విశాఖ: తుపాను వల్ల విద్యుత్ శాఖకు రూ. 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ స్పష్టం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లిందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. హుదూద్ పెను తుపాను కారణంగా విజయనగరం జాతీయరహదారిపై 30 కి.మీ మేర కూలిన భారీ వృక్షాలు కూలి రూ.10 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. తీవ్ర గాలుల ప్రభావంతో సముద్రంలోకి 120 బోట్లు కొట్టుకుపోయాయని ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రా యూనివర్శిటిలో భవనాలు కూలిపోవడంతో ఆ నష్టం రూ.50 కోట్ల వరకూ ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న మూడు జిల్లాలకు 30 మంది ఐఏఎస్ అధికారులను తరలించినట్లు ప్రభుత్వం పేర్కొంది.