stomach
-
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు విదేశీయులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.26 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. జనవరి 24న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసి... అనంతరం కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. జనవరి 24న సావోపాలో నుంచి వచ్చిన బ్రెజిల్ మహిళ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకొనేందుకు గ్రీన్ చానల్ దాటుతుండగా పట్టుకున్నారు. డ్రగ్స్ క్యాప్సూల్స్ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసి 100 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. వాటిలో కొకైన్‌గా అనుమానిస్తున్న తెల్లటి పొడి ఉన్నట్లు తేలింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్స్ బరువు 802 గ్రాములు కాగా, వీటి విలువ రూ.12.03 కోట్లు ఉంటుందని అంచనా. అదే రోజు అడిస్ అబాబా నుంచి వస్తున్న కెన్యా ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. విచారణలో కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు అంగీకరించాడు. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి మొత్తం 70 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. క్యాప్సుల్స్‌లో 996 గ్రాముల హై ప్యూరిటీ కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. రూ.14.94 కోట్ల విలువైన డ్రగ్స్‌గా గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి.. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాదకద్రవ్యాల సిండికేట్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
మంచు మనోజ్ కడుపు, వెన్నెముకలో గాయాలు
-
ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయొచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయొచ్చా లేదా అనేది ప్రతి ఒక్కరి మనుసులో మెదిలే సందేహమే ఇది. కొంతమంది వ్యక్తులు వారి జీవక్రియ, శక్తి స్థాయిలను బట్టి వ్యాయామానికి ముందు ఏదైనా తినవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అసలు ఇలా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల మంచిదేనా..? దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు వర్కౌట్లు చేయడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యకరమైన రీతిలో చేస్తేనే మంచి ఫలితాలను పొందగలుగుతారు. చాలామంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడమే మంచిదని గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే ఉత్తమ ఫలితాలు పొందేందుకు ఇది సరైనదే కానీ ఇది అందరికీ సరిపోకపోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొంతమంది వ్యక్తులు వారి జీవక్రియ, శక్తి స్థాయిలను బట్టి వ్యాయామానికి ముందు ఏదైనా తినవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి వారి ఆరోగ్య రీత్యా పరిస్థితి భిన్నంగా ఉంటుందనేది గ్రహించాలి. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే కలిగే ప్రయోజనాలు..ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే.. దాన్ని ఫాస్టెడ్ కార్డియో అంటారు. ఇలా చేస్తే తిన్న ఆహారానికి బదులుగా నిల్వ చేయబడిన కొవ్వు, కార్బోహైడ్రేట్ల నుంచి శరీరం శక్తిని ఉపయోగించుకుంటుంది. బరువు తగ్గడం సులభమవుతుంది గానీ కొందరిలో ఇది అధిక కొవ్వు నష్టానికి దారితీయొచ్చు.ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు వ్యాయామాలు బరువు నిర్వహణకు సహాయపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 2016 నుంచి జరిపిన అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసే ముందు అల్పాహారం తీసుకోని వ్యక్తులు ఎక్కువ కొవ్వును కరిగిస్తారని తేలింది. అయితే ఈ వాస్తవాన్ని తోసిపుచ్చే ఒక అధ్యయనం ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. 2014 అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసే ముందు తిన్న లేదా ఉపవాసం ఉన్న సమూహాల మధ్య శరీర కూర్పు మార్పులలో గణనీయమైన తేడా లేదు. అధ్యయనం కోసం, పరిశోధకులు నాలుగు వారాల పాటు శరీర బరువు, కొవ్వు శాతం, నడుము చుట్టుకొలతలను తీసుకున్నారు. అయితే అధ్యయనంలో ఈ రెండు గ్రూపులు బరువు, కొవ్వు ద్రవ్యరాశిని కోల్పోయినట్లు పరిశోధకులు గుర్తించారు.ఇక్కడ ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినప్పుడు శరీరం ప్రోటీన్‌ను శక్తి వనరుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఇది కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది.ఖాళీ కడుపుతో పని చేయడం వల్ల శరీరం తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అలాగే వ్యాయామానికి ముందు తినకపోతే స్ప్రుహ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి తలనొప్పి, వికారంకు దారితీస్తుంది.వ్యాయామానికి ముందు తినడం వల్ల కలిగే ప్రయోజనాలువర్కౌట్లకు ముందు ఆహారం తీసుకోవడం వల్ల వర్కౌట్లు చేయగలిగేలా శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను తీసుకున్నప్పుడు శరీరం దానిని గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఇది ప్రాధమిక శక్తి వనరుగా పనిచేసి ఎక్కవ వర్కౌట్లు చేసేందుకు ఉపయోగపడుతుంది.అంతేగాదు కండరాల సంరక్షణలో సహాయపడుతుంది. ఇక్కడ శారీరక శ్రమ చేసినప్పుడు,శరీరం శక్తి నిల్వల కోసం చూస్తుంది. ఎప్పుడైతే తినకుండా వ్యాయామాలు చేస్తామో అప్పుడూ కండరాల కణజాలం విచ్ఛిన్నం కావడం మొదలై కండరాల నష్టానికి దారి తీస్తుంది. అందువల్ల, వ్యాయామానికి ముందు తింటే ఇలాంటి నష్టాన్ని నివారించవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా..!) -
ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే?
వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడ్డప్పుడు జీర్ణ వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఒకటి. ఇది రెండు రకాలు. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, రెండోది క్రోన్స్ డిసీజ్.జీర్ణవ్యవస్థలో వచ్చే ఈ సమస్యలోని ‘అల్సరేటివ్ కొలైటిస్’లో పెద్దపేగు లోపలి లైనింగ్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అప్పుడు అక్కడ పుండ్లు పడటం, కొన్నిసార్లు ఆ పుండ్ల నుంచి రక్తస్రావం కావచ్చు. ఆ భాగం మినహాయించి మిగతా జీర్ణవ్యవస్థలో మరెక్కడైనా ఇన్ఫ్లమేషన్ రావడాన్ని ‘క్రోన్స్ డిసీజ్’ అంటారు. అంటే నోరు మొదలుకొని, చిన్నపేగుల వరకు ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఒక్కోసారి ఆ భాగం సన్నగా మారడం లేదా పుండ్లు పడటం జరగవచ్చు.కారణాలు..ఈ సమస్యలకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు గానీ వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనం కావడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జన్యుపరమైన అంశాలతోనూ, పర్యావరణ కారణాలతోనూ రావచ్చు. పొంగతాగడం క్రోన్స్ డిసీజ్‌కు దారితీయవచ్చని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.అల్సరేటివ్ కొలైటిస్ లక్షణాలు..నీళ్లవిరేచనాలుకడుపునొప్పిజ్వరంబరువు తగ్గడంతరచూ మలద్వారం నుంచి రక్తం, బంక (మ్యూకస్) పడుతుండటంకొన్నిసార్లు మలబద్దకంఇవిగాక... కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి లక్షణాలు కూడా ఉంటే వ్యాధి తీవ్రంగా ఉందని భావించాలి.క్రోన్స్ డిసీజ్ లక్షణాలు..నీళ్ల విరేచనాలుకడుపునొప్పితీవ్రమైన అలసటనీరసంనిస్సత్తువబరువు తగ్గడంనోటి పొక్కులుచర్మసమస్యలుకళ్లు ఎర్రబారడం, మండడంకొందరిలో మలద్వార సమస్యలైన ఫిస్టులా, మలద్వారం చీరుకు΄ోవడం, కుచించుకు΄ోవడం.నిర్ధారణ పరీక్షలు..కొలనోస్కోపీగ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎండోస్కోపీ ∙రక్తపరీక్షలు, అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎమ్మారైలతోపాటు కొన్ని సందర్భాల్లో పెద్ద పేగు బయాప్సీ.చికిత్స..– అల్సరేటివ్ కొలైటిస్‌కు... కొన్ని మందులతో లక్షణాలు తగ్గించడంతోపాటు అవి మళ్లీ రాకుండా చూస్తారు. ఉదాహరణకు నొప్పి తగ్గడానికి వాడే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి వాటి వాడకం– మందులు వాడినప్పటికీ లక్షణాలు తగ్గని కండిషన్‌ను రిఫ్రాక్టరీ అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. వ్యాధినిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తాత్కాలికంగా మందగించేందుకు 6–మెర్కా΄్టోప్యూరిన్, అజాథియోప్రిన్ వంటి మందులూ, అప్పటికీ గుణం కనిపించక΄ోతే సైక్లోస్పోరిన్ వంటి మందులు వాడాలని సూచిస్తారుశస్త్రచికిత్స..– సమస్య ఎంతకీ తగ్గక΄ోతే అప్పుడు శస్త్రచికిత్స చేసి ప్రభావితమైన మేరకు పెద్దపేగు భాగాన్ని తొలగిస్తారు. అవసరమైతే దేహంలో మరెక్కడైనా (సాధారణంగా నడుము దగ్గర) మలద్వారం ఏర్పాటు చేసి, చిన్నపేగు చివరి భాగం అక్కడ తెరుచుకునేలా చూస్తారు.– క్రోన్స్ డిసీజ్‌కు... ఇందులో జీర్ణవ్యవస్థలోని ఏ భాగమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... నిర్దిష్టంగా ఏ భాగం ప్రభావితమైందన్న అంశాన్ని బట్టి చికిత్స అందిస్తారు.ఈ వ్యాధికి చేసే చికిత్సల్లో కొన్ని... – జీర్ణవ్యవస్థలోని వాపును తగ్గించడానికి 5–అమైనోశాల్సిలేట్స్ (5–ఏఎస్ఏ) అనే మందులూ, వాటితో ఫలితం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తారు– వీటితో గుణం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి పరిమిత కాలం పాటు ప్రెడ్నిసోన్, బ్యూడిసోనైడ్ వంటి స్టెరాయిడ్స్‌ను వైద్యులు సూచించవచ్చు– లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇమ్యునో మాడ్యులేటర్స్ లేదా బయలాజిక్ రెస్పాన్స్ మాడిఫైయర్స్ అనే మందులను సూచిస్తారు.ఆహారంతో అదుపు ఇలా...– పాలు, పాల ఉత్పాదనలైన జున్ను, వెన్న, పెరుగు పుడ్డింగ్స్– చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులు– పల్లీలు ∙కృత్రిమరంగులు వాడిన ఆహారాలు– పుల్లటి పండ్లు, పండ్ల రసాలు ∙మసాలాలు– వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్, చైనీస్ ఫుడ్స్– కెచప్ క్యాబేజీ, బ్రాకలీ, క్యాలీఫ్లవర్– బీన్స్, కందులు– వేటమాంసం– ఆల్కహాల్ కు పూర్తిగా దూరంగా ఉండాలి.ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ)తో పాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే మరో సమస్యా ఉంది. తినగానే విరేచనానికి వెళ్లడం, కొందరిలో మలబద్ధకంతో బాధించే ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)లో తినగానే వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సిరావడమనే ఇబ్బంది తప్ప పెద్దగా సమస్యలు బాధించక΄ోవచ్చు. ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్), ఐబీడీ (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్) రెండూ వేర్వేరనీ, అందులో ఐబీడీ తీవ్రమైనదని గుర్తించాలి. (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వివరాలు పక్కనే...) – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
చెఫ్‌గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!
వృత్తీరీత్యా చెఫ్‌గా పదిమందికి భోజనం పెట్టిన ఆమె విధి శాపమో లేక కర్మఫలమో గానీ కడుపు నిండా తినడం కష్టమయ్యే అరుదైన వ్యాధి బారిన పడింది. కనీసం గుప్పెడు మెతుకులు నోట్లో పెట్టుకోవాలంటే అల్లాడిపోయేది. నిజానికి కేన్సర్ నుంచి బయటపడేందుకు చేయించుకున్న శస్త్ర చికిత్స ఆమె పాలిట మృత్యువుగా మారింది. చివరికి ఆ వ్యాధితో పోరాడుతూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ నటాషా దిద్దీ(50) వృత్తి రీత్యా చెఫ్. రకరకాల వంటకాలతో కస్టమర్లను అలరించేది. ఏమోందో ఏమో గానీ 2019లో కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆమె కడుపులో కణుతులు వేగంగా అభివృద్ధి చెందాయి. దీంతో వైద్యులు ఆ కేన్సర్ మొత్త వ్యాపించకుండా ఉడేలా మొత్తం కడుపు భాగానే తొలగించారు. ఆమె పొట్ట భాగం లేకపోవడంతో ఆహారాన్ని జీర్ణించుకోవడం ఆనేది సమస్యత్మకంగా మారింది. ఆ క్షణం నుంచే ఆమె జీవితం మరింత నరకప్రాయంగా మారిపోయింది. వైద్యులు చిన్న మీల్స్ తినమని సూచించినా..అది తినడమే మహానరకంగా ఉండేది నటాషాకి. అలా ఆమె ప్రాణాలతో పోరాడుతూ మార్చి 24న తుదిశ్వాస విడిచింది. ఆమె పలు ఇంటర్యూల్లో తాను డంపింగ్ సిండ్రోమ్‌తో పోరాడుతున్నట్లు తెలిపింది. దీని కారణంగా కడుపులోని ఆహరం స్పీడ్‌గా కదిలి జీర్ణంకాకమునుపే ప్రేగుల్లోకి వెళ్లిపోతుంది. దీని దుష్ప్రభావం కారణంగా అలసట, చెమటలు పట్డడం, విపరీతంగా ఆవులించడం వంటి సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని వాపోయింది కూడా. డంపింగ్ సిండ్రోమ్ అంటే.. కడుపులో జీర్ణక్రియం సక్రమమైన పద్ధతిలో జరగుతుంది. అలాకాకుండా అనియంత్రంగా కడుపులో పడ్డ ఆహారం వేగంగా కదిలితే దాన్ని 'గ్యాస్ట్రిక్ చలనశీలత' అంటారు. ఆహారం కండరాలు, నరాలు, హార్మోన్లు సంకేతాలతో నెమ్మదిగా ఖాళీ అవుతుంది. అలాగాకుండా అనియంత్రంగా త్వరితగతిన తిన్న ఆహారం పోట్టలో ఖాళీ అయిపోతుందంటే.. ఇక్కడ పైలోరిక్ వాల్వ్ తెరుచుకుని కడుపులోని ఆహారం బయటకు పోతుందని అర్థం. అంటే..ఇది చిన్న ప్రేగు తక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంతో తలెత్తే సమస్య ఇది. మాములుగా అయితే చిన్నప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేసేలోపు మిగతా అవయవాలు ఆహారం నెమ్మదిగా కదిలేలా సర్దుబాటు చేసుకుంటాయి. అప్పుడు అది చక్కగా వంటబడుతుంది. మనకు హాయిగా ఉంటుంది. అలాగాకుండా ఆహారం వేగంగా కదిలితే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అర్థం. ఎవరు బాధపడతారంటే.. కడుపుకి సంబంధించిన శస్త్ర చికిత్స కారణంగా ఈ డంపింగ్ సిండ్రోమ్ లక్షణాలను అభివృద్ధి చేస్తారు. గ్యాస్ట్రెక్టమీ లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వంటి కడుపులోని పెద్ద భాగాలను తొలగించే లేదా బైపాస్ శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులలో కూడా ఇది సాధారణం. నిజానికి ఈ డంపింగ్ సిండ్రోమ్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ..ఒక్కోసారి కొన్ని కేసుల్లో తీవ్రమై..బరువు తగ్గి, పోషకాహార లోపాలను ఎదుర్కొనవల్సి వస్తుంది. దీన్ని స్వీయ సంరక్షణతో నయం చేసుకోవచ్చు. చాలామందికి తేలికపాటి లక్షణాలే ఉండి క్రమేణ తగ్గుముఖం పడతాయి. కొందరిలో మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే.. వాంతులు అవుతున్నాయి అతిసారం ఉదరం మరియు తీవ్రమైన తిమ్మిరిలో నొప్పి ఉబ్బరం డిజ్జి అక్షరములు హృదయ స్పందన రేటును వేగవంతం చేయడం బలహీనత అలసట చల్లని చెమటలు ముఖం ఎర్రబడుతోంది మెదడు అలిసిపోవడం ఆకలి (చదవండి: ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..) -
మద్యం అలవాటు లేకపోయినా ఫ్యాటీ లివర్ వస్తుందా?
మనలో కొంతమందికి ఫ్యాటీలివర్పై ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. మద్యం తాగే అలవాటు ఉన్నవారు కాలేయంలో క్రమక్రమంగా కొవ్వు పెరుగుతూ ఒక దశ తర్వాత కణాలన్నీ పూర్తిగా నశించి, కొవ్వు మయం అయిపోతే..అది సిర్రోసిస్ అనే కండిషన్‌కు దారితీస్తుందనీ, అప్పుడు కాలేయ మార్పిడి తప్పదనే అవగాహన కొంతమందిలో ఉంటుంది. అయితే మద్యం తాగేవారికే ఫ్యాటీ లివర్ వస్తుందన్నది పాక్షిక సత్యమే..ఆ అలవాటు లేనివారిలోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కండిషన్‌నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఏఎఫ్ఎల్డీ) అంటారు. శరీరతత్త్వాన్ని బట్టి మద్యం, మాంసాహార అలవాట్లు లేకపోయినా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రావచ్చేనే అవగాహన కల్పించేదే ఈ కథనం. మద్యం అలవాటు లేనివారిలోనూ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్! మానవుల పొట్టలో కుడివైపున కాలేయం ఉంటుంది. తీసుకున్న ఆహారంలోని చక్కెరలు శక్తిగా మారాక... మిగతావి కొవ్వు రపంలోకి వరి కాలేయంలో నిల్వ ఉంటాయి. మళ్లీ అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. ఈ నిరంతర పక్రియలో కొవ్వు వెతాదులు పెరుగుతున్న కొద్దీ కాలేయ కణాలు తమ స్వగుణాన్ని కోల్పోయి కొవ్వు పేరుకున్నట్లుగా అయిపోతాయి. ఈ కండిషన్‌ను ఫ్యాటీలివర్ అంటారు. మద్యం అలవాటు ఉన్నా, పొట్ట ఎక్కువగా ముందుకొచ్చి ఉన్నా... వారిలో కాలేయం దశలవారీగా, ఎంతో కొంత ఫ్యాటీలివర్‌గా మారిపోయి ఉంటుంది. కారణాలు: జీవనశైలి / మెటబాలిక్ డిసీజెస్‌గా పేర్కొనే డయాబెటిస్ ఉన్నవారిలోన, అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం (సెంట్రల్ ఒబేసిటీ), స్థూలకాయం (ఒబేసిటీ) వంటి అంశాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్‌కు కారణం కావచ్చు. ఆహారంలో పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. లక్షణాలు: ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లోనైనా కొద్దిమేరకు లక్షణాలు కనిపింవచ్చేమోగానీ... నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌లో చాలావరకు లక్షణాలు కనిపించవు. అయితే మనకు చాలా సాధారణం అనిపించే కొన్ని లక్షణాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్‌ను పట్టిస్తుంటాయి. ఉదా: పొట్ట పెరిగి, బానపొట్టలా ముందుకు రావడం. కొందరిలో కుడివైపు పొట్ట పైభాగంలో పొడుస్తున్నట్లుగా నొప్పి రావడం. లివర్ క్రమంగా పెరుగుతుండటంతో ఈ లక్షణం బయటపడుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్... దశలు... నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్‌లో నాలుగు దశలు ఉంటాయి. అవి మొదటి సింపుల్ స్టియటోసిస్ దశ, రెండోది స్టియటో–హెపటైటిస్ దశ. మూడోది ఫైబ్రోసిస్ దశ, నాలుగోదీ, వరదీ... ఇక వెనక్కు తిప్పడానికి వీలుకాని సిర్రోసిస్ దశ. మొదటి దశ: ఇది సాధారణమైన ఫ్యాటీ లివర్ వ్యాధి దశ. ఇందులో కాలేయ కణాల మధ్య కొద్దిగా అంటే 5 శాతం నుంచి 10 శాతం మేరకు కొవ్వు శాతం పేరుకుంటుంది. రెండో దశ (నాశ్): ఈ దశను నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపటైటిస్ (ఎన్‌ఏఎస్‌హెచ్–నాశ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడటంతో పాటు కాలేయ కణాలు కొన్ని నశిస్తాయి. మూడో దశ (ఫైబ్రోసిస్): ఈ దశలో కాలేయం పీచుగా మారినట్లుగా కనిపిస్తుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’గా పేర్కొంటారు. నాలుగో దశ (సిర్రోసిస్): ఫైబ్రోసిస్ నుం కాలేయం కొవ్వుకణాలతో నిండిపోయి, పూర్తిగా తన స్వరపాన్ని కోల్పోయి, కాలేయ వర్పిడి తప్ప ప్రత్యామ్నాయం లేని దశ వస్తుంది. ఇది వెనక్కుమరల్చలేని (ఇర్రివర్సిబుల్) దశ. నిర్ధారణ: బాధితుని స్థలకాయం, పొట్ట (సెంట్రల్ ఒబేసిటీ) చసి డాక్టర్లు పరిస్థితిని కొంతమేర అంచనా వేయగలరు. కొన్ని రక్తపరీక్షలు, అలాగే డయాబెటిస్, కొలెస్ట్రాల్ వెతాదులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు పెరిగాయా అన్నదీ చూడాలి. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌తో ఫ్యాటీలివర్ తప్పక బయటపడుతుంది. కొందరిలో లివర్ బయాప్సీ అవసరం. లివర్ బయాప్సీతో ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీలో అది నాన్ఆల్కహాలిక్ ఫ్యాటీలివరా (ఎన్‌ఏఎఎఫ్‌ఎల్), లేక నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపాటిక్ (నాశ్) కండిషనా అని నిర్ధారణ చేయవచ్చు. ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్’ అనే వైద్యపరీక్షతో లివర్‌లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయి, తగ్గాయో కూడా తెలుసుకోవచ్చు. చికిత్స : ఆల్కహాల్ అలవాటు లేనివారిలో దీని చికిత్సకు నిర్ణీతంగా ఒక ప్రొటోకాల్ లేదుగానీ... దీని చికిత్స సమయంలో ఫ్యాటీలివర్ డిసీజ్‌కు దోహదపడిన అంశాలను బట్టి డాక్టర్లు చికిత్స చేస్తారు. ముఖ్యంగా బాధితుల జీవనశైలిలోనూ, ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం వంటివి సస్తారు. బాధితులు ఏవైనా మందులు వాడుతుంటే, వాటి కారణంగా ఫ్యాటీలివర్ వచ్చిందని భావిస్తే, వాటిని మారుస్తారు. చాలా కొద్దిమందిలో మందులూ, శస్త్రచికిత్సా అవసరం కావచ్చు. ముందస్తు నివారణకు ఈ జాగ్రత్తలు... బరువు తగ్గడం : ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువు ఉన్నవారు ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించాలి. ప్రతి వారం అర కిలో నుంచి కిలో బరువు తగ్గించుకునేలా శ్రమించాలి. ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరి. పొట్టుతో ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పాలిష్ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు వాడాలి. రిఫైన్డ్ షుగర్స్, మైదా, స్వీట్లు తగ్గించాలి. మాంసాహారం తీసుకునేవారు చేపలు తినడం మంచిది. వ్యాయామం: చురుగ్గా ఉంటూ రోజూ ఒంటికి పనిచెప్పేలా శ్రమించాలి. రోజూ కనీసం 30 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. డయాబెటిస్‌ను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ వెతాదులను తగ్గించుకోండి. ఇందుకు వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాలి. (చదవండి: ఆ చెట్టు ఆకులు తెల్ల జుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో.) -
16 నెలల క్రితం మహిళ కడుపులో క్లాత్ వదిలేసిన వైద్యులు.. చివరికి ఏం జరిగిందంటే?
సాక్షి, జగిత్యాల జిల్లా: మేం చాలా గొప్పగా పనిచేస్తున్నామని చెప్పుకునే కొందరు తెలంగాణ మంత్రుల మాటలకు భిన్నంగా.. అడుగడుగునా నిర్లక్ష్యపు ఛాయలు బట్టబయలవుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిలువెత్తు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపుతోంది. ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. చదవండి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
వింత ఘటన: 56 బ్లేడులు మింగిన వ్యక్తి!
కొంతమందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. వాళ్లు హార్మోన్ల లోపం వల్ల అలా ప్రవర్తిస్తుంటారే లేక మరేదైన కారణమా అనేది ఎవరికీ అంతుపట్టదు. కానీ ఆయా పనులు వాళ్ల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే..రాజస్తాన్‌కి చెందిన 25 ఏళ్ల యువకుడు అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను తన నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటున్నాడు. ఒక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉన్నటుండి ఆ యువకుడు రక్తపు వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ నర్సిరామ్ దేవాసి ఆయువకుడి సమస్యం ఏంటో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయించారు. అందులో ఆ వ్యక్తి కడుపులో ఏదో లోహం ఉన్నట్లు తేలింది. దీంతో అతనికి సోనోగ్రఫీ, ఎండోస్కోపీ నిర్వహించాగా..డాక్టర్లకి ఆ వ్యక్తి కడుపులో బ్లేడ్లు ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించి దాదాపు 56 బ్లేడులు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. అతను బ్లేడ్లను కవర్లతో సహా తిన్నాడని అందువల్లే అవి తింటున్నప్పుడూ నొప్పిగానీ, రక్తస్రావం గానీ జరగలేదరని చెప్పారు. అయితే అవి కడుపులోపలకి చేరాక కాగితం మొత్తం కరిగిపోయి బ్లేడ్లు ఉండటంతో.. క్రమంగా ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభించింది. దీంతో వ్యక్తి లోపల గ్యాస్ ఏర్పడి మనిషి వికారం వచ్చి వాంతులు రావడం జరిగిందని అన్నారు. ఐతే అతను ఆ బ్లేడు తినేటప్పుడే వాటిని రెండుగా విడగొట్టి మరీ తిన్నాడని చెప్పారు. అతను ఇలా చేయడానికి గల కారణాలేంటో తమకు తెలియదని అతడి బంధువులు చెబుతున్నారు. (చదవండి: వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..!) -
వైద్యుల నిర్వాకం.. పేషెంట్ కడుపులో సర్జికల్ క్లాత్ మరిచి..
మైలవరం(ఎన్టీఆర్ జిల్లా): ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గర్భసంచి తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు కడుపులోనే సర్జికల్ క్లాత్ వదిలేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన కొరివిడి శివపార్వతి తరచూ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేది. ఆమె ఆరు నెలల కిందట ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని అను హాస్పటల్‌కు వెళ్లింది. ఆమెకు వైద్యులు గర్భసంచి తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో మళ్లీ పలుమార్లు అను ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. చివరికి 20 రోజుల కిందట విజయవాడలోని హరిణి ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో గుడ్డ వంటి పదార్థం ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేయగా బాధితురాలి కడుపులో సర్జికల్ క్లాత్ ఉండటంతో తొలగించారు. శివపార్వతి డిశ్చార్జి అయిన అనంతరం మంగళవారం ఈ విషయంపై మాట్లాడేందుకు మైలవరంలోని అస్పత్రికి వచ్చి ఆమె బంధువులు... వైద్యులు సరిగా స్పందించలేదని ఆందోళన చేశారు. చదవండి: డేటా కేబుల్‌తో ప్రియురాలిని చంపి.. అదే రోజు మరో అమ్మాయితో పెళ్లి! -
కడుపులో మంట వస్తుందా?.. లైట్ తీసుకోవద్దు.. షాకింగ్ విషయాలు
సాక్షి, గుంటూరు మెడికల్: ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటు పడడం, పాశ్చాత్య జీవన శైలికి అలవాటు పడడం, ఇంట్లో వంట తగ్గించేసి హోటళ్లలో సమయపాలన లేకుండా మసాలాలతో కూడిన ఆహారం అమితంగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను ప్రజలు కొని తెచ్చుకుంటున్నారు. జీర్ణకోశ వ్యాధులపై ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఏళ్ల తరబడి ఎడాపెడా మందులు వాడుతూ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుంటూ చివరకు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఒకింత వ్యాధులపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రాథమిక దశలోనే జీర్ణకోశ వ్యాధులను కట్టడి చేయడంతోపాటు, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. సొంత వైద్యంతో మొదటికే మోసం.. అల్సర్ సోకగానే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై వైద్యుల సలహాలు పాటించకుండా ఇష్టానుసారంగా మందులు వాడేస్తుంటారు. అల్సరుకు నెలల తరబడి గ్యాస్ మాత్రలు వాడవలసిన అవసరం లేదు. అల్సర్‌కు కారణం కేవలం (యాసిడ్) కాదు. హెచ్. పైలొరి బ్యాక్టీరియా లేదా నొప్పి మాత్రల వల్ల అల్సర్ సోకుతోంది. అల్సరు తగ్గడానికి ఆ బ్యాక్టీరియా కోర్సు వాడితే సరిపోతోంది. అతిగా నొప్పి మాత్రలు వాడితే జీర్ణాశయానికి పుండ్లు పడతాయి. ఆ్రస్పిన్, నొప్పి మాత్రలు వాడుతున్న వారికి పొట్టనొప్పి, మంట వచ్చినా, నల్ల విరోచనాలు, నోటిలో రక్తం వచ్చినా వెంటనే ఎండోస్కోపి చేయించుకోవాలి. జీర్ణాశయ క్యాన్సర్‌ను గుర్తించండి ఫ్యాషన్ కోసం అలవాటు చేసుకునే చెడు వ్యసనాలు జీర్ణ కోశ వ్యాధులకు ముఖ్యంగా జీర్ణాశయ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. సిగరేట్, మద్యం సేవించడం వల్ల లివర్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. అతిగా మద్యం తాగితే క్లోమం దెబ్బతింటుంది. తీవ్రమైన పొట్టనొప్పి, వాంతులు, నడుం నొప్పి, షుగరు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు. సిగరెట్, మందు తాగేవారు. 50 సంవత్సరాల పైబడినవారు బరువు తగ్గుతున్నా, ఆకలిలేకున్నా, మింగటంలో ఇబ్బంది, రక్త హీనత, అతిగా వాంతులు ఉన్నా, వెంటనే గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించాలి. గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్లు తాగితే నోటి, జీర్ణాశయ క్యాన్సర్ వస్తుంది. ఆహారనాళం పూర్తిగా మూసుకు పోతుంది. నోటిద్వారా ఆహారం తీసుకోలేరు. ఈలక్షణాలు ఉన్నవారు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించాలి. పిల్లలకు చిల్లర ఇవ్వొద్దు పిల్లలు తినుబండారాల కొనుగోలు కోసం మారం చేసి డబ్బులు అడిగినప్పుడు ఎట్టిపరిస్థితుల్లో వారి చేతికి చిల్లర డబ్బులు ఇవ్వొద్దు. ముఖ్యంగా ఆటలు ఆడుకునే సమయంలో నోటిలో పట్టేంత చిన్న బొమ్మలు, వస్తువులు ఇవ్వవద్దు. తద్వారా పిల్లలు అమాయకత్వంతో వాటిని నోటిలో పెట్టుకుని మింగుతారు. కొన్ని సందర్భాల్లో అది గొంతులో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి తలెత్తే ప్రమా దం ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలకు ఏమీ తినిపించకుండా గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదిస్తే ఎండోస్కోపి ద్వారా చిల్లర నాణేలు, కడుపులో మింగిన వస్తువులు తొలగించవచ్చు. చదవండి: ఆహారంలో ఉప్పు తగ్గిస్తేనే... లేదంటే ఈ ముప్పు తప్పదు! ఆపరేషన్లు కొంత మందికి మాత్రమే.. ఈమధ్య బిజీ లైఫ్‌లో పడి సక్రమంగా మంచినీరు తీసుకోకపోవడం, త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, జీర్ణం కావడానికి సరిపడా సమయం ఇవ్వకపోవడం ద్వారా పసరు తిత్తుల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. పసరుతిత్తిలో రాళ్లు ప్రతి 100మందిలో 10మందికి ఉంటాయి. వీరిలో 75 శా తం మందికి వీటివలన ఏ ఇబ్బందీ రాదు. కేవలం పొట్టనొప్పి, కామెర్లు వచ్చినవారికి మాత్రమే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. పసరు తిత్తి మార్గంలో రాళ్లు అడ్డుపడితే ఆపరేషన్ లేకుండా ఇ.ఆర్.సి.పి అను ఎండోస్కోపి పద్ధతిద్వారా తొలగించ వచ్చు. తక్కువ తినండి.. జీర్ణకోశ వ్యాధులు రావడానికి మితిమీరిన ఆహారం తీసుకోవడమే కారణమవుతోంది. తిన్న ఆహారం జీర్ణం కాక శరీర బరువు పెరిగిపోయి వ్యాయామం లేకపోవడంతో లివరులో కొవ్వు చేరే ప్రమాదం ఉంది. మద్యం బాగా తాగే వారికి వచ్చే లివరు జబ్బులన్నీ వీరికి రావచ్చు. తక్కువ తిని ఎక్కువగా నడవాలి. కోతకుట్టులేకుండా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా పొట్టలో ఎటువంటి గడ్డలు అయినా పరీక్షించి ముక్క పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. – డాక్టర్ షేక్ నాగూర్ బాషా, లివర్, జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, గుంటూరు -
ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేసిన వైద్యులు.. మహిళ మృతి
లక్నో: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. ఆపరేషన్ చేసి బ్యాండేజ్‌ను కడుపులోనే వదిలివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అమ్రోహ జిల్లాలో ఇటివలే ఇలాంటి ఘటన జరిగింది. మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో టవల్‌ను వదిలేశారు. ఆమెకు తీవ్రమైన నొప్పి రావడంతో పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. Amroha, UP | Locals protest after a woman died allegedly due to bandage left inside her stomach during operation On basis of a man's complaint alleging that his wife died after treatment at a hospital due to negligence of a doctor, case registered.Probe on:VK Rana, CO City(21.1) pic.twitter.com/BjKhG8zxyf — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2023 చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం -
దారుణం: డాక్టర్ నిర్వాకం.. మహిళ కడుపులో టవల్ ఉంచేసి..
ప్రసవ వేదనతో ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేశాడో వైద్యుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లే... నజరానా అనే మహిళ ప్రసవ వేదనతో సైఫీ నర్సింగ్ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఐతే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఆమె కడుపులో టవల్ ఉంచేసి ఆపరేషన్ చేశారు డాక్టర్ మత్లూబ్. కానీ ఆ తర్వాత మహిళకు కడుపు నొప్పి ఎక్కువ అవ్వడంతో తాళలేక సదరు డాక్టర్‌కి ఫిర్యాదు చేసింది. ఐతే బయట చలి ఎక్కువగా ఉండటం వల్లే అలా అనిపిస్తుందని చెప్పి మరో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచేశారు సదరు మహిళని. కానీ ఆమెకు ఇంటికి వచ్చినా..ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో.. భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రెహాలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ అసలు విషయం తెలుసుకుని బాధితురాలి భర్త ఆలీ తెల్లబోయాడు. బాధితురాలి కడుపులో టవల్ ఉందని, ఆపరేషన్ చేసి తీసేసినట్లు అక్కడి ఆస్పత్రి వైద్యులు అలీకి తెలిపారు. దీంతో అలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ)కు సదరు ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. మీడియా కథనాల ద్వారా విషయం తెలుసుకున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) రాజీవ్ సింఘాల్ ఈ విషయంపై సమగ్ర విచారణ చేయమని నోడల్ అధికారి డాక్టర్ శరద్‌ను ఆదేశించారు. ఐతే అలీ ఈ విషయమై లిఖితపూర్వకంగా తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. విచారణ నివేదిక రాగనే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తారని సీఎంవో అధికారి సింఘాల్ చెప్పడం గమనార్హం. విచారణలో..వైద్యుడు మత్లూబ్ అమ్రోహాలో సైఫీ నర్సింగ్ హోమ్‌ని ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నట్లు తేలింది. (చదవండి: షాకింగ్ ఘటన: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ) -
తల వెంట్రుకలను పీక్కొని తిన్న బాలిక.. 8 నెలలుగా
మైసూరు(బెంగళూరు): బాలిక కడుపులో ఉండలా పేరుకుపోయిన అరకేజీ వెంట్రుకల ఉండను వైద్యులు ఎండో స్కోపీ ద్వారా బయటకు తీసి స్వస్థత చేకూర్చారు. 11 సంవత్సరాల వయసున్న బాలిక తన తల్లిదండ్రలకు తెలియకుండా తల వెంట్రుకలను పీక్కొని తినేది. ఈ క్రమంలో 8 నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. మైసూరులోని అపోలో అస్పత్రికి తీసుకెళ్లగా బాలల గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ అతీరా రవింద్రనాథ్ బాలికకు వైద్య పరీక్షలు చేయగా కడుపులో వెంట్రుకలు ఉన్నట్లు తేలింది. ఎండోస్కోపీ సాయంతో బయటకు తీసి ఉండను తూకం వేయగా 500 గ్రాముల బరువు 5 సెంటి మీటర్ల పొడవు ఉన్నట్లు తేలింది. బాలిక ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: న్యూ ఇయర్ పార్టీలో తుపాకీతో కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్.. -
వైద్యులు షాక్.. ఆ వృద్ధుడి కడుపులో ఏమున్నాయంటే?
యశవంతపుర(కర్ణాటక): మానసిక రోగి ఆయిన ఓ వృద్ధుడు తన చేతికి ఇచ్చే నాణేలను నిత్యం మింగేసేవాడు. రాయచూరు జిల్లా లింగసుగూరు తాలూకాకు చెందిన ద్యావప్ప (58) ఇలా 187 నాణేలను మింగాడు. అనారోగ్యానికి గురి కావటంతో కుటుంబ సభ్యులు బాగలకోట బసవేశ్వర సంఘం కుమారేశ్వర ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్‌రే తీసి ఇక ఆలస్యం చేస్తే ప్రాణానికి పెను ప్రమాదమని వెంటనే శస్త్ర చికిత్స చేసి నాణేలను బయటకు తీశారు. ఐదు, రెండు రూపాయలు కాయిన్లు చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. డాక్టర్ ఈశ్వర కలబురిగి, ప్రకాశ కట్టిమని, అర్చన, రూపలు శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స తరువాత ద్యావప్ప ఆరోగ్యం కుదుటపడింది. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి
కొందరు బరువు తగ్గడం కోసం కడుపు మాడ్చుతుంటారు. కానీ కడుపు నిండా తింటూనే బరువు తగ్గడం ఆరోగ్యకరమైన మార్గం. ఇటువంటి ఆహారంలో ముఖ్యమైనది కోడి గుడ్డు. గుడ్డులో ‘ల్యూసిన్’ అనే ఒక రకమైన ‘ఎసెన్షియల్ అమైనో యాసిడ్’ ఉంటుంది. ఇది నేరుగా బరువు తగ్గించడానికి దోహదపడుతుంది. ఇక ఉడికించిన కోడి గుడ్లు ఒకటి లేదా రెండు గుడ్లు తినగానే కడుపు ఉబ్బిపోయినట్లుగా అనిపిస్తుంది. అంటే త్వరగా పొట్ట నిండేందుకు కోడిగుడ్లు ఉపయోగపడి, తద్వారా తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఈ రెండు ప్రయోజనాలతో కోడిగుడ్డు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇక ఆకుకూరలు, కాయగూరల్లో నీటి మోతాదులు, పీచు పాళ్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తిన్న వెంటనే కడుపు నిండిపోయిన తృప్తి కలుగుతుంది. తాజా కాయ/ఆకుకూరలు కూడా బరువు తగ్గడానికి ఉపయోగం. ఒకవేళ మీరు మాంసాహారాన్ని ఇష్టపడేవారైతే వేటమాంసాని(రెడ్‌మీట్)కి బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటి వైట్‌మీట్ తినడం మేలు. అది కూడా పరిమితంగా, కేవలం రుచికోసం మాత్రమే. -
వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్..
న్యూఢిల్లీ: కడుపులో కొకైన్ దాచుకుని విదేశాల నుంచి వస్తున్న ఒక మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆ మహిళ ఉగాండ దేశస్థురాలిగా గుర్తించారు. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తొలుత అధికారులు.. సదరు మహిళ గర్భవతి కాబోలు అని భావించారు. ఆమెను సహయం చేయడానికి ఆమెవైపు చేరుకున్నారు. అయితే.. ఆ మహిళ మాత్రం అధికారులను చూడగానే భయంతో వణికిపోయింది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు తమదైన శైలీలో విచారించారు. ఆ తర్వాత... మహిళను ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో సదరు మహిళ కడుపులో ఒక కేజీ కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో నుంచి 91 కొకైన్ క్యాప్సుల్స్లను బయటకు తీశారు. వాటి బరువు 993 గ్రాముల వరకు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సంఘటనను చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇప్పటి వరకు 400 గ్రాముల వరకు కొకైన్‌ను రవాణా చేయడం మాత్రమే చూశామన్నారు. ఇంత భారీ ఎత్తున కొకైన్ రవాణా చేయడం చూడలేదన్నారు. ఇది కడుపులో విస్ఫోటనం చెందితే మహిళ ప్రాణాలకే ప్రమాదమన్నారు. బాధిత మహిళ కోలుకోవడానికి మరో నాలుగు రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం ఐడియారా బాబు..’, ‘వీడొక్కడే సినిమా గుర్తొచ్చిందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. Correction: The estimated value of the drug is Rs. 14 crores. This is the 24th case of seizure of NDPS covered drugs at Delhi airport this year. 32 passengers have been arrested so far. The estimated value of drug seizures would go into more than Rs. 845* crores: Customs Dept pic.twitter.com/nSgyZQo79U — ANI (@ANI) December 29, 2021 -
ఎంత నిర్లక్ష్యం.. ఆపరేషన్ చేసి సూదిని కడుపులో మరిచిపోవడంతో..
తిరువొత్తియూరు: ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్న యువకుడి కడుపులో సూది మరచి కుట్లు వేసిన సంఘటన సంచలనం కలిగించింది. చెన్నై పులియాంతోపు బీకే కాలనీకి చెందిన రంజిత్‌కుమార్ (28) కడుపులో ఏర్పడిన గాయానికి పట్టాలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేసుకున్నాడు. నొప్పి విపరీతంగా ఉండడంతో మూడు రోజుల తర్వాత స్కాన్ చేయించుకున్నాడు. కడుపులో సూది ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా తిరిగి ఆపరేషన్ చేయాలని తెలిపారు. దీనిని తిరస్కరించిన రంజిత్‌కుమార్ సోమవారం రాత్రి స్టాన్లీ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు ఆపరేషన్ చేసి సూదిని తొలగించారు. చదవండి: గతంలోనూ బిపిన్ రావత్ ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం.. ఎక్కడంటే? -
మీ బరువు సాధారణంగానే ఉన్నా.. పొట్ట పెద్దదిగా ఉంటే?
మీ శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ... మీ పొట్ట పెద్దగా బయటకు కనిపిస్తూ ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోండి. మీరు మీ పొట్ట దగ్గర అంటే నడుము చుట్టుకొలతను ఓ టేప్ సహాయంతో తీసుకోండి. ఇలా కొలిచే క్రమంలో బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలని గుర్తుంచుకోండి. ఆ కొలతకూ, పిరుదుల మధ్య (హిప్)లో... గరిష్ఠమైన కొలత వచ్చే చోట టేప్‌తో మరోసారి కొలవండి. ఈ రెండు కొలతల నిష్పత్తిని లెక్కగట్టండి. అంటే నడుం కొలతని హిప్ కొలతతో భాగించాలన్నమాట. అది ఎప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్‌లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. అలాగే పురుషుల విషయానికి వస్తే ఇది 0.90 కంటే తక్కువ రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోండి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండె సమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి ఎక్కువగా శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్టను అంటే నడుము చుట్టుకొలతను తగ్గించుకోవడం అన్ని విధాలా మేలు. -
Shocking: వ్యక్తి కడుపులో కేజీకీ పైగా నట్టులు, బోల్టులు
విల్నియస్: కొందరు వ్యక్తులు.. వెంట్రుకలను, బోల్ట్లను తినడం వంటి వార్తలను మనం అప్పుడప్పుడూ చదువుతూ ఉంటాం. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి లిత్వేనియాలో జరిగింది. ఒక వ్యక్తి కడుపులో దాదాపు కిలోగ్రాము స్క్రూలు, నట్టులు, బోల్టులను వైద్యులు శస్త్రచికిత్స చేసి వెలికితీశారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. లిత్వేనియాకు చెందిన వ్యక్తి మొదట మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత దాన్ని మానుకునే క్రమంలో.. అనుకోకుండా నట్టులు, బోల్టులు, గోర్లు వంటివి తినడం అలవాటు అయింది. దీంతో కొన్ని రోజులుగా అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కడుపునొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు.. అతడిని అంబులెన్స్‌లో బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న క్లైపెడా యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వ్యక్తికి డాక్టర్లు స్కానింగ్ చేశారు. అతని కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స ప్రారంభించారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించిన సరునాస్ డైలీడేనాస్ వైద్యుల బృందం అతని కడుపులో నుంచి దాదాపు కిలోగ్రాము బరువున్న స్క్రూలు, నట్టులు, గోర్లను బయటకు తీశారు. ఆ తర్వాత వ్యక్తి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి.. -
ఫోన్ మింగిన ఘనుడు.. కడుపులోకి వెళ్లగానే..
ప్రిస్టినా: బాగా ఆకలి వేసిందో.. లేక మత్తులో ఉన్నాడో తెలియదు కానీ, ఓ వ్యక్తి ఏకంగా నోకియా ఫోన్‌ను మింగేశాడు. అనంతరం దాన్ని అలానే కడుపులో ఉంచుకోవడంతో ప్రాణం మీదకు వచ్చేసరికి ఆస్పత్రి మెట్లెక్కాడు. కోసోవోలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. యూరప్‌లోని కోసోవో రిపబ్లిక్ ప్రిస్టినాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం నోకియా 3310 ఫోన్‌ను మింగేశాడు. ఫలితంగా అతని కడుపులో ఆ ఫోన్ ఇరుక్కుపోవడంతో బాధతో తల్లడిల్లిపోయి ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు. అనంతరం లేటెస్ట్ టెక్నాలజీని వాడి, కడుపులోంచి ఫోన్‌ను బయటకు తీశారు. అతనికి ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. అతడికి స్కాన్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించాము. అది కడుపులో వెళ్లిన అనంతరం మూడు భాగాలుగా విడిపోయి ఉందని, అన్నింటిని బాగానే బయటకు తీయగలిగామన్నారు. కాకపోతే బ్యాటరీని బయటకు తీసేటప్పుడే ఇబ్బంది ఎదురైందని, ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా అది కడుపు లోపలే పేలిపోయేదని తెలిపారు. అయితే, ఆ వ్యక్తి ఎందుకు ఫోన్ మింగాడన్న విషమంపై సమాచారం తెలియలేదు. చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్ -
వైరల్: జాలరికి జాక్‌పాట్.. చేప కడుపలో కిక్కెంచే బహుమతి
అనకోకుండా దొరికే వస్తువులు మనకీ భలే అనందాన్నిస్తాయి. ఇటీవల సముద్రంలో చేపల వేట కోసం వెళ్లే జాలర్లకు ఇలానే అరుదైన వస్తువులు దొరికిన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. వారి దినచర్యలో ప్రతిరోజూ ఒకేలా ఉండవు ఒక్కోసారి రోజంతా వేట కొనసాగించిన చేపలతో కాకుండా నిరాశతో వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అలానే ఇంకో రోజు అనూహ్యంగా అనుకోని రూపంలో చేపలతో పాటు బహుమతులు లభిస్తుంటాయ్. ఈ తరహాలోనే ఓ మత్స్యకారుడు జాక్ పాట్ కొట్టేశాడు. వేట కోసమని వెళ్లిన అతనికి చేప మాత్రమే కాకుండా మరో అనుకోని బహుమతి లభించింది. ఇంకేముంది ఈ ఘటన కాస్త వీడియోగా మారి అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా రచ్చ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ జాలరికి అనుకున్నట్లే భారీ ఆకారంలో చేపలు వలలో పడ్డాయి. ఇంక మన వాడు ఆనందంతో ఎప్పటిలానే చేపలను కటే చేస్తూ, శుభ్రపరుస్తుండగా ఓ చేప కడుపు లోపలి భాగాల్లో ఏదో వస్తువు గట్టిగా తగులుతుండడం గుర్తించాడు. ఇక ఆలస్యం చేయక కత్తితో కోసి చూడగా అందులో మద్యం సీసా ఫుల్ బాటిల్ ఉంది. ఇంకేముంది అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కాగా ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మనుషుల బాధ్యతా రహితమైన ప్రవర్తనకు ఈ సంఘటన నిదర్శమని కొందరు కామెంట్ చేయగా.. మనం చేసే పనులు జంతుజలాలకు ఏ విధంగా ముప్పును కలిగిస్తుందో ఇది స్పష్టంగా చూపిస్తోందని మరి కొందరు జంతు ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు. మరికొందరు ‘జాక్‌పాట్ కొట్టావ్.. క్యాచ్ ఆఫ్ ది డే’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. చదవండి: లవ్‌బర్డ్ .... నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది ..! -
హీరోయిన్ కడుపులో ట్రైనర్ పిడిగుద్దులు.. వీడియో వైరల్
ముంబై: సినిమాలో నటించేవాళ్లు కొందరైతే,జీవించేవాళ్లు మరికొందరు ఉంటారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏం చెయ్యడానికైనా వెనుకాడరు. కొన్ని పాత్రల కోసం ముందే రోజుల తరబడి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా(యూనివర్స్) ఊర్వశి రౌటేలా మరో అడుగు ముందుకేసింది. తన తదుపరి చిత్రం కోసం ఏకంగా బాక్సింగ్ పంచులను సైతం భరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఓ యాక్షన్ ఫిల్మ్ కోసం ఊర్వశీ ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆమె ట్రైనర్ కడుపులో పిడి గుద్దులు కురిపిస్తుంటే, ఆ నొప్పిని భరిస్తూ ట్రైనర్ పనితనాన్ని దగ్గరినుంచి గమనిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..నో పెయిన్.. నో గెయిన్ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఊర్వశీ డెడికేషన్‌ను మెచ్చుకుంటున్నారు. సినిమా కోసం ఇంత కష్టపడుతున్న ఊర్వశీకి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఊర్వశి ప్రస్తుతం "ద బ్లాక్ రోజ్"లో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రం "తిరుట్టు పాయలే 2" హిందీ రీమేక్‌లోనూ నటించనుంది. హీరో శరవణన్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తూ తమిళంలోనూ ఎంట్రీకి రెడీ అవుతోంది. బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడాతో "ఇన్స్పెక్టర్ అవినాష్" అనే వెబ్ సిరీస్ చేస్తోంది. "మర్ జాయేంగే" మ్యూజిక్ వీడియోలో గురు రంధవాతో ఆడిపాడనుంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) చదవండి : సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్ అనిత క్రికెట్ చూడను కానీ సచిన్, కోహ్లి అంటే.. -
మనలో ఉన్న మంచి బ్యాక్టీరియా తెలుసునా?
బ్యాక్టీరియా.... ఈ పేరు వినగానే రకరకాల వ్యాధులు, వాటితో వచ్చే బాధలు గుర్తొస్తాయి. కానీ, పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు బ్యాక్టీరియాలో కూడా మంచివి, మేలు చేసేవి కూడా ఉంటాయని చాలా తక్కువమందికి తెలుసు. ఇలా మనకు మేలు చేస్తూ మన శరీరంలో ఉంటూ మనతో సహజీవనం చేసే బ్యాక్టీరియా, ఈస్ట్‌లను ప్రోబయోటిక్స్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే గుడ్ బ్యాక్టీరియా అన్నమాట! సాధారణంగా ఈ ప్రోబయోటిక్స్ మన జీర్ణవ్యవస్థలో ఉంటూ, జీర్ణవాహికను ఆరోగ్యంగా ఉంచుతాయి. మన డైజెస్టివ్ ట్రాక్‌లో దాదాపు 400 రకాల ‘గుడ్’ బ్యాక్టీరియా ఉంటాయి. ఆహారపదార్ధాల జీర్ణం, వాటి చోషణ (టuఛిజుజీnజ), ఇమ్యూనిటీ పెంచడం వంటి అనేక విషయాల్లో ఇవి సాయం చేస్తుంటాయి. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు యాంటీ బయోటిక్స్ వాడితే ఆ సమయంలో ఇవి కూడా నశించిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా ’హెల్తీ గట్’(ఆరోగ్యవంతమైన అన్నవాహిక)ను మెయిన్‌టెయిన్ చేయవచ్చు. వేటి ద్వారా పొందొచ్చు? ఎక్కువగా ఫర్మెంటెడ్ పదార్ధాల్లో ఈ ప్రోబయోటిక్స్ లభిస్తాయి. పెరుగు, యాపిల్ సిడార్, యోగర్ట్, క్యాబేజీతో చేసే సౌర్‌క్రౌట్, సోయాబీన్స్‌తో చేసే టెంపె, పచ్చళ్లు, మజ్జిగ లాంటివి గట్‌లో గుడ్ బ్యాక్టీరియా పెండచడంలో సాయం చేస్తాయి. వీటిలో లాక్టోబాసిల్లస్, బైఫిడో బాక్టీరియం రకాలు ఎక్కువ ప్రయోజనకారులు. ఎంత డోసేజ్ మంచిది? సాధారణంగా రోజుకు 30 కోట్ల నుంచి 100 కోట్ల సీఎఫ్‌యూ(కాలనీ ఫామింగ్ యూనిట్స్– బ్యాక్టీరియా కొలమాని) ప్రోబయోటిక్స్‌ను డాక్టర్లు రికమండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యేకించి జీర్ణవ్యవస్థకు సంబంధించి ఇబ్బందులుంటే ఈ మోతాదు మరికొంత పెంచుతారు. లాభాలనేకం: ∙ఇరిటబుల్ బౌల్ సింట్రోమ్(ఐబీఎస్)తో పోరాటంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో పాటు గ్యాస్ సమస్యలు, మలబద్ధకం, డయేరియాలాంటి జీర్ణకోశ వ్యాధులు తగ్గించడంలో ఉపయోగ పడతాయి. హీలికోబాక్టర్ పైలోరి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, అల్సర్లు, జీర్ణకోశ కాన్సర్పై యుద్ధంలో ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని ప్రోబయోటిక్స్ బరువుతగ్గించేందుకు ఉపయోగపడతాయి. కొన్ని ఇన్ఫ్లమేషన్లపై పోరాటం చేస్తాయి. కొన్ని కీలక బ్యాక్టీరియాలు డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గించడంలో సాయపడతాయి. మరికొన్ని ఎల్డీఎల్(బ్యాడ్ కొలెస్ట్రాల్) తగ్గించేందుకు ఉపకరిస్తాయి. ప్రొబయోటిక్స్ కారణంగా చర్మం కాంతి వంతంగా కావడం, మొటిమలు తొలగిపోవడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సాధారణంగా ప్రోబయోటిక్స్ వాడకంతో ఎలాంటి ఇబ్బందులుండవు. కొందరికి మాత్రం జీర్ణ సంబంధిత తేలికపాటి సమస్యలు ఎదురుకావచ్చు. ఇవి స్వల్పకాలంలోనే తగ్గిపోతాయి. lఅయితే ఎయిడ్స్ పేషంట్లలో మాత్రం ఇవి ఒక్కోమారు తీవ్రమైన ఇన్ఫెక్షన్స్కు దారితీసే ప్రమాదం ఉంది. ∙ఇమ్యూనిటీ సంబంధిత వ్యాధులున్నవారికి సైతం ఇవి కొత్త తలనొప్పులు తెస్తాయి. అందువల్ల తీవ్రమైన వ్యాధులున్నవాళ్లు, గర్భిణులు, పసిపిల్లలు, వయోవృద్దులు ప్రోబయోటిక్స్ వాడేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. -
మహిళ కడుపులో నగలు, నాణేలు
రామ్పుర్హట్: కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె కడుపులో ఉన్న 1.5 కేజీల ఆభరణాలు, నాణేలను చూసి విస్తుపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా రామ్పురహాట్లో చోటుచేసుకుంది. మర్గ్రామ్కు చెందిన మానసికస్థితి సరిగా లేని 26 ఏళ్ల ఓ మహిళ కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసి మహిళ కడుపులోంచి బంగారం, కాంస్యం, రాగితో చేసిన గొలుసులు, దుద్దులు, ముక్కుపుడకలు, గాజులు వంటి 1.5 కేజీల ఆభరణాలు, రూ.5, రూ.10 విలువ గల 90 నాణేలను బయటికి తీసినట్లు వైద్యులు తెలిపారు. తాము బయటకు తీసిన వాటిలో చేతి వాచీలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ‘నా కూతురి మానసిక పరిస్థితి సరిగా లేదు. కొద్దిరోజులుగా భోజనం చేసిన తర్వాత ప్రతి వస్తువును విసిరికొడుతోంది. మాయమైన ఆభరణాల గురించి అడిగిన ప్రతిసారి ఏడవడం మొదలు పెట్టేది. కొంత కాలంగా ఆమెను కనిపెట్టి చూస్తున్నాం. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. చాలా మంది ప్రైవేటు డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకపోయింద’ని బాధితురాలి తల్లి వివరించింది. -
ఇన్ని ‘మింగే’శాడు
ఉదయపూర్ : ఇది ఒక రేర్ కేసు.. రేర్ ఆపరేషన్. నలుగురి శ్రమ గంటన్నర ఆపరేషన్ 80 వస్తువులు 180 గ్రాములు.. వయసు 40 ఏళ్లు నలుగురు వైద్యులు అతికష్టం మీద రోగి మింగేసిన వస్తులను బయటకు తీశారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తి (40)ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతని ఎక్స్‌రే రిపోర్టును చూసిన వైద్యులే షాక్ అయ్యారు. తాళం చెవి, చైన్స్‌తో పాటు ఇతర మెటల్స్ ఏకంగా 80 వస్తువులున్నట్లు గుర్తించారు. వెంటనే అతనికి అపరేషన్ చేయాలని నిర్ణయించారు. నలుగురు డాక్టర్ల బృందం 90 నిమిషాల పాటు శస్త్రచికిత్స చేసి ఆ వస్తువులను తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఇంతకీ ఇన్ని వస్తువులను కడుపులో దాచుకున్న (మింగేసిన) వ్యక్తి ఓ మానసిక రోగి అట. ఇది చాలా రేర్ కేస్ అని, మొత్తం 800 గ్రాముల బరువున్న వస్తులను ఆపరేషన ద్వారా తొలగించామని డా.డి. కెశర్మ వెల్లడించారు. గోర్లు, ఐరన్ తీగ, తాళం చెవి, పొగ పీల్చే చిల్లం తదితర వస్తువులున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. Rajasthan: Doctors remove more than 80 items including keys, coins & 'chillam' among other items from a patient's stomach in Udaipur. pic.twitter.com/zrT4iHcvu0 — ANI (@ANI) June 17, 2019 -
డాడీ
‘‘ఇంక నావల్ల కాదు.. భరించలేను’’అంటూ పొత్తి కడుపు పట్టుకొని లుంగలు చుట్టుకుపోతోంది చందన.‘‘ఓర్చుకో చందూ.. ప్లీజ్.. చూడు ఈ మంత్ తప్పకుండా పీరియడ్స్ మిస్ అవుతావ్’’ ఆమె పక్కన కూర్చోని తల నిమురుతూ అన్నాడు అనిరుద్.ఆ మాటకు అతని కళ్లల్లోకి చూసింది చందన. ‘‘నిజం.. ఈసారి కన్సీవ్ అవడం ఖాయం...’’భరోసా ఇస్తున్నట్టుగా ఆమె చేయిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేయి విడిపించుకుంటూ దిండు ఆసరాగా గోడకు ఒరిగి కూర్చుంది చందన. కిటికీలోంచి గార్డెన్‌లోకి చూస్తూ.. ‘‘ఈ ట్రీట్మెంట్... ఈ పెయిన్ నా వల్ల కాదు అనిర్.. ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం...’’అంది. ఆ మాట అతనికి కొత్త కాదు కాని.. ఆ స్వరం కొత్తగా వినిపించింది. స్థిరమైన అభిప్రాయం మోస్తున్నట్టు. ఆమెకు ఇంకాస్త దగ్గరగా జరిగి చందన తలను తన వైపు తిప్పుకుంటూ ‘‘ఒక్క చాన్స్ చూ..ద్...’’ అని అతను మాట పూర్తి చేసేలోపలే.. ‘‘నీడ్ టు టేక్ రెస్ట్’’ అంటూ అటువైపు తిరిగింది చందన. ఇంకో మాట మాట్లాడకుండా ఆ గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు అనిరు«ద్. పెళ్లయి ఆరేళ్లవుతున్నా పిల్లల్లేరు. ఆస్తి, అంతస్తు.. మంచి ఉద్యోగం.. పెద్ద ఇల్లు.. అన్నీ ఉన్నాయి. ఆ ఇంటికి కళ తెచ్చే పిల్లలే లేరు. ఇద్దరూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అనిరు«ద్ లోపం సరిచేయరానిది. ఆ విషయం తెలిసినా.. చందన మీదే ప్రెషర్. నరకం అనుభవిస్తోంది ఆమె. అర్థమైనా కృత్రిమ గర్భధారణ కోసం పదేపదే ప్రయత్నిస్తున్నాడు అనిరు«ద్. రక్తం పంచుకుపుట్టిన బిడ్డ కావాలని. ఆ చాదస్తం చందన ప్రాణం తీస్తోంది. దిండులో తల దూర్చి పొగిలి పొగిలి ఏడుస్తోంది ఆమె. గది బయటకు వచ్చేసిన అనిరు«ద్కూ తెలుసు చందన ఏడుస్తోందని. నిట్టూరుస్తూ.. ‘‘ఏమైనా ఇంకో చాన్స్ చూడాల్సిందే’’ అనుకున్నాడు. ఆఫీస్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుంటే ఫోన్.. బీప్.. మెస్సేజ్‌ను ఇండికేట్ చేస్తూ!చూసుకున్నాడు.. ‘‘డాడీ.. వాంట్ రిమోట్ కంట్రోల్ కార్’’ అని ఉంది. రెడిక్యులస్.. చిరాగ్గా అనుకుంటూ మెస్సేజ్ డిలీట్ చేశాడు. ఆఫీస్‌కు కార్ డ్రైవ్ చేశాడు. గుయ్.. గుయ్.. ..... ..... .... .... గుయ్.. గుయ్‘‘అబ్బా.. ఆ ఫోన్ చూడు అనిర్..’’ మధ్య రాత్రి ఫోన్ వైబ్రేషన్ సౌండ్‌కి ఇరిటేట్ అవుతూ చందన. ‘‘ఊ.. పోనిద్దూ.. పడుకో’’ అంటూ అటు తిరిగి ముసుగేసుకున్నాడు అనిరు«ద్.గుయ్.. గుయ్... ..... .... .... గుయ్.. గుయ్ ‘‘అబ్బా...’’ అని విసుక్కుంటూ అనిరు«ద్ ఫోన్ తీసింది. కళ్లునులుముకుంటూ చూసింది.. మెస్సేజెస్.. స్క్రీన్ మీద నోటిఫికేషన్స్‌లో.. ‘‘డాడీ...’’ అని కనిపించింది. ‘‘అనిర్.. ఏవో మెస్సేజెస్ ..’’ భర్తను తట్టి లేపుతూ.‘‘పొద్దున చూసుకుంటాలే.. ’’ నిద్ర మత్తుతోనే అనిరు«ద్. పక్కన పెట్టబోతుంటే మళ్లీ ఓ మెస్సేజ్ వచ్చింది. చూసింది. ‘‘డాడీ...’’ అని ఒక మెస్సేజ్... ‘‘డాడీ... వై డింట్ యు గివ్ రిప్లయ్?’’ అని ఒకటి.. ‘‘డాడీ.. రిమోట్ కంట్రోల్ కార్ తేలేదూ?’’ అని ఓ మెస్సేజ్, ‘‘డాడీ.. గిమ్మీ రిప్లయ్.. ’’, ‘‘డాడీ.. ప్లీజ్.. ప్లీజ్..’’ అంటూ ఓ అయిదారు మెస్సేజ్లున్నాయి. అన్నీ చదివింది. నిద్ర ఎగిరిపోయింది ఆమెకు. వెంటనే అనిరు«ద్‌ను లేపి.. ఏంటిది? అని అడిగాలన్నంత ఆవేశం వచ్చింది. కాని ఆలోచనలో పడింది. అనిరు«ద్‌కు పిల్లలా? మరి మెడికల్ రిపోర్ట్? అతనిలో కౌంట్ తక్కువనే కదా చెప్పారు డాక్టర్! అబద్ధమా? నాకు పిల్లలు పుట్టట్లేదని ఇంకో... ఛ.. ఇలా ఆలోచిస్తుందేంటి తను? మరో అమ్మాయి, ఆమెతో పిల్లలు ఉంటే తననెందుకు ఇబ్బంది పెడ్తాడు ట్రీట్మెంట్స్తో? ఏమో.. తనకు అనిరు«ద్ పట్ల అలాంటి థాట్ రాకుంటా ఉండడానికి ట్రీట్మెంట్ అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతున్నాడేమో? ఆ డాక్టర్ అనిరుద్ ఫ్రెండే కదా.. ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారా? ఆ చాన్స్ ఉందా? అందుకే అడాప్షన్ వద్దంటున్నాడా? లాంటి ఆలోచనలతో.. అనుమానాలతో తెలీకుండానే నిద్రలోకి జారుకుంది చందన. ‘‘డాడీ.... డాడీ...’’ అయిదేళ్ల అమ్మాయి గుసగుసగా పిలుస్తున్నట్టు.ఒకేసారి ఇద్దరికీ మెలకువ వచ్చింది. ‘‘డాడీ... డాడీ..’’ మళ్లీ పిలుపు. గాబరాగా అనిరు«ద్ లైట్ వేయబోయాడు. వెలగలేదు. అప్పటిదాకా వెలిగిన బెడ్‌లైట్ కూడా ఆరిపోయింది. పక్కనే ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని టార్చ్ ఆన్చేసింది చందన. అనిరు«ద్ వంక చూసింది. మొహం నిండా చెమటలతో వణుకుతున్నాడు. ఉన్నట్టుండి గాలి.. వెర్రెత్తినట్టు బెడ్రూమ్ కిటికీలను.. కర్టెన్లూ ఊపేస్తోంది.. కిటికీ తలుపులు ఊడిపడిపోతాయేమోనన్నంతగా! ‘‘పిల్లలు కావాలా డాడీ?’’ మళ్లీ ఆ పిల్ల గొంతే! ‘‘ఏయ్.. ఎవరు నువ్వు?’’కంపిస్తున్న స్వరంతో అనిరు«ద్. ‘‘నీ కూతురిని డాడీ.. పొద్దున ... మధ్యాహ్నం మెస్సేజెస్ పెట్టా కదా.. చూసుకొనీ డిలీట్ చేశావ్. ఇందాక కూడా పెట్టా. నువ్వు పట్టించుకోలేదు.. అందుకే వచ్చా డాడీ..’’ పలుకుతోంది పిల్ల గొంతు. ‘‘ఏయ్.. ఏంటా ముదురు మాటలు? డాడీ ఎవరు ? డాడీ అట డాడీ?’’ భయం ప్లేస్‌లో చిరాకు, కోపం వచ్చాయి అనిరు«ద్‌కి. మళ్లీ గాలి విసురుగా.. ఒక్కసారి ఆ ఇంటినే ఊపేసింది. ‘‘అనిర్...’’ భయంతో గట్టిగా అరిచింది చందన. ‘‘చందూ..’’ అంటూ ఆమెను పొదివి పట్టుకున్నాడు అతను. ‘‘అనిర్.. ఏంటిదంతా? ఎవరా పాపా? కనిపించదేంటి?’’ అంత భయంలోనూ భర్త మీదఅనుమానంతో ఆమె. ‘‘తెలీదు.. నాకూ కన్ఫ్యూజన్గానే ఉంది’’చెమటలు తుడుచుకుంటూ అతను. ‘‘అబద్ధం..’’ అరిచింది ఆ పిల్ల గొంతు. ఒక్కసారిగా వణికారు ఇద్దరూ. ‘‘డాడీ.. అబద్ధం చెప్పకు డాడీ.. ’’ అంతలోకే మార్దవంగా ఆ పిల్ల. మెల్లగా బెడ్ దిగి.. ‘‘ఏయ్ ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావ్?’’ ‘‘అదేంటి డాడీ.. నన్ను మర్చిపోయావా?’’ అని వినిపించగానే ఒక్కసారిగా గదిలో లైట్ వెలిగింది. గదంతా చూశారిద్దరూ .. ఎవరూ లేరు.చందనకు కోపం వస్తోంది. అనిరు«ద్ తనను మోసం చేశాడని. ఆ ఆగ్రహంతోనే భర్త టీషర్ట్ కాలర్ పట్టుకుంది.. ‘‘అనిర్.. నన్నెందుకు చీట్ చేస్తున్నావ్? ఆ పాపఎవరు?’’అంటూ!‘‘వ్వాట్..?’’ఖంగుతిన్నఅనిరు«ద్ షర్ట్ కాలర్ విడిపించుకుంటూ ‘‘గాన్ మ్యాడ్?’’ అరిచాడు. బిత్తరపోయింది చందన. ‘‘ఏం జరుగుతుందో చూసే ఆ మాట అంటున్నావా చందూ?’’ బాధగాఅతను.‘‘రాత్రి నీ సెల్‌కు వచ్చిన మెస్సేజెస్ చూశా.. ఈ అమ్మాయే కాబోలు’’ అంటూ సెల్ ఫోన్ తీసి అతని చేతికి ఇచ్చింది. చదవబోతూంటే బయట కార్ హార్న్ మోగింది గట్టిగా.. ఉలిక్కిపడ్డారిద్దరూ.మోగుతూనే ఉంది.. గబగబా పోర్టికోలోకి పరిగెత్తారు. హెడ్లైట్లు వెలుగుతూ... ఆరుతూ.. ఆరుతూ వెలుగుతూ.....!కార్ దగ్గరకు వెళ్లారు.. విండో గ్లాసెస్ మీద ‘‘డాడీ.. నన్ను ఇంటికి తెచ్చుకోండి... ప్లీజ్’’అని రాసుంది. అది చూసి ఆవేశంతో తుడిచేయబోయాడు అనిరు«ద్.. మళ్లీ హార్న్ మోగింది! అనిరు«ద్ చేయి పట్టి ఆపింది చందన.. తుడిచేయొద్దు అన్నట్టుగా! మళ్లీ మాటలు వినిపించాయి.. ‘‘డాడీ.. ప్లీజ్ మమ్మీ మాట వినండి.. అనా«థను దత్తత తీసుకోండి.. నాలా చెత్తకుప్పలో చనిపోనివ్వకండి.. డాడీ.. ప్లీజ్.. మమ్మీని అలా హాస్పిటల్‌కి తిప్పకండి. అడాప్ట్ చేసుకోండి.. నన్నూ.. మమ్మీని కాపాడండీ.. ప్లీజ్ డాడీ.. ప్లీజ్ డాడీ...’’ అంటూ ఆ పాప స్వరం ఏడుస్తోంది.. చందనాకూ దుఃఖం ఆగలేదు! - సరస్వతి రమ -
కడుపులో కత్తెర మరిచిపోవడం దురదృష్టకరం..
హైదరాబాద్ : మహిళ కడుపులో కత్తెర మరిచిపోయిన ఉదంతంపై నిమ్స్ డైరెక్టర్ మనోహర్ స్పందించారు. కడుపులో కత్తెర మరిచిపోయిన ఈ సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు చెందిన మహేశ్వరి చౌదరికి గత ఏడాది నవంబర్ 2వ తేదీన సర్జరీ జరిగిందని, ఆపరేషన్ తర్వాత వైద్యులు ఆమె కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేశారన్నారు. ఆ తర్వాత ఆమెకు కడుపు నొప్పి రావడంతో మళ్లీ నిమ్స్‌కు రాగా, మహేశ్వరికి ఎక్స్‌రే తీస్తే కడుపులో కత్తెరను గుర్తించామని నిమ్స్ డైరెక్టర్ తెలిపారు. (మహిళ కడుపులో కత్తెర మరిచిపోయారు..) మహేశ్వరికి వైద్యులు వీరప్ప, వేణు, వర్మ ఆపరేషన్ చేశారని, ఈ ఘటనలో ఆస్పత్రిలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఘటనకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట మహిళ బంధువులు ఆందోళనకు దిగటమే కాకుండా, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కత్తెరను తొలగించేందుకు మహిళకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. -
చివరి పాలు
అబూహురైరా (రజి) దైవప్రవక్త (సల్లం) సేవలో, జ్ఞానార్జనలో పూర్తిగా లీనమైపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. చివరికి పస్తులు కూడా ఉండవలసి వచ్చింది. ఒక రోజయితే ఆయన తీవ్రమైన ఆకలితో విలవిల్లాడి పోయారు. దాంతో ఆయన.. దారిలో ఒకచోట నిల్చొని ఎవరైనా వచ్చి తనను ఇంటికి తీసికెళ్లి భోజనం పెట్టిస్తారేమోనని ఎదురు చూడసాగారు. కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త (స) అటుగా వచ్చారు. దైవప్రవక్త (సల్లం) ఎంతో వాత్సల్యంతో ఆయన వైపు చూస్తూ ‘‘అబూహురైరా! పద నావెంట’’ అన్నారు. అబూహురైరా (రజి) వెంటనే ఆయన వెంట నడిచారు. దైవప్రవక్త ఆయన్ని తన ఇంటికి తీసికెళ్లారు. అక్కడ ఒక గిన్నెలో పాలు ఉండటం చూసి అబూహురైరా (రజి)తో ‘‘అబూహురైరా! మస్జిద్కు వెళ్లి సప్ఫా వారందరినీ పిలుచుకొనిరా’’ అని అన్నారు. దైవప్రవక్త (సల్లం) వాళ్లందరినీ పిలిపించడం అబూహురైరా (రజి)కు నచ్చలేదు. ఓ గిన్నెడు పాలు అంతమందికి ఎలా సరిపోతాయి? అనుకున్నారు ఆయన. ‘‘ఏమైనా దైవప్రవక్త (సల్లం) ఆజ్ఞ కదా!’’ అని భావిస్తూ వెళ్లి వారందరినీ పిలుచుకు వచ్చారాయన. దైవప్రవక్త (స) అందరూ వచ్చి కూర్చున్న తరువాత ‘‘అబూహురైరా! ఈ పాలగిన్నె తీసుకొని వీరందరికీ పాలు తాగించు’’ అని అన్నారు. అబూహురైరా (రజి) పాలగిన్నె తీసుకొని ఒకరి తర్వాత ఒకరు చొప్పున అందరికీ పాలు తాగించారు. అయినా గిన్నెలో పాలు ఏమాత్రం తగ్గలేదు. తరువాత ఆయన పాలగిన్నెను దైవప్రవక్త (సల్లం) ముందు పెట్టారు. ‘‘సరే, ఇప్పుడు నువ్వు తాగు ఈ పాలను’’ అన్నారు దైవప్రవక్త (సల్లం). ఆకలితో నకనకలాడుతున్న అబూహురైరా (రజి) వెంటనే పాలగిన్నె తీసుకొని గటగటా పాలుతాగి దాన్ని కింద పెట్టేశారు. దైవప్రవక్త (సల్లం) ఇంకా తాగమన్నారు. అబూహురైరా (రజి) మరొకసారి గిన్నె పైకెత్తి పాలుతాగారు. దైవప్రవక్త (సల్లం) ఇంకా తాగు, ఇంకా తాగు అన్నారు. అబూహురైరా (రజి) ఆవిధంగా కడుపునిండా తాగి ‘‘ఇప్పుడిక నా కడుపులో ఏమాత్రం అవకాశం లేదు’’ అని అన్నారు. గిన్నెలో పాలు ఇంకా మిగిలివున్నాయి. అందరికంటే చివర్లో దైవప్రవక్త (సల్లం) ఆ పాలను తాగారు. – ముహమ్మద్ ముజాహిద్ -
వాసనతోనే కడుపు నిండుతుందట!
వాషింగ్టన్: ఊబకాయం, బరువు పెరగడం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీంతో బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటూ బతికేస్తున్నారు. నోరూరించే ఆహార పదార్థాలు కనిపించినప్పుడల్లా తినాలా? వద్దా? అంటూ వారిలో ఓ యుద్ధమే జరుగుతుంది. మానసికంగా బలవంతులైతే ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి తమను తాము నియంత్రించుకుంటారు. అదే బలహీనులైతే.. ‘ఈ ఒక్కసారికే..’ అని తమకుతాము సర్దిచెప్పుకొని లాగించేస్తారు. తీరా తిన్నాక మళ్లీ సమస్య మొదటికి వచ్చేసిందంటూ బాధపడతారు. అయితే ఇలాంటివారు ఇకపై అలా బాధపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. పిజ్జా, బర్గర్, బిర్యానీ వంటి కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినకూడని పరిస్థితిలో ఉంటే.. వాటిని తినకుండానే, తిన్నామనే సంతృప్తి పొందొచ్చని చెబుతున్నారు. ఓ రెండు నిమిషాలపాటు సదరు ఆహార పదార్థాల వాసన చూస్తే చాలట.. తిన్నామన్న సంతృప్తి కలుగుతుందని.. ఆ తర్వాత తీసుకునే ఆహారం ఏదైనా తక్కువగా ఆరగిస్తామని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఆహార పదార్థాల సువాసన వల్ల పూర్తి సంతృప్తి లభించి కడుపు నిండినట్లు అనిపించడమే దీనికి కారణమట. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. -
పేగు బ్యాక్టీరియాపై చక్కెర ప్రభావం
కడుపులో పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆరోగ్యంగా, తగినంత బరువు మాత్రమే ఉండే వారిలో మంచి బ్యాక్టీరియా చేరేందుకు కావాల్సిన కీలకమైన ప్రొటీన్ ఉత్పత్తిని చక్కెర అడ్డుకుంటుందని అంటున్నారు యేల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. చక్కెర పేగుల్లోనే జీర్ణమైపోతుందని కడుపులోకి రాదని శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ కట్టిన అంచనా తప్పని ఈ కొత్త పరిశోధన చెబుతోంది. ఫ్రక్టోజ్ గ్లూకోజ్ వంటి చక్కెరలు ఎక్కువగా ఉండే పాశ్చాత్యదేశాల ఆహారం బ్యాక్టీరియాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు తాము ఈ పరిశోధన చేపట్టామని ఈ రెండు కలిసి తయారు చేసే సుక్రోజ్ ఆర్ఓసీ అనే ప్రొటీన్ ఉత్పత్తిని నిలిపిస్తున్నాయని గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎడ్యురాడో గ్రోయిస్మాన్ తెలిపారు. ఫలితంగా కొన్ని రకాల బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలో మనుగుడ సాగించలేకపోతున్నాయని చెప్పారు. -
పేవుల్లో బ్లూటూత్ ట్యాబ్లెట్!
కడుపు, పేవుల్లో ఏదైనా ఒక సమస్య వస్తే డాక్టర్ మందిస్తాడు. ఇలా కాకుండా, సమస్య వచ్చిందని తెలిసిన వెంటనే అక్కడికక్కడే కొన్ని మందులు విడుదలైపోతే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని త్వరలో ఈ అద్భుతం సాకారం కానుంది. పేవుల్లోకి చేరి నెలరోజులపాటు అక్కడే ఉంటూ క్రమక్రమంగా మందులు విడుదల చేసే సరికొత్త గాడ్జెట్ ఒకదాన్ని వీరు తయారు చేశారు. అంతేకాదు, శరీరం లోపలి నుంచే ఈ గాడ్జెట్ బ్లూటూత్ టెక్నాలజీ సాయంతో సమాచారాన్ని బయటకు పంపుతూ ఉంటుంది కూడా! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో ప్రత్యేకమైన ప్లాస్టిక్‌తో తయారైన ఈ గాడ్జెట్ నెల రోజుల తరువాత నిరపాయకరంగా శరీరం నుంచి బయటపడిపోతుంది. ఈ గాడ్జెట్‌ను ఇప్పటికే తాము పందుల్లో ఉపయోగించి పరీక్షించామని సానుకూల ఫలితాలు రాబట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రాబర్ట్ లాంగర్ తెలిపారు. బ్లూటూత్ సంకేతాల ద్వారా అవసరమైనప్పుడు మందులు విడుదల చేసేందుకూ అవకాశం ఉంటుందని చెప్పారు. పరిశోధన వివరాలు అడ్వాన్స్డ్ మెటీరియల్స్ టెక్నాలజీస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
మహిళ కడుపులో కిలోన్నర నట్లు, బోల్టులు.!
అహ్మద్‌బాద్ : సైకలాజికల్ కండిషన్స్‌తో కొంత మంది బలపాలు, మట్టి ఇతరత్రా వస్తువులను తింటూ ఉండటం చూస్తుంటాం. కానీ ముంబైకి చెందిన ఓ మహిళ పదునైన వస్తువులను ఆరగించి ఆనారోగ్యానికి గురైంది. ఆమెకు ఆపరేషన్ చేసిన అహ్మదాబాద్ వైద్యులు ఆ మహిళ కడుపులో కిలోన్నర నట్లు, బోల్ట్‌లు, జ్యూవెలరీ వస్తువులను చూసి అవాక్కయ్యరు. ఆమె ఉదర గోడలను పిన్నిసులు గాయపరచడంతో సుమారు మూడు గంటలపాటు కష్టపడి ఆపరేషన్ చేసి నట్లు, బోల్ట్‌లతో పాటు జిప్పులు, హెయిర్ పిన్నులను తొలగించారు. ఈ మహిళ అరుదైన సైకలాజికల్ కండిషన్ అకుఫగియాతో బాధపడుతుందని, ఈ వ్యాధితో బాధపడేవారు పదునైన వస్తువులను తింటారని వైద్యులు పేర్కొన్నారు. ఇలా ఆమె పదునైన వస్తువులు ఆరగించడంతో ఆమె కడుపు ధృఢంగా తయారైందని, ఊపిరితిత్తుల్లో పిన్నిసులు గుచ్చుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళా వైద్యుల పర్యవేక్షణలో ఉందని తెలిపారు. -
ఆ మనిషి పొట్టలో కొవ్వులే కొవ్వులు
కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి చేటు. ఈ విషయం మనకు తెలు సుగానీ.. ఎప్పుడో 5300 ఏళ్లక్రితం బతికున్న మనిషికి తెలియదు. అందుకేనేమో.. ఆ మనిషి ఎంచక్కా కొవ్వులున్న ఆహారాన్ని సుష్టుగా లాగించేశాడు. విషయం ఏమింటే.. ఫొటోలో కనిపిస్తోందే.. అది ఐదువేల ఏళ్ల క్రితం నాటి ఓ మనిషి అవశేషం. ఆల్ప్స్ పర్వతప్రాంతాల్లో మంచులో గడ్డకట్టుకుపోయి ఉండగా 1991లో బయటపడింది. శాస్త్రవేత్తలు ఐస్‌మ్యాన్ అని పేరు పెట్టారు. మంచులో ఉండిపోవడం వల్ల శరీరం పెద్దగా నాశనం కాలేదు. దీంతో శాస్త్రవేత్తలు ఐస్‌మ్యాన్ ఆ కాలంలో ఏం తిని ఉంటాడో తెలుసుకోవాలని అనుకున్నారు. పొట్టలో మిగిలి ఉన్న పదార్థాలను విశ్లేషించడం ద్వారా ఐస్‌మ్యాన్ చివరగా తీసుకున్న ఆహారంలో కొవ్వులు బాగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిశోధన ఆ కాలపు ప్రజల ఆహారపు అలవాట్లను తెలుసుకునేందుకు మాత్రమే కాకుండా... వంటలు ఎలా వండేవారో అర్థం చేసుకునేందుకు పనికొస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎప్పుడో 1991 ప్రాంతంలో బయటపడ్డ ఐస్‌మ్యాన్ కడుపు లో ఏముందో తెలుసుకునేందుకు ఇంత సమయం ఎందుకు పట్టిందన్న అనుమానానికి ఈపరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మాక్సినర్ సమాధానమిస్తూ.. ఐస్‌మ్యాన్ కడుపు ఎక్కడుందో తెలుసుకోవడం మొదట్లో కష్టమైందని చెప్పారు. శరీరం మమ్మీలా మారిపోయే క్రమంలో కడుపు కాస్తా పైకి చేరిపోయిందని 2009లో సీటీస్కాన్ సాయంతో దీన్ని గుర్తించి ఆ తరువాత పరిశోధనలు చేపట్టామని వివరించారు. -
కాన్పుకు వస్తే కడుపులో కాటన్ వేసి..
షాద్‌నగర్‌టౌన్ : వైద్యుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైన సంఘటన షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఎనిమిది నెలలుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. షాబాద్ మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన హరిత(25)ను ఏడాదిన్నర కిత్రం అదే మండలంలోని అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన రాజుతో వివాహం చేశారు. హరితకు తొలి కాన్పు సమయం దగ్గర పడడంతో గతేడాది అక్టోబర్ 3న షాద్‌నగర్ పట్టణంలోని విజయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. హరితను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కుటుంబీకుల అంగీకారంతో అక్టోబర్ 5న ఆపరేషన్ చేయడంతో హరిత తొలికాన్పులో పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. పాపను చూసి మురిసిపోయిన ఆ కుటుంబ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఆపరేషన్ అయిన కొన్ని నెలల్లోనే హరిత అనారోగ్యానికి గురైంది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. హరితకు స్కానింగ్ చేసి ఆమె కడుపులో కాటన్ ఉన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఉస్మానియా వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడలేదు. కొన్ని నెలలుగా మృత్యువుతో పోరాటం చేసి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హరిత మృతి చెందింది. ఆస్పత్రి ఎదుట పసిపాపతో ధర్నా మృతురాలి కుటుంబీకులు శనివారం సాయంత్రం షాద్‌నగర్‌లోని విజయ ఆస్పత్రి ఎదుట ధర్నా చేప ట్టారు. హరిత కూతురు పసిపాపతో ఆస్పత్రి ఎదు ట బైఠాయించారు. పసిపాపకు న్యాయం చేయాల ని, నిర్లక్ష్యంగా వ్యహరించి ఆపరేషన్ చేసిన వైద్యులను వెంటనే అరెçస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా షాద్‌నగర్ పట్టణ సీఐ అశోక్‌కుమార్ గట్టి బందోబస్తు చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రి నుండి హరిత మృతదేహాన్ని పోలీసులు నేరుగా ఆమె స్వగ్రామైన షాబాద్ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి తరలించారు. రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలి హరిత మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బాధిత కుటుంబ సభ్యులు రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చిన్నారి పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని ఆందోళన చేపట్టిన వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు, స్ధానిక నాయకులు జోక్యం చేసుకొని విజయ ఆస్పత్రి వైద్యులతో చర్చించినట్లు సమాచారం. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. -
భారీ తిమింగలం మృతి.. షాకింగ్ నిజాలు
బ్యాంకాక్ : ప్లాస్టిక్ భూతానికి ఓ భారీ తిమింగలం బలైంది. మానవుల నిర్లక్ష్యం ఆ సముద్ర జీవికి శాపంగా మారింది. థాయ్‌లాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్లాస్టిక్ వాడకంపై ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది. దాని ప్రాణాలు నిలపడం కోసం ఐదు రోజులుగా ప్రయత్నించిన వెటర్నటీ డాక్టర్లకు నిరాశే ఎదురైంది. థాయ్‌లాండ్, సంగాక్ల దక్షిణా ప్రాంతంలోని ఓ కెనాల్ సమీపాన అచేతన స్థితిలో ఉన్న ఓ భారీ తిమింగలాన్ని స్థానికులు గుర్తించి మెరైన్ కోస్టల్ రిసోర్స్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. తిమింగళం పొట్ట నుంచి తీసిన ప్లాస్టిక్ కవర్లు విస్తుపోయే విషయాలు.. ఆ తిమింగలం అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి వెటర్నీ డాక్టర్లు ప్రయత్నించగా.. విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. భారీ సంఖ్యలో ప్లాస్టిక్ బ్యాగులను తిమింగలం పొట్టలో పేరుకుపోయాయి. దాని పొట్ట నుంచి 5 ప్లాస్టిక్ బ్యాగ్‌లను తొలిగించగానే అది మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. అనంతరం దాని పొట్టలో మొత్తం 8 కేజీల బరువుగల 80 ప్లాస్టిక్ బ్యాగులను గుర్తించామని మెరైన్ కోస్టల్ రిసోర్స్ డిపార్ట్మెంట్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇలా కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో తిమింగలం జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, దాని మృతికి ఇదే కారణమని వైద్యులు పేర్కొన్నారు. కెనాల్ నుంచి తిమింగలాన్ని బయటకు తీస్తున్న వెటర్నటీ సిబ్బంది చిన్న చేపలు, సముద్ర జీవులను వేటాడి ఆహారంగా తీసుకునే తిమింగలాలకు అవి లభించకపోవడంతో ప్లాస్టిక్‌నే ఆహారంగా తీసుకుంటున్నాయని మెరైన్ కోస్టల్ డిపార్ట్మెంట్ హెడ్ జతుపోర్న్ తెలిపారు. ప్లాస్టిక్ వాడకంపై థాయ్‌లాండ్ ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. థాయ్‌లాండ్ ప్రజలు ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతున్నారని చెప్పారు. 2050 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణమే ఎక్కువగా ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం హెచ్చరిస్తూ ఓ నివేదికలో వెల్లడించింది. మన దేశంలో కూడా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గడం లేదు. ఇది జంతువులకు శాపంగా మారింది. -
8 కిలోల కణితి తొలగింపు
సాక్షి,తణుకు : తణుకులోని సాయిశ్వేత సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి సుమారు 8 కిలోల బరువున్న కణితిని తొలగించారు. తాడేపల్లిగూడెంకు చెందిన మహిళ అనారోగ్యంగా ఉండటంతో వైద్యురాలు డాక్టర్ ఉషారాణిని సంప్రదించింది. స్కానింగ్ చేసి కడుపులో కణితి ఉందని గుర్తించారు. డాక్టర్ ఉషారాణి, సత్యనారాయణలతో పాటు మత్తు వైద్యనిపుణులు నారాయణరావు పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. 15 ఏళ్ల క్రితమే గర్భసంచిని తొలగించే ఆపరేషన్ జరిగిందని, అప్పటి నుంచి శరీరం పెరుగుతోందనే ఉద్దేశంతోనే రోగి నిర్లక్ష్యం వహించిందని వైద్యురాలు చెప్పారు. -
అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?
నా వయసు 43 ఏళ్లు. కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం. డాక్టర్ గ్యాస్ట్రైటిస్ అన్నారు. హోమియోలో చికిత్స ఉందా? – ఎమ్. రామసుబ్బారెడ్డి, కర్నూలు జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. గ్యాస్ట్రిక్ ముదిరితే అవి కడుపులో అల్సర్స్ (పుండ్లు)గా ఏర్పడతాయి. కారణాలు : 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమ వుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : కడుపు నొప్పి, మంట, ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙మలం రంగు మారడం వంటివి. జాగ్రత్తలు : సమయానికి ఆహారం ∙కొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగ, మద్యపానం మానేయాలి ∙మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి. భోజనానికి నిద్రకు మధ్య రెండు గంటల విరామం ఉండాలి. చికిత్స : ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యత చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పేరుకొరుకుడుకు చికిత్స ఉందా? మా అమ్మాయికి 25 ఏళ్లు. ఈ మధ్య ఒకే దగ్గర వెంట్రుకలు రాలిపోతున్నాయి. పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? – సురభి, ఖమ్మం పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించు కోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోయి తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగాని రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. కారణాలు : ∙మానసిక ఆందోళన ∙థైరాయిడ్ సమస్య ∙డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ∙వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు : ∙తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. ∙తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ∙సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. నిర్ధారణ : ఈ సమస్య నిర్దుష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు. చికిత్స : పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
బరువుకు... పొట్టలోని బ్యాక్టీరియాకు లింక్?
తినే తిండే మనం లావెక్కేందుకు లేదా సన్నబడేందుకు కారణమని ఇన్నాళ్లూ అనుకుంటున్నామా? ఇందులో నిజం కొంతే అంటున్నారు శాస్త్రవేత్తలు. మన కడుపులో, పేవుల్లో ఉండే బ్యాక్టీరియా ఏం తింటుందో... దాన్ని బట్టి మన బరువు ఆధారపడి ఉంటుందన్నది జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన చెబుతున్న విషయం. వివరాల్లోకి వెళితే.. ఆహారంలో పీచుపదార్థం ఎక్కువ ఉంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే శరీరానికి బదులు బ్యాక్టీరియా ఈ పీచుపదార్థాన్ని తినేయడం వల్ల ఇలా జరుగుతోంది. ఆహారంలో పీచు తక్కువైనప్పుడల్లా బ్యాక్టీరియా రకాల్లో తేడాలొచ్చేస్తాయి. ఇది కాస్తా ఊబకాయం మొదలుకొని మధుమేహం చివరకు గుండెజబ్బులకు దారితీస్తుంది. అమెరికా తదితర దేశాల ఆహారంలో చక్కెరలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయని, పీచు తక్కువగా ఉంటుందని మనకు తెలుసు. ఈ కారణంగానే అక్కడ ఊబకాయ సమస్యలు ఎక్కువ. జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్త అండ్రూ గెవిర్ట్తోపాటు యూనివర్శిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్‌కు చెందిన బెడిక్లు వేర్వేరుగా కొన్ని ఎలుకలపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. పీచు తక్కువగా ఇచ్చినప్పుడు పేవుల్లోని బ్యాక్టీరియాలో తేడాలు వచ్చాయని, మోతాదు పెంచినప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినా.. మునుపటి స్థాయికి చేరుకోలేదని వీరు అంటున్నారు. ఏతావాతా తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. బరువు తగ్గాలంటే వీలైనంత వరకూ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తినాలని! -
పురుడుపోసి.. బ్లేడు మరచి
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): సంచనాలకు మారు పేరు అయిన రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పటల్ మరో సంచలనానికి వేదికైంది. కొంతకాలం క్రితం పురుడు పోసుకునేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ప్రసూతి విభాగంలో చేరిన ఒక గర్భిణికి ఆపరేషన్ చేసి పురుడుపోశారు. అనంతరం కడుపులో బ్లేడ్ మరిచిపోయి కుట్లు వేసేశారు. దీనితో మహిళకు కడుపు నొప్పి తరచూ రావడంతో స్కానింగ్ చేయించుకుంటే కడుపులో వైద్యం చేసేందుకు ఉపయోగించే బ్లేడు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసినట్లు గుర్తు రావడంతో ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చేరారు. అయితే ఆ మహిళ వివరాలు గోప్యంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపై హాస్పటల్ సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్ ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టి రాలేదన్నారు. -
5 కిలోల ఇనుము వెలికితీసిన డాక్టర్లు
సాట్నా : మధ్యప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ ఆసుపత్రి వైద్యలు అరుదైన సర్జరీ నిర్వహించారు. ఓ వ్యక్తి కడుపు నుంచి ఐదు కిలోల ఇనుమును వెలికితీశారు. అందులో 263 కాయిన్లు, షేవింగ్ బ్లేడ్లు, సూదులు, గొలుసు ఉన్నాయి. బాధితుడు మహ్మద్ మసూక్ ఈ నెల 18వ తేదీన విపరీతమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో వచ్చి చేరినట్లు వైద్యులు తెలిపారు. బాధితుడికి ఎక్స్‌రేతో పాటు పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత కడుపులో ఇనుము సంబంధిత వస్తువులు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. అనంతరం సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. ఇనుము సంబంధిత వస్తువులను రోగి మింగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్లో ఉంచినట్లు వివరించారు. -
కడుపులో 263 నాణేలు!?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా ఆసుపత్రిలో ఒక యువకుడి కడపులోంచి కేజీ బరువున్న ఇనుప పదార్థాలను వైద్యులు తొలగించారు. ఒక వ్యక్తి కడుపులో ఈ స్థాయిలో ఇనుప వ్యర్థాలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వైద్యులు తెలిపారు. ముగ్గురు వైద్యులు.. మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఆపరేషన్ చేసి వ్యర్థాలను తొలగించారు. రేవా జిల్లాలోని మారేమూల గ్రామానికి చెందిన సదరు వ్యక్తి కడుపు నుంచి మొత్తంగా 263 నాణేలను తొలగించినట్లు వైద్యులు ప్రకటించారు. రూ. 2, రూ. 5, రూ. 10 నాణేలు అందులో ఉన్నాయని.. వాటి విలువ రూ. 790 ఉంటుందని వైద్యులు తెలిపారు. నాణేలతో పాటు విరిగిపోయిన సైకిల్ చైన్ ముక్కలు, సూదులు, గోర్లు.. ఉన్నాయన్నారు. కడుపులో వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో.. సదరు యువకుడు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతనికి ఆపరేషన్ చేసి.. వాటిని తొలగించామని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. -
పేగుల్లోని బ్యాక్టీరియా మారితే చిక్కే
వయసుతో పాటు వచ్చే కొన్ని వ్యాధులకు మన కడుపు, పేగుల్లోని బ్యాక్టీరియా రకాల్లో తేడాలు రావడమే కారణమా అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. వయసులో ఉండే ఎలుకల బ్యాక్టీరియాను వయసు మీరిన ఎలుకల కడుపులోకి ప్రవేశపెట్టినప్పుడు వాటిల్లో వయసు సంబంధిత వాపు లేదా మంట పెరిగినట్లు తేలిందని నెదర్లాండ్స్‌కు చెందిన గ్రాంజియన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వాపు అలాగే కొనసాగితే గుండెపోటు, ఇతర గుండె జబ్బులు, మతిమరుపు వంటి సమస్యలొస్తాయని అంటున్నారు. వయోవృద్ధులు తమ ఆహారాన్ని తగినట్లు మార్చుకోవడం ద్వారా కొన్ని సమస్యలను అధిగమించవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రయోగాలు చేసినట్లు పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ ఫ్లోరిస్ ఫ్రాన్సన్ తెలిపారు. కడుపు, పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను అభివృద్ధి చేసుకుంటూ చెడు బ్యాక్టీరియాను తగ్గించుకుంటే వయసు మీదపడ్డా కూడా ఆరోగ్య సమస్యలు పెద్దగా బాధించవని పేర్కొన్నారు. ఇందుకోసం మొక్కల ద్వారా లభించే పీచుపదార్థాలు (ఉల్లి, వెల్లుల్లి, అరటి, బార్లీ, ఓట్స్ ఆపిల్స్, అవిశ గింజలు వంటివి) ఎక్కువగా తీసుకోవడం, పెరుగు, మజ్జిగ, ఊరగాయల వంటి ప్రో బయోటిక్స్‌ను ఆహారంలోకి చేర్చుకోవడం ద్వారా వాపును.. తద్వారా భవిష్యత్తులో రాగల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని వివరించారు. వయసు మళ్లిన తర్వాత పేగుల్లోని బ్యాక్టీరియాలో తేడా ఎందుకు వస్తుందన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదని, యాంటీ బయోటిక్స్ పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కడుపులో కత్తెర పై విచారణ
నెల్లూరు(బారకాసు): రోగి చలపతి కడుపులో కత్తెర ఉంచి కుట్లు వేసిన ఘటనపై గురువారం జేసీ ఇంతియాజ్ అహ్మద్ నేతృత్వంలోని కమిటీ జీజీహెచ్‌లో విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన వైద్యుల నిర్లక్ష్యం ఘటనపై మానవ హక్కుల కమి షన్ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించిన విషయం విదితమే. హెచ్చార్సీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కమిటీ చైర్మన్‌గా జేసీ, సభ్యులుగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ సీవీ రమాదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణరాజును నియమించిన విషయం తెలిసిందే. గురువారం జీజీహెచ్‌లో జరిగిన విచారణకు చలపతికి రెండు స్లారు ఆపరేషన్ చేసిన వైద్యులు, నర్సులు మొత్తం 8 మంది హాజరయ్యారు. వీరిలో జనరల్ సర్జన్ హెచ్ఓడీ డాక్టర్ పద్మశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పద్మజారాణి, డాక్టర్ శ్రీలక్ష్మి, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ సాయిసందీప్, మత్తు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ ప్రియాంక, స్టాఫ్ నర్సులు పార్వతి, అనిత ఉన్నారు. మూడు గంటలపాటు విచారణ ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్యులు, నర్సులను మూడు గంటల పాటు కమిటీ విచారించింది. ఒక్కొక్కరిని పిలిచి ఆపరేషన్ జరిగిన సమయంలో ఏం జరిగింది? ఆ సమయంలో చేసిన పని ఏమిటని పూర్తిస్థాయిలో విచారించారు. ఈ మేరకు వైద్యులు, నర్సుల వాగ్మూలాన్ని లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. పేషెంట్‌కు సంబంధించిన కేస్‌షీట్‌ను కూడా జేసీ తీసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ ఇంతియాజ్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు తాము పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని, ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. దీనిపై మరింత లోతుగా సమగ్రంగా విచారణ జరిపి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం జేసీ ఇంతియాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చలపతిని పరామర్శించారు. ఆయన భార్య జానకమ్మతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ కళారాణి, ఇన్చార్జి ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్ ఉన్నారు. బాధ్యులపై చర్యలెప్పుడో? ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఇంత వరకు కనీసం ప్రాథమిక చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు లేవు. బాధ్యులకు మెమోలు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగి ఇన్ని రోజులైతే చివరికి విషయం బయటకు పొక్కడం, మానవ హక్కుల కమిషన్ స్పందించడంతో గురువారం అధికారులు విచారణ చేపట్టిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే విచారణ నివేదికలను ఉన్నతాధికారులు పరిశీలించేదెప్పుడు..బాధ్యులపై చర్యలు తీసుకునేదెప్పుడు? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
భారీ తిమింగలం మృతి.. షాకింగ్ నిజాలు
ఓస్లో: నార్వే సముద్రతీరంలో ఇటీవల ఓ భారీ తిమింగలం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఇక బతికే అవకాశం లేకపోవడంతో మెరైన్ బయాలజిస్టులు దానికి కారుణ్య మరణం ప్రసాదించారు. అనంతరం.. దాని తీవ్ర అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బెర్జిన్కు చెందిన పరిశోధకులు ప్రయత్నించగా.. విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 30 ప్లాస్టిక్ బ్యాగులతో పాటు.. భారీ సంఖ్యలో మానవ వ్యర్థాలను తిమింగలం పొట్టలో గుర్తించారు. ఇలా భారీ సంఖ్యలో వ్యర్థాలను తీసుకోవడం మూలంగా.. తిమింగలం జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, దాని మృతికి కారణం ఇదే అని జంతు శాస్త్రవేత్త టెర్జీ లిస్లెవాండ్ తెలిపారు. 2050 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణమే ఎక్కువ ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ నివేదికలో వెల్లడించింది. -
సర్జరీ చేసిన 18 సంవత్సరాల తర్వాత!
హనోయ్: తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. ఆల్ట్రా సౌండ్ స్కాన్‌లో తన పొట్టలో 15 సెంటీమీటర్ల పొడవైన కత్తెర ఉందని తేలడంతో కళ్లు తేలేశాడు. అయితే.. అది తన పొట్టలోకి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే.. అది ఈనాటిది కాదు.. 18 సంవత్సరాల క్రితంది అని గుర్తుచేసుకున్నాడు. 1998లో జరిగిన కారు ప్రమాదంలో వియత్నాంకు చెందిన మా వాన్ నాట్(54) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి అతడి ప్రాణాలు కాపాడారు. అయితే.. ఆపరేషన్ నిర్వహించే సమయంలో అతడి పొట్టలో ఓ భారీ కత్తెరను వదిలేసి ముగించారు. ఆ సర్జరీ విషయమే మరచిపోయి హాయిగా ఉంటున్న వాన్ నాట్ ఇటీవల తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హనోయ్ సమీపంలోని ఓ ఆసుపత్రి వైద్యులు సుమారు 3 గంటల పాటు శ్రమించి అతడి పొట్టలో ఉన్న కత్తెరను తొలగించారు. గతంలో సర్జరీ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇన్నేళ్లు గడవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. -
ఉదరమే ఆధారం...
పొట్ట ఆధారంగా చేసే ఆసనాల సాధన ద్వారా అనూహ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి ఆసనాల గురించిన వివరణే.... 1. భుజంగాసన (కోబ్రా పోజ్) బోర్లా పడుకుని మకరాసనంలో చేతులు రెండు మడచి కుడిచేయిని ఎడమ చేతిమీద ఉంచాలి. చేతుల మీద గడ్డం ఆనించి తలకొంచెం లిఫ్ట్ చేసేటట్లుగా ఉంచాలి. పాదాల మధ్య రెండు లేదా మూడు అడుగుల దూరం, కాలి బొటన వేళ్ళు భూమికి దగ్గరగా ఉంచినట్లయితే పొత్తి కడుపు భాగం, తొడలు పూర్తిగా భూమికి ఆని విశ్రాంతి కలుగుతుంది. పొట్ట ఆధారంగా చేసే ఆసనాలకు మధ్య మధ్యలో ఇలా మకరాసనంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు పాదాలు రెండు కలిపి (వెన్నెముక లేదా సయాటికా సమస్య ఉన్నట్లయితే కాళ్ళు కొంచెం ఎడంగా ఉంచవచ్చు) అరచేతులు ఛాతీకిరువైపులా ఉంచి శ్వాసతీసుకుంటూ గడ్డాన్ని తలను పైకి లేపాలి. తరువాత చేతులు బలంగా నేలకు నొక్కుతూ మోచేతులు ఓపెన్ చేస్తూ ఛాతీని వీలైనంత పైకి లేపాలి. బొడ్డు నుంచి కిందకు నేలమీద పూర్తిగా ఆనేటట్లుగాను బొడ్డు నుంచి పై భాగాన్ని వీలైనంత పైకి లేపే ప్రయత్నం చేయాలి. (ఇది పూర్తి భుజంగాసన స్థితి). ఇలా కష్టం అన్పిస్తే మోచేతుల నుండి ముందు భాగం వరకూ పూర్తిగా రెండు చేతులను నేల మీద శరీరం ఇరువైపులా ముందుకు ఉంచి తలను ఛాతీని పైకి లిఫ్ట్ చేసే అర్థ భుజంగాసన ను ఎంచుకోవాలి. 1ఎ) భుజంగాసన: పూర్తి భుజంగాసన స్థితిలో ఉన్నప్పుడు తలను కుడివైపుకు తిప్పి కుడి భుజం మీదుగా వెనుక పాదాలను మళ్ళీ తలను ఎడమవైపుకు తిప్పి ఎడమ భుజం మీదుగా వెనుక పాదాలను చూసే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా పొట్ట ఛాతీభాగాలను తరువాత గడ్డంను నేలమీదకు తీసుకు రావాలి. శ్వాస తీసుకుంటూ తల ఛాతీ పైకి లేపడం, శ్వాస వదులుతూ తిరిగి నేల మీదకు మకరాసనంలో విశ్రాంత స్థితికి రావాలి. ఉపయోగాలు: నడుము కింది భాగంలో నొప్పి (లోయర్ బ్యాక్యేక్)కి ఉత్తమమైన ఆసనం. ఉదరం, చిన్నప్రేవులు, ప్రాంక్రియాస్, లివర్, గాల్‌బ్లాడర్‌కు టోనింగ్‌తో అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ, ఎడ్రినల్ గ్రంథులు సమర్థవంతంగా పనిచేయడానికి, కార్టిసోన్ హార్మోను ఉత్పత్తిని నియంత్రణకి వీలవుతుంది. కీళ్లనొప్పులకు, రెనిమాటిజమ్కు పరిష్కారం. స్త్రీలలో ఓవరీ, యుటరస్కు టోనింగ్ జరిగి రుతు చక్రసమస్యలకు. పొట్ట భాగంలో కొవ్వు తగ్గడానికి అవకాశం. జాగ్రత్తలు: గర్భిణీస్త్రీలు, పెప్టిక్ అల్సర్స్, హెర్నియా, ఇంటెస్టియల్ ట్యూబరోక్లోసిస్ ఉన్నవారు సాధన చేయరాదు. 2. సర్పాసన (స్నేక్ పోశ్చర్) మకరాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండి, గడ్డం నేల మీద ఆనించి చేతులు రెండూ వెనుకకు తీసుకువెళ్ళి ఇంటర్‌లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాళ్ళు రెండూ నేలకు గట్టిగా నొక్కుతూ, ఇంటర్‌లాక్ చేసిన చేతుల్ని గట్టిగా పుష్ చేస్తూ పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. చేతులు వేరే వాళ్లు గుంజుతూంటే ఎలాంటి అనుభూతి కల్గుతుందో అదేవిధంగా చేయడానికి ప్రయత్నించాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ మళ్ళీ క్రిందకు రావాలి. ఇలా 3/ 5 సార్లు రిపీట్ చేయవచ్చు. ఉపయోగాలు: వెన్నెముక బలపడటానికి, ఊపిరితిత్తులు, ఛాతీ, భుజాలు, పొట్ట భాగాలు స్ట్రెచ్ అవడానికి ఉపయోగపడుతుంది. భుజంగాసనం చేయడం వల్ల కలిగే లాభాలన్నీ సర్పాసనం చేయడం వల్ల కూడా కల్గుతాయి. - సమన్వయం: సత్యబాబు -
'టక్కు'టమారం
పరమ స్టైలిష్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా చొక్కాను ప్యాంటులోకి దోపే ట్రెండును టక్కు అంటారన్నది తెలిసిందే. ఈ టక్కుటమార విద్యను ప్రధానంగా అమ్మాయిలను ఆకర్షించడం కోసమే అంటారు అనుభవజ్ఞులు. అందుకే టక్కరులు ప్రదర్శించే ఫ్యాషను కాబట్టి దీనికి టక్కు అని పేరొచ్చిందని వ్యుత్పత్తిని బట్టి భాషావేత్తలు చెబుతుంటారు. టక్కులు పెక్కురకాలు. హృదయటక్కు. మీడియం టక్కు. లోబ్యాక్ టక్కు. బెల్‌బాటమ్స్ టైమ్‌లో గుండెకు ఇంచుమించు దగ్గరగా ఉండేది టక్కు. దీన్ని హృదయటక్కు అని పిలుచుకునేవారు. సాధన మీద ధ్యానం మూలాధారం నుంచి పైకి ప్రవహించినట్లే... ఏ సాధనా లేకుండానే టక్కు కిందికి జారింది. హృదయ టక్కు కొన్నాళ్లకు పొట్ట చేరి... ఇప్పుడు క్రమంగా నడుముకు జారింది. నడుము టక్కు లేదా లోబ్యాక్ టక్కు అన్నది ప్యాంటు నడుము కిందికి చాలా లోతుల్లోకి జారిపోతూ ఎక్కడో పాతాళంలో వేసినట్టుంది. అంతకంటే మరి కిందికి జారనివ్వవద్దని ఫ్యాషనేతరులు ఫ్యాషన్ ప్రియులను కోరుతున్నారు. బిక్కుబిక్కుమంటూ లో-వెయిస్టు టక్కరులను కోరుతున్నారు. అంతకు ముందు స్కూలు యూనీఫామ్ రూపంలో వేసే టక్కు కంటే టీనేజీలోకి వచ్చాక ఈ వయసులో టక్కుకు ఉండే ప్రాధాన్యం వేరు. ఆ దృష్టి వేరు. అందుకే ఇలాంటి బీటరులైన (బీటు కొట్టేవారైన) టక్కిస్టులు ప్రదర్శించే ట్రిక్కుటమార ఫ్యాషను కాబట్టి దీన్ని అనుసరించే వారిని టక్కరి అని పిలవవచ్చా అనేది ఒక హేతుబద్ధమైన సందేహం. నిజజీవితంలో అలాంటివారిని మనం ఎప్పుడూ చూడం గానీ... పాత సినిమాల్లో లెక్కలు చూసే గుమస్తాలు... ఒకనాటి మూవీలలోని ప్లీడర్లు చక్కగా పంచెకట్టుకుని మరీ టక్కువేసి... ఆ పంచె మీద బెల్టు కట్టేవారు. అంతకు ముందు అలవాటు లేకుండా కొత్తగా టక్కు మొదలు పెట్టినవారు కాస్త ఇబ్బంది ఇబ్బందిగా కదుల్తుంటారు. అస్తమానం టక్కు సర్దుకుంటుంటారు. ఇక టక్కుకు పునాదిలాంటి పొట్ట మరీ లోతుకుపోయినా కష్టమే. ముందుకు పొడుచుకువచ్చినా కష్టమే. కాబట్టి టక్కు అందరూ అనుకుంటున్నంత వీజీ కాదని విజ్ఞులు గ్రహించాలి. అయినా మితిమీరి మెక్కడం టక్కుకు చేటు తీసుకొస్తుందని ఫ్యాషనేతరులూ తెలుసుకోవాలి. వివాహానికి ముందు వేసిన టక్కును పెళ్లి తర్వాత కూడా కొనసాగించక తప్పదు. ఎందుకంటే ఇంతి లేని ఇల్లు... ఇన్‌షర్టు లేని డ్రస్సు చూడటానికి అంత బాగుండవని సామెత. కొందరు ఎప్పుడూ టక్కుతోనే కనిపిస్తారు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లుగా వీళ్లసలు టక్కుతోనే పుట్టారేమోనని డౌటొచ్చేలా ఉంటారు. వీళ్లను టక్కు లేకుండా గుర్తుపట్టలేం. వాళ్లు కూడా మనం గుర్తు పట్టేందుకు వీలుగా మన సౌలభ్యం కోసమే టక్ చేస్తారు. వీళ్లను నిత్యటక్కరులని అనుకోవచ్చు. టక్కు నాగరకతకు సూచన. కానీ మేధావులకు టక్కు నుంచి మినహాయింపు ఉంటుంది. వాళ్లు మాత్రం టక్కు వేయరు. ఈ టక్కు నిరసనకారులు కేవలం జీన్స్ మాత్రం తొడిగి దానిపై పొడవుగా, కాస్తంత ముతగ్గా ఉండే లాల్చీ వేస్తారు. లాల్చీ ముతకదనం అతడి మేధావి తనానికి అనులోమానుపాతంగా ఉంటుంది. అనగా... లాల్చి ఎంత ముతకదైతే అంత మేధావి అన్నమాట. ఇప్పుడంటే ఒకింత తగ్గిందిగానీ... గతంలో ఒక చేతి సంచీ కూడా ఈ అవతారానికి తోడయ్యేది. వీళ్లు టక్కును ఆహార్యపరంగా నిరసిస్తారు. టక్కు వేసిన వారి కంటే ఇలాంటి వారిని ‘టక్కు’న గుర్తుపట్టవచ్చు. టక్ టక్ మని తలుపు కొట్టి మాత్రమే లోపలికి ప్రవేశించాలన్నది జంటిల్మేన్ రూల్. కాబట్టి టక్ వేసుకోవడం కూడా జంటిల్మేన్ రూల్స్‌లో ఒకటిగా మారింది. టక్కుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్యాంటులోపలికి దోపుతాం కాబట్టి... అలా లోపలికి పోయే షర్టు భాగంలో ఎక్కడైనా రంధ్రం ఉన్నా, ఒకట్రెండు చిరుగులు ఉన్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. షర్టు కింది అంచు కుట్లు ఊడిపోయినా ఆ చొక్కాను ఉపయోగంలోకి తేవచ్చు. ఇది టక్కుకు ఉన్న సౌలభ్యం. కాకపోతే మనమైనా... ఇతరులైనా టక్కు పీకేయకుండా జాగ్రత్త పడాలి. అయితే టక్కుకు కొన్ని పరిమితులున్నాయి. కొన్ని జనరల్ రూల్స్ ఉన్నాయి. బనియన్‌కు టక్కు తప్పదు. లుంగీ మీద టక్కు నప్పదు. టక్కుకు షూ ఉండటం మేలు. చెప్పులైనా పర్లేదు. మనలో మన మాట చెప్పుల మీద టక్కు అంత ప్రభావపూర్వకంగా ఉండదు. అందుకే కొందరు షూ లేకపోవడం అనే కారణంగా టక్కు వేసుకోరు. ఇక టీ షర్టుకు, మామూలు ప్యాంటుకు టక్కు ఎంతమాత్రమూ కుదరదు. బెల్టుకూ ఇంచుమించూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇవన్నీ ఎవరూ రాయని జనరల్ రూల్స్. కానీ ఎవరికి వారు అర్థం చేసుకొని అందరూ పాటిస్తూ ఉంటారు. ఏది ఏమైనా టక్కు అంటే బంగారపు ఉంగరంలో పొదిగిన వజ్రంలాంటి ప్రెషియస్ స్టోన్ లాంటిది. వజ్రసంకల్పంతో టక్కు వేసేవారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదీ... పడిశెం పట్టే ముక్కు ఉన్నంత కాలం ఫ్యాషన్‌లో టక్కు ఉంటుంది. - యాసీన్ -
కడుపులో ఈతకొట్టే కొత్త రోబో..!
ఇజ్రాయెల్ః శరీర లోపలి భాగాలను పరీక్షించేందుకు ఎక్స్ రేలు, స్కానింగ్ లు తీయించే కాలం చెల్లి పోయింది. ప్రతి పనికీ రోబోను వినియోగిస్తున్నట్లే ఇకపై వైద్య పరీక్షల్లోనూ రోబోల ప్రాధాన్యత మరింత పెరగనుంది. ఇప్పుడు శరీరంలోని ఆరోగ్య పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతిచిన్న రోబోను సృష్టించారు. ఆ సూక్ష్మ పరికరం కడుపులో ఈతకొడుతూ, అన్నివైపులకు సంచరిస్తూ రోగికి సంబంధించిన ప్రతివిషయాన్నీ పరిశీలించి వివరాలను వెల్లడిస్తుంది. ఎస్ఏడబ్ల్యూ (సా..) పేరున తరంగంలా నడిచే రోబోను వైద్యపరీక్షలకోసం ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి. కడుపులో ఈత కొడుతూ వైద్య పరీక్షలు నిర్వహించే కొత్త రోబోను ఇజ్రాయెల్ నెగేవ్ (బిజియు) కు చెందిన బెన్-గురియన్ విశ్వవిద్యాలయం ఇంజనీర్లు మొదటిసారి అభివృద్ధి పరిచారు. ఈ అద్భుతమైన చోదక శక్తి కలిగిన పరికరం కడుపులో పైకీ కిందికీ పాకుతూ, ఇసుక గడ్డిలా ఉండే అస్థిరమైన భాగాల్లోనూ సంచరించగలిగేలా మొదటిసారి డిజైన్ చేశారు. సెకనుకు 57 సెంటీమీటర్ల వేగంతో సంచరించగలిగే ఈ రోబో కేవలం ఓ మోటార్ తో పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు దీన్ని మరింత సూక్ష్మంగా రూపొందిస్తే... వైద్యులు, సర్జన్లు.. రోగుల అంతర్గత పరీక్షలు నిర్వహించేందుకు ఉపయోగించేందుకు వీలుగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే పర్వతాల్లోనూ, కోస్ట్ గార్డ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు సైతం ఇటువంటి మైక్రోస్కోపిక్ రోబోను వినియోగించవచ్చని అంటున్నారు. తరంగం (వేవ్) లాంటి కదలికలు కలిగిన రోబోను రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తొంభై ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారని.. మెకానికల్ ఇంజనీరింగ్ బిజియు శాఖ, మరియు బయో ఇన్స్ పైర్డ్ అండ్ మెడికల్ రోబోటిక్ ల్యాబ్ హెడ్.. డాక్టర్ డేవిడ్ జరౌక్ తెలిపారు. ఇప్పుడు తాము వివిధ ప్రయోజనాలకోసం, వివిధ పరిమాణాల్లో వినియోగించే ఈ రోబోట్ ను రూపొందించి సక్సెస్ అయినట్లు చెప్తున్నారు. ఒక సెంటీమీటర్ లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉండే ఈ సూక్ష్మ పరికరం.. శరీరంలో ప్రవేశించి జీర్ణవ్యవస్థను పరిశీలించేందుకు, బయాప్సీ వంటివి నిర్వహించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే శోధన, సహాయక కార్యక్రమాల్లోనూ ఈ మైక్రోస్కోపిక్ రోబో వినియోగించేందుకు వీలుగా తయారు చేసినట్లు చెప్తున్నారు. -
‘మా పొట్ట కొడుతున్నారు’
అనంతపురం అర్బన్ : సమస్యలు పరిష్కరించకుండా, వేతన, ఇతర బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం, అధికారులు తమ పొట్టకొడుతున్నారని గోపాలమిత్రులు ధ్వజమెత్తారు. బకాయిలు చెల్లించాలని సోమవారం కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. గోపాల మిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ అధ్వర్యంలో జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ మాట్లాడారు. ప్రభుత్వం గోపాల మిత్రుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. అనంతరం జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్దీన్కి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ కోశాధికారి వెంకటనారాయణ, నాయకుల పెద్దన్న, గురివిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఉదర'భార'తం
పొట్ట పాట్లు ‘‘మేము మనిషిని నడిపిస్తాం. మేమే లేకపోతే మనిషి ఉన్న చోటనే రాయిలా పడి ఉంటాడు’’ బడాయి పోయాయి కాళ్లు. ‘‘మీ సాయంతో నడిచి వెళ్లిన వాడు ఏ పని చేయాలన్నా మమ్మల్ని నమ్ముకోవాల్సిందే. మేమే లేకపోతే కాలు గాలిన పిల్లిలా తిరుగుతాడు తప్ప వీసమెత్తు పని చేయలేడు’’ ఇంకా బడాయి పోయాయి చేతులు. ‘‘మీ ముఖం... ఎక్కడికెళ్లాలన్నా, ఏ పని చేయాలన్నా నేను దారి చూపితేనే మనిషి కదలగలిగేది’’ అంటూ కాళ్లుచేతుల కళ్లు తెరిపించాయి కళ్లు. ఇక దేహంలో ఒక్కొక్కటి నేనంటే నేనే కీలకం అని తమ ప్రాధాన్యాన్ని గుర్తు చేసుకున్నాయి. బడాయి కబుర్లతో ఆగిపోక అన్నీ కలిసి పొట్టను ఆడిపోసుకున్నాయి. ‘తినడం తప్ప నువ్వు చేసే పనేమిటి’ అని గేలి చేశాయి. పొట్ట తీవ్రంగా బాధపడింది. మనిషిని నిజంగా తన అవసరమే లేదా అని కుమిలిపోయింది. ఏమీ తినాలనిపించలేదు, తాగాలనిపించలేదు. రోజంతా అలాగే ఉండిపోయింది. మరుసటి రోజు... కాళ్లు చేతులు నిస్సత్తువగా కదల్లేకపోతున్నాయి. ఏమైందో తెలియడం లేదు వాటికి. కళ్లు నీరసంతో మూసుకుపోతున్నాయి. ఒక్కొక్క భాగం ఒకదాని బాధ ఇంకోదానితో చెప్పుకున్నాయి. అంతటికీ కారణం ఆహారం లేకపోవడమే అని నిర్ధారణకు వచ్చాయి. పొట్ట కూడా తాను ఊరికే తిని కూర్చోవడం లేదని, మనిషికి చాలా అవసరమైన భాగాన్ని అని తెలుసుకుని సంతోషించింది. అప్పటి నుంచి అన్ని భాగాలూ పొట్టను గౌరవించడం మొదలుపెట్టాయి. అమ్మమ్మ, నానమ్మలు ఈ కథను పిల్లలందరికీ చెప్పే ఉంటారు. బాగా అన్నం తిని ఆరోగ్యంగా పెరగాలనే సదుద్దేశంతో ఈ కథను బాగా ఒంటపట్టించేశారు కూడా. దాంతో ఈ తరం మగవాళ్లు పొట్టే ప్రధానం అనుకుంటున్నట్లు ఉన్నారు. పొట్ట పెంచని మగపురుషుడు కనిపించడం లేదు. ఎనభైలకు ముందు వందలో ఇరవై మంది పొట్టరాయుళ్లు కనిపించే వాళ్లు. వాళ్లకు సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవనం గడిపేవారిగా గౌరవమూ దక్కేది. తరం మారింది. తండ్రి పొట్ట చూస్తూ పెరుగుతున్నారు కొడుకులు. ‘మీసం లేకపోయినా ఫరవాలేదు, పొట్ట పెరగకపోతే మగాణ్ననిపించుకోలేనేమో’ అన్నట్లు పొట్ట మీద ప్రేమ ‘పెంచేసుకుంటున్నారు’. సినిమా హీరోలా ఉండాలని హెయిర్‌స్టయిల్ మారుస్తారు, షర్ట్ స్టయిల్ మారుస్తారు. మీసం తీసేస్తారు. పొట్ట కరిగించకపోతే గ్లామర్ జీరోనే అని మర్చిపోతారు. 21వ శతాబ్దం! ఏతావాతా తేలిందేమిటంటే... 21వ శతాబ్దపు ఆరంభంలో పొట్టకు ఎక్కడ లేని గౌరవమూ వచ్చేసింది. దేహంలో తానే ప్రధానం అన్నట్లు ముందుకు చొచ్చుకుని వచ్చేసింది. అప్పుడెప్పుడో 19, 20 శతాబ్దం వరకు బడాయి పోయిన కాళ్లు చేతులు ఇప్పుడు పొట్టకు అంగరక్షకులుగా ఆపసోపాలు పడుతున్నాయి. మనిషి నడుస్తుంటే పొట్టేమో ఠీవిగా ఉంటుంది. కొన్నిసార్లు చిన్న పిల్లల్లా చిలిపిగా చొక్కాలోంచి తొంగిచూస్తూ ఉంటుంది. అంత భారీ కాయాన్ని నడిపించలేక మోకాళ్లు అరిగిపోతున్నాయి. కాళ్ల కష్టాలను చూద్దామని కళ్లు ఆరాటపడుతుంటాయి. కానీ పాదాలు కనిపిస్తే కదా! ఇదీ మోడరన్ మగాడి రూపం. దేహానిదేముంది బుర్ర ప్రధానం. ఐటి సాఫ్ట్‌వేర్‌లో దూసుకుపోతున్న మేధ మా సొంతం. మా బుర్రలు పాదరసంలాంటివి అని కొత్తగా బడాయి పోవాలని ఓ ప్రయత్నమైతే చేస్తోంది ఈ తరం. ‘‘అవును, నిజ్జంగా నిజం, మీవి పాదరసంలాంటి బుర్రలే. తల మీద రూపాయి పెడితే పాదరసం కంటే త్వరగా జారి కింద పడుతుంది’’ అని ఏ అమ్మాయైనా కిసుక్కున నవ్వితే ముఖం బీట్రూట్ రంగులోకి మారుతుంది. అయినా... మగాడు మగాడే! ఎందుకంటే? తాను పెద్ద బెల్టుల కోసం మార్కెట్‌ని గాలిస్తూ, దువ్వెన అనే సాధనం ఒకటుంటుందని మర్చిపోయినా సరే భార్య నాజూగ్గా ఇలియానాలా ఉండాలంటాడు. ఇద్దరు పిల్లలు పుట్టి, ట్యూబెక్టమీ అయినా సరే... దేహం ఐదారు కేజీల బరువు పెరిగితే సహించలేడు. భార్య సమంతలా కరెంటు తీగలా లేదని వంకలు పెడుతుంటాడు. ప్చ్... మగాళ్లకు తెలియని సంగతి ఒకటుంది. తెలిసినా అంగీకరించని సంగతి కూడా! అదేంటంటే... ఆడవాళ్లలో ఒబేసిటీ మగాళ్లకెలా నచ్చదో... మగాళ్ల బట్టతల, బాన పొట్ట కూడా ఆడవాళ్లకు నచ్చవని! ‘అయినా... అతడు మారడు, అతడి వైఖరి మారదు’. ఆ ఒక్కటీ మారితే... భర్తకు బర్త్‌డే రోజు స్లిమ్ ఫిట్ చొక్కా బహుమతిగా ఇవ్వాలనే భార్యల కోరిక తీరుతుంది. బిడ్డలు పుట్టాక స్త్రీ రూపంలో అనివార్యంగా వచ్చే మార్పులను ఏమాత్రం సహించలేరు. బద్దకం పెంచుకుని తాము పెంచుకునే పొట్టలను పరిగణనలోకి తీసుకోరు. - వాకా మంజులారెడ్డి భార్య బరువు తగ్గినా ఆ ముఖం వెలగలేదు! సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్. ఓ భర్త తన భార్యకు విడాకులిచ్చేశాడు. విడాకులివ్వడానికి అతడు చెప్పిన కారణం ఏమిటంటే... ఇల్లు కొనుక్కుందామని దాచిన ఎనభై వేల రియాల్లతో బరువు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకుంది. అలాగని ఆ భార్య అమాయకురాలేమీ కాదు. టీచరుగా ఉద్యోగం చేస్తోంది. ఆమె తన దేహం మీద అంత పెద్ద ప్రయోగానికి ఎందుకు సిద్ధపడింది? ఈ సాహసం ఆమె తనకు తానే చేసిందా? అంటే... దీనికంతటికీ కారణం భర్త పోరే. అతడు తరచుగా భార్య స్థూలకాయాన్నే ప్రస్తావించడమేనని గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ చేసింది. బరువు తగ్గి సన్నగా మారి భర్తను సర్ప్రైజ్ చేయాలనుకున్నదామె. భర్త బదిలీ మీద వేరే ఊరికి వెళ్లడంతో ఆ సమయంలో బరువు తగ్గించే సర్జరీకి వెళ్లింది. సెలవులకు ఇంటికొచ్చిన భర్త నాజూకుగా కనిపించిన భార్యను చూసి ఉబ్బి తబ్బిబ్బై పోయాట్ట. కానీ ఆపరేషన్ కోసం తను దాచుకున్న డబ్బును ఖర్చు చేసినట్లు తెలియగానే ఆయన గారి సంతోషం ఆవిరైపోయింది. ‘స్థూలకాయం వద్దు సన్నదనమే ముద్దు’ అనడం వరకు ఓకే, కానీ తన డబ్బు తనకు అంతకంటే ముద్దు అని చెప్పకనే చెప్పుకున్నాడు. ఆ భర్త నిర్వాకాన్ని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ అతడిలో చలనం కనిపించడం లేదు. -
18 ఏళ్లుగా మహిళ కడుపులో కత్తెర!
శస్త్రచికిత్స చేసి తొలగించిన స్టాన్లీ ఆస్పత్రి వైద్యులు టీనగర్: ఎవరికైనా కడుపులో ఏముంటుందని ప్రశ్నిస్తే పేగులు, అవయవాలు ఉంటాయని ఠకీమని చెప్పేస్తాం. కానీ కడుపులో కత్తెర కూడా ఉంటుందని మీకు తెలుసా ? వైద్యుల నిర్వాకానికి నిదర్శనం ఈ ఘటన. తండయార్‌పేట తిలకర్నగర్ సునామి క్వార్టర్స్‌కు చెందిన సరోజ (60) పూల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమెకు గతంలో డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో కడుపులో కత్తెరను అలాగే పెట్టి కుట్లు వేశారు. రెండేళ్ల క్రితం ఆమెకు అనారోగ్యంగా ఉండగా స్కాన్ చేసినప్పుడు కడుపులో కత్తెర ఉన్నట్లు తేలింది. అయితే ఆమె పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుండడంతో మళ్లీ ఆపరేషన్ చేయించుకుంటే వ్యాపారం దెబ్బతింటుందని ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచి 18 ఏళ్లుగా నొప్పిని భరించింది. పేదరికంతో ఉండడం వల్ల ఆపరేషన్ అంటే మళ్లీ ఎక్కడ డ బ్బులు ఖర్చు అవుతాయయోనని అలాగే ఉండిపోయింది. ఆమెకు శనివారం తీవ్ర కడుపునొప్పి రావడంతో స్టాన్లీ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు స్కాన్ చేయగా కడుపులో కత్తెర ఉండడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. వైద్యులు కడుపులో ఉన్న కత్తెరను తొలగించి ఆమెకు బాధ నుంచి విముక్తి కల్పించారు. -
బీర్లు తాగడం వల్ల వచ్చే పొట్ట... ‘బీర్ బెల్లీ’!
మెడిక్షనరీ తరచూ బీర్ తాగే వారికి పొట్ట పెరుగుతుంది. దీన్నే వాడుక భాషలో బీర్ బెల్లీ అంటుంటారు. అయితే బీర్ తాగడంతో పాటు అత్యధికంగా క్యాలరీలు తీసుకోవడం వల్ల కూడా ఇది వస్తుంది. కుండలా పెరగడం వల్ల ఇలా పెరిగే పొట్టను పాట్ బెల్లీ అని కూడా అంటుంటారు. వైద్య పరిభాషలో దీన్ని అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ అని కూడా చెబుతారు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, మితిమీరి తినడం, ఒంటికి తగినంత పనిచెప్పకపోవడం... ఇలా కారణం ఏదైనా బీర్ బెల్లీ మాత్రం ప్రమాదకరమే. గుండెజబ్బులు, హైబీపీ, డయాబెటిస్... ఇలా ఎన్నో వ్యాధులకు బీర్బెల్లీ ఒక రిస్క్ ఫ్యాక్టర్. పొట్టదగ్గర చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే ప్రమాదం కలిగించే పొట్ట ఉన్నట్లుగా భావించి తగిన జీవనశైలి మార్పులు చేసుకోవాలి. -
బొజ్జ బాగోతం
సిరిసంపదలకు చిరుబొజ్జే ఆనవాలు అనే నమ్మకం నానా నాగరికతల్లో అనాదిగా ఉన్నదే. తరాలు మారినా, యుగాలు మారినా ఈ నమ్మకంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగని ఇదేమీ మూఢనమ్మకంలాంటిది కాదు. సిరిసంపదలకు అనులోమానుపాతంగా ‘మగా’నుభావుల పొట్టపెరగడం ఒక సహజ పరిణామం. కొందరు పుడుతూనే నోట్లో వెండిచెమ్చాతో పుడతారు. వాళ్లకు బాల్యావస్థలోనే బొజ్జపెరగడం మొదలవుతుంది. ఇంకొందరు యవ్వనదశలోనూ చువ్వల్లా చురుగ్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఢక్కామొక్కీలు తిని ఉంటారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఇక విజృంభిస్తారు. ఈ తిప్పలన్నీ దేనికంటారు? జానెడు పొట్ట కోసం కాదూ! అన్ని రుచులూ తృప్తిగా ఆరగించకపోతే ఈ దిక్కుమాలిన సంపాదనంతా దేనికోసమంటారు? లోకంలో ఎవరేమనుకుంటే నాకేం..? ఎవరెలా పోతే నాకేం..? చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష! ఇదిగో! ఇలా అనుకోవడం వల్లనే చాలామంది జానెడు పొట్టను బానలా పెంచేసుకుపోతారు. పెళ్లయిన కొత్తలో కొసరి కొసరి వడ్డించే భార్య ‘చిరుబొజ్జే సింగారం’ అంటుంటే తెగ మురిసిపోతూ రెచ్చిపోయి మరీ భోజన ప్రతాపాన్ని ప్రదర్శిస్తారు. కొన్నేళ్లు గడిచాక చూసుకుంటే ఏముంటుంది? బానెడు పొట్ట... ఆ పొట్టతో పాటు వచ్చే నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, సుగర్, బీపీ... వగైరా వగైరా ఉచిత బహుమతులు. అసలే ఉచితంగా వచ్చిన బహుమతులాయె! వదిలించుకుందామనుకున్నా ఒక పట్టాన వదిలి చావవు. పుట్టినప్పుడు పొట్ట అందరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. ఎదిగే క్రమంలోనే మార్పులు వస్తాయి. అలాగని జానెడు పొట్ట గాలి నింపిన బెలూన్లా అమాంతం ఒకేసారిగా ఉబ్బిపోదు. జిహ్వచాపల్యం ఆపుకోలేక దొరికినదల్లా నమిలి మింగేస్తూ ఉంటేనే... ఇంతై ఇంతింతై అన్నట్లుగా బానపొట్ట తయారవుతుంది. అదేపనిగా కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని హెచ్చరించిన పెద్దలు ఆ పని వల్ల పొట్ట బానలా పెరిగిపోతుందని, అది ఒక పట్టాన తరగదని హెచ్చరించకపోవడం నిజంగా ఒక చారిత్రక అపరాధం. పెద్దల మాట చద్దిమూట అంటారు గానీ, ఈ రోజుల్లో పెద్దల మాటలు, చద్ది మూటలు ఎవరికి రుచిస్తున్నాయి గనుక? పిజ్జా బర్గర్ల కాలం వచ్చిపడ్డాక స్కూళ్లకు వెళ్లే పిల్లకాయలు కూడా బొజ్జగణపయ్యల్లా తయారవుతున్నారు. అసలు బొజ్జగణపయ్యకు తొలిపూజలు చేయడం ఆచారంగా వస్తున్నందు వల్లే మన దేశంలో బొజ్జకు గ్లామర్ పెరిగిందేమోనని అనుమానం! బానపొట్టల సమస్య మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, అన్ని దేశాల్లోనూ ఉన్నదే. అమెరికాది అగ్రరాజ్యాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. అగ్రరాజ్యాలు ఇప్పుడిప్పుడే ఈ సమస్యను గుర్తించి, పొట్టలు కరిగించే దిశగా చర్యలు ప్రారంభిస్తున్నాయి. మన దేశంలో మాత్రం ఈ సమస్యపై ఏలినవారు ఇంకా కళ్లు తెరవలేదు. అఫ్కోర్స్, మన దేశంలో బానపొట్టలకు రెట్టింపు సంఖ్యలో వీపులను అంటుకుపోయే సైజ్‌జీరో పొట్టలూ ఉన్నాయనుకోండి. సైజ్‌జీరో పొట్టల్లో ముఖ్యంగా రెండురకాలు కనిపిస్తాయి. గ్లామర్ కోసం కష్టపడి కడుపు మాడ్చుకుని సాధించేవి కొన్నయితే, తప్పనిసరి పస్తుల వల్ల మలమలమాడి ఎండిన పొట్టలు మరికొన్ని. మాడిన పొట్టల్లో కాస్త ఆహారం నింపితే చాలు ఆరోగ్యంగా కోలుకుంటాయి. అయితే, బానపొట్టలను కరిగించి ఆరోగ్యకరంగా ఆరుపలకలతో అలరారేలా తీర్చిదిద్దడం అంత వీజీ కాదు గురూ! అసలే మగజన్మలకు బతుకే పెనుభారం. చిన్నప్పుడు చదువుల భారం. చదువు పూర్తయ్యాక ఉద్యోగ భారం. ఉద్యోగ భారం ఇంకా అలవాటు కాకముందే పెళ్ళయ్యాక మీదపడే సంసార భారం. అలాంటిది జానెడున్న పొట్ట కాస్త బానెడుగా విస్తరిస్తే, ఆ నడమంత్రపు అదనపు భారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదు. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమవుతుంది. ఎలాగోలా శక్తి కూడదీసుకుని గునగునమని వీధిలో నడుస్తూ ఉంటే గమనించే కుర్రకారు ‘కొబ్బరిబొండాం’ వంటి బిరుదులతో బహిరంగ రహస్యంగా సత్కరించేస్తారు. తెల్లారగట్లే వాకింగ్‌కు వెళ్దామనే ఉంటుంది. వీధిలో పాడు కుక్కలు వెంటపడితే పరుగు లంఘించుకునే శక్తి ఉండదు కదా! అందుకే ఆ కార్యక్రమానికి వాయిదా పడుతుంది. ఆరుపలకలేం అక్కర్లేదు గానీ, చదునైన ఏకపలక పొట్ట దక్కితే చాలురా భగవంతుడా! అని మొరపెట్టుకోని రోజు ఉండదు. జిమ్‌లో చేరాలనే ఉంటుంది. బరువులను చూస్తే భయం, గుండెదడ మొదలవుతాయి. అయినా తెగించి, బరువులెత్తితే ఆయాసం ముంచుకొస్తుంది. పొట్ట కరగడం దేవుడెరుగు! ఒంటినొప్పులు మొదలవుతాయి. సిరిసంపదలకు చిరుబొజ్జే ఆనవాలు అనే నమ్మకం నానా నాగరికతల్లో అనాదిగా ఉన్నదే. తరాలు మారినా, యుగాలు మారినా ఈ నమ్మకంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగని ఇదేమీ మూఢనమ్మకంలాంటిది కాదు. సిరిసంపదలకు అనులోమానుపాతంగా ‘మగా’నుభావుల పొట్టపెరగడం ఒక సహజ పరిణామం. కొందరు పుడుతూనే నోట్లో వెండిచెమ్చాతో పుడతారు. వాళ్లకు బాల్యావస్థలోనే బొజ్జపెరగడం మొదలవుతుంది. ఇంకొందరు యవ్వనదశలోనూ చువ్వల్లా చురుగ్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఢక్కామొక్కీలు తిని ఉంటారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఇక విజృంభిస్తారు. ఆబగా సిరిసంపదలను పోగేసుకుంటారు. బ్యాంకులో డబ్బును దాచుకున్నంత భద్రంగా ఒంట్లో కొవ్వును దాచుకుంటారు. వాళ్లకు సంప్రాప్తించిన నడమంత్రపు సిరిలాగానే, వాళ్ల నడమంత్రపు బొజ్జ కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. బొజ్జబాబులందరూ బొజ్జలు కరగాలని కోరుకుంటూ ఉంటారు. నానా దేవుళ్లకీ మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఇందులో వింతేమీ లేదు. ఈ ‘పైసా’చిక లోకంలో కొందరు మాత్రం దేశంలో బొజ్జలు వర్ధిల్లాలంటూ బొజ్జగణపయ్యకు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకైనా మంచిదని భారీ బొజ్జతో అట్టహాసాన్ని చిందించే లాఫింగ్ బుద్ధుడిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. బొజ్జలు కరిగించడమే వాళ్ల వ్యాపారం. జిమ్ పరికరాలతో కొందరు, లిపోసక్షన్స్ అంటూ ఇంకొందరు పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలతో ఊదరగొట్టేస్తూ ఉంటారు. సిటింగుకు ఐదు కిలోల చొప్పున అరడజను సిటింగుల్లోనే ఎంతటి భారీ బొజ్జలనైనా అవలీలగా కరిగించేస్తామంటూ నమ్మబలుకుతూ ఉంటారు. బొజ్జలోనే కాదు, ఒంట్లో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా రిటైల్‌గా, హోల్‌సేల్‌గా కరిగించేస్తాం అంటూ టీవీ ప్రకటనల్లో బొద్దుగుమ్మల చేత చెప్పిస్తారు. బొర్ర తప్ప బుర్ర పెరగని బకరాలు అలాంటి ప్రకటనలను అమాయకంగా నమ్మేస్తారు. అక్కడికి వెళితే పొట్ట కరిగినా కరగకపోయినా, పర్సు కరగడం మాత్రం ఖాయం. మరీ ఆత్రపడి, కొవ్వు తొలగించుకోవడానికి కోతలకు సిద్ధపడితే ప్రాణాల మీదకు వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. - పన్యాల జగన్నాథ దాసు -
కడుపులో క్రిములున్నా.. ఒంటి మీద దురద!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ఉద్యోగరీత్యా రాత్రిపూట పనిచేస్తుంటాను. దీనివల్ల సమయానికి భోజనం చేయలేకపోతున్నాను. ఎండోస్కోపీ చేయిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - అనిల్‌కుమార్, మిర్యాలగూడ ఆధునిక జీవనశైలిలో మార్పుల 40 శాతం మంది గ్యాస్ట్రిక్ వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. జీర్ణకోశంలో నోటి నుంచి మలమార్గం వరకు ఒక ట్యూబ్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ ఆహారమార్గంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటుంటారు. కారణాలు: మానసిక ఒత్తిడి, పొగతాగడం, మద్యం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, భోజన వేళలు సరిగా పాటించకపోవడం, రాత్రివేళలలో ఎక్కువసేపు మేల్కొని ఉండటం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, రక్తంగడ్డకట్టడంలో లోపాలు, నొప్పి నివారణమాత్రలు, యాంటీబయాటిక్స్ మందులు ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. లక్షణాలు: కడుపులో నొప్పి, మంట, కడుపులో ఉబ్బరం, ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, మలబద్దకం, కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు కావడం, బరువు తగ్గడం, ఉదయంపూట వాంతి వచ్చినట్లు ఉండటం, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే అది గ్యాస్ట్రిక్ అల్సర్‌కు దారితీయవచ్చు. మలంలో రక్తంపడటం కూడా జరగవచ్చు. నాభి పైభాగంలో నొప్పి ఈ సమస్యలో కనిపించే ప్రధానమైన లక్షణం. జీర్ణకోశం లోపల ఉండే సున్నితమైన మ్యూకోజల్ పొరలో వాపు, కమిలిపోవడం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువగా స్రవించడం దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య తీవ్రమైతే పుండు కూడా పడవచ్చు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు: రోగి లక్షణాలను బట్టి ఎక్స్‌రే, ఎండోస్కోపీ, ఎఫ్టీఎమ్, మలపరీక్ష, అమీబియాసిస్, సీబీపీ, ఈఎస్సార్, ఎల్ఎఫ్టీ, అల్ట్రాసౌండ్స్కానింగ్, కొలనోస్కోపీ, సీటీస్కాన్ లాంటి పరీక్షలు చేస్తారు. నివారణ మార్గాలు: ఆహారం విషయంలో సమయపాలన, మద్యం-పొగతాగే అలవాట్లను మానివేయడం, మిత వ్యాయామం, కారం, మసాలాలకు దూరంగా ఉండటం, రోజుకు 6-8 గంటలు పాటు సరైన నిద్ర, మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రాణాయామం, ధ్యానం చేయడం వంటివి అనుసరించాలి. చికిత్స: హోమియోలో అంకురం నుంచి చికిత్స చేస్తారు. నవీన పద్ధతుల్లో వ్యాధి నిర్ధారణ, కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా మానసిక ఒత్తిడి, పేగులోని పుండ్లు మానేలా చేయడం ద్వారా వ్యాధిని అదుపు చేస్తారు. శారీరక, మానసిక లక్షణాలను బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం వల్ల రోగి త్వరగా కోలుకుంటారు. డాక్టర్ మురళి అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ స్కిన్ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. నా చేతుల వేళ్లు విపరీతంగా దురద పెడుతున్నాయి. దాంతో చేతులను ఎప్పుడూ రుద్దుకుంటూ ఉంటున్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - కుమారస్వామి, తణుకు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు అలర్జీకి సంబంధించిన కాంటాక్ట్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. బహుశా దుమ్ము, ధూళి, డిటర్జెంట్, పుప్పొడి వంటి ఏవో అంశాలు మీకు సరిపడకపోవడం వల్ల మీకు విపరీతమైన దురద వస్తుండవచ్చు. మీరు ఒకసారి ఈ కింద పేర్కొన్న వైద్య పరీక్షలు చేయించాలి. అవి... సీబీపీ అబ్సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్ మలపరీక్ష. కొన్నిసార్లు మన కడుపులో లేదా పేగుల్లో ఏవైనా క్రిమికీటకాలు, పరాన్నజీవులు ఉండటం వల్ల కూడా ఇలా ఒంటి మీద దురద వస్తుంటుంది. చికిత్స: మీకు సరిపడవని తెలిసిన అంశాల నుంచి దూరంగా ఉండండి. (అంటే ఉదాహరణకు డిటర్జెంట్, దుమ్ము, పుప్పొడి వంటివి) మీ కడుపులో ఉండే క్రిములు పడిపోవడానికి ఆల్బెండిజోల్ 400 ఎంజీ మాత్రలు నోటి ద్వారా తీసుకోవాలి వైద్య పరీక్షల్లో ఒకవేళ మీ ఇజినోఫిల్ కౌంట్ ఎక్కువని తేలితే మాంటెలుకాస్ట్ వంటి యాంటీహిస్టమైన్ మందులను రెండు నుంచి నాలుగు వారాల పాటు వాడాలి ఏదైనా ర్యాష్ వంటివి వస్తే వేళ్ల మీద మూడు రోజుల పాటు మోమాటజోన్ క్రీమ్ రాయాలి ప్రతి రోజూ చేతుల మీద మాయిష్చరైజింగ్ క్రీమ్ వాడుతుండాలి. అప్పటికీ సమస్య తగ్గకపోతే వెంటనే చర్మ నిపుణులను సంప్రదించండి. నా రెండు చేతుల మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తే చాలాసేపు గీరుకున్నాను. దాంతో నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. నా చర్మం మామూలయ్యేందుకు ఏం చేయాలి? - పద్మ, నిజామాబాద్ మీరు చెబుతున్న కండిషన్‌ను పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది తగ్గడానికి పాటించాల్సిన సూచనలు: సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్ను డార్క్ మార్క్స్ ఉన్నచోట బాగా రాయండి ఎండకు ఎక్స్పోజ్ అయ్యే చోట ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యానం రాయండి కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీములు అప్లై చేయండి ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రతిరోజూ తీసుకోండి.ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. మీరు అలర్జీని అదుపులో ఉంచుకునే మందులూ వాడాలి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా కూతురి వయసు 36 ఏళ్లు. ఆమెకు పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇప్పటికి ఐదుసార్లు గర్భం వచ్చింది. కానీ ప్రతిసారీ ఏడో వారంలో గర్భస్రావం అయ్యింది. ఈ తర్వాత ఏడాదికి గర్భం వచ్చింది కానీ ఈ సారి తొమ్మిదోవారంలో గర్భస్రావం అయ్యింది. చివరిసారిగా రెండేళ్ల క్రితం గర్భం వచ్చి ఎనిమిది వారాలకు గర్భస్రావం అయ్యింది. ఆమెకు మాటిమాటికీ గర్భస్రావం కావడానికి కారణాలు ఏమిటి? నా కూతురికి గర్భం వస్తుందా, రాదా? - ఒక సోదరి, మహబూబ్‌నగర్ గర్భం రావడం, గర్భస్రావం కావడం మూడు సార్లు వరసగా జరిగితే దాన్ని వరస గర్భస్రావాలు (రికరెంట్ మిస్క్యారేజెస్) అంటారు. సాధారణంగా మన సమాజంలో ఒక శాతం మందిలో ఇలా జరుగుతుంటుంది. మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ గర్భస్రావం అయ్యే అవకాశాలూ పెరుగుతుంటాయి. అండాల సంఖ్య, నాణ్యత... ఈ రెండూ తగ్గుతుండటం వల్ల జరిగే ప్రక్రియ ఇది. చాలా సందర్భాలలో దీనికి కారణాలు తెలియవు. అయితే రెండు శాతం నుంచి ఐదు శాతం మందిలో దీనికి క్రోమోజోముల్లో సమస్య ఉండటం కారణం కావచ్చు. ఇలా మాటిమాటికీ గర్భస్రావాలు అవుతున్న మహిళల్లో 15 శాతం మందిలో యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ కారణంగా ఇది జరుగుతుంది. ఇదేగాక రక్తానికి, గర్భసంచి (యుటెరైన్)కి సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. ఒకవేళ క్రోమోజోమస్ సమస్యలు ఉంటే ప్రీ-నేటల్ పరీక్షలు లేదా ఐవీఎఫ్, ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ వంటివి చేయాలి. ఒకవేళ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఉంటే తక్కువ మోతాదులో ఆస్పిరిన్, హెపారిన్ వంటి మందులు వాడటం వంటివి ఉపయోగపడతాయి. ఒకసారి మీ అమ్మాయికి అన్నిరకాల పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమె గర్భస్రావాలకు నిర్దిష్టమైన కారణం బయటపడితే దాన్ని అనుసరించి చికిత్స చేయాలి. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్ -
చిన్నారి కడుపులో 'మెటల్' బాల్..!
కడుపు నొప్పితో బాధపడుతున్న చిన్నారికి వైద్యులు పెయిన్ కిల్లర్స్ తో చాలాకాలం వైద్యం నిర్వహించారు. అయితే మందులకు ఏమాత్రం తగ్గకపోగా నొప్పి పెరుగుతుండటంతో చివరికి అనుమానం వచ్చి...ఎక్స్ రే తీయించారు. కడుపులో కనిపించిన బంతిలాంటి ఆకారం చూసి విస్తుపోయారు. ఎన్నో రకాల మెటల్ వస్తువులు, అయిస్కాంతాలు ఒక్కచోటికి చేరి పేరుకుపోవడమే చిన్నారి నొప్పికి కారణమని గుర్తించారు. శస్త్ర చికిత్స నిర్వహించి ఆయా వస్తువులను బయటకు తీశారు. చిన్నపిల్లలు మట్టి, సుద్దముక్కలు వంటివి తినడం మనం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్ మధురకు చెందిన మూడేళ్ళ బాలుడు ఏది కనిపిస్తే అది కడుపులో వేసుకున్నట్టున్నాడు. అందుకే ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు అతడి పేగుకు చుట్టుకుపోయిన 29 అయిస్కాంతం ముక్కలు, ఓ బ్యాటరీ, ఓ కాయిన్ తోపాటు మరెన్నో చిన్న చిన్న వస్తువులను బయటకు తీశారు. నొప్పితో బాధపడుతున్న చిన్నారిని నెల క్రితం తల్లిదండ్రులు ఢిల్లీకి దగ్గరలోని ఫరీదాబాద్ మెట్రో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పట్లో అతడికి మొదటిసారి ఎక్స్ రే తీశారు. స్కానింగ్ లో అతడి కడుపులో పేరుకుని ఉన్న పెద్ద మెటల్ బాల్ లాంటి ఆకారాన్ని చూసి డాక్లర్లు ఆశ్చర్యపోయారు. ఫరీదాబాద్ మెట్రో హస్పిటల్ లోని లాప్రోస్కోపిక్ సర్జరీ హెడ్.. డాక్టర్ బ్రహ్మ దత్ పాఠక్... చిన్నారి కడపులోని వస్తువులను గుర్తించారు. సుమారు ఓ సంవత్సరం నుంచి బాలుడికి ఇటువంటి వస్తువులు తినే అలవాటు ఉన్నట్లుగా ఉందని... మాగ్నెట్లన్నీ ఓచోట చేరి బంతి ఆకారంలో మారి, చిన్నారి నొప్పికి కారణం కావడమే కాక, కడుపులోని ఇతర భాగాలను సైతం పాడుచేస్తుండటాన్ని డాక్టర్లు గమనించారు. 'ఇది చాలా సమస్యాత్మకమైన కేసు. అయస్కాంతాలన్నీ చుట్టుకుపోవడం వల్ల చిన్నారి పేగు పూర్తిగా పాడైపోయింది. శస్త్ర చికిత్స చేయడానికి సుమారు మూడు గంటలు పట్టింది. మా వైద్య బృందం అంతా కలిసి ఆ చిన్ని పొట్టనుంచి ఒకదాని తర్వాత ఒకటిగా వస్తువులు తీస్తూనే ఉన్నాం.' అని డాక్టర్ పాఠక్ చెప్పారు. చిన్నారి కుటుంబ సభ్యులు జ్యువెలరీ బాక్స్ లు తయారు చేసే వ్యాపారం ఇంట్లోనే చేస్తుంటారని, దీంతో నేలపై పడిన ప్రతి వస్తువునూ చిన్నారి తినేయడం వల్లనే ఈ సమస్య వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. మెటల్ వస్తువులు అతి చిన్నవిగా ఉంటే రోజువారీ కాలకృత్యాల్లో బయటకు వెళ్ళిపోయి ఉండేవని, పెద్దవిగా ఉండటంతో కడుపులోనే పేరుకు పోవడంతో.. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు అంటున్నారు. ఇప్పటికైనా పేగు చాలాశాతం తినేయడంవల్ల చిన్నారి ఎక్కువకాలం నొప్పితో బాధపడే అవకాశం ఉందని, తగ్గడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుందని వైద్యులు చెప్తున్నారు. శస్త్ర చికిత్స అనంతరం చిన్నారి కుటుంబ సభ్యులు కూడ అతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ అతడికి అందకుండా జాగ్రత్త పడుతున్నారు. -
ఎంత తక్కువ తిన్నా పొట్ట తగ్గడం లేదు...
ఆయుర్వేదం కౌన్సెలింగ్ ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. అది తింటే జలుబు చేస్తుందని కొంతమంది అంటున్నారు. ఆయుర్వేదశాస్త్రం ప్రకారం ఏది నిజం? వివరాలు తెలియజేయగలరు. - మృదుల, హైదరాబాద్ ఆయుర్వేద శాస్త్రానుసారం శరీరానికి ఆరోగ్యప్రదాయకమైన ఓషధులలో అత్యంత శ్రేష్ఠమైనది ‘ఉసిరికాయ’. దీనికి సంస్కృతంలో అనేక పర్యాయపదాలున్నాయి. ఉదాహరణకు ఆమలకీ, ధాత్రీ, అమృతా, పంచరసా, శ్రీఫలీ, వయస్యా, శివాచ, రోచని మొదలైనవి. ఉసిరికాయ తింటే జలుబు చేస్తుందనడం కేవలం అపోహ మాత్రమే. వాస్తవానికి అది జలుబును తగ్గిస్తుంది. షడ్రసాలలో ఒక్క లవణరసం (ఉప్పు) మినహాయించి మిగిలిన ఐదు రసాలూ ఉసిరికాయకు ఉంటాయి. అవి... మధుర (తీపి), ఆమ్ల (పులుపు), తిక్త (చేదు), కటు (కారం), వగరు (కషాయరసం). దీనికి కరక్కాయకూ (హరితకీ) సమాన గుణధర్మాలు ఉంటాయి. కానీ కరక్యాయ ఉష్ణవీర్యం. ఉసిరికాయ శీతవీర్యం. గుణధర్మాలు: ఉసిరికాయ అత్యంత శ్రేష్ఠమైన ‘రసాయనం’. అంటే సప్తధాతువులకు పుష్టిని కలిగించి ఓజస్సును వృద్ధి చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. శుక్రవృద్ధిని చేసి సంతానప్రాప్తికి కారకమవుతుంది. శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆకలిని పుట్టించి, అరుగుదలను పెంచుతుంది. కడుపులోని మంటను, వాయువుని, పుల్లటి తేన్పుల్ని తగ్గిస్తుంది. వాంతిని పోగొడుతుంది. ఉదరశూలను కూడా తగ్గిస్తుంది. పొట్టలోని పురుగులను నశింపజేస్తుంది అనీమియాను, పచ్చకామెర్లను, మొలలను హరిస్తుంది. ఉసిరితో కంఠస్వరం మెరుగుపడుతుంది. ఎక్కిళ్లు తగ్గుతాయి. దగ్గు, జ్వరాలు, కళ్లెపడటం, శిరోజాలు నెరవడం, చర్మం పొడిబారడం, దద్దుర్లు, మచ్చలు తగ్గుతాయి. హృదయానికి పుష్టికరం. మధుమేహవ్యాధి నియంత్రణలో దీన్ని పసుపుతో కలిపి వాడుతారు. మూత్రంలో మంట, మూత్రం కష్టంగా వెడలడం, అతిమూత్రవ్యాధులలో గుణం కనిపిస్తుంది. మంచి ఫలితాల కోసం: వాడేవారి వయసును బట్టి, కోరుకున్న ఫలితాన్ని బట్టి తీసుకోవాల్సిన మోతాదును ఆయుర్వేద వైద్యుడు నిర్ణయిస్తారు. ఏ రూపంలో సేవించాలి: స్వరసం: అంటే పండినకాయలోంచి గింజను తీసి, దంచి, రసం తీస్తారు. కల్కం: అంటే పిక్కను తొలగించిన పిదప మిగిలిన గుజ్జు, చూర్ణం: పిక్కలు తొలగించి ఆ ముక్కలను బాగా ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఔషధశాలలు ప్రత్యేకంగా తయారు చేసే విధానాలు: ఆమలకీఘృతం బ్రహ్మరసాయనం (లేహ్యం) అగస్త్యహరీతకీ రసాయనం (లేహ్యం) చ్యవనప్రాశలేహ్యం. మోతాదు: ఉసిరికాయలో ‘విటమిన్ సి’ చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా, పైన పేర్కొన్న వివిధ రూపాలలోకి మార్చినప్పటికీ చాలా తక్కువ శాతం మాత్రమే ఆ విటమిన్ తగ్గుతుంది. ఎక్కువ శాతం అలాగే ఉంటుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయస్సు 28 ఏళ్లు. నన్ను పొట్ట సమస్య బాధిస్తోంది. నేను ఎంత తక్కువ మోతాదులో తింటున్నా పొట్ట మాత్రం తగ్గడం లేదు. ఎందుకు ఇలా? - సుధాకర్, ధర్మవరం పొట్ట పెరగడం అనేది సాధారణంగా శరీర తత్వాన్ని బట్టి వస్తుంది. అలాంటప్పుడు మీరు ఎంత తక్కువ ఆహారం తీసుకున్నా పొట్ట తగ్గక పోవడం జరగవచ్చు. అయితే ఇందులో కొవ్వు కాకుండా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో చూడటానికి మీరు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షలో ఎలాంటి లోపాలు లేకపోతే మీరు భయపడనవసరం లేదు. ఇది మన శరీరతత్వాన్ని బట్టి వస్తుంది. కానీ మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకొని, సమయానికి భోజనం చేయడం వంటివి పాటించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మీరు మీ దగ్గరలోని డాక్టర్‌ను కలిసి ఇతర రక్త పరీక్షలు కూడా చేయించుకుంటే మంచిది. సాధారణంగా మన ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో నిర్ణయించుకోడానికి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎంత ఆహారం తీసుకుంటాం, ఎంత ఖర్చవుతోంది, ఈ రెండు సమంగా ఉన్నాయా లేదా అనే విషయం కూడా చూసుకోవాలి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే పొట్ట వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి మీరు మీ దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి ఆహార నియమాలు పాటించి చూడండి. నాకు 37 ఏళ్లు. కడుపులో నొప్పి, బరువు తగ్గడం ఉంటే డాక్టర్‌ను కలిస్తే చిన్న పేగులో క్షయ ఉందన్నారు. ఆరు నెలలపాటు మందులు వాడాను. ఇది పూర్తిగా తగ్గుతుందో లేదో తెలుపగలరు. - రామమోహన్‌రావు, శ్రీకాకుళం సాధారణంగా చిన్న పేగు క్షయ వల్ల పేగులో పుండ్లు తయారవుతాయి. ఇది టీబీ మందుల వల్ల పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. అలా కాకుంటే చిన్న పేగుల్లో స్ట్రిక్చర్ మాదిరిగా వస్తే టీబీ నియంత్రణలోకి అప్పుడప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాని ప్రస్తుతం లభించే క్షయ మందులు వ్యాధిని పూర్తిగా తగ్గించగలవు. మీరు వెంటనే దగ్గరలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి మందులు వాడుతుంటే మీ సమస్య పరిష్కారమవుతుంది. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. నాకు గత ఏడాదిగా తరచుగా తలనొప్పి వస్తుంది. సాధారణ తలనొప్పే కదా అంతగా పట్టించుకోలేదు. తలనొప్పి మళ్లీ మళ్లీ వస్తుండటంతో మాకు దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించాను. డాక్టర్ రాసిచ్చిన మందులు వాడితే తాత్కాలికంగా ఉపశమనం లభిస్తోంది. రెండు మూడు రోజుల తర్వాత తలనొప్పి పునరావృతం అవుతోంది. అసలు నొప్పి ఎందుకు వస్తుంది? దయచేసి నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలరు. - భవాని, కొత్తపేట తరచుగా తలనొప్పి వస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చాలా కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, రక్త ప్రసరణలో మార్పులు చేటు చేసుకోవడం, మెదడులో కణుతులు ఏర్పడటం వంటి కారణాలతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తలలోకి రక్తనాళాలు ఒత్తిడికి గురికావడం వల్ల మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్‌లో తలకు ఒక పక్కభాగంలో నొప్పి ఉంటుంది. స్త్రీలలో ఈ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తలలోకి రక్తనాళాలు ఒత్తిడికి గురికావడం వల్ల మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్‌లో తలకు ఒక పక్కభాగంలో నొప్పి ఉంటుంది. స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు తరచుగా తలనొప్పి వస్తుందని తెలిపారు కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే న్యూరో ఫిజీషియన్‌ను సంప్రదించండి. ముందుకు మీకు ఏ కారణంతో తలనొప్పి వస్తుందో తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు, సిటీ స్కాన్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. పరీక్షలు వచ్చిన ఫలితం ఆధారంగా చికిత్స అందిస్తారు. సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారణ చేసుకోండి. మీకు ఏదైనా వ్యాధి నిర్థారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం తలనొప్పి సంబంధించిన అన్ని వ్యాధులకు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్సను కొనసాగిస్తూ వైద్యుల సూచన మేరకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సాధ్యమైనంత వరకు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు కుటుంబపరంగా, ఉద్యోగపరంగా ఏమైనా ఒత్తిడికి గురవుతుంటే ముందుగా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నించండి.. డాక్టర్ జి. రాజశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ -
మూసాకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: డ్రగ్స్ తో పట్టుబడ్డ దక్షిణాఫ్రికా మహిళ మూసాకు 8 వ మెట్రో పాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మూసాను విచారించేందుకు నార్కోటిక్ అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపధ్యంలో మూసాకు 14 రోజుల రిమాండ్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా మూసా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అధికారులు ఈ రోజు ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఆమె నుంచి 45 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని నార్కోటిక్ సూపరింటెండెంట్ దినేష్ చౌహాన్ తెలిపారు. మూసా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు. -
కడుపులో కత్తి పెట్టి కుట్టేసిన డాక్టర్
-
కడుపు నిండా డ్రగ్స్ ప్యాకెట్లే!
సాక్షి, హైదరాబాద్: సినీఫక్కీలో మాదకద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన దక్షిణాఫ్రికా మహిళ మూసా కడుపు నుంచి మొత్తం 40 డ్రగ్స్ ప్యాకెట్లను బయటికి తీశారు. ఎనిమా ఇచ్చి ఇప్పటికే 18 ప్యాకెట్లు వెలికితీసిన వైద్యులు సోమవారం మరో 22 ప్యాకెట్లను తీశారు. రూ.50 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పొత్తికడుపులోకి చొప్పించుకొని వస్తున్న మూసా(32).. ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. అధికారులు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకురాగా ఆదివారం రాత్రి 18 డ్రగ్ ప్యాకెట్లను తీశారు. సోమవారం ఆమెకు మళ్లీ అల్ట్రాసౌండ్, సిటిస్కాన్ చేశారు. మరికొన్ని ప్యాకెట్లు లోపలే ఉన్నట్లు నిర్ధారించి, మరోసారి ఎనిమా ఇచ్చారు. దీంతో 22 ప్యాకెట్లు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోసారి స్కాన్ చేస్తామని, కడుపులో ప్యాకెట్లు లేకపోతే డిశ్చార్జి చేస్తామని వెల్లడించాయి. పరీక్షల కోసం ల్యాబ్‌కు.. మూసా కడుపు నుంచి బయటికి తీసిన డ్రగ్స్ ప్యా కెట్లను నార్కొటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. చిన్న పరిమాణంలో ప్యాకెట్లు చేయడంతో అది కొకైన్ అయి ఉంటుం దని అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను మహిళ ఎక్కడికి తరలిస్తోందన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
బయటపడుతున్న కొకైన్ ప్యాకెట్లు
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ మూసియా మూసా శరీర భాగం నుంచి కొకైన్ ప్యాకెట్లు బయటపడుతున్నాయి. దుబాయి నుంచి కొకైన్ అక్రమ రవాణా చేస్తూ దక్షిణాఫ్రికాకు చెందిన మూసా అనే మహిళ నిన్న దొరికిపోయిన విషయం తెలిసిందే. ఉస్మానియ ఆస్పత్రి నుంచి మూసా శరీరం నుంచి ఇప్పటి వరకూ 24 కొకైన్ ప్యాకెట్లను వైద్యులు వెలికి తీశారు. కాగా అదుపులోకి తీసుకున్న మూసాను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. వైద్యులు తొలుత ఆమెకు సీటీ స్కాన్, ఆ తర్వాతా ఎండోస్కోపీ చేశారు. కడుపులో ఆరు ప్యాకెట్ల మాదక ద్రవ్యాలున్నట్లు గుర్తించారు. వీటిని జననేంద్రియం, మలద్వారం నుంచి పొత్తి కడుపులోకి ప్రవేశపెట్టినట్లు గుర్తించారు. నిన్న సెలవు రోజు కావడంతో ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న వైద్యులే పొత్తి కడుపులో ఉన్న ఒక ప్యాకెట్‌ను బయటికి తీశారు. మిగిలిన ప్యాకెట్లు తీయడం సాధ్యం కాకపోవడంతో సర్జికల్ వార్డుకు తరలించారు. రాత్రి ఏడు గంటలకు 'ఎనిమా' ఇచ్చారు. దాంతో మలద్వారం నుంచి 16-20 (క్యాప్సూల్స్ రూపంలో ఉన్నవి) డ్రగ్స్ బయట పడ్డాయి. ఒక్కో క్యాప్సూల్ ఒక అంగుళం మందం నుంచి మూడు అంగుళాల పొడవు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ప్యాకెట్లు సహజంగా బయటకు రాకుంటే పొత్తికడుపు కింది భాగంలో శస్త్రచికిత్స చేసి వెలికి తీయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు. -
కడుపులో డ్రగ్స్ దాచుకుని పట్టుబడ్డ మహిళ
హైదరాబాద్: సినీఫక్కీలో డ్రగ్స్ ను తరలిస్తున్న ఓ మహిళను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. మాదక ద్రవ్యాలను కడుపులో పెట్టుకుని తరలించడానికి ప్రయత్నించిన విదేశీ మహిళ పోలీసులకు చిక్కింది. వివరాలు.. మూసియా మూసా(32) అనే నైజీరియా మూలాలున్నఅమెరికా మహిళ ఈకే 526 ఎమిరేట్స్ విమానంలో ఆదివారం ఉదయం దుబాయ్ మీదుగా శంషాబాద్ చేరుకుంది. అనంతరం సదరు మహిళను అధికారులు తనిఖీ చేయగా నివ్వెర పోయే విషయాలు వెలుగు చూశాయి. మహిళ శరీరంలో లక్షల రూపాయిలు విలువైన బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం కస్టడీలో తీసుకున్న పోలీసులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. బ్రౌన్ షుగర్ ను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ఆమెకు ఇంజక్షన్లు ఇచ్చి బ్రౌన్ షుగర్ ప్యాకెట్లను తీసేందుకు యత్నాలు ఆరంభించారు. అగస్టు 23న జొహెన్నెస్ బర్గ్ నుంచి దుబాయ్‌కు మూసా వెళ్లింది.అదే రోజు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అదే రోజు మళ్లీ జొహెన్నెస్ బర్గ్‌కు తిరిగి వెళ్లిపోయింది. అగస్టు 29న గౌరలహాస్ నుంచి దుబాయ్‌కు చేరుకుంది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చింది.తన ఫ్లైట్ టికెట్లో ఎక్కడా అడ్రస్‌ను మూసా మెన్షన్ చేయలేదు. ప్రస్తుతం 100 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్లను మాత్రమే బయటకు తీశామని.. ఇంకా 500 గ్రాముల వరకూ బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు ఉండే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవేళ ఇంజక్షన్ల ద్వారా సాధ్యం కాకపోతే సర్జరీ చేసి బయటకు తీయాల్సి వస్తుందని అంటున్నారు. ఆ బ్రౌన్ షుగర్ విలువ దాదాపు రూ. 50 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
కడుపులో డ్రగ్స్ దాచుకుని పట్టుబడ్డ మహిళ
-
60 ఏళ్లుగా కడుపులో పిండం!
వాషింగ్టన్: 91 ఏళ్ల వృద్ధురాలు 60 ఏళ్లుగా కడుపులో పిండాన్ని మోస్తోంది! చిలీకి చెందిన ఎస్తెలా అనే మహిళ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. కడుపులో కణతి ఉందేమోనన్న అనుమానంతో వైద్యులు కొన్ని రోజులు చికిత్స చేశారు. అయితే ఫలితం లేకపోవటంతో ఎక్స్‌రే, ఇతర పరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్భాశయంలో పిండం ఉండటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అరవై ఏళ్లుగా ఆమె ఆ పిండాన్ని మోస్తోందని వైద్యులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్తెలా తన కడుపులోకి పిండం ఎలా వచ్చిందో తెలియదని పేర్కొంది. తను, తన భర్త పిల్లల కోసం ఎంతో ఎదురుచూసినా పిల్లలు కలగలేదని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె వయసు దృష్టా శస్త్రచికిత్స చేసి పిండాన్ని తొలగించటం ప్రమాదకరమని, ఇన్నాళ్లు ఉన్నట్లే ఉంచటం నయమని వైద్యులు వెల్లడించారు. -
ఆరోగ్యం చిక్కడం ఎలా..?
కాస్త బొద్దుగా ఉన్నంత మాత్రాన తప్పేమీ లేదు. అయితే ఆ బరువు ఒక పరిమితికి లోపు ఉంటేనే అది ఆరోగ్యానికి సూచన. కానీ అదేపనిగా లావెక్కుతున్న కొద్దీ మధుమేహం, హైబీపీ వంటి మహాలావు అనారోగ్యాలు వస్తుంటాయి. అప్పుడు చిక్కితేనే ఆరోగ్యమూ మీ ఒంటికి చిక్కుతుంది. లావుకు పరిమితి ఏమిటో... అది మించితే వచ్చే అనర్థాలు ఎలా ఉంటాయో తెలిపేందుకే ఈ ప్రత్యేక కథనం. పొట్ట పెరగడం మరింత ప్రమాదకరం... పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో కేవలం పొట్ట చర్మం కిందనేగాక పొట్ట కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు పెరిగిపోయే హైపర్ లిపిడేమియా అనే కండిషన్లు.... సాధారణ స్థూలకాయం ఉన్నవారిలో కంటే పొట్ట పెరిగిన వారిలోనే వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మామూలు స్థూలకాయంతో పోలిస్తే పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం (పొట్ట పెరగడం) మరింత ప్రమాదకరం. మనమే లావెక్కే పరిస్థితులకు ఉదాహరణలివి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా లిఫ్టులు, ఎస్కలేటర్లు వాడుతున్నాం. టీవీ దగ్గరికి పోకుండానే ఛానెళ్లు మార్చేందుకు రిమోట్ ఉపయోగిస్తున్నాం.స్నానానికి నీళ్లు తోడుకోనవసరం లేకుండా నల్లా (కొళాయి), షవర్స్ ఉన్నాయి.కార్లో దూరప్రయాణం చేస్తూ... కనీసం కారైనా దిగకుండా భోజనాన్ని నోటి దగ్గరకు తెప్పించుకుంటున్నాం. దగ్గరి దూరాలకు కూడా వాహనాలను వాడుతున్నాం. ఇవన్నీ మనకు మనం తెచ్చిపెట్టుకున్న సుఖదుఃఖాలు. వీటిలో కొన్నింటిని నివారించుకోవచ్చు. ఉదాహరణకు... మన ఆరోగ్యం కోసం లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, టీవీ దగ్గరికి వెళ్లి ఛానెల్ మార్చడం, దగ్గరి దూరాలకు వాహనం ఉపయోగించకపోవడం వంటివి. జీవితాన్ని సుఖవంతం చేయడానికి ఇవన్నీ ఉన్నప్పుడు వీటినెందుకు ఉపయోగించుకోకూడదు అనే ప్రశ్న ఎవరైనా వేయవచ్చు. ఉదాహరణకు చేతికర్రను ఒక వయసు దాటిన తర్వాత పడిపోకుండా ఉండటం కోసం ఉపయోగిస్తాం. అంతేగానీ... ఎంత అందంగా ఉన్నా, ఖరీదైనదైనా అందుబాటులో ఉందికదా అని దాన్ని ఉపయోగించం కదా. అలాగే మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, గుండె శస్త్రచికిత్స జరిగినవారూ, ఇతరత్రా కారణాలతో మెట్లు ఉపయోగించలేనివారే లిఫ్ట్‌లను ఉపయోగించాలి. ఇలా మన జీవనశైలిని మనమే మార్చుకోగలిగితే మేలు. లావెక్కే క్రమంలో మన చేతుల్లో లేని పరిస్థితులివి... జన్యుపరమైన అంశాలు ఎండోక్రైన్ సమస్యలు మందుల దుష్ర్పభావం. వీటిని నివారించుకోవడం మన చేతుల్లో లేదు. మనం స్థూలకాయులమా కాదా తెలుసుకోవడం ఎలా? సాధారణంగా ఒక వ్యక్తి స్థూలకాయుడా, కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని కొలవడమూ చాలా సులభమే. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో తీసుకోవాలి. ఆ విలువను అతడి ఎత్తు స్క్వేర్తో భాగించాలి. స్క్వేర్ అంటే అదే సంఖ్యను మళ్లీ అదే సంఖ్యతో గుణించడమన్నమాట. ఎత్తు విలువను మీటర్లలో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 130 కిలోలు. అతడి ఎత్తు 1.8 మీటర్లు అనుకుందాం. అప్పుడు అతడి బీఎమ్ఐ విలువ = 130 / 1.8 గీ 1.8 = 40.12 కి.గ్రా./మీ2. ఇప్పుడు ఈ విలువను బీఎమ్ఐ పట్టికలోని విలువలతో సరిపోల్చుకుని మీరు ఏ స్థూలకాయ స్థాయిలో ఉన్నారో నిర్ణయించుకోవచ్చు. (పైన పేర్కొన్న విలువ వ్యాధిగ్రస్థ స్థూలకాయం కిందికి వస్తుందన్నమాట). ఇలా ఎవరికి వారు తమ బరువును, ఎత్తును కొలుచుకుని తాము పరిమితికి మించి బరువున్నారా లేదా అన్నది తెలుసుకోవచ్చు. బీఎమ్ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మన బీఎమ్ఐ తక్కువగా ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అనారోగ్యకరమైన ఆహారం అంటే... కొద్దిమోతాదుల్లో తీసుకున్నప్పటికీ పోషకవిలువలు తక్కువగా ఉండి, క్యాలరీలు ఎక్కువగా ఉండి... మనం బరువు పెరగడానికి తోడ్పడే ఆహారాన్ని అనారోగ్యకరమైన ఆహారంగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు అవి... క్యాలరీలు తప్ప పోషకాలు లేని శుద్ధిపరిచిన (రిఫైన్డ్ ) ఆహారపదార్థాలు కొవ్వులు, ఐస్‌క్రీమ్‌లు, కేకులు, స్వీట్స్ చక్కెర ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి హాని చేసే బిస్కెట్లు, చాక్లెట్లు, క్యాండీలు, కుకీలు, కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింకులు, కృత్రిమంగా తయారు చేసిన జ్యూసులు పిజ్జాలు, బర్గర్లు నూనెలో ఎక్కువసేపు (డీప్‌గా) వేయించిన పదార్థాలు (వడలు, పూరీలు, సమోసాలు, బజ్జీలు, బంగాళదుంప చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్).. ఇవన్నీ అనారోగ్యకరమైన ఆహారాలన్నమాట. ఇక భారతీయుల విషయానికి వస్తే తళతళ మెరిసే తెల్ల అన్నం కూడా అనారోగ్యకరమైనదే. భారతీయులకు వరి అన్నం ప్రధానాహారమే. కానీ దాన్ని శుద్ధిపరచడం వల్ల (బాగా రిఫైన్ చేయడం వల్ల) మెతుకులు పోషకాలన్నీ కోల్పోయి తెల్లగా తళతళలాడుతూ కనిపిస్తుంటాయి. అంతే ఈ అన్నంలో క్యాలరీలు తప్ప, పోషకాలేమీ లేవన్నమాట. ఇలాంటి తెల్ల అన్నం తినడం వల్ల స్థూలకాయ సమస్య, చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధనల్లో తేలింది. అనారోగ్యకరమైన ఆహారాన్ని అప్పుడప్పుడు తీసుకోవచ్చా? అనారోగ్యకరమైన ఆహారం ప్రమాదకరమని అనుకున్న తర్వాత అప్పుడప్పుడూ కొంచెం కొంచెం తీసుకోవచ్చా అని అడిగితే?... అది ప్రమాదకరం అని తెలిసి కూడా తీసుకోవచ్చని మీరు భావిస్తే తీసుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వ్యసనాల వంటివి. వ్యసనాలను వదిలించుకోవడం అంత సులభం కాదు. కాబట్టి అప్పుడప్పుడైనా తీసుకోవాలా, లేదా అని మీకు మీరే నిర్ణయించుకోవాలి. ఎంత తిన్నాం అన్నది కాదు... ఏమి తిన్నాం అన్నది ముఖ్యం (శక్తి సమతుల్యత) శరీరం నిత్యం కొంత శక్తిని ఖర్చు పెడుతూనే ఉంటుంది. మనం నిద్రలో ఉన్నా కూడా కొంత శక్తి ఖర్చవుతూనే ఉంటుంది. ఈ శక్తిని బేసల్ మెటబాలిక్ రేట్ లేదా బేసల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది మనిసి ఎత్తు, బరువు, వయసు, కండరాల పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది సరాసరి 1000 నుంచి 1500 క్యాలరీల మధ్య ఉంటుంది. కొంతమందిలో ఇది 2500 క్యాలరీల వరకు కూడా ఉండవచ్చు. మనిషి జబ్బుపడినా, కొన్ని రకాల మందులు వాడినా, కండరాలను బలపరిచే వ్యాయామం చేసినా బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఇది తగ్గుతుంది. అవసరాన్ని బట్టి శరీరం బేసల్ మెటబాలిక్ రేట్‌ను పెంచుకోగలదు లేదా తగ్గించుకోగలదు. బేసల్ మెటబాలిక్ రేట్కూ, శరీరంలో ఉష్ణం ఉత్పత్తి కావడానికి ఖర్చయ్యే శక్తిని, మనం రోజూ ఇతర పనులకోసం (వ్యాయామం, రోజువారీ పనులు) ఉపయోగించే శక్తిని కలిపితే ‘టోటల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్’ వస్తుంది. శక్తి సమతుల్యతను కాపాడే హార్మోన్లు, శరీర బరువును అవి నిర్ణయించిన ‘‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజీ’’ దగ్గరే ఉంచడానికి, అవసరమైతే అధికంగా తీసుకున్న క్యాలరీలను కరిగించి ఉష్ణం రూపంలో శరీరంలో నుంచి బయటకు పంపించేస్తాయి. ఈ ప్రక్రియ శరీరంలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు మీ బేసల్ మెటబాలిక్ రేట్ 1300 క్యాలరీలు అనుకోండి. మీది శారీరక శ్రమ లేని జీవనశైలి అనుకోండి. దీనికి తగ్గట్టుగా మీరు రోజుకు 2300 క్యాలరీలు తీసుకుంటున్నారనుకోండి. అంటే మీరు వ్యాయామం చేయకపోగా, ప్రతిరోజూ అవసరమైన దాని కంటే 1000 క్యాలరీలు అధికంగా తీసుకుంటున్నారన్నమాట. ఇలా అధికంగా తీసుకున్న ఈ క్యాలరీలను శరీరం కరిగించకపోతే, రోజుకు 111 గ్రాముల బరువు, నెలకు 3.3 కిలోలు, ఏడాదికి 40 కిలోల కొవ్వు శరీరంలో పేరుకుంటుంది. కానీ మీరు అంత బరువు పెరగడం లేదు. శక్తి సమతుల్యతను కాపాడే హార్మోన్లు, ఈ అధికంగా తీసుకున్న క్యాలరీలను ఉష్ణం రూపంలోకి మార్చి సమతుల్యతను కాపాడుతుంటాయి. శక్తి సమతుల్యతను ఇంత పకడ్బందీగా కాపాడుతున్నప్పటికీ మనం బరువు ఎందుకు పెరుగుతాం? ఎందుకంటే మనం ఎంత తీసుకున్నామనే విషయం కంటే ఏమి తీసుకున్నాం అన్న అంశమే చాలా ముఖ్యం. అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు ‘కొవ్వు సెట్ పాయింట్’ను పెంచుతాయి. అంటే బర్గర్లు, పిజ్జాలు, నూనెతో నిండిన ఆహారపదార్థాలు తినకముందుకంటే తిన్న తర్వాత ‘ఫ్యాట్ సెట్ పాయింట్’ పెరుగుతుంది. అంటే వీటిని తినకముందు కంటే తిన్న తర్వాత, పెరిగిన ‘ఫ్యాట్ సెట్ పాయింట్’ దగ్గర కొవ్వును ఉంచడానికి సరిపడా టోటల్ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్‌ను ఈ హార్మోన్లు తగ్గిస్తాయి. ఉదాహరణకు మీకు రోజుకు 2300 క్యాలరీలు అవసరం. అందులో 1300 క్యాలరీలు జీవక్రియలకు (బేసల్ మెటబాలిక్ రేట్‌కు) పోగా మిగిలిన 1000 క్యాలరీలను ఉష్ణం రూపంలోకి ఈ హార్మోన్లు మారుస్తున్నాయనుకుందాం. ఇప్పుడు అదనంగా 200 క్యాలరీలను ఇచ్చే ఆయిల్ ఫుడ్‌ను మీరు తిన్నారు. దీని కారణంగా ‘ఫ్యాట్ సెట్ పాయింట్’ కొంచెం పెరిగింది. అంటే మొత్తం 2500 కాలరీలను ఇచ్చే ఆహారం తీసుకున్నారు. ఇప్పుడు హార్మోన్లు పెరిగిన ‘ఫ్యాట్ సెట్ పాయింట్’ను దృష్టిలో ఉంచుకుని, ఆ మేరకు ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకోడానికి సిద్ధమవుతాయి. ఇప్పుడు మీరు వ్యాయామం చేసి 200 క్యాలరీలను ఖర్చుపెట్టారనుకుందాం. అప్పుడు మీ శరీరం మొత్తం 2500 ఖర్చు పెట్టాలి. (1300 క్యాలరీలు జీవక్రియల కోసం; 1000 క్యాలరీలు ఉష్ణం రూపంలో; ఇక మిగతా 200 క్యాలరీలు వ్యాయామం రూపంలో). కానీ సెట్‌పాయింట్ పెరిగి, శరీరం ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకోడానికి సిద్ధపడటం వల్ల హార్లోన్లు, జీవక్రియల్లో మార్పులు తెచ్చి, జీవక్రియల కోసం, ఉష్ణం రూపంలో ఖర్చు పెట్టే శక్తిని తగ్గించేస్తాయి. పెరిగిన ఫ్యాట్ సెట్ పాయింట్ మేరకు ఎంతైతే కొవ్వును అదనంగా నిల్వ ఉంచాలో, ఆ మేరకు శరీరం తక్కువ క్యాలరీలను ఖర్చుపెడుతుంది. అంటే 2500 క్యాలరీలకు బదులు అంతకంటే తక్కువ క్యాలరీలను శరీరం ఖర్చుపెడుతుంది. అంటే అనారోగ్యకరమైన ఆహారం తిని, ఆ మేరకు వ్యాయామం చేసినప్పటికీ మనం బరువు పెరుగుతామన్నమాట. అదే అనారోగ్యకరమైన ఆహారాన్ని మరింత ఎక్కువ మోతాదు లో తింటూపోతే.. ఫ్యాట్ సెట్ పాయింట్ ఇంకా ఎక్కువ పెరగడం వల్ల, బరువు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన ఆహారం కొంచెం ఎక్కువ తీసుకున్నప్పటికీ, ఫ్యాట్ సెట్ పాయింట్లో మార్పు లేకపోవడం వల్ల, హార్లోన్లు అదనంగా వచ్చిన క్యాలరీలను ఉష్ణం రూపంలోకి మార్చి బయటకు పంపించేయడం వల్ల బరువు పెరగరు. అందుకే మనం బరువు పెరుగుతామా లేదా అన్నది మనం ఎంత తింటాం అన్న అంశం మీద గాక... ఎలాంటి ఆహారం తింటాం (అనారోగ్యకరమైనదా లేక ఆరోగ్యకరమైనదా) అనే అంశంపై ఆధారపడి ఉంటుందన్నమాట. లావు ఇప్పుడు ప్రపంచ సమస్య... పరిమితికి మించి బరువుగా ఉండటాన్ని స్థూలకాయం లేదా ఊబకాయం అంటుంటాం. ఈ స్థూలకాయంతో వస్తున్న సమస్యలు కేవలం భారతీయులకు మాత్రమే పరిమితం కాదు. డబ్లూహెచ్ఓ 2014 నాటి లెక్కల ్రపకారం ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారిలో 39 శాతం మంది పరిమితికి మించిన బరువున్నారు. ఇది ఇప్పటికే ముంచుకువచ్చిన, మున్ముందు రాబోతున్న పెనుముప్పునకు ఒక సూచన. జనం ఎందుకిలా లావెక్కుతున్నారు... ఒకనాడు మనం తప్పనిసరిగా శారీరక శ్రమ చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు మనం స్థూలకాయ సమస్యను తెచ్చి పెట్టుకునే వాతావరణంలో జీవిస్తున్నాం. మనం జీవితాన్ని సుఖమయం చేసుకోవడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నాం. నూటికి 90 పాళ్లు మనం తెచ్చిపెట్టుకున్న పరిస్థితులతోనే లావెక్కుతున్నాం. మిగతా 10 పాళ్లు మన నియంత్రణలో లేని విషయాలు. కాబట్టి మన చేతిలో ఉన్న పరిస్థితులను మార్చుకుంటే లావెక్కకుండా ఉండవచ్చు. ఆరోగ్యప్రమాదాలను నివారించుకోవచ్చు. అనేక వ్యాధులకు దారితీసే ఒక వ్యాధే స్థూలకాయం మనం అనుకుంటున్నట్లుగా లావు అన్నది కేవలం అందానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. అది ఆరోగ్యానికి సంబంధించిన అంశం. బీఎమ్ఐ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత, బీఎమ్ఐ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయ వ్యాధి బారిన పడినట్టే లెక్క. లావెక్కువగా ఉండటం వల్ల వచ్చే దుష్పరిణామాలపైన కూడా మన ప్రజల్లో అంతగా అవగాహన లేదు. స్థూలకాయం ప్రమాదకరం. స్థూలకాయంతో 65 రకాలకు పైబడి వ్యాధులు వస్తాయి. డయాబెటిస్ (షుగర్), రక్తపోటు (హైబీపీ), రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గుండెపోటు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా (గురక), డిప్రెషన్, హెర్నియా వంటి అనేక వ్యాధులకు స్థూలకాయం ఒక కారణం. లావుగా ఉన్న మహిళలలో ప్రసవం కష్టమవుతుంది. అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువ. స్థూలకాయం కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారి తీయవచ్చు. మిగతావారితో పోలిస్తే స్థూలకాయుల్లో ఆయుఃప్రమాణం 5 ఏళ్ల నుంచి 20 ఏళ్లు తగ్గిపోయే అవకాశం ఉంది. పైగా స్థూలకాయం వల్ల వచ్చే కొన్ని వ్యాధుల వల్ల 50 శాతం నుంచి 100 శాతం వరకు లైఫ్ రిస్క్ ఉంటుంది. అందుకే స్థూలకాయాన్ని నివారించుకోవాల్సిందే. ఇన్ని రకాల వ్యాధులకు కారణమవుతున్నందు వల్లనే అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు దీన్ని 2013లో ఒక వ్యాధిగా గుర్తించారు. కొందరు తక్కువ తింటున్నా లావుగా ఎందుకుంటారు? మనం రోజూ చేసే పనులకూ, మన శరీరం నిర్వహించే జీవక్రియలకు అవసరమైన శక్తి కోసం మనం ఆహారం తీసుకోవాలి. అది పేగుల్లో జీర్ణమై, రక్తంలోకి ఇంకుతుంది. ఒక మనిషికి రోజుకు సగటున 2,300 క్యాలరీల శక్తి అవసరం. ఒకవేళ మనం అవసరానికి మించి క్యాలరీలను ఇచ్చేలా ఆహారాన్ని తీసుకుంటే, శరీరం తన అవసరాలకు ఉపయోగించుకున్నది పోగా మిగతాదాన్ని కొవ్వు రూపంలోకి మార్చుకుని నిల్వ చేసుకుంటుంది. అయితే మనం ఎంత బరువుండాలి, మన శరీరంలో ఎంత కొవ్వుండాలని అన్నది మనం స్వతహాగా మనసుతో నియంత్రించలేం. అది కొన్ని వేల జన్యువులు, కొన్ని వందల హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. ఈ హార్మోన్లలో ముఖ్యమైనవి జీర్ణవ్యవస్థలో తయారయ్యే గ్రెలిన్ జీఎల్పీ-1 (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1) గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ పెప్టైడ్ వైవై కొలికిస్టోకైనిన్ అమైలిన్ కొవ్వు కణాలలో తయారయ్యే లెప్టిన్ అడిపోనెక్టిన్... మొదలైనవి. ఈ జన్యువులు, హార్మోన్లను జీర్ణవ్యవస్థ, కాలేయం, ఎముకలు, కండరాల నుంచి వచ్చే సంకేతాలూ ప్రభావితం చేస్తాయి. ఈ సంకేతాలు... మనం తీసుకునే ఆహారం, మనం చేసే శారీరక శ్రమను బట్టి మారుతూ ఉంటాయి. చక్కెర తగ్గించండి... చక్కని ఆరోగ్యం పొందండి... మనం చక్కెరను కూడా కాస్త ఎక్కువే వాడతాం. కాఫీలు, టీలు, కూల్డ్రింకులు, ఎనర్జీడ్రింకులు, బిస్కెట్లు, క్యాండీలు, కుకీలు, కృత్రిమజ్యూసులు, ఐస్‌క్రీములు, కేకులు, స్వీట్లు మొదలైన ఆహారపదార్థాల్లో చక్కెరపాళ్లు అధికం. మనకు రోజూ అవసరమైన క్యాలరీలలో చక్కెర పాళ్లు ఐదు శాతానికి మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేస్తోంది. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు హార్మోన్లపైన ప్రభావం చూపించి ‘కొవ్వు సెట్ పాయింట్’ను పెంచుతాయని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. అనారోగ్యకరమైన ఆహారాలన్నీ రుచిగా ఉంటాయి. వీటికి అలవాటు పడితే మానడం కష్టం. ఒకసారి మత్తుకు బానిస అయితే మానడం ఎలా కష్టమో, రుచికి బానిస అయినవారు వీటిని వదలడం అంతే కష్టం. ఆరోగ్యకరమైన ఆహారమంటే... ఆరోగ్యకరమైన ఆహారాలంటే... శుద్ధి చేయకుండా/పొట్టుతీయకుండా (రిఫైన్ చేయనివి) ఉండే ఆహార ధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్). అందుకే తెల్ల వరి అన్నానికి బదులు పొట్టు తీయని బ్రౌన్ రైస్ వాడండి. వైట్ బ్రడ్కు బదులు బ్రౌన్ బ్రెడ్ వాడండి. హోల్ మల్టీ గ్రెయిన్ ఆటాతో (పిండితో) చేసిన చపాతీలు తినండి. మీగడపాల బదులు, వెన్న తీసిన పాలు (స్కిమ్మ్‌డ్ మిల్క్) లేదా వెన్న తక్కువగా ఉండే పాలు (లోఫ్యాట్ మిల్క్) వాడండి. మాంసాహారులు మటన్‌కు బదులు చేపలు, ఇతర సముద్ర ఆహారాలను తీసుకోండి. చికెన్‌ను చర్మం తొలగించి తినడం మంచిది. గుడ్డులో తెల్లసొనను తినండి. పచ్చసొనను వాడటం అంత మేలు కాదు. మొలకెత్తే విత్తనాలు, నట్స్ వంటి శాకాహార ప్రోటీన్లను తినడం ఆరోగ్యకరం. కూల్‌డ్రింక్స్ బదులు పండ్లరసాలను తీసుకోండి. చిరుతిండ్లకు బదులు పండ్లు, తక్కువ మోతాదులో పల్లీలు, జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్ తినడం మంచిది. బాగా తియ్యగా ఉండే మామిడి పండ్లను పరిమితంగా తినడం మేలు. నూనె తగ్గించాలి. చీజ్, నెయ్యి, వనస్పతి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌కు బదులు, సన్‌ఫ్లవర్ ఆయిల్, శాఫ్ఫ్లవర్ ఆయిల్ వంటి పాలీ అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, వేరుశనగనూనె వంటి మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉపయోగించండి. ప్రతిరోజూ కూరగాయలు, పండ్లు తినండి. వ్యాయామం: శారీరక శ్రమ లేకపోతే కొవ్వు సెట్ పాయింట్ పెరుగుతుంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోడానికి రోజుకు కనీసం 30 నిమిషాల చొప్పున, వారంలో కనీసం 150 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లకు బదులు మెట్లు వాడండి. తక్కువ దూరాలకు వాహనాలను వాడవద్దు. టెన్నిస్, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి ఆటలు ఆడండి. ఎక్కువ సేపు కూర్చుని ఉండటాన్ని తగ్గించుకోండి. టీవీ ముందు ట్రెడ్మిల్ లేదా క్రాస్ ట్రెయినర్లను ఉంచుకుని వ్యాయామం చేయండి. రోజులో ఒకేసారి రోజుకు 30 నిమిషాలు నడవడం కుదరదా? అయితే కనీసం 10 నిమిషాల చొప్పున రోజుకు మూడుసార్లు నడవండి. బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం, చెట్లకు నీళ్లుపోవడం వంటి పనులు చేయండి. జిమ్ముకు లేదా స్విమ్మింగుకు వెళ్లండి. అది కుదరకపోతే ఇంట్లోనైనా వ్యాయామం చేయండి. పిల్లల్లో స్థూలకాయ నివారణ చిన్నతనంలో లావుగా ఉంటే పెద్దయ్యాకకూడా అధికబరువుతో బాధపడే అవకాశాలు ఎక్కువ. స్థూలకాయ సమస్య నివారణ చిన్నతనంలోనే మొదలు కావాలి. తల్లిదండ్రుల ఆహారపు అలవాట్లు, జీవనశైలి పిల్లలను ప్రభావితం చేస్తాయి. మీరు అనుసరించకుండా పిల్లలను పాటించమంటే వాళ్లు పాటించరు. కాబట్టి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం నేర్పాలంటే ముందు వాటిని మీరు అనుసరించాలి. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను పిల్లలకు అలవాటు చేయకండి. వారిని రోజూ ఆటలకు పంపించండి. ఇతర ఆరోగ్య చిట్కాలు ఏమైనా తినేముందు ఇప్పుడు అవి తినవలసిన అవసరం ఉందా అని ఒకసారి ఆలోచించండి. తినేముందు ఒకటి లేదా రెండు గ్లాసులు మంచినీళ్లు తాగండి. తినే తిండిని ఆనందించండి. కాకపోతే తక్కువ తినండి. కడుపు నిండటానికి కొంచెం ముందే మనకు తృప్తి కలుగుతుంది. తృప్తి కలిగిన వెంటనే తినడం ఆపండి. కడుపు పూర్తిగా నిండేదాకా తినొద్దు. నెమ్మదిగా తినండి, బాగా నమిలి మింగండి. చిన్న ప్లేటు, చిన్నగ్లాసు వాడండి. మార్కెట్లో ఆహారపదార్థాలు కొనేటప్పుడు, వాటిపైన ఉండే లేబుల్సును గమనించండి. లేబుల్సు మీద ఆ ప్యాకెట్లో క్యాలరీలు, ఆహార సమాచారం ఉంటుంది. వీలైనంతవరకు ఇంట్లో చేసిన ఆహారాన్ని తినండి. హోటల్ ఫుడ్స్‌లో ఆయిల్, ట్రాన్స్ ఫ్యాటు వాడకం అధికంగా ఉంటుంది. స్నేహితులకు, చుట్టాలకు స్వీట్లను బహూక రించడం మానండి, పండ్లు లేదా నట్స్ బహూకరించండి. సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్ అంటే... హార్మోన్లు, జన్యువులు మనలో ఎంత కొవ్వు ఉండాలో నిర్ణయించిన కొలతను ‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజీ’ అంటారు. ఈ సెట్ పాయింట్‌ను మన మనసుతో నియంత్రించలేం లేదా మార్చలేం. అయితే మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు హార్మోన్లను, జన్యువులను ప్రభావితం చేసి సెట్ పాయింట్‌ను మార్చగలవు. ఉదాహరణకు 70 కిలోల బరువు ఉండాల్సిన వ్యక్తిలో 50 కేజీల కొవ్వు పేరుకుపోవడం వల్ల, ఆ వ్యక్తి బరువు 120 కేజీలకు పెరిగిందనుకుందాం. అంటే ఆ వ్యక్తి కొవ్వు సెట్‌పాయింట్ 50 కిలోలు అన్నమాట. గ్రెలిన్ అనే హార్మోన్ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది హైపోథలామస్లోని అపటైట్ సెంటర్ (ఆకలి కేంద్రం)పైన పని చేసి ఆకలిని పెంచుతుంది. మన పొట్ట ఖాళీగా ఉంటే గ్రెలిన్ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తుంది. దాంతో మనకు ఆకలి పెరుగుతుంది. మనం కడుపునిండా తినగానే ఈ హార్మోన్ స్రవించడం తగ్గుతుంది. దాంతో ఆకలి కూడా తగ్గుతుంది. అలాగే చిన్నపేగు చివరి భాగంలో జీఎల్పీ-1 (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1), పెప్టైడ్ వైవై హార్మోన్లు తయారవుతాయి. చిన్నపేగు మొదటిభాగమైన డియోడినంలో కొలికిస్టోకైనిన్, క్లోమంలోని బీటా కణాలలో అమైలిన్ తయారవుతాయి. ఈ హార్మోన్లు హైపోథలామస్లోని సెటైటీ సెంటర్‌పై పనిచేసి ఆకలిని తగ్గిస్తాయి. చిన్నపేగు చివరి భాగానికి అరగని ఆహారం వస్తే జీఎల్పీ-1, పెప్టైడ్ వైవై తయారై ఆకలి తగ్గుతుంది. పొట్ట ఖాళీగా ఉంటే జీఎల్పీ-1, పెప్టైడ్ వైవై తగ్గడం వల్ల ఆకలి పెరుగుతుందన్నమాట. అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటాం, మన శరీరంలో ఎంత కొవ్వు నిల్వ చేసుకుంటాం అన్న అంశాలు మన జీర్ణవ్యవస్థలోని ఈ తరహా హార్మోన్ల నియంత్రణలో ఉంటాయన్నమాట. మనలో కొంతమంది తక్కువగా తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. మరికొందరు ఎక్కువగా తింటున్నప్పటికీ సన్నగా ఉంటారు. దీనికి కారణం లావుగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్ ఎక్కువగానూ, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్ తక్కువగానూ ఉండటమే. కొన్ని అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు (ఉదాహరణకు కూల్డ్రింకులు తాగడం, ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లు, కేకులు, బర్గర్లు, పిజ్జాలు, బిస్కెట్లు తినడం)... మనలో స్రవించే హార్మోన్లను ప్రభావితం చేసి, కొవ్వు సెట్పాయింట్ను పెంచుతాయి. ఒకసారి కొవ్వు సెట్‌పాయింట్ పెరిగితే అది అంత తేలిగ్గా తగ్గదు. మన శరీర ఉష్ణోగ్రతగా సెట్ అయిన 98.6 డిగ్రీల ఫారెన్హీట్ను మన ప్రమేయంతో మార్చలేనట్టే... ఈ సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజీ (కొవ్వు సెట్ పాయింట్)ను కూడా మనం మనసులో అనుకుని మార్చలేం. కొంతమందిలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం... వంటి అంశాలు సెట్పాయింట్ను నియంత్రించే హార్మోన్లను తేలిగ్గా ప్రభావితం చేస్తాయి. అందుకే ఇలాంటివాళ్లు త్వరగా బరువు పెరుగుతారు. కానీ ఇంకొంత మందిలో జన్యుపరమైన తేడాల వల్ల ఈ హార్మోన్లు అంత తేలికగా ప్రభావితం కావు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేయనప్పటికీ వీళ్లు అంత తేలిగ్గా బరువు పెరగరు. అది వాళ్ల అదృష్టం. వీరిలో బ్రౌన్ అడిపోజ్ టిష్యూ అనే కణజాలం ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా కొవ్వు కణజాలం... అవసరానికి మించి తీసుకున్న క్యాలరీలను ఉష్ణం రూపంలోకి మార్చి బయటకు పంపిస్తుంది. ఈ తరహా వ్యక్తులు అంత తేలిగ్గా బరువు పెరగకపోవడానికి ఇదీ ఒక కారణం. డాక్టర్ వి. అమర్ మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, సిటిజన్స్ హాస్పిటల్, శేరిలింగంపల్లి, హైదరాబాద్ -
పొట్ట తగ్గడానికి 10 సూత్రాలు...
1. అల్పాహారాన్ని మానకూడదు. 2. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. 3. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. 4. మానసిక ఒత్తిడిని దరిచేరనీయకూడదు. 5. చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకూడదు. 6. భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినాలి. 7. రోజూ 45 నిమిషాలు యోగా చేయాలి. 8. ఐదు రకాల పండ్లు తీసుకోవాలి 9. ఐదు రకాల ఆకుకూరలు భోజనంలో ఉండేలా చూసుకోవాలి.. 10. అరగంటైనా రోజూ నడవాలి. -
పొట్ట పట్టా పొందితే వాడిక పొట్టభద్రుడే!
నవ్వింత మా రాంబాబు పరమ రెటమతస్తుడని తెలుసు. వాడిలోని పిడివాది ఇంత ఉద్ధృతంగా ఉంటాడన్న విషయం, వాడికి ఓ సలహా ఇచ్చేదాకా నాకు తెలియరాలేదు. ‘‘ఒరే రాంబాబూ... పొట్ట కాస్త ముందుకొస్తున్నట్టుంది. కాస్త ఏ వాకింగో, ఎక్సర్సైజో చేయ్‌రా బాబూ’’ అన్నా. అంతే! నన్ను సెక్షన్ నుంచి క్యాంటిన్‌కు తీసుకెళ్లి, చూపించాడు విశ్వరూపం. ‘‘అన్నానికి, దేహానికి జరిగిన ఓ సమరంలో/ అరగడానికీ పెరగడానికీ మధ్యన సంగ్రామంలో/ బెల్టు కట్టుకీ కట్టుబడనిదీ పొట్ట / బస్కీలకూ మెల్టుకానిదీ పొట్ట/ ఇది ఆ దైవమే ఇచ్చిన పొట్టా... అది పెరిగితే తప్పా... తప్పా... తప్పా... నో... నెవర్ ’’ అంటూ సాక్షాత్తూ గ్యాస్ట్రిక్ చౌదరి అవతారం ఎత్తేశాడు. ‘‘ఒరే... ఒరే... తెలీక సలహా ఇచ్చా. వదిలెయ్...’’ అని ప్రాధేయపడితే ఉగ్రావతారం విరమించినా శాంతావతారంలోకి వచ్చే ముందు మరికాసేపు ఆవేశపడ్డాడు. ‘‘ఒరేయ్... పొట్ట కాస్త పెరగ్గానే ప్రతివాడూ సలహాలిచ్చేవాడే. అసలు పొట్టా... దాని మహత్యమేమిటో తెల్సా?’’ ‘‘తర్వాత చెబుదువుగానీ’’ అంటూ తప్పించుకోడానికి చూశాగానీ... నేనే తెచ్చుకున్న తంటా కాబట్టి వీలు కాలేదు. ‘‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు అనే వాడుక మాట విన్నావా? పోనీ వాడికి డొక్కశుద్ధి ఉందండీ అనే నానుడి? మన పూర్వపు రోజుల్లో పొట్ట విజ్ఞానానికి చిహ్నంగా ఉండేదని తెలియడం లేదూ! క్రమంగా అక్షరాలూ, విజ్ఞానం మెదడులో ఉంటాయని ఆధునిక విజ్ఞానశాస్త్రం తేల్చింది కాబట్టి క్రమంగా జ్ఞానానికి పొట్టే కేంద్రమన్న పాత సిద్ధాంతం కొట్టుకుపోయి బ్రెయిన్ సెంట్రిక్ సిద్ధాంతం వచ్చింది. భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మే వాళ్లలా నేనూ ఇప్పటికీ పొట్టే జ్ఞానానికి కేంద్రమనీ, దాన్ని నింపుకోవడం వల్లనే జ్ఞానం వృద్ధి అవుతుందనీ నమ్ముతున్నా.’’ అన్నాడు. ‘‘సరే సరే... ఇకపై నేనూ నమ్మడానికి ప్రయత్నిస్తాన్లే’’ అంటూ వాడిని శాంతపరచడానికి మళ్లీ విఫలయత్నం చేశా. ‘‘పెరిగిన పొట్ట ఒక విజ్ఞానభాండాగారమే కాదు... అది ఒక కళారూపం’’ ‘‘పొట్ట కళారూపం ఏమిట్రా? నీకు మతిగానీ పోయిందా?’’ ‘‘పొట్టపెరిగిన వాణ్ణి ఎప్పుడైనా చూశావా? అంతకుముందు వాడెప్పుడూ తన పొట్టను తానే గమనించడు. కానీ పొట్టంటూ పెరిగాక వాడిలోని ఘటవాద్యకారుడు బయటికి వచ్చేస్తాడు. వేళ్లతో, చేతులతో దానిపై దరువేస్తూ అప్పటివరకూ తనలో నిశ్శబ్దంగా నిబిడీకృతమై ఉన్న అంతర్గత కళాకారుణ్ని బయటకు తీస్తాడు. అలాంటి పొట్ట మీద అనవసరంగా కామెంట్లు చేసి కళాకారుడు పుట్టకముందే వాడిలోని ప్రతిభను దయచేసి తొక్కేయకండ్రా. ప్లీజ్’’ అన్నాడు. ‘‘నీ పొట్టలాగే నీకు మరీ జ్ఞానం కూడా పెరిగి అది వెర్రితలలు వేస్తోంది’’ అంటూ కాస్త కేకలేయబోయా. ‘‘డొక్క చించి డోలు కట్టడం అన్న వాడుక ఎప్పుడైనా విన్నావా, లేదా? అంటే ఏమిటీ? డొక్కలో ఘటవాద్యం, డోలూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డొక్కకూ, డోలుకూ సంబంధం ఉంది కాబట్టే ఆ సామెత పుట్టింది. ఇన్ని తార్కాణాలూ, దృష్టాంతాలూ ఉన్నా అజ్ఞానులు నమ్మర్రా. అంతెందుకు ఎవడైనా బాగుపడటానికి కారణం వాడి పొట్టే’’ ‘‘బాగుపడటానికీ పొట్టకూ సంబంధం ఏమిట్రా రాంబాబూ?’’ ‘‘ఎవడైనా బాగుపడాలనుకుంటే వాడు పొట్టచేతపట్టుకుని పోయి, పొట్ట తిప్పలు పడి పొట్టపోసుకుంటాడు. ఇలాంటివాడే జీవితంలో పైకొస్తాడు. బాగుపడేవాళ్ల పొట్ట కొట్టకండ్రా ప్లీజ్’’ అన్నాడు మళ్లీ ఆవేశం పెంచుకుంటూ. ‘‘ఒరే నువ్వొక్కడివే పొట్టను ఇలా వెనకేసుకొస్తున్నావ్. ఆరోగ్యానికి పొట్ట అంత మంచిది కాదు తెల్సా?’’ ‘‘నాకు చెప్పకు. పొట్ట ఉంటే టక్కు బాగా కుదుర్తుందని చిరుపొట్టకోసం చాలామంది యూత్ ఏవేవో ప్రయాసలు పడతారు. నువ్వెప్పుడైనా పొట్టగలవాడు మోటార్‌సైకిల్ నడుపుతుంటే చూశావా? బండి పెట్రోల్ ట్యాంకు మీద ఓ కుండను జాగ్రత్తగా పెట్టుకుని, కాళ్లూ చేతుల మధ్య దాన్ని దొర్లిపోకుండా ఉంచుకున్నట్లుగా వెళ్తుంటారా పొట్టగలవాళ్లూ! అంతెందుకు వయసు పెరుగున్నకొద్దీ ఏ చదువూ, ఏ డిగ్రీలూ లేకుండానే లోకమనే ఈ విశ్వవిద్యాలయంలో ఒక పరిణతి చెందిన డిగ్రీ ఇచ్చి ఒకణ్ణి పొట్టభద్రుణ్ణి చేస్తుందిరా ఈ జీవితం. కాబట్టి దాన్ని కించపరచకు. వాకింగులంటూ, వ్యాయామాలంటూ సలహాలిచ్చి ఎవ్వడి పొట్టనూ పొట్టనబెట్టుకోకు’’ అంటూ వార్నింగిచ్చాడు మా రాంబాబుగాడు. రాంబాబు ధోరణేమిటి ఇలా పెడసరంగా ఉంది చెప్మా అంటూ కాస్త వాకబు చేశాక విషయం తెలిసింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గలేదట వాడికి. అందుకే ఇలా సమర్థింపుల్లోకి దిగాడట. కొంతమంది అంతే... ఏదైనా వదిలించుకోవడం కుదరకపోతే అదే ఎస్సెట్టంటూ ఎదురుదాడికి దిగుతారు. బట్టతల తప్పదని తెలిశాక దాన్ని సమర్థిస్తూ మాట్లాడినట్టు. వాడూ ఇదే బాపతు. ఏం చేస్తాం. ఎంతైనా మా ఫ్రెండు కదా. వాడి గురించి ఎవడికైనా చెబుదామని అనిపించినా... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని సెలైంటయిపోయా. - యాసీన్ -
కడుపులో కత్తెర మరచిపోయి కుట్టేశారు
రాయబరేలి: ఓ రోగికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె కడుపులో కత్తెర మరిచిపోయి కుట్టేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. మహరాజ్‌గంజ్ తహసిల్‌లోని రాజాకపూర్ గ్రామానికి చెందిన శివకాళి అనే మహిళకు ఓ నర్సింగ్ హోం వైద్యుడు రాకేశ్ రాజ్‌పుత్ కొన్ని నెలల క్రితం శ స్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. కడుపు నొప్పి తట్టుకోలేక ఇటీవల ఆమె చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏకే సింగ్‌ను కలిసి విషయం తెలియజేసింది. ఏకే సింగ్ వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
తిన్నది అరిగిందో లేదో చూడాలని..
చిత్రంలో రెండు ఆవులు, వాటి వీపులపై రంధ్రంతో ఉన్న గొట్టాలు అమర్చి ఉండటం చూస్తున్నారు కదా.. ఆ ఆవులు తింటున్న గడ్డి, దాణా ఎంతమేరకు అరుగుతుందో తెలుసుకుందామనే స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఈ గొట్టాలను అమర్చారు! ఎనిమిది అంగుళాల రంధ్రంతో ఉన్న ఈ గొట్టాలు నేరుగా వాటి జీర్ణాశయంలోని ఓ గదిలోకి తెరుచుకుని ఉంటాయి. అంటే ఒకరకంగా ఆ ఆవుల కడుపులకు ఇవి కిటికీల వంటివన్నమాట. వీటిలోంచి చూస్తే.. ఆవుల కడుపులో మేత ఎంతవరకూ అరిగిందో కనిపిస్తుంది. అంతేకాదు.. ఆ గొట్టంలోంచి కొంత మేతను సేకరించి పరీక్షలు చేయడం ద్వారా అది ఆవుకు ఎంత మేలైన ఆహారమో కూడా అంచనా వేస్తారు. స్విట్జర్లాండ్ ప్రభుత్వ పరిశోధన సంస్థ ‘అగ్రోస్కోప్’ శాస్త్రవేత్తలు ఇలా 14 ఆవులకు కాన్వులాస్ అనే ఈ గొట్టాలను అమర్చారు. ప్రస్తుతం యూరప్‌తోపాటు అమెరికాలో కూడా ఇలాంటి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. అయితే నోరులేని అమాయకపు జంతువులను ఇలా ప్రయోగాల పేరుతో హింసించడం క్రూరమైన చర్య అంటూ.. జంతుహక్కుల కార్యకర్తలు మండిపడుతున్నా.. గోమాతల మేలు కోసమే ఈ ప్రయోగం చేస్తున్నామని శాస్త్రవేత్తలు బదులిస్తున్నారు. ఆవులకు ఏది మంచి ఆహారమో నిర్ణయించి, ఆ ఆహారాన్నే ఇవ్వడం ద్వారా వాటికి ఆరోగ్యాన్ని, ఆయువునూ ఇవ్వవచ్చని చెబుతున్నారు. అన్నట్టూ.. పశువులపై ఇలాంటి ప్రయోగాలు 1833లోనే మొదలయ్యాయట. -
పొట్ట ఉబ్బటం కిడ్నీ సమస్యకు సంకేతమా?
నాకు 55 ఏళ్లు. మొదట్నుంచీ నేను కొంచెం లావుగానే ఉంటాను. కానీ ఈమధ్య కాలంలో పొట్ట మాత్రం విపరీతంగా ముందుకు వస్తూ ఉంది. ఉదయం వేళల్లో కాళ్ల వాపు, ముఖం వాపు కూడా ఉంటోంది. గత 20 ఏళ్లుగా నాకు మద్యం అలవాటు ఉంది. నా స్నేహితులంతా కిడ్నీ చెడిపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడతాయని అంటున్నారు. ఇతరత్రా నాకు ఎలాంటి సమస్యా లేదు. గత మూడేళ్లుగా హైబీపీ కూడా ఉంది. నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? పొట్ట విపరీతంగా ఉబ్బితే కిడ్నీ సమస్య ఉన్నట్లా? దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. - డి.ఎస్.ఎమ్., కరీంనగర్ సాధారణంగా పొట్టతోపాటు, శరీరం కూడా పెరిగితే స్థూలకాయం అంటారు. కానీ ముఖం మీద, కళ్ల చుట్టూ వాపు రావడం, పాదాల్లో వాపు వంటి లక్షణాలు స్థూలకాయంలో ఉండవు. కిడ్నీ, గుండె, కాలేయానికి సంబంధించిన సమస్య ఉన్నవాళ్లలో మాత్రమే ఇలాంటి వాపు కనిపిస్తుంటుంది. ఒకవేళ పై సమస్యల కారణంగా పొట్టలో కూడా నీరు చేరితే, పొట్ట ఉబ్బుతుంది. ఈ కండిషన్‌ను అసైటిస్ అంటారు. అయితే ఈ కండిషన్లో కాళ్లూ, చేతులు స్థూలకాయంలో ఉన్నంత లావుగా ఉండకుండా, మామూలుగానే ఉంటాయి. కిడ్నీ సమస్య ఉన్నవాళ్లలో పొట్ట వాపు కంటే కళ్ల చుట్టూ వాపు ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి క్రియాటినిన్ అనే కిడ్నీ పరీక్ష, ఎల్.ఎఫ్.టి. అనే కాలేయ పరీక్ష, ఎకో-కార్డియోగ్రామ్ అనే గుండె పరీక్ష చేయించుకుంటే... మీ లక్షణాలు దేనికి సంబంధించినవో తెలుస్తుంది. మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి, పై పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
పొట్టని‘పొడి’చేద్దాం...ఇలా...
లావుగా ఉన్నవారినే కాదు సన్నగా ఉన్నవారిని కూడా విసిగించే సమస్య పొట్ట. చాలా మంది అనుకున్నట్టు లావుగా ఉన్నవారికే పొట్ట ఉంటుందనేది కరెక్ట్ కాదు. మిగిలిన శరీరభాగాలతో పోల్చుకుంటే ఉదరభాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం అనేది ఎవరికైనా జరగవచ్చు. అందులో ప్రస్తుత ఆహారపు అలవాట్ల కారణంగా వయసులకు అతీతంగా ప్రతి ఒక్కరినీ వేధిస్తోందీ ఉదరభాగపు ఉబ్బు. మొత్తం బాడీషేప్‌ని పాడు చేసే శక్తి ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం నిపుణులు ఏం చెప్తున్నారంటే... ముందుగా మీ నడుము చుట్టుకొలత కొలుచుకోవాలి. బరువు ఎంత అధికంగా ఉన్నామో కూడా పరీక్షించుకోవాలి. అది నిర్దేశించిన పరిమాణాన్ని దాటినట్టు గుర్తించగానే ముందుగా చేయాల్సింది వైద్యుని సంప్రదించడం. వారి సూచనల మేరకు ఉదరభాగం పెరగడానికి కారణాలేమిటో గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం. పరీక్షల ఫలితాల ప్రకారం వైద్యసలహా మేరకు ‘బెల్లీ’పై వార్ ప్రకటించాలి. వర్కవుట్స్‌కి కంగారొద్దు... పొట్ట పెరుగుతోందనగానే జిమ్‌లు, వర్కవుట్లు అంటూ కంగారుగా పరుగులు పెట్టడం సరికాదు. ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పు చేర్పులు చేయకుండా పొట్ట తగ్గించడం అసాధ్యం. ఆహారపు అలవాట్లు మార్చకుండా జిమ్‌లకు పరిగెడితే... అదనపు శారీరకశ్రమ వల్ల మనకు తెలీకుండానే మనం అదనంగా తింటాం. దాంతో పొట్ట తగ్గే అవకాశాలు మరింత తగ్గుతాయి. అందుకని ముందుగా పొట్ట పెరిగేందుకు దోహదం చేస్తున్న ఆహారాన్ని త్యజించాల్సిందే. వ్యాయామం దిశగా... అనంతరం బరువు చెక్ చేసుకుంటే ఎంతోకొంత మార్పు తప్పకుండా కన్పడుతుంది. అలా కనపడితేనే మనం ఖచ్చితమైన దారిలో వెళుతున్నట్టు. బరువు తగ్గినట్టు తెలిశాక... అవసరమైన షూస్, తగిన డ్రెస్ సిద్ధం చేసుకుని వాకింగ్ మొదలు పెట్టాలి. ప్రారంభంలో ఉదయం పూట కనీసం 20నిమిషాలు తరువాత దశలవారీగా దాన్ని 40-60నిమిషాల దాకా తీసుకెళ్ళాలి. సాధారణ వాకింగ్ 2 వారాల పాటు మానకుండా చేశాక బ్రిస్క్‌వాకింగ్ మొదలు పెట్టాలి. ఆ తర్వాత వాకింగ్, బ్రిస్క్‌వాకింగ్ కలిపి చేయాలి. మరో 2 వారాలు గడిచాక నిపుణుల పర్యవేక్షణలో అబ్డామినల్ క్రంచెస్ ప్రారంభించాలి. వీటిలో విభిన్న రకాలున్నాయి. వీటిలో నుంచి అనువైనవి ఎంచుకుని సాధన చేయాలి. వీటితో పాటుగా సైడ్ బెండ్స్, యోగాసనాలు, లైట్ వెయిట్స్తో స్ట్రెంగ్త్ ట్రయినింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి కూడా వీలునిబట్టి అపుడపుడు జత చేస్తుండాలి. రోజుకి 30నిమిషాలతో ప్రారంభించి గంట, గంటన్నర దాకా సమయాన్ని పెంచాలి. ఇలా 3 నెలలు చేశాక పొట్ట ప్రాంతంలో వచ్చిన మార్పుని, బరువు పరంగా వచ్చిన ఫలితాల్ని బేరీజు వేసుకోవాలి. వాటిపై నిపుణులతో చర్చించి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎక్సర్సైజ్ రొటీన్లో అవసరమైన మార్పు చేర్పులు చేసుకోవాలి. గమనించాల్సినవి... శరవేగంగా మార్పును ఆశించవద్దు. అలాగే మొదట్లోలాగే త్వరగా బరువు తగ్గుతామని అనుకోవద్దు. లేదా కృత్రిమ పద్ధతుల్లో తగ్గించేసుకోవాలని ఆరాటం వద్దు. ఆహారపు అలవాట్లలో మార్పు చేర్పులను కొనసాగిస్తూ, వ్యాయామం చేస్తుంటే నిదానంగా పొట్ట కరగడం ప్రారంభిస్తుంది. అయితే ఒకసారి కరిగిన పొట్ట తిరిగి రాకుండా శారీరక శ్రమని దినచర్యలో భాగం చేయడం అవసరం. లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కి దిగడం, చిన్న చిన్న దూరాలకు నడిచి వెళుతుండడం, ఆఫీసు, ఇంట్లో ఇలా ఎక్కడైనా సరే శరీరం కదిలేలా చలాకీగా పనులు నిర్వర్తిస్తుండడం... వంటివి చేస్తూ... పొట్ట తగ్గడం వల్ల మీరెంత చలాకీగా మారామనేది తెలుసుకుంటూ, చెప్పకనే చెప్పాలి. పొట్ట తగ్గిపోయాక కూడా వ్యాయామాన్ని కొనసాగిస్తూ పోతే... ఇక భవిష్యత్తులో ఉదరభాగంలో ఫ్యాట్ అనే ప్రమాదం రాదు. అంతేకాకుండా మంచి బాడీషేప్ కూడా స్వంతం అవుతుంది. - ఎస్.సత్యబాబు పొట్ట పెరిగేందుకు దోహదం చేసే ఆహారం ముఖ్యంగా తెల్లని బియ్యం కారణంగా ఉదరభాగం ఉబ్బుగా మారే అవకాశాలు బాగా ఎక్కువ. కాబట్టి దానికి బదులుగా గోధుమలు, దంపుడు బియ్యం, జొన్నలు, కొర్ర బియ్యం... వంటివి వాడడం మొదలు పెట్టాలి. చిన్న చిన్న పరిమాణాలలో పలు దఫాలుగా ఆహారం తీసుకునే వేళలు సవరించుకోవాలి. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ కాస్త ఎక్కువగా తీసుకున్నా పర్లేదు. అక్కడి నుంచి తగ్గిస్తూ వెళ్ళాలి. రాత్రి 7-8గంటల లోపు తినే కార్యక్రమం ముగించడం అవసరం. అలాగే నిద్రపోయే వేళలు కూడా వీలున్నంత వరకూ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కనీసం 6 వారాల పాటు ఖచ్చితంగా పాటించాలి. పొట్ట భాగంలో కొవ్వు కరగడానికి, కండరాలు మంచి షేప్ తిరగడానికి యాబ్స్ ఎక్సర్సైజ్లు, క్రంచెస్ మాత్రమే మార్గం అనుకుని వాటికే పరిమితం కాకూడదు. అబ్డామినల్ వ్యాయామాలలో విభిన్న రకాలను సాధన చేయాలి. అలాగే వెల్లకిలా పడుకుని చేసే బైసికిల్ ఎక్సర్సైజ్ను అత్యుత్తమమైనదిగా అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ నిర్థారించింది. ది ప్లాంక్ (పుషప్ చేయడానికి చేతులు నేలకు ఆన్చి అదే భంగిమలో నిశ్చలంగా ఉండిపోయే వర్కవుట్) అనే వెరైటీ వ్యాయామం కూడా పొట్ట భాగాన్ని చదును చేసేందుకు చక్కని మార్గం. - కుల్దీప్సేథీ, ఫిట్నెస్ ట్రైనర్.