Nithya Naresh
-
సారీ.. నేను ఉగ్రవాదిని
‘‘ఇండియాకు వ్యతిరేకంగా నడుచుకునే ఉగ్రవాది పాత్ర చేసినందుకు సారీ. నటుడిగా అన్ని పాత్రలను ఒకేలా చూడాలని ఈ పాత్ర చేశాను’’ అన్నారు మనోజ్ నందం. సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ఆది సాయికుమార్, అబ్బూరి రవి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యానరేశ్ ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. సినిమాలో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్సే నిర్మాతలు. ‘అతడు, ఛత్రపతి’ సినిమాల్లో హీరో చిన్ననాటి పాత్రలు చేసిన మనోజ్ నందం ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. మనోజ్ లుక్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘కేరింత’ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. దురదృష్టవశాత్తు సెలెక్ట్ కాలేదు. మనోజ్, అబ్బూరి రవిగారి లుక్స్ నచ్చాయి’’ అన్నారు. ‘‘బిజీగా ఉన్నప్పటికీ లుక్ రిలీజ్ చేయడానికి అంగీకరించిన విజయ్‌కు థ్యాంక్స్’’ అన్నారు సాయికిరణ్ అడవి. ‘‘ఫస్ట్ టైమ్ బ్యాడ్‌బాయ్ పాత్రలో నటించాను. ఆడియన్స్ నన్ను విలన్‌గా యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు మనోజ్. -
గోల్డ్ ఫిష్ కీరవాణి పాట
ఆది సాయికుమార్ ఎన్.ఎస్.జి కమాండోగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. శషా చెత్రి, నిత్యా నరేష్ కథానాయికలు. రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా ఘాజీ బాబా పాత్రలో నటిస్తున్నారు. సాయికిరణ్ అడివి దర్శకుడు. ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి ఓ దేశభక్తి పాట పాడారు. ‘‘కీలక సన్నివేశంలో వచ్చే కీరవాణిగారు పాడిన పాట సినిమాని ఇంకో స్థాయికి తీసుకువెళ్లింది. రామజోగయ్య శాస్త్రిగారు విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించారు’’ అన్నారు సాయికిరణ్. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసే పాట ఇది. రామజోగయ్యశాస్త్రిగారు మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటలోని సందేశం జనాలను ఆలోచింపచేస్తుంది. కీరవాణిగారి సంగీతం వింటూ పెరిగాను. నా సంగీతంలో ఆయన పాట పాడడం, పైగా ఆ పాటను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్‌రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్), నిర్మాతలు: ప్రతిభ అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సతీష్ డేగల. -
కమాండో అర్జున్ పండిట్
మైనస్ పది డిగ్రీల చలిలో దాదాపు 1300 అడుగుల ఎత్తులో ఎన్.ఎస్.జీ కమాండో అర్జున్ పండిట్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కోసం కష్టపడుతున్నారు. మరి.. ఆ ఆపరేషన్ టార్గెట్ ఎవరు? అనేది వెండితెరపై తెలుస్తుంది. ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్ ముఖ్య తారలుగా ‘వినాయకుడు’ ఫేమ్ అడివి సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడవి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్, ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గేరి. బిహెచ్, సతీష్ డేగలతో పాటు కొందరు సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు నిర్మాతలు. ఈ సినిమాకి పని చేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడం విశేషం. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో రానా విడుదల చేశారు. అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జీ కమాండోగా ఆది సాయికుమార్ నటిస్తున్నారు. ‘‘విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం మైనస్ పది డిగ్రీల చలిలో షూటింగ్ జరుపుతున్నాం. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కల్పిత కథ ఇది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
అందరూ నిర్మాతలే
ఆది సాయికుమార్, నిత్యా నరేశ్, పార్వతీశం, శషా చెట్రి ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ‘వినాయకుడు, కేరింత’ వంటి సినిమాలు తెరకెక్కించిన అడవి సాయికిరణ్ దర్శకుడు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులే ఈ చిత్రం నిర్మించడం విశేషం. ఎయిర్టెల్ మోడల్ శషా చెట్రి ఈ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నారు. మాటలు రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాశ్మీర్, ఢిల్లీ, లంబసింగి, చింతపల్లి తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. ఒక్క షెడ్యూల్ మినహా చిత్రీకరణ పూర్తయింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వినోదాల సోడా
హీరో హీరోయిన్స్‌గా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ నిర్మించిన చిత్రం ‘సోడ గోలీసోడ’. ఈ సినిమా ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్య సింధుజ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో వస్తున్న ఫస్ట్ సినిమా. కంప్లీట్ ఎంటర్టైనర్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఆడియన్స్ ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘కుటుంబం మొత్తం కలిసి చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. హీరో, హీరోయిన్ ఎంతో ఇష్టంతో కష్టపడి చేశారు. సినిమా రిలీజ్ కావాలంటే ప్రొడ్యూసర్స్ సపోర్ట్ కావాలి. ప్రొడ్యూసర్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు హరిబాబు. మానస్ మాట్లాడుతూ – ‘‘టీమ్ సపోర్ట్ ఉంటే సినిమా బాగా వస్తుందని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. నన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్న దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మంచి సినిమాను ఆడియన్స్ ఆదరించాలని దర్శక–నిర్మాతలు సినిమా తీశారు. అందరూ కష్టపడి చేశారు. సినిమాలో మంచి రోల్ ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు’’ అన్నారు కృష్ణ భగవాన్. ఈ చిత్రానికి సహనిర్మాత: భువనగిరి శ్రీనివాసమూర్తి. -
కామెడీ సోడా
మానస్, నిత్య నరేష్, కారుణ్య ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘సోడ గోలీ సోడ’. మల్లూరి హరిబాబు దర్శకత్వంలో చక్రసీద్ సమర్పణలో ఎస్.బి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భువనగిరి సత్య సింధూజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా భువనగిరి సత్య సింధూజ మాట్లాడుతూ– ‘‘హాస్యం ప్రధానాంశంగా రూపొందిన చిత్రమిది. తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ కమెడియన్స్ అందరూ మా సినిమాలో ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే అంశాలున్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అన్ని కమర్షియల్ విలువలతో తెరకెక్కించాం. తప్పకుండా మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: భువనగిరి శ్రీనివాస్ మూర్తి, సంగీతం: భరత్, కెమెరా: ముజీర్ మాలిక్. -
నవ్వులే నవ్వులు
మానస్ హీరోగా, నిత్య నరేష్, కారుణ్య హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘సోడ గోలీ సోడ’. ‘మొత్తం గ్యాస్’ అన్నది ట్యాగ్‌లైన్. మల్లూరి హరిబాబు దర్శకత్వంలో చక్రసీద్ సమర్పణలో భువనగిరి సత్య సింధూజ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలనే ఈ సినిమా తీశాం. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘సీనియర్ కమెడియన్స్ అందరూ మా చిత్రంలో ఉన్నారు. కుటుంబం మొత్తం కలిసి చూసేలా సినిమా ఉంటుంది. పాలకొల్లు, హైదరాబాద్‌లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం. భరత్ మంచి మ్యూజిక్ అందించారు’’ అన్నారు మానస్. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. అతి త్వరలో విడుదల చేయనున్నాం’’ అన్నారు సత్య సింధూజ. -
ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న నిర్మాతలు బాగుండాలి
‘‘దర్శకుడు తండ్రయితే నిర్మాత తల్లి. నటీనటులు వారి పిల్లలు. సినిమా అన్నది ఒక కుటుంబం. ఈ కుటుంబం బాగుండాలంటే ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అని నటుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మానస్ హీరోగా, నిత్యానరేష్, కారుణ్య హీరోయిన్లుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ నిర్మించిన చిత్రం ‘సోడ.. గోలీసోడ’. భరత్ మధుసూదనన్ స్వరకర్త. ఈ సినిమా పాటల సీడీని హరికృష్ణ రిలీజ్ చేసి, నిర్మాత రాజ్ కందుకూరికి అందించారు. హరికృష్ణ మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న నిర్మాతలు బాగుండాలి. సినిమా మీద మక్కువతో సత్యసింధుజ ఈ చిత్రం నిర్మించారు. మానస్‌ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’అన్నారు. ‘‘నా మొదటి సినిమాలో మానస్ విలన్‌గా నటించాడు. తను మంచి నటుడే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. ఈ సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో నవీన్‌చంద్ర. -
గోలీసోడాలో మెసేజ్
మానస్, నిత్యా నరేష్, కారుణ్య, అలీ ముఖ్య తారలుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సోడా గోలిసోడా’. ఎస్.బి. ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై భువనగిరి సత్య సింధూజ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోదావరి జిల్లాలో కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సెకండ్ షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హరిబాబు మాట్లాడుతూ – ‘‘పదిమంది హాయిగా నవ్వుకునే విధంగా తెరకెక్కిస్తున్నాం. మరో పది రోజుల్లో సెకండ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేస్తాం. ఆగస్టులో ఆడియో లాంచ్‌కి ప్లాన్ చేస్తున్నాం. కెమెరామేన్ ముజీర్ మాలిక్ తీసిన ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. కథ వినగానే అవకాశం ఇచ్చిన సింధూజగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మంచి మేసేజ్‌ని చక్కని కామెడీతో కలిపి సినిమా తీస్తున్నాం. హరిబాబు చాలా క్లారిటీతో సినిమా తీస్తున్నారు. అలీ, కృష్ణభగవాన్, ప్రభాస్ శ్రీను, గౌతంరాజు కామెడీ అందరినీ నవ్విస్తుంది’’ అన్నారు సింధూజ. ‘‘బీడు భూముల్లో కూడా పంటలు పండించవచ్చనే మెయిన్ కాన్సెప్ట్‌తో ఎంటర్టైనింగ్ సినిమా సాగుతుంది’’ అన్నారు నటుడు అలీ. ఈ చిత్రానికి సంగీతం: భరత్, కో–ప్రొడ్యూసర్: భువనగిరి శ్రీనివాస మూర్తి, ఎడిటర్ నందమూరి హరి. -
లవ్లీ ఎంటర్ టైనర్...
సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా, నిత్యానరేశ్ నాయికగా ఓ చిత్రం రూపొందుతోంది. ఎస్.వి.సి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీవీ గిరి దర్శకత్వంలో బిక్షమయ్య, రాధాకిషోర్ నిర్మించనున్న ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయిధరమ్ తేజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ కొట్టగా, విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణ మాట్లాడుతూ-‘‘ నవీన్ హీరోగా చేస్తున్న రెండో చిత్రమిది. వైవిధ్యమైన ప్రేమకథగా అందరినీ నవ్వించే ఎంటర్టైనర్’’ అని అన్నారు. ‘‘చాలా ఎంటర్టైనింగ్గా ఉండే సబ్జెక్ట్ ఇది. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో ఈ చిత్రం సాగుతుంది’’ అని నరేశ్ తెలిపారు. రచయితగా చాలా సినిమాలకు వర్క్ చేసిన తనకిది దర్శకునిగా తొలి చిత్రమనీ, ఏప్రిల్ తొలివారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని దర్శకుడు చెప్పారు.