
సూపర్‌స్టార్ కృష్ణ మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 350కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కృష్ణ.. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. నేడు(నవంబర్ 27) హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ కృష్ణ దశ దిన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలిరానున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రెండు చోట్ల భారీ ఏర్పాటు చేశారు. అభిమానులకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో.. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు ఎన్ కన్వెన్షన్‌లో భోజన ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం 5వేల పాసులను పంపిణీ చేశారు. 32 రకాల వంటకాలతో ప్రముఖులకు ఎన్ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులంతా పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment