ప్రతీకాత్మక చిత్రం
విల్నియస్: కొందరు వ్యక్తులు.. వెంట్రుకలను, బోల్ట్‌లను తినడం వంటి వార్తలను మనం అప్పుడప్పుడూ చదువుతూ ఉంటాం. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి లిత్వేనియాలో జరిగింది. ఒక వ్యక్తి కడుపులో దాదాపు కిలోగ్రాము స్క్రూలు, నట్టులు, బోల్టులను వైద్యులు శస్త్రచికిత్స చేసి వెలికితీశారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
లిత్వేనియాకు చెందిన వ్యక్తి మొదట మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత దాన్ని మానుకునే క్రమంలో.. అనుకోకుండా నట్టులు, బోల్టులు, గోర్లు వంటివి తినడం అలవాటు అయింది. దీంతో కొన్ని రోజులుగా అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కడుపునొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు.. అతడిని అంబులెన్స్‌లో బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న క్లైపెడా యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత వ్యక్తికి డాక్టర్లు స్కానింగ్ చేశారు. అతని కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స ప్రారంభించారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించిన సరునాస్ డైలీడేనాస్ వైద్యుల బృందం అతని కడుపులో నుంచి దాదాపు కిలోగ్రాము బరువున్న స్క్రూలు, నట్టులు, గోర్లను బయటకు తీశారు. ఆ తర్వాత వ్యక్తి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment