన ఈ యాప్‌లో పాత నేరస్తుల సమాచారం, క్షేత్రస్థాయిలో నిందితులను గుర్తించేందుకు అవసరమైన ఫేషియల్ రికగ్నిషన్ యాప్, సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్), రవాణాశాఖ సమాచారం వంటి మొత్తం 54 సర్విసులు పోలీసులకు క్షేత్రస్థాయి విధుల కోసం అందుబాటులో ఉంటాయి. లక్షలాది మంది నేర స్తుల ఫొటోలు, వేలిముద్రలు, ఇతర వివరాలు, గత కొన్నేళ్లలో నమోదైన నేరాల వివరాలు, రోడ్డు ప్రమాదాలు, ఆయా కేసులలో నిందితులు, బాధితుల ఫోన్ నంబర్లు, దర్యాప్తులో అవసరం మేరకు ఆధార్‌కార్డు, ఇతర ధ్రువపత్రాల వివరాలు, వాహనాల నంబర్లు, సీసీ టీవీ కెమెరాల జియో ట్యాగింగ్ వివరాలు, క్రైం సీన్ ఫొటోలు, వీడియో లు, సాక్షుల స్టేట్మెంట్ రికార్డులు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వివరాలు ఇలా చాలా సమాచారాన్ని టీఎస్‌కాప్ యాప్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇంత కీలమైన యాప్ హ్యాక అవడంపై పోలీస్‌శాఖలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆన్లైన్లో డేటా అమ్మకం? టీఎస్‌కాప్ యాప్‌లోని యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి.. తన డిజిటల్దత్తా పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్లో ‘టీఎస్‌కాప్ సహా మొత్తం తెలంగాణ కాప్‌ల నెట్‌వర్క్‌ను ఎవరో హ్యాక్ చేశారు.ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కంపెనీ.. యాప్‌లో పాస్‌వర్డ్‌లను ప్లెయిన్ టెక్ట్స్‌గా పొందుపర్చడం, యాప్ సీసీటీఎన్ఎస్కు కనెక్ట్ అయి ఉండటం వంటివి సులభంగా హ్యాక్ అవడానికి కారణాలై ఉండొచ్చు’’అని పేర్కొన్నారు. హ్యాకర్ కొనుగోలుదారులను ప్రలోభపెట్టడానికి ఆన్లైన్ ఫోరమ్‌లలో నమూనా డేటాను పోస్ట్ చేశాడని., నేరస్తుల రికార్డులు, తుపాకీ లైసెన్సులు, ఇతర డేటాను కూడా పొందుపర్చాడని తెలిపారు. హ్యాకింగ్ క్రైం ఫోరం అయిన బ్రీచ్ ఫోరమ్స్‌లో పేర్కొన్న ప్రకారం.. టీఎస్‌కాప్, హాక్ ఐ నుంచి లీకైన డేటాలో 2 లక్షల మంది యూజర్ల పేర్లు, ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు , అడ్రస్‌లు 1,30,000 ౖ రికార్డులు, 20 వేల ప్రయాణ వివరాల రికార్డులను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కీలక విభాగాలు, పోలీస్ అధికారుల వివరాలు కూడా..? హాక్ ఐ, టీఎస్‌కాప్ యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడంతో.. సైబర్ నేరగాళ్ల చేతికి ఏసీబీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, సీసీఆర్బీ, సీసీఎస్, సీఐడీ, కంట్రోల్ రూమ్‌లు, సీపీ ఆఫీస్‌లు, డీసీఆర్బీలు, గ్రేహౌండ్స్, జీఆర్పీ, ఇంటెలిజెన్స్, ఐటీ కమ్యూనికేషన్స్, లా అండ్ ఆర్డర్, ఎస్పీ ఆఫీసులు, ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్‌లు, స్పెషల్ యూనిట్లు, టాస్‌్కఫోర్స్, ట్రాఫిక్, టీజీఎస్పీ ఇలా చాలా విభాగాల సమాచారం చిక్కి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి కూడా.. ‘‘అధికారుల పేర్లు, పోలీసు స్టేషన్ అనుబంధాలు, హోదాలు, ఫొటోలతో సహా సమాచారం డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు, వందల మంది పోలీసు అధికారుల వివరాలు అందులో ఉన్నాయి’’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న టీఎస్‌కాప్ యాప్‌కు గతంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నుంచి ‘సాధికార పోలీసు విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’విభాగంలో అవార్డు దక్కింది. అలాంటి టీఎస్‌కాప్ యాప్ హ్యాక్ అవడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు సులువుగా ఉండే పాస్వర్డ్లు పెట్టుకోవడంతో హ్యాకింగ్ సులువైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ డేటా బ్రీచ్‌పై ఇప్పటికే తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఆలోచింపజేసే కాప్
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా రూపొందిన చిత్రం ‘కాప్’. రాధా సురేష్ సమర్పణలో మాధవన్ సురేష్ నిర్మించారు. బి. సోము సుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ని తిరుపతి ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో విడుదల చేశారు. ఎస్వీ కాలేజ్ డైరెక్టర్ డా.యన్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా కళాశాల విద్యార్థి మాధవన్ సురేష్ యూఎస్ వెళ్లి అంచలంచెలుగా ఎదిగి సినిమా నిర్మించే స్థాయికి రావడం హ్యీపీ. నితిన్ కూడా మా కాలేజ్ కుర్రాడే’’ అన్నారు. ‘‘శత్రుపురం, మన్యం రాజు’ చిత్రాల తర్వాత నేను డైరెక్ట్ చేసిన మూడో చిత్రం ఇది’’ అన్నారు సోము సుందరం. ‘‘మా సినిమాని హిట్ చేయాలి’’ అన్నారు రాధా సురేష్. ‘‘పోలిటికల్ సెటైర్‌తో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో మంచి సందేశం ఉంది’’ అన్నారు మాధవన్ సురేష్. -
ఆరేళ్లలో రూ.30 లక్షల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: భారత్ విధించుకున్న కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి వచ్చే ఆరు ఆర్థిక సంవత్సరాల్లో (2024–2030) రూ.30 లక్షల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఇరెడా’ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ అన్నారు. దేశంలో సగం విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని భారత్ ఏర్పాటు చేసుకోగా, 2070 నాటికి నికరంగా సున్నా కర్బన ఉద్గారాల స్థితికి చేరుకోనున్నట్టు ప్రకటించడం తెలిసిందే. దీంతో సోలార్ పరికరాలు, ఎలక్ట్రోలైజర్లు, పవన విద్యుత్ టర్బయిన్లు, వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ సామర్థ్యాల ఏర్పాటుపై పెట్టుబడులు అవసరమవుతాయని దాస్ చెప్పారు. ప్రపంచబ్యాంక్ నిర్వహించిన ఒక వెబినార్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. పీఎం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించారు. దీని కింద కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఇందు కోసం కేంద్ర సర్కారు రూ.75,000 కోట్లను ఖర్చు చేయనుంది. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా దీన్ని చేపట్టనున్నారు. ఈ పథకం వల్ల గణనీయమైన ప్రయోజనాలకు తోడు, ప్రజల్లో పునరుత్పాదక ఇంధనం పట్ల పెద్ద ఎత్తున అవగాహన ఏర్పడుతుందని దాస్ అభిప్రాయపడ్డారు. దేశ కర్బన ఉద్గారాల లక్ష్యాలకు సాయపడుతుందన్నారు. ‘‘వచ్చే మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని భారత్ విధించుకుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఇంధన డిమాండ్‌ను చేరుకోవాల్సి ఉంటుంది. ఇందులో 90 శాతం పునత్పాదక ఇంధన వనరుల రూపంలోనే సమకూరనుంది’’అని దాస్ చెప్పారు. -
నడిరోడ్డుపై దళిత మహిళను లాఠీతో చితకబాదిన పోలీసు
పాట్నా: బిహార్‌లో నడిరోడ్డుపై ఓ దళిత మహిళను పోలీసు లాఠీతో చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. విపక్ష బీజేపీ మండిపడింది. బిహార్‌లో నేరస్థులను వదిలేసి సామాన్య ప్రజలపై పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు వివరణ కూడా ఇచ్చారు. సితామర్హికి చెందిన ఓ బాలిక కిడ్నాప్ కేసులో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో రక్షించిన బాలిక కోసం ఇద్దరు మహిళలు పోటీ పడ్డారు. తమ బాలికేనని ఇరువురు గొడవకు దిగారు. పోలీసులు విడిపించినా గొడవ ఆపలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీఛార్జీ చేశారని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. అయితే.. పోలీసుల చర్యను స్థానికులు తప్పుబడుతున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: భారత సంతతి కుటుంబం మృతి కేసులో కీలక అంశాలు -
ఇందిరా గాంధీ బ్రేక్ ఫాస్ట్ కోసం ఓ చెఫ్ పడ్డ పాట్లు!
ఇందిరా గాంధీకి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజ్ గోవాలోని చెఫ్ సతీష్ అరోరా తన పుస్తకంలో పేర్కొన్న ఘటన ఇది. తాను ఇందిరా గాంధీకి బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయి పండ్లు ఇచ్చేందుకు ఎంతలా కష్టపడాడో గుర్తు చేసుకున్నారు. ఓ యుద్ధమే చేసినట్టు తాను రాసిన స్వీట్స్ అండ్ బిట్టర్స్: టేల్స్ ఫ్రమ్ ఏ చెఫ్స్ లైఫ్ అనే పుస్తకంలో వివరించారు. ఇంతకీ ఆ చెఫ్ గెలచాడా? లేదా? అసలేం జరిగిందంటే..అది 1983లో ఇందిరాగాంధీ చోగం (CHOGM) సమావేశం సందర్భంగా జరిగిన ఘట్టం. చెఫ్ అరోరా ఆ పుస్తకంలో.. 1983 నవంబర్‌లో దివగంత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో గోవాలో దాదాపు 40కి పైగా కామెన్వెల్త్ దేశాల నాయకులతో 48 గంటల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ సదస్సు వరల్డ్ టూరిజం మ్యాప్‌లో గోవాను ఉంచాలనే లక్ష్యంతో జరుగుతోంది. వారికి గోవా తాజా హోటల్లో ఆతిధ్యం ఏర్పాటు చేశారు. నాయకులకు అందించే వంటకాల మెనుతో సహా ఇందిరాగాంధీ భోజన మెనూ కూడా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. ఇందిరాగాంధీ బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయిలు తీసుకుంటారని ఆ మెనూలో ఉంది. గోవాలో అది కూడా నవంబర్ మాసం కావడంతో బోపాయిలు ఎక్కడ అందుబాటులో లేవు. అదీగాక ఈ కామెన్వెల్త్ నాయకుల సదస్సు కోసం గోవా అంతటా టైట్ సెక్యూరిటీతో పోలీసులు బందోబస్తుతో హాడావిడిగా ఉంది. ఎక్కడిక్కడ మరమత్తులు చేసి వీధి దీపాలు వెలిగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బయటకు వెళ్లి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే పోలీస్ చెకింగ్ దాటుకుని బయటకు వెళ్లి తిరిగి రావడం మాటలు కాదు. దీంతో చెఫ్‌ల బృందం బొప్పాయిలను ముంబై తాజ్ నుంచి తెప్పించే ఏర్పాట్లు చేసిందని అక్కడే ఐదేళ్లుగా సేవలందించిన చెఫ్ సతీష్ అరోరా వెల్లడించారు. "వచ్చిన పచ్చి బొప్పాయిలు తొందరగా పక్వానికి వచ్చేలా కాగితం చుట్టి ఉంచాను. అవి పక్వానికి మెల్లగా వస్తున్నాయి. ఇంకో పక్క ఇందిరా గాందీ, ఆమె సిబ్బంది బ్రేక్ ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పడంతో ఎలా అందించాలో తెలియక కలవరపడుతున్నాం. ఎందుకంటే సరిగా పక్వానికి రానీ పండ్లను వారికి ఎలాఅందించాలో తెలియక ఒకటే ఆందోళన. ఇక లాభం లేదనుకుని ఆమెకు బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయిలు అందించేందుకు పోలీస్ జీపులో ఓ యుద్ధ వీరుడి మాదిరి గోవా మార్కెట్లన్నీ గాలించానని" తెలిపారు అరోరా. "చివరికి ఓ మార్కెట్లో పండిన బొప్పాయిలు కనిపించాయి. ఓ డజను బొప్పాయిలను తీసుకుని అదే జీపులో వస్తూ.. ఏదో సాధించిన వీరుడిలా ఆనందంగా వచ్చా". కానీ చివరికి ఆ హోటల్ ప్రవేశించేందుకు హోటల్ సెక్యూరిటీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యులు అరోరాను అడ్డుకున్నారు. వాస్తవాన్ని వివరించి ఎంతగా బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పండ్లలో పేలుడు పదార్థాలు ఉన్నాయోమో! అని ప్రతి దానికి రంధ్రాలు పెట్టి చెక్‌చేశారు. ఓ రెండు చెక్‌లు చేసి వదిలిపెట్టక మొత్తం అన్నింటికి రంధ్రాలు చేశారు సెక్యూరి సిబ్బంది. ఏదో రకంగా ప్రదాని ఇందిరా గాంధీకి బ్రేక్‌ఫాస్ట్‌గా బోప్పాయిల అందిచేందుకు చేసిన యుద్ధం విజయవంతం కాకపోగా తమకు అత్యంత నిరాశనే మిగిల్చిందంటారు అరోరా. పైగా జీవితంలో మర్చిపోలేనంత టెన్షన్‌కి గురిచేసిన రసవత్తరం ఘట్టం అని తన పుస్తకం స్వీట్స్ అండ్ బిట్టర్స్లో చెప్పుకొచ్చారు చెఫ్ అరోరా. నాయకులకు సంబంధించని కొన్ని ఆసక్తకర విషయాలు వాళ్లు మన ముందు సజీవంగా లేకపోయినా వాళ్ల నిర్ణయాలు, జీవితశైలికి అద్దం పట్టేలా కనిపిస్తాయి కదూ!. (చదవండి: సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే ఇవాళ అయోధ్య..!) -
శిలాజ ఇంధనాలకు బైబై
దుబాయ్: హరిత గృహ వాయువుల ఉద్గారానికి, తద్వారా భూతాపానికి, భూగోళంపై ప్రకృతి విపత్తులకు, జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన శిలాజ ఇంధనాల వాడకానికి వీడ్కోలు చెప్పే దిశగా అడుగులు వేసేందుకు దాదాపు 200 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు దుబాయ్‌లో జరుగుతున్న ‘కాప్–28’ సదస్సులో చరిత్రాత్మక ఒప్పందానికి అన్ని దేశాలు మద్దతు పలికాయి. ‘శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం.. మార్పు సాధిద్దాం’ అంటూ ప్రతిన బూనాయి. కాప్–28 సదస్సులో బుధవారం చివరి సెషన్ జరిగింది. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులంతా ముక్తకంఠంలో ఆమోదించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 2050 నాటికి నెట్‌జీరో(సున్నా) ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఏడాది కాప్ సదస్సులో చెప్పుకోదగ్గ తీర్మానాలేవీ ఉండబోవన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని కాప్–28 అధ్యక్షుడు సుల్తాన్ అల్–జబేర్ తేలి్చచెప్పారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని, పటిష్టమైన, నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని కాప్–28 సదస్సు పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని స్పష్టం చేసింది. చేతలు కావాలి: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాలని గతంలో జరిగిన కాప్ సదస్సుల్లో ప్రత్యేకంగా సూచించారు. ఈసారి మాత్రం ఈ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. బొగ్గుతో విద్యు త్ను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. తమ విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడానికి బుధవారం ఆమోదించిన ఒప్పందమే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళిక అని సుల్తాన్ అల్–జబేర్ అన్నారు. కాప్–28 టాప్ 10 చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 1. చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 2. సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయి. పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాఏళ్లుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం వచి్చంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 3. నిర్దేశిత గడువు కంటే నెట్జిరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50 శాతం తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 4. 2030 కంటే ముందే గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. 5. క్లైమేట్ యాక్షన్ కోసం సంపన్న దేశాల నుంచి నిధులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. 6. జీవ వైవిధ్యానికి, మానవళికి ఎలాంటి హాని కలగకుండా వాతావరణ మార్పుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని నిర్దేశించారు. 7. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిస్ ఒప్పందం లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం, ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఆదేశించారు. 8. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ తరహాలో క్లైమేట్ ఫైనాన్స్, సపోరి్టంగ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కొన్నిదేశాలు, సంస్థలు మద్దతు ప్రకటించాయి. 9. కాప్–26 సదస్సు ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కర్బన్ ఉద్గారాల సమాచారాన్ని నమోదు చేసే విషయంలో నిబంధనలు సవరించారు. 10. అన్ని దేశాల, అన్ని వర్గాల అవసరా లను దృష్టిలో పెట్టుకొని శిలాజ ఇంధనాల నుంచి ఇతర ప్రమాద రహిత ఇంధనాల వైపు క్రమానుగతంగా మారాలని సూచించారు. -
Licypriya Kangujam: నిండు సభలో... నిగ్గదీసి అడిగిన అగ్గిస్వరం
వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే మురిసే చిన్నారి హృదయాలకు ప్రకృతి ఆత్మీయ నేస్తం. అలాంటి అందమైన, ఆత్మీయమైన ప్రకృతి ఎదుట విలయ విధ్వంసం కరాళనృత్యం చేస్తుంటే... లిసిప్రియలాంటి చిన్నారులు ‘పాపం, పుణ్యం ప్రపంచ మార్గం’ అని ఊరుకోరు. ప్రకృతికి సంబంధించి మనం చేస్తున్న పాపం ఏదో, పుణ్యం ఏదో కళ్లకు కట్టేలా ప్రచారం చేస్తారు. దుబాయ్‌లో జరిగిన ‘యునైటెడ్ నేషన్స్ క్లైమెట్ చేంజ్ కాన్ఫరెన్స్–2023’లో తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది మన దేశానికి చెందిన పన్నెండు సంవత్సరాల లిసిప్రియ కంగుజామ్. ‘శిలాజ ఇంధనాలను అంతం చేయండి... భవిష్యత్తును, భూగోళాన్ని కాపాడండి’ అంటూ నినదించింది. కొద్దిసేపు ప్రసంగించింది. ఆమె నిరసనను ప్రపంచ ప్రతినిధులు కొందరు చప్పట్లతో ఆమోదం పలికారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మణిపుర్‌కు చెందిన క్లైమెట్ యాక్టివిస్ట్ లిసిప్రియ గురించి.... లిసిప్రియ కంగ్జామ్ మణిపుర్‌లోని బషిక్హోంగ్లో జన్మించింది. తల్లిదండ్రుల ద్వారా, స్కూల్లో ఉపాధ్యాయుల ద్వారా విన్న పర్యావరణపాఠాలు ఈ చిన్నారి మనసుపై బలమైన ప్రభావాన్ని చూపాయి. పర్యావరణ సంరక్షణ కోసం తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది. ఏడు సంవత్సరాల వయసులోనే అందరూ ఆశ్చర్యపడేలా పర్యావరణ సంబంధిత విషయాలు మాట్లాడేది. 2018లో ప్రకృతి విధ్వంసంపై మంగోలియాలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో తండ్రితో కలిసి పాల్గొంది. ఈ సదస్సులో వక్తల ఉపన్యాసాల నుంచి ఎన్నో కొత్తవిషయాలు నేర్చుకుంది. ఈ సదస్సు ప్రియ జీవితాన్ని మార్చేసిన సదస్సు అని చెప్పవచ్చు. ఈ సదస్సు స్ఫూర్తితో ‘చైల్డ్ మూమెంట్’ అనే సంస్థను మొదలుపెట్టింది. మొక్కల పెంపకం వల్ల ప్రకృతికి జరిగే మేలు, ప్రకృతి విధ్వంసం వల్ల జరిగే నష్టాలు... మొదలైన వాటి గురించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో స్కూల్స్‌లో ప్రచారకార్యక్రమాలు విరివిగా నిర్వహించింది. 2019లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. ఇదే సంవత్సరం అంగోలా దేశంలో జరిగిన ఆఫ్రికన్ యూనియన్ సదస్సులో పాల్గొంది. ఈ సదస్సులో ఎంతోమంది దేశాధ్యక్షులతో పాటు ప్రియ ప్రసంగించడం విశేషం. చిన్నవయసులోనే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు తెచ్చుకుంది లిసిప్రియ. ప్రియకు డబ్బులను పొదుపు చేయడం అలవాటు. అవి తన భవిష్యత్ అవసరాలకు ఉద్దేశించి కాదు. సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం కోసం పొదుపు చేస్తుంటుంది. 2018లో కేరళ వరద బాధితులకు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి లక్షరూపాయలు విరాళంగా ఇచ్చింది. దిల్లీలోని వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని‘సర్వైవల్ కిట్ ఫర్ ది ఫ్యూచర్’అనే డివైజ్‌కు రూపకల్పన చేసింది. ఈ జీరో బడ్జెట్ కిట్ వాయుకాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఎవరైనా, ఎక్కడైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని పంజాబ్ అసెంబ్లీలో లాంచ్ చేసింది ప్రియ. వాతావరణ మార్పులపై కార్యచరణ కోసం, మన దేశంలో క్లైమెట్ లా కోసం వందలాదిమందితో కలిసి దిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ప్రదర్శన నిర్వహించింది. ‘సందేశం ఇవ్వాలనుకోవడం లేదు. సమస్యను అర్థం చేసుకోమని చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను’ అంటుంది లిసిప్రియ. యాక్ట్ నౌ దుబాయ్‌లో జరిగిన క్లైమేట్ కాన్ఫరెన్స్–2023లో 190 దేశాల నుంచి 60,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారి ప్రియ ధైర్యంగా వేదిక మీదికి వచ్చి ‘అవర్ లీడర్స్ లై, పీపుల్ డై’ అని గట్టిగా అరిచింది. సదస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తరువాత ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ‘ఎవరు ఈ అమ్మాయి?’ అంటూ చాలామంది ఆరా తీశారు. చిన్న వయసు నుంచే పర్యావరణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న ప్రియ గురించి తెలుసుకొని ఆశ్చర్యానందాలకు గురయ్యారు. శిలాజ ఇంధనాలను అంతం చేయండి... భవిష్యత్తును, భూగోళాన్ని కాపాడండి. – లిసిప్రియ నా నేరం ఏమిటి? నిరసన తరువాత అధికారులు నన్ను 30 నిమిషాలకు పైగా నిర్బంధించారు. నేను చేసిన నేరం ఏమిటంటే పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణం అయిన శిలాజ ఇంధనాలను దశల వారీగా తొలగించమని అడగడం. నన్ను ‘కాప్ 28’లో లేకుండా చేశారు. – లిసిప్రియ, యాక్టివిస్ట్ -
అరబ్ దేశాల పర్యటనలో గురుదేవ్..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్
ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ తన వారం రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎమిరేట్స్ నాయకత్వంతో వ్యూహాత్మక సంభాషణలు సహా, వాతావరణ మార్పులపై చర్చించే కాప్ 28 సదస్సులో ఉన్నత స్థాయి చర్చలలో పాల్గొంటున్నారు. శాంతి స్థాపన, సంక్షోభ నివారణ, సమస్యల పరిష్కారం, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిక్షణ తదితర అంశాలలో శ్రీశ్రీ రవిశంకర్ గణనీయమైన పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. పర్యటనలో భాగంగా శ్రీశ్రీ మొదటగా ఫుజైరా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడైన గౌ. షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీతో అతని రాజ నివాసంలో సమావేశమై, ధర్మబద్ధమైన మానవ విలువల్ని పెంపొందించటం, శాంతియుత సహజీవనపు ఆవశ్యకత సహా విస్తృతమైన అంశాలపై చర్చించారు. భారతదేశంలోని 70 నదులు ఉపనదుల పునరుద్ధరణ, పునరుజ్జీవనానికి, 36 దేశాల్లో 8 కోట్ల 12 లక్షల చెట్లను నాటేందుకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా, అలాగే 22 లక్షల రైతులను స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా చేసిన వ్యక్తిగా, గురుదేవ్ తన అభిప్రాయాలను కాప్ 28 సమావేశాలలో పంచుకోనున్నారు. ధార్మిక విశ్వాసాలను పాటించే సమాజాలను భూ పరిరక్షణకు ఎలా సమీకరించాలనే అంశంపై శ్రీశ్రీ ప్రసంగించనున్నారు. బ్రహ్మ కుమారీస్కు చెందిన మోరీన్ గుడ్మాన్ వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్‌కు చెందిన యుకికో యమదా మోరోవిక్ వంటి ఇతర ధార్మిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేగాక ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమాన్ని ప్రారంభించి కీలకోపన్యాసం చేయనున్నారు. పర్యావరణ హితమైన సుస్థిరమైన జీవనశైలిని పెంపొందించేందుకు మానవ కార్యకలాపాలకు పర్యావరణానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు మొదటగా మనలో రావలసిన అంతర్గత పరివర్తన యొక్క ప్రాముఖ్యతను, అంతర్గత పరివర్తనకు మార్గాలను శ్రీశ్రీ వివరిస్తారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వార్షిక అంతర్జాతీయ సదస్సులో ఎమిరేట్స్ దేశపు సహన, పరస్పర సహజీవన శాఖా మంత్రి గౌ. షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, ఇతర ప్రముఖులతో కలసి గురుదేవ్ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. కాప్28 పర్యావరణ సదస్సులో భాగంగా ఏర్పాటు చేయబడ్డ అనేక కార్యక్రమాలలో భాగంగా, గురుదేవ్ డిసెంబర్ 6న కొలంబియన్ పెవిలియన్‌లో ప్రధానోపన్యాసం చేయనున్నారు. కొలంబియా ప్రభుత్వం, ఫార్క్ వేర్పాటువాదుల మధ్య 52 సంవత్సరాలపాటు కొనసాగిన వివాదానికి ముగింపు పలికేందుకు, దౌత్యం, చర్చల ద్వారా ఏకాభిప్రాయ నిర్మాణానికి 2015 సంవత్సరంలో జరిపిన చర్చలను, వాటి ఫలితాన్ని, సభ్యులతో శ్రీశ్రీ పంచుకోనున్నారు. మానవత్వానికి, ప్రేమకు, ఏకాభిప్రాయ సాధనకు ప్రాధాన్యమిచ్చే గురుదేవ్ విధానాలు సంఘర్షణలతో అతలాకుతలమౌతున్న ప్రజలకు ఆశారేఖలుగా దారిచూపుతాయనడంలో సందేహం లేదు. ప్రపంచ శాంతి, సామరస్యం కావాలంటే మొదటగా వ్యక్తిగతమైన ప్రశాంతత కావాలని గురుదేవ్ అంటారు. అందుకు అనుగుణంగా ఈ ఆరు రోజల అరబ్బుదేశాల పర్యటనలో చివరగా గురుదేవ్ దుబాయ్ లోని అల్ నాసర్ క్లబ్ - అల్ మక్టూమ్ స్టేడియంలో 15 వేల మందికి పైగా ప్రజలతో ధ్యానం చేయించనున్నారు. అరబ్బు దేశాలలో అభివృద్ధికి కృషిచేసిన వ్యాపారవేత్తలను, సంఘ సేవకులను, సన్మానిస్తున్న ఈ కార్యక్రమానికి రిజర్వు చేసిన టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. (చదవండి: ప్రధాని జస్టిన్ ట్రూడో కఠిన నిర్ణయం.. విదేశీ విద్యార్ధులకు భారీ షాకిచ్చిన కెనడా!) -
మెలోనీ ‘మెలోడీ’కి మోదీ ఫిదా
న్యూఢిల్లీ: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చేసిన ‘మెలోడీ’కి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నెటిజన్లంతా ఫిదా అయ్యారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానులిద్దరి మధ్య నడిచిన పోస్టులు వైరల్‌గా మారాయి. శుక్రవారం దుబాయ్‌లో కాప్28 సదస్సు సందర్భంగా వారిద్దరూ భేటీ కావడం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీతో తీసుకున్న సెల్ఫీని మెలోనీ శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘కాప్28 సదస్సులో మంచి మిత్రులు’అనే క్యాప్షన్‌తో పాటు, తామిద్దరి పేర్లనూ అందంగా కలుపుతూ ‘మెలోడీ’అంటూ హాష్టాగ్ జత చేశారు. దాంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. చూస్తుండగానే దానికి ఏకంగా 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనికి మోదీ కూడా సరదాగా స్పందించారు. ‘మిత్రులతో కలయిక ఎప్పుడూ ఆహ్లాదకరమే’అనే క్యాప్షన్‌తో మెలోనీ సెల్ఫీని రీపోస్ట్ చేశారు. వారి పోస్టులు ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. జీ20 నుంచీ ట్రెండింగ్‌లోనే.. నిజానికి ‘మెలోడీ’ హా‹Ùటాగ్ గత నెలలో భారత్ తొలిసారి ఆతిథ్యమిచి్చన జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగినప్పటి నుంచీ ఇంటర్నెట్లో వైరలైంది. సోషల్ సైట్లలో తెగ తిరుగుతోంది. ఆ సదస్సు ఆద్యంతం మోదీ, మెలోనీ పరస్పరం స్నేహపూర్వకంగా మెలిగిన తీరు అందరి దృష్టినీ బాగా ఆకర్షించింది. ఆతిథ్య దేశ సారథిగా మిగతా దేశాధినేతలతో పాటు మెలోనీని కూడా మోదీ సాదరంగా సదస్సుకు ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆమె మోదీతో కరచాలనం చేశారు. కాసేపు ముచ్చటించుకుని ఇరువురూ నవ్వుల్లో మునిగి తేలారు. ఇదే ఒరవడి తాజాగా కాప్28 సదస్సులోనూ కొనసాగింది. -
ఇటలీ ప్రధాని, భారత ప్రధాని స్నేహితులైతే..
దుబాయ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని కూడా కలిశారు. మెలోని కూడా ప్రధాని మోదీతో సెల్ఫీ దిగి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘మేం మంచి స్నేహితులం’ అని రాశారు. అలాగే ‘#మెలోడి’ అని రాసి.. అందులో మెల్ అంటే మెలోనీ అని.. ఓడి అంటే మోదీ అని రాశారు. వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాధినేతలతో చర్చలు జరిపారు. మెలోనితో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధాని రిషి సునక్, బ్రెజిల్ ప్రధాని లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌లను కూడా కలిశారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సులో నాలుగు సెషన్లలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ ఇతర నేతలు కలిసి గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాతావరణ లక్ష్యాలను సాధించడంలో భారతదేశం చేపట్టే కార్యక్రమాలు, పురోగతిని ప్రధాని మోదీ వివరించారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్‌లో చేరాలని ప్రపంచ నాయకులను ప్రధాని మోదీ కోరారు. కాప్-28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కూడా కలిశారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాప్-28 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంపై ప్రధాన మంత్రి మోదీ వారిని అభినందించారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌కు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ప్రధాని ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: మానవాళి స్వార్థంతో ప్రపంచానికి పెను చీకట్లే -
COP28: మానవాళి స్వార్థంతో ప్రపంచానికి పెను చీకట్లే
దుబాయ్: గత శతాబ్ద కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ప్రపంచానికి ఎక్కువ సమయం లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేవలం మన ప్రయోజనాలు మాత్రమే కాపాడుకోవాలన్న మానవాళి వైఖరి అంతిమంగా భూగోళాన్ని చీకట్లోకి నెట్టేస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, తద్వారా ప్రకృతి విపత్తులతో భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, వాటి దుష్ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచానికి సవాలు విసురుతున్న కర్బన ఉద్గారాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా తగ్గించుకోవడానికి ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి వాతవరణ సదస్సు ‘కాప్–33’ని 2028లో భారత్‌లో నిర్వహిస్తామని ప్రతిపాదించారు. శుక్రవారం యూఏఈలోని దుబాయ్‌లో జరిగిన కాప్–28లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాలుష్యం, విపత్తుల నుంచి భూగోళాన్ని కాపాడుకొనే చర్యలను వెంటనే ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ను ప్రస్తావించారు. వ్యాపారాత్మక ధోరణికి భిన్నంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే ఇందులో పాలుపంచుకోవాలని కోరారు. మూల్యం చెల్లిస్తున్న మానవాళి అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకాన్ని భారత్ చక్కగా పాటిస్తోందని, ఈ విషయంలో ప్రపంచానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత(గ్లోబల్ వార్మింగ్) పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరమితం చేయాలన్న లక్ష్య సాధనకు నిబద్ధతతో కృషి చేస్తున్న అతికొన్ని దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. గత శతాబ్ద కాలంలో మానవళిలో ఒక చిన్న సమూహం ప్రకృతికి ఎనలేని నష్టం కలిగించిందని మోదీ ఆక్షేపించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయండి వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలకు నరేంద్ర మోదీ సూచించారు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్లోబల్ కార్బన్ బడ్జెట్లో తగిన వాటా ఇవ్వాలన్నారు. ‘కాప్–33’ని 2028లో భారత్‌లో నిర్వహించడానికి ప్రపంచ దేశాలు అంగీకరిస్తే తమ దేశంలో ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత ఇదే అతిపెద్ద సదస్సు అవుతుందని పేర్కొన్నారు. ఏమిటీ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్? భారత ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌లో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కూడా దాదాపు ఇలాంటిదే. ఇదొక వినూత్నమైన మార్కెట్ ఆధారిత కార్యక్రమం. వేర్వేరు రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసిన వ్యక్తులకు, వ్యవస్థలకు, కమ్యూనిటీలకు, ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపునిస్తారు. ప్రోత్సాహకాలు అందజేస్తారు. అమెరికా, చైనా అధినేతల గైర్హాజరు దుబాయ్‌లో జరుగుతున్న కాప్–28కు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ప్రతిఏటా కర్బన ఉద్గారాల్లో ఏకంగా 44 శాతం వాటా అమెరికా, చైనాలదే కావడం గమనార్హం. ఈ రెండు బడా దేశాల నిర్లక్ష్యం వల్ల ఇతర దేశాలకు నష్టపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
కాప్ దిశ ఎటువైపు..?
ఏటా తప్పనిసరి లాంఛనంగా జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)–28 సదస్సు శుక్రవారం మొదలైంది. ఈనెల 12 వరకూ జరగబోయే ఈ సదస్సుకు 130 మంది దేశాధినేతలు, దాదాపు 80,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. అలా చూస్తే ఈ సదస్సు గత సమావేశాలతో పోలిస్తే విస్తృతమైనదే. కానీ చివరాఖరికి ఇది ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోగలదా లేక గత సదస్సుల మాదిరే ఉస్సూరనిపిస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. లక్ష సంవత్సరాల వ్యవధిలో జరగాల్సిన వాతావరణ మార్పులు కేవలం గత వందేళ్లలో సంభవించాయన్న చేదు వాస్తవాన్ని గుర్తించి చిత్తశుద్ధితో కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమించాల్సిన సంపన్న దేశాలు మాటలతో కాలక్షేపం చేసి లక్ష్యానికి తిలోదకాలిస్తున్నాయి. భూమాత తన భవిష్యత్తును పరిరక్షించమంటూ మనవైపు చూస్తున్నదని, ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించి విజయం సాధించటం మనందరి కర్తవ్యమని సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అర్థవంతమైనది. 2030 కల్లా కర్బన ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించటంతో పాటు హరిత ఇంధనాల వాడకం వాటాను 50 శాతానికి పెంచాలని భారత్ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పటం కూడా మెచ్చదగ్గదే. అయితే ప్రధాన కాలుష్య కారక దేశాలైన చైనా, అమెరికా, ఇతర సంపన్న దేశాలూ ఏం చేయ బోతున్నాయన్నదే ప్రధానం. శిలాజ ఇంధనాల అవసరం లేని భవిష్యత్తును నిర్మించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ దేశాధినేతలకు విన్నవించారు గానీ వినేదెవరు? వాతావరణ మార్పులు ఎలా వున్నాయో వివిధ నివేదికలు చెబుతున్నాయి. గత ఏడెనిమిది దశాబ్దాలుగా కనీవినీ ఎరుగని ఉష్ణోగ్రతలను ఈ ఏడాది చవిచూశామని వాతావరణ పరిశోధకులు అంటున్నారు. ఇది ఏ స్థాయిలో వున్నదంటే పనామాలో కరువుకాటకాలు విస్తరిల్లి పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను అనుసంధానించే 80 కిలోమీటర్ల పనామా కాలువకు నీటి పరిమాణం గణనీయంగా తగ్గింది. దాంతో ఆ కాల్వమీదుగా వెళ్లే నౌకల సంఖ్య 40 నుంచి 32కు తగ్గింది. అంతేకాదు... నౌకలు మోసు కెళ్లే సరుకుల బరువుపై కూడా పరిమితులు విధించారు. పర్యవసానంగా సరుకు రవాణా బాగా దెబ్బ తింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదంతా చవిచూసిన కార్చిచ్చులు, వరదలు అన్నీ ఇన్నీ కావు. ఈసారి భారీవర్షాలతో మన దేశం 1,500 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టాన్ని చవిచూసింది. లిబియానూ, మెక్సికోనూ కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. ఇలాంటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేస్తాయి. నిజానికి ఈ పరిస్థితులను సమీక్షించి, సరైన నిర్ణయాలు తీసుకో వటానికి కాప్ వంటి వేదికలు తోడ్పడాలి. ఆచరణలో అది సాధ్యం కావటం లేదు. ఉష్ణోగ్రతల పెరు గుదలను పారిశ్రామికీకరణకు ముందునాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ మేరకు పరిమితం చేయాలంటే అన్ని రకాల శిలాజ ఇంధనాల వాడకాన్నీ నిలిపేయటం తప్ప తగ్గించటంవల్ల ఒరిగేదేమీ లేదన్నది పర్యావరణవేత్తల మాట. కానీ సంపన్న దేశాలు నిలకడగా ఒక మాట మీద ఉండటం, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటం ఇంతవరకూ లేనేలేదు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలు చేదు వాస్తవమని పర్యావరణపరంగా జరుగుతున్న పెను మార్పులు రుజువు చేస్తున్నాయని, తక్షణం కర్బన ఉద్గారాలను ఆపటంలో విఫలమైతే మహా విపత్తు తప్పదని ఇదే సదస్సులో మాట్లాడిన బ్రిటన్ రాజు చార్లెస్–3 చెప్పారు. కానీ విషాదమేమంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గత ప్రభుత్వాల వాగ్దానాలను బుట్టదాఖలు చేస్తూ పెట్రోల్, డీజిల్ కార్ల విక్ర యాలకున్న గడువును 2030 నుంచి 2035కు పొడిగించారు. 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కనబెట్టారు. ఒకే దేశం భిన్న వైఖరులను ప్రదర్శించటం పర్యావరణ పరిరక్షణకు ఏమేరకు దోహదపడుతుందో చార్లెస్–3, సునాక్‌లు ఆలోచించాలి. అసలు శిలాజ ఇంధనాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో వున్న దేశాల్లో ఒకటైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో కాప్ సదస్సు నిర్వహించటం, సదస్సు అధ్యక్ష స్థానంలో వుండటం ఒక విచిత్రం. నిరుడు ఈజిప్టులో కాప్ సదస్సు జరిగింది. అప్పటినుంచీ శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజవాయు ఉత్పత్తులు రికార్డు స్థాయికి చేరాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఉత్పత్తుల్లో చమురు వాటా 40 శాతం కాగా, బొగ్గు ఉత్పత్తి వాటా 31 శాతం. మిగిలిన 29 శాతం సహజవాయు ఉత్పత్తులది. వీటిని ఒకేసారి పూర్తిగా తగ్గించుకోవటం సాధ్యపడదు గానీ, ఒక క్రమ పద్ధతిలో హరిత ఇంధనాల వైపు మొగ్గటం ప్రారంభిస్తే లక్ష్యసాధన సులభం అవుతుంది. కానీ ఆ దిశగా ఏ దేశమూ చర్యలు తీసుకోవటం లేదు. నిరుడు ప్రపంచదేశాలు శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం ఏడు లక్షల కోట్ల డాలర్ల సొమ్మును వినియోగించాయని ఒక అంచనా. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచటం విషయంలో ఈసారైనా కాప్ దృష్టి సారించాలి. లేనట్టయితే పర్యావరణ విధ్వంసం మరింత పెరగటం ఖాయం. ఇందుకు అవసరమైన సాంకేతికతలను వెనకబడిన దేశాలకు చవగ్గా అందించటంలో సంపన్న దేశాలు విఫలమవుతున్నాయి. ఇది సరికాదు. నిపుణుల మాట వినటం, పారిస్ ఒడంబడిక అమలుకు నిర్దిష్ట కార్యాచరణ రూపొందించి చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయటం తక్షణావసరం. ఒడంబడిక లక్ష్యాలను విస్మరించిన దేశాలపై ఎలాంటి చర్యలుండాలో నిర్ణ యించాలి. ప్రపంచంలో ఏమూల పర్యావరణానికి విఘాతం కలిగినా అది అన్ని దేశాలకూ ముప్పు కలిగిస్తుందని అందరూ గుర్తించాలి. కాప్ సదస్సు ఈ స్పృహను కలిగించగలిగితే దాని లక్ష్యం ఏదోమేరకు నెరవేరినట్టే. -
పేద దేశాలకు ‘వాతావరణ మార్పుల’ నష్టపరిహారం
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయి నగరంలో కాప్–28 సదస్సు గురువారం ప్రారంభమైంది. 12 రోజులపాటు సదస్సు జరగనుంది. తొలిరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే. అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తోంది. అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కాప్–28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు. -
కాప్–28లో భారత్ భూమిక కీలకం!
వాతావరణ మార్పులపై మనిషి పోరుకు వేదికగా నిలిచిన కాప్ సమావేశాలు నవంబర్ 30న ప్రారంభం కానున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల 28వ సదస్సు మానవాళి భవిష్యత్తును నిర్దేశించవచ్చు. అంతర్జాతీయ వాతావరణ మార్పుల చర్చల్లో సమూలమైన మార్పు తీసుకు రావాలని భారత్ కాంక్షిస్తోంది. ఆతిథ్య దేశంతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా కాప్–28 సమా వేశాలు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు. దీనికి కేంద్రబిందువుగా భారత ప్రభుత్వపు లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (లైఫ్) కార్యక్రమం ఉండాలి. సుస్థిర, అతితక్కువ ఇంధన ఖర్చును పోత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు లైఫ్ దోహదపడుతుంది. గత వారం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షంతో యుఏఈలో జనజీవితం స్తంభించిపోయింది. పాఠశాలలు బంద్ అయ్యాయి. పాఠాలు ఆన్లైన్ మార్గం పట్టాయి. కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమయ్యారు. ఒక్కసారిగా ముంచెత్తిన వాన జోరుకు వీధుల్లో కార్లు పడవలయ్యాయి. పౌరుల భద్రతకు అధికార యంత్రాంగం నానా పాట్లూ పడాల్సి వచ్చింది. చిత్రమైన విషయం ఏమిటంటే... యుఏఈ, సౌదీ, బెహ్రాయిన్ వంటి దేశాల ప్రజలు నిన్నమొన్నటివరకూ నింగి నుంచి నేలకు జారే వాన చినుకులు చూసేందుకు రుతుపవవాల సీజన్లో ముంబైకి వచ్చేవారు. కేవలం వాన హోరు, జోరులను ఆస్వాదించేందుకు వీరు నరీమన్ పాయింట్, గేట్ వే ఆఫ్ ఇండియా వంటి ప్రాంతాల్లో సముద్రాభిముఖంగా ఉన్న ఖరీదైన బంగళాలు, హోటళ్లలో దిగేవారు. 1970లలో బయటపడ్డ ముడిచమురు వారి ఈ విలాసానికి సాయపడేది. వాన చినుకులకు వారు ముఖం వాచిపోయి ఉండేవారు. అయితే అది గతం. ఇప్పుడు వారే భారీ వర్షాలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూండటం వైచిత్రి. గాలి మూటలు... నీటి రాతలు... 15 రోజులపాటు కొనసాగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 28వ సమావేశానికీ, వాతావరణ మార్పులపై జరిగే ఇతర సమావేశాలకూ మధ్య స్పష్టమైన తేడా ఇదే కానుంది! ధనిక దేశాలు అనేకం కాప్ సమావేశాల్లో పెద్ద మాటలు మాట్లాడతాయి. అలివికాని హామీలూ గుప్పిస్తాయి. సమావేశాల తరువాత అన్నింటినీ మరచిపోతూంటాయి. ఇప్పుడు ఆ దేశాలూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రత్య క్షంగా చవిచూస్తున్నాయి. అయితే అవి యూఏఈ మాదిరిగా పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటాయన్న గ్యారెంటీ లేదు. మరికొన్ని దేశాలు అసలు సమస్యను కాకుండా, లక్షణాలపై ఎక్కువ దృష్టి పెడతాయి. డోనాల్డ్ ట్రంప్ 2025 జనవరి నాటికి మళ్లీ అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణ మార్పులపై అతడికి నమ్మకం లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాలి. గత పాలకులు సంతకం చేసిన అనేక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకొనేలా చేసిన ఘనత ఆయనదే. రెండేళ్ల క్రితం గ్లాస్గోలో జరిగిన కాప్–26 సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ కూడా పెద్ద హామీలిచ్చింది. వాతావరణ మార్పులకు మూల కారణాలను వెతికి సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన తరువాత ఏం జరిగిందన్నది వెనుదిరిగి చూసుకుంటే... స్వదేశంలో జరిగిన కాప్–26 సమావేశాలకు వైఫల్యం ముద్ర అంట కూడదనే యూకే అలా ప్రకటించి ఉండవచ్చునన్న అనుమానాలు బల పడుతున్నాయి. యూకేతోపాటు పారిశ్రామిక దిగ్గజ జీ–7 దేశాలన్నీ ఇలాంటి మాటలే మాట్లాడాయి. వాతావరణ మార్పుల సమస్యకు చేసింది మాత్రం సున్నకు సున్న హళ్లికి హళ్లి! కాప్–26లో ఇచ్చిన హామీల అమలును మాత్రమే కాదు... 2015 నాటి కాప్–21 అంటే చారిత్రాత్మక ప్యారిస్ ఒప్పందం విషయంలోనూ యూకే వెనకడుగు వేసింది. వాతావరణ మార్పుల విషయంలో ప్యారిస్ ఒప్పందం మొట్టమొదటి అంతర్జాతీయంగా అమలు చేయదగ్గ చట్టంగా మారడం గమనార్హం. మొత్తం 196 దేశాలు సంతకాలు చేసిన ఈ ఒప్పందం విషయంలో ప్రస్తుత బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్... వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకయ్యే ఖర్చులతో బ్రిటిష్ ప్రజలపై పడే ఆర్థిక భారం ఆమోదయోగ్యం కాదంటున్నారు. మరోవైపు యూఏఈ ఈ ఖర్చులను భరిస్తానని చెప్పడమే కాదు... సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పెట్టుబడుల ద్వారా ఇతర దేశాలకూ సాయం చేస్తామని ప్రకటించింది. సమస్యను పరిష్కరించే గాంధేయవాదం 2015 నాటి కాప్ 21 సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన వాతావరణ మార్పుల విషయంలో నిర్ణయాత్మకంగా మారింది. అప్పటివరకూ సమస్యగా భావించినదే పరిష్కారంలో భాగమైపోయింది. వాస్తవానికి భారత్, కాప్–28కు ఆతిథ్యమిస్తున్న యూఏఈ రెండూ వాతావరణ మార్పుల సమస్య పరిష్కారం విష యంలో ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. అందుకే ఈ కాప్– 28 సమావేశాల్లో భారత్ పాత్ర కీలకం కానుంది. ప్రపంచ దేశాలన్నీ సమస్య పరిష్కారానికి ఒక్కమాటపై కదిలేలా చేసేందుకూ భారత్ గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది జనవరిలో యూఏఈ పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత శాఖ మంత్రి సుల్తాన్ అహ్మద్ అల్ జబేర్‌ను కాప్–28 అధ్యక్ష స్థానం వరించింది. ఆ వెంటనే ఆయన మొదటగా భారత్ పర్యటనకు విచ్చేశారు. దీన్ని భారత్ మరచిపోలేదు. బెంగళూరులో మాట్లాడుతూ కాప్–28పై జబేర్ తన అంచనాలను వివరించారు. దశాబ్ద కాలంగా అల్ జబేర్ తరచూ భారత్‌కు వస్తూన్నారు. భారతీయ నేతలతో ఆయన సంబంధాలు బాగా తెలిసినవే. అల్ జబేర్ మంత్రి మాత్రమే కాకుండా, అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ గ్రూపు సీఈవో కూడా. యూఏఈతో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు మోదీ ప్రయ త్నిస్తున్న సమయంలో ద్వైపాక్షిక ఇంధన సంబంధాలను మార్చేయ డంలో అల్ జబేర్ కీలకపాత్ర పోషించారు. అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ద్వారా భారత్ ఇంధన భద్రతకు గట్టి హామీ కూడా ఇచ్చారు. పరస్పర ప్రయోజనకరమైన ఈ అంశం ప్రస్తుత సమావేశాల్లోనూ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాప్–28 అధ్యక్షుడిగా అల్ జబేర్ మద్దతు ఉండటంతో అంత ర్జాతీయ వాతావరణ మార్పుల చర్చ దిశను నిర్ణయాత్మకంగా మార్చా లని భారత్ కూడా ఆశిస్తోంది. ఆయా దేశాలే కేంద్రంగా సాగుతున్న ప్రయత్నాలను సార్వజనీనం చేసేందుకు భారత్ ప్రయత్నించాలి. దీనికి కేంద్రబిందువుగా మోదీ ప్రభుత్వపు లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరా న్మెంట్ (లైఫ్) కార్యక్రమం ఉండాలి. సుస్థిర, అతితక్కువ ఇంధన ఖర్చును పోత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రజలు అల వర్చుకునేందుకు లైఫ్ కార్యక్రమం దోహదపడుతుంది. దీనికి ప్రపంచ ఆమోదముద్ర పడితే ప్రస్తుత జీవనశైలి భిన్నంగా మారుతుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు ఆలోచనలు ఆచరణ రూపం దాలుస్తాయి. ధనిక దేశాల ఖరీదైన జీవనశైలి, వృథా వ్యవహారాలకు చెక్ పడుతుంది. వీటి కారణంగా భూమ్మీద వనరులు కరిగిపోతున్న విషయం తెలిసిందే. అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ సీఈవో అయిన అల్ జబేర్ ఆ దేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహానికీ కృషి చేస్తున్న విషయం చెప్పుకోవాలి. యూఏఈ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ మస్దార్కు ఆయన తొలి సీఈవోగా, తరువాతి కాలంలో చైర్మన్ గానూ పనిచేశారు. ఈ కంపెనీకి దాదాపు 40 దేశాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. కాప్–28లో పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాల వాడకం వైపు ప్రపంచం మళ్లేందుకు అల్ జబేర్ కాలుష్య కారక ముడిచమురు పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. యూఏఈ స్వయంగా చమురు అమ్మకాలు చేస్తున్నప్పటికీ పశ్చి మాసియాలో అణుశక్తి కేంద్రం కలిగిన తొలి దేశం కూడా ఇదే కావడం గమనార్హం. పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చేచ్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు యూఏఈ వద్ద పుష్కలం. ఈ నేపథ్యంలోనే 2015 నాటి ప్యారిస్ సమావేశాల కంటే ఈ సారి జరిగే కాప్ సమావేశాలు మరింత ఫలప్రద మవుతాయని ఆశిద్దాం. - కె.పి. నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దారుణం: ఫోన్ లిఫ్ట్ చేయని భార్యపై అనుమానంతో 230 కి.మీ. వెళ్లి మరీ..
అనుమానం.. పెనుభూతం అంటారు. అతని విషయంలో అది ఉన్మాదం వైపు అడుగులేయించింది. పెళ్లి అయిన తొలినాటి నుంచే భార్యపైనా అనుమానం పెంచుకున్నాడు. అది అతన్ని ఆమె ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పరిశీలిస్తూ.. మాట్లాడే ప్రతి ఒక్కరి గురించి ఆరా తీసే స్థాయికి దిగజార్చింది. చివరకు.. పండటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమెను గొంతు నులిమి కడతేర్చే కిరాతకానికి పాల్పడ్డాడు. తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో కర్ణాటకలో ఓ పోలీసు కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. అత్తగారింటికి వెళ్లి తన భార్య గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పదకొండు రోజుల క్రితమే ఈ దంపతులకు ఓ పాప పుట్టడం గమనార్హం. కిషోర్(32) ప్రతిభ(24) నవంబర్ 13, 2022న వివాహం చేసుకున్నారు. 11 రోజుల క్రితమే వారికి ఓ పాప పుట్టింది. ప్రతిభ హోస్కోట్ సమీపంలోని ఆమె అమ్మ ఇంటి వద్ద ఉంది. ప్రతిభకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని కిశోర్ నిత్యం అనుమానించేవాడు. ఆమె మెసేజ్‌లు, కాల్ రికార్డులను తరచుగా పరిశీలించేవాడు. ఆమెతో మాట్లాడే ప్రతి వ్యక్తి గురించి ఆరా తీసేవాడు. కాలేజీ నాటి పురుష స్నేహితులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని ఆరోపణలు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. ప్రతిభ ఫోన్లో విలపించడంతో ఆమె తల్లి జోక్యం చేసుకుని కాల్ డిస్కనెక్ట్ చేసింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, కిషోర్ కాల్స్‌కు సమాధానం ఇవ్వవద్దని ఆమె ప్రతిభకు సూచించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం కిషోర్ తనకు 150 సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించిన ప్రతిభ.. తన తల్లిదండ్రులకు తెలిపింది. భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కిషోర్ రగిలిపోయాడు. చామరాజనగర్ నుంచి దాదాపు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన కిషోర్.. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ప్రతిభ తల్లిదండ్రుల నివాసానికి చేరుకున్నాడు. కిషోర్ మొదట పురుగుల మందు తాగి, నవజాత శిశువుతో ప్రతిభ ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసాడు. దుపట్టాతో ప్రతిభ గొంతునులిమి హత్య చేశాడు. ప్రతిభ తల్లికి అనుమానం వచ్చి తలుపు తట్టినా స్పందన రాలేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత గది బయటకు వచ్చిన కిశోర్.. ఘటనాస్థలం నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. చికిత్స పూర్తి కాగానే కిషోర్‌ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ -
డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఎస్ఐ సస్పెన్షన్.. ఎందుకంటే..?
ముంబయి: డ్రీమ్ 11లో రూ.1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ ఎస్ఐకి అధికారులు షాక్ ఇచ్చారు. పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సోమనాథ్ ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఆయన తనకున్న జ్ఞానంతో టీంను ఎంచుకుని డ్రీమ్ 11లో పాల్గొన్నారు. అదృష్టం కలిసివచ్చి రూ.1.5 గెలుచుకున్నారు. దీంతో ఆయన తన కుటుంబానికి మిఠాయిలు తినిపిస్తూ ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లడంతో విషయం పెద్దదైంది. ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొని పోలీసు శాఖ పరువు తీస్తున్నారంటూ ఉన్నతాధికారులు ఎస్ఐ సోమనాథ్పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాన్ని స్థానిక డీసీపీకి అప్పగించారు. గత మూడు నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్‌లో ఎస్ఐ సోమనాథ్ పాల్గొంటున్నారని నిర్దారించారు. ఈ వ్యవహారంలో సోమనాథ్పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో రూ.1.5 గెలుచుకున్న ఆనందం ఆవిరైపోయింది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
ఈజిప్టులో ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులు
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఒక పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక ఈజిప్షియన్ మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ మధ్య శనివారం ఉదయం నుండి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద జరిగిన దాడిలో మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితున్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు -
అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!
భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. యూఎస్‌లోని ఓ రహదారికి అతడి పేరుని పెట్టిమరీ గౌరవించింది. ఇంతకీ ఎవరా వ్యక్తి ఎందుకంతా గౌరవం ఇచ్చిందంటే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో 34 ఏళ్ల రోనిల్ సింగ్ అనే భారత సంతతి వ్యక్తి న్యూమాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఒకరోజు అతను విధినిర్వహణలో భాగంగా ఒక రాత్రి ఓవర్ టైం చేయాల్సి వచ్చింది. సరిగా 2018 డిసెంబర్ 26న క్రిస్మస్ రాత్రి ఓ రహదారి వద్ద గస్తీ కాస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి కారులో తాగుతూ వచ్చి విచక్షణరహితంగా కాల్పులు చేస్తున్నాడు. ఆ కాల్పుల్లో రోనిల్ సింగ్ మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా ఇతురల భద్రత విషయమై జీవితాన్ని ఫణంగా పెట్టాడు సింగ్. అయితే అతడు చనిపోయేనాటికి కొడుకు ఆర్నవ్ కేవలం 5 నెలల పసివాడు. ఇలా విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆ వ్యక్తిని గౌరవించేలా ఓ రహదారికి అతని పేరు పెట్టి అంకితం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అములులోకి రాలేదు. ఎట్టకేలకు సింగ్ న్యూమాన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే గాక అమలయ్యేలా చేసింది. ఆ కాలిఫోర్నియా రాష్ట్ర సెనేటర్ మేరి అల్వరాడో గిల్ యూఎస్ ప్రతినిధి డువార్టే, అసెంబ్లీ సభ్యుడు జువాన్ అలానిస్ సెప్టెంబర్ 2న హైవే 33 స్టుహ్ర్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి "కార్పోరల్ రోనిల్ సింగ్ మోమోరియల్ హైవే" అని నామకరణం చేసి మరీ సైన్ బోర్డు పెట్టారు. ఆ రహదారికి అతడి పేరుని పెట్టి అత్యున్నతంగా గౌరవించింది. ఈ కార్యక్రమంలో సింగ్ భార్య అనామిక, కొడుకు ఆర్నవ్ , ఇతర కుటుంబ సభ్యులు న్యూమాన్ పోలీస్ డిపార్ట్మెంట్లోని సింగ్ సహోద్యోగులు తదితరలు పాల్గొన్నారు. సింగ్ కొడుకు ఆర్నవ్ ఆ బోర్డు వెనకాల ఐ లవ్ యు పప్పా! అని రాశాడు. కాగా, రోనిల్ సింగ్ నేపథ్యం వచ్చేసరికి అతడు ఫిజీలో జన్మించి మోడెస్లో పోలీస్‌డిపార్ట్‌మెంట్‌లో వాలంటీర్‌గా లా ఎన్ఫోర్స్మెంట్ వృత్తిని ప్రారంభించాడు. తర్వాత టర్లాక్ పోలీస్ డిపార్ట్మెంటల్లో క్యాడెట్ జంతు సేవా అధికారిగా కూడా విధులు నిర్వర్తించాడు. ఇక సింగ్ చనిపోయిన ఒక ఏడాది తర్వాత పోలీసులు నిందితుడిని మెక్సికన్ జాతీయుడైన పాలో విర్జెన్ మెన్డోజాగా గుర్తించి అరెస్టు చేశారు. అతడికి పెరోల్ లేకుండా జీవితఖైదు శిక్ష విధించింది కోర్టు. అలాగే అతడిని తప్పించాలని చూసిన అతడి సోదరుడు కాన్రాడో విర్జెన్ మెన్డోజాకు 21 నెలల జైలు శిక్ష పడింది. -
'నన్ను వేధిస్తున్నాడు..' ఎమ్మెల్యేపై మహిళా పోలీసు ఆరోపణలు
చిక్కమంగళూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది ఓ మహిళా పోలీసు. కక్షపూరితంగా తనను బదిలీ చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె తన వాట్సాప్ స్టేటస్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ఈ వ్యవహారంలో ఆమెపై చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కర్టాటకకు చెందిన మహిళా పోలీసు లత. చిక్కమంగళూరు జిల్లాలోని కాడూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఎస్. ఆనంద్ తనను వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో హెల్మెట్ లేని కారణంగా కాంగ్రెస్ కార్యకర్తకు జరిమానా విధించింది మహిళా పోలీసు లత. ఈ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆనంద్ అప్పట్లో తనతో వాగ్వాదానికి దిగాడని ఆమె తెలిపింది. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఎన్నికల అనంతరం మహిళా పోలీసు లత కాడూరు స్టేషన్ నుంచి టరికేరి స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీపై అధికారి లత నిరసన వ్యక్తం చేశారు. తనను కక్షపూరితంగా బదిలీ చేయడంపై లత.. ఎమ్మెల్యేకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ ఘటనల అనంతరం లత.. తనను ఎమ్మెల్యే ఆనంద్ వేధిస్తున్నాడని వాట్సాప్ స్టేటస్ పెట్టారు. తనకు ఏమైనా.. ఎమ్మెల్యేనే కారణమని పేర్కొంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఆమెను సస్పెండ్ చేశారు. ఇదీ చదవండి: 'మణిపూర్ సమస్యకు సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం..' -
'యూరిన్ పోసి.. ఎమ్మెల్యే కాళ్లు నాకించారు..' దళితునిపై దారుణం..
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. రక్షించాల్సిన పోలీసే ఓ దళిత వ్యక్తిపై అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితునిపై యూరిన్ పోశాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కాళ్లు నాకించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా, పోలీసు అధికారి శివకుమార్ భరద్వాజపై కేసు నమోదు చేశారు. తాను పొలంలో పనిచేస్తుండగా.. పోలీసులు వచ్చి ఓ గదిలోకి తీసుకెళ్లారని బాధితుడు(51) ఫిర్యాదులో తెలిపారు. అక్కడ డీఎస్పీ శివ కుమార్ భరద్వాజ తనపై యూరిన్ పోసి అవమానించాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా ఆ ప్రాంతానికి రాజని.. అతని మాటకు ఎదురులేదని చెప్తూ ఎమ్మెల్యే బూట్లు నాకించారని పోలీసులకు తెలిపాడు. తన ఫోన్‌ను లాక్కున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు. మొదట పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను నేరుగా కోర్టునే ఆశ్రయించినట్లు తెలిపాడు. ఫిర్యాదు చేసిననాటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని నిందితులకు భయపడే జూన్ 30న ఈ ఘటన జరగగా.. జులై 27న ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. తన కుటుంబ సభ్యులను కూడా వేదిస్తున్నారని తెలిపాడు. అయితే.. దళిత వ్యక్తిపై నిందితులు ఈ ఘటనకు పాల్పడటానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు.. -
జైపూర్ కాల్పుల ఘటన.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగింది..?
జైపూర్: జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సహోద్యోగులతో సహా తోటి ప్రయాణికులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితుడు చేతన్ సింగ్‌తో పాటు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఘన్‌శ్యామ్ ఆచార్య.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగిందో సవివరంగా పోలీసులకు వివరించాడు. కాల్పులకు ముందు కానిస్టేబుల్ చేతన్ సింగ్ తనకు ఆరోగ్యం సరిగా లేదని సీనియర్ అధికారికి తెలిపినట్లు ఘన్‌శ్యామ్ వెల్లడించారు. రైలు దిగిపోతానని చెప్పాడని పేర్కొన్నాడు. అయితే.. షిఫ్ట్ పూర్తి చేసుకునే వెళ్లమని సీనియర్ అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో కోపోద్రిక్తుడైన చేతన్ సింగ్ కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. అంతకు ముందే చేతన్ సింగ్‌తో వాగ్వాదం జరిగిందని, అక్కడ తన గొంతును నులిమే ప్రయత్నం చేశాడని ఘన్‌శ్యామ్ పేర్కొన్నాడు. 'దిగిపోతా..' ఘన్‌శ్యామ్, సీనియర్ అధికారి టిమారమ్ మీనా(58), కానిస్టేబుల్ నరేంద్ర పర్మార్(58), చేతన్ సింగ్(33)లు డ్యూటీలో ఉన్నారు. అర్ధరాత్రి 2.53 సమయంలో మీనా, చేతన్ సింగ్‌లు ఏసీ కోచ్‌లో పర్యవేక్షిస్తున్నారు. పర్మార్, శ్యామ్ స్లీపర్ కోచ్‌లో ఉన్నారు. ఘన్‌శ్యామ్ రిపోర్టును ఇవ్వడానికి వెళ్లిన క్రమంలో చేతన్, మీనాతో సహా మరో ఇద్దరు టికెట్ కలెక్టర్లు ఉన్నారు. అయితే.. చేతన్ ఆరోగ్యం బాగులేదని రైలు దిగిపోతానని మీనాకు చెప్పారు. కానీ కేవలం రెండు గంటలు డ్యూటీ మాత్రమే మిగిలి ఉందని మీనా చేతన్‌ను సముదాయించారు. 'డ్యూటీ పూర్తి చేయాలని..' కానీ చేతన్.. మీనా మాటలు వినడానికి సిద్ధంగా లేరు. అయితే చేతన్ విషయాన్ని ఎన్స్‌పెక్టర్‌కు తెలిపాడు మీనా. అటు నుంచి కంట్రోల్ రూమ్‌కు కూడా సమాచారం అందించాడు. కానీ డ్యూటీ పూర్తి చేసుకుని ముంబయి ఆస్పత్రిలో చికిత్స తీసుకోమని ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని చేతన్‌కు చెప్పగా ఆయన వినిపించుకులేదు. అయితే.. చేతన్ వద్ద గన్ తీసుకుని, విశ్రాంతి తీసుకోమన్నారు. పక్కనే ఉన్న బెడ్‌పైన పడుకోమన్నారు. గొంతు నులిమి.. కొద్ది సేపటికే తిరిగి వచ్చిన చేతన్ తన గన్ను తనకు ఇచ్చేయమని అడిగాడు. వద్దని వారించిన ఘన్‌శ్యామ్ గొంతును నులిమే ప్రయత్నం చేశాడు. ఘన్‌శ్యామ్, చేతన్ల గన్లు తారుమారు అయ్యాయి. ఎవరి గన్లు వారికి ఇప్పించడానికి వచ్చిన సీనియర్ అధికారి మీనాపై చేతన్ తిరగబడ్డాడు. వాగ్వాదం సాగింది కాసేపు. ఆ తర్వాత ఘన్‌శ్యామ్ అక్కడి నుంచి వెళ్లాడు. కాసేపటికే చేతన్ ఫైరింగ్ మొదలుపెట్టాడు. మీనాతో సహా మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన జరిగే సమయంలో గన్ పేలుడు శబ్దాలు విని బాత్రూంలో దాక్కున్నట్లు ఘన్‌శ్యామ్ తెలిపారు. మిగిలిన కానిస్టేబుళ్ల క్షేమాన్ని కనుకుని, కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. అనంతరం రైలును చైన్ లాగి నిందితుడు పారిపోయాడని ఘన్‌శ్యామ్ తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం!