లవ్లీ ఎంటర్ టైనర్... | senier naresh son movie lounched today superstar krishna | Sakshi
Sakshi News home page

లవ్లీ ఎంటర్ టైనర్...

Published Sat, Mar 19 2016 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

లవ్లీ ఎంటర్ టైనర్...

లవ్లీ ఎంటర్ టైనర్...

సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా, నిత్యానరేశ్ నాయికగా ఓ చిత్రం రూపొందుతోంది. ఎస్.వి.సి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీవీ గిరి దర్శకత్వంలో బిక్షమయ్య, రాధాకిషోర్ నిర్మించనున్న ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయిధరమ్ తేజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ కొట్టగా, విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణ మాట్లాడుతూ-‘‘ నవీన్ హీరోగా చేస్తున్న రెండో చిత్రమిది.  వైవిధ్యమైన ప్రేమకథగా అందరినీ నవ్వించే ఎంటర్‌టైనర్’’ అని అన్నారు. ‘‘చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండే సబ్జెక్ట్ ఇది. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో ఈ చిత్రం సాగుతుంది’’ అని నరేశ్ తెలిపారు. రచయితగా చాలా సినిమాలకు వర్క్ చేసిన తనకిది దర్శకునిగా తొలి చిత్రమనీ, ఏప్రిల్ తొలివారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని దర్శకుడు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement