rachamallu Shiva Prasad Reddy
-
బాబూ.. ఇదే మందు నాడు విషమైతే నేడు అమృతమా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారని ఆరోపించారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, ఏపీలో గతంలో ఉన్న బ్రాండ్సే ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి.వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో మందుబాబులను రెచ్చగొట్టి చంద్రబాబు లబ్ధి పొందారు. ఎన్నికలు అయ్యాక మద్యం ధరలు తగ్గిస్తామని మోసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు. గతంలో ఉన్న బ్రాండ్స్ ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలే ఇప్పుడూ ఉన్నాయి. మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో అధిక ధరలన్నాడు.. నాణ్యత లేదన్నాడు. ఆడ పిల్లల మంగళ సూత్రాలు తెంపుతాడు.. మీ ఆరోగ్యం గోవింద అన్నాడు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయాడు. 99 రూపాయలకే మద్యం అన్నాడు.. కానీ ఆ చీఫ్ లిక్కర్ మాత్రం దొరకడం లేదు. మీరిచ్చిన మాట ప్రకారం ధరలు ఎక్కడ తగ్గించారు?. జగన్ ప్రభుత్వంలో అది విషం.. ఇప్పుడు అదే మందు అమృతం అవుతుందా?. ఇప్పుడు ఆడ బిడ్డల మెడలో తాళిబొట్టు తెగవా?. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం మద్యం తాగే సోదరులే. వారితో ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని కూడా బాబు మోసం చేశాడు.చంద్రబాబు ఇచ్చే చీఫ్ లిక్కర్ 99కి అమ్మితే.. అదే మందు కేరళలో 85కి ఇస్తున్నారు. దానికి తోడు ఈ చీఫ్ లిక్కర్ నాణ్యమైనది కాదనేది నా అభిప్రాయం. కొన్ని ఏళ్లు ఈ మద్యం తాగితే వారి ఆరోగ్యం తప్పకుండా చెడిపోతుంది. చివరికి మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారు. వారికి 20 శాతం మార్జిన్ అని చెప్పి ఇప్పుడు 9.5శాతం మార్జిన్ ఇస్తున్నాడు. విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలిశాయి.. అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. మా ప్రభుత్వంలో 47వేల బెల్టు షాపులు రద్దు చేస్తే మళ్ళీ వాటిని తెరిచి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మద్యం షాపులు సంఖ్య తగ్గించి పర్మిట్ రూమ్స్ లేకుండా చేశాం. కానీ, మళ్ళీ చంద్రబాబు పాత రోజులు తెచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు -
ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి అని అంటూ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.సోషల్ మీడియాలో టీడీపీ వారు పెట్టిన అసభ్యకర పోస్టులపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం, రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ.. నాపై గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము.కూటమి ప్రభుత్వం ఎంతమందిపై కేసులు పెడతారో పెట్టుకోండి. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తాము. మా పార్టీ ప్రతి కార్యకర్త, నాయకులకు మేము అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు. అలాగే, కూటమి నేతల అబద్ధాలను ఎండగడతాం. ప్రజలకు అన్ని నిజాలు తెలుస్తున్నాయి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అక్రమ బెల్ట్ షాపులు.. బాలకృష్ణ నియోజకవర్గంలో ఏరులై పారుతున్న లిక్కర్! -
ఆ గ్యారెంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కనీసం చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే వాటిని అదుపు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తండ్రిగా మాట్లాడుతున్నా.. రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడ పిల్లలైనా బయట అడుగుపెడితే భద్రతగా ఇంటికి వస్తారనే గ్యారెంటీ లేదు. ఆ గ్యారెంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా? అని ప్రశ్నించారు.నిందితులకు వెన్నులో వణుకు పుట్టాలిదాదాపు 100 మంది ఆడపిల్లల మానాలు, ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కూటమి నేతలకు మాత్రం దున్నపోతుపై వానపడ్డట్లుంది.. ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం అయితే ప్రభుత్వం ఎంత సీరియస్‌గా స్పందించాలి..? నిజంగా అంత సీరియస్‌గా ఈ ప్రభుత్వం స్పందించి ఉంటే వంద సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ప్రారంభంలోనే వెన్నులో వణుకు పుట్టించి ఉంటే ఇలా జరిగేది కాదు.కూటి ప్రభుత్వంది పేరు గొప్ప.. ఊరు దిబ్బఈ నేతలు కేవలం మాటలకు మాత్రమే పరిమితి.. చేతలు శూన్యం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. వాటిని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. నిత్యం వైఎస్ జగన్‌ను నిందించడం..టీడీపీ గొప్పలు చెప్పకోవడం తప్ప చేసిందేమీ లేదు. సెల్ ఫోన్ మేమే కనిపెట్టాం..హైదరాబాద్‌కు బీచ్ తెచ్చాం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వీరు చేసిందేమీ లేదు. కనీసం చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది.మా కులం, మా పార్టీ అని నేరానికి పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ఏమో కానీ దేవుడి వద్ద మాత్రం మీకు శిక్ష తప్పదు. మూడేళ్ల చిన్నారిపై దారుణం జరిగితే నిందితుల్ని బహిరంగంగా ఉరితీయాలి. కానీ ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదు. వాళ్లకు ఓటు వేసిన ప్రతి తల్లి, చెల్లి కూటమి నేతలను చూసి సిగ్గు పడుతున్నారు.ప్రభుత్వ అసమర్ధతను పవన్ అంగీకరించారుపవన్ కల్యాణ్ జరిగిన తప్పును, వారి అసమర్ధతను కనీసం ఒప్పుకున్నారు. మా హోం మంత్రి శాంతిభద్రతల విషయంలో విఫలమయ్యిందని అంగీకరించారు. పవన్..పరోక్షంగా సీఎం చంద్రబాబునే అన్నారు. నేరుగా చంద్రబాబును అనే ధైర్యం లేక హోం మంత్రిపై పెట్టి అన్నారు. శాంతిభద్రతలు దెబ్బతింటుంటే క్యాబినెట్‌కు బాద్యత లేదా..? ఈ ప్రభుత్వం బాధ్యత వహించదా?. మీకు మానం, మర్యాద ఉంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలి..అధికారంలో కొనసాగే అర్హతే మీకు లేదు. పైపెచ్చు పోలీసులపై నిందలు వేస్తున్నారు. పోలీసులకు మీరు స్వతంత్య్రం ఇచ్చారా..? ఈ ఎస్పీలు, ఇంటిలిజెన్స్ అధికారులు మొదటి నుంచీ ఉన్నారు..గతంలో ఇలా జరగలేదేం..?.ఇలా జరగడానికి కారణం నేరం చేసే వారి ఆలోచనలు పెచ్చురిల్లిపోతున్నాయి...చిన్నపిల్లల్ని సైతం వదలడం లేదు.ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు దానికి తోడు విచ్చలవిడిగా మద్యం, మత్తు పదార్ధాలు..నేరస్థుడికి ఇవి ఊతం ఇస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ మద్యం, గంజాయి దొరికితే నేరస్థులు రాక్షసులు కారా..? పోలీసుల విధి నిర్వహణకు మీరు మోకాలడ్డుతున్నారు కాబట్టే పరిస్థితి ఇలా ఉంది. మీరు పోలీసులకు స్వేచ్ఛనిస్తే ..వారు కఠినంగా వ్యవహరించే వారు. మీరు తప్పు చేసి పోలీసులపై నింద వేస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు మీ ఆత్మన్యూనత భావంతో పోలీసులను విమర్శిస్తున్నారు.డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీరేం చేశారు?దిశా చట్టాన్ని పదును పెట్టండి. పోలీసులకు స్వేచ్చనివ్వండి..నేరం జరుగుతుందా?. తాను తప్పించుకోగలను..అనే ధైర్యం నేరస్థుడిలో రాబట్టే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఓ బిడ్డ జరిగిన అన్యాయాన్ని చూసి ఆ తల్లిదండ్రుల గుండె ఎన్నిసార్లు పగిలిపోయి ఉంటుంది?. ఇలా ఎంత మంది తల్లిదండ్రుల ఉసురు పోసుకుంటారు..? వీటన్నిటినీ పక్కదోవ పట్టించేందుకు వైఎస్ జగన్‌పై డైవర్షన్ పాలిటిక్స్ రోజుకొకటి చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో ఏముంది..? ఏ అబివృద్ధి లేకపోయినా పర్వాలేదు..కనీసం మా ఆడబిడ్డలకు రక్షణనైనా కల్పించండి.తల్లీ.. అనిత..? పవన్ నిన్ను పొగడలేదుపవన్ కల్యాణ్ నిన్ను పొగిడాడా తల్లీ..అనిత..?హోం శాఖ నేను తీసుకుంటాను అంటుంటే అర్ధం మీరు పూర్తిగా విఫలం అయ్యారనే అర్థం. ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కానీ మీరే మిమ్మల్ని సమర్ధించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలను ముఖ్యమంత్రి కూడా బాద్యత వహించాలి. మా ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వానికి పాలించే అర్హతే లేదు. మా బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడమని కోరితే అది కూడా మీరు చేయలేకపోతున్నారు.పిల్లల మానాలు, ప్రాణాలు కాపాడలేని నువ్వు..2047కి ఏదో చేస్తానంటున్నావు. ఎప్పుడో ఏదో చేసేది కాదు..ముందు మా బిడ్డలకు రక్షణ కల్పించండి. ఇలాంటి సంఘటన జరిగితే ప్రొద్దుటూరులో పెద్ద స్థాయిలో దీక్షకు దిగుతా’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. -
ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ రాచమల్లు కామెంట్స్
-
విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: చంద్రబాబు ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. సోమవారం(అక్టోబర్ 28) ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికలకు ముందు ఐదు సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలు పెంచేది లేదని బాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారు. ఎన్నికల ముందు ఒక మాట,ఇప్పుడు ఇంకో మాట సరైన పద్ధతి కాదు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి..లేదంటే వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తుంది.విద్యుత్ చార్జీలు పెరిగితే ప్రజల జీవితాలు గాడాంధకారంలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రజలు 164 సీట్లు ఇచ్చి బాబుకు ఇస్తే, బాబు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపనున్నారు. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు పేరు చెప్పి,విద్యుత్ చార్జీల రూపంలో దండుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంచి చేనేత,అమ్మ ఒడి,ఇతర సంక్షేమాలు రద్దు చేసి బాబు పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భారమైనా సరే రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీలు పెంచకూడదు అని డిమాండ్ చేస్తున్నా. 2014 నుంచి 2019 వరకు బాబు పాలనలో దాదాపు 57 వేల కోట్లు విద్యుత్ కోసం అప్పు చేశారు. కోవిడ్ కాలంలో కూడా వైఎస్ జగన్ విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితి లేని ఈ సమయంలో బాబు ఎందుకు విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు?వైఎస్ జగన్ హయాంలో దళితులకు ఉచిత విద్యుత్ అందించి దాదాపు రూ. 650 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ చెల్లించారు. మద్యం బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పి మద్యం ఏరులై పారేలా చేస్తున్నారు. ఐదు సంవత్సరాలు ఇలాగే పాలన కొనసాగితే రాష్ట్ర ప్రజలు అప్పుల్లో కూరుకుపోతారు. ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు తగ్గించేలా పోరాడతాం. కరెంట్ ఆఫీసులను చుట్టుముడతాం,ఉద్యమం తీవ్రతరం చేస్తాం,దీక్షలకు పూనుకుంటాం’అని రాచమల్లు హెచ్చరించారు.ఇదీ చదవండి: చంద్రబాబు ఇది మీరిచ్చిన వాగ్దానామే: వైఎస్ జగన్ -
ఇచ్చిన హామీలు అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా పెన్షన్ తప్ప చెప్పిన పథకాలు ఒక్కటీ అమలు కావడం లేదని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. విజయవాడ వదరపాలు కావడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ధ్వజమెత్తారు. కొవ్వొత్తులకు రూ. 26 కోట్లు, పులిహోరకు రూ. 360 కోట్లు ఖర్చు అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.‘తెలంగాణాలో హైడ్రాలాగా, ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం బయటకు తెచ్చారు. ఎన్ని రోజులు వీటితో తప్పించుకు తిరుగుతారు? నాలుగు నెలల కాలంలోనే ఇంతగా ఒక ప్రభుత్వ గ్రాఫ్ పడిపోవడం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ఈ దేశ ప్రజలనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వారి భక్తులను నమ్మకాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. నాణ్యత లేదని నాలుగు నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపినామని ఈఓ స్పష్టంగా చెప్పినా సీఎం కల్తీ జరిగిందని ఎలా చెబుతారని సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించింది.లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చంద్రబాబు తన తప్పుడు ప్రచారంతో అబాసు పాలయ్యారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ తీరును నిలదీయడంతో శ్రీవారి భక్తులు లడ్డూ అపవిత్రత కాలేదని తేలిపోయింది. చంద్రబాబు తప్పుడు ప్రచారాలతో అపవిత్రుడు అయ్యాడు.. ఆయన జీవితం అంతా అపవిత్రమే. ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు అందే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్
-
కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్
-
టీడీపీకి ఎమ్మెల్యే రాచమల్లు ఓపెన్ ఛాలెంజ్..
-
ఏమయ్యా చంద్రబాబు..వాలంటీర్లు అంటే ఇంత భయమా..
-
6 జెండాలు, 3 పెళ్లాలు మార్చినోడు పవన్..జగన్ వెంట్రుక కూడా పీకలేరు
-
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: నందిగం సురేష్
సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే -
పెన్షన్ల పెంపుతో వృద్ధుల్లో చిరుమందహాసం కనపడుతోంది: రాచమల్లు
-
16 కోట్లతో ప్రొద్దుటూరు అభివృద్ధి పనులు
-
కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన పెద్ద కుమార్తె పల్లవికి ఆదర్శ వివాహం చేశారు. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కుమార్తె పల్లవి, కమ్మర లీలా గోపి పవన్‌కుమార్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు అయిప్పటికీ వారి పెళ్లికి ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పలేదు. ఆయనే స్వయంగా పల్లవి, పవన్‌కుమార్‌లను గురువారం స్థానిక బొల్లవరంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు. అనంతరం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో వారికి రిజిష్టర్ మ్యారేజీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీఏ చదివేటప్పుడు పవన్‌కుమార్‌ను ప్రేమించిందని తెలిపారు. తన కుమార్తె ఇష్ట్రపకారం మనస్ఫూ ర్తిగా ప్రేమ వివాహం చేశానని చెప్పారు. పవన్‌కుమార్ తండ్రి ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేస్తున్నారని, ఇష్టపడిన అబ్బాయితో కుమార్తె వివాహం చేశానన్న తృప్తి తనకు ఉందని వివరించారు. వాస్తవానికి ఈ వివాహాన్ని ఘనంగా చేయాలని భావించానని, అయితే తన కు మార్తె ఇందుకు అంగీకరించకపోవడంతో నిరాడంబరంగా జరిపించానని ఎమ్మెల్యే చెప్పారు. చదవండి: ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం -
వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి విచారణ: రాచమల్లు
-
నిరుపేద.. ఆపై పెద్ద బాధ.. నేనున్నానంటూ ఎమ్మెల్యే రాచమల్లు భరోసా
సాక్షి, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని మీనాపురం గ్రామానికి చెందిన బత్తల మల్లికార్జున, మునిలక్ష్మి దంపతులు నిరుపేదలు. మల్లికార్జున కూలీ పనికి వెళ్తుంటాడు. వారికి ముగ్గురు కుమార్తెలు. కీర్తన చివరి సంతానం. స్థానికంగా ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 10 ఏళ్ల కీర్తనకు పెద్ద కష్టం వచ్చింది. కొన్ని నెలల క్రితం ముఖంలో గడ్డలు ఏర్పడి వాపు వచ్చింది. తగ్గుతుందిలే అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆ వాపు కాస్త ముఖమంతా ఎక్కువగా వ్యాపించింది. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ వచ్చారు. చాలా ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఆదుకున్న ఎమ్మెల్యే ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాలిక తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం నెల్లూరులోని మెడికోవర్ ఆస్పత్రికి పంపించారు. అన్ని రకాల పరీక్షలు చేసి దవడ ఎముక లోపలి భాగంలో క్యాన్సర్ సోకినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆపరేషన్ చేయిస్తే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు రూ.10 లక్షలు మేర ఖర్చు అవుతుందని తెలపడంతో.. వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అంత డబ్బు భరాయించే స్థోమత తమకు లేదని రోదించసాగారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. రెండు రోజుల్లో ఆపరేషన్ చిన్నారి కీర్తన ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మీడియాకు వెల్లడించారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణానికి ప్రమాదమని వైద్యులు చెప్పారన్నారు. ముగ్గురు వైద్యులు కలిసి ఆపరేషన్ చేయనున్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం చేయాలని తాను కోరిన మేరకు వైద్యులు రూ.6 లక్షలకు అంగీకరించారన్నారు. కొంత డబ్బు కుటుంబ సభ్యులు పెట్టుకుంటామని చెప్పారని, మిగతా రూ.5 లక్షలు లేదా అంతకు ఎక్కువైనా తానే భరాయిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ నిమిత్తం బుధవారం కీర్తనను ఎమ్మెల్యే నెల్లూరుకు పంపించారు. అడ్మిట్ అయిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఆపరేషన్ చేస్తారన్నారు. పేదరికంలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రాచమల్లుకు కీర్తన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు) -
వైఎస్ కుటుంబానికి రక్తపు మరకలు అంటించే కుట్ర
ప్రొద్దుటూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ కుటుంబానికి రక్తపు మరకలు అంటించాలని మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఏబీఎన్, టీవీ5 చానళ్లు, ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్ కుటుంబంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేరం చేశాడనే రీతిలో ఏబీఎన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. అవినాష్‌ని నిందితుడిగా చూపించేందుకు నానా తంటాలు పడుతున్నారని అన్నారు. నాలుగు నెలల క్రితమే తాను ఈ విషయాన్ని చెప్పానని, అదే ప్రకారం అవినాష్‌రెడ్డిని కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎంపీ అవినాష్‌రెడ్డి అత్యంత సౌమ్యుడని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఈ హత్యతో సంబంధం ఉండదని విశ్వసించాను కాబట్టే తనతో పాటు జిల్లాలోని 8 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తామని ప్రకటించానన్నారు. ఎంపీపై నేరం రుజువైతే చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. తన తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వారినే క్షమించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై బురద చల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. తనపై కత్తితో దాడి చేసిన వ్యక్తిపై కూడా ప్రతీకారం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుకోలేదని, అలాంటి కుటుంబంలో పుట్టిన ఎంపీ అవినాష్‌రెడ్డికి హత్యా రాజకీయాలు అంటగట్టాలని చూడటం దుర్మార్గమని చెప్పారు. ప్రజాస్వామ్యం పట్ల అమితమైన గౌరవం ఉన్న వైఎస్ కుటుంబానికి ప్రజా సేవలో తరించాలనే తపన తప్ప మరొకటి లేదని తెలిపారు. -
రాచమల్లుపై ఎన్టీవీలో కక్షపూరిత కథనం
ప్రొద్దుటూరు : కరోనా కమ్ముకున్న వేళ నా కుటుంబంపై కనికరం లేని కథనాలేలని, మాతృమూర్తి సేవ కోసం వెళ్లిన తనపై విమర్శలు చేయడం దారుణమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం తన జన్మహక్కు అని, దాన్ని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఎన్టీవీలో వచ్చిన కథనాలకు దీటుగా ఎమ్మెల్యే సమాధానం చెప్పారు. తన మాతృమూర్తి రాచమల్లు మునిరత్నమ్మతోపాటు హైదరాబాదు కూకట్పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆదివారం ఫోన్లో మీడియాతో మాట్లాడారు. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగా దాన్ని అదుపులో ఉంచేందుకు చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ కరోనా ఆవహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మా నుంచి ఎవరికీ వ్యాధి సోకకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.ఎన్టీవీలో కక్షపూరిత, దురుద్దేశంతో కూడిన కథనం ప్రచారం చేశారని తెలిపారు. ‘ఒక్కసారిగా సైలంట్ అయిన అధికార పార్టీ ఎమ్మెల్యే’అని విషప్రచారం చేసిందన్నారు. ఈనెల 12న వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి హాజరు కాబోయే ముందు రోజే తాను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చిందన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యే హోదాలో కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. ఈనెల 14న మా తల్లి రాచమల్లు మునిరత్నమ్మకు పాజిటివ్ రావడంతో ఆమె చికిత్స కోసం హైదరాబాద్‌కు బయల్దేరాను.అంతకుముందే తాను మరో సారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నానన్నారు. ప్రొద్దుటూరు–హైదరాబాద్ మార్గమధ్యలో ఉండగా తనకు కరోనా పాజిటివ్ అని తెలిసిందన్నారు. తాను, తన తల్లి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరామన్నారు. ఎన్టీవీ తనపై కక్షకట్టి ఉద్దేశపూర్వకంగానే ఎక్కడో ఆరుబయట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్టు చిత్రీకరించారని ఆరోపించారు. మానవత్వం ఉన్న తన నియోజకవర్గ ప్రజలు, ఆఖరికి ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే ఎన్టీవీ వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా మారి, జర్నలిజం విలువలు మరిచిపోయి అసత్యప్రచారం చేస్తోందన్నారు. గౌరప్రదంగా, నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ ఫలాలను అందించడం,జెండా వందనం చేయడం తన విధి అన్నారు. దీనిని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదన్నారు. కరోనా వ్యాధిగ్రస్తుల మధ్య స్వాతంత్య్ర వేడుకులను నిర్వహించడం తప్పు ఎలా అవుతుందో ఎన్టీవీనే చెప్పాలన్నారు. -
ఎమ్మెల్యే రాచమల్లుపై దుష్ప్రచారం
ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిపై ఉద్దేశ పూర్వకంగానే కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఓ మీడియాలో కథనం ప్రసారం చేశారని టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్ అన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లుకు సత్సంబంధాలు లేవని చెప్పడం వాస్తవం కాదన్నారు. సీఎంతో ఉన్న సన్నిహిత సంబంధంతోనే ఎమ్మెల్యే తనలాంటి సాధారణ వ్యక్తికి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పదవి ఇప్పించారన్నారు. సీఎంతో చర్చించిన తర్వాతే ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్లను రద్దు చేసి, ప్రస్తుతం లబ్ధిదారులకు స్థలాలు ఇస్తున్నారన్నారు. కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోలేదని చెప్పడంలో అర్థం లేదన్నారు. తనలాంటి కార్యకర్తకు చాలా కాలం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్ష పదవి ఇచ్చారని పేర్కొన్నారు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీకి చెందిన శేఖర్ యాదవ్‌కు ఎంపీపీ పదవికి ప్రతిపాదన చేశారని, నంగనూరుపల్లెకు చెందిన యాలం తులశమ్మకు మార్కెట్ చైర్పర్సన్, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డికి వైస్ చైర్మన్, ఎస్ఏ నారాయణరెడ్డికి రాజుపాళెం మండల బాధ్యునిగా పదవులు ఇచ్చారన్నారు. వరదరాజులరెడ్డి వస్తారనేది అవాస్తవం 1996 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్న బంగారురెడ్డి చొరవతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తొలి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆయన కార్యకర్తలా శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని గత ఎన్నికల సమయంలోనే ప్రకటించారన్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ప్రచారం చేయడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఎంపీపీ అభ్యర్థి శేఖర్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాచమల్లు పనితీరును సీఎం జగన్మోహన్రెడ్డి సైతం ప్రశంసించారన్నారు. మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ నారాయణరెడ్డి, హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ ద్వార్శల భాస్కర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు శంకర్‌యాదవ్ పాల్గొన్నారు. -
లాక్డౌన్ వల్లే విద్యుత్ చార్జీలపై అపోహలు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలో విధించిన లాక్డౌన్ వల్లే విద్యుత్ బిల్లులు పెరిగాయి తప్ప ప్రభుత్వం ధరలను పెంచలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రీనివాసులు, డీఈ శ్రీనివాసులరెడ్డి, ఏఏఓ బాలసుబ్రహ్మణ్యంతో కలసి విద్యుత్‌చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ పలు మార్లు అధికారులతో చర్చించిన అనంతరం అనుమానాలను నివృతి చేసుకుని ఈ విషయాలను చెబుతున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో విద్యుత్‌సిబ్బంది బిల్లులు వసూలు చేయడానికి వీలు లేకుండా పోయిందన్నారు.దాదాపు 70 రోజుల పాటు బిల్లులు వసూలు చేయలేదని చెప్పారు. ప్రస్తుతం ఏప్రిల్, మే నెలతోపాటు జూన్ నెలకు సంబంధించి 15 రోజుల బిల్లును కూడా కలుపుతున్నారన్నారు. దీనికి సంబంధించి స్లాబ్‌లు మార్చలేదన్నారు. కేవలం రోజువారీ విద్యుత్ ఖర్చును లెక్కించి బిల్లు వేశారన్నారు. ప్రొద్దుటూరు నియోజకర్గంలో లక్షా 5వేల విద్యుత్ మీటర్లు ఉండగా కేవలం ప్రొద్దుటూరు పట్టణంలో మాత్రమే ఈ సమస్య ఏర్పడిందన్నారు. మండలంతోపాటు రాజుపాళెం మండలంలో కరోనా ప్రభావం లేకపోవడంతో యధావిధిగా వసూలు చేశారన్నారు. అక్కడ బిల్లు పెరగలేదన్నారు. టీడీపీ నేతలు చేసిన విమర్శలపై తాను వివరణ ఇవ్వలేదని, కేవలం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి బిల్లులు పెంచి ఖజానా నింపుకోవాల్సిన అవసరం లేదన్నారు. 500 యూనిట్లుపైగా విద్యుత్ ఖర్చు చేసేవారికి మాత్రమే యూనిట్‌కు 90పైసలు చొప్పున చార్జీలు పెంచారన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. ప్రజలు తమకు పథకాలు వర్తించబోమని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు ఓ మారు పెంచి ఏడాదికంతటికీ అదే విధానాన్ని అమలు చేసేవారన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఖర్చు ఆధారంగా వచ్చే కేటగిరిని బట్టి ప్రతి నెలా వసూలు చేస్తారన్నారు. చంద్రబాబు తన హయాంలో రూ.2.5లక్షల కోట్లు అప్పు పెట్టగా సీఎం జగన్ ఆ బకాయిలను పూడ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కామిశెట్టిబాబు పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని పరిశీలించారు. నూతన భవనం నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విషయంపై ప్రతిపాదనలు తయారు చేసి పంపితే తాను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా నిధులు మంజూరు చేయిస్తానన్నారు. -
లాక్‌డౌన్‌లోనూ మద్యం అమ్మకాలా..
ప్రొద్దుటూరు: పట్టణంలో కొందరు బార్ల యజమానుల తీరుపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో వారు మద్యం అమ్మకాలెలా జరుపుతున్నారని ఎక్సై జ్ అధికారులను ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాచమల్లు మాట్లాడు తూ నష్టం వస్తున్నా ప్రజల ఆరోగ్యం కోసం ప్రభు త్వం మద్యం అమ్మకాలను నిలిపివేసిందన్నారు. కానీ కొంత మంది ధరలు దారుణంగా పెంచి అమ్ముకుంటున్నారన్నారు. తన వద్ద రుజువులు ఉన్నాయన్నారు. ఓ బార్ యజమాని లాక్డౌన్ సమయంలో రూ.10లక్షలు ఆర్జించినట్లు తెలిసిందన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అమ్మకాలు సాగుతున్నా పట్టించుకోవడం దారుణమన్నా రు. కోగటంలో మద్యం తయారు చేసి సరఫరా చేస్తున్నారని తెలిపారు. రామేశ్వరంలో రోజూ సాయంత్రం గుంపులుగుంపులుగా చేరుతున్నారన్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నిరోధించకపోతే ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు చేస్తానని అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాధాకృష్ణ, సీఐ సీతారామిరెడ్డి పాల్గొన్నారు. ♦ మున్సిపాల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా శానిటైజర్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రాధ, అసిస్టెంట్ కమిషనర్ గంగాప్రసాద్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు. ♦ 19వ వార్డులో వైఎస్సార్సీపీ నాయకుడు మునీర్, అమీర్ 1000 మందికి కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు పాతకోట బంగారు మునిరెడ్డి, చాంద్‌బాషా, జగన్, ప్రసాద్ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే రాచమల్లు
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి గత ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి శుక్రవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే సాక్షికి విషయాన్ని ఫోన్ ద్వారా వివరించారు. పట్టణంలోని వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటై 12 ఏళ్లు అయినా నేటికీ అద్దె గదుల్లో నడుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. సొంత భవనాలు, ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి రూ.173కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి ఐదు ప్రధానమైన డ్రైనేజీలను ఆధునీకరించాల్సి ఉందన్నారు. ఇందు కోసం రూ.80కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో మహిళలు నడవడానికి వీలులేకుండా అసౌకర్యంగా ఉందని, దీని ఆధునీకరణకు రూ.83కోట్లు అవసరమని చెప్పారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కోసం రూ.38.60కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు. పూర్వం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా దెబ్బతిందని, ఆధునీకరణకు రూ.3కోట్లు మంజరు చేయాలని, 6వేల మంది జనాభా నివసిస్తున్న అమృతానగర్‌లో ఉన్నత పాఠశాలను నిర్మించడంతోపాటు పట్టణంలో లా కళాశాలను ఏర్పాటు చేయాలని, రూ.15కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మించాలని విన్నవించినట్లు చెప్పారు. రామేశ్వరంలోని పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఈ బ్రిడ్జిని నిర్మిస్తే రామేశ్వరం హౌసింగ్ కాలనీలో ఉగాది నాటికి ఇవ్వబోయే ఇళ్ల పట్టాల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సమస్యలన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టిడ్కో ఇళ్లు రద్దు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు. -
2024 నాటికి వినికిడి దృష్టి లోపాలుండవు
ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా 2024 నాటికి రాష్ట్రంలో వినికిడి, దృష్టి లోపాలు ఉన్నవారు కనిపించరని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. విర్చోస్, వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆదివారం సాహి నేతృత్వంలో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వాగ్దేవి ఇంజినీరింగ్‌కళాశాలలో చెవిలో నొప్పి, వినికిడి సమస్య, చీము కారడం లాంటి సమస్యలకు వైద్యులు పరీక్ష చేసి చికిత్స చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి తల్లిదండ్రులు పిల్లలను శిబిరానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యకంటే జ్ఞానం గొప్పదని, జ్ఞానం కంటే మానవత్వం గొప్పదని, ఆ మానవత్వానికి నిలువెత్తు రూపమే సాహి సంస్థ అని తెలిపారు. మానవీయ కోణంలో తన కుటుంబాన్నే కాకుండా పేదరికంలో ఉన్న అందరి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలనే నిస్వార్థ ఆలోచనతో సంస్థ వ్యవస్థాపకులు సజ్జల దివాకర్‌రెడ్డి అందిస్తున్న సేవలు గొప్పవని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు సేవ చేసి ఓటును ఆశిస్తారన్నారు. అయితే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రూ.కోట్లు పెట్టడంతోపాటు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తుండటం గొప్ప విషయమన్నారు. ఎంతో మంది ధనవంతులు ఉన్నారని, అలాంటి వారు సామాజిక సేవకు ముందుకు రావడం లేదన్నారు. వారందరూ ఈ దిశగా ఆలోచించాలని కోరారు.ఆకలితో పోరాటం చేసే పేదలు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసుకోవాలంటే సాధ్యం కాదన్నారు. ఈ ఆపరేషన్ చేసుకోవడానికి ఒక చెవికి రూ.6లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఇలాంటి వారికి సాహి సంస్థ ముందుకు వచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం గొప్ప విషయమని చెప్పారు. సజ్జల దివాకర్‌రెడ్డి మా కుటుంబానికి ఆత్మ బంధువు అని అన్నారు. దాతృత్వానికి పేరెన్నికగన్నారని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ప్రధానంగా నలుగురు కారణమన్నారు. తనకు టికెట్ ఇచ్చి ఎంతో అభిమానంతో తనను ప్రోత్సహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకరైతే, మానసికంగా తనను వెన్నుతట్టి ప్రోత్సహించి అన్ని విధాలా సహాయం అందించిన మా అన్న కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో వారన్నారు. తనను ఆదరించి ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గ ప్రజలు మూడో వారని, కౌన్సిలర్ స్థాయి నుంచి తన వెనకుండి ప్రోత్సహించిన సజ్జల దివాకర్‌రెడ్డి నాలుగోవారని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితో సాన్నిహిత్యం పెరగడానికి కూడా ఆయన కారణమని పేర్కొన్నారు. రాజన్న మానస పుత్రిక ఆరోగ్యశ్రీ– జగనన్న మానస పుత్రిక అమ్మ ఒడి ప్రాణానికి ప్రాధాన్యత ఇచ్చి అందరూ ఆరోగ్యంతో జీవించాలని నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. ప్రపంచంలోనే ఎవరికి రాని ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అకాల మరణం పొందారన్నారు. ఈ కారణంగానే నేటికీ అందరి మనస్సుల్లో రాజశేఖరరెడ్డి అమరుడుగా ఉన్నారని చెప్పారు. అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరక్షరాస్యత లేకుండా ఉండేందుకుగాను అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాల ద్వారా ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులను చేస్తే తద్వారా వారి కుటుంబాలు బాగుపడుతాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. సాహి (సొసైటీ టు ఎయిడ్ ది హియరింగ్ ఇంపైర్డ్) సంస్థ వ్యవస్థాపకుడు సజ్జల దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కుటుంబాల వారు వినికిడిలోపం సమస్యతో బాధపడుతున్నారన్నారు. వారికి అవగాహన కల్పించి, చికిత్స చేసేందుకు చాలా క్యాంప్‌లను నిర్వహించామని పేర్కొన్నారు. సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే ఉపయోగం ఉంటుందని, వయసు పెరిగే కొద్ది సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉందన్నారు. వినికిడి లోపం సమస్యతో ఎవరు కుటుంబానికి, సమాజానికి భారం కాకూడదనే లక్ష్యంతో సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ఎంతో మంది వినికిడి లోపం ఉన్న వారు ఆపరేషన్ చేయించుకుని ఉన్నత ఉద్యోగాలు పొందారని, క్రీడల్లో రాణిస్తున్నారని వివరించారు. 16 ఏళ్లుగా ఇలాంటి సేవలు అందిస్తున్నామని, ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. మెటర్నిటి ఆస్పత్రుల్లోనే ఆడియాలజిస్టును ఏర్పాటు చేసి వెంటనే జబ్బును గుర్తించేందుకు వీలుగా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. రిమ్స్‌లాంటి ఆస్పత్రుల్లో ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఇప్పటికే ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆయన సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకునే అవకాశ ఉందని తెలిపారు.కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాని పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చక్రయపేట మండల వైఎస్సార్సీపీ ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజి కరస్పాండెంట్ జి.హుసేన్‌రెడ్డి, డైరెక్టర్ పీఆర్ బాబాజీ, ప్రిన్సిపాల్ జి.జగదీశ్వరరెడ్డి, డిజెబుల్ వెల్ఫేర్ జిల్లా ఏపీఓ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. 70 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు ప్రొద్దుటూరు : విర్చోస్, వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల, వైఎస్ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాహి నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం 70 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు నిర్ధారించినట్లు చక్రాయపేట మండల వైఎస్సార్సీపీ ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి తెలిపారు. సాయంత్రం 36 మందికి అవసరమైన వినికిడి యంత్రాలను వైఎస్ కొండారెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఒక్కో వినికిడి యంత్రం దాదాపు రూ.10వేలు అవుతుందని తెలిపారు. వైద్య శిబిరానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 348 మంది వచ్చారన్నారు. వీరిలో 70 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు అవసరమని వైద్యులు చెప్పారన్నారు. రెండు మూడు నెలల్లో దశల వారిగా వీరందరిని హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. రెండు రోజులు అక్కడే ఉండేందుకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. ఆపరేషన్లు అనంతరం వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత కూడా తమదేనని చెప్పారు. అనంతరం సాహి వైద్య బృందాన్ని, వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను వైఎస్ కొండారెడ్డి అభినందించారు. పేదలకు మంచి సేవ చేశారని కొనియాడారు. కార్యక్రమంలో వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ జి.హుసేన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జి.జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న నమ్మకాన్ని నిలబెట్టారు
రాజుపాళెం : ఎన్నికల ముందు ఇచ్చిన హహామీలను నెరవెర్చడంతో జగనన్న నమ్మకాన్ని నిలబెట్టారని, టీడీపీ మోసం, దగాలను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. రాజుపాళెం మండలంలోని చిన్నశెట్టిపల్లె గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం బియ్యం కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో బియ్యం కార్డులను రెండు, మూడు పంపిణీ చేసి మమ అనిపించారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీ తుడిచి పెట్టుకొని పోతుందని అన్నారు. ప్రతి కుటుంబంలో అర్హులైన అవ్వాతాతకు పింఛను, అమ్మ ఒడి, వైఎస్సార్ రైతుభరోసా కింద ఖాతాల్లో నగదు జమ చేశారని, ఈ ప్రకారం ఏడాదికి రూ.55 వేల నుంచి రూ.60 వేల వరకు లబ్ధి కలిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.గత ప్రభుత్వంలో రాజుపాళెం మండలంలోని చిన్నశెట్టిపల్లె గ్రామంలో నువ్వు వైఎస్సార్సీపీకి చెందిన వాడవు.. నీకు సంక్షేమ పథకాలు ఇవ్వమని తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అలా కాకుండా టీడీపీ జెండా మోసిన వారికి కూడా పథకాలను అందింస్తోందని చెప్పారు.ఇదంతా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ ఇరగంరెడ్డి జయరామిరెడ్డి, నాయకులు ఎంబీ శివశంకరరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రాజారాంరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.