
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు విభాగం రూపొందించిన ‘టీఎస్‌కాప్’కు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ట్రోఫీ– 2017 లభించింది. బుధవారం చెన్నైలో జరిగిన ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్ లో భాగంగా ట్రోఫీని తమిళనాడు ముఖ్య మంత్రి పళనిస్వామి చేతుల మీదుగా అదనపు డీజీ అంజనీకుమార్ అందుకున్నారు. ఎన్‌సీఆర్‌బీ ఏటా నిర్వహించే టెక్నాలజీ అమలు, వినియోగం, పోలీసు శాఖలో కంప్యూటీకరణ తదితర అంశాలపై పోటీ నిర్వహిస్తోంది. ఇందులో అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు పోటీ పడగా టీఎస్‌కాప్‌కు ఈ ట్రోఫీ లభించింది.