MIDHUN REDDY
-
అందుకే పెద్దిరెడ్డి పేరును చంద్రబాబు రోజూ తలుచుకుంటున్నారు: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్షనేత మిథన్ రెడ్డి. అలాగే, చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.అనంతరం, మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. పుంగనూరులో మేము కొనుగోలు చేసిన భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి పేరును ఆయన రోజూ తలుచుకుంటున్నారు. ఏదో ఒక రకంగా కక్ష సాధించాలని చూస్తున్నారు. 2001లోనే మేము భూములను కొనుగోలు చేశాం. అది ప్రభుత్వ భూమి కాదని 1968లోనే గెజిట్ విడుదల చేసింది. అది ప్రైవేట్ ల్యాండ్ అని రికార్డ్స్ చెపుతున్నాయి. ఆ భూమి ఎకర విలువ నాలుగు లక్షల రూపాయలు మాత్రమే. మొత్తం భూమి విలువ మూడు కోట్లు మాత్రమే ఉంటుంది. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. రాజకీయ కక్షతోనే మాపైన కేసులు పెడుతున్నారు. పై కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదు. చంద్రబాబు కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నారు. గతంలో మదనపల్లి ఫైల్స్ తగలబెట్టారని మాపైన ఆరోపణలు చేశారు. రకరకాల కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాకు డిస్టిలర్లో భాగం ఉందన్న ఆరోపణలు రుజువు చేయాలి. మాపై ఇప్పటి వరకు ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. చంద్రబాబు ఆరోపణలు రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలి. కూటమి కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్ జగన్‌కు విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితులు. ఆయన పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. విజయసాయిరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. ఎంపీలు ఎవరూ వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లరు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపారేశారు. ఇదే సమయంలో పోలవరం ఎత్తుపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలి. పోలవరం ఎత్తు తగ్గిస్తారన్న అంశంపై మంత్రి నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, మార్గదర్శి చిట్ ఫండ్స్ కుంభకోణం సహారా కుంభకోణాన్ని మించింది. మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘించిందని సుప్రీంకోర్టుకు ఆర్బీఐ స్పష్టం చేసింది. వేలాది మంది డిపాజిటర్లు మార్గదర్శి వల్ల నష్టపోయారు. నేను పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని లేఖలు రాస్తాను. న్యాయస్థానంలో కూడా కేసులు వేస్తాను అని చెప్పారు. ఇదిలా ఉండగా.. పెద్దిరెడ్డి, చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఓ సందర్భంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు ఇద్దరూ క్లాస్మేట్స్ అని చెప్పారు. అప్పట్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని అన్నారు. అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే అంత కోపమని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పటికీ పెద్దిరెడ్డిపై కక్షతో రగిలిపోతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేసి, ఆయనపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారని అంటూ కామెంట్స్ చేశారు. -
ఈనాడు,ఎల్లో మీడియాపై మిథు రెడ్డి ఫైర్
-
టీడీపీ, ఎల్లో మీడియాపై మిథున్ రెడ్డి ఫైర్
-
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజంపేట: కొత్తగా అన్నమయ్య జిల్లా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి. సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ముచ్చటగా మూడోసారి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజనకు కారకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ అభ్యరి్థగా ఈయనపై పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి పీవీ మిథున్‌రెడ్డి చేసిన అభివృద్ధి, ఆయన విజయావకాశాలు తదితర అంశాలపై ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.. మీరు రాజంపేట స్థానం నుంచి ఎన్నోసారి పోటీ చేస్తున్నారు. మీ బలం ఏమిటి? మిధున్‌రెడ్డి : రాజంపేట నుంచి మూడోసారి పోటీ చేస్తున్నాను. ప్రజలతో పాటు పార్టీ క్యాడర్‌కు అండగా ఉంటా. పిలిస్తే పలుకుతా..చెబితే చేస్తాను. రెండుసార్లు రాజంపేట లోక్‌సభ ప్రజలు ఆశీర్వదించారు. మూడోసారి ఆశీర్వదిస్తే లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తాను. ప్రజల అండదండలతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతున్నాను. మీ ప్రత్యరి్థ, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి, మీకు ఉన్న తేడా ఏమిటి మిధున్‌రెడ్డి: నేను లోకల్ లీడర్, కిరణ్‌కుమార్‌రెడ్డి గెస్ట్ పొలిటిíÙయన్. వస్తాడు. పనిచేసుకుంటాడు. హైదరాబాదుకు వెళ్లిపోతాడు. ఇది లోక్‌సభ పరిధిలోని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ సూట్‌కేసుతో హైదరాబాదుకు పంపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. మీకున్న బలం ఏమిటి? ఏ విధంగా ఈ ఎన్నికల్లో గెలుస్తారని భావిస్తున్నారు మిధున్‌రెడ్డి: నాకున్న బలం ప్రజలు. జగనన్న ఆశయాలతో ముందుకెళుతున్నాను. ఈ ఎన్నికల్లో ఓటర్లు సంక్షేమం, అభివృద్ధినే చూస్తారు. మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే. జగనన్న ఎన్నికల సభలకు జ నం బ్రహ్మరథం పట్టారు. అందుకే కూటమిలో ఓటమి గుబులు పట్టుకుంది. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏ విధంగా అభివృద్ధి చేశారు. వచ్చే టర్మ్‌లో ఏం చేయనున్నారు మిధున్‌రెడ్డి: రూ.2400 కోట్లతో వాటర్గ్రిడ్స్ పూర్తి చేశాము. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను ముందుకు నడిపిస్తున్నాము. కడప–రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాను. రాయచోటి, పుంగనూరు, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు తీయించాము. అన్ని నియోజకవర్గాలలో ఆ ప్రాంత పరిస్ధితులను బట్టి అభివృద్ధి చేస్తున్నాం. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ పార్లమెంటరీ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. తప్పకుండా దేవుడు, ప్రజల ఆశీస్సులతో నా సంకల్పం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రైల్వే సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేశారు మిధున్‌రెడ్డి: ప్రదానంగా రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో నూతన రన్నింగ్‌రూం మంజూరుకు కృషి చేశాను. బడ్జెట్లో కూడా ప్రకటించారు. రైల్వే పూర్వవైభవం కోసం ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేయాలని లోక్‌సభలో కూడా ప్రస్తావించాను. ఎప్పటికప్పుడు నందలూరు రైల్వే అభివృద్ధి కోసం రైల్వేమంత్రి, రైల్వేబోర్డుకు వినతులు ఇస్తూనే ఉన్నాము. ఎన్నడూ లేని విధంగా ముంబై–రేణిగుంట రైలుమార్గంలోని రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న రైల్వే ప్రాంతాల్లో గేట్ల సమస్య లేకుండా ఆర్యూబీ(రోడ్ అండర్ బ్రిడ్జి)ల మంజూరుకు కృషి చేశాము. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. రాజంపేట, పీలేరు రైల్వేస్టేషన్లను అమృత్‌లో ఎంపికకు కృషి చేశాను. అలాగే కరోనా ముందు ఏ వి«ధంగా హాలి్టంగ్ సౌకర్యం ఉండేదో అదే విధంగా ఉండేలా రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాను. జిల్లాకు సంబంధించిన అంశంపై చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు సాధ్యమయ్యేవేనా మిధున్‌రెడ్డి: చంద్రబాబు రాజంపేటకు వస్తే ఒక మాట..రాయచోటికి వెళితే మరొక మాట, మదనపల్లెలో ఉంటే ఇంకో మాట ఇలా జనం చెవిలో పువ్వులు పెడతారు. అవి సాధ్యం కావని ప్రజలకు తెలుసు. బాబు మాటలను నమ్మే పరిస్థితిలో రాజంపేట జనం లేరు. ఊసరవెల్లి రాజకీయాలకు రాజంపేట ప్రజలు చెల్లుచీటి పలుకుతారు. మేము వచ్చే టర్మ్‌లో అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయిస్తాము. 18వ మెడికల్ కాలేజి రాజంపేటలో ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. రాజంపేట వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యరి్ధగా విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి మిధున్‌రెడ్డి: కచ్చితంగా జగనన్న సంక్షేమం, అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి. దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, బీసీల ఆశీర్వాదాలు నాకు పుçష్కలంగా ఉన్నాయి. ముస్లిం మైనారీ్టలకు సీఎం వైఎస్ జగన్ అంటే అభిమానం, ఆతీ్మయత ఉంది. పెద్దిరెడ్డి కుటుంబం పేదల పక్షాన నిలుస్తుందని అన్నమయ్య, చిత్తూరు జిల్లా వాసులందరికి తెలుసు. ఏ అవసరం ఉన్నా..నేనున్నా అంటూ ముందుకొచ్చే కుటుంబం ఏది అంటే పెద్దిరెడ్డి కుటుంబమే. దైవబలం, ప్రజాబలంతో అఖండ విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది. -
Pawan Kalyan: దిగజారిన రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్..
పిచ్చోడి గురించి వినడమే కాని, ఇంతవరకు చూడలేదు.. ఇప్పుడే చూస్తున్నా.. అని ఒక సినమా డైలాగు ఉంది. ఈ మధ్య కొందరు నేతల ప్రసంగాలు గమనిస్తే అలాగే అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిచ్చోడని మనం అనజాలం కానీ, ఆయన స్పీచ్‌ల తీరు మాత్రం రాజకీయ అజ్ఞానాన్ని, ఆయన ప్రస్టేషన్‌ను స్పష్టంగా తెలియచేస్తుంది. మొత్తం మీద తన గెలుపు మీద తనకే అపనమ్మకం ఏర్పడిందో, లేక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై అవిశ్వాసం ఏర్పడిందో కానీ, తన కుటుంబ సభ్యులందరిని ఎన్నికల ప్రచారంలోకి దించారు. అలాగే జబర్దస్త్ టీమ్ పై నమ్మకం పెట్టుకున్నట్లున్నారు.అఫ్ కోర్స్.. ఆయన సతీమణి అన్నాలెజోవా కనిపించడం లేదనుకోండి. ఆయన ప్రచారం ఆయన ఇష్టం. ఎందుకంటే పిఠాపురంలో తనను గెలిపించాలని వర్మను వేడుకున్న పవన్ కల్యాణ్ ఇతర నియోజకవర్గాలలో కూటమి అభ్యర్దులను గెలిపిస్తానని తిరుగుతున్నారు. పిఠాపురానికి, జిల్లాకు, రాష్ట్రానికి ఏమి చేస్తానో చెప్పకుండా ఊదరకొట్టుకుంటూ తిరిగుతున్న పవన్‌ను ఎవరైనా ఎందుకు నమ్ముతారు. సినిమా నటుడు కనుక కాసేపు వినోదం కోసం ఆయనను చూడడానికి వచ్చి, ఆయన పిచ్చి గంతులు, చిందులు చూసి, పనికిమాలిన డైలాగులు విని ఏదో సినిమా చూశాంలే అని జనం సరిపెట్టుకుంటున్నారు. గతంలో గాజువాక, భీమవరంలలో జరిగింది అదే.మరో చిత్రం ఏమిటంటే ఆయన కాకినాడ సిటీలో చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్‌లో కన్నబాబుల అంతు చూడడానికే పిఠాపురంలో పోటీ చేస్తున్నారట. ఆయనే ఈ సంగతి చెప్పారు. నిజంగా వీరి అంతు చూడాలనుకుంటే ఆ నియోజకవర్గాలలో కదా ఆయన పోటీ చేయాల్సింది. అక్కడికి చంద్రశేఖరరెడ్డి ఒకటికి, రెండుసార్లు సవాల్ కూడా విసిరారు కదా? అయినా కాకినాడలో పోటీచేయకుండా పిఠాపురం ఎందుకు పవన్ కళ్యాణ్ చిత్తగించారు.రాజకీయాలలో కాస్త పద్దతిగా మాట్లాడాలి. అచ్చం టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి నోటికి వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయా చోట్ల పోటీ చేస్తున్న ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దులను పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతే పట్టరాని కోపంతో ఊగిపోతూ శాపనార్ధాలు పెడుతున్నారు. ఆయన వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రిని అధఃపాతాళానికి తొక్కేస్తారట. ఇది ఆయన సినిమాలో నటించడమనుకుంటున్నారు కానీ, ప్రజాసేవ అనుకోవడం లేదు. అందుకే ఇలాంటి పిచ్చి మాటలు వస్తున్నాయి.2019 లో రెండు చోట్ల పోటీచేసిన పవన్ కల్యాణ్‌ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడించి ఆయన భాషలో చెప్పాలంటే పాతాళానికి తొక్కారు. ఇప్పుడు ఎన్నికలకు ముందుగానే పవన్‌ను చంద్రబాబు అధఃపాతాళానికి తొక్కేశారు. పవన్ కళ్యాణ్ గెలిచినా, ఓడినా పెద్ద తేడా లేకుండా చేసేశారు. ఒకప్పుడు తాను సీఎంను అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్‌ను ఆ ఊసే ఎత్తనివ్వకుండా చంద్రబాబు తన పెరటి మనిషిగా మార్చుకున్నారు. జనసేనను రాష్ట్రంలో గౌరవప్రదమైన స్థానాలలో పోటీచేయనివ్వకుండా, ఓ ఇరవైఒక్క సీట్లు ఇచ్చి, అందులో డజను సీట్లలో టీడీపీ వాళ్లనే పెట్టి పవన్‌ను కేవలం తన కాళ్ల వద్ద పడి ఉండేలా చంద్రబాబు చేసుకోగలిగారు.చంద్రబాబు వద్ద ఊడిగం చేయడానికే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని భావించిన పలువురు జనసేన నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ సంగతి అర్ధం కాకో, లేక అర్దం అయినా, చంద్రబాబుకు సరెండర్ అయినందువల్లో నోరు మెదపకుండా ఆయన చెప్పినట్లు పవన్ చేస్తున్నారు. జనసేనను రాష్ట్ర వ్యాప్త పార్టీగా లేకుండా చేసి, కేవలం రెండు, మూడు జిల్లాలకే పరిమితం చేసి పవన్ స్థానం ఏమిటో చంద్రబాబు తెలివిగా చూపెట్టారు. ఇక ఎప్పటికీ జనసేన అధఃపాతాళంలోనే ఉండేలా చంద్రబాబు చేస్తే, ఈయనేమో ఎవరినో తొక్కుతానని ప్రగల్బాలు పలుకుతూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం టీడీపీ పిఠాపురం నేత వర్మ కూడా ఈయన ధోరణితో విసిగి చిరాకు పడుతున్నారట. ఆయన పవన్‌కు ఆశించిన రీతిలో సహకరించకపోతే ఇంతే సంగతులు అన్న పరిస్థితి పిఠాపురంలో ఏర్పడిందని చెబుతున్నారు. చంద్రబాబు కన్నా ఘోరంగా అబద్ధాలు చెబుతూ, ఒక్కోచోట ఒక్కో మాట చెబుతూ ప్రజలను, ముఖ్యంగా అభిమానులను బురిడి కొట్టించాలనుకుంటున్న పవన్ లీలలన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయి. తాను ఇంటర్ చదివానని, అందులో కూడా ఆయా చోట్ల ఒక్కో గ్రూప్ చదివినట్లు చెప్పడం, తీరా చూస్తే ఆయన ఎస్ఎస్ఎల్సి అని బ్రాకెట్ లో 10 వ క్లాస్ అని పెట్టడంతో ఈయన ఏమిటో అర్దం అయింది.ఆస్తుల కొనుగోలు లావాదేవీలలో కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయ జీవితంలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా ఇంత మోసపూరితంగా ఉంటారా అన్న విమర్శకు అవకాశం ఇచ్చారు. పవన్ ఎక్కడా తమ కూటమి అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పడం లేదు. ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. కొన్ని ఉదాహరణలు చూడండి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల సొంత ఇళ్లను కూడా తాకట్టు పెట్టేస్తారట. ప్రజలను రోడ్డుపైకి లాగేస్తారట.. బుర్ర, బుద్ది ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి పిచ్చి విమర్శలు చేస్తారా? ఏ ప్రభుత్వం అయినా అలా చేయగలుగుతుందా? మరి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అంత వెర్రివాళ్లు, వాళ్లకు ఏమి తెలియదని, ఈయన ఏమి చెబితే దానిని చెవిలో పువ్వు పెట్టుకుని వింటారని అనుకుంటున్నారా? ఆ జిల్లా ప్రజలు బాగా తెలివైన వాళ్లన్న సంగతి పవన్ కు తెలియదు.రేషన్ బియ్యం విక్రయాలలో 20 వేల కోట్ల కుంభకోణం చేశారట. అసలు ప్రభుత్వం ఇస్తున్నదే ఉచిత రేషన్ బియ్యం. అందులో స్కామ్ ఏమిటి? ఇంత అజ్ఞానమా? రీ సర్వే పేరుతో ప్రజల భూములను కంప్యూటరైజ్ చేస్తున్నారట. తద్వారా దోచేస్తారట. ఇది కేంద్రం తీసుకు వచ్చిన చట్టం అని తెలియకుండా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రాసే తప్పుడు వార్తలను పట్టుకుని పిచ్చి ఉపన్యాసాలు చేస్తే ఏమి ప్రయోజనం. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటీకరణ జరుగుతుంటే, భూముల వివరాలు కంప్యూటర్లలో ఎక్కించకూడదట. మరి భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచో అంటే చంద్రబాబు పాలన సమయం నుంచి కంప్యూటరైజ్ అవుతున్నాయి కదా? దాని వల్ల ఏ ప్రమాదం వచ్చిందో పవన్ చెప్పాలి కదా? అసలు ఇంతవరకు ఆ చట్టమే అమలులోకి రాలేదు. అయినా ఇలా వక్రీకరిస్తున్నారు.ఇక రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. దానికి కారణం పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి మిధున్ ప్రత్యేక శ్రద్ద పెట్టడమే. రాజకీయాలలో ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా పవన్ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో చంద్రబాబుతో కలిసి తిరుగుతూ, వారిని ఓడిస్తా.. వీరిని ఓడిస్తా.. అని చెబుతుండే పవన్ తను పోటీచేసే నియోజకవర్గానికి వేరే పార్టీవారు వచ్చి బాధ్యత తీసుకోకూడదట. దీనిని బట్టే మిధున్ రెడ్డి అంటే పవన్ ఎంత భయపడుతున్నది అర్ధం చేసుకోవచ్చు.మాజీ మంత్రి కన్నబాబుకు చిరంజీవి రాజకీయ భిక్షపెట్టారట. అయినా చిరంజీవిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవమానిస్తే స్పందించలేదట. చివరికి తన అన్న విషయంలో కూడా అబద్ధాలు చెప్పడమేనా! చిరంజీవిని అంత చక్కగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకుంటే, చంద్రబాబు చెప్పమన్నాడని, పవన్ కళ్యాణ్ ఈ రకంగా అసత్యాలు చెబుతున్నారు. కన్నబాబు వైఎస్సార్సీపీలో ఉంటే ఈయనకు వచ్చిన బాధ ఏమిటి? మరి చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో ఎందుకు కలిపారు? పవన్ కల్యాణ్ కొంతకాలం బీజేపీ, టీడీపీలతో, మరికొంతకాలం బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో ఎందుకుపొత్తు పెట్టుకున్నారు. మళ్లీ తాను గతంలో బండ బూతులు తిట్టిన టీడీపీ, బీజేపీల పంచన ఎందుకు చేరారు? ఏదైనా మాట్లాడే ముందు అర్ధం ఉండాలి.మిధున్ రెడ్డి ఏదో మద్యం వ్యాపారి అట. ఈయనేదో పవిత్రుడు మాదిరి కబుర్లు. ఒక పక్క అక్రమ సారా వ్యాపారం చేసి రాజకీయాలలోకి వచ్చిన సీ.ఎమ్.రమేష్ ను గెలిపించాలని చిరంజీవి, పవన్ కళ్యాణ్ కోరుతూ మరో పక్క మిధున్‌పై విమర్శలు చేయడం అంటే ఈయన సారా పైత్యం ఏమిటో తెలుస్తూనే ఉంది. ఒకపారి కాపులైనా తనకు ఓటు వేయాలని, మరోసారి తనకు కులం ఏమిటని, ఇలా రకరకాలుగా మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు శాసనసభ ఎన్నికలలో తన దత్తతండ్రి కళ్లలో ఆనందం చూడాలని తిరుగుతున్నారు. అందుకే ఆయనకు ప్రత్యర్థులు ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టారు.పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఇంతగా దిగజారి చంద్రబాబుకు తెగ భజన చేస్తున్న తీరు మాత్రం సినీ నటుడుగా ఆయనకు ఏర్పడిన అభిమానులు సైతం భరించలేకపోతున్నారు. జనసేన మొత్తం దివాళా తీసినా పర్వాలేదు.. తాను ఒక్కడినైనా గెలవాలన్న వాంఛతో పిఠాపురంలో తంటాలు పడుతున్నారు. కోట్లు సంపాదించుకుంటూ రోడ్లపైకి ఎందుకు వచ్చానో ప్రజలు ఆలోచించాలి అని పవన్ అన్నారు. అవును!ప్రజలు కచ్చితంగా ఆలోచించాల్సిందే. ప్రస్తుతం రోడ్లపై ఈయన తిరుగుతాడు. ఆ తర్వాత తనను కలవడానికి వచ్చేవారిని రోడ్డుపై నిలబెడతారు! అంతకు మించి ఈయన గెలిచినా, ఓడినా ప్రజలకు చేసే సేవ ఏమీ ఉండదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సీఎం జగన్ దాడి ఘటనపై లోతైన దర్యాప్తు..!
-
గల్లా వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్
-
‘చిట్టచివరికి చంద్రబాబు చట్టానికి చిక్కారు’
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వ్యవహారం పార్లమెంట్‌ను తాకింది. ముందస్తు ప్లాన్‌లో భాగంగా ప్రత్యేక సమావేశాల్లో సోమవారం టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్ట్‌ను హైలైట్ చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు సైతం గట్టి కౌంటరే ఇచ్చారు. ఇది పూర్తిగా అవినీతి కేసు అని, ఇందులో చంద్రబాబు ప్రమేయం నిరూపితమైందని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, ఆ అరెస్ట్ ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా స్పందించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. ఆ సమయంలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసులో చోటు చేసుకున్న పరిణామాలను లోక్‌సభకు వివరించారాయన. ఇది పూర్తిగా అవినీతి కేసు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం పూర్తి ఆధారాలతో నిరూపితం అయ్యింది. రూ.371 కోట్ల లూటీ జరిగింది. అన్ని ఆధారాలు ఉన్నందునే ఆయన అరెస్ట్ జరిగింది. ఇప్పటి వరకు చంద్రబాబు అవినీతిని.. స్టేల ద్వారా తప్పించుకుంటూ రాగలిగారు. చిట్టచివరకు చంద్రబాబు చట్టానికి చిక్కారు. ఐటీ కేసులో చంద్రబాబు సైతం నోటీసులు అందుకున్నారు. చంద్రబాబు పీఏకు సైతం ఐటీ నోటీసు ఇవ్వగా.. ఆయన విదేశాలకు పారిపోయారు. ఈ కేసులో దోచిన మొత్తాన్ని 80 షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేలిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది అని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. అయితే.. మిథున్ రెడ్డి ప్రసంగాన్ని మధ్యలో టీడీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కోర్టులో ఉన్న సమయంలో సభలో చర్చ సరికాదని అభిప్రాయపడ్డారు. కోర్టులో విచారణలో ఉన్న ఈ అంశం పైన సభలో చర్చకు అనుమతించనని స్పష్టం చేశారు. -
తనకు బలం లేదని పవన్ కల్యాణే ఒప్పుకున్నారు:మిథున్‌రెడ్డి
కాకినాడ: టీడీపీతో పొత్తు ఆశయంలో భాగంగానే జనసేన నేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మిథున్రెడ్డిఅన్నారు. ముఖ్యమంత్రిని కానని గతంలో పవన్ చెప్పారని, అంత బలం తనకు లేదని స్వయంగా పవన్ చెప్పిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలతో నేరుగా ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలనేదే తమ పార్టీ స్ట్రాటజీ అని మిధున్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే తమవల్ల ఉపయోగం ఉంటేనే ఓటు వెయ్యమని సీఎం జగన్ అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ముద్రగడ వైఎస్సార్సీపీలోకి వస్తానంటే తప్పకుండా ఆహ్వనిస్తామన్నారు. ఎంపీ ఎన్నికల షెడ్యూల్‌తోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. గడప గడపకు ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్లే వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని, వారే తమ పార్టీ అభ్యర్ధులని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టాప్ ప్రయారిటీ ఉంటుందని మిథున్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం: సీఎం జగన్ -
ఆధారాలతోనే నలుగురు ఎమ్మెల్యేలను సస్సెండ్ చేశాం: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఆధారాలతోనే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. జగన్‌ను విభేదించిన వారికి ఓటమి తప్పదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు పట్టిన గతే వీళ్లకూ పడుతుంది. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు సీట్లు లేవని సీఎం ముందే చెప్పారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి. అనైతికంగా ఎమ్మెల్యేలను కొని ఎన్టీఆర్‌ని ఎలా దించేశారో అందరికీ తెలుసు’ అంటూ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: తప్పటడుగు వేసి అడ్డంగా దొరికిపోయారు.. ‘‘సీటు ఇస్తే ఓటు వేస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ సీఎం జగన్ నిజాయితీగా సీటు ఇవ్వలేనని చెప్పేశారు. ఒక ఎమ్మెల్సీ కంటే సీఎం జగన్ వ్యక్తిత్వం ముఖ్యమనుకున్నారు’’ అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో పోటీ చేసే దమ్ము లోకేష్‌కు ఉందా? అంటూ ఎంపీ సవాల్ విసిరారు. మేం కచ్చితంగా 175 సీట్లు గెలవాలన్న టార్గెట్‌తోనే పనిచేస్తామని ఆయన అన్నారు. చదవండి: జైలు తప్పదా బాబూ? -
త్వరలోనే కోనసీమ అల్లర్ల కేసు ముగింపు: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, కాకినాడ జిల్లా: త్వరలోనే అమలాపురం అల్లర్ల కేసుకు ముగింపు పలుకుతామని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘కొద్దిరోజుల కిందట మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్.. సీఎం జగన్‌ను కలిశారు. అల్లర్ల కేసులో కొందరు అమాయకుల పేర్లు ఉన్నాయని, దీనివల్ల యువత భవిష్యత్తు పాడవుతుందని సీఎంకు వివరించారు. వారిపై నమోదైన కేసులను ఉపసంహరించాలని కోరారు’’ అని మిథున్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: ‘ఎన్టీఆర్‌ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’ -
ఘనంగా ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు
కేవీపల్లె : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలను కేవీపల్లెలో ముందస్తుగా నిర్వహించారు. శనివారం జెడ్పీటీసీ సభ్యురాలు గజ్జెల శృతి ఆధ్వర్యంలో కేక్ ఏర్పాటు చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ ఇక్బాల్ అహ్మద్‌కు తినిపించారు. పీలేరు నియోజకవర్గం నుంచే గాక, రాయచోటి, పుంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు నాయకులు, కార్యకర్తలు మిథున్‌రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్లు హరీష్‌రెడ్డి, కారపాకుల భాస్కర్‌నాయుడు, ఏఎంసీ ఛైర్మన్ కడప గిరిధర్‌రెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ, జెడ్పీటీసీ గజ్జెల శృతి, నాయకులు గజ్జెల శీన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, పి. ద్వారకనాథరెడ్డి, ఆనందరెడ్డి, జయరామచంద్రయ్య, రామ్ప్రసాద్నాయుడు, సి.కె. యర్రమరెడ్డి, సిరి, సైఫుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ మెగా ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అతిపెద్ద సమీకృత ప్రత్యామ్నాయ ఇంధన స్టోరేజి ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. లోక్‌సభలో శుక్రవారం ఇంధన పరిరక్షణ సవరణ బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ తరపున ఆయన పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం, ప్రపంచలోనే అతిపెద్ద సమీకృత ప్రత్యామ్నాయ ఇంధన స్టోరేజి ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇంధన రంగం కోసం యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్‌తో పనిచేస్తున్నారు. సుమారు 5300 మెగావాట్ల పంప్ స్టోరేజి కెపాసిటీతో నిర్మిస్తోంది. కాబట్టి, ఈ అంశంలో రాష్ట్రానికి సహకరించాలని ఎంపీ మిథున్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎనర్జీ అభివృద్ది రంగంలో ఏపీ 22 శాతం అభివృద్ధితో ఉందని తెలిపిన ఆయన.. ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రోత్సాహం కోసం జిఎస్టీని తగ్గంచాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 250 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతితో ఖజానాపై భారం పడుతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా 33 గిగావాట్ల ఇంధన పంప్ స్టోరేజీని నిర్మించాలి. ఒక్క ఏడాది బొగ్గు దిగుమతి ఖర్చుతో.. దీన్ని శాశ్వత ఇంధన వనరుగా మార్చుకోవచ్చు. దీంతో ఇంధన రంగంలో దేశం స్వయం సమృద్ధిగా మారుతుంది. ఇదొక గేమ్ చేంజర్‌గా మారుతుంది. అదే సమయంలో ఏపీ ఒక హబ్‌గా, బ్యాటరీగా మారుతుంది. గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు వస్తాయి అని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. ‘‘పంప్ స్టోరేజీకి కాంక్రీట్, ఎర్త్ వర్క్ మాత్రమే చాలు. అంతా స్వదేశీయంగానే తయారు చేసుకోవచ్చు. బొగ్గు దిగుమతికి డాలర్లలో ఖర్చు పెడుతున్నాం. అదే పంప్ స్టోరేజికి వచ్చే 25 ఏళ్లకు ఫిక్స్డ్ ధర నాలుగు రూపాయలకే సరఫరా చేయొచ్చు. అంతేకాదు పవర్ బిల్లు, బొగ్గు దిగుమతి బిల్లు తగ్గుతుంది.పెట్టుబడులు, ఉద్యోగ కల్పన పెరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ పెరిగి గ్రీన్ ప్రొడక్ట్స్ డిమాండ్ వస్తుందని ఎంపీ మిథున్‌రెడ్డి వివరించారు. -
ఏపీలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది: విజయసాయిరెడ్డి
-
మరి కేంద్రం అప్పుల సంగతి ఏంటి?: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైఎస్ జగన్ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక స్థితిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. ఈమేరకు గురువారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది. చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, రాష్ట్రం సీఎం జగన్ లాంటి సమర్థ నాయకుడి చేతిలో ఉంది. ఒకరకంగా కేంద్రం కంటే ఏపీ పరిస్థితినే ఆర్థికంగా మెరుగ్గా ఉంది. 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా ఉంది. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో ఉంది. ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గింది. కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదు. 41 శాతం పన్నుల వాటా కేంద్రం ఇస్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. సెస్, సర్ఛార్జీలు కేంద్రం ఏటా పెంచుతోంది. కానీ, ఆ ఆదాయం మాత్రం కేంద్రం ఇవ్వడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం.. తన అప్పుల సంగతిపై ఏం చెబుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి నిలదీశారు. 2014-19లో కేంద్రం అప్పులు 60 శాతం పెరిగితే , చంద్రబాబు హాయంలో రాష్ట్రంలో 117 శాతం అప్పులు పెరిగాయి. కేంద్రం 2019 నుంచి ఇప్పటి వరకు 50 శాతం అప్పులు చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో కేవలం 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయి. నాటి చంద్ర బాబు ప్రభుత్వం అయిదుగురు కోసం పని చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదు కోట్ల మంది ప్రజల అభివృద్ధికి పని చేస్తుంది అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతలది తప్పుడు ప్రచారం: మిథున్ రెడ్డి జాతీయ రహదారుల విషయంలో ఏ రాష్ట్రానికి రాని నిధులు ఏపీకి వచ్చాయి. రైతు భరోసా కేంద్రాలు, వాలంటరీ వ్యవస్త ను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం కింద నిధులు తీసుకు రావడంలో ఎంపీలందరం సమిష్టిగా పని చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకం కింద రాష్ట్రంలో సురక్షిత జలాలు ఇస్తున్నాం. అయినా టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి పేర్కొన్నారు. -
తిరునగరి.. క్రీడాపురి
-
‘గతంలో అర్హత ఉన్నా జన్మభూమి కమిటీ చెబితేనే పెన్షన్ ఇచ్చేవారు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను 2500 రూపాయలకు పెంచారని వైఎస్సార్సీపీ ఎంపీ వెంకట మిథున్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం అందుతుందన్నారు. ఈ మేరకు ఎంపీ చిత్తూరులో ఆదివారం మాట్లాడుతూ.. ఎవరి రికమెండేషన్ లేకుండానే పథకాలు ఇంటిటికీ చేరుతున్నాయన్నారు. గతంలో అర్హత ఉన్నా కూడా జన్మభూమి కమిటీ చెబితేనే పెన్షన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు మాత్రమే టీడీపీ పెన్షన్ పెంచిందని దుయ్యబట్టారు. పిల్లలు అందరూ చదువుకుని ప్రయోజకవంతులు అవ్వాలనేదే సీఎం జగన్ ఉద్దేశ్యమని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు, అప్పుడే కుటుంబాలు బాగుపడుతాయనేది ఆయన ఆలోచన అని కొనియాడారు. అందుకే పెచ్చులు ఊడిపోయే పాఠశాలలను నాడు-నేడుతో అబివృద్ది చేశారని, పిల్లలకు యూనిఫాం, భోజనం, అమ్మ ఒడి ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలుగులో చదివి ఢిల్లీలో ఉద్యోగం కావాలంటే కష్టమని అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష మీడియా తీసుకొచ్చామని చెప్పారు. చదవండి: బయపరెడ్డీ అని కేక వేస్తే.. ఒకరు కాదు.. పది మంది వస్తారు.. ఎందుకంటే? ‘చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి కానీ పెద్దవాళ్ళ పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలా? చిన్న పిల్లలకు ఎవ్వరికీ ఓట్లు లేవు, కేవలం అందరి జీవితాల్లో మార్పు కోసమే ఈ పథకాలు. ప్రతి పథకం మహిళలకు అందిస్తున్నారు, ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. పేద ప్రజలకు సహాయం చేస్తే చంద్రబాబుకు వచ్చే బాధ ఏంటి?. గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఒక మాట చెపితే దానికి కట్టుబడి ఉంటారు. పేదలకు ఇళ్ళు లేవని ఇప్పుడు గృహ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ’ అని ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: ఛీ ఛీ పార్టీ ఆఫీస్‌లో ఇదేం పని.. బీజేపీ నేతల వీడియో వైరల్ -
Lok Sabha: రఘురామ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి,ఢిల్లీ: లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజుపై రెండు సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ థర్మల్ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: ఓటీఎస్‌పై చంద్రబాబు విమర్శలు అర్థరహితం: సజ్జల ‘‘ఆయన బ్యాంకులను మోసం చేశాడు. వాటి నుంచి బయట పడటం కోసం కేంద్రంలోని అధికార(బీజేపీ) పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు మా పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు. బ్యాంకులను మోసం చేశాడు కాబట్టే.. ఆ కేసుల నుంచి బయటపడటానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుపై కేసులను వీలైనంత త్వరగా తేల్చండి. భారత్ థర్మల్ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని’’ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అవాస్తవ ప్రచారం చేస్తోంది
-
గ్లాస్గోలో ప్రధాని మోదీని కలిసిన ఎంపీ మిథున్ రెడ్డి
గ్లాస్గో: వాతావరణ మార్పులపై గ్లాస్గోలో జరుగుతున్న క్లైమేట్ పార్లమెంట్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంపీ మిథున్ రెడ్డి కలిశారు. ఈ సదస్సుకు భారత్ నుంచి ముగ్గురు ఎంపీలతో కూడిన బృందం గ్లాస్గోకు వెళ్లింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన చర్యలపై ఈ బృందం సదస్సులో చర్చించనుంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆయన సోమవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో గ్లాస్గో నగరంలో కాప్–26లో భాగంగా నిర్వహించిన ప్రపంచ దేశాల అధినేతల సదస్సులో మాట్లాడారు. చదవండి: కాప్ 26 సదస్సులో జోబైడెన్ కునికిపాట్లు -
'పవన్ కల్యాణ్ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారు'
సాక్షి, తిరుపతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కులాల మధ్య చిచ్చురేపుతున్నారంటూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పవన్ కల్యాణ్ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆయనకు కనిపించడం లేదు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి మ్యానిఫెస్టోలోని హామీలను అమలుపరచడం పవన్‌కు కనిపించడం లేదా?. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు తీవ్ర అన్యాయం చేసింది. గత ప్రభుత్వంలో సోమల, సదుం మండలాల్లో భూముల రికార్డులు టాంపరింగ్, అక్రమాలు జరిగాయి. సీఐడీ విచారణలో అక్రమాలు వెలుగులోకి వస్తాయి' అని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. చదవండి: (ప్యాకేజీ పెంచుకునేందుకే శ్రమదానం) -
వైఎస్సార్ జిల్లా జడ్పీ చైర్మన్‌గా ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి
-
జగనన్న కాలనీలను పరిశీలించిన ఎంపీ మిథున్ రెడ్డి
-
రాష్ట్రానికి రావాల్సిన హక్కులకోసం పార్లమెంట్ లపోరాడతాం : మిథున్ రెడ్డి
-
మిథున్ రెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
‘రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడుతున్నారు’
-
తిరుపతి ప్రచారం లో టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి
-
సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు: మిధున్ రెడ్డి
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత మిధున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంతో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు కేంద్రం నుంచి వచ్చేలా చూడమని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలా ఒత్తిడి చేయమని కోరారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేశాము. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తాము. జీఎస్టీ పెండింగ్ బకాయిలను రాష్ట్రానికి వచ్చేలా అధికారులతో కలుస్తాం. గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. 'జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజ్ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఉంటే గిరిజనులకు లాభం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు. అంతర్వేది టనపై నిజాలు నిగ్గు తేలాలి. మతకలహాలు రెచ్చగొట్టే ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సీఆర్డీఏ, ఫైబర్ గ్రిడ్లపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరపాలి. దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి గౌరవం ఇచ్చింది. అయితే ఆయన ప్రతిపక్షాల ఎజెండా ప్రకారం నడుచుకుంటున్నారు. ఆయనపై త్వరితగతిన అనర్హత వేటు వేయాలి' అని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. (వైఎస్సార్సీపీ ఎంపీలతో సమావేశమైన సీఎం వైఎస్ జగన్) -
ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ: అడవులు అగ్ని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య కేంద్రాన్ని శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నించారు. దీనికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో సమాధానమిస్తూ అడవుల్లో మంటలు అంటుకుంటే హెచ్చరించడానికి ఐదు రకాల హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని వివరించారు. మంటలు ఆర్పేందుకు తగిన ఆర్థిక సాయం అందుతుందని వివరించారు. ‘జగనన్న గోరుముద్ద’ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారా? పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు తగిన పోషకాహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో పథకం అమలు చేస్తున్నారని, ఈ స్కీమ్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారా? అని వైఎస్సార్సీపీ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు కేంద్రాన్ని ప్రశ్నించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సమాధానమిస్తూ ఉత్తమ విధానాలు అమలు చేసే అన్ని రాష్ట్రాలను ప్రశంసిస్తామని, కేంద్ర ప్రభుత్వం తన సామర్థ్యాలకు అనుగుణంగా రాష్ట్రాలతో చర్చించి పథకాలు అమలు చేస్తుందని వివరించారు. ఆయా పథకాలను రాష్ట్రాలు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని వివరించారు. కొత్త టెక్స్టైల్ పాలసీ రూపకల్పన జరుగుతోంది టెక్స్టైల్ రంగం అభివృద్ధికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్స్టైల్ పాలసీని రూపొందిస్తోందని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బీశెట్టి వెంకటసత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్, ఎన్.రెడ్డప్ప, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్, పోచా బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎగుమతుల సబ్సిడీలకు డబ్ల్యూటీవో ఆటంకాలు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వివాదాన్ని లేవనెత్తిన విషయం వాస్తవమేనని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, ‘ప్యానల్ దశలో ఇండియా తన కేసును వాదించింది. కానీ వివాద పరిష్కార ప్యానల్ మాత్రం భారత్ చేపట్టిన చర్యలు డబ్ల్యూటీవో నిబంధనలకు విరుద్ధమని తన నివేదికలో పేర్కొంది. ప్యానల్ నివేదికను భారత్ 2019, నవంబర్ 19న అప్పిలేట్ సంఘం వద్ద సవాల్ చేసింది. కానీ తగినంత కోరం లేని కారణంగా కేసులో పురోగతి లేదు. అయినప్పటికీ డబ్ల్యూటీవోలోని ఇతర సభ్యులతో కలసి అప్పిలేట్ సంఘం వద్ద ఈ కేసును అనుకూలంగా పరిష్కరించుకోవడానికి భారత్ కట్టుబడి ఉంది..’ అని మంత్రి తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వయో పరిమితి సడలింపు ఇవ్వాలి ఆర్థికంగా బలహీన వర్గాలకు అందిస్తున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో గరిష్ట వయోపరిమితి కూడా పెంచాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాజ్యసభ జీరో అవర్‌లో మాట్లాడారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇచ్చే వయోపరిమితి సడలింపు తరహాలో ఈడబ్ల్యూఎస్‌లో కూడా ఇవ్వాలని కోరారు. -
ఆస్తులు కాపాడుకోవడానికే టీడీపీ ఆందోళనలు
రాయచోటి: అమరావతి పేరుతో ఆస్తులను కాపాడుకోవడానికే టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా రామాపురంలో మంగళవారం ఆయన ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలన వికేంద్రీకరణతోపాటు ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ ముందుకు పోతున్నారని మిథున్ రెడ్డి చెప్పారు. రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడదన్న విషయాన్ని టీడీపీ నేతలు గ్రహించాలన్నారు. తిరువూరుకు సమీపంలో రాజధాని వస్తుందని ముందుగా ప్రచారం చేసి.. తర్వాత అమరావతిలో భూములు కొనుగోలు చేశాక దాన్ని రాజధానిగా ప్రకటించిందా టీడీపీ కాదా అని నిలదీశారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని మరిచి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవడానికే పాలనను సాగించారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రకటనపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ నేతలు తమ భూముల కోసం ఆందోళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై కమిటీలు సూచించిన విధానాలను అమలు చేసేందుకు సీఎం ముందుకు వచ్చారన్నారు. ఇదే విషయంపై అసెంబ్లీలో కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ వద్దని విశాఖ, కర్నూలుకు వెళ్లి చెప్పే దమ్ము టీడీపీ నేతలకుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో గ్రాఫిక్స్‌లో అమరావతిని చూపించింది వాస్తవమా.. కాదా చెప్పాలన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌పాషా విమర్శించారు. సీఎం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంటే వాటిని సినిమా యాక్టర్లతో రెచ్చగొట్టేలా చేయడం సిగ్గుచేటన్నారు. -
అడగకముందే ఇస్తున్నందుకు గర్వపడుతున్నాం
సాక్షి, వైఎస్సార్ కడప: అమరావతిలో భూములు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. లోటు బడ్జెట్లో కేవలం అమరావతికే లక్ష కోట్లకు పైగా కేటాయించడమంటే మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం చేసినవారమవుతామన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌లు జిల్లాలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోస్టన్, జీఎన్ రావు కమిటీల నివేదికలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపించారని విమర్శించారు. కనపడని రాజధాని కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అధోగతిపాలు చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ స్వార్థపరుడైతే కడపను రాజధానిగా చేసేవారని చెప్పుకొచ్చారు. కానీ 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సినిమా యాక్టర్లతో జనాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. మేము అడగకముందే మాకు హైకోర్టు ఇస్తున్నందుకు గర్వపడుతున్నామని తెలిపారు. కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్న టీడీపీ ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృద్ధి పట్ల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి కొనుగోలు చేసిన భూముల విలువలు కాపాడటానికి తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పోరాడింది లేదని విమర్శించారు. ప్రభుత్వం మీద బురద జల్లడమే టీడీపీ పనిగా పెట్టుకొందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో టీడీపీ నాయకులకు బయట తిరిగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. -
యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలి
సాక్షి, న్యూఢిల్లీ : జల వివాదాల కమిటీ ఏర్పాటుకు మద్దతిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. అయితే దానికి నేతృత్వం వహించే వారు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండాలని, జల వివాదాల సమస్య పరిష్కారానికి ఏడాదిన్నర సమయం తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రెండు, మూడు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలని కోరారు. బుధవారం లోక్‌సభలో అంతర్ రాష్ట్ర జల వివాదాల బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలస్యం చేయడం వల్ల అసలు ఉద్దేశం నెరవేరదని అభిప్రాయపడ్డారు. సరైన డేటా ఉంటే సమస్యను పరిష్కరించడం చాలా సులువని, సమస్య పరిష్కారం అంతా ఆరు నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దిగువ రాష్ట్రాల్లో ప్రయోజనాలను కాపాడాలని, ప్రభావవంతమైన నీటి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
కేంద్రానికి సహకరిస్తూనే ‘హోదా’ కోసం పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూనే, ప్రత్యేక హోదా సాధన కోసం తమ పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హాజరయ్యారు. అఖిలపక్ష భేటీ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రిని కోరామని చెప్పారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశామన్నారు. సభా సమయం వృథా కాకుండా చూడాలి ‘‘వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించాం. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, అవసరమైతే దీన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగబద్ధత కల్పించాలని కోరాం. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలని విన్నవించాం. గతంలో పార్లమెంట్ సమావేశాల్లో సభా సమయం ఎక్కువగా వృథా అయ్యేది. ఎలాంటి చర్చలు, నిర్ణయాలు లేకుండా ఆటంకాలతో సభా సమయం ముగిసేది. ఇప్పుడు అలా జరగకుండా ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఏడాదికి ఇన్ని రోజుల పాటు పార్లమెంట్ సమావేశం కావాలని, ఎవరైతే హాజరు కారో, ఎవరైతే సమావేశాలకు ఆటంకాలు సృష్టిస్తారో అలాంటి వారికి జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు అందకుండా చూడాలని సూచించాం. పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. అన్ని రాజకీయ పక్షాలు మహిళా రిజర్వేషన్లను కోరుకున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని అఖిలపక్ష సమావేశంలో కోరాయి’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే తమ ప్రధాన ఎజెండా అని తేల్చిచెప్పారు. బీసీలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం పెరగాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా ఆలోచించి, బీసీలకు అత్యధిక ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. -
అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు: వైఎస్ జగన్
-
రాక్షస పాలన అంతమెందించే రోజులు దగ్గర్లోనే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిందేమి లేదని, అవినీతే తప్ప అభివృద్ది చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. స్వార్థం కోసం అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. గురువారం కడపలో జరిగిన వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభలో పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ.. ఐదేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన జరుతుందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ది చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు ధనబలంలో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని.. అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బాబు ప్రలోభాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను మించిన పోరాట యోధుడు లేరని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ నేతలను గెలిపించేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏం చెప్పిన నమ్మే స్థితి లేదు : సి. రామచంద్రయ్య ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు ఏం చెప్పిన నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఆస్తులను కొల్లగొట్టేందుకే అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలేదని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని రాక్షస పాలనను అంతమెందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యం : కోరుముట్ల తన స్వార్థం కోసం నక్కజిత్తుల చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పాదయాత్ర ద్వారా ప్రజల బాధలు తెలుసుకున్న వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎవరు భయపడోద్దు : మిథున్ రెడ్డి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైన టీడీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని, ఎవరూ భయపడొద్దని అందరి బాగోగులు వైఎస్ జగన్ చూసుకుంటారని వైఎస్సార్సీపీ నేత మిథున్‌రెడ్డి హామీ ఇచ్చారు. అక్రమ కేసులు పెడుతున్నారని ఎవరూ అధైర్యపడొదన్నారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులన్ని ఎత్తేస్తామని చెప్పారు. ఐదేళ్లుగా చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. ఏ ఒక్క వర్గాన్ని అభివృద్ధి చేయని టీడీపీ నేతలు.. అన్నీ చేశామంటూ విధుల్లో తిరగడం సిగ్గుచేటన్నారు. బాబు ప్రలోభాలకు గుణపాఠం చెప్పాలి : రాచమల్లు చంద్రబాబు నాయుడు ధనబలంతో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రజలను కోరారు. ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు.. అవినీతి సొమ్ముతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ నవరత్నాలను బాబు కాపీ కొట్టారు
-
కోడి కత్తి కాదు.. నారా వారి కత్తి డ్రామా
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించడం శుభపరిణామమని, దీంతో వాస్తవాలు బయటకొస్తాయని ఆశిస్తున్నామని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఇది కోడి కత్తి డ్రామా కాదని, నారా వారి కత్తి డ్రామా అనే విషయం విచారణలో బయటపడుతుందని భావిస్తున్నామని చెప్పారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను చంపించడానికి కుట్ర పన్నిందెవరో బయటకు రాకుండా కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారని విమర్శించారు. ‘‘విపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన అరగంటలోపే ఈ కేసు ఏవిధంగా దర్యాప్తు జరపాలో డీజీపీ డిక్టేట్ చేశారు. డీజీపీ ఆదేశాలకు విరుద్ధంగా ఆయన కింద పనిచేసేవారు ఎలా దర్యాప్తు చేస్తారు? ఈ హత్యాయత్నం వెనుక ఎవరూ లేరని, శ్రీనివాస్ అనే వ్యక్తి మాత్రమే ఉన్నారని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇలా చేస్తారని మేం ఊహించే థర్డ్‌పార్టీ విచారణకు డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాం. ఈ నేపథ్యంలో ఈ కేసును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించింది’’ అని చెప్పారు. సీబీఐ, ఆదాయపన్ను శాఖలు ఏపీలో విచారణ జరపడానికి వీల్లేదని అడ్డుకుంటూ చంద్రబాబు ఇప్పటికే జీవోలిచ్చారని, రేపు ఎన్ఐఏను కూడా ఆయన సామ్రాజ్యం(రాష్ట్రం)లో విచారణ జరపడానికి వీల్లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారేమోనని సందేహం వెలిబుచ్చారు. చిల్లర రాజకీయాలకు నిదర్శనం.. మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి పంపిణీ చేస్తున్న గడియారాలపై చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మిథున్ మండిపడ్డారు. తిప్పారెడ్డి తన సొంత డబ్బుతో గత ఆగస్టు నుంచి తన నియోజకవర్గంలోని ప్రజలకు గడియారాలు పంపిణీ చేస్తున్నారని, అందులో ఒకదాంట్లో తమ పార్టీ బొమ్మ వెనకాల టీఆర్ఎస్ బొమ్మ ఉందని, ఇది తయారీదారు వద్ద జరిగిన చిన్న పొరపాటని, అయితే ప్రభుత్వ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి దీన్ని వీడియో ప్లేచేసి చూపించడం, టీఆర్ఎస్తో లింకుపెట్టడం చంద్రబాబు చిల్లర రాజకీయాలకు, నీచపు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. ‘‘తిప్పారెడ్డి గుజరాత్లో గడియారాల తయారీకి ఆర్డరిచ్చారు. అక్కడ 150 గడియారాల వెనుక పొరపాటున టీఆర్ఎస్ గుర్తుపేపర్ పెట్టామని తయారీదారు తెలియజేశారు. దీన్నెలా రాజకీయం చేస్తారు? పరిటాల శ్రీరామ్ వివాహమప్పుడు టీడీపీ నేతలు తెలంగాణ సీఎం ఫ్లెక్సీలు, స్వాగతద్వారాలు ఏర్పాటు చేయడం చంద్రబాబుకు కనిపించలేదా? రాజధాని శంకుస్థాపనకు మీరు (చంద్రబాబు) స్వయంగా కేసీఆర్‌ను ఆహ్వానించలేదా? మీరు కేసీఆర్ యాగానికి వెళ్లలేదా? మరిలాంటప్పుడు తయారీదారు ఒక గడియారంలో చిన్న పొరపాటు చేస్తే రాజకీయం చేయడం నీచం కాదా?’’ అని విమర్శించారు. ‘‘ఆంధ్రాలో లూటీ చేసిన డబ్బుతో రేవంత్‌రెడ్డిని బలిపశువును చేయలేదా? హరికృష్ణ చనిపోయిన సందర్భంగా టీఆర్ఎస్తో పొత్తుకోసం కేటీఆర్‌తో ప్రయత్నించడం నిజంకాదా? మీతో పొత్తుకు ఒప్పుకుంటే టీఆర్ఎస్ మంచిది.. లేదంటే చెడ్డదా? ఇదేనా బాబు మార్కు నీతి’’ అని నిలదీశారు. -
‘చంద్రబాబు మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదు’
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం 20వేల రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోని పక్షంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రులు ఉన్నారా అని ప్రశ్నించారు. చుక్క భూములు కూడా పెద్ద స్కాం అని ఆరోపించారు. ఆ భూములను చంద్రబాబుకి చెందిన వ్యక్తులకు ధారాదత్తం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర డీజీపీకి చట్టాలు తెలుసా? తెలియవా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అబద్ధాలకు అవార్డ్స్, రివార్డ్స్ ఇస్తే చంద్రబాబుకు ఇవ్వచ్చని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని.. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 100 రోజులు ఆగితే ప్రజా వ్యతిరేకత అంటే ఏమిటో చంద్రబాబుకు తెలుస్తుందన్నారు. త్వరలో వైఎస్సార్ సీపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.. చంద్రబాబు నాయుడు ఓ వీడియో ప్లే చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లిలో ఆగస్టు నుంచి తిప్పారెడ్డి 60వేల గడియారాలు పంచుతున్నారని తెలిపారు. ఓ గడియారంలో టీఆర్ఎస్ ఫొటో ఉంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కుట్ర కోణమని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పిలవలేదా అని గుర్తుచేశారు. ఓటుకు కోట్లు కేసులో అప్పటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డికి ఇచ్చింది మీ డబ్బు కాదా అని నిలదీశారు. నందమూరి హరికృష్ణ మృతదేహం దగ్గర టీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించారని కేటీఆర్ చెబితే.. అందులో తప్పేముందని చంద్రబాబు వ్యాఖ్యానించడం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంటో అర్థమవుతుందన్నారు. వైఎస్సార్ సీపీకి ఎవరితోను కుమ్మక్కు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తామని పేర్కొన్నారు. -
చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..
-
రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి
-
‘నల్లారి కిశోర్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి’
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో టీడీపీ నాయకుల అరాచకాలను నిలదీసేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం చిత్తూరు జిల్లాలోని కలికిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని, ఆయనకు బుద్ధి చెప్పాలంటే.. అందుకు సరైన ఆయుధం ప్రజల చేతిలోనే ఉందని, ప్రజలు ఓటుతో ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు ప్రజాప్రతినిధులు అయితే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. టీడీపీ నేతలు అధికారదర్పం ప్రదర్శిస్తూ కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ బాలయ్యకుంట గ్రామస్తులకు నరకం చూపిస్తున్నారని, గ్రామస్తులు వైఎస్సార్సీపీలో చేరవద్దంటూ కిశోర్‌కుమార్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ సభలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఇక్బాల్ అహమ్మద్, కారపకుల భాస్కర్ నాయుడు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
అధికారంలోకి రాగానే గాలేరు–నగరి పూర్తి
నగరి: తాము అధికారంలోకి రాగానే గాలేరు–నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని, నగరి అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండా వేధిస్తోందని అన్నారు. శనివారం నగరిలో జరిగిన రోజా పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళా సమస్యలపై ఎమ్మెల్యే రోజా చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. సర్కారు నిధుల కోసం వేచి చూడకుండా రోజా సొంత నిధులతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తోందన్నారు. పథకాల కోసం ఖర్చు ఎక్కువవుతున్నా వెనకడుగు వేయలేదని చెప్పారు. వచ్చే పుట్టిన రోజుకు ఎమ్మెల్యే కంటే పెద్ద పోస్టులో ఆమెను చూడాలని ఉందని ఆకాంక్షించారు. నగరి నియోజకవర్గం తల్లిలాంటిది: రోజా తన చిరకాల వాంఛను నెరవేర్చిన నగరి నియోజకవర్గం కన్నతల్లిలాంటిదని ఎమ్మెల్యే రోజా అన్నారు. నగరి ప్రజలు ఏ సమయంలో అయినా తనను కలిసి కష్టాలు చెప్పుకోవచ్చని తెలిపారు. సర్కారు నిధులు ఇవ్వకపోయినా సొంత డబ్బుతో అయినా మేలు చేసేం దుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాలల్లో మంచినీళ్ల ప్లాంట్లు, ఫ్యాన్లు, పండ్లు అమ్ముకునే వారికి తోపుడు బండ్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం మాత్రం పేదలకు సంక్షేమ ఫలాలు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రజలు సంక్షేమ ఫలాలు పొందాలంటే జన్మభూమి కమిటీల వద్ద చేతులు కట్టుకొని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారని వాపోయారు. జన్మభూమి కమిటీల్లో రౌడీలు, గూండాలు ఉన్నారని ధ్వజమెత్తారు. పేదల సంక్షేమాన్ని చంద్రబాబు రౌడీల చేతిలో పెట్టారని దుయ్యబట్టారు. నగరిలో ఎమ్మెల్సీ ఉన్నా గాలేరు–నగరి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులపై ప్రేమలేదు కాబట్టే ప్రాజెక్టు పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబునాయుడు రాహుల్‌గాంధీ కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఒంటరిగా పోటీ చేసిన పాపానపోలేదన్నారు. జగన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రోజా పుట్టిన రోజు వేడుకల్లో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుత్తూరు నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కువైట్‌లోనూ జన్మదిన వేడుకలు జరిగాయి. యాప్‌తో ప్రజలకు మరింత చేరువ.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎమ్మెల్యే ఆర్కే.రోజా వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు విన్నవించేందుకు ‘మై ఎమ్మెల్యే’ యాప్‌ను శనివారం అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కస్తానని ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు. ఈ యాప్‌ను మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రారంభించారు. -
చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి షాక్
-
చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి షాక్
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా తాంబల్లపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం ఎంపీపీగా ఉన్న కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ్ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ద్వారాకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వారు కలిశారు. టీడీపీలో 40 ఏళ్ల పాటు కొనసాగిన కొండా సిద్ధార్థ్ కుటుంబాన్ని జననేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై టీడీపీ నేతలకే నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఎంతోకాలం టీడీపీలో కొనసాగిన కొండా సిద్ధార్థ్ కుటుంబం ఆ పార్టీని వీడిందంటే చంద్రబాబు ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందన్నారు. తనపై హత్యాయత్నం జరిగినా వైఎస్ జగన్ చాలా హుందాగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోసం పాకులాడకుండా.. ప్రజలు సంయమనం పాటించేలా వైఎస్ జగన్ చేశారని తెలిపారు. టీడీపీ చేస్తున్న మోసాలు వెలుగులోకి రావడంతో ఆ పార్టీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. కొండా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్ పాటించిన విలువలు ప్రస్తుతం టీడీపీలో లేవని అన్నారు. అందుకే 40 ఏళ్లు టీడీపీలో ఉన్నప్పటికీ.. విలువల కోసమే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. టీడీపీ నిజమైన నేతలకు, కార్యకర్తలకు ప్రస్తుతం విలువ లేదని తెలిపారు. -
‘అప్పుడేలా పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చారు?’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై దాడి ప్రచారం కోసం జరిగిందని డీజీపీ చెప్పడం దారుణమని మండిపడ్డారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగింది వాస్తవమా, కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఎక్కడైన అభిమాని ఇష్టమైన నాయకునిపై దాడి చేస్తాడా అని నిలదీశారు. డీజీపీ వ్యాఖ్యలు బాధ కలిగించాయని పేర్కొన్నారు. విచారణ చేయకుండానే డీజీపీ అలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఎవరి ఒత్తిడితో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. తొలుత డీజీపీ, ఆ తర్వాత మంత్రి నక్కా ఆనంద్‌బాబు, విశాఖ ఏసీపీలు విచారణ జరపకుండానే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ప్రచారం కోసం జరిగిదంటూ మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. పలువురు ఏపీ మంత్రులు మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వారు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎయిర్పోర్ట్ కేంద్రం ఆధీనంలో ఉందని మాట్లాడుతున్నవారికి.. గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖకు చేరుకున్న వైఎస్ జగన్‌ను పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్న సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. డీజీపీ స్థాయి వ్యక్తే ఈ విధంగా మాట్లాడితే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు శివాజీ చెప్పినట్టుగా జరిగితే ముందు అతన్ని అరెస్ట్ చేసి విచారించాలని అన్నారు. కోడి పందాలలో వినియోగించే కత్తి చాలా పదునైనదని.. అది కొద్దిగా అటు ఇటు అయితే ప్రాణలే పోతాయని తెలిపారు. ప్రస్తుతం వైఎస్ జగన్ క్షేమంగా ఉన్నారని.. అభిమానులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. వైఎస్ జగన్ బలమైన, ధైర్యం ఉన్న నాయకుడు వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడు సెల్ఫీ పేరుతో వైఎస్ జగన్‌పై దాడికి ప్రయత్నించిన సమయంలో కత్తి మెడకు తగిలితే ఏమై ఉండేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ అడిగితే లేదని చెబుతున్నారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో భద్రత ఉన్నా అలాంటి కత్తులు ఎలా తీసుకువచ్చారో అర్ధం కావడం లేదని అన్నారు. ఎయిర్పోర్ట్ లోపల జరిగిన ఘటనతో తమకు సంబంధం లేదని మంత్రులు చెప్పడాన్ని నీచమైన చర్యగా అభివర్ణించారు. ఈ సంఘటనను వైఎస్సార్ సీపీ ఎక్కడ రాజకీయాలకు వాడాలనుకోలేదని స్పష్టం చేశారు. రాజకీయాలు పక్కనపెట్టి మనం మనుషులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి నీచమైన రాజకీయాలు చోటుచేసుకోవడంపై మండిపడ్డారు. వైఎస్ జగన్ బలమైన, ధైర్యం ఉన్న నాయకుడు అందుకే ఇలాంటి వాటిని పట్టించుకోకుండా హైదరాబాద్ బయలుదేరి వచ్చారని తెలిపారు. క్యాంటీన్లో పనిచేసే వ్యక్తి ఇలా చేస్తే రేపు పాదయాత్రలో ఏం జరుగుతుందనే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్ జగన్‌కు భద్రత పెంచాలని కోరారు. చంద్రబాబుపై దాడి జరిగితే వైఎస్సార్ నిరసన తెలిపారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని తప్పుదారి పట్టించేలా ప్రభుత్వం వ్యవహారించడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబుపై ఇలాంటి దాడి జరిగితే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెంటనే వెళ్లి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఓ సినీ నటుడు చెప్పినట్టు అంతా జరిగితే.. అతన్ని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మంత్రులు, టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ కోణంలో మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. చదవండి: వైఎస్ జగన్‌పై హత్యాయత్నం: లైవ్ అప్డేట్స్ వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల వైఎస్ జగన్‌పై హత్యాయత్నం; మోహన్‌బాబు స్పందన -
వైఎస్ జగన్ బలమైన, ధైర్యం ఉన్న నాయకుడు
-
రైల్వే కోడూరులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
తిరుపతిలో సాక్షి మెగా ఆటోషో ప్రారంభించిన మిధున్ రెడ్డి
-
అలా చేస్తే దేశవ్యాప్తంగా ప్రకంపనలు..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాజకీయాలను పక్కనపెట్టి పోరాటం చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. హోదా పోరాటం కీలక దశలో ఉందని, హోదా కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని, ఇది శుభపరిణామం అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని, చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కూడా తమతో కలిసి రావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో కూర్చుని అఖిలపక్షం పెడితే లాభం లేదని, అందరం కలిసి రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మిథున్ రెడ్డి సూచించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా ప్రకంపనలు వస్తాయన్నారు. ఏమైనా రాజకీయాలు ఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసుకుందామని, ఇప్పుడు హోదా కోసం కలిసికట్టుగా రాజీనామాలు చేద్దామని మిథున్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు వస్తే కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుందన్నారు. రాజస్థాన్, కర్ణాటకలోనూ అలాగే జరిగిందని, రాష్ట్ర ప్రజయోజనాల కోసం పదవులు వదులుకోవడానికి తాము సిద్ధమని స్ఫష్టం చేశారు. అవిశ్వాసం ప్రకటించిందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, అదే ఇప్పుడు ఒక కుదుపు కుదిపిందన్నారు. వైఎస్ జగన్ ముందడుగు వెయ్యడం వల్లే ... అన్ని పార్టీలు కదిలాయన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే లాలూచీ పడినట్లేనని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ సీపీ వెనక్కి తగ్గేది లేదని సోమవారం అయినా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరుగుతుందనే నమ్మకం ఉందని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముందుగా ప్రకటించినట్లే తాము ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ టీడీపీ ఎంపీలు అంతకంటే ముందే రాజీనామాలు చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వారి రాజీనామాలు చేశాక తాము చేస్తామని తెలిపారు. -
ఐఎన్ఎస్ అరిహంత్ మూలన పడిందా?
సాక్షి, న్యూఢిల్లీ : స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారతదేశ తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్కు హాని జరిగిందా?. గతేడాది జరిగిన ఓ ప్రమాదంలో అరిహంత్ తీవ్రంగా నష్టపోయిందా?. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ ప్రశ్నలను బుధవారం లోక్‌సభలో అడిగారు. ప్రశ్నలపై స్పందించిన రక్షణ శాఖ జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ సమాచారాన్ని ఇవ్వలేమని పేర్కొంది. ఐఎన్ఎస్ అరిహంత్కు 2017లో హాని జరిగినట్లు మీడియా రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి రక్షణశాఖను ఈ మేరకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి అరిహంత్ సముద్రయానం చేయడం లేదా? అని కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మానవ తప్పిదం వల్లే అరిహంత్‌లోని ప్రొపల్షన్ కంపార్ట్మెంట్లో ప్రమాదం జరిగిందని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. 2016లో అరిహంత్ భారతీయ నేవీలో చేరింది. -
వైఎస్ జగన్‌కు ప్రజా సమస్యలే జగన్‌కు ముఖ్యం
-
కేంద్రమంత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి విజ్ఞప్తి
-
దమ్ముంటే నిజాలు చెప్పండి
సీఎం చంద్రబాబుకు విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సవాల్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘చంద్రబాబును అడుగుతున్నా.. దమ్ము ధైర్యం ఉంటే ఎంపీ మిథున్‌రెడ్డిపై పెట్టిన కేసులో నిజాలు బైటపెట్టు. ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ఆయన తప్పు చేసినట్లు రుజువుచేయగలరా? రాష్ట్రంలో దారుణమైన పాలన సాగిస్తున్నారు. ఎమర్జెన్సీని తలపిస్తోంది. బ్రిటీష్ పాలనకంటే దారుణంగా ఉంది. మా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఖచ్చితంగా చెబుతున్నా.. ఇవే పరిస్థితులు మీకూ వస్తాయి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నాలుగురోజులుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డిని గురువారం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... దమ్ముంటే వాస్తవాలు బైటపెట్టండి.. ‘‘ఆ రోజు ఏం జరిగిందంటే.. నన్ను సాగనంపటానికి మిథున్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో 19మంది ప్రయాణీకులు ఎయిర్‌పోర్టు మేనేజర్ తమకు బోర్డింగ్ పాసులు ఇవ్వలేదని కంప్లైంట్ చేశారు. వారికి బోర్డింగ్‌పాస్ ఎందుకు ఇవ్వలేదని మేనేజర్‌ను అందరి ముందే మిథున్ అడిగారు. అలా మిథున్ అడగడం తప్పా? ఆ ప్రయాణీకులు మేనేజర్ దురుసుగా ప్రవర్తించినట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ లెటర్ ఎందుకు బయటపెట్టడం లేదు? ఆరోజు ఎయిర్‌పోర్టు మేనేజర్ 2 గంటల నుంచి 8 గంటల వరకు ఎయిర్‌పోర్టులోనే పనిచేశాడు. మిథున్ చేయిచేసుకుని ఉంటే ఆరుగంటలపాటు మేనేజర్ ఎలా పనిచేస్తాడు? ఎయిర్‌పోర్టులో మిథున్ చేయిచేసుకుంటే సీఐఎస్ఎఫ్ బలగాలకు తెలియకుండా పోతుందా? నిజంగా కొట్టి ఉంటే వారు మిథున్‌ను అరెస్టు చేసి ఉండేవారు కదా? కేసులు పెట్టేవారు కదా? తిరుపతి ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఎక్కువగా ఉన్నాయి. అందరిముందు మిథున్ కొట్టి ఉంటే సీసీ కెమెరాల్లో ఉండాలి. అలా ఎక్కడైనా ఉందా? ఉంటే ఆ సీసీ ఫుటేజ్‌లను ఎందుకు బయటపెట్టడంలేదు? అయ్యా చంద్రబాబూ.. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాలు బైటపెట్టండి. ఇదంతా బాబు గీసిన స్కెచ్ అదేరోజు సాయంత్రం తిరుపతికి వచ్చిన చంద్రబాబు వెంటనే స్కెచ్ గీశారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పైనా ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేసు పెట్టిన తర్వాత సాధారణంగా ఆసుపత్రిలో మెడికో లీగల్ సర్టిఫికేషన్ జరుగుతుంది కాబట్టి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీమాంధ్రలో ఇవాళ రుయా నెంబర్-1 ఆసుపత్రి. మేనేజర్ బాగానే ఉన్నాడని, ఎలాంటి దెబ్బలూ తగలలేదని రుయాలో సర్టిఫై చేశారు. మరుసటి రోజు మేనేజర్ డ్యూటీకి వెళ్లారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు, ఆయన దూతలు అయ్యయ్యో మీరు డ్యూటీకి వెళితే కేసు నిలబడదంటూ మేనేజర్‌ను యశోద ఆసుపత్రిలో చేరమన్నారు. సంఘటన జరిగిన నాలుగురోజుల తర్వాత మేనేజర్ ప్రైవేట్ ఆసుపత్రి యశోదలో చేరారు. మేనేజర్ సోదరుడు ఆ యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఒక ఎంపీ మీద దొంగ కేసు పెట్టి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. కమీషన్లకు అడ్డుపడుతున్నాడనే మిథున్‌పై దొంగకేసులు చిత్తూరు జిల్లాలో ఇరిగేషన్ సహా అన్ని ప్రాజెక్టుల్లో చంద్రబాబు, ఆయన కొడుకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్లు దోచుకుంటున్నారు. అయితే టెండర్లలో మిథున్ పోటీకి వెళ్లి ఎల్1 వచ్చేవిధంగా తక్కువకు కోట్ చేస్తున్నాడు. మిథున్ ఉంటే తక్కువకు టెండర్లు వేసి తమకు కమీషన్లు రాకుండా అడ్డుపడుతున్నాడనే చంద్రబాబు, ఆయన కొడుకు కక్షకట్టారు. అందుకే ఒక ఎంపీపై దొంగ కేసులు బనాయించే స్థాయికి దిగజారిపోయారు. చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా. ఇన్ని ప్రశ్నలు వేశా. దమ్ము ధైర్యం ఉంటే వాటికి జవాబు చెప్పాలి. దొంగకేసులు బనాయిస్తూ మీరు సాగిస్తున్న పాలనను ప్రజలు చూస్తున్నారు. పైనుంచి దేవుడు చూస్తున్నాడు. కచ్చితంగా వీళ్లందరి ఉసురు మీకు తగులుతుంది. మీరు బంగాళాఖాతంలో కలిసే రోజు త్వరలోనే వస్తుంది. సన్మానించాల్సిన వారిని జైల్లో పెడతారా? రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంతోమంది పోరాడారు. అందులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసినందుకు సన్మానించాల్సింది పోయి ఆ కేసును ఉపయోగించుకుని భాస్కర్ని అరెస్టు చేస్తారా? మరింత దుర్మార్గం ఏమిటంటే 2009లో గోడలపై రాతలు రాశారన్న కేసును తిరగదోడి భాస్కర్ని పీలేరుకు తీసుకెళ్తున్నారట. ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉంటుందా? అన్నా.. భాస్కర్ని నాకన్నా ఎక్కువగా వేధిస్తున్నారని లోపల కలసినపుడు మిథున్ చెబుతున్నాడు. అరెస్టు చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఈ పరిపాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. ఇలాంటి పాలన సాగిస్తున్నందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. ఎల్లకాలం ఇలాగే ఉండదు. మనం ఏం నాటితే అదే పండు వస్తుంది. మీక్కూడా ఇదే పరిస్థితి వచ్చే రోజులు త్వరలోనే వస్తాయని చెబుతున్నా. రోజమ్మ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిథున్, చెవిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఇలా... వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపైన తప్పు డు కేసులు పెట్టారు.భయభ్రాంతులకు గురిచేసి వారి స్థయిర్యాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు, ఆ దేవు డు చూస్తున్నారు. ’’ అని జగన్ పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాంలు ఉన్నారు. ఆరోగ్యమిత్రల తొలగింపు దారుణం మద్దతుగా పోరాడతాం: జగన్ ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలను తొలగించటం అన్యాయమని, వారికి మద్దతుగా పోరాడతామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. ‘బాబొస్తే జాబు వస్తుందన్నారు. బాబొచ్చారు.. ఉన్న జాబులు పోతున్నాయి’ అని ఆయన విమర్శించారు. రాష్ర్టంలో 6వేల మంది ఆరోగ్యమిత్రలను తొలగిస్తూ ఈనెల 20న రాష్ర్టప్రభుత్వం జీవో 28 జారీ చేసిన సంగతి తెల్సిందే. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్‌ను జిల్లాకు చెందిన ఆరోగ్యమిత్రలు కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రతిపక్ష నేతకు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. ఉద్యోగంపైనే ఆధారపడి బతుకుతున్న తాము ఇక ఎలా బతికేది? అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి అందరినీ తొలగిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. -
'చంద్రబాబు డైరెక్షన్లోనే కుట్రలు'
-
'చంద్రబాబు డైరెక్షన్లోనే కుట్రలు'
నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం నెల్లూరు నగరంలోని జైలులో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీకాళహస్తి ఇంచార్జ్ బి.మధుసూధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట వైఎస్ జగన్మోహన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ అవినీతిని అడ్డుకున్నందుకే మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. కేసుల పేరుతో తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల్లో రోజుకొకరిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... త్వరలోనే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని చెప్పారు. రేణుగుంట ఎయిర్‌పోర్టులో ఓ వేళ మిథున్‌రెడ్డి దాడి చేసి అక్కడే ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) కేసు పెట్టి ఉండేది కాదా అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి వచ్చాకే మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. -
చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిగా ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పథకం అమలు చేశారా అని ప్రశ్నించారు. రైతు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ విషయంలో మోసం చేసింది చాల క విజయవాడలో నవ నిర్మాణ దీక్ష చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. అది నయవంచన దీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. సొంత మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి గద్దె దించి రాజకీయ కుట్రకు పాల్పడిన చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో రేవంత్‌రెడ్డి పాల్పడిన ఓటుకు నోటు కుట్ర గురించి ఒక్క మాటైనా చెప్పకుండా ఎంత సేపూ జగన్‌పై నిందారోపణలు చేశారని, ఇది చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. -
'ఏపీ ఇబ్బందుల్లో ఉంది.. ఆదుకోవాలి'
-
ఏపీ ఇబ్బందుల్లో ఉంది.. ఆదుకోవాలి: మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మంగళవారం లోక్ సభలో ఏపీకి ఎమ్మెల్సీ స్ధానాలు పెంచే విషయంలో తెచ్చిన ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ కు కచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని కోరారు. హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. పోలవరానికి కేవలం వందకోట్లు మాత్రమే కేటాయించారని మిథున్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సీబీఐ కీలుబొమ్మగా మారుతోంది: మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ నియామకంలో సవరణ బిల్లుకు వైఎస్ఆర్ సీపీ మద్దతు ఇస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో స్పష్టం చేశారు. సీబీఐ డైరెక్టర్ నియాయకంలో సవరణలపై చర్చ సందర్బంగా ఆయన బుధవారం లోక్‌సభలో మాట్లాడుతూ అధికార పార్టీ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారుతోందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికే సీబీఐని వాడుకుంటున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి విషయంలో కూడా సీబీఐని ఇలాగే ఉపయోగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అధికారిక హోదాలో లేకపోయినా వైఎస్ జగన్‌పై కేసులు మోపారని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఓవైపు సిబ్బంది లేరంటూనే...మరోవైపు వైఎస్ జగన్ విషయంలో 22 సీబీఐ బృందాలులు పని చేశాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే మరో కేసులో విచారణ చేపట్టేందుకు తమకు తగినంతగా సిబ్బంది లేరని సీబీఐ...న్యాయస్థానానికి చెప్పిందన్నారు. ఎలాంటి వివక్షకు తావివ్వకుండా సీబీఐ పనిచేయాలని... అందుకనే సీబీఐకి స్వతంత్రత ఉండాలని మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. -
సీబీఐ.. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ కావొద్దు!
-
మిథున్ అఖండ విజయం
పుంగనూరు, న్యూస్‌లైన్ : ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను ఢీకొని రాజంపేట లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి, ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీలో దిగారు. ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి, సాయిప్రతాప్ త మ శక్తియుక్తులు దారపోసి మిథున్‌రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నాలు చేశారు. మిథున్‌రెడ్డి, ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చతురత ముందు ప్రత్యర్థుల ఆటలు సాగలేదు. యువనేత మిథున్‌రెడ్డి సుమారు 1,74,762 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించారు. పుంగనూరు నియోజకవర్గంలో మిథున్‌రెడ్డికి 1,05,772 ఓట్లు లభించాయి. పురందేశ్వరికి 60,674 ఓట్లు వచ్చాయి. మరో మాజీ మంత్రి సాయిప్రతాప్‌కు 4,927 ఓట్లు మాత్రమే పోలయ్యూరుు. పుంగనూరులో మిథున్‌రెడ్డికి 46,009 ఓట్ల మెజారిటీ లభించింది. నిత్యం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు సొంత నిధులు ఖర్చుచేస్తున్న తండ్రీతనయులను ప్రజలు ఆదరించారు. విశేష అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతటి ఘన విజయం అందించిన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.