Soda
-
బిర్యానీ తిన్నామంటే గోలీ సోడా పడాల్సిందే..
హే బాబూ.. ఓ గోలీ సోడా కొట్టవోయ్.. ఈ మాట విని ఎన్నేళ్లవుతుందో కదా..! ఒకప్పుడు ప్రతి ఊర్లో.. ప్రతి వీధిలో బండిపై గోలీ సోడా అమ్ముతుండేవారు. ఎండాకాలం వచి్చందంటే చాలు అలా గోలీ సోడా ఒకటి కడుపులో పడిందంటే ఎంతో హాయిగా ఉండేది. కాలక్రమేణా గోలీ సోడా స్థానంలోకి శీతల పానీయాలు వచ్చి చేరాయి. మళ్లీ ఇప్పుడు పాత రోజులు గుర్తు చేసేందుకు గోలీ సోడాలు మార్కెట్లోకి వచ్చేశాయి. అప్పట్లో వీటి టేస్ట్ చూసిన వారు.. ఆ టేస్ట్ తెలుసుకొని నేటి యువత వాహ్.. అంటున్నారు. గోలీ సోడా తాగితే చాలు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు హైదరాబాద్ యువత. నగరంలో గోలీ సోడాకు పెరుగుతున్న క్రేజ్డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో కలర్ఫుల్గా ..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న యూత్ ఒకప్పుడు తోపుడు బండ్లపై నిమ్మకాయ సోడా, సాదా సోడాలు అమ్ముతుండే వారు. ఇప్పుడు మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్లలో అందుబాటులోకి వచ్చాయి. అలా హైదరాబాదీ బిర్యానీ తిన్నామంటే.. ఓ గోలీ సోడా పడాల్సిందే.. అన్నట్టు ట్రెండ్ సెట్ చేస్తున్నారు సిటీ యూత్. డిఫరెంట్ ఫ్లేవర్స్తోనే కాకుండా క్రేజీ కలర్స్‌లో దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద మాల్స్, రెస్టారెంట్లలో గోలీసోడాల సీసాలను ఇప్పుడు అమ్ముతున్నారు. బ్లూబెర్రీ, వర్జిన్ మొజిటో, లెమనేడ్, నింబూమసాలా, యాపిల్ మొజిటో, ఆరెంజ్, రోజ్‌ఎసెన్స్ ఇలా వేర్వేరు ఫ్లేవర్స్‌లో కంపెనీలు తయారు చేస్తున్నాయి. లెమన్ ట్రీ, పర్పుల్ హేజ్, బెడ్ ఆఫ్ రోజెస్ం అంటూ పాపులర్ ఇంగ్లిష్ పాటల పేర్లు పెట్టి మరీ యువతను ఆకర్షిస్తున్నారు. దుకాణాలతో పాటు కొన్ని హోటళ్లూ, క్లబ్బులూ కాలేజీలకు కూడా ఈ సోడాలను సరఫరా చేస్తున్నారు. దాంతో అందరి దృష్టి మళ్లీ.. సోడావైపు మళ్లింది.ఆ టేస్టే వేరు.. గోలీ సోడా సీసా స్టైల్, కలర్, గోలీ కొడుతుంటే వచ్చే శబ్దం.. అందులోని సోడా అన్నీ ప్రత్యేకమే.. చిన్నప్పుడు ఊర్లలో ఒకటి, రెండు రూపాయలకు దొరికే సోడా తాగేందుకు ఎంతో ఎదురు చూసేవాళ్లం. సోడా తాగిన తర్వాత వచ్చే అనుభూతి వేరేలా ఉండేది. ఇప్పుడు కూడా ఎక్కడైనా సోడా బాటిల్ కని్పస్తే వేరే కూల్‌డ్రింక్స్ ఉన్నా కూడా గోలీ సోడా తాగుతుంటే వచ్చే మజానే వేరు. – సాయికిరణ్ మెగావత్, హిమాయత్నగర్ఆ శబ్దం వింటే.. అదో ఆనందం..పిల్లలకు గోలీ సోడా సరదా ఓ పట్టాన తీరేది కాదు. రబ్బరు కార్కుతో సోడా కొట్టగానే గోలీ లోపలికి వెళ్లినప్పుడు వచ్చే ఆ శబ్దానికి కళ్లనిండా ఆశ్చర్యమే. ఆ శబ్దం వింటే మనసుకు అదో తృప్తి. గోలీసోడాలో ఉండేది కార్బొనేటెడ్ నీళ్లే. మొదటగా 1767లో జోసెఫ్ ప్రిస్ట్లే అనే శాస్త్రవేత్త, కార్బన్‌డయాక్సైడ్‌ను నీటిలోకి పంపి, స్నేహితులకిస్తే, ఆ రుచి నచ్చడంతో అందులో పండ్ల ఫ్లేవర్లూ, చక్కెరలూ కలిపి సాఫ్ట్‌డ్రింక్స్ తయారు చేయడం ప్రారంభించారు. అందుకే సోడా కూడా ఓ సాఫ్ట్ డ్రింకే.. మొదట్లో సోడా నీళ్లని సాదా బాటిల్స్‌లోనే నింపేవారు. అయితే మూత బిగించేటప్పుడూ తీసేటప్పుడూ గ్యాస్ పోయేది. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు ఇప్పుడు మనం చూస్తున్న కాడ్నెక్ బాటిల్‌ను రూపొందించారు. 1872లో హిరమ్ కాడ్ అనే బ్రిటిష్ ఇంజినీర్ దీన్ని తయారు చేశాడు. ఈ బాటిల్ మందంగా ఉంటుంది. -
బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
సుష్టిగా భోంచేసినపుడో, కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడో మనకు వెంటనే గుర్తు వచ్చేది సోడా. సోడా తాగిన బ్రేవ్ మని త్రేన్పు వచ్చి రిలాక్స్ అనిపిస్తుంది చాలామందికి కదా. కానీ అప్పుడపుడు సోడా వాటర్ తాగితే పరవాలేదు. కానీ ఇది ఒక అలవాటుగా మారిపోతే మాత్రం ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు. సోడా తాగితే తప్ప తిన్నది అరగదు అన్న భావనతోపాటు, మార్కెట్లో రకరకాల ఫ్లావర్లలో ఆకర్షిస్తుంటాయి. కానీ సోడా రోజూ తీసుకుంటే ప్రమాదంలో పడినట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.సోడాతో ముప్పురోజూ సోడా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ మూత్రపిండ వ్యాధి, కాలేయ వ్యాధి, దంత క్షయం, కావిటీస్, గౌట్తోపాటు శరీరంలోని ఎముకలు కూడా బలహీనపడతాయి. ఇంకా శరీరానికి తీవ్రమైన హానికలుగుతుంది. లాలాజలం, దంత సమస్యలు: సోడాలోని చక్కెర, యాసిడ్ చిగుర్లను, దంతాలను దెబ్బతీస్తుంది.నోటి పరిశుభ్రతను పలు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సోడా తాగడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోతుంది. లాలాజలం నోటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నోటిలోని ఆమ్లాలను, ఆహార కణాలు , బ్యాక్టీరియాను కడిగివేయడానికి సహాయ పడుతుంది. సోడాతో లాలాజలం తగ్గి, చిగుళ్ల వ్యాధికి దారి తీస్తుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.సోడా చాలా కార్బోనేటేడ్గా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పొట్టలో పుండ్లు, పుండ్లు, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారికి ఇది ప్రమాదంకరం. అలాగే ఆస్తమా ఉంటే సోడాకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆస్తమాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెంజోయేట్ ఆస్తమాను ప్రేరేపిస్తుంది. దాని వల్ల సమస్యలు మరిన్ని పెరుగుతాయి.ఎముకలు బలహీనంసోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగిస్తుంది. దీంతో రోజూ సోడా తాగే వారి ఎముకలు బలహీనమవుతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం: కొంతమంది ఆరోగ్య స్పృహతో డైట్ సోడా తాగడానికి ఇష్టపడతారు. అది తమ ఆరోగ్యానికి మంచిదని వారు భావిస్తారు. కానీ.. డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వాడటం వల్ల స్థూలకాయానికి గురవుతారు. అంతే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడవచ్చు. మెటబాలిక్ సిండ్రోరమ్ దెబ్బతిని షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలను 67 శాతం పెంచుతుంది.చర్మంపై దురదలుసోడాలో బ్రామినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుపుతారు. ఈ కెమికల్ కారణంగా చర్మంపై దురదలు రావచ్చే. నరాల బలహీనత కూడా వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బుల ప్రమాదం: రోజూ సోడా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడవచ్చు.అలాగే గుండెలోని ధమనులను దెబ్బతీస్తాయి. సోడాలోని ఫాస్పేట్స్, ఫాస్పారిక్ యాసిడ్ వల్ల తొందరగా వృద్ధాప్యం వచ్చే ప్రమాదం ఉంది.షుగర్వ్యాధి: దీని వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.సోడా తాగడం, ట్రైగ్లిజరైడ్స్ 30 శాతం పెరుగుతాయి. మంచి (HDL) కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. మెదడుకు చేటు: డైట్ సోడాల్లో తక్కువ కేలరీలు ఉన్నప్పటికీ, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను కూడా దెబ్బతీస్తాయి. -
ఇంటిప్స్: మురికిని ఇకపై సులభంగా వదిలించండి..
'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్ వాడారో.. కాస్త వీటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..' ఇలా చేయండి.. వాటర్ బాటిల్లో సగం వరకు నీళ్లుపోయాలి. మిగతా సగంలో నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, ఐస్ ముక్కలను వేసి బాగా షేక్ చేయాలి. ఇలా పది నిమిషాలు చేసిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధానంలో బాటిల్ కడగడం వల్ల బాటిల్లో సూక్ష్మజీవులు పూర్తిగా పోతాయి. టీస్పూను వంటసోడా, రెండు టీస్పూన్ల వెనిగర్‌ను బాటిల్లో వేసి మూతపెట్టాలి. ఇరవై నిమిషాల తరువాత బాటిల్‌ను బాగా షేక్ చేసి కడగాలి. ఇలా కడిగిన బాటిల్‌ను మూతతీసి పూర్తిగా ఆరిన తరువాత వాడుకోవాలి. వంటసోడా, వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా మాడిన గిన్నె, ఫ్రైపాన్పై రాసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్వాషర్తో రుద్ది కడిగితే మురికి మొత్తం తొలగి పోతుంది. గోరువెచ్చని పాలల్లో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలపాలి. పాలల్లో ఈ మిశ్రమం వేసి, వడలను వేసి ఐదారు గంటలు నానపెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులవకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి. వేడినీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేస్టి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. ఇవి చదవండి: బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు! -
కాస్టిక్ సోడా ఉత్పత్తుల హబ్‌గా కాకినాడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీల నుంచి పెట్టుబడుల ఆకర్షణకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందులో భాగంగా కాస్టిక్ సోడా, క్లోరిన్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్‌ను ఏర్పాటు చేసింది. రూ.2,700 కోట్లతో ఏటా 1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడాను ఉత్పత్తి చేసే క్లోర్ ఆల్కాలి యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022, ఏప్రిల్ 21న ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం 1,300 మంది ఉపాధి పొందుతుండగా.. యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరో 1,100 మందికి ఉపాధి కలి్పంచవచ్చు. దేశంలోనే అతిపెద్ద యూనిట్ బలభద్రపురంలో ఏర్పాటు కావడంతో ఈ ప్రత్యేక రసాయనాలు ముడి సరుకుగా తయారుచేసే అనేక ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థలకు కాకినాడ ప్రధాన హబ్‌గా మారనుంది. ఫార్మాస్యూటికల్స్, ఆగ్రో కెమికల్స్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక యూనిట్లు రావడం ద్వారా కాకినాడ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. తూర్పు తీరంలో ఇదే తొలి యూనిట్ ఆదిత్య బిర్లా గ్రూపునకు దేశవ్యాప్తంగా ఏడు క్లోర్ ఆల్కాలి యూనిట్లు ఉండగా, తూర్పుతీర ప్రాంతంలో తొలి యూనిట్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో లాక్డౌన్ సమయంలో కూడా పనులు వేగంగా జరిగాయి. కీలక అనుమతులు తీసుకురావడంలో అధికారులు వేగంగా స్పందించడంతో రికార్డు సమయంలోనే ఉత్పత్తిని ప్రారంభించారు. ఎలాంటి కాలుష్య కారకాలు లేకుండా జర్మన్ టెక్నాలజీ సాయంతో ఈ యూనిట్‌ను అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడంతో ఉత్పత్తి ప్రారంభించిన వెంటనే విస్తరణ పనులు ప్రారంభించారు. ఎగుమతుల దిశగా.. మనం తినే అహార పదార్థాల నుంచి శుభ్రం చేయడానికి వినియోగించే ప్రతి వస్తువులోనూ కాస్టిక్ సోడా చాలా కీలకం. కాగిత పరిశ్రమ, టెక్స్టైల్స్, అల్యూమినియం, ఫార్మా, ఫెస్టిసైడ్స్, మంచినీటిని శుభ్రం చేయడం, స్విమ్మింగ్ పూల్స్‌లో నీటిని పరిశుభ్రంగా ఉంచడంలో, ఆయిల్ రిఫైనరీలు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీ ఇలా అన్నింటా కాస్టిక్ సోడా ముఖ్యమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి కూడా కాస్టిక్ సోడానే వినియోగిస్తారు. కోవిడ్ సమయంలో ఆస్పత్రులు శుభ్రం చేసేందుకు, శానిటైజేషన్ వంటి వాటిల్లో ఈ యూనిట్లో తయారయ్యే సోడియం హైపో క్లోరైడ్ కీలకపాత్ర పోషించిందని ఆల్కలీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మన దేశంలోప్రస్తుతం కాస్టిక్ సోడా డిమాండ్ 35.6 లక్షల టన్నులుండగా 2035 నాటికి అది 55 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తాజా గణాంకాల మేరకు 2021 నాటికి దేశంలో వివిధ యూనిట్ల ద్వారా 47.63 లక్షల టన్నుల కాస్టిక్ సోడా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చాక ఈ కెమికల్స్‌ను పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ కీలకం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతిస్తూ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – ఏప్రిల్ 21, 2022న కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంబోత్సవంలో ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా -
69 క్యాన్ల సోడాలు హాంఫట్
ఒట్టావా: కెనడాలో ఒక మహిళకి వింత అనుభవం ఎదురైంది. ఇంట్లో అవసరాల కోసం తెచ్చుకున్న సోడా క్యాన్లను ఒక ఎలుగు ఊది పారేసింది. షరోన్ రోజెల్ అనే మహిళ తెల్లవారుజామున కుక్క మొరగడంతో లేచి చూసింది. అప్పటికే తన కారు అద్దాలు బద్దలు కొట్టిన ఎలుగుబంటి అందులో ఉంచిన 72 సోడాల క్యాన్లలో ఏకంగా 69 తాగేసింది. బాల్కనీ నుంచి ఇదంతా చూసి రోజెల్ వాటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఎలుగు బంటి ఆ స్థాయిలో సోడాలు తాగడం అత్యంత అరుదు అని కొందరు వ్యాఖ్యానించారు. -
Health Tips: డైట్ సోడా తాగినా.. ప్రమాదంలో పడ్డట్లే! ప్రాణాంతక వ్యాధులు..
చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అందులోనూ సోడా ఉండే వాటిని ఎక్కువ మంది ఇష్టంగా తీసుకుంటారు. వేసవికాలం, చలికాలం అనే సంబంధం లేకుండా వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కలిగే ప్రయోజనాల కన్నా... ఆరోగ్య సమస్యలే ఎక్కువ. కూల్ డ్రింకులు, సోడాలు, చక్కెర పానీయాలు తాగడం వల్ల మధుమేహం,ఊబకాయం, కొవ్వు పెరిగి కాలేయం, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొందరు సోడాకు బదులు డైట్ సోడా తాగితే ఆరోగ్యంపై అంతగా ప్రభావం ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ, మెటబాలిక్ సిండ్రోమ్, అలాగే స్ట్రోక్ ప్రమాదాలను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. మరి కొన్ని పరిశోధనల ప్రకారం, డైట్ సోడా వినియోగం కూడా ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. అదే విధంగా.. రసాయనాలు కలిసిన కూల్డ్రింకులు తాగితే, ఈ సమస్యలకు తోడు పేగుల్లో సమతుల్యత దెబ్బతిని, జీర్ణకోశ సమస్యలూ తలెత్తే ప్రమాదం లేకపోలేదు. చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల.. -
మధుమేహులకు పండ్లతో మేలు..
లండన్ : తీపి పదార్ధాలతో పోలిస్తే కృత్రిమ పానీయాలతోనే టైప్ టూ మధుమేహ ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఫ్రక్టోజ్‌తో కూడిన డైట్ మన ఆహారంలో పోషక రహిత శక్తిని చొప్పించి రక్తంలో చక్కెర స్ధాయిలపై పెను ప్రమాదం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే పండ్లు, కూరగాయలు, సహజసిద్ధమైన పండ్ల రసాలు, తేనె వంటి ఆహారం, పానీయాలతో ఎలాంటి ముప్పు లేదని వెల్లడించారు. సోడాతో పాటు శీతల పానీయాలు, బేకరీ పదార్ధాలు, స్వీట్లకు దూరంగా ఉండాలని కెనడాకు చెందిన సెయింట్ మైఖేల్ హాస్పిటల్, టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు సూచించారు. గతంలో మధుమేహం, ఆహారానికి ఉన్న సంబంధంపై వెలువడిన 155 అథ్యయనాలను విశ్లేషించి ఈ పరిశోధనల చేపట్టారు. అదనపు క్యాలరీలు లేని ఫ్రక్టోజ్ చక్కెరతో కూడిన ఆహారంతో ఎలాంటి అనర్ధం ఉండదని పరిశోధక బృందం తేల్చింది. డయాబెటిస్తో బాధపడే వారిలో చక్కెరలో గ్లూకోజ్, ఇన్సులిన్లను నియంత్రించేందుకు తాజా పండ్లు, పండ్ల రసాలు ఉపయోగపడతాయని తాజా అథ్యయనం వెల్లడించడం గమనార్హం. శీతల పానీయాలతో మాత్రం మధుమేహుల ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది. పండ్లలో అధికంగా ఉండే పీచు పదార్ధం శరీరంలో చక్కెరను విడుదల చేసే ప్రక్రియను నెమ్మదింపచేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.మధుమేహ నియంత్రణ, నివారణలో తమ అథ్యయన వివరాలు ఉపయోగపడతాయని అథ్యయన రచయిత డాక్టర్ జాన్ సివెన్‌పైపర్ పేర్కొన్నారు. . -
లో కేలరీ సోడా కంటే నీళ్లే బెటర్!
సోడాలు, కూల్‌డ్రింకుల్లో చక్కెర ఎక్కువ ఉంటుంది కాబట్టి.. కేలరీలు తక్కువగా ఉండేవి తాగుదామని అనుకుంటున్నారా? వాటి కంటే మంచినీళ్లు తాగడం ఎంతో మేలు అంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్! ఈ లో కేలరీ సోడాలు, కూల్డ్రింకులపై ఇప్పటివరకు జరిగిన అనేక పరిశోధనలను తాము రెండేళ్ల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, అన్నింటి ద్వారా తెలిసిందేమిటంటే.. ఈ రకమైన పానీయాల వల్ల బరువు పెరగడం పాటు మతిమరుపు, గుండెపోటు వంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని. అయితే అమెరికాలో ఈ లో కేలరీ పానీయాల వాడకం క్రమేపీ తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని.. 2006లో సగటున 5.6 ఔన్సుల వరకూ తాగుతూంటే 2014 కల్లా ఇది 3.8 ఔన్సులకు తగ్గిందని ఇది మంచి పరిణామమేనని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రాచెల్ కె. జాన్సన్ తెలిపారు. ఊబకాయం ఉన్న పిల్లలు, సోడాలు, పానీయాలు నిత్యం తాగేవారు... బరువు నియంత్రించుకునేందుకు లో కేలరీ పానీయాలు కొద్దికాలం పాటు వాడవచ్చు. వాటిని వదిలేయడమే దీర్ఘకాలపు పరిష్కారం. నీళ్లు, కొవ్వులు తక్కువగా ఉండే పాలు తాగడం అన్నిటికంటె ఉత్తమమని సూచిస్తున్నారు. -
ఫ్రీ సోడా కోసం ఆడవాళ్ల మధ్య భీకర పోరు
న్యూయార్క్ : సోడా కోసం ఇద్దరు ఆడవాళ్ల మధ్య మొదలైన చిన్న గొడవ చినికి చినికి గాలివానై భీకర పోరుకు దారి తీసింది. డబ్ల్యూడబ్ల్యూఈని తలపించేలా ఉన్న గొడవ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌కు ఓ యువతి వెళ్లింది. ఫ్రీ సోడా తాగటానికి ఓ వాటర్ గ్లాస్ ఇవ్వాల్సిందిగా యువతి అక్కడున్న రెస్టారెంట్ ఉద్యోగినిని అడిగింది. అయితే ఆ ఉద్యోగిని అందుకు ఒప్పుకోలేదు. ఏమైనా కొనుగోలు చేస్తే గ్లాసు ఇస్తానని ఆ యువతికి చెప్పింది. అయితే ఫ్రీ సోడా ఇవ్వకపోవటంతో ఆగ్రహించిన ఆ యువతి ఆమెను దుర్భాషలాడింది. అక్కడనున్న చిప్స్‌ను ఆమెపై విసురుతూ ఎగతాళి చేస్తూ మాట్లాడింది. యువతి మాటలకు కోపం తెచ్చుకున్న ఆ ఉద్యోగిని ఆమెపైకి ఉరికింది. యువతిని బల్లపైకి తోసి మొహంపై పిడిగుద్దులు గుద్దింది. డబ్ల్యూడబ్ల్యూఈకి ఏమాత్రం తీసిపోని విధంగా కొద్దిసేపు ఇద్దరి మధ్య భీకర పోరు నడిచింది. ఇంతలో యువతిని పక్కకు లాగుతున్న ఓ మహిళపై కూడా ఆ యువతి తిరగబడటంతో ఆమె కూడా రెండు దెబ్బలు వేసింది. అయినా ఆ యువతి ఏమాత్రం తగ్గలేదు సరికదా కుర్చీ తీసుకుని ఉద్యోగినిపై దాడికి వెళ్లింది. అయితే ఆ ఉద్యోగిని కుర్చీ లాక్కొని గొడవను సద్దుమనిగేలా చేసింది. -
సోడాతో గుండెకు ముప్పు
లండన్ : సోడా తాగితే అరుగుదల బాగుంటుందని భావిస్తే పొరపాటే అంటున్నారు నిపుణులు..రోజుకు రెండు సోడా క్యాన్లు సేవిస్తే గుండె జబ్బుతో మరణించే ముప్పు రెండింతలు అధికమవుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. అధిక చక్కెర కలిగిన పానీయాలు సేవించే వారు గుండె పోటు, గుండె వైఫల్యం వంటి హృదయ సంబంధిత వ్యాధులతో మరణించినట్టు పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా రెండు సోడా క్యాన్లతో సమానమైన 24 ఔన్సుల సోడాను రోజూ సేవించిన వారు వీటిని తీసుకోని వారితో పోలిస్తే రెండింతలు అధికంగా గుండె జబ్బుల బారిన పడి మరణించే రిస్క్ రెండింతలుగా ఉన్నట్టు తేలిందని పరిశోధకులు చెప్పారు. తీపిపదార్ధాలు అధికంగా తీసుకునే వారిలో మరణాల ముప్పు పెరిగినట్టు తాము గుర్తించలేదని తెలిపారు. చక్కెర అధికంగా ఉన్న పానీయాలతోనే గుండెకు ముప్పు అధికమని చెప్పారు.వీటిలో ఇతర పోషకాలు లేని కారణంగా శరీరంలో చక్కెర స్ధాయిలు అనూహ్యంగా పెరగడంతో జీవక్రియలపై సత్వర ప్రభావం ఉంటుందని 45 ఏళ్ల పైబడిన 17,930 మందిపై ఆరేళ్ల పాటు జరిపిన అథ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు డాక్టర్ వెల్ష్ వెల్లడించారు. -
వినోదాల సోడా
హీరో హీరోయిన్స్‌గా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ నిర్మించిన చిత్రం ‘సోడ గోలీసోడ’. ఈ సినిమా ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్య సింధుజ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో వస్తున్న ఫస్ట్ సినిమా. కంప్లీట్ ఎంటర్టైనర్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఆడియన్స్ ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘కుటుంబం మొత్తం కలిసి చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. హీరో, హీరోయిన్ ఎంతో ఇష్టంతో కష్టపడి చేశారు. సినిమా రిలీజ్ కావాలంటే ప్రొడ్యూసర్స్ సపోర్ట్ కావాలి. ప్రొడ్యూసర్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు హరిబాబు. మానస్ మాట్లాడుతూ – ‘‘టీమ్ సపోర్ట్ ఉంటే సినిమా బాగా వస్తుందని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. నన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్న దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మంచి సినిమాను ఆడియన్స్ ఆదరించాలని దర్శక–నిర్మాతలు సినిమా తీశారు. అందరూ కష్టపడి చేశారు. సినిమాలో మంచి రోల్ ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు’’ అన్నారు కృష్ణ భగవాన్. ఈ చిత్రానికి సహనిర్మాత: భువనగిరి శ్రీనివాసమూర్తి. -
కామెడీ సోడా
మానస్, నిత్య నరేష్, కారుణ్య ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘సోడ గోలీ సోడ’. మల్లూరి హరిబాబు దర్శకత్వంలో చక్రసీద్ సమర్పణలో ఎస్.బి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భువనగిరి సత్య సింధూజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా భువనగిరి సత్య సింధూజ మాట్లాడుతూ– ‘‘హాస్యం ప్రధానాంశంగా రూపొందిన చిత్రమిది. తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ కమెడియన్స్ అందరూ మా సినిమాలో ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే అంశాలున్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అన్ని కమర్షియల్ విలువలతో తెరకెక్కించాం. తప్పకుండా మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: భువనగిరి శ్రీనివాస్ మూర్తి, సంగీతం: భరత్, కెమెరా: ముజీర్ మాలిక్. -
నవ్వులే నవ్వులు
మానస్ హీరోగా, నిత్య నరేష్, కారుణ్య హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘సోడ గోలీ సోడ’. ‘మొత్తం గ్యాస్’ అన్నది ట్యాగ్‌లైన్. మల్లూరి హరిబాబు దర్శకత్వంలో చక్రసీద్ సమర్పణలో భువనగిరి సత్య సింధూజ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలనే ఈ సినిమా తీశాం. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘సీనియర్ కమెడియన్స్ అందరూ మా చిత్రంలో ఉన్నారు. కుటుంబం మొత్తం కలిసి చూసేలా సినిమా ఉంటుంది. పాలకొల్లు, హైదరాబాద్‌లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం. భరత్ మంచి మ్యూజిక్ అందించారు’’ అన్నారు మానస్. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. అతి త్వరలో విడుదల చేయనున్నాం’’ అన్నారు సత్య సింధూజ. -
స్వచ్ఛమైన నీటికి సోడా!
శుద్ధమైన నీరుంటే చాలు.. బోలెడన్ని రోగాలు.. వాటి ద్వారా వచ్చే ఇబ్బందులను తప్పించుకోవచ్చు. అయితే మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ వాటర్ ఫిల్టర్‌ను తీసుకున్నా తరచూ కాండిళ్లు లేదంటే ఫిల్టర్లు మార్చడం తప్పనిసరి. దీంతోపాటే ఆధునిక రివర్స్ ఆస్మాసిస్ ఫిల్టర్లకు విద్యుత్తూ ఖర్చు అవుతుంది. ఈ ఇబ్బందులన్నింటినీ తొలగించేందుకు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ సరికొత్త సోడా స్ట్రీమ్ టెక్నిక్‌ను అభివృద్ధి చేశారు. పాతకాలపు గోలిసోడాలు తెలసుగా.. వాటిల్లో వాడే కార్బన్ డైయాక్సైడ్‌నే అత్యధిక పీడనంతో చిన్న చిన్న బాటిళ్లలో నింపడం.. రెండుగా విడగొట్టిన సిలికాన్ గొట్టం గుండా శుద్ధి చేయాల్సిన నీటిని పంపడం.. అంతే మనం చేయాల్సిన పని. సిలికోన్ గుండా ప్రసారం కాగల కార్బన్‌డైయాక్సైడ్ కారణంగా నీటి తాలూకూ రసాయన మిశ్రమం మారిపోతుంది. ఈ క్రమంలో ధనాత్మక ఆవేశం కలిగిన హైడ్రోజన్ నీటిలో వేగంగా ప్రయాణిస్తే.. బైకార్బనేట్ (కార్బన్‌డైయాక్సైడ్ విడిపోడం వల్ల ఏర్పడే మూలకాలు) నెమ్మదిగా వెళుతూ చుట్టూ ఉన్న మలినాలను ఆకర్షించి నీటిని శుద్ధి చేస్తుంది. ఇంకో విషయం కార్బన్‌డైయాక్సైడ్‌ను పదే పదే వాడుకునే అవకాశముండటం వల్ల దీనికయ్యే ఖర్చు కూడా అతితక్కువన్నమాట. అంతేకాదు. ఈ టెక్నాలజీతో బావులు, చెరువులు, నదుల్లోని నీటిలోంచి కూడా బ్యాక్టీరియా, ధూళి కణాలను తొలగించవచ్చు. -
ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న నిర్మాతలు బాగుండాలి
‘‘దర్శకుడు తండ్రయితే నిర్మాత తల్లి. నటీనటులు వారి పిల్లలు. సినిమా అన్నది ఒక కుటుంబం. ఈ కుటుంబం బాగుండాలంటే ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అని నటుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మానస్ హీరోగా, నిత్యానరేష్, కారుణ్య హీరోయిన్లుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ నిర్మించిన చిత్రం ‘సోడ.. గోలీసోడ’. భరత్ మధుసూదనన్ స్వరకర్త. ఈ సినిమా పాటల సీడీని హరికృష్ణ రిలీజ్ చేసి, నిర్మాత రాజ్ కందుకూరికి అందించారు. హరికృష్ణ మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న నిర్మాతలు బాగుండాలి. సినిమా మీద మక్కువతో సత్యసింధుజ ఈ చిత్రం నిర్మించారు. మానస్‌ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’అన్నారు. ‘‘నా మొదటి సినిమాలో మానస్ విలన్‌గా నటించాడు. తను మంచి నటుడే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. ఈ సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో నవీన్‌చంద్ర. -
చావి చేవ సేవ
చావి రజావత్ ఎంబీఏ చేసింది పెద్ద పెద్ద కంపెనీలు రజావత్కి అవకాశాన్నిచ్చాయి ఆ పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కాదని తన ఊరి ఉద్యోగానికి ఇంటర్వ్యూకెళ్లింది జీన్స్ ప్యాంటు వేసుకునే అమ్మాయిని సర్పంచ్‌గా ఒప్పుకుంటామా... అని అగ్రకులాలే ప్రశ్నించాయి నిమ్నకులాలు గొప్ప మనసును చూపించాయి చావి సర్పంచ్ అయింది ఆ ఊరి పేరు సోడా ఇప్పుడది గాలి బుడగల సోడా కాదండీ... గొప్ప అడుగుల సోడా అదీ... చావిలో ఉన్న చేవ తన ఊరికి ఆమె చేస్తున్న సేవ సూర్యుడు పడమరకి తరలి వెళ్తున్నాడు. వెలుగు ప్రతాపాన్ని చీకటి మెల్లగా బలహీనపరుస్తోంది. 20, 25, 30, 35, 40... ఇలా పలురకాల వయస్సున్న మగవాళ్లు కొంతమంది చెరువు కట్ట మీదకు వెళ్తున్నారు. అనువైన.. చాటు చోటు చూసుకొని ఒక్కొక్కళ్లే కూర్చుంటున్నారు. వాళ్ల వెనక కాస్త దూరంలో పదేళ్ల లోపు పిల్లలు అయిదారుగురు అక్కడున్న పొదల మాటున నక్కి వాళ్లు కూర్చోగానే అరుపులు, ఈలలు, కేకలు, గోల, గేలి చేస్తున్నారు. ఉలిక్కిపడి పెద్దాళ్లు లేస్తున్నారు. లేవగానే ఒక్కసారిగా పిల్లల గోల ఆగిపోతోంది. అటూఇటూ చూసి మళ్లీ కూర్చుంటున్నారు పెద్దాళ్లు. వాళ్లు అలా కూర్చోగానే పిల్లల గోల షురూ! వచ్చిన పనికానివ్వకుండా ఇబ్బంది పెట్టడంతో పెద్దాళ్లు వెనక్కి తిరిగిపోతున్నారు. ఇలా జరిగింది ఏ ఒక్కరోజో కాదు. పెద్దాళ్లు అలా చెరువుకట్ట మీదకు రావడం ఆగేవరకూ కొనసాగింది. విసిగివేసారిన పెద్దాళ్లు వెళ్లడం మానేశారు. ‘హమ్మయ్య... ఇప్పుడు ఊళ్లోని అన్ని ఇళ్లకూ టాయ్‌లెట్స్ వచ్చేశాయి’ ప్రశాంతంగా అనుకుంది చావి రజావత్. అసలు ఆ పిల్లల దండుకి, ఊళ్లో టాయ్‌లెట్స్‌కు, చావి రజావత్‌కు ఏంటి సంబంధం? చాలానే ఉంది. ఈ అక్షరాల వెంట ప్రయాణం చేస్తే రాజస్థాన్‌లోని సోడా వస్తుంది. సోడా.. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని గ్రామం. మన దేశంలోని చాలా గ్రామాల్లాగే సోడా కూడా పితృస్వామ్య విలువలనే పాటిస్తోంది. ఆ ఊరికి తొలి మహిళా సర్పంచ్ చావి రజావత్. ఒక్క సోడాకే కాదు దేశంలోనే తొలి ఏంబీఏ సర్పంచ్, అతి పిన్న వయసులో సర్పంచ్ అయిన తొలి మహిళ కూడా. అంతకు ముందు ఆ ఊరికి 20 ఏళ్లు ఆమె తాత రఘుబీర్ సర్పంచ్. రాజకీయం వారసత్వంగా అబ్బినా.. సర్పంచ్ పదవి మాత్రం వారసత్వంగా రాలేదు. అసలు రాజకీయాల్లోకి రావాలనేది ఆమె లక్ష్యం కూడా కాదు. అందుకే ఏంబీఏ చేసింది.. కార్పొరేట్ కెరీర్లోనే స్థిరపడాలనుకుంది. మలుపెలా తిరిగింది? అందరిలా కాదు.. ఎందరికో స్ఫూర్తి పంచేలా.. చావి రజావత్ పుట్టింది సోడాలోనే. రాజ్‌పుత్ కుటుంబం. తండ్రి నరేంద్రసింగ్ రజావత్ మిలిటరీ ఆఫీసర్. దాంతో దేశంలోని అన్ని కంటోన్మెంట్ ప్రాంతాల్లో పెరిగింది చావి. ఆంధ్రప్రదేశ్, మదనపల్లిలోని రిషీ వ్యాలీ స్కూల్లో చదువుకుంది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో డిగ్రీ చేసింది. పుణేలోని బీఐఎమ్ఎమ్ (బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్)లో ఏంబీఏ పూర్తి చేసింది. ఏంబీఏలో మంచి పర్సెంటేజ్‌తో బయటకు వచ్చిన చావీకి టైమ్స్ ఇండియా గ్రూప్ ఫస్ట్ చాన్స్ ఇచ్చింది. తక్కువ సమయంలోనే చావి పనితీరు మేనేజ్మెంట్ ఉన్నతాధికార వర్గం దృష్టిలోకి వెళ్లింది. ప్రమోషన్‌తో ఆమె సేవల పరిధిని విస్తృతం చేసింది మేనేజ్మెంట్. చావి సమయస్ఫూర్తి, వేగంగా నిర్ణయాలు తీసుకోగలగడం, దూరదృష్టి... బయట కార్పొరేట్ సెక్టార్‌లోనూ చర్చకు వచ్చాయి. భారతి ఎయిర్టెల్ సంస్థ చెవినా పడ్డాయి. తమ సంస్థలో చేరాలనే ఆహ్వానాన్ని పంపాయి. భారతీ ఎయిర్టెల్ ఆఫర్‌ను అందుకొని అందులో చేరింది. ఓ వైపు కమ్యూనికేషన్ సంస్థలో కొనసాగుతూ ఇంకోవైపు హోటల్ బిజినెస్‌లోకి ప్రవేశించింది. కర్ల్‌సన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో జాయిన్ అయింది. ఉత్సాహంతో పని చేస్తోంది. కానీ జీతం కోసం కాదు.. పదిమంది మంచి కోరే పని కావాలి.. అని తపన చెందింది. రిషీవ్యాలీలో నేర్పించింది ఏంటీ? నీ కోసం కాదు.. నీ సమాజం గురించి ఆలోచించాలి.. అని బడి రోజులను గుర్తుచేసుకుంది.. అందరిలా కాదు.. ఎందరికో స్ఫూర్తి పంచేలా బతకాలి.. అని నిర్ణయించుకుంది. విమెన్ రిజర్వేషన్ ఇది 2010నాటి సంగతి. అప్పుడే సోడా గ్రామాన్ని మహిళా సర్పంచ్ కోటా కింద కేటాయించారు. చావి సోడాలో పెరగక పోయినా.. ప్రతి సెలవులకు ఆ ఊరు వెళ్తూ ఉండేది. వాళ్లది భూస్వామ్య కుటుంబమే అయినా ఊహ తెలిసినప్పటి నుంచే ఆ ఛాయలేవీ తన మీద పడకుండా చూసుకుంది. రిషీ వ్యాలీ స్కూల్ నేర్పిన సంస్కారాన్ని ఒంటబట్టించుకుంది. ఊళ్లోని బడుగు వర్గాలకు దగ్గరైంది. వాళ్లలోని ప్రతి కుటుంబమూ ఆమెను తమ సొంత బిడ్డలాగే ఆదరించింది. అందుకే మహిళా రిజర్వేషన్ తర్వాత సర్పంచ్ ఎన్నికలు అనగానే వాళ్లందరికీ గుర్తొచ్చిన పేరు చావి. ఒకరోజు ఆమె ఆ ఊరొస్తే ఆ మాటే ఆమెతో చెప్పారు కూడా. ‘రాజకీయాల్లోకా?’ అని మనసులోనే నవ్వుకొని ఏ సమాధానమూ చెప్పకుండా మౌనంగానే తిరుగు ప్రయాణమైంది. అయితే గమ్యం చేరేవరకు మెదడు ఆమెను మౌనంగా ఉండనివ్వలేదు. ఎన్నో దృశ్యాలు.. చిన్నప్పటి నుంచి అప్పటిదాకా తను చూసిన సోడాను కళ్ల ముందు నిలబెట్టింది. ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ఊరు అలాగే ఉంది. తాత 20 ఏళ్లు సర్పంచ్ పదవిలో ఉన్నా ఊళ్లో ఏ మాత్రం మార్పులేదు. టాయ్‌లెట్‌కి వెళ్లాల్సి వస్తే సూర్యోదయానికి ముందన్నా, సూర్యాస్తమయం తర్వాతైనా వెళ్లాలి. ఈ మధ్యలో అర్జెంట్ అయితే సూర్యుడి నిష్క్రమణ దాకా ఆగాలి. డయేరియా, విరేచనాల వంటివి వస్తే ఆ పరిస్థితి ఊహించుకోవడానికే భయం. ఏ ఇంటికీ టాయ్‌లెట్ లేదు. ప్రతి ఇంట్లోని ఆడ, మగ, పిల్లాజెల్లా, ముసలి, ముతక అందరూ చెరువు కట్టకు వెళ్లాల్సిందే. ఊరంతటికీ ఒకే ఒక్క మంచి నీటి వనరుగా ఉన్న ఆ చెరువును, దాని పరిసరాలను మలినం చేయాల్సిందే. సురక్షితమైన నీటి పథకం లేదు. కరెంట్? ఊళ్లో ఎన్ని గంటలు కరెంట్ ఉంటోంది? మహా అంటే నాలుగు గంటలు. అంతకన్నా ఎక్కువుండదు. అసలు ఊళ్లో వాళ్లకు చేతి నిండా పనేది? అందుకే కదా అన్ని ఎండిపోయిన డొక్కలు? ఆడ, మగ పిల్లలకు చదువేది? అసలు అభివృద్ధి అనే పదం తెలుసా ఊళ్లో వాళ్లకి? రాజస్థాన్ రాజధాని జైపూర్‌కి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోడా.. ప్రగతికి మాత్రం కొన్ని వందల కిలోమీటర్ల ఆవల ఉంది. విలాసాల ముచ్చట అటుంచి కనీస సౌకర్యాలు లేని దుస్థితి... జైపూర్ వచ్చింది. మెదడు చేసిన డిజిటల్ ప్లే ఆగింది. వెంటనే సోడాకు తిరుగు ప్రయాణమైంది. సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి తాను సిద్ధమే అని చెప్పింది. సంతోషంతో ఆమెను భూజాలకెత్తుకున్నారు. తల్లిదండ్రులకూ వినిపించింది తన నిర్ణయాన్ని. ఆనందంగా ఆశీర్వదించారు. స్వచ్ఛ్ సోడా.. స్వచ్ఛ్ భారత్ అభియాన్ రాకముందే.. దానికి మూడునాలుగేళ్ల ముందే స్వచ్ఛ్ సోడా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది చావి. దీనికి ఊరు ఊరంతా ఆమెకు వ్యతిరేకమైంది. అవాక్కయినా అధైర్యపడలేదు చావి. బయట మలవిసర్జన చేస్తే గాలి, నీళ్లు, పరిసరాలు ఎలా మలినం అవుతాయో చెప్పింది. ఆరోగ్యకర్తలతో చెప్పించింది. అర్థం చేసుకున్న ఆడవాళ్లు చావి పక్షాన చేరారు. అందుకు రెండేళ్లు పట్టింది. 900 ఇళ్లున్న ఆ ఊళ్లో 800 ఇళ్లు టాయ్లెట్లు కట్టుకున్నాయి. మిగిలిన వంద ఇళ్లల్లోని వాళ్లు తరతరాలుగా వస్తున్న అలవాటును మానుకోవ డానికి ఇష్టపడలేదు. మాన్పించడానికి పిల్లలను ఉసిగొల్పింది చావి. పిల్లల దండును తయారు చేసి ఇందాక ఈ కథనం మొదట్లో చెప్పు కున్నట్టు చెరువు కట్టమీదకు తోలింది. ఇప్పుడు సోడాలోని 900 ఇళ్లల్లో టాయ్‌లెట్లున్నాయి. వెల్కమ్ టు సోడా.. సోడా చరిత్రలో లేనిది, ఎవరూ చేయనిది.. ఒకరకంగా సోడాలో విప్లవం అని చెప్పుకోదగ్గదీ... ఆ ఊళ్లో బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా! జైపూర్–టోంక్ హైవే మీదున్న సోడా ఊళ్లోకి ఎంటర్ కాగానే పెద్ద హోర్డింగ్ కనబడుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లది.. వెల్కమ్ టు సోడా అని! దానికి పది అడుగుల దూరంలోనే ఉంటుంది బ్యాంక్ విత్ ఏటీఎమ్. ఆ ఊరికే కళ తెచ్చే కూడలి అది. బ్యాంక్ ఏర్పాటుతో ఊళ్లో ఆడవాళ్లకు పొదుపు గురించి తెలిసింది. సోడాలోని ప్రతి వ్యక్తి ఇప్పుడు ఆ బ్యాంక్ ఖాతాదారుడే. బ్యాంక్‌కి వందమీటర్ల దూరంలో సెల్‌టవర్ పెట్టించింది. ఊళ్లోని వాళ్లంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొబైల్‌ఫోన్‌ను, ఉచిత డాటా సౌకర్యాన్నీ పొందుతున్నారు. మృత్యుభూమి సోడాలో ఎవరైనా చనిపోతే.. పలకరించ డానికి వచ్చిన బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు అందరికీ ఆ ఇంటి కుటుంబం భోజనం పెట్టి మర్యాదలు చేసే ఆచారం పేరే మృత్యుభూమి. చిన్నప్పుడే దీనిపట్ల వ్యతిరేకత ఏర్పడింది ఆమెకు. మనిషి పోయిన బాధలో ఆ కుటుంబముంటే పరామర్శించడానికి వచ్చిన వాళ్లకు ఆ కుటుంబమే విందుతో మర్యాద చేయడమేంటి? అది ఎంత ఆర్థిక భారం? ఇంకెంత మానసిక క్షోభ? చనిపోయిన వాళ్ల కుటుంబంతో అలాంటి మర్యాద చేయించుకో వడానికి వీల్లేదని నియమం పెట్టింది. ఆ మృత్యుభూమి ఆచారాన్ని మాన్పించింది. అభద్రతతో అడ్డంకులు అన్ని అవరోధాలను తట్టుకొని మొదటి అయిదేళ్లు సోడా అభివృద్ధికి కృషి చేసిన చావికి ఆ ఊరి ప్రజలు ఉన్నత వర్గాలతో సహా రెండో టర్మ్‌లోనూ సర్పంచ్‌గా గెలిపించారు. ఇప్పుడు ఆమె లక్ష్యం.. ఆ ఊళ్లో స్త్రీ, పురుష సాధికారత సాధించడం. సమకాలీన అభివృద్ధి ఫలాలు సోడా ప్రజలూ అందుకునేలా చేయడం. సోడాకు సంబంధించి ఏ సంక్షేమ పథకం గురించి తాను ఆలోచించినా ఎన్నో అడ్డంకులు, దాడులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా అదే చిరునవ్వు, సహనంతో నెగ్గుకొచ్చే ప్రయత్నం చేస్తోంది చావి. జీన్స్ వేసుకునే పిల్లా? ‘‘చావి.. సర్పంచ్ పదవికి పోటీ చేయనుందట..’’ అప్పటిదాకా చావిని కూతురిలాగే భావించిన కొంతమంది అగ్రకుల పెద్దలకు ఈ మాట మింగుడు పడలేదు. ఆ సాహసాన్ని వాళ్లు భరించలేకపోయారు. కారణం.. ఘూంగట్ (తల మీదుగా పైట కప్పుకోవడం). ఆచారాన్ని గౌరవించని చావికి సర్పంచ్గిరీనా? అన్నారు. జీన్స్ ప్యాంట్, కుర్తా, మెడచుట్టూ స్కార్ఫ్‌తో కనపడుతుంది. ఇలాంటి పిల్లను ఆ గద్దెమీద కూర్చోబెడితే ఊరి ఆడపిల్లలు పాడై పోరూ? అదీగాక ఆ అమ్మాయి ఏ రాజకీయ పార్టీకి చెందిన మనిషి కాదు. ఆమెకు అధికారం ఎలా ఇస్తాం? ఈ భావాలన్నీ ఎన్నికల్లో చావికి వ్యతిరేకంగా పనిచేశాయి. కాని బడుగు, బలహీన జనం మెజారిటీతో ఆమెను గెలిపించారు. సర్పంచ్‌గా పంచాయతీ ఆఫీస్‌లో కూర్చోబెట్టారు. వాళ్లకు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాననే దీక్షనే ప్రమాణంగా స్వీకరించింది. మంచినీరు.. కరెంట్.. రోడ్లు.. ప్రధాన సమస్య తీరిపోయాక కనీస అవసరాల మీద దృష్టి పెట్టింది చావి. గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క మంచి నీటి చెరువు మలినాల కంపు. అంతకుముందు తను పనిచేసిన కార్పొరేట్ సంస్థలను సంప్రదించి వాటి సాంఘిక బాధ్యత కింద ఆ చెరువును శుభ్రం చేయించింది. ఆ చెరువులోకి వ్యర్థాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంతకుముందే ఉన్న రిజర్వాయర్‌ను బాగు చేయించి వాన నీటిని నిలువచేసే సామర్థ్యాన్ని పెంచింది. ఇప్పుడు ఊళ్లో అందరికీ సురక్షితమైన మంచి నీరు అందుతోంది. అలాగే కరెంట్ కూడా. అంతకుముందు నాలుగు గంటలు ఉండే కరెంట్ ఇప్పుడు 22 గంటలు ఉంటోంది. అంతేకాదు చుట్టుపక్కల ఊళ్లకూ సహాయం చేస్తోంది. సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కార్పొరేట్ సంస్థల నుంచి, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించింది. తర్వాత ఆమె చూపు రోడ్ల మీదకు వెళ్లింది. ఊళ్లో ప్రతి వాడకు.. వాడల నుంచి కూడళ్లకు, కూడళ్ల నుంచి హైవేకు కలుపుతూ నలభై రోడ్లను నిర్మించింది. సోడా స్వరూపమే మారిపోయింది. గ్రామాలను మరిచిపోతున్నారు... మన దేశంలోని 75 శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే బతుకున్నారు. పాలసీ మేకర్స్ ఆ విషయాన్ని మరిచిపోయి.. దేశ ప్రగతికి సంబంధించి పాలసీల్లో గ్రామాలను ఇన్క్లూడ్ చేయట్లేదు. గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరగకుండా దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి పాలసీ మేకర్స్ గ్రామాలు, వాటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని పాలసీలను చేయాలి. నేటి తరానికీ గ్రామాల మీద పట్టు ఉండట్లేదు. పెద్ద చదువులు చదువుకుంటున్నామంటే మన మూలాలను మరిచిపొమ్మని కాదు అర్థం. ఆ చదువులను మన రూట్స్ బలపడేలా ఉపయోగించమని. తల్లిదండ్రులు కూడా డబ్బు సంపాదన ధ్యేయంగానే పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. అలా కాకుండా మన గ్రామాల కోసం మనమేం చేయగలమనే ఆలోచనను పిల్లల్లో కలిగించాలి. థ్యాంక్స్ టు రిషీ వ్యాలీ స్కూల్. అక్కడ అలవర్చుకున్న విలువలు నా గ్రామ సంక్షేమానికి ఎంతో తోడ్పడుతున్నాయి. – శరాది -
గోలీసోడాలో మెసేజ్
మానస్, నిత్యా నరేష్, కారుణ్య, అలీ ముఖ్య తారలుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సోడా గోలిసోడా’. ఎస్.బి. ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై భువనగిరి సత్య సింధూజ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోదావరి జిల్లాలో కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సెకండ్ షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హరిబాబు మాట్లాడుతూ – ‘‘పదిమంది హాయిగా నవ్వుకునే విధంగా తెరకెక్కిస్తున్నాం. మరో పది రోజుల్లో సెకండ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేస్తాం. ఆగస్టులో ఆడియో లాంచ్‌కి ప్లాన్ చేస్తున్నాం. కెమెరామేన్ ముజీర్ మాలిక్ తీసిన ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. కథ వినగానే అవకాశం ఇచ్చిన సింధూజగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మంచి మేసేజ్‌ని చక్కని కామెడీతో కలిపి సినిమా తీస్తున్నాం. హరిబాబు చాలా క్లారిటీతో సినిమా తీస్తున్నారు. అలీ, కృష్ణభగవాన్, ప్రభాస్ శ్రీను, గౌతంరాజు కామెడీ అందరినీ నవ్విస్తుంది’’ అన్నారు సింధూజ. ‘‘బీడు భూముల్లో కూడా పంటలు పండించవచ్చనే మెయిన్ కాన్సెప్ట్‌తో ఎంటర్టైనింగ్ సినిమా సాగుతుంది’’ అన్నారు నటుడు అలీ. ఈ చిత్రానికి సంగీతం: భరత్, కో–ప్రొడ్యూసర్: భువనగిరి శ్రీనివాస మూర్తి, ఎడిటర్ నందమూరి హరి. -
పాలకొల్లులో షూటింగ్ సందడి
ఉల్లంపర్రు (పాలకొల్లు అర్బన్): పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో సోడా.. గోలీ సోడా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎస్బీ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్లో భాగంగా శుక్రవారం ఉల్లంపర్రు మాంటిస్సోరీ స్కూల్లో పలు సన్నివేశాలను హీరో మానస్ (కాయ్ రాజా కాయ్ ఫేం), హీరోయిన్ నిత్యా నరేష్ (నందిని నర్శింగ్ హోం ఫేం), ఆర్తి (చెన్నై)లపై దర్శకుడు మల్లూరి హరిబాబు తెరకెక్కించారు. కుటుంబ హాస్య కథా చిత్రంగా ఈ మూవీని నిర్మిస్తున్నట్టు దర్శకుడు మల్లూరి హరిబాబు తెలిపారు. ఈ నెల 28 వరకు పాలకొల్లు పరిసర ప్రాంతాలతో పాటు, అమలాపురం, రాజమండ్రి, పాపికొండల్లో సినిమా షూటింగ్ జరుగుతుందన్నారు. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జూన్‌లో చిత్రీకరించి డబ్బింగ్, ఇతర పనులు పూర్తి చేసుకుని జూలై లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. ప్రముఖ సినీ, మాటల రచయిత తోటపల్లి మధు గ్రామ సర్పంచ్‌గా ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారన్నారు. అలాగే హీరో మిత్రులుగా గాదె రాంబాబు, కిర్లంపూడి అచ్చిరాజు, హీరోయిన్ ఫ్రెండ్స్‌గా ఆర్తి (చెన్నై), భవాని నటిస్తుండగా మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, మాధవి, షకలక శంకర్ తదితరులు నటిస్తున్నారని వెల్లడించారు. భువనగిరి సత్యసింధూజ, భువనగిరి శ్రీనివాసమూర్తి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
కామెడీ సోడా
మానస్, కారుణ్య, మహిమా అలేఖ్య ముఖ్య తారలుగా హరిబాబు మల్లూరి దర్శకత్వంలో ఎస్.బి. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భువనగిరి సత్య సింధూజ నిర్మించనున్న ‘సోడా గోలీసోడా’ ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత సత్య సింధూజ క్లాప్ ఇవ్వగా, స్వామిగౌడ్ కెమేరా సిచ్చాన్ చేశారు. నటుడు శివాజీరాజా గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సమాజంలో పరిస్థితులను ఆవిష్కరించే సందేశాత్మక చిత్రమిది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం. పాలకొల్లు, హైదరాబాద్‌లలో టాకీ, అవుట్ డోర్లో సాంగ్స్ షూటింగ్ చేస్తాం’’ అన్నారు హరిబాబు మల్లూరి. ‘‘మంచి చిత్రాలు అందించాలనే సంకల్పంతో నిర్మాతగా నేను చేస్తున్న తొలి ప్రయత్నం ఈ సినిమా’’ అన్నారు సత్య సింధూజ. నిర్మాత రాజ్ కందుకూరి, మానస్ తల్లి పద్మిని తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిప్స్
వెండి వస్తువులు కొత్తవిలా మెరవాలంటే... లీటర్ నీటిలో బేకింగ్ సోడా కలిపి బాగా మరిగించాలి. మరొకపాత్ర అడుగున అల్యూమినియమ్ ఫాయిల్ (మార్కెట్లో దొరుకుతుంది) వేసి, పైన వేడి నీరు పోయాలి. అందులో వెండి వస్తువులను నెమ్మదిగా వేయాలి. కాసేపు అలాగే ఉంచి, బయటకు తీయాలి. మురికి అంతా పోతుంది. మరిగించిన నీటిలో ఉప్పు, బేకింగ్ సొడా వేసి కలపాలి. అలాగే దీంట్లో కొద్దిగా వెనిగర్‌ను కలపకుండా నెమ్మదిగా పోయాలి. ఆ తర్వాత వెండి ఆభరణాలు ఆ నీటిలో మెల్లగా వేయాలి. కాసేపు ఉంచి, వాటిని బయటకు తీసి, మెత్తని క్లాత్‌తో తుడవాలి. వెండి ఆభరణాలకు ఉన్న స్టోన్స్‌కి టొమాటో కెచప్‌ను అద్దుతూ, రుద్దితే అవి త్వరగా పాడవవు. -
ఇంట్లోనే సోడా బుడ్డీ
బిర్యానీకి ది బెస్ట్ కాంబినేషన్ అంటే.. అది కచ్చితంగా సోడానే.. మరి అలాంటి సోడాను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. అలాంటి సోడాను ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ ‘సోడాస్ట్రీమ్ స్టార్టర్ కిట్’ ఉండాల్సిందే. ఈ కిట్‌లో సోడామేకర్, కార్బొనేటర్తో పాటు ఓ హై క్వాలిటీ ప్లాస్టిక్ బాటిల్ కూడా ఉంటుంది. దీంట్లో మీరు ఏ డ్రింక్ పోసినా అది సోడాగా మారుతుంది. మంచినీరు, నిమ్మరసం, పండ్ల రసాలు... ఇలా వేటినైనా ఇందులో పోస్తే సరి. దుకాణాల్లో దొరికే కార్బొనేటెడ్ డ్రింక్ అర నిమిషంలో మీ గ్లాసులో ఉంటుంది. ఒక కార్బొనేటర్ అరవై లీటర్ల సోడాను తయారు చేయగలదు. దాని తర్వాత కార్బొనేటర్ మార్చుకుంటే సరిపోతుంది. వీటికి ఎలాంటి ఎలక్ట్రిసిటీ, బ్యాటరీ అవసరం లేదు. బ్యాగులో ఇమిడిపోయేది కాబట్టి ఫ్యామిలీతో పిక్నిక్లకు వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లొచ్చు. -
సోడాక్యాన్ బాంబుతో ఆ విమానాన్ని పేల్చేశారు!
కైరో: ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఇటీవల కూలిన రష్యా విమానంలోకి బాంబును ఎలా అమర్చామో వివరిస్తూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. పేలుడు పదర్థాలను దాచి తరలించిన వస్తువుల చిత్రాలను తన ఆన్లైన్ మ్యాగజీన్ దబిఖ్లో వెల్లడించింది. ఈ చిత్రాలను బట్టి సోడాక్యాన్లో పేలుడు పదార్థాలను పెట్టి.. దానిని విమానంలోకి తరలించినట్టు తెలుస్తున్నది. గత నెల 31న ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో రష్యా విమానం కూలిన ఘటనలో 224 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతిచెందిన కొందరు ప్రయాణికుల పాస్‌పోర్టుల చిత్రాలను కూడా ఐఎస్ఐఎస్ ఈ కథనంలో ప్రచురించింది. ఈజిప్టులోని రెడ్ సీ రిసార్ట్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ వెళుతున్న ఈ విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. సిరియా, ఇరాక్‌లో వైమానిక దాడులు జరుపుతున్న అమెరికా మిత్రరాజ్యాలకు చెందిన విమానాలను కూల్చాలని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మొదట భావించారు. అయితే రష్యా కూడా సిరియాలోని తమ ఫైటర్లపై వైమానిక దాడులు ప్రారంభించడంతో ఆ దేశానికి చెందిన విమానాన్ని లక్ష్యంగా చేసుకొని పేల్చేసినట్టు తెలిపింది. బాంబు పేలడం వల్లే విమానం కూలిందని ప్రకటించిన రష్యా.. ఇందుకు కారకులను పట్టుకొని శిక్షిస్తామని ప్రతిన బూనిన సంగతి తెలిసిందే. -
ఇంటిప్స్
కోడిగుడ్డు సొనను గిన్నెలో వేసినప్పుడు ఒక్కోసారి పచ్చసొన గిన్నెకు అంటుకుపోతుంది. అలా జరక్కుండా ఉండాలంటే ముందు గిన్నెను తడిపి, అప్పుడు సొన వేయాలి.వాష్బేసిన్లు మురికిగా అయిపోతే... టీ పొడిలో కొంచెం బేకింగ్ సోడా కలిపి రుద్ది కడిగితే మళ్లీ మెరుస్తాయి.పప్పు ఉడికించేటప్పుడు పసుపు రంగు నురగ తేలుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఉడికించే నీటిలో చెంచాడు నూనె వేయాలి. ఏదైనా వంటకం మాడిపోయినప్పుడు ఆ వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అది పోవాలంటే... నీటిలో కమలాఫలం తొక్కలు, కొన్ని లవంగాలు వేసి బాగా మరిగిస్తే సరి. -
బేకింగ్ సోడాతో హోమ్ మేకింగ్
కిచెన్ కిటుకు కేక్‌లు, కుకీస్ వంటివి గుల్లగా రావడం కోసం వాటి తయారీలో బేకింగ్ సోడాని వాడుతుంటాం మనం. కానీ అది వంట చేయడానికే కాదు... చాలా వాటికి పనికొస్తుంది. చాలా పనులు చేసిపెడుతుంది. అవేంటంటే...{ఫిజ్ కనుక దుర్వాసన వస్తుంటే, ఓ చిన్న గిన్నెలో బేకింగ్ సోడా వేసి లోపల ఉంచితే చాలు. ఆ వాసన పోతుంది;ఆభరణాలు కిలుం పట్టినట్టుగా తయారైతే... బేకింగ్ సోడాలో కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసి, దానితో కడిగితే తిరిగి మెరుస్తాయి; మన దంతాలు రంగు మారినప్పుడు బేకింగ్ సోడాలో ఉప్పు కలిపి తోముకుంటే మళ్లీ తెల్లగా అయిపోతాయి;నేలమీద పడిన నూనె జిడ్డు వదలకుండా ఉంటే కాసింత బేకింగ్ సోడా చల్లి కడిగితే జిడ్డు పోతుంది.అలాగే వంటగిన్నెల జిడ్డును కూడా బేకింగ్ సోడాతో కడిగి పోగొట్టవచ్చు;డస్ట్‌బిన్ వాసన వస్తుంటే అందులో కాస్త బేకింగ్‌సోడా చల్లితే సరి; స్నాక్స్ దుర్వాసన గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ వాసన వదిలించడానికి నీటిలో బేకింగ్ సోడా వేసి నానబెట్టి ఉతికితే ఫలితముంటుంది;లంచ్ బాక్సులు వాసన వస్తుంటే వాటిని నీటితో నింపి, అందులో కాస్త బేకింగ్ సోడా వేసి నాననిచ్చి, గంట తర్వాత కడిగేస్తే వాసన మాయమౌతుంది;పిల్లలు గోడమీద గీసిన పెన్నుగీతలు పోవాలంటే తడి స్పాంజికి బేకింగ్‌సోడా అద్ది తుడవాలి. -
సోడానీటిలో ఉండే వాయువు ఏది?
మాదిరి ప్రశ్నలు కార్బన్ డై ఆక్సైడ్ అనేది కార్బన్ ప్రధాన ఆక్సైడ్. దీన్ని ద్రవీకరించి ఆకస్మిక వ్యాకోచం చెందిస్తే ఘన కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. దీన్నే ‘డ్రై ఐస్’ అంటారు. దీన్ని ఐస్‌క్రీం, అతి శీతల ఆహారాల (Frozen Food) కోసం ప్రశీతకం (రిఫ్రిజిరెంట్ )గా వాడుతున్నారు. దీనికి ఘనస్థితి నుంచి నేరుగా వాయు రూపంలోకి మారే (ఉత్పతనం) గుణం ఉంటుంది. స్టేజి షోలలో బ్యాక్‌గ్రౌండ్‌లో పొగలను సృష్టించడానికి దీన్ని ఉపయోగిస్తారు. కార్బన్ కుటుంబం కార్బన్ (ఇ), సిలికాన్ (జీ), జెర్మేనియం (ఎ్ఛ), టిన్ (), లెడ్ మూలకాలు 14వ గ్రూప్‌లో ఉన్నాయి. కార్బన్ మూలకస్థితి అంటే స్వేచ్ఛాస్థితి (గ్రాఫైట్, డైమండ్, కోల్, కోక్)తో పాటు సంయోగస్థితి (కార్బొనేట్లు, బై కార్బొనేట్ల రూపంలో)లో కూడా లభిస్తుంది. గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ (0.03%) రూపంలో ఉంటుంది. భూపటలంపై విస్తృతంగా లభించే మూలకాల్లో సిలికాన్ రెండో స్థానంలో ఉంది. ఇది ద్రవ్యరాశిపరంగా 27.7% ఆక్రమిస్తుంది. ఆక్సిజన్ మొదటి స్థానంలో (ద్రవ్యరాశి పరంగా 46.6%) ఉంది. సిలికాన్ ప్రకృతిలో సిలికా (సిలికాన్ డై ఆక్సైడ్), సిలికేట్ల రూపంలో లభిస్తుంది. పింగాణీ, గాజు, సిమెంటులో సిలికాన్ ముఖ్యమైన అనుఘటకం. రూపాంతరత రసాయన ధర్మాలు ఒకేవిధంగా ఉండే భిన్న భౌతికరూపాలనే ఒక మూలక రూపాంతరాలు (అౌ్టటౌఞ్ఛట) అంటారు. కార్బన్ స్ఫటిక రూపాంతరాలు - గ్రాఫైట్, డైమండ్, ఫుల్లరీన్. అస్ఫటిక రూపాలు - కోల్, కోక్, చార్కోల్ మొదలైనవి. గ్రాఫైట్ పొరల నిర్మాణాన్ని కల్గి ఉంటుంది. ఈ పొరల మధ్య వాండర్‌వాల్స్ ఆకర్షణ బలాలు ఉంటాయి. ఒత్తిడిని కలిగిస్తే పొరలు ఒకదానిపై మరొకటి జారతాయి. అందువల్ల అధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేసే భారీ యంత్రాల్లో గ్రాఫైట్ పొడిని కందెన (ఔఠఛటజీఛ్చ్టి)గా వాడతారు. గ్రాఫైట్‌లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల ఇది మంచి ఉష్ణవాహకంగానే కాకుండా విద్యుత్ వాహకంగానూ పనిచేస్తుంది. దీన్ని విద్యుత్ ఘటాల్లో ఎలక్ట్రోడులుగా, పెన్సిల్ లెడ్‌ల తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తారు. డైమండ్ త్రిమితీయ అల్లిక కల్గిన జాలక నిర్మాణం కారణంగా అత్యంత గట్టిగా ఉంటుంది. దీన్ని గాజును కోయడానికి, దృఢమైన పనిముట్లను పదును చేయడానికి, అపఘర్షకంగా (అఛట్చటజీఠ్ఛి), ఎలక్ట్రిక్ బల్బుల్లో వాడే టంగ్స్టన్ ఫిలమెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఫుల్లరీన్లు పంజరాన్ని పోలిన అణువులు. ఇ60 అణువుకు సాకర్బంతిని పోలిన నిర్మాణం ఉంటుంది. అందువల్ల దీన్ని ‘బక్ మినిస్టర్ ఫుల్లరీన్’ అంటారు. ఫుల్లరీన్ శుద్ధమైన కార్బన్ (స్ఫటిక రూపం). అస్ఫటిక రూపంలో చక్కెర బొగ్గు (ఠజ్చట ఛిజ్చిటఛిౌ్చ) శుద్ధమైంది. ఫుల్లరీన్ను ‘బక్కీ బాల్స్’ అని కూడా అంటారు. కార్బన్ ఆక్సైడ్లు: కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్లు కార్బన్ ప్రధాన ఆక్సైడ్లు. కార్బన్‌ను పరిమిత ఆక్సిజన్‌లో ప్రత్యక్ష ఆక్సీకరణ చేస్తే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఇది మండే స్వభావం ఉన్న విషపూరిత వాయువు, మంచి క్షయకరణి. కార్బన్ డై ఆక్సైడ్‌కు మంటలను ఆర్పే గుణం ఉంటుంది. ఇది నీటిలో కరిగి (సోడా తదితర శీతల పానీయాలు) కార్బోనిక్ ఆమ్లాన్ని ఇస్తుంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా పచ్చటి చెట్లు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్లూకోజ్ లాంటి కార్బొహైడ్రేట్లుగా మారుస్తాయి. 1. కిందివాటిలో అర్ధ లోహం (Metalloid) ఏది? 1) కార్బన్ 2) సిలికాన్ 3) జెర్మేనియం 4) లెడ్ 2. ఒకే రకమైన పరమాణువులు లేని పదార్థం ఏది? 1) గ్రాఫైట్ 2) డైమండ్ 3) కార్బన్ డై ఆక్సైడ్ 4) కోక్ 3. డైమండ్‌కు సంబంధించి సరికాని వాక్యం? 1) సహజంగా లభించే పదార్థాల్లో అత్యంత కఠినమైంది 2) అత్యధిక వక్రీభవన గుణకం కలిగింది 3) డైమండ్ ప్రకాశించడానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనం 4) ఉత్తమ ఉష్ణవాహకం, మంచి విద్యుత్ వాహకం 4. లెడ్ పెన్సిళ్లలో ఉపయోగించే మూలకం? 1) లెడ్ 2) గ్రాఫైట్ 3) 1, 2 4) డైమండ్ 5. సోడానీటిలో ఉండే వాయువు ఏది? 1) CO 2) CO2 3) SO2 4) O3 6. అలోహం అయినప్పటికీ లోహధర్మమైన ఉష్ణ, విద్యుత్ వాహకతను ప్రదర్శించేది? 1) డైమండ్ 2) గ్రాఫైట్ 3) కోక్ 4) లెడ్ 7. కృత్రిమ శ్వాసను అందించడానికి, కార్బన్ మోనాక్సైడ్ విషానికి విరుగుడుగా ఉపయోగించే 10% ఇై2, 90% ై2ల మిశ్రమాన్ని ఏమంటారు? 1) పొడిమంచు 2) వాటర్ గ్యాస్ 3) ప్రొడ్యూసర్ గ్యాస్ 4) కార్బొజెన్ 8. లెడ్ పెన్సిళ్లలో లెడ్ శాతం? 1) 100% 2) 50% 3) 0% 4) 75% 9. చెట్లు రాత్రివేళల్లో విడుదల చేసే వాయువు? 1) కార్బన్ మోనాక్సైడ్ 2) కార్బన్ డై ఆక్సైడ్ 3) ఓజోన్ 4) సల్ఫర్ డై ఆక్సైడ్ 10. అత్యంత కఠినమైన, మృదువైన మూలకం ఏది? 1) కార్బన్ 2) సిలికాన్ 3) జెర్మేనియం 4) లెడ్ 11. డ్రై ఐస్‌లో ఏమి ఉంటుంది? (ఎస్.ఐ.-2011) 1) భారజలం 2) అమ్మోనియా ద్రవం 3) ఘనీభవించిన ఆల్కహాల్ 4) ఘనీభవించిన కార్బన్ డై ఆక్సైడ్ 12. అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే భారీ యంత్రాల్లో కందెనగా దేన్ని వాడతారు? 1) గ్రాఫైట్ 2) గ్రీజు 3) నూనె 4) వజ్రం 13. పొరల నిర్మాణాన్ని కలిగి, జారే స్వభావం ఉన్న మెత్తని కార్బన్ రూపం ఏది? 1) డైమండ్ 2) కోక్ 3) ఫుల్లరీన్ 4) గ్రాఫైట్ 14. సిలికా (ఇసుక) రసాయన నామం? 1) సిలికాన్ 2) సిలికాన్ డై ఆక్సైడ్ 3) సోడియం సిలికేట్ 4) కాల్షియం సిలికేట్ 15. కిందివాటిలో సిలికా స్ఫటిక రూపం కానిది? 1) క్వార్ట ్జ 2) క్రిస్టోబలైట్ 3) ట్రిడిమైట్ 4) ఇసుక 16. రసాయనికంగా క్వార్ట ్జ అనేది? (పోలీస్ కానిస్టేబుల్-2013) 1) కాల్షియం సిలికేట్ 2) సిలికాన్ డై ఆక్సైడ్ 3) సోడియం సల్ఫేట్ 4) కాల్షియం సల్ఫేట్ 17. సరైన వాక్యాన్ని గుర్తించండి. 1) స్వచ్ఛమైన జెర్మేనియం (ఎ్ఛ), సిలికాన్ (జీ)లను ట్రాన్సిస్టర్లు, అర్ధవాహకాల తయారీలో ఉపయోగిస్తారు. 2) క్వార్ట ్జను పీజో విద్యుత్ పదార్థంగా ఉపయోగిస్తారు. 3) కచ్చితమైన డిజిటల్ గడియారాల తయారీలో క్వార్ట ్జఉపయోగపడుతుంది 4) పైవన్నీ సరైనవే 18. కిందివాటి సరైన వాక్యం ఏది? 1) ఇై విషపూరితం, ఇై2 విషపూరితం కాదు 2) ఇై తటస్థమైంది. ఇై2 ఆమ్ల స్వభావాన్ని కల్గి ఉంటుంది 3) ఇై బలమైన క్షయకరణి 4) పైవన్నీ సరైనవే 19. కార్బన్ శాతం అత్యధికంగా ఉండే బొగ్గు ఏది? 1) ఆంథ్రసైట్ 2) లిగ్నైట్ 3) బిట్యూమినస్ 4) పీట్ 20. కిందివాటిలో సమయోజనీయ స్ఫటికం ఏది? 1) డైమండ్ 2) సోడియం క్లోరైడ్ 3) చక్కెర 4) సున్నపురాయి 21. వజ్రం దేని భిన్న రూపం? 1) కార్బన్ 2) సిలికాన్ 3) సిలికా 4) జెర్మేనియం 22. ఉష్ణగతిక శాస్త్రం పరంగా కార్బన్ స్థిరమైన ఎల్లోట్రోప్ ఏది? 1) డైమండ్ 2) గ్రాఫైట్ 3) కోల్ 4) కోక్ 23. పెట్రోల్‌కు యాంటీనాకింగ్గా కలిపే పదార్థం ఏది? 1) టెట్రా ఇథైల్ జెర్మేనియం 2) టెట్రా ఇథైల్ లెడ్ (ఖీఉఔ) 3) సల్ఫర్ 4) ఆల్కహాల్ 24. {sాఫిక్ పోలీస్ కిందివాటిలో ఏ కాలుష్య కారకానికి గురవుతాడు? 1) కార్బన్ డై ఆక్సైడ్ 2) లెడ్ 3) సల్ఫర్ డై ఆక్సైడ్ 4) పైవన్నీ సమాధానాలు 1) 3; 2) 3; 3) 4; 4) 2; 5) 2; 6) 2; 7) 4; 8) 3; 9) 2; 10) 1; 11) 4; 12) 1; 13) 4; 14) 2; 15) 4; 16) 2; 17) 4; 18) 4; 19) 1; 20) 1; 21) 1; 22) 2; 23) 2; 24) 4. - డాక్టర్ బి. రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా. జాబ్స్, అడ్మిషన్స: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహారాష్ట్రలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నర్స్ (మేల్/ ఫిమేల్): 10 అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ (నర్సింగ్) లేదా నర్సింగ్‌తో పాటు సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 18 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎక్స్-రే టెక్నీషియన్: 1 అర్హతలు: ఇంటర్‌తో పాటు మెడికల్ రేడియోగ్రఫీ/ ఎక్స్‌రే టెక్నిక్ ట్రేడ్‌లో సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 6 వెబ్సైట్: www.npcil.nic.in మేనేజ్మెంట్లో ఫెలో ప్రోగ్రామ్ తిరుచిరాపల్లిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఇది పీహెచ్‌డీకి సమానం) విభాగాలు: కార్పొరేట్ స్ట్రాటజీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఎంఐఎస్/ఐటీ, ఓబీ అండ్ హెచ్ఆర్ అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 30 వెబ్సైట్: www.iimtrichy.ac.in కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రం కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. బీఎడ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్), బీఎడ్ అడిషనల్ మెథడాలజీ అర్హతలు: బీఏ/ బీకామ్/ బీఎస్సీతో పాటు తెలంగాణకు చెందిన ప్రభుత్వ/ ఎయిడెడ్/ఎంపీపీ/జెడ్పీపీ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా రెండేళ్లకు తగ్గకుండా పనిచేస్తూ ఉండాలి. బీఎడ్ అడిషనల్ మెథడాలజీకి సంబంధించిన వారికి బీఎడ్ తర్వాత రెండేళ్లకు తగ్గకుండా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉండాలి. దరఖాస్తు: డిసెంబర్ 11 తర్వాత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 5 వెబ్సైట్: www.sdlceku.co.in