Suspicious death
-
విశాఖలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి!
విశాఖ: నగరంలోని ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నట్లు సీపీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె వెంట ఉన్న ఎన్ఆర్ఐ డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయ్యిందని, అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఆమె మెడకు ఉరితాడు బిగించి వాష్ రూమ్ లో పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఆమె కూడా ఉన్న డా క్టర్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
వాచ్మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్ జిల్లా, సాక్షి: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మన్ రంగయ్య .. కడప రిమ్స్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి మృతి చెందాడు. అయితే ఆయన మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నా భర్తను 2024 వరకూ పోలీసులు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత నా భర్తను హింసించారు. ఆయన కీళ్లు విరగొట్టారు. కొట్టి కొట్టి ఇలా చనిపోయేలా చేశారు. గత మూడు నెలలుగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి అన్నీ ప్రాంతాలు తిప్పారు. ఇప్పుడు మాకేం సంబంధం అంటున్నారు. రంగయ్య మృతికి సీబీఐ, పోలీసులే కారణం’’ అని ఆరోపించారామె. సుశీలమ్మ ఆరోపణలపై సీఐ ఉలసయ్య స్పందించారు. ‘‘రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ పిర్యాదు చేసింది. అనుమానాస్పద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. మృతికి కారణం ఏమిటో పోస్ట్ మార్టం నివేదికలో తెలుస్తుంది’’ అని తెలిపారు. రంగయ్య మృతదేహానికి ఇవాళే పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. -
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: తాడిగడప శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి చెందింది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామానికి చెందిన రామిశెట్టి గంగా భువనేశ్వరి.. నీట్లో కోచింగ్ తీసుకుంటోంది. కామినేని ఆసుపత్రికి విద్యార్థిని మృతదేహన్ని తరలించారు. కాగా, తమ కుమార్తె మృతిపై విద్యార్థిని తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు, కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తండ్రికి గుండెపోటుకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.విద్యార్ధి తల్లి గోవింద లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు ఎటువంటి ఆనారోగ్య సమస్యలు లేవని.. నిన్న రాత్రి కూడా తనతో ఫోన్లో మాట్లాడిందన్నారు. గత రాత్రి తన కుమార్తెకు తలనొప్పి వస్తే అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పుడు చనిపోయింది అంటున్నారు.తలనొప్పి వస్తే ప్రాణం పోతుందా?. ఇప్పుడు నిర్లక్ష్యంగా శవాన్ని తీసుకువెళ్లమంటున్నారు’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన విషయం ఎందుకు దాచారు?. చనిపోయిందని ఆలస్యంగా ఎందుకు తెలిపారు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు -
ఇంజినీర్ సుచిర్ బాలాజీ మృతి..మస్క్ కీలక ట్వీట్
కాలిఫోర్నియా: ఓపెన్ఏఐ ఇంజినీర్ సుచిర్ బాలజీ మరణంపై అతడి తల్లి పూర్ణిమారావ్ చేస్తున్న ఆరోపణలకు ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్(Elon Musk) మద్దతిచ్చారు. సుచిర్ బాలాజీ నవంబర్ 26న అమెరికాలోని సాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు.అయితే సుచిర్ మరణంపై తల్లి పూర్ణిమారావ్ తాజాగా ఎక్స్(ట్విటర్)లో సంచలన పోస్టు చేశారు. సుచిర్ మృతిపై తాము ప్రైవేట్ డిటెక్టివ్‌తో చేయించిన దర్యాప్తులో భాగంగా రెండోసారి శవపరీక్ష చేశామని తెలిపారు. శవపరీక్ష ఫలితాలు పోలీసులు చెబుతున్నదానికి భిన్నంగా ఉన్నాయన్నారు. ‘నవంబర్ 26న సుచిర్ అపార్ట్మెంట్లోకి ఎవరో ప్రవేశించారు. బాత్రూమ్లో సుచిర్కు ఇతరులకు మధ్య ఘర్షణ జరిగిన ఆనవాళ్లున్నాయి. రక్తపు మరకలు కూడా కనిపించాయి. ఇంతటి దారుణ హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చారు. సుచిర్ అనుమానాస్పద మృతిపై ఎఫ్‌బీఐ విచారణ చేయాలి’అని పూర్ణిమారావ్ తన పోస్టులో డిమాండ్ చేశారు. Update on @suchirbalajiWe hired private investigator and did second autopsy to throw light on cause of death. Private autopsy doesn’t confirm cause of death stated by police.Suchir’s apartment was ransacked , sign of struggle in the bathroom and looks like some one hit him…— Poornima Rao (@RaoPoornima) December 29, 2024పూర్ణిమారావ్ పెట్టిన ఈ పోస్టుకు బిలియనీర్ మస్క్ మద్దతు పలికారు. సుచిర్‌ది ఆత్మహత్యలా కనిపించడం లేదని మస్క్ ఆమె ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. సుచిర్ మృతిపై తమ పోరాటానికి మద్దతివ్వాలని పూర్ణిమారావ్ ఈ సందర్భంగా మస్క్‌ను కోరారు. This doesn’t seem like a suicide— Elon Musk (@elonmusk) December 29, 2024కాగా, సుచిర్ ఓపెన్ ఏఐ కంపెనీ చాట్‌జీపీటీ ఏఐ ప్రాజెక్టులో ఇంజినీర్‌గా పనిచేశారు. ఓపెన్ ఏఐ కంపెనీ కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని పనిచేస్తున్న కంపెనీపైనే ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే సుచిర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత -
నీటి కాలుష్యమే పొట్టన పెట్టుకుంది... వీడిన 350 ఏనుగుల మృతి మిస్టరీ
బోట్స్వానాలో 2020లో ఏనుగుల మూకు మ్మడి మరణం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకేసారి ఏకంగా 350 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమ య్యాయి. ఈ ఉదంతంపై లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధనలు జరిపింది. ఆ ఏనుగుల మరణాల వెనుక మిస్టరీ నాలుగేళ్లకు వీడింది. అడవిలోని నీటి గుంతలు కలుషితమవడమే ఏనుగుల మృతికి కారణమని అధ్యయన బృందం తెలిపింది. ‘‘సైనో బ్యాక్టీరియా విడుదల చేసిన సైనో టాక్సిన్లు నీటిపై విషపూరిత నురగకు కారణమయ్యాయి. అదే ఏనుగుల మరణానికి దారి తీసింది’’ అని వెల్లడించింది.వర్షాధారిత గుంతల వల్లే.ఒకవాంగో డెల్టాలోని 6 వేల చదరపు కిలోమీట ర్ల పరిధిలో 20 నీటి గుంతలు కలుషితమైనట్టు అధ్యయనంలో తేలింది. ఆ నీటిని తాగాక 88 గంటల్లోనే ఏనుగులు చనిపోయినట్టు అంచనా వేసింది. అవి శాశ్వత నీటి వనరులు కావు. కేవ లం వర్షాధారిత గుంతలు. వాటివల్లే ప్రమాదం జరిగిందని అధ్యయన సారథి శాస్త్రవేత్త డేవిడే లోమియో చెప్పారు. చనిపోయిన ఏనుగులు వేర్వేరు వయసులవి. పైగా వాటి దంతాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. కనుక వాటిని వేటాడారన్న వాదన సరికాదు’’ అని తెలిపారు.ఆల్గే పెరుగుదలకు కారణం?సైనో బాక్టీరియాగా పిలిచే నీలం–ఆకుపచ్చ ఆల్గే లో అన్నిరకాలూ విషపూరితం కావు. కొన్నిరకాల సైనోబాక్టీరియా నిలకడగా ఉన్న నీటిలో ఒక రకమైన ప్రాణాంతక ఆల్గల్ బ్లూమ్స్ (హెచ్ఎబి) ను ఉత్పత్తి చేస్తుంది. బోట్స్వానాలో 2019లో అస్సలు వానల్లేవు. 2020లోనేమో విపరీతంగా వానలు పడ్డాయి. ‘‘అధిక వర్షపాతంతో భూమి నుంచి భారీ అవక్షేపాలతో పాటు పోషకాల పునరుత్పత్తి విపరీతంగా జరిగింది. అదే ఆల్గల్ పెరుగుదలకు కారణమైంది’’ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ఇలాంటివి తరచూ జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టితో ఆఫ్రికా దక్షిణ భాగం వైరుధ్య వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోందని వారంటున్నారు. ‘‘ఇదే నీటిపై ప్రభా వం చూపుతోంది. దాంతో జంతువులు విపత్కర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి’’ అని తెలిపారు. అడవులు, పార్కుల్లోని నీటి వనరుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా అవసరమన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వివాహిత అనుమానాస్పద మృతి
కెలమంగలం: డెంకణీకోట సమీపంలో మహిళ అనుమానాస్పద మృతిపై హోసూరు సబ్ కలెక్టర్ ప్రియాంక విచారణ చేపట్టారు. డెంకణీకోట తాలూకా బేవనత్తం గ్రామానికి చెందిన మురుగేషన్ భార్య సోనియా (23), వీరికి గత ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగి కొడుకు పుట్టాడు. ఈ నేపథ్యంలో సోనియా ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. విషయం తెలుసుకొన్న డెంకణీకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళ శవాన్ని ఆస్పత్రికి తరలించారు. కూతురి మృతి గురించి అనుమానం ఉందని ఆమె తల్లి సుశీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి జరిగి ఏడేళ్లు మాత్రమే కావడంతో హోసూరు సబ్ కలెక్టర్ విచారణ జరిపారు. -
HYD: నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. ఆమెపై హత్యాచారం జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు.గచ్చిబౌలి రెడ్‌స్టోన్ హోటల్లోని ఓ గదిలో ఓ యువతి ఉరికొయ్యకు వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. వెంటనే క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. గదిలో అంతా రక్తపు మరకలు ఉండగా, మరోవైపు మద్యం బాటిల్స్ పడి ఉన్నాయి. మృతిరాలిని నర్సింగ్ చదువుతున్న శృతిగా పోలీసులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గది మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఘటన గురించి తెలిశాక హోటల్ వద్దకు చేరుకున్న మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆపైనే ఉరి వేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులను అడ్డుకుని హోటల్ ముందు ధర్నాకు దిగారు. ఇదీ చదవండి: ప్రియుడి మోజుతో ఆ కూతురు చేసిన పనికి.. -
టీవీ పాత్రికేయురాలి అనుమానాస్పద మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఒక టీవీ జర్నలిస్టు రాజధాని ఢాకాలో ఓ సరస్సులో శవమై తేలారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా, చంపి ఎవరైనా నీళ్లలో పడేశారా అనేది తెలియరాలేదు. మృతురాలిని గాజీ మీడియా గ్రూప్‌లోని బెంగాలీ బాషలో ప్రసారమయ్యే గాజీ టీవీ న్యూస్‌రూమ్ ఎడిటర్ సారా రహనుమాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఢాకాలోని హతిర్జహీల్ సరస్సు నుంచి మంగళవారం అర్ధరాత్రి దాటాక 2గంటలపుడు పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు సారా ఫహీమ్ ఫైజల్ అనే వ్యక్తిని ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ నీలాంటి స్నేహితుడిని పొందడం సంతోషంగా ఉంది. నీ కలలను నెరవేర్చలేకపోతున్నందుకు క్షమించు. నీ జీవిత గమనంలో దేవుడు నీకు తోడుగా నిలుస్తాడు’ అని రాసుకొచి్చంది. ‘‘చస్తూ బతకడం కంటే చావడమే ఉత్తమం’ అంటూ అంతకుముందు మరో పోస్ట్ పెట్టింది. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
హైదరాబాద్: తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో మెడకు చున్నీ బిగించిన స్థితిలో ఓ మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నేరేడ్మెట్ ఠాణా పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. జవహర్‌నగర్ ఠాణా పరిధి కౌకూర్ మల్లారెడ్డి కాలనీలో ఉంటున్న కృష్ణ, సుశీల దంపతుల కుమార్తె మాధవి(34) వివాహం బేగంపేట ప్రకాశ్‌నగర్‌కు చెందిన రాజుతో 2007లో జరిగింది. వారికి కుమారుడు పవన్(15), కుమార్తె శ్రీజ(13), కుమారుడు మున్నా(11) ఉన్నారు. రాజు అనారోగ్యంతో 2021లో మృతి చెందాడు. అనంతరం మాధవి తన ముగ్గురు సంతానాన్ని తల్లి ఇంట్లో ఉంచి చదివిస్తోంది. ఏఎస్‌రావునగర్‌లోని ఓ డెంటల్ క్లినిక్‌లో సహాయకురాలిగా పని చేస్తోంది. సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన సాయితో పరిచయం ఏర్పడింది. సాయికి అప్పటికే వివాహమైంది. అయినా ఇద్దరు కలిసి ఉండాలని 8 నెలల క్రితం సఫిల్‌గూడ బలరాంనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. సోమవారం ఉదయం 6:40కి సాయి.. మాధవి పెద్ద కుమారుడు పవన్‌కు ఫోన్ చేసి మీ అమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మాధవి తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు వెళ్లి చూడగా గదిలో తలకు గాయమై రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. సీఐ సందీప్‌కుమార్, ఎస్సై రమేష్‌లు చేరుకుని ఆధారాల్ని సేకరించారు. మృతురాలి దగ్గర 2 చరవాణులు, రూ.20 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం ఉంది. అవి కనిపించలేదు. సాయి వాటిని తీసుకొని పరారయ్యాడని భావిస్తున్నారు. సాయి నడిపే ఆటో మాధవే కొన్నదని బంధువులు తెలిపారు. అతడు చిక్కితే అన్ని విషయాలు బయటకొస్తాయని పోలీసులంటున్నారు.ఆదివారం రాత్రి తల్లి తనకు ఫోన్ చేసిందని పెద్ద కుమారుడు పవన్ పోలీసులకు చెప్పాడు. తన వద్ద రూ.20వేలు ఉన్నాయని.. వాటితోపాటు తన ఫోన్ నుంచి మరో 8వేలు బదిలీ చేసుకోవాలని చెప్పిందని పోలీసులకు వివరించాడు. తనకు ప్రాణభయం ఉందని మాధవికి ముందుగానే తెలుసా? లేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో కొడుక్కి డబ్బులు అందజేయాలని అనుకొని ఫోన్ చేసిందా? ఆత్మహత్య అయితే మెడకు చున్నీతో ఉరి వేసుకొని ఉండాలి.. అలా కాకుండా రక్తపు మడుగులో కింద పడి ఉండడాన్ని గమనిస్తే.. హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఎందుకు పారిపోయాడనే కోణంలోనూ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. -
పాట్నాలో హైటెన్షన్.. అసలేం జరిగిందంటే..
బీహార్ రాజధాని పాట్నా నిరసనలతో అట్టుడికిపోతోంది. కోపంతో ఊగిపోతున్న కొందరు నడివీధుల వెంట చేరి చేతికి దొరికిన వస్తువుల్ని కాలుస్తున్నారు. ఆ ఆగ్రహావేశాలకు కారణం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారి అనుమానాస్పద రీతిలో చనిపోవడం. పాట్నాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పదరీతిలో చనిపోవడం, ఆ విషయాన్ని దాచేందుకు స్కూల్ సిబ్బంది యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి అండగా తోడైన ఓ కులం.. పాట్నాలో నిరసనలకు దిగింది. రోడ్లపై మంటలు పెట్టి.. సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. టినీ టాట్ అకాడమీ స్కూల్లో చదివే చిన్నారి.. గురువారం స్కూల్ ట్యూషన్ అయ్యాక కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కూల్‌కు వచ్చారు. అయితే పాఠశాల సిబ్బంది పొంతన లేని సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బలవంతంగా స్కూల్లోకి అర్ధరాత్రి దాకా వెతికారు.చివరకు.. ఈ వేకువ ఝామున 3గం. ప్రాంతంలో స్కూల్ ఆవరణలోని డ్రైనేజీలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుటుంబ సభ్యులు స్కూల్‌కు నిప్పటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్కూల్‌కు చేరుకుని ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. ఎస్పీ చంద్రప్రకాష్ స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.#WATCH | Patna, Bihar: An angry crowd sets a school on fire after the body of a student was allegedly found on school premises. More details awaited. pic.twitter.com/6OwmDe8mjY— ANI (@ANI) May 17, 2024 స్కూల్లోకి వెళ్లిన చిన్నారి.. తిరిగి బయటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యింది. దీంతో ఆ అవరణాలోనే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాం. అయితే చిన్నారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్పీ అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, సిబ్బంది మృతదేహాన్ని దాచే యత్నం ఎందుకు చేసిందో తేలాల్సి ఉందన్నారు. మరోవైపు ఉద్రిక్తతలు విస్తరించకుండా పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారాయన. -
అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి
తెనాలిరూరల్: అమెరికాలోని కనెక్టికట్‌లో నివశిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తనయుడు అభిజిత్ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మిలు ఎన్నో ఏళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అడవి ప్రాంతంలో అదే రోజు గుర్తించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా అభిజిత్ భౌతిక కాయం అమెరికా నుంచి శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం చేరుకుంది. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భౌతికకాయాన్ని సందర్శించి, అభిజిత్ తల్లిదండ్రులను పరామర్శించారు. -
ఈనాడు ఒత్తిళ్లతో మహిళా ఉద్యోగి ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్: ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడింది. సంస్థలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను, అనుభవిస్తున్న మానసిక క్షోభను భర్తతో పంచుకున్నప్పటికీ.. అవి మరింత తీవ్రతరం కావడంతో తనకిక చావే శరణ్యం అనుకుంది. తాను పనిచేస్తున్న ఈనాడు కార్యాలయ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు, మృతురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ గజ్జి స్వామియాదవ్ కాలనీలో నివాసముండే ఎర్రగొల్ల శ్రీనివాస్, సాయికుమారి (34)కి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. శ్రీనివాస్ పదిహేనేళ్లుగా, సాయికుమారి తొమ్మిదేళ్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈనాడు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈనాడు కాల్ సెంటర్లో పనిచేసే సాయికుమారికి కొంతకాలంగా సంస్థలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో తరచూ ఇబ్బంది పడుతుండేది. భర్తకు చెప్పుకుని బాధ పడేది. ఆదివారం సరదాగా గడిపి.. ఈ క్రమంలోనే భార్యకు మానసిక ధైర్యాన్నిచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తిప్పాడు. ఇద్దరూ సరదాగా గడిపారు. సోమవారం విధుల్లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీకి బయలుదేరిన సాయికుమారిని ఉదయం 6 గంటలకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జాతీయ రహదారి వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చాడు. అయితే 9 గంటల సమయంలో ఈనాడు హెచ్ఆర్ విభాగం నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. సాయికుమారి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయిందని చెప్పడంతో హుటాహుటిన ఫిల్మ్‌సిటీకి వెళ్లాడు. అప్పటికే తలకు తీవ్ర గాయమైన సాయికుమారి మృతి చెందింది. శ్రీనివాస్ ఇచ్చింన ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. ఈనాడు సిబ్బంది అత్యుత్సాహం ఈనాడు సంస్థ ఒత్తిళ్ల కారణంగా తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చింన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పీఎస్‌లో ఉన్న శ్రీనివాస్ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అతని చుట్టూ కంచెలా ఉన్న ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. తన భార్య మృతికి దారితీసిన పరిస్థితులను మీడియాకు వివరించేందుకు సిద్ధమవుతున్న శ్రీనివాస్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
అనుమానాస్పద స్థితిలో తల్లీకుమారుడి మృతి
మల్కాజిగిరి: కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం..అదే గదిలో అతని తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలి్పన వివరాల మేరకు..మౌలాలి ఈస్ట్ ప్రగతినగర్‌కు చెందిన మెరుగు విజయ (73) భర్త చనిపోవడంతో కుమారుడు శ్రీధర్ గౌడ్(47)తో కలిసి ఉంటుంది. శ్రీధర్ గౌడ్‌కు భార్య శైలజతో మనస్పర్థలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె వేరే ఇంట్లో ఉంటోంది. కాగా శ్రీధర్ గౌడ్ ప్రస్తుతం జవహర్‌నగర్‌లో ఉన్న వాటర్ ప్లాంట్ నిర్వహణ చూసుకుంటున్నాడు. వారి సంతానంలో కుమారుడు, కూతురు ఇతని వద్ద ఉంటుండగా..మరో కుమారుడితో కలిసి శైలజ కాప్రాలో ఉంటున్నది. బుధవారం ఉదయం శ్రీధర్ కుమార్తె నిద్రలేచి చూసేసరికి తండ్రి బెడ్రూమ్లో ఉరివేసుకొని ఉండగా, అదే రూములో ఆమె నానమ్మ విజయ కిందపడి చనిపోయిఉండడం గమనించింది. వెంటనే బయటకు వచ్చి కేకలు వేయడంతో స్ధానికులు వచి్చ..పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ మల్లయ్యలు వారిద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శ్రీధర్ భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. కుటుంబ సమస్యలే కారణమా? భిక్షపతి, విజయలకు నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆర్థికంగా బాగానే ఉన్న కుటుంబం. శ్రీధర్‌కు అతని భార్య శైలజకు విభేదాలు ఏర్పడ్డాయి. గతంలో మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో శ్రీధర్‌పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా..వాదనలు పూర్తయి వచ్చే నెలలో తీర్పు రానున్నట్లు సమాచారం. పోలీసులు శ్రీధర్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని ప రిశీలించగా..మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో శ్రీధర్ బయట నుంచి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత పాలు పోసే వ్యక్తి రావడంతో విజయ పాలు పోయించుకున్నట్లు రికార్డు అయింది. విజయ నేల మీద పడి వుండడం, తల వెనుక రక్తం ఉండడాన్ని పోలీసులు గమనించారు. కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో షాక్‌కు గురైన ఆమె కింద పడిపోయి చనిపోయిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా యా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే నెలలో విడాకులకు సంబంధించి తీర్పు రానున్నడంతో శ్రీధర్ ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చునని భావిస్తు న్నారు. గత కొంత కాలంగా ఆస్తి పంపకాలపై కూడా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. -
Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై అంతర్జాతీయ స్థాయిలో ఖండనలు వ్యక్తం అవుతున్నాయి. పుతిన్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించారు గనుకే ఆయన్ని.. తీవ్రవాదం కేసులో జైలుకు పంపారని.. అక్కడే ఆయన్ని చంపేసి ఉంటారని అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆయన్ను హింసించారంటూ వస్తోన్న వార్తలను రష్యా ప్రభుత్వం ఖండించింది. సహజ కారణాల వల్లే చనిపోయారని చెబుతోంది. ఈ క్రమంలో.. ఓ కథనం వెలుగులోకి వచ్చింది. నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలున్నాయని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. మృతదేహం మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించాయని వైద్య నిపుణుడిని ఉటంకిస్తూ తెలిపింది. ‘‘సాధారణంగా జైల్లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను గ్లాజ్కోవా వీధిలోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌కు తరలిస్తారు. ఈ కేసులో కొన్ని కారణాలతో బాడీని క్లినికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తర్వాత మార్చురీ లోపలికి తీసుకువచ్చారు. అక్కడ ఇద్దరు పోలీసుల్ని కాపలా ఉంచారు. ప్రతిఒక్కరూ ఆయన మృతికి గల కారణం తెలుసు కోవాలనుకుంటున్నారు. ఈ గోప్యత దేనికి, వారు ఏదైనా దాచాలనుకుంటున్నారా..?’ అని ఆ వైద్యుడు ప్రశ్నించినట్లు ఆ కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సడెన్ డెత్ సిండ్రోమ్ వల్లే అలెక్సీ నావల్నీ చనిపోయినట్లు అధికారులు తనకు సమాచారం అందించారని ఆయన తల్లి లియుడ్మిలాకు మీడియాకు చెప్పారు. అదే సమయంలో.. మృతదేహాన్ని ఇప్పటికీ కుటుంబానికి అప్పగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీకి నివాళులర్పించేవారిని, ర్యాలీలు నిర్వహించేవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. -
ఆయన మరణం పుతిన్ నాశనానికే: బైడెన్ ఫైర్
ఆయన చనిపోవడం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత, పుతిన్‌దే పూర్తి బాధ్యత.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్.. రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(47) హఠాన్మరణంపై యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీలో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణించారని.. వైద్యులు ప్రయత్నించినా లాభం లేకపోయిందని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే.. అంతకు ముందు రోజు కూడా కోర్టు విచారణకు నవ్వుతూ హాజరైన నావల్నీ.. ఉన్నట్లుండి మరణించడంతో క్రెమ్లిన్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలెక్సీ నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతూ.. నావల్నీ మరణం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయనొక పోరాటయోధుడు. అవినీతి విషయంలో పుతిన్‌ను ఎదురించాడు. పుతిన్ ప్రభుత్వ పాల్పడుతున్న హింసకు ధైర్యంగా అడ్డుచెప్పాడు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత.. ఇది పుతిన్ వినాశనానికి దారి తీయక తప్పదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మరోవైపు నావల్నీ మృతిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించే పనిలో ఉన్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. #WATCH | On the death of jailed Russian opposition figure and Kremlin critic Alexey Navalny, US President Joe Biden says, "...Putin is responsible for Navalny's death. Putin is responsible..." (Video source: Reuters) pic.twitter.com/6xpoKvAnA4 — ANI (@ANI) February 17, 2024 ఇంకోవైపు మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. అలెక్సీ నావల్నీ భార్య యూలియాని కలిసి ఓదార్చారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ యూలియా కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అని యూలియా అన్నారు. అతి(తీవ్ర)వాదం అభియోగాలపై కిందటి ఏడాది ఆగస్టులో అలెక్సీ నావల్నీకి 19 ఏళ్ల జైలుశిక్ష పడింది. ‘‘నా ప్రాణం ఉన్నంతవరకు లేదా ఈ (పుతిన్) ప్రభుత్వం ఉన్నంత కాలం నేను జైల్లోనే ఉంటానన్న సంగతి నాకు తెలుసు’’ అని నాటి తీర్పు సమయంలో నావల్నీ వ్యాఖ్యానించారు. రెండు నెలల కిందటే ఆయన్ని.. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీకి తరలించారు. ఇదీ చదవండి: నిరసన గళం మూగబోయింది పుతిన్ హేట్స్ నావల్నీ రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ విధానాలను వ్యతిరేకిస్తూ నావల్నీ అనేక నిరసనలు చేపట్టారు. అందుకుగాను పలుమార్లు అరెస్టయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో నావల్నీ పోటీ చేశారు. వ్లాదిమిర్ పుతిన్‌కు ఆయనంటే తీవ్ర కోపం. నావల్నీ పేరును పలికేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. నావల్నీకి మరింత ఎక్కువ పేరు రావొద్దనే ఆయన పేరును పుతిన్ పలికేవారు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే.. ఆ వ్యక్తి అని మాత్రమే సంబోధించేవారు. ఆది నుంచీ ధిక్కార స్వరమే! ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. పుతిన్ సర్కారు పాలనా విధానాల్లో లోపాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఎదురైనా లెక్కచేయలేదు. నాయకులు/అధికారుల అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు జరిపి అనేక కీలక వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ టీవీ ఛానళ్లలో నావల్నీకి ఏమాత్రం ప్రచారం లభించేది కాదు. అయితే యూట్యూబ్ వీడియోలు, సామాజిక మాధ్యమ ఖాతాలతో ఆయన జనానికి బాగా దగ్గరయ్యారు. -
Alexey Navalny: నిరసన గళం మూగబోయింది
మాస్కో: రష్యాలో మరో అసమ్మతి గళం శాశ్వతంగా మూగబోయింది. మూడేళ్లుగా నిర్బంధంలో ఉన్న విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు 47 ఏళ్ల అలెక్సీ నవాల్నీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ‘‘ఆయన శుక్రవారం ఉదయం వాకింగ్ అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయతి్నంచినా, తక్షణం అంబులెన్సు రప్పించినా లాభం లేకపోయింది’’ అని జైలు వర్గాలు తెలిపాయి. అయితే మరణానికి కారణమేమిటో బయట పెట్టలేదు. దశాబ్దానికి పైగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంట్లో నలుసుగా మారి ఆయనకు ప్రబల ప్రత్యర్థిగా ఎదిగిన నవాల్నీ మృతిపై తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది కచి్చతంగా ప్రభుత్వ హత్యేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో రష్యా అధ్యక్ష పదవి కోసం పుతిన్‌తో పోటీ పడేందుకు విఫలయత్నం చేసిన నవాల్నీ, నాటినుంచీ ప్రభుత్వ అవినీతిపై పోరును తీవ్రతరం చేశారు. పలు స్థాయిల్లో పెచ్చరిల్లిన అవినీతిని బయటపెడుతూ సంచలనం సృష్టిస్తూ వచ్చారు. దాంతో ప్రభుత్వం ఆయన్ను నిర్బంధించడమే గాక దేశద్రోహం తదితర అభియోగాలు మోపింది. 19 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నవాల్నీని మాస్కో సమీపంలోని జైలు నుంచి గత డిసెంబర్లో దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలోని స్పెషల్ రెజీమ్ పీనల్ కాలనీకి తరలించారు. అతి శీతల ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ కాలనీ రష్యాలోకెల్లా అత్యంత కఠినమైన పరిస్థితులుండే కారాగారం. వచ్చే నెలలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో ఇది కచి్చతంగా ఆయన గొంతు నొక్కే ప్రయత్నమేనని అభిమానులు అప్పుడే ఆందోళనలకు దిగారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌ను సవాలు చేసే గట్టి ప్రత్యర్థి లేకపోయినా ‘నవాల్నీ ఫ్యాక్టర్’ ఆయన్ను బాగా చీకాకు పరుస్తోంది. నవాల్నీ అనుయాయులతో పాటు నానాటికీ పెరిగిపోతున్న అభిమాన గణం సోషల్ మీడియా ద్వారా పుతిన్ వ్యతిరేక ప్రచారంతో దేశమంతటా హోరెత్తిస్తోంది. దేశ విదేశాల్లోని పుతిన్ అపార ఆస్తుల చిట్టాను కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా విప్పుతూ ఫొటోలు, వీడియోలతో సహా బయట పెడుతూ వస్తోంది. వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షలాది లైక్‌లు వచ్చి పడుతున్నాయి! ఈ నేపథ్యంలో నవాల్నీ ‘మృతి’ పుతిన్ పనేనని భావిస్తున్నారు. దీనిపై పాశ్చాత్య దేశాలన్నీ స్పందించాయి. పుతిన్ అణచివేతను నవాల్నీ ఆజన్మాంతం అత్యంత ధైర్యసాహసాలతో ఎదిరించారంటూ పలు దేశాధినేతలు కొనియాడారు. విషప్రయోగం జరిగినా... మూడున్నరేళ్ల క్రితం ప్రాణాంతక విషప్రయోగం జరిగినా వెరవని గుండె ధైర్యం నవాల్నీది! ఆయన 2020 ఆగస్టులో సైబీరియా పర్యటన ముగించుకుని తిరిగొస్తుండగా ‘నొవిచోక్’ దాడికి గురయ్యారు. రష్యాకే ప్రత్యేకమైన ఆ ప్రాణాంతక రసాయనాన్ని నవాల్నీ లో దుస్తులపై చల్లినట్టు తర్వాత తేలింది. నాడీ మండలాన్ని నేరుగా దెబ్బ తీసే నొవిచోక్ ప్రభావానికి విమానంలోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనుయాయులు హుటాహుటిన జర్మనీకి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. నెలల తరబడి చికిత్స తర్వాత కోలుకున్నాక పుతిన్‌పై ‘అండర్‌ప్యాంట్స్ (లో దుస్తుల) పాయిజనర్’ అంటూ చెణుకులు విసిరారు. దాంతో అండర్‌ప్యాంట్స్ పదబంధం ఒక్కసారిగా రష్యా సోషల్ మీడియాలో పాపులరైంది. దానిపై లెక్కలేనన్ని మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. నిర్బంధం ఖాయమని తెలిసి కూడా ఆరోగ్యం చక్కబడుతూనే 2021 జనవరిలో నవాల్నీ రష్యా తిరిగొచ్చారు. మాస్కోలో విమానం దిగీ దిగగానే ఆయన్ను నిర్బంధంలోకి తీసుకుని జైలుకు తరలించారు. చివరికి జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నవ్వుతూనే కన్పించారు... నవాల్నీ చివరిసారిగా గురువారం బయటి ప్రపంచానికి కన్పించారు. ఓ కేసు విచారణలో వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండటమే గాక సరదాగా నవ్వుతూ, విచారణ సందర్భంగా జడ్జితోనూ జోకులు వేస్తూ గడిపారు. సాహసమే శ్వాస... మాస్కో శివారు ప్రాంతమైన బుటిన్లో జని్మంచిన నవాల్నీ మాస్కోలో లా డిగ్రీ అనంతరం విదేశాల్లో పై చదువులు పూర్తి చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం ద్వారా పుతిన్ వ్యతిరేకునిగా తెరపైకి వచ్చారు. రష్యా చమురు, గ్యాస్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసి వాటిలోని విచ్చలవిడి అవినీతిని బయట పెట్టారు. 2008 నుంచీ ఆయన పేరు క్రమంగా రష్యా అంతటా పాకింది. దాంతో 2012లో నవాల్నీ అరెస్టుల పర్వం మొదలైంది. 2014లో ఆశ్చర్యకరంగా జైలు నుంచి విడుదల చేయడంతో మాస్కో మేయర్ ఎన్నికల బరిలో దిగారు. ప్రచార మార్గాలన్నింటినీ మూసేసినా పుతిన్ బలపరిచిన అభ్యరి్థకి గట్టి పోటీ ఇవ్వడంతో నవాల్నీ పేరు మారుమోగిపోయింది. దాంతో ప్రభుత్వం మళ్లీ అరెస్టుల పర్వానికి తెర తీసింది. చివరికి 2018 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించడంతో ప్రజల దృష్టిలో నవాల్నీ మళ్లీ హీరోగా మారారు. రష్యాలో రెండు దశాబ్దాలుగా విపక్ష నేతలు, పుతిన్ విమర్శకులు, వ్యతిరేకులు నిర్బంధం పాలవడం, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పరిపాటిగా మారింది. విపక్ష నేత బోరిస్ నెమ్త్సోవ్ను 2015లో పుతిన్ అధికార నివాసం క్రెమ్లిన్ ప్రాసాదానికి కూతవేటు దూరంలోనే కాల్చి చంపారు. పుతిన్‌ను విమర్శించిన వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ 2023 ఆగస్టులో ‘విమాన ప్రమాదం’లో మరణించాడు. ప్రభుత్వంపై విమర్శలు చేసి అకాల మరణం పాలైన రష్యా కుబేరుల జాబితా చాలా పెద్దది. నవాల్నీ మాత్రం పుతిన్‌ను గట్టిగా సవాలు చేస్తూ ప్రబల ప్రత్యర్థిగా ఎదుగుతూ వచ్చారు. సోషల్ మీడియాను, స్వతంత్ర మీడియాను సమర్థంగా వాడుకుంటూ చెమటలు పట్టించారు. భౌతిక దాడులు, హత్యాయత్నాలను ఏమాత్రం లెక్కచేయని తీరు ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించి పెట్టింది. నిరసనలు... ఆగ్రహావేశాలు నవాల్నీ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పుతిన్ పనేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. నవాల్నీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎవరినైనా అంతమొందించడం పుతిన్ నైజమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ దుయ్యబట్టారు. ఆయన సర్వం కోల్పోవడంతో పాటు తన తప్పిదాలకు బాధ్యునిగా శిక్ష అనుభవించి తీరాల్సిందేనన్నారు. నవాల్నీ తన అసమాన ధైర్యసాహసాలకు జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి రావడం బాధాకరమని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కొల్జ్ ఆవేదన వెలిబుచ్చారు. అడుగడుగునా ప్రాణాపాయం పొంచి ఉన్నా మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించడం నవాల్నీకే చెల్లిందంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కొనియాడారు. ఆయన్ను రష్యా ప్రభుత్వమే క్రూరంగా పొట్టన పెట్టుకుందని లాతి్వయా అధ్యక్షుడు రింకేవిక్స్ ఆరోపించారు. తాను అత్యంత బలహీనుడినని ఈ చర్యతో పుతిన్ రుజువు చేసుకున్నారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. రష్యాలో స్వేచ్చా గళాలపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మండిపడ్డారు. సొంత ప్రజల అసమ్మతి పుతిన్‌ను విపరీతంగా వణికిస్తోందని మరోసారి రుజువైందని ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ అన్నారు. పుతిన్ ఆదేశాల మేరకే నవాల్నీ హత్య జరిగిందని ప్రపంచ మాజీ చెస్ చాంపియన్, రష్యా విపక్ష నేత గారీ కాస్పరోవ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పుతినే బాధ్యుడు: భార్య నవాల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యూలియా నవాల్నయా అనుమానాలు వెలిబుచ్చారు. శుక్రవారం మ్యూనిచ్ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అన్నారు. సదస్సులో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తదితర నేతలు ఆమెను ఓదార్చారు. -
సంగారెడ్డిలో మెడికో అనుమానాస్పద మృతి
సాక్షి, సంగారెడ్డి: మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కృష్ణారెడ్డి పేట్ ఓఆర్ఆర్ దగ్గర కారులో ఆపస్మారక స్థితిలో ఉన్న మెడికో రచనా రెడ్డి(25)ని పోలీసులు ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందింది. మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి.. ప్రస్తుతం బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఆమె మృతిపై అమీన్పూర్ పోలీసులు విచారణ చేపట్టారు -
సంగారెడ్డిలో కలకలం.. విష్ణువర్ధన్ అనుమానాస్పద మృతి!
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డిలో అదనపు కలెక్టర్ వద్ద పనిచేస్తున్న విష్ణువర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద సీసీ (క్యాంప్ క్లర్క్)గా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్ (44) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం ఉదయం కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్షిప్ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లలేదు. ఇక, విష్ణువర్ధన్‌కు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్ (16) ఉన్నారు. రాత్రి భార్య ఫోన్ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో గత నెలరోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. విష్ణువర్ధన్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? దాని కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇది కూడా చదవండి: భార్య దారుణ హత్య, కోమాలో భర్త.. ప్రేమ వ్యవహారమే కారణం! -
మిస్టరీగా ఇంటర్ విద్యార్ధిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. న్యాయం కోసం పెనమూరు పీఎస్ ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆందోళన చేపట్టారు. కాగా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ ఈ నెల 17న అదృశ్యమైంది. 18వ తేదీన విద్యార్ధిని తండ్రి మునికృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 20న ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ శవమై కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా పోస్టుమార్టంలో ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తెలిసిందని ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. అఘాయిత్యం జరిగిందా, విషప్రయోగం జరిగిందా అని పరీక్షించేందుకు సాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయిందా? ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఆమె మృతదేహాన్ని బావిలో పడేశారా అన్న విషయం తేల్చేందుకు స్టెరమ్‌బోన్ సాంపిల్స్‌ను కెమికల్ అనాలసిస్ కోసం తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆ నివేదికలు వచ్చిన అనంతరం అనుమా నితులను సమగ్రంగా, నిష్పాక్షికంగా విచారిస్తామన్నారు. విచారణను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను, నిరాధార వార్తలను ప్రచారంచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ -
కొలంబియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
జి.కొండూరు(మైలవరం): కొలంబియాలో స్నేహితురాలి జన్మదిన వేడుకలకు హాజరైన తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన బేతపూడి సుదీర్‌కుమార్ అలియాస్ జోషి (34) టెలీ కమ్యూనికేషన్లో ఎంఎస్ చేసేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ లే డే జైన్‌లో ఎంఎస్‌లో చేరాడు. కరోనా కారణంగా చదువు పూర్తి కాకపోవడం, సబ్జెక్ట్‌లు మిగిలిపోవడంతో అక్కడే ఉండి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ ఎంఎస్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనతోపాటు అదే యూనివర్సిటీలో చదువుతున్న కొలంబియాకు చెందిన యువతి జెస్సికాతో సుదీర్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన తన స్నేహితురాలి జన్మదిన వేడుకల నిమిత్తం సుదీర్‌కుమార్ స్పెయిన్ నుంచి కొలంబియా రాజధాని బోగోటో వెళ్లాడు. అక్కడి నుంచి రియో బ్లాంకోలోని స్నేహితురాలి నివాసానికి చేరుకున్నాడు. అక్కడ జన్మదిన వేడుకల అనంతరం ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 19వ తేదీన మంగళవారం తెల్లవారుజామున కొలంబియాలోని జెస్సీకా నుంచి జి.కొండూరులోని సుదీర్‌కుమార్ తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసుకు సుదీర్‌కుమార్ మరణ వార్త అందింది. తన ఇంట్లోనే సుదీర్‌కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని జెస్సీకా తెలిపినట్లు కేథరీన్, దేవదాసు చెబుతున్నారు. స్నేహితురాలి జన్మదిన వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సైతం తమతో వాట్సాప్‌లో పంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జన్మదిన వేడుకలలో భాగంగా తాగిన డ్రింక్ వల్ల మత్తుగా ఉందని, తర్వాత మాట్లాడతానని తమతో చివరిగా ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. తమ కుమారుడిని జన్మదిన వేడుకల పేరుతో రప్పించి కావాలని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ కుమారుడి భౌతికకాయం తమకు అప్పగించేలా చూడాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి.. భర్త రాత్రికి రాత్రే ...
కర్నాటక: ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన నగరంలోని జవహర్ నగర్లో జరిగింది. శిల్ప(28) అనే మహిళకు ఏడాది క్రితం శరత్‌తో వివాహమైంది. మంగళవారం రాత్రి ఆమెను భర్త హత్య చేసి పరారైనట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. భర్త శరత్, అత్త శశికళ, మామ సురేష్ తమ కుమార్తెను హత్య చేసి మేడ మీద నుంచి పడి మరణించిందని అబద్ధం చెబుతున్నారని వారు ఆరోపించారు. భర్త వచ్చేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు జరపనీయబోమన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు నేతాజీనగర్ సీఐ నాగరాజ్ వవెల్లడించారు. -
హోంగార్డు మృతి.. పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు
ఒడిశా: హోంగార్డు అనుమానాస్పద మృతి ఘటనలో జిల్లా ఎస్పీ వివేకానంద శర్మ ఆదేశాల మేరకు ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసిన మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పుటాసింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పుటాసింగి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అవినాష్ లిమ్మ(33) సోమవారం రాత్రి అనుమనాస్పద రీతిలో పుటాసింగిలోని ఓ మండపంపై శవమై కనిపించాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసు శాఖ నుంచి సరైన స్పందన లేకపోవడంతో మతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లిన లిమ్మ కుటుంబీకులు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. విషయం జిల్లా ఎస్పీ వివేకానంద శర్మ దృష్టికి వెళ్లడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఎలా అప్పగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతికి గల పూర్తి కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిని గ్రామానికి చేరుకున్న సిబ్బంది.. పూడ్చి పెట్టి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లిమ్మ కుటుంబీకులు, గ్రామస్తులు దీనిపై వ్యతిరేక వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు వారికి నచ్చజెప్పి, మృతదేహాన్ని వెలుపలికి తీశారు. అనంతరం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించి, భద్రపరిచారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం చేయనున్నారు. అయితే ఇది హత్య? లేక సహజ మరణమా అనే వివరాలు పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. -
కాజల్ అనుమానస్పద మృతి.. ప్రియుడిపై అనుమానం
సాక్షి, వరంగల్: హనుమకొండ బొక్కలగడ్డలో యువతి కాజల్ అనుమానస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ప్రియుడే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్ అబ్బాస్ తో సహజీవనం చేసే యువతి కాజల్ జూలై 12న మృతి చెందగా కుటుంబసభ్యులు పూడ్చి పెట్టారు. ఆలస్యంగా మేల్కొన్న కాజల్ తల్లి షరనార్జన్ బిడ్డ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు 20 రోజుల క్రితం పూడ్చిపెట్టిన కాజల్ మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ వైద్య బృందం, తహశీల్దార్ సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. కూలీ పనితో కుటుంబాన్ని పోషించుకునే కాజల్ ను అబ్బాస్ లోబర్చుకుని హత్య చేసి అనుమానం రాకుండా అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించాడని కాజల్ తల్లి ఆరోపించారు. (చదవండి: బావా కలవాలని ఉంది.. అని మెసేజ్ పెట్టి) -
వీడిన ఖాదీ వ్యాపారి హత్య మిస్టరీ!
హైదరాబాద్: గత ఏడాది జరిగిన ఖాదీ వ్యాపారి అనుమానాస్పద మృతి కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కేసు దర్యాప్తును నారాయణగూడ నుంచి నల్లకుంట పోలీసులకు ఉన్నతాధికారులు అప్పగించారు. ఖాదీ వ్యాపారి ప్రకాష్ వీర్ మృతిపై పలు అనుమనాలు ఉండటమే ఇందుకు కారణం. కొద్ది రోజులుగా నల్లకుంట ఇన్స్పెక్టర్ రవి ముమ్మర విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మృతుడి భార్య, ఇద్దరు కుమార్తెలపై పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అసలు ఏమైందంటే? గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి హైదర్‌గూడలోని ‘భారత్ ఖాదీ’ స్టోరు యజమాని ప్రకాష్ వీర్ అవంతినగర్లోని తన నివాసంలో రక్తపు మడుగులో కనిపించారు. నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు ఇతని మరణంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అతని సోదరులు ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీ కార్యాలయానికి లేఖ రాశారు. తన సోదరుడి మృతికి కారకులైన వారిని శిక్షించాలని ఆ లేఖలో రాయడంతో దీనిపై అప్పుడు స్పెషల్ బ్రాంచ్ పూర్తి నివేదికను ఉన్నతాధికారుల ఎదుట ఉంచింది. పోలీసుల అదుపులో భార్య, కుమార్తెలు? కొద్దిరోజులుగా నల్లకుంట పోలీసులు వ్యాపారి హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారు. రెండు, మూడు పర్యాయాలు మృతుడి భార్య, ఇద్దరు కుమార్తెలను విచారించిన సందర్భంలో పలు విషయాలు బయటకు వచి్చనట్లు తెలిసింది. దీంతో శనివారం వారిని నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలో మరిన్ని విషయాలు, వ్యాపారి మృతిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
బాలిక అనుమానాస్పద మృతి
రాయచూరు రూరల్: తాలూకాలోని గిల్లేసూగూరు గ్రామ శివారులో 15 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మరణించిన ఘటన జరిగింది. వివరాలు..ఊరి శివారులోని పొలంలో పూరి గుడిసెలో నివాసమున్న ఈరమ్మ(14) అనే బాలిక గురువారం మధ్యాహ్నం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించిందని ఇడపనూరు ఎస్ఐ కరియమ్మ తెలిపారు. గిల్లేసూగూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఈరమ్మ ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని కుటుంబ సభ్యులు వాపోయారు. భిక్షాటన చేసుకుని జీవితం గడిపే తల్లిదండ్రులు ఊరి బయట చిన్న గుడిసెలో ఉంటున్నారు. గురువారం బాలిక బడికి వెళ్లలేదు. ఈరమ్మను సమీప బంధువులు శివలింగ(20), శివు(21), వీరే‹Ù(22) అనే ముగ్గురు యువకులు కలిసి హత్య చేశారని సీఐ బాలచంద్ర శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరిలో ఒకరు ఈరమ్మను ప్రేమిస్తున్నట్లు నటించి మాయమాటలతో పిలుచుకెళ్లి హత్య చేసి చెట్టుకు ఉరి వేశారన్నారు. 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని కేసు దర్యాప్తు చేపట్టిన ఇడపనూరు పోలీసులు తెలిపారు. -
ఏమైంది శ్రీకృష్ణ... ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కడే వారసుడు
కాకినాడ: వైద్య కళాశాల క్యాంపస్‌లో ఓ మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొండూరు శ్రీకృష్ణ కేదార్ (27) అలియాస్ శృంగేరి జీఎస్ఎల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, పీజీ (పీడియాట్రిక్స్) సెకండియర్ చదువుతున్నాడు. కళాశాల ప్రాంగణంలోని స్టాఫ్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం ఉదయం 6.55 గంటల సమయంలో స్టాఫ్ క్వార్టర్స్ సమీపంలోని కారిడార్ వద్ద అతడు విగతజీవిగా పడి ఉన్నాడు. అతడిని గమనించిన వారు వెంటనే సూపరింటెండెంట్ డాక్టర్ టీవీఎస్పీ మూర్తికి సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడకు చేరుకున్నారు. కేదార్‌ను పరీక్షించగా అప్పటికే అతను మరణించినట్టు గుర్తించారు. దీంతో అక్కడి నుంచే అతడి తల్లిదండ్రులకు, స్థానిక పోలీసులకు డాక్టర్ మూర్తి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రాజమహేంద్రవరం తూర్పు మండలం డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, స్థానిక సీఐ కాశీ విశ్వనాథ్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అంతలోనే మృతుని తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. కవుకు దెబ్బలు మృతుని చెవుల నుంచి రక్తం కారడం, శరీరంపై నెత్తుటి గాయాలు, కవుకు దెబ్బలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంతటి పిరికివాడు కాదని, ఇది ఏమాత్రం ఆత్మహత్య కాదని తండ్రి శివరామలింగేశ్వరరావు అన్నారు. కేదార్ మృతిపై తమకు అనుమానం ఉందని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, న్యాయం చేయాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెడికో మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. క్లూస్ టీమ్‌ను, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. మృతుని ఫోన్ డేటా పరిశీలించగా.. సోమవారం రాత్రి నుంచి తెల్లవారుజామున 6.42 గంటల వరకూ తల్లిదండ్రులతో తరచూ మాట్లాడుతున్నట్టు ఉందని డీఎస్పీ చెప్పారు. అన్ని కోణాల్లోనూ ఈ కేసు దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కడే వారసుడు మృతుడు కేదార్ తండ్రి శివరామలింగేశ్వరరావుకు ఇద్దరు సోదరులున్నారు. ఈ ముగ్గురికీ కేదార్ ఒక్కడే వారసుడు. ‘ముగ్గురు అన్నదమ్ములైన మాకు ఒక్కడే వారసుడు కావడంతో అందరం అల్లారుముద్దుగా పెంచుకున్నాం. మెడిసిన్ చేస్తానంటే చదివించాం. ఎంబీబీఎస్ తరువాత పీజీ చేస్తానంటే ఒకే అన్నాం. ఇలా వాడు అడిగింది ఏదీ కాదనకుండా వచ్చిన మాకు ఇలా కడుపు శోకం మిగులుస్తాడనుకోలేదు’ అంటూ కేదార్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
లండన్‌లో అనుమానాస్పదస్థితిలో కోవై విద్యార్థి మృతి
సాక్షి, చైన్నె : లండన్‌లో చదువుకుంటున్న కోయంబత్తూరు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సమాచారం ఆదివారం కుటుంబీకులకు చేరింది. దీంతో మృతదేహం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. నీలగిరి జిల్లా ఊటీకి చెందిన శివకుమార్ కోయంబత్తూరు జిల్లా నరసింహనాయకన్ పాళయంలో నివాసం ఉన్నారు. ఆయన కుమారుడు జీవన్(25) గత ఏడాది లండన్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు చదివేందుకు వెళ్లాడు. అక్కడి హాస్టన్ వర్సిటీలో చదువుతున్నాడు. ఈ పరిస్థితులలో రెండు రోజుల క్రితం లైబ్రరీకి వెళ్లిన జీవన్ కనిపించకుండాపోయాడు. అతడి కోసం గాలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో జీవన్ తీవ్ర గాయాలతో బర్మింగ్‌హాం కాలువలో పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. లైబ్రరీకి వెళ్లిన జీవన బర్మింగ్‌హాం కాలువలో గాయాలతో పడి ఉండడం అనుమానాలకు దారి తీసింది. అతడి మరణ సమాచారాన్ని ఆదివారం వేకువజామున లండన్‌లోని అధికారులు భారత రాయబార కార్యాలయం వర్గాల ద్వారా కుటుంబీకులకు తెలియజేశారు. దీంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. జీవన్ మృతదేహాన్ని కోయంబత్తూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు. -
కల నెరవేరకుండానే ‘కథ’ ముగిసింది
కర్నూలు: ఎన్నో సినిమా కథలు రాశాడు. ఎన్నో పాత్రలు సృష్టించాడు. వాటికి ప్రాణం పోశాడు. వెండి తెర మీద చూసి మురిసిపోదామనుకున్నాడు. కానీ పరిస్థితులు కలిసిరాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. వందలాది కథలు రాసుకున్న ఆయన ‘కథ’ అర్ధాంతరంగా ముగిసింది. ఇది ఓ రచయిత విషాద గాథ. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తిసాగర్ (50) సినిమాల్లో కథలు రాయడంపై మక్కువతో చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. షేక్ పేట్ పరిధిలోని ఓ పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. సినిమా కథలతో పాటు సహాయ దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున టెర్రస్‌పై విగత జీవిగా కనిపించాడు. ఇది గమనించిన స్నేహితుడు 108 కు సమాచారం అందించాడు. వారు వచ్చి అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళాడు. స్నేహితుడు రాధాకృష్ణ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని గదికి వెళ్లి చూడగా తాను రాసుకున్న వందలాది కథలు గది నిండా ఉన్నాయి. వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు. -
Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి
ఫిల్మ్ నగర్(హైదరాబాద్): ఎన్నో సినిమా కథలు రాశాడు. ఎన్నో పాత్రలు సృష్టించాడు. ఆ పాత్రలకు ప్రాణం పోశాడు. వాటిని వెండి తెర మీద చూసి మురిసిపోదామనుకున్నాడు. కానీ పరిస్థితులు కలిసిరాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయాడు. వందలాది కథలు రాసుకున్న ఆయన ‘కథ’ అర్ధాంతరంగా ముగిసింది. ఇది ఓ కథా రచయిత విషాద గాథ. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తిసాగర్ (50) సినిమాల్లో కథలు రాయడంపై మక్కువతో చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. షేక్ పేట్ పరిధిలోని ఓ పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. సినిమా కథలతో పాటు సహాయ దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున టెర్రస్‌పై విగత జీవిగా కనిపించాడు. చదవండి: హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి! ఇది గమనించిన స్నేహితుడు 108 కు సమాచారం అందించాడు. వారు వచ్చి అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళాడు. స్నేహితుడు రాధాకృష్ణ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని గదికి వెళ్లి చూడగా తాను రాసుకున్న వందలాది కథలు గది నిండా ఉన్నాయి. వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు. -
పెందుర్తి లెండీవనం రిసార్ట్‌లో ఐదేళ్ల బాలుడు అనుమానాస్పద మృతి
-
బెంగళూరులో హైదరాబాద్ యువతి దారుణ హత్య.. అర్ధరాత్రి ఏం జరిగింది?
కర్ణాటక: సోమవారం రాత్రి బెంగళూరు జీవన్‌బీమా నగర పోలీసుస్టేషన్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష (23)గా గుర్తించారు. ఆమె ప్రియుడు అర్షిత్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ నగరంలో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. అర్పిత్ పదోన్నతిపై హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు. తన స్నేహితురాలితో కలిసి జీవన్‌బీమా నగర పరిధిలోని కొడిహళ్లిలో అపార్ట్మెంట్లో ఆకాంక్ష ఉండేది. అర్పిత్ హైదరాబాద్ నుంచి వచ్చి అప్పుడప్పుడు ఆమెను కలిసి వెళ్లేవాడు. సోమవారం అర్ధరాత్రి ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన అర్పిత్ గొడవ పడ్డాడు. ఈ సమయంలో ఆమెను గొంతు పిసికి హత్య చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆకాంక్ష రూంమేట్ విధులు ముగించుకుని తెల్లవారుజామున రూంకు రాగా హత్య విషయం బయట పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. అర్పిత్ కోసం గాలింపు చేపట్టారు. -
ఇంటిముందు మృతదేహం, డబ్బు, లేఖ
పుల్లలచెరువు/యర్రగొండపాలెం: ఒక యువకుడి మృతదేహాన్ని కొందరు వ్యక్తులు కారులో తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో సంచలనం కలిగించింది. మృతదేహంతోపాటు రూ.35 వేలు, క్షమాపణ లేఖ ఉంచి వెళ్లారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. మృతుడు ఉప్పు శ్రీను (35) భవన నిర్మాణ పనుల్లో కూలీగా చేస్తుంటాడు. పనుల కోసం ముఠావాళ్లతో చెన్నై, తెలంగాణ, ఇతర దూర ప్రాంతాలకు వెళుతుంటాడు. 10 రోజుల కిందట పనులకు చెన్నై వెళ్లాడు. అతడికి నయంకాని వ్యాధి ఉన్నట్లు గుర్తించిన భార్య పిల్లలను తీసుకుని రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కొందరు వ్యక్తులు తెల్లటి కారులో శ్రీను మృతదేహాన్ని తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లారు. మట్టి ఖర్చులకు రూ.35 వేలు, క్షమాపణ లేఖ అక్కడ ఉంచి వెళ్లారు. ఆ లేఖలో ‘అమ్మా.. పనిచేసే ప్రదేశంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో మీ అబ్బాయి చనిపోయాడు. మాకు దెబ్బలు తగిలాయి. తల్లి శోకం తీర్చలేనిదని మాకు తెలుసు. కానీ ఏమీచేయలేక పోయాం. మీ అబ్బాయి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.35 వేలు ఇస్తున్నాం. అమ్మా క్షమించండి..’ అని రాసి ఉంది. ఈ లేఖను బట్టి భవన నిర్మాణ పనులు జరిగే సమయంలో తోటి కూలీలతోపాటు శ్రీను కిందపడి ఉంటాడని, ఈ నేపథ్యంలో అతను చనిపోగా మరికొందరికి దెబ్బలు తగిలి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని అప్పజెప్పే తరుణంలో గ్రామస్తులు తమపై దాడిచేసే అవకాశం ఉందని, పోలీసు కేసులు అవుతాయనే భయంతో ఇంటిముందు పడేసి వెళ్లి ఉండవచ్చని అనుకుంటున్నారు. మృతుడి ఇంట్లో దొరికిన మందులు, పరీక్షల రిపోర్టును బట్టి అతనికి నయంకాని వ్యాధి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ కె.మారుతీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ వై.శ్రీహరి దర్యాప్తు చేస్తున్నారు. -
మూగ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
(హుస్నాబాద్): ఓ మూగ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఆ యువకుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. ఎస్ఐ తాండ్ర వివేక్ తెలిపిన వివరాల ప్రకారం... మండలపరిధిలోని నర్సింహతండాకు చెందిన మాలోతు రాజు–లలిత దంపతులకు ముగ్గురు సంతానం. రెండేళ్ల కిందటే ఐదేళ్ల కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. పెద్దకుమారుడు మాలోతు ఆంజనేయులు(17)పుట్టుకతోనే మూగవాడు. బుధవారం తండాలో బంధువుల వివాహ వేడుక జరిగింది. మధ్యాహ్నం పెళ్లిలో భోజనం చేస్తున్న క్రమంలో ముగ్గురు భయపెట్టారని ఆంజనేయులు సైగల ద్వారా తన తల్లిదండ్రులకు వివరించాడు. రాత్రి 9గంటలు దాటినా ఇంటికి రాలేదు. చుట్టు పక్కల వెతకగా, ఎక్కడా ఆచూకీ దొరకలేదు. గురువారం తెల్లవారుజామున గౌరవెల్లి రిజర్వాయర్ సమీపంలో తమకున్న వ్యవసాయ క్షేత్రం దగ్గర కట్టవద్దకు వెళ్లి చూసేసరికి వేప చెట్టుకు ఆంజనేయులు శవం వేలాడుతూ ఉంది. విషయం తెలుసుకొని పలువురు సంఘటన స్థలానికి వచ్చారు. తండాకు చెందిన కిషన్‌కు రాజుకు కొంతకాలంగా భూతగదాలు నడుస్తున్నాయి. ఇటీవల ఇద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే పాతకక్షల నేపథ్యంలో తమ కుమారుడిని హతమార్చారని ఆంజనేయులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యురాలు భూక్యమంగ హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంజనేయులు మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
భూదాన్‌పోచంపల్లి: వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్‌కు వెళ్లిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లికి చెందిన గూడూరు రాంరెడ్డి, రాధ దంపతుల కుమారుడు మణికాంత్‌రెడ్డి(21) ఫిలిప్పీన్స్‌లోని దావో మెడికల్ కాలేజీలో 2020లో ఎంబీబీఎస్‌లో చేరాడు. కరోనా కారణంగా కొద్దిరోజులు ఆన్లైన్లో క్లాసులు విన్నాడు. గత ఏడాది ఆగస్టులో ఫిలిప్పీన్స్ వెళ్లాడు. ప్రస్తుతం థర్డ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నాడు. అయితే.. ఆదివారం తెల్లవారుజామున మణికాంత్‌రెడ్డి ఉంటున్న హాస్టల్ మేనేజర్ రాంరెడ్డికి ఫోన్‌చేసి మీ కుమారుడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడని, కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్‌చేసి మెట్లపై నుంచి జారి పడి మృతిచెందాడని చెప్పారు. మణికాంత్‌రెడ్డి మృతదేహం ఫొటో, వీడియో పంపించారు. కాగా.. హాస్టల్ వెనుక డ్రెయినేజీలో మణికాంత్‌రెడ్డి మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. హాస్టల్ యాజమాన్యం, పోలీసులు చెప్పిన తీరు వేర్వేరుగా ఉండటంతో కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మణికాంత్‌రెడ్డి డ్రెయినేజీలో పడి ఉండటం,తలకు గాయం ఉండటంతో హత్యేనని ఆరోపిస్తున్నారు. కచ్చితంగా ఎవరో హత్య చేసి డ్రెయినేజీలో పడేసి ఉంటారని అంటున్నారు. 15 రోజుల క్రితం హాస్టల్లో మనదేశానికే చెందిన విద్యార్థులకు, మణికాంత్‌రెడ్డికి మధ్య గొడవ జరిగిందని, వారిలో ఎవరైనా ఘాతుకానికి పాల్పడ్డారా అనిఅనుమానిస్తున్నారు. మణికాంత్‌రెడ్డి మృతదేహాన్ని వెంటనే ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి, ఫిలిప్పీన్స్‌లోని ఎంబసీతో పాటు, అక్కడి ఎన్ఆర్ఐలతోనూ మాట్లాడి.. మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. మేమెట్టా బతికేది నాలుగురోజుల కిందట మాట్లాడినం. హాస్టల్ ఫీజు కావాలంటే పంపించిన. ‘పరీక్షలు నడుస్తున్నయి, నేనే ఫోన్ చేసి మాట్లాడుతా’అన్నడు. శనివారం ఫోన్ చేస్తే కలువలేదు. ఆదివారం చేద్దామనుకొన్నం. ఈ లోపు ఘోరం జరిగిపోయింది. నా కొడుకు లేకుండా మేమెట్లా బతికేది. – గూడూరు రాంరెడ్డి, మృతుడి తండ్రి -
బ్యూటీషియన్ మృతి.. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలిసేది?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని మంగళవారం ఓ బ్యూటీషియన్ చనిపోవడం.. పక్కనే ఆమె స్నేహితుడు రక్తపుమడుగులో పడి ఉండటం సంచలనం సృష్టించింది. ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉండటంతో యువతి గొంతు కోసి చంపి.. ఆ తర్వాత ఆమె స్నేహితుడు గొంతు, ఛాతి, చేతులు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని తొలుత భావించారు. అయితే, పోలీసులు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మృతురాలి శరీరంపై ఎక్కడా చిన్నగాయం కూడా కనిపించలేదు. యువతిని ఆమె స్నేహితుడు గొంతు నులిమి చంపేసి, అనంతరం అతను బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగరాజు, ఇందిర దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమారుడు 15 ఏళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. పెద్ద కుమార్తెకు ఏడాది క్రితం పెళ్లి చేశారు. రెండో కుమార్తె దుర్గాప్రశాంతి(23) ఎం.ఫార్మసీ పూర్తిచేసి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కొంతకాలం పనిచేసింది. ఆమె ఏడాది క్రితం హైదరాబాద్‌కు వెళ్లి బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది. నాలుగు నెలల క్రితం చిత్తూరులోని కొండమిట్ట ప్రాంతంలో సొంతగా బ్యూటీపార్లర్ ప్రారంభించింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమై.. దుర్గాప్రశాంతికి రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో చక్రవర్తి (27) అనే యువకుడు పరిచయమయ్యాడు. అతనిది తెలంగాణలోని భద్రాచలం జిల్లా కొత్తగూడెం కాగా, రెండేళ్లు దుబాయ్‌లో వంట మాస్టర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే చక్రవర్తికి, దుర్గాప్రశాంతికి ఫేస్బుక్ ద్వారా స్నేహం కుదిరింది. రెండు నెలల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన చక్రవర్తి.. తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. నగరంలోని దర్గా కూడలిలో బ్రెడ్ ఆమ్లెట్ దుకాణం పెట్టి జీవనం సాగిస్తున్నాడు. ఇతని తల్లి, దుర్గాప్రశాంతి తల్లి ఇందిర కూడా స్నేహితులుగా మారారు. రెండు రోజుల క్రితం ఇద్దరూ కలిసి కాణిపాకం వినాయకస్వామి ఆలయానికి కూడా వెళ్లి వచ్చారు. దుర్గాప్రశాంతి బ్యూటీపార్లర్ వద్దకు మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చక్రవర్తి వచ్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇందిర వచ్చి బ్యూటీపార్లర్ తలుపు తీసి చూడగా.. దుర్గాప్రశాంతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. చక్రవర్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ నరసింహరాజు ఘటనాస్థలానికి చేరుకుని చక్రవర్తిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దుర్గాప్రశాంతి అప్పటికే చనిపోయి ఉంది. చక్రవర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రిమ్స్‌కు తరలించారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద దుర్గాప్రశాంతి మృతదేహాన్ని ఎస్పీ రిషాంత్‌రెడ్డి పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. చదవండి: 'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో.. ఇప్పుడే పెళ్లి వద్దంటూ.. దుర్గాప్రశాంతికి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఇటీవల ఒక సంబంధం చూశారు. అబ్బాయి వైద్యుడు అని, పెళ్లి చేసుకోవాలని కోరారు. అయితే, ఏడాది తర్వాత పెళ్లి గురించి చూద్దామని దుర్గాప్రశాంతి చెప్పింది. ఈ నేపథ్యంలో చక్రవర్తి, దుర్గాప్రశాంతికి మధ్య ఏదైనా గొడవ జరిగి.. ఆమె గొంతు నులిమి చంపేసి, అతను బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్గాప్రశాంతి ఆత్మహత్య చేసుకుందనడానికి ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
దంపతుల అనుమానాస్పద మృతి
మడకశిర రూరల్: దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. భర్త ఉరి వేసుకున్న ప్రాంతంలోనే రక్తపు గాయాలతో భార్య మృతదేహం లభ్యం కావడంతో ఇరువైపులా కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. మడకశిర మండలం ఎగువ రామగిరి గ్రామానికి చెందిన చింతగుట్లప్ప, నింకమ్మ దంపతుల కుమారుడు వెంకటేష్ (42)కు 14 ఏళ్ల క్రితం కర్ణాటకలోని పావగడ తాలూకా ఈర్లగొంది గ్రామానికి చెందిన బొమ్మక్క కుమార్తె రాధమ్మ (35)తో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల వయసున్న కుమార్తె ఉంది. పరిగిలోని గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికురాలిగా రాధమ్మ పనిచేస్తోంది. మంగళవారం అర్ధరాత్రి గ్రామ శివారులోని రోడ్డు పక్కన చెట్టుకు వెంకటేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పక్కనే రాధమ్మ రక్తగాయాలతో విగతజీవిగా పడి ఉంది. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన వారు మృతదేహాలను గమనించి, సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. భార్యను హత్య చేసి, అనంతరం వెంకటేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ సురే‹Ùబాబు, ఎస్ఐ నాగేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. ద్విచక్రవాహనం, కట్టె, తాడు స్వా«దీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను వెంకటేష్ హతమార్చి ఉంటాడనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే.. : ఘటనపై రాధమ్మ తల్లి బొమ్మక్క మాట్లాడుతూ.. పథకం ప్రకారమే తన కుమార్తెను అల్లుడు హతమార్చాడని, అనంతరం పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది. మంగళవారం రాత్రి ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై కుమార్తెను గ్రామ శివారులోకి పిలుచుకెళ్లి, కట్టెతో కొట్టి హతమార్చినాడని బోరున విలపించింది. గ్రామంలో ఈ నెల 10న జాతర ఉందని, ఖర్చులకు డబ్బు కావాలంటే కొంత మొత్తాన్ని కూడా ఇచ్చినట్లు గుర్తు చేసింది. గతంలోనూ కుమార్తెను వేధిస్తుండడంతో పావగడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో స్టేషన్లో రాజీ చేశారని, అయినా అల్లుడిలో మార్పు రాలేదని పేర్కొంది. రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని కుమార్తెతో గొడవపడేవాడని, ఈ క్రమంలోనే భార్యను పథకం ప్రకారమే వెంకటేష్ హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
అమెరికా వెళ్లిన ఏడు నెలలకే..
మార్టూరు: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఏడు నెలలకే అనుమానాస్పదస్థితిలో అర్ధంతరంగా తనువు చాలించాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన గోవాడ రమేష్ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు గోవాడ నాగసాయి గోపి అరుణ్ కుమార్ (22) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చదవడం కోసం గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. లాంనార్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ టెక్స్‌పోర్టన్ ఏరియాలో ఐదుగురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటుండగా, వారితో ఒక యువతి కూడా ఉంటోంది. ఈ క్రమంలో మార్చి 1న అరుణ్ కుమార్ స్నేహితులకు కనిపించకుండా పోవడంతో గదిలోని స్నేహితురాలి ఫిర్యాదు మేరకు అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మార్చి 3వ తేదీన అరుణ్‌కుమార్ మృతదేహాన్ని వారి నివాసానికి సమీపంలో ఓ నీటి సరస్సులో గుర్తించి స్నేహితులకు, ఇండియాలోని తండ్రి రమేష్‌కు సమాచారం అందించారు. శవ పరీక్ష అనంతరం అరుణ్‌కుమార్ మృతదేహాన్ని అతని స్నేహితులు స్వంత ఖర్చులతో ఇండియా పంపగా.. శనివారం మధ్యాహ్నం స్వగ్రామం జొన్నతాళి చేరింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే కానీ అరుణ్‌కుమార్ మృతికి కారణం తెలియదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశించి అమెరికా పంపిస్తే శవమై తిరిగి వస్తాడని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. సాయంత్రం గ్రామంలో అరుణ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. -
రష్యా రక్షణ శాఖ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వంలోని మరో ఉద్యోగిని అనుమానాస్పదంగా మృతి చెందారు. రక్షణ శాఖలో పని చేస్తున్న 58 ఏళ్ల మరీనా యాంకినా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అపార్ట్మెంట్లో 16వ అంతస్తులో ఉన్న తన నివాసం కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రమాదవశాత్తూ పడిపోయారా, ఆత్మహత్య చేసుకున్నారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. 160 అడుగుల ఎత్తు నుంచి కిండ పడిపోవడంతో ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయారు. రక్తపు మడుగులో ఉన్న మరీనాను ఆ మార్గం నుంచి వెళుతున్న వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌పై జరిపే యుద్ధంలో నిధుల సేకరణలో మరీనా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి.. లైంగిక దాడికి పాల్పడి హత్య?
సాక్షి, బెంగళూరు: పీయూసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన లింగసూగురులో చోటు చేసుకుంది. అయితే తన కుమార్తెపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింగసూగూరు తాలూకా గోనవాట్ల తండాకు చెందిన యువతి లింగసూగూరులోని ప్రైవేటు పీయూసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. ఏం జరిగిందో ఏమో కాని తన గదిలో శుక్రవారం ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా తన కుమార్తెను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధించేవాడని, ఈక్రమంలోనే శుక్రవారం లైంగిక దాడికి పాల్పడి ఓణితోనే ఉరివేసి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మంజునాథ తెలిపారు. చదవండి: ‘హాయ్ అమ్మా, నాన్న.. ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను.. క్షమించండి!’ -
నర్సు అనుమానాస్పద మృతి.. ఆసుపత్రిలో ఏం జరిగింది?
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నగరంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. నగర శివారులోని టమాట మండీ వద్ద ఉన్న బీజేపీ కొట్టాలలో నివాసముంటున్న సునీత, కేశప్ప దంపతుల కుమార్తె పద్మ(23).. కిమ్స్ సవీరా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. సోమవారం రాత్రి విధులకు హాజరైన ఆమె మంగళవారం వేకువ జాము 2.22 గంటలకు ఎమర్జెన్సీ గదిలోని ఓ బెడ్‌పై నిద్రించింది. తెల్లవారుజాము 4.45 గంటలకు ఆమెను నిద్రలేపేందుకు తోటి ఉద్యోగి వెళ్లింది. ఆ సమయంలో అచేతనంగా పడి ఉన్న పద్మను గమనించి.. విషయాన్ని వెంటనే ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన వైద్యులు.. పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే తమ బిడ్డ మృతి చెందిందంటే నమ్మశక్యంగా లేదని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు సాకే హరి, తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకుని పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మృతికి కారకులెవరో తెలపాలంటూ ఆస్పత్రి వర్గాలను డిమాండ్ చేశారు. చదవండి: భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి రెండు రోజుల క్రితం చిన్నారికి వైద్యం అందించే అంశంపై పద్మను యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేసిందని, తప్పు లేకపోయినా లిఖిత పూర్వకంగా సంజాయిషీ తీసుకున్నారని మండిపడ్డారు. మరుసటి రోజు కూడా ఆమెను డైరెక్టర్ల సమావేశానికి రప్పించుకుని రాత్రి 9 గంటల వరకూ నిల్చోబెట్టి అవమానించారని మండిపడ్డారు. పద్మ మృతిపై లోతైన దర్యాప్తు చేపట్టి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
పెద్దలకు తెలియజేయడమే శాపమైందో ఏమో! ఆ ప్రేమ జంట..
సాక్షి, గంగావతి రూరల్: ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన శనివారం కొప్పళ జిల్లా కుక్కనూరు తాలూకా బలిగేరి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాష్ (20) కుక్కనూరు ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన సుమ సుమ (17) కుక్కనూరులో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ గ్రామం నుంచి ఆటో, బస్సుల్లో కుక్కనూరుకు వెళ్లివచ్చే క్రమంలో వీరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వీరిద్దరివి వేర్వేరు కులాలు. తమ ప్రేమను కుటుంబ పెద్దలకు తెలియజేయగా చదువుకునే వయస్సులో ప్రేమ ఏంటని మందలించారు. వీరి ప్రేమ వ్యవహారంపై గ్రామస్తులు కూడా తప్పు బట్టారు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో కాని శనివారం సుమ ఇంట్లో ప్రేమికులిద్దరూ రక్తపుమడుగులో విగతజీవులుగా కనిపించారు. కుక్కనూరు పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. గొంతుల వద్ద గాట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను కుక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కొత్త బట్టలు కొని వస్తుండగా ఘోరం) -
నందిగామలో విషాదం.. విమానం ఎక్కాల్సిన యువకుడు అనుమానాస్పద మృతి!
నందిగామ/వత్సవాయి: మరికొద్ది సేపట్లో ఉన్నత విద్య కోసం లండన్ బయలుదేరి వెళ్లవలసిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం నందిగామ శివారు హనుమంతుపాలెంకు చెందిన గాడిపర్తి వెంకటనారాయణ కొంతకాలంగా నందిగామ పట్టణంలో నివాసం ఉంటున్నారు. వెంకటనారాయణ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్నాడు. రెండవ కుమారుడు గాడిపర్తి శివకృష్ణ (24) గత ఏడాది బీటెక్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం బుధవారం తెల్లవారుజామున లండన్ బయలుదేరేందుకు హైదరాబాదు వెళ్లవలసి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో తన మిత్రులను కలిసి వస్తానని చెప్పి శివకృష్ణ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. బయటికి వెళ్లిన శివకృష్ణ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీనికి తోడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనతో మిత్రులను ఆరా తీశారు. అయినా ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నవాబుపేట సమీపంలోని పొలాల్లో చెట్టుకి ఉరివేసుకొని ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో అటుగా వచ్చిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే తమ కుమారుడి కోసం వెతుకుతున్న వెంకటనారాయణ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి మృతుడు శివకృష్ణగా గుర్తించారు. దీంతో వత్సవాయి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు లండన్ వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాల్సిన శివకృష్ణ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో బయలుదేరవలసిన తమ కుమారుడు ఎందుకు మృతి చెందాడో కూడా కుటుంబ సభ్యులకు అర్థం కాక తలలు బాదుకుంటున్నారు. ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల పరామర్శ శివకృష్ణ మృతదేహానికి బుధవారం నందిగామ పట్టణంలో పంచనామా నిర్వహించారు. శివకృష్ణ మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఉన్నత చదువులకు లండన్ వెళ్లవలసిన శివకృష్ణ మృతి చెందడం బాధాకరమన్నారు. -
పంట చేనుకు కాపలా వెళ్లిన యువతి.. చివరికి ఊహించని ఘటన..
పెంచికల్పేట్(సిర్పూర్)కొమరంభీం జిల్లా: మండలంలోని కమ్మర్గాం గ్రామానికి చెందిన దుర్గం దస్రుబాయి(22) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సదరు యువతి శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని పంట చేనుకు కాపలా వెళ్లింది. మధ్యాహ్నం వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా పంటచేనులో మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై విజయ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్(టి) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. యువతి తల్లి శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. మృతిపై అనుమానాలు దస్రుబాయి మృతి పట్ల తల్లి శకుంతల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంట చేనుకు కాపలా వెళ్లిన తన కూతురును హత్య చేసి నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. భూతగాదాల నేపథ్యంలో హత్య చేశారని నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: విజయవాడలో స్పా మాటున హైటెక్ వ్యభిచారం.. -
గుణదల మహిళది హత్యే?.. వివాహేతర సంబంధంతో.. పదేపదే..
సాక్షి, పెనమలూరు: కానూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళది హత్యేనని తేలింది.ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని చెబుతున్నారు. కానూరులో గురువారం రాత్రి గుణదలకు చెందిన ముమ్మిడివరపు గౌరమ్మ (50) కానూరు శివారు పంచాయతీరాజ్ ఎంప్లాయిస్ కాలనీలో నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఆమె గుణదల నుంచి వచ్చి ఇక్కడ ఎలా చనిపోయిందనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి ఫోన్‌కాల్ డేటాను పరిశీలించగా ఆమె యనమలకుదురుకు చెందిన జయరావు అనే వ్యక్తితో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా జయరావు ఆచూకీని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. గుణదలకు చెందిన మృతురాలు గౌరమ్మ, ప్రసాదంపాడు బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యనమలకుదురు నివాసి జయరావుకు గత కొద్ది కాలంగా పరిచయం ఉంది. జయరావుకు వివాహం అయింది. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే గౌరమ్మ తరచుగా జయరావుకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టసాగింది. దీంతో గురువారం మద్యం తాగిన జయరావు బైక్‌పై గౌరమ్మను కానూరు శివారుకు తీసుకు వచ్చాడు. అక్కడ వీరి మధ్య వివాదం ఏర్పడటంతో ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తరువాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. పోస్టుమార్టంలో ఊపిరాడక పోవటంతోనే గౌరమ్మ చనిపోయిందని తేలడంతో కేసు విచారణ వేగవంతం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పై విషయాలు నిందితుడు వెల్లడించాడని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
షాకింగ్ ఘటన.. పారిపోయిన అల్లుడు.. అసలేం జరిగింది?
బాన్సువాడ రూరల్(కామారెడ్డి జిల్లా): నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండాలో గురువారం మాలోత్ సోని (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు.. చందూర్ మండలం కారేగాం తండాకు చెందిన రమావత్ చంద్రుకు నలుగురు కూతుర్లు. చిన్న కుతూరు సోనికి అంకోల్‌తండాకు చెందిన మాలోత్ రాంచందర్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. రాంచందర్ భార్యతో కలిసి మహబూబ్‌నగర్ వెళ్లాడు. అక్కడ రాంచందర్ భార్యను అనుమానిస్తూ వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు కులపెద్దలు పంచాయతీ పెట్టిన రాంచందర్ తీరు మార్చుకోలేదు. దీంతో భర్త వేధింపులు భరించలేక ఇటీవల సోని కారేగాం తండాలోని తల్లిగారింటికి వచ్చింది. భార్యను కొట్టనని, మంచిగా చూసుకుంటానని రాంచందర్ వచ్చి చెప్పడంతో ఈ నెల 17న అంకోల్ సోనీని తల్లిదండ్రులు అంకోల్ తండాకు పంపించారు. చదవండి: పెళ్లి కుమార్తె రవళి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కాగా గురువారం తన కూతురు చనిపోయినట్లు సమాచారం రావడంతో వెళ్లి చూడగా అల్లుడు పారిపోయాడని చంద్రూ చెప్పారు. రాంచందర్ తన కూతురు మనికట్టు వద్ద కోసి తాడుతో ఉరివేసి చంపేసినట్లు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని మృతి.. కాలేజీలో టాబ్లెట్ వేసుకుని..అంతలోనే
వత్సవాయి(జగ్గయ్యపేట) ఎన్టీఆర్ జిల్లా: అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మరణించిన సంఘటన బుధవారం వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో జరిగింది. విద్యారి్థని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన జి.రాముడు తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె జి.భార్గవి(19), కుమారుడు ఉన్నారు. భార్గవి నందిగామలోని ఒక ప్రయివేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. రోజూ మాదిరిగానే కళాశాలకు వెళ్లిన భార్గవి తనకు ఒంట్లో నలతగా ఉందని కళాశాలలో టాబ్లెట్ వేసుకుంది. మధ్యలోనే ఇంటికి బయలుదేరిన భార్గవి బస్సులో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దాహం వేయడంతో పక్కనే ఉన్న ప్రయాణికుల దగ్గర ఉన్న మంచినీరు అడిగి తాగింది. ఇంటికి వచ్చాక కడుపులో మంటగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో వారు మరో టాబ్లెట్ తెచ్చి వేశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో భార్గవిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మార్గంమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రాములు ఫిర్యాదు మేరకు ఎస్ఐ అభిమన్యు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అనుమానాస్పద స్థితిలో భార్య.. నిద్రమాత్రలు మింగి భర్త.. -
అనుమానాస్పద స్థితిలో భార్య.. నిద్రమాత్రలు మింగి భర్త..
సాక్షి, యానాం: పట్టణ పరిధిలోని మెట్టకూరు గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక సాయికాలనీలో నివాసం ఉంటున్న వివాహిత దంగేటి లక్ష్మీభవాని(20) బుధవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఆమె భర్త, ఆర్ఎంపీ వైద్యం చేసే దంగటి వరప్రసాద్ నిద్రమాత్రలు మింగడంతో అతను స్థానిక జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. యానాం మెట్టకూరు సాయికాలనీకి చెందిన దంగేటి వరప్రసాద్‌కు గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన లక్ష్మీభవానికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారై ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. మృతదేహాన్ని యానాం జీజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బడుగు కనకారావు తెలిపారు. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు వరప్రసాద్ తండ్రి సూర్యనారాయణ, తల్లి బేబీలే తన కుమారై లక్ష్మీభవాని మృతికి కారకులని మృతురాలి తల్లి అరుణ బుధవారం విలేకరుల వద్ద ఆరోపించింది. తన కుమారైను ముందుగా చంపేసి తరువాత ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని, ఆర్ఎంపీ వైద్యుడిగా ఉన్న వరప్రసాద్ స్లీపింగ్ టాబ్లెలెట్స్ మింగినట్లు నటిస్తున్నాడని ఆరోపించింది. అనుమానిస్తూ రోజూ తనను కొడుతున్నారని లక్ష్మీభవాని ఫోన్లో చెప్పేదని అయితే సర్దుబాటు చేసుకుంటారని భావించామని చెప్పింది. గొడవలపై పెద్దల సమక్షంలో ఇటీవల అంగీకారం కుదరడంతో మూడు నెలల క్రితమే గోకవరం మండలం కొత్తపల్లి నుంచి కాపురానికి తన కుమారై యానాం వచ్చిందని అంతలోనే ఘోరం జరిగిందన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. -
కొత్త పెళ్లి కొడుకు షాకింగ్ ట్విస్ట్.. బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి..
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): వివాహ సందడి ఇంకా ముగియలేదు. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఇంకా వారి ఇళ్లకు చేరుకోలేదు. అంతలోనే ఆ ఇంట పెనువిషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో గాని వివాహం జరిగి మూడు రోజులు గడవకుండానే పెళ్లి కొడుకు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన రాజవొమ్మంగి మండలం బోర్నగూడెంలో సోమవారం జరిగింది. జడ్డంగి ఎస్ఐ షరీఫ్ అందజేసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలెం నాగభూషణం (30) అదే గ్రామంలో ఇంటికి కొంత దూరంలో ఏటిగట్టుపై ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. గ్రామస్తులు కొంత మంది చూసి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. ఈనెల 17న మండలంలోని సింగంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పెద్దల నిశ్చయం ప్రకారం ఓ ఆలయంలో నాగభూషణం వివాహం చేసుకున్నాడు. సోమవారం బహిర్భూమికి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి ఎదురుగా ఉన్న కాలువవైపు వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చదవండి: వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు పెళ్లి కుమారుడు పెద్ద తండ్రి దాసరి ఏసుబాబు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమారా్టనికి అడ్డతీగల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని స్థానిక సీఐ రవికుమార్ సందర్శించి, ఆరా తీశారు. వీఆర్వో నాగేశ్వరరావు తదితరుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. -
మ్యాచ్ కవర్ చేస్తూ కుప్పకూలాడు.. మృతిపై అనుమానాలు!
దోహా: అమెరికన్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్(48).. గుర్తున్నారా?.. ఫుట్‌బాల్ స్టేడియం వద్ద రెయిన్ బో కలర్ దుస్తులు ధరించి.. ఖతార్ పోలీసుల ఆగ్రహానికి గురైన వ్యక్తి. ఎల్జీబీటీక్యూ హక్కులకు మద్ధతుగా ఆయన ఈ పని చేశాడు. అయితే.. ఆయన శుక్రవారం మ్యాచ్ సమయంలో హఠాత్తుగా కుప్పకూలి మరణించారు. శుక్రవారం లుసాయిల్ స్టేడియంలో అర్జెంటీనా-నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను కవర్ చేస్తూ ఆయన హఠాత్తుగా కుప్పకూలాడు. పక్కనే ఉన్న జర్నలిస్టులు ఆయన్ని సీపీఆర్ కాపాడే యత్నం చేశారు. కానీ, అది ఫలించలేదు. అయితే.. ఆయన మరణం పట్ల సోదరుడిగా చెప్పుకుంటున్న ఎరిక్ వాల్ అనే వ్యక్తి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. గ్రాంట్ మరణంలో.. ఖతార్ ప్రభుత్వ ప్రమేయం ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేశాడాయన. నా పేరు ఎరిక్ వాల్. వాషింగ్టన్ సియాటెల్‌లో జీవిస్తున్నా. గ్రాంట్ వాహ్ల్ సోదరుడిని నేను. నా కారణంగానే నా సోదరుడు రెయిన్బో రంగు షర్ట్‌తో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఆయన చాలా ఆరోగ్యవంతుడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. చావు బెదిరింపులు వచ్చాయని ఆయన నాతో చెప్పాడు. చాలా ఆరోగ్యంగ ఉన్న ఆయన మరణించాడంటే నమ్మబుద్ధ ఇకావడం లేదు. ఆయన్ని చంపేసి ఉంటారు. సాయం కోసం అర్థిస్తున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన సోదరుడు ఒక వీడియో పోస్ట్ చేశాడు. అయితే ఇన్స్టాగ్రామ్ ఎందుకనో ఆ వీడియోపై ఆంక్షలు విధించింది. Free to read: What happened when Qatar World Cup security detained me for 25 minutes for wearing a t-shirt supporting LGBTQ rights, forcibly took my phone and angrily demanded that I remove my t-shirt to enter the stadium. (I refused.) Story: https://t.co/JKpXXETDkH pic.twitter.com/HEjr0xzxU5 — Subscribe to GrantWahl.com (@GrantWahl) November 21, 2022 ఇదిలా ఉంటే.. ఫిఫా వరల్డ్ కప్ ఆరంభంలో గ్రాంట్ వాల్‌ను సెక్యూరిటీ సిబ్బంది అల్ రయాన్లోని అహ్మద్ బిన్ అలీ స్టేడియం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు కూడా. సుమారు 25 నిమిషాల తర్వాత తానెవరో తెలుసుకుని.. ఆపై వాళ్లు తనకు క్షమాపణలు చెప్పి.. లోనికి అనుమతించారని తెలియజేశారు. ఇదిలా ఉంటే.. వాల్ భార్య గౌండర్ మాత్రం ఆయన హఠాన్మరణంపై అనుమానాలు వ్యక్తం చేయలేదు. కేవలం తన భర్త మరణంపై దిగ్భ్రాంతికి గురయ్యానంటూ ఆమె ట్విటర్ ద్వారా ఓ పోస్ట్ చేశారు. I am so thankful for the support of my husband @GrantWahl's soccer family & of so many friends who've reached out tonight. I'm in complete shock. https://t.co/OB3IzOxGlE — Céline Gounder, MD, ScM, FIDSA 🇺🇦 (@celinegounder) December 10, 2022 వాల్.. ప్రిన్స్టన్ నుంచి 1996లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అప్పటి నుంచి 2021 దాకా స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా రాణించారు. సాకర్, బాస్కెట్ బాల్ కవరేజీలకు ఆయన ప్రత్యేక గుర్తింపు దక్కింది. 2012 నుంచి ఏడేళ్ల పాటు ఆయన ఫాక్స్ స్పోర్ట్స్‌లో పనిచ చేశారు. ఆపై ఆయన తన సొంత వెబ్‌సైట్‌ను లాంఛ్ చేశారు. -
‘అమ్మానాన్న సారీ.. అందుకే వెళ్లిపోతున్నా..’
తాటిచెట్లపాలెం/కూర్మన్నపాలెం(విశాఖపట్నం): నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న చట్టి పవన్‌కుమార్(20) అనుమానాస్పదంగా మృతి చెందాడు. మర్రిపాలెం రైల్వేస్టేషన్‌కు సమీపంలో పట్టాల పక్కన అతని మృతదేహం లభ్యమైంది. గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివీ.. వడ్లపూడి నిర్వాసితకాలనీ అప్పికొండ ప్రాంతానికి చెందిన చట్టి రామునాయుడు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అతని చిన్న కుమారుడు పవన్‌ను కళాశాలకు పంపించేందుకు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కూర్మన్నపాలెం బస్టాండ్‌లో దించాడు. మధ్యాహ్నం సమయంలో కుమారుడికి తండ్రి ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. కాగా.. మంగళవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ మర్రిపాలెం సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించి.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జీఆర్పీ సీఐ కోటేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఎస్ఐ కామేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పవన్ మృతదేహాంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఉన్నత చదువులు చదివి.. గొప్పస్థాయికి ఎదుగుతాడన్న కుమారుడు ఇక రాడనే వార్త ఆ తల్లిదండ్రులను కలచి వేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. కాగా.. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు తల్లిదండ్రులకు పవన్ మేసేజ్ పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ‘అమ్మానాన్న సారీ.. నా వల్ల మీకెప్పుడైనా బాధలు తప్పవు.. అందుకే వెళ్లిపోతున్నా..’అంటూ అందులో పేర్కొన్నాడు. అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ కామేష్ తెలిపారు. చదవండి: క్లాస్మేట్ అని జాబ్ ఇప్పించి.. లవ్యూ అంటూ సహజీవనం.. తర్వాత.. -
నిశ్చితార్థమైన యువకునితో బయటకెళ్లి.. ఇద్దరూ విషం తాగి..
సాక్షి, బెంగళూరు: నిశ్చితార్థమైన యువకునితో వెళ్లిన బాలిక అనుమానాస్పదరీతిలో చనిపోగా, యువకుడు కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన హాసన్ జిల్లా అరకలగూడు తాలూకా కోణనూరు హొబళిలో జరిగింది. కొడ్లూరు గ్రామానికి చెందిన దినేశ్‌కు కోణనూరుకు చెందిన 16 ఏళ్ల బాలికతో నిశ్చితార్థం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు రామనాథపురలో జరిగిన షష్ఠి జాతరకు బైకుపై దినేశ్‌తో కలిసి వెళ్లింది. సాయంత్రం 4 గంటలకు మీ కూతురు విషం తాగిందంటూ దినేశ్ కుటుంబసభ్యులు ఫోన్ చేసి, హాసన్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. దినేశ్ కూడా విషం తాగినట్లు గుర్తించారు. ఇతడు చికిత్స పొందుతున్నాడు. కూతురి మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశు సంక్షేమ సమితి కూడా ఎస్పీకి ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కామాంధునికి 20 ఏళ్ల జైలు శిక్ష బాలునిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఉత్తరకన్నడ జిల్లా కారవార జిల్లా సత్ర న్యాయస్థానం మంగళవారం 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానాను విధించింది. కారవార వన్నహళ్లికి చెందిన అన్సారి ఖాసిం జింగ్రో ఈ ఏడాది మార్చి 15న ఆరేళ్ల బాలునికి చాక్లెట్ ఇప్పిస్తానని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. చదవండి: (పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాలీవుడ్ బ్యూటీ) -
భర్త వివాహేతర సంబంధం.. వివాహిత అనుమానాస్పద మృతి
సాక్షి, యశవంతపుర: బెంగళూరు సుద్ధగుంటెపాళ్య పరిధిలోని గురప్పనపాళ్యలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు... కతీజా కుబ్రా (29), మహబూబ్ షరీఫ్ దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే అత్తింటి వారు తమ కూతుర్ని వేధించేవారని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కతీజా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొట్టి ఉరి వేసినట్లు అనుమానం వ్యక్తం కావడంతో భర్త మహబూబ్ షరీఫ్, అతడి చెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మహబూబ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. తమ కుమార్తె మృతికి అత్తింటి వారే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (షూటింగ్ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..) -
అది హత్యా.. ఆత్మహత్యా!.. 4 నెలల క్రితం బాలిక అనుమానాస్పద మృతి
సాక్షి, నల్గొండ: పన్నెండేళ్ల బాలిక ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.. ఆత్మహత్యేమో అని భావించిన తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ గ్రామంలోని కొందరి వ్యవహారశైలిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో బాలిక మృతదేహాన్ని తవ్వి తీసి పోస్టుమార్టం చేయించారు. ఇదంతా జరిగి నాలుగు నెలలైంది. ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. పైగా ఇటీవల సదరు బాలిక సమాధి తవ్వేసి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంతకాలమైనా పోలీసులు ఏమీ తేల్చడం లేదని, నిందితులను విచారించలేదని బాలిక తల్లిదండ్రులు శుక్రవారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. నాలుగు నెలల కింద ఘటన పెర్కకొండారం గ్రామానికి చెందిన పెరుమాండ్ల రమేశ్–పుషష్పలతల కుమార్తె మెర్సి(12). స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదివే ఆమె.. ఈ ఏడాది జూలై 13న ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. మెర్సి నోట్‌బుక్‌లో సుసైడ్ నోట్ రాసి పెట్టి ఉంది. ఆమెది ఆత్మహత్యగా భావించిన తల్లిదండ్రులు, బంధువులు అదేరోజు రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియల సమయంలో గ్రామానికి చెందిన కట్ట పద్మారావు, పెరుమాండ్ల కృష్ణ, పెరుమాండ్ల ప్రభాకర్‌లు ఆ ఇంటికి వచ్చి.. నోట్‌బుక్‌లో రాసి ఉన్న సుసైడ్ నోట్‌ను చించివేశారు. మెర్సి మృతి చెందిన మూడో రోజు ఆమె సమాధి వద్ద తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. దీనితో తల్లిదండ్రులకు అనుమానం వచ్చిన, పద్మారావు, కృష్ణ, ప్రభాకర్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూతగాదాల నేపథ్యంలో వారే తమ కుమార్తెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అందుకే తప్పుడు సుసైడ్‌నోట్‌ను వారే రాసి, తర్వాత చించివేశారని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరో రోజున సమాధి నుంచి మెర్సి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఆ తర్వాత కేసు ముందుకు కదలలేదు. సమాధి తవ్వేసి ఉండటంతో..: మెర్సి తల్లిదండ్రులు కుమార్తెకు నివాళులు అర్పించేందుకు గత నెల 28న సమాధి వద్దకు వెళ్లారు. కానీ అప్పటికే సమాధి తవ్వి పైకప్పు రాయి దూరంగా పడవేసి ఉంది. తల్లిదండ్రులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు కేసు విచారణ చేపట్టలేదని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని వివరించారు. దీనితో ఎస్పీ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేస్తున్నాం మెర్సి మృతిపై తల్లిదండ్రుల ఫిర్యా దు ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం. కేసును పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అవాస్తవం. మెర్సి పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దాని ఆధారంగా విచారణ జరుగుతోంది. మెర్సి సమాధిని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేసిన విషయం వాస్తవమే. ఈ ఘటనపైనా దర్యాప్తు చేపట్టాం. కానీ సమాధిలో మృతదేహం ఉందో, లేదో మేం చూడలేదు. సీఐ రాఘవరావు, శాలిగౌరారం -
ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అనుమానాస్పద మృతి.. హత్యకేసుగా..
సాక్షి, బెంగళూరు(బనశంకరి): హొన్నాళి ఎమ్మెల్యే రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్ (24) అనుమానాస్పద మృతికి సంబంధించి హొన్నాళి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. తుంగా కాలువలో బయటపడిన కారులో వెనుకసీట్లో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. దీంతో హొన్నాళి పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. కుందూరులో చంద్రశేఖర్ అంత్యక్రియలు దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా కుందూరు గ్రామంలోని రేణుకాచార్య తల్లిదండ్రులు సమాధుల వద్ద శుక్రవారం చంద్రశేఖర్ అంత్యక్రియలను వీరశైవ లింగాయత్ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిలో గురువారం అర్థరాత్రి శవపరీక్షలు నిర్వహించారు. ఎఫ్ఎస్ఎల్కు నివేదిక పంపించారు. అంతిమ దర్శనం కోసం తరలివచ్చిన ప్రజలు హొన్నాళి పట్టణంలోని రేణుకాచార్య ఇంట్లో చంద్రశేఖర్ అంతిమ దర్శనం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్ప, కుమారుడు కేఎస్.కాంతేశ్, పార్టీ నేతలు కార్యకర్తలు అంతిమ దర్శనం చేసుకున్నారు. చదవండి: (తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే) స్పీడోమీటర్‌లో 100 కిలోమీటర్ల వేగం నమోదు చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైన ఘటన స్థలాన్ని శుక్రవారం ఏడీజీపీ అలోక్ కుమార్ పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. అక్టోబరు 30 తేదీ రాత్రి 11.58 నిమిషాలకు న్యామతి వద్ద చంద్రశేఖర్ కారు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు రికార్డయింది. అదేరోజు రాత్రి 12.06 నిమిషాలకు చంద్రశేఖర్ మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. మృతదేహం లభించిన స్థలానికి న్యామతికి 10 కిలోమీటర్లు దూరం ఉంది. కాల్ హిస్టరీ, సీడీఆర్‌తో పాటు అన్నింటిని తనికీ చేసి వీటితో డయాటైమ్ టెస్ట్‌సైతం చేశామని తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తరువాత విషయాలు వెల్లడవుతాయన్నారు. దావణగెరె ఎస్పీ రిష్యంత్ నేతృత్వంలో దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. మాజీ సీఎం యడియూరప్ప నివాళి హొన్నాళి ఎమ్మెల్యే రేణుకాచార్య నివాసానికి శుక్రవారం మాజీ సీఎం యడియూరప్ప వచ్చి చంద్రశేఖర్ పార్థివదేహాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో యడియూరప్ప మాట్లాడారు. చంద్రశేఖర్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని రేణుకాచార్య చెప్పినట్లు నిజమైంది. సీఎం బొమ్మై, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర చొరవతో దర్యాప్తు వేగంగా సాగుతోందన్నారు. -
రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్.. అంతలోనే షాకింగ్ ఘటన.. అసలు ఏం జరిగింది?
కుప్పం(చిత్తూరు జిల్లా): పట్టణంలో గురువారం రాత్రి వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. ఆజాద్ రోడ్డులో ఉంటున్న రోహిత్‌కుమార్, భువనేశ్వరి రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలు అంగీకరించడంతో రోహిత్‌కుమార్ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. గురువారం రాత్రి భువనేశ్వరి ఇంట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది. తమ కుమార్తెను రోహిత్ కుటుంబ సభ్యులే కడతేర్చారని భువనేశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి మృతురాలి తండ్రి శరవణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య -
డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. అసలు ఏం జరిగింది?
బి.కోడూరు/ సిద్దవటం(వైఎస్సార్ జిల్లా): మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థిని శవమై తేలింది. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బద్వేలు నియోజకవర్గం బి.కోడూరు మండలంలోని మరాటిపల్లె గ్రామానికి చెందిన అల్లంపాటి అనూష (20) బద్వేలులోని శ్రీ చైతన్య కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండేది. ఈమె మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు బి.కోడూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. బి.కోడూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలంలోని జంగాపల్లె గ్రామం పెన్నా నది ఒడ్డున ఆదివారం మృతదేహం లభ్యమైంది. చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం మృతి చెందడానికి గల కారణాలపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో పెన్నా నదిలోనే పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబీకులకు అప్పజెప్పారు. బి.కోడూరు మండలం మరాటిపల్లె గ్రామానికి చెందిన అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకుమార్తె అనూష. కుటుంబానికి ఆసరాగా ఉంటుందని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని.. కూలీ పనులు చేస్తూ చదివించే వారు. తిరిగి వస్తుందని రేయింబవళ్లు పోలీసుస్టేషన్ల వద్ద పరిసరాల ప్రాంతాల్లో ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. దీంతో వారు గుండెలవిసేలా రోదించారు. బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. మృతిరాలి తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నిఖిల్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా?
సూర్యాపేట క్రైం/చిలుకూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన చిలుకూరు మండలం ఆర్లెగూడెం గ్రామ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, అడ్వకేట్ ధరావత్ భాస్కర్ కుమారుడు నిఖిల్(24) హైదరాబాద్‌లో ఉంటూ ఇటీవల ఎల్ఎల్బీ పూర్తిచేశాడు. దసరా సెలవులకు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వచ్చాడు. నిఖిల్ ఈ నెల 9వ తేదీన సాయంత్రం తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అదే రోజు రాత్రి 11గంటల సమయంలో ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఫోన్ చేసి చాలా సమయం అవుతున్నా ఇంటికి చేరుకోలేదు. దీంతో నిఖిల్ తల్లి అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆ రోజు నుంచి తమ కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు వెతుకుతున్నారు. కాగా మంగళవారం ఉదయం ఆర్కే మేజర్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకుని వస్తుండగా రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెలుసుకున్న నిఖిల్ తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని చనిపోయింది తమ కుమారుడేనని నిర్ధారణ చేసుకున్నారు. ప్రేమ వ్యవహారంతోనే తన కుమారుడిని హత్య చేశారని మృతుడి తండ్రి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా కోదాడ రూరల్ సీఐ నాగదుర్గాప్రసాద్ తెలిపారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనట్లు పేర్కొన్నారు. ముమ్మరంగా పోలీసుల విచారణ.. నిఖిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిఖిల్ శరీరంపై తీవ్రంగా గాయాలుండడంతో మృతికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిఖిల్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమంటూ అతని తల్లితండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండుళ్లుగా సూర్యాపేటకి చెందిన ఒక వ్యాపారి కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా సమాచారం. అయితే కులాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు నిఖిల్ అక్క తెలిపారు. దీనిపై అమ్మాయి తండ్రిని పోలీసులు విచారించి పంపినట్లు సమాచారం. దీనితో పాటు గతంలో అదే అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి నిఖిల్‌తో అమ్మాయి సన్నిహితంగా ఉండడంతో అతనే హత్య చేసినట్లుగా అమ్మాయి తల్లితండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీనితో పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని సీఐ రాజశేఖర్ తెలిపారు. -
జైళ్ల ఉన్నతాధికారి హత్య.. ఇంట్లో పనిచేసే వ్యక్తి పరార్
జమ్ముకశ్మీర్ జైళ్ల ఉన్నతాధికారి హేమంత్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన ఇంట్లో శమమై కన్పించారు. నిందితుడు ఆయనను ఊపిరాడకుండా చేసి, ఆ తర్వాత పగిలిన గ్లాస్ సీసా ముక్కతో గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు శవానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. అయితే హేమంత్ లోహియా హత్య జరిగిన వెంటనే ఆయన ఇంట్లో పనిచేసే యాసిర్ పరార్ అయ్యాడు. హత్య జరిగిన కాసేపటికే ఇంట్లో నుంచి పారిపోతున్నట్లు సీసీటీవీలో రికార్డులో అయింది. పోలీసులు రంగంలోకి దిగి గంటల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లోహియా ఇంట్లో యాసిర్ ఆరు నెలలుగా పని చేస్తున్నాడని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. అతనికి ఆవేశం ఎక్కువని, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోందని చెప్పారు. యాసిర్‌ను విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన లోహియా(57) జమ్ముకశ్మీర్ జైళ్ల డీజీగా పనిచేస్తున్నారు. జమ్ము పరిసరాల్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆయన హత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. చదవండి: మోదీజీ వారిపై చర్యలు తీసుకోండి.. లేఖ రాసి సాధువు ఆత్మహత్యాయత్నం! -
అనుమానాస్పద స్థితిలో సర్పంచ్ భార్య మృతి
సాక్షి, నిజామాబాద్(మాచారెడ్డి): మండలంలోని లక్ష్మిరావులపల్లి గ్రామ సర్పంచ్ ఎర్రొల్ల నవీన్‌కుమార్ భార్య రవళి (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం సాయంత్రం ఆమె పురుగుల మందు తాగినట్లు గుర్తించి భర్త నవీన్‌కుమార్, కుటుంబ సభ్యు లు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నిర్మల్ జిల్లా దేగాం గ్రామానికి చెందిన రవళిని మూడేళ్ల కిందట నవీన్‌కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో ముగ్గురు సోదరీమణులు కట్నకానుకలు ఇచ్చి పెళ్లి నిర్వహించారు. పెళ్లి అయిన కొన్ని రోజుల నుంచే అదనపు కట్నం కోసం భర్త వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త నవీన్, కుటుంబ సభ్యులు ప్రవీణ్, నరేశ్, సిందుజలు రవళిని బలవంతంగా కారులో తీసుకెళ్లి హత్య చేశారని వారు పేర్కొన్నారు. నోట్లో క్రిమిసంహారక మందు పోసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. బాధ్యులైన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రవళి కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. కాగా మృతురాలికి ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు. చదవండి: (ప్రియుడితో ఏకాంతంగా ఉండగా వీడియో.. లైంగిక వాంఛ..) -
అమరావతి పాదయాత్రలో వ్యక్తి అనుమానాస్పద మృతి
అవనిగడ్డ: అమరావతి పాదయాత్రలో భోజనాల కేటరింగ్‌కు వచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్ధితిలో మరణించాడు. బుధవారం కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది. విజయవాడకు చెందిన కేటరింగ్ మేస్త్రి కింద పలు ప్రాంతాల నుంచి 35 మంది పాదయాత్రలో భోజనాలు వడ్డించడానికి వచ్చారు. కృష్ణా జిల్లా మాజేరులో బుధవారం భోజనాల అనంతరం సాయంత్రం 5.30 గంటల సమయంలో కొంతమంది కేటరింగ్ సిబ్బందిని వాహనాల్లో మచిలీపట్నం తరలించారు. మిగిలిన వారికి మరో వాహనం వస్తుందని చెప్పారు. ఈలోగా కొంతమంది మాజేరు నుంచి నడచుకుంటూ మచిలీపట్నం వైపు వెళుతున్నారు. 216 జాతీయ రహదారిపై ఘంటసాల మండలం లంకపల్లి వద్ద గూడూరుకు చెందిన కె.చెన్నారావు కుప్పకూలి రోడ్డు పక్కన పడిపోయాడు. పక్కనే ఉన్న వారు ఫిట్స్ వచ్చి పడిపోయాడనుకుని చేతిలో తాళాలు పెట్టి 108 వాహనానికి సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న 108 వాహనం టెక్నీషియన్ అతన్ని పరీక్షించి, అప్పటికే మరణించినట్టు చెప్పారు. మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే వారు రాకపోవడంతో మృతదేహాన్ని అవనిగడ్డలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాక్షి టీవీ విలేకరిని బెదిరించిన జేఏలీ లీగల్ అడ్వైజర్ వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న జర్నలిస్టులు ఘటన ప్రాంతానికి చేరుకుని వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇంతలో మచిలీపట్నం వైపు నుంచి 6677 నంబర్ వాహనంలో వచ్చిన పాదయాత్ర జేఏసీ లీగల్ అడ్వైజర్ జమ్మల అనిల్‌కుమార్ ‘సాక్షి’ టీవీ విలేకరి సుబ్రహ్మణ్యేశ్వరరావుతో వీడియోలు డిలీట్ చేయాలంటూ దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు విలేకరి నిరాకరించడంతో ఆగ్రహించిన అనిల్‌కుమార్ ‘అయితే నేను చేయాల్సింది చేస్తాను. నీ వ్యవహారం చూస్తాను’ అని బెదిరిస్తూ విలేకరిని వీడియో, ఫోటోలు తీసుకుని వెళ్ళారు. ఈ విషయమై చల్లపల్లి సీఐ రవికుమార్‌ని వివరణ కోరగా ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, వెంటనే అనిల్కుమార్ని పిలిపించి మందలించినట్టు చెప్పారు. -
వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తే చంపేశాడా?
బనగానపల్లె(నంద్యాల జిల్లా): అందరి ఆడ పిల్లల్లాగే ఓ అమ్మాయి ఎన్నో ఆశలతో అత్తారింట అడుగుపెట్టింది. కొన్నాళ్లకే ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామల వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వేధింపులు మరింత అధికమయ్యాయి. మగ పిల్లవాన్ని కనలేదని పుట్టింటికి తరిమేశారు. పెద్దలు పంచాయితీ చేసి భర్త వద్దకు పంపగా శనివారం విగతజీవిగా మారింది. కడుపు నొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు బుకాయిస్తుండగా.. తమ కూతురిని తాడుతో గొంతు బిగించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదవండి: వేరే మహిళలతో భర్త వివాహేతర సంబంధం.. భార్య షాకింగ్ నిర్ణయం పట్టణంలోని ఎరుకలిపేటకు చెందిన విష్ణుప్రియ(26) శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు.. వైఎస్సార్ జిల్లా కేంద్రంలోని అల్మాస్పేటకు చెందిన సుధాకర్, బిజ్జమ్మ దంపతుల కూతురు విష్ణుప్రియను బనగానపల్లె పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు, దేవి కుమారుడు విజయ్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో 10 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు నాలుగేళ్ల గీత, రెండేళ్ల దక్షత ఉన్నారు. అయితే పెళ్లైన రెండు నెలలకే అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామ వేధింపులు ప్రారంభించారు. దీంతో మరో నాలుగు తులాల బంగారం ఇచ్చి పెద్ద మనుషుల వద్ద పంచాయితీ చేసి కూతురిని మరోసారి అత్తారింటికి పంపారు. అయితే ఇద్దరు ఆడపిల్లలు కావడంతో మగ పిల్లవాని కోసం మరో వివాహం చేసుకుంటానని భర్త విజయ్ భార్యను వేధించేవాడు. ఇదే విషయమై శనివారం ఉదయం భార్య, భర్త గొడవ పడ్డారు. కాసేపటికే విష్ణుప్రియ విగతజీవిగా మారింది. గొంతుకు తాడుతో బిగించి చంపారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిందని భర్త చెబుతున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అంత్యక్రియలకు సిద్ధం.. అంతలోనే అనుమానాస్పదం..!
జగదేవ్‌పూర్(గజ్వేల్)/సిద్ధిపేట జిల్లా: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందింది. నల్లగొండ జిల్లా వెంకటాపూర్‌కు చెందిన పావని అలియాస్ కాత్యాయినికి, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడపకు చెందిన నాగరాజుతో రెండేండ్ల క్రితం పెళ్లి అయింది. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో ఉన్నట్టుండి అలజడిరేగింది. చదవండి: మస్కట్‌లో ఏం జరిగింది..? మహిళ సెల్ఫీ వీడియో కలకలం.. ఏమైందో తెలియదు కానీ, మంగళవారం రాత్రి పావని జ్వరంతో చనిపోయిందని నాగరాజు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. కూతురు మరణించిందనే బాధతో ఆమె పుట్టింటివారు, బంధువులు హుటాహుటిన మునిగడపకు చేరుకున్నారు. పావని రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోందని, ఉన్నట్టుండి చనిపోయిందని నాగరాజు చెప్పడంతో అందరూ అదే నిజమనుకున్నారు. అయితే పావని అంత్యక్రియలకు బుధవారం ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఆమెకు స్నానం చేయిస్తుండగా ఒంటిపై గాయాలు గమనించారు. వెంటనే పావని తల్లి పూర్తిగా పరిశీలించగా.. పావని శరీరం మొత్తం గాయాలతో హూనమైపోయింది. ఆగ్రహంతో నాగరాజును నిలదీయగా.. వెంటనే కుటుంబసభ్యులతో సహా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పావని కుటుంబసభ్యులు సమాచారమివ్వడంతో.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కూతురును కొట్టి చంపి.. జ్వరంతో చనిపోయిందని అంటున్నారని వాపోయారు. తమ కూతురు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. నిజమేంటో తేల్చాలని కోరుతున్నారు. పావని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మృతదేహాన్ని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
Hyderabad: షేక్‌పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
-
షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో గతంలో సుజాత ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. ఆమెను అరెస్ట్ చేశారు. ఏసీబీ దాడుల అనంతరం ఏడాది క్రితమే సుజాత భర్త ఆత్మహత్య పాల్పడ్డాడు. అప్పటి నుంచి తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాతకు మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం ఇచ్చినా ఆమె తిరస్కరించారు. క్రమంలోనే డిప్రెషన్లోకి వెళ్లిన సుజాత.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజాగాకు ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. సుజాత మృతిని ధృవీకరించిన వైద్యులు మాజీ ఎమ్మార్వో సుజాత మృతిని వైద్యులు ధృవీకరించారు. గత వారం క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తీసుకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు సుజాతకు క్యాన్సర్ కూడా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అదే సమయంలో డెంగీ కూడా సోకడంతో వైద్యులు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అయితే చికిత్స కొనసాగుతూ ఉండగానే ఈ ఉదయం గుండెపోటుతో సుజాత మృతి చెందినట్లు తెలిపారు. సుజాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చిక్కడ పల్లికి తరలించారు. చదవండి: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి -
సూసైడ్ కాదు.. పుతిన్ హత్య చేయించాడు?
మాస్కో/లండన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాలో గత కొన్ని నెలలుగా హైప్రొఫైల్ ప్రముఖులు అనుమానాస్పద రీతిలో చనిపోతుండడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. అయితే ఈ మరణాలపై రష్యా మీడియా గప్‌చుప్‌గా ఉంటున్నా.. పాశ్చాత్య మీడియా సంస్థలు మాత్రం పుతిన్ ప్రమేయంతోనే జరుగుతున్న హత్యలంటూ చర్చిస్తున్నాయి. తాజాగా.. రష్యాలో అతిపెద్ద రెండో చమురు సమస్థ లుకోలి అధినేత రవిల్ మగనోవ్.. అనుమానాస్పద రీతిలో చనిపోయారు. 67 ఏళ్ల రవిల్.. గురువారం మాస్కోలోని ఓ ఆస్పత్రి కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి మీడియా చెబుతోంది. అయితే.. ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నట్లు ఆయన అప్పట్లో ఒక ప్రకటన ఇచ్చారు. అంతేకాదు.. ఉక్రెయిన్ విషయంలో రష్యా దారుణంగా వ్యవహరిస్తోందని, వెనక్కి తగ్గాలంటూ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక పెనువిషాదంగా అభివర్ణించిన ఆయన.. వీలైనంత త్వరలో ముగింపు పడుతుందని ఆశిస్తున్నట్లు వరుసగా ప్రకటనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ పుతిన్ చేయించిన హత్యేనని ఆరోపిస్తున్నారు. ఇక ఆయన భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సరైన ఆధారాలు చూపించలేకపోతున్నారని సన్నిహితులు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అంతేకాదు.. ఆయనతో దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తులు సైతం ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్తున్నారు. మే నెలలో లుకోలీ మాజీ మేనేజర్ అలెగ్జాండర్ సుబ్బోటిన్ తన ఇంటి బేస్మెంట్లో మృతదేహంగా కనిపించారు. రష్యా ఎనర్జీ పరిశ్రమతో సంబంధాలున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం గత కొన్నినెలలుగా అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు. 1993 నుంచి లుకోలిలో ఆయన పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రష్యా దర్యాప్తు విభాగాలు మాత్రం విరామం లేకుండా కంపెనీ కోసం పని చేసి ఆయన ఆరోగ్యం దెబ్బతిందని.. ఆ బాధలోనే డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించాయి. మరోవైపు లుకోలి లో పని చేసే వేల మంది ఉద్యోగులు గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన కన్నుమూసినట్లు కంపెనీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: రూ. 437 కోట్లకు ముంచేసిన యూట్యూబ్ స్టార్ -
భారత స్టార్ రెజ్లర్ భర్త అనుమానాస్పద మృతి
Commonwealth Games 2022 Bronze Medallist Pooja Sihags Husband Dies: బర్మింగ్‌హామ్ వేదికగా ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా రెజర్ల్ పూజా సిహాగ్ ఇంట్లో విషాదం నెలకొంది. నిన్న (ఆగస్ట్ 27) రాత్రి సిహాగ్ భర్త అజయ్ నందల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హర్యానాలోని రోహ్తక్ నగర పరిసర ప్రాంతంలో నందల్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. నందల్ మృతదేహం లభించిన ప్రాంతంలో అతని స్నేహితుడు రవి, మరో వ్యక్తిని అచేతనావస్థ స్థితిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా, అజయ్ నందల్ ఆకస్మిక మరణంపై అతని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. అజయ్‌కు అతని స్నేహితుడు రవి డ్రగ్స్ అలవాటు చేశాడని, డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే అజయ్ మృతి చెంది ఉంటాడని ఆరోపించాడు. అజయ్ తండ్రి ఆరోపణలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని వెల్లడించారు. స్వతహాగా రెజ్లర్ అయిన అజయ్ నందల్.. క్రీడల కోటాలో ఇటీవలే ఆర్మీ ఆఫీసర్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అజయ్ నందల్ భార్య, భారత స్టార్ మహిళా రెజ్లర్ పూజా సిహాగ్.. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో 76 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. చదవండి: డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ -
మరణానికి ముందు సోనాలి ఫోగట్‌కు డ్రగ్స్! .. సంచలన విషయాలు వెల్లడి
బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సోనాలి ఫోగట్ ఆగస్టు 23న గోవాలో హఠాన్మరణ చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుతో మరణించినట్లు భావించగా.. తరువాత సోనాలిది హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలతో గోవా పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. తాజాగా ఆమె డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్ నెలకొంది. సోనాలికి పార్టీలో డ్రగ్స్ ఇచ్చినట్లు తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గోవా ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ శుక్రవారం మీడియాకు సంచలన విషయాలు వెల్లడించారు. సోనాలి ఫోగట్ మరణానికి ముందు అంజునాలో జరిగిన పార్టీలో ఆమెకు తన ఇద్దరు సహచరులు మత్తుమందు ఇచ్చినట్లు తేలిందన్నారు. అసహ్యకరమైన రసాయన పదార్ధాలను కలిపిన డ్రింక్‌ను ఆమెతో బలవంతంగా తాగించారని పేర్కొన్నారు. చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై గాయాలు.. హత్య కేసు నమోదు డ్రింక్ తాగిన తర్వాత ఆమె తనపై తాను కంట్రోల్ తప్పిందని తెలిపారు. సోనాలి నియంత్రణ కోల్పోవడంతో ఉదయం 4.30 నిమిషాలకు తనను టాయిలెట్లకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే తరువాత రెండు గంటలపాటు ఏం చేశారనే దానిపై వివరణ లేదన్నారు. నిందితులిద్దరూ ఆమె హత్యకు సంబంధించిన కేసులో ఇప్పుడు ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ ఆగస్టు 22న ఫోగట్‌తో కలిసి గోవాకు వెళ్లారని, అంజునాలోని కర్లీస్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసినట్లు, త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఇక డ్రగ్స్ ప్రభావంతోనే సోనాలి మృతి చెందినట్లు తెలుస్తుందన్నారు. చదవండి: సోనాల్ ఫోగట్ మృతిలో మరో ట్విస్ట్.. నైట్ క్లబ్ వీడియో వైరల్ -
Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పదంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అలకాపూర్ టౌన్షిప్ శివబాలాజీ అపార్ట్మెంట్లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా, గన్నవరం ప్రాంతానికి చెందిన భార్గవ్‌రెడ్డి(31) పుప్పాలగూడ, అలకాపూర్ టౌన్షిప్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని గ్రామానికే చెందిన సాయిసందీప్, జస్వంత్ అతనితో పాటే అదే ఫ్లాట్‌లో ఉంటున్నారు. 10 రోజుల క్రితం సందీప్, జస్వంత్ స్వ గ్రామానికి వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చిన సాయిసందీప్ డోర్ కొట్టినా, ఫోన్ చేసినా భార్గవ్ రెడ్డి స్పందించకపోవడంతో అనుమానం వచ్చి వాచ్‌మెన్‌ను పిలిచాడు. అతను కిచెన్ చిమ్నీ ద్వారా లోపలికి వెళ్లి చూడగా భార్గవ్‌రెడ్డి నేలపై మృతి చెంది పడి ఉన్నాడు. అతను ఆఫీసు నుంచి చివరి ఫోన్‌కాల్ అందుకున్నట్లు ఉందని, ఎలా చనిపోయాడనే విషయం తెలియరాలేదని పేర్కొన్నారు. సాయి సందీప్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా భార్గవ్‌రెడ్డి ఐదు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చనని భావిస్తున్నారు. చదవండి: (హాస్టళ్లపై పోలీసుల ఫోకస్.. ఈ పది నిబంధనలు పాటించాల్సిందే) -
భరించలేని తలనొప్పి, వాంతులు, నోట్లో నుంచి నురుగ వచ్చి
సాక్షి, హైదరాబాద్: ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్న ఓ యువతి తలనొప్పి భరించలేక మరణించిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్‌కోఠి ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి సమాచారం మేరకు... నిజామాబాద్ జిల్లా పెద్దభీంగల్ గ్రామానికి చెందిన కొత్తపల్లి అనూష(22) నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చింది. అబిడ్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్యాషీయర్‌గా పనిచేస్తూ కింగ్‌కోఠి షేర్‌గేట్ దగ్గర ఉన్న సింధూజ హాస్టల్లో నివాసం ఉంటోంది. సోమవారం తన స్నేహితురాలితో కలసి డ్యూటీకి వెళ్లింది. అప్పటికే తలనొప్పి, వికారంగా ఉండటంతో ఆఫీస్‌కు వెళ్లిన గంటకు వాంతు చేసుకుంది. వెంటనే తాను పనిచేయలేనని మేనేజర్ పర్మిషన్ తీసుకుని హాస్టల్‌కు వచ్చింది. కొద్దిసేపటికే తలనొప్పి ఎక్కువ కాడంతో పక్క రూమ్ మేట్ ఒకామే జండూబామ్ రాసి తలకు మసాజ్ చేసింది. అయినా సాయంత్రం 4 గంటల సమయంలో తీవ్ర తలనొప్పి, ఒళ్లంతా చెమటలు పట్టి, కనుగుడ్లు తేలేస్తుండటంతో.. ఆందోళన చెందిన స్నేహితులు అనూషను ఆసుపత్రికి తీసికెళుతున్న క్రమంలో మరోసారి వాంతి చేసుకుంది. ఆటోలో ఎక్కించాక నోటి నుంచి నురగ వచ్చి అపస్మారక స్థితికి చేరుకుంది. సమీపంలోని కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసికెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: అనుమానమే పెనుభూతమై.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య -
బాలిక అనుమానాస్పద మృతితో... రణరంగమైన స్కూలు
సాక్షి, చెన్నై: ప్రైవేటు విద్యా సంస్థలో ఓ బాలిక అనుమానాస్పద మృతి తమిళనాట తీవ్ర ఉద్రిక్తతకు, ఆస్తుల విధ్వంసానికి దారి తీసింది. కాళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్లో శ్రీమతి (17) అనే బాలిక ప్లస్–2 చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజులుగా కుటుంబీకులు, బంధువులు అక్కడే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఆదివారం గుర్తు తెలియని యువకులు వందలాదిగా చొరబడి విధ్వంసానికి దిగారు. దాంతో డీఐజీ పాండియన్‌తో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. మంత్రులు, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి వచ్చి వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు! -
Maharashtra Family Death: ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి
-
మహారాష్ట్ర: ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి
-
మహారాష్ట్రలో విషాదం.. ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ముంబైకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్ గ్రామంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఇంట్లోనే విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ముగ్గురి మృతదేహాలు ఒకచోట, ఆరుగురి మృతదేహాలు వేర్వేరు చోట్ల లభ్యమయ్యాయని సాంగ్లీ ఎస్పీ దీక్షిత్ గెడమ్ తెలిపారు. అయితే పోస్టుమార్టం అనంతరం 9 మంది మరణానికి సంబంధించికచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. చదవండి: సాంకేతిక లోపం.. కేబుల్ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు -
తనకెవ్వరూ సాటిరారని నిరూపించాడు.. దానిని తట్టుకోలేకే చంపేశారా?
నగరి: తక్కువ ధరకే వివాహాలు, శుభకార్యాలకు ఆర్డర్లు పట్టేశాడు. వ్యాపారంలో తనకు సాటిరారని నిరూపించాడు. ఇదే ఇతని ప్రాణాలమీదికి తెచ్చినట్టు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈనెల 9వ తేదీన అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం.. నగరి మునిసిపల్ పరిధి, కొత్తపేటకు చెందిన విజయ్ (22) స్థానికంగా లక్ష్మీ డెకరేటర్స్, ఈవెంట్స్ పేరిట పూల దుకాణం నడుపుతున్నాడు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు పుష్పాలంకరణ చేస్తుంటాడు. ఈ నెల 9వ తేదీన పలు వివాహ వేడుకలకు పుష్పాలంకరణ చేశాడు. అనంతరం అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన తమిళనాడు వేలూరులోని ఒక లాడ్జీ నుంచి బయటకు పరుగులు తీస్తూ వచ్చిన విజయ్ విషం తాగేశానని, కాపాడాలంటూ కేకలు వేశాడు. అక్కడున్న వారు అతన్ని ఆస్పత్రికి చేర్చగా నాలుగురోజుల పాటు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఇతని మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేలూరు పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నాప్ చేసి విషం తాగించారా? విజయ్ తక్కువ ధరకే పూలడెకరేషన్స్ చేస్తుంటాడు. ఈ విషయమై తమిళనాడుకు చెందిన కొందరు వ్యాపారులతో వివాదాలు కూడా జరిగినట్టు సమాచారం. ఇదే ఇతని మృతికి పరోక్షంగా కారణమైనట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతుడు అవివాహితుడు, కాగా ఈ నెల 20వ తేదీన అతనికి పుట్టిన రోజు అని, అంతలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం) -
తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు
సాక్షి, అమరావతి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వైఎస్ వివేకా అల్లుడు, కుమార్తె తనను వేధిస్తున్నారని, వారి నుంచి ప్రాణభయం కూడా ఉందని పోలీసులను, న్యాయస్థానాన్ని వేడుకున్న కల్లూరి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడంటే ఎవరి మీద సందేహం కలగాలి? ఆయన అంతకుముందు ఫిర్యాదులో పేర్కొన్న వారిపైనే కదా? టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. చదవండి: ఈ పాపం బాబుది కాదా? రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దీన్ని సాధనంగా వాడుకునే కుట్రకు బరి తెగించాయి. గంగాధరరెడ్డి గురువారం అనంతపురం జిల్లా యాడికిలో అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే తనకు ప్రాణభయం పొంచి ఉందని, తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ బెదిరింపులు వచ్చాయని గతంలో గంగాధరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి కుట్రకు గంగాధరే అడ్డంకి.. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే కుట్రలను సమర్థంగా అడ్డుకుంది గంగాధర్‌రెడ్డి అని పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. 2019లో చంద్రబాబు సర్కారు, అనంతరం సీబీఐ అధికారులు, వివేకా కుమార్తె, అల్లుడు ఎంత వేధించినా గంగాధరరెడ్డి ఒప్పుకోకపోవడంతో వారి ఎత్తుగడలు ఫలించలేదు. అతడు జీవించి ఉండటం వారికి ప్రతికూలంగా పరిణమించే అంశం అన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో గంగాధర్‌రెడ్డి అనుమానస్పద మృతి వెనుక వారి పాత్ర ఉండొచ్చన్న వాదనకు బలం చేకూరుతోంది. ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు టీడీపీ అధికారంలో ఉండగా 2019 ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. అందులో భాగంగానే నాడు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ సాగింది. సిట్ బృందంలో సభ్యుడిగా ఉన్న సీఐ శ్రీరామ్ విచారణ పేరిట గంగాధర్‌రెడ్డిని వేధించారు. వివేకా హత్యకు వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు ఒప్పుకోవాలని గంగాధరరెడ్డిని వేధించారు. చిత్రహింసలకు గురి చేసినా ఆ ప్రయత్నం ఫలించలేదు. రాంసింగ్ వేధింపులు అనంతరం సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా అదే కుట్ర కొనసాగడం గమనార్హం. సీబీఐ అధికారి రాంసింగ్ 2021 అక్టోబరు 3, 4వ తేదీల్లో గంగాధర్‌రెడ్డికి వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్లు చెప్పాలని ఒత్తిడి చేశారు. సీబీఐ అధికారులు అనంతపురం జిల్లా యాడికిలో ఉన్న గంగాధర్‌రెడ్డి నివాసానికి వెళ్లి అదే రీతిలో ఒత్తిడి తెచ్చారు. విచారణ పేరిట 2021 అక్టోబరు 4న కడప తీసుకొచ్చారు. వివేకా ఇంట్లో దొంగతనానికి వెళ్లినప్పుడు ఆయన నిద్రలేవడంతో హత్య చేసినట్లు అంగీకరించాలని శివశంకర్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారని, అలా చెబితే రూ.10 కోట్లు ఇస్తామన్నారని వాంగ్మూలం ఇవ్వాలని రాంసింగ్ ఒత్తిడి చేశారు. సీబీఐ అధికారులే ఓ వాంగ్మూలం రాసుకొచ్చి దానిపై సంతకం చేయాలని, న్యాయస్థానంలో అదే విషయం చెప్పాలని వేధించారు. కానీ తనకు తెలియని విషయాలను తెలిసినట్లు చెప్పనని గంగాధర్‌రెడ్డి స్పష్టం చేశాడు. ఆ విషయంపై సీబీఐ అధికారులతో ఘర్షణకు పడ్డారు. తాము అనుకున్నట్లు గంగాధర్‌రెడ్డి సాక్ష్యం ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సైతం నివేదించడం గమనార్హం. వివేకా కుమార్తె, అల్లుడి బెదిరింపులు.. మరోవైపు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కూడా గంగాధర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సమీప బంధువులైన నర్రెడ్డి జగదీశ్వరరెడ్డి, భువనాల బాబురెడ్డి యాడికి వెళ్లి గంగాధర్‌రెడ్డిని కలిశారు. సీబీఐ అధికారులు చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలే వైఎస్ వివేకాను హత్య చేయించినట్లు చెబితే రూ.10 లక్షలు ఇవ్వడంతోపాటు కిడ్నీ చికిత్సకు వైద్య ఖర్చులు కూడా భరిస్తామన్నారు. రూ.15 వేలు అడ్వాన్సు కూడా ఇచ్చారు. వారి బెదిరింపులు భరించలేక గంగాధర్‌రెడ్డి 2021 నవంబరు 25న పులివెందుల రింగ్ రోడ్డు వద్ద వైఎస్ సునీతను కలిశారు. సీబీఐ అధికారులు సూచించినట్లుగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఆమె చెప్పారు. అయితే అందుకు గంగాధర్‌రెడ్డి తిరస్కరించాడు. పోలీసులకు ఫిర్యాదు... కోర్టులో కేసు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేందుకు గంగాధర్‌రెడ్డి తిరస్కరించడంతో ఆయనకు బెదిరింపులు తీవ్రమయ్యాయి. నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, భువనాల బాబురెడ్డితోపాటు గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి పలు బెదిరింపు కాల్స్ రావడంతో అనంతపురం పోలీసులకు 2021 నవంబరు 29న ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని కోరాడు. అప్పటికీ బెదిరింపు కాల్స్ ఆగకపోవడంతో తాడిపత్రి న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, భువనాల బాబురెడ్డిల నుంచి తనకు ప్రాణ హాని ఉందని... సీబీఐ అధికారులు వేధిస్తున్నారని... గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఆ కేసు విచారణలో ఉండగానే గంగాధరరెడ్డి తీవ్ర అనారోగ్యం బారిన పడి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో వెల్లడిస్తూ గంగాధరరెడ్డి పోలీసులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారో అనుమానాస్పద మృతి వెనుక కూడా వారి ప్రమేయం ఉందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తమ కుట్రకు అడ్డంకి అనే తప్పించారా? వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకు గంగాధర్‌రెడ్డి సహకరించకపోవడం ‘కొందరికి’ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేందుకు గంగాధర్‌రెడ్డి సమ్మతించకపోవడంతో వారి కుట్ర ముందుకు సాగలేదు. దీంతో గంగాధర్‌రెడ్డిని అడ్డు తప్పించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెదిరింపులకు లొంగకుండా, తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుండా గంగాధరరెడ్డి నిలబడటం కచ్చితంగా వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు అనుకూల అంశం. కాబట్టి వారు గంగాధర్‌రెడ్డి క్షేమాన్ని కోరుకుంటారు. తమ కుట్రకు గంగాధరరెడ్డి సహకరించ లేదని భావిస్తున్న వారే అతడిని అడ్డు తొలగించా లని ప్రయత్నిస్తారు. దీన్నిబట్టి గంగాధర్‌రెడ్డి తనకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసిన నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, బాబురెడ్డి పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారు వివేకా కుమార్తె, ఆమె భర్తకు సమీప బంధువులు కావడం గమనార్హం. బాబు.. బెంబేలు శవ రాజకీయాలపై పేటెంట్ హక్కులున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. గంగాధర్‌రెడ్డి అనుమానస్పద మృతిపై ఆయన స్పందన మరిన్ని సందేహాలకు తావిస్తోంది. టీడీపీ సర్కారు హయాంలో వేధింపులపై ఫిర్యాదు చేసిన గంగాధర్‌రెడ్డి మృతి చెందడంతో ఆందోళనకు గురైన చంద్రబాబు, లోకేశ్ దీనికి రాజకీయ రంగు పులిమేందుకు అవాస్తవ ఆరోపణలతో ఎదురుదాడికి దిగారు. గంగాధర్‌రెడ్డి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు దర్యాప్తు కోరితే తమ బండారం బట్టబయలవుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏం జరిగిందో.. స్నేహితుడి గదికి వెళ్లి.. తెల్లారే సరికి..
గుత్తి(అనంతపురం జిల్లా): స్నేహితుడి గదిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్ఎస్ పాత పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో నివాసముంటున్న షేక్ బాషా (23) శుక్రవారం రాత్రి సుందరయ్య కాలనీలోని స్నేహితుడు సురేష్ గదికి వెళ్లాడు. తెల్లారే సరికి అతను మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న సీఐ శ్యామారావు, ఎస్ఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్ -
భర్తకు దూరంగా భార్య.. అనుమానాస్పద మృతి.. మరిదే కారణమంటూ..
చిత్తూరు అర్బన్: నగరంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. టూ టౌన్ సీఐ యతేంద్ర కథనం మేరకు, నగరానికి చెందిన జగదీశ్వరి (42) కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. తమ కుమార్తె మృతికి ఆమె మరిది శ్రీహరే కారణమంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ యతేంద్ర కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా.. -
పది రోజులకు ఒకసారి ప్రసాద్ ఇంటికి.. అనుమానాస్పద స్థితిలో..
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత హత్యకు గురైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రసాద్(35) ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్‌లో గత ఆరు నెలలుగా ఓ గదిని అద్దెకు తీసుకుని ఒక్కడే ఉంటున్నాడు. పలు చోట్ల కుక్‌గా పనిచేసే ప్రసాద్ ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి వస్తుండేవాడు. కాగా శిరీష అనే మహిళ ప్రతి పది రోజులకు ఒకసారి ప్రసాద్ ఉంటున్న గదికి వచ్చి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ప్రసాద్ తాను ఉంటున్న గదికి పక్కనే ఉండే వారికి సోమవారం కాల్ చేసి తన గదిలో శిరీష చనిపోయిందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో అతడి గది వద్దకు వెళ్లగా తీవ్ర దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం లభించింది. చుట్టు పక్కల పరిశీలించగా గోడపై రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో ఆమె తలను గోడకు కొట్టడంతో మృతి చెంది ఉండవచ్చని, రెండు, మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి) ప్రసాద్ గదిలో లభ్యమైన మహిళ ఫొటో.. పోలీసులు నిందితుడిగా భావిస్తున్న ప్రసాద్ ఉంటున్న గదిలో తనిఖీలు చేపట్టగా మృతురాలి శిరీష ఫొటో లభ్యమైంది. ఓ ప్రణాళిక ప్రకారమే ఆమె ఫొటో ఉంచి ఉంటాడని పోలీసులు తెలుపుతున్నారు. కాగా శిరీషను కొందరు ప్రసాద్ భార్య అని చెబుతుండగా, మరికొందరు భార్య అయితే పది రోజులకోసారి ఎందుకు వస్తుందని పేర్కొంటున్నారు. అయితే ప్రసాద్‌తో సదరు మహిళకు ఉన్న సంబంధంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఆమె ఎక్కడ ఉంటుందన్న విషయాలు సైతం ఎవరికి తెలియవని పోలీసులు పేర్కొంటున్నారు. అసలు ఎందుకు హత్య చేసి ఉంటాడు? హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
మిస్టరీగా వందన మృతి.. సందీప్ ఇంట్లో ఏం జరిగింది..?
శ్రీకాళహస్తి: అనుమానాస్పద స్థితిలో యువతి మృతిచెందిన ఘటన శ్రీకాళహస్తిలో బుధవారం చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ భాస్కర్‌నాయక్ కథనం మేరకు.. శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలుకు చెందిన వందన (20) తొట్టంబేడు మండలం పొయ్యగ్రామంలో మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్‌గా పనిచేస్తోంది. పట్టణంలోని కుమ్మరివీధికి చెందిన పులి సందీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు బావమరదళ్లు కావడంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వందన బుధవారం ఉద్యోగానికి వెళ్లే ముందు సందీప్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో కానీ కాసేపటికి హాల్లో సందీప్ నిద్రిస్తుండగా బాత్రూమ్లో వందన ఉరివేసుకుని మృతి చెందింది. భయాందోళనకు గురైన సందీప్ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విషయం చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భాస్కర్‌నాయక్, ఎస్ఐ మహేష్ మృతదేహాన్ని పరిశీలించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎవరికీ చెప్పకుండా యువతి ఎందుకు సందీప్ ఇంటికి వెళ్లింది? వాళింట్లో ఏం జరిగిందో మిస్టరీగా మారింది. దీనిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీఐ భాస్కర్‌నాయక్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం బంధువులకు అప్పగించారు. చదవండి: (ఆరేళ్లక్రితం వివాహం.. భర్తే అత్తమామలకు ఫోన్‌చేసి) -
ఆరేళ్లక్రితం వివాహం.. భర్తే అత్తమామలకు ఫోన్‌చేసి
సాక్షి, పలమనేరు: వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం గంగవరం మండలంలోని మబ్బువారిపేటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు, గ్రామానికి చెందిన శివతో పలమనేరు మండలం గుండ్లపల్లికి చెందిన రేఖకు ఆరేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శివ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవడేవాడు. దీనికితోడు వరకట్న వేధింపులు మొదలైనట్లు బాధితురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం వారి ఇంటిలోని హాలులో రేఖ(23) ఉయ్యాలకొక్కీకి ఉరేసుకొని మృతి చెందింది. భర్తే అత్తమామలకు ఫోన్‌చేసి రేఖ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అయితే ఆత్మహత్య చేసుకున్న తీరు అనుమానించేలా ఉండడంతో మృతురాలి కుటుంబీకులు అతడిపైనే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితున్ని గంగవరం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా రేఖది హత్యా లేక ఆత్మహత్య అనే విషయం తెలుస్తుందని గంగవరం ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. చదవండి: (3 Burnt Alive: హాసిని అంటే చాలా ప్రేమ.. డాడీ లేడన్న విషయం ఎలా చెప్పాలో) -
అజయ్‌తో ప్రేమ.. ఐదు నెలల క్రితమే పెళ్లి.. సడెన్‌గా
సాక్షి, వరంగల్: దుగ్గొండి మండలంలోని అడవిరంగాపురం గ్రామానికి చెందిన వివాహిత సూర అఖిల(20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అఖిల, అదే గ్రామానికి చెందిన అజయ్‌ని ప్రేమించింది. ఐదు నెలల క్రితం ఇంట్లోంచి వెళ్లి పోయి వివాహం చేసుకుంది. ఇటీవల అఖిల అనారోగ్యానికి గురైందని అజయ్ ఆమెను ఎంజీఎంలో చేర్పించాడు. చికిత్స పొందుతున్న అఖిల మంగళవారం మృతి చెందింది. అయితే కూతురు అలా అకస్మాత్తుగా చనిపోవడంపై వివాహిత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అఖిలను అజయ్, అత్తామామలు వేధించి చంపి ఉంటారని ఆమె తండ్రి దయాసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. చదవండి: ఒకరితో పెళ్లి.. ఇద్దరితో వివాహేతర సంబంధం.. వీడిన హత్యకేసు మిస్టరీ -
హైదరాబాద్‌లో వైద్యుడి అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంత్రుల నివాసాల ఎదురుగా హోటల్లో ఆరో అంతస్తు నుంచి నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ గుంత కింద పడి వైద్యుడు మరణించారు. కూతురు పెళ్లి సంబంధం గురించి మాట్లాడటం కోసం ఇండోర్ నుంచి వచ్చిన డాక్టర్ పంకజ్‌కుమార్ జైన్ అనే వైద్యుడి కుటుంబం.. మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌లో హోటల్లో దిగింది. చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం.. ఆరో అంతస్తు మీద నుంచి లిఫ్ట్ గుంతలో నుంచి కింద పడిన పంకజ్ జైన్.. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెంది ఉంటారని ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోకాపేటలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి.. ఆ టైమ్‌లో బాయ్‌ఫ్రెండ్
సాక్షి, రంగారెడ్డి: స్పాలో పనిచేస్తున్న అస్సాంకు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మిజోరం రాష్ట్రానికి చెందిన రోసీ (23) తన స్నేహితురాలు లాల్వెన్‌తో కలిసి నెల రోజుల క్రితం కోకాపేటలోని ఐఎస్ఏ స్పాలో థెరపిస్టుగా చేరారు. స్పా యజమాని ఆనందరావు కోకాపేటలో వారికి ఓ గది ఇప్పించారు. అయితే రోసీ ఆదివారం గదికి రాలేదు. దీంతో స్నేహితురాలు సోమవారం స్పాకు వెళ్లి రాత్రికి వచ్చింది. రోసీ మంగళవారం ఉదయం పార్సిల్లో ఏదో తెప్పించుకొని తిన్నది. ఆ సమయంలో గదిలో ఆమెతో పాటు నాగాలాండ్‌కు చెందిన ప్రియుడు లన్సో ఉన్నాడు. పార్సిల్లో వచ్చింది తిని బాత్రూంకు వెళ్లిన రోసీ ఎంత సేపటికీ బయటకు రాకపోవటంతో లన్సో డోర్ తొలగించి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉంది. అంతేకాకుండా బాత్రూంలో ఇంజెక్షన్ సిరంజి, మాత్రలు కనిపించాయి. దీంతో లన్సో వెంటనే 108 ద్వారా సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృ వీకరించారు. మృతురాలి బంధువు బినిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: అమ్మమ్మ పాలకూర కావలంటూ.. పుస్తెలతాడుతో.. -
పాలస్తీనా భారత రాయబారి ముకుల్ హఠాన్మరణం!
పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య ఆకస్మిక మరణం చెందారు. రమల్లహ్ భవనంలో ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ముకుల్ మరణానికి గల కారణాల గురించి ఇటు భారత విదేశాంగ శాఖతో పాటు పాలస్తీనా ప్రభుత్వంగానీ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఇరు దేశాలు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆయన భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య మృతిని ధ్రువీకరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. ముకుల్ ఆర్య ప్రతిభావంతుడైన అధికారి అని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. స్నేహపూర్వక భారత ప్రభుత్వానికి, ప్రతినిధి ఆర్య కుటుంబానికి, సంతాపాన్ని ప్రకటించారు విదేశాంగ వ్యవహారాలు, వలసదారుల మంత్రి డాక్టర్ రియాద్ అల్-మాలి. Mukul Arya మృతదేహాన్ని అంత్యక్రియల కోసం భారతదేశానికి తరలించే ఏర్పాట్లను పూర్తి చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అధికారిక సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ముకుల్ మృతి పట్ల పాలస్తీనా ప్రభుత్వం విచారణ వ్యక్తం చేసింది. ఆయన మరణంపై దర్యాప్తు జరిపాలని అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని సైతం దర్యాప్తు విభాగాలను ఆదేశించారు. Deeply shocked to learn about the passing away of India’s Representative at Ramallah, Shri Mukul Arya. He was a bright and talented officer with so much before him. My heart goes out to his family and loved ones. Om Shanti. — Dr. S. Jaishankar (@DrSJaishankar) March 6, 2022 ముకుల్ నేపథ్యం.. ఢిల్లీలో పుట్టి, పెరిగిన ముకుల్ ఆర్య.. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదివాడు. 2008 ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన వారు. ఢిల్లీ విదేశాంగ విభాగాల్లోపని చేసిన ఆర్య.. యునెస్కో(పారిస్)లో శాశ్వత ప్రతినిధిగా పని చేశారు. అంతేకాదు కాబూల్, మాస్కోలోని రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వర్తించారు. -
ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..
సాక్షి, మైసూరు: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువజంట ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషాద ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా సింగర మారనహళ్లిలో జరిగింది. హుణసూరు తాలూకా బిళికెరె హోబళి సింగరమారనహళ్లి గ్రామానికి చెందిన అర్చన (18), రాకేశ్ (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను కాదని ఐదు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయి వేరోచోట పెళ్లి చేసుకున్నారు. మైసూరులో కాపురం పెట్టారు. మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదనివారి తల్లిదండ్రులు సెప్టెంబర్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అర్చన, రాకేశ్‌లు మంగళవారం రాత్రి సింగరమారనహళ్లి గ్రామానికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో బుధవారం ఉదయానికి ఊరు శివార్లలోని పొలంలో చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. బిళికెరె ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?) -
Hyderabad: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: బీటెక్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన ప్రకారం.. శేరిలింగంపల్లిలోని దూబే కాలనీ రోడ్డు నెంబర్–11లో నివాసముంటున్న ఉమారాణి, వెంకటాచారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె కుమ్మరి సౌజన్య (21) బాచుపల్లిలోని డీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చదువుతోంది. సౌజన్య గతంలో యూట్యూబ్ చానల్లో పనిచేస్తూ వీడియోలు తీస్తుండేది. అందులో పనిచేస్తున్న విజయ్‌తో సన్నిహితంగా ఉండేవారు. శుక్రవారం తల్లి ఉమారాణి మొయినాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లగా ఆ రాత్రి ఇంట్లో సౌజన్య ఉరేసుకొంది. కాగా అదే సమయంలో విజయ్ సౌజన్యకు ఫోన్ చేయగా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడికి వచ్చి ఉరి వేసుకున్నది చూసి తాడు తెంచి వేశాడు. పక్క ఇంటిలో అద్దెకు ఉంటున్న సారంగపాణికి సమాచారం అందించి పారిపోయాడు. సారంగపాణి చందానగర్ పోలీసులు, తల్లి ఉమారాణీకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అప్పటికే సౌజన్య మృతి చెంది ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విజయ్‌పై అనుమానంతో కుటుంబ సభ్యులు చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కుటుంబాన్ని కబళించిన ప్రేమ వివాహం) -
బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది?
సాక్షి, జీడిమెట్ల: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అను మానాస్పదంగా ఓ బాలిక మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది సీఐ కె.బాలరాజు, బాలిక బంధువుల వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన బచ్చన్సింగ్, పూర్ణంకౌర్ దంపతులకు ఐదుగురు పిల్లలు వీరిలో నలుగురు కుమార్తెలు కాగా ఒక్క కుమారుడు. వీరి పెద్దకుమార్తె(17) ఆరో తరగతి వరకు చదువుకుంది. అనంతరం చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుంది. బచ్చన్సింగ్ కుటుంబం నాలుగు నెలల క్రితం గాజులరామారంలో ఉండేవారు. ఇటీవలే సుభాష్‌నగర్‌కు వచ్చా రు. సోమవారం రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్న బాలిక ఒక్కతే ఇంటి నుంచి బయటకు వెళ్లింది. బయటకు వెళ్లిన అరగంట అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యు లు ఆమె ఆచూకీ కోసం చుట్టు పక్కల వెతికారు. అయినప్పటికీ ఆమె జాడ తెలియకపోవడంతో రా త్రి ఒంటి గంటకు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కిడ్నాప్ అయినట్లుగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాత్రి 2:30 గంటలకు జీడిమెట్ల పోలీసులకు పైప్‌లైన్ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ వద్ద బాలిక మృతదేహం పడి ఉందని అపార్ట్మెంట్ వాచ్మెన్ అమ్రిత్ పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీ సులు బాలిక తల్లిదండ్రులను ఘటనా స్థలికి పిలిపించి వాకబు చేయగా వారి కూతురేనని తెలిపారు. బాలిక చున్నీ అపార్ట్మెంట్ 5వ ఫ్లోర్లో లభించగా ఆమె 5వ అంతస్తు నుంచి కిందకు దూకిందెమో.. అన్నట్లుగా పోలీసులు పోలీసులు వ్య క్తం చేశారు. బాలిక తలపై లోతు గాయం అవ్వడంతో పాటు నోట్లో నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. చదవండి: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన రౌడీమూకలు పోస్టుమార్డమ్ రిపోర్టులో ఆత్మహత్యే.. బాలిక పోస్టుమార్డమ్ నివేదికలో మాత్రం హత్య చే యబడ్డ ఆనవాళ్లు లేనట్లుగా పోలీసులు తెలిపారు. బాలిక తానంతట తానే అపార్ట్‌మెంట్‌పై నుంచి దూ కిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది? సోమవారం రాత్రి బాలికను కుటుంబ సభ్యులెవ రూ బయటకు పంపకపోవడంతో బాలిక ఒక్కతే ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన నాలుగు గంటలకే శవ మై కనిపించింది. అంతే కాకుండా తన ఇంటికి దూరంగా ఉన్న అపార్ట్మెంట్ వద్దకు వచ్చినా.. చీకటిగా ఉండే 5వ అంతస్థుకు ఒక్కతే ఎలా వెళ్లగలిగింది? ఒకవేళ వెళ్లినా అపార్ట్‌మెంట్‌పైన రేలింగ్ చాలా ఎత్తులో ఉన్న ందున బాలిక అంత సులభంగా ఎలా ఎక్కగలదు? అనే సందేహాన్ని బాలిక బంధువులు వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రేమికుల దినోత్సవం రోజే ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మరో ఆరు నెలల్లో పెళ్లి చేయాలనుకున్నాం.. బాలికకు 18 సంవత్సరాలు నిండకపోవడంతో పెళ్లి చేయలేదు. మరో ఆరు నెలల్లో 18 ఏళ్లు రాగానే పెళ్లి చేయాలని అనుకున్నామని బాలిక తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. ఇంతలోనే బాలిక మృతి చెందడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో ఓ బాలిక అనుమానాస్పద మృతి చెందిండం కలకలం రేపుతోంది. సుభాష్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక సోమవారం రాత్రి ఇంట్లో నుంచి ఆదృశ్యమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా మంగళవారం తెల్లవారుజామున బాలిక మృతుహదేహం లభ్యమమైంది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రక్తపు మడుగుల్లో బాలిక మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీంతో తనిఖీలు చేపట్టారు. అనుమానితులను, భవన నిర్మాణ కార్మికులు, స్థానికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
కాటేసిన బాబాయ్.. టాటా చెబుతూ నవ్వుతూ వెళ్లిన చిన్నారి.. అంతలోనే..
కంచికచర్ల(నందిగామ)\కృష్ణా జిల్లా: అండగా ఉండాల్సిన సొంత బాబాయి చిన్నారిని కిరాతకంగా కడతేర్చాడు. ఈ దారుణ ఘటన కంచికచర్ల మండలంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన సమాచారం ప్రకారం.. కంచికచర్ల మండల పరిధిలోని కీసర గ్రామంలో ఉన్న ఖాళీ స్థలంలో గత కొద్ది రోజులుగా సంచార జాతులకు చెందిన పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. వారు నిత్యం చిత్తు కాగితాలు సేకరించటంతో పాటు సమీప గ్రామాల్లో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆ కుటుంబాల్లో పెదాల శ్రీను, వెంకటమ్మ దంపతులకు ద్రాక్షావలి (8), ఏసమ్మ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో వీరిద్దరూ తల్లిదండ్రుల సహాయకులుగా నిలుస్తున్నారు. వీరి కుటుంబంలో ఎవ్వరికి కూడా ఆధార్ కార్డులు లేవు. చదవండి: బాలికను ప్రేమించి.. ఆపై వంచించి.. ఆ తర్వాత తాళిని తెంచేసి.. ఊరికి తీసుకు వెళ్తానని చెప్పి.. మైలవరంలో నివాసముంటున్న శ్రీను తమ్ముడు, మృతురాలి బాబాయి అయిన సైదులు తన ప్లాట్ ఫాం రిక్షాపై అన్నయ్య ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు పెద్ద పాప ద్రాక్షావలిని తన ఊరికి తీసుకెళ్లతానని చెప్పి రిక్షాపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. బాలిక మృతదేహం కలకలం.. బుధవారం గ్రామ సమీపంలోని ఓ కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుడు పక్కనే ఉన్న సుబాబుల్ తోటలోకి బహిర్బూమికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ నిర్జీవంగా పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గమనించి, తోటి కార్మికుల ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న చిన్నారి చెప్పులు, గౌనుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధారాలను సేకరించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా.. టోల్ ప్లాజాలోని సీసీ కెమెరాల ద్వారా ఆధారాలను సేకరించారు. సోమవారం సాయంత్రం.4.10 గంటల సమయంలో సైదులు ద్రాక్షావలిని రిక్షాపై తీసుకెళ్తున్నట్లు రికార్డుల్లో గుర్తించారు. పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం ద్రాక్షావలిని వెంట తీసుకెళ్లి లైంగికదాడి చేయటంతో పాటు బాబాయే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మైలవరంలో నివాసముండే నిందితుడిగా భావిస్తున్న సైదులు కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఐవీ నాగేంద్రకుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ.. సమాచారం అందుకున్న నందిగామ డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి, రూరల్ సర్కిల్ సీఐ ఐవీ నాగేంద్రకుమార్, కంచికచర్ల, వీరులపాడు ఎస్ఐలు జి.జయలక్ష్మీ, సోమేశ్వరరావు, ఏఎస్ఐ రమేష్‌బాబులు పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టాటా చెబుతూ వెళ్లిన చిన్నారి.. బాబాయి వెంట ఊరికి వెళ్తున్నాను అంటూ తల్లిదండ్రులకు టాటా చెప్పి నవ్వుతూ వెళ్లిన చిన్నారి ద్రాక్షావలి హత్యకు గురవడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
అనితకు ఏమైందో ఏమో.. హాస్టల్ బాత్రూంలో..
సాక్షి, తిరుపతి(చిత్తూరు): తిరుపతి రూరల్ పరిధిలోని తాటితోపులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్ సీఐ దీపికా వివరాల మేరకు.. వీకోట సమీపంలోని ఆరుమాకులపల్లికి చెందిన వెంకటరత్నం రెడ్డి కుమార్తె అనిత( 20) డిగ్రీ పూర్తి చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ కోసం తిరుపతి రూరల్ పరిధిలోని తాటితోపుకు 2 నెలల క్రితం వచ్చింది. ఏమైందో ఏమో గాని శనివారం రాత్రి హాస్టల్ బాత్రూంలో కింద పడింది. అక్కడి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్పీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఎలా చనిపోయింది అనే విషయం విచారణలో తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్యం లేదని.. ఆరోగ్యంగా ఉండేదని తెలిపారు. -
ఏమైందో? ఏమో?.. చింతచెట్టుకు వేలాడుతూ..
గుమ్మలక్ష్మీపురం (శ్రీకాకుళం): మండలంలోని సంధిగూడ గ్రామంలో యువతి మండంగి సంధ్య (25) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెది హత్యా? ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై ఎల్విన్‌పేట సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్సై షన్ముఖరాజు బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం గొహిది గ్రామానికి చెందిన సంధ్యకు గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీ సంధిగూడ గ్రామానికి చెందిన ఆరిక లక్ష్మణ్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో సుమారు నాలుగుసార్లు లక్ష్మణ్ ఇంటికి సంధ్య వచ్చి వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో కూడా లక్ష్మణ్ ఇంటికి ఆమె రాగా వారిద్దరి మధ్య కొద్దిపాటి గొడవ జరగడంతో మనస్తాపానికి గురై లక్ష్మణ్‌కు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ పట్టుకుని స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇటీవల పలు పోస్టులకు ప్రకటనలు రావడంతో దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్లు అవసరమై సంధ్యకు ఫోన్ చేసి ఇవ్వాల్సిందిగా లక్ష్మణ్ కోరినప్పటికీ నిరాకరించింది. దీంతో గొహిది సర్పంచ్‌కు లక్ష్మణ్ ఫోన్ చేసి తన సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరాడు. ఈ మేరకు సర్పంచ్ ఆమెతో మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించాడు. చదవండి: (నాన్నా నన్ను క్షమించు... చాలా సార్లు ఇబ్బంది పెట్టాను!) ఇదిలా ఉండగా లక్ష్మణ్ జనవరి 28న పనిమీద విశాఖ జిల్లా పెందుర్తి వెళ్లిన సమయంలో సంధ్య మళ్లీ సంధిగూడ వచ్చింది. ఏం జరిగిందో ఏమో గానీ మంగళవారం రాత్రి సంధిగూడ గ్రామానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న చింతచెట్టుకు ఆమె వేలాడుతూ కనిపించింది. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి, పరిశీలించి శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
భర్త పుణెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. నవ్య అనారోగ్యంతో గుంటూరులో..
సాక్షి, గుంటూరు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన మండలంలోని నల్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమయ్య తెలిపిన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం సమీపంలోని సంఘంపల్లి గ్రామానికి చెందిన నవ్య(31), నల్లపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. రాజశేఖర్ పూనెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో నవ్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో మృతురాలి తండ్రి రఘుకు సమాచారం అందించగా ఇంటికి వచ్చిన ఆయన తన కుమార్తెను అత్త, మామ, భర్తలే కావాలని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రియుడిని కలవడానికి భర్త అడ్డు.. ఏం చేయాలా అని ఆలోచించి..) -
నాటు వైద్యుని ఇంట్లో మహిళ శవం
యలహంక (బెంగళూరు): అనారోగ్యం కారణంతో నాటుమందు వైద్యుని దగ్గరకు వెళ్లిన మహిళ శవమై తేలింది. యలహంక సమీపంలోని కటిగేనహళ్లిలో నివాసముండే సిద్దమ్మ (50) అనారోగ్యం కారణంతో చికిత్స కోసమని పక్కింటిలో నివాసముంటున్న సలీం నాటువైద్యుని ఇంటికి శుక్రవారం మధ్యాహ్నం వెల్లింది. సిద్దమ్మ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు వెతకగా, సలీం ఇంటిలో చనిపోయి పడి ఉంది. సలీం పరారీలో ఉన్నాడు. యలహంక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సలీం– సిద్దమ్మ మద్య నగదు లావాదేవీలు ఉన్నాయని తేలింది. మృతురాలి ఒంటిపైవున్న నగలు కోసం హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సలీం కోసం గాలిస్తున్నారు. చదవండి: (సహజీవనం చేస్తున్న మహిళపై.. ఇద్దర్ని హతమార్చి.. మరొకర్ని చంపబోతూ) -
జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి.. నిద్రమత్తులో..
Junior Artist Jyothi Reddy Death News: రైలు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ స్టేషన్లో మంగళవారం తెల్లవారుజామున రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి చెందిన బట్టినపాత జ్యోతి (26) హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగిగానూ ఆమె విధులు నిర్వర్తిస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన జ్యోతిరెడ్డి.. సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూరు నుంచి కాచిగూడ వస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆమె రైల్వేకోడూరులో ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరింది. రైలు మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో షాద్‌నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకొని షాద్‌నగర్ స్టేషన్లో దిగింది. చదవండి: (వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్) వెంటనే తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. అప్పటికే రైలు కదులుతుండటంతో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంపై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జ్యోతిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రి వద్ద ఆందోళన.. చాదర్‌ఘాట్: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతితో మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. షాద్‌నగర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో జ్యోతిరెడ్డి తీవ్ర గాయాల పాలైంది. చికిత్స నిమిత్తం ఆమెను మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. చదవండి: (Dhanush and Aishwaryaa Separation: ఫలించని తలైవా ప్రయత్నం) -
జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతిపై రగడ
Junior Artist Jyothi Reddy Suspicious Death: Friends Demands Justice: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి అనుమానాస్పద మృతిపై జూనియర్ ఆర్టిస్టులు, స్నేహితులు ఆందోళన చేపట్టారు. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి ఈరోజు( మంగళవారం) షాద్‌నగర్ రైలు పట్టాలపై గాయాలతో పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం స్నేహితులు ఆమెను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్యోతి రెడ్డి మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి ఎదుట జూనియర్ ఆర్టిస్టులు ధర్నా చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
హోటల్ రూంలో శవమై తేలిన ప్రముఖ కమెడియన్
ప్రముఖ అమెరికన్ కమెడియన్ బాబ్ సాగేట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ గదిలో సాగేట్ శవమై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తుంది. మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఆయన చేసిన ఓ షో గురించి సరదాగా ట్వీట్ చేయడం గమనార్హం. గత రాత్రి ఓర్లాండోలోని రిట్జ్-కార్ల్‌టన్‌లోని హోటల్లో సాయంత్రం 4గంటల తర్వాతి నుంచి సాగేట్ గదిలోంచి బయటకు రాకపోవడం, ఎలాంటి స్పందన లేకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఎలాంటి డ్రగ్స్ లేవని ద్రువీకరించారు. ప్రస్తుతం సాగేట్ మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అమెరికన్ కమెడియన్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాబ్ సాగేట్ 1956 మే 17న అమెరికాలోనే జన్మించాడు. 1887 నుండి 1995 వరకు ప్రసారమైన ABC టెలివిజన్ షో ‘ఫుల్ హౌస్’లో డానీ టాన్నర్ పాత్రతో పాపులర్ అయ్యాడు. దీని సీక్వెల్‌గానే ‘ఫుల్ హౌస్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓ పాపులర్ వెబ్‌సిరీస్ కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే. Loved tonight’s show @PV_ConcertHall in Jacksonville. Appreciative audience. Thanks again to @RealTimWilkins for opening. I had no idea I did a 2 hr set tonight. I’m happily addicted again to this shit. Check https://t.co/nqJyTiiezU for my dates in 2022. pic.twitter.com/pEgFuXxLd3 — bob saget (@bobsaget) January 9, 2022 -
హైదరాబాద్: పెళ్లైన 15 రోజులకే.. శవమై తేలిన నరేష్
సాక్షి, మేడ్చల్: సాఫ్ట్ వేర్ ఉద్యోగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కొత్త నరేష్(32) అదృశ్యమయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుండి బయటకొచ్చిన నరేశ్ ఆచూకి లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే గ్రామంలోని మంగళ కుంట చెరువు దగ్గర శనివారం నరేష్ ద్విచక్ర వాహనం, చెప్పులను కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని పోలీసలకు తెలపగా నిన్నటి నుంచి గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ.. ఈ క్రమంలో ఈ రోజు చెరువులో నుంచి నరేష్ మృతదేహన్ని గజ ఈతగాళ్ళు వెలికి తీశారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా నరేష్‌కు గత నెల 26న కోకాపేటకు చెందిన యువతితో వివాహం అయ్యింది. పెళ్లైన 15 రోజులకే నరేష్ విగత జీవిగా మారడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరేష్‌ది హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి.. -
అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు కాలువలో నిర్జీవంగా...
తోట్లవల్లూరు (పామర్రు): మండలంలోని యాకమూరులో అదృశ్యమై బాలుడి మృతదేహం పుల్లేటి కాలువలో లభ్యమైంది. గ్రామంలోని పుల్లేటికాలువ కట్టపై నివశించే శింగవరపు వెంకటరమణ, మంగ దంపతుల కుమారుడు మోహిత్‌సాయి (4) శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు స్థానిక పుల్లేటి కాలువలో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం మోహిత్‌సాయి మృతదేహం కాలువలో లభ్యమైంది. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మోహిత్‌సాయి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోహిత్‌సాయి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చదవండి: కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే.. -
వికారాబాద్ జిల్లాలో అమానుషం.. ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. టేకులపల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు చెందిన దంపతులు సుభాష్, మంజుల టేకులపల్లి గ్రామంలో కోళ్లఫారం వద్ద పని చేసేవారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు మైత్రి(2), మహేశ్వరి(15 నెలలు) ఉన్నారు. అయితే శనివారం రోజు ఉదయం పిల్లలు ఇద్దరు మృతి చెంది ఉండగా.. మంజుల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మంజులను వైద్యం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారులను తల్లిదండ్రులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతో భోజనంలో విషయం కలిసి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. -
విధి వక్రించి భర్త, తండ్రి మృతి.. చంటితో సహజీవనం.. అంతలోనే..
సాక్షి, విజయనగరం: కొమరాడ మండలంలోని చినఖేర్జిల పంచాయతీ లింగదొరవలస గ్రామానికి చెందిన మీసాల పార్వతి(29) అనూమనాస్పద స్థితిలో సోమవారం మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. కుమ్మరిగుంట పంచాయతీ కందివలస గ్రామానికి చెందిన మీసాల పోలీస్తో పార్వతికి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. అయితే ఏడాదిన్నర క్రితం మీసాల పోలీస్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పార్వతి ఆడపిల్లలను తీసుకుని కన్నవారింటికి వచ్చేసింది. విధి వక్రించి నాలుగు నెలల క్రితం ఆమె తండ్రి కూడా మృతి చెందాడు. చదవండి: (పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా..) అనంతరం ఆమె గుమడ పంచాయతీ సీతామాంబపురం గ్రామానికి చెందిన జన్ని శ్రీకాంత్(చంటి)తో సహజీవనం కొనసాగిస్తోంది. ఇద్దరూ భార్యాభర్తల్లా కొనసాగుతున్నారు. అయితే పార్వతి దగ్గర గల నగదు, బంగారు అభరణాలను తనకు ఇచ్చేయలని శ్రీకాంత్ హింసిస్తుండేవాడని, ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగిన అనంతరం ఉరివేసుకుందా? లేదా శ్రీకాంత్ ఆమెను హత్యను చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అన్న అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం) గ్రామస్తుల ఫిర్యాడు మేరకు సీఐ ఎన్‌ఎచ్‌ఏవీ విజయానంద్, ఎస్సై ప్రయోగ మూర్తి సంఘటన స్థలానికి చేరుకుని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు లేక అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు ఆనాథలు కావడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఏకే రావు ఉదంతంలో అనేక అనుమానాలు.. ఆత్మ‘హత్యా’?
సాక్షి, హైదరాబాద్: సుజనా ఫౌండేషన్ సీఈఓ, సినీ నేపథ్య గాయని హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. ఘటనాస్థలిలోని ఆధారాలు ఇది హత్య అనడానికి అనుమానాలు కలిగిస్తుండగా... కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ ఉదంతాన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు సిటీ రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.శివకుమార్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీలో నివసించే ఏకే రావు గతంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు డైరెక్టర్‌గా పని చేశారు. చదవండి: సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’ బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారికి ఫిర్యాదు మేరకు అక్కడి సుద్ధగుంటపాళ్య పోలీసుస్టేషన్లో నమోదైన కేసుతో రావుకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో నిందితులుగా ఉన్న ముగ్గురితో రావు సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ నెల 13న బెంగళూరు వెళ్లిన ఏకే రావు అక్కడి అశోక్‌నగర్ ప్రాంతంలో ఉన్న ది చాన్సరీ పెవిలియన్ హోటల్లో బస చేశారు. ఆఖరుసారిగా ఈ నెల 19న కుటుంబీకులతో మాట్లాడారు. సోమవారం రాత్రి క్యాబ్ బుక్ చేసుకున్న అతను హోటల్ నుంచి యలహంక రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ క్యాబ్ దిగిన ఆయన ఆ తర్వాత ఆదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం యలహంక రైల్వేస్టేషన్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన లోకో పైలెట్ యలహంక రైల్వేస్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. చదవండి: తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే ఆయన సిటీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. మృతదేహన్ని పరిశీలించిన పోలీసులు ఎడమ చేతి మణికట్టపై రెండు కత్తిగాట్లు, మెడకు ఎడమ వైపు మరో గాటు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహం పక్కనే ఓ కత్తి, బ్లేడ్‌తో పాటు రెండు కత్తెరలను స్వాధీనం చేసుకున్నారు. నరాలు కోసుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే ఆ మూడింటిలో ఏదో ఒకటి తీసుకుని వస్తారని, అయితే ఇన్ని రకాలైనవి ఎందుకు తెచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్స్పెక్టర్ వి.శివకుమార్ శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఏకే రావు కుమార్తె శాలినీ రావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశామన్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమికంగా ఆత్మహత్యగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన నివేదిక రెండుమూడు రోజుల్లో వస్తుంది. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. సుద్ధగుంటపాళ్య పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో నిందితులుగా ఉన్న వారితో పాటు ఫిర్యాదుదారుడినీ ప్రశ్నిస్తున్నాం’ అని తెలిపారు. మరోపక్క ఏకే రావు కుటుంబం శ్రీనగర్‌కాలనీలో నివసిస్తోందని తెలిసిందని, అంతకు మించి తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. -
తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే
సాక్షి, బెంగళూరు: తెలుగు గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకే రావుది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలింది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏకే రావు సుమారు వారం రోజుల కింద కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ నెల 22న కర్ణాటకలోని యలహంక–రాజన్‌కుంటె స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై ఏకే రావు మృతదేహం లభించింది. చదవండి: సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’ కర్ణాటక పోలీసులు తొలుత ఆయనది ఆత్మహత్యగా భావించినా.. మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అక్కడి ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా.. ఏకే రావు శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, అది హత్యేనని వైద్యులు నిర్ధారించినట్టు పోలీసులు తెలిపారు. -
సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని హరిణి తండ్రి ఏకే రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద స్థితిలో ఆయన మృతదేహం లభ్యమయ్యింది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేశారు. ఏకే రావు శరీరం పై కత్తి గాయాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఏకే రావు నవంబర్ 8 న హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. చివరిసారిగా ఆయన ఈ నెల 19 న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నాలుగు రోజుల తర్వాత అనగా నవంబర్ 23 న ఏకే రావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలో ఏకే రావుది హత్యే అంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బెంగళూరులోనే ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు ఏకే రావు కుటుంబ సభ్యులు. ఆయనది హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రముఖ సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. కుటుంబం అదృశ్యం!) ఎఫ్ఐఆర్లో ఏం ఉంది అంటే.. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 23 తేదీన యలహంక, రాజనా కుంటు రైల్వే స్టేషన్ మధ్య ఏకే రావు మృత దేహం గుర్తించాము. నాందేడ్ ఎక్స్ ప్రెస్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నాం. యలహంక రైల్వే ట్రాక్ పైన బోర్ల పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించాము. తల ఎడమ వైపు ఆరు సెంటిమీటర్లు గాయం.. ఎడమ చేతికి , గొంతుపై గాయాలు ఉన్నట్లు గుర్తించాము. ఘటన స్థలంలో చాకు, కత్తి, బ్లెడ్‌ని స్వాధీనం చేసుకున్నాం. పోస్టు మార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించాము’’ అని తెలిపారు. ‘‘మృతుడు దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము. తన మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి, తన తండ్రి మృత దేహం అని గుర్తించాడు. ఓ ప్రాజెక్ట్ పని మీద అప్పుడప్పుడు బెంగళూరుకి వచ్చేవాడు. ఈ నెల 8 తేదీన బెంగళూరుకు వచ్చిన ఏకే రావు తన కొడుకు ఇంట్లో ఉన్నాడు’’ అని తెలిపారు. (చదవండి: ఇంట్లో తెలియకుండా పెళ్లి.. నవ వధువు అనుమానాస్పద మృతి) ఇక నవంబర్ 23 తేదీన ఏకే రావు మృతి గురించి తెలిసిన తర్వాత ఆయన భార్య బెంగళూర్‌లో ఉన్న కుమారుడుకి ఫోన్ చేసింది. యశ్వంత్‌పూర్ రైల్వే పోలీసుల నుంచి నాకు ఫోన్ వచ్చిందని.. రైల్వే ట్రాక్‌పై మీ భర్త మృతదేహం ఉంది అని పోలీసులు చెప్పారు.. అని కుమారుడుకి సమాచారం ఇచ్చింది. ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు’’ అని తెలిపారు. ‘‘ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయ చేయాలని ఏకే రావు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూర్ రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో302, 201 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశాం. హత్య, ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: పెళ్లి చేసుకోవాలని డ్యాన్సర్ బలవంతం చేయడంతో -
‘డాడీ, మమ్మీ గొడవ పడ్డారు.. ఆ అంకుల్ డాడీని కొట్టాడు’
పాకాల(చిత్తూరు జిల్లా): ఓ వివాహితుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన సోమవారం అర్ధరాత్రి స్థానిక శివశక్తి నగర్లో చోటు చేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు..చెన్నుగారిపల్లె దళిత వాడకు చెందిన నవీన్‌కుమార్(28) తన భార్య ఐషు, కుమారుడు హర్షిత్ కలిసి శివశక్తి నగర్లో కాపురం ఉంటున్నాడు. సోమవారం రాత్రి బెడ్రూమ్లోకి వెళ్లి తలుపు గడి పెట్టుకున్నాడు. భార్య ఎంతసేపు పిలిచినా, తలుపు తట్టినా నవీన్ బదులివ్వకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. తన మామయ్య, బావకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. ప్రియుడితో గొడవ.. ఇంతలోనే.. బెడ్రూం తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకుని వేలాడుతున్న నవీన్‌ను చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీసులకు తెలియజేయడంతో ఎస్ఐ వంశీధర్ తన సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కుమారుడు బలవన్మరణం చెంది ఉంటాడని అనుమానిస్తూ మంగవారం ఉదయం మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు. ‘‘మా డాడీ, మమ్మీ గొడవ పడ్డారు.. కొంతసేపటికి మా ఇంటి దగ్గరలోని ఇంటి నుంచి ఒక అంకుల్ వచ్చి మా డాడీని కొట్టాడు.. ఆ తర్వాతే మా డాడీ బెడ్రూమ్లోకి వెళ్లి గడి పెట్టుకుని తలుపే తీయలేదు..’’ అని హర్షిత్ (7)మంగళవారం సాయంత్రం తన అవ్వాతాతలతో పోలీస్ స్టేషన్‌కి వచ్చి చెప్పడంతో ఎస్ఐ ఆశ్చర్యచకితులయ్యా రు. కంప్లైంట్ కూడా మార్చమని ఎస్ఐ సార్‌కు చెప్పు తాతా..అని పదే పదే చెప్పాడు. నవీన్ మృతికి కారణాలేమిటో పోస్టుమా ర్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు లో తెలియాల్సి ఉంది. -
వివాహేతర సంబంధం.. ప్రియుడితో గొడవ.. ఇంతలోనే..
శిడ్లఘట్ట(కర్ణాటక): పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్లో నివాసం ఉంటున్న రాజేశ్వరి (35) అనే మహిళ మంగళవారం ఉరి వేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మరణించింది. ఆమెకు భర్త వెంకటేష్‌తో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ బాడుగ ఇంట్లో ఉంటున్నారు. శిడ్లఘట్టలోనే ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే అనంత్‌కుమార్– రాజేశ్వరి మధ్య 4 ఏళ్ల నుంచి అక్రమ సంబంధం కొనసాగుతోంది. చదవండి: ఇంటర్ యువతికి ప్రేమ వేధింపులు.. మనస్తాపానికి గురై ఈ నెల 21వ తేదీన ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. ఇంతలోనే రాజేశ్వరి అనూహ్యంగా శవమైంది. తన భార్యను అనంత్ కుమారే హత్య చేశాడని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు అనంత్‌కుమార్ పరారీలో ఉన్నాడు. దోషుల్ని శిక్షించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. చదవండి: 1959లో హత్యాచారం.. డీఎన్ఏ టెస్ట్‌తో ఇప్పుడు తీర్పు.. ట్విస్ట్ ఏంటంటే -
ఇంట్లో తెలియకుండా పెళ్లి.. నవ వధువు అనుమానాస్పద మృతి
నాగోలు: అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, జర్పుల తండాకు చెందిన జర్పుల మంత్రు, మారెమ్మ దంపతుల కుమార్తె అమూల్య (22), కొత్తపేటలోని ఓ కాఫీ షాపులో పని చేసేది. అక్కడ పని చేస్తున్న నాగర్‌కర్నూల్‌కు చెందిన కంతుల డేవిడ్(25)తో పరిచయమై మార్చి 24న సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకుని వనస్థలిపురంలో కొన్ని రోజులు ఉండి, గత 20 రోజుల క్రితం ఎల్బీనగర్లోని శివగంగాకాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. నాటి నుంచి అమూల్య పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. మూడ్రోజుల క్రితం హస్తినాపురంలో ఉండే తన అక్క ఇంటికి వెళ్లగా మెడలోని నల్లపూసలు గురించి కుటుంబ సభ్యులు అడిగినట్లు సమాచారం. అక్కడ నుంచి 17న హాస్టల్‌కు వెళ్తున్నానని చెప్పి తన భర్త వద్దకు వచ్చింది. అదే రోజు రాత్రి తల్లికి ఫోన్‌చేసి తాను కులాంతర వివాహం చేసుకున్నానని మీ వద్దనున్న తన బంగారు ఆభరణాలు, డబ్బులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. ఉదయం బాత్రూంలో అమూల్య చున్నీతో అనుమానాస్పద స్థితిలో ఉండటంతో గమనించిన డేవిడ్ కామినేని హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అమూల్య మృతి చెందిన సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు పెద్ద సంఖ్యలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. డేవిడ్ తన కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమూల్య మృతికి డేవిడ్ కారణమంటూ అతడిని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ రాములు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నాడు. పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ.. అమూల్య మృతికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి స్పందించి అమూల్య కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వివాహేతర సంబంధం: పెళ్లి చేసుకోవాలని డ్యాన్సర్ బలవంతం చేయడంతో
సాక్షి, హైదరాబాద్: ఫలక్‌నుమా ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. క్యాబ్ డ్రైవర్ మహ్మద్ అప్సర్‌తోపాటు రేస్ కోర్స్ బుకీ నహీద్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం ఫాతిమా భర్త మృతిచెందడంతో క్యాబ్ డ్రైవర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు విచారణలో తేలింది, ఇటీవల పెళ్లి చేసుకోవాలంటూ డ్రైవర్‌పై ఫాతిమా ఒత్తిడి తీసుకొచ్చింది. డ్యాన్స్‌లు ఆపేస్తే పెళ్లి చేసుకుంటానని డ్రైవర్ ఫాతిమాకు షరతు పెట్టాడు. చదవండి: బీరు బాటిల్, అర్థనగ్నంగా.. మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కాగా దీంతో వివాహ విషయంలో క్యాబ్ డ్రైవర్, ఫాతిమాకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఫాతిమాకు మద్యం తాగించి క్యాబ్ డ్రైవర్ ఉరి వేసి హత్య చేశాడు. ముస్తఫానగర్‌కు చెందిన 30 ఏళ్ల షరీన్ ఫాతిమాకు ఏడుగురు సంతానం. ఫాతిమా భర్త నదీమ్ ఏడాది కిందట మృతి చెందాడు. ఏడుగురు సంతానాన్ని ఆర్కెస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా పనిచేస్తూ తల్లి ఫాతిమానే పోషించుకునేది. ప్రస్తుతం ఫాతిమా మరణంతో పిల్లలు అనాథలుగా మారారు. చదవండి: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి కిరాతకంగా... -
Panjagutta: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ..
హైదరాబాద్: పంజగుట్టలో చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు.. చిన్నారి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో నవంబరు 4న దీపావళిరోజు సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం.. ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు ఉండటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: పంజాగుట్టలో దారుణం.. పాపం.. పసిపాప! చదవండి: యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం.. -
పంజాగుట్టలో దారుణం.. చిన్నారి అనుమానాస్పద మృతి
-
పంజాగుట్టలో దారుణం.. పాపం.. పసిపాప!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ముఖం కమిలి పోయి ఎవరో తీవ్రంగా కొట్టినట్లు ఉండగా, కుడి చేయి విరిచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందరూ దీపావళి వేడుకల్లో ఉండగా గురువారం ఉదయం సుమారు 9:45 ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పాప మృతదేహాన్ని పంజగుట్ట ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు పడేశారు. పాప గులాబీ రంగు ప్యాంట్, బూడిద రంగు టీషర్ట్ వేసుకుని ఉండగా, ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టారు. పాపను గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసు బృందాల దర్యాప్తు: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా.. తాము ఉదయం 9:15 గంటల ప్రాంతంలో అక్కడే శుభ్రం చేశామని ఆ సమయంలో అక్కడ మృతదేహం కనిపించలేదని చెప్పారు. 9:30 నుంచి 9:45 ప్రాంతంలో అక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులకు కేసు మిస్టరీగా మారింది. డాగ్ టీం, క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించాయి. బాలిక ముఖంపై ఎవరో కొట్టినట్లు కమిలిపోయి ఉండటం, కుడిచేయి విరిగి ఉండటంతో ఎవరో హత్యచేసి ఉంటారని భావిస్తు న్నారు. గురువారం అమావాస్య ఉండటంతో క్షుధ్రపూజలు ఏమైనా చేశారా అనే దానితో పాటు ఇతర కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్, క్రైమ్ టీం, పంజగుట్ట పోలీసులు బృందాలుగా విడిపోయి అన్ని మార్గాల్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ అంతా బాలిక పోస్టర్లు, సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫొటోలు పెట్టి ఎవరికైనా తెలిస్తే సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. శుక్రవారం సాయంత్రం గాంధీలో ఇద్దరు ఫ్రొఫెసర్ల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కిడ్నీ పైభాగం, ఊపిరితిత్తుల కింది ప్రాంతంలో బలమైన గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. చదవండి: అన్నయ్య చెప్పినా వినకుండా.. చివరికి ఏం జరిగిందంటే.. -
బాలికకు మాయమాటలు చెప్పి.. ఇంటి వెనకాలకు తీసుకెళ్లి..
సాక్షి, నారాయణఖేడ్: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని లింగాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్‌కు చెందిన కుమ్మరి పుష్పలత (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈనెల 17న రాత్రి పుష్పలతను అదే కాలనీకి చెందిన చాకలి పండరి మాయమాటలు చెప్పి ఇంటి వెనకాలకు తీసుకెళ్లగా బాలిక తండ్రి వెంకయ్య వెతుకుతూ వెళ్లగా ఆయనను చూసి పారిపోయారు. చదవండి: హైదరాబాద్‌లో విషాదం: సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి గంట తర్వాత పండరి గ్రామానికి రాగా పుష్పలత రాలేదు. ఆచూకీ కోసం వెతుకుతుండగా సోమవారం గ్రామ శివారులోని మంగలి లక్ష్మయ్య చేనులో చెట్టుకు చున్నీతో ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో బాలిక కనిపించింది. కూతురి మృతి విషయంలో పండరిపై అనుమానం ఉందని బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. చదవండి: చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది.. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. పొరుగింట్లో నివాసం ఉండే..
సాక్షి, తణుకు: పట్టణానికి చెందిన వివాహిత కొల్లి విజయదుర్గ (25) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు ఎస్ఐ కె.గంగాధరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని శీనివారి వీధిలో నివాసం ఉంటున్న కొల్లి వెంకట్, విజయదుర్గ ఆరేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకట్ సర్వీసింగ్ షెడ్ నిర్వహిస్తున్నాడు. రెండు రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో వెంకట్ ఇంటికి రావడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం విజయదుర్గ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త వెంకట్ ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పొరుగింట్లో నివాసం ఉంటున్న ఓ మహిళ తన చావుకు కారణమని పేర్కొంటూ మృతురాలు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు సీఐ డీఎస్ చైతన్యకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భర్త ప్రైవేట్ భాగాలపై మరిగే నీరు పోసి హత్యాయత్నం చేసిన మూడో భార్య) -
కెన్యా అథ్లెట్ అగ్నెస్ అనుమానాస్పద మృతి
Kenya Athlete Agnes Tirop Death.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లలో (2017, 2019) పది వేల మీటర్ల విభాగంలో రెండు కాంస్య పతకాలు గెలిచిన కెన్యా మహిళా రన్నర్ అగ్నెస్ టిరోప్ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. 25 ఏళ్ల అగ్నెస్ ఇంట్లోనే మరణించిందని, ఆమె మృతికి గల కారణాలు తెలియలేదని కెన్యా ట్రాక్ సమాఖ్య తెలిపింది. ఇంట్లోనే విగతజీవిగా పడి ఉండటంతో ట్రాక్ సమాఖ్య... అగ్నెస్ భర్తపై అనుమానాలను వ్యక్తం చేసింది. గత ఆగస్టులో ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో 5000 మీటర్ల పరుగులో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: Uber Cup: ఐదేళ్ల తర్వాత... తొలిసారిగా.. -
పీజీ గోల్డ్ మెడలిస్ట్.. ప్రేమించి పెళ్ళి చేసుకొంది.. అంతలో ఏమైందోగానీ!
సాక్షి, మైసూరు: చదువుల్లో మేటి, బంగారు పతకం కూడా సాధించింది, కానీ జీవితంలో ఓడిపోయింది. శనివారం మైసూరు జేపీ నగరంలో ఆశా (30) అనే వివాహిత అనుమానాస్పదరీతిలో శవమైంది. ఆమె స్వస్థలం మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా మడేనహళ్ళి. ఎనిమిదేళ్ల కిందట మళవళ్ళికి చెందిన నాగప్రసాద్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకొంది. మైసూరులోని జేజీ నగరలో కాపురం పెట్టారు. ఆశా గతంలో మైసూరు వర్సిటీలో పీజీ పూర్తిచేసి స్వర్ణ పతకం కూడా సాధించింది. భర్త నాగప్రసాద్ కట్నం తేవాలని భార్యను తరచూ వేధించేవాడు. అతని పోరు తట్టుకోలేక ఆశా రెండుసార్లు పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు జడ్జి ఇద్దరికీ నచ్చజెప్పడంతో మళ్లీ కలిసి ఉన్నారు. అప్పటికీ భర్త వేధింపులు ఆపకపోవడంతో ఆశ వేరేగా పీజీ హాస్టల్లో ఉంటానని స్పష్టంచేసింది. ఇంతలో ఏమైందోగానీ శనివారం తెల్లవారుజామున ఇంటిలో ఉరి వేసుకొన్న స్థితిలో ఆమె మరణించింది. విద్యారణ్యపుర పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కొత్త కారుకు పూజ కోసం వెళుతూ..) -
ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా మారి
సాక్షి, మర్రిపాడు: ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మండలంలోని నందవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లి అక్కడ ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతిచెందాడు. వివరాలు.. నందవరం గ్రామానికి చెందిన షేక్ మౌలాలి – జానీబేగం దంపతుల 3వ కుమారుడు షేక్ ఖాజాగరీబ్ నవాజ్(22) కువైట్‌లోని ఫెర్దోస్ పట్టణంలో ఉన్న గ్రేన్ కోసుర్ ఏరియాలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చదవండి: (అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి) రెండేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లిన నవాజ్ అక్కడ ఇళ్లలో పూల మొక్కల పెంపకం పనులు చేసుకుంటూ సంపాదించిన నగదును ఇంటికి పంపుతూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవించే తల్లిదండ్రులకు అండగా ఉండేవాడు. తరచూ ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడే నవాజ్ మంగళవారం కూడా వారితో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ బుధవారం ఉదయం అతను ఉంటున్న ఇంటి సమీపంలో రేకుల షెడ్లో నవాజ్ ఉరేసుకుని మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. నవాజ్‌తోపాటు అక్కడ పనుల కోసం వెళ్లిన మరికొంతమంది ఈ విషయం తెలియజేశారు. అందరూ నిద్రపోయిన తరువాత నవాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాస్పదంగా ఉందంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవాజ్ మృతదేహానికి అక్కడే గురువారం పోస్టుమార్టం నిర్వహించారని, శనివారానికి మృతదేహం స్వగ్రామానికి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. నవాజ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు) -
అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి
భువనేశ్వర్/బొలంగీరు: బొలంగీరు జిల్లా భీమబొయి వైద్య బోధన ఆస్పత్రి విద్యార్థిని నిరుపొమ నొందొ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. థర్డ్ ఇయర్ చదువుతున్న నిరుపొమ బుధవారం రాత్రి 11.40 గంటల వరకు తన సోదరితో చాట్ చేసింది. ఆ తర్వాత కళాశాల హాస్టల్ గదిలో మృతురాలిగా కనిపించడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని, రోదించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే ఇది హత్యా... ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: (హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు) -
ఇల్లరికం వెళ్లిన అల్లుడు అమ్మమ్మ ఊరికి వచ్చి శవమయ్యాడు
హన్వాడ: అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు బావిలో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని ఏనమీదితండా సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన శివకృష్ణ (29)కు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన అరుణకు మూడేళ్ల కిందట వివాహమైంది. శివకృష్ణ ఇల్లరికం వెళ్లాడు. చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ ఈక్రమంలోనే భార్య అరుణతో తరచూ గొడవలు జరిగేవి. శివకృష్ణ అప్పుడప్పుడు స్వగ్రామం మహమ్మదాబాద్, అమ్మమ్మ వారి గ్రామం ఏనమీదితండాకు వచ్చివెళ్లేవాడు. గత శనివారం కూడా కోస్గి నుంచి నేరుగా అమ్మమ్మ ఇంటికి (ఏనమీదితాండ) వచ్చిన శివకృష్ణ అదేరోజు ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా గ్రామ సమీపంలో దొడ్డుకుంటోని బావిలో పడి మృత్యువాతపడ్డాడు. బుధవారం మృతదేహం బావిలో తేలడంతో స్థానికులు గమనించి బయటికి తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న హన్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామా చేశారు. జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హన్వాడ పోలీసులు తెలిపారు. చదవండి: సిరిసిల్ల జిల్లా అరుదైన ఫీట్: సంతోషంలో కేటీఆర్ -
భారత యువ షూటర్ అనుమానాస్పద మృతి
మొహలీ: భారత షూటర్ 28 ఏళ్ల నమన్వీర్ సింగ్ బ్రార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మొహలీలోని సెక్టార్ 71లో తన ఇంట్లో నమన్వీర్ సింగ్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే నమన్ వీర్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని మొహలీ డీఎస్పీ గుర్షేర్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ షూటింగ్ వరల్డ్ కప్ లో కనీస అర్హత స్కోరు విభాగంలో నమన్వీర్‌సింగ్ నాలుగోస్థానంలో నిలిచాడు. అలాగే 2015లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జౌలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్లో నమన్వీర్ కాంస్య పతకం సాధించాడు. చదవండి: అంతా నాలుగు నెలల్లోనే... అనామక ప్లేయర్ నుంచి చాంపియన్ దాకా! PELE: ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం.. -
హైదరాబాద్ మియాపూర్ లో దారుణం
-
మియాపూర్‌లో దారుణం: చిన్నారి అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లో దారుణం జరిగింది. 13 నెలల చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. నిన్న ఓంకార్ నగర్లో చిన్నారి అదృశ్యం కాగా, ఈ రోజు తెల్లవారుజామున ఇంటి ముందు మృతదేహం లభ్యమైంది. తొలుత చిన్నారి మృతదేహాన్ని ఆమె అమ్మమ్మ చూసింది. ఇక నీటిలో ముంచి చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 13 ఏళ్ల బాలుడు ఎత్తికెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాప మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఇవీ చదవండి: ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం భర్త ఫోన్‌కాల్: భార్యను చంపేశా.. కూతుర్లను కూడా చంపేస్తా.. -
విషాదం: ఏమైందో తెలియదు.. అత్తింట్లో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
ఒంగోలు: ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీరు. మరో సాఫ్ట్వేర్ ఇంజినీరును పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు నిత్యం నరకం కనిపించింది. భర్తతోపాటు మామ కూడా చేయి చేసుకుంటున్నాడంటూ తండ్రికి ఫోన్లో మొరపెట్టుకుంది. చివరకు ఇంట్లోకి సైతం రానివ్వడం లేదంటూ విలపించింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తన కుమార్తెను చంపేశారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషాద సంఘటన ఆదివారం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగింది. జిల్లాలోని రాచర్ల మండలం సోమిదేవిపల్లికి చెందిన రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి అయినాబత్తుల వెంకటేశ్వర్లు కుమార్తె స్వాతికి, ఒంగోలు భాగ్యనగర్‌లో ఉంటున్న సంగా శ్రీహరి కుమారుడు వెంకటశ్రీకాంత్‌కు గత ఏడాది మేనెల 13న వివాహం జరిగింది. వెంకటేశ్వర్లు 25 తులాల బంగారం, రూ.50 లక్షలు కట్నంగా ఇచ్చారు. స్వాతి హైదరాబాద్ విప్రో కంపెనీలోను, వెంకటశ్రీకాంత్ ఇన్ఫోసిస్‌లోను సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు. (చదవండి: వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు) ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీహరికి గత ఏడాది జూలైలో యాక్సిడెంట్ కావడంతో ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తూ స్వాతి దంపతులు ఒంగోలులోనే శ్రీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. శ్రీహరి ఉద్యోగం చేయలేని నేపథ్యంలో కుమారుడు వెంకటశ్రీకాంత్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించి స్వాతిని వదిలించుకోవాలని పథకం పన్నారు. నల్లగా ఉన్నావంటూ కించపరుస్తూ విడాకులివ్వాలంటూ వేధించారు. ఈ ఏడాది మార్చిలో స్వాతిని పుట్టింటికి పంపారు. మళ్లీ పెద్దల సమక్షంలో ఈ ఏడాది జూలైలో స్వాతి ఒంగోలులోని అత్తగారింటికి చేరింది. అప్పటినుంచి భర్త, మామ శారీరకంగా, మానసికంగా హింసించసాగారు. శనివారం రాత్రి ఆమెను కొట్టి ఇంట్లోంచి గెంటేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్వాతి తన తండ్రికి ఫోన్‌చేసి తనను ఇంట్లోకి రానిచ్చారని చెప్పింది. 5.07 నిమిషాలకు ఆయనకు వాచ్మెన్ ఫోన్‌చేసి స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే ఒంగోలు చేరుకున్న వెంకటేశ్వర్లు దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ పోలీసులు.. స్వాతి భర్త, అత్తమామలతో పాటు మరికొందరిపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్వాతి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (చదవండి: తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!) -
సింధు మృతికి ప్రియుడే కారణం!?
గుణదల (విజయవాడ తూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడే సీఏ విద్యార్థిని సింధు మృతికి కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజయవాడ గుణదలలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధును పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆమె ప్రియుడు ప్రసేన్ కొంతకాలంగా మరో యువతితో సంబంధం ఏర్పర్చుకున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ యువతిని వివాహం చేసుకునేందుకే సింధును వదిలించుకోవాలని నిర్ణయించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక ఉద్దేశపూర్వకంగానే ప్రసేన్ తమ కుమార్తెను హత్యచేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గదిలో సింధు పడిఉన్న తీరు కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆమె ఉరికి వేలాడకుండా నేలపై పడి ఉండడం గమనార్హం. ముక్కు నుంచీ తీవ్రంగా రక్తస్రావం జరిగిందని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు ఆధారపడి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాయాలు, దెబ్బలు వంటివి ఉన్నట్లు రిపోర్టులో వస్తే ఇది హత్య కిందే పరిగణించాల్సి ఉంటుందన్నారు. నిందితుడు ప్రసేన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి
గుణదల (విజయవాడ తూర్పు) : ప్రేమ వివాహం జరగకపోగా ప్రియుడు తన నుంచి దూరమయ్యాడనే మనస్తాపంతో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణాజిల్లా తిరువూరు మండలం, రాజుగూడెం గ్రామానికి చెందిన చెరుకూరి సింధు (29) గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలో ఉంటోంది. సీఏ చదువుకుంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. కొంతకాలంగా ప్రసేన్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. కానీ, ప్రసేన్ కుటుంబ సభ్యులు వారిద్దరి ప్రేమ వివాహానికి నిరాకరించారు. సింధు తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరోవైపు.. సింధు, ప్రసేన్ మధ్య కూడా మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. దీంతో సింధు విజయవాడ గుణదల ప్రాంతానికి వచ్చి ఒంటరిగా ఉంటోంది. అటు సొంత కుటుంబ సభ్యులు, ఇటు ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో ఆమె మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలో.. జీవితంపై విరక్తి చెంది తాను ఉంటున్న గదిలోనే ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రెండ్రోజులుగా సింధు ఉన్న గది తలుపులు మూసి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లిదండ్రులు విజయవాడ చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ప్రసేనే పొట్టన పెట్టుకున్నాడు తన కూతురు ఉరి వేసుకుని చనిపోయేంత పిరికి వ్యక్తి కాదని.. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రసేనే తన కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని సింధు తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉంటుందని ఆయనన్నారు. సింధు మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. సింధు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే తాను ఉరికి వేలాడకుండా నేలపై ఎలా పడిఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, సింధు తలభాగం నుంచి రక్తం కారడంతో ప్రసేన్ హత్యచేసి ఉంటాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. -
Krishna District: మహిళా వైద్యురాలి అనుమానాస్పద మృతి
సాక్షి, వత్సవాయి: మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. మండల కేంద్రం వత్సవాయిలో సంవత్సరం కిందట ఒక ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు. అందులో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన భీమనాథం మౌనికారెడ్డి(28) వైద్యురాలిగా పనిచేస్తున్నారు. మృతిచెందిన వైద్యురాలు మౌనికారెడ్డి రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా విధులు నిర్వహించిన ఆమె అదే రోజు రాత్రి ఆమె ఉంటున్న గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ ఉండటాన్ని కిటికీలోంచి సిబ్బంది గమనించారు. వెంటనే రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. వీఆర్వో శివాజీ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహాలక్ష్ముడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అసలేం జరిగిందో?: రక్తపు మడుగులో భార్య.. విగతజీవిగా భర్త
కంబాలచెరువు(రాజమహేంద్రవరం)/తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలో శనివారం ఉపాధ్యాయ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో సబ్‌కలెక్టర్ ఆఫీసు సమీపంలోని సూర్య థియేటర్ వద్ద ఎస్ఆర్ ప్లాజాలో ఉంటున్న నడింపల్లి నర్సింహరాజు(59) నిడదవోలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భార్య వెంకటమణి(55) రాజమహేంద్రవరం ఉమెన్స్ కాలేజీలో కాంట్రాక్టు అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. వారి కుమారుడు అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ ఎప్పటిలాగే నిద్ర పోయారు. శనివారం మధ్యాహ్నం వరకూ తలుపులు తెరవకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. పక్కింటివారు కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపులు తెరిచి పరిశీలించగా మంచంపై రక్తపు మరకలతో భార్య పడి ఉండగా, భర్త కుర్చీలో చనిపోయి ఉన్నాడు. అతని చేతిలో చాకు ఉంది. భార్య గొంతుకోసి, తాను గొంతుకోసుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. నర్సింహరాజు భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా మరేమైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాపు చేస్తున్నారు. కుర్చీలో శవమైన నర్శింహరాజు చేతిలో చాకు కింద పడకుండా ఉండడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. -
విజయవాడలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, విజయవాడ: నగరంలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తరుణ్ అనే యువకుడు కొట్టడం వల్లే చనిపోయిందని బంధువులు అంటున్నారు. ప్రేమ పేరుతో తరుణ్ మోసం చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. యువతిని కొన్ని రోజులుగా తరుణ్ తన గదిలోనే ఉంచాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈనెల 23న యువతిని ఆస్పత్రిలో చేర్చి తరుణ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో తరుణ్ పనిచేస్తున్నాడు. విద్యార్థిని స్వస్థలం పశ్చిమ గోదావరిజిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామం. -
చికిత్స కోసం ఆస్పత్రికి.. చనిపోయిందనడంతో తీసుకొచ్చినవారు పరార్
దుండిగల్: అపస్మారక స్థితిలో ఉన్న ఓ గుర్తుతెలియని మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చిన వ్యక్తులు తీరా ఆమె చనిపోయిందని తెలియడంతో పరారైన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఈ నెల 16న రాత్రి 10:25 గంటల సమయంలో సూరారంలోని నారాయణ మలారెడ్డి ఆస్పత్రికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఓ మహిళను చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. సదరు మహిళను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని చెప్పారు. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడ నుంచి పరారయ్యారు. ఆస్పత్రి సిబ్బంది వారి కోసం వెతకగా కనిపించలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది శనివారం దుండిగల్ పోలీçసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో పరిశీలించగా ఆటోలో వెళ్లిపోయినట్లు కనిపించింది. స్పష్టత లేకపోవడంతో సదరు వ్యక్తులను గుర్తించలేకపోయారు. మహిళ ఎడమ చేతిపై లక్ష్మి, కుడి చేతిపై ‘ఎం’ అనే అక్షరాలతో పచ్చబొట్లు ఉన్నాయని, మెడలో మంగళసూత్రం, చేతులు, కాళ్లకు పారాణి ఉండటంతో కొత్తగా పెళ్లై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహిళ వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటుందని, కుటుంబ గొడవల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందా లేదా ఇతరాత్రా కారణాలతో మృతి చెంది ఉంటుందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ కుటుంబ సభ్యులెవరైనా ఉంటే దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. -
మా ప్రీతిని కచ్చితంగా పవనే హత్య చేశాడు
కేతేపల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని కొప్పోలులో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొప్పోలు గ్రామానికి చెందిన చింతమళ్ల దశరథ అలియాస్ శ్రీను, నాగమ్మ దంపతుల కుమార్తె ప్రీతి(17) నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో ఉంటోంది. మూడు రోజుల క్రితం ప్రీతి స్వగ్రామానికి వచ్చింది. సోమవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో పడుకుంది. అర్ధరాత్రి తర్వాత శ్రీను లేచి చూసే సరికి ప్రీతి కనిపించలేదు. ఇంట్లో ఉన్న ఇతర గదులతో పాటు బాత్రూంలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామంలో రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది. వ్యవసాయ భూమిలో విగతజీవిగా... మంగళవారం ఉదయం కొప్పోలు శివారులోని రైస్‌మిల్లు వెనుక ఉన్న రైతు నంద్యాల వాసుదేవరెడ్డి వ్యవసాయ భూమిలో ప్రీతి విగతజీవిగా పడి ఉంది. ప్రీతి మెడ చుట్టూ చున్నీ బిగించి లాగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. నోట్లోనుంచి నురగలు వస్తున్నాయి. మృతదేహం వద్ద పగిలిన బీరుసీసా గాజు పెంకులు పడి ఉన్నాయి. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడి వెళ్లి చూడగా ప్రీతి మృతిచెంది ఉంది. ప్రీతి తమ్ముడు అనారోగ్యంతో ఏడాది కిత్రం మృతిచెందాడు. ఏడాది కాల వ్యవధిలోనే తమకున్న ఇద్దరు సంతానం మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. వ్యవసాయ భూమిలో ప్రీతి మృతదేహం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సమాచారం అందుకున్న కేతేపల్లి ఎస్ఐ బి.రామక్రిష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం రాత్రి ప్రీతి ఫోన్లో ఎవరెవరితో మాట్లాడింది? ప్రీతిది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హత్య చేశారని ఆరోపణలు కొంత కాలంగా ప్రీతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న గ్రామానికి చెందిన దోరెపల్లి పవన్ తన కూతురును హత్య చేశాడని ఆమె తల్లి నాగమ్మ, బంధువులు ఆరోపిస్తున్నారు. విష యం తెలిసి తాము పవన్‌ను మందలించడంతో ప్రీతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తమను కూడా నమ్మించాడని తెలిపారు. ప్రేమిస్తున్న తనతో కాకుండా నల్లగొండలో ఇతరులతో తిరుగుతున్నాంటూ పవన్ ప్రీతిపై అనుమానం పెంచుకున్నాడని, ఈ క్రమంలో ఇటీవల ఇంటికి వచ్చి కూతురుపై చేయి చేసుకున్నాడని, చంపుతానంటూ బెదిరించాడని వాపోయారు. రాత్రి తమతో ఇంట్లో పడుకున్న ప్రీతికి ఫోన్లో మాయమాటలు చెప్పి, బయటికి రప్పించి హత్య చేశాడని ఆరోపించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సాక్షి, హస్తినాపురం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పిల్లగుంట్ల తండాకు చెందిన కవిత, విజయ్ దంపతులు ఇంజాపూర్ గ్రామంలోని సుందరయ్యకాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 18న కవిత కరోనాతో మృతి చెందిందని చెప్పి ఆమె భర్త విజయ్ చెప్పాడని కవిత కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని హుటాహుటినా గ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారన్నారు. అంత్యక్రియలలో పాల్గొన్న కవిత కుటుంబ సభ్యులు కరోనా టెస్ట్ చేయించుకుంటే అందరికీ నెగెటివ్ వచ్చింది. తమ కూతురిని పథకం ప్రకారం హత్య చేసి కరోనాతో చనిపోయిందని నమ్మించి మోసం చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నల్గొండ జిల్లా పిఏపల్లి మండల తహసీల్దార్ సమక్షంలో పాతిపెట్టిన కవిత మృదేహాన్ని పోలీసులు వెలికి తీసి సోమవారం పంచనామా చేశారు. రిపోర్ట్ వస్తే కవిత మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. చదవండి: రూ. 2 కోట్ల కోసం కిడ్నాప్.. కోవిడ్ శవంగా అంత్యక్రియలు -
జాన్ మెకఫీ మృతి.. ముందే అనుమానించిన భార్య
వాషింగ్టన్: యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ‘మెకఫీ’ సృష్టికర్త జాన్ మెకఫీ(75) బుధవారం స్పెయిన్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య జానైస్ మెకఫీ కొన్ని రోజుల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. ‘‘నా భర్త జైలులోనే మరణించాలని అమెరికా అధికారులు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఏజెన్సీల్లో ఉన్న అవినీతి గురించి మాట్లాడితే.. ఏమవతుందో తెలిపేందుకు నా భర్త మృతిని ఉదాహరణగా చూపాలని భావిస్తున్నారు’’ అంటూ ఫాదర్స్ డే రోజున జానైస్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జానైస్ మెకఫీ ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20న చేసిన ట్వీట్లో ‘‘హ్యాపీ ఫాదర్స్ డే.. నీవు ఈ రోజును జైలులో గడుపుతున్నావు. నీ నిజాయతీ వల్లనే నీవు ఈ రోజు జైలులో ఉన్నావు. అవినీతి పరిపాలన సాగుతున్న చోట నీవు నిజాయతీగా ఉన్నావు. అదే నిన్ను ఇబ్బందుల్లో పడేసింది. అమెరికాలో నీకు న్యాయం జరుగుతుందని నేను భావించడం లేదు’’ అంటూ జానైస్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతోంది. జానైస్, జాన్‌లకు 2013లో వివాహం అయ్యింది. ఆమె వ్యక్తిగతం జీవితం గురించి ఎవరికి పెద్దగా తెలియదు. Happy Father's Day @officialmcafee. Though you are spending the day in prison know that you are loved and appreciated. #FreeJohnMcAfee #FreeMcAfee pic.twitter.com/YFmB36KWfb — Janice McAfee (@theemrsmcafee) June 20, 2021 -
యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ సృష్టికర్త మెకఫీ ఇకలేరు
మాడ్రిడ్: యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ‘మెకఫీ’ సృష్టికర్త జాన్ మెకఫీ(75) బుధవారం స్పెయిన్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బార్సిలోనా నగర సమీపంలోని జైలులో తన గదిలో మెకఫీ నిర్జీవంగా కనిపించారు. ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. పన్నుల ఎగవేత కేసులో ఆయనను అమెరికాకు అప్పగించవచ్చని స్పెయిన్ నేషనల్ కోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. ఈ కేసులో నేరం రుజువైతే మెకఫీకి 30 ఏళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అధికారులు చెప్పారు. మెకఫీ మృతిపై న్యాయ విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందులో మెకఫీ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ 75 ఏళ్ల అమెరికా పౌరుడు, పన్నుల ఎగవేత కేసులో నిందితుడు అని పేర్కొన్నారు. అమెరికా పౌరుడైన జాన్ మెకఫీ క్రిప్టోకరెన్సీ ప్రమోటర్‌గానూ వ్యవహరించారు. -
ఘట్కేసర్ ORR వద్ద బాలిక అనుమానాస్పద మృతి
-
అనుమానాస్పద స్థితిలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాతనౌపడ గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ కూర్మాపు చిన్ని (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్పూర్లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్న ఆయన రెండు రోజుల కిందట సెలవుపై ఇంటికి బయల్దేరారు. మరో నలుగురితో కలిసి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వరకు ట్యాక్సీ బుక్ చేసుకున్నారు. శనివారం ఉదయం ఆమదాలవలసలో దిగి ఆటోలో బయల్దేరుతూ టెక్కలి జగతిమెట్ట వద్దకు తమ్ముడిని పంపించాలని తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులతో మాట్లాడిన కాసేపటికే చిన్ని ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. తమ్ముడు జగతిమెట్ట వద్దే ఉన్నా చిన్ని రాలేదు. ఎంతకూ రాకపోవడంతో శనివారమంతా చుట్టుపక్కల గ్రామాల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గాలించారు. పోలీసులను కూడా ఆశ్రయించారు. ఆదివారం నందిగాం మండలం దేవుపురం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఓ మృతదేహం కనిపించడంతో పోలీసులు చిన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా మృతదేహం చిన్నిదేనని గుర్తు పట్టారు. -
చిన్నారి సింధుశ్రీ మృతిపై వీడని మిస్టరీ
-
ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి.. అమ్మే అంతపని చేసిందా?!
పీఎంపాలెం(భీమిలి)/విశాఖపట్నం: కన్నబిడ్డను కాపాడాల్సిన తల్లే ఆ చిన్నారిపాలిట మృత్యువుగా మారిందా? విశాఖ జిల్లా బారవానిపాలేనికి చెందిన బొద్దాన రమేష్‌కు మారికవలసకు చెందిన వరలక్ష్మితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. రమేష్ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి పాప సింధు శ్రీ(3) ఉంది. వరలక్ష్మి ప్రవర్తన భర్తకు అనుమానం కలిగేలా ఉండటంతో పెళ్లయినప్పటినుంచీ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్త తనను వేధిస్తున్నాడంటూ జనవరిలో వరలక్ష్మి దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇరువురినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. గొడవలు తగ్గకపోవడంతో వరలక్ష్మి కుమార్తెను తీసుకుని భర్త నుంచి వేరుగా వచ్చేసింది. బోరవానిపాలేనికి చెందిన ప్రియుడు బోర జగదీష్‌రెడ్డితో కలిసి గత నెల 14నుంచి మారికవలస రాజీవ్ గృహకల్పలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. ఈ నెల 1న పాప మరణించింది. అనారోగ్యానికి గురికావడంతో అదే రోజు రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లామని, అప్పటికే పాప మృతిచెందినట్లు వైద్యులు చెప్పారని వరలక్ష్మి తెలిపింది. రాత్రికి రాత్రే చిన్నారిని మారికవలస శ్మశానంలో పూడ్చిపెట్టారు. బుధవారం మధ్యాహ్నం భర్తకు ఫోన్ చేసి పాప చనిపోయిందని చెప్పి ఫోన్ పెట్టేయడంతో ఆగ్రహించిన రమేష్ కుటుంబీకులు గురువారం వరలక్ష్మి ఇంటికి వచ్చి ఆమెతో గొడవకు దిగారు. చిన్నారిని భార్య, మరో వ్యక్తి కలిసి హత్య చేశారని రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారించగా చిన్నారిని శ్మశానంలో పాతిపెట్టినట్టు చెప్పారు. పోలీసులు అక్కడికి వెళ్లి, పాప మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి వరలక్ష్మి, జగదీష్‌లను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రహస్యంగా నగ్న వీడియోలు తీసి.. -
అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి..
ప్రముఖ మలయాళ నటుడు ఉన్నిరాజన్ పీ దేవ్ భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపుతోంది. మరోవైపు వరకట్నం తేవాలని భర్త ఉన్నిరాజన్ వేదిస్తున్నాడని వట్టప్పర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. వివరాల ప్రకారం ఉన్నిరాజన్ భార్య ప్రియాంక బుధవారం రాత్రి తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని విగతజీవితా కనిపించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, భర్త, నటుడు ఉన్నిరాజన్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి అయిన నాటి నుంచి ఉన్నిరాజన్ కట్నం డిమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఉన్నిరాజన్ ఆగడాలు మొదట్లో తమకు తెలిసేవి కాదని, అయితే పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో అతడి నైజం బయటడిందని, అంతేకాకుండా తమ కూతురిని శారీరకంగా హింసించేవాడని కుటుంబసభ్యులు అంటున్నారు. ఇక 2019లో ఉన్నిరాజన్-ప్రియాంకలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే వివాహం అయిన కొన్నాళ్లకే వీరి మధ్య కలహాలు వచ్చాయని, తన వ్యక్తిగత అవసరాలకు ప్రియాంక నగలు కూడా నమ్మేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎంత డబ్బు అడిగినా ప్రియాంక తల్లి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేదని కానీ తన భర్త అడుగుతున్నట్లు కాకుండా, తనకే అవసరం ఉందని ప్రియాంక చెప్పేదని పేర్కొన్నారు. కొద్ది రోజుల నుంచి ఉన్ని రాజన్ పెట్టే టార్చర్‌ను భరించలేక విషయం తమకు చెప్పిందని, శారీరక హింసకు పాల్పడినట్లు వీడియోలు కూడా ఉన్నాయని చెప్పారు. అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ప్రియాంక మృతిచెందడం అనుమానాలకు తివిస్తోందన్నారు. ఇక ఉన్నిరాజన్ మరెవరో కాదు ప్రముఖ మలయాళ నటుడు దివంగత రాజన్ పీ దేవ్ కుమారుడు. పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా ద్వారా రాజన్ పీ దేవ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలోను ప్రతినాయకుడి పాత్రలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. -
ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి
పొన్నూరు(గుంటూరు జిల్లా): పొన్నపల్లి హేమవర్ష (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ఆరో వార్డుకు చెందిన మురళీకృష్ణ కుమారై హేమవర్ష హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. హేమవర్ష చిన్నతనంలోనే తల్లిదండ్రులు (మురళీకృష్ణ, పద్మావతి) మృతి చెందారు. అప్పటి నుంచి మేనమామలైన శ్రీనివాసప్రసాద్, ప్రసాద్ వద్దనే పెరిగింది. ఏడాదిన్నర నుంచి హైదరాబాద్‌లో మాదాపూర్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 7వ తేదీ కూడా హేమవర్ష మేనమామలతో ఫోన్లో మాట్లాడింది. 8వ తేదీ శేఖర్ అనే యువకుడు శ్రీనివాసప్రసాద్‌కు ఫోన్ చేసి హేమవర్ష మృతి చెందిందని తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉన్న బంధువులతో మాట్లాడి అక్కడ ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఆ యువకుడు అంబులెన్స్ మాట్లాడుకుని శనివారం అర్ధరాత్రి మృతదేహాన్ని పొన్నూరు తీసుకువచ్చాడు. దీంతో బంధువులు ఆదివారం ఆ యువకుడిపై అనుమానం ఉందని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హేమవర్ష మేనమామ శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పూర్తి దర్యాప్తు కోసం హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌కు కేసును బదలాయిస్తామని పట్టణ సీఐ శరత్‌బాబు తెలిపారు. చదవండి: ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న కరోనా అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు -
నవ వధువు అనుమానాస్పద మృతి.. పరారీలో భర్త, అత్త మామలు
సాక్షి, మైసూరు: కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు మెట్టినింటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు... మైసూరులోని శ్రీరామ్‌పుర ఎస్బీఎం లేఔట్లో నివాసం ఉంటున్న ప్రదీప్‌తో మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా సరగూరు గ్రామానికి చెందిన ఆశారాణి(25)కి నెల రోజుల క్రితం మైసూరులోని కాళమ్మ కళ్యాణ మండపంలో వివాహం జరిగింది. ఏం జరిగిందో ఏమో కాని శనివారం ఆశారాణి ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. సమాచారం అందుకున్న ఆశారాణి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి వచ్చి కూతురిని ఆ స్థితిలో చూసి విలపించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో కట్నం కోసం భర్త ప్రదీప్, అతని తండ్రి, తల్లి కొట్టి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న ప్రదీప్, అతని తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చదవండి: ‘ఇళ్లల్లోకి వెళ్లండి, రోడ్లపై కనిపిస్తే కాల్చిపడేస్తాం’ -
హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి
బనగానపల్లెరూరల్(కర్నూలు జిల్లా): మండల పరిధిలోని యాగంటిపల్లె గ్రామ సమీపంలో గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) ప్రధాన కాల్వ లైనింగ్ పనుల వద్ద టి.అనూష(15) అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నారాయణ్‌పేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన రాములు అతని కమార్తె అనూష కొన్ని రోజుల క్రితం.. జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాల్వ లైనింగ్ పనుల కోసం వచ్చారు. రాములు ఉదయం పనులు చేసేందుకు వెళ్లాడు. పని ప్రదేశంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్ల వద్ద కుమార్తె ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాములు.. షెడ్ పక్కన కుమార్తె.. మంటల్లో కాలిపోయి, మృతి చెంది ఉండడాన్ని చూసి నిర్ఘాంత పోయాడు. విషయం తెలుసుకున్న సీఐ సురేష్‌రెడ్డి, ఎస్ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించి, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనూషను ఎవరైనా అత్యాచారం చేసి.. డీజల్ పోసి నిప్పటించి హత్య చేశారా? బాలిక ఆత్మహత్య చేసుకుందా? అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. చదవండి: భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని... గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా.. -
రక్తపు మడుగులో భార్యాభర్తలు.. బాల్కనీలో ఏడుస్తూ చిన్నారి
అమెరికాలో భారత్‌కు చెందిన దంపతులు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు అక్కడి స్థానిక మీడియా శుక్రవారం పేర్కొంది. వివరాలు.. మహారాష్ట్ర బీద్ జిల్లాకు చెందిన బాలాజీ భారత్ రుద్రవర్కు(32) ఆర్తితో 2014లో వివాహమైంది. అనంతరం 2015లో ఉద్యోగరీత్యా వీరు అమెరికాకు వెళ్లారు. న్యూజెర్సీలోని నార్ద్ ఆర్లింగ్టన్లో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. యూఎస్‌లోని ఓ ప్రముఖ భారత ఐటీ సంస్థంలో బాలాజీ ఐటీ నిపుణుడిగా ఉద్యోగం చేస్తుండగా.. భార్య గృహిణి. ఈ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉండగా ప్రస్తుతం ఆర్తి ఏడు నెలల గర్భవతి. అయితే అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం బాలాజీ కుమార్తె ఇంటి బాల్కనీలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లగా.. లివింగ్ రూమ్‌లో భార్యాభర్తలిద్దరూ రక్తపు మడుగుల్లో విగతా జీవిలుగా కనిపించారు. బాధితులిద్దరి శరీరంపై బలమైన కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే బాలాజీ తన భార్యను కత్తితో పొడిచి అనంతరం తను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటారని యూఎస్ మీడియా కథనాలు వెల్లడించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, రీపోర్టులు వచ్చాక మృతికిగల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కాగా దంపతుల మృతిపై మహారాష్ట్రలో ఉంటున్న తమ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి న్యూజెర్సీలోని బాలాజీ స్నేహితుల సంరక్షణలో ఉంది. చదవండి: అమెరికాలో తుపాకీ.. ఇక అంత ఈజీ కాదు బాబోయ్.. అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్! -
‘మా కూతురి మెడపై ఉరివేసిన గుర్తులున్నాయి’
సాక్షి, సైదాబాద్: ‘మా బిడ్డది అనుమానస్పద మృతి కాదు.. కావాలనే ఎవరో చంపేశారు.. మాకు న్యాయం చేయండి’ అని బాలిక తల్లిదండ్రులు పోలీస్ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఈనెల 23న సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాజాబాగ్‌లో బాలిక అనుమానస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం బాలిక తల్లిదండ్రులు జ్యోతి, సేవ్యానాయక్ మాట్లాడుతూ... గత మంగళవారం పనికి వెళ్లి వచ్చేసరికి తమ పదేళ్ల పెద్ద కూతురు పడిపోయి ఉందని పరిశీలించగా అప్పటికే మృతి చెందిందన్నారు. బాలిక ఒంటిపై దుస్తులు లేకుండా పలు గాయాలున్నాయని రోధిస్తూ తెలిపారు. తమ కూతురు మెడపై ఉరి వేసిన గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆత్మహత్యపై కనీస అవగాహన లేని పిల్ల ఉరి వేసుకుంటుందా అని వారు ప్రశ్నించారు. ఇది కావాలనే ఎవరో చేసిన హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు వాస్తవాలు వెలికి తీయాలని విన్నవించుకున్నారు. తమకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. దర్యాప్తు కొనసాగుతోంది.. సైదాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఘటన జరిగిన రోజు తమ విచారణలో పాప ఉరి వేసుకోవటంతోనే మృతి చెందిందని తెలిపారు. ఆ రోజు తల్లిదండ్రులు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. ఇప్పటికీ కేసు విచారణలోనే ఉందని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తరువాత దర్యాప్తు చేస్తామన్నారు. బాలిక మృతి ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవం అన్నారు. చదవండి: సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్.. ‘నేను చనిపోతున్నా’ -
వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ప్రియురాలికి వేధింపులు.. ప్రియుడి అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల ప్రకారం. .జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరి నగర్ కాలనీలో ఓ యువతితో సునీల్(38)అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరి మధ్య ఇటీవలే మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి సునీల్..ఆ యువతిని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి హత్య వరకు వెళ్లిందని అనుమానిస్తున్నారు. మృతుని శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో ఇది హత్యా లేక అనుమానాస్పద మృతి అన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..యువతితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని అన్న శ్యామ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : నా కోరిక తీర్చు.. లేదంటే నీ భర్త, కొడుకును.. మహిళ హత్య కేసులో యువకుడి అరెస్టు -
మూడో పెళ్లి.. వివాహిత అనుమానాస్పద మృతి
వైరారూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాలడుగు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన మాణిగ భాస్కర్ అలియాస్ బజార్ కోదాడ మండల ద్వారాకుంట గ్రామానికి చెందిన శైలజ (27)ను సుమారు ఐదేళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో నిత్యం ఘర్షణ పడుతుండేవారు. దీంతో శైలజ తరచూ పుట్టింటింకి వెళ్తుండేది. మూడు రోజుల క్రితం కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగడంతో శైలజ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతున్నారు. కాగా కొందరు రైతులు ఆదివారం పాలడుగు సమీపం నుంచి వెళ్తుండగా బావిలో నుంచి దుర్వాసన వచ్చింది. బావి వద్దకు వెళ్లి గమనించగా శైలజ మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించగా.. వారు శనివారం మధ్యాహ్నం వరకు ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అనుమానాస్పదంగా పసికందు మృతి
రేగోడ్(మెదక్): అభం శుభం తెలియని పసికందు అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన రేగోడ్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, అల్లాదుర్గం సీఐ జార్జి తెలిపిన వివరాల ప్రకారం.. రేగోడ్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మన్ పోచమ్మ దంపతులకు ఇది వరకు ఇద్దరు కుమారులు ఉండగా రెండోబాబు ఏడాది క్రితం చనిపోయాడు. తొమ్మిది రోజుల క్రితం పోచమ్మ మరో బాబుకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో పసికందు అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఇంట్లో లక్ష్మన్, పోచమ్మలతో పాటు మరో ఐదుగురు ఉంటున్నారు. లక్ష్మన్ పాత సామగ్రి (స్క్రాప్) వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పసికందు మృతిచెందిన ఘటనా స్థలికి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలు చేరుకుని క్లూస్‌కోసం పరిశీలించారు. పసికందు తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో పెద్దశంకరంపేట ఎస్ఐ నరేందర్, స్థానిక హెడ్ కానిస్టేబుల్ పూర్యానాయక్, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి : (బైక్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య) (మంచి నిద్రలో ఉండగా..గొలుసు మాయం!) -
హోటల్లో ఎంపీ అనుమానాస్పద మృతి
-
హోటల్లో ఎంపీ అనుమానాస్పద మృతి
ముంబై : దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సౌత్ ముంబైలోని ఓ హోటల్లో మోహన్ నిర్జీవంగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఎంపీ మోహన్‌ది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాతీలో రాసిన సూసైడ్ నోట్‌ను దేల్కర్ బస చేసిన గది నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎంపీ మోహన్ దేల్కర్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా 58 ఏళ్ల మోహన్‌కు భార్య కలాబెన్, ఇద్దరు పిల్లలు అభినవ్, దివిత ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో దాద్రా నగర్ హవేలి లోక్‌సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. గతంలో కూడా ఏడుసార్లు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న మోహన్.. 2019 వరకు దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. అనంతరం ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. గతేడాది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో భేటీ తర్వాత దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలకు మోహన్ డెల్కర్ జేడీయూతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జేడీయూకు ఆయన మద్దతు ఇవ్వడం వల్ల దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. చదవండి: కీలకంగా మారిన బిట్టు.. మధుపై అనుమానం! వికారాబాద్‌లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య -
బర్త్‌డే: తప్పతాగి యువకుడి మృతి?
సాక్షి, కంటోన్మెంట్: పుట్టిన రోజు వేడుక జరుపుకొన్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే.. విందులో అధికంగా మద్యం తాగడం వల్లే మరణించినట్లు తెలుస్తోంది. గోపాలపురం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు తమిళనాడులోని ముళ్లిపట్టుకు చెందిన కేశవ ప్రకాశ్ (28) ఎనిమిది నెలలుగా రెజిమెంటల్ బజార్‌లోని జేఎంజే హాస్టల్లో ఉంటున్నాడు. స్థానికంగా ఓ కాల్ సెంటర్లో ఉద్యోగం చేసే కేశవ్ సోమవారం రాత్రి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని రూమ్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం అతను బయటికి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు తలుపులు పగులగొట్టి చూడగా కేశవ్ ప్రకాశ్ తన రూమ్‌లో పడి ఉన్నాడు. ఈ మేరకు హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అధికంగా మద్యం సేవించడం వల్లే కేశవ్ మృతి చెందినట్లు భావిస్తున్నప్పటికీ, ఇతర కారణాలు ఏవైనా ఉంటాయన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘రేవంత్ ఉన్నడా.. నాకు బాగా దగ్గరోడు ఆయన’ -
నాన్నా.. కొడుతున్నాడు! : అదే చివరి మాట
పన్నెండేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొంది. తాగుడుకు బానిసైన భర్తలో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అంతలోనే పిల్లలు పుట్టడంతో వారి భవిష్యత్ కోసమైనా బతకాలని భరిస్తూ వచ్చిన ఆమె శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన కర్నూలులోని కౌతాళం మండల పరిధిలోని లింగాలదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది. సాక్షి, కౌతాళం రూరల్: కౌతాళం మండల కేంద్రానికి చెందిన హరిజన గౌరప్ప, పెద్ద బోడెమ్మ కూతురు బుజ్జమ్మ(30)ను సమీప బంధువు లింగాలదిన్నె గ్రామానికి చెందిన హరిజన అబ్రహం, యమిలమ్మ కుమారుడు జాన్‌కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరి సంసారం నాలుగేళ్లు అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత భర్త జాన్ తాగుడుకు బానిసై భార్యను వేధించడం మొదలు పెట్టాడు. వీరికి నలుగురు మగ పిల్లలు. అయినా భర్తతో పాటు అత్త, మామ, ఆడపడచు భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండటంతో తల్లిదండ్రులకు చెప్పుకుని విలపించేది. సంసారం ఆగం చేసుకోవద్దని వారు చెప్పే మాటలు, నలుగురు పిల్లల భవిష్యత్‌ను తలచుకుని భరిస్తూ వచ్చేది. (ఆదోనీలో పరువు హత్య కలకలం) బుజ్జమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు ఈ క్రమంలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో భర్త తాగి వచ్చి కొడుతుండటంతో తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా.. కొడుతున్నాడు’ అంటూ చెప్పింది. అవే ఆఖరి మాటలయ్యాయి. వెంటనే ఫోన్ కట్ కావడంతో తండ్రి తిరిగి కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇలాంటి వేధింపులు గతంలోనే చూసిన అతను మిన్నకుండిపోయాడు. అర్ధరాత్రి కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పక్కింటి వాళ్ల నుంచి ఫోన్ ద్వారా సమారాచారం తెలుసుకుని గుండెలు బాదుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన లింగాలదిన్నె చేరుకుని బోరున విలపించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో భర్త, అత్తమామలే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, హత్యనా, ఆత్మహత్మనా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. కాగా అమ్మ కావాలంటూ ఏడుస్తున్న చిన్నారులను చూసి పలువురు కన్నీరు పెట్టుకున్నారు. -
వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి
సాక్షి, కృష్ణా : జిల్లాలోని కంచికచర్లలో వృద్ధ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులు బండారుపల్లి నాగేశ్వరరావు, ప్రమీలారాణిగా గుర్తించారు. బెడ్ రూంలో విగతా జీవులుగా పడి ఉండడంతో.. దీన్ని హత్యగా భావిస్తున్నారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మర్డర్ ఫర్ గైస్ కోణంలో దర్యాప్తు చేపట్టారు.