లండన్ : తీపి పదార్ధాలతో పోలిస్తే కృత్రిమ పానీయాలతోనే టైప్ టూ మధుమేహ ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఫ్రక్టోజ్‌తో కూడిన డైట్ మన ఆహారంలో పోషక రహిత శక్తిని చొప్పించి రక్తంలో చక్కెర స్ధాయిలపై పెను ప్రమాదం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే పండ్లు, కూరగాయలు, సహజసిద్ధమైన పండ్ల రసాలు, తేనె వంటి ఆహారం, పానీయాలతో ఎలాంటి ముప్పు లేదని వెల్లడించారు.
సోడాతో పాటు శీతల పానీయాలు, బేకరీ పదార్ధాలు, స్వీట్లకు దూరంగా ఉండాలని కెనడాకు చెందిన సెయింట్ మైఖేల్ హాస్పిటల్, టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు సూచించారు. గతంలో మధుమేహం, ఆహారానికి ఉన్న సంబంధంపై వెలువడిన 155 అథ్యయనాలను విశ్లేషించి ఈ పరిశోధనల చేపట్టారు. అదనపు క్యాలరీలు లేని ఫ్రక్టోజ్ చక్కెరతో కూడిన ఆహారంతో ఎలాంటి అనర్ధం ఉండదని పరిశోధక బృందం తేల్చింది.
డయాబెటిస్‌తో బాధపడే వారిలో చక్కెరలో గ్లూకోజ్, ఇన్సులిన్‌లను నియంత్రించేందుకు తాజా పండ్లు, పండ్ల రసాలు ఉపయోగపడతాయని తాజా అథ్యయనం వెల్లడించడం గమనార్హం. శీతల పానీయాలతో మాత్రం మధుమేహుల ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది. పండ్లలో అధికంగా ఉండే పీచు పదార్ధం శరీరంలో చక్కెరను విడుదల చేసే ప్రక్రియను నెమ్మదింపచేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.మధుమేహ నియంత్రణ, నివారణలో తమ అథ్యయన వివరాలు ఉపయోగపడతాయని అథ్యయన రచయిత డాక్టర్ జాన్ సివెన్‌పైపర్ పేర్కొన్నారు.
.
Comments
Please login to add a commentAdd a comment