New Study
-
ఫాస్టింగ్‌తో బరువు తగ్గడానికి మించిన ఆరోగ్య ప్రయోజనాలు!
బరువు తగ్గాలి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం. తర తరాలుగా భారతీయుల్లో ఉపవాసం కొత్తేమీకాదు. బరువు తగ్గాల నుకునే వారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు ఫాస్టింగ్ చేయడం కూడా చాలా కామన్. అయితే ఎక్కువ కాలం మన దేహాన్ని పస్తు పెట్టడం వల్ల వెయిట్‌లాస్ కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది తాజా అధ్యయనం. ఆ వివరాలు మీకోసం. ఉపవాసంతో శరీరంలో ఏమి జరుగుతుంది? ఉపవాస సమయంలో, మన శరీరం దాని ఇంధన మూలాన్ని స్వీకరిస్తుంది. సులభంగా యాక్సెస్ చేసే చక్కెరల నుండి బాడీలోని నిల్వ ఉన్న కొవ్వులను వాడుకుంటుంది. అయితే ఆహారం లేకుండా ఎక్కువ కాలం పాటు ఉంటే శరీరం ఎలా స్పందిస్తుంది? ఇదే ఈ స్టడిలోని కీలక అంశం. నేచర్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ సైన్సెస్ పరిశోధకులు 12 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరశోధన చేశాడు. వారు ఏడు రోజుల పాటు కేవలం నీరు మాత్రమే తీసుకునేలా చేశారు. అలా వారి రక్తంలో వివిధ ప్రోటీన్ మార్కర్ల స్థాయిలలో మార్పులను నిశితంగా పరిశీలించారు. మూడు రోజుల తర్వాతే మంచి ప్రయోజనం ఊహించినట్లుగానే తొలి రెండు, మూడు రోజుల్లో గ్లూకోజ్ నుండి కొవ్వు ప్రధాన ఇంధన వనరుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. దీంతో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతూ వస్తుంది. మొత్తంగా, వాలంటీర్లు సగటున 5.7 కిలోగ్రాముల కొవ్వు ,లీన్ మాస్ రెండూ తగ్గాయి. అయితే మూడు రోజుల ఉపవాసం తర్వాత వాలంటీర్ల రక్త బయోమార్కర్లలో విభిన్న మార్పులను పరిశోధకులు గమనించారు. మొత్తం బాడీలో కూడా మార్పులొచ్చాయి. ముఖ్యంగా మెదడు కణాల నిర్మాణ ప్రోటీన్లలో మార్పులు ఆసక్తికరంగా నిలిచాయి. దీంతో మూడు రోజుల తరువాత చేసే ఉపవాసంలో మాత్రమే బరువు తగ్గడాన్ని మించి, మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఈ అధ్యయనంలో తేల్చారు. క్వీన్ మేరీస్ ప్రెసిషన్ హెల్త్ యూనివర్శిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (PHURI) డైరెక్టర్ క్లాడియా లాంగెన్‌బర్గ్ మాట్లాడుతూ, ‘తొలిసారి ఉపవాసం ద్వారా శరీరం అంతా కూడా అతి చిన్న స్థాయిలో కూడా ఏమి జరుగుతుందో చూడగలుగుతున్నామన్నామని ప్రకటించారు. సురక్షితమైన పద్ధతులో ఫాస్టింగ్ చేసినప్పుడు, బరువు తగ్గడం అనేది ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం కూడా బరువు తగ్గడ కంటే అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అయితే చాలాకొద్దిమందిపై చేసిన తమ ప్రయోగంలో అందరిలోనూ ఫలితాలు ఒకేలా ఉన్నాయని, మరి ఎక్కువమందిపై ఈ ప్రయోగం చేసినపుడు ఫలితాలు ఎంటా ఉంటాయనేది పరిశీలించాల్సి ఉందన్నారు. -
అంతరిక్షం రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా?
భూమ్మీద ఏ చోటకు వెళ్లినా అక్కడి వాతావరణం ఏదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ పరిసరాల్లో ఉండే పరిస్థితులను బట్టి ధ్వనులు వినిపిస్తుంటాయి. మట్టి నుంచి మొక్కలు, జంతువుల దాకా ఎక్కడికక్కడ వాసన, రుచి అనుభూతులు ఉంటాయి. మరి అంతరిక్షంలో ఎలాంటి ధ్వనులు వినిపిస్తాయి? అక్కడి రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా? దీనిపై పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చిన వివరాలు ఇవీ.. గెలాక్సీల మధ్య ధ్వని ప్రయాణం సాధారణంగా వాతావరణం లేనిచోట ధ్వని ప్రయాణించదు అనేది భౌతికశాస్త్ర సూత్రం. విశ్వంలో చాలా భాగం శూన్యమే కాబట్టి ధ్వని ప్రసారం ఉండదనే భావన ఉంది. ఇది కొంతవరకు నిజమే. అయితే వేలకొద్దీ నక్షత్ర సమూహాలు (గెలాక్సీలు) ఉండే గెలాక్సీ క్లస్టర్లు భారీ ఎత్తున గ్యాస్‌తో నిండి ఉంటాయి. వాటిలో ధ్వని ప్రయాణిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతరిక్ష ధ్వనులను విడుదల చేసిన నాసా.. 2003లో పెర్సెయస్ గెలాక్సీ క్లస్టర్ మధ్య ఉన్న ఒక కృష్ణ బిలం (బ్లాక్ హోల్) నుంచి వచ్చిన ధ్వనిని చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ సాయంతో గుర్తించారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న ఆ ధ్వని ఫ్రీక్వెన్సీని నాసా శాస్త్రవేత్తలు ఇటీవల కొన్నికోట్ల రెట్లు పెంచారు. మనకు వినపడే స్థాయికి తీసుకొచ్చి విడుదల చేశారు. గ్రహాల ‘పాటలు’ ఇవి నాసా ప్రయోగించిన రోవర్లు, ఉపగ్రహాల సాయంతో పలు గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కల ధ్వనులనూ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. అంగారకుడు, శుక్రుడు, జూపిటర్, శనిగ్రహాలతోపాటు పలు తోకచుక్కల ధ్వనులను నమోదు చేశారు. పర్సవరెన్స్రోవర్ మార్స్పైచేసిన ప్రయోగాలతో.. అక్కడి పలుచని వాతావరణం కారణంగా ధ్వనిఅతి మెల్లగా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. విజిల్స్, గంటలు, పక్షుల కూతలు వంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే ధ్వనులు దాదాపుగా వినిపించవని తేల్చారు. ఏదో కాలిపోతున్నట్టు వాసనతో.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండే శాస్త్రవేత్తలు అప్పుడప్పుడూ మరమ్మతులు, ప్రయోగాల కోసం.. బయట శూన్యంలో స్పేస్ వాక్ చేస్తుంటారు. అలా స్పేస్ వాక్ చేసి, తిరిగి ఐఎస్ఎస్లోకి వెళ్లిన తర్వాత.. తమకు ‘ఏదో కాల్చిన మాంసం’.. ‘బాగా వేడి చేసిన ఇనుము నుంచి వెలువడిన లేదా వెల్డింగ్ చేసినప్పుడు వెలువడే పొగ’ వంటి వాసన వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఐఎస్ఎస్ బయట అంతరిక్షంలో భారీస్థాయి రేడియేషన్ ఉంటుందని.. దానికి లోనైనప్పుడు స్పేస్ సూట్, ఇతర పరికరాల్లోని పరమాణువులు తీవ్రస్థాయి కంపనాల (హైఎనర్జీ వైబ్రేషన్స్)కు గురవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు తిరిగి ఐఎస్‌ఎస్‌లోనికి వచ్చాక ఆ హైఎనర్జీ పార్టికల్స్‌లో కూడిన గాలిని పీల్చడం వల్ల.. వెల్డింగ్ తరహా వాసన వస్తున్నట్టు తేల్చారు. ‘టచ్’లో మార్పు లేదట! అంతరిక్షంలో మన స్పర్శ విషయంలో ఎలాంటి తేడాలు కనిపించలేదని కెనడా ఆస్ట్రోనాట్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ వెల్లడించారు. అయితే వరుసగా రెండు నెలలపాటు ఐఎస్ఎస్లో గడిపిన వ్యోమగాముల్లో పాదాల అడుగుభాగం గరుకుదనం తగ్గి మెత్తగా అయితే.. పాదాలపైన చర్మం అత్యంత సున్నితంగా మారుతోందని గుర్తించారు. రకరకాల రుచుల్లో నక్షత్రాలు సాధారణంగా వివిధ రసాయనాలను బట్టి పదార్థాలకు రుచి వస్తుంటుంది. అలాగే అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాల రుచినీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మన పాలపుంతలోని సాగిట్టారియస్ బీ2 గా పిలిచే ధూళిమేఘంలో ఈథైల్ ఫార్మేట్ రసాయనం ఉన్నట్టు గుర్తించారు. దానితో అది గులాబీ జాతికి చెందిన ‘రాస్ప్బెర్రీ’ పండ్ల రుచిని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇక నక్షత్రాలు, ఖగోళ పదార్థాల్లో ఆల్కహాల్, యాసిడ్లు, ఆల్డిహైడ్స్గా పిలిచే రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు అనుగుణంగా వగరు, పులుపు, ఒకరకమైన చేదు వంటి రుచులను తలపించొచ్చని అంచనా వేశారు. కళ్లు ‘ఫ్లాట్’ అవుతాయట! అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపే వ్యోమగాముల్లో ‘స్పేస్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్ (సాన్స్)’ సమస్య వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుత్వాకర్షణ లేని వాతావరణం వల్ల కళ్లలోని ఆప్టిక్ డిస్క్‌లో మార్పులు వచ్చి.. కళ్లు గుండ్రని ఆకారాన్ని కోల్పోతూ, దృష్టి సామర్థ్యం తగ్గుతోందని తేల్చారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ ఇదీ చదవండి: భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును! -
భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును!
భూమి గుండ్రంగా ఉండును. ఇది చిన్నప్పటి నుంచీ మనమంతా వింటున్నదే. నిజానికి పూర్తిగా గుండ్రంగా కాకుండా ఓ మాదిరి దీర్ఘవృత్తాకారంలో ఉందట. అసలు ఆ మాటకొస్తే భూమి ఇంకా పూర్తి రూపాన్ని సంతరించుకునే క్రమంలోనే ఉందట. దీర్ఘవృత్తాకారం రావడానికి కారణమైన గురుత్వాకర్షణ శక్తే భూమికి ఓ నిశ్చిత రూపాన్నిచ్చే పనిలో మునిగి ఉందని సైంటిస్టులు చెబుతుండటం విశేషం! భూమిపై నుంచి అంతరిక్షంలోకి జారిపోకుండా మనల్ని కాపాడుతున్నది, భూమిపై పట్టి ఉంచుతున్నది గురుత్వాకర్షణ శక్తేనన్నది తెలిసిందే. భూమికి ఉన్న ఆ శక్తే భూమిని లోలోపలి నుంచి సమ్మెట పోట్లను తలపించేలా ఒత్తిడి చేసీ చేసీ దీర్ఘవృత్తాకారానికి తీసుకొచ్చిందట. భూమి కేంద్రానికి, ఉపరితలానికి మధ్య దూరం భూమధ్యరేఖ వద్ద ఒకలా, ధ్రువాల వద్ద ఇంకోలా ఉండటానికి ఈ దీర్ఘవృత్తాకారమే కారణమట. భూమి రూపాన్ని తీర్చిదిద్దే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని తాజాగా కనిపెట్టామంటున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. భూమి ఆకారాన్ని నిర్దేశించడంలో గురుత్వాకర్షణ శక్తితో పాటు ఎగుడుదిగుడు ఉపరితలం, లోపలి పొరల్లో ఉన్న వనరుల అసమతుల విస్తృత వంటి పలు ఇతర కారకాల ప్రమేయమూ ఉందని పరిశోధన తేల్చింది. ఒకప్పుడు భూమిపై 30 కిలోమీటర్ల పైచిలుకు ఎత్తు దాకా ఉన్న పర్వతాలు గురుత్వాకర్షణ శక్తి వల్లే క్రమంగా తగ్గుతూ వచ్చాయట. భూమిపై ఉన్న విభిన్న స్థలాకృతులు, పై పొరల కదలికలు తదితరాలు కూడా ఇందుకు కారణమయ్యాయని తేలింది. భూమి ఎలా ఏర్పడిందో అర్థం చేసుకునే ప్రయత్నానికి ఈ తాజా ఆవిష్కరణలు కొత్త కోణాలను అందిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదీ చదవండి: IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం -
లిక్కర్ తాగితే ఆరోగ్యానికి మేలేనటా.. అది ఎలాగంటే!
లండన్: ఆల్కాహాల్ తీసుకోవటం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని వైద్యులు చెబుతుంటారు. తాగి ఇంటికొస్తే పెద్దలు తిడతారు. అయితే.. మద్యం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఉన్నాయని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. అవునండి అది నిజమేనటా? లిక్కర్ తాగితే చాలా రోగాలు దరిచేరవటా! కానీ, దానికో షరతు ఉంది. మీరు 40 ఏళ్ల వయసు దాటి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే.. చిన్న గ్లాస్ రెడ్ వైన్, బీరు బాటిల్, విష్కి లేదా ఇతర లిక్కర్‌ను ప్రామాణిక మోతాదులో తీసుకోవచ్చని తేల్చింది. దాంతో గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, గుండపోటు, మధుమేహం వంటివి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. మరోవైపు.. వృద్ధులతో పోలిస్తే యువత ఆల్కాహాల్ తీసుకోవటం ద్వారా ఎక్కువ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. 15-39 ఏళ్ల వయసు వారు లిక్కర్ తీసుకోవటం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవటా. ప్రస్తుతం మద్యం సేవిస్తున్నవారిలో వీరి వాటానే ఎక్కువ. ఈ వయసు వారిలోనే 60 శాతానికిపైగా ఆల్కాహాల్ సంబంధిత సమస్యలకు గరువుతున్నట్లు అధ్యయనం తేల్చింది. బైక్ ప్రమాదాలు, ఆత్మహత్యలు, దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొంది. 'యువత ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. 40 ఏళ్లు పైబడిన వారు కొద్దిగా లిక్కరు తీసుకోవటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. యువత ఆల్కహాల్‌కు దూరంగా ఉంటారని నమ్మకం లేకపోయినప్పటికీ.. మా అధ్యయనంతో కొంత వరకైనా మారుతారనే నమ్మకం ఉంది.' అని పేర్కొన్నారు వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎమ్మాన్యూయెల్ గాకిడో. మహిళలు, పురుషుల్లో ఆల్కహాల్ తీసుకుంటే వచ్చే ముప్పుపై అధ్యయనం చేశారు పరిశోధకులు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వంటి 22 సమస్యలపై.. వ్యాధులతో ప్రపంచ వ్యయం 2020 డేటాను వినియోగించుకున్నారు. 15-95 ఏళ్ల వయసువారిపై పరిశోధన.. 1990- 2020 మధ్య 15-95 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, ఆడవారిపై అధ్యయనం చేశారు పరిశోధకులు. 2020 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ డేటాను ఉపయోగించి హృదయ వ్యాధులు, క్యాన్సర్లతో సహా 22 ఆరోగ్య ఫలితాలపై ఆల్కహాల్ వినియోగం ప్రమాదాన్ని పరిశీలించారు. 204 దేశాల్లో ఈ పరిశోధన చేపట్టారు. 40-60 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు ప్రామాణిక మేతాదులో సగం తీసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేల్చారు. 65 ఏళ్లు పైబడిన వారిలో రోజులో మూడు ప్రామాణిక మోతాదులకన్నా ఎక్కువ మోతాదు తీసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు.. 15-39 వయసు వారు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే రోజుకు ప్రామాణిక మోతాదులో 0.136 వంతు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే.. మహిళలకు రోజుకు 0.273గా ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
Mosquitoes: ఆ రంగుల బట్టలేసుకుంటే మాత్రం ‘అంతే’
సాయంత్రమైందంటే చాలు పరుగెత్తుకొస్తాయి దోమలు. చెవుల పక్కన చేరి వాటి భాషలో హలో చెబుతుంటాయి. కుట్టి కుట్టి రక్తాన్ని పీల్చేస్తుంటాయి. అంతటితో అయి పోతుందా.. లేనిపోని రోగాలను కూడా అంటి స్తాయి. అందుకే దోమ తెరలు, ఆల్ అవుట్లు, రకరకాల ప్రయోగాలతో దోమల్ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇవన్నీ సరే.. మనం ఎక్కడున్నా సరే అసలు దోమలు మన దగ్గరకే రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చాలా మంది అనుకునే ఉంటారు. తాజాగా శాస్త్రవేత్తలు కూడా ఇదే ఆలోచనపై పరిశోధన చేశారు. 4 రకాల రంగుల బట్టలు వేసుకుంటే దోమలు మనల్ని కాస్త తక్కువగా కుడతాయని, ఇంకో 4 రకాల రంగుల బట్టలేసుకుంటే మాత్రం ‘అంతే’ సంగతులని కనుగొన్నారు. ఆ రంగుల కథేంటో, దోమలు రంగులను ఎలా గుర్తిస్తు న్నాయో తెలుసుకుందాం. వాసన, రంగుతో పసిగట్టేసి.. మనుషులు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్, చెమట వాసన, శరీర ఉష్ణోగ్రతను గుర్తించాక నేరుగా మనుషుల దగ్గరకు దోమలు వస్తున్నాయని ఇదివరకే కనుగొన్నారు. తాజా పరిశోధనలో నాలుగో అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే ‘రంగు’. చెమట, కార్బన్ డై ఆక్సైడ్ వాసన గుర్తించనంత వరకు మనుషులున్నా, ఇంకేమున్నా దోమలు పట్టించుకోలేదని.. కానీ వాటి వాసనను పసిగట్టాక మాత్రం ఆ వాసన వస్తున్న వైపు ఎగురుతున్నాయని గుర్తించారు. అయితే ఇందులోనూ ఇంకో ఆసక్తికరమైన అంశాన్ని కనుగొన్నారు. వాసన వచ్చే ప్రాంతంలో ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగులవైపు దోమలు ఎక్కువగా వెళ్లాయని.. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగులను పట్టించుకోలేదని గమనించారు. మనుషుల శరీరం దోమలకు ఎరుపు–నారింజ రంగు రూపంలో కనిపిస్తుందని, అందుకే నేరుగా మన దగ్గరకు వచ్చేస్తాయని తెలుసుకున్నారు. మన శరీర ఛాయతో వాటికి సంబంధం లేదని, అన్ని శరీరాలూ వాటికి ఎరుపు–నారింజ రంగులోనే కనిపిస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగుల బట్టలు వేసుకుంటే మన శరీర రంగుకు ఆ బట్టల రంగు తోడై దోమలు మరింత ఎక్కువగా మన దగ్గరకు వస్తాయని అంటున్నారు. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగుల బట్టలు వేసుకుంటే కాస్త తక్కువగా ఆకర్షితమవుతాయని వివరిస్తున్నారు. ప్రయోగం ఎలా చేశారు? పరిశోధన కోసం ఒక్కో దోమను ఒక్కో టెస్ట్ చాంబర్లో పెట్టి మరీ శాస్త్రవేత్తలు పరీక్ష చేశారు. ఈ చాంబర్లలోకి రకరకాల వాసనలు పంపారు. అదే సమయంలో రకరకాల రంగులను ప్రదర్శించి చూశారు. ఎలాంటి వాసన లేనప్పుడు చాంబర్లో ఎలాంటి రంగును ప్రదర్శించినా దోమలు పట్టించుకోలేదు. కార్బన్ డై ఆక్సైడ్‌ను పంపాక ఆకుపచ్చ, నీలం, ఊదా రంగులను ప్రదర్శించినా పెద్దగా స్పందించలేదు. కానీ కార్బన్ డై ఆక్సైడ్‌తోపాటు ఎప్పుడైతే ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగులను ప్రదర్శించారో ఆ రంగుల వైపు వెళ్లడం గమనించారు. మామూలుగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు మంచి బిర్యానీ వాసన వస్తే ‘ఎక్కడినుంచబ్బా’ అని అటూ ఇటూ చూస్తాం. దోమలు కూడా కార్బన్ డై ఆక్సైడ్ వాసన రాగానే ‘వాటి బిర్యానీ’ ఎక్కడని చూస్తాయని శాస్త్రవేత్తలు సరదాగా చెప్పారు. శాస్త్రవేత్తలు తమ చేతికి రకరకాల గ్లోవ్స్ వేసుకొని కూడా పరిశీలించారని, అందులోనూ ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగు గ్లోవ్స్ వైపు దోమలు ఎక్కువగా వెళ్లాయని.. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగుల గ్లోవ్స్‌ను పట్టించుకోలేదని తెలిపారు. దోమలు వాటి ఆహారాన్ని ఎలా వెతుకుతాయో తెలుసుకోవడానికి ఇది తొలిమెట్టేనని, మనుషుల శరీరం నుంచి వచ్చే వాసనలను ఎలా అవి గుర్తిస్తున్నాయో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
ఒక్క పెగ్గే కదా అంటూ తాగేస్తున్నారా... అది కూడా ప్రాణాంతకమే!
Single Glass Of Alcohol Also Affects Atrial Fibrillation: ఒక్క పెగ్గు మద్యంతో నష్టం లేదు.. పైగా ఆరోగ్యానికి మంచిది అని చాలామంది భావిస్తుంటారు. అయితే ఒక్క స్మాల్ వేసుకున్నా సరే.. అది గుండెకు చేటే అంటోందీ తాజా పరిశోధన! ఆరోగ్యంపై మద్యం ప్రభావంపై చర్చ ఈ రోజు తాజాది కాదు. కాకపోతే చాలాకాలంగా అందరూ బలంగా విశ్వసించిన విషయం ఏమిటంటే.. ‘ఏదో.. అప్పుడప్పుడూ సరదా కొద్దీ... విందు భోజనం తరువాత కొంచెం ‘పుచ్చుకుంటే’ తప్పేమీ కాదు’ అన్నది! కానీ... కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక పరిశోధన మాత్రం అవన్నీ హంబగ్ అని తేల్చేసింది. వీరి లెక్క ప్రకారం.. ఒక్క డ్రింక్ తీసుకున్నా గుండె కొట్టుకోవడంలో తేడాలొచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. గుండె కొట్టుకునే తీరులో హెచ్చుతగ్గులు ఉంటే దాన్ని ఆట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆట్రియల్ ఫిబ్రిలేషన్ ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. ‘‘ఈ సమస్య తాగుబోతుల్లో ఎక్కువని ఒక అంచనా ఉండేది. కానీ ఒక డ్రింకు పుచ్చుకున్నా ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంది’’ అని తాజా పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవ్తేత గ్రెగరీ మార్కస్ చెబుతున్నారు. తాము వంద మంది రోగులపై పరిశోధన చేశామని, ఒక డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వారికి ఆట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం రెట్టింపు అయ్యిందని చెప్పారు. వీరు రెండో డ్రింక్ కూడా తీసుకుంటే ప్రమాదం మూడు రెట్లు పెరిగిందని అన్నారు. అయితే తాము పరిశోధనలు చేసిన వారు ముందుగానే ఈ సమస్యతో బాధపడుతున్న వారు కాబట్టి సాధారణ వ్యక్తుల్లో ఒక్క డ్రింక్ కూడా ప్రమాద హేతువు కావచ్చునని చెప్పవచ్చునని వారు వివరించారు. శషభిషలకు తావు లేకుండా... ముందుగా చెప్పుకున్నట్లు ఆరోగ్యంపై మద్యం ప్రభావాన్ని కచ్చితంగా లెక్కకట్టడం అంత సులువైన పనేమీ కాదు. పరిశోధనలో పాల్గొన్న వారు తాము ఎంత మద్యం పుచ్చుకున్నదీ స్పష్టంగా తెలియజేయాల్సి ఉండటం దీనికి ఒక కారణం. అంతేకాకుండా.. వారి జీవితాల్లోని ఇతర అంశా లను కూడా పరిగణనలోకి తీసుకుని తుది అంచనా వేయాల్సి ఉంటుంది. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ శషభిషలను, ఊహాగానాలను తొలగించేందుకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. పరిశోధనల్లో పాల్గొన్న వారు తరచూ తమ రక్తాన్ని స్వయంగా పరీక్షించుకునే ఏర్పాట్లు చేశారు. మధుమేహ పరీక్ష తరహాలో రక్తంలో మద్యం మోతాదును లెక్కకట్టారు. ‘‘ఫలితాలు చెప్పే విషయం ఒక్కటే.. మద్యం ఎంత ఎక్కువైతే.. ప్రమాదమూ అంతేస్థాయిలో పెరుగుతోంది’’ అని మార్కస్ వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు దశాబ్దాలుగా చాలామంది రోగులు చెప్పిన అంశాలకు దగ్గరగా ఉన్నాయని, కాకపోతే ఈసారి కచ్చితమైన లెక్కలతో తాము ఫలితాలను నిర్ధారించగలిగామని వివరించారు. తగినన్ని నీళ్లే ఆయుధం...! గుండెజబ్బులను నివారించేందుకు జీవనశైలి మార్పులు ఎంత అవసరమో.. తగినన్ని నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం. యూరప్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది రోజూ తగినన్ని నీళ్లు తాగడం లేదని, కనీసం ఒక్క గ్లాసు అదనంగా తాగినా గుండెసంబంధిత సమస్యలను అధిగమించవచ్చునని వీరు చెబుతున్నారు. ‘గుండె విఫలమయ్యేందుకు ఉన్న అవకాశాలను నివారించేందుకు లేదా ఆలస్యం చేసేందుకు నీళ్లు చాలా ఉపయోగపడతాయి’ అంటారు ఈ తాజా పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త నటాలియా దిమిత్రైవ. ప్రతిరోజూ పురుషులైతే మూడు లీటర్ల వరకూ నీరు తీసుకోవాలని, మహిళలైతే 1.6 నుంచి 2.1 లీటర్ల వరకూ ఉండాలని తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ చదవండి: National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే! -
కొలెస్ట్రాల్, గుండెకూ ‘చిరు’ రక్షణ! ఇక్రిశాట్ కొత్త స్టడీ
సాక్షి, హైదరాబాద్: చిరుధాన్యాలు రుచిగా ఉండటమే కాకుండా బరువు తగ్గేందుకు దోహదపడతాయని ఇటీవలే నిర్ధారించిన మెట్టప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) తాజాగా మరో కొత్త విషయాన్ని గుర్తించింది. చిరుధాన్యాలను తరచూ తినడం వల్ల శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌తో పాటు, హానికారక ట్రైగ్లిజరైడ్స్ మోతాదునూ తగ్గిస్తాయంది. వివిధ దేశాలకు చెందిన ఐదు సంస్థలు ఇక్రిశాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయయనంలో ఇప్పటికే జరిగిన 19 పరిశోధనల ఫలితాలను విశ్లేషించారు. ఫలితాలను ఫ్రాంటియర్స్ ఆఫ్ న్యూట్రిషన్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఊబకా యం, మధుమేహం, గుండె జబ్బులను ఆహారంతోనే నివారించే అవకాశాన్ని చిరుధాన్యాలు ఇస్తున్నందున వీటికి మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో తాము వాటి శాస్త్రీయ విశ్లేషణ చేపట్టామని ఇక్రిశాట్ తెలిపింది. చెడు కొవ్వులకు చెక్.. చిరుధాన్యాలను తరచూ తిన్నవారిలో మొత్తం కొలెస్ట్రాల్ మోతాదు 8% వరకు తగ్గిందని, అదే సమయంలో హానికారక లోడెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), ట్రైగ్లిజరాల్ కూడా 10% వరకు తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఫలితంగా అధ్యయనం చేసిన వ్యక్తుల కొవ్వు మోతాదులు అసాధారణ స్థాయి నుంచి సాధారణ స్థాయికి చేరాయని, పైగా చిరుధాన్యాలతో డయాస్టోలిక్ రక్తపోటు కూడా 7% వరకు తగ్గినట్లు అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎస్.అనిత తెలిపారు.బరువు తగ్గేందుకే కాకుండా గుండెకూ మేలు ∙చిరుధాన్యాలపై ఇక్రిశాట్ అధ్యయనంలో వెల్లడి తిండే కారణం: డాక్టర్ హేమలత గుండెజబ్బులు, మధుమేహం వంటివి పెరిగేందుకు అనారోగ్యకరమైన ఆహారం ప్రధాన కారణమని, చిరుధాన్యాలను తినడం ద్వారా ఈ సమస్యను కొంతమేరకైనా అధిగమించొచ్చని ఇక్రిశాట్ అధ్యయనంలో భాగం వహించిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. భారతీయుల ఆహారంలో చిరుధాన్యాలు ప్రధాన భాగం అయ్యేందుకు తద్వారా మధుమేహం, గుండెజబ్బులను తగ్గించేందుకు ఈ అధ్యయనం సాయపడుతుందని అన్నారు. కాగా, మెరుగైన వంగడాలు రూపొందిస్తే చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూగ్స్ తెలిపారు. ఇక్రిశాట్, ఎన్‌ఐఎన్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ (యూకే), జపాన్‌కు చెందిన కోబెయూనివర్సిటీలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయి. -
గుండె వేగంతో ‘డిప్రెషన్’ గుర్తింపు..
బెల్జియమ్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెజారిటీ ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రెటీల నుంచి సామాన్య జనాలను వేధిసున్న సమస్య డిప్రెషన్(మానసిక రుగ్మత). అయితే డిప్రెషన్‌ను ప్రారంభ దశలోనే ఎదుర్కోవాలి, లేకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వైద్యులు అనేక దశాబ్ధాలుగా కృషి చేస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు ఓ కొత్త అధ్యయనాన్ని వెల్లడించారు. కాగా డిప్రెషన్‌తో బాధపడే వ్యక్తులను గుర్తించాలంటే గుండె వేగాన్ని(24 గంటల పాటు) పరీక్షించాలని అధ్యయనం ద్వారా తేల్చారు. అయితే గుండె వేగం ద్వారా డిప్రెషన్‌కు సంబంధించిన చికిత్స పనిచేస్తుందో లేదో తెలుసుకోవచ్చని తెలిపారు. బెల్జియమ్కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్కీవెక్ నేతృత్వంలో అధ్యయనం చేశారు. కాగా ఇది వరకు కొందరు అధ్యయనకర్తలు గుండె వేగం ఎక్కువున్న వారు డిప్రెషన్‌తో బాధపడుతున్నట్ల తెలిపారు. కానీ కొంత అసంపూర్ణంగా ఉండేది. కానీ ప్రస్తుతం తాము పటిష్టమైన అధ్యయనం చేశామని 16మంది ఆరోగ్యవంతులు, 16మంది డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిని అధ్యయనానికి వాలంటీర్లుగా తీసుకున్నట్లు తెలిపారు. కాగా ప్రామాణిక అధ్యయనం చేసినట్లు డాక్టర్ స్కీవెక్ పేర్కొన్నారు. (చదవండి: ‘నువ్వు చచ్చిపోతే ఒక రోజు వార్తలో ఉంటావు’) -
9 కోట్ల కొలువులు అవసరం!
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగార్ధులు ఏటా జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తుండటంతో 2022 నుంచి 2030 వరకూ ఎనిమిదేళ్లలో 9 కోట్ల మంది అదనంగా ఉద్యోగ వేటలో ఉంటారని మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ (ఎంజీఐ) అంచనా వేసింది. వీరందరికీ ఉద్యోగాలు దక్కాలంటే భారత్ ఏటా 8 నుంచి 8.5 శాతం మధ్య వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని పేర్కొంది. మారుతున్న పరిస్థితుల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగి 5.5 కోట్ల మంది మహిళలు ఉద్యోగాన్వేషణలో ఉంటారని, వీరి సంఖ్య అదనమని ఎంజీఐ పేర్కొంది. ఇంతటి పెద్దసంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చేందుకు భారీ సంస్కరణలు చేపట్టడం అనివార్యమని, లేనిపక్షంలో పదేళ్ల గరిష్టస్ధాయిలో ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత నెలకొంటుందని హెచ్చరించింది. ప్రస్తుత జనాభా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా రాబోయే సంవత్సరాల్లో 6 కోట్ల మంది కొత్తగా శ్రామిక శక్తిలో కలుస్తారని, మరో 3 కోట్ల మంది వ్యవసాయ పనుల నుంచి వ్యవసాయేతర, ఉత్పాదక రంగాలకు మళ్లుతారని ‘భారత్‌లో కీలక మలుపు -వృద్ధి,ఉద్యోగాల కోసం ఆర్థిక అజెండా’ పేరిట ఎంజీఐ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 అనంతరం 2029-30 వరకూ వ్యవసాయేతర ఉద్యోగాల్లో ఏటా 1.2 కోట్ల ఉద్యోగాల వృద్ధి కీలకమని పేర్కొంది. 2012-18 వరకూ ఏటా కేవలం 40 లక్షల ఉద్యోగాలే అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. ఉత్పాదక, వ్యవసాయ ఎగుమతులు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో గ్లోబల్ హబ్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పోటీతత్వాన్ని పెంచడం, రవాణా, విద్యుత్ రంగాలను పటిష్టపరచడం కీలకమని నివేదిక తెలిపింది. నూతన జీవన, పని విధానాలు, షేరింగ్ ఎకానమీ, ఆధునీకరించబడిన రిటైల్ వ్యవస్థ వంటి వినూత్న విధానాలకు మళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చదవండి : ఉద్యోగాలేవీ?: రాహుల్ -
‘లాక్డౌన్ ఎత్తివేస్తే విశృంఖలమే’
సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తే కరోనా వైరస్ కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తాయని ఎయిమ్స్ నేతృత్వంలో చేపట్టిన అథ్యయనం హెచ్చరించింది. కోవిడ్-19 కేసులు ముమ్మర దశకు చేరిన మీదట విస్తృతంగా టెస్టులు నిర్వహించిన అనంతరమే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడం మేలని ఎయిమ్స్ వైద్యులు గిరిధర గోపాల్ పరమేశ్వరన్, మోహక్ గుప్తా, సప్తర్షి సోహన్ మహంత నేతృత్వంలో సాగిన అథ్యయనం పేర్కొంది. లాక్డౌన్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందేందుకు భారత్ మరికొంత కాలం వేచిచూడాలని సూచించింది. ఈలోగా భారత్ వైద్య మౌలిక వసతులు సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. రోజువారీ కరోనా వైరస్ కేసుల్లో ఎలాంటి తగ్గుదల లేదని, ఇలాంటి పరిస్థితిలో లాక్‌డౌన్‌కు భారీ సడలింపుల వల్ల వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతాయని అథ్యయనం వెల్లడించింది. చదవండి : మరింత అప్రమత్తంగా ఉండాలి : మోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఒక్కసారిగా పూర్తిగా ఎత్తివేయడం సరైనది కాదని, దీంతో మహమ్మారి కేసులు పెరుగుతాయని నిర్ధిష్ట కాలం లాక్‌డౌన్‌ను పొడిగిస్తే చురుకైన కేసులు ముమ్మరమై క్రమంగా క్షీణ దశకు చేరుకునే క్రమంలో దశలవారీగా లాక్‌డౌన్‌ను ఉపసంహరించాలని అథ్యయనం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే తాజా కేసుల (రెండో దశ)ను జాప్యం చేయవచ్చని దీంతో ప్రభుత్వం వైద్యారోగ్య మౌలిక వసతులను పెంచుకునేందుకు సమయం లభిస్తుందని పేర్కొంది. -
కోవిడ్ -19 : రోజు గడిచేదెట్టా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలు కరోనా మహమ్మారి కంటే ఈ వ్యాధి ప్రభావంతో ఎదురయ్యే ఆర్థిక సంక్షోభం గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని తాజా సర్వే స్పష్టం చేసింది. లాక్డౌన్లో ప్రజల మనోగతంపై సీఎంఈఈ ఆధ్వర్యంలో ఐఐఎం లక్నో ఈ సర్వే చేపట్టింది. 23 రాష్ట్రాల్లోని 104 నగరాల్లో ఈ అథ్యయనం పలువురిని పలుకరించింది. వీరిలో అత్యధికులు లాక్‌డౌన్‌తో తలెత్తే ఆర్థిక సమస్యలపైనే ఆందోళన చెందుతున్నామని చెప్పినట్టు వెల్లడైంది. ఇక లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజల ప్రవర్తన హేతుబద్ధంగా ఉండబోదనే భయం వెంటాడుతోందని మరికొందరు తెలిపారు. మహమ్మారి ప్రభావంతో ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయని అత్యధికంగా 32 శాతం మంది ఆందోళన చెందగా, లాక్డౌన్లో ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై 15 శాతం మంది స్పందించారు. ఇక వైరస్ సోకుతుందనే భయంతో ఉన్నామని చెప్పినవారు కేవలం 14 శాతం కావడం గమనార్హం. చదవండి : వృద్ధ జంటకు సానియా, అనుష్క ఫిదా మరోవైపు వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రతి 5గురిలో ముగ్గురు సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 25-మే 3 మధ్య లాక్డౌన్ అమలవుతున్న వ్యవధిలో ఫేస్బుక్, లింక్డ్డిన్ వంటి సామాజిక మాథ్యమాలపై ఆన్లైన్లో ఈ అథ్యయనం చేపట్టామని సీఎంఈఈ వెల్లడించింది. -
5 కోట్ల మందికి మహమ్మారి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో భారత్‌లో 5 కోట్ల మందికి పైగా అల్పాదాయ, మధ్యతరగతి ప్రజలు సరైన రీతిలో చేతులు పరిశుభ్రపరుచుకునే సదుపాయానికి నోచుకోలేదని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. మెరుగైన హ్యాండ్‌వాషింగ్ సదుపాయం లేని వీరందరికీ కోవిడ్-19 ముప్పు పొంచిఉందని హెచ్చరించింది. శుభ్రమైన నీరు, సబ్బు అందుబాటులో లేని కారణంగా అల్పాదాయ, మధ్యశ్రేణి రాబడి కలిగిన దేశాల్లోని 200 కోట్ల మంది ప్రజలకు కోవిడ్-19 సంక్రమించే ముప్పు అధికమని వాషింగ్టన్కు చెందిన హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ (హెచ్ఎంఈ) సంస్థ పరిశోధకులు వెల్లడించారు. 46 దేశాల్లో సగానికి పైగా జనాభాకు సబ్బు, సురక్షిత నీరు అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఇక భారత్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, ఇథియోపియా, కాంగో, ఇండోనేషియాల్లో ప్రతి దేశంలో 5 కోట్ల మందికి సరైన హ్యాండ్‌వాషింగ్ సదుపాయం అందుబాటులో లేదని అంచనా వేసింది. కోవిడ్-19 సంక్రమణను అడ్డుకునేందుకు కీలకమైన చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే కనీస సదుపాయం వర్ధమాన దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలకు కొరవడిందని ఐహెచ్ఎంఈ ప్రొఫెసర్ మైఖేల్ బ్రౌర్ అన్నారు. హ్యాండ్ శానిటైజర్లు, మంచినీటి ట్యాంకర్ల సరఫరా అనేది తాత్కాలిక ఉపశమనమేనని, కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని చెప్పారు. చేతులను సరైన రీతిలో పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో ఏటా ఏడు లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. 1990 నుంచి 2019 మధ్య సౌదీ అరేబియా, మొరాకో, నేపాల్, టాంజానియా వంటి దేశాలు తమ ప్రజల్లో పారిశుద్ధ్యంపై మెరుగైన అవగాహన కల్పించడంలో విజయం సాధించాయని పరిశోధకులు పేర్కొన్నారు. చదవండి : కరోనా వార్డు: బికినీలో నర్సు సేవలు -
ఇమ్యూనిటీతోనే మహమ్మారికి చెక్
లండన్ : పెద్దసంఖ్యలో ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోగలగడం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని, వాతావరణ మార్పులతో దీన్ని నియంత్రించలేమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. వేడి, శీతల వాతావరణం కరోనా మహమ్మారి వ్యాప్తిపై ప్రభావం చూపవని తెలిపింది. కోవిడ్-19 తొలి దశ వ్యాప్తిని ప్రస్తుత వేసవి గణనీయంగా నియంత్రిస్తుందని తమ అథ్యయనంలో వెల్లడి కాలేదని ప్రిన్స్టన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. గట్టి నియంత్రణ చర్యలు చేపట్టకుండా అధిక ఉష్ణోగ్రతలు, వేసవి వాతావరణం వైరస్ వృద్ధిని పరిమితం చేయబోవని సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అథ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇప్పటికీ వైరస్ ప్రభావానికి లోనయ్యే ముప్పును కలిగిఉన్నారని పరిశోధకులు హెచ్చరించారు. ప్రస్తుత ఇన్ఫెక్షన్ రేటు వృద్ధిలో వాతావరణ పరిస్ధితుల వల్ల ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదని గుర్తించామని చెప్పారు. వైరస్‌ను ఎదుర్కోగల రోగనిరోధక శక్తిని పెద్దసంఖ్యలో ప్రజలు అందిపుచ్చుకుంటేనే వాతావరణం ప్రభావం దానిపై ఉంటుందని, కోవిడ్-19 విషయంలో ప్రజలకు ఇంకా ఇలాంటి ఇమ్యూనిటీ లేదని అథ్యయనం స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అథ్యయన రచయిత డాక్టర్ రాచెల్ బెకర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ లేకపోవడంతో పాటు భౌతిక దూరం పాటించని క్రమంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టదని స్పష్టం చేశారు. చదవండి : అమెరికా వెంటిలేటర్లు వచ్చేస్తున్నాయ్.. -
మహమ్మారితో ఆ‘పరేషాన్’లు..
లండన్ : కోవిడ్-19 ప్రభావంతో భారత్‌లో 5,80,000కు పైగా సర్జరీలు రద్దవడం లేదా జాప్యానికి గురయ్యాయని అంతర్జాతీయ కన్సార్షియం చేపట్టిన అథ్యయనం అంచనా వేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆస్పత్రి సేవలకు 12 వారాల పాటు తీవ్ర అంతరాయం నెలకొన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలు రద్దవడం లేదా వాయిదా పడవచ్చని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీలో ప్రచురితమైన అథ్యయనం పేర్కొంది. దీంతో రోగులు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సర్జికల్ కేర్‌పై కోవిడ్-19 ప్రభావం గురించి 120 దేశాలకు చెందిన 5000 మంది సర్జన్లతో కూడిన కోవిడ్సర్జ్ కొలాబరేటివ్ ఈ పరిశోధనను నిర్వహించింది. బ్రిటన్, అమెరికా, భారత్, ఇటలీ, మెక్సికో, నైజీరియా, దక్షిణాఫ్రికాకు చెందిన సభ్యుల నేతృత్వంలో ఈ అథ్యయనం సాగింది. ఆస్పత్రి సేవలకు అదనంగా ఏ ఒక్క వారం విఘాతం కలిగినా మరో 24 లక్షల సర్జరీలు వాయిదా పడటమో, రద్దవడమో జరుగుతాయని అథ్యయనం స్పష్టం చేసింది. 71 దేశాల్లోని 359 ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ సహా ఇతర పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. చదవండి : మరో సరికొత్త ఆవిష్కరణ కోవిడ్-19 అవాంతరాలతో ప్రపంచవ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన 72.3 శాతం సర్జరీలు రద్దవుతాయని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సరేతర ఆపరేషన్లే వీటిలో అధికంగా ఉంటాయని వెల్లడించారు. ఇక భారత్‌లో కోవిడ్-19 కలకలంతో 12 వారాల సమయంలో 5,84,737మంది రోగులకు ఆపరేషన్లు వాయిదా పడ్డాయని అథ్యయనం అంచనా వేసింది. ఇక ఈ 12 వారాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 63 లక్షల ఆర్ధోపెడిక్ ఆపరేషన్లు రద్దయ్యాయని పరిశోధకులు పేర్కొన్నారు. -
లాక్‌డౌన్‌తో 80 శాతం కుటుంబాలు కుదేలు..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో గత నెలలో దాదాపు 84 శాతం భారతీయ కుటుంబాల రాబడి గణనీయంగా పడిపోయిందని, ప్రభుత్వ ఊతం లేకుండా వీరిలో చాలా మంది ఎక్కువ కాలం మనుగడ సాగించలేరని తాజా అథ్యయనం వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పీవీటీ (సీఎంఐఈ) ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లోని 5800 కుటుంబాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి చికాగో బూత్స్ రుస్టాండీ సెంటర్ ఫర్ సోషల్ సెక్టార్ ఇన్నోవేషన్ ఈ వివరాలు వెల్లడించింది. సుదీర్ఘ లాక్‌డౌన్‌తో గ్రామీణ భారతం బారీగా దెబ్బతిన్నదని పరిశోధకులు పేర్కొన్నారు. లాక్డౌన్ తీవ్రతతో త్రిపుర, చత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, హరియాణా రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని తెలిపారు. సర్వే పలకరించిన వారిలో 34 శాతం మంది తమకు అదనపు సాయం అందకుంటే మరో వారానికి మించి మనుగడ సాగించలేమని తెలపడం ఆందోళనకరమని అథ్యయనం పేర్కొంది. అల్పాదాయ వర్గాలు లాక్‌డౌన్‌తో అధికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించిన తర్వాత 10 కోట్ల మంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారని సీఎంఐఈ సహా ఇతర అథ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి : ఎంజాయ్ చేసేందుకు ఇక్కడకు రావొద్దు: సీఎం -
కీలక అవయవాలపై మహమ్మారి దాడి..
న్యూయార్క్ : కరోనా మహమ్మారి మానవ శరీరంలో ఊపిరితిత్తులు, గొంతు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, పేగులు సహా అన్ని కీలక అవయవాలను ఇన్ఫెక్షన్కు గురిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఊపిరితిత్తులే కాకుండా అన్ని అవయవాలపై వైరస్ దాడి చేస్తుందని దీంతో కోవిడ్-19 లక్షణాలు సైతం బహుముఖంగా ఉంటాయని రెండు వేర్వేరు నివేదికలు వెల్లడించాయి. కరోనా రోగుల్లో లక్షణాలపై ఈ అథ్యయన వివరాలు స్పష్టతను తీసుకువచ్చాయి. మహమ్మారి దాడితో యువతలో స్ట్రోక్‌కు దారితీసేలా బ్లడ్ క్లాట్స్ ఏర్పడం, విపరీతమైన తలనొప్పి, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర లక్షణాలు కపిపిస్తాయని వెల్లడించింది. శ్వాసకోశ వైరస్‌గా పేరొందిన కోవిడ్-19 రోగి నోటి నుంచి వెలువడే తుంపరల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కొన్ని సార్లు డయేరియాకు దారితీయడంతో పాటు పేగు, జీర్ణవ్యవస్థలో ఇబ్బందుల వంటి ఇతర లక్షణాలతోనూ కూడి ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. రోగుల మలంలోనూ వైరస్ జాడను శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్-కోవిడ్-2 వాహకంగా జీర్ణవ్యవస్థ మారవచ్చని నేచర్ మెడిసిన్‌లో ప్రచురితమైన జీఝూ, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకులు చేపట్టిన అథ్యయనం పేర్కొంది. ఇక మానవ శరీరంలోని కీలక అవయవాలన్నింటిలో వైరస్ ఆనవాళ్లను గుర్తించామని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన మరో అథ్యయనం వెల్లడించింది. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఆ ఛాన్స్ -
కోవిడ్-19 : ఆ మందు ప్రభావంపై షాకింగ్ సర్వే!
న్యూయార్క్ : కరోనా మహమ్మారి చికిత్సలో మలేరియాకు వాడే హ్రైడాక్సీక్లోరోక్వీన్ బాగా పనిచేస్తుందన్న ప్రచారంలో పసలేదని వెల్లడైంది. ప్రామాణిక వైద్య చికిత్సతో పోలిస్తే ఈ మందు ప్రభావం పరిమితమే కాకుండా ప్రాణ నష్టం అధికంగా వాటిల్లుతోందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. హైడ్రాక్సీక్లోరోక్వీన్ అమెరికన్ సీనియర్ సైనిక సిబ్బందిపై ఎలాంటి ప్రభావం చూపిందని ప్రభుత్వ నిధులతో సాగిన ఈ అథ్యయన వివరాలను మెడికల్ ప్రీప్రింట్ సైట్లో పొందుపరిచారు. ఈ అథ్యయనానికి పలు పరిమితులున్నా కరోనాను ఎదుర్కొనేందుకు హైడ్రాక్లీక్లోరోక్వీన్ పరమౌషధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా నమ్ముతున్న క్రమంలో ఈ మందు ఫలితాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా ఆగస్ట్ 11 వరకూ కరోనా బారినపడి మరణించిన వారు, డిశ్చార్జి అయిన 368 మంది సీనియర్ సిటిజన్ల వైద్య రికార్డులను పరిశీలించి పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను తీసుకున్న రోగుల్లో మరణాల రేటు 28 శాతం ఉండగా, యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్‌తో కలిపి ఈ మందును తీసుకున్న వారిలో మరణాల రేటు 22 శాతంగా నమోదైంది. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనా వైరస్‌పై సమర్ధంగా పోరాడుతుందని ఫ్రెంచ్ శాస్త్రవేత్త దీదీర్ రౌల్ట్ వెల్లడించడంతో ఈ డ్రగ్‌పై ఆసక్తి పెరిగింది. ఇక ప్రామాణిక వైద్యం పొందిన రోగుల్లో మరణాల రేటు 11 శాతమే ఉండటం గమనార్హం. ఈ అథ్యయనాన్ని ర్యాండమ్‌గా చేపట్టకుండా, ఇప్పటికే ముగిసిన కేసుల రికార్డులను పరిశీలించడం ద్వారా నిర్వహించడం ఈ సర్వేకున్న పరిమితుల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పరిశోధకులు పరిశీలించిన రోగుల్లో అత్యధికులు 65 సంవత్సరాలు దాటిన పురుషులు కాగా వారు అప్పటికే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు కావడంతో ఈ ఫలితాలను సార్వజనీనంగా పరిగణించలేం. చదవండి : కరోనా: ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్! కాగా హృదయ స్పందనల్లో ఇబ్బందులు ఉన్నవారికి, గుండె జబ్బులతో బాధపడేవారికి హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇవ్వడం రిస్క్ అని అంతకుముందు పలు అథ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను మలేరియా చికిత్సతో పాటు ఆటోఇమ్యూన్ డిజార్డర్లకు, ఆర్ధరైటిస్ చికిత్సకు దశాబ్ధాలుగా వాడుతున్నారు. కరోనా మహమ్మారికి చికిత్సలో ఈ మందు వాడకంపై పెద్దసంఖ్యలో రోగులకు, ర్యాండమ్ పద్ధతిలో క్లినికల్ ట్రయల్స్‌ను వైద్యుల పర్యవేక్షణలో సాగిస్తేనే కచ్చితమైన ఫలితాలు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, యూరప్, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాల్లో ఈ తరహా అథ్యయాలు సాగుతున్నాయి. -
కోవిడ్-19 : మరణాల రేటు ఎంతంటే..
లండన్ : కరోనా వైరస్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తుండగా తాజా సర్వేలో ఈ మహమ్మారితో ముందుగా అంచనా వేసిన స్ధాయిలో ప్రాణాలకు ముప్పు ఉండదని వెల్లడైంది. కరోనా వైరస్ మరణాల రేటు ఇప్పటివరకూ వేసిన అంచనాల కంటే చాలా తక్కువగా ఉంటుందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అథ్యయనం పేర్కొంది. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన వారితో పాటు ఈ మహమ్మారికి కేంద్ర బిందువుగా మారిన వుహాన్‌లో రాకపోకలు సాగించిన వారిపై బ్రిటిష్ పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. చైనాలో కరోనా వైరస్ కేసులను సమగ్రంగా విశ్లేషించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. కరోనా వైరస్ నిర్ధారణ అయిన, నిర్ధారణ కాని కేసులన్నింటిలో మరణాల రేటు కేవలం 0.66 శాతంగా ఈ అథ్యయనం గుర్తించింది. నిర్ధారణైన కోవిడ్-19 కేసుల్లో మరణాల రేటు 1.38 శాతంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్ నిర్ధారించిన కేసుల్లో మరణాల రేటును గతంలో అధికారులు 2 నుంచి 8 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేయడం గమనార్హం. ఇక మొత్తం కేసుల్లో మరణాల రేటును 0.2 నుంచి 1.6 శాతంగా అంచనా వేయగా తాజా సర్వేలో ఇది 1.38 శాతంగా వెల్లడైంది. ఇక వయసుల వారీగా చూస్తే 80 ఏళ్ల పైబడిన వారిలో వైరస్ నిర్ధారణ అయితే వారిలో 20 శాతం మందికి ఆస్పత్రిలో చికిత్స అవసరమని, అదే 30 ఏళ్లలోపు వైరస్ రోగుల్లో కేవలం 1 శాతం మందికే ఆస్పత్రుల్లో చికిత్స అవసరమని తాజా సర్వే పేర్కొంది. వయసుమళ్లిన వారు అధికంగా ఉండే దేశాలకు కరోనా వైరస్ కారణంగా ముప్పు అధికంగా ఉంటుందని ఈ అథ్యయనం వెల్లడించింది. గత అంచనాల కన్నా కోవిడ్-19తో మరణాల రేటు తాజా అథ్యయనంలో తక్కువగా ఉన్నా ఈ వైరస్ గతంలో వచ్చిన వాటికంటే పలు రెట్లు ప్రాణాంతకమేనని ఈ అథ్యయనం హెచ్చరించింది. చదవండి : కోవిడ్‌కు మందు కనుగొన్నాం -
‘ఇలాగైతే అమెరికాలో 22 లక్షల మరణాలు’
లండన్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విధ్వంసంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పలు దేశాలు ఈ మహమ్మారి బారినపడి విలవిలలాడుతున్నాయి. కరోనా విజృంభణపై లండన్ ఇంపీరియల్ కాలేజ్ జీవగణితం ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ నేతృత్వంలోని బృందం చేపట్టిన అథ్యయనం మహమ్మారి ఏస్ధాయిలో మానవాళిని కబళిస్తుందో కళ్లకు కట్టింది. కరోనా భారీగా విస్తరించిన ఇటలీలోని తాజా డేటాను విశ్లేషిస్తూ ఈ అథ్యయనం రాబోయే రోజుల్లో పరిణామాలను అంచనా వేసింది. కొవిడ్-19ను 1918లో వ్యాపించిన ఫ్లూతో పోల్చిన అథ్యయనం కరోనాను కట్టడి చేసే చర్యలు కొరవడటంతో అమెరికాలో 22 లక్షల మంది, బ్రిటన్‌లో 5 లక్షల మంది మరణిస్తారని పేర్కొంది. మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి అనుమానిత కేసులను ఇంటి వద్దే ఒంటరిగా ఉంచడం వంటి చర్యలు ఫలితాలను ఇచ్చినా ముందస్తుగా జనజీవనంపై ఆంక్షలు విధించకపోవడంతో 2,50,000 మంది మరణిస్తున్నారని, ఆరోగ్య వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తున్నాయని అధ్యయనం తెలిపింది. ప్రజలు ఎక్కువగా కలిసే థియేటర్లు, మాల్స్, క్లబ్‌లు, పబ్‌లను మూసివేయడం, సామాజిక దూరం పాటించడం వల్ల ఈ మహమ్మారి విస్తృత వ్యాప్తిని కట్టడి చేయవచ్చని తెలిపింది. ఈ చర్యలు సామాజికంగా, ఆర్థికంగా మనపై భారీ ఒత్తిడిని కలిగిస్తాయని ఈ అథ్యయనంలో ఫెర్గూసన్‌తో కలిసి పనిచేసిన ఎపిడెమాలజీ ప్రొఫెసర్ అజ్రా ఘని అన్నారు. కాగా ఈ అథ్యయనంలో పేర్కొన్న అంచనాలు గడ్డుకాలం ముందుందనే సంకేతాలు పంపుతోందని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ఎపిడెమాలజీ నిపుణులు టిమ్ కొలబన్ హెచ్చరించారు. ఇక ఈ అథ్యయనంతో బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిపుణుల సూచనలను ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలో పొందుపరుస్తామని పేర్కొంది. బొరిస్ జాన్సన్ సారథ్యంలోని బ్రిటన్ ప్రభుత్వం కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సరైన చర్యలు చేపట్టలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఈ అథ్యయనం వివరాలు వెలువడటం గమనార్హం. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించడం వంటి చర్యలు చేపట్టగా బ్రిటన్ ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు చోటుచేసుకున్నాయి. చదవండి : చికెన్‌తో కరోనా అని నిరూపిస్తే రూ. కోటి బహుమతి -
ఈ ఫుడ్‌తో క్యాన్సర్‌కు చెక్..
లండన్ : ఉల్లిగడ్డలు, అరటి, వెల్లుల్లి వంటి ప్రిబయాటిక్స్తో క్యాన్సర్ పెరుగుదలను నిరోధించవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. ఎలుకలపై చేసిన ప్రయోగంలో ప్రిబయాటిక్స్ వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసినట్టు పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ శరీరంలోని మరిన్ని కణాలకు విస్తరించిన క్రమంలో వ్యాధి పురోగతిని ఇవి నియంత్రించినట్టు కనుగొన్నారు. మానవులపై ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రిబయాటిక్స్ అత్యున్నత క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. కణితి నిరోధక ఇమ్యూనిటీని పెంచడం ద్వారా ప్రిబయాటిక్స్ క్యాన్సర్ వృద్ధిని అడ్డుకుంటాయని తొలిసారిగా తమ అథ్యయనంలో తేలిందని సెల్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన అథ్యయన రచయిత డాకట్ర్ జీవ్ రొనాయ్ పేర్కొన్నారు. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించి క్యాన్సర్‌పై దాడి చేసే సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పుకొచ్చారు. ఇక ప్రీబయాటిక్స్ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరీయాకు దోహదకారిగా ఉంటాయని ఎముకలు బలం పుంజుకునేందుకు అవసరమైన కాల్షియమ్ను శరీరం సంగ్రహించేందుకు అనుకూలంగానూ పనిచేస్తాయని వెల్లడైంది. ఒత్తిడికి గురయ్యే వారి అలసటను నిరోధించి మంచి నిద్రను ఆస్వాదించేందుకూ ఇవి ఉపకరిస్తాయని మరో అథ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. చదవండి : అన్ని రకాల కేన్సర్లకు ఒక్క మందు? -
ఎఫ్బీ పోస్టులతో జాబ్‌కు ఎసరు..
వాషింగ్టన్ : ఫేస్బుక్ ప్రొఫైల్‌లో వివాదాస్పద అంశాలపై మీ అభిప్రాయాలను వెల్లడించే పోస్ట్‌లు ఉంటే మీకు ఉద్యోగం లభించే అవకాశం సన్నగిల్లినట్టేనని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. సోషల్ మీడియా పోస్టుల్లో మితిమీరి తలదూర్చడం, నిర్థిష్ట అభిప్రాయాలను కలిగి ఉండే అభ్యర్ధులను రిక్రూటర్లు ఎంపిక చేసుకునే అవకాశాలు తక్కువని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్‌ను ప్రోత్సహించే కంటెంట్‌ను పోస్ట్ చేసే వారిని కూడా తమ ఉద్యోగులుగా రిక్రూటర్లు నియమించుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెలెక్షన్ అండ్ అసెస్మెంట్లో ప్రచురితమైన ఈ అథ్యయనం గుర్తించింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయని, తమ గురించి మిగిలిన ప్రపంచానికి తెలియచేస్తాయనే భావన ఉన్నా తమ వ్యక్తిగత ఆసక్తులు, ప్రతిభపై అమితాసక్తిని కనబరిచే వారు ఇతర ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాల కోసం త్యాగం చేసే స్వభావం తక్కువగా కలిగి ఉంటారని హైరింగ్ మేనేజర్లు అభిప్రాయపడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. ఇక వివాదాస్పద అంశాలపై భిన్న ఉద్దేశాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు సహకార ధోరణితో సర్ధుకుపోయే స్వభావం కలిగిఉండరని, వాదన ధోరణిని కలిగిఉంటారనే అభిప్రాయం రిక్రూటర్లలో నెలకొందని విశ్లేషించారు. ఇక మద్యం, డ్రగ్ వాడకంపై పోస్ట్‌లు చేసేవారు ఒక ఉద్యోగంలో కుదురుగా ఉండరని రిక్రూటర్లు భావిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. చదవండి : నువ్వే నా సర్వస్వం - ఫేస్బుక్ సీవోవో -
బీరు, వైన్లతో ఆ రిస్క్..
లండన్ : మద్యం అతిగా సేవించే వారి మాటతడబడటం, చూపు మసకబారడం చూస్తుంటాం. అయితే ఆల్కహాల్ మెదడు వయసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది నిర్ధిష్టంగా వెల్లడికాని క్రమంలో తాజా అథ్యయనం సరికొత్త అంశాలను ముందుకు తెచ్చింది. మద్యం తీసుకునే మోతాదును బట్టి మెదడు వయసు పెరుగుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. నిత్యం మద్యం సేవించే 45 నుంచి 81 సంవత్సరాల మధ్య వయసున్న 11,600 మందిపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెలుగుచూశాయి. రోజూ ఒక బీరు లేదా గ్లాస్ వైన్‌ను మించి అదనంగా తీసుకునే ప్రతి గ్రాముతో వారి మెదడు క్రమంగా కుచించుకుపోతున్నట్టు ఈ అథ్యయనం నిగ్గుతేల్చింది. రోజులో అదనంగా తీసుకునే ప్రతి గ్రాము ఆల్కహాల్‌తో వారి మెదడు రోజున్నరతో సమానమైన 0.02 సంవత్సరాల వయసు మీరుతుందని పరిశోధకులు గుర్తించారు. మద్యపానం, పొగతాగడం మెదడు వయసుమీరడానికి దారితీస్తుందనేది తొలిసారిగా కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ సదరన్ కాలిపోర్నియా పరిశోధకులు నిర్ధారించారు. రోజూ మద్యం సేవించే వారి మెదడు మద్యం తక్కువగా లేదా అసలు ముట్టని వారి మెదడు వయసుల మధ్య వ్యత్యాసాన్ని ఎంఆర్ఐ ద్వారా పరిశోధకులు పరిశీలించారు. ఒక గ్లాస్ వైన్, పింట్ బీరుకు మించి అదనంగా తీసుకునే ప్రతి గ్రాము ద్వారా మద్యపాన ప్రియుల మెదడు 0.02 సంవత్సరాలు వయసు మీరుతున్నట్టు వారు లెక్కగట్టారు. పొగతాగేవారిలోనూ ఇదే ఫలితాలు కనిపించాయని పరిశోధకులు పేర్కొన్నారు. చదవండి : చుక్కేశారు.. చిక్కేశారు...ఎక్కేశారు... -
మరో ఎనిమిదేళ్లలో రోబోటిక్ గుండె..
లండన్ : హృద్రోగాలకు అత్యాధునిక పద్ధతుల్లో చికిత్సలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో 2028 నాటికి గుండె మార్పిడి స్ధానంలో రోబోటిక్ హార్ట్‌ను అమర్చే ప్రక్రియ ఊపందుకోనుంది. ఈ దిశగా నెదర్లాండ్స్, కేంబ్రిడ్జి, లండన్‌లకు చెందిన వైద్య నిపుణులు సాఫ్ట్ రోబోట్ హార్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మూడేళ్లలోగా జంతువుల్లో తొలి నమూనాగా దీన్ని ఇంప్లాంట్ చేసే లక్ష్యంతో వారు పరిశోధనలు ముమ్మరం చేశారు. గుండె జబ్బుల చికిత్సను కొత్తపుంతలు తొక్కించే ఆవిష్కరణలకు ఇచ్చే 30 మిలియన్ యూరోలు చెల్లించే ప్రైజ్‌కు ఎంపికైన నాలుగు ప్రాజెక్టుల్లో రోబోటిక్ హార్ట్ ఒకటిగా ఎన్నికైంది. రోటోటిక్ హార్ట్‌తో పాటు గుండె జబ్బుకు వ్యాక్సిన్ రూపకల్పన, గుండె లోపాలను సరిచేసే జన్యు చికిత్స, గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, స్ర్టోక్స్ను ముందే పసిగట్టే వేరబుల్ టెక్నాలజీలు ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపికయ్యాయి. ఈ బహుమతిని స్పాన్సర్ చేస్తున్న బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు40 దేశాల నుంచి 75 దరఖాస్తులు అందాయి. ఇక పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న రోబోటిక్ గుండె శరీరమంతటికీ రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. మానవులకు ఈ గుండెను అమర్చే ప్రక్రియ మరో ఎనిమిదేళ్లలో అంటే 2028 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశోధకులు శ్రమిస్తున్నారు. చదవండి : 9.7 కి.మీ.. 12 నిమిషాలు -
ఈ ఏడాది ఆ టెకీలకు పండగే..
బెంగళూర్ : నూతన టెక్నాలజీల రాకతో ఆయా సాంకేతికతపై పట్టున్న అభ్యర్ధులకు భారీ వేతనాలతో ఉపాధి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ ఏడాది డేటా సైన్స్‌లో లక్షకు పైగా ఉద్యోగాలు రానున్నాయని, ఇది గత ఏడాది కంటే 62 శాతం అధికమని ఓ ఎడ్యుటెక్ సంస్థ నివేదిక పేర్కొంది. ఐదేళ్లలోపు అనుభవం కలిగిన వారికే ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. డేటా సైన్స్‌లో పనిచేసే ప్రొఫెషనల్స్, ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు, సీనియర్ మేనేజర్లతో విస్తృతంగా చర్చించిన మీదట ఎడ్యుటెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ ఈ అంచనాకు వచ్చింది. సరైన నైపుణ్యాలు కొరవడిన క్రమంలో 2019లో ఎనలిటిక్స్, డేటా విభాగాల్లో 97,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. డేటా సైన్స్‌తో కూడిన ఉద్యోగాలకు ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇంధన, ఫార్మా, హెల్త్‌కేర్, ఈకామర్స్ సహా పలు రంగాల్లో డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా డిజిటల్ ఎకానమీ ఎదుగుదల నేపథ్యంలో కంపెనీలు అమ్మకాలు పెంకచుకునేందుకు, వినియోగదారులను మెరుగ్గా అర్ధం చేసుకునేందుకు డేటా సైన్స్ ప్రాధాన్యత పెరిగింది. విస్తృతంగా డేటా అందుబాటులోకి రావడంతో వ్యాపారాభివృద్ధికి డేటా సైన్స్ విభాగం కీలకంగా మారిందని గ్రేట్‌లెర్నింగ్ కో ఫౌండర్ హరి కృష్ణన్ నాయర్ పేర్కొన్నారు. డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ వంటి పోస్టులకు విపరీతమైన డిమాండ్ నెలకొందని చెప్పారు. చదవండి : ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు.. -
ఆ పాలతో నిత్య యవ్వనం..
లండన్ : వెన్నతీసిన పాలు తీసుకోవడం ద్వారా డీఎన్ఏ వయసు మీరడాన్నినియంత్రించవచ్చని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. తక్కువ కొవ్వున్న పాలను తాగేవారు వారు వారి వయసు కంటే నాలుగున్నరేళ్లు చిన్నవారిగా కనిపిస్తారని పేర్కొంది. 6000 మంది జీన్స్‌ను, వారు తీసుకునే ఆహారం, ఎలాంటి పాలు తాగుతారనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఆ సర్వే కీలక వివరాలను వెల్లడించింది. క్రోమోజోముల పరిమాణం ఆధారంగా డీఎన్ఏ వయసును శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రజలు తీసుకునే పాలల్లో ఒక శాతం కొవ్వు అధికమైనా ఒక్కో శాతానికి వారి డీఎన్ఏ నాలుగేళ్ల పైగా వయసు మీరినట్టు సర్వేలో వెల్లడైంది. 0.3 శాతం కొవ్వు కలిగి ఉన్న పాలను తీసుకునే వారు 3.6 శాతం కొవ్వున్న పాలను తీసుకునే వారితో పోలిస్తే దీర్ఘకాలం యవ్వనంగా కనిపిస్తూ ఆరోగ్యంగా ఉన్నట్టు తేలిందని సర్వే సూచించింది. సంతృప్త కొవ్వులతో కూడిన పాలను తీసుకుంటే అది కణాలపై ఒత్తిడి పెంచి వాటిని నిర్వీర్యం చేస్తుందని శరీరంలోని కండరాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. పాలు తాగడం అనారోగ్యకరం కాదని, కానీ మీరు ఎలాంటి పాలు తాగుతున్నారనే దానిపై అవగాహన ఉండాలని పరిశోధకులు పేర్కొన్నారు. అధిక కొవ్వున్న పాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే వెన్నతీసిన పాలు డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడతాయనేందుకు పరిశోధకులు ఎలాంటి ఆధారాలు చూపకపోవడం గమనార్హం. వారు కేవలం ఈ పాలను తీసుకుంటే కలిగే ప్రభావాలను మాత్రమే పరిశీలించారు..కారణాలపై లోతుగా విశ్లేషించలేదు. బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ అథ్యయనానికి ప్రొఫెసర్ లారీ టకర్ నేతృత్వం వహించారు. ఈ అథ్యయన వివరాలు సైన్స్ జర్నల్ ఆక్సిడేటివ్ మెడిసిన్ అండ్ సెల్యులార్ లాంగివిటీలో ప్రచురితమయ్యాయి. చదవండి : గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న! -
వారానికి మూడుసార్లు గ్రీన్ టీ తాగితే..
బీజింగ్ : వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ర్టోక్ ముప్పులను నివారించవచ్చని తాజా అథ్యయనం స్పష్టం చేశారు. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తేల్చారు. చైనాలో లక్ష మందిపై జరిపిన అథ్యయనంలో గ్రీన్ టీ తాగేవారు తాగని వారితో పోలిస్తే సగటున 1.26 సంవత్సరాలు అధికంగా జీవించినట్టు గుర్తించారు. గ్రీన్ టీ తాగని వారి కంటే 1.4 ఏళ్ల తర్వాత గుండె పోటు వంటి వ్యాధుల బారిన పడ్డారని సుదీర్ఘంగా సాగిన అథ్యయనంలో వెల్లడైంది. బ్లాక్ టీ తాగిన వారిలో ఇలాంటి ప్రయోజనాలను గుర్తిచలేదని పరిశోధకులు తెలిపారు. అయితే కేవలం మంచి ఆరోగ్యం కోసం గ్రీన్ టీకి మారితే మెరుగైన ఫలితాలు రావని, ఇతర అనారోగ్య అలవాట్లను కొనసాగిస్తూ గ్రీన్ టీ ఒక్కటితోనే పరిస్థితి మారబోదని వారు పేర్కొన్నారు. నిత్యం టీ తాగడం అలవాటుగా చేసకున్నవారికి గుండె జబ్బులు, ఇతర కారణాలతో మరణించే రిస్క్ తక్కువగా ఉంటుందని అథ్యయన రచయిత డాక్టర్ జియాన్ వాంగ్ చెప్పారు. టీలో ఉండే పోలీపెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణం కలిగిఉందని అన్నారు. పండ్లు, కూరగాయల్లో కూడా లభించే పాలీపెనాల్స్ దెబ్బతిన్న కణజాలాన్ని శక్తివంతం చేయడంతో పాటు శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తూ బరువు పెరగడాన్ని నెమ్మెదింపచేస్తాయి. -
ఇలా చేస్తే ఏడు రకాల క్యాన్సర్లకు చెక్..
న్యూయార్క్ : వారానికి రెండున్నర గంటలు లేదా రోజుకు దాదాపు 20 నిమిషాలు పైగా వేగంగా నడిస్తే ఏడు రకాల క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. ఈ తరహా వ్యాయామంతో స్త్రీ, పురుషులు లివర్ క్యాన్సర్ ముప్పును 18 శాతం, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 6 శాతం మేర తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. వారానికి ఏడు గంటల పాటు వేగంగా నడిస్తే ఈ ముప్పు 10 శాతం తగ్గుతుందని తేల్చారు. వారానికి రెండున్నర గంటల పాటు వేగంగా నడిస్తే కిడ్నీ క్యాన్సర్ ముప్పును 11 శాతం, ఐదుగంటల వ్యాయామంతో 17 శాతం మేర ఈ ముప్పును తగ్గించవచ్చని వెల్లడించారు. బ్రిస్క్ వాకింగ్ చేసే పురుషుల్లో జీర్ణవాహిక క్యాన్సర్ ముప్పు 14 శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. ఇక స్త్రీ, పురుషులిద్దరిలో బ్లడ్ క్యాన్సర్ ముప్పు 19 శాతం తగ్గినట్టు వెల్లడైంది. వ్యాయామంతో బరువు తగ్గడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని, చురుకైన వ్యక్తులు వ్యాయామం చేయడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లను నియంత్రించుకోగలుగుతారని ఈ ఫలితాలు వెల్లడించాయని పరిశోధకులు తెలిపారు. 7.5 లక్షల మందిపై పదేళ్ల పాటు పరిశోధనలు చేపట్టిన అనంతరం ఈ అవగాహనకు వచ్చినట్టు అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన సహ రచయిత డాక్టర్ అల్ఫా పటేల్ వెల్లడించారు. వేగంగా నడవటం వంటి సరళమైన వ్యాయామంతో పలు రకాల క్యాన్సర్ల ముప్పును నిరోధించవచ్చని పరిశోధనలో వెల్లడవడం నిజంగా అద్భుత ఫలితమేనని పరిశోధకులు విశ్లేషించారు. -
నిద్ర సమస్యలతో ఆ వ్యాధుల ముప్పు..
లండన్ : నిద్రలేమి, అతినిద్రతో సతమతమయ్యేవారు రోజుకు ఏడు గంటలు నిద్రించేవారితో పోలిస్తే ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు పల్మనరీ ఫైబ్రోసిస్ బారిన పడే ముప్పు అధికమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. రోజుకు 11 గంటలకు పైగా నిద్రించేవారు, నాలుగు గంటల కన్నా తక్కువ సమయం నిద్రించేవారు ఇతరులతో పోలిస్తే రెండు, మూడు రెట్లు అధికంగా ఈ వ్యాధి బారిన పడతారని అథ్యయనం హెచ్చరించింది. ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటే ఆ అవయవం సరిగ్గా పనిచేయడం కష్టమవడం పల్మనరీ ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. మానవ శరీరంలోని అన్ని కణాలను జీవ గడియారం నియంత్రిస్తుందని, జీవ గడియారం సక్రమంగా నడవాలంటే సరైన నిద్ర అవసరమని మాంచెస్టర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. నిద్ర లేమి, అతినిద్రతో జీవగడియారం పనితీరు అపసవ్యమై అనర్ధాలకు దారితీస్తుందని ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం పల్మనరీ ఫైబ్రోసిస్ నయం కాని వ్యాధిలా ముంచుకొస్తోందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ ప్రొఫెసర్ జాన్ బ్లాక్లీ తెలిపారు. పల్మనరీ ఫైబ్రోసిస్‌కు నిద్రించే సమయానికి మధ్య సంబంధంపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అథ్యయనంలో వెల్లడైన అంశాలు నిర్ధారణ అయితే నిద్ర సమస్యలను అధిగమించడం ద్వారా ఈ కిల్లర్ డిసీజ్ ప్రభావాన్ని తప్పించుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. -
చిన్నారులనూ కుంగదీస్తుంది..
న్యూయార్క్ : చిన్నారుల్లోనూ డిప్రెషన్ వేధిస్తుందని, ఏడేళ్ల వయసు నుంచే కుంగుబాటు సంకేతాలు కనిపిస్తాయని తాజా పరిశోధన హెచ్చరించింది. కుంగుబాటుతో బాధపడేవారిలో చాలా మందిలో టీనేజ్ వరకూ ఆదుర్ధా, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపించవని చెబుతారు. అయితే వందమంది చిన్నారులను పరిశీలించిన అమెరికన్ శాస్త్రవేత్తలు కుంగుబాటు లక్షణాలు ఏడేళ్ల నుంచే కనిపిస్తాయని వెల్లడించారు. ఎంఆర్ఐ యంత్రంపై చిన్నారులను పరీక్షించగా వారి మెదడులో నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, మూడ్‌కు సంబంధించిన రెండు భాగాల మధ్య కనెక్షన్ తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ రెండు మెదడు భాగాల మధ్య రక్త సరఫరా అధికంగా ఉంటే ఆ పిల్లలు తమ ఎమోషన్స్‌ను సమర్ధంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారని, రక్త సరఫరా తక్కువగా ఉంటే ఆ చిన్నారులు నాలుగేళ్ల తర్వాత కుంగుబాటు తరహా మనస్తత్వానికి చేరుకుంటారని పరిశోధనలో వెల్లడైంది. బోస్టన్లోని నార్త్ఈస్ర్టన్ యూనివర్సిటీ చిన్నారుల తల్లితండ్రులతోనూ మాట్లాడి ఈ అవగాహనకు వచ్చింది. ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరికి నాలుగేళ్ల తర్వాత కుంగుబాటు లక్షణాలు కనిపించాయని జామా సైకియాట్రీలో ప్రచురితమైన ఈ అథ్యయనం వెల్లడించింది. -
ఆ కొలువులతో హైబీపీ రిస్క్..
లండన్ : వారం రోజుల పాటు నైన్ టూ ఫైవ్ జాబ్‌లతో కుస్తీపట్టే ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు తప్పవని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఒకే చోటు కూర్చుని ఏకబిగిన ఇన్నేసి గంటలు పనిచేస్తే అధిక రక్తపోటు సహా పలు వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. 3500 మంది కార్యాలయ ఉద్యోగుల ఆరోగ్యాన్ని విశ్లేషించిన మీదట కెనడాలోని లావల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వివరాలు వెల్లడించారు. వారానికి 40 గంటలు పైబడి పనిచేసే ఉద్యోగుల్లో అంతకంటే తక్కువ పనిగంటలు పనిచేసే వారితో పోలిస్తే అధిక రక్తపోటుకు గురయ్యే ముప్పు మూడింట రెండు వంతులు అధికమని వెల్లడైంది. వారానికి 40 గంటలు పనిచేసే వారిలో హైపర్‌టెన్షన్‌కు లోనయ్యే అవకాశం 50 శాతంగా నమోదైంది. ఇక వారానికి 35 గంటలే పనిచేసేవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఇక వారానికి 49 గంటలకు పైగా పనిచేసే వారిలో ఈ రిస్క్ ఏకంగా 70 శాతంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. పని ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం కొరవడటం ఈ పరిస్ధితికి దారితీస్తోందని అథ్యయనం తెలిపింది. అధిక రక్తపోటు స్ర్టోక్, గుండె పోటు, కిడ్నీ వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. ఐదేళ్ల పాటు సాగిన ఈ అథ్యయనంలో మూడు ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులను పరీక్షించారు. -
ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్..
ముంబై : ఆర్థిక మందగమనంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో తాజా సర్వే ఉద్యోగార్ధులకు భారీ ఊరట ఇచ్చింది. విద్యాలయాల నుంచి గ్రాడ్యుయేట్లుగా బయటకు వస్తున్న వారిలో దాదాపు 50 శాతం అభ్యర్ధులకు ఉద్యోగాలు అందివస్తున్నాయని ఈ సర్వే వెల్లడించింది. 2014లో జాబ్ మార్కెట్లోకి అడుగుపెట్టే గ్రాడ్యుయేట్లలో కేవలం 33 శాతం మందికే ఉద్యోగాలు దక్కే పరిస్థితి ఉందని ఈ సర్వే పేర్కొంది. 2019లో ప్రొఫెషనల్ డిగ్రీ కలిగిన వారిలో 50 శాతం మంది ఉద్యోగాలు చేపట్టేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండగా, ఐదేళ్ల కిందట కేవలం 33 శాతం ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉద్యోగాలు చేపట్టే నైపుణ్యాలను కలిగి ఉన్నారని వీబాక్స్, పీపుల్ స్ర్టాంగ్, సీఐఐ సంయుక్తంగా చేపట్టిన ఇండియా స్కిల్స్ నివేదిక వెల్లడించింది. ఉద్యోగాలకు అనువైన నైపుణ్యాలు అందుబాటులో ఉండే ధోరణి గణనీయంగా మెరుగైందని వీబాక్స్ వ్యవస్ధాపక సీఈవో నిర్మల్ సింగ్ పేర్కొన్నారు. ఎంబీఏ అభ్యర్ధులతో పాటు బీఫార్మసీ, పాలిటెక్నిక్, బీకాం, బీఏ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగాలను అందిపుచ్చుకునే సత్తా 15 శాతం పైగా మెరుగైందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే బీటెక్ సహా ఎంసీఏ, సాంకేతిక, కంప్యూటర్ సంబంధిత గ్రాడ్యుయేట్లలో ఉద్యోగ నైపుణ్యాల్లో క్షీణత నెలకొనడం కొంత ఆందోళనకరమని అన్నారు. అధిక ఉద్యోగిత నగరాల్లో ముంబై అగ్రస్ధానంలో నిలవగా తర్వాతి స్ధానంలో హైదరాబాద్ ఉండటం గమనార్హం. ఇక టాప్ టెన్ ఎంప్లాయిబిలిటీ నగరాల్లో వీటి తర్వాత బెంగళూర్, న్యూఢిల్లీ, పుణే, లక్నో, చెన్నైలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలను అందిపుచ్చుకునే నైపుణ్యాలు కూడిన మహిళల్లో హైదరాబాద్, ఘజియాబాద్, విశాఖపట్నంలు తొలి మూడుస్దానాల్లో నిలిచాయి. -
ఇలా తింటే వ్యాధులు దూరం..
న్యూయార్క్ : రోజుకు 14 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా మిగిలిన పది గంటల్లో కొద్దిపాటి విరామం ఇస్తూ ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహం, స్ర్టోక్, గుండె జబ్బుల ముప్పు తప్పుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు పది గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం, కొలెస్ర్టాల్ అదుపులో ఉండటం వంటి అదనపు ప్రయోజనాలూ చేకూరతాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. అథ్యయనంలో భాగంగా తాము ఎంపిక చేసుకున్న వారిని 12 వారాల పాటు రోజుకు 14 గంటలు ఎలాంటి ఆహారం తీసుకోరాదని, మిగిలిన పదిగంటల్లో వారికిష్టమైన సమయంలో ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 12 వారాల అనంతరం అథ్యయనంలో పాల్గొన్న వారి శరీరంలో కొవ్వు నిల్వలు, బీఎంఐ, బరువు మూడు శాతంపైగా తగ్గిన్టు గుర్తించారు. వీరిలో పలువురికి షుగర్ నిల్వలు కూడా తగ్గాయి. మరోవైపు 70 శాతం మంది తాము గతంలో కంటే మెరుగ్గా నిద్రించామని చెప్పుకొచ్చారు. 14 గంటల పాటు ఏమీ తినకుండా పదిగంటల్లో ఆహారం తీసుకునే సమయాన్ని షెడ్యూల్ చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందని పరిశోధకులు చెప్పారు. -
అక్కడ వ్యాయామం చేస్తే డేంజర్..
లండన్ : రోజూ వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తుండటంతో బిజీ రోడ్లపై ఓ అరగంట నడిచేసి మొక్కుబడిగా ముగిస్తే మొదటికే మోసం వస్తుందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. ట్రాఫిక్ అధికంగా ఉండే రోడ్లపై వాకింగ్, జాగింగ్ చేస్తే కాలుష్య ప్రభావంతో వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించింది. డీజిల్ వాహనాలు, వ్యర్థ పదార్ధాలు వెదజల్లే వాయువులతో మనం పీల్చే గాలిలో ప్రమాదకర స్ధాయిలో పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) స్ధాయిలు పెరుగుతాయని, ఉదయాన్నే బిజీబిజీ వీధుల్లో వాకింగ్‌కు బయలుదేరితే ప్రతికూల ఫలితాలే అధికమని దక్షిణ కొరియా నిపుణులు చేపట్టిన అథ్యయనం స్పష్టం చేసింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే వీధుల్లో వాకింగ్ చేసేవారిలో వెంట్రుకల పెరుగుదలకు అవసరమైన ప్రొటీన్ల స్ధాయి తగ్గినట్టు ఈ అథ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. కాలుష్యంతో సహజీవనం ద్వారా ఆస్త్మా, క్రానిక్ బ్రాంకైటీస్, గుండె జబ్బులు, స్ట్రోక్, డిమెన్షియా వంటి వ్యాధుల ముప్పు అధికమని యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ కాలుష్య నిపుణులు ప్రొఫెసర్ ఇయాన్ కాల్బెక్ విశ్లేషించారు. కాగా, ఈ నివేదికను మాడ్రిడ్‌లో జరిగిన యూరోపియన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ, వెనెరాలజీ కాంగ్రెస్‌లో సమర్పించారు. వాహన రాకపోకలతో బిజీగా ఉండే రోడ్లపై వాకింగ్, వ్యాయామానికి పూనుకోవడం కంటే ఇంటి పరిసరాల్లో లేదా ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేయడం సరైనదని వారు పేర్కొన్నారు. ఇక ఏంజైనా సహా గుండె జబ్బులతో బాధపడేవారు సైతం కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ఆరుబయట వ్యాయామం చేయడం సరైంది కాదని సూచించారు. కాలుష్య స్ధాయిలు అధికంగా ఉన్న సమయంలో నివాస ప్రాంగణాలు, ఇంటి సమీపంలోని పార్క్‌ల్లో వ్యాయామం చేయడం మేలని నిపుణులు పేర్కొన్నారు. -
వారానికి 50 నిమిషాల జాగింగ్‌తో..
లండన్ : సమయం సరిపోవడం లేదనో..మరే కారణాలతోనో వ్యాయామం జోలికి వెళ్లని వారికి తాజా అథ్యయనం ఊరట ఇస్తోంది. వారానికి ఒకసారి 50 నిమిషాల పాటు జాగింగ్ చేసినా మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. జాగింగ్‌తో అకాల మరణం ముప్పు 30 శాతం తగ్గుతుందని, గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పునూ ఇది గణనీయంగా నిరోధిస్తుందని పరిశోధకులు తెలిపారు. రన్నింగ్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఇప్పటకే పలు సర్వేలు తేల్చిచెప్పాయి. వారంలో ప్రతి ఒక్కరూ కనీసం 75 నిమిషాల పాటు రన్నింగ్, స్విమ్మింగ్ వంట కఠిన వ్యాయామం చేయాలని పరిశోధకులు సూచించారు. 2,33,149 మందికి సంబంధించిన 14 అథ్యయనాల గణాంకాలను పరిశీలించిన మీదట విక్టోరియా యూనివర్సిటీ ఈ వివరాలు వెల్లడించింది. 30 సంవత్సరాల పాటు వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేసిన క్రమంలో సర్వే సాగిన మూడు దశాబ్ధాల కాలంలో వారిలో 25,951 మంది మరణించారు. అసలు పరగెత్తని వారితో పోలిస్తే రన్నింగ్ చేసే వారిలో ఏ కారణం చేతనైనా మరణించే రేటు 27 శాతం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. రన్నింగ్‌లో వేగం ఎంతైనా ఫలితాల్లో మాత్రం వ్యత్యాసం లేదని వెల్లడైంది. గంటకు ఎనిమిది కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వారానికి కనీసం 50 నిమిషాలు పరిగెత్తినా మెరుగైన ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉన్నట్టు తేలిందని పరిశోధకులు చెప్పారు. అథ్యయన వివరాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసన్‌లో ప్రచురితమయ్యాయి. -
కశ్మీర్ కంటే ధరల మంటపైనే కలత..
ఇస్లామాబాద్ : కశ్మీర్‌పై అంతర్జాతీయ సమాజం ఎదుట పాకిస్తాన్ గగ్గోలు పెడుతుంటే అక్కడి ప్రజలు మాత్రం కశ్మీర్ కంటే మండుతున్న ధరలు, ఆర్ధిక వ్యవస్థ దుస్థితిపైనే అధికంగా కలత చెందుతున్నారు. గాలప్-గిలానీ పాకిస్తాన్ సంస్థ దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 53 శాతం మంది పాకిస్తానీలు ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందుతుంటే, నిరుద్యోగం ప్రధాన సమస్యగా 23 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక అవినీతి పెద్ద సమస్యగా నాలుగు శాతం మంది పాకిస్తానీలు పేర్కొన్నారు. 1200 మంది పాక్ దేశీయులను ఈ సర్వే పలుకరించగా, కేవలం 8 శాతం మంది మాత్రమే కశ్మీర్ పాకిస్తాన్‌కు ప్రధాన సమస్యగా చెప్పుకొచ్చారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తర్వాతే కశ్మీర్ పాకిస్తానీల ప్రధాన సమస్యగా మూడో స్ధానంలో నిలిచింది. అవినీతి, రాజకీయ అస్ధిరత, నీటి కొరత వంటి స్ధానిక సమస్యలను ప్రస్తావించకుండా కశ్మీర్‌పైనే తాము కలత చెందుతున్నామని ఎనిమిది శాతం మంది పాక్ ప్రజలు పేర్కొన్నారు. -
ఉద్యోగార్ధులకు గుడ్‌న్యూస్..
సాక్షి, న్యూఢిల్లీ : మాంద్య మేఘాలు ముసురుకోవడంతో అన్ని రంగాలూ కుదేలై ఉద్యోగాలు కోల్పోతున్న వేళ ఓ నివేదిక యువతలో ఉత్తేజం నింపుతోంది. మందగమనం తాత్కాలికమేనని మళ్లీ కొలువుల కోలాహలం నెలకొంటుందనే ఆశను రేకెత్తించింది. ఈ ఏడాది మే -ఆగస్ట్‌లో దేశవ్యాప్తంగా 40.49 కోట్ల మంది ఉపాధి రంగంలో ఉన్నారని సీఎంఐఈ సర్వే వెల్లడించినట్టు ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో 40.24 కోట్ల మంది వివిధ వృత్తి, ఉద్యోగాల్లో కుదురుకున్నారని, ఈ ఏడాది 25 లక్షల మంది అదనంగా శ్రామిక శక్తికి తోడయ్యారని ఈ సర్వే నివేదిక తెలిపింది. అంతకుముందు రెండేళ్లుగా ఉపాధి పొందే వారి సంఖ్య తగ్గుముఖం పట్టగా తాజాగా పనిచేసే వారి సంఖ్య 25 లక్షల మేర పెరగడం మెరుగైన సంకేతాలు పంపుతోందని సీఎంఐఈ సీఈఓ మహేష్ వ్యాస్ పేర్కొన్నారు.ఈ ఏడాది మే-ఆగస్ట్‌లో తాము నిర్వహించిన సర్వేలో వ్యవసాయ రంగం, అనుబంధ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య 84 లక్షల మేర పెరిగినట్టు వెల్లడైందని, అయితే ఐటీ, ఆర్థిక సేవల రంగాల్లో ఉద్యోగాల సంఖ్య ఆశాజనకంగా లేదని ఆయన పెదవివిరిచారు. వ్యవసాయ రంగంలో ఈసారి పంట సాగుబడి అధికంగా ఉండటంతో ఈ రంగంలో ఉపాధి 13 కోట్ల నుంచి 14 కోట్లకు పెరిగిందని..కోళ్ల పెంపకం, పశుసంవర్ధక రంగంలో ఉపాథి 18 లక్షల నుంచి 43 లక్షలకు పెరిగిందని తెలిపారు. మరోవైపు తయారీ రంగంలో ఉద్యోగాలు గత ఏడాదితో ఇదే కాలంతో పోలిస్తే 9 లక్షలు, జౌళి రంగంలో 22 లక్షల మేర ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఐటీ, ఆర్థిక సేవల రంగాల్లో ఉపాధి వృద్ధి ఆశించిన మేర లేదని ఈ సర్వే తెలిపింది. మొత్తంమీద తక్కువ నైపుణ్యం కలిగిన రంగాల్లో ఉపాధి అధికమవడం గమనార్హం. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు గ్రామీణ రంగంలో ఉపాధి పెరగడం ఎకానమీ ఎదుగుదలకు ఎంతమేర తోడ్పడుతుందనేది వేచిచూడాలి. వ్యవసాయేతర రంగాల్లోనూ ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరిగితేనే మందగమన ప్రభావాన్ని దీటుగా తిప్పిగొట్టగలమని నిపుణులు పేర్కొంటున్నారు. -
ప్రతి పది మంది పురుషుల్లో ఒకరింతే..
న్యూయార్క్ : పురుషుల్లో సంతాన సాఫల్య సమస్యలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ప్రతి పది మంది పురుషుల్లో ఒకరు తండ్రి అయ్యేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. తక్కువ వీర్యకణాల సంఖ్యతో పెద్దసంఖ్యలో పురుషులు సంతాన లేమితో సతమతమవుతున్నారని పేర్కొంది. ఈ లక్షణం పురుషుల్లో తర్వాతి దశల్లో క్యాన్సర్ రిస్క్కూ దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ చేపట్టిన సర్వేలో రెడ్, ప్రాసెస్డ్ మాంసాహారం, తీపి పానీయాలు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకునే పురుషుల్లో సగటు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్టు తేలింది. వీరిలో వీర్యకణాల సంఖ్య సగటు 25.6 మిలియన్లు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. సహజంగా సంతానోత్పత్తికి వీర్యకణాల సంఖ్య 39 మిలియన్లు ఉండాలని వారు తెలిపారు. మరోవైపు చాలామంది పురుషులు తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఈ లోపంతో పుడుతున్నారని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తొలి నెలల్లోనే శిశువులు తండ్రులుగా మారే అవకాశాలు దెబ్బతింటున్నాయని, వారి పునరుత్పత్తి అవయవాలు ప్రతికూల ప్రభావానికి లోనవుతున్నాయనేందుకు ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ఇది వీర్యకణాలు తగ్గడానికే పరిమితం కాదని, వారు వయసు పెరిగేకొద్దీ హృద్రోగాలు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
వ్యాయామం ఇలా చేస్తే మేలు..
లండన్ : బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న తర్వాత వ్యాయామం చేయాలని కొందరు సూచిస్తుండగా ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు వ్యాయామం చేస్తే రక్తంలో చక్కెర స్ధాయి నియంత్రణలో ఉంటుందని ఈ పరిశోధన వెల్లడించింది. ఖాళీ కడుపుతో ఎక్సర్సైజ్ చేస్తే శరీరం ఇన్సులిన్ వాడకాన్ని సమర్ధంగా నిర్వహిస్తుందని ఇది టైప్ 2 డయాబెటిస్తో పోరాడటంతో పాటు జీవక్రియల వేగం పెంచేందుకు ఉపకరిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. బాత్ అండ్ బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. వ్యాయామం చేసే సమయంలో మీరు ఆహారం తీసుకునే సమయంలో చేసే మార్పుల ద్వారా మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని తమ పరిశోధనలో తేలిందని యూనివర్సిటీ ఆప్ బాత్ ప్రొఫెసర్ డాక్టర్ జేవియర్ గోంజలెజ్ చెప్పారు. ఖాళీ కడుపుతో వ్యాయామం చేసిన వారి కండరాలు ప్రొటీన్‌ను మెరుగ్గా సంగ్రహిస్తున్నట్టు తమ అథ్యయనం గుర్తించామని తెలిపారు. బరువు తగ్గే క్రమంలో వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఆహారం తీసుకునే సమయంతో సంబంధం లేకపోయినా వారి ఆరోగ్యంపై మాత్రం ఇది సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు. -
వారంలో రెండుసార్లు ఓకే..
లండన్ : నిత్యం మందు జోలికి పోకుండా వారాంతంలోనే మద్యం అధిక మోతాదులో తీసుకోవడం కంటే వారంలో ఎక్కువ సార్లు మద్యం సేవించడమే ప్రమాదకరమని పరిశోధకులు స్పష్టం చేశారు. గతంలో నిత్యం మితంగా మద్యం సేవించడం మేలని పలు అథ్యయనాలు వెల్లడైన సంగతి తెలిసిందే. గత సర్వేలకు భిన్నంగా వారంలో ఒకసారి పూటుగా తాగడంతో పోలిస్తే వారంలో పలుసార్లు మద్యం సేవించేవారిలో స్ర్టోక్‌కు దారితీసే గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఉండే ముప్పు అధికమని తాజా పరిశోధన తేల్చింది. వారానికి రెండు సార్లు మద్యం సేవించే వారితో పోలిస్తే ప్రతి రోజూ తాగే వారికి ఈ ముప్పు 40 శాతం అధికమని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. మొత్తంగా ఒకేసారి ఎక్కువ మోతాదులో మద్యం సేవించడంతో పోలిస్తే తరచూ ఎక్కువ సార్లు మద్యం సేవించడం అసాధారణంగా గుండె కొట్టుకునే పరిస్థితికి దారితీస్తుందని తమ అథ్యయంలో తేలిందని కొరియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోంగ్ చి చెప్పారు. 2009 నుంచి దాదాపు కోటి మందిపై ఈ అథ్యయనాన్ని చేపట్టగా వారంలో ఎక్కువసార్లు మద్యం సేవించడం గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఉండే రిస్క్‌ను పెంచిందని వెల్లడైంది. ఒక్కో సెషన్లో అధిక మోతాదులో మద్యం సేవించడానికి ఈ రిస్క్‌తో ఎలాంటి లింక్ లేదని పరిశోధకులు తేల్చారు. వారంలో రెండు సార్లు మద్యం సేవించేవారిలో ఈ ముప్పు తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. అసలు తాగనివారు, వారంలో ఒకసారి మద్యం సేవించేవారితో పోల్చినా రెండుసార్లు తాగేవారిలో ఈ ముప్పు స్వల్పంగా ఉండటం గమనార్హం. వారానికి ఆరు సార్లు మద్యం సేవించే వారిలో ఈ ముప్పు 30 శాతం, రోజూ తాగేవారిలో 40 శాతం అధిక ముప్పు నమోదైంది. -
స్మార్ట్ ఫోన్ వాడకంపై షాకింగ్ సర్వే..
లండన్ : నిత్యం స్మార్ట్‌ఫోన్‌ను విడిచిపెట్టకుండా ఉంటే పెనుముప్పు తప్పదని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. ఫోన్లు, కంప్యూటర్ల తెరల నుంచి వెలువడే బ్లూ లైట్‌కు ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే వయసు మీరిన లక్షణాలు ముందుగానే ముంచుకొస్తాయని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఎల్ఈడీ తరంగాలకు అధికంగా గురైతే మెదడు కణాజాలం దెబ్బతిన్నట్టు ఒరెగాన్ యూనివర్సిటీ తుమ్మెదలపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. బ్లూ లైట్ నేరుగా మీ కళ్లలోకి పడనప్పటికీ దానికి ఎక్స్పోజ్ అయినంతనే వయసు మీరే ప్రక్రియను వేగవంతం చేస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కృత్రిమ వెలుగు తుమ్మెదల జీవనకాలాన్ని గణనీయంగా తగ్గించినట్టు కనుగొన్నామని ప్రొఫెసర్ జాగ జిబెల్టవిజ్ తెలిపారు. మానవ కణజాలంతో పోలిఉన్నందునే ఈ కీటక జాతులపై ఎల్ఈడీ తరంగాల ప్రభావాన్ని పరిశీలించామని చెప్పారు. ఆరోగ్యకర మానవులకు, జంతుజాలానికి సహజ కాంతి కీలకమని, అది జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తూ మెదడు చురుకుదనం, హార్మోన్ ఉత్పత్తి, కణజాల పునరుద్ధరణను చక్కగా క్రమబద్ధీకరిస్తుందని అథ్యయన రచయితలు పేర్కొన్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పూర్తిగా వదిలివేయడం సాధ్యం కాని పక్షంలో బ్లూ లైట్ ప్రభావాన్ని తగ్గించడం, రెటీనాను కాపాడుకోవడం కోసం సరైన లెన్స్‌లతో కూడిన గ్లాస్లు ధరించాలని సూచించారు. బ్లూ ఎమిషన్స్‌ను నిరోధించే స్మార్ట్ఫోన్లు ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలను వాడాలని కోరారు. -
ఇలా చేస్తే క్యాన్సర్‌కు చెక్..
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రబలుతున్న క్యాన్సర్ వ్యాధిని మెరుగైన జీవన శైలితోనే నిరోధించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తరచూ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం తీసుకుంటే వాటిలోని కెమికల్స్ మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని హరించడంతో పాటు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పూ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్, పాప్‌కార్న్‌ను ఎక్కువగా తీసుకునేవారిలో అనారోగ్య కారక రసాయనాలు పేరుకుపోయాయని, చక్కగా ఇంటిలో తయారుచేసే ఆహారం తీసుకునేవారిలో కెమికల్స్ తక్కువగా ఉన్నాయని తాజా సర్వే వెల్లడించింది. రెస్టారెంట్లు, హోటళ్లలో మనం తినే ఆహార పదార్ధాల్లో అత్యధిక పదార్ధాల్లో ట్యాక్సిన్స్ అధికంగా ఉంటాయని, మనం ఏం తింటున్నాము అనే దానితో పాటు ఎక్కడ తింటున్నామనేది కూడా ప్రధానమైనదని ఈ అథ్యయనం చేపట్టిన సైలెంట్ స్ర్పింగ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు పేర్కొన్నారు. ప్యాకేజింగ్ ఫుడ్‌లో అధికంగా ఈ తరహా కెమికల్స్ ఉంటాయని వారు తెలిపారు. ఇంటి వంటతో ప్రమాదకర రసాయనాలు మన శరీరంలో పేరుకుపోకుండా కొన్ని రకాల క్యాన్సర్లు, థైరాయిడ్ సమస్యలు ఉత్పన్నం కాకుండా నియంత్రించవచ్చని పరిశోధకులు సూచించారు. -
ఆ నిర్ణయంతో ఉద్యోగాలు ఊడాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు కష్టాలపై ఇప్పటికే పలు సర్వేలు, అథ్యయనాలు వెలువడగా ఈ నిర్ణయంతో ఉద్యోగాలు 2-3 శాతం మేర దెబ్బతినడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీసిందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. బ్లాక్ మనీ నిరోధించడం, ఉగ్ర నిధులకు కళ్లెం వేసే లక్ష్యంతో 2016 నవంబర్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే నోట్ల రద్దుతో ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక వేత్తలు గాబ్రియల్ చోడ్రో-రీచ్, ఐఎంఎఫ్‌కు చెందిన గీతా గోపినాథ్‌ల నేతృత్వంలో తాజా అథ్యయనం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వృద్ధిని తగ్గించడంతో పాటు 2-3 శాతం ఉద్యోగాలు ఊడిపోయాయని ఈ సర్వే స్పష్టం చేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో 2016 నవంబర్, డిసెంబర్ మధ్య ఆర్థిక కార్యకలాపాలు 2.2 శాతం తగ్గాయని వీరు వెల్లడించిన పరిశోధన నివేదిక తెలిపింది. నోట్ల రద్దుకు ముందు ఆర్బీఐ పెద్దమొత్తంలో కొత్త నోట్లను ముద్రించకపోవడంతో తీవ్ర నగదు కొరత ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. -
ఇలా ఉంటే గుండె బేఫికర్..
న్యూయార్క్ : జీవితంలో సానుకూల అంశాలపై దృష్టిసారిస్తూ సంతృప్తికరంగా జీవించేవారిలో గుండెపోటు, స్ట్రోక్ ముప్పు 35 శాతం తక్కువని తాజా అథ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2,30,000 మంది డేటాను, 15 అథ్యయనాలను పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ విషయం తేల్చారు. సానుకూల దృక్పథంతో కూడిన వారిలో అకాల మరణం ముప్పు 14 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. సానుకూల ఆలోచనలు కలిగిన వారు శారీరక వ్యాయామానికి, మెరుగై ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యం కాపాడుకుంటారని పరిశోధకులు భావిస్తున్నారు. గుండెపై ఒత్తిడి పెంచి శరీరంలో వాపునకు కారణమయ్యే ఒత్తిడి, ఆందోళనలను ఎలా అధిగమించాలో కూడా వారికి తెలుసునని ఈ అథ్యయనం తెలిపింది. సానుకూల ఆలోచనలు రేకెత్తించే పరిణామాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యూయార్క్‌కు చెందిన మౌంట్ సినాయ్ సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్ బృందం పేర్కొంది. సానుకూల దృక్పథంతో కూడిన మైండ్‌సెట్‌తో కార్డియోవాస్క్యులర్ ముప్పు తగ్గుతుందని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయన రచయిత ప్రొఫెసర్ అలన్ రోజన్స్కీ చెప్పుకొచ్చారు. ఒత్తిడి, కుంగుబాటు, ఒంటరితనం గుండె జబ్బులకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. సానుకూల ధోరణితో హైబీపీ, కొవ్వుశాతం వంటి రిస్క్ కారకాలు అదుపులో ఉంటాయని ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని తెలిపారు. -
అవును వారు బామ్మలే..కానీ!
లండన్ : జుట్టు ముగ్గుబుట్టవడం..ముడతలు పడిన చర్మం..ఉద్యోగం దూరమవడం ఇవన్నీ వయసు తెచ్చే మార్పులే. 60 దాటగానే అన్నీ అయిపోయాయనుకునే నిర్వేదం నుంచి 70లు దాటితేనే అసలైన జీవితాన్ని ఆస్వాదించవచ్చంటున్నారు ఈ నయా బామ్మలు. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని చెప్పే వాళ్లని చూశాం కానీ, వయసు తమ శరీరానికీ దూరమే అన్నట్టు ఈ వృద్ధుల దినచర్య అందరి కళ్లకు కడుతోంది. బోల్డర్ అనే వెబ్సైట్ చేసిన పరిశోధనలో చలాకీ వృద్ధుల దూకుడు వెల్లడైంది. కృష్ణ రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తారనుకునే 70 ఏళ్ల పైబడిన వారినే ఈ వెబ్సైట్ పలుకరించగా వారి చురుకైన లైఫ్‌స్టైల్ చూసి విస్తుపోయే పరిస్థితి ఎదురైంది. వీరిలో ఒకరు 82 ఏళ్ల వయసులో ప్రేమలో పడి వివాహం చేసుకున్నవారు కాగా, మరొకరు 85 ఏళ్ల వయసులో ఏకంగా రోజూ ఒక మైలు దూరం స్విమ్ చేస్తున్నారు. వీరంతా ఇప్పటికీ ఏదో ఒక పనిచేస్తుండటం గమనార్హం. తమ జీవితంలో అత్యంత సంతోషదాయకమైన దశ ఇదేనని వారంతా చెప్పుకొచ్చారు. వృద్ధాప్యం జీవితంలో అత్యంత దుర్భర దశ అనుకుని అసలు వాస్తవం గ్రహించాలని వీరిని ఇంటర్వ్యూ చేయగా భిన్నమైన పరిస్ధితి తమ పరిశోధనలో వెల్లడైనట్టు ఆ వెబ్సైట్ పేర్కొంది. 87 ఏళ్ల వయసులో టెన్నిస్.. తాను ఇప్పటికి 70 ఏళ్లు పైగా టెన్నిస్ ఆడుతున్నానని కెనడాలోని ఒంటారియాకు చెందిన ముఫీ గ్రీవ్ (87) వెల్లడించి ఇంటర్వ్యూ చేసిన వారిని షాక్‌కు గురిచేశారు.తాను 30, 40, 50 ఇలా వయసు పెరుగుతున్న కొద్దీ ఎలాంటి సమస్యలూ ఎదుర్కోలేదని, జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఎదో రంగంలో విజయం సాధిస్తే తమకు లభించే ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పదని ఆమె చెప్పుకొచ్చారు. తాను 62 ఏళ్ల వయసులో బ్రైన్ ట్యూమర్‌తో బాధపడినా సానుకూల దృక్పథంతో సమస్యలు అధిగమించానని వెల్లడించారు. సమస్యలతో దిగాలుపడి కూర్చోవడం తనకు ఇష్టం ఉండదని పాజిటివ్ మైండ్‌తో పరిగెత్తడమే తనకు తెలిసిన విషయమన్నారు. గోల్ప్‌లో 90 స్కోర్ చేయడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు. ఏడు పదుల వయసులో స్విమ్మింగ్ ఎలరీ మెక్గొవన్ ఏడు పదుల వయసు దాటిన ఈ బామ్మ స్విమ్మింగ్‌లో పలు వరల్డ్ ఛాంపియన్షిప్లను కైవసం చేసుకున్నారు. రష్యాలో వింటర్ స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తనకు గాయమైనా రేస్ ముగిసే వరకూ రక్తం కారుతున్నా తనకు ఆ విషయం తెలియలేదని ఎలరీ చెబుతారు. తాను ప్రతివారం పైలేట్స్, స్పిన్ క్లాసులు తీసుకుంటానని ఆరోగ్యకర ఆహారం, పరిమితంగా రెడ్‌వైన్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెప్పకొచ్చారు. గత ఏడాది తన కుమారుడు జేమ్స్ హఠాన్మరణం చావు పట్ల తొలిసారిగా భయాన్ని కల్పించిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే జీవితాన్ని చాలించాలని లేదని, కానీ నా వయసు ఏటికేడు పెరుగుతూ పోతోందని అన్నారు. అయినా తాను జీవితంలో సాధించాలనే పట్టుదలను వీడలేదని, అంటార్కిటికాను ఈదడం తన తదుపరి టార్గెట్ అని చెప్పారు. పదహారు ఫ్లోర్లు: అవలీలగా ఎక్కేస్తారు రీటా గిల్మోర్ 87 ఏళ్ల వయసులో తన రెస్టారెంట్‌లోని 16 ఫ్లోర్లనూ ఎక్కిదిగుతారు. కస్టమర్లు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ బ్రెయిన్‌ను చురుకుగా ఉంచుకుంటానని ఆమె చెబుతారు. మద్యం ముట్టకుండా..పొగ తాగకుండా ఉండటమే తాను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమనే రీటా రోజూ మేకప్ వేసుకోవడమే కాదు స్ధానిక దుస్తుల కంపెనీకి ఇప్పటికీ మోడల్‌గా వ్యవహరిస్తున్నారు. -
వారానికి ఐదు సార్లు తాగినా..
లండన్ : నిత్యం మితంగా మద్యం లేదా వైన్ సేవిస్తే పదికాలాల పాటు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పలు అథ్యయనాలు వెల్లడైనా తాజా అథ్యయనం మద్యం ప్రియులకు షాక్ ఇస్తోంది. వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసుల వైన్, 9 గ్లాస్‌ల బీర్‌ను పుచ్చుకున్నా అకాల మరణం తప్పదని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ స్పష్టం చేసింది. 19 దేశాల్లోని ఆరు లక్షల మంది మందు ముచ్చట్లను పరిశీలించిన మీదట ఈ పరిశోధన వివరాలు వెల్లడయ్యాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించే వారు స్ర్టోక్, గుండె వైఫల్యం వంటి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ముప్పు అధికంగా ఉందని ఈ పత్రిక తేల్చింది. ఇక వారానికి 200 గ్రాముల నుంచి 350 గ్రాములు అంటే వారానికి 10 నుంచి 18 గ్లాసుల వరకూ వైన్, 20 నుంచి 40 గ్లాసుల వరకూ బీరును తీసుకునేవారు సగటు జీవిత కాలంలో రెండేళ్లకు ముందే మృత్యువాతన పడతారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం సేవించడంపై ఉన్న అధికారిక గైడ్‌లైన్స్‌ను సవరించాల్సిన అవసరం ఉందని ది లాన్సెట్‌లో ప్రచురితమైన అథ్యయనం తెలిపింది. ఇక ప్రతివారం ఆరు గ్లాస్‌ల వైన్, అదే మోతాదులో బీర్‌ను తీసుకోవాలని, అంతకు మించి మద్యం సేవించడం ఆరోగ్యానికి చేటని బ్రిటన్ ఇటీవల తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు మహిళలు తగిన మోతాదులో రోజుకు ఒక డ్రింక్, పురుషులు రోజుకు రెండు సార్లు మితంగా మద్యం తీసుకోవచ్చని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గైడ్‌లైన్స్ పేర్కొంటున్నాయి. -
శునకంతో ఆరోగ్యానికి శుభ శకునం..
లండన్ : పెంపుడు జంతువులతో సహవాసం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని పలు పరిశోధనలు వెల్లడించగా..తాజాగా కుక్కను పెంచుకుంటే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు. శునకంతో చెలిమి చేస్తే దానితో పాటు పరిగెత్తడం, పచ్చిక బయళ్లలో విహరించడం చేస్తారని ఇది గుండెకు మేలు చేకూరుస్తుందని చెబుతున్నారు. కుక్క యజమానులు మంచి ఆహారం తీసుకుంటారని వీరికి డయాబెటిస్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుందని తాజా అథ్యయనం పేర్కొంది. చురుకైన జీవనశైలి, మంచి ఆహారంతో హృదయ ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. 24 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసున్న దాదాపు 2000 మందిపై జరిపిన పరిశోధనలో కుక్క సహా పెంపుడు జంతువులతో కాలక్షేపం చేసేవారిలో ఇతరుల కంటే రక్తపోటు, మధుమేహం, కొవ్వు శాతం తక్కువగా ఉండి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు వెల్లడైందని సెయింట్‌యాన్స్ యూనివర్సిటీ ఆస్పత్రి చేపట్టిన అథ్యయనం తెలిపింది.పెంపుడు జంతువులు లేని వారితో పోలిస్తే వీరికి మంచి కొలెస్ర్టాల్ అధికంగా ఉండటంతో పాటు మధుమేహం లేకపోవడాన్ని గుర్తించామని అథ్యయనానికి నేతృత్వం వహించిన రచయిత అండ్రియా మగెరి చెప్పారు. పెంపుడు జంతువులు కలిగిన వారిలో ఎక్కువగా శారీరక కదలికలు, మెరుగైన ఆహారం, సరైన స్ధాయిలో మధుమేహం ఉండటం కనిపిస్తోందని వెల్లడించారు. -
వాటి కోసం వెంపర్లాడితే గుండె గుబేల్..
న్యూయార్క్ : సొంతిల్లు, ఉద్యోగం అంటూ విపరీతంగా టెన్షన్, తీవ్ర ఒత్తిళ్లకు లోనయ్యే యువతకు మున్ముందు గుండెపోటు, పక్షవాతం ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని తాజా అథ్యయనం హెచ్చరించింది. యుక్తవయసులో నిరంతరం ఆందోళన, ఒత్తిడితో చిత్తయ్యే వారిలో తర్వాతి కాలంలో గుండెపోటుతో పాటు టైప్ టూ డయాబెటిస్ ముప్పు పొంచిఉందని పేర్కొంది. జీవితారంభంలో ఎదురయ్యే ఎగుడుదిగుళ్లతో రక్తపోటు పెరగడంతో పాటు ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఉత్పత్తి అవుతుందని ఈ భారమంతా ఆయా వ్యక్తులపై తదనంతర కాలంలో గుండెపోటు వంటి విపరిణామాలకు దారితీస్తుందని ఛారిటీ హెల్త్ ఫౌండేషన్ పరిశోధన వెల్లడించింది. యువతలో నిలకడ లేమి, ఆర్థిక సమస్యలతో ఈ విషవలయంలో కూరుకుపోతారని ఛారిటీస్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బిబీ హెచ్చరించారు. యువత ఈ విషయాలను కేవలం సామాజిక సమస్యలుగా పరిగణిస్తుందని అయితే వీటి పర్యవసానాలు ఆరోగ్య సమస్యలుగా పరిణమిస్తాయని స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం ఆవిష్కరించాలని భావిస్తే యువత వ్యక్తిగత, సామాజిక సంబంధాలతో పాటు వారి గృహసంబంధ, ఉపాధి అంశాలపై వారు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఒత్తిడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని అథ్యయనం తేల్చిచెప్పింది. -
రెడ్ వైన్‌తో ఆ వ్యాధులకు చెక్
లండన్ : పరిమితంగా రెడ్ వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పలు పరిశోధనల్లో వెల్లడవగా తాజాగా రెడ్ వైన్‌లో ఉండే ఓ పదార్ధం కుంగుబాటు, యాంగ్జైటీల నుంచి ఉపశమనం కలిగిస్తుందని తేలింది. రెడ్ వైన్ తయారీలో ఉపయోగించే ద్రాక్షలో ఉండే పదార్ధం ఈ వ్యాధులను నిలువరిస్తుందని ఎలుకలపై చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. కుంగుబాటు, యాంగ్జైటీలను ప్రేరేపించే ఎంజైమ్‌ను రెడ్ వైన్‌లో ఉండే రిస్వరట్రాల్ అడ్డుకుందని పరీక్షల్లో వెలుగుచూసింది. ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు డిప్రెషన్, ఎంగ్జైటీలో నూతన చికిత్సలకు దారితీస్తాయని భావిస్తున్నారు. ఈ రెండు వ్యాధులపై రిస్వరట్రాల్ ప్రభావాన్ని యూనివర్సిటీ ఆఫ్ బఫెలో శాస్త్రవేత్తలు ఎలుకలపై పరీక్షించడం ద్వారా అంచనా వేశారు. క్యాన్సర్, అర్ధరైటిస్, డిమెన్షియా సహా పలు వ్యాధులను ప్రభావవంతంగా ఎదుర్కొనే సామర్ధ్యం రిస్వరట్రాల్‌కు ఉందని చాలా కాలంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వేరుశెనగ పప్పులోనూ ఉండే రిస్వరట్రాల్ శరీరంలో వాపు ప్రక్రియను తగ్గిస్తుందని పలు అథ్యయనాల్లో వెల్లడైంది. హాని చేసే కొవ్వులను నియంత్రించడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, బీపీని నియంత్రించడంలోనూ ఇది మెరుగ్గా పనిచేస్తుందని పలు అథ్యయనాల్లో వెలుగుచూసింది. వైన్‌లో తక్కువ పరిమాణంలో ఉండే రిస్వరట్రాల్‌ను సప్లిమెంటరీలుగా అందిచడంపైనా పలు అథ్యనాలు జరుగుతున్నాయి. -
ఇవి తింటే క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
న్యూయార్క్ : వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వారానికి ఒకసారి చేపను తినేవారితో పోలిస్తే మూడు సార్లు తీసుకునేవారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12 శాతం తక్కువగా ఉందని ఈ పరిశోధన వెల్లడించింది. అన్ని రకాల చేపలను తీసుకోవడం మంచిదే అయినా నూనె అధికంగా ఉండే సాల్మన్, మాకరెల్ చేపల కంటే ఇతర చేపలు మరింతగా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని తేలింది. చేపల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. శరీరంలో వాపు ప్రక్రియ డీఎన్ఏను ధ్వంసం చేయడం ద్వారా క్యాన్సర్‌కు దారితీస్తుందని గత అధ్యయనాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టాయి. తరచూ చేపలను తినేవారిలో నేరుగా క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గినట్టు వెల్లడైందని, ఆరోగ్యకర ఆహారంలో చేపలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ మార్క్ గుంటర్ అన్నారు. ప్రజలు పొగతాగడం మాని బరువును తగ్గించుకుని ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే క్యాన్సర్ కేసులను 40 శాతం వరకూ నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే
న్యూఢిల్లీ : సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్, మినరల్స్ వంటి డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటే మేలు కంటే కొన్ని సందర్భాల్లో కీడే అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. డైటరీ సప్లిమెంట్స్ గుండెకు సహా శరీరానికి మేలు చేయకపోగా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమని అనాల్స్ ఆఫ్ ఇంటర్నర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం స్పష్టం చేసింది. కాల్షియం, విటమిన్ డీతో కూడిన సప్లిమెంట్లు స్ర్టోక్ ముప్పును పెంచుతాయని ఈ అథ్యయనం బాంబు పేల్చింది. కాల్షియం, విటమిన్ డీలతో నేరుగా ఎదురయ్యే అనారోగ్య ముప్పులు, ప్రయోజనాలపై ఇంతవరకూ సాధికారిక ఆధారాలు ఏమీ లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బుల ప్రభావాన్ని నిరోధించడంలో మల్టీవిటమన్లు, మినరల్స్, ఇతర హెల్త్ సప్లిమెంట్లు నిర్థిష్టంగా దోహదపడ్డాయనేందుకు తమకు ఎలాంటి కొలమానాలు లభించలేదని వెల్లడైందని అథ్యయన రచయిత వెస్ట్ వర్జీనియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సఫీ యూ ఖాన్ పేర్కొన్నారు. -
ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం
టోక్యో : రొటీన్ జీవితంలో ఒత్తిడికి గురికాని వారు అరుదు. నిత్యజీవితంలో ఒత్తిడిని బ్రేక్ చేసి ఉత్సాహంగా పనిచేసేందుకు జపనీయులు ఇప్పుడు మచా టీని ఆశ్రయిస్తున్నారు. ఈ టీలో ఒత్తిడిని తగ్గించే పదార్ధాలతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్‌లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మచా పౌడర్‌ను ఎలుకలపై ప్రయోగించిన మీదట వాటిలో ఒత్తిడి, కంగారు తగ్గినట్టు గుర్తించారు. ఒత్తిడికి కారణమయ్యే డోపమైన్, సెరటోనిన్లను ఈ టీ ఉత్తేజితం చేయడం ద్వారా ప్రశాంతత చేకూరుస్తుందని పరిశోధకులు గుర్తించారు. మచాలో మానవ శరీరానికి మేలు చేకూర్చే పదార్ధాలు ఉన్నాయని తమ అథ్యయనం గుర్తించిందని అథ్యయన రచయిత, కుమమటో వర్సిటీకి చెందిన యుకి కురిచి చెప్పారు. -
వెయిట్ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు
లండన్ : హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కార్డియో వ్యాయామాలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ మేలని తాజా అథ్యయనం వెల్లడించింది. స్థూలకాయుల్లో గుండెలో పేరుకుపోయిన కొవ్వు ప్రమాదకరమని దీన్ని తగ్గించడంలో బరువులు ఎత్తడం, డంబెల్స్,పుషప్స్ వంటివి మెరుగైన వ్యాయామంగా ఉపకరిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. కార్డియో వ్యాయామాల జోలికి వెళ్లకుండా మూడు నెలల పాటు కేవలం వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకున్న స్థూలకాయుల్లో మూడింట ఒక వంతు హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గుముఖం పట్టిందని శాస్త్రవేత్తల అథ్యయనంలో వెల్లడైంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హృద్రోగాలకు దారితీసే పరిస్థితిని నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. కోపెన్హాగన్ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అథ్యయనం నిర్వహించారు. -
వీటితో అకాల మరణాలకు చెక్
లండన్ : బీపీని అదుపులో ఉంచుకుని ఉప్పు, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉంటే రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2040 నాటికి గుండె జబ్బులను ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా పెద్ద ఎత్తున నియంత్రించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఉప్పు, కొవ్వు పదార్ధాలతో తయారయ్యే ప్రాసెస్డ్ ఆహారాన్ని అధికంగా తీసుకుంటే రక్తపోటు తీవ్రమై గుండె జబ్బులకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బీపీని చికిత్స ద్వారా నియంత్రించడం వల్ల కోట్లాది మందిని అకాల మృత్యువాత పడకుండా కాపాడవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. బీపీకి సరైన చికిత్స ద్వారా 4 కోట్ల మందిని, ఉప్పు వాడకం తగ్గించడం ద్వారా మరో 4 కోట్ల మందిని మరణాల ముప్పు నుంచి తప్పించవచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధక బృందం వెల్లడించింది. ఇక కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండటం ద్వారా 2040 నాటికి రెండు కోట్ల మందిని మృత్యువు అంచు నుంచి బయటపడవేయవచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలు అథ్యయనాల్లో వెల్లడైన గణాంకాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. -
ఈ జ్యూస్‌తో గుండె జబ్బులు దూరం..
టోక్యో : ఉప్పు కలపకుండా టొమాటో జ్యూస్ నిరంతరం తీసుకోవడం బీపీ, కొలెస్ర్టాల్లను తగ్గించి గుండె జబ్బుల ముప్పును నివారిస్తుందని తాజా అథ్యయనం తేల్చింది. దాదాపు 500 మంది స్త్రీ, పురుషులను ఏడాది పాటు పరిశీలించిన మీదట ఉప్పులేని టొమాటో జ్యూస్ తీసుకున్న వారిలో బీపీ గణనీయంగా తగ్గినట్టు తేలిందని టోక్యో మెడికల్, డెంటల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అథ్యయనం వెల్లడించింది. తమ అథ్యయనంలో పాల్గొన్న వారిలో సిస్టోలిక్ బీపీ సగటున 141 ఎంఎంహెచ్‌జీ నుంచి 137కు తగ్గగా, డయాస్టలిక్ బీపీ సగటున 83.3 నుంచి 80కి తగ్గిందని పరిశోధకులు తెలిపారు. ఇక చెడు కొలెస్ర్టాల్ సగటున 155 నుంచి 149కు తగ్గినట్టు గుర్తించారు. మహిళలు, పురుషులు సహా భిన్న వయసుల వారిలో ఒకేరకంగా సానుకూల ఫలితాలను గమనించామని చెప్పారు. ఏడాదిపాటు భిన్న వయసులు, స్త్రీ, పురుషులపై ఈ తరహా అథ్యయనం జరగడం ఇదే తొలిసారని ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అథ్యయన పరిశోధకులు వెల్లడించారు. -
నిద్రలేమితో జీవనశైలి వ్యాధులు
లండన్ : కంటి నిండా నిద్ర కరవైతే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పలు పరిశోధనలు తేల్చగా..చాలినంత నిద్ర ఉన్నా ఏకబిగిన నిద్రపోకుండా తరచూ నిద్ర వేళల్లో మార్పులతో అధిక రక్తపోటు, మధుమేహం, స్ధూలకాయం వంటి జీవన శైలి వ్యాధులు చుట్టుముడతాయని తాజా అథ్యయనం స్పష్టం చేశారు. మనం విశ్రాంతి తీసుకోవడం, జీవక్రియల వేగం వంటి అంశాలను జీవ గడియారం నియంత్రిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. నిద్ర వేళల్లో మార్పులు జీవక్రియలను విచ్ఛిన్నం చేస్తాయని ఫలితంగా ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉదని బ్రిగమ్, వుమెన్స్ హాస్పిటల్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అథ్యయనం వెల్లడించింది. రోజూ ఒకే సమయంలో నిద్ర వేళలను మెయింటెన్ చేస్తే జీవక్రియల సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా కుంగుబాటును నిరోధించడంతో పాటు హృదయ ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. 45 ఏళ్ల నుంచి 84 ఏళ్ల మధ్య వయసు కలిగిన 2000 మందికి పైగా స్త్రీ, పురుషుల నిద్ర అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్ధితిని ఆరేళ్ల పాటు పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. రోజూ నిద్ర వేళలను ఒకే విధంగా ఉండేలా కచ్చితంగా పాటిస్తే జీవక్రియల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అథ్యయన సహ రచయిత డాక్టర్ సుసాన్ రెడ్‌లైన్ చెప్పారు. -
కొలెస్ర్టాల్‌తో మెదడుకు ముప్పు
లండన్ : అధిక కొవ్వుతో గుండెకు చేటు అని వైద్యులు హెచ్చరిస్తున్న క్రమంలో తాజాగా హై కొలెస్ర్టాల్‌తో అల్జీమర్స్ త్వరగా వచ్చే అవకాశం ఉందని, ఇది మెదడుకూ ముప్పు కలిగిస్తుందని ఓ అథ్యయనం స్పష్టం చేసింది. అల్జీమర్స్ జన్యువులు శరీరంలో ఉన్నాయా, లేదా అనే దానితో సంబంధం లేకుండా రక్తంలో చెడు కొలెస్ర్టాల్ అధికంగా ఉండే వారిలో అల్జీమర్స్ ముప్పు త్వరగా చుట్టుముట్టే అవకాశం ఉందని ఎమరీ యూనివర్సిటీ, అట్లాంటా వెటరన్స్ అఫైర్స్ హాస్పిటల్‌తో కలిసి చేపట్టిన అథ్యయనంలో పరిశోధకులు తేల్చారు. జ్ఞాపకశక్తిని కోల్పోయేందుకు దారితీసే అల్జీమర్స్‌కు దూరంగా ఉండేందుకు ఆరోగ్యకర ఆహారం తీసుకోవడమే మేలని తాజా అథ్యయనం సూచించింది. కాగా ఈ అథ్యయనం కోసం పరిశోధకులు 2215 మంది రక్త నమూనాలనూ, డీఎన్ఏ శాంపిల్స్‌ను పరీక్షించి ఓ అవగాహనకు వచ్చారు. చెడు కొలెస్ర్టాల్ అధికంగా ఉన్న మహిళలు, పురుషులు వారి రిస్క్ ఫ్యాక్టర్స్‌తో సంబంధం లేకుండా యుక్తవయసులోనే వారికి అల్జీమర్స్ ముంపు పొంచిఉందని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయనం పేర్కొంది. -
అలా బతికితే చాలు..
లండన్ : జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో తపన పడే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలరని తాజా అథ్యయనం వెల్లడించింది. అర్ధవంతమైన జీవితం అకాల మరణాన్ని నియంత్రిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన పరిశోధన తెలిపింది. 6985 మందిపై నిర్వహించిన ఈ పరిశోధనలో ఓ లక్ష్యంతో ముందుకెళుతున్న వారిలో అకాల మరణాల రిస్క్ గణనీయంగా తగ్గినట్టు వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన మిచిగన్ స్కూల్‌కు చెందిన డాక్టర్ లీగ్ పియర్స్ పేర్కొన్నారు. జీవితంలో ఏదో సాధించాలనే ధ్యేయంతో ఉన్న వారు ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తూ అవసరమైతే వైద్యులను సంప్రదిస్తుంటారని, ఆరోగ్యకర అలవాట్లను కలిగిఉంటారని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. అర్ధవంతమైన జీవితం ఆరోగ్యానికి బాటలు పరుస్తుందనే సంస్కృతి జపాన్‌లో వేళ్లూనుకుందని, అక్కడ పుట్టుక నుంచి మరణం వరకూ ఒక సంకల్పం కోసం సంతోషంగా బతికేయాలనే నినాదం వారిలో ఆరోగ్యకర జీవనానికి నాంది పలికిందని చెబుతున్నారు. లక్ష్యాలు, సంకల్పం వ్యక్తులను బట్టి మారినప్పటికీ ప్రతిఒక్కరూ దీర్ఘకాలం ఆరోగ్యంగా బతికేందుకు అర్ధవంతమైన జీవనం అలవరుచుకోవాలని తమ అథ్యయనంలో వెల్లడైందని డాక్టర్ లీగ్ పియర్స్ సూచించారు. -
సమయానికి తగు ఆహారమే మేలు..
లండన్ : మీ ప్లేట్లో ఆహార పదార్ధాలు ఏమి ఉన్నాయనే దాని కంటే ఏ సమయంలో వాటిని తీసుకుంటున్నారనేదే ప్రధానమని తాజా అధ్యయనం స్పష్టంచేసింది. ఆహారం తీసుకునే సమయాన్ని బట్టి జీవగడియారంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి, జీవక్రియలు, జీర్ణశక్తిపై ప్రభావం గురించి శాస్త్రవేత్తలు పరీక్షించారు. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తలు ఎలుకలపై సాగించిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మనం ఆహారం తీసుకున్న సమయంలో మన శరీరం విడుదల చేసే ఇన్సులిన్ జీవగడియారంపై, కణాలన్నీ కలిసి పనిచేయడంపై ప్రభావాన్ని ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అర్ధరాత్రి ఆహారం తీసుకుంటే అపసవ్య సమయంలో శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేయడం ద్వారా శరీరతత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడైంది. సూర్యాస్తమయంలోపే శరీరానికి అవసరమైన 75 శాతం ఆహారాన్ని తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. జీవగడియారం లయ తప్పడంతోనే డయాబెటిస్, స్ధూలకాయం, జీవక్రియల లోపాలు, గుండె సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఆధునిక జీవితంలో ఉద్యోగుల షిఫ్ట్ సమయాలు, నిద్ర లేమి వంటివి మన జీవగడియారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయని అధ్యయనంలో పాలుపంచుకున్న వర్సిటీ సీనియర్ లెక్చర్ డాక్టర్ డేవిడ్ బెక్ వెల్లడించారు. -
మధుమేహులకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే..
న్యూయార్క్ : టైప్ టూ డయాబెటిస్తో బాధపడేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే మేలని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. వీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ రోజంతా నియంత్రణలో ఉండాలంటే మధుమేహులు అధిక కొవ్వు, తక్కువ కార్బోహైడ్రేట్లతో కూడిన అల్పాహారం తీసుకుంటే మంచిదని పరిశోధకులు పేర్కొన్నారు. తృణధాన్యాలు, ఓట్స్, పండ్లు సహా పాశ్చాత్య బ్రేక్‌ఫాస్ట్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో టైప్ 2 మధుమేహంతో బాధపడేవారికి ఉదయాన్నే బ్లడ్ షుగర్ అధికమవుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనంకి నేతృత్వం వహించిన జొనాథన్ లిటిల్ చెప్పారు. టైప్ టూ మధుమేహుల్లో అల్పాహారమే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచేస్తోందని తమ అధ్యయనంలో వెల్లడైందని అన్నారు. వీరిలో షుగర్ లెవెల్స్‌ను భారీగా తగ్గించేందుకు తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక కొవ్వుతో కూడిన ఆహారంతో రోజును ప్రారంభించడం మేలని చెప్పారు. ఇది షుగర్‌తో వచ్చే అనుబంధ లక్షణాలను కూడా నియంత్రించేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. లంచ్, డిన్నర్లో కూడా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. మధుమేహులే కాకుండా అందరూ ఈ తరహా ఆహారాన్ని అనుసరించడం ఆరోగ్యకరమని చెప్పారు. -
సాల్ట్, షుగర్‌తో బీ కేర్‌ఫుల్..
లండన్ : అధిక మోతాదులో ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్ధాలను తీసుకోవడంతో 2017లో ప్రపంచవ్యాప్తంగా కోటి పది లక్షల మంది మృత్యువాత పడ్డారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఉప్పు, చక్కెరతో పాటు ప్రాసెస్ చేసిన మాంసాహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులతో ఈ మరణాలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషించింది. ఆహార సంబంధిత మరణాలు ఉజ్బెకిస్తాన్‌లో అధికంగా, ఇజ్రాయెల్‌లో తక్కువగా ఉన్నట్టు ది లాన్సెట్ ఆన్లైన్లో ప్రచురితమైన ఈ పరిశోధన వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా 43వ స్ధానంలో, బ్రిటన్ 23వ స్ధానం, చైనా 140వ స్ధానంలో భారత్ 118వ స్ధానంలో నిలిచాయి. గింజలు, సీడ్స్, పాలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకర ఆహారం వినియోగం సగటు బాగా తక్కువగా ఉందని, చక్కెర కలగలిసిన పానీయాలు, ఉప్పు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం పెరగడం ఫలితంగా 2017లో ప్రతి ఐదు మరణాల్లో ఒక మరణం చెడు ఆహారాన్ని తీసుకోవడం వల్లే సంభవించిందని తెలిపింది. ఆరోగ్యకర ఆహారమైన గింజలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను కేవలం 12 శాతం ప్రజలు మాత్రమే ఆహారంలో తీసుకుంటున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. -
కీటో డైట్‌తో గుండెకు చేటు
లండన్ : కొవ్వును కరిగించి స్ధూలకాయాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కీటో డైట్‌పై తాజా అథ్యయనం బాంబు పేల్చింది. కార్బొహైడ్రేట్లను ఆహారంలో తగ్గించే ఈ డైట్ ద్వారా గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పు అధికమని అథ్యయనం హెచ్చరించింది. సెలబ్రిటీలు సైతం వాడుతున్న కీటో ఆహారంతో గుండెకు చేటేనని సర్వే తేల్చింది. ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదని వెల్లడించింది. కీటో ఆహారంలో భాగంగా ధాన్యాలు, పండ్లు, కూరగాయలను తగ్గించడం ద్వారా గుండెకొట్టుకునే వేగం లయతప్పుతుందని, ఇది గుండె పోటు వంటి తీవ్ర అనర్ధాలకు దారితీస్తుందని తమ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు. బరువు తగ్గే క్రమంలో పాటిస్తున్న కీటో డైట్‌పై జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్య నిపుణులకు అథ్యయన రచయిత సన్ యాట్-సేన్ యూనివర్సిటీ, చైనాకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ జుంగ్ సూచించారు. కార్బోహైడ్రేట్ల స్ధానంలో ప్రొటీన్, కొవ్వు పదార్ధాలు తీసుకున్నప్పటికీ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారంతో గుండె కొట్టుకునే వేగం లయ తప్పుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని ఆయన చెప్పారు. 14,000 మంది ఆహారపు అలవాట్లను రెండు దశాబ్ధాల పాటు పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. -
పుషప్స్‌తో గుండె పదిలం
లండన్ : పుషప్స్‌తో గుండెకు మేలని, రోజుకు 40 పుషప్స్ చేసే పురుషులకు గుండె పోటు, స్ర్టోక్ ముప్పు 96 శాతం తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. ట్రెడ్మిల్ టెస్ట్‌లతో పోలిస్తే ఫిట్నెస్ స్ధాయిలను పరీక్షించేందుకు పుషప్స్ మెరుగైన మార్గమని పేర్కొంది. రోజుకు పది నుంచి 40 పుషప్స్ చేసే వారిలో దీర్ఘకాలంలో గుండె జబ్బులు, గుండె పోటు అవకాశాలు గణనీయంగా తగ్గాయని తమ పరిశోధనలో వెల్లడైందని హార్వర్డ్ వర్సిటీకి చెందిన డాక్టర్ జస్టిన్ యంగ్ పేర్కొన్నారు. గుండె జబ్బును గుర్తించడంలో రోగి స్వయంగా వెల్లడించే అంశాలతో పాటు, ఆరోగ్య, జీవనశైలి ఆధారంగానే వైద్యులు ఓ అంచనాకు వస్తున్నారని, కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్ వంటి కీలక హెల్త్ రిస్క్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ అథ్యయనం వెల్లడించింది. పుషప్స్ సామర్ధ్యాన్ని సులభంగా, ఎలాంటి వ్యయం లేకుండా పరీక్షించవచ్చని, దీంతో రాబోయే రోజుల్లో వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని అథ్యయన రచయిత స్టెఫాన్స్ కేల్స్ వెల్లడించారు. ఫిబ్రవరి 2000 నుంచి నవంబర్ 2007 మధ్య దాదాపు వేయి మంది ఫైర్ఫైటర్లపై జరిపిన పరిశోధనలో ఈ అంశాలు గుర్తించామన్నారు. అథ్యయన వివరాలు జామా నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమయ్యాయి. -
ఇవి తీసుకుంటే ఉద్యోగం వచ్చినట్టే..
లండన్ : రోజూ తీసుకునే ఆహారానికి అదనంగా పండ్లు, కూరగాయలను జోడిస్తే మానసికంగా ఉల్లాసంగా ఉండటంతో పాటు నిరుద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి అడుగుపెట్టిన తీరున ఉత్సాహంతో ఉరకలు వేయవచ్చని తాజా అథ్యయనంలో తేలింది.తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటే గుండెకు మంచిదని వైద్యులు సూచిస్తుంటే వీటిని ఆహారంలో అధికంగా తీసుకుంటే మానసికంగానూ ధృడంగా ఉంటారని ఈ అథ్యయనం వెల్లడించింది. యాపిల్స్, క్యారెట్, అరటిపండ్లు మానసిక ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తాయని ఈ అథ్యయనం పేర్కొంది. రోజూ తీసుకునే ఆహారంలో మీరు తాజా పండ్లు, కూరగాయలను తొలగిస్తే మీ మానసిక స్థితి జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి పరిస్థితిలా తయారవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొనడం గమనార్హం. పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకునే వారి మానసిక ఆరోగ్యం స్వల్పకాలంలోనే ఉత్సాహంగా మారుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ రీసెర్చి ఫెలో నీల్ ఓషన్ చెప్పుకొచ్చారు. దాదాపు 50,000 మందిపై తాము జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయని నీల్ తెలిపారు. -
రక్తపోటు నియంత్రణతో ఆ రిస్క్‌కు చెక్
లండన్ : అధిక రక్తపోటుతో గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు, కిడ్నీ వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న క్రమంలో బీపీని నియంత్రణలో ఉంచితే అల్జీమర్స్, డిమెన్షియా ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనంస్పష్టం చేసింది. రక్తపోటును అదుపులో ఉంచుకునే వారిలో మతిమరుపు రిస్క్ 19 శాతం తక్కువగా ఉన్నట్టు 50 సంవత్సరాల పైబడిన 9000 మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఇక వీరిలో డిమెన్షియా ముప్పు 15 తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. రక్తపోటును పూర్తి అదుపులో ఉంచుకోవడం ద్వారా డిమెన్షియా ముప్పును తగ్గించవచ్చని పరిశోధనలో తేలని క్రమంలో ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు మార్గం సుగమమైందని అల్జీమర్స్ అసోసియేషన్‌కు చెందిన చీఫ్ సైన్స్ అధికారి డాక్టర్ మారియా కరిల్లో చెప్పుకొచ్చారు. రక్తపోటును మూడేళ్ల పాటు పూర్తిగా అదుపులో ఉంచుకుంటే అది గుండె, మెదడు ఆరోగ్యాలపై సానుకూల ప్రభావం చూపినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన నార్త్ కరోలినాకు చెందిన వేక్ ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అథ్యాపకుడు ప్రొఫెసర్ జెఫ్ విలియమ్సన్ వెల్లడించారు. -
అది కొకైన్, హెరాయిన్‌తో సమానం
లండన్ : సోషల్ మీడియాకు బానిసైతే అది తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందని గత అథ్యయనాలు స్పష్టం చేయగా, ఫేస్బుక్, ట్విటర్లకు అడిక్ట్ కావడం, కొకైన్, హెరాయిన్‌లకు బానిసవడం వంటిదేనని తాజా అథ్యయనం హెచ్చరించింది. సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన వారు నిజజీవితంలో స్ధిరమైన నిర్ణయాలు తీసుకోలేరని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ చేపట్టిన ఈ అథ్యయన నివేదిక కుండబద్దలు కొట్టింది. కొకైన్, హెరాయిన్ల వంటి డ్రగ్స్ తీసుకునే వారిలో కనిపించే ప్రవర్తనా శైలి సోషల్ మీడియా అడిక్ట్స్లో కనిపిస్తుందని ఈ అథ్యయన పరిశోధనా పత్రం పేర్కొనడం గమనార్హం. 71 మందిపై చేపట్టిన ఈ సర్వేలో ఫేస్‌బుక్‌పై గంటల తరబడి కాలక్షేపం చేసేవారు స్ధిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, వారితో పోలిస్తే ఎఫ్‌బీపై తక్కువ సమయం వెచ్చిస్తున్న వారు చురుగ్గా ఉంటున్నారని వెల్లడైంది. సోషల్ మీడియా దుష్ప్రభావాలపై తాజా సర్వే వెల్లడించిన అంశాలు చర్చకు తావిస్తున్నాయి. కాగా సోషల్ మీడియా ఎడిక్షన్‌తో కుంగుబాలు, గాబరా, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని గతంలో రాయల్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్ సర్వే నివేదిక స్పష్టం చేసింది. -
వెలివేతతో ఇస్లామిక్ తీవ్రవాదానికి ఊతం
లండన్: ఇస్లామిక్ తీవ్రవాదం పేట్రేగిపోవడానికి సామాజిక బహిష్కరణ లేదా వెలివేత కూడా ఓ కీలక కారణమని తాజా అధ్యయనంలో తేలింది. మెడికల్ సైన్స్, న్యూరోఇమేజింగ్ పద్ధతుల ద్వారా తీవ్రవాదానికి ఆకర్షితులైన వ్యక్తులను విశ్లేషించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న నఫీస్ హమీద్ మాట్లాడుతూ..‘ సామాజిక బహిష్కరణకు గురైనప్పుడు తీవ్రవాదంవైపు మొగ్గుచూపే ఆలోచనలు పెరుగుతున్నాయని గుర్తించాం. 2017లో స్పెయిన్‌లోని లాస్ రమ్బ్లాస్ జిల్లాలో జరిగిన ఇస్లామిక్ స్టేట్ దాడిలో 13 మంది చనిపోగా దాదాపు 100 మంది గాయపడ్డారు. ఆ నేపథ్యంలో 535 మంది ముస్లిం వ్యక్తులను పరిశోధనకు ఎంపిక చేసుకున్నాం. ముగ్గురు సభ్యులు ఆడే వర్చువల్ గేమ్ ‘సైబర్ బాల్’లో వీరిని భాగస్వాములు చేశాం. ఆ ఆటలో ఇద్దరు స్పెయిన్ పౌరుల ముఖకవళికలతో ఉన్న ఆటగాళ్లు వీరిని నిర్లక్ష్యం చేసేలా చేసి వారి మెదళ్లను స్కాన్ చేయడంతో పాటు వారి అభిప్రాయాలను సేకరించాం. ఇందులో పాల్గొన్న వ్యక్తులు పాఠశాలల్లో ఇస్లామిక్ బోధన, మసీదులు కట్టడం వంటి విషయాలు ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో 38 మంది మొరాక్ సంతతి వ్యక్తులు హింసను ప్రేరేపించేందుకు అంగీకరించారు’ అని పేర్కొన్నారు. -
ఆ నగరాల జాబితాలో హైదరాబాద్
సాక్షి, న్యూఢిల్లీ : 2019 నుంచి 2035 మధ్య అత్యంత వేగంగా ఎదిగే టాప్ 20 నగరాల జాబితాలో 17 భారతీయ నగరాలకు చోటు దక్కింది. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వెల్లడించిన ఈ జాబితాలో సూరత్ అగ్రస్ధానంలో నిలవగా వరుసగా ఆగ్రా, బెంగళూర్, హైదరాబాద్, నాగపూర్, తిరుపూర్, రాజ్‌కోట్, తిరుచిరాపల్లి, చెన్నై, విజయవాడలు నిలిచాయి. అయితే 2035 నాటికి ఈ నగరాల మొత్తం జీడీపీ చైనా నగరాల జీడీపీతో పోల్చితే తక్కువగానే ఉంటుందని వార్షిక ప్రపంచ నగరాల పరిశోధన నివేదికలో ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ పేర్కొంది. ఉత్తర అమెరికా, యూరప్ నగరాల కంటే అధికంగా చైనా నగరాలే 2035 నాటికి అత్యధిక ఉత్పత్తులు సమకూరుస్తాయని అంచనా వేసింది. ఇక 2018-2035 మధ్య సూరత్ 9.2 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత నగరాల జాబితాలో నెంబర్ వన్‌గా నిలిచింది. భారత్ వెలుపల కంబోడియా రాజధాని ఫెమ్ ఫన్ అత్యధికంగా 8.1 శాతం సగటు వార్షిక వృద్ధితో ఎదుగుతాయని ఈ అథ్యయనం పేర్కొంది. ఆసియా నగరాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నా 2035 నాటికి సైతం అమెరికా నగరం న్యూయార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా తన ప్రతిష్టను నిలుపుకుంటుందని అంచనా వేసింది. -
మధుమేహులకు పండ్లతో మేలు..
లండన్ : తీపి పదార్ధాలతో పోలిస్తే కృత్రిమ పానీయాలతోనే టైప్ టూ మధుమేహ ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఫ్రక్టోజ్‌తో కూడిన డైట్ మన ఆహారంలో పోషక రహిత శక్తిని చొప్పించి రక్తంలో చక్కెర స్ధాయిలపై పెను ప్రమాదం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే పండ్లు, కూరగాయలు, సహజసిద్ధమైన పండ్ల రసాలు, తేనె వంటి ఆహారం, పానీయాలతో ఎలాంటి ముప్పు లేదని వెల్లడించారు. సోడాతో పాటు శీతల పానీయాలు, బేకరీ పదార్ధాలు, స్వీట్లకు దూరంగా ఉండాలని కెనడాకు చెందిన సెయింట్ మైఖేల్ హాస్పిటల్, టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు సూచించారు. గతంలో మధుమేహం, ఆహారానికి ఉన్న సంబంధంపై వెలువడిన 155 అథ్యయనాలను విశ్లేషించి ఈ పరిశోధనల చేపట్టారు. అదనపు క్యాలరీలు లేని ఫ్రక్టోజ్ చక్కెరతో కూడిన ఆహారంతో ఎలాంటి అనర్ధం ఉండదని పరిశోధక బృందం తేల్చింది. డయాబెటిస్తో బాధపడే వారిలో చక్కెరలో గ్లూకోజ్, ఇన్సులిన్లను నియంత్రించేందుకు తాజా పండ్లు, పండ్ల రసాలు ఉపయోగపడతాయని తాజా అథ్యయనం వెల్లడించడం గమనార్హం. శీతల పానీయాలతో మాత్రం మధుమేహుల ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది. పండ్లలో అధికంగా ఉండే పీచు పదార్ధం శరీరంలో చక్కెరను విడుదల చేసే ప్రక్రియను నెమ్మదింపచేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.మధుమేహ నియంత్రణ, నివారణలో తమ అథ్యయన వివరాలు ఉపయోగపడతాయని అథ్యయన రచయిత డాక్టర్ జాన్ సివెన్‌పైపర్ పేర్కొన్నారు. . -
కుంగుబాటుతో స్ర్టోక్ ముప్పు
లండన్ : కుంగుబాటుకు గురైన వారిలో హృదయ స్పందనలు అస్తవ్యస్తంగా తయారై స్ర్టోక్, అకాల మరణానికి దారితీసే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. కుంగుబాటును నివారించే మాత్రలతో ఈ రిస్క్‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది. కుంగుబాటును నివారించే మందులు వాడే ముందు వీరి అకాల మరణం ముప్పు ఏడు రెట్లు ఉండగా, చికిత్స తీసుకున్న నెలలోనే ముప్పు మూడు రెట్లకు తగ్గిందని అథ్యయనంలో వెల్లడైంది. డెన్మార్క్‌కు చెందిన అర్హస్ యూనివర్సిటీ పరిశోధకులు 2000 నుంచి 2013 వరకూ కుంగుబాటు మందులు తీసుకుంటున్న 7.8 లక్షల మందిని పరీక్షించిన అనంతరం ఈ వివరాలు వెల్లడించింది. మనసుకు, గుండెకు మధ్య ఉన్న సంబంధం ఈ అథ్యయనంలో ప్రస్ఫుటంగా స్పష్టమైందని పరిశోధకులు పేర్కొన్నారు. కుంగుబాటుకు లోనైన వ్యక్తులు అస్తవ్యస్త హార్ట్‌బీట్‌తో పాటు గుండెకొట్టుకునే వేగం అసాధారణంగా పెరిగే సమస్యను ఎదుర్కొంటారని, మందులతో దాన్ని నియంత్రించవచ్చని అథ్యయనం వెల్లడించింది. మానసిక సమస్యలు గుండెపై ప్రభావం చూపవచ్చనేందుకు తమ అథ్యయనంలో ఆధారాలు లభించాయని పరిశోధకులు పేర్కొన్నారు. అథ్యయన వివరాలు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. -
యాంటీబయాటిక్స్‌తో స్ధూలకాయం
లండన్ : యాంటీబయాటిక్స్ వాడకంతో వాటిల్లే అనర్ధాలపై వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో చిన్నారులు ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలకు యాంటీబయాటిక్స్ మరింత ప్రమాదమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. నవజాత శిశువులు, రెండేళ్లలోపు చిన్నారులకు యాంటీబయాటిక్స్ ఇస్తే భవిష్యత్‌లో వారిని ఊబకాయం వెంటాడే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం వీటిని తీసుకుంటే ఒబెసిటీ ముప్పు మరింత పెరుగుతుందని పేర్కొంది. బాలికలకు నాలుగైదు రకాల యాంటీబయాటిక్స్ ఇస్తే వారు మున్ముందు స్ధూలకాయంతో బాధపడే పరిస్ధితి 50 శాతం అధికమని అంచనా వేసింది. రెండేళ్ల పాటు పిల్లలకు యాంటీబయాటిక్స్ రిఫర్ చేస్తే వారు స్ధూలకాయం బారిన పడే ముప్పు 26 శాతం పెరుగుతుందని పేర్కొంది. మూడు లక్షల మందికి పైగా పిల్లలపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. యాంటీబయాటిక్స్ తీసుకున్న వారిలో దాదాపు 47,000 మంది పిల్లలు ఆ తర్వాత అనూహ్యంగా బరువు పెరిగారని పరిశోధనలో తేలింది. శరీర బరువును నియంత్రించే కీలక బ్యాక్టీరియాను ఈ శక్తివంతమైన ఔషధాలు నాశనం చేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. జలుబు వంటి చిన్న అనారోగ్యాలకు సైతం పిల్లలకు అనవసరంగా యాంటీబయాటిక్స్‌ను వాడుతున్నారని అథ్యయనానికి నేతృత్వం వహించిన మేరీల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ కేడ్ న్యూలాండ్ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్లో ఊబకాయంతో మున్ముందు వారు రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యాంటీబయాటిక్స్‌ను పిల్లలకు అత్యవసరమైతే తప్ప సిఫార్సు చేయరాదని పరిశోధకులు సూచిస్తున్నారు. -
ఒత్తిడితో మెదడుపై పెనుప్రభావం..
లండన్ : మధ్యవయస్కుల్లో ఒత్తిడితో మెదడు కుచించుకుపోయి జ్ఞాపక శక్తి దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ ప్రభావంతో మెదడు కుచించుపోతున్నట్టు గుర్తించారు. ఒత్తిడి హార్మోన్ అత్యధికంగా విడుదల కావడం మున్ముందు డిమెన్షియా ముప్పుకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి ప్రజల ఆలోచనా ధోరణిని కూడా ప్రభావితం చేస్తుందని జర్నల్ న్యూరాలజీలో ప్రచురితమైన హార్వర్డ్ మెడికల్ స్కూల్ అథ్యయనం వెల్లడించింది. పరిశోధన కోసం 49 ఏళ్ల సగటు వయసు కలిగిన 2231 మందిని డాక్టర్ జస్టిన్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు పరీక్షించారు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ డిమెన్షియా ప్రారంభ లక్షణాలైన మెదడు కుచించుకుపోవడం, జ్ఞాపకశక్తి మందగించడాన్ని ఆయా వ్యక్తుల్లో తమ పరిశోధనలో భాగంగా గుర్తించామని డాక్టర్ జస్టిన్ వెల్లడించారు. తగినంత నిద్ర, సరైన వ్యాయామం, ఆహ్లాదంగా గడపటం వంటి చర్యలతో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రజలు చొరవ చూపాలని సూచించారు. అవసరమైతే ఒత్తిడిని పెంచే కార్టిసోల్‌ను నియంత్రించే మందులను వైద్యులను సంప్రదించి తీసుకోవాలన్నారు. కార్టిసోల్ అధికంగా విడుదలయ్యే రోగుల పట్ల వైద్యులు తగిన శ్రద్ధ చూపాలని సూచించారు. -
శీతాకాలంలో పెరగనున్న హృద్రోగ ముప్పు..
లండన్ : శీతాకాలంలో గుండె జబ్బుల ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. చలికాలంలో శీతల గాలులు, తక్కువ సూర్యరశ్మి కారణంగా రక్తనాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉందని, ఇది గుండె పోటుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గి పెనుముప్పు ఎదురయ్యే అవకాశం పది శాతం అధికమని అథ్యయన రచయిత, లండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఎర్లింగె వెల్లడించారు. శీతాకాలంలో జలుబు, ఫ్లూ జ్వరాలు సాధారణం కాగా, గుండె జబ్బుల రిస్క్ కూడా అధికమని చెప్పారు. జీరో సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఈ ముప్పు అధికమని వెల్లడించారు. స్వీడిష్ నేషనల్ రికార్డులను 1998 నుంచి 2013 వరకూ పరిశోధకులు విశ్లేషించి ఈ అంచనాకు వచ్చారు. 50 నుంచి 89 ఏళ్ల మధ్య 2,74,000 మంది సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. తక్కువ ఉష్ణోగ్రతలతో పాటు చలిగాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండే రోజుల్లో గుండె పోటు ముప్పు అధికమని ప్రొఫెసర్ ఎర్లింగె తెలిపారు. ఉష్ణోగ్రతలు సున్నా సెంటీగ్రేడ్ (32 డిగ్రీల ఎఫ్) కంటే తక్కువగా ఉన్న రోజుల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడైందని చెప్పారు. ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరిగిన సందర్భాల్లో గుండె పోటు రిస్క్ తక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. రక్త సరఫరా నిలిచిపోయి గుండె కణాలు నిర్జీవమవడంతో వచ్చే గుండెపోటు అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించాలన్నారు. శీతాకాలంలో కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి హానికరమని, అలాగే సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో విటమిన్ డీ సరిగ్గా అందకపోవడం కూడా గుండె జబ్బుల రిస్క్ పెంచుతుంది. కాగా అథ్యయన వివరాలు జామా కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
సేంద్రియ ఆహారంతో క్యాన్సర్‌కు చెక్
లండన్ : క్రిమిసంహారక మందులకు దూరంగా సేంద్రియ ఆహారం తీసుకుంటే క్యాన్సర్ ముప్పు 86 శాతం వరకూ తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. బ్లడ్ క్యాన్సర్ సహా ఏ తరహా క్యాన్సర్ ముప్పు అయినా సేంద్రియ ఆహారం మాత్రమే తీసుకునేవారికి 25 శాతం తక్కుగా ఉంటుందని, చర్మ, బ్రెస్ట్ క్యాన్సర్లు సోకే అవకాశం మూడోవంతు తగ్గుతుందని అథ్యయనం పేర్కొంది. స్ధూలకాయుల్లో సేంద్రియ ఆహారంతో మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని తమ అథ్యయనంలో గుర్తించామని పరిశోధకులు పేర్కొంది. సేంద్రియ ఆహారాన్ని అధికంగా తీసుకునే వారిలో క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉన్నట్టు తమ పరిశోధన వెల్లడించిందని అథ్యయన రచయిత, సెంటర్ ఆఫ్ రీసెర్చి ఇన్ ఎపిడెమాలజీకి చెందిన డాక్టర్ జులియా బుద్రీ చెప్పారు. పురుగుమందులు వాడకుండా పండించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని, క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రజలు సేంద్రియ ఆహారాన్నే తీసుకోవాలని సూచించారు. అథ్యయన వివరాలు జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఆ మందులు వృధానే..
లండన్ : హెల్త్ సప్లిమెంట్, విటమిన్ ట్యాబ్లెట్లతో సమయం, డబ్బు వృధా కావడంతో పాటు ఆరోగ్యానికి ముప్పు కొనితెచ్చుకున్నట్టేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ మందులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్న దాఖలాలు లేవని మందుల భద్రతపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేఫ్టీ ఆఫ్ మెడిసిన్స్ కమిటీ మాజీ సలహాదారు డాక్టర్ పౌల్ క్లేటన్ స్పష్టం చేశారు. వీటి నియంత్రణకు పటిష్ట నిబంధనలు, యంత్రాంగం అవసరమన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ పేలవమైన ఫార్ములాతో కూడిన మందులతో విపరీతమైన ప్రచారంతో అమ్మకాలు సాగిస్తున్నారని, వీటితో ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు, తక్కువ నాణ్యతతో వీటిని రూపొందించడంతో ఎలాంటి ఫలితాలు దక్కడం లేదన్నారు. హెల్త్ సప్లిమెంట్స్‌లో బహుళ ప్రాచుర్యం పొందిన చేప నూనెతో తయారయ్యే క్యాప్సూల్స్, మల్టీవిటమిన్స్ రెండూ ప్రోత్సాహకర ఫలితాలు ఇవ్వడం లేదని తమ పరిశోధనలో తేలిందని క్లేటన్ చెప్పారు. మల్టీవిటమిన్స్ తీసుకుంటే గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పు తగ్గలేదని చెప్పుకొచ్చారు. ఇకబ్రిటన్ సహా ఐరోపా యూనియన్‌లో విక్రయించే సంస్ధలు స్ధానిక ఆహార చట్టానికి అనుగుణంగా ఆహార సప్లిమెంట్స్‌ను విక్రయించాలని డాక్టర్ ఎమ్మా డెర్బీషైర్ సూచించారు. -
వ్యాయామంతో వ్యాధులకు చెక్
లండన్ : క్యాన్సర్, మధుమేహం, డిమెన్షియా, కుంగుబాటు వంటి జబ్బుల బారిన పడిన వారిని వ్యాయామం చేసేలా వైద్యులు, హెల్త్‌కేర్ సిబ్బంది ప్రోత్సహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దైనందిన జీవితంలో మరింత చురుకుగా ఉండటం ద్వారా ఆయా వ్యాధుల తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు. వైద్యులు తమ రోగుల శారీరక చురుకుదనం గురించి ఆరా తీయాలని, వ్యాయామం ద్వారా చేకూరే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించాలని సూచించారు. డాక్టర్ లేదా నర్సు చెబితే నలుగురు రోగుల్లో ఒక్క రోగైనా శారీరకంగా చురుకుగా ఉండేందుకు చొరవ చూపుతారని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైద్యుల్లో మూడొంతుల మంది రోగుల శారీరక చురుకుదనం గురించి మాట్లాడటం లేదని తాజా అథ్యయనం వెల్లడించింది. వ్యాయామం ద్వారా స్ధూలకాయం ముప్పును తగ్గించడం ద్వారా జీవనశైలి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. చురుకైన జీవనశైలిని పాటించడం ద్వారా టైప్ 2 మధుమేహ ముప్పును తగ్గించుకోవండం ద్వారా అధిక రక్తపోటు ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బుల ముప్పును 40 శాతం మేర తగ్గించవచ్చని, స్ర్టోక్, కుంగుబాటు ముప్పును కూడా 30 శాతం మేర తగ్గించవచ్చని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్, స్పోర్ట్ ఇంగ్లండ్ స్పష్టం చేశాయి. -
ఇవి తీసుకుంటే మధుమేహానికి దూరం
లండన్ : కొవ్వు అధికంగా ఉండే వెన్న, పెరుగు, మీగడ వంటి డైరీ ఉత్పత్తులను తరచూ తీసుకుంటే టైప్ 2 మధుమేహం ముప్పు తగ్గించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. వీటిని తక్కువగా తినేవారితో పోలిస్తే అత్యధికంగా తీసుకునేవారిలో టైప్ 2 మధుమేహం ముప్పు 30 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాగా కొవ్వు తక్కువగా ఉండే డైరీ ఉత్పత్తులను ఎంచుకోవాలని అమెరికన్లకు యూఎస్ డైటరీ గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి. పాలు, ఇతర డైరీ ఉత్పత్తుల్లో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో తాజా అథ్యయనం ఆసక్తికర అంశాలను ముందుకుతెచ్చింది. డైరీ ఉత్పత్తులను తీసుకోకుండా ప్రజలను ప్రోత్సహించరాదని తమ అథ్యయనంలో వెల్లడైందని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి పరిశోధకులు తెలిపారు. డైరీ ఆహారంతో చేకూరే జీవక్రియల ప్రయోజనాలపై పునఃసమీక్ష అవసరమని పేర్కొన్నారు. డైరీ ఉత్పత్తుల్లో గుండె జబ్బులకు దారితీసే ఎల్డీఎల్ కొలెస్ర్టాల్‌ను పెంచే కొవ్వు ఉత్పత్తులు ఉంటాయని గత అథ్యయనాల ఆధారంగా వీటిని పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్న క్రమంలో తాజా అథ్యయనం వెల్లడించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. గత 20 ఏళ్లుగా 63,600 మందికి పైగా హెల్త్ రికార్డులను పరిశీలించిన మీదట తాజా అథ్యయనం ఈ అంచనాలకు వచ్చింది. వీరిలో అత్యధికంగా డైరీ కొవ్వులను తీసుకున్న వారిలో టైప్ 2 మధుమేహం వచ్చిన వారు తక్కువగా ఉన్నట్టు తేలింది. డైరీ ఫ్యాట్ తక్కువగా తీసుకున్న వారిలో టైప్ 2 మధుమేహం బారిన పడిన వారు ఎక్కువ మంది ఉన్నట్టు పరిశోధనలో తేలింది. డైరీ ఫ్యాట్ బయోమార్కర్లకు వారి టైప్ 2 మధుమేహం ముప్పు తక్కువగా ఉండటానికి దగ్గరి సంబంధం ఉన్నట్టు తొలిసారిగా తమ అథ్యయనంలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి చెందిన డాక్టర్ ఫుమియకి ఇమముర పేర్కొన్నారు. దీనిపై విస్తృత అథ్యయనం అవసరమని తమ పరిశోధనలో గుర్తించామని చెప్పారు. -
వాయుకాలుష్యంతో కిడ్నీ వ్యాధుల ముప్పు
లండన్ : విషవాయువులతో శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయని పలు అథ్యయనాలు వెల్లడవగా, వాయు కాలుష్యం తీవ్ర కిడ్నీ వ్యాధులకు దారితీస్తుందని తాజా అథ్యయనం పేర్కొంది. కిడ్నీ పనితీరుపై గాలిలోని హానికారక పదార్ధాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. పొగతాగడం తరహాలోనే హానికారక పదార్ధాలు కలిగిన వాయు కాలుష్యం ద్వారా నేరుగా మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అధ్యయన రచయిత జెన్నిఫర్ బ్రాగీషమ్ స్పష్టం చేశారు. కిడ్నీల నుంచి పెద్ద మొత్తంలో రక్తం ప్రవహిస్తుందని, ఈ ప్రక్రియలో ప్రవాహ వ్యవస్థకు చిన్నపాటి విఘాతం కలిగినా తొలుత కిడ్నీలపై ప్రభావం పడుతుందని చెప్పారు. కాలుష్య ప్రాంతాల్లో నివసించే మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి హైరిస్క్ రోగులు కాలుష్యం బారిన పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి వీచే ప్రాంతాలతో పోలిస్తే కాలుష్య ప్రాంతాల్లో మూత్రపిండాల వ్యాధులు సహజంగానే అధికమని అథ్యయనం పేర్కొంది. -
మద్యానికి ఓ నెల దూరమైతే..
లండన్ : మద్యం ముట్టకుండా ఓ నెలరోజులు గడిపితే సానుకూల ఫలితాలు చేకూరుతాయని తాజా అథ్యయనం వెల్లడించింది. 30 రోజుల పాటు మద్యాన్ని తీసుకోకుండా ఉంటే రక్తపోటు తగ్గడంతో పాటు, క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుందని, ఇన్సోమ్నియాకు చెక్ పెడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొంది. తాగుబోతుల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు 20 శాతం వరకూ తగ్గుతుందని ఈ అథ్యయనం వెల్లడించింది. నెలపాటు మద్యానికి దూరంగా ఉండటం వల్ల సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని బీబీసీ 2 హెల్త్ షో నిర్వహించే డాక్టర్ మైఖేల్ మోస్లీ పేర్కొన్నారు. నెలరోజులు మద్యాన్ని తీసుకోకుండా ఉండటం ఓ ఔషధం వంటిందని, ఈ ఔషధం విలువ బిలియన్ డాలర్లు ఉంటుందని అథ్యయన రచయిత, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ రాజీవ్ జలన్ పేర్కొన్నారు. 26 మంది వాలంటీర్లపై ఈ పరిశోధన చేపట్టగా నాలుగు వారాల పాటు మద్యాన్ని సేవించని వారి రక్తపోటు, ఇతర వ్యాదులు చుట్టుముట్టే రిస్క్ తగ్గినట్టు తేలింది. మద్యం తీసుకోని వారంతా తమకు నిద్ర బాగా పట్టిందని, ఏకాగ్రత పెరిగిందని, ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలిగిందని చెప్పారని పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా తాగుబాతుల కాలేయంలో కొవ్వు 20 శాతం తగ్గగా, తక్కువగా మద్యం సేవించే వారిలో పది శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. మద్యం సేవించే వారి రక్తంలో క్యాన్సర్ మార్కర్ల సర్కులేషన్ సైతం తగ్గినట్టు వెల్లడైంది. కాగా నాలుగు వారాల పాటు మద్యానికి దూరంగా ఉన్న వాలంటీర్లలో కొద్ది మోతాదులో మద్యం తీసుకునేవారు యథావిథిగా తమ అలవాటును కొనసాగిస్తుండగా, అతిగా మద్యం సేవించే వారు 70 శాతం తక్కువగా తీసుకుంటున్నారని, మరికొందరు మొత్తానికే మద్యం అలవాటును వదిలివేశారని పరిశోధకులు పేర్కొన్నారు. -
మన స్టెంట్లే మేలు..
సాక్షి, న్యూఢిల్లీ : బహుళజాతి కంపెనీలు రూపొందించే స్టెంట్లతో పోలిస్తే దేశీయంగా తయారయ్యే కరోనరీ స్టెంట్లే మేలైనవని తాజా అథ్యయనం వెల్లడించింది. అమెరికాలోని శాండియాగోలో నాన్ సర్జికల్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్పై ఇటీవల జరిగిన సదస్సులో అథ్యయన వివరాలు సమర్పించారు. యూరప్ సహా పలు దేశాల్లోని 1500 మంది రోగులపై నిర్వహించిన ఈ అథ్యయనాన్ని ప్రపంచ ప్రఖ్యాత క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఆర్ఓ) పర్యవేక్షించింది. విదేశాల్లో తయారయ్యే స్టెంట్లలో ఉండే నాణ్యత, సామర్థ్యం భారత్‌లో తయారయ్యే దేశీయ స్టెంట్లకు లేదని చాలా మంది డాక్టర్లు, రోగుల్లో ఉండే అపోహలను ఈ అథ్యయనం పటాపంచలు చేసింది. గుండె ధమనుల్లో పూడికలకు చికిత్స అందించే క్రమంలో లోహంతో తయారయ్యే కరోనరీ స్టెంట్లపై పాలిమర్స్‌తో ఔషధపు పూత ఉంటుంది. దీర్ఘకాలం సరైన సామర్థ్యంతో పనిచేసేలా వీటిని తయారుచేస్తారు. యూరప్, అమెరికాల్లో తయారయ్యే అబాట్ వాస్కులర్ కంపెనీకి చెందిన జిన్స్ స్టెంట్‌తో పోలిస్తే భారత్‌లో రూపొందే ఎస్‌ఎంటీకి చెందిన సుప్రాఫ్లెక్స్ స్టెంట్ మెరుగైనదని రాండమ్ ట్రయల్‌లో పలువురు పేర్కొన్నారు. దేశీయ స్టెంట్లు చవకగా అందుబాటులో ఉండటంతో తాజా అథ్యయనం నేపథ్యంలో వీటి వాడకం పెరుగుతుందని అథ్యయనంలో చురుకైన పాత్ర పోషించిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ ఉపేంద్ర కౌల్ పేర్కొన్నారు. దేశీయ పరిజ్ఞానంతో తయారయ్యే స్టెంట్లు మెరుగైనవని సర్వేలో వెల్లడవడంస్వాగతించదగిందని చెప్పారు. -
అధిక రక్తపోటుతో అల్జీమర్స్ ముప్పు
లండన్ : రక్తపోటు నియంత్రణలో లేకుంటే గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పుపై వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా, అధిక రక్తపోటుతో అల్జీమర్స్ ముప్పు పొంచిఉందని తాజామ అథ్యయనం వెల్లడించింది. నార్త్ కరోలినాకు చెందిన వేక్ ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డేటా బీపీతో అల్జీమర్స్ రిస్క్ ఉందనే సంకేతాలు పంపింది. రక్తపోటును నియంత్రించుకోవడంతో పాటు నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యకర బరువును మెయింటెన్ చేయడం ద్వారా అల్జీమర్స్ ముప్పును నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు 67 సంవత్సరాల సగటు వయసు కలిగిన వృద్ధుల్లో ఆరోగ్యకర రక్తపోటును మెయింటెన్ చేసే వారిలో అల్జీమర్స్ ముప్పు తక్కువగా ఉందని చికాగోలో జరిగిన అల్జీమర్స్ అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన ఓ నివేదిక వెల్లడించింది. బీపీ నియంత్రణలో ఉన్న వారిలో అధిక రక్తపోటు కలిగిన వారితో పోలిస్తే డిమెన్షియా,అల్జీమర్స్ రిస్క్ 19 శాతం తక్కువగా ఉన్నట్టు వేక్‌ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. గుండె జబ్బుల నివారణకు ఏ జాగ్రత్తలు పాటిస్తారో వాటినే అల్జీమర్స్ ముప్పును తగ్గించేందుకు పాటించవచ్చని అల్జీమర్స్ అసోసియేషన్ చీఫ్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ మరియా కరిలో తెలిపారు.