khadar basha
-
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు
-
పవన్ కళ్యాణ్ ఎవరిని వదలడు: ఖాదర్ బాషా
-
మద్యం మత్తులో హత్య
పులివెందుల : పులివెందుల పట్టణంలో ఖాదర్‌బాషా అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనలో మిస్టరీ వీడింది. అతనితో కలిసి మద్యం సేవించిన యువకుడే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. అశోక్‌బాబు అనే యువకుడు హత్యకు గురికాగా, ఖాదర్‌బాషా తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. స్థానిక జయమ్మ కాలనీకి చెందిన దస్తగిరి, ఫకురున్నీసా దంపతుల ఏకైక కుమారుడు ఖాదర్ బాషా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తుండేవాడు. హత్యకు గురైన అశోక్‌బాబు, ఇతను మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి అశోక్‌బాబు, ఖాదర్ బాషా, బాలు, జిలానిలు కలిసి మద్యం సేవించారు. అక్కడి నుంచి అశోక్‌బాబు ఇంటికి వెళ్లగా.. ఖాదర్ బాషా, బాలు, జిలానిలు అక్కడే మద్యం సేవిస్తూ ఉండిపోయారు. మద్యం మత్తులో ఖాదర్ బాషా బాలును దుర్భాషలాడాడు. దీంతో కోపోద్రిక్తుడైన బాలు చేతిలో ఉన్న మద్యం బాటిల్ తీసుకుని ఖాదర్ బాషాపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఖాదర్ బాషా ప్రాణభయంతో కొంచెం దూరం పరుగెత్తగా.. బాలు వెంటాడి దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ముద్దనూరు – కడప రింగ్ రోడ్డులోని ప్రధాన రహదారిపై అడ్డంగా పడేశాడు. నిందితుడు బాలు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఖాదర్ బాషా మృతిని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో గురువారం కడప రిమ్స్నుంచి ఫోరెనిక్స్ నిపుణులు వచ్చి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని మృతుడి తల్లిదండ్రులకు అప్పగించారు. -
ముస్లింలకు 8 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలకు 8 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. ఖాదర్‌బాషా డిమాండ్ చేశారు. గురువారం కడపలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో ముస్లిం, మైనార్టీలతో నిర్వహించి న సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు కు నోట్లు కేసులో చంద్రబాబు మోదీ కాళ్ల దగ్గర సాగిలపడి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ముస్లింలు 20వేల మంది ఉండే ప్రతి ప్రాంతంలో పర్యటించి సద్భావనా సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ, పార్టీ జాతీ య కార్యదర్శి రెహమాన్ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ముస్లింలు ఒకరికి ఇచ్చే స్థితిలో ఉండేవారని, చంద్రబాబు పాలనలో పుచ్చుకొనే స్థాయికి చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సీని యర్ నాయకులతో కమిటీ వేసి ముస్లింల సమస్యలపై అధ్యయం చేస్తామన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం లో, యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోనూ ముస్లిం మంత్రులున్నారని, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం లేరని ఎద్దేవా చేశారు. లౌకికవాదం అంతమొందించేలా ప్రభుత్వ చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం, మైనార్టీలను అణగదొక్కుతున్నాయని కడప శాసనసభ్యులు అంజద్‌బాషా ధ్వజమెత్తారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముస్లింలకు అనేక హామీలిచ్చి న చంద్రబాబు ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. రాజ« దాని పేరుచెప్పి ఎన్నో మసీదులు, దేవాలయాలు, చర్చిలను కూల్చివేశారని గుర్తు చేశారు. లౌకికవాదాన్ని అంతం చేసే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయని తెలిపారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్ – రఘురామిరెడ్డి ముస్లిం, మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని విద్య వల్లే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుదని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. మైదుకూరులో 20 ఏళ్ల చరిత్ర కలిగిన దర్గాను అర్థరాత్రి కరెంటు తీసి కూల్చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. ఇలాంటి పాపాలు చేస్తున్న ఆయన్ను దేవుడు కూడా క్షమించడని హెచ్చరించారు. ముస్లింలు నమ్మకానికి ప్రతిరూపం – రాచమల్లు ముస్లిం, మైనార్టీలు నమ్మకానికి ప్రతిరూపాలని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ముస్లింల పట్ల కర్కషంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హబీబుల్లా, జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ కరిముల్లా, నగర అధ్యక్షుడు ఎస్ఎండీ షఫీ, పార్టీ రాష్ట్ర నాయకులు గౌస్‌లాజం, తుమ్మలకుంట శివశంకర్, ఎంపీ సురేష్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ, బీసీసెల్ అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్, స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా, దేవిరెడ్డి ఆదిత్య పాల్గొన్నారు. తీర్మానాలు ఇవే... ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయాలని, నియోజకవర్గానికి ఒక ఉర్దూ జూని యర్ కళాశాల, రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని, ఓబీసీల వర్గీకరణ చేయాలని, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి బ్యాంకులతో సంబంధం లేకుండా రుణా లివ్వాలని, మైనార్టీల సబ్‌ప్లాన్ అమలు చేయాలని, దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇవ్వాలని, వక్ఫ్ భూములకు రక్షణ కల్పించి దూదేకుల కమ్యూనిటీకి సమాన అవకాశాలు కల్పించాలని, వెయ్యి కోట్లతో మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. -
ఎస్పీ కోసం గాలింపు
♦ తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయంలో రహస్య విచారణ ♦ సన్నిహితుల వద్ద సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం ♦ పొన్నేరిలోనూ ఖాదర్‌బాషా పంచాయతీ లీలలు తిరువళ్లూరు: రూ.20 కోట్ల రూపాయలు విలువ చేసే పంచలోహ విగ్రహాలను అక్రమంగా తరలించడంతో పాటు వాటిని విక్రయించిన కేసులో చిక్కుకుని పరారీలో ఉన్న డీసీబీ డీఎస్పీ ఖాదర్‌బాషా ఆచూకీ కోసం తిరువళ్లూరులో రహస్య విచారణను చెన్నై పోలీసులు చేపట్టారు. మదురై జిల్లా అరుప్పుకోటై సమీపంలోని ఆలపాడి ప్రాంతానికి చెందిన రిటైర్డ్ టీచర్ ఆరోగ్యరాజ్‌కు చెందిన వ్యవసాయ భూమిలో 2008వ సంవత్సరం వ్యవసాయ పనులను సాగించారు. అప్పట్లో అరక దున్నుతుండగా శివపార్వతీల పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. అయితే వ్యవసాయభూమిలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వని ఆరోగ్యరాజ్ తన సన్నిహితుడు సంతానం కలిసి రహస్యంగా దాచి పెట్టారు. అనంతరం అదే ప్రాంతానికి చెందిన ఫొటోగ్రాఫర్ సుందరమూర్తి చేత ఫొటోలు తీయించి అంతర్జాతీయ స్మగ్లర్‌కు పంపించారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కడంతో అక్కడే సీఐగా పనిచేస్తున్న ఖాదర్‌బాష, హెడ్‌కానిస్టేబుల్ సుబ్బురాజ్ కలిసి ఆరోగ్యరాజ్‌ను పలిపించి తమదైన శైలిలో విచారణ చేపట్టి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్‌తో చేతులు కలిపిన వైనం: ఆరోగ్యరాజ్ నుంచి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న ఇన్స్పెక్టర్ ఖాదర్‌బాష, హెడ్‌కానిస్టేబుల్ సుబ్బురాజ్ విగ్రహంపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అంతర్జాతీయ స్మగ్లర్ దీనదయాళన్‌తో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఎవ్వరీకి తెలియకుండా శివపార్వతీల పంచలోహ విగ్రహాలను 20 లక్షల రూ పాయలకు విక్రయించి తద్వారా వచ్చిన సొమ్మును ఇద్దరు కలిసి పంచుకున్నారు. వెలుగులోకి ఇలా: గమ్మత్తుగా సాగిన విగ్రహల స్మగ్లింగ్ 2016 జూన్1న ఢిల్లీలో అంతర్జాతీయ స్మగ్లర్ దీనదయాళన్ అరెస్టుతో తిరువళ్లూరు డీఎస్పీ మెడకు ఉచ్చుబిగిసింది. దీనదయాళన్ వద్ద విచారణ జరిపిన పోలీసులు తిరువళ్లూరు డీఎస్పీ ఖాదర్‌బాష నుంచి సైతం విగ్రహాలను కొనుగోలు చేసినట్టు నిర్ధారించి కేసు నమోదు చేశారు. సుబ్బురాజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు డీఎస్పీ ఖాదర్‌బాష కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో డీఎస్పీ: సుబ్బురాజ్ అరెస్టు విషయం తెలుసుకున్న డీఎస్పీ మెడికల్ లీవు పెట్టి వెళ్లిపోయారు. అయితే డీఎస్పీ అచూకీ కోసం ఆరుగురితో కూడిన రెండు బృందాలు తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయం, పోలీసు క్వార్టర్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో రహస్యంగా తనిఖీ చేశారు. కాగా పొన్నేరీ డీఎస్పీగా ఉన్నప్పుడు భూసంబంధిత వివాదంలో తలదూర్చి రూ.80 లక్షల వరకు వసూలు చేశారన్న విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్ తిన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేపట్టిన పోలీసులు, సాయంత్రం ఏడున్నర వరకు విచారణను కొనసాగించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడడానికి నిరాకరించిన విచారణ బృందం, కొన్ని కీలక సమాచారాన్ని రాబట్టామని చెప్పి వెళ్లిపోయారు. -
పులి బొమ్మతో కోతులు పరార్!
చిలమత్తూరు : మండల కేంద్రం చిలమత్తూరులో కోతులు పగటిపూట ఇళ్లల్లోకి చొరబడి రభస చేస్తున్నాయి. చిన్నారులు, పెద్దలపై దాడులకు కూడా దిగుతున్నాయి. చింత, బొప్పాయి, జామæ తదితర పండ్ల తోటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. దీంతో కోతుల బెడదను అరికట్టడంతో పాటు పంటలను కాపాడుకోవడం కోసం చిలమత్తూరుకు చెందిన ఖాదర్‌బాషా వినూత్నంగా ఆలోచించి పులి బొమ్మను తెచ్చాడు. పండ్ల తోటల యజమానుల వద్ద దినసరి కూలీకి పని చేస్తూ బొమ్మను చూపిస్తూ కోతులను బెదిరించి పారదోలుతుంటాడు. -
నంద్యాలలో వ్యాపారి ఆత్మహత్య
నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డులోని వంతెనకు ఓ వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఖాదర్ బాషా ధాన్యం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఖరీఫ్ కాలంలో రాయపాలపురం గ్రామానికి చెందిన రైతుల నుంచి దాదాపు ఖాదర్ బాషా నాలుగు వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేశాడు. వాటిని సిరివెళ్లలోని గోదాములో నిల్వ ఉంచాడు. అయితే ప్రస్తుతం ధాన్యంకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ధాన్యం విక్రయించ లేకపోయాడు. రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి రావటంతో తట్టుకోలేక శుక్రవారం రాత్రి వంతెన కింది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.