burripalem
-
అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి
తెనాలిరూరల్: అమెరికాలోని కనెక్టికట్‌లో నివశిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తనయుడు అభిజిత్ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మిలు ఎన్నో ఏళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అడవి ప్రాంతంలో అదే రోజు గుర్తించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా అభిజిత్ భౌతిక కాయం అమెరికా నుంచి శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం చేరుకుంది. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భౌతికకాయాన్ని సందర్శించి, అభిజిత్ తల్లిదండ్రులను పరామర్శించారు. -
బుర్రిపాలెంలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
తెనాలిరూరల్: ప్రముఖ సినీహీరో ‘సూపర్‌స్టార్’ ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో శనివారం ఆవిష్కరించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, అల్లుడు సుధీర్‌బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు పాల్గొని సూపర్‌స్టార్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ అని కొనియాడారు. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కృష్ణ తమ స్వగ్రామం బుర్రిపాలెంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, వాటిని తాము కొనసాగిస్తామని చెప్పారు. కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల మాట్లాడుతూ ‘బుర్రిపాలెం బుల్లోడు’గా కోట్లాది మంది ప్రేమను తమ తండ్రి పొందారని, అభిమానులతో కలసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
బుర్రిపాలెం: హలో.. నా సినిమా ఎలా ఉందండి?
సాక్షి, గుంటూరు: నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెనాలి పరిధిలోని ఆయన స్వగ్రామం బుర్రిపాలెంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంత ఎత్తు ఎదిగినా.. ఆయన సొంతూరిపట్ల ఎంతో మమకారం ప్రదర్శించేవారని, వయసు తారతమ్యాలను ప్రదర్శించకుండా పేరుపేరునా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అంతకుముందు.. సోమవారం ఆయన ఆరోగ్యం విషమించిందన్న సమాచారం తెలుసుకున్న బుర్రిపాలెం వాసులు.. ఎప్పటికప్పుడు క్షేమసమాచారాల గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరాభిమానులు. కానీ, ఆ పూజలు ఫలించలేదు. మంగళవారం వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ వార్త తెలియగానే.. గ్రామస్థులు కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఈ ఉదయం కృష్ణ చిత్రపటానికి పూలమాలమేసి నివాళులర్పించారు. బుర్రిపాలెం బుల్లోడు (1979) పేరుతో ఓ చిత్రంలో ఆయన నటించారు. ఇక చెన్నై, హైదరాబాద్‌లు కేంద్రంగా ఆయన నట శిఖరాలను అధిరోహించిన విషయం విదితమే. అయినా.. తాను పుట్టిన గడ్డకు సేవ చేయడం మాత్రం ఆయన మరువలేదు. ఆయన బుర్రిపాలెం వెళ్లినప్పుడల్లా పండుగ వాతావరణం నెలకొనేది. గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ నిర్మాణంతో పాటు కళ్యాణ మండపం, గీతా మందిరం కట్టించారు కృష్ణ. ఇక డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చారని కొందరు గ్రామస్తులు అంటున్నారు. ఊళ్లో వ్యవసాయం గురించి కూడా ఆయన ఆరాలు తీసేవారని మరికొందరు అంటున్నారు. మరోవైపు కరోనా సమయంలో ఆయన తనయుడు మహేష్ బాబు చొరవతో గ్రామంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగిన సంగతి తెలిసిందే. హలో.. నా సినిమా ఎలా ఉంది? బుర్రిపాలెం బుల్లోడిగా సూపర్ స్టార్ కృష్ణకు మరో ట్యాగ్ లైన్ కూడా ఉంది. మోసగాళ్లకు మోసగాడు సమయంలో.. ఆయన స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక సినిమాల పరంగానూ బుర్రిపాలెం సెంటిమెంట్‌ను ఆయన ఫాలో అయ్యేవారు. ఏ చిత్రం రిలీజ్ అయినా సరే.. ముందుగా అక్కడికి ఫోన్ చేసేవారట. గ్రామస్తుల్లో బాగా దగ్గరి వాళ్ల అభిప్రాయాలను ఫోన్ చేసి అడిగి తెలుసుకునేవారు. ఆ అభిప్రాయం ఎలా ఉన్నా సరే.. ఆయన స్వీకరించేవారట. ఇక విజయవాడ, తెనాలి ప్రాంతాల్లో ఆడియొన్స్ సినిమాకు బ్రహ్మరథం పడితే.. అది కచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతుందని నమ్మే వారు ఆయన. అంతేకాదు.. బుర్రిపాలెం వాసులు ఎక్కడ కలిసినా ఆప్యాయంగా పలకరించేవారాయన. ఇదీ చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే! -
దత్తత గ్రామంలో మహేశ్‌బాబు వ్యాక్సిన్ డ్రైవ్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు స్వస్థలం, దత్తత గ్రామం బుర్రిపాలెంలో రెండో దశ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది. బుర్రిపాలెం ప్రజల కోసం మహేశ్ మరోసారి కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాడు. గతంలో సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా మే 31న బుర్రిపాలెం ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించిన ఈ హీరో తాజాగా రెండో డోసు అందించేందుకు సంకల్పించాడు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ఆదివారం నుంచి గ్రామప్రజలకు ఉచితంగా కోవిడ్ టీకా ఇస్తున్నారు. కాగా మహేశ్ ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే! ఈ రెండు ఊర్లను అభివృద్ధి చేసే బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్న మహేశ్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిజమైన శ్రీమంతుడిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. The Second dose of #COVID vaccination drive begins today at #Burripalem village, sponsored by @urstrulyMahesh with the help of #Andhrahospitals. #BurripalemgetsVaccinated #MaheshBabu pic.twitter.com/wGZZUGSXVd — BARaju's Team (@baraju_SuperHit) July 11, 2021 -
Krishna B'day: బుర్రిపాలెం ప్రజలకు టీకా వేయించిన మహేశ్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు తన తండ్రి కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుని సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేశ్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాడు. బుర్రిపాలెంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తున్నామని మహేశ్ ట్విటర్లో పేర్కొన్నాడు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ఈ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపాడు. "టీకా అనేది మళ్లీ సాధారణంగా జీవించడానికి అవసరమైన ఆశాకిరణం వంటిది. బుర్రిపాలెం ప్రజలు టీకా వేసుకుని సురక్షితంగా ఉండాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నమిది. ఈ టీకా డ్రైవ్ ఏర్పాటుకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు, క్లిష్ట కాలంలో స్వచ్చందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించిన టీమ్ మహేశ్‌బాబు సభ్యులకు ప్రత్యేక అభినందనలు" అని మహేశ్ ట్వీట్ చేశాడు. కాగా మహేశ్ ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఈ రెండు ఊర్లను అభివృద్ధి చేసే బాధ్యతలను తన భుజాల మీద వేసుకోవడమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిజమైన శ్రీమంతుడిగా ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నాడు. Vaccination is our ray of hope for a normal life again! Doing my bit to ensure everyone in Burripalem is vaccinated and safe. Extremely grateful to #AndhraHospitals for helping us arrange this vaccination drive. pic.twitter.com/n4CXbzrN9X — Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2021 చదవండి: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్ ‘టైటానిక్’ మూవీ హీరోయిన్‌తో పోల్చుకున్న యంగ్ హీరో -
సామాజిక మార్పుపైనే దృష్టి
తెనాలి: బుర్రిపాలెం అభివృద్ధితోపాటు అక్కడ సామాజిక మార్పుపై ప్రధానంగా దృష్టిసారిస్తానని ‘వెండితెర శ్రీమంతుడు’ ప్రిన్స్ మహేశ్‌బాబు చెప్పారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామాన్ని దత్తత తీసుకోవడం గొప్ప అవకాశమని చెప్పిన ఆయన.. గ్రామాభివృద్ధిలో తన సాయం, ప్రభుత్వ పథకాలతో సమకూరే నిధులతోపాటు ఇతరులనూ కలుపుకొని ముందుకు వెళతానని చెప్పారు. గుంటూరు జిల్లా బుర్రిపాలేనికి మహేశ్‌బాబు ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. తన చిన్నాన్న జి.ఆదిశేషగిరిరావు, బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, విజయవాడ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలసి విలేకరులతో మహేశ్ మాట్లాడారు. తన నాయనమ్మ నాగరత్నమ్మ, తాత, తండ్రికి ఈ ఊరంటే ఎంతో ఇష్టమని, వారు ఊరికి చాలా చే శారని చెప్పారు. ఇక్కడకు రావటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘శ్రీమంతుడు’ చేస్తున్న సమయంలో తన బావ జయదేవ్ బుర్రిపాలేన్ని దత్తత తీసుకోమని సూచించారన్నారు. అప్పట్లోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తే సినిమా కోసం చెప్పినట్టుగా ఉంటుందని, ఆ తర్వాతనే వెల్లడించానని చెప్పారు. గ్రామంలో ఆరోగ్యం, విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. విజయవాడ సిద్ధార్థ వైద్యకళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులు, ఆంధ్రా హాస్పటల్లచే వైద్యశిబిరాల నిర్వహణ, వైద్యసహాయం వంటివి చేపడతామన్నారు. రోడ్లు, డ్రెయిన్లపై ఇప్పటికే కొంత పని చేశామన్నారు. తన నాయనమ్మ కట్టించిన స్కూలులో సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. తన ప్రధాన దృష్టి అంతా సామాజిక మార్పుపైనని స్పష్టంచేశారు. తరచూ ఇక్కడకు వస్తుంటానన్నారు. తెలంగాణలో తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని ఇప్పటికే తన భార్య నమ్రత సందర్శించారని, అక్కడ కార్యక్రమాలు ఆరంభిస్తున్నామని చెప్పారు. కాగా మహేశ్‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. తమ నివాసం నుంచే మహేశ్‌బాబు వారికి పలుసార్లు అభివాదం చేశారు. అనంతరం టాపులేని వాహనంలో గ్రామంలో పర్యటించారు. గ్రామంలో చేపట్టనున్న రూ. 2.16 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్‌ను ఎంపీ గల్లా జయదేవ్ ఆవిష్కరించారు. ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులను మహేశ్‌బాబు ప్రారంభించారు. వీరితో తెనాలి ఆర్డీవో జి.నర్సింహులు, తహశీల్దారు జీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులున్నారు. -
మళ్లీ మళ్లీ వస్తా: మహేశ్ బాబు
బుర్రిపాలెం: తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెంలో విద్య, ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే తన లక్ష్యమని హీరో మహేశ్ బాబు అన్నారు. సొంతూరిని దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఆదివారం ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. బుర్రిపాలెంకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. బుర్రిపాలెం పాఠశాలను బాగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇక్కడకు మళ్లీ మళ్లీ వస్తానన్నారు. తెలంగాణలో తాను దత్తత తీసుకున్న గ్రామానికి వచ్చే వారం వెళ్లనున్నట్టు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం సిద్ధాపూర్ గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, మహేశ్ బాబు రాక సందర్భంగా బుర్రిపాలెంలో పండగ వాతావరణం నెలకొంది. ఆయనను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 70 మంది బౌన్సర్లతో 'ప్రిన్స్'కు భద్రత కల్పించారు. -
బుర్రిపాలెంలో శ్రీమంతుడు
గుంటూరు: ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు జిల్లా బుర్రిపాలెం వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం వచ్చిన 'శ్రీమంతుడు'కు గ్రామస్తులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు బుర్రిపాలెం. మహేష్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. మహేష్ తన బావ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో కలసి వచ్చారు. మహేష్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైంది. ఈ రోజు అభివృద్ధి పనులకు మహేష్ శంకుస్థాపన చేయనున్నారు. మహేష్ బాబు రాకకోసం బుర్రిపాలెం గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభివృద్ధికి నోచుకోని తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయన్న ఆశతో ఉన్నారు. సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం అన్న సందేశాన్ని చాటిన శ్రీమంతుడు సినిమాకు ముందే మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. మార్చిలో మహేష్ భార్య నమ్రత, సోదరి పద్మావతి ఈ గ్రామానికి వచ్చారు. అప్పట్లో నమ్రత ప్రకటించినట్టే రెండు నెలల్లోపే మహేష్ ఈ ఊరికి వచ్చారు. -
రా... రా... శ్రీమంతుడా
► నేడు బుర్రిపాలేనికి మహేశ్‌బాబు ► ఆశగా ఎదురుచూస్తున్న గ్రామస్తులు ► ఘనస్వాగతానికి సన్నాహాలు ► పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రిన్స్ ఆరోజు వచ్చేసింది.. ఎంతోకాలంగా ఆ గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్న శుభదినం రానే వచ్చింది. తమ గ్రామాన్ని సుసంపన్నం చేసే శ్రీమంతుడు ఆదివారం వస్తున్నాడన్న వార్తతో బుర్రిపాలెం గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు అభివృద్ధికి నోచని తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయన్న ఆశతో వారంతా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెనాలి : సూపర్‌స్టార్ కృష్ణ తన స్వగ్రామం బుర్రిపాలెం పేరును సినీ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘బుర్రిపాలెం బుల్లోడు’తో ఈ ప్రాంతాన్ని వెండితెరపైకి కూడా తెచ్చారు. కృష్ణ తనయుడు, ‘ప్రిన్స్’ మహేశ్‌బాబు దత్తత తీసుకోవడంతో మరోసారి ఈ గ్రామం వార్తల్లోకొచ్చింది. ‘సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం’ అన్న సందేశాన్ని చాటిన శ్రీమంతుడు సినిమాకు ముందే మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. ఆయన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ ప్రకటన చేసినప్పట్నుంచీ బుర్రిపాలేన్ని బంగారుపాలెం చేస్తారన్న భావనతో అభిమానులు ప్రిన్స్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మార్చిలో మహేష్ భార్య నమ్రతా, సోదరి పద్మావతి కలిసి వచ్చారు. అప్పట్లో నమ్రతా ప్రకటించినట్టే రెండు నెలల్లోపే మహేష్ ఆదివారం గ్రామానికి రానున్నారు. అన్నీ ఉన్నా అభివృద్ధి లేదు బుర్రిపాలెం జనాభా 3,306 మంది. ఓటర్లు 2,524 మంది. జనాభాలో మూడోవంతు ఎస్సీలు, బీసీలే. ఆయకట్టు 1,200 ఎకరాలు. నీటితీరువా మినహా ఇతర ఆదాయం లేదు. ప్రభుత్వ నిధులతో సహా ఏడాదికి వచ్చే రూ.10 లక్షలతో అభివృద్ధికి ఆస్కారమే లేకుండా పోయింది. శివలూరుకు వెళ్లే డొంకరోడ్డు ఒక్కటే తారురోడ్డు. గ్రామంలో రోడ్లు 3వేల మీటర్లుంటే, 2,400 మీటర్లు సిమెంటు రోడ్లు వేయగలిగారు. మూడు ఎలిమెంటరీ పాఠశాలలు, ఉన్నత పాఠశాల, ప్రైవేట్ బీఈడీ కళాశాల, మూడు అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో రెండింటికి శాశ్వత భవనాలు నిర్మితం కాగా, మరొకటి నిర్మించాల్సి ఉంది. అక్షరాస్యత 80 శాతం. భూగర్భ జలాలు అడుగంటి, తాగునీటి సమస్య ఎదురైంది. మురుగునీటి పారుదల వ్యవస్థ దుర్భరంగా ఉంది. దళితుల కాలనీల్లో వసతులు కరువయ్యాయి. షెడ్యూల్ ఇదీ.. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా బయల్దేరనున్న మహేశ్‌బాబు ఉదయం 11.30 గంటలకు కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బుర్రిపాలెం వచ్చి సొంత ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి తన నాయనమ్మ, మాజీ సర్పంచ్ నాగరత్నమ్మ నిర్మించిన గీతామందిరంలో దైవదర్శనం చేసుకుంటారు. గ్రామం వెలుపల పంట సంజీవని కింద పంటపొలాల్లో తీసిన నీటికుంటలను పరిశీలిస్తారు. అక్కడే గ్రామస్తులు, అభిమానులతో మాట్లాడతారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందజేస్తారు. రెండు డ్వాక్రా గ్రూపులకు చెక్కులు పంపిణి చేస్తారని ఎంపీడీవో శ్రీనివాసరావు చెప్పారు. నాగరత్నమ్మ పేరుతో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వశిక్షా అభియాన్ నిధులతో కొత్తగా నిర్మించిన రెండు తరగతి గదులను ప్రారంభిస్తారు. గ్రామంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. బహిరంగ సభ రద్దయినట్టు సమాచారం. మురుగునీటి పారుదల మెరుగుపరచాలి బుర్రిపాలెం గ్రామంలో మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా ఉంది. నీరుపారుదలకు సరైన మార్గం లేదు. కల్యాణమండపం ఎదుట నాకు పూరిల్లు ఉంది. వర్షం వస్తే నీళ్లను తోడుకోవాల్సిన పరిస్థితి. డ్రెయినేజీని మెరుగుపరచాలని కోరుకుంటున్నా.- నిడమానూరి కనకదుర్గాదేవి, బుర్రిపాలెం సమస్యలు చెప్పుకునే వీలుంటుందా? గ్రామంలో డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు ఉన్నాయి. మహేష్‌బాబు దత్తత తీసుకున్నాడని తెలిసిన నాటి నుంచి పరిస్థితులు మెరుగు పడతాయని ఆశిస్తున్నాం. ఆయనను కలిసి మా సమస్యలను వివరించే అవకాశం వస్తుందో రాదో. - కంచర్ల స్వాములు, బుర్రిపాలెం -
ఆధునికతే అసలైన దత్తత
గ్రామాభివృద్ధిపై నమ్రత శిరోడ్కర్ బుర్రిపాలెంలోపర్యటన ప్రజల అవసరాలు తెలుసుకున్న మహేష్‌బాబు భార్య తెనాలి : గ్రామాన్ని దత్తత తీసుకోవడమంటే కేవలం రోడ్లు వేయడం, రంగులు పూయడం కాదని, ఆధునిక గ్రామంగా తీర్చిదిద్దడం, ప్రజలను చైతన్యం చేసి భాగ స్వాములను చేయడం, వారి జీవన ప్రమాణాలను పెంచడమని ప్రిన్స్ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ చెప్పారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్‌బాబు దత్తత తీసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు నమ్రత, మహేష్ సోదరి గల్లా పద్మావతి గురువారం గ్రామంలో పర్యటించారు. అనంతరం స్థానిక కల్యాణమండపంలో గ్రామ సర్పంచి కొండూరు సామ్రాజ్యం అధ్యక్షతన ఏర్పాటుచేసిన బహిరంగ సభలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. నమ్రత మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా గుర్తింపును పొందాల్సి ఉందన్నారు. అప్పుడే అనారోగ్య సమస్యలు తొలగి వైద్య ఖర్చులు తగ్గిపోతాయని చెప్పారు. మద్యపానం, ధూమపానం సాధ్యమైనంతగా తగ్గించాలని, అక్షరాస్యతను నూరు శాతానికి చేర్చాలన్నారు. అంతా ఐక్యంగా ఉండాలని, తరచూ గ్రామసభలు నిర్వహించి, అన్ని వర్గాలను భాగస్వాములను చేసి ముందుకు నడవాలని చెప్పారు. గ్రామంలో వివిధ పనులకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని, గ్రామాభివృద్ధిని పర్యవేక్షించాలని సలహానిచ్చారు. సభకు ముందు అంగన్వాడి కార్యకర్త శ్రీలక్ష్మి, డ్వాక్రా మహిళ ఘట్టమనేని సామ్రాజ్యం, ప్రధానోపాధ్యాయుడు లలితా ప్రసాద్ ఆయా విభాగాలకు సంబంధించిన అవసరాలను ప్రస్తావించారు. వాకా పాములు సభకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవీ శ్రీనివాస్, తహశీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, ఎంఈవో రవికాంత్, ఎంపీపీ ఎస్.వెంకట్రావు, జెడ్పీటీసీ ఎ.జయలక్ష్మి, పాలకేంద్రం అధ్యక్షుడు చలపతిరావు, నీటిసంఘం అధ్యక్షుడు కోటా వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి ప్రియబాంధవి, మార్కెట్ యార్డు డెరైక్టర్ కంచర్ల ఏడుకొండలు, పి.శ్రీనివాస్, అశోక్, డి.శారద పాల్గొన్నారు. అడుగడుగునా స్వాగతం నమ్రతకు బుర్రిపాలెం గ్రామస్తులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని మౌలిక సదుపాయాలు, అక్కడి కుటుంబాల వివరాలతో సహా సమగ్ర సమాచారాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పంపిన ప్రత్యేక బృందం ఇప్పటికే సేకరించింది. ఈ క్రమంలో అక్కడి ప్రజల మనోగతాన్ని, అవసరాలను స్వయంగా తెలుసుకునే నిమిత్తం నమ్రత, మహేష్‌బాబు సోదరి, జయదేవ్ భార్య పద్మావతితో కలిసి వచ్చారు. తొలుత హీరో కృష్ణ ఇంట్లో ఆయన తలిదండ్రులు ఘట్టమనేని నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసిన నమ్రత ఉదయం 9.30 గంటల నుంచి గ్రామంలో పర్యటించారు. వీధుల్లో నడుస్తూ.. ముందుగా కృష్ణ తల్లిదండ్రులు నిర్మించిన గీతామందిరానికి వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం ఎస్సీ కాలనీకి వెళ్లి, అక్కడి చ ర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాలనీలో మహిళలను పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఘట్టమనేని నాగరత్నమ్మ పేరిట నడుస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు లలితాప్రసాద్, విద్యార్థులు, ఉపాధ్యాయులను పలకరించారు. అక్కడి అవసరాలను తెలుసుకున్నారు. పాఠశాల ఎదుట సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అక్కడ మొక్క నాటారు. అనంతరం గ్రామంలోని కల్యాణమండపంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. మళ్లీ మహేష్‌తో వస్తా.. బాబు (మహేష్‌బాబు)కు బుర్రిపాలెం ఊరంటే చాలా ఇష్టమని నమ్రత చెప్పారు. తనతోపాటే మహేష్ రావాల్సి ఉందని, బిజీ షెడ్యూలు కారణంగా రాలేకపోయినట్టు చెప్పారు. గ్రామస్తులు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు, ఆతిథ్యానికి ధన్యవాదాలు చెబుతూ ‘మళ్లీ వస్తా.. మహేష్‌తో’ అన్నారు. తొలుత ‘అందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో మాట్లాడటం ఆరంభించిన నమ్రత కొద్దిసేపు తెలుగులోనే మాట్లాడినా.. సరిగ్గా రాదని చెబుతూ ఇంగ్లిష్‌లో ప్రసంగించారు. దేవినేని కరుణ చంద్రబాబు ఆమె ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. మహేష్‌బాబు, నమ్రత, వారి పిల్లలతో రూపొందించిన టెలీఫిలిం, 2015 ‘రిఫ్లెక్షన్స్’ పేరుతో ఎంపీ గల్లా జయదేవ్ చిత్రమాలికను ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రదర్శించారు. దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత విజయవాడ (ఇంద్రకీలాద్రి) : సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమత్ర గురువారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చిన నమత్రకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. నమత్రను తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. -
'త్వరలో మహేష్‌బాబు వస్తారు'
గుంటూరు : బుర్రిపాలెంను స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత ఆ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గురువారం నమ్రత గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించారు. అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో గ్రామస్తులతో నమ్రత సమావేశమయ్యారు. గ్రామంలో సమస్యలను ఈ సందర్భంగా నమ్రత అడిగి తెలుసుకున్నారు. త్వరలో బుర్రిపాలెంలో ప్రిన్స్ మహేష్ బాబు పర్యటిస్తారని నమ్రత గ్రామస్తులకు తెలిపారు. నమ్రత వెంట మహేష్ బాబు సోదరి గల్లా పద్మావతి ఉన్నారు. -
బుర్రిపాలెంలో పర్యటించనున్న శ్రీమంతుడి శ్రీమతి
ప్రిన్స్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామమైన గుంటూరు జిల్లా తెనాలి తాలుకా బుర్రిపాలెంను దత్తత తీసుకుని... అభివృద్ధి చేసేందుకు ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులోభాగంగా ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత గురువారం బుర్రిపాలెంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటనతో బుర్రిపాలెం బంగారమాయేనా ? ఇప్పటికైనా గ్రామానికి అభివృద్ధి దారులు తెరుచుకునేనా ? సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఈ గ్రామాన్ని పూర్తిగా మార్చేయనున్నారా? ఈ ప్రశ్నలు బుర్రిపాలెం గ్రామస్తుల మెదళ్లలో మెదులుతున్న ఆశలు, ఆకాంక్షలు.తన తండ్రి కృష్ణ సొంత ఊరైనా బుర్రిపాలెం దత్తత తీసుకున్నట్లు ఏడాది కిందట ప్రకటించిన మహేష్ బాబు.. నమ్రత ద్వారా ఏ వరాలు జల్లు కురిస్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు బుర్రిపాలెం బుల్లోడు సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ తన ఊరిని వెండితెరకెక్కించి రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశారు. ఆయన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు ఆ ఊరిని దత్తత తీసుకుని మరోసారి ఆ గ్రామాన్ని వార్తల్లో నిలిపారు. 'సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం' అనే సందేశాన్ని చాటిన శ్రీమంతుడు సినిమాకు ముందే మహేష్ బాబుకు బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అప్పట్లో ప్రకటించిన విషయం విదితమే. అప్పటి నుంచి బుర్రిపాలెం గ్రామం మహేష్ బాబుకు కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌తోపాటు సోదరి గల్లా పద్మావతి గురువారం గ్రామంలో పర్యటించనున్నారు. దీంతో గ్రామస్తుల్లో కొత్త ఆశలు చిగురింప చేసింది. నాటి నుంచి నేటి వరకు... సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ, తల్లి నాగరత్నమ్మ, తండ్రి వీరరాఘవయ్య. గ్రామానికి రాజకీయంగా... సామాజికంగా వీరు సేవలందించారు. నాగరత్నమ్మ గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. గ్రామస్తులు విరాళంగా ఇచ్చిన స్థలంలో ఉన్నతపాఠశాల నిర్మాణానికి సొంత నిధులు అందించారు. అలాగే శ్రీకృష్ణ సాయి గీతమందిరాన్ని కూడా నిర్మించారు. ఆసుపత్రి కోసం సొంత స్థలం విరాళమిచ్చినా ప్రభుత్వం మాత్రం వినియోగించలేదు. జన్మస్థలంపై మమకారం కలిగిన కృష్ణ తన బుర్రిపాలెం అందాలను... అక్కడి రైతుల జీవన దృశ్యాలను తన సినిమాల్లో చిత్రీకరించారు. సాధ్యమైనప్పుడల్లా సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడకొచ్చి గ్రామస్తులతో గడుపుతుంటారు. -
బుర్రిపాలెం... బుల్లోడు
సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరు బుర్రిపాలెం ‘స్మార్ట్ విలేజ్’గా మారనుందా? అవును. తండ్రి పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలని మహేశ్‌బాబు సంకల్పించారు. గుంటూరు జిల్లా ఎంపీ, తన బావ గల్లా జయదేవ్‌తో కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అందుకే, బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారాయన. -
'బుర్రిపాలెంను దత్తత తీసుకోబోతున్న మహేష్‌బాబు'
గుంటూరు : గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామాన్ని తన బావమరిది, సినీహీరో మహేష్‌బాబు త్వరలో దత్తత తీసుకోనున్నట్టు గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తెలిపారు. బుర్రిపాలెం జెడ్పీ హైస్కూలు ఆవరణలో సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు జయదేవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ బుర్రిపాలెంను దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని ఎన్నికలకు ముందే అనుకున్నామని చెప్పారు. కానీ ప్రజా ప్రతినిధులు తమ స్వగ్రామం, ఆత్తగారి ఊర్లను దత్తత తీసుకోకూడదన్న నిబంధనలు ఉండడంతో కుదరలేదన్నారు. అయితే తన భార్య, సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె పద్మ తెనాలి మండలం కంచర్లపాలెంను, తన బావమరిది అతని స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకోనున్నారని జయదేవ్ తెలిపారు.