న్యూఢిల్లీ : సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్, మినరల్స్ వంటి డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటే మేలు కంటే కొన్ని సందర్భాల్లో కీడే అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. డైటరీ సప్లిమెంట్స్ గుండెకు సహా శరీరానికి మేలు చేయకపోగా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమని అనాల్స్ ఆఫ్ ఇంటర్నర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం స్పష్టం చేసింది.
కాల్షియం, విటమిన్ డీతో కూడిన సప్లిమెంట్లు స్ర్టోక్ ముప్పును పెంచుతాయని ఈ అథ్యయనం బాంబు పేల్చింది. కాల్షియం, విటమిన్ డీలతో నేరుగా ఎదురయ్యే అనారోగ్య ముప్పులు, ప్రయోజనాలపై ఇంతవరకూ సాధికారిక ఆధారాలు ఏమీ లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బుల ప్రభావాన్ని నిరోధించడంలో మల్టీవిటమన్లు, మినరల్స్, ఇతర హెల్త్ సప్లిమెంట్లు నిర్థిష్టంగా దోహదపడ్డాయనేందుకు తమకు ఎలాంటి కొలమానాలు లభించలేదని వెల్లడైందని అథ్యయన రచయిత వెస్ట్ వర్జీనియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సఫీ యూ ఖాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment