బుర్రిపాలెంలో సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహావిష్కరణ | Superstar Krishna statue unveiling at Burripalem | Sakshi
Sakshi News home page

బుర్రిపాలెంలో సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహావిష్కరణ

Published Sun, Aug 6 2023 4:10 AM | Last Updated on Sun, Aug 6 2023 4:53 PM

Superstar Krishna statue unveiling at Burripalem - Sakshi

తెనాలిరూరల్‌: ప్రముఖ సినీహీరో ‘సూపర్‌స్టార్‌’ ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో శనివారం ఆవిష్కరించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, అల్లుడు సుధీర్‌బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు పాల్గొని సూపర్‌స్టార్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.

అనంతరం జరిగిన సభలో దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో కృష్ణ అని కొనియాడారు. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కృష్ణ తమ స్వగ్రామం బుర్రిపాలెంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, వాటిని తాము కొనసాగిస్తామని చెప్పారు. కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల మాట్లాడుతూ ‘బుర్రిపాలెం బుల్లోడు’గా కోట్లాది మంది ప్రేమను తమ తండ్రి పొందారని, అభిమానులతో కలసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఏపీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement