Heart health
-
వైన్‌తో గుండె పదిలం
వైన్ చరిత్ర ఇప్పటిది కాదు. ప్రాచీన కాలంలోనే పులిసిన ద్రాక్ష రసాన్ని సేవించేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి. వైన్ మంచిదా, కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. దీనిపై రకరకాల అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. వైన్ ఆరోగ్యానికి మంచిదని కొన్ని , నష్టమేనని మరికొన్ని చెబుతుంటాయి. అయితే మితంగా సేవిస్తే గుండె భద్రంగా ఉంటుందని స్పెయిన్‌లో జరిగిన తాజా పరిశోధన వెల్లడించింది. రోజూ చిన్న గ్లాస్ పరిమాణంలో వైన్ తీసుకుంటే హృదయం పదిలమని సైంటిస్టులు గుర్తించారు.అంతేకాదు, వైన్ సేవించాక మాంసాహారం కాకుండా శాకాహారం తీసుకుంటే మరింత చక్కటి ఫలితాలుంటాయని వారు పేర్కొనడం విశేషం! 60 ఏళ్లు దాటాక గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉంటుంది. ఇలాంటి వారిపైనే పరిశోధన చేశారు. 1,232 మందిని అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వీరంతా టైప్ 2 డయాబెటీస్ లేదా అధిక కొలె్రస్టాల్, రక్తపోటు, అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారే. గుండె జబ్బుల బాధితుల కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. వారికి నిత్యం సగం, లేదా గ్లాసు వైన్ ఇచ్చారు. వైన్ సేవించని వారితో పోలిస్తే వీరిలో హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ ముప్పు 50 శాతం తగ్గినట్లు తేల్చారు. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ⇒ పరిమితంగా వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. కానీ రోజుకు గ్లాసు కంటే అధికంగా సేవిస్తే కొత్త రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనాకు చెందిన డాక్టర్ రమోన్ ఈస్ట్రచ్ చెప్పారు. ⇒ చక్కటి ఆహారానికి తోడు ఒక గ్లాసు వైన్‌తో మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని సూచించారు. ⇒ ఈ పరిశోధన ఫలితాలపై నిపుణులు అభ్యంతరం వెలిబుచ్చుతున్నారు. గుండెకు సంబంధించే పరిశోధన సాగింది తప్ప అల్కహాల్‌తో తలెత్తే ఇతర అనారోగ్యాలను పరిగణనలోకి తీసుకోలేదంటున్నారు. ⇒ వైన్ కూడా మద్యమే. తక్కువ మోతాదులో సేవించే వైన్‌తో కార్డియోవాస్క్యులర్ డిసీజ్ (సీవీడీ) రిస్క్ తగ్గుతుందని స్పెయిన్ పరిశోధన తేలి్చంది. కానీ ఇతర అవయవాల సంగతి ఏమిటన్నది గుర్తించలేదని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన సీనియర్ డైటీషియన్ ట్రాసీ పార్కర్ చెప్పారు. ‘‘వైన్‌తో సహా ఏ రకమైన మద్యమైనా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. గుండెతో పాటు లివర్ దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్ల బారిన కూడా పడతారు’’ అన్నారు. ⇒ గుండె ఆరోగ్యానికి వైన్ మంచిదన్నది చాలామందిలో ఉన్న అభిప్రాయమేనని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ప్రొఫెసర్ పాల్ లీసన్ అన్నారు. ‘‘ఇతర అవయవాల పరిస్థితినీ దృష్టిలో పెట్టుకోవాలి. మోతాదు మించితే గుండెతోపాటు కీలకావయవాలు దెబ్బతింటాయి’’ అని చెప్పుకొచ్చారు. ⇒ వైన్‌తో గుండె భద్రంగా ఉంటుంది కదా అని అదే ఏకైక మార్గం అనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ‘‘గుండెను కాపాడుకోవాలంటే మరెన్నో ఆరోగ్యకరమైన మార్గాలున్నాయి. సమతుల ఆహారం, క్రమంతప్పకుండా వ్యాయామం. బరువు పెరగకుండా జాగ్రత్తపడడం, పొగ మానేయడం వంటివి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి’’ అని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Health: రోజూ స్కిప్పింగ్ చేసే అలవాటుందా? ఈ విషయాలు తెలిస్తే
Skipping- Health Benefits: వర్కవుట్స్ మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవే మనల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించగలవు. అయితే అందరూ వర్కవుట్స్ చేయలేరు. అలాగని వర్కవుట్స్ చేయకుంటే స్థూలకాయంతో సహా రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ తలనొప్పంతా మాకెందుకులే అనుకుంటే మాత్రం రోజూ చిన్నవో పెద్దవో వ్యాయామాలు చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. అలాంటి వ్యాయామాలలో స్కిప్పింగ్ ఒకటి. దీనినే ఒకప్పుడు తాడాట అనేవాళ్లు. ఇప్పుడు స్కిప్పింగ్ అంటున్నారు. స్కిప్ చేయకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. కొంతమంది జిమ్ములకు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే సమయం లేక కొంతమంది అవి కూడా చేయకుండా స్కిప్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వారు ఎంచక్కా స్కిప్పింగ్‌ను చేయొచ్చు. చిన్న తాడుతో చేసే ఈ వ్యాయామం వల్ల మాకేంటి ప్రయోజనాలు అనేవారు... అనుకునేవారు కాస్త ఆగండి.. జిమ్ముల్లో చేసే వర్కవుట్స్‌లో కష్టపడి చెమటలు చిందించే వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో.. స్కిప్పింగ్ వల్ల కూడా అన్ని ప్రయోజనాలను పొందుతారని ఫిట్నెస్ నిపుణులంటున్నారు. స్కిప్పింగ్‌ను ఎంచక్కా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇంట్లో చేసే స్కిప్పింగ్ వల్ల ఏం లాభాలుంటాయని తేలిగ్గా తీసిపారేయకండి.. ఇది ఎన్నో రోగాలను ఇట్టే తగ్గించేయగలదు.. సులువుగా బరువు తగ్గచ్చు స్కిప్పింగ్ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న అదనపు కేలరీలు కరిగిపోతాయి. స్కిప్పింగ్ కూడా ఒక లాంటి వ్యాయామమే. స్కిప్పింగ్ వల్ల నిమిషాలను 15 నుంచి 20 కేలరీలను బర్న్ చేస్తారు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు స్కిప్పింగ్ ను చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. గుండె బాగుంటుంది స్కిప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిప్పింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తద్వారా గుండె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరు మెరుగు స్కిప్పింగ్ మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపెడుతుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా జంప్ చేసేలా మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఈ శ్రద్ధ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బద్దకాన్ని వదిలిస్తుంది స్పిప్పింగ్ చేసే మొదట్లో బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం హుషారుగా మారుతుంది. ఇది మీ అలసటను పోగొట్టడమే కాదు.. మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. అందుకు బద్దకంగా, ఎప్పుడూ విసుగ్గా ఉండేవారు స్కిప్పింగ్ ను రోజూ చేయండి. స్ట్రెస్‌ను తగ్గిస్తుంది ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో స్కిప్పింగ్ ముందుంటుంది. ఎందుకంటే ఇది మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.. స్కిప్పింగ్ చేసే అలవాటు మీకు లేకపోతే వెంటనే అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా స్కిప్పింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేయించండి. వారితోపాటు మీరు కూడా పోటీ పడి స్కిప్పింగ్ చేస్తూ ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండండి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే! చదవండి: Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే.. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
Health: ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే.. ఈ ప్రమాదం పొంచిఉన్నట్లే!
ఇటీవల కాలంలో చిన్న వయసులో కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగిన స్థాయిలో నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారంన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తగ్గించాలి 👉🏾జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్,న్యూట్రియెంట్స్‌తో సమృద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 👉🏾ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. ఇవి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. 👉🏾వీటిలో ఆహారాన్ని ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. 👉🏾ఇవి గుండెకి మంచివి కావు. వీటివల్ల గుండె జబ్బులు వస్తాయి. 👉🏾కనుక ఈ ఆహారాలకు బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తినాలి. 👉🏾ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి మంచిది కాదు. దీనివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. 👉🏾అంతేకాకుండా చివరకు అది గుండె జబ్బులకు దారితీస్తుంది. 👉🏾అదే క్రమంలో చక్కెర వల్ల అధికంగా బరువు పెరుగుతారు. అది కూడా గుండె జబ్బులు వచ్చేందుకు దారి తీస్తుంది. 👉🏾కనుక ఈ రెండు పదార్థాలను నిత్యం తక్కువగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. 👉🏾వీటితో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చదవండి👇 Healthy Heart Diet: 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! -
Health Tips: ఇవి తింటే బీపీ అదుపులో ఉంటుంది!
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. దీనిని ఆహారంతోనే అదుపు చేయవచ్చు. గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మీకు తెలుసా? తల తిరగడం కూడా గుండె వైఫల్యానికి సంకేతం. డీ హైడ్రేషన్ వల్ల మైకం వచ్చి గుండె పనిచేయదు. గొంతు లేదా దవడలో నొప్పి కూడా గుండెపోటుకు సంకేతం. అయితే అన్ని నొప్పులు గుండెనొప్పులకి కారణమని చెప్పలేం. కొన్నిసార్లు ఇది జలుబు లేదా సైనస్ కారణంగా వస్తుంది. కానీ కొన్నిసార్లు ఛాతీ నొప్పి గొంతు నుంచి దవడకు వ్యాపిస్తుంది. ఇది చాలా ప్రమాదం. మీరు చాలా త్వరగా అలసిపోయినట్లనిపిస్తే బలహీనతగా భావించకండి. ఎందుకంటే ఇది కూడా గుండెపోటుకు కారణమయ్యే లక్షణాలలో ఒకటని గుర్తుంచుకోండి. చదవండి: చెమట కాయలా? చందనం పొడి, వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి.. -
ఎలాంటి వ్యాయామాలు గుండెకు మేలు ??
-
మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే
న్యూఢిల్లీ : సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్, మినరల్స్ వంటి డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటే మేలు కంటే కొన్ని సందర్భాల్లో కీడే అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. డైటరీ సప్లిమెంట్స్ గుండెకు సహా శరీరానికి మేలు చేయకపోగా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమని అనాల్స్ ఆఫ్ ఇంటర్నర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం స్పష్టం చేసింది. కాల్షియం, విటమిన్ డీతో కూడిన సప్లిమెంట్లు స్ర్టోక్ ముప్పును పెంచుతాయని ఈ అథ్యయనం బాంబు పేల్చింది. కాల్షియం, విటమిన్ డీలతో నేరుగా ఎదురయ్యే అనారోగ్య ముప్పులు, ప్రయోజనాలపై ఇంతవరకూ సాధికారిక ఆధారాలు ఏమీ లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బుల ప్రభావాన్ని నిరోధించడంలో మల్టీవిటమన్లు, మినరల్స్, ఇతర హెల్త్ సప్లిమెంట్లు నిర్థిష్టంగా దోహదపడ్డాయనేందుకు తమకు ఎలాంటి కొలమానాలు లభించలేదని వెల్లడైందని అథ్యయన రచయిత వెస్ట్ వర్జీనియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సఫీ యూ ఖాన్ పేర్కొన్నారు. -
వెయిట్ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు
లండన్ : హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కార్డియో వ్యాయామాలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ మేలని తాజా అథ్యయనం వెల్లడించింది. స్థూలకాయుల్లో గుండెలో పేరుకుపోయిన కొవ్వు ప్రమాదకరమని దీన్ని తగ్గించడంలో బరువులు ఎత్తడం, డంబెల్స్,పుషప్స్ వంటివి మెరుగైన వ్యాయామంగా ఉపకరిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. కార్డియో వ్యాయామాల జోలికి వెళ్లకుండా మూడు నెలల పాటు కేవలం వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకున్న స్థూలకాయుల్లో మూడింట ఒక వంతు హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గుముఖం పట్టిందని శాస్త్రవేత్తల అథ్యయనంలో వెల్లడైంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హృద్రోగాలకు దారితీసే పరిస్థితిని నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. కోపెన్హాగన్ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అథ్యయనం నిర్వహించారు. -
వేగంగా నడిస్తే..
సిడ్నీ : వేగంగా నడవడం గుండెకు మేలు చేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 30 సంవత్సరాల వయసు పైబడిన వారు గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే గుండెపోటు, స్ర్టోక్ ముప్పు మెల్లిగా నడిచేవారితో పోలిస్తే సగం తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అన్ని వయసుల వారూ వేగంగా నడిస్తే ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 20 శాతం తక్కువగా ఉంటుందని, జీవనకాలం 15 సంవత్సరాలు పెరుగుతుందని పేర్కొన్నారు. వేగంగా నడవడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అథ్యయనం పేర్కొంది. గంటకు అయిదు నుంచి ఏడు కిలోమీటర్లు నడవడం వేగవంతమైన నడకగా గుర్తిస్తామని, అయితే ఇది నడిచేవారి ఫిట్నెస్ స్ధాయిలపై ఆధారపడిఉంటుందని అథ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన ప్రొఫెసర్ ఇమ్మానుయేల్ స్టమటకిస్ తెలిపారు. వేగవంతమైన నడకకు మరో సంకేతంగా చిరు చెమట పట్టడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు. 1994 నుంచి 2008 వరకూ 11 జనాభా లెక్కల ప్రామాణికంగా 50,000 మంది ఆరోగ్య రికార్డులను అథ్యయనంలో భాగంగా పరిశోధకులు పరిశీలించారు. నడక వేగాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం, అకాల మరణం ముప్పును నివారించవచ్చని తమ ఫలితాలు సూకచిస్తున్నాయని ప్రొఫెసర్ స్టమటకిస్ చెప్పారు. -
తేలికపాటి వ్యాయామం చేసినా..
లండన్ : మెరుగైన ఆరోగ్యం కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు, ఎక్కువసేపు నడవడం, యోగా, ధ్యానం అంటూ భారీ సమయం వెచ్చిస్తుంటారు. అయితే రోజూ కొద్దిసేపు తేలికపాటి వ్యాయామం, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని తాజా అథ్యయనం తేల్చింది. తేలికపాటి వ్యాయామం, చిన్నపాటి శారీరక కదలికలతో గుండె ఆరోగ్యం పదిలపరుచుకోవచ్చని, నూతన కణాల పరిమాణం వీటితో పెరుగుతున్నట్టు తేలిందని పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగంలో వెల్లడైంది. చిన్నపాటి వ్యాయామమైనా రోజువారీ దినచర్యలో భాగంగా నిత్యం చేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని హార్వర్డ్ అథ్యయనం పేర్కొంది. రోజూ వ్యాయామం, శారీరక కదలికలతో కణాల పునరుజ్జీవం పెరుగుతుందని, ఇది శరీరంలో వాపు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడి నిస్సత్తువ, గుండె జబ్బులను దరిచేర్చకుండా కాపాడుతుందని పరిశోధనలో గుర్తించారు. రోజూ వ్యాయామం చేసే ఎలుకలో కొత్త గుండె కణాలను నాలుగు రెట్లు అధికంగా గుర్తించారు. గుండె పోటుకు గురైన వారు, వృద్ధుల గుండెను పరిరక్షించుకునేందుకు తేలికపాటి వ్యాయామాలూ మెరుగ్గా ఉపకరిస్తాయని తేలినట్టు పరిశోధకులు వెల్లడించారు. గాయం లేదా వయసు మళ్లిన కారణంగా కుచించుకుపోయే గుండె కణజాలం నూతన కణజాలంతో పునరుజ్జీవం కావడం ద్వారా సమతుల్యతను కాపాడుకోవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్, పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఆంథోని పేర్కొన్నారు. -
గుండెజబ్బులకు కొత్త చికిత్స...?
గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే... అది రక్తప్రసారాన్ని పూర్తిగా అడ్డుకునే స్థాయికి చేరితే గుండెపోటు వస్తుందని అందరికీ తెలుసు. మరి అవసరానికి తగ్గట్టుగా రక్తనాళాలు విశాలమైతే? కొవ్వు పేరుకునే అవకాశమే ఉండదు. గుండెపోటు, జబ్బులు రానేరావు. బాగానే ఉందిగానీ.. ఇదెలా సాధ్యం అంటున్నారా? స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ పనిచేయగల ఓ ప్రొటీన్‌ను గుర్తించారు. జీపీఆర్ 68 అని పిలుస్తున్న ఈ ప్రొటీన్ రక్తప్రవాహాన్ని గుర్తించి.. అందుకు తగ్గట్టుగా డైలేట్ (విశాలంగా మారడం) కావాలని ఆర్టీరియోల్స్ అనే చిన్నస్థాయి రక్తనాళాలకు సందేశాలు పంపుతాయని వీరు గుర్తించారు. రక్తప్రసరణ వేగంలో వచ్చే మార్పులను రక్తనాళాలు గుర్తించగలవని దశాబ్దాలుగా తెలుసునని, అయితే అదెలా జరుగుతోందన్న విషయం ఇప్పటివరకూ తెలియలేదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆర్డెన్ పటపౌటియన్ తెలిపారు. రక్తనాళాలను తలపించే ఓ యంత్రాన్ని తయారుచేసి.. అందులో ద్రవాలు ప్రవహించేటప్పుడు గోడల్లో లాంటి మార్పులు వస్తున్నాయేమోనని గుర్తించడం ద్వారా తాము జీపీఆర్ 68 గురించి తెలుసుకున్నామని చెప్పారు. తదుపరి పరిశోధనల్లోనూ జీపీఆర్ 68 ప్రొటీన్ మన రక్తనాళ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందని తెలిసిందని వివరించారు. ఈ నేపథ్యంలో జీపీఆర్ 68ను ప్రేరేపించగల మందులను తయారు చేయగలిగితే, భవిష్యత్తులో గుండెజబ్బులను నియంత్రించేందుకు అవకాశముంటుందని చెప్పారు. -
రోజూ మూడు సార్లు కాఫీ తీసుకుంటే..
లండన్ : రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలని పరిశోధకులు తేల్చారు. రోజుకు ఎక్కువ సార్లు కాఫీ తాగే వారి గుండె ధమనుల్లో కాల్షియం నిల్వలు తక్కువగా పేరుకుపోయినట్టు యూనివర్సిటీ ఆఫ్ సాపౌలో చేపట్టిన తాజా అథ్యయనంలో వెల్లడైంది. రోజుకు మూడు కప్పులు పైగా కాఫీ తాగే వారిలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాల్షియం నిల్వలు తక్కువగా పేరుకుపోయినట్టు తమ పరిశోధనలో గుర్తించామని అథ్యయన రచయిత ఆండ్రియా మిరండా వెల్లడించారు. రోజుకు మూడు సార్లు కన్నా కాఫీ తాగితే ఇంకా మేలని..అయితే అతిగా తాగడం మాత్రం అనారోగ్యకరమని చెప్పారు. కాఫీలో ఉండే కేఫిన్ లేక ఇతర యాంటీఆక్సిడెంట్స్ వేటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని మాత్రం పరిశోధన స్పష్టత ఇవ్వలేదు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది. -
వీటితో గుండె పదిలం
సాక్షి, న్యూఢిల్లీ: అధిక కొవ్వుతో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారించేందుకు ఆహారంలో సోయా, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మాంసం, కొవ్వు శాతం అధికంగా ఉండే పాలు వంటి పదార్ధాల స్ధానంలో ఆరోగ్యకర ఆహారంతో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయని ఓ అథ్యయనం వెల్లడించింది. రోజూ రెండు కప్పుల సోయా, తృణధాన్యాలు, గింజలను తీసుకుంటే హానికర ఎల్డీఎల్ కొవ్వులను 5 శాతం మేర తగ్గించవచ్చని తేలింది.ఈ ఆహారంపై తాము విస్తృతంగా జరిపిన పరిశోధనలో ఇవి గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని స్పష్టంగా వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన జాన్ సెన్పైపర్ చెప్పారు. కెనడాలోని ఒంటారియో నగరంలోని సెంట్ మైఖేల్ హాస్పిటల్లో జాన్ సేవలందిస్తున్నారు. ప్లాంట్ ప్రొటీన్లతో పాటు కొవ్వును తగ్గించే ఓట్స్, బార్లీ వంటి ఆహారంతో వీటిని కలిపితీసుకుంటే ఆరోగ్యకరంగా మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని అథ్యయనంలో తేలింది. -
గుండెకు ‘ప్రాణం'
గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి, హృద్రోగ సమస్యలు పరిష్కరించడానికి ప్రాణాయామము, యోగాసనాలు, ధ్యానసాధన అత్యుత్తమ మార్గం. అయితే గుండె శక్తివంతంగా మారాలని చేస్తున్నామా? గుండె సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి చేస్తున్నామా? అనేది గమనించాలి. తదనుగుణంగా సాధన ఎంచుకోవాలి. సాధన చేసే పద్ధతి మీడియం నుంచి స్పీడ్‌గా ఉంటే...దానిని శక్తి క్రమ అంటారు. అదే నిదానంగా శ్వాసకు అనుగుణంగా చేసే సాధన చికిత్సా క్రమ పద్ధతి అంటారు. నిలబడి చేసే ఆసనాలన్నీ కూడా వెన్నెముకను సాగదీయడానికి, రిలాక్స్ చేయడానికే. నడుం పైభాగాన ఉండే సోవాస్ మజిల్స్ రిలాక్స్ కావడం వల్ల గుండెకు ఒత్తిడి తగ్గుతుంది. అదే విధంగా నిలబడి చేసే యోగాసనాల్లో వృక్షాసనం, ఉత్కటాసనం, త్రికోణాసనం,, వీరభధ్రాసనం... వంటివి గుండె పనితీరును మెరుగు పరిచేందుకు ఉపకరిస్తాయి. మరిన్ని ఉపయుక్తమైన ఆసనాల్లో... అధోముఖ శ్వానాసనం, చతురంగ దండాసనం, భుజంగాసనం, పర్వతాసనం, పాదహస్తాసనం... వంటి వాటి వల్ల దిగువ అబ్డామిన్ ఆబ్లిక్ మజిల్ చురుకుగా మారి, తద్వారా గుండె కండరాలు శక్తివంతం అవుతాయి. బాలాసనం, నిరాలంబాసనం, సేతు బంధాసనం వల్ల లోయర్ అబ్డామిన్, ఆబ్లిక్ మజిల్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది. మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. డయాఫ్రమ్ రిలాక్స్ అవుతుంది. తేలికపాటి ప్రాణయామాలు ఎక్కువ సేపు ధ్యానం చేయడం గుండెకు ఆరోగ్యం. సూక్ష్మ ప్రాణయామాలైన సూర్యవేది, చంద్రవేది అనులోమ విలోమ ప్రాణయామాలు, అంగన్యాస, అధంగన్యాస, అరణ్యాస వంటి విభాగ ప్రాణయామాలు (సెక్షనల్ బ్రీతింగ్ టెక్నిక్స్) చేయడం ద్వారా గుండె సమస్యలున్నవారికి రిలీఫ్ కలుగుంది. హార్ట్‌రేట్ క్రమబద్ధీకరిస్తాయి. (సేకరణ : సత్యబాబు)