nuts
-
ట్రెండ్ మారింది.. ఫుడ్ మారాలి
ఫ్యాషన్ ట్రెండ్స్లాగానే ఆహారంలో కూడా కొంతకాలం పాటు ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రతి సందర్భంలోనూ ఆ ట్రెండ్ ఎవరికి మంచిది, ఎవరికి హానికరం అనే వివరాలను తన బ్లాగ్‌లో రాస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి. హెల్త్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న షీలా కృష్ణస్వామి ఈ వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యసంరక్షణ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.న్యూట్రిషన్, వెల్నెస్ రంగంలో నలభై ఏళ్ల అనుభవం ఉన్న షీలా కృష్ణస్వామి రోజూ 30 గ్రాముల నట్స్, సీడ్స్ తీసుకోవాలని చెప్పారు. ముప్ఫై గ్రాములంటే ఎన్ని అని తూకం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓ గుప్పెడు చాలు. రోజూ గ్లాసు నీరు, గుప్పెడు బాదం పప్పులతో తన రోజు మొదలవుతుందన్నారు. ఉదయం ఇలాంటి శక్తినిచ్చే సహజాహారం తీసుకుంటే రోజంతా నీరసం రాదు. విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన ఆహారం కోసం మన డైట్లో పప్పులు, ధాన్యాలు, పీచు, పాలు, పండ్లను తీసుకుంటున్నాం. బాదం, గుమ్మడి విత్తనాలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి. సమయానికి భోజనం చేయడం కుదరనప్పుడు కూడా బాదం తింటే దేహానికి దాదాపుగా సంపూర్ణ ఆహారం అందినట్లే. జంక్ బదులు గింజలు! వందేళ్ల కిందట ఇప్పుడున్న అనారోగ్యాలు లేవు. గడచిన తరాలు ఆహారం విషయంలో ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఏం తినాలనిపిస్తే అది తిన్నారు. ఏం పండితే వాటినే తిన్నారు. ఊబకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్యాల్లేవు. అందుకు కారణం వారికి ఆహారం ద్వారా అందిన శక్తిని కరిగించేటంతటి వ్యాయామం ఉండేది. తగినంత వ్యాయామం ఉండడంతో మంచి నిద్ర ఉండేది. ఈ రెండింటి వల్ల దేహక్రియలు చక్కగా జరిగేవి. గట్ హెల్త్ అంటే అదే. ఆ గట్ హెల్త్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. ‘బెంగళూరులో నా కళ్లారా చూస్తుంటాను. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లడానికి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇంటికి వెళ్లేలోపు ఆకలి వేస్తుంటుంది. కారులో వెళ్తూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై, సమోసాలు, బేకరీ ఫుడ్ వంటి జంక్ తింటూ ఉంటారు. నేనేం చె΄్తానంటే జంక్ స్థానంలో సహజ ఆహారాన్ని తీసుకోండి. ఆఫీసుకెళ్లేటప్పుడు పండ్లను బ్యాగ్‌లో తీసుకెళ్లడం కొన్నిసార్లు సాధ్యంకాకపోవచ్చు. బాదం వంటి నట్స్ ఒక చిన్న బాక్సులో పెట్టుకుంటే మధ్యలో ఆకలి అనిపించినప్పుడు పది గింజలు తింటే చాలు’ అన్నారు షీలా కృష్ణస్వామి. అరవై నాలుగేళ్ల వయసులో ఇంత చురుగ్గా ఉండడానికి సరైన ఆహారమే కారణమన్నారు. ‘అందంగా ఉండడానికి రహస్యం ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉండడమే’నని నవ్వారామె. ఎలాగైనా తినండి!పరిపూర్ణ ఆరోగ్యానికి, దీర్ఘకాలం యవ్వనంగా ఉండడానికి దోహదం చేసే బాదం పప్పులను ఇలాగే తినాలనే నియమం ఏదీ అవసరం లేదు. పచ్చిగా లేదా నానబెట్టి తినవచ్చు. డ్రై రోస్ట్, నానిన వాటిని వేయించి,పోపు పెట్టి చాట్ మసాలా చల్లి తినవచ్చు. బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తినేటప్పుడు పొట్టు వలిచేస్తుంటారు. కానీ పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఆ ఫైబర్ కూడా దేహానికి అవసరమే. వృద్ధులకు పొట్టుతోపాటు తినడం ఇబ్బందవుతుంది. పొట్టు తీసి తినాల్సింది దంతాలు సరిగా లేని వాళ్లు మాత్రమే. – షీలా కృష్ణస్వామి, న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటో : టి.దయాకర్ -
క్వీన్ ఆఫ్ నట్స్ .. షుగర్, కేన్సర్ రానివ్వవు..
సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే మకడమియ తోటల సాగు మనకు బాగా కొత్త. ప్రోటీసీ కుటుంబం. ఎన్నో పోషక విలువలతో కూడినది కావటం వల్ల దీనికి క్వీన్ ఆఫ్ ద నట్స్ అని పేరొచ్చింది. మకడమియ చెట్టు గింజలను క్వీన్స్లాండ్ నట్స్ లేదా ఆస్ట్రేలియన్ నట్స్ అని కూడా పిలుస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఉష్ణమండల ప్రాంతాలు దీని సాగుకు అనుకూలం. గుండె జబ్బులు, కేన్సర్, షుగర్ రానివ్వకుండా చూసే ఈ అద్భుత పంటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..మకడమియ దీర్ఘకాలిక పంట. గుబురుగా పెరిగే చెట్టుకు కాచే గుండ్రటి మకడమియ కాయల నుంచి వొలిచిన గింజలను తింటారు. ఈ గింజలు చూడడానికి పెద్ద శనగల మాదిరిగా ఉంటాయి. గుండ్రటి కాయలోని మరొక ΄÷రలో ఈ గింజ దాక్కొని ఉంటుంది. మకడమియ చెట్లలో ఏడు జాతులున్నాయి. వాణిజ్యపరంగా సాగుకు అనువైనవి రెండు మాత్రమే. మకడమియ ఇంటెగ్రిఫోలియ (దీని కాయ పెంకు గుల్లగా ఉంటుంది), మకడమియ టెట్రాఫిల్లా (దీని కాయ పెంకు కొంచెం గట్టిగా ఉంటుంది). మిగతా రకాల గింజలు విషపూరితాలు, తినటానికి పనికిరావు.కిలో గింజల ధర రూ. 1,175మకడమియ పంట ఆస్ట్రేలియా, హవాయి, సౌతాఫ్రికా, మలావి, బ్రెజిల్, ఫిజి, కాలిఫోర్నియ (అమెరికా)లో ఎక్కువగా సాగువుతున్నది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కొందరు రైతులు ఈ చెట్ల సాగును ఈ మధ్యనే ప్రారంభించారు. 2017 నాటి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48,544 టన్నుల మకడమియ కాయల వార్షిక ఉత్పత్తి జరుగుతోంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెన్యాల నుంచే 70% దిగుబడి వస్తోంది. డిమాండ్‌కు తగిన మకడమియ గింజల లభ్యత మార్కెట్లో లేదు. ఈ గింజల ఖరీదు కిలోకు 14 అమెరికన్ డాలర్లు. అంటే.. రూ. 1,175. ఇంత ఖరీదైన పంట కాబట్టే మకడమియ తోటల సాగుపై మన దేశంలోనూ రైతులు ఆసక్తి చూపుతున్నారు.12 అడుగుల ఎత్తుమకడమియ ఉష్ణమండల పంట. అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉంటుంది. అశోకా చెట్ల ఆకుల మాదిరిగా దీని ఆకులు ఉంటాయి. ఎత్తు 2–12 మీటర్లు, కొమ్మలు 5–10 మీటర్ల వరకు పెరగుతాయి. తెల్లటి పూలు గుత్తులుగా (8–10 సెం.మీ. పోడవున) వస్తాయి. శీతాకాలం మధ్యలో పూత ్ర΄ారంభమవుతుంది. గుత్తికి 100కిపైగా పూలు ఉన్నా 2 నుంచి 10 కాయలు మాత్రమే వస్తాయి. స్వపరాగ సంపర్కం జరిగే పంట ఇది. కృత్రిమంగా పోలినేషన్ చేస్తే దిగుబడి పెరుగుతుంది. మకడమియ కాయ పైన ఉండే మందపాటి తీసేస్తే గట్టి గుళ్లు బయటపడతాయి. వాటిని పగులగొడితే మధ్యలో గింజలు ఉంటాయి. లేత పసుపు రంగులో మెత్తగా ఉండే గింజలు తియ్యగా ఉంటాయి. పూత వచ్చిన 7–8 నెలల్లో కాయలు కోతకొస్తాయి. 13 –31 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దీనికి సూటబుల్. వార్షిక వర్ష΄ాతం 125 సెం.మీ. చాలు. నీరు నిలవని సారవంతమైన లోమీ సాయిల్ (ఇసుక, బంకమన్ను, సేంద్రియ పదార్థం కలిసిన ఎర్ర ఒండ్రు భూములు) అనుకూలం. విత్తనాల ద్వారా, కొమ్మ కత్తిరింపుల ద్వారా మొక్కలు పెంచవచ్చు. నాటిన తర్వాత 4–5 ఏళ్లలో కాపు ప్రారంభమై.. 50–75 ఏళ్ల ΄ాటు కాయల దిగుబడినివ్వటం ఈ చెట్ల ప్రత్యేకత.ఆరోగ్యదాయక పోషకాల గనిఆరోగ్యదాయకమైన అనేక పోషకాలతో కూడి ఉండే మకడమియ గింజలు తియ్యగా, కమ్మని రుచిని కలిగి ఉంటాయి. మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్లు ఉంటాయి. ఆస్ట్రేలియాలో జరిగిన పరిశోధనల ప్రకారం.. ఈ గింజలు తిన్న వారి రక్తంలో టోటల్, ఎల్డిఎల్ కొలస్ట్రాల్ తగ్గింది. వంద గ్రాముల గింజలు 718 కేలరీల శక్తినిస్తాయి. గింజలకే కాదు దాని పైన రలో కూడా అధిక కేలరీలను ఇచ్చే శక్తి ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఇందులో ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 8.6 గ్రాములు లేదా రోజుకు మనిషికి కావాల్సిన 23% డైటరీ ఫైబర్ ఉంది. చెడు కొలెస్ట్రాల్ లేదు. బి–సిటోస్టెరాల్ వంటి ఫైటోస్టెరాల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఓలిక్ ఆసిడ్ (18:1), పాల్మిటోలీక్ ఆసిడ్ (16:1) వంటి మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీసు, జింగ్, సెలీనియం (గుండె రక్షణకు ఇది ముఖ్యం) వంటి ఎంతో ఉపయోగకరమైన మినరల్స్ ఉన్నాయి. ఇంకా.. జీవక్రియలకు దోహదపడే బి–కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 15% నియాసిన్, 21% పైరిడాక్సిన్ (విటమిన్ బి–6), 100% థయామిన్, 12% రిబోఫ్లావిన్ వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉన్నాయి. ఆక్సిజన్–ఫ్రీ రాడికల్స్ కలిగించే నష్టం నుంచి డిఎన్ఎను, కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు మకడమియ గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ పంటకు అంత క్రేజ్!గుండె ఆరోగ్యానికి మేలు..షుగర్, కేన్సర్ రానివ్వవు..👉మకడమియ గింజలు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. 👉 మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ తగ్గిస్తాయి. 👉 ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ∙జీర్ణ శక్తిని పెంచుతాయి. 👉 కేన్సర్ నిరోధక శక్తినిస్తాయి.👉 మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 👉 చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. 👉 ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 👉 మానసిక వత్తిడి నుంచి ఇన్ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 👉 రక్తహీనత రాకుండా చూస్తాయి. 👉 మధుమేహం రాకుండా చూస్తాయి. -
చిన్న గింజలే కదాని లైట్ తీసుకోవద్దు : చికెన్ కూడా దిగదుడుపే!
పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, మహిళలు భారత దేశంలో చాలామందే ఉన్నారు. పేదరికం, అవగాహన లేక పోవడం, ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఫాస్ట్ ఫుడ్ తదితరాలను దీనికి కారణాలుగా చెప్పుకోవచ్చు. పోషకాహారం అంటే అదేదో ఖరీదైన వ్యవహారంగా చాలా మంది అపోహపడతారు. బ్రెజిల్ నట్స్,హాజిల్ నట్స్, బాదం, పిస్తా, జీడి పప్పు లాంటివే అనుకుంటారు. కానీ భారతదేశంలో చక్కటి పోషకాలందించే గింజలు ఇంకా చాలా ఉన్నాయి. వీటి వల్ల శరీరానికి అనేక పోషకాలంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సులభంగా, తక్కువ ధరలో దొరికే వీటిని తీసుకోవడం వల్ల లాభాలేంటి? తెలుసుకుందాం!సులభంగా లభించే ఎక్కువ పోషకాలు లభించేవాటిలో వేరుశనగలునువ్వులు, గుమ్మడి గింజలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు.పల్లీలు, వేరుశనగలువేరుశనగలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి,. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా అధిక బరువుపెరగకుండా నియంత్రిస్తాయి. వేరుశనగల్లో పుష్కలంగా లభించే కాల్షియం, మెగ్నీషియంఎదిగే పిల్లల్లో ఎముకల వృద్ధికి తోడ్పడతాయి. ఎముకలకు బలాన్నిస్తాయి. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ముడతలు పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. వేరుశనగల్లో ఉండే మాంగనీస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.ఎలా తీసుకోవాలిఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఆహారానికి రుచితోపాటు, పోషకాలు అందుతాయి. పచ్చిగా తీసుకోవచ్చు. వేయించి తినవవచ్చు. నాన బెట్టి మొలకలు వచ్చిన తరువాత తింటే ఇంకా శ్రేష్టం.బెల్లంతో కలిపి చేసిన వేరుశనగ ఉండల్ని, అచ్చులను తినిపిస్తే రక్త హీనత నుంచి కాపాడుకోవచ్చు.వంటల్లో వేరుశనగ నూనెను వాడవచ్చు. ఇది. ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది.దక్షిణ భారతదేశంలో కరకర లాడే కారం మాసాలా పల్లీలు, పల్నీ చట్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఇడ్లీ, దోసలతో కలిపి తింటే పోషకాలు అందుతాయి. గుమ్మడి గింజలుగుమ్మడి గింజల్లో అత్యధిక స్థాయిలో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి.రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తుంది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు తోడ్పడుతుంది. మానసిక ఒత్తిళ్ల నియంత్రణ, జుట్టు పెరుగుదలలో గుమ్మడి గుంజలు బాగా పనిచేస్తాయి. ఆధునిక జీవన శైలి పురుషుల్లో కనిపిస్తున్న సంతానోత్పత్తి సమస్యలకు చెక్ చెబుతుంది. స్పెర్మ్ నాణ్యత మంచి పరిష్కారం. ఐరన్ తగిన స్థాయిలో ఉండేందుకు గుమ్మడి గింజలు తోడ్పడుతాయి.ఎలా తీసుకోవాలిగుమ్మడి గింజల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు.సాధారణంగా రోజూ తీసుకునే ఆహారంలో గుమ్మడి గింజలను భాగం చేసుకోవచ్చు. పెరుగు, పండ్లు, సలాడ్లు సూప్‌లో కొన్ని గుమ్మడి గింజలను వేసుకోవచ్చు.కుకీలు, బ్రెడ్, తీపి పదార్థాల్లో గుమ్మడి గింజల్ని చక్కగా అమరుతాయి.నువ్వులు, లడ్డూలునువ్వుల గింజలు కాల్షియం, రాగి, ఫైబర్, మెగ్నీషియం, ఇనుము అధికంగా లభిస్తాయి. పిల్లల్లో పోషకాహార లోపానికి నువ్వులు, బెల్లం లడ్డూలను తినపించవచ్చు. ఆడపిల్లల్లో అనేక గైనిక్సమస్యలకు చక్కటి పరిష్కారంగా నువ్వుల గురించి పెద్దలు చెబుతారు. -
'పైన్ నట్స్'తో ఆరోగ్యం ఫైన్..!
నట్స్ అనంగానే గుర్తొచ్చేవి వేరుశెనగ, బాదం, జీడిపప్పు తదితరాలే. కానీ మధురమైన రుచిలో అంతకు మించి అనే నట్స్ మరొకటి ఉన్నాయి. అవే పైన్ నట్స్. ఒక్కసారి టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు. ధర వింటే మాత్రం తినాలన్న కోరిక పోతుంది. ఆ రేంజ్లో ధర పలుకుతాయి ఈ గింజలు.ఈ పైన్నట్స్ని తెలుగులో చిల్గోజా అంటారు. రుచికరమైన జీడిపప్పులు, బాదాంలకు మించి అన్నట్లు టేస్టీగా ఉంటాయి. చెప్పాలంటే ఇవి తింటే ఓ చక్కటి స్వీట్ తిన్న ఫీల్ కలుగుతుంది. దీనిపై చింతపండుకు ఎలాగైతే గోధుమరంగు తొడుగు ఉంటుందో అలానే ఉంటుంది. దాన్ని పగలకొడితే తెల్లటి గింజ బయటకు వస్తుంది. అవే పైన్ నట్స్. రోజూ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.ధర మాత్రం..ఈ పైన్‌నట్స్ ధర చాలా ఎక్కువ. కిలోకు ఏకంగా రూ.8000ల వరకు పలుకుతాయి. అంటే..దగ్గర దగ్గర ఓ గ్రాము బంగారం ధర పలుకుతుంది. ఆరోగ్యం కావాలనుకుంటే ధర గురించి పట్టించుకోకుండా చక్కగా కొని ఆస్వాదించండి. మరి ఖరీదు అనిపిస్తే..కనీసం ఒక్కసారైనా వందగ్రాముల గింజల్ని తెచ్చుకుని తప్పకుండా రుచి చూడండి.చిల్గోజాలో పోషకాలు:వంద గ్రాముల గింజల్లో సుమారు 673 కేలరీలు ఉంటాయి. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల చిల్గోజా తినడం వల్ల 13.69 ప్రోటీన్లు లభిస్తాయి. అదే సమయంలో, చక్కెర పరిమాణం 3.59గ్రాముల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా, 100 గ్రాముల చిల్గోజాలో 251 మి.గ్రా మెగ్నీషియం, 16 మి.గ్రా కాల్షియం, 597 గ్రాముల పొటాషియం ఉంటాయి. వీటి తోపాటే ఫోలేట్, ఐరన్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ వంద గ్రాముల చిల్గోజా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.గుండె ఆరోగ్యం:చిల్గోజాలో 90% అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బు బారిన పడకుండా ఉండొచ్చు. దీనిలో ఇతర గింజల కంటే ఎక్కువ కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.జంక్ ఫుడ్‌పై ఆసక్తి తగ్గుతుంది..వీటిని తినడం వల్ల కొవ్వులున్న జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇవి తిన్నవెంటనే విడుదలయ్యే హార్మోన్లే దానికి కారణం. బరువు తగ్గాలని ఆలోచించే వ్యక్తులు చిల్గోజా తినడం ప్రారంభించాలి. అనారోగ్యకర ఆహారాలు తినాలనే కోరిక తగ్గించడంతో పాటూ బరువు తగ్గడంలోనూ ఇది సాయపడుతుంది.కేన్సర్:చిల్గోజాలో ఒమేగా 6, సెలీనియం ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. కేన్సర్ రాకుండా కాపాడుతుంది.సంతానలేమికి చెక్ పెడుతుంది..సెలీనియం పరిమాణం సంతానోత్పత్తి సమస్యను తొలగిస్తుంది. చిల్గోజా పురుషుల్లో సెక్స్ శక్తిని పెంచుతుంది. చిల్గోజాలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంతానలేమి వంటి సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది. రోజూ చిల్గోజా తినడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరగడంతో పాటు వీర్యకణాల నాణ్యత కూడా పెరుగుతుంది. అలాగే, చిల్గోజా ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.ఇతర ప్రయోజనాలు..చిల్గోజా సాధారణ జలుబు నుండి రక్షించడానికి కూడా సహాయపడుతుంది. జింక్ పరిమాణం గాయం వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది.డిప్రెషన్, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఉన్నవారు నిరాశ సమస్యతో పోరాడతారు. వీరు ఆహారంలో చిల్గోజా చేర్చుకోవాలి. మెగ్నీషియం మోతాదు ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రాత్రిపూట చిల్గోజా తింటే కండరాలు రిలాక్స్ అవుతాయి.మోనోపాజ్ తరువాత, మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. అలాంటి మహిళలు తప్పనిసరిగా చిల్గోజా తినాలి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చిల్గోజాలో ఉండే మెగ్నీషియం మొత్తం శరీరానికి కాల్షియం రవాణా చేయడానికి సహాయపడుతుంది.పైన్ గింజల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువవ్వడం వల్ల డయాబెటిస్‌లో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ పనితీరు పెరుగుతుంది. చిల్గోజా తినడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.(చదవండి: ఈ విటమన్ని తక్కువగా తీసుకుంటే ఎక్కువ కాలం జీవించొచ్చట..! పరిశోధనలో షాకింగ్ విషయాలు..) -
వాల్నట్స్ తింటున్నారా..?ఐతే అలాంటివాళ్లు మాత్రం..!
వాల్నట్స్ సూపర్ హెల్తీ నట్స్. ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలతో నిండి ఉంటాయి. దీనిలో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక పోషకాలు కలిగిన వాల్నట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ను ఉంటాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, అలాంటి వ్యాధి ఉన్నవారికి ఈ వాల్నట్స్ ఎంత మాత్రం మంచివి కావని తేల్చి చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి వ్యాధులు ఉన్నవారు వీటిని తీసుకోకూడదు?ఎందుకని..? తదితరాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.డయాబెటిస్తో బాధపడుతున్ వారికి ఈ వాల్నట్స్ వారి మూత్రం ఆమ్లత్వానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. మూత్రంలో కాల్షియం ఆక్సలేట్ అధిక సాంద్రతలు క్రిస్టలైజ్ అవ్వడంతో ఈ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రనాళంలోకి ప్రయాణించి మూత్రప్రవాహాన్ని అడ్డుకుని ఇన్ఫెక్షన్ లేదా రక్తస్రావాన్ని కలిగిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ల సంకేతాలు, లక్షణాలువికారం, వాంతులుమూత్ర విసర్జనలో రక్తంమూత్ర విసర్జన చేసినప్పుడు నొప్పిమూత్ర విసర్జన చేయలేకపోవడంమూత్ర విసర్జన చేయాలనే కోరిక విపరీతంగా ఉండటంజ్వరం లేదా చలిదుర్వాసనతో కూడిన మూత్ర విసర్జనడయాబెటిస్ ఉన్నవాళ్లు ఎన్ని వాల్నట్స్ తినాలి..?మధుమేహం ఉన్నవాళ్లు రోజువారీగా వాల్నట్లను 30 నుంచి 50 గ్రాములకు పరిమితం తీసుకుంటే మంచి ప్రయోజనాలను పొందగలరు. ఒక అధ్యయనం ప్రకారం, ఎనిమిది వారాలపాటు ప్రతిరోజూ 43 గ్రాములు లేదా 1.5 ఔన్సుల వాల్నట్లను తినడం వల్ల మచి సానుకూలా ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రయోజనాలురోగనిరోధక శక్తిని పెంచుతాయిఇతర సాధారణ గింజల కంటే వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ, మెలటోనిన్, పాలీఫెనాల్స్ వంటి మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. వాపును తగ్గిస్తాయివాల్నట్లను క్రమం తప్పకుండా తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె సమస్యలు, టైప్ -2 డయాబెటిస్, అల్జీమర్స్, కేన్సర్ వంటి వ్యాధులకు చెక్‌పెడుతుంది. వాల్‌నట్‌లోని పాలీఫెనాల్స్ ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడటానికి సహాయపడతాయి.ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహిస్తుంది.. అధ్యయనాల ప్రకారం, ఇందులో గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రేగు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కాబట్టి, వాల్నట్లను క్రమం తప్పకుండా తింటే మైక్రోబయోటా, గట్ ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది.ఆహారంలో వాల్నట్లను చేర్చుకోవడం వల్ల రొమ్ము, ప్రోస్టేట్, కొలొరెక్టల్ కేన్సర్‌తో సహా కొన్ని రకాల కేన్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వాల్‌నట్స్‌లో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాల్స్ నిండి ఉంటాయి కాబట్టి. కొన్ని గట్ సూక్ష్మజీవులు వీటిని యురోలిథిన్స్ అని పిలిచే సమ్మేళనాలుగా మార్చగలవు. వాల్నట్లు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, శరీరం వాటి పోషకాల ఆధారంగా ఊహించిన దాని కంటే 21 శాతం తక్కువ శక్తిని గ్రహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల ఇది ఆకలిని నియంత్రిస్తుంది, జీవక్రియను పెంచుతుంది, తద్వారా బరువు తగ్గడం లేదా నిర్వహణలో సహాయపడుతుంది.(చదవండి: ఏసీలో పడుకుంటున్నారా..? ఐతే ఈ సమస్యలు తప్పవు..!) -
డ్రై ఫ్రూట్స్, ఇతర గింజల్ని నానబెట్టి తింటున్నారా? అయితే ..!
ఆయుర్వేదం ప్రకారం, డ్రై ఫ్రూట్స్, ఇతర కొన్ని రకాల గింజలను తినే ముందు రాత్రిపూట నీటిలో నానబెట్టడం మంచిది తద్వారా వాటిల్లోని జీవపదార్థం ద్విగుణీ కృతమవుతుందని తినడానికి సులభంగా ఉంటుందని చెబుతారు. నానబెట్టడం వల్ల నట్స్ , డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాల లభ్యతను పెరుగుతుంది. రాత్రంతా నానబెట్టిన గింజలు, డ్రైఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలుంటాయి.నానబెట్టడం వలన కలిగే ప్రయోజనాలు నానబెట్టిన గింజల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలతో కూడిన అద్భుతమైన మూలాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించి, వ్యాధులను నివారించడానికి, శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.నానబెట్టినపుడు గింజల రుచి, ఆకృతి రెండూ పెరుగుతాయి. అజీర్ణానికి కారణమయ్యే ఫైటిక్ యాసిడ్ తొలగి పోతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే టానిన్ లేదా (ఆమా) గణనీయంగా తగ్గిస్తుంది. గట్ దీంతో గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.మానవ శరీరాన్ని నియంత్రించే మూడు వాత, పిత్త , కఫ దోషాలు రాకుండా ఉంటాయి. వీటి వల్ల బాడీలో అసమతుల్యత, ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.మచ్చుకు కొన్నిమెంతులు: రెండు చెంచాల మెంతుల్ని త్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఉనాలి. ఆ నీటిని తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రపరిచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.అవిసె గింజలు: వీటిలో పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-బి, ఇనుము, మాంసకృత్తులు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ చెంచా నాన బె ట్టిన గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.అంజీరా: ఇది పోషకాల గని. దీంట్లో ఏ, బీ విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, సోడియం, పొటాషియం, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.ఇది మహిళల ఆరోగ్యానికి చాలామంచిది. గుమ్మడి విత్తనాలు: వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని తినడం వల్ల స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మలబద్దకం సమస్యకు కూడా మంచి పరిష్కారం. చెడు కొలెస్ట్రాల్ కరుగుతంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అలాగే మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. పురుషులలో వీర్య కణాల నాణ్యత కూడా పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడే వా ప్రశాంతమైన నిద్ర కావాలంటే వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది.నోట్: రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ , గింజలను చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఏదైనా అనారోగ్య సమస్యలను ఎందుర్కొంటున్నా, ఏదైనా ఇతర సమస్యలున్నా, వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
Soaked Walnuts : వాల్ నట్స్ నానబెట్టి తినాలా? మామూలుగా తినాలా?
వాల్నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మెదడు ఆకారంలో ఉండే దీనివలన జ్ఞాపకశక్తికి మంచి ఉపయోగం ఉటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది వాల్‌నట్స్‌లో ఫైబర్, విటమిన్లు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. ప్రధానంగా పోషకాలకు పవర్ హౌస్ లాంటి వాల్నట్ను నానబెట్టి తింటే దాని లాభాలు రెట్టింపవుతాయి. వాల్నట్లను రాత్రంతా నానబెట్టి, ఉదయం తినడం ఉత్తమమైన మార్గం. 2-4 వాల్నట్ ముక్కలను ఒక కప్పు నీటిలో రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తినాలి.నానబెట్టిన వాల్నట్-ఆరోగ్య ప్రయోజనాలుమెదడుకు మంచిది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పని తీరుకు సహాయపడతాయి. అంతేకాదు వయససురీత్యా వచ్చే మెదడు సమస్యలను దూరం చేస్తాయి. బరువు : తొందరగా బరువు తగ్గాలనుకునేవారికి నానబెట్టిన వాల్నట్స్ బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్ కారణంగా పెద్దగా ఆకలి వేయదు. వాల్ నట్స్ నానబెట్టి తీసుకోవడం జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో ఖనిజాలు ఫైబర్ జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగు ఎముకలకు బలమైన మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇందులో లభిస్తాయి.చర్మ ఆరోగ్యం: ఇందులోని విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతం చేస్తుంది. మెలటోనిన్, పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు ఎండనుంచి చర్మాన్ని రక్షించడంలో సాయపడతాయి.మధుమేహులకు వాల్నట్ గ్లైసోమిక్ సూచి తక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తికి మంచిది వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు , పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబు, జ్వరం లాంటి అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.నిద్రకు: వాల్‌నట్స్‌లో సహజసిద్ధమైన మెలటోనిన్ రసాయనం కారణంగా మంచి నిద్ర పడుతుంది. మెలటోనిన్ చాలా సంవత్సరాలుగా మనకు మంచి నిద్రను పొందడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజాదరణ పొందింది. నానబెట్టిన వాల్నట్లను ఉదయం , పడుకునే ముందు తీసుకుంటే మంచిది. గుండె ఆరోగ్యం: నానబెట్టిన వాల్నట్న్ శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ వాల్‌నట్‌లతో పోలిస్తే, నానబెట్టిన తరువాత ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఆ పోషకాలను బాడీ కూడా సులభంగా గ్రహిస్తుంది. ఇందులోని ఒమేగా ఫ్లాటీ 3 ఆసిడ్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాయిల్ స్థాయిలను పెంచుతాయి. -
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా.. పండ్ల రసంతో ట్యాబెట్లు తీసుకుంటే!
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను కాపాడుతుందన్న ఆరోగ్య నిపుణుల సలహా అందరికీ తెలిసిందే. చెప్తున్నారు. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి తినడం కంటే కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యా ఎదురు కాదు. ఉండదు. గుడ్లు ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి బలాన్నిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి. ఓట్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్ మీల్‌కు ఓటెయ్యడం ఉత్తమం. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోగలగడమే గాక చాలా ఉత్తమమైనది కూడా. ఎందుకంటే, ఓట్ మీల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపు చేయడంలో తోడ్పడతాయి. రక్తపోటు, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్ మీల్ మంచి బ్రేక్‌ఫాస్ట్. ఓట్ మీల్‌ను పాలతో కలుపుకొని తినడం లేదా ఉప్మాలా తిరగమోత వేసుకుని తినడం వల్ల ఈ సుగుణాలు అందుతాయి. చదవండి: Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి పండ్లు మీ రోజు ఫలవంతంగా సాగాలంటే ఉదయాన్నే పొట్టను పండ్లతో నింపేస్తే సరి. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్ ముక్కలు, లేదా సిట్రస్ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్ ఏవైనా సరే మంచి బ్రేక్‌ఫాస్ట్ జాబితాలో ఉంటాయి. చదవండి: Health Tips: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా నట్స్, సీడ్స్ నట్స్ తినటానికి రుచిగా ఉండటమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్ లో కేలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏ మాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్ చాలా ఉపయోగకరం, వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం గుప్పెడు నట్స్ తీసుకోవటం ఆరోగ్యకరం. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్ ను అందిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలనుంచి రక్షణ లభిస్తుంది. ఒక విషయం సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. అందులో భాగంగా పండ్ల రసంతో మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయనే ఉద్దేశ్యంతో నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మేలు జరగకపోగా, ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు. -
నట్స్, డార్క్ చాక్లెట్స్, అరటి పండ్లు ఇష్టమా? డోపమైన్ అనే హార్మోన్‌ను విడుదల చేసి..
Health Tips In Telugu: ఒక్కోసారి కారణమేమీ లేకుండానే దిగులుగా అనిపిస్తుంది. విలువైన వస్తువులేవో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా చికాకు వేస్తుంటుంది.ఆ తర్వాత కాసేపటికి ఇష్టమైన వారెవరో కనిపిస్తేనో, ఏదైనా మంచి వార్తలు వింటేనో, ఏమయినా మంచి ఆహారం తింటేనో మూడ్ సరి అయిపోతుంది. ఇది మనసు చేసే మాయాజాలం. ఇదంతా జరగడానికి మన శరీరంలో ఉండే డోపమైన్ అనే హార్మోన్ విడుదలలో తేడాలు రావడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే అలా కారణం మాత్రమే చెప్పి ఊరుకోకుండా మంచి మూడ్‌లోకి తీసుకొచ్చే కొన్ని ఆహార పానీయాల గురించి కూడా చెప్పారు. వీటిని కేవలం మూడ్ బాగోలేనప్పుడే కాదు, రోజువారీ తీసుకుంటే ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు కదా.. ఇంతకూ అలాంటి ఆహార పానీయాలేమిటా అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వెళ్దాం... వీటితోబాటు ఆకుకూరలు, కాలీఫ్లవర్, బ్రోకలీ కూడా డోపమైన్ బూస్టర్‌గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు వీటిని కూడా ఆహారంలో చేర్చుకుంటే సరి. నట్స్ నట్స్‌లో అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అమైనో యాసిడ్‌కు డోపమైన్ విడుదలను పెంచే సామర్థ్యం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం... నట్స్‌లో టైరోసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ టైరోసిన్ విచ్ఛిన్నమైతే.. డోపమైన్‌గా తయారవుతుంది. వేరుశెనగలు, బాదం, గుమ్మడి గింజలు, నువ్వులలో టైరోసిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే ఉల్లాసంగా, ఆనందంగా ఉంటారు. కాఫీ సాధారణంగా చాలామందికి మూడ్ బాగోలేనప్పుడు లేదా తలనొప్పిగా అనిపించినప్పుడు మంచి ఫిల్టర్ కాఫీ తాగుతుంటారు. దాంతో శాడ్ మూడ్ కాస్తా తిరిగి హ్యాపీ మూడ్‌గా మారిపోతుంటుంది. ఒక పరిశోధన ప్రకారం రోజూ సుమారు బిలియన్ మందికి పైగా కాఫీ తాగుతుంటారు. రోజూ కాఫీ తాగేవారికి డిప్రెషన్ కూడా కాస్త దూరంలోనే ఉంటుందని కొన్ని సర్వేలలో తేలింది కాబట్టి నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే కాఫీ తాగే అలవాటున్నవారు దానిని కొనసాగించడం మంచిది. ఈసారెప్పుడైనా మూడ్ బాగోలేప్పుడు ఒక కప్పు కాఫీ తాగి చూస్తే సరి. కొబ్బరి పచ్చి కొబ్బరిలో మీడియం లెవెల్లో ట్రై గ్లిజరైడ్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని, మెదడుకు చైతన్యాన్ని ఇస్తాయి. కొబ్బరి పాలు, కొబ్బరితో చేసిన తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుంది. అందుకే కొబ్బరికి మూడ్ ఫుడ్ అనే పేరుంది. బెర్రీలు... సాధారణంగా పండ్లు, కూరగాయలు బాగా తీసుకునేవారి మానసిక ఆరోగ్యం బాగానే ఉంటుంది. వాటిలోనూ ప్రత్యేకించి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల బెర్రీలు తీసుకునే వారికి కుంగుబాటు, ఆందోళన ఆమడదూరంలో ఉంటాయి. బ్లూ బెర్రీలు అంటే నేరేడు పండ్ల వంటివి తీసుకోవడం వల్ల మూడ్ బాగుంటుంది. అవకాడో ఒకప్పుడు ఇది కాస్తంత ఖరీదైన ఆహారాల జాబితాలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ పండులో ఉండే మెత్తటి గుజ్జు అనేక రకాల పోషకాలకు నిలయం. దీనిలోని కొలీన్కు నాడీ వ్యవస్థను నియంత్రించడంతోపాటు మూడ్‌ను సంతోషంగా మార్చే లక్షణాలు ఉన్నాయి. ఒక సర్వే మేరకు అవకాడో తినే మహిళలలో ఆందోళన ఉండదట. వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ బి శరీరంలోని ఒత్తిడి స్థాయులను అదుపు చేస్తుంది. అందువల్ల వీలయినప్పుడలా అవకాడో తింటూ ఉండటం ఎంతో ప్రయోజనకరం. డార్క్ చాక్లెట్స్ ఇవి తినడానికి రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపే వాటిలో డార్క్ చాక్లెట్స్ ఎప్పుడూ ముందుంటాయి. వీటిలో ఉండే ఉండే ఫినైల్థైలమైన్ అనే రసాయనం డోపమైన్‌ను కొద్ది కొద్దిగా విడుదల చే స్తుంటుంది. అంతే కాదు, డార్క్ చాక్లెట్స్‌లో ఉండే కొన్ని రకాల రసాయనాల వల్ల ఎండార్ఫిన్ హార్మోన్, సెరోటోనిన్ అనే మోనోఅమైన్ న్యూరోట్రాన్స్మీటర్ విడుదలవుతాయి. వీటివల్ల మానసిక ఉల్లాసం, సంతోషం కలుగుతాయి. అరటిపండు అరటిపండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలో డోపమైన్, సెరోటోనిన్ న్యూరో టాన్స్మీటర్ల విడుదలకు ఉపకరిస్తుంది. మెదడు, శరీరం చురుగ్గా ఉండేలా చేయడానికి ఈ రసాయనాలు తోడ్పడడంతోపాటు మానసిక స్థితిని నియంత్రణలో ఉంచి.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అరటిపండ్లు రక్తంలోని షుగర్ నిల్వలను సైతం నియంత్రించగలవు. అలాగని షుగర్ ఉన్నవారు ఒకేసారి రెండు మూడు అరటిపళ్లు లాగించేయకూడదు. మూడ్ సరిగా లేదనిపిస్తే మాత్రం ఒక అరటిపండు తింటే సరి. డెయిరీ ఉత్పత్తులు ఒత్తిడిలో ఉన్నప్పుడు డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చీజ్, పాలు, పెరుగు తీసుకుంటే.. శరీరంలో హ్యాపీ లెవల్స్ పెరుగుతాయి. చీజ్‌లో టైరమైన్ ఉంటుంది, ఇది మానవ శరీరంలో డోపమైన్‌గా మారుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు పాలు, చీజ్, పెరుగు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు, పుల్లట్లు తిన్నా, పులి బొంగరాలు తిన్నా మంచిదే. కాకపోతే అవి సిద్ధంగా ఉండవు కాబట్టి వీలయినప్పుడల్లా తింటూ ఉంటే మంచిది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్నర్కు సంబంధించి Beauty Tips: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్.. ఇలా చేశారంటే -
Health Tips: గుండె ఆరోగ్యం.. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే..
Best Diet For Heart Health And Weight Loss: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడటం, కొందరు ఆకస్మాత్తుగా మృత్యువాత పడటాన్నీ చూస్తున్నాం, వింటున్నాం. గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్నిరకాల ఆహారాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతాయి. కానీ కొన్ని మాత్రం గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ క్రమంలోనే గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో, దానిని ఎందుకు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఫైబర్ ఎక్కువగా ఉండాలి.. ►నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ►ఫైబర్ హైబీపీని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. ►ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.ఇవి ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. ►దీంతో శరీరంలో వాపులు తగ్గుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ►చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి కనుక వాటిని తరచూ తినడం వల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. వెజిటేరియన్లు ఎలా? ►ఇక వెజిటేరియన్లు నట్స్, సీడ్స్ తినడం ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ►బాదంపప్పు, వాల్నట్స్ వంటి వాటిని నిత్యం గుప్పెడు మోతాదులో తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ►వీటిల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ►నట్స్‌ను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు తగ్గించుకుంటేనే.. ►అధికంగా బరువు ఉండడం వల్ల కూడా గుండె వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీనివల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ►ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. ►చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ►అదే విధంగా కూరగాయలూ, పండ్లలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు.. ►సాల్మన్ ఫిష్, ట్యూనా, హెర్రింగ్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. ►వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే బెటరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ►ఓట్ మీల్ తింటే మంచిది. పీచు పదార్థం ఉండే ఈ ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ►జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే. ►స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, ఆ పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. చాక్లెట్లు కూడా.. ►డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరిగే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. ►అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం లేదు. అయితే వీటిని కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే.. ►విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్ళీ అతిగా పంచదార కలుపుకోకూడదు. ►సోయా పాలు, సోయా జున్ను (తోఫూ) తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. ►అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. సోయా ప్రొటీన్లు ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో.. ►బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదకరం కావు. ►పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది. ►టొమాటోలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. ఇందులోని విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ►గుప్పెడన్ని నట్స్ అంటే బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ►బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి. ►దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. ►దానిమ్మ పండు గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే అడ్డంకులు (ప్లాక్స్)నూ శుభ్రం చేస్తాయి. యాపిల్ పండ్లు కూడా. ►అవిశె గింజలలో (ఫ్లాక్ సీడ్స్) పీచు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటిని రోజుకు 20 గ్రాములు తింటే మేలు. చదవండి👉🏾Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! చదవండి👉🏾Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
Shocking: వ్యక్తి కడుపులో కేజీకీ పైగా నట్టులు, బోల్టులు
విల్నియస్: కొందరు వ్యక్తులు.. వెంట్రుకలను, బోల్ట్లను తినడం వంటి వార్తలను మనం అప్పుడప్పుడూ చదువుతూ ఉంటాం. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి లిత్వేనియాలో జరిగింది. ఒక వ్యక్తి కడుపులో దాదాపు కిలోగ్రాము స్క్రూలు, నట్టులు, బోల్టులను వైద్యులు శస్త్రచికిత్స చేసి వెలికితీశారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. లిత్వేనియాకు చెందిన వ్యక్తి మొదట మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత దాన్ని మానుకునే క్రమంలో.. అనుకోకుండా నట్టులు, బోల్టులు, గోర్లు వంటివి తినడం అలవాటు అయింది. దీంతో కొన్ని రోజులుగా అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కడుపునొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు.. అతడిని అంబులెన్స్‌లో బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న క్లైపెడా యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వ్యక్తికి డాక్టర్లు స్కానింగ్ చేశారు. అతని కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స ప్రారంభించారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించిన సరునాస్ డైలీడేనాస్ వైద్యుల బృందం అతని కడుపులో నుంచి దాదాపు కిలోగ్రాము బరువున్న స్క్రూలు, నట్టులు, గోర్లను బయటకు తీశారు. ఆ తర్వాత వ్యక్తి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి.. -
నట్స్‌తో ఆ సమస్యలకు చెక్
లండన్ : రోజూ గుప్పెడు బాదం, వాల్నట్స్ వంటి గింజలతో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు 60 గ్రాముల పలు రకాల నట్స్ తీసుకుంటే పురుషుల్లో వీర్య కణాల సంఖ్య 16 శాతం పెరుగుతుందని ఈ అథ్యయనం పేర్కొంది. వీటితో వీర్య కణాల కదలికలు సైతం ఆరు శాతం మేర మెరుగవుతాయని ఫలితంగా పురుషుల్లో సంతాన సాఫల్యతకు ఉపకరిస్తాయని పరిశోధన తెలిపింది. నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో వీర్యకణాల వృద్ధి జరుగుతుందని పేర్కొంది. కాలుష్యం, పొగతాగడం, పాశ్చాత్య సంస్కృతి పెచ్చుమీరడంతో స్ర్తీ, పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తాజా అథ్యయన వివరాలు వెలుగుచూశాయి. 18 నుంచి 34 ఏళ్ల వయసున్న 119 మందిని 14 వారాల పాటు పరిశీలించిన అనంతరం అథ్యయనం చేపట్టిన స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ రొవిర విర్గిల్ పరిశోధకులు ఈ అంశాలను గుర్తించారు. మరోవైపు రోజూ గుప్పెడు నట్స్ తీసుకోవడం ద్వారా వీర్యకణాల డీఎన్ఏ దెబ్బతిని పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గడాన్ని నివారించవచ్చని వెల్లడైందని అథ్యయన రచయిత డాక్టర్ అల్బర్ట్ సలాస్ హ్యుటోస్ చెప్పారు. -
వాల్‌నట్స్‌తో మధుమేహం దూరం
లండన్ : రోజుకు గుప్పెడు వాల్‌నట్స్‌తో టైప్ 2 డయాబెటిస్‌కు దూరంగా ఉండవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు మూడు టేబుల్స్పూన్ల వాల్నట్స్ తీసుకుంటే డయాబెటిస్ ముప్పును సగానికి సగం తగ్గించుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. నిత్యం వాల్‌నట్స్‌ను తింటే డయాబెటిస్ వచ్చేఅవకాశాలు 47 శాతం మేర తగ్గుతాయని అథ్యయనం పేర్కొంది. 34,000 మందిపై జరిపిన పరిశోధనలో ఏ తరహా వాల్‌నట్స్‌ను తీసకున్నా మధుమేహం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధన చేపట్టిన కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన డేవిడ్ గెఫెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తెలిపారు. వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకున్నవారిలో మధుమేహాన్ని నిరోధించడాన్ని గుర్తించామని అథ్యయన రచయిత డాక్టర్ లీనోర్ అరబ్ పేర్కొన్నారు. కాగా వాల్నట్స్ మానసిక ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయని మరో పరిశోధనలో వెల్లడైంది. 18 నుంచి 80 సంవత్సరాల వయసున్న స్త్రీ, పురుషులకు నిర్వహించిన మధుమేహ పరీక్షల్లో వాల్నట్స్ తరచూ తీసుకునే వారిలో ఈ ఆహారాన్ని తీసుకోని వారితో పోలిస్తే టైప్ 2 డయాబెటిస్ అరుదుగా కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. డయాబెటిస్తో బాధపడేవారు బీపీ, కొలెస్ర్టాల్, ట్రైగిజరైడ్లు అధికంగా కలిగి గుండెజబ్బులు, స్ర్టోక్ బారిన పడే అవకాశాలున్నాయని చెప్పారు. వాల్‌నట్స్‌తో మధుమేహంతో పాటు గుండెజబ్బులూ నిరోధించవచ్చని గతంలోనూ పలు పరిశోధనల్లో వెల్లడైంది. వాల్‌నట్స్‌లో ఉండే ప్లాంట్ ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. అథ్యయన వివరాలు డయాబెటిక్స్ మెటబాలిజం రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
గుప్పెడు నట్స్‌తో..
లండన్ : తరచూ తక్కువ మోతాదులో బాదం, జీడిపప్పు వంటి నట్స్ తీసుకునేవారిలో అసాధారణంగా గుండె కొట్టుకునే రిస్క్ గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. వారానికి మూడు సార్లు నట్స్ తింటే స్ర్టోక్‌కు దారితీసే అసాధారణ హార్ట్ బీట్ ముప్పును 18 శాతం మేర తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. అయితే ఎక్కువగా నట్స్‌ను తీసుకోరాదని, పరిమితంగా వీటిని తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. స్వీడన్‌కు చెందిన కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు 60,000 మందిని 17 ఏళ్ల పాటు పరిశీలించి నట్స్ వినియోగం, వారి గుండె ఆరోగ్యాన్ని గమనించారు. నట్స్ వినియోగంతో గుండె పోటు, స్ర్టోక్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ప్రాథమికంగా నిర్థారించారు. నట్స్ వినియోగం పెరిగిన కొద్దీ అసాధారణంగా గుండె కొట్టుకోవడం, గుండె వైఫల్యం వంటి రుగ్మతల రిస్క్ తగ్గినట్టు వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. అథ్యయన వివరాలు జర్నల్ హార్ట్‌లో ప్రచురితమయ్యాయి. -
వాల్‌నట్స్‌తో హృద్రోగాలు, క్యాన్సర్‌కు చెక్
లండన్ : రోజూ గుప్పెడు వాల్‌నట్స్‌తో హృద్రోగాలతో పాటు పేగు క్యాన్సర్‌ను నివారించవచ్చని తాజా అథ్యయనం పేర్కొంది. ఆరు వారాల పాటు రోజూ మూడోవంతు కప్పు వాల్నట్స్ తీసుకుంటే చెడు కొలెస్ర్టాల్ తగ్గడంతో పాటు ప్రమాదకర ఆమ్లాలు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయని అథ్యయనం తేల్చింది. ఈ తరహా ఆమ్లాలు పేగు క్యాన్సర్‌కు దారితీస్తాయని గత పరిశోధనలు పేర్కొన్న క్రమంలో ఆ ముప్పును కూడా వాల్నట్స్ తగ్గిస్తాయని పేర్కొంది. కొవ్వుశాతాన్ని కరిగించడంతో హృద్రోగాల ముప్పు తగ్గుతుందని పరిశోధకులు విశ్లేషించారు. అధిక ఫైబర్ కలిగి ఉండే వాల్‌నట్స్‌తో కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, ఇది గుండె, జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా నిర్వహిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. వాల్‌నట్స్‌లో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఇవి దోహదపడతాయని శాస్త్రవేత్తలు సైతం గుర్తించారు. ఇక వాల్‌నట్స్‌లో ప్రమాదకర ఆమ్లాలు శరీరంలో పేరుకుపోవడాన్ని నియంత్రించే గుణం ఉండటంతో పేగు క్యాన్సర్‌ను నివారిస్తాయని అథ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన ప్రొఫెసర్ హన్నా హల్చర్ చెప్పారు. -
కడుపు నిండుతుంది
చూడటానికి అచ్చం మెదడు షేపులో కనిపించే వాల్‌నట్‌తో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అపరిమితం. ఈ డ్రైఫ్రూట్ మెదడుకు చాలా మంచిది. వీటితో కలిగే ప్రయోజనాల్లో ఇవి కొన్ని. ♦ వాల్నట్లో చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటికి తోడు అందులోని ఫీనాలిక్ కాంపౌండ్లు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్, గామా–టోకోఫెరాల్ వంటివి క్యాన్సర్ కణాలను చాలా బలంగా తుదముట్టిస్తాయి. రొమ్ము, ప్రోస్టేట్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ల వంటి ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ♦ వాల్‌నట్స్‌లోని లినోలిక్ యాసిడ్, ఆల్ఫాలినోలిక్ యాసిడ్, ఆరాకిడోనిక్ యాసిడ్స్ వంటివి గుండెజబ్బులను (కరోనరీ హార్ట్ డిసీజ్) నివారిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచికొలెస్ట్రాల్ను పెంచుతాయి. దాంతో రక్తనాళాలలో పూడిక ఏర్పడే ముప్పును నివారితమవుతుంది. ♦ రోజుకు మూడు లేదా నాలుగు వాల్నట్స్ తినేవారికి రక్తపోటు (హైబీపీ) ముప్పు చాలా తక్కువ. ఇది నిర్ధారణ అయిన ఫలితం. ♦ వాల్నట్స్ కొద్దిగా తినగానే వెంటనే సంతృప్తభావన కలుగుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి వాల్నట్స్ చాలా మేలు చేస్తాయి. ♦ వాల్‌నట్స్‌లోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు చాలా మేలు చేస్తాయి. అవి అయోడిన్, సెలినియమ్లతో కలిసి మెదడును చురుగ్గా ఉంచేలా చూస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచి మతిమరపును తగ్గిస్తాయి. మూర్చతో బాధపడేవారికి వాల్నట్స్ చాలా మంచివి. ♦ ఇవి డయాబెటిస్‌ను చాలా సమర్థంగా నియంత్రిస్తాయి. బరువు తగ్గించడం ద్వారా కూడా ఇవి డయాబెటిస్ ముప్పును తగ్గిస్తాయి. ♦ ఎముకలలోకి క్యాల్షియమ్‌ను సమర్థంగా ఇంకేలా చేస్తాయి. అలా ఇవి ఎముకల పటిష్టతకూ ఉపకరిస్తాయి. ♦ గర్భవతులకు ఇవెంతో మేలు చేస్తాయి. పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడతాయి. ♦ నిద్రను క్రమబద్దీకరిస్తాయి. నిద్రలేమి, కలత నిద్రతో బాధపడేవారు రాత్రి భోజనం తర్వాత కొన్ని వాల్నట్స్ తీసుకుంటే మంచి నిద్రపడుతుంది. ♦ వాల్నట్స్ ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేసి, దీర్ఘకాలం యౌవనంగా ఉంచేలా తోడ్పతయాయి. చర్మం మీది ముడుతలను నివారిస్తాయి. -
వీటితో గుండె పదిలం
సాక్షి, న్యూఢిల్లీ: అధిక కొవ్వుతో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారించేందుకు ఆహారంలో సోయా, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మాంసం, కొవ్వు శాతం అధికంగా ఉండే పాలు వంటి పదార్ధాల స్ధానంలో ఆరోగ్యకర ఆహారంతో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయని ఓ అథ్యయనం వెల్లడించింది. రోజూ రెండు కప్పుల సోయా, తృణధాన్యాలు, గింజలను తీసుకుంటే హానికర ఎల్డీఎల్ కొవ్వులను 5 శాతం మేర తగ్గించవచ్చని తేలింది.ఈ ఆహారంపై తాము విస్తృతంగా జరిపిన పరిశోధనలో ఇవి గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని స్పష్టంగా వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన జాన్ సెన్పైపర్ చెప్పారు. కెనడాలోని ఒంటారియో నగరంలోని సెంట్ మైఖేల్ హాస్పిటల్లో జాన్ సేవలందిస్తున్నారు. ప్లాంట్ ప్రొటీన్లతో పాటు కొవ్వును తగ్గించే ఓట్స్, బార్లీ వంటి ఆహారంతో వీటిని కలిపితీసుకుంటే ఆరోగ్యకరంగా మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని అథ్యయనంలో తేలింది. -
చికెన్ కుర్మాలో శెనగలు.. భారీ ఫైన్
లండన్: చికెన్ కుర్మాలో శెనగలు వేసి వండిన భారతీయ రెస్టారెంట్ షెఫ్‌కు అధికారులు భారీ జరిమానా విధించారు. తూర్పు ఇంగ్లండ్ ప్రాంతం గ్రిమ్స్బీలో 'మసాలా' ఇండియన్ రెస్టారెంట్లో బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ ఉద్దీన్ షెఫ్‌గా పనిచేస్తున్నాడు. మసాలా రెస్టారెంట్ లో తయారు చేసిన చికెన్ కుర్మాను ఆహార శాఖ అధికారులు 2016 లో తనిఖీ చేశారు. కుర్మాలో 6.8 మిల్లీగ్రాముల శెనగలు ఉన్నట్లు కనుగొన్నారు. మరోసారి తనిఖీ చేసినప్పుడు కూడా అటువంటి కల్తీనే గుర్తించారు. దీనిపై సంబంధిత షెఫ్‌ను అధికారులు విచారించగా... కుర్మాలో శెనగలు ఎలా కలిశాయో తనకు తెలియదని, తాను వాటిని కలుపలేదని షెఫ్ మహ్మదుద్దీన్ అధికారులకు తెలిపారు. అయితే, శెనగలు లేకుండానే చికెన్ కుర్మా చేస్తున్నట్లు మెనూలో పేర్కొని, వాటిని కలపటం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. అంతే కాకుండా, కొందరు 5 మిల్లీ గ్రాములకు మించి శెనగలు ఆహారంలో ఉంటే అలెర్జీతో ఇబ్బందులు పడతారని, అవేమీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వాటిని కలిపి ఆహార పదార్థాలు వండారని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు గాను షెఫ్ మహ్మదుద్దీన్కు 2,300 పౌండ్ల జరిమానా విధించారు. ( గ్రిమ్స్బీలోని 'మసాలా' ఇండియన్ రెస్టారెంట్ ) -
పువ్వులు ఆహ్లాదం... గింజలు ఆరోగ్యం!
తెలుసా? అందానికీ, ఆహ్లాదానికీ తామర పువ్వుల గురించి చెబుతూ ఉంటాం. కానీ, ఆరోగ్యానికి కూడా అవి కీలకమంటున్నారు నిపుణులు. మీకు తెలుసో తెలియదో తామర పువ్వుల్లో ఉండే గింజలు తినవచ్చు. అవి ఆరోగ్యాన్ని అందిస్తాయట! తామర గింజల నిండా బోలెడన్ని పోషక పదార్థాలు ఉంటాయట! పచ్చిగా, తాజాగా ఉన్నప్పుడు గింజలు ఆకుపచ్చగా ఉంటాయి. కొద్దిగా ముదిరితే, గట్టిగా తయారవుతాయి. వీటి ఔషధ గుణాల గురించి చైనీయులకు తెలుసు. అందుకే, వాళ్ళు వీటిని ఔషధాల్లో వాడుతున్నారు. ఆగస్ట్, సెప్టెంబరుల్లో ఎక్కువగా తామర పూలొస్తాయి. వీటిలోని గింజల్ని పచ్చిగా కానీ, ఉడకబెట్టి కానీ తినవచ్చు. నిల్వ చేయడమెలా? ఈ గింజల్ని ఎండబెట్టి, గాలి చొరబడని ప్లాస్టిక్ సీసాల్లో వేసి, తడి తగలని చోట ఉంచాలి. అదే గనక పచ్చి గింజలైతే, వాటిని పొడిగా ఉండే, జిప్ లాక్ బ్యాగ్‌లలో వేసి, ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఔషధ ప్రయోజనాలు ఎన్నో... * తామర పూలగింజలు తింటే యౌవనంతో, నాజూగ్గా కనిపిస్తారు. దానికి కారణం ఉంది. ఈ గింజల్లో ‘ఎల్-ఐసో యాస్పర్టిల్ మిథైల్ ట్రాన్స్‌ఫెరేస్’ ఎంజైమ్ ఉంటుంది. ఇది దెబ్బతిన్న ప్రొటీన్లను సరిదిద్ది, వయసు మీద పడకుండా చేస్తుందట! అందుకే, సౌందర్య ఉత్పత్తుల్లో ఈ గింజల్ని వాడుతున్నారు. * వీటిలో గైసీమిక్ ఇండెక్స్ తక్కువ. కొన్ని తినగానే కడుపు నిండినట్లనిపిస్తుంది. దాంతో, పొట్ట తగ్గుతుంది. బరువు తగ్గుతాం. * గర్భిణులు ఈ గింజలు తింటే పోషక విలువల వల్ల గర్భంలోని పిండం తాలూకు నాడీ వ్యవస్థ, మెదడు వృద్ధి చెందుతాయి. * అలాగే, గర్భిణుల్లో రక్తస్రావాన్ని అరికట్టి, గర్భస్రావం కాకుండా చూడడంలో కూడా ఈ గింజల పనితనం భేష్. కాన్పు అయ్యాక ఉండే శారీరక బలహీనతను అరికడతాయి. * మనసుకు ప్రశాంతతనిచ్చి, నిద్రపుచ్చే గుణం వీటికుంది. * తామరగింజల మధ్యలో ఐసోక్వినోలిన్ ఆల్కలాయిడ్స్‌తో చేదు పదార్థం ఉంటుంది. అది రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్తపోటు తగ్గిస్తుంది. అలా ఇవి గుండెకు మేలైనవన్న మాట! * ఈ గింజలు దంతాలు, ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. డయేరియాను నివారిస్తాయి. అలాగే, నోటిలో పుండ్లను తగ్గిస్తాయి. మొత్తం మీద, సాధారణ ఆరోగ్యం మెరుగవుతుంది. జాగ్రత్తలు కొన్ని... * ఈ గింజలు కొంతమందికి పడవు. ఎలర్జీ రావచ్చు. * కడుపు ఉబ్బరంగా అనిపించి, గ్యాస్ వచ్చే సూచనలుంటాయి. * ఈ గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గే సూచనలున్నాయి కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్థులు జాగ్రత్త వహించాలి. ఎలా తినవచ్చంటే... కొద్దిగా నూనె, లేదంటే నెయ్యి బాణలిలో వేసి, వేడి చేయండి. తామర గింజలను దానిలో వేసి, కరకరలాడేలా సన్నటి సెగ మీద 10 నిమిషాలు వేయించండి. మంట ఆపాక, తగినంత ఉప్పు, మసాలా దినుసులు కలపాలి. బాగా కలుపుకొన్నాక, వేడి వేడిగా తినవచ్చు. ఈ గింజలతో సాస్‌లు, పాల పాయసం చేసుకోవచ్చు. -
తొడిమలు తీస్తే... తాజా!
ఇంటిప్స్ బెండకాయలకు రెండు వైపులా ఉన్న తొడిమెలను తీసేసి వాటిని ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే అవి తాజాగా ఉంటాయి.అల్లం-వెల్లుల్లి పేస్ట్ రంగు మారకుండా ఉండాలంటే, వాటిని మిక్సీలో వేసే ముందు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలారోజుల పాటు ఆ పేస్ట్ తాజాగా ఉంటుంది. ఆకుకూరలు ఉడకబెట్టిన నీళ్లు పారబోయకుండా వాటిని మరో గిన్నెలోకి తీసుకొని సూప్ తయారీలో వాడుకోవచ్చు. ఇలా చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్ వృథా కావు. అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కానీ, సెనగపప్పు కానీ వేయాలి. అలా చేస్తే అప్పడాలు మెత్తపడకుండా ఉంటాయి. -
ఇసుక దిబ్బల్లోనూ..!
‘తివిరి ఇసుక నుంచి తైలం తీయవచ్చు..’ అంటారు. తైలం విషయం ఏమోగాని.. బంగ్లాదేశ్‌లో ఇసుక దిబ్బలు, వరదల కారణంగా ఇసుక మేట వేసిన పొలాల్లో చక్కని పంటలు పండిస్తున్నారు. భారీ టెక్నాలజీ, ఖరీదైన సదుపాయాల వంటివేమీ అక్కర్లేదు. ఎక్కువ కాలం నిల్వ ఉండే గుమ్మడి కాయలు పండిస్తే ఆహార భద్రతకు ఢోకా ఏముంది? 1. ఇసుకలో మీటరు లోతు, వైశాల్యం గల గుంత తవ్వాలి. 2. ఒక గోనె సంచిని తీసుకొని కంపోస్టు లేదా ఘనజీవామృతం కలిపిన మట్టి మిశ్రమంతో నింపాలి. కొన్ని రోజుల తర్వాత దాన్ని ఇసుక గుంతలో బల్లపరుపుగా పెట్టాలి. కంపోస్టులో నాలుగు నుంచి ఆరు వరకు ఏవైనా విత్తనాలను విత్తుకోవాలి. 3. ఆ తరువాత ఐదు నెలలు ఈ గోతులను జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ప్రతి గుంత నుంచి ఫలసాయం లభిస్తుంది. -
నట్లు, బోల్టులు, మేకులే అతడి ఆహారం!
బటిండా: పంజాబ్ రాష్ర్టంలోని బటిండాకు చెందిన రైతు రాజ్‌పాల్ సింగ్....34 ఏళ్లు... నట్లు, బోల్టులు, బ్యాటరీలతోపాటు 140 నాణెంలు, 150 మేకులు తిన్నాడు. మూడేళ్లుగా ఆయనకు అదే పని. ఇంకా అదేపనిగా వాటిని తినాలని కోరుకున్న ఆయనకు కడుపు నొప్పి అడ్డం పడింది. దాంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. ఎక్కడికెళ్లినా తగ్గలేదు. కడుపునొప్పి ఎందుకొస్తుందో ఆ ఆస్పత్రుల వైద్యుల గుర్తించలేక పోయారు. చివరకు స్థానికంగా ఉన్న గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ గోయల్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆయన కడుపుకు ఎండోస్కోపి చేసిన డాక్టర్లు అవాక్కయ్యారు. కడుపా, ఇనుప సామాన్ల కొట్టా! అంటూ గద్దించిన డాక్టర్లు ఆ తర్వాత శస్త్ర చికిత్స ద్వారా రాజ్‌పాల్ సింగ్ మింగిన నట్లు, బోట్లు, మేకులు, నాణెంలు వెలికి తీశారు. అయినప్పటికీ అయన కడుపులో ఇంకా కొన్ని ఇనుప సామాన్లు మిగిలిపోయాయి. పదే పదే ఆపరేషన్లు చేస్తే ఆయన శరీరం తట్టుకునే పరిస్థితి ప్రస్తుతం లేదని, ఓ వారం రోజుల తర్వాత మరోసారి ఆపరేషన్ చేసి మిగిలిన వాటిని వెలికి తీస్తామని డాక్టర్ గోయల్ తెలిపారు. మానసిక ఒత్తిడి కారణంగా చచ్చిపోదామనుకొని మూడేళ్ల క్రితం ఇనుప వస్తువులు మింగడం మొదలు పెట్టానని, ఆ తర్వాత వాటిని తినకుండా ఉండలేక పోయానని, తినకపోతే కడుపులో వెలితిగా ఉండేదని రైతు రాజ్‌పాల్ సింగ్ మీడియాకు తెలిపాడు. నేరుగా వాటిని మింగలేక పాలల్లో, పండ్ల రసాల్లో కలుపుకొని సున్నితంగా మింగేవాడట. తనకు ఈ చెడలవాటున్న విషయం సింగ్ ఏ డాక్టరుకు చెప్పలేదట. అందుకే చాలా మంది డాక్టర్లు కడుపునొప్పికి కారణం ఏమిటో కనుక్కోలేక పోయారు. అనవసరమైనవాటికి అడ్డమైన టెస్టులు రాసే డాక్టర్లున్న నేటి ప్రపంచంలో సింగ్‌కు చిన్న ఎక్స్‌రే కూడా రాయకపోవడం వృత్తిపట్ల ఎంత నిజాయితీయో! -
దండంతో సరిపెట్టుకోవాల్సిందే..!
సాక్షి, ముంబై: ప్రముఖ నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోకి కొబ్బరి కాయలు, పూల హారాలు, స్వీట్లు, ఇతర పూజా సామగ్రిని నిషేధించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని కొత్త ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు కమిటీ తెలిపింది. దీంతో ఎంతో భక్తిశ్రద్ధలతో శివున్ని దర్శించుకునేందుకు అంత దూరం వెళ్లిన భక్తులు కేవలం నమస్కారం వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. అయితే ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కమిటీ స్పష్టం చేసింది. ప్రముఖ 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ ఒకటి. దీంతో నిత్యం ఈ ఆలయాన్ని వేలాదిమంది సాధారణ భక్తులు, ప్రజలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా సందర్శిస్తుంటారు. నాసిక్ జిల్లాలో పంచవటి, త్రయంబకేశ్వర్ సమీపంలో ఉన్న కొండ వద్దే గోదావరి నది పుట్టింది. అదేవిధంగా నాసిక్ జిల్లాకు 90 కి.మీ. దూరంలో ప్రముఖ షిర్డీ పుణ్య క్షేత్రం కూడా ఉంది. దీంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు త్రయంబకేశ్వర్‌ను దర్శించుకోనేదే ఉండలేరు. త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక దర్శనం, వీఐపీ పాస్‌లు, డబ్బులు చెల్లించి శీఘ్ర దర్శనం లాంటి ప్రత్యేక సౌకర్యాలేమీ లేవు. ఇక్కడ అందరూ సమానమే. అందువల్ల ఎవరైనా ఎవరైనా దేవుడిని దర్శించుకోవడానికి క్యూలో వెళ్లాల్సిందే. ఈ ఆలయం కీర్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతుండటంతో భక్తుల సంఖ్య కూడా పెరగసాగింది. అదే స్థాయిలో ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తరుచూ కేంద్ర గూఢచార నిఘా సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. అందుకు భద్రతలో అనేక మార్పులు చేయాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి కాయలు, పూలు,హారాలు, మిఠాయి బాక్స్‌లు తదితర అర్చన సామగ్రిని నూతన సంవత్సరం నుంచి నిషేధించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
కందినైనా కాపాడుకోండి
శనగపచ్చ పురుగు రెక్కల పురుగులు(బసవంతలు) లేత ఆకులపై పూత, పిందెలపై తెల్లని గసగసాల పరిమాణంలో గుడ్లు పెడుతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన లార్వాలు తొలి రోజుల్లో ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. తర్వాత పంట పూత దశకు చేరగానే పూత, మొగ్గలు, కాయలు, గింజలను ఆశించి అధిక నష్టం కలగజేస్తాయి. నివారణ చర్యలు... దీని నివారణకు మొక్కల మొదళ్లలో గోనె సంచులు లేదా తాటిపత్రి షీట్లను పరవాలి. మొక్కను సున్నితంగా ఓ వైపు వంచి దులపాలి. ఇలా చేస్తే 90 శాతం శనగపచ్చ పురుగులు, ఇతర క్రిమికీటకాలు, నల్లులు, పెంకు పురుగులు కింద పడుతాయి. రాలిన లార్వాలను, ఇతర కీటకాలను పూడ్చడం గానీ మంటలో వేయడం చేయాలి. ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (20శాతం ఈసీ) లేదా 1 మిల్లీలీటరు నోవాల్యురాన్ (10శాతం ఈసీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ (50 శాతం ఈసీ) మందును ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పంటపై పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు దీన్ని మారుక మచ్చల పురుగు, గూడు పురుగు అని కూడా అంటారు. వీటి లార్వాలు చిన్నవిగా ఉండి పూత లోపలి మెత్తటి భాగాలను తిని నష్టపరుస్తాయి. ఆకులు, పూత, పిందెలను కలిపి గూడుగా మలిచి తింటూ ఉండిపోతుంది. ఫలితంగా పంట కాత పట్టదు. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తుంది. లోపలి మెత్తటి గింజలను తినేసి కాయలను డొల్లగా మారుస్తాయి. ఈ లార్వా ఆశించిన పూతపై, కాయ లోపల వాటి విసర్జన పదార్థాన్ని చూసి నిర్ధారించుకోవచ్చు. నివారణ చర్యలు... ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (25శాతం ఈసీ) మందును కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే రెండోసారి వారం రోజుల తర్వాత.. లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ట్రయాజోఫాస్ (40శాతం ఈసీ) లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమమేక్టిన్ బెంజోయేట్ (5 ఈసీ డబ్ల్యూజీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్లూబెండమైడ్ (39, 35 ఎస్సీ) మందును కలిపి స్ప్రే చేయాలి. కాయతొలుచు ఈగ తల్లి ఈగ గుడ్లను కాయ లోపలికి జొప్పించి పెడతాయి. కాయ లోపలే గుడ్లు పొదిగి కాళ్లు లేని పిల్లలు(మగ్గోట్స్)గా మారి లేత గింజలను తిని మగ్గేట్ దశను పూర్తి చేసుకుని ప్యూపాగా మారుతాయి. ప్యూపాలు కొంత కాలం తర్వాత పగిలి తల్లి ఈగలు తయారవుతాయి. మగ్గేట్లు కాయ లోపలి భాగాన్ని కొరికి తినేటప్పుడు కాయ తొక్కకి పలుచని పొర ఏర్పడుతుంది. దీన్ని చీల్చుకుంటూ తల్లి ఈగ బయటకు వస్తుంది. ఈగ లేత దశలోనే ఆశించడం వల్ల జీవిత చక్రం కాయ లోపలనే జరుపుకోవడంతో ఇది కలుగజేసే నష్టాన్ని గుర్తించడం కష్టం. నివారణ చర్యలు... మొదటి దశలో లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత రెండో విడతగా లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల డైమిథోయేట్‌ను పంటపై స్ప్రే చేయాలి. వేరుకుళ్లు, ఎండుకుళ్లు ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వడలిపోయి క్రమేపీ వాడిపోతాయి. కాండాన్ని చీల్చి చూసినట్లయితే గోధుమ రంగు ధారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా కానీ పాక్షికంగా గానీ కుళ్లిపోతాయి. కొద్ది రోజుల్లోనే మొక్క చనిపోతుంది. నివారణ చర్యలు... దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 0.2 గ్రాముల తెబుకొనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. - మొక్కను మొత్తం మందుతో తడపాలి. ముఖ్యంగా మొదళ్లు బాగా తడిసేలా చూడాలి. - పై పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఏఓ సూచించారు. కందిపెంకు పురుగు పెంకు పురుగులు పూత, కాతను ఆశించి పూత నుంచి కాత రసాన్ని పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నివారణ చర్యలు... లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేయాలి.