సాక్షి, న్యూఢిల్లీ: అధిక కొవ్వుతో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారించేందుకు ఆహారంలో సోయా, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మాంసం, కొవ్వు శాతం అధికంగా ఉండే పాలు వంటి పదార్ధాల స్ధానంలో ఆరోగ్యకర ఆహారంతో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయని ఓ అథ్యయనం వెల్లడించింది.
రోజూ రెండు కప్పుల సోయా, తృణధాన్యాలు, గింజలను తీసుకుంటే హానికర ఎల్‌డీఎల్ కొవ్వులను 5 శాతం మేర తగ్గించవచ్చని తేలింది.ఈ ఆహారంపై తాము విస్తృతంగా జరిపిన పరిశోధనలో ఇవి గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని స్పష్టంగా వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన జాన్ సెన్‌పైపర్ చెప్పారు. కెనడాలోని ఒంటారియో నగరంలోని సెంట్ మైఖేల్ హాస్పిటల్‌లో జాన్ సేవలందిస్తున్నారు.
ప్లాంట్ ప్రొటీన్లతో పాటు కొవ్వును తగ్గించే ఓట్స్, బార్లీ వంటి ఆహారంతో వీటిని కలిపితీసుకుంటే ఆరోగ్యకరంగా మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని అథ్యయనంలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment