రాక్షస పాలన అంతమెందించే రోజులు దగ్గర్లోనే.. | YSRCP Leaders Criticize CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం’

Published Thu, Feb 7 2019 4:52 PM | Last Updated on Thu, Feb 7 2019 5:06 PM

YSRCP Leaders Criticize CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిందేమి లేదని, అవినీతే తప్ప అభివృద్ది చేయలేదని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. స్వార్థం కోసం అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. గురువారం కడపలో జరిగిన వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం సభలో పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ.. ఐదేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన జరుతుందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ది చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు ధనబలంలో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని.. అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బాబు ప్రలోభాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర‍‍్కొన్నారు. వైఎస్‌ జగన్‌ను మించిన పోరాట యోధుడు లేరని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ నేతలను గెలిపించేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు ఏం చెప్పిన నమ్మే స్థితి లేదు : సి. రామచంద్రయ్య
ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని వైఎస్సార్‌సీపీ నేత సి. రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు ఏం చెప్పిన నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఆస్తులను కొల్లగొట్టేందుకే అగ్రిగోల్డ్‌ సమస్యను పరిష్కరించడంలేదని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని రాక్షస పాలనను అంతమెందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

వైఎస్‌ జగన్‌ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యం : కోరుముట్ల

తన స్వార్థం కోసం నక్కజిత్తుల చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పాదయాత్ర ద్వారా ప్రజల బాధలు తెలుసుకున్న వైఎస్‌ జగన్‌ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

 ఎవరు భయపడోద్దు : మిథున్‌ రెడ్డి

వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపైన టీడీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని, ఎవరూ భయపడొద్దని అందరి బాగోగులు వైఎస్‌ జగన్‌ చూసుకుంటారని వైఎస్సార్‌సీపీ నేత మిథున్‌రెడ్డి హామీ ఇచ్చారు. అక్రమ కేసులు పెడుతున్నారని ఎవరూ అధైర్యపడొదన్నారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులన్ని ఎత్తేస్తామని చెప్పారు. ఐదేళ్లుగా చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. ఏ ఒక్క వర్గాన్ని అభివృద్ధి చేయని టీడీపీ నేతలు.. అన్నీ చేశామంటూ విధుల్లో తిరగడం సిగ్గుచేటన్నారు. 

బాబు ప్రలోభాలకు గుణపాఠం చెప్పాలి : రాచమల్లు

చంద్రబాబు నాయుడు ధనబలంతో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ప్రజలను కోరారు. ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు.. అవినీతి సొమ్ముతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement