భారీ తిమింగలం మృతి.. షాకింగ్ నిజాలు
ఓస్లో: నార్వే సముద్రతీరంలో ఇటీవల ఓ భారీ తిమింగలం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఇక బతికే అవకాశం లేకపోవడంతో మెరైన్ బయాలజిస్టులు దానికి కారుణ్య మరణం ప్రసాదించారు.
అనంతరం.. దాని తీవ్ర అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బెర్జిన్‌కు చెందిన పరిశోధకులు ప్రయత్నించగా.. విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 30 ప్లాస్టిక్ బ్యాగులతో పాటు.. భారీ సంఖ్యలో మానవ వ్యర్థాలను తిమింగలం పొట్టలో గుర్తించారు. ఇలా భారీ సంఖ్యలో వ్యర్థాలను తీసుకోవడం మూలంగా.. తిమింగలం జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, దాని మృతికి కారణం ఇదే అని జంతు శాస్త్రవేత్త టెర్జీ లిస్లెవాండ్ తెలిపారు. 2050 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణమే ఎక్కువ ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ నివేదికలో వెల్లడించింది.