అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి  | Suspicious death of Burripalem student in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి 

Published Sun, Mar 17 2024 5:32 AM | Last Updated on Sun, Mar 17 2024 5:55 AM

Suspicious death of Burripalem student in America - Sakshi

స్వగ్రామంలో అంత్యక్రియలు  

తెనాలిరూరల్‌: అమెరికాలోని కనెక్టికట్‌లో నివశిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తనయుడు అభిజిత్‌ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మిలు ఎన్నో ఏళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్‌ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమా­రుడు అభిజిత్‌ బోస్టన్‌లోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు.

ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్‌ నుంచి ఎలాంటి సమాచారం రాక­పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్ర­యించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసు­లు సెల్‌ నంబర్‌ ఆధారంగా అభిజిత్‌ మృత­దేహాన్ని బోస్టన్‌ సమీపంలోని అడవి ప్రాంతంలో అదే రోజు గుర్తించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా అభిజిత్‌ భౌతిక కాయం అమెరికా నుంచి శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం  చేరుకుంది. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ భౌతికకాయాన్ని సందర్శించి, అభిజిత్‌ తల్లిదండ్రులను పరామర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement