ఐఎన్‌ఎస్ అరిహంత్ (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారతదేశ తొలి అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్‌కు హాని జరిగిందా?. గతేడాది జరిగిన ఓ ప్రమాదంలో అరిహంత్ తీవ్రంగా నష్టపోయిందా?. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ ప్రశ్నలను బుధవారం లోక్‌సభలో అడిగారు.
ప్రశ్నలపై స్పందించిన రక్షణ శాఖ జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ సమాచారాన్ని ఇవ్వలేమని పేర్కొంది. ఐఎన్‌ఎస్ అరిహంత్‌కు 2017లో హాని జరిగినట్లు మీడియా రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి రక్షణశాఖను ఈ మేరకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రమాదం జరిగిన నాటి నుంచి అరిహంత్ సముద్రయానం చేయడం లేదా? అని కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మానవ తప్పిదం వల్లే అరిహంత్‌లోని ప్రొపల్షన్ కంపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగిందని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. 2016లో అరిహంత్ భారతీయ నేవీలో చేరింది.
Comments
Please login to add a commentAdd a comment