ఖాదర్ బాషా (ఫైల్‌ఫొటో)
పులివెందుల : పులివెందుల పట్టణంలో ఖాదర్‌బాషా అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనలో మిస్టరీ వీడింది. అతనితో కలిసి మద్యం సేవించిన యువకుడే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. అశోక్‌బాబు అనే యువకుడు హత్యకు గురికాగా, ఖాదర్‌బాషా తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. స్థానిక జయమ్మ కాలనీకి చెందిన దస్తగిరి, ఫకురున్నీసా దంపతుల ఏకైక కుమారుడు ఖాదర్ బాషా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తుండేవాడు. హత్యకు గురైన అశోక్‌బాబు, ఇతను మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి అశోక్‌బాబు, ఖాదర్ బాషా, బాలు, జిలానిలు కలిసి మద్యం సేవించారు.
అక్కడి నుంచి అశోక్‌బాబు ఇంటికి వెళ్లగా.. ఖాదర్ బాషా, బాలు, జిలానిలు అక్కడే మద్యం సేవిస్తూ ఉండిపోయారు. మద్యం మత్తులో ఖాదర్ బాషా బాలును దుర్భాషలాడాడు. దీంతో కోపోద్రిక్తుడైన బాలు చేతిలో ఉన్న మద్యం బాటిల్ తీసుకుని ఖాదర్ బాషాపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఖాదర్ బాషా ప్రాణభయంతో కొంచెం దూరం పరుగెత్తగా.. బాలు వెంటాడి దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ముద్దనూరు – కడప రింగ్ రోడ్డులోని ప్రధాన రహదారిపై అడ్డంగా పడేశాడు. నిందితుడు బాలు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఖాదర్ బాషా మృతిని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో గురువారం కడప రిమ్స్‌నుంచి ఫోరెనిక్స్ నిపుణులు వచ్చి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని మృతుడి తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment