
మానస్, నిత్య నరేష్
మానస్, నిత్య నరేష్, కారుణ్య ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘సోడ గోలీ సోడ’. మల్లూరి హరిబాబు దర్శకత్వంలో చక్రసీద్ సమర్పణలో ఎస్.బి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భువనగిరి సత్య సింధూజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా భువనగిరి సత్య సింధూజ మాట్లాడుతూ– ‘‘హాస్యం ప్రధానాంశంగా రూపొందిన చిత్రమిది.
తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ కమెడియన్స్ అందరూ మా సినిమాలో ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే అంశాలున్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అన్ని కమర్షియల్ విలువలతో తెరకెక్కించాం. తప్పకుండా మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: భువనగిరి శ్రీనివాస్ మూర్తి, సంగీతం: భరత్, కెమెరా: ముజీర్ మాలిక్.