కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలకు 8 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. ఖాదర్‌బాషా డిమాండ్ చేశారు. గురువారం కడపలోని వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో ముస్లిం, మైనార్టీలతో నిర్వహించి న సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు కు నోట్లు కేసులో చంద్రబాబు మోదీ కాళ్ల దగ్గర సాగిలపడి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ముస్లింలు 20వేల మంది ఉండే ప్రతి ప్రాంతంలో పర్యటించి సద్భావనా సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ, పార్టీ జాతీ య కార్యదర్శి రెహమాన్ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ముస్లింలు ఒకరికి ఇచ్చే స్థితిలో ఉండేవారని, చంద్రబాబు పాలనలో పుచ్చుకొనే స్థాయికి చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సీని యర్ నాయకులతో కమిటీ వేసి ముస్లింల సమస్యలపై అధ్యయం చేస్తామన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం లో, యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోనూ ముస్లిం మంత్రులున్నారని, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం లేరని ఎద్దేవా చేశారు.
లౌకికవాదం అంతమొందించేలా ప్రభుత్వ చర్యలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం, మైనార్టీలను అణగదొక్కుతున్నాయని కడప శాసనసభ్యులు అంజద్‌బాషా ధ్వజమెత్తారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముస్లింలకు అనేక హామీలిచ్చి న చంద్రబాబు ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. రాజ« దాని పేరుచెప్పి ఎన్నో మసీదులు, దేవాలయాలు, చర్చిలను కూల్చివేశారని గుర్తు చేశారు. లౌకికవాదాన్ని అంతం చేసే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయని తెలిపారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్ – రఘురామిరెడ్డి
ముస్లిం, మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని విద్య వల్లే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుదని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. మైదుకూరులో 20 ఏళ్ల చరిత్ర కలిగిన దర్గాను అర్థరాత్రి కరెంటు తీసి కూల్చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. ఇలాంటి పాపాలు చేస్తున్న ఆయన్ను దేవుడు కూడా క్షమించడని హెచ్చరించారు.
ముస్లింలు నమ్మకానికి ప్రతిరూపం – రాచమల్లు
ముస్లిం, మైనార్టీలు నమ్మకానికి ప్రతిరూపాలని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ముస్లింల పట్ల కర్కషంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హబీబుల్లా, జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఏ కరిముల్లా, నగర అధ్యక్షుడు ఎస్‌ఎండీ షఫీ, పార్టీ రాష్ట్ర నాయకులు గౌస్‌లాజం, తుమ్మలకుంట శివశంకర్, ఎంపీ సురేష్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ, బీసీసెల్ అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్, స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా, దేవిరెడ్డి ఆదిత్య పాల్గొన్నారు.
తీర్మానాలు ఇవే...
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయాలని, నియోజకవర్గానికి ఒక ఉర్దూ జూని యర్ కళాశాల, రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని, ఓబీసీల వర్గీకరణ చేయాలని, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి బ్యాంకులతో సంబంధం లేకుండా రుణా లివ్వాలని, మైనార్టీల సబ్‌ప్లాన్ అమలు చేయాలని, దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇవ్వాలని, వక్ఫ్ భూములకు రక్షణ కల్పించి దూదేకుల కమ్యూనిటీకి సమాన అవకాశాలు కల్పించాలని, వెయ్యి కోట్లతో మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment