Superstar Krishna
-
జై బోలో కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వారణాసి మానస హీరోయిన్. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ‘దేవకి నందన వాసుదేవ’ మూవీ నుంచి ‘జై బోలో కృష్ణ...’ అంటూ సాగే రెండో పాటని రిలీజ్ చేశారు. ఈ పాటకి రఘురామ్ సాహిత్యం అందించగా, స్వరాగ్ కీర్తన్ పాడారు. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ‘‘భక్తి అంశాలతో కూడిన ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హీరో తన బ్యాచ్‌తో కలిసి కృష్ణుడి జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో ‘జై బోలో కృష్ణ...’ పాట వస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!
మహేశ్ బాబు పేరు చెప్పగానే మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ గుర్తొస్తాయి. ఊరు దత్తత తీసుకోవడం, వ్యవసాయం చేయడం లాంటి సందేశాల్ని సినిమాల ద్వారా ఇస్తూ హిట్స్ కొట్టేస్తున్నాడు. మరోవైపు 'గుంటూరు కారం' లాంటి మాస్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్న మహేశ్.. ఇప్పుడు మరో మంచిపనికి శ్రీకారం చుట్టాడు. తెలుగు హీరోల్లో మహేశ్ కాస్త డిఫరెంట్. అయితే సినిమా షూటింగ్ లేదంటే ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. వీటికి మధ్యలో యాడ్స్ చేస్తూ బిజీబిజీగా ఉంటాడు. ఇవన్నీ పక్కనబెడితే ఎంబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 2500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించాడు. అలానే తన సొంతూరు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని.. ఆ ఊరి బాగోగులు చూసుకుంటున్నాడు. (ఇదీ చదవండి: బిగ్ బాస్: నా ప్రైజ్ మనీలో వాళ్లే రూ. 27 లక్షలు తీసుకున్నారు: వీజే సన్నీ) తాజాగా తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ తొలి వర్థంతి సందర్భంగా ఓ మంచిపని మొదలుపెట్టాడు. దాదాపు 40 మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు అయ్యే ఖర్చంతా.. ఎంబీ ఫౌండేషన్ సమకూరుస్తుందని చెప్పారు. తాజాగా 'ఎడ్యుకేషనల్ ఫండ్' పేరుతో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేశాడు. ఈ క్రమంలో విద్యార్థులంతా మహేశ్ గర్వంగా ఫీలయ్యేలా చేస్తామని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పనిచేస్తాడు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత జక్కన్న చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. కాకపోతే ఈ మూవీ రిలీజ్ కావడానికి మరో మూడు-నాలుగేళ్లు ఈజీగా పడుతుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) As a tribute to Superstar Krishna garu, The Mahesh Babu foundation has recently launched the Superstar Krishna Educational Fund. @urstrulyMahesh pic.twitter.com/wd4WL3KJU5 — Mahesh Babu Foundation (@MBfoundationorg) November 15, 2023 -
'మామయ్య.. ఆగిపోలేదు మీ ప్రస్థానం'.. సుధీర్ బాబు ఎమోషనల్!
ఇటీవలే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సుధీర్ బాబు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎమోషనలయ్యారు. మామయ్యను తలుచుకుంటూ సోషల్ మీడియాలో వేదికగా సూపర్ కృష్ణ ఫోటోను పంచుకున్నారు. సుధీర్ బాబు తన ట్వీట్లో రాస్తూ 'మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం హరోం హర అనే పాన్ ఇండియా చిత్రంలో సుధీర్ బాబు నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 22న టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా కృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా మరిన్ని సేవ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఎం.బీ ఫౌండేషన్ పేరుతో ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల చదువు కోసం ఉపకారవేతనాలు కూడా ఇవ్వనున్నారు. మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.#SSKLivesOn pic.twitter.com/lYdFgRIcaa — Sudheer Babu (@isudheerbabu) November 15, 2023 -
నేను కృష్ణ గారికి పాడను అంటే అప్పుడు ఆయన అన్న మాట..!
-
కృష్ణ కుటుంబాన్ని ఎలా ఒప్పించారు..?
-
నా అభిమానులకు థాంక్స్: సూపర్ స్టార్ కృష్ణ
-
నా పిల్లలు సెటిల్ అయిపోయారు చాలా సంతోషంగా ఉంది
-
నా సినిమాలకంటే వాళ్ళ సినిమాలు చాలా రిచ్ గా ఉండేవి..!
-
మహేష్ పై ఆ నమ్మకం ఉంది అని అంటున్న కృష్ణ
-
నాకొక తీరని కోరిక ఉంది..!
-
ఆరోజు ఎన్టీఆర్ రియాక్షన్ మర్చిపోలేనిది: సూపర్ స్టార్ కృష్ణ
-
నా కలలోకి వచ్చి ఇలా అన్నాడు: మాధవరావు
-
కృష్ణ గారు మానసికంగా చాలా దెబ్బతిన్నాడు..!
-
టీవిలో స్క్రోల్ చూసి తెలుసుకున్న.. అంతవరకు తెలియదు
-
నటుడిగా కంటే వ్యక్తిగా చాలా గొప్పవాడు..!
-
నన్ను నిర్మాతను చేస్తా అన్నాడు: మాధవరావు
-
కృష్ణ విజయ నిర్మలను ఆ గెటప్ లో చూసి ఎగిరి గంతేసాడు..!
-
కృష్ణ గారు ఎంత గొప్పవారంటే.. నా కోసం షూటింగ్ ఆపి మరి..!
-
ఆ గొప్ప మనిషి ఎలాంటి వాడంటే: రంగారావు
-
నాన్నగారి గురించి అలా మాట్లాడుతుంటే బాధేసింది
-
సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని..కానీ కలుద్దాం అంటే భయమేసింది..!
-
జయప్రద అంటే చాలా ఇష్టం..!
-
బుర్రిపాలెంలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
తెనాలిరూరల్: ప్రముఖ సినీహీరో ‘సూపర్‌స్టార్’ ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో శనివారం ఆవిష్కరించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, అల్లుడు సుధీర్‌బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు పాల్గొని సూపర్‌స్టార్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ అని కొనియాడారు. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కృష్ణ తమ స్వగ్రామం బుర్రిపాలెంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, వాటిని తాము కొనసాగిస్తామని చెప్పారు. కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల మాట్లాడుతూ ‘బుర్రిపాలెం బుల్లోడు’గా కోట్లాది మంది ప్రేమను తమ తండ్రి పొందారని, అభిమానులతో కలసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
మహేష్ పక్కన ఉంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడలేరు..
-
కృష్ణ అంకుల్ చాలా అదృష్టవంతులు ఎందుకంటే...!
-
ఇది మీ కోసమే నాన్న.. మహేశ్ బాబు స్పెషల్ ట్వీట్, పోస్టర్ వైరల్
సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు(మే 31). ఈ సందర్భంగా మహేశ్ బాబు, త్రివిక్రమ్ కొత్త సినిమా పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్నహ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. (చదవండి: నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా..హీరో అశ్విన్ కన్నీంటి పర్యంతం) SSMB28 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పోస్టర్ని నేడు విడుదల చేశారు. ఇందులో మహేశ్ తలకు ఎర్ర టవల్ చుట్టుకొని ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. ‘ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణ గారి లెగసీని సెలబ్రేట్ చేసుకుంటూ’అంటూ కార్నర్లో కృష్ణగారి ఫోటోని పెట్టారు. పోస్టర్ చూస్తుంటే ఫైట్ సీన్‌కి సంబంధించినది అని తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్‌ని ఈ రోజు సాయంత్రం రివీల్ చేయనున్నారు. కాగా, ఈ పోస్టర్ని మహేశ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘ఈరోజు మరింత ప్రత్యేకమైంది. ఇది నీ కోసమే నాన్న’ అని క్యాప్షన్ ఇచ్చాడు. మహేశ్ చేసిన ట్వీట్, ఆ లుక్ వైరల్ గా మారాయి. Today is all the more special! This one's for you Nanna ❤️❤️❤️ pic.twitter.com/HEs9CpeWvY — Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2023 -
మళ్ళీ పెళ్లి కృష్ణగారికి అంకితం
‘‘రియల్ బోల్డ్ కపుల్ అంటే కృష్ణగారు, విజయ నిర్మలగారు. వాళ్ల రథం మళ్లీ ముందుకు వెళ్లాలని విజయ్ కృష్ణ మూవీస్‌ని మళ్లీ ప్రారంభించడం గర్వంగా ఉంది. సూపర్‌స్టార్ కృష్ణగారి 81వ జయంతి (మే 31) సందర్భంగా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాను’’ అని వీకే నరేష్ అన్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వీకే నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. నరేష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (26) విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో వీకే నరేష్ మాట్లాడుతూ–‘‘ నేను బతికున్నంత కాలం నటిస్తాను. అలాగే సమాజ సేవ చేస్తా’’ అన్నారు. చిత్రపరిశ్రమలో వీకే నరేష్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్’ నిర్వాహకులు ఆయన్ను సత్కరించారు. సంగీత దర ్శకుడు సురేష్ బొబ్బిలి, నటి అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు. -
ఇటీవల మరణించిన సినీ ప్రముఖులకు ఏపీ కేబినెట్ నివాళులు
ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నివాళులర్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్ సాగర్‌కు నివాళి అర్పిస్తూ మంత్రివర్గం మౌనం పాటించింది. -
ములాయం, కృష్ణ, కృష్ణంరాజులకు పార్లమెంట్ నివాళి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, టాలీవడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సహా తదితరులకు తొలుత లోక్‌సభ నివాళులర్పించింది. సంతాప సందేశం చదివిన తర్వాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అటు.. రాజ్యసభలోనూ వారికి నివాళులర్పించారు. మరోవైపు.. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారానున్నారన్నారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్ సమర్థంగా నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: జీ20 నాయకత్వం.. భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం: ప్రధాని మోదీ -
యాక్షన్ ప్లాన్.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్‌కు మహేశ్!
రెండు నెలల క్రితం తల్లి ఇందిరా దేవి మరణం, ఇటీవల(నవంబర్ 15) తండ్రి కృష్ణ హఠాన్మరణంతో మహేశ్ బాబు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన తివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. అతడు’(2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయ్యింది. అక్కడే ఓ వారం రోజులు షూట్ చేశారు. రెండో షెడ్యూల్ ఇటీవల ప్రారంభం కావాల్సి ఉండగా.. కృష్ణ మరణంతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ డిసెంబరు 8న ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ముందు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట త్రివిక్రమ్. తండ్రి మరణంతో మహేశ్ పుట్టేడు శోకంలో ఉన్నప్పటికీ.. నిర్మాతల కోసం తిరిగి షూటింగ్లో పాల్గొనడంపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా షూటింగ్ పునఃప్రారంభానికి సహకరించడం.. సినిమాపై ఆయనకు ఉన్న శ్రద్ద, గౌరవాన్ని చూపిస్తోందని అభిమానులు తెలుపుతున్నారు. -
ఈ రోజు మహేశ్ బాబుకు ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే?
ఇవాళ నవంబరు 29వ తేదీ. అయితే ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదులెండీ ఇవాళ టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబుకు ప్రత్యేకమైన రోజు అని చెప్పేందుకు అలా రాశా. అయితే ఎందుకు అని మీకు సందేహం వచ్చి ఉంటుంది సుమా. అందుకే ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి. ప్రిన్స్ మహేశ్ బాబుకు ఆయన అభిమానులకు ఈరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. మహేశ్ బాబు రాజకుమారుడులా ఎంట్రీ ఇచ్చి.. మురారిలా మురిపించి.. ఒక్కడుగా వచ్చి.. బాక్సాఫీస్‌ను ఊపేసిన పోకిరిలా అయినా.. తెలుగు సినిమాకు పక్కా బిజినెస్‌మెన్‌లా సరికొత్త మార్కెట్ సృష్టించిన ఓవర్సీస్ స్టార్ అతడే. గెలుపోటములతో సంబంధం లేకుండా.. సైనికుడులా కష్టపడుతూ.. ఎల్లప్పుడు దూకుడుగా ఉంటూ.. శ్రీమంతుడిలా అలరిస్తూ.. మహర్షిలా సాయం చేస్తూ.. సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న వన్ అండ్ ఓన్లీ స్టార్ మహేశ్ బాబు. ఆయన అభిమానులకు ఈరోజు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్‌గా ఎదగడానికి ఈరోజే ప్రధాన కారణం. నటనకు నాంది పడింది ఈరోజే..: మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రయాణానికి పునాది పడింది ఈ రోజే. దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'నీడ' సినిమాలో తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ నటించారు. 1979లో విడుదలైన ఈ చిత్రంలో మురళీ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అందులో మహేశ్ బాబు బాలనటుడిగా అదరగొట్టారు. అప్పట్లో ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. మరోవైపు మహేశ్ బాబు బాగా నటించడంతో ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకున్నారు. తొమ్మిది చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించి..: బాలనటుడిగా మొత్తం తొమ్మిది చిత్రాల్లో మహేశ్ బాబు నటించగా.. అందులో కృష్ణతో కలిసి ఏడు చిత్రాల్లో మెప్పించాడు. సరిగ్గా 43 ఏళ్ల కింద ఇదే రోజు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల అభిమానులు.. చిన్నప్పటి ఫొటోలను షేర్ చేస్తూ గుర్తు చేసుకుంటున్నారు. 43 years of his Reign 👑 & Still Continues to Conquer ❤️🔥 Superstar @urstrulyMahesh 🦁#43YearsForSSMBReignInTFI 💥#MaheshBabu #SSMB pic.twitter.com/dZSobnxlen — SSMB Space 🌟 (@SSMBSpace) November 29, 2022 -
కృష్ణలో ఏదో ఆకర్షణ శక్తి ఉండేది, అందుకే ఆయనతో..: చంద్రమోహన్
దివంగత నటులు, సూపర్ స్టార్ కృష్ణలో ఏదో ఆకర్షణ శక్తి ఉండేదంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీనియర్ నటులు చంద్రమోహన్. రీసెంట్గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆయన సూపర్ కృష్ణ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కృష్ణ ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఎవరికి వారు అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవాళ్లం. మద్రాసులో నేను, రామ్మోహన్ ఒకే రూంలో ఉండేవాళ్లం. కృష్ణ సపరేట్గా ఉండేవాళ్లు. అప్పుడప్పుడు మా రూంకు ఆయన వస్తూ ఉండేవారు’ అని చెప్పారు. ‘‘కృష్ణ మొదటి నుంచి చాలా చురుగ్గా ఉండేవారు. ఆయన చాలా స్పీడ్. అనుకున్నది వెంటనే చేసేవారు. సినిమా చాన్స్‌ల కోసం ప్రయత్నిస్తూనే ఆయన నిర్మాతలతో టచ్‌లో ఉండేవారు. మా రూంకి వచ్చినప్పుడల్లా ‘ఫలానా సినిమాలో నన్ను తీసుకున్నారు. ఈ సినిమాకు నేను బుక్ అయ్యాను’ అని కృష్ణ చెబుతుంటే మేం ఆశ్చర్యపోయేవాళ్లం. ఒకసారి కృష్ణతో సినిమా చేసినవారు మళ్లీ ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపేవారు. అంత ఆకర్షణ శక్తి కృష్ణలో ఉండేది’’ అంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో శోభన్ బాబు, రామకృష్ణ వంటి ఇతర హీరోలు ఉన్నప్పటికీ, కృష్ణతోనే తనకు ఎక్కువ అనుబంధం ఉండేదన్నారు. పెద్ద హీరో కావాలనీ.. ఫారిన్ కారు కొనడమే తన కల అని కృష్ణ అంటుంటే.. అంత తేలికైన విషయం కాదని తాను అంటుంటే వాడినన్నారు. కానీ చూస్తుండగానే ఆయన తాను అనుకున్నవి సాధిచారన్నారు. ఇక తాను పద్మాలయా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్లోనే దాదాపు 40 సినిమాలకు పైగా చేశానని, తానంటే కృష్ణ - విజయనిర్మలకు అంతటి అభిమానమంటూ చంద్రమోహన్ ఎమోషనయ్యారు. చదవండి: బిగ్‌బాస్ 6: ఆర్జీవీతో డాన్స్ వీడియోపై ఇనయా సుల్తానా ఏమందంటే.. యశోద మూవీ వివాదంపై స్పందించిన నిర్మాత -
ఆ రూపంలో ఇంకా జీవించే ఉన్నారు.. మంజల ఘట్టమనేని ఎమోషనల్ ట్వీట్
సూపర్ స్టార్ కృష్ణ మరణం వారి కుటుంబంతో పాటు అభిమానుల్లో విషాదాన్ని నింపింది. ఇవాళ ఆ నటశేఖరుని పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబసభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని నాన్నను గుర్తు చేసుకున్నారు. (చదవండి: నాన్న ఎన్నో ఇచ్చారు.. వాటిలో నాకు అదే గొప్పది : మహేశ్ బాబు) కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ.. 'మీరు మమ్మల్ని వదిలివెళ్లినా.. మీరు ఇచ్చిన గొప్ప వారసత్వం రూపంలో ఇంకా జీవించే ఉన్నారు. మేము ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం నాన్నా' అంటూ పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. You continue to live through the rich legacy you left behind. We love you forever Nana ❤️❤️❤️ pic.twitter.com/Mjw7fdcQ3d — Manjula Ghattamaneni (@ManjulaOfficial) November 27, 2022 -
సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కర్మ.. 32 రకాల వంటకాలతో విందు
సూపర్‌స్టార్ కృష్ణ మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 350కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కృష్ణ.. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. నేడు(నవంబర్ 27) హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ కృష్ణ దశ దిన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రెండు చోట్ల భారీ ఏర్పాటు చేశారు. అభిమానులకు జేఆర్సీ కన్వెన్షన్‌లో.. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు ఎన్ కన్వెన్షన్‌లో భోజన ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం 5వేల పాసులను పంపిణీ చేశారు. 32 రకాల వంటకాలతో ప్రముఖులకు ఎన్ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులంతా పాల్గొననున్నారు. -
‘అమ్మాయిల పిచ్చి రూమర్’పై స్పందించిన కాంతారావు కూతురు
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటుడిగా ఓ వెలుగు వెలిగాడు కాంతారావు. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నోరకాల పాత్రలు పోషించి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ఎంతగానో ఆస్తులు పోగేశాడు. కానీ తర్వాతి కాలంలో నిర్మాతగా మారి ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో 400 ఎకరాలను పోగొట్టుకున్నాడు. కాంతారావు కూతురు సుశీల రావు మాట్లాడుతూ.. 'నాన్నగారి చిన్నతనంలోనే తాతయ్య చనిపోయాడు. దీంతొ నానమ్మ నాన్నను గారాబంగా పెంచింది. ఎవ్వరు ఏం చెప్పినా తనకు నచ్చిందే చేసేవాడు. నిర్మాణ రంగం వైపు వెళ్లొద్దని ఎన్టీ రామారావు గారు చెప్పారు, కానీ ఆయన వినిపించుకోలేదు. సినిమాల కోసం 400 ఎకరాలు అమ్మేశారు. అలా సినిమాలు నిర్మించి చాలా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ మాట వినుంటే బాగుండేదని అనుకున్నారు. అప్పుడు కృష్ణ- విజయనిర్మలగారు మా ప్రతి సినిమాలో కాంతారావుకు ఓ వేషం ఇప్పిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. నా పెళ్లి కోసం కృష్ణగారు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. నాన్నకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చచ్చేదాకా నటిస్తూ ఉండాలన్నదే ఆయన కోరిక. కాంతారావుకు ఆడవాళ్ల పిచ్చి ఉంది, దానివల్లే ఉన్నదంతా పోగొట్టుకున్నారని ఓ రూమర్ ఉంది. అది పూర్తిగా అవాస్తవం. ఆయనకు సినిమాలు, ఇల్లు ఈ రెండే తెలుసు. ఏ హీరోయిన్‌కూ డబ్బులివ్వలేదు' అని క్లారిటీ ఇచ్చింది సుశీల. -
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రూపుదిద్దుకున్న సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహం
-
తండ్రి సూపర్‌స్టార్ కృష్ణపై మహేష్‌బాబు ఎమోషనల్ ట్వీట్
-
తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతిపై మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్
తండ్రి మృతిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా తండ్రి మరణాన్ని తలుకుంటూ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహాంగా గడిపారు. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ వ్యక్తిత్వం. మీలో నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి. నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. ఇంతకుముందెన్నడూ లేని బలం నాలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మీ కాంతి నాలో ఎప్పటికి ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్న.. మై సూపర్‌స్టార్’ అంటూ మహేశ్ బాబు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని పక్కన పెడుతున్నారు: ‘యశోద’ నటి -
'అందుకే నాన్న మమ్మల్ని విడిచి వెళ్లారేమో'.. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె ఎమోషనల్ పోస్ట్
కొద్ది రోజుల సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ ఏడాదిలోనే కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు కూడా మరణించారు. మహేశ్ బాబుకు ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టాలీవుడ్ చిత్రసీమ మొత్తం కదలివచ్చి సూపర్‌స్టార్‌కు నివాళులర్పించింది. ఇందిరా దేవికి రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఐదుగురు సంతానం. తాజాగా ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి పెళ్లిరోజు సందర్భంగా మంజుల ఎమోషనల్ పోస్ట్ చేసింది. (చదవండి: నాన్న.. నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్.. మంజుల ఎమోషనల్ ట్వీట్) మంజుల తన ఇన్‌స్టాలో రాస్తూ..' వారి వివాహబంధం స్వర్గంలో కొనసాగేంత గొప్ప బంధం. అమ్మ వెళ్లిన తర్వాత నాన్న చాలా మిస్ అయ్యారని నేను అనుకుంటున్నా. అందుకేనేమో మమ్మల్ని విడిచి అమ్మ వద్దకే చేరాడు. నిజంగా వారు ఆత్మలు కూడా సహచరులేనేమో. వారి 60 ఏళ్ల వివాహబంధానికి మేం ఐదుగురు పిల్లలం. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు నా తల్లిదండ్రులు కావడం నిజంగా అదృష్టం. వారి ప్రేమ మాకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. వారిలో కనీసం 10 శాతమైన స్వచ్ఛంగా మారడమే వారికిచ్చే ఉత్తమ బహుమతి అని నేను భావిస్తున్నా.' అంటూ ఎమోషనల్ అయ్యారు మంజుల. అమ్మా, నాన్నకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు . View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) -
కృష్ణానదిలో కృష్ణ అస్థికల నిమజ్జనం, ఉండవల్లి కరకట్టకు మహేశ్
దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నది సహా దేశంలోని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయనున్నారు. ఇందులో భాగంగా మహేశ్ బాబు ముందుగా కృష్ణ అస్థికలను నేడు నదిలో నిమజ్జనం చేశారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేసేందుకు సోమవారం మహేశ్ బాబు కుటుంబంతో కలిసి విజయవాడకు చేరుకున్నారు. చదవండి: నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటూ నటి మేఘన! వీడియో వైరల్ తాజాగా ఆయన కృష్ణానది ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మనిలయం వద్ద అస్థికలను నిమజ్జనం చేశారు. కృష్ణానదిలో కృష్ట అస్తికలు కలిపి, శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించారు మహేశ్ బాబు. ఈ కార్యక్రమంలో మహేశ్‌తో పాటు ఆయన బావ ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ సోదరుడు శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. Mahesh Babu Reached Gannavaram Airport. pic.twitter.com/XsUzSew2Cx — Naveen MB Vizag (@NaveenMBVizag) November 21, 2022 -
తండ్రి అంత్యక్రియల విషయంలో మహేశ్‌బాబు తప్పు చేశాడా?
సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేశ్‌బాబు తీసుకున్న నిర్ణయంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ అభిమానులతో పాటు టాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులు మహేశ్ బాబు తీరును తప్పుబడుతున్నారు. ఈ విమర్శలకు కారణం.. తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలను ‘మహాప్రస్థానం’లో నిర్వహించడమే. ఈ విషయంలో మహేశ్‌బాబు తన కుటుంబ సభ్యుల మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా, స్మారక చిహ్నం నిర్మించే విధంగా ప్రైవేట్ స్థలంలో దహనసంస్కారాలు చేయాలని మహేశ్ ఎందుకు ఆలోచించలేదని కృష్ణ ఫ్యాన్స్ అంటున్నారు. సోసైటీలో ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు మరణిస్తే.. వాళ్ల అంత్య క్రియలు వారి ప్రైవేట్ స్థలంలో నిర్వహిస్తుంటారు. ఇటీవల రెబల్‌స్టార్ కృష్ణ మరణిస్తే.. ఆయన పాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు దహన సంస్కారాలను అన్నపూర్ణ స్డూడియోలో నిర్వహించారు. ఎన్టీఆర్ మరణించినప్పుడు ప్రభుత్వ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించి, ఎన్టీఆర్ ఘాట్‌ని ఏర్పాటు చేశారు. కృష్ణ సతీమణి విజయనిర్మలకు గుర్తుగా ఆమె కుమారుడు నరేశ్ స్మారక మందిరం కట్టించిన సంగతి తెలిసిందే. కృష్ణ అంత్యక్రియలను కూడా పద్మాలయ స్టూడియోస్‌లో నిర్వహించి, స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తే గొప్పగా ఉండేదని కృష్ణ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం మహేశ్ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ ఏడాదిలో మరణించిన కృష్ణ సోదరుడు రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవిల అంత్యక్రియలు కూడా మహా ప్రస్థానంలోనే జరిగాయని.. అందుకే తండ్రి దహనసంస్కారాలు కూడా అక్కడే నిర్వహించాడేమోనని అంటున్నారు. అయితే తండ్రి కృష్ణ విషయంలో మహేశ్ బాబు ఆలోచన మాత్రం మరోలా ఉంది. కృష్ణ కోసం స్మారక చిహ్నం కాకుండా ఒక మెమోరియల్ ఏర్పాటుకి మహేశ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. -
ఒకే ఫ్రేమ్‌లో సూపర్ స్టార్ కష్ణ, మహేశ్ బాబు.. మీ రెండు కళ్లు చాలవు..!
సీనియర్ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల టాలీవుడ్ మొత్తం ఘననివాళి అర్పించింది. 350కి పైగా చిత్రాల్లో నటించిన నటశేఖరుడికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం నివాళులర్పించారు. నిర్మాతల నటుడిగా ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన సూపర్ స్టార్ కృష్ణ సినీప్రస్థానం ఓ చరిత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. కృష్ణను కడసారి చూసేందుకు వచ్చిన వేల మంది అభిమానులను చూసి యావత్ సినీ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సీనియర్ నటుడు మోహన్ బాబు కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉంది. అయితే తాజాగా మహేశ్ అభిమానులు ఎడిట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దివంగత సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు నటించిన సినిమాల్లోని సన్నివేశాలతో ఓ ఆసక్తికర వీడియో రూపొందించారు. ఆనాటి చిత్రాల్లోని సన్నివేశాలతో మహేశ్ బాబు నటించిన వాటిని కలిపి చేసిన ఎడిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో మహేశ్ తన తండ్రి గురించి చెప్పిన మాటలు ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తండ్రీ, కొడుకులను ఒకేసారి చూడటానికి మీ రెండు కళ్లు చాలవంటే నమ్మండి. అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి. The resemblance♥️@urstrulymahesh #KrishnaGarupic.twitter.com/05sAr9atVX — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) November 18, 2022 -
మాటలకు నిప్పులు అద్దాడు.. డైలాగ్స్‌కి డైనమిజం నేర్పాడు..
-
కెరీర్ మొత్తంలో 70 మందికి పైగా హీరోయిన్స్ తో డ్యాన్స్
-
ఒక శకం ముగిసింది
-
మహేష్ అన్నా నువ్వు ఒంటరి కాదు.. మేమంతా తోడుగా ఉన్నాం
పాపం మహేష్‌బాబు.. విధి ఆయన జీవితంలో తీరని విషాదం నింపింది. ఒక్క ఏడాదిలోనే కుటుంబంలోని పెద్ద దిక్కులను దూరం చేసి ఆయనకు పీడకలను మిగిల్చింది. ఒకరి మరణం నుంచి కోలుకునేలోపే మరొకరు.. మొదట అన్న.. తర్వాత తల్లి.. ఇప్పుడు నాన్న ఇలా వరుస విషాదాలు మహేష్‌బాబును ఒంటరిగా మిగిల్చాయి. అయితే బాధాతప్త హృదయంతో దిగాలుపడ్డ మహేష్‌కి మేమున్నామంటూ ఆయన అభిమానులు ముందుకొస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. నువ్వు ఒంటరి కాదు.. మేమంతా నీకు తోడుగా ఉన్నామని ధైర్యాన్నిస్తున్నారు. సాధారణంగా కుటుంబంలోని ఒక వ్యక్తి మరణిస్తేనే ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతారు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి కనీసం ఏడాదైనా పడుతుంది. అలాంటిది మహేష్‌బాబు ఒక్క ఏడాదిలోనే ముగ్గురు సొంతవాళ్లను కోల్పోయారు. అన్న నిష్క్రమణ నుంచి కాస్త కోలుకుంటున్నసమయంలోనే తల్లి ఈలోకాన్ని విడిచి పెట్టడంతో మహేష్ శోకసంద్రంలో మునిగిపోయారు. దుఃఖాన్ని దిగమింగుకొని చూస్తూ ఉండిపోయారు. యావత్ ప్రపంచం ఆయనను ఓదారుస్తున్నా గుండెల్లోని బాధ కళ్లలో కనిపిస్తోంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేని తన తండ్రి కృష్ణ అకాల మరణం మహేష్‌ను మరింత కృంగదీసింది. మునుపెన్నడూ లేనంత నైరాశ్యంలో ఆయన కూరుకుపోయారు. చదవండి: (సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. ఎవరా సీఎం?) కడసారి చూపునకు నోచుకోలేదు.. ఈ ఏడాది ప్రారంభంలోనే సోదరుడైన రమేష్‌బాబును కోల్పోయాడు. అప్పుడు మహేష్‌బాబు బాగా ఢీలా పడిపోయాడు. తండ్రి తర్వాత తండ్రిగా భావించిన అన్నను కడసారి కూడా చూడలేకపోయాడు మహేష్‌బాబు (క్వారంటైన్ కారణంగా). అప్పుడు మహేష్‌బాబుకు ఎంత కష్టం వచ్చిందంటూ అభిమానులు బాధపడ్డారు. ఈ బాధ నుంచి పూర్తిగా బయటకు రాకముందే మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. ఆ సమయంలో యావత్ సినీ ప్రపంచం వచ్చి మహేష్‌ను ఓదార్చారు. తల్లి అస్తికలను ఇటీవలే వారణాసిలో గంగానదిలో నిమజ్జనం చేసి వచ్చారు. ఆ బాధ నుంచి తేరుకుంటున్న సమయంలోనే కొండంత అండగా ఉన్న తండ్రి కృష్ణను కూడా కోల్పోయారు. కెరీర్ పరంగానే కాక అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలిచిన అన్న, అమ్మ, నాన్న దూరం కావడం మహేష్‌బాబుకు తీరనిలోటుగా మిగిలింది. కుటుంబంలో ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోవడం సాధారణ విషయం కాదు. కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు మహేష్‌బాబు కష్టాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. అయినా మహేష్‌బాబు బాధ తీర్చలేనిది. ఇప్పటి వరకూ తనకు స్తంభాలుగా ఉన్న ముగ్గురిని కోల్పోవడం తీరనిలోటే. ఈ కష్టకాలంలో అందరూ మహేష్‌కు సంతాపం తెలుపుతున్నారు. సోషల్‌మీడియాలోనూ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. #StayStrongMaheshAnna అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ బాధ నుంచి మహేష్‌బాబు త్వరగా బయటపడాలని అభిమానలోకం కోరుకుంటోంది. -
నాన్న కోసం మహేష్ బాబు సంచలన నిర్ణయం
-
ఏడాది క్రితం సూపర్‌స్టార్ కృష్ణ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ
-
జోహార్ నటశేఖరా! హీరో కృష్ణకు కన్నీటి వీడ్కోలు
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): లక్షలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం రాయదుర్గంలోని వైకుంఠ మహా ప్రస్థానం మోక్షఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య తెలుగు తెరపై ‘ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్’ భువి నుంచి దివికేగారు. అంతకుముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సీనియర్ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ క్రతువును నిర్వహించారు. కృష్ణ చితికి ఆయన కుమారుడు మహేశ్‌బాబు నిప్పంటించారు. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయరంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిమంది ప్రజలు అశ్రునయనాలతో తమ అభిమాన నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులు బారులు తీరిన కార్లలో ఊరేగింపును అనుసరించారు. పెద్దసంఖ్యలో ప్రజలు జేజేలు పలుకుతూ మహాప్రస్థానానికి చేరుకున్నారు. పరిమిత సంఖ్యలో లోపలికి అనుమతి వైకుంఠ మహాప్రస్థానంలోకి వెళ్లేందుకు పోలీసులు తొలుత పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మహేష్‌బాబు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, కుమార్తెలు మంజుల, ప్రియదర్శిని, పద్యావతితో పాటు నటుడు నరేష్, సుధీర్‌బాబు, సంజయ్, గల్లా జయదేవ్ తదితర సమీప బంధువులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణలతో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నందిగామ ఎమ్మెల్సీ అరుణ్, కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు, సినీ ప్రముఖులు మురళీమోహన్, దిల్‌రాజు, శివపార్వతి తదితరులు కూడా లోనికి వెళ్లారు. అభిమానులు, సామాన్య ప్రజలను మాత్రం క్రతువు ముగిసే వరకు అనుమతించలేదు. దీంతో మహాప్రస్థానం పరిసరాలన్నీ జనçసంద్రంగా మారి పోయాయి. నినాదాలతో మారుమ్రోగిన పరిసరాలు భారీగా గుమిగూడిన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘కృష్ణ అమర్ రహే, సూపర్‌స్టార్ కృష్ణ అమర్ రహే, జోహర్ కృష్ణ, జై కృష్ణ..జైజై కృష్ణ ’ అంటూ హోరెత్తించారు. ఒక దశలో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కుటుంబసభ్యులు, ప్రముఖులు వెళ్లిపోయిన తర్వాత అభిమానులను అనుమతించారు. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి తలసాని కృష్ణ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆయన ముందుగానే మహాప్రస్థానానికి చేరుకుని పోలీసులు, అధికారులకు పలు సూచనలు చేశారు. గవర్నర్ సహా ప్రముఖుల నివాళులు కృష్ణ పార్థివ దేహానికి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, కుమార్తె బ్రాహ్మణి నివాళులర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిర్మాత అల్లు అరవింద్, నటుడు కోట శ్రీనివాసరావు, సినీ నటి జయప్రద, ఏపీ మంత్రి రోజా, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు కృష్ణ భౌతికకాయయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంతిమయాత్ర మొదలైంది. సాయంత్రం 4 గంటల సమయంలో అంత్యక్రియలు ముగిసాయి. ఇదీ చదవండి: సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. అసలు విషయం ఏంటంటే.. -
సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. ఎవరా సీఎం?
50 ఏళ్లపాటు నిరంతరాయంగా 'సాహసమే ఊపిరి'గా ఎన్నో రికార్డులను నెలకొల్పిన నటశేఖరుడు.. ఇక లేడనే విషయం తెలుసుకొని యావత్ సినీలోకం కంటతడిపెడుతోంది. అయితే సూపర్‌స్టార్ కృష్ణ మనల్ని విడిచి వెళ్లిపోయిన ఆయన జ్ఞాపకాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో సూపర్‌స్టార్ కృష్ణ జీవితంలో జరిగిన ఒక సంఘటన మాత్రం ఔరా అనిపించకమానదు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే కుమార్తె వివాహానికి రావొద్దని చెప్పారంటే మనం నమ్మగలమా?. కానీ ఇదే నిజం.. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఒకసారి పరిశీలిస్తే.. కృష్ణ తన పెద్దకుమార్తె పద్మావతి వివాహ వేడుకను గల్లా జయదేవ్‌తో చెన్నైలో నిశ్చయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను సూపర్‌స్టార్ కృష్ణ స్వయంగా వెళ్లి వివాహానికి ఆహ్వానించారు. చెన్నైలోనే వివాహం జరుగుతుండటంతో అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేస్తూ తప్పకుండా వస్తానని మాటిచ్చింది. అయితే వివాహానికి మూడు రోజుల ముందు జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి కృష్ణను కలిశారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో మొదటి మూడు వరుసలు భద్రతా కారణాల రీత్యా జయలలితకు కేటాయించాల్సిందిగా సెక్యూరిటీ ఆఫీసర్ కోరారు. దీంతో షాక్ తిన్న కృష్ణ.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖలు వివాహానికి వస్తున్న సంగతి చెప్పి మొదటి మూడు వరుసలు పూర్తిగా కేటాయించడం కదురదని చెప్పారు. కృష్ణ వెంటనే జయలలితకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలోనే జయలలితను సున్నితంగా వివాహానికి రావొద్దని.. మీ ఆశీర్వచనాలు ఉంటే చాలని చెప్పారు. విషయాన్ని అర్థం చేసుకున్న జయలలిత వివాహానికి హాజరు కాకుండా పెళ్లిరోజున వధూవరులకు ఒక బొకేను పంపారు. కాగా, జయలలిత సూపర్‌స్టార్ కృష్ణతో గూఢాచారి 116, నిలువు దోపిడి వంటి సినిమాల్లో కలిసి నటించారు. చదవండి: (మహేశ్ బాబు గొప్ప మనసు.. తీవ్ర విషాదంలోనూ వారికోసం..!) -
మహేశ్ బాబు గొప్ప మనసు.. తీవ్ర విషాదంలోనూ వారికోసం..!
మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు అభిమానుల అశ్రునాయనాల మధ్య, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇవాళ ముగిశాయి. అభిమాన జనవాహిని ఆయన వెంట ఒక సైన్యంలా తరలివచ్చింది. తమ అభిమాన నటుడిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం వేలసంఖ్యలో నగరానికి చేరుకున్నారు. కృష్ణ పార్థివదేహాన్ని కడసారి చూసి భావోద్వేగానికి లోనయ్యారు. (చదవండి: అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణ అంత్యక్రియలు) ఇలాంటి విషాద సమయంలోనూ మహేశ్ బాబు తన గొప్ప మనసును చాటుకున్నారు. సూపర్ కృష్ణ కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. అభిమానులందరికీ ఆయన భోజన ఏర్పాట్లు చేశారు. తన తండ్రిని చూసేందుకు వచ్చిన వారు ఖాళీ కడుపుతో వెళ్లకూడదని మహేశ్‌బాబు అందరికీ భోజనం ఏర్పాటు చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన విషాదంలో ఉన్నా మా ఆకలి తీర్చారంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. మధ్యాహ్నాం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. And Are Waiting To See Super Star Krishna Garu 😢🙏 pic.twitter.com/tuatino9rO — Naveen MB Vizag (@NaveenMBVizag) November 16, 2022 -
అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణ అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కృష్ణకు ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. గౌరవ వందనం అనంతరం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక ఆయన అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చివరి సారిగా తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. బుధవారం పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర జరిగింది. కాగా ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్ ఆస్ప్రతిలో చేరిన కృష్ణ చికిత్స పొందుతూ మంగళవారం(నవంబర్ 15న) తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణాన్ని ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆయన చనిపోయారన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాం
-
సూపర్‌స్టార్ కృష్ణ మృతి.. ఆయన అత్తగారి గ్రామంలో విషాదఛాయలు
ఖమ్మం గాంధీచౌక్ : తెలుగు సినిమా రంగంలో అనేక రికార్డులు నెలకొల్పిన సినీ హీరో, సూపర్‌స్టార్ కృష్ణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో విడదీయలేని బంధం ఉంది. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగుకు చెందిన ఇందిరాదేవిని కృష్ణ వివాహమాడారు. అత్తగారి ఇంటికి వచ్చివెళ్లే క్రమంలో ఆయనకు ఖమ్మంతో అనుబంధం ఏర్పడింది. ఇక వందలాది సినిమాల్లో హీరోగా నటించిన కృష్ణకు జిల్లాలో అభిమానులు కూడా ఎక్కువే. హీరోగా గురిపు సాధించిన ఆయన అభిమానులు ఏర్పాటుచేసిన కార్యక్రమాలతో పాటు రాజకీయ నాయకుడిగానూ జిల్లాకు పలు సార్లు వచ్చారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో 2000 మార్చి 27న జిల్లా కళాకారుల ఐక్యవేదిక నిర్వహించిన మిలీనియం కళా పురస్కార ఉత్సవాల్లో కృష్ణ తన సతీమణి విజయనిర్మలతో కలిసి పాల్గొన్నారు. ఐక్యవేదిక ప్రతినిధులు వీ.వీ.అప్పారావు, డాక్టర్ నాగబత్తిని రవికుమార్ ఆధ్వర్యాన కృష్ణకు ఎన్టీఆర్ పురస్కారం, విజయనిర్మలకు మిలీనియం కళా పురస్కారం అందించి సన్మానించారు. అలాగే, ఖమ్మం కమాన్ బజార్లో ఏర్పాటు చేసిన విమల్ షోరూం ప్రారంభోత్సవానికి కృష్ణ వచ్చిన సమయాన ఉమ్మడి జిల్లా కృష్ణ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాబాజీ, గౌరవ అధ్యక్షుడు తోట రంగారావు ఆయనకు జ్ఞాపిక అందించారు. (చదవండి: ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్ యూ తాతయ్య: సితార ఎమోషనల్) సినిమా షూటింగ్లో కృష్ణతో అభిమానులు తోట రంగారావు, తదితరులు (ఫైల్) ఇక భద్రాచలం అడవులు, గోదావరి తీరంలో జరిగిన ఎన్కౌంటర్ సినిమా షూటింగ్లో నూ సూపర్ స్టార్ పాల్గొన్నారు. కాగా, మాజీ మంత్రి జలగం ప్రసాదరావుతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ప్రసాదరావు ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయాన ప్రచారానికి హాజరయ్యారు. నేతలతో పాటు అభిమానుల సంతాపం ఖమ్మం మయూరిసెంటర్ : సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు తెలి యగానే ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు ఆయన చిత్రపటాల వద్ద నివాళులర్పించగా కొందరు కృష్ణకు కడసారి వీడ్కోలు పలికేందుకు హైదరాబాద్ వెళ్లారు. అలాగే, సీఎం కేసీఆర్‌తో కలిసి కృష్ణ నివాసానికి వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించడమే కాక మహేష్‌బాబు, కుటుంబీకులను ఓదార్చారు. ఇక ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా కృష్ణ మృతిపై సంతాపం ప్రకటించారు. (చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?) -
సూపర్ స్టార్ కృష్ణ సాధించిన ఈ రికార్డులు టచ్ చేయడం అసాధ్యం..
-
కృష్ణ లేని లోటు ఎవరు పూడ్చలేనిది, ఆయన మళ్లీ పుట్టాలి: ఫ్యాన్స్ ఆవేదన
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకి తరలించారు. నానక్‌రామ్ గూడలోని ఆయన నివాసం నుంచి పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచి ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తమ అభిమాన నటుడి కడచూపు కోసం పద్మాలయ స్టూడియోకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు రావడంతో పద్మాలయ స్టూడియో ముందు అభిమానుల తాకిడి ఎక్కువైంది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అభిమానులు అయనను కడసారి చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమాలు, పవర్ఫుల్ డైలాగ్స్ గుర్తు చేస్తూ సూపర్‌స్టార్ ఘననివాళులు అర్పిస్తున్నారు. ‘‘ఆయన ఓ హీరో మాత్రమే కాదు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన చనిపోయారన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాం. మా ఇంట్లో మనిషి మరణించిన దానికంటే ఎక్కువగ బాధగా ఉంది. ఆయన కడచూపు కోసం వచ్చిన ఈ అభిమానుల సంద్రోహమే ఆయన మంచితనానికి నిదర్శనం. ఆయన ఓ లెజెండరి నటులు. సినిమాల్లో తన పాత్రలతో ఎన్నో వేరియేషన్స్ చూపించారు. ఆయన లేని లోటు ఇండస్ట్రీలో ఎవరు పూడ్చలేరు. ఆయన మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నాం’ అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చబొట్టుతో అభిమానం ఇక సిద్దిపేటకు చెందిన ఓ అభిమాని ఏకంగా కృష్ణపేరును చేతిపై పచ్చబొట్టు వేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అంటూ చేతిపై పచ్చబొట్టు వేసుకుని అభిమానాన్ని చాటుకున్నాడు. కృష్ణగారు చనిపోయారని తెలిసి అన్నం కూడా తినలేదు అంటూ సదరు అభిమాని కన్నీరు పెట్టుకున్నాడు. అనంతరం అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌ను ఆపకుండ చెబుతూ తన అభిమాన నటుడికి నివాళి అర్పించాడు. అచ్చం కృష్ణలా మారి.. ఇక ఓ అభిమాని అచ్చం కృష్ణలా తయరై వచ్చాడు. ఊహా తెలిసినప్పటి నుంచి కృష్ణగారు అంటే అభిమానం, ఆ అభిమానంతోనే ఇక్కడి వచ్చాను. యమదొంగ, నెంబర్ వన్, అల్లూరి సీతారామరాజు. ఆయన సినిమాలన్నా, ఆయన డైలాగ్స్ అంటే గూస్బంప్స్ రావాల్సిందే. ఈ సందర్భంగా అల్లూరి సీతారామారాజు మూవీలోని డైలాగ్స్ చెప్పి అదరగొట్టాడు. -
ఆ కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణ..
-
డిస్ట్రిబ్యూటర్లకు అండగా ఉండే రియల్ హీరో కృష్ణ గారు : బండి సంజయ్
-
ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్ యూ తాతయ్య: సితార ఎమోషనల్
తాత సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని భావోద్వేగానికి లోనయ్యింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తాత కృష్ణతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఇకపై ఇంతకు ముందలా ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇకపై వీకెండ్ లంచ్ ఇంతకు ముందులా ఉండదు. మీరు నాకు ఎన్నో విలువైన విషయాలు నెర్పించారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా? ఎప్పుడూ నన్ను నవ్వించేవారు. ఇప్పుటి నుంచి అవన్ని మీ జ్ఞాపకాలుగా నా మెమరిలో ఉండిపోతాయి. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి చేరుకుంటాను. మిస్ యూ సో మచ్ తాతగారు(తాతయ్య)’ అంటూ సితార రాసుకొచ్చింది. కాగా ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ చికిత్స పొందతూ నిన్న మంగళవారం తెల్లవారుజాము తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
డబ్బులిచ్చి మరీ సినిమాలు రిలీజ్ చేశాడు..కృష్ణని కోల్పోవడం దురదృష్టకరం: అల్లు అరవింద్
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్కి చేరుకున్న ఆయన .. కృష్ణకు పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ నిర్మాత హీరో అని కొనియాడాడు. ‘నేను సినిమాలు తీయడానికి వచ్చినప్పటి నుంచి ఆయనను(కృష్ణ) గమనిస్తున్నాను. ఆయన చనిపోయాడనే వార్త వినగానే.. ఆయన చేసిన గొప్ప విషయం గుర్తుకు వచ్చింది. ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఆయనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకముందే సినిమాలు విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అప్పుడు కృష్ణ వాళ్లని పిలిచి ‘మీరేదో కష్టాల్లో ఉన్నారట కదా.. నన్ను ఏమైనా సాయం చెయ్యమంటారా?’అని అడిగి డబ్బులు ఇచ్చి మరీ సినిమాలు విడుదల చేశారు. ఆ నిర్మాతలు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వారి పేర్లు ప్రస్తావించదలచుకోలేదు. నిర్మాతల బాగోగులు కోరుకునే గొప్ప వ్యక్తి ఇప్పుడు మనకు లేడు. అది మన దురదృష్టం. ఆయన నివాళికి కుటుంబు సభ్యులు, సినీ ప్రముఖులతో పాటు లక్షల మంది అభిమానులు రావడం నిజంగా విచిత్రం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’అని అల్లు అరవింద్ అన్నారు. -
ఆయన నా దేవుడు: కృష్ణ గురించి మహేష్ మాటలు విన్నారా?
-
సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ.. వెండితెరపై ఆయన పేరు చేరగని ముద్ర. సాహసాలకు, సంచనాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిలోనే పాత్రలతో ప్రయోగాలు చేశారు. అప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేసి జేమ్స్‌బాండ్ తరహాలో గుఢాచారి 116 సినిమాతో అద్భుతం చేశాడు. ఇక తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాలో రికార్డులు క్రియేట్ చేశారు. హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఆయన కథ తెలుగు వెండితెరపై ఓ చరిత్రగా నిలిచింది. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ ఓ హీరోగానే కాదు వ్యక్తిగతంగా మంచి మనుసున్న చాటుకున్న నటుడు. కష్టకాలంలో నిర్మాతలను ఆదుకున్న గొప్ప హీరో. అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు. స్టార్ హీరోగా, మంచి మనసు చాటుకున్న వ్యక్తిగా సూపర్ స్టార్ సువర్ణాక్షరాలతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి ఆయన గురించి ప్రముఖ రచయిత, మహాకవి శ్రీశ్రీ గతంలో ఏమన్నారో తెలుసా. అప్పట్లోనే తనదైన రాతలతో కృష్ణ గొప్పతనాన్ని శ్రీశ్రీ చాటిచెప్పారు. ఓ సందర్భంలో కృష్ణ గురించి ప్రస్తావించిన ఓ పాత న్యూస్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు ‘‘నేను ఒక అక్షరం రాసినా దానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ’’ అని శ్రీశ్రీ అన్నారు. 1994లో ఓ ప్రముఖ పత్రికలో ఈ వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కృష్ణ గొప్పతనానికి, వ్యక్తిత్వానికి జోహార్లు చేస్తున్నారు. కాగా గుండెపోటు కారణంగా కృష్ణ మంగళవారం(నవంబర్ 15) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆయన అంతిమ యాత్ర మహప్రస్థానం వరకు సాగనుంది. -
కృష్ణ డైలాగ్ తో అదరగొట్టిన Jr కృష్ణ
-
నాన్న.. నీ ఫోన్ కాల్స్, మాటలు.. మిస్ అవుతున్నా: కృష్ణ కూతురు ఎమోషనల్
తండ్రిని తలచకుంటూ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఎమోషనల్ పోస్ట్ చేసింది.‘ప్రియమైన నాన్న.. మీరు మాకు, ఈ ప్రపంచానికి సూపర్స్టార్వి. ఇంట్లో ఎప్పుడూ సాదాసీదా తండ్రిలాగే వ్యవహరించేవాడివి. ఎలా జీవించాలో మీరు మాకు ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. మీరు మీ చర్యల ద్వారా మాకు బోధించారు. మీ సరళత, సౌమ్యత, వివేకం, క్రమశిక్షణ, సమయపాలన మరియు దాతృత్వం .. అసమానమైనవి. సినిమాకి, మీ వారసత్వానికి చేసిన సేవలు ఎప్పటికీ బతికే ఉంటాయి. నువ్వే నా బలం, నువ్వే నాకు వెన్నెముక, నువ్వే నా హీరో. నీ ప్రేమ అంతులేని సముద్రం. మాకు అవసరమని మాకు తెలియనప్పుడు కూడా మీరు మాకు కావాల్సినవన్నీ ఇచ్చారు.ఇప్పటికే నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ప్రతి రోజు ఉదయం 11 గంటల పోన్ కాల్స్, సంభాషణలను కోల్పోతున్నాను. మీరు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను నాన్న’అని తన ఇన్‌స్టా ఖాతాలో మంజుల రాసుకొచ్చింది. కాగా, గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ మంగళవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) -
సినీ సాహసి.. ఘట్టమనేని
సినీ సాహసి ఘట్టమనేని కృష్ణ.. అద్వీతీయ నటనతో 350కి పైగా చిత్రాలు చేసిన నటుడు. ఇన్ని చిత్రాలు చేసిన హీరో మరొకరు తెలుగు సినీ పరిశ్రమలోనే లేరు. కృష్ణ సినీ కళామతల్లి ఒడిలో ఎదిగింది చెన్నైలోనే. ఈయన కోడంబాక్కం ముచ్చట్లు చాలానే ఉన్నాయి. ఆయన ఎదుగుదల, వెలుగుకు చెన్నైనే చిరునామా. కృష్ణ సాహసాలు చేసింది. సూపర్ స్టార్ అయ్యింది ఇక్కడే. పద్మాలయ ఫిలిమ్స్ సంస్థను ప్రారంభించింది, నిర్మాతగా మారింది, దర్శకుడిగా అవతారం ఎత్తింది చెన్నపురిలోనే. ఇక్కడ సూపర్‌స్టార్ కృష్ణ సంబంధించిన మధుర స్మతులు ఎన్నో ఎన్నెన్నో. లెజెండరీ హీరో కృష్ణ ని్రష్కమణతో టాలీవుడ్‌తో పాటు తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. కొత్తదనాన్ని పరిచయం చేసిన నటుడు: సీఎం తెలుగు సూపర్‌స్టార్ కృష్ణ మరణ వార్త తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. తెలుగు సినిమాకు కొత్తదనాన్ని పరిచయం చేసిన ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. కృష్ణ కుమారుడు నటుడు మహేశ్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత చలన చిత్ర నటుడు రజినీకాంత్ స్పందిస్తూ, తాను ఎప్పటికీ అభిమానించే నటుడు కృష్ణ అని, ఆయనతో కలిసి మూడు హిట్ చిత్రాల్లో నటించానని గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి పేర్కొంటూ గొప్ప కీర్తిని సంపాదించుకున్న సేవాతత్పరుడు, గట్స్ ఉన్న మనిషి, వివాదరహితుడు, గౌరవ ప్రదమైన వ్యక్తి అయిన కృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తమిళనాడు తెలుగు యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిలిం ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్పందిస్తూ ఆయన వద్ద 22 చిత్రాలకు తాను కో– డైరక్టర్‌గా పని చేసి ఎంతో నేర్చుకున్నానని గుర్తు చేశారు. హాస్య నటుడు సెంథిల్ మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తి సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. విశ్వనటుడు కమలహాసన్ పేర్కొంటూ, తెలుగు సినీ వినీలాకాశంలో ఉన్నతస్థాయికి ఎదిగిన నటుడు కృష్ణ అని వ్యాఖ్యానించారు. ఏడాది వ్యావధిలో తల్లి, సోదరుడు, తండ్రిని వరుసగా కోల్పోయిన నటుడు మహే‹Ùబాబు కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలన్నారు. నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ పేర్కొంటూ.. కృష్ణ మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ నటీనటుల తరపున ఆ సంఘం అధ్యక్షుడు నాజర్ తదితరులు తమ సంతాపాన్ని తెలియజేశారు. -
ఆయన మళ్లీ పుట్టాలి: ఫ్యాన్స్ ఆవేదన
-
పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం
-
మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు
అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటశేఖరుడి సినీ ప్రస్థానం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిసింది. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. ►అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటశేఖరుడి సినీ ప్రస్థానం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిసింది. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. ►సూపర్‌స్టార్ కృష్ణ అంతిమయాత్ర పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి చేరుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ►సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. లక్షలాది అభిమానుల మధ్య ఆయన అంతిమయాత్ర కొనసాగుతోంది. పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగనుంది. ►సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు అభిమానులు పోటెత్తారు. అభిమానుల రాకతో పద్మాలయ స్టూడియోస్ కిక్కిరిసిపోయింది. కాసేపట్లో ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మహాప్రస్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ► సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సందర్శించారు. ఆయనకు నివాళులు అర్పించి అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. కృష్ణ నిర్మాతల హీరో అన్నారు. నిర్మాతల బాగోగులు కోరుకున్న ఒకే ఒక్క హీరో ఆయన అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ► పద్మాలయ స్టూడియో ప్రాంగణం అంతా జనాలతో కిక్కిరిసి పోయింది. తమ అభిమాన నటుడిని కడాసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లు తోసుకుని అభిమానులు ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. దీంతో జనాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జికి దిగారు. ► సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి సినీ నటి జయప్రద నివాళులు అర్పించారు. ఆనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ లెజెండరి హీరో అన్నారు. హైదరాబాద్‌కు తెలుగు ఇండస్ట్రీ రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన పట్టుదలతో పనిచేసే వ్యక్తి అంటూ జయప్రద కన్నీరు పెట్టుకున్నారు. ► సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి ఏపీ మంత్రి రోజా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ అద్భుతమైన వ్యక్తి అని, సాహసాలు.. సంచనాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ కృష్ణ మృతి పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ► కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్తమిళి సై నివాళులర్పించారు. ► సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్కి చేరుకున్న ఆయన .. కృష్ణకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేశ్‌ని హత్తుకుని ధైర్యం చెప్పాడు. ► కృష్ణ భౌతికకాయానికి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించాడు. ఫ్యామిలీతో కలిసి పద్మాలయ స్టూడియోకు వచ్చిన బాలకృష్ణ.. పూలమాల వేసి అంజలి ఘటించారు. ► పద్మాలయ స్టూడియోకి సినీ తారలు తరలివస్తున్నారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, నటుడు అలీ, ఆయన సోదరుడు ఖయ్యూంలు కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. ►మహేశ్‌బాబు తనయుడు గౌతమ్, కూతురు సితారలు వారి తాత పార్ధివదేహానికి నివాళులర్పించారు. ► జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం లో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల కి ఏర్పాట్లు చేస్తున్నారు. మహా ప్రస్థానం వద్ద కార్యక్రమం జరుగుతున్న సమయంలో బయటకి వ్యక్తులు లోపలకి రాకుండా భారీ ప్రైవెట్ భద్రత ఏర్పాటు చేశారు. ► తండ్రిని తలచుకుంటూ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఎమోషనల్ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) ► కృష్ణ మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కృష్ణ మృతికి గౌరవ సూచికంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినీ పరిశ్రమ నేడు బంద్ పాటిస్తోంది. ► సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళ్లు అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుని.. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించనున్నారు. అనంతరం ఘట్టమనేని కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ► అభిమానుల సందర్శనార్ధం కృష్ణ భౌతికకాయం పద్మాలయ స్టూడియోకి తీసుకొచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అభిమానులు సందర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. 12 గంటల తరువాత అంతిమయాత్ర, మహా ప్రస్ధానంలో అంత్యక్రియులు జరగనున్నాయి. ►సూపర్‌స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పద్మాలయా స్టూడియోస్ దగ్గర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. -
మల్టీస్టారర్స్ తో ట్రెండ్ సెట్ చేసిన సూపర్ స్టార్
-
ఒకే సంవత్సరంలో ఎక్కువ సినిమాలలో నటించిన కృష్ణ
-
రాజీవ్‌గాంధీతో సాన్నిహిత్యం... వైఎస్ఆర్తో అనుబంధం
-
కృష్ణం వందే సినీ జగద్గురుం
అఖిలాంధ్ర ప్రేక్షకుల ‘తేనె మనసులు’ను రంజింపజేసిన బుర్రిపాలెం బుల్లోడు ఇక లేరు. ‘కన్నెమనసులు’ దోచిన ఉమ్మడి గుంటూరు జిల్లా అందగాడు తెరమరుగయ్యారు. తెలుగు సినీ జగత్తులో ‘ఏకలవ్యు’డై అంచెలంచెలుగా ఎదిగి ‘నంబర్‌వన్’ స్థాయికి చేరిన ఘట్టమనేని ఘట్టం పరిసమాప్తమైంది. ప్రేక్షకుల హృదయ ‘సింహాసనం’పై చెరగని ముద్రవేసిన ‘మహామనిషి’ అమరుడై కళామ తల్లికి కడుపుకోత మిగిల్చారు. చరిత్రను తిరగరాసే సాహసాలకు ఎప్పుడూ ‘ముందడుగు’ వేసే ‘అసాధ్యుడు’ ‘ఈనాడు’ కానరాని లోకాలకు చేరారనే వార్త సగటు ప్రేక్షకుడి గుండెలను పిండేసింది. అఖిలాంధ్రలో ‘ప్రజారాజ్యం’ కోసం ‘అగ్నిపర్వతమై’ జ్వలించి ‘శంఖారావం’ పూరించిన అభినవ ‘అల్లూరి సీతారామ రాజు’ నటశేఖర సూపర్‌స్టార్ కృష్ణ రగిలించిన విషాదాగి్నతో స్వగ్రామం బుర్రిపాలెంతోపాటు ఉమ్మడి జిల్లా శోకసముద్రంలో మునిగింది. మహానటునితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతోంది. ఊరికి మొనగాడు కృష్ణ సొంతూరు బుర్రిపాలెం వాసులకు కొండంత అండగా ఉండేవారు. ఊరికోసం ఆయన చాలా చేశారు. అందరికీ ఆప్తుడిగా నిలిచారు. అవకాశం ఉన్నపుడల్లా ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్‌లోని ఇంటికి ఎవరు ఎప్పుడెళ్లినా చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించారు. భోజనం పెట్టి మరీ పంపేవారు. తమవాడు... ఆతీ్మయుడు అనుకున్న గొప్ప మనిషి.. ఇక లేడు.. అనుకుంటేనే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. – ఇదీ బుర్రిపాలెం వాసుల అంతరంగం కఠోర శ్రమ.. సినీ రంగంలో నిలదొక్కుకునేందుకు కఠోరంగా శ్రమించారు కృష్ణ. రోజుకు రెండు, మూడు షిఫ్టులు పనిచేశారు. ఏడాదికి డజను సినిమాల్లో నటించారు. 1972లో ఏకంగా 18 సినిమాలు రిలీజయ్యాయి. రకరకాల జోనర్లలో సినిమాలు తీశారు. మొత్తం 350 సినిమాల్లో నటించిన కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. భారతప్రభుత్వం ఆయన్ను ‘పద్మ భూషణ్’తో గౌరవించింది. తెనాలి: సూపర్ స్టార్ కృష్ణ అస్తమయంతో ఉమ్మడి గుంటూరు జిల్లా దిగ్భ్రమకు గురైంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మననం చేసుకుంది. ఆయన ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలిసింది మొదలు కలత చెందింది. మరణ వార్త తెలిశాక కన్నీరుమున్నీరైంది. కడసారి చూపుకోసం ఇప్పటికే అధిక సంఖ్యలో అభిమానులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఇదీ కుటుంబ ప్రస్థానం సూపర్‌స్టార్ కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఆయన తల్లిండ్రులు నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి. రైతు కుటుంబం. వీరరాఘవయ్య చౌదరికి వ్యక్తిగతంగా నెమ్మదస్తుడని పేరు. ఆయన భార్య నాగరత్నమ్మ ధైర్యశాలి. అనుకున్నది సాధించాలన్న వ్యక్తిత్వం ఆమెది. అదే లక్షణం కృష్ణకూ వచ్చిందని బంధువులు చెబుతుంటారు. 1943 మే 5న జన్మించారు కృష్ణ. ఆయనకు ఇద్దరు సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. ఇద్దరు సోదరీమణులు. బిడ్డల చదువు కోసమని కృష్ణ తల్లిదండ్రులు తెనాలికి మకాం మార్చారు. ఇక్కడి తాలూకా హైసూ్కలులో చదువుకున్న కృష్ణ అనంతరం కాలేజి చదువుల కోసం ఏలూరు వెళ్లారు. మకాం తెనాలికి మార్చకముందు స్నేహితులు కృష్ణబాబు, వెంకటప్పయ్యతో కలిసి రోజూ సైకిల్‌పై తెనాలి వచ్చి తాలూకా హైసూ్కలులో కృష్ణ చదువుకున్నారు. ప్రస్తుతం కడియాల వెంకటరమణ హాస్పిటల్ ఉన్న వీధిలో ఉండే ములుకుట్ల లక్ష్మీనారాయణ మాస్టారు ఇంటికి వచ్చి కృష్ణ ట్యూషన్ చెప్పించుకున్నారట. బీఎస్సీ పూర్తి చేసిన అనంతరం కృష్ణ సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సినీరంగం వైపు తొలి అడుగులిలా.. మద్రాస్ వెళ్లి తెనాలికి చెందిన నటులు జగ్గయ్య, గుమ్మడి, సినీ నిర్మాత చక్రపాణిని కృష్ణ కలిశారు. వారి సూచనపై తిరిగొచ్చారు. గరికపాటి రాజారావు సహకారంతో ప్రజానాట్యమండలి నాటకాల్లో నటించారు. అందం, ఆకర్షణ కలిగిన కృష్ణను అచిరకాలంలోనే సినిమా అవకాశం వరించింది. దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘తేనె మనసులు’ సినిమాతో హీరో అయ్యారు. ఆ సినిమా కోసమని కృష్ణకు కొద్దిరోజులు శిక్షణనిచ్చారు ప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్.ఆ చిత్రానికి ఆయన సహాయ దర్శకుడు. బుర్రిపాలెంను మరవని సూపర్‌స్టార్ జన్మస్థలి బుర్రిపాలెంను కృష్ణ మరువలేదు. తొలి చిత్రం తేనెమనసులు విడుదల రోజున సినిమాను స్థానిక రాజ్యం థియేటరులో బంధుమిత్రులతో కలిసి వీక్షించారు. చిన్ననాటి స్నేహితులనూ విస్మరించేవారు కాదు. తన సినిమాలు రిలీజైన మరుసటిరోజు బుర్రిపాలెం వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేవారు. ఎప్పుడు వచ్చినా విజయనిర్మలతో సహా వచ్చేవారు. నాగరత్నమ్మ నిర్మించిన గీతామందిరంలో స్వామి దర్శనం చేసుకునేవారు. గ్రామంలో బీఈడీ కాలేజీ శంకుస్థాపనకు, ఇంటర్నేషనల్ స్కూలు ప్రారంభానికి వచ్చారు. నాగరత్నమ్మ గ్రామ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. హైసూ్కలు అభివృద్ధికి కృషిచేశారు. దీనికి ఘట్టమనేని నాగరత్నమ్మ వీరరాఘవయ్య స్కూలు అని నామకరణం చేశారు. స్వగ్రామంలో షూటింగులు కృష్ణ స్వగ్రామంలో విజయనిర్మల దర్శకత్వం వహించిన ‘మీనా’ సినిమా షూటింగ్ జరిపారు. తన మేనమామ నర్రావుల సుబ్బయ్య∙మండువా ఇంటిలో చిత్రీకరించారు. పాడిపంటలు సినిమాలో ఎడ్ల జత కూడా బుర్రిపాలెంకు చెందిన పెమ్మసాని ధర్మయ్య, శివరామయ్యలవే. చిడతలు, పట్టీలు లేకుండా కాడిని వాటికవే వేసుకునే ఆ ఎడ్ల జతకు అప్పట్లో యమా క్రేజ్. ప్రజారాజ్యం, బుర్రిపాలెం బుల్లోడు, పచ్చని సంసారం సినిమాల్లో కొన్ని భాగాలను, ‘ఈనాడు’ సినిమాలో ఒక పాటలో కొంత ఇక్కడ తీశారు. వివాహ జీవితం కృష్ణ సతీమణి ఇందిరాదేవి. 1965లో వీరికి వివాహమైంది. భార్య స్వగ్రామం తెనాలి దగ్గర్లోని కంచర్లపాలెం. వీరికి రమేష్‌బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. సహచరి విజయనిర్మలతో కలిసి 40 సినిమాల్లో నటించారు కృష్ణ. పద్మాలయా బ్యానర్‌పై 16 సినిమాలు తీశారు. రాజీవ్‌గాంధీ ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరిన కృష్ణ 1989లో ఏలూరు ఎంపీగా గెలుపొందారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. చివరిసారిగా 2016లో శ్రీశ్రీ సినిమాలో మరోసారి నటించారు. ఆయన కుమారుడు రమేష్ బాబు, భార్య ఇందిరాదేవి ఆరునెలల వ్యవధిలో మరణించటంతో కృష్ణ కుంగిపోయారు. అనారోగ్యానికి తోడు.. ఆప్తులను కోల్పోయిన దిగులు.. ఆయన్ను మరణానికి చేరువచేసిందనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. తెనాలి ప్రేక్షకుల అభిరుచిపై మంచి గురి హీరో కృష్ణకు తెనాలి ప్రేక్షకుల అభిరుచిపై మంచి గురి ఉండేది. సినిమా విజయంపై ముందుగా తెనాలి ప్రేక్షకుల అభిప్రాయాన్నే ఆయన పరిగణనలోకి తీసుకునేవారు. 1991–92లో ‘పచ్చని సంసారం’ సినిమా షూటింగ్ బుర్రిపాలెంలో తీస్తున్నారు. ఒకరోజు కృష్ణ విలేకరుల సమావేశం పెట్టారు. ఆయన వేసిన తొలి ప్రశ్న ‘బృందావనం’ సినిమా ఎలా ఉంది? అని.. ఆ సినిమా అప్పటికి కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. తెనాలి పల్స్ తెలుసుకోవటానికి ఆయన అలా అడిగారు. క్రేజీ స్టార్డమ్ ∙జ్యోతిచిత్ర సినీ పత్రిక నిర్వహించిన బ్యాలెట్లో వరుసగా అయిదేళ్లు కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎంపికయ్యారంటే ఆయన స్టారడమ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అమ్మంటే ఎనలేని అనురాగం సూపర్ స్టార్ కృష్ణకు తల్లి నాగరత్నమ్మ అంటే ఎంతో అపేక్ష. హెసూ్కలు విద్యను తెనాలిలో పూర్తిచేశాక కాలేజి చదువుల కోసం బుర్రిపాలెంలోని పొలాన్ని అమ్మి కృష్ణను ఏలూరుకు పంపారామె. కొడుకు ఇంజినీరు కావాలని ఆమె కలలు కనేది. కృష్ణకేమో సినిమాల్లో నటించాలని ఉండేది. బీఎస్సీ పూర్తయ్యాక ‘నేను ఇంజినీరు అవను.. సినిమాల్లోకి వెళతాను’ అనగానే ‘అలాగే నువ్వు తప్పకుండా హీరో అవుతావు’ అని ఆశీర్వదించి పంపారట ఆమె. అనుకున్నట్టే కొడుకు హీరో కావటంతో ఎంతో పొంగిపోయారు ఆమె. ‘ఉన్న ఊళ్లో పొలం అమ్ముకున్నాం.. ఎప్పుడైనా బుర్రిపాలెంలో పొలం కొనాలి’ అన్న అమ్మ కోరిక ప్రకారం కృష్ణ ఊళ్లో పొలం కొన్నారు. బుర్రిపాలెం వచ్చినపుడు ఇక్కడ ఉండేందుకని పాత ఇంటిని రీమోడల్ చేయించారామే. అంతేకాదు. తన పేరుమీద ఏదైనా సినిమా తీయమని అమ్మ కోరిన ప్రకారం ఆమె పేరిట ‘రత్నా మూవీస్’ పతాకంతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సోదరుల సహకారంతో ‘ప్రజారాజ్యం’ తీశారు కృష్ణ. తన ముగ్గురు కొడుకుల పేరు మీద ఒక సినిమా తీయాలనీ సంకలి్పంచారామె. ఆమె కోరిక తీర్చాలనే తపనతో కృష్ణ, తన ఇద్దరు కొడుకులు రమేష్, మహేశ్‌బాబుతో కలిసి అన్నదమ్ములుగా నటిస్తూ ‘ముగ్గురు కొడుకులు’ సినిమా తీసి అమ్మ కోరిక నెరవేర్చారు. ఆ సినిమా కూడా విజయం సాధించటం తనకెంతో సంతోషమని కృష్ణ చెప్పేవారు. -
కృష్ణకు నివాళి.. కుటుంబ సభ్యులకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్గజం, నటశేఖర సూపర్ స్టార్ కృష్ణకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చారు. బుధవారం ఉదయం తాడేపల్లి(గుంటూరు) నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. పద్మాలయ స్టూడియోకు వెళ్లారు. అక్కడ కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోలో ప్రజల సందర్శన కోసం ఉంచిన కృష్ణ పార్థివ దేహానికి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం.. ఘట్టమనేని కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. కృష్ణ తనయుడు మహేష్ బాబుని హత్తుకుని ఓదార్చారు సీఎం జగన్. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి నట దిగ్గజానికి నివాళి అర్పించిన వాళ్లలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రి వేణుగోపాలకృష్ణ, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. నటశేఖరుడు, తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కృష్ణ ఆదివారం సాయంత్రం గుండెపోటుకి గురికాగా.. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన్ని కుటుంబ సభ్యులు చేర్చారు. సోమవారం సాయంత్రం ఆయన పరిస్థితి విషమించగా.. మంగళవారం వేకువ ఝామున నాలుగు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమాన గణం, యావత్ తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. ఇదీ చదవండి: సినీ సాహసి.. ఘట్టమనేని కృష్ణ -
సాహసమే అతడి ఊపిరి
1962లో తొలి బాండ్ సినిమా ‘మిస్టర్ నో’ రిలీజ్ అయ్యింది. షేన్ కానరీ హీరో. తర్వాత నాలుగేళ్లకు అలాంటి సినిమా తీయాలని నిర్మాత డూండీకి అనిపించింది. హీరో ఎవరు? ఎన్.టి.ఆర్... ఊహూ. ఏ.ఎన్.ఆర్.. కాదు. ‘తేనె మనసులు’ సినిమా చూశాడాయన. క్లయిమాక్స్‌లో కారు చేజ్. స్కూటర్ వేగంగా నడుపుతున్న కొత్త హీరో నదురు బెదురు లేకుండా డూప్ జోలికి పోకుండా చేజ్ చేసి ఒక్క గెంతులో కారులో దూకాడు. డేరింగ్ డేషింగ్ స్టంట్. ఇతడే నా బాండ్ అనుకున్నాడు డూండీ. ‘గూఢచారి 116’ రిలీజైంది. స్కూటర్ మీద నుంచి కారు మీదకు గెంతిన ఒక్క గెంతు ఆ నటుణ్ణి సూపర్‌స్టార్‌ని చేసింది. షేన్ కానరీ గొప్పవాడు. 32 ఏళ్లకు బాండ్ అయ్యాడు. కృష్ణ మరీ గొప్పవాడు. 23 ఏళ్లకే బాండ్ అయ్యాడు. తెనాలిలో కుర్రకారు చూడాల్సిన సినిమాలంటే ఇంకేం ఉంటాయి. అయితే ఎన్.టి.ఆర్. లేకుంటే ఏ.ఎన్.ఆర్. కృష్ణ ఎన్.టి.ఆర్ ఫ్యాన్. ఏలూరులో ఫిజిక్స్ మెయిన్‌గా బిఎస్సీ చదువుతూ ఎన్.టి.ఆర్ సినిమాలు చూసి మైమరిచాడు. 60 సినిమాలు పూర్తి చేసుకున్న ఏ.ఎన్.ఆర్‌ను సి.ఆర్.రెడ్డి కాలేజీకి సన్మానానికి పిలిస్తే ఆయనకు దక్కిన రాజభోగం గమనించాడు. ‘సినిమాకు ఇంత యోగమా’ అనుకున్నాడు. చెప్పాలంటే తెనాలి గాలిలోనే ఏదో కళ ఉంది. కృష్ణ ఊరు– బుర్రిపాలెంకు అది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక గాలి గట్టిగా తగిలింది. సినిమా గాలి. ‘ఆడబతుకు’, ‘మంగమ్మ శపథం’, ‘దేవత’ 1965లో రిలీజైన ఎన్.టి.ఆర్ సినిమాలు. ‘ఆత్మగౌరవం’, ‘ప్రేమించి చూడు’, ‘సుమంగళి’ ఏ.ఎన్.ఆర్ చిత్రాలు. ఇద్దరూ 42 ఏళ్ల వయసులో ఉన్నారు. పోటాపోటీగా కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని అప్పటికే తరం మారి, తలకట్టు మారి, తెలుగు తెర కొత్త ముఖం కోసం ఎదురు చూస్తూ ఉంది. అభిమానులు సంఘాలు పెట్టుకోవడానికి కొత్త హీరో అన్వేషణలో ఉన్నారు. తెలుగు నేలపై గాలి మారిందని చెప్పడానికి ఒకడు రావాలి. అదే సంవత్సరం 22 ఏళ్ల కృష్ణ తొలి సినిమా ‘తేనె మనసులు’ రిలీజ్ అయ్యింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్లతో ‘తేనె మనసులు’ తీసి హిట్ కొట్టాడు. ఆశ్చర్యం. దేవ్ ఆనంద్ పోలికలున్న రామ్మోహన్‌కు పేరొచ్చింది. అచ్చెరువు. ఏ పోలికలు లేని ఒరిజనల్ రూపు, ఊపు ఉన్న నటుడికే ఆ తర్వాత పట్టం దక్కింది. పట్టం దక్కినవాడు కృష్ణ. ఎన్.టి.ఆర్కు ఒక సంస్థానం ఉంది. తమ్ముడు త్రివిక్రమరావు పక్కన ఉన్నాడు. పుండరీ కాక్షయ్య ఉన్నాడు. నిర్మాతల సమృద్ధి ఉంది. అక్కినేనికి దుక్కిపాటి, విక్టరీ మధుసూదనరావు, వి.బి.రాజేంద్రప్రసాద్, ఆదుర్తి ఉన్నారు. కృష్ణకు? ఉన్నవల్లా ధైర్యం, సాహసం, పట్టుదల, పంతం. రోజూ లేవగానే మేకప్ వేసుకుని సెట్లో ఉండాలి. చెవులకు యాక్షన్, కట్ వినిపించాలి. ఊళ్లో ఏదో ఒక హాల్లో తన సినిమా ఆడుతూ ఉండాలి. అందుకు ఏం చేయాలి? నిర్మాత నుంచి సినిమా పుడుతుంది. నిర్మాతకు ఇబ్బంది రాకపోతే తనకు ఏ ఇబ్బందీ రాదు. ఆ సూత్రం తెలిశాక కృష్ణ నిర్మాతల హీరో అయ్యాడు. రేపు షూటింగ్. డబ్బు లేదు. తానే ఏర్పాటు చేసేవాడు. రిలీజయ్యాక సినిమా పోయింది. రెమ్యూనరేషన్ వదులుకున్నాడు. ఎవరో నిర్మాత గొల్లుమంటున్నాడు. పిలిచి డేట్స్ ఇచ్చాడు. కృష్ణకు కూడా ఇప్పుడు మెల్లగా ఒక సంస్థానం ఏర్పడింది. ఇద్దరు తమ్ముళ్లు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు తోడు నిలిచారు. డూండీ, వి.రామచంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్, ఆరుద్ర, త్రిపురనేని మహారథి తన పక్షం అయ్యారు. నెక్స్›్ట ఏంటి? కృష్ణ ఒకటి గమనించాడు... ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు నిర్మాతలు వస్తే హీరోలుగా నటిస్తారు. రాకపోతే తామే నిర్మాతలై హీరోలుగా నటిస్తారు. అంటే వారు హీరోలుగా నటిస్తూనే ఉంటారు. తాను కూడా నిర్మాతగా మారితే? తన హీరోయిజంను తానే నిరూపించుకుంటే? అదిగో డెక్కల చప్పుడు చేస్తూ నురగలు కక్కుతూ దౌడు తీస్తున్న గుర్రం. పైన ఎర్ర టోపి, చేత రివాల్వర్‌తో కృష్ణ. సినిమా పేరు ఏమిటా అని పల్లెటూళ్లో పాదచారి ఆగి పోస్టర్ చూశాడు. మోసగాళ్లకు మోసగాడు! ‘అమరవీడు’ సంస్థానం ఫ్రెంచ్ సేనల వశం అయ్యాక ఇద్దరు విశ్వాసపాత్రులు ఆ సంస్థానం నిధిని అడవిలో దాచారు. దాని కోసం మోసగాళ్లు వేటాడుతున్నారు. వారిని తలదన్నే మోసం చేసి నిధిని ప్రజలకు చేర్చాలి. అదీ ‘మోసగాళ్లకు మోసగాడు’ కథ. మన దేశంలో ఆలమందల్ని పిల్లనగ్రోవితో కట్టడి చేస్తారు. అమెరికాలో గుర్రాలతో కాపు కాస్తారు. ఆ కౌబాయ్‌లు మనకు లేరు. ఆ వాతావరణం మనది కాదు. సినిమా జాతకం చిటికెలో తేల్చే చక్రపాణి ‘ఈ సినిమా ఎవరికి అర్థమవుతుందయ్యా’ అని చికాకు పడ్డాడు సెట్‌కొచ్చి. కాని తీసెడివాడు కృష్ణ. మన దేశంలో తొలి కౌబాయ్ సినిమా. అదీ కలర్లో. మద్రాసులో రైలుకు మూడు ప్రత్యేక డబ్బాలు తగిలించి యూనిట్ రాజస్థాన్‌కు చేర్చి షూటింగ్ జరిపితే గుర్రాలు సకలించాయి. తుపాకులు గర్జించాయి. రక్తం చిమ్మింది. శత్రువులు మట్టి కరిచారు. నిధి ప్రజలకు చేరింది. ‘మోసగాళ్లకు మోసగాడు’ 1971లో విడుదలైతే ప్రేక్షకులు గుప్పిళ్ల కొద్దీ చిల్లర, మడతలు పడ్డ రూపాయి నోట్లు కౌంటర్లో ఇచ్చి టికెట్లను పెరుక్కొని హాల్లో సీట్లు వెతుక్కోడానికి పరిగెత్తారు. చక్రపాణి జోస్యం తొలిసారి పొల్లుపోయింది. కృష్ణ ఇప్పుడెవరనుకున్నారు? ఆంధ్రా జేమ్స్‌బాండ్ కృష్ణ. ఆంధ్రా కౌబాయ్ కృష్ణ. డేరింగ్ డాషింగ్ కృష్ణ. ఘంటసాలకు నాటుమందు పడలేదు. ప్రాణం మీదకొచ్చింది. పరిస్థితి అర్థమైన అక్కినేని రామకృష్ణను కనుగొన్నాడు. ఘంటసాల స్థానంలో రామకృష్ణను అక్కినేని ఎంకరేజ్ చేస్తే శోభన్‌బాబు, కృష్ణంరాజు కూడా అతణ్ణే ఎంచుకున్నారు. ఎన్.టి.ఆర్కు ఈ టెన్షనే లేదు. రఫీనే రంగంలో దించగలడు. కాని కృష్ణకు ఒక గొంతు కావాలి. పాటల్లో తనకో సపోర్ట్ కావాలి. ఇండస్ట్రీకి ఎవరో కొత్త గాయకుడు వచ్చి స్ట్రగుల్ అవుతున్నాడని విని పిలిపించారు. ‘మీరు వర్రీ కాకండి. ఎంత లేదన్నా నాకు సంవత్సరానికి నాలుగు సినిమాలుంటాయి. అన్నిటికీ మీరే పాడండి. నా సింగర్‌గా ఉండండి’ అని హామీ ఇచ్చాడు. ఆ కొత్త గాయకుడు ఉత్సాహంగా కృష్ణకు పాడాడు. ‘విశాల గగనంలో చందమామా... ప్రశాంత సమయములో కలువలేమా’.... విన్న ప్రేక్షకులు, రేడియో శ్రోతలు తలలు ఊపారు. తనివి తీరడం లేదని కార్డు ముక్కలు రాసి పోస్ట్‌డబ్బాలో పడేశారు. ఆ కొత్త గాయకుడు ఇంకా ఉల్లాసంగా పాడాడు. ‘తనివి తీరలేదే... నా మనసు నిండలేదే’... అలా కృష్ణ, తర్వాతి కాలంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగా తెలిసిన ఆ కొత్త గాయకుడు స్థిరపడి అనేక జూబ్లీల కాలం ప్లాటినమ్ డిస్క్‌లతో గమకాలాడారు. ఎన్.టి.ఆర్కు ‘పాతాళభైరవి’ ఉంది. అక్కినేనికి ‘దేవదాసు’ ఉంది. స్టార్లుగా కొనసాగాలంటే ప్రయత్నం, కృషి సరిపోతుంది. కాని సుదీర్ఘకాలం నిలబడాలంటే నటుడుగా ప్రూవ్ చేసుకోవాలి. మాగ్నమ్ ఓపస్ ఉండాలి. తనకు అదేమిటి అనే ఆలోచన వచ్చింది కృష్ణకు. ‘అసాధ్యుడు’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా పాటలో కనిపించినప్పటి నుంచి ఆ పాత్ర మీద మనసు ఉంది. ఆ సినిమా తీయాలన్న సంకల్పం ఉంది. కాని అందుకు గేట్ అడ్డం ఉంది. ఆ గేట్ పేరు ఎన్.టి.ఆర్. ఎప్పటి నుంచో ఆయన అల్లూరి సీతారామరాజు తీస్తానంటున్నాడు. తీయడం లేదు. కృష్ణ ఆగదల్చుకోలేదు. కృష్ణ నటించు ‘అల్లూరి సీతారామరాజు’. ఈ వార్త ఇండస్ట్రీ అంతా గుప్పుమంది. ఆ తర్వాత వార్తలే వార్తలు. 30 రోజుల పాటు విశాఖ ఏజెన్సీలో షూటింగ్ అట. యూనిట్ కోసం చింతపల్లిలో 5 ఎకరాల జొన్నచేను కొని సాపు చేసి కాలనీ కట్టారట. ఫీల్డులోని కేరెక్టర్ ఆర్టిస్టులంతా ఇందులో నటిస్తున్నారట. మన్యం వీరుడి కోసం కృష్ణ ఎంతకైనా ఖర్చు చేయడానికి సిద్ధ పడ్డాడట. అన్నింటికి మించి సినిమా స్కోప్‌లో తీస్తున్నారట. 1973 డిసెంబర్లో షూటింగ్ మొదలైతే కారెక్టర్ ఆర్టిస్టులంతా చింతపల్లిలో ఉండటం చేత మద్రాసులో రెండువారాలు షూటింగులు ఆగిపోయాయి. అదీ ఆ సినిమా తడాఖా. మెల్లమెల్లగా పోస్టర్లు, అల్లూరి గెటప్ బయటకు వచ్చాయి. ఖాకీ చెడ్డీ, మోచేతుల వరకూ తెల్ల చొక్కా, పైన ముతక తువ్వాలు, చేతి బెత్తంతో జనులకు కనిపించిన అల్లూరి సీతారామరాజు తెలుగు వారికి మాత్రం సినిమా వారు తమ ఊహలకు తగ్గట్టుగా తీర్చిదిద్దిన ఆహార్యం వల్ల ఇప్పుడున్న రూపానికి మారిపోయాడు. ఎన్.టి.ఆర్ ప్రోద్బలంతో అల్లూరికి ఆ సినీ రూపం ఇచ్చిన ఆర్టిస్ట్ మాధవపెద్ది గోఖలే. అన్నట్టు అతనిదీ కృష్ణ ఊరే. తెనాలి. ‘ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలనే కోరికా? రూథర్‌ఫర్డ్... నేనే కాదు. మా భారతీయులు ఎవ్వరూ ఏనాడూ ఇతరులను జయించాలని రాజ్యాలను స్థాపించాలని కోరలేదు. ఎప్పుడూ ఇతరులే ఈ రత్నగర్భపై ఆశపడ్డారు. దుర్జన దండయాత్రలతో రణరక్తసిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు. రాళ్లల్లో కలిసిపోయారు. యవనులు, హూణులు, మ్లేచ్చుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర అలానే అంతమవుతుంది’... అల్లూరి సీతారామరాజు డైలాగులతో హాల్లో జనం ఉద్వేగపడుతున్నారు. కన్నీరు కారుస్తున్నారు. ఆవేశ పడుతున్నారు. పౌరుషంతో ఉప్పొంగుతున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి మావాడు. ఆ పాత్రకు జీవం పోసిన కృష్ణ మావాడు. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. కృష్ణ పేరు ముందు ఇప్పుడు ‘నట’ చేరింది. ‘నటశేఖర’ కృష్ణ. అక్కినేని, ఎన్.టి.ఆర్ నిర్మాతలుగా ఉంటూ కృష్ణతో సినిమాలు తీయలేదు. కృష్ణ తాను నిర్మాతగా అక్కినేని, ఎన్.టి.ఆర్‌లతో సినిమాలు తీశాడు. ఎన్.టి.ఆర్తో తీసిన ‘దేవుడు చేసిన మనుషులు’ పెద్ద హిట్. అక్కినేనితో ‘హేమాహేమీలు’ తీశాడు. అక్కినేని, ఎన్.టి.ఆర్‌లను ఫలానా సినిమా తీయవద్దని కృష్ణ ఎప్పుడూ అనలేదు. కాని కృష్ణ తీస్తున్న సినిమాల విషయంలో వారు ఇరువురూ అభ్యంతరం చెప్పారు. ఎన్.టి.ఆర్ కృష్ణను పిలిచి ‘అల్లూరి సీతారామరాజు’, ‘కురుక్షేత్రం’ సినిమాలు విరమించమని కోరాడు. కృష్ణ ‘దేవదాసు’ తీస్తే అక్కినేని పోటీగా తన ‘దేవదాసు’ను రీరిలీజ్ చేశాడు. కృష్ణతో నటించే సినిమాలలో తనకు ప్రాధాన్యం ఉండటం లేదని పేపర్ ప్రకటన ఇచ్చి మరీ శోభన్‌బాబు తప్పుకున్నాడు. కృష్ణ ఆగలేదు. ఆగడం కృష్ణకు తెలియదు. నూరవ చిత్రం... రెండు వందలవ చిత్రం... ఇప్పుడతడు సూపర్‌స్టార్ కృష్ణ. ‘బృహన్నల’ వేషం వేయడానికి బాడీ లాంగ్వేజ్ కోసం నృత్య శిక్షణ తీసుకున్నాడు ఎన్.టి.ఆర్. ‘దేవదాసు’ రూపం కోసం అన్నపానీయాలు మానేశాడు అక్కినేని. కృష్ణ అలాంటి నటుడు కాదు. అతడు ఎంతో అందమైన అమాయకమైన నటుడు. అప్పటికప్పుడు చేయదగింది చేసి ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తే చాలు అనుకుంటాడు. అందుకే మార్నింగ్ కాల్షీట్లో గూఢచారిగా మారి భూమి మీద స్కైలాబ్ పడకుండా కాపాడతాడు. మధ్యాహ్నం కాల్షీట్లో ఓడ కెప్టెన్‌గా సముద్రం అడుగున ఉన్న నిధిని బయటకు తీస్తాడు. ‘పాడిపంటల’ రైతు అతడే. ‘నేనొక ప్రేమపిపాసిని’ అని పాడే భగ్న ప్రేమికుడు అతడే. పాత్రను అమాయకపు నిజాయితీతో చేరవేస్తాడు కనుకనే ప్రేక్షకులు విపరీతంగా అభిమానించారు. ‘ఏకలవ్య’ సినిమాలో ‘మోగింది ఢమరుకం మేల్కొంది హిమనగం’ పాటలో శాస్త్రీయ నృత్యం చేస్తాడు కృష్ణ. అది చూసి ప్రేక్షకులు వచ్చీరాని నృత్యం చేసే సొంత పిల్లల్ని కావలించుకున్నట్టు కృష్ణను కావలించుకుంటారు. అదే కృష్ణ విజయం. నటులుగా ఉంటూ దర్శకులుగా పెద్ద హిట్స్ ఇచ్చిన రాజ్ కపూర్, ఎన్.టి.ఆర్ల వరుసలో కృష్ణ నిలుస్తాడు. ‘సింహాసనం’ అందుకు ఉదాహరణ. నటుడుగా ఉంటూనే నిర్మాతగా రెండు భాషల్లో (తెలుగు, హిందీ) కృష్ణ తీసినన్ని సినిమాలు తీసినవారు లేరు. ఎంత వయసు వచ్చినా ఇమేజ్ చెక్కు చెదరకుండా కాపాడుకోవడం కృష్ణకు సాధ్యమైంది. కారెక్టర్ ఆర్టిస్టుగా కృష్ణ కొన్ని సినిమాలు చేశాడు. కాని జనం మాత్రం ‘హీరో కృష్ణ’ అని మాత్రమే పిలిచారు. అనవసర వివాదాలు, వాచాలత్వాలు లేకుండా కృష్ణ జీవితం ఎంతో హుందాగా గడిచింది. ‘యాక్షన్’ అనగానే బెబ్బులిలా మారే ఈ నటుడు తెర వెనుక మితభాషిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. భార్య విజయ నిర్మలను ఇంటికి పరిమితం చేయాలనుకోక దర్శకురాలిగా ప్రోత్సహించి ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా నిలిపాడు. ఎక్కడ సంపాదించాడో అక్కడే ఖర్చు పెట్టాడు. కన్నపిల్లల్ని తిరిగి సినిమా రంగానికే అప్పజెప్పాడు. గాలివాటానికి దొర్లిపోయే మనుషులు చరిత్రలో నిలవ్వొచ్చు. కాని ఎదురుగాలిని సవాలు చేస్తూ చరిత్రను సృష్టిస్తారు కొందరు. కృష్ణది అలాంటి కోవ. చేవ. అందుకే తెలుగువారికి ఎప్పటికీ అతడు డేరింగ్ డాషింగ్ కృష్ణ. – కె. -
కనుమరుగైన నటశేఖరుడు
తెలుగు చలనచిత్ర సీమలో సాహసిగా, సూపర్ స్టార్‌గా, నటశేఖరుడిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రేక్షక నీరాజనాలందుకున్న సీనియర్ నటుడు కృష్ణ కన్నుమూశారు. ఆయనకు ముందూ తర్వాతా వెండితెరనేలిన నటీనటులు ఎందరో ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు గడించినవారూ ఉన్నారు. కానీ సినీ పరిశ్రమలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ మనసున్న మనిషిగా, మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న విశిష్ట వ్యక్తి హీరో కృష్ణ. చిన్నతనంలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు పోస్టర్లు చూసి, ఆ తర్వాత వారి సినిమాలు చూసి వ్యామోహంలో పడిపోయిన కుర్రాడొకడు పెరిగి పెద్దయి డిగ్రీ చదువులకెదిగినప్పుడు ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు సన్మానసభను కళ్లారా చూశాక ఇక సినిమా రంగమే తన సర్వస్వంగా భావించు కోవటం తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ఆ నిర్ణయం వారికొక ‘డేరింగ్ అండ్ డాషింగ్ హీరో’ను అందించింది. ఆ తర్వాత దశాబ్దాలపాటు తనదైన నటనతో, తనకే సొంతమైన సాహసాలతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆయన అబ్బురపరిచారు. దేనిపైనైనా ఇష్టం కలగడం వేరు...ఆ ఇష్టాన్ని సాకారం చేసుకోవడానికి అవసరమైన కృషి, పట్టుదల కలిగి ఉండటం, లక్ష్య సాధన కోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధపడటం వేరు. కృష్ణలో అవి పుష్కలంగా ఉండబట్టే అచిరకాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకోగలిగారు. రెండు నట దిగ్గజాలు– ఎన్టీఆర్, ఏఎన్నార్ తమ నటనావైభవంతో వెండితెరను జిగేల్మనిపిస్తున్న కాలంలో ఇదేమంత సులభం కాదు. కానీ కృష్ణ దాన్ని సాధించారు. తనకు స్ఫూర్తినిచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకే అనంతరకాలంలో ఆయన పోటీనిచ్చారు. నటుడిగా ఉంటూనే సినిమా రంగంలోని సమస్త విభాగాలపైనా పట్టు సాధించారు. నిర్మాతగా మారారు. దర్శకుడిగా పనిచేశారు. స్టూడియో అధినేత అయ్యారు. ప్రేక్షకుల అభిరుచేమిటో, వారిని మెప్పించేదేమిటో తెలుసుకోవటం, మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం నటుడిగా దూసుకెళ్లటానికి దోహదపడతాయి. కృష్ణ సినీ జీవితంలో అపజయాలు లేవని కాదు. నటుడిగా ఆయన నిమ్నోన్నతాలు రెండూ చూశారు. కానీ విజయాలు సాధించినప్పుడు పొంగిపోవటం, వైఫల్యాలెదురైనప్పుడు కుంగిపోవటం కృష్ణకు అసలే పొసగనిది. అందుకే నిబ్బరంగా అడుగులేస్తూ అసాధ్యుడనిపించుకున్నారు. ప్రేక్షకులకు కావా ల్సిందేమిటో గ్రహించటమే కాదు... వారికి ఎలాంటి అభిరుచులుండాలో కూడా నేర్పారు. కథల ఎంపికలో, సాంకేతికతలను కొత్త పుంతలు తొక్కించటంలో కృష్ణది ఒక విలక్షణమైన దారి. ఆ దారిలో నడవాలంటే అన్యులు భయపడేంతగా ఆ ప్రయోగాలుండేవి. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ... ఆయన తొలి చిత్రం ‘తేనెమనసులు’ సాంఘిక చిత్రాల్లో తొలి కలర్ చిత్రం కాగా, అనంతర కాలంలో వచ్చిన ‘గూఢచారి 116’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘అల్లూరి సీతారామరాజు’ వంటివి దేనికవే కొత్త ప్రయోగాలు. సినీ జగత్తులో ఏ కొత్త సాంకేతికత ప్రవేశించినా దాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనిదే నిద్రపోని వ్యక్తిత్వం ఆయనది. ఆ సాంకేతికతకయ్యే వ్యయం తెలుగులో గిట్టుబాటు కాదని అందరూ అనుకునే రోజుల్లో ఆయన వెనకా ముందూ ఆలోచించ కుండా వాటిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమా వీక్షణను ఒక అపురూపమైన అనుభవంగా మిగిల్చారు. తొలి పూర్తి సినిమా స్కోప్, తొలి 70 ఎంఎం వంటివన్నీ కృష్ణ చేతుల మీదుగానే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాయి. వారిని చకితుల్ని చేశాయి. సమ్మోహన పరిచాయి. అప్పట్లో హాలీవుడ్ సినిమాలను ఏలుతున్న కౌబాయ్నీ, జేమ్స్‌బాండ్‌నీ మన వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈ సూపర్ స్టారే. ‘గూఢచారి 116’లో జేమ్స్‌బాండ్‌గా, ‘మోసగాళ్లకు మోసగాడు’లో కౌబాయ్‌గా ఆయన చేసిన ఫైట్లూ, ఛేజింగ్‌లూ సాధారణ ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. మనవాళ్లను మాత్రమే కాదు... తమిళ, మలయాళ, బెంగాలీ ప్రేక్షకులనూ కట్టిపడేశాయి. ఇంగ్లిష్, రష్యన్, స్పానిష్ భాషల్లో సైతం కొన్ని చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్టీఆర్ ఎంతో మనసుపడిన ‘అల్లూరి సీతారామరాజు’ను తానే చేయాలని నిర్ణయించుకుని, దిగ్గజాలు అనుకున్నవారంతా వెనక్కిలాగుతున్నా దాన్ని తన వందవ చిత్రంగా ఎంపిక చేసుకుని కృష్ణ ఒక పెద్ద సాహసమే చేశారు. తెలుగువారి ‘విప్లవజ్యోతి’ని కళ్లకు కట్టారు. దాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దారు. ఆ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించటం కష్టమని జోస్యం చెప్పినవారంతా అది ఏకంగా 175 రోజులు ఆడటం చూసి ‘ఔరా’ అనక తప్పలేదు. తన సొంత చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’ హిందీ అనువాదానికి సెన్సార్ అడ్డంకులెదురైనప్పుడు న్యాయస్థానాల్లో అవిశ్రాం తంగా పోరాడి వాటిని అధిగమించారు. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ రాజకీయాల్లో సైతం తనదైన ముద్రవేశారు. లెక్కకు మిక్కిలి సాహసాలు చేసిన నటుడిగా, నిర్మాతల హీరోగా, సాధారణ సినీ కార్మిక కుటుంబాల బాగోగుల కోసం తపించిన వ్యక్తిగా కృష్ణ చిరకాలం గుర్తుండి పోతారు. ఉన్నత శిఖరాలకెదగటం, ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోవటం, సంపద గడించటం సినీ రంగంలో చాలామందికి సాధ్యపడి ఉండొచ్చు. కానీ సమాజానికి ఎంతోకొంత తిరిగి అందించటం తోటి మనిషిగా తన కర్తవ్యమని ఎంచి, తన ఆలంబన అందరికీ చల్లని నీడనివ్వాలని, తన చుట్టూ ఉన్నవారంతా సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న కృష్ణవంటివారు చాలా అరుదు. ఆ ‘మనసున్న మనీషి’కి ‘సాక్షి’ నివాళులు. -
నాన్న.. నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్.. మంజుల ఎమోషనల్ ట్వీట్
సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల ఆయన కూతురు మహేశ్ సోదరి మంజుల ఘట్టమనేని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాన్నను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు మంజుల. మీరు టాలీవుడ్‌కు మాత్రమే కాదు.. ప్రపంచానికే సూపర్ స్టార్ అంటూ కొనియాడారు. మా పట్ల మీరు చూపించిన ప్రేమానురాగాలు చిరకాలం మాతోనే ఉంటాయని నాన్నతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. తండ్రి మరణాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. (చదవండి: గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ పార్థివదేహం.. ఎందుకు తరలించలేదంటే?) ట్విటర్లో మంజుల రాస్తూ.. ' నాన్నా. మీరు ప్రపంచానికే సూపర్ స్టార్. మా కోసం మీరు చూపించిన ప్రేమ చిరకాలం మాతోనే ఉంటుంది. ఏది ఏమైనా మీరే నా జీవితానికి సూపర్ స్టార్. చిత్రసీమకు మీరు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పటికే నిన్ను చాలా మిస్ అవుతున్నా. లవ్ యూ నాన్న.' ఎమోషనల్ పోస్ట్ చేసింది. Dearest Nana, You are a superstar to the world and for us, at home, you are a loving, simple father who is always there for us, no matter what.Your legacy and immense contribution to cinema continue to live forever. I already miss you terribly. Love you forever Nana ❤ pic.twitter.com/xJ3G8L7iGH — Manjula Ghattamaneni (@ManjulaOfficial) November 15, 2022 -
సూపర్ స్టార్ కృష్ణ చివరి ఇంటర్వ్యూ ..
-
చుక్కల తోటలో ఎక్కడున్నావో ..!
-
సూపర్‌స్టార్ కోసం ఒక సీట్ రిజర్వ్.. నవరంగ్ థియేటర్ ఘననివాళి
సాక్షి, విజయవాడ: సూపర్‌స్టార్ కృష్ణకు నవరంగ్ థియేటర్ యాజమాన్యం ఘననివాళులు అర్పించింది. విజయవాడలో గల ఈ థియేటర్‌కు కృష్ణ గతంలో అనేకమార్లు వచ్చారు. ఈనేపథ్యంలో సూపర్‌స్టార్ కృష్ణ కోసం థియేటర్ యాజమాన్యం రోజు మొత్తం ఒక సీటు రిజర్వ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంది. సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు. ఇదిలాఉంటే, కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈమేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్) -
కృష్ణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేఏ పాల్
-
సూపర్ స్టార్ కృష్ణను తలుచుకొని ఎమోషనల్ అయిన సినీ ప్రముఖులు
-
గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ పార్థివదేహం.. ఎందుకు తరలించలేదంటే?
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని ఇవాళ నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. అభిమానుల సందర్శనార్థం విజయకృష్ణ నిలయం వద్దే ఈ రాత్రికి పార్థివదేహాన్ని ఉంచునున్నట్లు ప్రకటించారు. సూపర్ స్టార్ అభిమానులు ఆయన నివాసం వద్దకే వచ్చి నివాళులు అర్పించవచ్చని మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. అయితే రేపు ఉదయం 9 గంటలకు పద్మాలయ స్టూడియోస్‌కు ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నారు. (చదవండి: సూపర్ స్టార్ కృష్ణ మరణం.. రాజమౌళి ఎమోషనల్ ట్వీట్) మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన పార్థివదేహాన్ని ఆయన నివాసం వద్దే ఉంచుతున్నారు. మొదట సాయంత్ర 5 గంటల తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి తరలించాలని భావించారు. కానీ సమయం మించి పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయం వద్దే ఉంచుతున్నారు. అభిమానులు ఇక్కడికే వచ్చి నివాళులు అర్పించవచ్చు. — GMB Entertainment (@GMBents) November 15, 2022 -
మహేష్ బాబును పరామర్శించిన విజయ్ దేవరకొండ
-
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన jr ఎన్టీఆర్, నాగ చైతన్య
-
మహేష్ బాబును పరామర్శించిన అల్లు అర్జున్
-
సూపర్ స్టార్ కృష్ణ మరణం.. రాజమౌళి ఎమోషనల్ ట్వీట్
సూపర్ స్టార్ కృష్ణ గారి ఆకస్మిక మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని దర్శకధీరుడు రాజమౌళి విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. 300కు పైగా సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చలనచిత్ర రంగానికి సూపర్ స్టార్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సినీ పరిశ్రమలో కొత్త టెక్నాలజీ పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, అభిరుచి ప్రత్యేకంగా నిలుస్తాయని రాజమౌళి కొనియాడారు. కృష్ణ మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన ట్వీట్ చేశారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించడానికి ఆయన చేసిన ధైర్యం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. టాలీవుడ్లో మొదటి 70 ఎమ్ఎమ్ చిత్రం, తొలి కలర్ సినిమాతో పాటు ఇతర చిత్రాలతో తెలుగు సినిమాని విప్లవాత్మకంగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. మనం ఎంచుకున్న మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయొద్దనే విషయాన్ని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయన్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో మహేష్ బాబు, అతని కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. Extremely saddened to hear about the sudden demise of Superstar Krishna Garu. Krishna garu's contribution to the telugu film field as an actor in 300+ films, director, and producer are well known. What sets him apart from the rest is his love and passion for newer technologies. — rajamouli ss (@ssrajamouli) November 15, 2022 -
CM Jagan: హైదరాబాద్‌కు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే, కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చదవండి: (కృష్ణ గొప్ప నటుడే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మనిషి: డిప్యూటీ సీఎం) -
ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన అకాల మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. వెండితెరపై 350 వందలకు పైగా చిత్రాలు చేసి వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ చివరికి ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు. అవేంటంటే.. మనవడితో కలిసి తెరపై సందడి చేయాలనుకున్నారు… ‘వన్ నేనొక్కడినే’ మూవీతో ఆయన మనవడు, మహేశ్ కుమారుడు గౌతమ్ కృష్ణ వెండితెరకు పరిచయం అయ్యాడు. దాంతో మనవడితో నటించాలని ఉందని ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో, మూవీ విడుదల తర్వాత కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. కానీ అది కుదరలేదు. మంచి కథ వస్తే మహేశ్‌తో కలిసి మరో సినిమాలో నటించాలనుకున్నారు. కానీ ఆ కోరిక కూడా తీరలేదు. అయితే కృష్ణ తన కుమారులు మహేశ్, రమేశ్ బాబులతో కలిసి చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. తండ్రి నటించిన పలు చిత్రాల్లో మహేశ్ బాలనటుడిగా కనిపించారు. ఆయనను జేమ్స్ బాండ్‌గా చూడాలనుకున్నారు.. తెలుగు తెరకు జెమ్స్‌బాండ్ తరహా పాత్రని పరిచయం చేసింది కృష్ణే. గూఢఛారి 116, రహస్య గూఢచారి వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా గుర్తింపు పొందారు. తనలానే కుమారుడు మహేశ్‌ను కూడా జేమ్స్ బాండ్ పాత్రలో చూడాలనుకున్నారాయన. ఇదే విషయాన్ని పలు ఇంటర్య్వూలో ఆయన పేర్కొన్నారు. మహేశ్‌ను ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారంటూ జెమ్స్‌బాండ్‌గా అని ఆయన సమాధానం ఇచ్చారు. దాంతో మహేశ్‌ను జేమ్స్‌బాండ్‌గా చూడాలనే కృష్ణ కోరిక తీరకుండానే మిగిలిపోయింది. కాగా మహేశ్-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో మహేశ్ జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే నిజమైతే కృష్ణ కోరిక తీరినట్టే.. కానీ తెరపై మహేశ్‌ను జెమ్స్‌బాండ్‌గా చూసి మురిసిపోవాలనుకున్న ఆయన ఆశ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఆయన మనసు పడ్డ పాత్రలో నటించకుండానే.. తెరపై విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేసిన కృష్ణకు చత్రపది శివాజీగా చేయాలనేది ఆయన కోరిక. అల్లూరి సీతారామరాజుగా వెండితెరపై చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఆ తర్వాత మనసు పడ్డ మరో పాత్ర.. ఛత్రపతి వీర శివాజీ. చంద్రహాస సినిమాలో కృష్ణ శివాజీ పాత్రలో నటించారు. అయితే.. అది పూర్తిస్థాయి పాత్ర కాదు. కాసేపు మాత్రమే. దానికి తృప్తి చెందని కృష్ణ పూర్తి స్థాయిలో చత్రపతి శివాజీ సినిమా చేయాలనుకున్నారట. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత మహారథితో శివాజీ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట కృష్ణ. ఆ ప్రాజెక్ట్ మీద కొంత వర్క్ కూడా చేశారు. అయితే.. ఆ సినిమా వలన మత ఘర్షణలు చెలరెగే అవకాశం ఉందనే సందేహం వచ్చింది. దీంతో ఈ సినిమా చేయాలనే ఆలోచనను ఆయన వెనక్కి తీసుకున్నారట. దాంతో తనకు ఇష్టమైన శివాజీ పాత్రలో కనిపించాలనే కోరిక తీరకుండానే పోయింది. ఆ తర్వాత ఆ అవకాశం కూడా ఆయనకు రాలేదు. ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేయాలని.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహస్తున్న రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. దేశవ్యాప్తంగా ఈ షో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. తెలుగులోనూ ఈ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే అప్పట్లోనే ఇలాంటి ఓ రియాలిటీ షో చేయాలన్నది కృష్ణ కోరిక అట. కౌన్ బనేగా కరోడ్ పతి చూసి ఇక్కడ కూడా అలాంటి ఓ షో చేయాలని ఆయన కోరుకున్నారట. అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కేబీసీ షో చూసిన కృష్ణ.. తనకు కూడా అటువంటి షో చేయాలని ఉందని ఓ సందర్భంలో తన మనసులో మాట బయటపెట్టారు. అటువంటి కొత్త కాన్సెప్ట్‌తో ఎవరైనా టీవీ షో ఆఫర్‌తో తన దగ్గరకు వస్తే చేస్తానన్నారు. బుల్లితెరపై షోలు చేయడానికి తనకు అభ్యంతరం లేదని కృష్ణ గతంలో తెలిపారు. చదవండి రికార్డుల గని... అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్ -
కృష్ణ గొప్ప నటుడే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి: డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి: ఘట్టమనేని కృష్ణ గొప్ప నటుడే కాక ఉన్నత వ్యక్తిత్వం, విలువలు ఉన్న మనిషి అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. సంపాదనతో నిమిత్తం లేకుండా సమాజ హితం కోసం ఆయన అనేక సందేశాత్మక చిత్రాలు తీశారన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయనకున్న గుర్తింపు సినిమాలకే పరిమితం కాదు. నిజ జీవితంలో కూడా ఆయన అలాగే ఉండేవారని తెలిపారు. ఈ మేరకు మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి గొప్పవారినైనా ఎదిరించి నిలబడే మనస్తత్వం గల నిజాయితీపరుడు. పశ్చిమగోదావరి జిల్లాకు ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఆయన బిఎస్సీ చదువుకున్నారు. 1989 ప్రాంతంలో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయన పని చేసిన రెండేళ్లలోపు కాలంలోనే ముంపు బాధిత రైతులకు ఎంతో సహాయం చేశారు. చెరకు రైతులకు సకాలంలో పర్మిట్లు ఇప్పించేందుకు కృషి చేశారు. అలాగే పశ్చిమ, కృష్ణా డెల్టాల మధ్య ఉన్న కొల్లేరు సరస్సు ప్రత్యేకత, అక్కడి ప్రజల జీవన విధానం, కష్టసుఖాలు తెలియజేబుతూ "కొల్లేటి కాపురం" అనే సినిమా తీశారు. అలాగే మన జిల్లావాసి అయిన స్వతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు "అల్లూరి సీతారామరాజు" సినిమా తీయడం ద్వారా ఆయన గొప్పదనాన్ని ఆంధ్రదేశానికి చాటి చెప్పడమే కాకుండా కృష్ణ తన దేశభక్తిని చాటుకున్నారు. ఆయన రాజకీయలలో క్రియాశీలక పాత్ర పోషించకపోయినా అమరులైన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, రాజీవ్ గాంధీకి ఈయన ఎంతో సన్నిహితులుగా ఉండేవారు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృష్ణ గారి కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంతో చరిత్ర కలిగిన కృష్ణ గారు మన మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన తనయులు మహేష్ బాబుకి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (కృష్ణ పార్థివదేహం వద్ద బోరున విలపించిన మోహన్ బాబు) -
కృష్ణ పార్థివదేహం వద్ద బోరున ఏడ్చేసిన మోహన్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి సీనియర్ నటుడు మోహన్ బాబు నివాళులర్పించారు. కృష్ణ పార్థివదేహన్ని చూసిన ఆయన అక్కడే బోరున విలపించారు. కృష్ణను చూసిన వెంటనే బాధను దిగమింగుకోలేక పోయారు. ఆయనతో ఉన్న క్షణాలను మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. (చదవండి: ఆయన లేరన్న వార్త విని నా గుండె పగిలింది.. రామ్ చరణ్ ట్వీట్) అక్కడే మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చారు. వారి కుటుంబసభ్యులను మోహన్ బాబు పరామర్శించారు. ఇలాంటి బాధాకర సమయంలో దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ఆకాంక్షించారు. కృష్ణ మన మధ్య నుంచి వెళ్లిపోవడం తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆయన లేరన్న వార్త విని నా గుండె పగిలింది.. రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మెగాస్టార్ తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ ఇక లేరన్న వార్త విని నా గుండె పగిలిందని విచారం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనొక లెజెండ్ అని కొనియాడారు. ఆయన సినీ ప్రస్థానం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు రామ్ చరణ్. సూపర్ స్టార్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో మహేశ్ బాబుకు ధైర్యాన్ని ఇవ్వాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. Heartbroken to hear that Superstar Krishna Garu is no more. He was a legend whose journey will be remembered forever . My heartfelt condolences to my brother @urstrulyMahesh , his family and millions of fans🙏🏼🙏🏼 — Ram Charan (@AlwaysRamCharan) November 15, 2022 -
వెండితెరపై ఒకే ఒక్కడు..
-
అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు
సూపర్ స్టార్ కృష్ణ... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ చరిత్రగా నిలిచిన పేరు ఇది. హీరోగా వెండితెరపై కొత్త పాత్రలను పరిచయం చేసిన ఘనత ఆయనది. అందుకే కృష్ణ అంటే నేటి తరానికి కూడా పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. పాత్రలతో ప్రయోగాలు చేస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడికి పుంతలు వేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి లెజెండరి నటులు పోటీగా ఉన్నప్పటికీ పాత్రలతో ప్రమోగాలు చేసేందుకు ఏమాత్రం వెనకాడని సాహిసి ఆయన. అలా మోసగాళ్లకు మోసగాడు అనే యాక్షన్ మూవీ చేసి రికార్డు సృష్టించారు. అప్పటి వరకు హాలీవుడ్లో మాత్రమే కనిపించే ఈ పాత్రలు ఈ మూవీతో తొలిసారి ఇండియన్ సినిమాలో అది తెలుగు తెరపై పరిచయం కావడం విశేషం. 1971లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఒక్క తెలుగులోనే కాదు హిందీ. తమిళం, మలయాళం, బెంగాలీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇక ఈసినిమాతో కౌబాయ్‌గా టాలీవుడ్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన. కృష్ణ అంటే ఓ స్టార్ హీరో మాత్రమే కాదు గొప్ప వ్యక్తిగతం ఉన్న హీరో కూడా. ఇక కృష్ణను నిర్మాతల హీరో అని కూడా పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. నిర్మాతల హీరోగా మంచి మనసున్న వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణకు పేరు ఉంది. తాను నటించిన సినిమా ప్లాప్ అయితే వెంటనే ఆ నిర్మాతతను పిలిచి.. మళ్ళీ మంచి కథ సిద్ధం చేసుకోండి… ఫ్రీగా సినిమా చేస్తాను చెప్పడమే కాదు.. వారికిచ్చిన మాటను నిలబెట్టుకున్న హీరో ఆయన. అలా పలు నిర్మాతలకు ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండ నటించి వారికి హిట్లు ఇచ్చారు కృష్ణ. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో అప్పటి నిర్మాతలే స్వయంగా చెప్పారు. కృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరో మాత్రమే కాదని, ఆయన నిర్మాతల హీరో అంటూ ఆయనపై తరచూ ప్రశంసలు కురిపించేవారు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే. అంతేకాదు కృష్ణ ఒకానొక సమయంలో రోజుకి మూడు షిప్ట్ ల చొప్పున పని చేస్తూ.. ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేశారు. అంటే 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కృష్ణ ఒకే ఏడాది 17 సినిమాలను విడుదల చేసి రికార్డు సృష్టించాడు. 1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. ప్రపంచంలో మరే సినీ నటుడికీ ఇలాంటి రికార్డు లేదు. చదవండి: తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్ నటులకు ఆ భయం పట్టుకుంది: ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ -
బాగా కావాల్సిన వాళ్లంతా దూరమైపోతున్నారు.. మహేశ్ వీడియో వైరల్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలోనే తల్లి, సోదరుడిని పోగొట్టుకున్న మహేశ్‌కు తాజాగా తండ్రి కూడా దూరమయ్యాడు. గతకొంత కాలంగా అనారోగ్యంగో బాధపడుతున్న సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణ మరణంతో విషాదంలో ఘట్టమనేని ఇంట విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని మహేశ్‌బాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. (చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు) నాన్న అంటే మహేశ్‌కు ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ‘నాన్న నాకు దేవుడితో సమానం’ అని చాలా సందర్భాల్లో మహేశ్ చెప్పాడు. ఇప్పుడా దేవుడే లేడననే విషయాన్ని మహేశ్ తట్టుకోలేకపోతున్నాడు. తండ్రి పార్థీవదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మహేశ్‌ను అలా చూసి ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.ధైర్యంగా ఉండాలంటూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేశ్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోదరుడు రమేశ్‌బాబు మరణించిన సమయంలో మహేశ్ ఓ కార్యక్రమంలో పాల్గొని స్టేజ్ పైన ఎమోషనల్ గా మాట్లాడాడు.‘నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగిన మీ అభిమానం మాత్రం మారలేదు’ అంటూ అభిమానులనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Mahesh True Fans 🔔 (@mahesh_truefans) -
నానక్‌రామ్‌గూడలోని స్వగృహంలో కృష్ణ పార్థీవదేహం
-
బుధవారం మధ్యాహ్నాం మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు
►ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో బుధవారం మధ్యాహ్నాం మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ►రేపు ఉదయం 9 గంటలకు సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోస్‌కు తరలించనున్నారు. ఇవాళ రాత్రికి నానాక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహంలోనే ఉంచనున్నారు. ►కృష్ణ ఆత్మకు నివాళులర్పిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు చిత్ర పరిశ్రమ బంద్ పాటిస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. ► సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు... ఆయనతో కలిసి 3 సినిమాల్లో నటించా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ సంతాపం ప్రకటించారు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి హీరో రానా, రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ హీరో అక్కినేని అఖిల్, టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నివాళులర్పించారు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి ఏపీ సీఎం జగన్ రేపు నివాళులర్పించనున్నారు. బుధవారం హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. ► కృష్ణ పార్థివదేహనికి సీనియర్ నటుడు మోహన్ బాబు నివాళులర్పించారు. కృష్ణ పార్థివదేహాన్ని చూసిన మోహన్‌బాబు బోరున విలపించారు. బాధను ఆపులోలేక కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని సీఎం కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. ఈ బాధాకర సమయంలో ఆ కుటుంబానికి దేవుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని సీఎం ఆకాంక్షించారు. ఆయన వెంట మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ కుడా ఉన్నారు. ► కృష్ణ పార్థివదేహనికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. నానాక్‌రామ్‌గూడలోని కృష్ణ స్వగృహానికి చేరుకున్న కేసీఆర్ మహేశ్ బాబును పరామర్శించారు. కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోశ్ కుమార్ కూడా ఉన్నారు. ► సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం 4గంటలకు మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ► కృష్ణ పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి ,ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, నాగచైతన్య తదితరులు నివాళులర్పించారు. . అనంతరం మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ►తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’అని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశాడు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి హీరో వెంకటేశ్, దర్శఖులు బోయపాటి, రాఘవేంద్రరావుతో పాటు పలువురు సీనీ ప్రముఖులు నివాళులర్పించారు.దర్శకుడు రాఘవేంద్ర రావు పరామర్శిస్తున్న క్రమంలో మహేశ్ ద:ఖం ఆపుకోలేకపోయారు. తండ్రిని తలుచుకుని ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యం అక్కడి వారితో పాటు అభిమానులను కలిచి వేస్తోంది. ► రేపు మహా ప్రస్థానం లో కృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు సిని రాజకీయ ప్రముఖుల సందర్శన తర్వాత కృష్ణ గారి పార్ధివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం 3గంటల నుంచి మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర , సాయంత్రం 4గంటలకు మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. ► సూపర్‌స్టార్ కృష్ణ మరణం పట్ల పశ్చిమగోదావరి జిల్లా వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణానికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) జిల్లా వ్యాప్తంగా థియేటర్స్‌లో ఉదయం ఆటను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబీటర్స్ తెలిపారు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని హాస్పిటల్ నుంచి నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. రేపు పద్మాలయ స్టూడియో, అనంతరం కృష్ణ పార్థివ దేహానికి మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరుపబడతాయని తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ(79) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. -
మహేశ్ బాబు ఒంటరివాడైపోయాడు.. ఆ కుటుంబానికి నా ప్రగాడ సానుభుతి: లక్ష్మీ పార్వతి
-
కృష్ణ మృతి పట్ల నటుడు సాయి కుమార్ సంతాపం
-
డేర్ అండ్ డాషింగ్ ఆయన పేరులోనే ఉంది: అలీ
-
2500 అభిమాన సంఘాలు ఉన్న ఏకైక నటుడు కృష్ణ
-
కృష్ణ మృతి పట్ల నటుడు సుమన్ సంతాపం
-
కృష్ణ మృతిపట్ల సీఎం జగన్ దిగ్బ్రాంతి
-
కృష్ణ మరణానికి కారణం ఇదే.. వైద్యులు
సూపర్ స్టార్ కృష్ణ మరణంపై కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. వైద్యనీతి పాటించి ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనఃశాంతిగా వెళ్లిపోయేలా చేశామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్, ఎండీ డాక్టర్ గురు ఎన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. (చదవండి: రాజకీయాల్లోనూ రాణించిన కృష్ణ.. ఎన్టీఆర్‌కు ధీటుగా ప్రచారం!) ‘గుండెపోటు రావడంతో సోమవారం ఉదయం కృష్ణ ఆస్పత్రికి వచ్చారు. ఆయనను వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించాం. మొదటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. డయాలసిస్ కూడా చేశాం. సోమవారం సాయంత్రం కృష్ణ ఆరోగ్యం మరింత విషమించింది. ఎలాంటి ట్రీట్మెంట్ అందించినా ఫలితం ఉండదని నిర్ధారణకు వచ్చాం. (చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!) దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కొన్ని గంటలు మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం తెల్లవారుజామున 4.09గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ విషయంలో మేం వైద్యనీతి పాటించాం. ఆయన కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాం. కృష్ణ భౌతికకాయాన్ని వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించాం’ అని డాక్టర్ గురు తెలిపారు. -
రాజకీయాల్లోనూ రాణించిన కృష్ణ.. ఎన్టీఆర్‌కు ధీటుగా ప్రచారం!
సూపర్ స్టార్ కృష్ణ(79) మరణం అభిమానులకు, సినీ, రాజకీయ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిత్రపరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు సాధించిన కృష్ణ.. రాజకీయాల్లోనూ రాణించాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్నేహంతో రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణ.. ఎన్టీఆర్‌ని ధీటుగా ఎదుర్కొన్నాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. కృష్ణకు సన్నిహితులు. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి ప్రభంజనం కొనసాగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు. 1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. (చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!) 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవడం.. ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎంపీగా ఉన్నసమయంలో పార్లమెంట్ కమిటీల్లో చురుకుగా పాల్గొన్నారు. కన్సల్టెటివ్ కమిటిలోను, అలాగే కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీలో కూడా విశేష సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. తెలుగుదేశం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు సినిమాలు చేశారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అవయవాలు పని చేయడం మానేశాయి: వైద్యులు
-
అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ
సూపర్‌స్టార్ కృష్ణ అంటే తెలుగు సినీ ప్రపంచంలో తెలియని వారుండరు. అంతలా ఆ పేరు ప్రేక్షకుల గుండెల్లో అంతలా పాతుకుపోయింది. ఆయన నటనకు ప్రతిరూపం. అలనాటి తెలుగు సినిమాల్లో ఆయన ముద్ర చెరిగిపోని స్వప్నం. ఎన్నో అరుదైన రికార్డులు ఆయన సొంతం. టాలీవుడ్ నటుల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఏ హీరో సాధించని అరుదైన రికార్డును సాధించిన ఏకైక స్టార్ కృష్ణ మాత్రమే. అందుకే ఆయన పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. (చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే.. వైద్యులు) తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘట్టమనేని కృష్ణ.. నటనతోనే ఆగిపోకుండా దర్శకుడు, నిర్మాతగా, ఎడిటర్‌గానూ పని చేశారు. సినీ పరిశ్రమలో కృష్ణ కెరీర్ దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగిందంటే ఆయన నటనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో తెలుస్తోంది. దాదాపు 350 సినిమాల దాకా నటించారాయన. హ్యాట్రిక్ రోల్స్‌తో అబ్బురపరిచిన స్టార్ సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం పోషించే నటులను చూస్తాం. కానీ ఒకే సినిమాలో ఒకే నటుడు బహుళ పాత్రల్లో నటించడం అనేది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. అలాంటి పాత్రల్లో అవలీలగా నటించడం ఒక్క సూపర్ స్టార్కే సాధ్యమైంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ త్రిపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించడం ఆయనకే సాధ్యమైంది. ఇలా మూడు పాత్రల్లో కనిపించడం ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. కుమారరాజా, డాక్టర్-సినీ యాక్టర్, రక్త సంబంధం, పగపట్టిన సింహం.. ఇలా మూడు కంటే ఎక్కువ సినిమాల్లో ఆయన త్రిపాత్రాభియనంతో అలరించారు. ఆ చిత్రాలు ఇవే.. ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా టాలీవుడ్లో అరుదైన రికార్డు సృష్టించారు. ఆపై త్రిపాత్రాభినయ చిత్రాల్లో.. మొదటి సినిమా కుమారరాజాలో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారాయన. ఇది కన్నడ చిత్రం శంకర్ గురుకి రీమేక్. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్లో కృష్ణ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలు ఆయనే పోషించారు. ఈ చిత్రం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కృష్ణ తన ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన రెండో చిత్రం విజయనిర్మల దర్శకత్వం వహించిన డాక్టర్ సినీ యాక్టర్. సినిమాలో తండ్రి పాత్రతో పాటు కొడుకుగా, మేనల్లుడి పాత్రల్లో ఆయనే నటించారు. ఆ తర్వాత 'పగపట్టిన సింహం' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మళ్లీ అదే ట్రెండ్ రిపీట్ చేశాడు. ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విలన్‌గా, పోలీసాఫీసర్‌గా, లాయర్‌గా మూడు పాత్రల్లో మెప్పించారు. సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, బొబ్బిలి దొర వంటి ఇతర చిత్రాలలో కూడా బహుళ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు సూపర్ స్టార్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Krishna: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!
సూపర్‌స్టార్ కృష్ణ(79) ఇకలేరు. తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో అధునాతన విషయాలు తెరమీదకు తెచ్చిన నటుడు..కోట్లాది మంది ప్రేక్షకులను విషాదంలో ముంచుతూ శాశ్వత సెలవు తీసుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. చిత్రపరిశ్రమలో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేయలేదు. మొట్టమొదటి స్కోప్ తెలుగు చిత్రం అల్లూరి సీతారామరాజు కావడం తెలిసిందే. అలాగే మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు.మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సింహాసనం. 40– 50 లక్షల్లో సిన్మాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక, నిర్మాత, హీరో కృష్ణ రూ. 3 కోట్ల 20 లక్షల దాకా చాలా ధైర్యంగా ఖర్చు పెట్టారు. బిజినెస్ కూడా అదే రేంజ్లో భారీగా జరిగింది. ఈ చిత్రానికి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఎన్నో మైలురాళ్లు దాటిన ఆయన దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి అందరిని అబ్బురపరచారు. 350 పైగా చిత్రాల్లో హీరోగా నటించాడు. ఒకే ఏడాది ఎక్కువ సినిమాలు విడుదల చేసిన హీరోగా కూడా కృష్ణ అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. 70-71వ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు మరుపురానిది. ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్లను పరిచయం చేశాయి. ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో కూడా కృష్ణే. కెరీర్ మొత్తంలో 50 మల్టీస్టారర్స్ చేశారు. చిత్ర పరిశ్రమలో కృష్ణ నెలకొల్పిన రికార్డులను మరే హీరో సాధించలేడనడం అతిశయోక్తి కాదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూత
-
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి తాజా అప్డేట్
-
అత్యంత విషమంగా కృష్ణ ఆరోగ్యం, ఇప్పుడే ఏం చెప్పలేం: వైద్యులు
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యలు పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రి చైర్మన్ గురునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సుమారు ఆయన మధ్యరాత్రి సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఎమర్జేన్సీకి తరలించాం. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందించాం. అరగంట పాటు సీపీఆర్ చేశాం. ప్రస్తుతం ఇంటెన్సీవ్ కేర్‌లో ఉన్నవారికి ఎటువంటి చికిత్స ఇవ్వాలో అదే చేస్తున్నాం. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక ఇప్పటికీ చికిత్స కొనసాగుతూనే ఉంది. మరో 24 గంటల వరకు ఏం చెప్పలేం’ అన్నారు. అనంతరం ఆయన దగ్గరి బంధువులంతా ఆస్పత్రిలో ఉన్నారని, వారి ప్రైవసీని ప్రతి ఒక్కరు గౌరవించాలని ఆయన కోరారు. అంతేకాదు ప్రతి గంట క్రూషియల్ అని, ఆయన కోలుకోవాలని ప్రార్థిద్దాం చైర్మన్ గురునాథ్ రెడ్డి అన్నారు. దీంతో తమ అభిమాన నటులు కృష్ణ కోలుకోవాలని ఘట్టమనేని ఫ్యాన్స్, సినీవర్గాలు ప్రార్థిస్తున్నాయి. -
‘కృష్ణగారి ఆరోగ్యం నిలకడగా ఉంది.. ఆందోళన అవసరం లేదు’
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై సీనియర్ నటుడు నరేశ్ సోమవారం ఉదయం స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రోటిన్ చెకప్‌లో భాగంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్లు నరేశ్ పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక కాగా కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మరో రెండు రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. -
సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
సీనియర్ నటులు, సూపర్ స్టార్ కృష్ణ ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా కొంతకాలంగా కృష్ణ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Indira Devi Death: తల్లి మృతితో శోకసంద్రంలో మహేశ్‌బాబు
తల్లి ఇందిరా దేవి(70) మృతితో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఏడాది జనవరిలోనే సోదరుడు రమేశ్ బాబు మరణించడం, ఇప్పుడు తల్లి కూడా చనిపోవడంతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది. మహేశ్‌కు తల్లి ఇందిరా దేవిపై అపురూపమైన ప్రేమ. పలు సందర్భల్లో ఆమె ప్రస్తావన రాగానే ఎంతో ఎమోషనల్ అయ్యాడు. పెళ్లికిముందు వరకు ఆయన తల్లి చాటునే పెరిగాడు. అందుకే ఆమె అంటే అంత ప్రేమ. ఓ వివాహ వేడుకకు ఇందిర వచ్చినప్పుడు మహేశ్‌బాబు ఆమెను రిసీవ్ చేసుకున్న విధానం అందరినీ ఆకర్షించింది. తండ్రికి రెండో వివాహం.. అందుకే తల్లి చాటున ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణ మామ కూతురే. వరసకు మరదలు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొన్నాళ్లకే కుటుంబసభ్యుల సలహా మేరకు ఇందిరను పెళ్లి చేసుకున్నారు కృష్ణ. అయితే ఆ తర్వాత విజయ నిర్మలతో వరుసగా సినిమాలు తీయడంతో ఆమెతో ప్రేమలో పడ్డారు. దీంతో ఇందిరతో పెళ్లైన నాలుగేళ్లకే.. విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణ. పెళ్లి విషయాన్ని ఇందిరకు చెప్పారు. ఆ తర్వాత కూడా అందరూ కలిసే ఉన్నారు. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఇందిరా దేవి ఎప్పుడూ బయటకు రాలేదు. ఫంక్షన్లలోనూ అరుదుగా కనిపించారు. ఎమోషనల్ పోస్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 20న ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు చాలా ప్రత్యేకంగా ట్విట్టర్లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. అమ్మా మీరు నా తల్లికావడం అదృష్టం. మీ గురించి చెప్పడానికి ఒక్కరోజు సరిపోదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ట్వీట్ చేశాడు. మహేశ్ తన మాతృమూర్తి పట్ల చూపించిన ప్రేమను చూసి ఆయన అభిమానులు మురిసిపోయారు. కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె ప్రాణాలు కోల్పోవడం మహేశ్‌తో పాటు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Happy birthday Amma ♥️ Thank you for being the blessing you are. One day is never truly enough! Love you always 🤗🤗🤗 pic.twitter.com/92aqNPmUQR — Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2022 చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం -
కుటుంబ సభ్యులతో సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి (ఫొటోలు)
-
Indira Devi Death: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవికి రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఐదుగురు సంతానం. అభిమానుల సందర్శనార్థం ఇందిరా దేవీ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోస్కి తరలిస్తారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జనవరిలోనే రమేశ్ బాబు(56) మృతిచెందారు. ఏడాది తిరగకముందే ఇందిరా దేవి కూడా కన్నుమూయడం కృష్ణ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాగా.. ఇందిరా దేవి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కృష్ణ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రకృతి వనాన్ని తలపిస్తోన్న సూపర్ స్టార్ ఇల్లు చూశారా?
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ కృష్ణ బయటకు మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. అందుకే ఆయనను నటుడిగానే కాదు పర్సనల్‌గా కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆ సింప్లిసిటీ ఆయనలో మాత్రమే కాదు, ఇంటిని కూడా అన్ని సౌకర్యాలతో చాలా సింపుల్‌గా నిర్మించుకున్నారు కృష్ణ. ఇటీవల కృష్ణ హోంటూర్ వీడియో ప్రోమోను ఆయన కూతురు మంజుల ఘట్టమనేని తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఫుల్ వీడియోను వదిలారు ఆమె. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే హైదరాబాద్ నగరంలో ఎవరూ ఊహించని రీతిలో కృష్ణ ఇల్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చూట్టూ ఆకుపచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాలు, రకరకాల పూలు, పండ్ల తోటలతో పూర్తి ప్రకృతమయంగా ఇంటిని నిర్మించుకున్నారు కృష్ణ. ఇంట్లో అడుగడుగునా ఆయన అభిరుచి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే పచ్చని వనం, మధ్యలో కృష్ణుడి విగ్రహం.. వాటర్ ఫౌంటెన్ దాని చుట్టూ గులాబీ చెట్లు.. కొబ్బరి చెట్లు, పెరటిలో తులసి, ఆ పక్కనే విజయ నిర్మల గారి విగ్రహం ఇలా ఆహ్లాద వాతావరణాన్ని తలపిస్తోంది. భాగ్య నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కలిగించేలా కట్టుకున్న ఇల్లును చూసి ఫిదా అవుతున్నారంతా. మరో విశేషం ఏంటంటే ఇంటి వెనకాలే మామిడి తోట.. ఆకుకూరలు, కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి. ఇక కుటుంబమంతా కలిసి సరదాగా గడిపేందుకు గార్డెన్లో, ఇంట్లో స్పెషల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఇంటి లోపల హోం థియేటర్, స్మిమ్మింగ్ ఫూల్, ఇంట్లోనే పార్టీ చేసుకునేందుకు అన్ని హంగులతో నిర్మించుకున్న హాల్, పిల్లల కోసం ప్లేయింగ్ రూమ్స్ అన్నీ చక్కగా అమర్చి ఉండటంతో ఇది ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. లివింగ్ రూంలో ఎక్కడ చూసినా విజయ నిర్మల ఫొటోలు, విగ్రహాలు.. బంగారంతో చేయించిన ఆమె కాళ్లు.. కృష్ణ గెలుచుకున్న పతకాలు ఇలా ఎన్నింటినో చూపిస్తూ ఆసక్తికర అంశాలను షేర్ చేశారు మంజుల. లివింగ్ రూం వరకే చూపించి మొదటి అంతస్తులో నాన్న ఉంటారని, ప్రస్తుతం అక్కడికి నో ఎంట్రీ అని చెప్పారామె. కుదిరితే భవిష్యత్తులో చూపిస్తానన్నారు. మొత్తానికి ఆయన ఇంటిని చూస్తుంటే ఓ సుందరవనాన్ని తలపిస్తోంది. ప్రకృతిమయమైన రిసార్టును చూస్తున్న భావన కలుగుతోంది. ఇలా ఎన్నో విశేషాలతో ఆయన ఇల్లు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. -
సూపర్‌స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ సీఎం జగన్ ట్వీటర్లో పేర్కొన్నారు. చదవండి: (గ్రీన్ ఎనర్జీ.. ఏపీ ఒక దిక్సూచి కాబోతుంది: మంత్రి అమర్నాథ్) సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2022 -
అభిమానిని తలుచుకొని ఎమోషనల్ అయిన సూపర్‌స్టార్ కృష్ణ
-
సర్కారు వారి పాట విజయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన
Super Star Krishna About Sarkaru Vaari Paata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోన్న ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఇలా ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా సర్కారు వారి పాట రికార్డుకెక్కింది. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట మూవీపై మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ స్పందించారు. చదవండి: జై భీమ్ వివాదం, హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్ సర్కారు వారి పాట సక్సెస్ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా సర్కారు వారి పాట ఇంత ఘనవిజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘మహేశ్ సర్కారు వారి పాట చాలా బాగుతుంది. ఫస్ట్ హాప్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సెకండ్ హాఫ్‌లో మహేశ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఈ మూవీ కలేక్షన్స్ అన్ని సెంటర్స్‌లోనూ హౌజ్‌ఫుల్‌తో పోతుంది. అయితే కొన్ని చానల్స్ మాత్రం మూవీ బాగాలేదని ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. ఈ సినిమాలో మహేశ్ పోకిరి కంటే కూడా చాలా యంగ్ కనిపిస్తున్నాడంటూ కృష్ణ మురిసిపోయారు. మహేశ్ చాలా మెయిన్‌టెన్ చేస్తాడని, షూటింగ్ లేని రోజుల్లో ఎక్కువ సమయంలో జిమ్‌లోనే ఉంటాడని చెప్పారు. చదవండి: కంగనా చిత్రాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నా: నటి పాయల్ ఇక సర్కారు వారి పాట సినిమా గురించి సుప్రీం కోర్టులో మాట్లాడాలని, అంత మంచి కథ తీసుకున్నారని చెప్పారు. ఇక మే 31న ఆయన బర్త్‌డే వేడుకలపై స్పందిస్తూ స్ట్రెయిన్ అవుతున్న కారణంగా గత 5 ఏళ్లుగా బయటకు వెళ్లడం లేదని, తన చిన్న కూతురు ప్రయదర్శిని ఇంట్లోనే తనకు ఇష్టమైన వంటకాలు అన్ని చేస్తుందని తెలిపారు. అయితే సర్కారు వారి పాట మూవీ ఇంట్లోనే తన హోం థియేటర్లో చూశానని, సినిమా చూడగానే మహేశ్‌కు ఫోన్ చేశానన్నారు. చాలా బాగా నటించావని, పోకిరి, దూకుడు కంటే కూడా సర్కారు వారి పాట పెద్ద హిట్ అవుతుందని చెప్పడంతో వాడు చాలా హ్యాపీగా ఉన్నాడని పేర్కొన్నారు. అనంతరం భవిష్యత్తులో మహేశ్ అల్లూరి సీతారామరాజు సినిమా చేసే అవకాశం ఉందా? అని అడగ్గా వందశాతం ఈ మూవీ చేయబోడని కృష్ణ బదులిచ్చారు. -
నాన్న బయోపిక్‌లో నేను నటించలేను: మహేశ్ బాబు
Mahesh Babu about Father Krishna Biopic: ‘‘కొన్ని సినిమాలు కొందరే చేయాలి. ‘మేజర్’లో అమరవీరుడు సందీప్‌గా శేష్ బాగా సూటయ్యాడు. సందీప్ పాత్ర నేను చేసుంటే బాగుండేదేమోనని ఆలోచించే అంత సెల్ఫిష్ కాదు నేను. నా సినిమాలు నేనే చేయాలి. మిగతా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు హీరో, నిర్మాత మహేశ్‌బాబు. అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్లు సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల నటించారు. చదవండి: ఎఫ్ 3 ఒక మంచి ట్రీట్‌లా ఉంటుంది: వెంకటేశ్ అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సందీప్‌గా అడివి శేష్ నటించారు. జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మహేశ్‌బాబు మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తీస్తారనే ప్రశ్న ఎదురైంది. చదవండి: సింగర్స్‌గా మారిన మంచు విష్ణు కుమార్తెలు దీనికి మహేశ్ బాబు స్పందిస్తూ.. ‘నాన్నగారి (సూపర్‌స్టార్ కృష్ణ) బయోపిక్ ఎవరైనా చేస్తే ఫస్ట్ నేనే హ్యాపీగా చూస్తాను. నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు. నాన్నగారి బయోపిక్‌కి ఎవరైనా దర్శకత్వం వహిస్తే నా బ్యానర్లో నిర్మించడానికి రెడీగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు. అలాగే మేజర్ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘‘బయోపిక్ తీసేటప్పుడు బాధ్యతగా ఉండాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ తీస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా తీయాలి. ‘మేజర్’ చూశాను. చాలా సీక్వెన్సెస్ గూస్బంప్స్ ఇచ్చాయి. చివరి 30 నిమిషాలయితే నా గొంతు ఎండిపోయింది. సినిమా చూశాక రెండు నిమిషాలు మౌనంగా ఉండి, ఆ తర్వాత శేష్‌ను హగ్ చేసుకున్నాను’ అని చెప్పారు. -
అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు
-
విఠలాచార్యపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది
‘‘నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో విఠలాచార్యగారి సినిమాలు చాలా చూశాను. ఆయన దర్శకత్వంలో నేను చేసిన ఒకే ఒక సినిమా ‘ఇద్దరు మొనగాళ్లు’ హిట్ అయ్యింది. గొప్ప దర్శకుడు, సక్సెస్ఫుల్ నిర్మాత అయిన ఆయనపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణం నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ రాసిన ‘జై విఠలాచార్య’ పుస్తకం ఫస్ట్ లుక్‌ని కృష్ణ విడుదల చేశారు. ‘‘సినిమా నిర్మాణంలో విఠలాచార్యగారు పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్య శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేసి, త్వరగా రాశాను. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది’’ అని పులగం చిన్నారాయణ అన్నారు. ‘‘జై విఠలాచార్య’ను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా అన్నారు. -
‘జుంబారే.. జుజుంబరే’ రీమిక్స్ అదిరింది!
సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘జుంబారే.. జుజుంబరే’ రీమిక్స్ సాంగ్ స్పెషల్ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యమలీల చిత్రంలోని ఈ పాట ఎంత పాపులరో వేరే చెప్పనక్కర్లేదు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన ఈ పాటకి జొన్నవిత్తుల సాహిత్యం అందించారు. కృష్ణ, పూజా ‘జుంబారే.. జుజుంబరే’ పాటకు డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇదే పాటని సరికొత్త స్టైల్లో రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. (చదవండి: రాజమౌళితో మహేశ్ సినిమా ఆశించొచ్చా?) టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్, సత్యా, అర్చనా సౌందర్య నటిస్తున్నారు. 50 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయింది. కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్ నిలిచిపోయింది. తాతగారి పాటకు అశోక్ గల్లా స్టెప్పులు అదిరిపోయాయని అభిమానులు సంబరపడిపోతున్నారు. -
కేసీఆర్ గారికి హృదయపూర్వక అభినందనలు
మొన్న విడుదలైన తెలంగాణ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు చిత్ర ప్రముఖులతో పాటు ఆయనకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ– ‘నాలుగున్నరేళ్ల పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావటం చాలా గొప్ప విషయం. కేసీఆర్‌గారు ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకు మేలు చేశాయి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి అఖండ విజయాన్ని అందించారు. మళ్లీ రెండోసారి తెలంగాణకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న శ్రీ కె. చంద్రశేఖరరావుగారికి నా హృదయపూర్వక అభినందనలు’’ అన్నారు. కేసీఆర్‌గారికి ‘మా’ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి విజయ పతాకాన్ని ఎగురవేసిన టీఆర్ఎస్ నేత కేసీఆర్‌ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అభినందించింది. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతో కట్టుబడి ఉంది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, ఎఫ్.డి.సి. చైర్మన్ రామ్మోహన్రావు గారిని ఎప్పుడు ఏ పని నిమిత్తం కలిసినా వారు ఎంతో సహకరించారు. ‘మా’ రజతోత్సవం సందర్భంగా ఓ పెద్ద బాధ్యత మాపై ఉంది. గోల్టెన్ హోమ్ నిర్మాణాన్ని ఈ కార్యవర్గం ఉండగానే ప్రారంభించాలనుకుంటున్నాం. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా. -
సీఎం పదవికి వైఎస్ జగన్ పూర్తి అర్హుడు
పాదయాత్రలో జనం అద్భుత స్పందన చూస్తుంటే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం ఖాయమనిపిస్తోందని సూపర్ స్టార్ కృష్ణ పేర్కొన్నారు. జగన్ ఏ ఊరెళ్లినా ఇసుక వేస్తే రాలనంతగా జనం వస్తున్నారని, మే నెల ఎండల్లో కూడా అంతగా కష్టపడుతున్నాడంటే జగన్‌ని నిజంగానే అభినందించాలని ప్రశంసించారు. ఆంధ్రలో మే నెలలో వేసవి ఎండల్లో ఇంతగా నడవడం అంటే మాటలు కాదని, జగన్ శ్రమకు ఫలితం వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసి మరీ ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టారు కాబట్టి ఆ హామీని తప్పకుండా నిలబెట్టుకోవాలంటున్న కృష్ణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... 350 సినిమాల్లో నటించిన ఏకైక తెలుగు సినిమా హీరో మీరే కదా. ఈ రికార్డు ఎలా సాధించారు? చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి సంవత్సరం మూడే సినిమాలు చేశాను. గూఢచారి సినిమా తర్వాత మూడు షెడ్యూల్స్‌లో పనిచేశాను. ఒక సంవత్సరమైతే 18 సినిమాల్లో హీరోగా నటించాను. అన్నీ విడుదలయ్యాయి. ఒకే రోజు రెండు సినిమాలు నావి విడుదలైన సందర్భాలున్నాయి. బాలకృష్ణ మాత్రమే ఒకసారి బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలను ఒకే రోజు విడుదల చేశారు. నా సినిమాలు అలా చాలాసార్లు విడుదలయ్యాయి. ఏడేళ్లలోనే వంద సిని మాల్లో నటించాను. తర్వాత కలర్ పిక్చర్ల యుగం రావడంతో వాటిపై కాస్త ఏకాగ్రత పెట్టి తీయాలని పించింది. అప్పటినుంచి సంవత్సరానికి ఏడు సిని మాల్లో మాత్రమే నటించసాగాను. అప్పుడు కూడా కాస్త మొహమాటాలకు పోయి సంవత్సరానికి పది సినిమాల్లో కూడా నటించాను. సీతారామరాజు చిత్ర విశేషాలు చెప్పండి? అల్లూరి ఉద్యమం నడిపిన ప్రాంతాల్లోనే సినిమా షూటింగ్ జరిగింది. నేను మేకప్ వేసుకుని షూటింగ్ స్పాట్‌కి రాగానే మన బాబు వచ్చారు, మా బాబు వచ్చారు అంటూ గిరిజనులు దండాలు పెట్టేవారు. నన్ను అచ్చం రామరాజే అనుకున్నారు జనం. ఎన్టీఆర్‌తో మీకు విభేదాలు ఎలా వచ్చాయి? సీతారామరాజు సినిమా విషయంలోనే వచ్చాయి. ఆయన ఎంతకాలానికీ సినిమా తీయలేదు. నేను తీయబోతోంటే వద్దన్నారు. కారణం ఏమీ లేదు. ఆ కథ డ్రై సబ్జెక్ట్. తీస్తే ఆడుతుందనే నమ్మకం నాకు లేదు కాబట్టే తీయలేదు. నువ్వూ తీయవద్దు. నేనూ తీయను. ఇప్పటికే దేవుడు చేసిన మనుషులు సినిమా తీసి డబ్బులు వెనకేసుకున్నావు. అల్లూరిపై సినిమా తీస్తే అవి కూడా పోతాయి. నష్టపోతావు. తీయవద్దన్నారు. కావాలంటే కురుక్షేత్రం సినిమా తీయి. దాంట్లో నేను కృష్ణుడిగా వేస్తాను. నువ్వు అర్జునుడిగా వేయి. మళ్లీ ఇద్దరం కలిసి పనిచేద్దాం అన్నారాయన. మీరు అల్లూరి తీస్తానంటే నేను మానేస్తాను అన్నాను. కానీ అప్పటికే అల్లూరిపై స్క్రిప్టు తయారు చేసిన మా బృందం పూర్తి నమ్మకంతో ఉంది. తప్పకుండా తీద్దాం అని చెబితే నేను కూడా సిద్ధపడ్డాను. అలా అల్లూరి సినిమా మొదలైంది. తాను చెబితే కూడా నేను వినలేదనే కోపంతో ఎన్టీరామారావు దేవుడు చేసిన మనుషులు సినిమా శత దినోత్సవానికి కూడా రాలేదు. అల్లూరి సినిమా కూడా చూడలేదాయన. కానీ ఆ సినిమా ఎలాగైనా సరే తీయాలని ఉండేది తనకు. పదేళ్ల తర్వాత పరుచూరి బ్రదర్స్‌ని పిలిపించి అల్లూరి సినిమా స్క్రిప్ట్ రాయండి నేను నటిస్తాను అన్నారట. పరుచూరి గోపాల కృష్ణ ఎన్టీఆర్‌తో మాట్లాడుతూ.. ఇలా చెబుతున్నానని ఏమనుకోవద్దు. ఒకసారి కృష్ణగారితో కలిసి ఆ సినిమా చూడండి. ఆ తర్వాతా తీద్దామంటే తప్పక రాస్తామన్నారట. మేం అప్పటికి పదేళ్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు. అప్పుడే వాహిని స్టూడియోలో పక్క పక్క ఫ్లోర్లలో ఇద్దరం షూటింగు చేస్తుండేవాళ్లం. ఒకరోజు బయటికి వస్తుండగా బ్రదర్ ఒకసారిలా రండి అని పిలిచారు ఎన్టీఆర్. అల్లూరి సీతారామరాజు సిని మాను నేను చూడాలి. మీరు పక్కన ఉండగానే చూడాలి అన్నారు. అలా ఆ సినిమా చూశారు. ఇంటర్వెల్ సమయానికే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. పూర్తి సినిమా చూశాక.. ఎంతో మెచ్చుకున్నారు. ఇంతకంటే ఎవరూ ఈ సినిమాను తీయలేరు అంటూ నన్ను కావలించుకుని అభినందించారు. ఇక మేం ఈ సినిమాను తీయాల్సిన పనిలేదు అని చెప్పారు. వైఎస్సార్ కుటుంబంతో మీ పరిచయం ఎలా ఉండేది? ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు. ఇద్దరం ఎంపీలుగా ఉన్నప్పటినుంచి పరిచయమైంది. చాలా స్నేహపూరితంగా ఉండేవారు. రాజకీయంగా తొలి అయిదేళ్లు బ్రహ్మాండంగా పనిచేయబట్టే రెండో సారి కూడా రిపీటెడ్‌గా గెల్చి అధికారంలోకి వచ్చారు. వైఎస్ఆర్లో మీరు చూసిన విశిష్టత ఏమిటి? ఆయన మాట తప్పడు. అనుకున్న పని చేస్తాడు. ఎవరికైనా మాట ఇస్తే తప్పడు. ప్రజలకు చేసిన వాగ్దానాలను కూడా వీలైనంతవరకు అమలు చేసేవారు. సక్రమంగానే పరిపాలన సాగించారు. ఆయన చేసిన పనుల్లో నాకు నచ్చినవి ఒకటి కాదు. ఆరోగ్యశ్రీతోపాటు పది పథకాలు పెట్టి విజయవంతంగా అమలు చేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర పట్ల మీ స్పందన ఏమిటి? జనం బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఏ ఊరెళ్లినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. చాలా కష్టపడుతున్నాడు. ఇంత ఎండల్లో నడవడం అంటే మాటలు కాదు. హైదరాబాద్‌లో కొంచెం ఫర్వాలేదు కానీ మే నెలలో ఆంధ్రలో ఎండలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. అంత ఎండల్లో కూడా అంతగా కష్టపడుతున్నాడంటే జగన్‌ని నిజంగానే అభినందించాలి. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే జగన్ సీఎం అయ్యేటట్టే కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఉద్యమంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసే ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ హామీని తప్పకుండా నిలబెట్టుకోవాలి. చంద్రబాబు, కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం? చంద్రబాబు అనుభవజ్ఞుడు. ఇక కేసీఆర్ ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతున్నాడు. పాలన చాలా బాగుంది. హైదరాబాద్ నగరంలో గతంలో ఒక్క కార్పొరేటర్ సీటు కూడా లేని టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వంద స్థానాల్లో గెలిచిందంటే ఎంత వృద్ధి సాధించిందో అర్థమవుతుంది. తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి? సందేశాలు రాజకీయ నేతలే ఇవ్వాలి. తమకేం కావాలో ప్రజలకు బాగా తెలుసు. -
రేపటికి ముందడుగు
మహిళను గౌరవించడానికి ఒక ‘డే’నా! ఒక జన్మ కూడా సరిపోదు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ ఒక్క రోజు నాలుగు చప్పట్లు కొట్టి రేపటి నుంచి ఇష్టానుసారంగా ఉండటం... ఇవాళ్టి అబద్ధాన్ని ఒక జన్మంతా సాగదీయడమే. అసలు మహిళలకి మగాడు మర్యాద ఇవ్వడమేంటి? అతడికి జన్మను ఇచ్చిందే ఒక మహిళ. మహిళ ఆత్మ గౌరవాన్ని తగ్గించకుండా ఉంటే చాలు. మహిళ విజయాలకు వంకలు పెట్టకుండా ఉంటే చాలు. సామర్థ్యాలను సమాధి చేయకుండా ఉంటే చాలు. మగాడి జీవితానికి బొడ్డుతాడు అయిన ఈ మహోన్నత శక్తిని నులిమేయకుండా ఉంటే చాలు. తన మనుగడను తను తెంచుకోకుండా ఉంటే చాలు! నటి... సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె... మంజులతో ఇంటర్వ్యూ అసలు ఎక్కడా కనిపించడం లేదు.. ఏం చేస్తున్నారు? మాతృత్వం గొప్ప వరం. అందుకే కూతురు పుట్టాక బ్రేక్ తీసుకున్నా. ఇన్నేళ్లూ మదర్‌హుడ్‌ని ఆస్వాదించాను. ఎదిగే పిల్లలకు తల్లిదండ్రుల అవసరం ఉంటుంది. అప్పుడు పిల్లలపై మన ప్రేమ తప్పక చూపించాలి. నేనదే చేశా. ఇప్పుడు నా కూతురి వయసు పదేళ్లు. ‘అమ్మా... నాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకు. వర్క్ చూసుకో’ అని తనే అంటోంది. సో, ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేసే టైమ్ వచ్చింది. ఓ మూవీ డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నా. ఇవాళ ‘ఉమెన్స్ డే’ కాబట్టి, దాని గురించి మాట్లాడుకుందాం. మహిళగా పుట్టినందుకు మీరెలా ఫీలవుతున్నారు? లక్లా భావిస్తున్నా. మగవాళ్ల కంటే మహిళలే ఎక్కువ అనే అంశం జోలికి వెళ్లదలచుకోలేదు. అలాంటి వాదన నాకిష్టం ఉండదు. ‘ఎంతో పుణ్యం చేస్తే మహిళగా పుడతారు’ అని దలైలామా, ఓషో వంటి ఆధ్యాత్మిక గురువులు అన్నారు. ఉద్వేగం, సున్నితత్వం, ఆవేశం, జాగ్రత్త.. వంటివన్నీ మహిళలకు ఎక్కువ. మగవాళ్లు కూడా మహిళల నుంచే పుడతారు. అది సహజమైన ప్రక్రియ. మహిళగా పుట్టినందుకు ఒక్క క్షణం కూడా పశ్చాత్తాపపడింది లేదు. స్త్రీ ‘తక్కువ’... పురుషుడు ‘ఎక్కువ’ అనే సమాజం ఇది. ఈ పరిస్థితిలో ఓ స్త్రీ ఆత్మవిశ్వాసంగా బతకాలంటే ఏం చేయాలి? నేను ఫీలయ్యేది ఏంటంటే... మనకి మనమే (మహిళలు) ఎక్కడో చిన్న భయాలు, ఓ రకమైన ఆలోచనలతో ఒకదానికి కట్టుబడిపోతున్నాం. కొందరు మహిళలు వాళ్లను వాళ్లే తక్కువ చేసుకుంటారు. ‘మనం ఎక్కువ’ అనే ఫీలింగ్ ఇన్సెక్యూర్టీని పోగొట్టి, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మహిళలకు అడ్డంకులు ఉన్నాయి. కాదనడం లేదు. ఏది ఏమైనా అమ్మగా, వర్కింగ్ విమెన్‌గా... రెంటినీ బ్యాలెన్స్ చేసుకోగల సామర్థ్యం మహిళలకే ఉంది. మనకు ‘సూపర్ పవర్స్’ ఉన్నాయి. ఇంటినీ, జాబ్‌నీ బ్యాలెన్స్ చేసుకోవడం మగవాళ్ల వల్ల కాదు. మనల్ని మనం తక్కువగా ఊహించుకోకుండా ఉంటే ‘మగవాళ్లు ఎక్కువ’ అనే ధోరణిలో మార్పు తీసుకురాగలుగుతామని నా నమ్మకం. మగవాడు ఇంటి పనులు చేయకూడదని కొందరి మగవాళ్లల్లో ఉంటుంది.. కొందరు ఆడవాళ్ల ఫీలింగ్ కూడా అదే... కరెక్ట్‌గా అన్నారు. ట్రెండ్ మారింది. ఇప్పుడు మగవాళ్లు కూడా ఇంటి పనుల్లో హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్నారు. మహిళలుగా వాళ్లకు ఆ ఛాన్స్ మనమే ఇవ్వాలి. కొందరు... ‘వద్దండీ. మీకెందుకు శ్రమ’ అంటారు. మగాళ్ల కంటే మనమే ఎక్కువ ఇదైపోతుంటాం. మనకూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలని మనం ఫీలవ్వాలి. అది లేనిదే ఏం చేయలేం. ఇప్పుడు మగవాళ్లు మారుతున్నారు. మా ఆయన మా అమ్మాయి డైపర్స్ ఛేంజ్ చేసేవారు. స్టడీస్ దగ్గర్నుంచి అమ్మాయి విషయంలో ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు. పిల్లల బాగోగులు చూసుకోవడం తండ్రులకు లభించే గొప్ప గిఫ్ట్. ఐయామ్ నాట్ గుడ్ ఎట్ సీయింగ్ అకడమిక్స్. ఆయనే చూసుకుంటారు. కృష్ణగారి కూతురు కావడంతో ఫ్యాన్స్ మిమ్మల్ని హీరోయి న్ని కానివ్వలేదు. అమ్మాయిని కాబట్టి ప్రొఫెషన్ని ఎంచుకునే ఫ్రీడమ్ లేకుండాపోయిందని బాధగా అనిపించిందా? అప్పుడు అనిపించింది. ఫ్రీడమ్ లేదా? అనుకున్నా. నేను అనుకుని ఉంటే అభిమానులను ఎదిరించి సినిమాలు చేసుండొచ్చు. కానీ, ఆలోచించా. ఓ మహిళగా కుటుంబ గౌరవం, పేరు మన చేతుల్లో ఉంటాయి. మన కల్చర్ చాలా డిఫరెంట్. ఫ్యాన్స్ నాన్నగారిని చాలా ప్రేమిస్తారు. ‘హీ ఈజ్ ద కింగ్. ఇది ఆయన కింగ్డమ్’. నేను దాన్ని పూర్తిగా గౌరవిస్తా. అందుకే నేను కూడా ఫ్యాన్సే రైట్ అనుకున్నా. ఎందుకంటే... దర్శకులు వచ్చి కథలు చెప్పినప్పుడు... ‘నేను ఇది చేయను, అది చేయను’ అని చెప్పేదాన్ని. కొన్ని పాత్రలకే పరిమితం కావాలనుకున్నప్పుడు చేయకపోవడమే బెటర్. యాక్చువల్లీ నేను యాక్ట్ చేస్తానన్నప్పుడు నాన్నగారు హండ్రెట్ పర్సెంట్ హ్యాపీగా లేరు. నా ఇష్టాన్ని కాదనలేక ‘యస్’ చెప్పారు. ఫ్యాన్స్ ఆక్షేపించినప్పుడు ఓ పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పుడు కొన్ని పాటించాలని, ఫ్యామిలీ గౌరవ మర్యాదలను స్పాయిల్ చేయకూడదని అర్థమైంది. అందుకే నా అంతట నేను మానుకున్నా. అయినా అప్పుడు చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ కూడా లేవు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ టైమ్‌లో ఎప్పుడైనా నేను అబ్బాయిగా పుట్టి ఉంటే నచ్చిన ప్రొఫెషన్లో సెటిలై ఉండేదాన్నని అనిపించిందా? అస్సలు లేదండి. మా అమ్మ, అమ్మమ్మ ‘నువ్ మగాడిగా పుట్టుంటే ఈపాటికి ఇండస్ట్రీ అంతా ఏలేసేదానివి’ అనేవారు. నేను నవ్వేదాన్ని. అప్పుడు కూడా నాకు అబ్బాయిగా పుడితే బాగుండేదని అనిపించలేదు. ‘నిర్భయ’ వంటి ఘటనలు విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? చాలా డిస్ట్రబ్ చేస్తాయి. మహిళగానే కాదు... మానవత్వపు దృష్టితో చూసినా చాలా విచారకరమైన ఘటన. ఓ మనిషి అంత క్రూరంగా ఎలా చేస్తాడు? ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది? ఆ ప్రాణం ఎంత విలవిలలాడి ఉంటుంది? రక్త–మాంసాలతో పుట్టిన సాటి మనిషిగా ఆ బాధను గ్రహించలేరా? ఒకప్పుడు మంచి మనుషులు ఉండేవారు. రాముడు తదితరుల గురించి చెబుతారు కదా! మళ్లీ ఆ రోజులు రావాలి. కఠినమైన శిక్షలు వేయాలి లాంటివి చెప్పను. శిక్షలు కూడా మార్చలేవు. ‘మంచితనం’ పెంచుకోవాలి. అందుకే, ‘మూర్ఖత్వపు మనుషులు మాకు వద్దు. వాళ్ల నుంచి మమ్మల్ని బయటకు తీసుకురా. మనుషుల్లో మంచిని మాత్రమే ఉంచు. నీచపు స్థితికి దిగజారనివ్వకుండా ఉన్నత స్థితికి తీసుకువెళ్లు’ అని మనందరం దేవుణ్ణి ప్రార్థించాలి. మనందరం మంచోళ్లం అయిపోవాలి. అదొక్కటే మార్గం. మనం మారి, ప్రేమతో సమాజంలో మార్పు తీసుకురావాలి. ప్రేమను పంచాలి. ఇటీవల తమిళ హీరో శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి దగ్గర ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. బ్యాగ్రౌండ్ ఉన్న సెలబ్రిటీలకూ వేధింపులు తప్పవా? సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరికైనా అలాంటి ఘటనలు ఎదురవుతాయి. చెడు ఆలోచనలున్న వెధవ ఎవరైనా తగిలాడనుకోండి... వాట్ టు డూ! ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా బయటపడాలి? అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాంటోళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో తెలియాలి. అడ్వాంటేజ్ తీసుకోవాలనే వెధవలు ఇంచు మించు ప్రతి రంగంలోనూ ఉన్నారు. అందరిలోనూ మార్పు రావాలి. మంచిని పంచాలి. మంచి మనుషులుగా మారుతుంటే.. మనల్ని చూసి ఇంకొకరు. అలా మల్టిప్లై అయ్యి లోకమంతా మారుతుందని ఆశిద్దాం. మీ రోల్ మోడల్ ఎవరు? మా అమ్మమ్మ. ఆ ప్రేమ వేరు. (నవ్వుతూ..) నాయనమ్మకు లేదని అనడం లేదు. మా అమ్మమ్మకు అమ్మ ఏకైక సంతానం. అందుకని అమ్మమ్మ మాతోనే ఉండేవారు. నాన్నగారికి మా అమ్మమ్మ అంటే గౌరవం. అమ్మకన్నా అమ్మమ్మ స్ట్రాంగ్. మమ్మల్ని బాగా పెంచింది. స్కూల్‌కి వెళతాం, పాఠాలు చదువుతాం, మిగతావన్నీ నేర్చుకుంటాం. కానీ, ముందు మన బేస్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడు ఏదైనా చేయగలం అనిపిస్తుంది. నాకు ఆ బేస్ అమ్మ, అమ్మమ్మ దగ్గర లభించింది. ఏం నేర్చుకున్నా.. నేర్చుకోకపోయినా... ఎమోషన్, లవ్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ ఇద్దరి దగ్గరనుంచి అవి నేర్చుకున్నాను. మా ఐదుగురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌ను అమ్మమ్మ ఎంతో కేరింగ్‌గా చూసుకుంది. అమ్మమ్మ ఈజ్ వెరీ స్ట్రాంగ్ విమెన్. డైరెక్షన్ చేయబోతున్నారని తెలిసి, కృష్ణగారు ఏమన్నారు? హి వాజ్ సో హ్యాపీ. ముఖ్యంగా నా కథను నమ్మి, మరొకరు సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందపడ్డారు. కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తున్నానని తెలిసిన తర్వాత నాన్నగారు ఇంకా గర్వంగా ఫీలయ్యారు. మహేశ్‌బాబుకు చెప్పగానే... ‘డైరెక్షన్ చేస్తున్నావా? వెరీ డిఫికల్ట్. అంత ఈజీ కాదు’ అన్నాడు. ‘అవును! నాకు ఆ సంగతి తెలుసు. బట్, నేను చేయగలనని నాకు తెలుసు’ అని చెప్పా. అప్పుడు ‘గుడ్... గుడ్. బాగా చెయ్’ అన్నాడు. మహేశ్‌కి భయం ఎక్కువ. తన చుట్టూ ఉన్నవాళ్లు సక్సెస్ కావాలని కోరుకుంటాడు. ఒకవేళ సరైన రిజల్ట్ రాకపోతే... ఎక్కడ డిజప్పాయింట్ అవుతామేమోనని ‘బీ కేర్‌ఫుల్’ అంటుంటాడు. ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. ప్రాక్టికల్‌గా ఉంటాడు. నాన్నగారికి మహేశ్‌కి ఫుల్ డిఫరెంట్. నాలో ఇద్దరి లక్షణాలున్నాయి. అన్నయ్య రమేశ్, మా ఆయన అందరూ... సపోర్ట్ చేస్తారు. మీ చుట్టూ ఉన్న మీ నాన్నగారు, బ్రదర్స్, హజ్బెండ్, బ్రదర్ ఇన్లాస్... అందరూ మంచోళ్లే అనుకుంటా! అవునండీ. మా ఆయన (సంజయ్) చాలా మంచి వ్యక్తి. ఫ్యామిలీని చూసుకోవడంలో గానీ, ఇల్లు, పిల్లలు, ఫ్రీడమ్ విషయంలోగానీ... హి ఈజ్ అమేజింగ్. నాన్నగారు మహిళలను గౌరవించే విధానం, ఫ్రీడమ్ ఇచ్చే విధానం సూపర్. ఆయనెంత గొప్ప మనిషి అండి. మనీ, ఫేమ్, సక్సెస్ రావడం ఈజీ. కానీ, మంచి పేరు రావడం చాలా కష్టం. తెలుగువాళ్లు మొత్తం ‘కృష్ణగారు గొప్ప వ్యక్తి’ అని చెబుతారు. మహిళలు, మగవారు సమానమని నాన్న చెబుతారు. మహేశ్ కూడా అంతే. ఒక్క క్షణం కూడా ‘ఐయామ్ ద బాస్’ అనే తరహాలో ప్రవర్తించడు. ఫాదర్, బ్రదర్స్, హజ్బెండ్... ప్రతి ఒక్కరూ అంత మంచోళ్లు అవడం నా అదృష్టం. చుట్టూ మంచి వాతావరణం ఉంటే లైఫ్‌లో అద్భుతాలు సృష్టించవచ్చు. మీరు డైరెక్షన్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? క్యూట్ లవ్ స్టోరీ. ‘ఫస్ట్ మూవీ ఎప్పుడూ ఎందుకు లవ్ స్టోరీలు తీస్తారు?’ అని చాలామంది అడిగారు. ప్రేమ అనేది యూనివర్సల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఇదే నా మొదటి సినిమా. మంచి సినిమా చేయాలని మొదలుపెడుతున్నాను. నా ఫస్ట్ లవ్ డైరెక్షనే. యాక్టింగ్‌లోకి ఎందుకొచ్చానంటే... నాన్నగారిని చూసి యాక్టింగ్ ఈజీ అనుకున్నాను. నాకూ ఈజీగా ఛాన్సులొచ్చాయి. కానీ, దర్శకత్వం అనేది జీవితాన్ని ఓ కోణంలో దగ్గరగా చూసిన తర్వాత అనుభవంతో చేయాలి. ఓ 20 ఏళ్ల అమ్మాయికి, ఆ టైమ్‌లో కష్టం అనిపించింది. ఇప్పుడు హ్యాపీగా సినిమా తీయడానికి రెడీ అయ్యాను. మనుషులు ఎలా ఉండాలనుకుంటానో... అలాంటి పాత్రలు సృష్టించే ఛాన్స్ వచ్చింది. 20 ఏళ్ల క్రితం నేను వేరు, ఇప్పుడు వేరు. నాలో వచ్చిన పరిణతి సినిమాలో కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్... ఫన్, కమర్షియల్ వేలో తీయబోతున్నా. కానీ, మంచి సెన్సిబిలిటీస్ ఉంటాయి. మీ అమ్మాయి జాన్వీని కూడా నటింపజేస్తున్నారట? అవునండీ. కథని మలుపు తిప్పే క్యారెక్టర్ తనది. పక్కనే అల్లరి చేస్తున్న కూతురితో.. జానూ... కుదురుగా కూర్చో... వన్ లాక్ రెమ్యునరేషన్ ఇస్తానన్నాగా... నో మమ్మీ... ఫైవ్ లాక్స్.. అంటూ అల్లరిగా చూసింది. తల్లీకూతుళ్లిద్దరూ కూల్‌గా నవ్వేశారు. ► ఈ ‘ఉమెన్స్ డే సందర్భంగా’ నేను కోరుకునేదొక్కటే.. నాలానే మిగతా అందరి మహిళల జీవితాల్లోనూ మంచి మగవాళ్లు ఉండాలి. ఇప్పటికే మంచివాళ్లు ఉన్నారు. నెగటివ్ ఎనర్జీ ఉన్న ఆ మిగతావాళ్లల్లోనూ మంచి మార్పు రావాలి. ► మహాత్మా గాంధీగారు నాకు ఆదర్శం. అహింసను నమ్ముతా. ఆయన మహిళల గురించి చాలా గొప్పగా చెప్పారు. ‘మహిళలకు పవర్ ఇచ్చినట్లయితే.. ప్రపంచం ఇంకా మంచిగా మారుతుంది’ అని ఆయనోసారి చెప్పారు. – డి.జి. భవాని -
అప్పుడు ఎలా నటించాలో తెలియదు!
‘‘యాభై సంవత్సరాల క్రితం ‘తేనె మనసులు’ చిత్రంలో నటించాను. నాతోపాటు చాలామంది కొత్తవాళ్లతో ఆదుర్తి సుబ్బారావుగారు ఆ చిత్రం తీసి, హిట్ చేశారు. ఆ చిత్రానికి నేను సెలక్ట్ అయినప్పుడు డ్యాన్స్, ఫైట్స్, ఎలా నటించాలో కూడా తెలియదు. నాలుగైదు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరీ సినిమా తీశారు. కానీ, ఈ తరం వారు రెండు మూడేళ్లు అన్ని రంగాల్లో శిక్షణ తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. నవీన్ కూడా శిక్షణ తీసుకున్నాడు. తనకు మీ ఆశీర్వాదం (అభిమానులు) ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నందిని నర్సింగ్ హోమ్’. శ్రావ్య, నిత్య హీరోయిన్లు. పీవీ గిరి దర్శకత్వంలో రాధాకిషోర్.జి, బిక్షమయ్య సంగం నిర్మించారు. అచ్చు స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని హీరో మహేశ్‌బాబు విడుదల చేసి కృష్ణకు అందించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ- ‘‘నవీన్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. ‘అతడు’, ‘పోకిరి’ చిత్రాలప్పుడు ఎక్కువగా కలిసేవాళ్లం. నా చిత్రాలకు ఫైట్స్ కూడా ఎడిటింగ్ చేశాడు. ‘ఏమవుదామనుకుంటున్నావ్’ అని ఓ సందర్భంలో అడిగితే ‘యాక్టర్ అవుతాను అన్నా!’ అన్నాడు. అప్పుడు తను జోక్ చేస్తున్నాడా? అనిపించింది నాకు. ఎందుకంటే నవీన్ అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. ఏడాది తర్వాత తనని కలిస్తే బాగా సన్నబడటంతో పాటు సిక్స్‌ప్యాక్ బాడీలో కనిపించాడు. అప్పుడే తన డెడికేషన్ ఏంటో అర్థమైంది. మనం హార్డ్‌వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందని నమ్ముతాను’’ అన్నారు. ‘‘కథ నచ్చడంతో మొదటి సిట్టింగ్‌లోనే నవీన్ నటించేందుకు ఒప్పుకున్నారు. క్లయిమాక్స్‌లో నవీన్ నటనకు మహేశ్ గుర్తుకొచ్చారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు పీవీ గిరి పేర్కొన్నారు. ఈ వేడుకలో నటి విజయనిర్మల, సీనియర్ నటుడు నరేశ్, దర్శకులు బి.గోపాల్, ఎ.కోదండరామిరెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు ఎమ్మెస్ రాజు, రాజ్ కందుకూరి, హీరోలు సుధీర్‌బాబు, సాయిధరమ్ తేజ్, సంగీత దర్శకుడు కోటి, హీరోయిన్లు శ్రావ్య, నిత్య పాల్గొన్నారు. -
బర్త్‌డే గిఫ్ట్
అక్షరాల్లో అగ్నికణాలు నింపి తెలుగు రచనా ప్రపంచంలో చైతన్య శిఖరారోహణ చేసిన మహాకవి శ్రీశ్రీ. అలాంటి చైతన్యాన్ని రగిలించే పాత్రలో సూపర్‌స్టార్ కృష్ణ కనిపిస్తారు. ఆయన ప్రధానపాత్రలో ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ నిర్మించిన ఈ చిత్రం కృష్ణ పుట్టినరోజు (మే 31) కానుకగా జూన్ 3న రిలీజవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే అన్నదే కథాంశం. మహాకవి శ్రీశ్రీగారు తన ఆవేశాన్ని రచనల్లో చూపిస్తే, మా చిత్రంలో శ్రీశ్రీ చేతల్లో చూపిస్తారు. కృష్ణగారు సినిమా ఇండస్ట్రీకొచ్చి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దాం, వారి ఆశీస్సులు కావాలి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కృష్ణ తనయుడు, హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. విజయనిర్మల, సీనియర్ నరేశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇ.ఎస్.మూర్తి, కెమెరా: సతీష్ ముత్యాల. -
బుర్రిపాలెంలో శ్రీమంతుడు
గుంటూరు: ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు జిల్లా బుర్రిపాలెం వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం వచ్చిన 'శ్రీమంతుడు'కు గ్రామస్తులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు బుర్రిపాలెం. మహేష్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. మహేష్ తన బావ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో కలసి వచ్చారు. మహేష్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైంది. ఈ రోజు అభివృద్ధి పనులకు మహేష్ శంకుస్థాపన చేయనున్నారు. మహేష్ బాబు రాకకోసం బుర్రిపాలెం గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభివృద్ధికి నోచుకోని తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయన్న ఆశతో ఉన్నారు. సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం అన్న సందేశాన్ని చాటిన శ్రీమంతుడు సినిమాకు ముందే మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. మార్చిలో మహేష్ భార్య నమ్రత, సోదరి పద్మావతి ఈ గ్రామానికి వచ్చారు. అప్పట్లో నమ్రత ప్రకటించినట్టే రెండు నెలల్లోపే మహేష్ ఈ ఊరికి వచ్చారు. -
రా... రా... శ్రీమంతుడా
► నేడు బుర్రిపాలేనికి మహేశ్‌బాబు ► ఆశగా ఎదురుచూస్తున్న గ్రామస్తులు ► ఘనస్వాగతానికి సన్నాహాలు ► పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రిన్స్ ఆరోజు వచ్చేసింది.. ఎంతోకాలంగా ఆ గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్న శుభదినం రానే వచ్చింది. తమ గ్రామాన్ని సుసంపన్నం చేసే శ్రీమంతుడు ఆదివారం వస్తున్నాడన్న వార్తతో బుర్రిపాలెం గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు అభివృద్ధికి నోచని తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయన్న ఆశతో వారంతా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెనాలి : సూపర్‌స్టార్ కృష్ణ తన స్వగ్రామం బుర్రిపాలెం పేరును సినీ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘బుర్రిపాలెం బుల్లోడు’తో ఈ ప్రాంతాన్ని వెండితెరపైకి కూడా తెచ్చారు. కృష్ణ తనయుడు, ‘ప్రిన్స్’ మహేశ్‌బాబు దత్తత తీసుకోవడంతో మరోసారి ఈ గ్రామం వార్తల్లోకొచ్చింది. ‘సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం’ అన్న సందేశాన్ని చాటిన శ్రీమంతుడు సినిమాకు ముందే మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. ఆయన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ ప్రకటన చేసినప్పట్నుంచీ బుర్రిపాలేన్ని బంగారుపాలెం చేస్తారన్న భావనతో అభిమానులు ప్రిన్స్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మార్చిలో మహేష్ భార్య నమ్రతా, సోదరి పద్మావతి కలిసి వచ్చారు. అప్పట్లో నమ్రతా ప్రకటించినట్టే రెండు నెలల్లోపే మహేష్ ఆదివారం గ్రామానికి రానున్నారు. అన్నీ ఉన్నా అభివృద్ధి లేదు బుర్రిపాలెం జనాభా 3,306 మంది. ఓటర్లు 2,524 మంది. జనాభాలో మూడోవంతు ఎస్సీలు, బీసీలే. ఆయకట్టు 1,200 ఎకరాలు. నీటితీరువా మినహా ఇతర ఆదాయం లేదు. ప్రభుత్వ నిధులతో సహా ఏడాదికి వచ్చే రూ.10 లక్షలతో అభివృద్ధికి ఆస్కారమే లేకుండా పోయింది. శివలూరుకు వెళ్లే డొంకరోడ్డు ఒక్కటే తారురోడ్డు. గ్రామంలో రోడ్లు 3వేల మీటర్లుంటే, 2,400 మీటర్లు సిమెంటు రోడ్లు వేయగలిగారు. మూడు ఎలిమెంటరీ పాఠశాలలు, ఉన్నత పాఠశాల, ప్రైవేట్ బీఈడీ కళాశాల, మూడు అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో రెండింటికి శాశ్వత భవనాలు నిర్మితం కాగా, మరొకటి నిర్మించాల్సి ఉంది. అక్షరాస్యత 80 శాతం. భూగర్భ జలాలు అడుగంటి, తాగునీటి సమస్య ఎదురైంది. మురుగునీటి పారుదల వ్యవస్థ దుర్భరంగా ఉంది. దళితుల కాలనీల్లో వసతులు కరువయ్యాయి. షెడ్యూల్ ఇదీ.. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా బయల్దేరనున్న మహేశ్‌బాబు ఉదయం 11.30 గంటలకు కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బుర్రిపాలెం వచ్చి సొంత ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి తన నాయనమ్మ, మాజీ సర్పంచ్ నాగరత్నమ్మ నిర్మించిన గీతామందిరంలో దైవదర్శనం చేసుకుంటారు. గ్రామం వెలుపల పంట సంజీవని కింద పంటపొలాల్లో తీసిన నీటికుంటలను పరిశీలిస్తారు. అక్కడే గ్రామస్తులు, అభిమానులతో మాట్లాడతారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందజేస్తారు. రెండు డ్వాక్రా గ్రూపులకు చెక్కులు పంపిణి చేస్తారని ఎంపీడీవో శ్రీనివాసరావు చెప్పారు. నాగరత్నమ్మ పేరుతో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వశిక్షా అభియాన్ నిధులతో కొత్తగా నిర్మించిన రెండు తరగతి గదులను ప్రారంభిస్తారు. గ్రామంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. బహిరంగ సభ రద్దయినట్టు సమాచారం. మురుగునీటి పారుదల మెరుగుపరచాలి బుర్రిపాలెం గ్రామంలో మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా ఉంది. నీరుపారుదలకు సరైన మార్గం లేదు. కల్యాణమండపం ఎదుట నాకు పూరిల్లు ఉంది. వర్షం వస్తే నీళ్లను తోడుకోవాల్సిన పరిస్థితి. డ్రెయినేజీని మెరుగుపరచాలని కోరుకుంటున్నా.- నిడమానూరి కనకదుర్గాదేవి, బుర్రిపాలెం సమస్యలు చెప్పుకునే వీలుంటుందా? గ్రామంలో డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు ఉన్నాయి. మహేష్‌బాబు దత్తత తీసుకున్నాడని తెలిసిన నాటి నుంచి పరిస్థితులు మెరుగు పడతాయని ఆశిస్తున్నాం. ఆయనను కలిసి మా సమస్యలను వివరించే అవకాశం వస్తుందో రాదో. - కంచర్ల స్వాములు, బుర్రిపాలెం -
లవ్లీ ఎంటర్ టైనర్...
సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా, నిత్యానరేశ్ నాయికగా ఓ చిత్రం రూపొందుతోంది. ఎస్.వి.సి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీవీ గిరి దర్శకత్వంలో బిక్షమయ్య, రాధాకిషోర్ నిర్మించనున్న ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయిధరమ్ తేజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ కొట్టగా, విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణ మాట్లాడుతూ-‘‘ నవీన్ హీరోగా చేస్తున్న రెండో చిత్రమిది. వైవిధ్యమైన ప్రేమకథగా అందరినీ నవ్వించే ఎంటర్టైనర్’’ అని అన్నారు. ‘‘చాలా ఎంటర్టైనింగ్గా ఉండే సబ్జెక్ట్ ఇది. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో ఈ చిత్రం సాగుతుంది’’ అని నరేశ్ తెలిపారు. రచయితగా చాలా సినిమాలకు వర్క్ చేసిన తనకిది దర్శకునిగా తొలి చిత్రమనీ, ఏప్రిల్ తొలివారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని దర్శకుడు చెప్పారు. -
ఆ ఇద్దర్నీ ఎప్పటికీ మర్చిపోలేను: సూపర్‌స్టార్ కృష్ణ
‘‘తెలుగులో తొలి కౌబాయ్ సినిమా సహా ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత కృష్ణది. అందుకే, రెబల్‌స్టార్ నేను కాదు కృష్ణే. అతను నిర్మాతల మనిషి మాత్రమే కాదు.. ఏటా 12-14 సినిమాలు చేసి, పరిశ్రమలో కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తి’’ అని రెబల్‌స్టార్ కృష్ణంరాజు అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల జంటగా ముప్పలనేని శివ దర్శకత్వంలో సాయిదీప్ చాట్ల, వై. బాలురెడ్డి, షేక్ సిరాజ్ సమష్టిగా నిర్మించిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఇ.ఎస్. మూర్తి స్వరపరిచిన ఈ చిత్రం పాటలనూ, ప్రచార చిత్రాన్నీ గురువారం హైదరాబాద్‌లో మహేశ్‌బాబు ఆవిష్కరించారు. హీరోగా కృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తరఫున అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ శాలువా, సన్మానపత్రంతో కృష్ణను సత్కరించారు. కృష్ణ మాట్లాడుతూ- ‘‘‘తేనెమనసులు’ ద్వారా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారు నన్ను హీరోని చేస్తే, ‘గూఢచారి 116’ ద్వారా నాకు మాస్ ఇమేజ్ తెచ్చి, 50 ఏళ్లు కెరీర్‌ని నడిపే బలం ఇచ్చారు నిర్మాత డూండీ. వారినెప్పటికీ మర్చిపోలేను. ఈ ‘శ్రీశ్రీ’ యాభై ఏళ్ల కెరీర్లో ఓ మైలురాయి’’ అన్నారు. ‘‘అందరి కన్నా కృష్ణగారికి అతి పెద్ద అభిమానిని నేనే. నాలుగు నెలల క్రితం ‘శ్రీశ్రీ’లో నాన్న గారి గెటప్ ఫోటో చూసి, ఇప్పుడు ట్రైలర్ చూసి ఎగ్జయిట్ అయ్యా. చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా? అనిపిస్తోంది’’ అని మహేశ్‌బాబు అన్నారు. విజయనిర్మల మాట్లా డుతూ - ‘‘చాలా ఏళ్ల తర్వాత నేనూ, కృష్ణగారూ కలసి నటించాం. ఇప్పటివరకూ మేమిద్దరం కలసి 48 సినిమాలు చేశాం. ఇంకా రెండు సినిమాలు చేస్తే.. హాఫ్ సెంచరీ పూర్తి చేసేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పలనేని శివ, సంగీత దర్శకుడు ఇ.ఎస్. మూర్తి, నటులు నరేశ్, హీరో సుధీర్ బాబు, సినీ ప్రముఖులు కోదండరామిరెడ్డి, ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశ్రీలో మహేశ్‌బాబు?
చాలా కాలం విరామం తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీ’. ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయనిర్మల, నరేశ్‌లు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మహేశ్‌బాబు మెరుపులా కనిపిస్తారనే వార్త ప్రస్తుతం ఫిలిమ్నగర్లో హల్చల్ చేస్తోంది. అక్కినేని ఫ్యామిలీ అంతా ‘మనం’లో కనిపించిన తరహాలో, కృష్ణ ఫ్యామిలీ అంతా ఇందులో కనిపించే ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ఆ వార్త సారాంశం. మహేశ్ తనయుడు గౌతమ్ కృష్ణ, హీరో సుధీర్‌బాబు కుమారుడు కూడా ఇందులో నటిస్తున్నారట. ఈ వార్తే నిజమైతే అభిమానులకు పండగే పండగ. -
సమ్మర్లో నంబర్‌వన్ అవుతుంది!.
‘‘వచ్చింది కదా అవకాశం...ఓ మంచి మాట అనుకుందాం...ఎందుకు ఆలస్యం..అందర్నీ రమ్మందాం’’ అంటూ ‘బ్రహ్మోత్సవం’ టీజర్లో మహేశ్‌బాబు చేసిన సందడికి అభిమానులు, ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్.వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత ఇందులో కథానాయికలు. ఈ టీజర్ గురించి ‘ సూపర్‌స్టార్ ’ కృష్ణ మాట్లాడుతూ- ‘‘‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేశ్ తన గత సినిమాల కంటే చాలా బాగున్నాడు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలవుతుంది. కచ్చితంగా సమ్మర్ చిత్రాలలో ‘బ్రహ్మోత్సవం’ నంబర్‌వన్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. భలే మంచి హిట్ ఇది - కృష్ణ ’ ‘‘భలే మంచి రోజు’ సినిమా సుధీర్ కెరీర్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమాతో అతని కెరీర్ స్టడీ అవుతుందన్న నమ్మకం ఉంది. అతనికిది భలే మంచి హిట్’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో కృష్ణ, విజయనిర్మల ఈ సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణ పాత్రికేయులతో మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఎవరి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయకుండా ఇంత మెచ్యూర్డ్‌గా, క్లారిటీగా సినిమా తీయడం చాలా విచిత్రంగా ఫీలయ్యాను. శ్రీరామ్‌కి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని చె ప్పారు. ‘‘ఈ సినిమాలో సుధీర్ యాక్టింగ్ బాగుంది. శ్రీరామ్ ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సినిమా తీయడం గొప్ప విషయమే’’ అని విజయనిర్మల అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సుధీర్‌బాబు, నిర్మాతల్లో ఒకరైన విజయ్, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశ్రీ ఆవేశం
అక్షరాల్లో అగ్నికణాలు నింపి తెలుగు రచనా ప్రపంచంలో చైతన్య శిఖరంలా నిలిచిన మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకంటే సూపర్‌స్టార్ కృష్ణ ‘శ్రీశ్రీ’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్‌పై శ్రీసాయిదీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ - ‘‘టైటిల్ చూస్తే మహాకవి శ్రీశ్రీ గుర్తుకొస్తున్నారు. ఆయన తన ఆవేశాన్ని రచనల్లో చూపిస్తే, మా చిత్రంలో శ్రీశ్రీ చేతల్లో చూపిస్తారు. దర్శకుడు చెప్పిన దానికంటే అద్భుతంగా తీస్తున్నారు’’ అని అన్నారు. విజయ నిర్మల మాట్లాడుతూ - ‘‘కథ, పాత్రలు నచ్చడంతో కృష్ణగారు, నేనూ కలసి నటిస్తున్నాం. నా 70వ ఏట రీ ఎంట్రీ ఇస్తున్నా’’ అని చెప్పారు. ‘‘అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే అన్నదే కథాంశం. ఫిబ్రవరి 12న సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. -
ఈ పెద్దోడు చెబుతున్నాడు...బాక్సాఫీస్ బద్దలైపోతుంది : వెంకటేశ్
‘‘శ్రీమంతుడు టైటిల్ చాలా బాగుంది. మహేశ్ గ్లామరస్‌గా ఉన్నాడు. ఇండస్ట్రీలో ‘శ్రీమంతుడు’ గురించి టాక్ బాగుంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ ఎంటర్టైన్మెంట్, ఎం.బి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సీవీయం మోహన్ సమష్టిగా నిర్మించిన చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న హీరో వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం ట్రైలర్ చూశాక నేను రెండు సైకిల్స్ కొన్నాను. కానీ, సైకిల్ మీద నేను కొంచెం రఫ్‌గా కనిపించాను. (మహేశ్‌బాబుని ముద్దుగా సంబోధిస్తూ) మా చిన్నోడు చాలా స్మూత్‌గా, అందంగా ఉన్నాడు. ఈ పెద్దోడు చెబుతున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక మీ అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. బాక్సాఫీస్ బద్దలైపోతుంది’’ అన్నారు. సినీ నటుడిగా కృష్ణ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం ఆయనను సత్కరించింది. ‘‘మహేశ్‌బాబు గెటప్ బాగుంది’’ అని సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల అన్నారు. ‘‘మహేశ్‌బాబుతో వంద కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయనున్నా. కథ సిద్ధం చేస్తున్నా’’ అని అతిథిగా పాల్గొన్న దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ -‘‘దేవిశ్రీ ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఆడియోలో ‘జాగో జాగో...’ నా కెరీర్లో మంచి సాంగ్. కొరటాల శివ ఈ చిత్రాన్ని చెప్పిన దానికన్నా బాగా తీశారు. తండ్రి పాత్రకు జగపతిబాబు గారు ఒప్పుకుంటారో లేదో అని అనుమానం వచ్చింది. కానీ, నేను, కొరటాల శివ కథ చెప్పగానే, వెంటనే ఓకే చెప్పారు. ఆ పాత్రను ఆయనకన్నా ఎవరూ బాగా చేయరు, నేను కమల్‌హాసన్ ఫ్యాన్‌ని. శ్రుతితో సినిమా చేస్తానని అనుకోలేదు. మీరెప్పుడూ (అభిమానులు) నా గుండెల్లో ఉంటారు. (‘ఆగడు’ చిత్రాన్ని ఉద్దేశించి) లాస్ట్ టైమ్ డిజప్పాయింట్మెంట్ చేశాను. అందుకు క్షమించండి. ఈసారి పుట్టినరోజుకు మీ అందరికీ మంచి హిట్ ఇస్తాను’’ అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ -‘‘ ‘దేవుడు అందం, ఓర్పుతో పాటు టాలెంట్ అన్నీ కలిపి మహేశ్‌బాబుకు ఇచ్చాడు’’అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ -‘‘టాలీవుడ్లో ప్రతిభ గల నటుల్లో ఒకరైన మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశం ఇంత త్వరగా వచ్చినందుకు సంతోషంగా ఉంది. నిజజీవితంలో కృష్ణగారు మహేశ్‌బాబు తండ్రీ కొడుకులుగా ఎంత అందంగా ఉన్నారో, ఈ సినిమాలో జగపతిబాబు, మహేశ్‌బాబు అలానే ఉంటారు’’ అన్నారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ గల్లా జయదేవ్, నిర్మాత ఆదిశేషగిరి రావు, దర్శకులు శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, నటుడు సుధీర్‌బాబు తదితరులు పాల్గొని, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, కథానాయిక శ్రుతీహాసన్, నటుడు రాహుల్ రవీంద్రన్, కెమేరామన్ మది, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సీవీయం మోహన్ తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
సూపర్ స్టార్ గోల్డెన్ జూబ్లీ!
-
విడుదలైన ‘మా’ డైరీ
తెలుగు సినీ నటులు, సాంకేతిక నిపుణుల సమాచారంతో ప్రతి ఏడాదీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)వారు డైరీని విడుదల చేస్తుంటారు. తాజాగా కొత్త ఏడాదికి ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ-2015’ ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సూపర్‌స్టార్ కృష్ణ డైరీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సీనియర్ నటి జమునకు అందించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ -‘‘తెలుగు సినిమాకు సంబంధించిన నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఈ డైరీలో పొందుపరిచారు. ఎంతో శ్రమకోర్చి ప్రతి ఏడాదీ ఈ డైరీని అందిస్తున్న ‘మా’ వారికి అభినందనలు. మహానటుడు అక్కినేని చేతులమీదుగా ఈ డైరీ ఆవిష్కరణ జరగడం ఆనవాయితీ. కానీ... ఈ రోజు ఆయన లేరు. అందుకే.. ఆ బాధ్యత నాపై పడింది’’ అని అన్నారు. ఇంకా విజయనిర్మల, ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్, గిరిబాబు, నరేశ్, కవిత, అలీ, శివకృష్ణ, మహర్షి రాఘవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆటోలో... స్కూల్‌కు వెళ్లేవాణ్ణి!
మహేశ్‌బాబు మితభాషి. మీడియా ముందు కూడా చాలా తక్కువగా మాట్లాడతారు.సినిమాల గురించి తప్ప, వ్యక్తిగత విషయాల గురించి మాత్రం అస్సలు ప్రస్తావించరు. ఇటీవల ఓ కార్యక్రమంలో మనసు విప్పి మాట్లాడారు. చిన్నప్పటి విషయాలు, తన మనస్తత్వం,పిల్లల గురించి ఇలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు... నేను పెరిగింది చెన్నయ్‌లో. చదువుకున్నదీ అక్కడే. అందరి పిల్లల్లా నేనూ సాదాసీదాగానే ఉండేవాణ్ణి. అందరిలానే నేనూ ఆటోరిక్షాలో స్కూల్‌కి వెళ్లేవాణ్ణి. మా నాన్న సూపర్‌స్టార్ కృష్ణ అని చెబితే.. అందరూ ప్రత్యేకంగా చూస్తారేమోనని స్కూల్లో ఎవరికీ చెప్పలేదు. మా నాన్నకు కూడా అదే ఇష్టం. ఓసారి సమ్మర్ హాలిడేస్‌లో మా నాన్న ఓ సినిమాలో యాక్ట్ చేయమంటే చేశాను. అప్పట్నుంచీ వేసవి సెలవుల్లో సినిమాలు చేయడం ఆనవాయితీ అయ్యింది. చెన్నయ్‌లో తెలుగు సినిమాలు చూసేవాళ్లు తక్కువమంది కాబట్టి, నేను ‘చైల్డ్ స్టార్’ అని ఎవరికీ తెలియదు. అలా తెలియకపోవడం నాకు మంచిదైంది. లేకపోతే ప్రత్యేకంగా చూసేవాళ్లు.. నాకు దూరంగా ఉండేవాళ్లు. డేటింగ్ మీద నాకు ఆసక్తి లేదు. ఒకవేళ మూడు గంటలపాటు లాస్ ఏంజిల్స్‌లో ఎవరినైనా డిన్నర్ డేట్‌కి తీసుకెళ్లాల్సి వస్తే.. ఎవరిని తీసుకెళతారని అడిగితే... హాలీవుడ్ స్టార్ డెమీ మూర్ పేరు చెబుతాను. కానీ, మూడు గంటలసేపు డిన్నర్ డేట్ అంటే బోరింగ్‌గా ఉంటుంది కదా. ‘1’ చిత్రంలో నటించిన తర్వాత మా అబ్బాయి గౌతమ్‌కి సినిమాలంటే ఆసక్తి పెరిగింది. కానీ, పెద్దైన తర్వాత తన ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. సో.. భవిష్యత్తులో తనేమవుతాడో కాలమే చెబుతుంది. ఇప్పుడిప్పుడే గౌతమ్ నా సినిమాలు చూస్తున్నాడు. ఎక్కువ శబ్దం ఉండే సన్నివేశాలు తనకు పెద్దగా నచ్చవు. జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు చాలా అవసరం. అందుకే, డబ్బు సంపాదించడానికి కష్టపడాలి. మా నాన్న నాకు చెప్పిన మాటలివి. నా పిల్లలకు కూడా నేనీ మాటలే చెప్పాలనుకుంటున్నా. చీటికీ మాటికీ కోపం తెచ్చుకునే తత్వం కాదు నాది. అరుదుగా వస్తుంది.. అది కూడా ఇంట్లో ఉన్నప్పుడే. ఆ కోపం ఐదు నిమిషాల్లోనే పోతుంది. నాకైతే మా అమ్మాయి సితారను సైంటిస్ట్‌ను చేయాలని ఉంది. మరి.. పెద్దైన తర్వాత తనేం కావాలనుకుంటుందో చూడాలి. స్వతహాగా నేను ఫుడ్ లవర్ని. కానీ, షూటింగ్స్ అప్పుడు డైట్ కంట్రోల్ చేయాలి కదా. అందుకే, హాలిడేస్‌లో డైట్ పాటించను. నచ్చినవన్నీ లాగించేస్తా. నా ఫేవరెట్ హాలిడే స్పాట్ దుబాయ్. -
అరుదైన సినిమా... ఆసక్తికరమైన పుస్తకం... - కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు శనివారం ఊటీలో జరిగాయి. సతీమణి విజయనిర్మల, పలువురు అభిమానుల సమక్షంలో కృష్ణ బర్త్‌డే కేక్ కట్ చేశారు. అలాగే, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రాసిన ‘విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి, విజయనిర్మలకు అందజేశారు. కృష్ణ మాట్లాడుతూ -‘‘నా ‘అల్లూరి సీతారామరాజు’ ఓ అరుదైన సినిమా. దాని గురించి వినాయకరావు రాసిన ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. ప్రతి అభిమాని దాచుకోదగ్గ పుస్తకం ఇది’’ అన్నారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రవిశేషాలను పుస్తకరూపంలో తెచ్చిన వినాయకరావుని అభినందిస్తున్నానని, కృష్ణగారి సినీ జీవిత చరిత్ర గురించి ఆయన రాస్తున్న పుస్తకం కూడా బాగా రావాలని కోరుకుంటున్నానని విజయనిర్మల చెప్పారు. కృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా ఈ ‘విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు’ పుస్తకావిష్కరణ జరగడం ఆనందంగా ఉందని వినాయకరావు అన్నారు. -
అల్లూరి సీతారామరాజు సినిమాకి 40 ఏళ్లు
-
11 ఏళ్ల వయసులో ఆ బుర్రకథ చూసి ఇన్స్పయిరయ్యా
‘అల్లూరి సీతారామరాజు’కి 40 ఏళ్లు ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ఒక హిస్టరీ... ఒక వండర్... ఒక మిరాకిల్. మళ్లీ మళ్లీ చేయలేని అపూర్వ ప్రయత్నం. సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్లో ఓ మైలురాయి. తొలి తెలుగు సినిమా స్కోప్ - ఈస్ట్‌మన్ కలర్ చిత్రం. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆ సినిమా విడుదలైంది. కృష్ణ, విజయనిర్మల దగ్గర ఈ చిత్రం గురించి ప్రస్తావిస్తే ఆ జ్ఞాపకాల ప్రవాహంలోకి వెళ్లిపోయారు. ‘‘అప్పుడు నాకు పదకొండేళ్లు. ఎన్టీఆర్ నటించిన ‘అగ్గిరాముడు’ సినిమాకు వెళ్లా. అందులో ఓ బుర్రకథ చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అది అల్లూరి సీతారామరాజుకి సంబంధించినది. ఆ తర్వాత ప్రజానాట్యమండలి వారి ‘అల్లూరి సీతారామరాజు’ నాటక ప్రదర్శనకు అనేకసార్లు వెళ్లాను. సీతారామరాజుగా గరికపాటి రాజారావుగారి నటన చూసి మైమరచిపోయా. అలా నా హృదయంలో ఆ పాత్ర సజీవంగా నిలిచిపోయింది. 1968లో ‘అసాధ్యుడు’ చేశాను. అది నా పన్నెండో సినిమా. అందులో ఓ అంతర్నాటకంలో నేను అల్లూరి సీతారామరాజు వేషం వేశాను. నాలో ఏదో పులకింత. ఎప్పటికైనా ఆయన కథతో సినిమా చేయాలన్న బీజం పడింది. ఏయన్నార్‌తో ‘దేవదాసు’ తీసిన డీఎల్ నారాయణగారు నాతో ఓ సినిమా చేయడానికి వచ్చారు. ఆయన అంతకుముందే శోభన్‌బాబుతో ‘అల్లూరి సీతారామరాజు’ చేస్తానని ప్రకటించి, ఎందుకో మానుకున్నారు. నేనా విషయం ప్రస్తావించి, ఆ సినిమా నాతో చేయమని అడిగాను. ఆర్థికంగా తన వల్ల కాదన్నారాయన. మీకంత ఆసక్తి ఉంటే మీరు చేసుకోవచ్చని, అప్పటి వరకూ తను సేకరించి పెట్టుకున్న మెటీరియల్ అంతా నాకు ఇచ్చేశారు. దర్శకుడు వి.రామచంద్రరావు, రచయిత త్రిపురనేని మహారథి, నా సోదరుడు జి.హనుమంతరావుతో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించాను. నా వందో సినిమాగా ఇదే చేయాలనుకున్నా. అప్పట్లో నా సినిమాలన్నీ నవయుగ వాళ్లు పంపిణీ చేసేవారు. వాళ్లు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపలేదు. తారకరామ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చారు. మొత్తానికి ‘అల్లూరి సీతారామరాజు’ మొదలుపెట్టాం. అప్పుడు నా వయసు 31 ఏళ్లు. చింతపల్లి అడవుల్లో షూటింగ్ చేశాం. దాదాపు 400 మందికి అక్కడే విడిది ఏర్పాటు చేశాం. సినిమా పూర్తి చేయడానికి రెండు నెలలు పట్టింది. 20 లక్షల రూపాయల వరకూ ఖర్చయ్యింది. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ‘విజయా’ చక్రపాణిగారు సినిమా చూసి, ఇక నిన్ను ప్రేక్షకులు చాలాకాలం ఇతర పాత్రల్లో చూడలేరు అన్నారు. ఆయన అన్నట్టుగానే ‘పాడిపంటలు’ సినిమా వరకూ మళ్లీ నాకు హిట్టు రాలేదు. శ్రీశ్రీ గారు రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాటకు జాతీయ పురస్కారం లభించింది. ఎన్టీఆర్‌గారు కూడా సినిమా చూసి నన్నెంతో మెచ్చుకున్నారు. ఇలా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా చాలా చెప్పొచ్చు. మహారథి, వీఎస్సార్ స్వామి, ఆది నారాయణరావు ఇలా చాలామంది సాంకేతిక నిపుణుల కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సంఘటనలు... ఎన్నో మధుర జ్ఞాపకాలు... 40 ఏళ్లయినా నా మదిలో చెక్కు చెదరలేదు.’’ ఈ సినిమా కోసం కృష్ణ గారు చాలా కష్టపడ్డారు. మహారథి గారు ఓ తపస్సు లాగా డైలాగ్స్ రాశారు. క్లైమాక్స్‌లో కృష్ణ గారు డైలాగులు చెప్పిన తీరు చూసి నేను ఏడ్చేశాను. మాకెన్నో తీపి గుర్తులు మిగిల్చిన సినిమా ఇది. - విజయ నిర్మల