carcass
-
వీధి కుక్కలను చంపి ‘పడేశారు’!
అడ్డాకుల: మూసాపేట మండలం జానంపేట శివారు 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన కాల్వలో కుక్కల కళేబరాలు కనిపించడం కలకలం రేపింది. పదిహేను వీధి కుక్కలను గుర్తు తెలియని దుండగులు చంపి వాటిని కాల్వలో పడేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం స్థానికుల సమాచారంతో ఎస్ఐ సుజాత అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం కుక్కల కళేబరాలను ట్రాక్టర్లో చక్రాపూర్ శివారులోని అటవీ ప్రాంతానికి తరలించి అక్కడ పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత గుట్ట సమీపంలోని ప్రభుత్వ భూమిలో గుంతను తవి్వంచి పూడ్చి వేశారు. కుక్కల కళేబరాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో విష ప్రయోగం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు.కుక్కలకు సంబంధించిన శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్‌ఖన్న తెలిపారు. పొన్నకల్ ఘటన మరువక ముందే? అసలు ఈ కుక్కలను ఎవరు.. ఎక్కడ.. ఎందుకు చంపారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదో గ్రామంలో కుక్కల సంఖ్యను తగ్గించడానికి వాటిని చంపేసి కళేబరాలను ఇక్కడ వదిలేసి ఉంటారనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 16న అడ్డాకుల మండలం పొన్నకల్‌లో 21 వీధి కుక్కలను తుపాకీతో కాల్చి చంపిన ఘటన మరువక ముందే ఇప్పుడు 15 కుక్కల కళేబరాలు హైవే పక్కన కాల్వలో కనిపించడం కలకలం రేపుతోంది. -
3,500 ఏళ్ల నాటి ఎలుగు కళేబరం...
మాస్కో: దాదాపుగా 3,500 ఏళ్ల నాటి ఎలుగుబంటి కళేబరం ఏమాత్రం చెక్కుచెదరని స్థితిలో దొరికి సైంటిస్టులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. అది పూర్తిగా అతిశీతల వాతావరణంలో మంచులో కూరుకుపోవడమే ఇందుకు కారణం. రష్యాలో మాస్కోకు 4,600 కిలోమీటర్ల దూరంలో న్యూ సైబీరియన్ ఆర్చిపెలాగోలో భాగమైన బొల్షోయ్ ల్యాక్షోవ్స్కీ ద్వీపంలో జింకల వేటగాళ్లు దీన్ని 2020లో గుర్తించారు. ‘‘అది ఆడ ఎలుగుబంటి. గోధుమ రంగుతో, 1.55 మీటర్ల ఎత్తు, దాదాపు 78 కిలోల బరువుంది. చనిపోయేనాటికి బహుశా మూడేళ్ల వయసుంటుంది’’ అని తూర్పు సైబీరియాలోని లజరేవ్ మామూత్ మ్యూజియం లేబొరేటరీ చీఫ్ మాక్సిం చెప్రసోవ్ అంచనా వేశారు. ఆయన సారథ్యంలోని సైంటిస్టుల బృందం దానికి శవపరీక్ష జరిపింది. ‘‘దాని ఒంట్లోని అతి మృదువైన కణజాలం కూడా గులాబి రంగులో ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా ఉండటం నిజంగా అద్భుతం. అలాగే పసుపు రంగులోని కొవ్వు కూడా. అంతేగాక దాని చివరి తిండి తాలూకు పక్షి ఈకలు, మొక్కలు కూడా పొట్టలో అలాగే ఉన్నాయి. అంత పురాతన కాలపు జంతువు తాలూకు కళేబరం ఇంత చక్కని స్థితిలో పరిపూర్ణంగా దొరకడం ఇదే తొలిసారి’’ అని పేర్కొంది. దాని మెదడు, అంతర్గత అవయవాలను కోసి లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కణజాల, సూక్ష్మజీవ, జన్యుపరమైన పరీక్షల్లో తలమునకలుగా ఉన్నారట. -
తల్లి గుండె బద్ధలైంది.. బిడ్డ శవాన్ని మోసుకుంటూ వెళ్లింది!
వైరల్: అప్పటిదాకా తల్లి చాటుగా పెరిగిన బిడ్డ.. ఆ తల్లి కళ్ల ముందే మరణిస్తే ఎలా ఉంటుంది?. మనిషి అయినా నోరు లేని జీవి అయినా అమ్మ ప్రేమ ఒక్కటే కదా!. అందుకే ఆ తల్లి ఏనుగు తల్లడిల్లింది. బరువెక్కిన గుండెతోనే బిడ్డను మోసుకుంటూ బయలుదేరింది. హృదయ విదారకమైన ఘటన.. వైరల్ అవుతూ ఎంతో మందిని కంటతడి పెట్టిస్తోంది. తన కళ్ల ముందే మరణించిన ఓ గున్న ఏనుగును మోసుకుంటూ ముందుకెళ్లింది ఓ ఏనుగు. ఆ నడక ఆగిపోకుండా.. చాలా దూరం అలా ముందుకు సాగింది. హఠాత్తుగా ఏమైందో తెలియదు.. ఆ తల్లి ఏనుగు, గున్నేనుగు శవంతో కనిపించకుండా పోయింది. బెంగాల్ జలపైగురిలో టీ ఎస్టేట్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబరీ టీ ఎస్టేట్‌లో ఓ ఏనుగు.. తన కళ్ల ఎదురుగా చనిపోయిన గున్న ఏనుగు దేహాన్ని ఎత్తే ప్రయత్నం చేసింది. ఇబ్బంది పడుతూనే తొండంతో ఆ శవాన్ని పైకి ఎత్తి దంతాల మధ్య పట్టుకుని ముందుకు ప్రయాణం మొదలుపెట్టింది. పచ్చి నీళ్లు, ఆహారం ముట్టకుండా ముందుకు సాగింది. బిడ్డ కిందపడిపోయిన శక్తినంతా కూడదీసుకుని మళ్లీ పైకి ఎత్తి ముందుకు సాగింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. A mother elephant seen carrying carcass of her dead calf in Ambari Tea Estate, Jalpaiguri, West Bengal, India! 🙁🙁pic.twitter.com/9YBachPy8M — Aman Verma (@amanverm_a) May 29, 2022 బనారహత్ బ్లాక్ దూవార్స్ రీజియన్‌లోని చునాభటి టీ గార్డెన్ సమీపంలోని అడవిలో శుక్రవారం ఉదయం ఆ గున్నేనుగు మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అది ఎలా చనిపోయింది కారణం మాత్రం నిర్ధారించుకోలేకపోయారు. అయితే చనిపోయిన తన బిడ్డను మోసుకుంటూ మరో 30-35 ఏనుగులతో కూడిన మందతో ఆ తల్లి ఏనుగు ముందుకు ప్రయాణం మొదలుపెట్టింది. దాదాపు కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి.. చునాభటి నుంచి అంబరి టీగార్డెన్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి డయానా టీ గార్డెన్ నుంచి న్యూదువార్స్ టీ గార్డెన్ వైపు వెళ్లింది. చివరకు రెడ్బంక్ టీ గార్డెన్‌లోని పొదల్లో బిడ్డ శవాన్ని ఉంచింది. మిగతా ఏనుగులన్నీ అడవి వైపు మళ్లాయి. కానీ.. ఆ ఏనుగుల కదలికలను పరిశీలించిన అధికారులకు ఆ గున్నేనుగు శవం దొరకలేదు.. సరికదా ఆ తల్లి ఏనుగు మంద నుంచి కనిపించకుండా పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ తల్లి ఏనుగును ఎలాగైనా కనిపెట్టి.. అడవుల్లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
నవీన్ మృతదేహం స్థలంలో 12 మంది రావొచ్చు
బెంగళూరు: ఉక్రెయిన్‌లో మృతిచెందిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ(22) మృతదేహం తరలింపుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవీన్ పార్థివదేహాన్ని తీసుకొచ్చేందుకు విమానంలో ఉపయోగించే స్థలంలో 10 నుంచి 12 మందిని కూర్చోబెట్టవచ్చని అన్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో బతికి ఉన్నవాళ్లను తీసుకురావడమే చాలా కష్టంగా మారగా మృతదేహాలను సొంత దేశాలకు తరలించడం మరింత కష్టమన్నారు. అయినప్పటికీ నవీన్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం, కర్ణాటక ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని వివరించారు. (చదవండి: జెలెన్స్కీ ఎక్కడ? ఆయన పై మూడు సార్లు హత్యాయత్నం) -
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు..
కొమ్మాది (భీమిలి): విశాఖలోని సాగర్‌నగర్ తీరానికి శనివారం భారీ తాబేలు కళేబరం కొట్టుకుని వచ్చింది. ఈ తరహా తాబేలు సాగర జలాల్లో సంచరిస్తుంటాయి. ఇవి గుడ్లు పెట్టేందుకు సముద్రపు ఒడ్డుకు వచ్చే సమయంలో వలలో చిక్కుకుని పడవ చక్రాలకు తగిలి మృత్యువాత పడుతుంటాయని మత్స్యకారులు తెలిపారు. ఒక్కోసారి సముద్రంలో కాలుష్యం ఎక్కువ అవుతున్నప్పుడు కూడా మరణిస్తుంటాయని పేర్కొన్నారు. చదవండి: టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత.. ‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్ -
ముంబై బీచ్‌కు కొట్టుకొచ్చిన వేల్
ముంబై : నవీ ముంబైలోని ఖర్ దాండా తీరానికి 40 అడుగుల పొడవైన వేల్ శవమై కొట్టుకువచ్చింది. గురువారం ఉదయం వేల్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు మరణించింది బ్లూ వేల్ అని వెల్లడించారు. గత మూడేళ్లలో ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది సార్లు ఇలా మహారాష్ట్ర తీరానికి వేల్ మృతదేహాలు కొట్టుకొచ్చాయి. చనిపోయిన వేల్ టిష్యూలను మహారాష్ట్ర అధికారులు సేకరించారు. వేల్ దాదాపు 20 టన్నులకుపైగా బరువు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. చనిపోయి చాలాకాలం అవుతుండటం వల్ల బ్లూ వేల్ దేహం రంగు మారిందని తెలిపారు. -
నిబంధనలు కాలరాసి.. చేపలు పెంచేసి..!
భీమడోలు: చేపల కూర మాంసప్రియులను చెవులూరిస్తుంది. చేపలు శరీరానికి ఆరో గ్యంతో పాటు మాంసకృత్తులు, విట మిన్లు, ఫాస్పరస్ వంటి ఖనిజాలు అందిస్తాయి. అయితే ప్రస్తుతం చేపలు తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మార్కెట్లో దొరికే ఏ చేప పడితే ఆ చేపను కూర వండుకుని తింటే ఆరోగ్యం మాట అటుంచితే దుష్పరి ణామాలు చోటుచేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే చేపల సాగులో కోళ్ల వ్యర్థాలను, ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని వినియోగించడమే కారణం. దీంతో పాటు పట్టణాల్లోని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో కోళ్ల వ్యర్థాలను తిని పెరిగే ఫంగస్, క్యాట్‌ఫిష్‌ను రుచికరంగా వండి వడ్డిస్తున్నారు. ఇటువంటి వాటిపై అధికారులు దృష్టిపెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో ఆక్వా సా గవుతోంది. దీనిలో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో చేపలు సాగుచేస్తున్నారు. అ యితే వేలాది ఎకరాల్లో ఫంగస్ (తెల్ల క్యాట్‌ఫిష్)ను సాగుచేస్తున్నారు. ప్రధానంగా కొల్లేరుతో పాటు డెల్టా మండలాల్లో నిషేధిత ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ సాగవుతోంది. మేత ధరలు పెరగడంతో సాగుదారులు కోళ్లవ్యర్థాలను చెరువుల్లో వేసి ఫంగస్, క్యాట్‌ఫిష్‌లను పెంచుతున్నారు. కోళ్లవ్యర్థాలు.. పశు కళేబరాలు కోళ్ల వ్యర్థాలు, పశు కళేబరాలను తిని పెరిగే ఫంగస్, ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ తింటే దుష్పరిణామాలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. నగరా ల్లోని పలు హోటళ్లలో క్యాట్‌ఫిష్ కర్రీ, ఫ్రైలను విక్రయిస్తున్నారు. పదేళ్ల క్రితం నిషేధం కోరమేను, మార్పు, ఇంగిలాయి తది తర రకాలు మన దేశానికి చెందిన సహజసిద్ధ క్యాట్‌ఫిష్ చేపలు. దీని శాస్త్రీయనామం క్లారియాస్గారీపినస్. విదేశాలకు చెందిన ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్‌ను ఇక్కడ సాగు చేస్తుండటంతో సంప్రదాయక క్యాట్‌ఫిష్ రకాలు అంతరించిపోతున్నాయి. ఈనేపథ్యంలో పదేళ్ల కితం ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్‌ను ప్రభుత్వం నిషేధిస్తూ జీఓ జారీచేసింది. ఫంగస్, ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్‌లు మాంసా హార జీవులు. ఇవి మొండిజాతులు. వీటితో అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. నిరోధక కమిటీ సభ్యులు వీరే ఫంగస్, క్యాట్‌ఫిష్ పెంపకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నిరోధక క మిటీలను ఏర్పాటుచేసింది. కమిటీలో తహసీల్దార్, ఎస్సై, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, వీఆర్వోలు సభ్యులుగా ఉంటారు. మత్స్యశాఖాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వీరు చెరువులను తనిఖీ చేసి పట్టుకున్న కోళ్ల వ్యర్థాలు, క్యాట్‌ఫిష్‌ను గ్రామానికి దూరంగా గొయ్యి తీసి పాతి పెట్టడం, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం వంటివి చేయాలి. అనర్థాలు ఎన్నో.. సాధారణంగా చేపల చెరువుల్లో తడి మేత వేయరాదు. దీని వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ఫంగస్, క్యాట్‌ఫిష్ సాగు చేస్తున్న చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వేయడంతో వచ్చే దుర్గంధం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. కోళ్ల ఎదుగుదలకు వినియోగించే యాంటీబయోటిక్స్ కోళ్ల వ్యర్థాల ద్వారా చేపలకు చేరి వాటిని తింటే మానవ శరీరంలోకి చేరతాయి. రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఆయా చెరువుల్లోని మురుగు నీరు పంట బోదెల ద్వారా తాగునీటి కలుషితానికి కారణమవుతోంది. ఈ నీటిని తాగితే విరేచనాలు, వాంతులు వస్తాయి. గర్భిణులు, బాలింతల ద్వారా పుట్టబోయే బిడ్డలకు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. గాలి, నీరు, పర్యావరణం కలుషితమవుతాయి. వీరమ్మకుంటలో చర్మవ్యాధులు ఫంగస్, క్యాట్‌ఫిష్ సాగు వల్ల పెదపాడు మండలం వీరమ్మకుంట ప్రాంతంలో పలువురికి చర్మవ్యాధులు సోకాయి. నీరు కలుషితమై దురద, దద్దర్లు వచ్చాయి. పెదపాడు మండలంలో చేపల మేతగా వేసేందుకు సిద్ధం చేసిన ఉడికించిన కోళ్ల వ్యర్థాలను పరిశీలిస్తున్న అధికారులు, కోళ్ల వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువు -
భారీ తిమింగలం మృతి.. షాకింగ్ నిజాలు
ఓస్లో: నార్వే సముద్రతీరంలో ఇటీవల ఓ భారీ తిమింగలం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఇక బతికే అవకాశం లేకపోవడంతో మెరైన్ బయాలజిస్టులు దానికి కారుణ్య మరణం ప్రసాదించారు. అనంతరం.. దాని తీవ్ర అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బెర్జిన్కు చెందిన పరిశోధకులు ప్రయత్నించగా.. విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 30 ప్లాస్టిక్ బ్యాగులతో పాటు.. భారీ సంఖ్యలో మానవ వ్యర్థాలను తిమింగలం పొట్టలో గుర్తించారు. ఇలా భారీ సంఖ్యలో వ్యర్థాలను తీసుకోవడం మూలంగా.. తిమింగలం జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, దాని మృతికి కారణం ఇదే అని జంతు శాస్త్రవేత్త టెర్జీ లిస్లెవాండ్ తెలిపారు. 2050 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణమే ఎక్కువ ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ నివేదికలో వెల్లడించింది. -
శవమై తేలిన మరో ఖడ్గమృగం!
అసోంః కాజీరంగా నేషనల్ పార్క్ సమీపంలో మరో ఖడ్గమృగం శవమై తేలింది. ఇప్పటికే ఎన్నోసార్లు వేటగాళ్ళ బారిన పడి ఆ మూగజీవాలు మృత్యు వాత పడ్డ విషయం తెలిసిందే. వాడిగా ఉండే వాటి కొమ్ములకోసం వేటగాళ్ళు ఏంకగా వాటి ప్రాణాలనే బలితీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కాగా తాజాగా కొమ్ములతోసహా ఓ మగ ఖడ్గమృగం కనిపించి కలకలం రేపింది. అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్ (కేఎన్ పీ) సమీపంలో ఖడ్గ మృగం మృతదేహం కనిపించింది. పార్కు సమీపంలోని జపోరిపత్తర్ గ్రామస్థులు కొమ్ములతోపాటు ఉన్న జంతువు శరీరాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. కొహోరా రేంజ్ లోని మికిర్జన్ అటవీప్రాంతం డిప్లూ నదిలో ఖడ్గమృగం శరీరం కొట్టుకొని వచ్చినట్లు జపోరిపత్తర్ గ్రామస్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో కేఎన్పీ అధికారులు, పశువైద్యులు శరీరాన్ని పరిశీలించి.. ఆ మృగానిది సహజ మరణంగా నిర్థారించారు. ఎంతో దృఢంగా ఉండే ఖడ్గమృగం కొమ్ములను సురక్షితంగా భద్రపరిచేందుకు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కళేబరం వెలికితీత
- సుగర్స్ కార్మికుడు శ్రీనివాసరావుదిగా గుర్తించిన తల్లి - డిఎన్ఏ పరీక్షలకు పంపిన పోలీసులు - ఫ్యాక్టరీ యాజమాన్యంపై సర్వత్రా ఆగ్రహం చోడవరం: గోవాడ చక్కెరమిల్లు స్ప్రేపాండ్ డ్రైనేజీలో లభ్యమైన కళేబరం ఆ గ్రామానికి చెందిన పప్పల శ్రీనివాసరావు(30)గా కుటుంబసభ్యులు నిర్ధారించారు. కళేబరాన్ని పోలీసులు శ నివారం వెలికితీసి చోడవరం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. దానికి ఉన్న దుస్తులు ఆధారంగా తల్లి చెల్లయ్యమ్మ పరిశీలించి కళేబరం తన కుమారుడు శ్రీనివాసరావుదిగా గుర్తించింది. దీంతో రెండ్రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కళేబరాన్ని డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్టు ఎస్ఐ రమణయ్య తెలిపారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం మిస్టరీగానే ఉంది. రెండునెలల కిందట క్రషింగ్ జరుగుతున్న సమయంలో విధుల్లో ఉన్న కాంట్రాక్టు కార్మికుడు స్ప్రేపాండ్ తొట్టెలో ఎలా పడ్డాడు. ఇంత కాలంగా మృతదేహం అక్కడే ఉన్నా ఎవరూ ఎందుకు కనిపెట్టలేకపోయారన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. ఫ్యాక్టరీలోకి ఎవరు వెళుతున్నారు,ఎప్పుడు వెళుతున్నారు, విధుల అనంతరం ఎంతమంది వస్తున్నారనే వివరాలపై సరైన నిఘా లేదనే విమర్శలు చోటుచేసుకున్నారు. ఇందువల్లే మిల్లు హౌస్ వెనుక ఉన్న స్ప్రేపాండ్, దాని పరిసరాల్లో ఎటువంటి ఘటనలు చోటుచేసుకున్నా సకాలంలో వెలుగుచూడటంలేదనే వాదన వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా కనిపించకుండా పోయిన కొడుకు ఇలా కళేబరమై కనిపించడాన్ని తల్లి చెల్లయ్యమ్మ, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. బోరున విలపిస్తున్నారు. ఇంటికి ఆధారంగా ఉన్న కొడుకు ఇలా అకాలంగా మృతిచెందడంలో ఆ వృద్ధురాలు తనకు ఇక దిక్కెవరంటూ రోదిస్తోంది. కేసు దర్యాప్తుచేస్తున్నామని ఎస్ఐ రమణయ్య తెలిపారు. -
టీడీపీ ఎంపీల 2 నెలల జీతం విరాళం
హైదరాబాద్:తుపాను బాధితులకు టీడీపీ ఎంపీలు తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి సోమవారం స్పష్టం చేశారు. తుపాను బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. తుపాను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సుజనా చౌదరి పేర్కొన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఒక్కో ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలను సేకరిస్తున్నట్లు తెలిపారు. హుదూద్ తుపాను ప్రభావంతో మూడు జిల్లాలో భారీ ఆస్తినష్టంతో పాటు, పంట నష్టం కూడా ఏర్పడింది. దీనిపై సహాయకచర్యలు ప్రభుత్వం సిద్ధమైనా.. బాధితులు మాత్రం ప్రభుత్వం నుంచి తగిన సహకారాలు లభించడంలేదని ఆవేదన చెందుతున్నారు. -
విద్యుత్ శాఖకు రూ.500 కోట్ల నష్టం
విశాఖ: తుపాను వల్ల విద్యుత్ శాఖకు రూ. 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ స్పష్టం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లిందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. హుదూద్ పెను తుపాను కారణంగా విజయనగరం జాతీయరహదారిపై 30 కి.మీ మేర కూలిన భారీ వృక్షాలు కూలి రూ.10 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. తీవ్ర గాలుల ప్రభావంతో సముద్రంలోకి 120 బోట్లు కొట్టుకుపోయాయని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రా యూనివర్శిటిలో భవనాలు కూలిపోవడంతో ఆ నష్టం రూ.50 కోట్ల వరకూ ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న మూడు జిల్లాలకు 30 మంది ఐఏఎస్ అధికారులను తరలించినట్లు ప్రభుత్వం పేర్కొంది. -
'ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. సహకారం అందించాలి'
విశాఖ: హుదూద్ పెను తుపాను ప్రభావంతో అపార నష్టం బారిన పడ్డ ప్రజలకు తగిన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. ఈ సమయంలో అందరూ సహకారం అందించాలన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోని నీళ్లను జనరేటర్లు పెట్టి తొలగిస్తున్నామన్నారు. ఈ సాయంత్రానికి తుపాను బాధితులకు 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన, కిలో చక్కెర చొప్పున అందజేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ఆస్పత్రులకు సాయంత్రంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.తుపానులో మృత్యువాత పడిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామన్నారు. తీవ్రగాయాలైన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50వేలు అందిస్తామన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకులను బాధితులకు అందజేసేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మత్యకారులకు రూ.5 వేలు, బోటు ధ్వంసమైతే రూ.10 వేలు, మోటారు బోటుకు రూ.15 వేలు, ఆటోకు రూ.5 వేలు, ఇల్లు ధ్వంసమైతే రూ.5 వేలు పరిహారం అందిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారు రూ.15 వేలు సాయం చేస్తామన్నారు. -
విశాఖకు పొంచి ఉన్న మరో ముప్పు!
హుదూద్ తుఫాను విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసింది. సెల్ టవర్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. ఇళ్లు కుప్పకూలాయి, అపార్టుమెంట్లు బీటలు వారాయి. హోర్డింగులు పడిపోయాయి. పెద్దపెద్ద చెట్లు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. కమ్యూనికేషన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. విశాఖ నగరానికి మరో అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. లెక్కలేనన్ని మూగజీవాలు ఈ తుఫాను కారణంగా మరణించాయి. అయితే వాటి కళేబరాలను తొలగించడం అధికారులకు ఇప్పటికిప్పుడు సాధ్యం కావట్లేదు. అసలు రోడ్ల మీద వాహనాలు వెళ్లే పరిస్థితి ఎక్కడా లేదు. 200 పొక్లెయిన్లను ఉపయోగించి రోడ్లు క్లియర్ చేస్తామని చెబుతున్నా, ఇంకా పనులు పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. దాంతో రోడ్లమీద పడి ఉన్న పశు కళేబరాల కారణంగా అంటువ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా, ఎవరికీ తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకట్లేదు. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో వరదనీటినే తాగుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని, దీంతో ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. పునరావాస కేంద్రాలతో పాటు, మామూలు ఇళ్లలో కూడా ఎక్కడా మంచినీళ్లు దొరకట్లేదు. ఈ పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో కూడా ఎవరూ చెప్పలేకపోవడం విషాదం.