గ్లాస్గోలో ప్రధాని మోదీని కలిసిన ఎంపీ మిథున్‌ రెడ్డి | Ysrcp Mp Midhun Reddy Meets Pm Narendra Modi In Glasgow | Sakshi
Sakshi News home page

గ్లాస్గోలో ప్రధాని మోదీని కలిసిన ఎంపీ మిథున్‌ రెడ్డి

Published Tue, Nov 2 2021 11:06 PM | Last Updated on Tue, Nov 2 2021 11:25 PM

Ysrcp Mp Midhun Reddy Meets Pm Narendra Modi In Glasgow - Sakshi

గ్లాస్గో: వాతావరణ మార్పులపై గ్లాస్గోలో జరుగుతున్న క్లైమేట్ పార్లమెంట్ సదస్సులో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంపీ మిథున్ రెడ్డి కలిశారు. ఈ సదస్సుకు భారత్ నుంచి ముగ్గురు ఎంపీలతో కూడిన బృందం గ్లాస్గోకు వెళ్లింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన చర్యలపై ఈ బృందం సదస్సులో చర్చించనుంది.

వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్‌ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్‌ మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి భారత్‌ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆయన సోమవారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో గ్లాస్గో నగరంలో కాప్‌–26లో భాగంగా నిర్వహించిన ప్రపంచ దేశాల అధినేతల సదస్సులో మాట్లాడారు.
చదవండి: కాప్‌ 26 సదస్సులో జోబైడెన్‌ కునికిపాట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement