![soda goli soda movie release shortely - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/3/Soda-golisoda-%282%29.jpg.webp?itok=q5BMIUfW)
నిత్య నరేష్, మానస్
మానస్ హీరోగా, నిత్య నరేష్, కారుణ్య హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘సోడ గోలీ సోడ’. ‘మొత్తం గ్యాస్’ అన్నది ట్యాగ్‌లైన్. మల్లూరి హరిబాబు దర్శకత్వంలో చక్రసీద్ సమర్పణలో భువనగిరి సత్య సింధూజ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది.
ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలనే ఈ సినిమా తీశాం. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘సీనియర్ కమెడియన్స్ అందరూ మా చిత్రంలో ఉన్నారు. కుటుంబం మొత్తం కలిసి చూసేలా సినిమా ఉంటుంది. పాలకొల్లు, హైదరాబాద్‌లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం. భరత్ మంచి మ్యూజిక్ అందించారు’’ అన్నారు మానస్. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. అతి త్వరలో విడుదల చేయనున్నాం’’ అన్నారు సత్య సింధూజ.
Comments
Please login to add a commentAdd a comment