shankharavam
-
మోదీ శంఖారావం
న్యూఢిల్లీ: ఏడాదిన్నర ముందే ప్రధాని మోదీ ఎన్నికల శంఖం పూరించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు కేవలం 400 రోజుల దూరంలోనే ఉన్నాయి. ఇక టాప్ గేర్‌లో దూసుకెళ్లాల్సిన సమయం వచ్చేసింది. చరిత్ర సృష్టిద్దాం పదండి’’ అంటూ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చివరి రోజైన మంగళవారం కీలకాంశాలపై లోతైన చర్చ జరిగింది. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన 350 మంది బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు, సీఎంలు కూలంకషంగా చర్చించారు. చివరగా మోదీ కీలకోపన్యాసం చేశారు. భావి కార్యాచరణపై నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అతి విశ్వాసానికి ఎక్కడా చోటివ్వొద్దని హెచ్చరించారు. ‘‘బోహ్రాలు, పాస్మాండాలు, సిక్కులు... ఇలా సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ కండి. ఎన్నికల లబ్ధి గురించి ఆలోచించకుండా వారి సంక్షేమం కోసం పాటుపడండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల వద్దకు తీసుకెళ్లండి. అన్నిచోట్లా, ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా ప్రత్యేక కార్యక్రమాలు, మోర్చాలు నిర్వహించండి. అక్కడి ప్రజలకు మరింత చేరువ కండి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా అక్కడికీ చేరవేయండి. సరిహద్దు గ్రామాల యువతను బీజేపీ కార్యకర్తలుగా తీర్చిదిద్దండి. తద్వారా అక్కడా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయండి. 18–25 ఏళ్ల యువతకు దేశ రాజకీయ చరిత్ర తెలియదు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన విచ్చలవిడి అవినీతి, తప్పిదాలు తెలియవు. వీటన్నింటిపైనా వారికి అవగాహన కల్పించండి. అంతటి దుష్పరిపాలనను బీజేపీ ఎలా సుపరిపాలనగా మార్చి చూపించిందో యువతలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అని సూచించారు. ‘‘రానున్నది మన దేశానికి అత్యుత్తమ సమయం. వచ్చే పాతికేళ్ల అమృత కాలాన్ని కర్తవ్య కాలంగా మార్చుకుని కష్టపడితేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. ప్రజలకు సేవ చేసేందుకు అన్ని విధాలుగా కష్టపడదాం’’ అన్నారు. ‘‘అతి విశ్వాసానికి పోతే ప్రతికూల ఫలితాలు తప్పవు. 1998లో మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా బీజేపీ కేవలం అతి విశ్వాసం వల్లే ఓడింది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం’’ అంటూ నేతలను హెచ్చరించారు. మోదీ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా మాత్రమే గాక సరికొత్త దిశానిర్దేశం చేసేదిగా సాగిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ప్రసంగ విశేషాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ సాకారానికి కృషి చేయాల్సిందిగా బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. పార్టీ కంటే దేశానికి ప్రాధాన్యమిస్తూ రాజకీయ నాయకునిగా గాక రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రసంగం సాగింది’’ అని ఫడ్నవీస్ చెప్పారు. ధర్తీ బచావో... పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దామని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చారు. ‘‘బేటీ పఢావో మాదిరిగా ధర్తీ బచావో (భూమిని కాపాడండి) ఉద్యమానికి శ్రీకారం చుడదాం. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకుందాం. కాశీ–తమిళ సంగమం తరహాలో భిన్న సంస్కృతులను, ప్రాంతాలను కలిపే వారధిగా పార్టీని తీర్చిదిద్దుకుందాం’’ అని సూచించారు. సినిమాలపై అనవసర వ్యాఖ్యలొద్దు: మోదీ సినిమాలు తదితర అంశాలపై అనవసర ప్రకటనలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నేతలను, శ్రేణులను మోదీ ఆదేశించారు. ‘‘ఏదో సినిమా గురించి మనవాళ్లలో ఎవరో ఏదో అంటారు. టీవీల్లో, మీడియాలో రోజంతా అదే వస్తుంది. అభివృద్ధి అజెండా తదితర అసలు విషయాలన్నీ పక్కకు పోతాయి. అందుకే అనవసర వ్యాఖ్యలేవీ చేయకండి’’ అని కరాఖండిగా చెప్పినట్టు సమాచారం. షారుఖ్‌ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో కాషాయాన్ని కించపరిచారంటూ దాని బహిష్కరణకు నరోత్తం మిశ్రా, రామ్ కదమ్ తదితర బీజేపీ నేతలు, మంత్రులు బహిరంగంగా పిలుపునివ్వడం, దానిపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. -
రాక్షస పాలన అంతమెందించే రోజులు దగ్గర్లోనే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిందేమి లేదని, అవినీతే తప్ప అభివృద్ది చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. స్వార్థం కోసం అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. గురువారం కడపలో జరిగిన వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభలో పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ.. ఐదేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన జరుతుందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ది చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు ధనబలంలో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని.. అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బాబు ప్రలోభాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను మించిన పోరాట యోధుడు లేరని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ నేతలను గెలిపించేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏం చెప్పిన నమ్మే స్థితి లేదు : సి. రామచంద్రయ్య ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు ఏం చెప్పిన నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఆస్తులను కొల్లగొట్టేందుకే అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలేదని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని రాక్షస పాలనను అంతమెందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యం : కోరుముట్ల తన స్వార్థం కోసం నక్కజిత్తుల చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పాదయాత్ర ద్వారా ప్రజల బాధలు తెలుసుకున్న వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎవరు భయపడోద్దు : మిథున్ రెడ్డి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైన టీడీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని, ఎవరూ భయపడొద్దని అందరి బాగోగులు వైఎస్ జగన్ చూసుకుంటారని వైఎస్సార్సీపీ నేత మిథున్‌రెడ్డి హామీ ఇచ్చారు. అక్రమ కేసులు పెడుతున్నారని ఎవరూ అధైర్యపడొదన్నారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులన్ని ఎత్తేస్తామని చెప్పారు. ఐదేళ్లుగా చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. ఏ ఒక్క వర్గాన్ని అభివృద్ధి చేయని టీడీపీ నేతలు.. అన్నీ చేశామంటూ విధుల్లో తిరగడం సిగ్గుచేటన్నారు. బాబు ప్రలోభాలకు గుణపాఠం చెప్పాలి : రాచమల్లు చంద్రబాబు నాయుడు ధనబలంతో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రజలను కోరారు. ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు.. అవినీతి సొమ్ముతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. -
2న హైదరాబాద్‌లోఅర్చక శంఖారావం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల రెండోతేదీన హైదరాబాద్‌లో ‘అర్చక శంఖారావం’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్, ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు. వారు ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అర్చక సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నామని, హైదరాబాద్‌లోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఈ సభ జరుగుతుందని చెప్పారు. రెండోతేదీన ఉదయం 9 గంటలకు సామూహిక బ్రహ్మయజ్ఞం, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాశాంతియాగం పూర్ణాహుతి, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5 గంటల వరకు సభాకార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సభలో పలు రాజకీయపార్టీల నేతలు, పత్రికా సంపాదకులు, ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, అర్చకసంఘ ప్రతినిధులు ప్రసంగిస్తారని తెలిపారు. అన్ని జిల్లాల అర్చక సమాఖ్య నాయకులు, అర్చకులు పెద్దసంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని వారు కోరారు. సమావేశంలో పాల్గొనే అర్చకులు విధిగా ఆగమ సాంప్రదాయ పద్ధతిలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
శంఖారావం యాత్ర విజయవంతం కావాలని పూజలు
-
షర్మిళ కోసం వేచి చూస్తున్న కదిరి ప్రజలు
-
కాసేపట్లో మదనపల్లీ చేరుకోనున్న సమైక్య శంఖారావం