Diseases
-
ఓవైపు చలి మరోవైపు ఆకలి
శీతాకాలం.. అంటేనే భూమిమీద ఉత్తరార్థ గోళానికి పండుగ వాతావరణం. ప్రపంచంలో మూడోవంతు జనాభా ఇప్పుడు హాలిడే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఉత్తరార్థగోళ చలి ప్రభావాన్ని నేరుగా చవిచూస్తే గాజా స్ట్రిప్ మాత్రం వేడుకలకు దూరంగా ఆకలితో పోరాటం చేస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా పండుగకు సిద్ధమవుతుంటే క్షిపణుల మోతలు, బాంబుల దాడులతో ధ్వంసమైన గాజా నిరాశ, ఆకలితో మరణపు అంచున ఒంటరిగా నిలబడింది. ఉత్తరార్ధ గోళంలోకి వచ్చిన శీతాకాలం గాజాలో మరింత విషాదాన్ని తెచ్చిపెట్టింది. చల్లని వాతావరణం, వర్షం గాజాలో నిరాశ్రయులైన 20 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షం కురిసింది. నిర్వాసితుల గుడారాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని కూలిపోయాయి. ఇది వేలాది నిరుపేద కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టింది. బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇళ్ల నుంచి కేవలం కట్టుబట్టలతో బయటపడ్డారు. కొందరు శిథిలాల నుంచి బట్టలు తెచ్చుకున్నారు. కానీ అత్యధిక శాతం పాలస్తీనియన్లకు ఆ అవకాశం లేకుండాపోయింది. చలికాలం రావడంతో ఒంటిని వెచ్చగా ఉంచే సరైన దుస్తులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీసం చెప్పులు కూడా కొనుక్కోలేని దుస్థితి. ఆకాశాన్నంటుతున్న ధరలు ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఒక కొత్త గుడారం 1,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక తాత్కాలిక షెల్టర్ వందల డాలర్లు ఖర్చవుతుంది. ఒక కొత్త దుప్పటి 100 డాలర్ల వరకు ఉంటుంది. బట్టల ధరలు మరింత పెరిగిపోయాయి. ఒక లైట్ పైజామా ధర ఇప్పుడు 95 డాలర్లు. ఒక కోటు వంద డాలర్లు. ఒక జత బూట్లు 75 డాలర్లు. చలి కాచుకోవడానికి సరిపడా ఇంధనం లేదు. ఇక 8 కిలోల గ్యాస్ ధర 72 డాలర్లకు చేరుకుంది. కలప ధర కొంచెం తక్కువ. కానీ పునరావాస శిబిరాల్లో ఉన్న ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు. విపరీతమైన డిమాండ్‌ను తీర్చడానికి గాజా అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లు వెలిశాయి. అక్కడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రబలుతున్న వ్యాధులు వెచ్చగా ఉంచేందుకు బట్టలు, ఇంధనం లేకపోవడంతో శీతాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. పోషకాహార లోపంతో బలహీనపడిన శరణార్థుల శరీరాలు విపరీతమైన భయం, బాంబుల గాయాలతో అలసిపోయాయి. అందుకే సాధారణ జలుబును కూడా వాళ్లు తట్టుకోలేక ఊరకనే జబ్బు పడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. బాంబు దాడిలో తీవ్రంగా గా యపడిన వారికి మాత్రమే వైద్యం అందుతోంది. ఔషధాలు, సిబ్బంది కొరతతో సాధారణ రోగాలకు వైద్యం అందించలేకపోతున్నాయి. పరిశుభ్రత దాదాపు అసాధ్యంగా మారడంతో వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. చలివాతారణంలో సరైన విద్యుత్, ఇతరత్రా వసతులు ఏక గుడారాల్లో నిర్వాసితులు సరిగా స్నానం చేయలేక తిప్పలు పడుతున్నారు. చివరకు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోలేని దైన్యం వాళ్లది. అత్యంత విలాసం.. రొట్టె ముక్క అక్టోబర్ నుంచి గాజాలోకి వచ్చే అంతర్జాతీయ మానవతా సహాయం కూడా చాలా తగ్గిపోయింది. గాజా స్ట్రిప్ మొత్తం వినాశకరమైన కరువును ఎదుర్కొంటోంది. డిమాండ్ పెరిగి సరకు రవాణా బాగా తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పైకి ఎగశాయి. ఒక బస్తా పిండి ధర ఇప్పుడు ఏకంగా 300 డాలర్లకు పైనే ఉంది. ఇతర ఆహార పదార్థాలు కూడా ప్రియమైపోయాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేట మాంసం, కోడి మాంసం కోరుకోవడం చాలా పెద్ద అత్యాశ కిందే లెక్క. ఒకప్పుడు కుటుంబాలకు జీవనాడి అయిన బేకరీలు ఇప్పుడు ముడి సరుకులు అందక మూతపడ్డాయి. ఒక రొట్టె దొరకడమే చాలా కష్టంగా మారింది. పిండి దొరికినా అది పురుగులమయం. ఒకవేళ పురుగులు లేకుంటే అప్పటికే అది ముక్కిపోయి ఉంటోంది. దీంతో ప్రజలు ఇప్పుడు తకాయా(ఛారిటీ సూప్ కిచెన్ల)పై ఆధారపడవలసి వస్తోంది. ఉదయం 11:00 గంటలకు ఇవి తెరిచే సమయానికి పంపిణీ కేంద్రాల ముందు జనం చాంతాడంత వరసల్లో క్యూ కడుతున్నారు. వేలాది మంది శరణార్థుల కుటుంబాలకు తమ పిల్లలను పోషించడానికి ఇవి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. భరించలేని మానసిక వేదన ఆకలి శారీరక బాధే అయినా మానసిక వేదన అంతులేకుండా ఉంది. 2 లక్షలకు మందికి పైగా పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. సరైన పౌష్టికాహారం లేక చిన్నారుల శరీరాలు ఎముకల గూడులాగా తయారయ్యాయి. వందలమంది చిన్నారులు సరైన తిండితిప్పలు లేక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. పిల్లలకు సరైన తిండికూడా పెట్టలేకపోతున్నామన్న బాధ తల్లిదండ్రులను విపరీతంగా వేధిస్తోంది. ఆకలితో చచ్చిపోతున్న పిల్లలను చూసి నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. కన్నపిల్లలు కడతేరిపోతుంటే కన్నవారి కష్టాలకు హద్దుల్లేకుండా పోయిది. అత్యంత క్రూరమైన ఈ పరిస్థితులను దూరం నుంచి చూస్తున్న పశి్చమదేశాలు నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం. భూతలంపై నడిమధ్యలోనే ఉన్నా చలి, ఆకలితో పాలస్తీనా సమాజం ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ మరణంకోసం ఎదురుచూస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కిడ్స్‌పై కోల్డ్ వార్! 'పొడి' చెయ్యనియ్యొద్దు
చలికాలంలో చిన్నారుల చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్లు చిన్నపిల్లలు కావడంతో తమ చర్మం గురించి ఎరుక, శ్రద్ధ వాళ్లలో ఉండదు. కానీ పిల్లల్లో ముఖం, పెదవులు పగలడం, కాళ్ల దగ్గరా పగుళ్లు రావడం వంటి అంశాలతో తల్లిదండ్రులు వారికోసం ఆందోళన పడుతుంటారు. ఇది చలికాలం కావడంతో టీనేజీ లోపు చిన్నారులకు వచ్చే చర్మ సమస్యల గురించి అవగాహన కోసం ఈ కథనం.చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లూ పిల్లలందరిలోనూ... ఆ మాటకొస్తే చాలామంది పెద్దవాళ్లలోనూ కనిపించేదే. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే కొన్ని ప్రోటీన్లలోపం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబారడమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. మామూలుగా చర్మం బయటి కాలుష్యాలూ, వాతావరణం ప్రభావం, రాపిడి వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుందన్నది తెలిసిందే. అయితే ఇలా పొడిబారి, ఎర్రగా మారడంతో.. కల్పించాల్సినంత రక్షణ కల్పించలేదు. ఇలా జరగడాన్ని ‘అటోపిక్ డర్మటైటిస్’గా చెబుతారు. అయితే ఈ సమస్య తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండక... చిన్నారి చిన్నారికి మారుతుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ చర్మ సమస్య, పరిష్కారాలు తెలుసుకుందాం. ఇటీవల వాతావరణంలో కాలుష్యాలు బాగా పెరగడం, పిల్లలు గతంలోలా ఆరుబయట మట్టిలో ఆడక΄ోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, తల్లిపాలకు బదులు డబ్బాపాలపై ఆధారపడటం, పిల్లలు సిజేరియన్ ప్రక్రియతో పుట్టడం వంటి కారణాలతో చిన్నారుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సరైనవిధంగా నియంత్రితం కావడం లేదు. దాంతో డాక్టర్లు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్‌ను ఎక్కువగా చూస్తున్నారు.ఈ సమస్యలో మొదట చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురద వస్తుంటుంది. పిల్లలు పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఆ తర్వాత దురద మరింతగా పెరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలూ ఒక సైకిల్ (ఇచ్–స్క్రాచ్ సైకిల్)లా నడుస్తుంటాయి. ఈ అటోపిక్ డర్మటైటిస్ అన్నది నెలల పిల్లలు మొదలుకొని, ఏడాది వయసు వారి వరకు కనిపించవచ్చుపిల్లల్లో 12 నెలల వయసు వరకు... ప్రభావితమయ్యే భాగాలుచర్మం ఎర్రబారడమన్నది ముఖంపై కనిపిస్తుంటుంది గాని నిజానికి చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా ఇలా జరగవచ్చు.΄పాకే పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకు΄ోతుంటాయి కాబట్టి వీళ్లలో మోకాళ్ల వద్ద ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది.ఏడాదీ రెండేళ్ల పిల్లల్లో... ఈ వయసు పిల్లల్లో చర్మం ప్రభావితం కావడంమన్నది చర్మం ముడుతలు పడే ్ర΄ాంతాల్లో ఎక్కువ. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో...ఈ వయసు పొడిబారడం మోకాళ్ల కిందనున్న చర్మంలో చాలా ఎక్కువ. ముఖం మీద చర్మం పెద్దగా పగలదు. పెదవులు చీలినట్లుగా కావడం, కంటి చుట్టూ నల్లటి ముడతలు, మెడ మురికిపట్టినట్లుగా నల్లగా కనిపించడం, కాళ్ల వేళ్లకింద పగుళ్లు (ఫిషర్స్), చేతి గీతలు కాస్త ప్రస్ఫుటంగా కనిపించడం, వెంట్రుకలు ఉన్నచోట బొబ్బల్లా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో...ఏడు కంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వారిలో అటోపిక్ డర్మటైటిస్ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం పగిలి ఉండటంతో తరచూ వైరల్ ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ వంటివి; అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉదాహరణకు స్టెఫాలోకోకల్ వంటివి కనిపించవచ్చు. నివారణ / మేనేజ్మెంట్ అండ్ చికిత్స స్నానం చేయించే వ్యవధి ఎంత తక్కువైతే అంత మంచిది. గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయించాలిస్నానం చేసిన వెంటనే పూర్తిగా తుడవకుండా టవల్‌తో అద్దుతూ ఆ తేమ మీదనే మాయిశ్చరైజర్ పట్టించాలి కాళ్లూ, చేతులు ఎక్కువగా పొడిబారతాయి కాబట్టి మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండు మూడుసార్లయినా పట్టించడం మంచిది ఉలెన్ దుస్తుల వల్ల పిల్లలకు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే వాటికి బదులు కాటన్ దుస్తులు ధరింపజేయడం మేలు దోమల వల్ల కూడా పిల్లల చర్మంపై దుష్ప్రభావం పడే అవకాశముంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్కూలుకు వెళ్లే వయసు పిల్లలకు షూజ్తో కాటన్ సాక్స్ వాడటం, గట్టి చెప్పులకు బదులు కాస్త మెత్తటి పాదరక్షలు వాడితే కాళ్ల పగుళ్ల వల్ల కలిగే బాధలు తగ్గుతాయి సమస్య మరింత తీవ్రమైతే డర్మటాలజిస్టులను కలవాలి. సమస్య తీవ్రతను బట్టి వారు తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు
2024వ సంవత్సరంలో చివరి దశకు చేరుకున్నాం. ఈ ఏడాదిలో దేశంలో కొన్ని నూతన వ్యాధులు అందరినీ వణికించాయి. నిపా, జికా, క్రిమియన్-కాంగో బ్లీడింగ్ ఫీవర్‌తో పాటు క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ వ్యాప్తి అందరినీ ఆందోళనకు గురిచేసింది.నిపా వైరస్: దీనిని జూనోటిక్ పారామిక్సోవైరస్ అని అంటారు. ఇది ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. భారతదేశంలో ఈ వైరస్ వ్యాప్తి తొలిసారిగా 2018 మేలో కేరళలో కనిపించింది. ఈ వైరస్ గబ్బిలాలు లేదా పందుల ద్వారా వ్యాప్తిచెందుతుంది.జికా వైరస్: ఏడెస్ ఈజిప్టి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో తొలిసారిగా 2021 జూలైలో కేరళలో ఈ వైరస్ కనిపించింది.క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్: గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో తొలిసారిగా ఈ వైరస్ కనిపించింది.చండీపురా వైరస్: దోమలు, పేలు, ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. భారతదేశంలో తొలిసారిగా 1965లో మహారాష్ట్రలో ఈ వైరస్ కనిపించింది. 2024లో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు కనిపించాయి. డెంగ్యూ: ఏడెస్ ఈజిప్టి లేదా ఏడెస్ ఆల్బోపిక్టస్ ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో మొదటి ఈ కేసు తొలిసారిగా 1780లో చెన్నైలో కనిపించింది. 2024లో పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.జపనీస్ ఎన్సెఫాలిటిస్: భారతదేశంలో ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ 2024లో తొలిసారిగా కనిపించింది.క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్‌డీ): భారతదేశంలో విస్తరిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్గా కేఎఫ్‌డీ మారింది.ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు: హాంటావైరస్, చికున్‌గున్యా వైరస్, హ్యూమన్ ఎంట్రోవైరస్-71 (ఈవీ-71), ఇన్ఫ్లుఎంజా, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) కరోనావైరస్. ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
ఉప్పు ఊబిలోకి..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అతి సర్వత్రా వర్జయేత్.. ఏ విషయంలోనూ అతి పనికిరాదు అని చెప్పడానికి ఉద్దేశించిన సూక్తి ఇది. కానీ, ఇప్పుడిది తలకిందులవుతోంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో.. అది కూడా ఉప్పు వాడకంలో. దీని వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగిందని.. ఫలితంగా లక్షలాది మంది వినియోగదారులు జీవనశైలి జబ్బులకు గురవుతున్నట్లు న్యూఢిల్లీలోని ఎయిమ్స్, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్ అండ్ రీసెర్చ్ (ఎన్‌సీడీఐఆర్) సంస్థలు గుర్తించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు సగటున ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు వాడకూడదని సూచించగా.. ఏపీలో రోజుకు 8.7 గ్రాముల నుంచి 9 గ్రాముల వరకు వాడుతున్నట్లు అవి తేల్చాయి. సోడియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు వాడటంవల్ల జీవితకాల వైకల్యానికి దారితీస్తుందని ఆయా సంస్థలు వెల్లడించాయి.ఊబకాయులకు అధిక ముప్పు..ఆంధ్రప్రదేశ్‌లో ఉప్పు అధిక వినియోగంవల్ల ఊబకాయుల్లో అధిక ముప్పు పొంచి ఉందని ఆ సంస్థలు స్పష్టంచేశాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది అధిక ఉప్పు వినియోగించడంవల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారని, దీని కారణంగా వారు పక్షవాతం బారిన పడుతున్నారని పేర్కొన్నాయి. అలాగే, జనాభాలో ఎక్కువమంది అధిక మోతాదులో తీసుకోవడంవల్లే ఉప్పు ఊబిలో కూరుకుపోయి రకరకాల జబ్బులకు గురవుతున్నట్లు తేల్చారు. అదే అధిక ఆదాయ దేశాల్లో ఉప్పు వినియోగం తక్కువగా ఉందని, దీనివల్ల హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కేసులు అక్కడ తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ప్యాక్ చేసినవి, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలని.. ఆకుకూరలు, కూరగాయల్లో సహజ సిద్ధంగానే కొంత ఉప్పు శాతం కలిగి ఉంటాయని, వాటిని అనుసరించి అదనపు ఉప్పును తగ్గించుకోవాలని సర్వే సంస్థలు సూచించాయి. ఇక దేశంలో మధుమేహం, బీపీ, గుండెపోట్లు పెరుగుతున్న నేపథ్యంలో.. ఉప్పు, చక్కెర వంటివి వీలైనంత తక్కువగా వాడాలని ఐసీఎంఆర్ సూచించింది. 40 ఏళ్లు దాటిన వారిలో అధికంగా..ఈ సంస్థలు 18–69 ఏళ్ల వయస్సున్న వారిలో సర్వే నిర్వహించగా.. 70 శాతం మందికి ఉప్పు వినియోగంపై అవగాహన కానీ, దానివల్ల కలిగే ప్రమాదంగానీ తెలీదని తేలింది. సుమారు 3 వేల మందిపై ఈ సర్వే చేయగా.. ఉప్పు వలన కలిగే ప్రతికూలతలపై వారినుంచి సరైన సమాధానాలు రాలేదని, దీన్నిబట్టి వారికి ఉప్పు వినియోగంపై అవగాహనలేదన్న విషయం వెలుగుచూసింది. ఇక పలువురిలో రక్త నమూనాలు, మూత్ర నమూనాలు సేకరించి వారి నుంచి సోషియో డెమోగ్రాఫిక్, బిహేవియర్, మెటబాలిక్ లక్షణాలనూ అంచనా వేశారు. -
కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!
వైద్య సంరక్షణలో కళను నింపడం ద్వారా ప్రజలలో ఆరోగ్య అక్షరాస్యతను పెంచడానికి ఓ కొత్త ఒరవడిని సృష్టించారు కళాకారులు. తమ సృజనాత్మక ఆలోచనల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించారు. పుణెలో జరిగిన ఈ హెల్త్ ఆర్ట్ కార్యక్రమం ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది.పాయిజన్ అండ్ యాంటి డోట్’ పెయింటింగ్ ద్వారా కళాకారుడు సాగర్ కాంబ్లే కొంకణ్ ప్రాంతంలోని కఠినమైన వాస్తవాలను చిత్రించాడు. ఈ ప్రాంతంలో వైద్య సంరక్షణ చాలా తక్కువగా ఉండటం, తేలు కుట్టిన చికిత్సపై పరిశోధనలో ప్రసిద్ధి చెందిన వైద్యుడు, పద్మశ్రీ డాక్టర్ హిమ్మత్రావు బావస్కర్ ఎలా ప్రసిద్ది చెందాడు, ప్రాణాలను ఎలా కాపాడారు? అనేది పెయింటింగ్స్ ద్వారా చూపారు.పోషకాహార లోపం... ఓ చిత్రణ‘ఎ టేల్ ఆఫ్ డ్యూయల్ బర్డెన్’ అనే తన కళాకృతిలో జరా షేక్ ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సి.ఎస్ యాజ్నిక్ పరిశోధనను దృశ్యంగా చూపారు. ఇది పోషకాహార లోపం– రెట్టింపు భారం‘ గురించి నొక్కి చెబుతుంది. పోషకాహార లోపం చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఊబకాయం, మధుమేహం పెరగకుండా నిరోధించడానికి, పునరుత్పత్తి సమయాలలో మహిళలకు సాధికారత, మద్దతు అవసరం గురించి తెలియజేస్తుంది. ‘రంగ్ దే నీలా’ అనే ఈ వినూత్న ప్రాజెక్ట్ ‘హీలింగ్ జర్నీస్’లో ఒక ప్రత్యేక భాగం. ఆర్ట్ మీట్స్ హెల్త్ అనే క్యాప్షన్‌తో ఆరోగ్య విద్యలో చొరవ చూపుతుంది. రంగ్ దే నీలా వ్యవస్థాపకుడు అమీ షా వైద్య నిపుణుల సహకారంతో 100 కళాకృతుల సేకరణ ద్వారా ఈ కథలకు జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వర్క్షాప్స్కళ ద్వారా ఆరోగ్య అక్షరాస్యత, శ్రేయస్సు భావాన్ని పెంపొందించడానికి అమి షా ‘రంగ్ దే నీలా‘ కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించారు. మొదట ‘రంగ్ దే నీలా’ గ్రామీణ వర్క్‌షాప్‌లతో ప్రారంభమైంది. ఇక్కడ కళాకారులు, వైద్యులు కళను రూపొందించడానికి సహకరించారు. వర్క్‌షాప్‌లలో పాల్గొన్న కళాకారులు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులతో చర్చించారు. వైద్య నిపుణులు మాత్రం భావోద్వేగాలు నింపుకున్న కళాకారులుగా కొత్త ప్రశంసలను ΄పొందారు.ర్యాంప్‌పై నడకఈ సందర్భంగా నిర్వహించిన ‘వాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్‘లో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకున్న రోగులు వైద్యులతోపాటు ర్యాంప్‌పై నడిచారు. చీర సంప్రదాయాన్ని హైలైట్ చేయడమే కాకుండా ఒక ముఖ్యమైన ఆరోగ్య సందేశాన్ని కూడా అందించారు. మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, సమస్యలను నివారించడం, వైకల్యాలు ఉన్నప్పటికీ బాగా జీవించడం, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేయడానికి తోలుబొమ్మలాటనూ ప్రదర్శించారు.వైద్యులను ప్రోత్సహించడానికి...హీలింగ్ జర్నీ ద్వారా వివిధ రోగాల నుంచి కోలుకున్న 100 స్ఫూర్తిదాయకమైన కథనాల సమాహారాన్ని అందించారు. ‘గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్, ఇతర అనారోగ్యాలతో పోరాడిన వ్యక్తులు నొప్పి నుండి ఎలా నయం అయ్యారనే దాని గురించి వారి కథనాలను పంచుకున్నారు. ఈ కథలను తీసుకొని వాటిని అద్భుతమైన కళాఖండాలుగా మార్చడమే మా లక్ష్యం’ అని షా అన్నారు.ప్రస్తుతం పూణేలో ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇవ్వడానికి, వైద్యులను ప్రోత్సహించడానికి, షా మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 40 కథలు రికార్డ్ చేశాం, 28 కాన్వాస్‌లు పూర్తయ్యాయి. ‘ప్రజలు, కమ్యూనిటీలు మరింత ఆరోగ్య–అక్షరాస్యులుగా మారడానికి ఆరోగ్యం పట్ల వారి వైఖరిని మార్చడానికి కళలను కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉపయోగించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం‘ అని షా చె΄్పారు. -
సూక్ష్మజీవుల దండయాత్ర
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలపై సూక్ష్మజీవులు దండయాత్ర చేస్తున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఈస్ట్, శిలీంధ్రాల దాడితో ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. మురుగు నీటిలో ఎక్కువ రోజులు ఉండటం, క్రిమికీటకాలు కుట్టడం వల్ల సూక్ష్మజీవులు శరీరంపై చేరి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ముంపు తగ్గిన నేపథ్యంలో ఇన్ఫెక్షన్ల బారినపడిన వందలాది మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు వరదలతో సర్వం కోల్పోయి బాధితులు మానసిక ఒత్తిడిలో ఉంటే.. ఇప్పుడు వారిని ఇన్ఫెక్షన్లు వెంటాడుతున్నాయి. వరద వచ్చి 15 రోజులైనా ఇంకా కొన్ని ప్రాంతాలు పూర్తిగా కోలుకోలేదు. ఇళ్లలోని దుస్తులు, సామాన్లను శుభ్రం చేసుకునే క్రమంలో మురుగు నీటిలోనే ఉండటం, క్రిమికీటకాలు ఉండటంతో ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. – లబ్బీపేట (విజయవాడ తూర్పు)వరద తగ్గిందని ఊరట చెందేలోపే... వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కువ రోజులు నీటిలోనే నానటం, సూక్ష్మజీవులు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ల బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.పాచిపోయిన పాదాలతో ఇన్ఫెక్షన్లు సోకిన వారు ఆస్పత్రులకు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారు చికిత్సకోసం వస్తున్నారు. అలాంటి వారిలో కొందరికి ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వారిలో కొందరికి ఇన్ఫెక్షన్లతో కాళ్లపై పుండ్లు వచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన శానిటరీ వర్కర్‌కు నీటిలో క్రిమి కుట్టడంతో చేతికి ఇన్ఫెక్షన్ సోకి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి చేతికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటంతో చేయి తీసి వేయాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికే వైద్యులు తెలిపారు. మానసిక ఒత్తిళ్లతో..వరద ప్రాంతవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు ఇష్టమైన సామాన్లు ఎంతోకాలం కష్టపడి సమకూర్చుకుంటే ఇప్పుడు అవన్నీ వరద పాలయ్యాయి. చాలా వరకూ పనికిరాకుండా పోయాయి. మరికొందరు ఆ ప్రాంతంలో సొంత ఇళ్లను సైతం సమకూర్చుకున్నారు. రుణాలు తీసుకుని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. తాము ఇళ్లు కొన్నది ముంపు ప్రాంతంలోనా! అంటూ కొందరు వేదన పడుతున్నారు. ఇలా వరద బాధితులందరూ ప్రస్తుతం మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. అలాంటి వారిలో దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దుష్ఫలితాలు ఉంటాయని, వ్యాధులున్న వారు పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదుపులో ఉండని వ్యాధులతో..ముంపు ప్రాంతాల్లో వేలాది మంది దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వాటితో బాధపడుతున్న వారు సైతం ఉన్నారు. వారంతా ఇళ్లలోకి నీరు రావడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చారు. దీంతో వాళ్లు రెగ్యులర్‌గా వాడే మందులు నీట మునిగాయి. దీంతో 15 రోజులుగా మందులు వాడకుండా ఉండటంతో మధుమేహం, రక్తపోటు వంటివి అదుపు తప్పాయి. అలాంటి వారికి ఇన్ఫెక్షన్లు సోకితే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు అదుపులో లేనివారికి ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గే అవకాశం ఉండదంటున్నారు. ఇన్ఫెక్షన్ల బాధితులే అధికంవరద ముంపు ప్రాంతాల నుంచి కాళ్లకు ఇన్ఫెక్షన్లు సోకిన వారు చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్నారు. ఎక్కువ రోజులు మురుగు నీటిలో నడవడం వల్ల కాళ్లు పాచిపోయి ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. మందులు వరద పాలవడం వల్ల మధుమేహులు మందులు సక్రమంగా వాడక, శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయి ఉంటాయి. మానసిక ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ఇన్ఫెక్షన్లు సోకితే ప్రమాదమే. సక్రమంగా మందులు వాడుతూ.. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా చూసుకోవాలి. -
వరద ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్ఎంను ఫోన్లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
మందు లవర్స్! లివర్ జాగ్రత్త!
గతంలో మద్యం తాగడం తప్పు అన్న భావనతో చాలామంది దానికి దూరంగా ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో తాగడం ఓ ఫ్యాషన్ అనే ధోరణి పెరుగుతుండటంతో పాటు... ఆల్కహాల్ అంటే మూడు నాలుగు దశాబ్దాల కిందట ఉన్న అపరాధభావన క్రమంగా కనుమరుగైపోతుండటంతోయువత ఎలాంటి జంకు గొంకు లేకుండా మద్యానికి అలవాటు పడుతున్నారు. దాంతో ఇటీవల యువతలో ఫ్యాటీలివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, స్కార్డ్ లివర్, లివర్ సిర్రోసిస్ లాంటి ‘ఆల్కహాలిక్ సంబంధిత కాలేయ వ్యాధులు’ (ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్) పెరుగుతున్నాయి. మద్యం ఎన్నిరకాలుగా కాలేయాన్ని దెబ్బతీస్తుందో, ఎన్ని వ్యాధులు కలగజేస్తుందో తెలుసుకుందాం...కాలేయం అత్యంత కీలకమైన అవయవం. జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు బయటనుంచి జీర్ణవ్యవస్థ ద్వారా ఏ పదార్థం దేహంలోకి ప్రవేశించినా అందులోని విషాలను విరిచివేసి, వాటిని బయటకు ప్రయత్నిస్తుంది. ఆల్కహాల్ కూడా ఒకరకంగా విషమే. అందుకే దాని దుష్ప్రభావం పడకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో దీర్ఘకాలంగా మద్యం తాగే అలవాటున్న వ్యక్తుల్లో క్రమంగా పలు మార్పులకు లోనవుతుంది. దాంతో ఫ్యాటీలివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, సిర్రోసిస్, కాలేయంపైన ఓ గాటులాంటిది పడే స్కారింగ్ వంటి దుష్ప్రభావాల కారణంగా క్రమంగా లివర్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. ఇలా కాలేయాన్ని దెబ్బతీసి, ్రపాణాపాయం వైపునకు వెళ్లేలా చేసే వ్యాధులివి...ఫ్యాటీలివర్ : శక్తిగా మారి, దేహ అవసరాలు పూర్తయ్యాక అదే చక్కెర కాలేయంలో కొవ్వు రూపంలో పేరుకు΄ోతుంది. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఇది చాలా వేగంగా జరుగుతూ కాలేయ కణాలు కొవ్వు పేరుకున్నట్లుగా మారి΄ోతాయి. ఈ కండిషన్‌ను ఫ్యాటీలివర్ అంటారు. ఫ్యాటీలివర్‌లో మూడు దశలుంటాయి. మొదటి దశ : ఈ దశలో కాలేయ కణాల మధ్య కొద్దిగా కొవ్వు పేరుకుంటుంది. ఇది ్రపాథమిక సమస్య. రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడటంతో పాటు కొన్ని కాలేయ కణాలు నశిస్తాయి. కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్కు కూడా గురికావచ్చు. అంతేకాదు కాలేయం గాయపడటం వల్ల... ఓ మచ్చగా అంటే... స్కార్లాగా ఏర్పడవచ్చు. మూడో దశ: ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోవడమేగాక దాన్ని ఆకృతి కూడా మారిపోతుంది. కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ దశలో కాలేయ మార్పిడి తప్ప మరో వైద్యమేమీ పనిచేయదు. ఫ్యాటీలివర్ లక్షణాలు : మొదట్లో లక్షణాలు పెద్దగా కనిపించవు. అయితే సాధారణంగా ఇతర సమస్యలకోసం అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నవారిలో ఇది బయటపడుతుంటుంది ∙కొందరికి కుడివైపు పోట్ట పైభాగంలో (రిబ్కేజ్ కింద) ΄÷డుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరుగుతుండటం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఫ్యాటీలివర్ వల్ల పరిణామాలు : ∙ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే అది కాలేయం పూర్తిగా దెబ్బతిని΄ోయే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి పరిణామాలకు దారితీయవచ్చు ∙ఫ్యాటీ లివర్ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్)కూ, అక్కడి నుంచే క్రమంగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుందని భావించడానికే వీల్లేదు. కొన్నిసార్లు నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ తొలిదశలో ఇది కనిపించినప్పుడే జాగ్రత్తపడాలి. ఫ్యాటీ లివర్‌కు చికిత్స : ∙ఆల్కహాల్‌తోనే ఫ్యాటీలివర్ వచ్చిందని తేలితే... లేదా ఇది వచ్చిన వారిలో ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటి మార్గాలను డాక్టర్లు సూచిస్తారు చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. లివర్ స్కార్ : ఆల్కహాల్ అలవాటు మితిమీరిన కొందరిలో కాలేయం వాపు రావచ్చు. దాన్ని లివర్ ఎన్లార్జ్మెంట్గా చెబుతారు. వీళ్లలో ఆ గాయం తీవ్రమై కాలేయం మీద మచ్చ (స్కార్)లా ఏర్పడవచ్చు. ఇది చాలా ప్రమాదం తెచ్చిపెట్టే అంశం కాబట్టి జాగ్రత్తపడాలి. లివర్ సిర్రోసిస్ : హెపటైటిస్–ఏ, హెపటైటిస్–బి, హెపటైటిస్–సి, హెపటైటిస్–డి, హెపటైటిస్–ఇ వంటి కొన్ని కాలేయ ఇన్ఫెక్షన్లు ముదరడంతో లివర్ సిర్రోసిస్ రావచ్చు. అలాగే ఆల్కహాల్ అలవాటు కారణంగా కాలేయం ఆకృతి, దానికి ఉండే సహజ స్వాభావికమైన రంగు దెబ్బతిని, అది జిగురుజిగురుగా మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి ఆల్కహాల్ తీసుకునే అలవాటుంటే సిర్రోసిస్ ముప్పు మరింత ఎక్కువ. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి మద్యం అలవాటు ఉంటే అది కాలేయ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. ఇలాంటివారికి ప్రమాదం మరింత ఎక్కువ. నిర్ధారణ పరీక్షలు: ∙అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌తో చాలా వరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది ∙ఫ్యాటీలివర్ మొదలుకొని మిగతా అన్ని కాలేయ సమస్యలకు లివర్ ఫంక్షన్ పరీక్ష (ఎల్ఎఫ్టీ) అవసరం. దాంతో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న విషయం తెలుస్తుంది ∙డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు ఏమైనా పెరిగాయా అన్నది కూడా పరిశీలించాలి ∙కొందరిలో లివర్ బయాప్సీ (అంటే సూది ద్వారా కాలేయానికి సంబంధించిన చిన్న ముక్కను సేకరించి) చేయించాల్సిన అవసరం ఉంటుంది.ఫ్యాటీలివర్ దశలోనే జీవనశైలి మార్పులో జాగ్రత్తపడటం చాలా మేలు. అయితే... పరిస్థితి లివర్ సిర్రోసిస్ దశకు చేరాక కాలేయ మార్పిడి మినహా మరే చికిత్స కూడా సాధ్యం కాదు. అందుకే ఫ్యాటీలివర్ దశలో ఉన్న సమయంలోనే ఆల్కహాల్ అలవాటు పూర్తిగా మానేయడం మంచిది. -
ఊరూ.. వాడా.. చెత్తగుట్టలు
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతటా వ్యాధులు ప్రబలుతున్నా పారిశుద్ధ్యం ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోవడంతో అంటు రోగాలు, విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణాలు, నగరాల మాదిరిగానే రాష్ట్రంలోని దాదాపు 90 శాతానికి పైగా గ్రామాల్లో గత మూడేళ్లు కనీసం రెండు రోజులకు ఒకసారి ఇంటింటా చెత్త సేకరణ జరిగింది. గ్రామ పంచాయతీల్లో పనిచేసే క్లాప్ మిత్రలు ప్రతి రోజూ తమ పరిధిలోని ఇళ్ల వద్దకు వెళ్లి చెత్తను సేకరించేవారు. రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా గత రెండున్నర నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ చేపట్టే పంచాయతీల సంఖ్య నామమాత్రంగా ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వెబ్సైట్ ప్రకారం శనివారం (ఆగస్టు 24వ తేదీ) రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగలేదని గణాంకాలు పేర్కొంటున్నాయి.ఐదేళ్ల క్రితం కూడా ఇవే పరిస్థితులు నెలకొనగా మాజీ సీఎం వైఎస్ జగన్ 2021లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా ఇంటింటా చెత్త సేకరణను ప్రారంభించారు. గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు దాదాపు 14 వేల దాకా మూడు చక్రాల రిక్షాలు, వెయ్యి చెత్త సేకరణ ఆటోలతో పాటు గ్రామాల్లో దోమలు నియంత్రణకు ఫాగింగ్ కోసం 10,628 యంత్రాలు, 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు, 6,417 శానిటరీ వేస్ట్ ఇన్సినేటర్స్లను ప్రభుత్వ నిధులతో మంజూరు చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో దాదాపు 75 వేల కోట్ల టన్నుల తడి, పొడి చెత్తను గ్రామాల్లో ఇంటింటా సేకరించారు. దీన్ని వర్మీ కంపోస్టుగా మార్చి విక్రయించడం ద్వారా ఆయా గ్రామాలు ప్రాథమిక దశలో రూ.5 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని పొందాయి. ఇప్పుడు గ్రామాల్లో ఇంటింటా చెత్త సేకరణ నిలిచిపోవడంతో రోగాలు ముసురుకుంటున్నాయి.మంకీపాక్స్ నిర్ధారణ కిట్ తయారీసాక్షి, విశాఖపట్నం: ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధిని గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఆర్టీపీసీఆర్ కిట్ విశాఖలో తయారైంది. ఏపీ మెడ్‌టెక్‌జోన్‌లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్ సంస్థ ఎర్బా ఎండీఎక్స్ పేరుతో ఈ కిట్‌ను రూపొందించింది. ఈ ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణపత్రం అందించగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతిని పొందింది. గంటలో మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ ఫలితాలు ఈ కిట్ ద్వారా తేలనుంది. కోవిడ్–19 మాలిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్‌లలో వీటిని తయారు చేసి ప్రయోగాలు నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ వజిరానీ వెల్లడించారు. నేడు, రేపు దక్షిణ కోస్తా, సీమలో వానలుసాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తేమ గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి నైరుతి దిశగా వస్తున్నాయి. ఈ కారణంగా ఆది, సోమ వారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా తూర్పు గోదావరి నుంచి గుంటూరు జిల్లా వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలకు ఆస్కారముంది. రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడా మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 29, 30, 31 తేదీలు, సెప్టెంబర్ మొదటి వారంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.మార్చి 31లోపు రిటైరయ్యే వారికి బదిలీ వద్దు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయవద్దని, వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయాలంటే ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉద్యోగులకు కూడా బదిలీలను వర్తింప చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో 15 శాఖలకు బదిలీలు వర్తింప చేయగా ఇప్పుడు 16వ శాఖగా ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌కు వర్తింప చేశారు.మలేరియాలో కుప్పం మహిళ గల్లంతు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం సాక్షి, అమరావతి: మలేరియా రాజధాని కౌలాలంపూర్‌లో ఫుట్‌పాత్ కుంగిపోవడంతో కుప్పం అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి (45) అనే మహిళ మురుగు కాలువలో పడి గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తక్షణం గాలింపు చర్యలు చేపట్టే విధంగా మలేషియా అధికారులతో సంప్రదింపులు జరపాల్సిందిగా ఏపీ ఎన్ఆరీ్టఎస్ను ఆదేశించారు. మహిళ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటూ, గాలింపు చర్యలు పగడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. మలేషియాలో గాలింపు చర్యలు జరుగుతున్నాయని, శనివారం రాత్రి వరకు గల్లంతైన విజయలక్ష్మి ఆచూకీ తెలియలేదని ఏపీ ఎన్ఆరీ్టఎస్ అధికారులు వెల్లడించారు. -
మానవుల వల్లే వైరస్ల విజృంభణ!
వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికం అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క ప్యారిస్‌లో భారీ మహోత్సవాల మధ్య ఒలింపిక్స్ జరుగుతుండగా... ఇంకోపక్క దేశంలో నిఫా, చాందీపుర వైరస్లు కూడా ఒలింపిక్స్ మాదిరిగానే వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని హెచ్చరి స్తుండటం గమనార్హం. వీటన్నింటినీ పక్కనపెట్టినా, సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్ రకాలు తెరిపి లేకుండా మనిషిని జబ్బున పడేస్తూనే ఉన్నాయి. అనేక వైరస్ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకు తున్నవే. అదేదో జంతువులు మనపై కక్షకట్టి చేస్తున్న పనేమీ కాదు. మానవులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలను మళ్లీ సంపాదించు కునే పనిలో ఉన్నాయనీ కాదు. అడవిలో బతికే జంతుజాలాన్ని మనం మన ఆవాసాల్లోకి చేర్చుకున్నాం కాబట్టి! అలాగే మన మధ్యలో ఉన్న జంతువులు అటవీ ప్రాంతాల్లోకి చేరేందుకు తగిన ‘మార్గం’ వేశాము కాబట్టి! అటవీ ప్రాంతాల విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతూండటం, రకరకాల పెంపుడు జంతువుల ఎగు మతి, దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తూండటం వంటివన్నీ వైరస్లు కూడా మనుషుల్లోకి జొరబడేందుకు అవ కాశాలు పెంచుతున్నాయి. పెరుగుతున్న వేడి... తరుగుతున్న నీరువాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషు లతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వైరస్లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కలిగించేందుకు వీలు కల్పించే కొత్త కొత్త జంతు అతిథులు వైరస్‌లకు లభిస్తున్నాయి. సైన్ ్స రచయిత ఎడ్ యంగ్ ఇటీవల ‘ది అట్లాంటిక్’లో రాస్తూ... మనిషి ‘ప్యాండెమిసీన్’ యుగాన్ని సృష్టించుకున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్ అని, మనిషి పుట్టుక తరువాతి యుగాన్ని ఆంత్రో పసీన్ అని పిలిస్తే... ప్రస్తుత మహమ్మారుల యుగాన్ని ప్యాండెమిసీన్ (పాండమిక్ = మహమ్మారి) అని పిలిచాడన్నమాట. జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ ఛేంజ్ జీవశాస్త్రవేత్త కాలిన్ కార్ల్సన్ ఈ మధ్యే ఈ ప్యాండెమిసీన్ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనుషులకు సోకే అవకాశముందో అంచనా కట్టారు. ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం... మనిషిని ముట్టడించేందుకు అవకాశమున్న వైరస్ల సంఖ్య ఏకంగా పదివేల రకాలు! ప్రస్తుతం వీటిల్లో అత్యధికం జంతువుల్లో మాత్రమే తిరు గుతూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతూండటంతో అవి ఇతర జంతువులకు అంటే మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. వాతావరణ సంక్షోభం కాస్తా జంతువులు, మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తూండటం గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందం అయిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వైరస్‌లకు జాతర లాంటిది అంటే అతిశయోక్తి కాదు. అసలు పరిచయమే లేని బోలెడన్ని వైరస్లు ఒక దగ్గర చేరితే ఎన్ని కొత్త స్నేహాలు, బంధుత్వాలు కలుస్తాయో ఊహించుకోవచ్చు.వినాశకర మార్పులువేర్వేరు వాతావరణ, భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్ల్సన్ వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3,139 క్షీరద జాతులు (పాలిచ్చి పెంచే జంతువులు) సహజ ఆవాసాలకు దూరంగా వలస వెళతాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎతై ్తన, జీవవైవిధ్య భరిత, జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్ల సంచారం నాలుగు వేల రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియా లోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్లు మను షులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని కార్ల్సన్ బృందం అంచనా వేస్తోంది. వీటిల్లో 15,000 వరకూ క్షీరదాలు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్సన్ హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగవచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. కనిపించేది కొంతే... పొంచివున్నది ఎంతో!కార్ల్సన్ బృందం చేపట్టిన ఈ అధ్యయనం పేరు ‘ఐస్‌బర్గ్ స్టడీ’. అంటే పైకి కనిపించే భాగం మాత్రమే. కనిపించనిది ఇంకా చాలానే ఉందన్నమాట. ప్రస్తుతం ఎక్కువ అవుతున్న జూనోటిక్ వ్యాధులు రాగల ప్రమాదాలతో పోలిస్తే చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతుంది. క్షీరదాల్లో గబ్బిలాలు జూనోటిక్ వైరస్ల విజృంభణలో ముందు వరసలో ఉన్నాయి. సార్స్ కోవ్–2 కూడా వూహాన్ ప్రాంతంలోని గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందే. ఎక్కువ దూరాలు ప్రయాణించగల సామర్థ్యం వల్ల ఈ గబ్బిలాలు వాతావరణ మార్పులకు వేగంగా స్పందిస్తాయి. వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తాయి. తమతోపాటు వైరస్‌లను కూడా మోసుకొస్తాయి.పండ్లను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఈ వైరస్ జాడలు పండ్ల నుంచి మనకూ సోకుతాయన్నమాట. నిఫా వైరస్ ప్రస్థానం కూడా దాదాపుగా ఇలాంటిదే. ఆగ్నేయాసియా ప్రాంతంలో గబ్బిలాల జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి సరికొత్త వ్యాధులు పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువే. అయితే జలచరాలు, పక్షుల ద్వారా కూడా వైరస్లు మనిషికి సోక వచ్చు. ఇన్ ఫ్లుయెంజా వైరస్ రకాలకు పక్షులు ఆతిథ్యమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు అనేవి వ్యవస్థ మొత్తాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్యను మనం మరింత తీవ్రతతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ఐస్‌బర్గ్ స్టడీ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన వన్ హెల్త్ (మనుషులతోపాటు పరిసరాల్లోని జంతువులపై కూడా పర్యవేక్షణ) మైక్రోబియల్ నిఘా వ్యవస్థ, వేర్వేరు ప్రాంతాలు, జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించడం వంటివి ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను సరిగ్గా అంచనా కట్టే ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటూ తప్పనిసరి. అప్పుడే కొత్త వ్యాధుల ఆగమనం, వాటిని అడ్డుకోవడం, సమర్థంగా తిప్పికొట్టడం సాధ్య మవుతుంది. కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ మాజీ అధ్యక్షులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
జంతు ప్రేమికా.. జాగ్రత్త సుమా!
రాజమహేంద్రవరం రూరల్ /రాయవరం/ కాకినాడ సిటీ: మూగజీవాల పెంపకంపై ఎంతో మంది శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ప్రస్తుతం అవి మానవ జీవితంతో ముడిపడ్డాయి.. నిన్న మొన్నటి వరకూ సరదాకు, ఇంటి కాపలాకు పరిమితమైన కుక్కల పెంపకం ప్రస్తుతం స్టేటస్ సింబల్‌గా మారింది. అలాగే గుర్రాలు, కుందేళ్లు, పిల్లులతో పాటు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోతులు వంటి వాటినీ పెంచుకుంటున్నారు. ఎంతో ఇష్టంగా సాకుతున్న జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. శనివారం ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం రండి.ఆ పేరు ఎలా వచ్చిందంటే..పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైంది. పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి 1885 జూలై 6న లూయీ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటి సారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ రేబిస్ టీకాను జూలై 6న కనిపెట్టడం వల్ల ప్రతి ఏటా ప్రపంచ జునోసిస్ దినోత్సవం జరుపుకొంటున్నారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..తూర్పుగోదావరి జిల్లాలో వీధికుక్కలు 1,15,771, పెంపుడు కుక్కలు 26,562, ఆవులు 74,778, గేదెలు 1,93,847, గొర్రెలు 1,71,263, మేకలు 69,265, పందులు 2,080 ఉన్నాయి. కోనసీమ జిల్లాలో మొత్తం పెంపుడు జంతువులు 63,953 ఉన్నాయి. ఇందులో కుక్కలు 22,570 ఉండగా, పిల్లులు, గుర్రాలు, కుందేళ్లు, పక్షులు, ఇతర పెంపుడు జంతువులు 41,383 ఉన్నాయి. కాకినాడ జిల్లాలో పశువైద్య శాలలు, ప్రాంతీయ, వెటర్నటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో జూనోటిక్ వ్యాధుల నివారణకు శనివారం ఉచితంగా టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం జిల్లాకు 32 వేల యాంటీ రేబిస్ టీకాలు సిద్ధం చేశారు. ఏ వ్యాధులు వస్తాయంటే..పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియోసిస్, రింగ్వార్మ్ వ్యాధులు వస్తాయి. గొర్రెలు, మేకల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియా, హైడాటిడోసిస్, సార్కోసిస్టిస్, సోల్మోనెల్లోసిస్, క్యూ–ఫీవర్, మేంజ్ వ్యాధులు సంక్రమిస్తాయి. కుక్కల నుంచి రేబిస్, లీష్మీనియా, బద్దెపురుగుల వ్యాధి, రింగ్ వార్మ్, హైడాటిడోసిస్, మీసిల్స్, మంప్స్, మేంజ్ వ్యాధులు వస్తాయి. అలాగే పందులు, పిల్లులు, గుర్రాలు, కోళ్లు రామచిలుకలు, కుందేళ్ల నుంచీ వివిధ వ్యాధులు సోకుతాయి. వైద్యుల సలహాలు తప్పనిసరిజంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజస్ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. సరైన వ్యాక్సిన్ వేయకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. జునోసిస్ డే సందర్భంగా శనివారం రాజమహేంద్రవరం ఏరియా పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి, మున్సిపల్ వర్కర్లకు, జంతువధ శాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్ టీకాలు వేస్తాం. –టి.శ్రీనివాసరావు, జిల్లా పశు వైద్యాధికారి, తూర్పుగోదావరిసకాలంలో టీకాలు వేయించాలి వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. వాటికి సన్నిహితంగా ఉండే వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఇంట్లో కుక్కల పెంపకం చేపట్టిన యజమానులు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఆరోగ్య, పశుసంవర్ధక అధికారుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలి. –డాక్టర్ కర్నీడి మూర్తి, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ, అమలాపురం వ్యాధులుసంక్రమించకుండా టీకాలుజంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజస్ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఏటా జునోసిస్ దినోత్సవాన్ని జూలై 6న జరుపుకోవడం ఆనవాయితీ. పశువుల వ్యాధుల పట్ల మరిన్ని సలహాల కోసం ప్రభుత్వం 1962 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రేబిస్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులైన కుక్కలకు టీకాలు వేయించాలి.–ఎస్.సూర్యప్రకాశరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు, కాకినాడశుభ్రత.. భద్రతముఖ్యంగా పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకోవడం బాగా పెరిగింది. పెంపుడు జంతువులతో ఆటలాడిన తర్వాత శుభ్రత పాటించకుంటే వ్యాధులకు గురవుతుంటారు. జంతువులను పెంచుకునే వారు తగిన జాగ్రత్తలు పాటించకుంటే వాటి నుంచి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఇందులో రేబిస్, ఆంత్రాక్స్ వంటివి భయాందోళనకు గురిచేస్తున్నాయి. అందువల్ల తమ పెంపుడు కుక్కలు బయట తిరిగే సమయంలో ఇతరులపై దాడి చేయకుండా యజమానులూ జాగ్రత్త పడాలి.వ్యాక్సిన్ తప్పనిసరిపెంపుడు జంతువులకు వేసే వ్యాక్సినేషన్‌పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని పట్టించుకోరు. కుక్కులకు మామూలుగా కరిచే గుణం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తప్పనిసరి. మనిషి, జంతువుకు ఉండే కాంటాక్ట్‌లో అది కరవడం, గీరడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దానివల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. కుక్కలు, పిల్లులు పెంచుతున్న వారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. -
విజృంభిస్తున్న అంటువ్యాధులు
-
ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం.. 1. గుండె జబ్బులు: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 2. డెంగ్యూ ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 3. మిస్టీరియస్ న్యుమోనియా ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4. వైరల్, ఇన్ఫెక్షన్ నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు. 5. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1
-
‘అపసవ్య ఆహారం’ ః రూ.25 లక్షల కోట్లు!
సాక్షి, సాగుబడి డెస్క్: వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటివరకూ ఇదమిత్దంగా తెలియదు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ఇది ఎంత ఎక్కువంటే.. కనీసం ఊహకు కూడా అందనంత ఎక్కువగా.. ఏడాదిలో 12.7 లక్షల కోట్ల డాలర్లు అని పేర్కొంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు (20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు (12.3%) కాగా ఆ తర్వాత స్థానంలో భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు (8.8%) ఉండటం గమనార్హం. మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్ఏఓ లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ప్రకారం డాలర్ మార్పిడి విలువను నిర్థారించింది. భారత్‌కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ.21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం అపసవ్యమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ.25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ.14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ.6.2 లక్షల కోట్ల మేర పర్యావరణ, జీవవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1 లక్షల కోట్ల వరకు పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్ఏఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగు మందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘పరోక్ష మూల్యం’లెక్కించేదిలా? ఆహారోత్పత్తులను మనం మార్కెట్లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపితే దాని అసలు ధర పూర్తిగా తెలుస్తుంది. అయితే వైద్య ఖర్చులు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని కలిపి ‘హిడెన్ కాస్ట్’అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ఎఫ్ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’అనే తాజా నివేదికలో ఎఫ్ఏఓ వెల్లడించింది. ఈ ఆహారాలే జబ్బులకు మూలం వ్యవసాయంలో భాగంగా అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ మనల్ని దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తున్నాయి. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవలి దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్ఏఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్‌లో 60% మేరకు ఉండటం గమనార్హం. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్ఎఓ తెలిపింది. సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశంలో బాగంగా పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యమని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తామని తెలిపారు. -
ఏటా కొత్త వ్యాధికారకం!
సాక్షి, హైదరాబాద్: మానవాళికి అంటువ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచమంతా దాదాపు మూడేళ్లపాటు అతలాకుతలమైంది. వందల ఏళ్లుగా ఈ వ్యాధికారకాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య మరింత ఎక్కువవుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏకంగా 30 రకాల వ్యాధికారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధనలో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున ఒక వ్యాధికారకం వెలుగులోకి వచ్చి ంది. అయితే ఈ వ్యాధికారకాల ఉద్భవంలో అత్యధికం జంతువుల నుంచే కావడం గమనార్హం. అడవుల నరికివేత, జంతువుల వలసలు... అంటువ్యాధుల కారకాలపై డబ్ల్యూహెచ్‌వో ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రధానంగా జంతువుల నుంచే వ్యాపిస్తున్నవి 60 శాతంగా ఉంటున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వల్ల జంతువుల వలసలు పెరగడంతోపాటు అటవీ జంతువులను ఆహారంగా మార్చు కోవడం, జంతు ఉత్పత్తుల వాడకంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. మనుషుల ఆహార జాబితాలో గతంలో శాకాహార జంతువులే ఉండగా క్రమంగా మాంసాహార జంతువులూ చేరాయి. శాకాహార జంతువులతో పోలిస్తే మాంసాహార జంతువుల జీర్ణవ్యవస్థ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆహార అరుగుదల కోసం ఉపయోగపడే బ్యాక్టీరియా, ఇతరత్రా మానవ శరీరానికి ప్రమాదకారిగా మారుతున్న సందర్భాలున్నాయి. కోవిడ్–19 వైరస్ ఇదే తరహాలో ఉద్భవించిందనే వాదనలు సైతం ఉన్నాయి. ఎబోలా, రేబిస్ మొదలైన వైరస్లు ఈ కోవకు చెందినవే. కట్టడి కోసం ‘వన్ హెల్త్’.. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల కారణంగా కోటిన్నరకుపైగా మరణాలు సంభవించాయి. అలాగే ప్రపంచ దేశాలు 4 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. జంతువుల నుంచి వచ్చే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు, వాటిని నిలువరించేందుకు డబ్ల్యూహెచ్‌వో వన్‌హెల్త్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల జంతు వ్యాధికారకాలను నిలువరించవచ్చని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైన భారం కూడా తగ్గుతుందని భావిస్తోంది. కోవిడ్‌పై పోరులో 28 విభాగాల కృషి కోవిడ్–19 వ్యాప్తి తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెరిగింది. కోవిడ్ టీకాల కోసం దేశంలో 28 విభాగాలు సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాయి. పర్యావరణం, మొక్కలు, జంతువులు, మానవాళి మధ్య సంబంధాల్లో సమతౌల్యం ఎప్పుడూ పాటించాలి. దాని ఆమలుకు సంబంధించినదే వన్ హెల్త్ విధానం. డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన ఈ విధానం వల్ల ఆర్థికంగా కలసిరావడంతో పాటు ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ అంశం అన్ని దేశాలు పూర్తిస్థాయిలో అమలు చేసే స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నా. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కమిటీ కన్వినర్ -
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మనిషి యంత్రంలా మారాడు. నిద్ర లేచింది మొదలు ఉరుకులు.. పరుగుల జీవితానికి అలవాటు పడ్డాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాకా సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ కాలం గడిపేస్తున్నాడు. నలుగురు కలిసి కూర్చుని చెప్పుకునే ముచ్చట్లు లేవు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. భార్యభర్తలిద్దరూ ఇంట్లో ఉన్నా చెరో వైపు కూర్చుని ఫోన్లు, లాప్‌టాప్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు ఆశ, అత్యాశ పెరిగిపోయి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల కారణంగా ప్రజల్లో విపరీతంగా మానసిక సమస్యలు పెరిగిపోయాయి. ఒత్తిళ్లు, డిప్రెషన్ అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఈ ఏడాది ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రకటించింది. మానసిక ఆరోగ్యంపై దృష్టి ఏదీ ఆర్థిక ఇబ్బందులతో కొందరు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో విశ్రాంతి లేని జీవనం సాగిస్తూ అనేకమంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. ఆశ, అత్యాశలు బాగా పెరిగిపోయాయి. మనిషి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. పిల్లల ఆకాంక్షలు తెలుసుకోకుండా డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలని రూ.లక్షలు ఖర్చుచేసి ఆ కోర్సుల్లో చేర్చుతుంటే.. అక్కడ ఒత్తిళ్లు తట్టుకోలేక మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. వారంతా శారీరక అనారోగ్యాలకు తక్షణమే చికిత్స పొందుతున్నారు కానీ.. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఆలోచనే చేయడం లేదు. ఆత్మీయ, అనురాగాలేవి ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో జనం సమూహాలుగా ఒకచోట చేరి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు. ఉమ్మడి కుటుంబాల్లో సాయంత్ర ం వేళ ఇంట్లోని వారంతా కలిసి కబుర్లు చెప్పుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఉదయం నుంచి నిద్రించే వరకూ స్మార్ట్ ఫోన్ లేనిదే నిమిషం గడవడం లేదు. ఏదైనా సమాచారం చెప్పాలన్నా.. తెలుసుకోవాలన్నా చాటింగ్‌లోనే. కనీసం కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. బంధువులు, ఆత్మీయుల కలయికలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు ఒకప్పుడు రెండు మూడు రోజుల ముందే వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కల్యాణ మండపం వద్దకు రావడం.. కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా ఆత్మీయ , అనుబంధాలు అంతరించిపోవడం కూడా మానíÜక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మానసిక ప్రశాంతతోనే ఆరోగ్యం ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారిలో ఈ సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ఫలితంగా గుండెపోటు, మెదడు పోటుకు దారి తీయవచ్చునంటున్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతాడని వైద్యులు అంటున్నారు. పాజిటివ్‌గా ముందుకు సాగాలి ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసంపై దృష్టి సారించాలి. సెల్ఫోన్లు, టెక్నాలజీని అవసరం మేరకే వాడాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా దృష్టి సారించాలి. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ కొంత సమయం గడపటం ద్వారా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగా, మెడిటేషన్, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. – డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్యురాలు, రిజిస్ట్రార్, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిందే..జాగ్రత్తలే రక్ష!
ఆసిఫాబాద్‌అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి తుకారాం సూచించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో ఉన్న సందేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వూలో వివరించారు. సాక్షి: సీజనల్ వ్యాధులపై ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? డీఎంహెచ్‌వో: డిస్ట్రిక్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) ద్వారా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ యూనిట్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 20 మంది మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. ప్రతీ కుటుంబానికి దోమతెరలు అందించాం. ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఎంపీడీవోల సహకారంతో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. సాక్షి: వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? డీఎంహెచ్‌వో: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటిని వేడిచేసి చల్లార్చి వడబోసిన తర్వాత మాత్రమే తాగాలి. ఆహారం వేడిగా ఉండగానే భుజించాలి. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాం. సాక్షి: డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణ ఎలా? డీఎంహెచ్‌వో: జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో సీబీపీ (బ్లడ్ పిక్చర్, ప్లేట్లెట్స్, కౌంటింగ్) యంత్రాలు ఉన్నాయి. ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు అందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని టీహబ్ ద్వారా 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. డెంగీ ఎలిజ టెస్టు ద్వారానే కచ్చితమైన ఫలితం వస్తుంది. సాక్షి: వైద్యశాఖ అందించే చికిత్సలు ఏమిటి? డీఎంహెచ్‌వో: అన్ని పీహెచ్‌సీల్లో యాంటిబయాటిక్స్, క్లోరోక్విన్, ప్రైమ్ ఆక్సిజన్, ఆర్టిపీసీటి, అన్ని రకాల విటమిన్స్, నొప్పులు, సిప్రోప్లోక్సిన్, మెట్రోజిల్, ప్లురోక్సిన్, స్పోర్లాక్, సీసీఎం, డెరిఫిల్లిన్, దగ్గు మందులు, మాత్రలు, ఐవీ ప్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 20 పీహెచ్‌సీలు, 2 అర్బన్ సెంటర్లు, 118 సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాం. సాక్షి: గ్రామీణులకు అత్యవసర వైద్యం అందేదెలా? డీఎంహెచ్‌వో: రోగిని ఇంటి నుంచి ఆస్పత్రులకు తీసుకువచ్చేందుకు 8 అవ్వాల్, 12 (108) వాహనాలు, 15 (102) వాహనాలు, 1 ఎఫ్హెచ్ఎస్ వాహనం అందుబాటులో ఉంచాం. సాక్షి: సీజనల్ వ్యాధుల వివరాలు తెలపండి? డీఎంహెచ్‌వో: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో డెంగీ–81, మలేరియా–69, టైఫాయిడ్–231 కేసులు నమోదయ్యాయి. (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
ఆహారంలోని ఔషధాన్నే వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది?
ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలి...లేకపోతే... ఔషధాలనే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సూక్తిలో గొప్ప ఆరోగ్య హెచ్చరిక దాగి ఉంది. ఆహారంతోనే ఆరోగ్యం... అంటుంది వైద్యరంగం. ఆహారంలోని ఔషధాన్ని వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది? త్రిపుర చేస్తున్న ప్రయత్నమూ అదే. ‘ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగిన వారి కోసం ఒక సమూహాన్ని సంఘటితం చేస్తున్నాను’ అంటున్నారు లక్కీ 4 యూ న్యూట్రాస్యుటికల్స్ ప్రతినిధి త్రిపుర. ‘ఆహారం అంటే కంటికి ఇంపుగా కనిపించినది, నాలుకకు రుచిగా అనిపించినది తినడం కాదు. దేహానికి ఏమి కావాలో, ఏది వద్దో తెలుసుకుని తినడం. ఈ విషయంలో నాకు స్పష్టత వచ్చేటప్పటికే నా జీవితం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. పీసీఓడీ, ఒబేసిటీ వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యమైంది. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు వేసుకుని జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. మా వారికి రక్తం మరీ చిక్కబడడం, బ్లడ్ థిన్నర్స్ వాడినా ఫలితం కనిపించక బ్రెయిన్ స్ట్రోక్ ఆయనను తీసుకెళ్లి పోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. జీవితం అగమ్యగోచరమైంది. ఆ షాక్‌లో ఉన్న నాకు ఒక వ్యాపకం ఉండాలని మా అన్నయ్య చేసిన ప్రయత్నమే ఇది’ అంటూ తాను పరిశ్రమ నిర్వహకురాలిగా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు త్రిపుర సుందరి. ఇంటర్నెట్ నేర్పించింది! ‘‘నేను పుట్టింది, పెరిగింది విజయవాడలో. సిద్ధార్థ మహిళా కళాశాలలో బీఏ చేశాను. భర్త, ఇద్దరు పిల్లలతో గృహిణిగా సౌకర్యవంతంగా ఉన్న సమయంలో జీవితం పరీక్ష పెట్టింది. నన్ను మామూలు మనిషిని చేయడానికి మా అన్నయ్య తిరుపతికి తీసుకెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో కెమికల్ ఇంజనీరింగ్ చేసి తిరుపతిలో న్యూట్రాస్యూటికల్స్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఫార్మారంగంలో పనిచేయమని ప్రోత్సహించాడు. నేను చదివింది ఆర్ట్స్ గ్రూపు. ఫార్మా పట్ల ఆసక్తి లేదనడం కంటే అసలేమీ తెలియదనే చెప్పాలి. కలినరీ సైన్స్ (పాకశాస్త్రం) ఇష్టమని చెప్పాను. ఆ సమయంలో నా మాటల్లో తరచూ మన ఆరోగ్యం మీద ఆహారం ఎంతటి ప్రభావం చూపిస్తుందోననే విషయం వస్తుండేది. మేము ఎదుర్కొన్న అనారోగ్యాలన్నీ ఆహారం పట్ల గమనింపు లేకపోవడంతో వచ్చినవే కావడంతో నా మెదడులో అవే తిరుగుతుండేవి. నాకు అప్పటికి ప్రోటీన్ ఏంటి, విటమిన్ ఏంటనేది కూడా తెలియదు. కానీ ఈ రంగంలో పని చేయాలనుకున్నాను. బ్రాండ్ రిజిస్ట్రేషన్ నుంచి పరిశ్రమ స్థాపనకు అవసరమైన ఏర్పాట్లన్నీ అన్నయ్య చేసి పెట్టాడు. ఈ రంగం గురించిన వ్యాసాలనిచ్చి చదవడమనేవాడు. ఆ తర్వాత నేను ఇంటర్నెట్ను కాచి వడపోశాననే చెప్పాలి. ఇప్పుడు సీవోటూ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ నుంచి కాంబినేషన్ల వరకు క్షుణ్నంగా తెలుసుకున్నాను. నాకు సబ్జెక్టు తెలిసినప్పటికీ సర్టిఫైడ్ పర్సన్ తప్పని సరి కాబట్టి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, ముగ్గురు ఫుడ్ ఎక్స్‌పర్ట్‌లను తీసుకున్నాను. తేనెతోపాటు ఇంకా... ఫలానా ఆరోగ్య సమస్యకు ఉదయాన్నే తేనెలో అల్లం రసం కలిపి తినాలి, తేనెతో లవంగం లేదా దాల్చినచెక్క పొడి తీసుకోవాలి. మొలకెత్తిన గింజలను ఉదయం ఆహారంగా తినాలి... ఇవన్నీ ఆరోగ్యకరం అని తెలిసినప్పటికీ ఈ రోజుల్లో వాటిని రోజూ చేసుకునే టైమ్ లేని వాళ్లే ఎక్కువ. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ అంతలా డీలా పడిపోవడానికి కారణం దేహంలో పోషకాల నిల్వలు ఉండాల్సిన స్థాయిలో లేకపోవడమే. అందుకే ఇన్ఫ్యూజ్డ్ హనీ తయారు చేశాం. అలాగే స్ప్రౌట్స్ తినే వారికి ఉద్యోగరీత్యా క్యాంప్లకెళ్లినప్పుడు కుదరదు కాబట్టి డీ హైడ్రేటెడ్ స్ప్రౌట్స్ తీసుకువచ్చాను. ఇలా ప్రతి ఉత్పత్తినీ ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు మోతాదులు పాటిస్తూ నేను చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ముంబయిలో ఈ నెల 16 నుంచి నాలుగు రోజులపాటు జరిగే ‘ఎఫ్ ఐ ఇండియా’ సదస్సులో నా అనుభవాలను పంచుకుంటూ ప్రసంగించనున్నాను. దుబాయ్‌లో జరిగే ఎగ్జిబిషన్లో కూడా అన్ని దేశాల వాళ్లు స్టాల్ పెడుతుంటారు. గత ఏడాది తెలుసుకోవడం కోసమే వెళ్లాను. నా యూనిట్‌ని ఇంకా ఎలా విస్తరించవచ్చనే స్పష్టత వచ్చింది. ఈ ఏడాది చివరలో దుబాయ్ ఎగ్జిబిషన్ ద్వారా అంతర్జాతీయ వేదిక మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాను’’ అని వివరించారు త్రిపుర. ఇష్టంగా పనిచేశాను! నా యూనిట్‌ని మా అన్నయ్య యూనిట్‌కు అనుబంధంగా నిర్మించాం, కాబట్టి ప్రతిదీ తొలి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ప్లాంట్ నిర్మాణం నుంచి ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకోమని చెప్పడంతో రోజుకు పదమూడు గంటలు పని చేశాను. ఇప్పుడు మూడు షిఫ్టుల్లో పని జరుగుతోంది. యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఒకవిధమైన ఆందోళన వాతావరణమే ఉండేది. ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా అనే సందేహం నాతోపాటు అందరిలోనూ ఉండింది. మా అన్నయ్య మాత్రం ‘ఏదయితే అదవుతుంది, నువ్వు ముందుకెళ్లు’ అనేవాడు. నేను చేస్తున్న పని మీద ఇష్టం పెరగడంతో అదే నా లోకం అన్నట్లు పని చేశాను. మా ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ, జీఎమ్‌పీ, ఐఎస్ఓ వంటి దేశీయ విదేశీ సర్టిఫికేట్లు వచ్చాయి. కానీ నేను మా ఉత్పత్తుల అవసరం ఉన్న అసలైన వాళ్లకు పరిచయమైంది మాత్రం ఈ నెల మొదటి వారంలో జరిగిన ‘రాయలసీమ ఆర్గానిక్ మేళా’తోనే. – ఎం. త్రిపుర, ఆపరేషనల్ మేనేజర్, లక్కీ 4 యూ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
వానర రహస్యం రట్టయ్యిందా?
సాక్షి, హైదరాబాద్: మన జన్యువుల్లో ఒక చిన్న మార్పు ఉన్నా ఏదో ఒక రకమైన వ్యాధికి గురికావడం ఖాయం. కానీ మనిషికి అతిదగ్గరి చుట్టంగా చెప్పుకొనే వానరాల్లో మాత్రం ఇలా ఉండదు. జన్యుపరమైన మార్పులు ఎన్ని ఉన్నా వాటికి మనలా వ్యాధులు అంటవు. ఎందుకిలా? ఈ విషయాన్ని తెలుసుకొనేందుకే హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఓ భారీ అధ్యయనాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఇందులో భాగంగా సుమారు 233 వానర జాతులకు చెందిన 809 జన్యుక్రమాలను మానవ జన్యుక్రమాలతో పోల్చి చూశారు. భారత్‌లోని 19 వానర జాతులకు సంబంధించిన 83 నమూనాల జన్యుక్రమ నమోదు, విశ్లేషణ బాధ్యతలను సీసీఎంబీ చేపట్టింది. అంతరించిపోతున్న వానర జాతుల సంరక్షణకు, జన్యుపరమైన వ్యాధులను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. ప్రత్యేకమైన జన్యుమార్పులు గుర్తింపు... మానవ, వానర జన్యుక్రమాలను పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ సుమారు 43 లక్షల మిస్‌సెన్స్ జన్యుమార్పులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ప్రత్యేకమైన జన్యు మార్పులు శరీరానికి అవసరమైన అమైనోయాసిడ్ల రూపురేఖలను మార్చేస్తాయి. ఫలితంగా ఈ అమైనో యాసిడ్లతో తయారయ్యే ప్రొటీన్లు కూడా సక్రమంగా పనిచేయకుండా మనం వ్యాధుల బారిన పడుతూంటాం. అయితే ప్రస్తుతం ఏ మార్పుల కారణంగా మనకు వ్యాధులు వస్తున్నాయన్నది గుర్తించడంలో చాలా పరిమితులున్నాయి. జన్యుమార్పులు వందలు, వేల సంఖ్యలో ఉండటం దీనికి కారణం. మధుమేహం, గుండె జబ్బుల్లాంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకూ జన్యుపరమైన మూలకారణం ఇప్పటివరకూ తెలియకపోవడానికి కూడా జన్యు మార్పులకు సంబంధించిన సమాచారం లేకపోవడమూ ఒక కారణం. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు... వానరులు, మనుషుల జన్యుక్రమాలను సరిపోల్చే పరిశోధ న చేపట్టారు. కొన్ని వ్యాధులు ఒకటి కంటే ఎక్కువ జన్యువు ల్లో వచ్చిన మార్పుల వల్ల పుడతాయని... మొదట్లో వాటి ప్ర భావం తక్కువగానే ఉన్నా క్రమక్రమంగా ఈ జన్యుమార్పుల న్నీ కలసికట్టుగా పనిచేయడం మొదలుపెట్టి మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులుగా పరిణమిస్తాయని అంచనా. కొన్నింటిని గుర్తించాం... మానవులు, వానరాలను వేరు చేసే 43 లక్షల ప్రత్యేకమైన జన్యుమార్పులు (మిస్‌సెన్స్ మ్యుటేషన్స్)లలో ఆరు శాతం వాటిని ఇప్పటికే గుర్తించామని, ఇవి మనుషుల కంటే వానరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయని కృత్రిమ మేధ కంపెనీ ఇల్యూమినా ఉపాధ్యక్షుడు కైల్ ఫార్ తెలిపారు. ఈ ఆరు శాతం జన్యుమార్పులు మానవ వ్యాధులు వానరాలకు అంటకుండా కాపాడుతున్నట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధికారక జన్యుమార్పులను గుర్తించేందుకు తాము ప్రైమేట్ ఏఐ–3డీ అనే డీప్ లెరి్నంగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించామని చెప్పారు. ఈ అల్గారిథమ్ జన్యుశాస్త్రానికి సంబంధించిన చాట్‌జీపీటీ అనుకోవచ్చు. చాట్‌జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకుంటే ప్రైమేట్ ఏఐ–3డీ జన్యుక్రమాన్ని అర్థం చేసుకోగలదు. అంతే తేడా! విస్తృత స్థాయిలో వానర జన్యుక్రమం నమోదు... ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక వానర జాతుల జన్యుక్రమాలను నమోదు చేశారు. ‘‘ఐదు గ్రాముల బరువుండే చిన్న కోతి మొదలుకొని చింపాంజీల వరకూ... భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే వెస్టర్న్ హూలాక్ గిబ్బన్, పశ్చిమ కనుమల్లో నివసించే లయన్ టెయిల్డ్ మకాక్ వరకు అనేక వానర రకాల జన్యుక్రమాలను ఇందులో నమోదు చేశారు. ఈ స్థాయిలో వానర జన్యుక్రమ నమోదు జరగడం ఇదే మొదటిసారి’’అని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గోవింద స్వామి ఉమాపతి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. భూమ్మీద ఉన్న మొత్తం వానర జాతుల్లో దాదాపు సగం జాతుల జన్యుక్రమం ఇప్పుడు అందుబాటులో ఉందని అంచనా. ఈ విస్తృతస్థాయి జన్యుక్రమం ఫలితంగా వానరాల జన్యుక్రమాలను పోల్చి చూడటం సాధ్యమైందని, తద్వారా పరిణామ క్రమంలో వాటిలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం దక్కిందని డాక్టర్ ఉమాపతి తెలిపారు. అంతేకాకుండా వానరాలను మనుషులను వేరు చేసే అంశాలేమిటన్నది కూడా మరింత స్పష్టమవుతుందన్నారు. జన్యుక్రమాలు అందుబాటులోకి రావడం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా... మనకు వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకోవడానికి, వానరాల సంరక్షణకూ ఉపయోగపడుతుందని వివరించారు. ‘‘వానర జన్యుక్రమ నమోదు.. వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నాయి’’అని సీసీఎంబీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనం ఫలితం ఇంకొకటి కూడా ఉంది. మనిషికి మాత్రమే ప్రత్యేకమనుకున్న జన్యుపరమైన అంశాలు దాదాపు సగం తగ్గాయి! అంటే మనిషికి.. వానరానికి మధ్య ఉన్న అంతరం మరింత తగ్గిందన్నమాట! -
దోమ.. ప్రాణాంతకం! లాలాజలంలో వైరల్ ఆర్ఎన్ఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: దోమ.. చూడటానికి చిన్నప్రాణే. కానీ.. ప్రపంచాన్ని వణికిస్తోంది. దోమను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రాణిగా వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోగాలను మోసుకు రావడంలో ముందుండే దోమలు ఇప్పుడు మనిషి రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు వెల్లడించారు. దోమ లాలాజలంలోని ఆర్ఎన్ఏ మానవ రోగ నిరోధక(ఇమ్యూనిటీ) వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో గుర్తించారు. సరికొత్త చికిత్సకు మార్గం దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మలేరియాతో మరణించే వారి సంఖ్య 6 లక్షలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారు 400 మిలియన్ల మంది ఉంటున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, చర్మంపై మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వైరస్‌కు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదని, డెంగీ లక్షణాలను తగ్గించే వైద్య పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నట్టు వర్జీనియా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రస్తుత అధ్యయనం ద్వారా డెంగీ చికిత్సకు, ఔషధాల తయారీకి కొత్త మార్గం లభించినట్టయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వెలుగులోకి కొత్త విషయాలు ఇటీవల వర్జీనియా శాస్త్రవేత్తలు డెంగీ వైరస్‌పై పరిశోధనలు చేయగా.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోమల లాలాజలంలోని వైరల్ ఆర్ఎన్ఏ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను అడ్డుకుంటున్నట్టు తేలింది. వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్ తానియా స్ట్రిలెట్స్ నేతృత్వంలోని బృందం మూడు వేర్వేరు విశ్లేషణ పద్ధతుల ద్వారా దోమ సెలైవా(లాలాజలం)పై అధ్యయనం చేశారు. ఇందులో నిర్దిష్ట రకమైన వైరల్ ఆర్ఎన్ఏ (రిబోన్యూక్లియిక్ యాసిడ్)ను గుర్తించారు. ఇందులో ‘ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్’ అని పిలిచే మెంబ్రేన్ (పొర) కంపార్ట్మెంట్లలో సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏ (ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ) ద్వారా డెంగీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్ స్థాయిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ పెంచిందని బృందం ధ్రువీకరించింది. ఇది దోమ లాలాజలంలో ఉంటుందని, మనిషి రోగ నిరోధక శక్తిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ శక్తివంతంగా అడ్డుకుంటోందని తానియా స్ట్రిలెట్స్ వెల్లడించారు. ఈ సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏను కీటకాల ద్వారా సంక్రమించే జికా, ఎల్లో ఫీవర్ వంటి రోగాల్లో కూడా గుర్తించారు. దోమ కుట్టినప్పుడు డెంగీ ఉన్న లాలాజలాన్ని శరీరంలోకి చొప్పిస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు మానవ శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని లాలాజలంలోని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ అడ్డుకుంటోందని తేల్చారు. -
డేంజర్ ‘లైఫ్‌స్టైల్’.. 63 శాతం మరణాలకు ఇదే కారణం! షాకింగ్ విషయాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. పోటీ ప్రపంచంలో అందరి కంటే ముందుండటానికి ఉరుకులపరుగుల జీవితం ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యమైపోయింది. ఈ ప్రపంచీకరణతో మనిషి ఆలోచనలు, అలవాట్లు, ఆహారం అన్నీ మారిపోయాయి. మారిన జీవనశైలి తనతోపాటు కొన్ని వ్యాధులను కూడా మోసుకొస్తోంది. దీంతో ఊబకాయం, క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు అధికమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మరణిస్తున్న ప్రతి వంద మందిలో 63 శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. పొగ తాగడం, మద్యపానం, పోషకాహారలోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక, పని ఒత్తిళ్లు అనారోగ్యానికి ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. 2030లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తారని బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తోంది. టారీ సర్వేలో ఆందోళనకర అంశాలు అలాగే థాట్ ఆర్బిటరేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టారీ) దేశంలోని 21 రాష్ట్రాల్లో 2,33,672 మంది వ్యక్తులను, అలాగే 673 ప్రజారోగ్య కార్యాలయాలను పరిశీలించింది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. 18 ఏళ్లు దాటిన వారు కూడా జీవనశైలి వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్సీడీ) జాబితాలో ఉన్నారు. 35 ఏళ్లు దాటిన వారికి హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్ ఎక్కువగా వస్తున్నాయి. వీటి తర్వాత స్థానంలో క్యాన్సర్ నిలుస్తోంది. దేశంలో 26–59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఎన్సీడీ జబ్బులతో బాధపడుతున్నారు. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. వీరు అనారోగ్యానికి గురైతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలకు తాజాగా లేఖ రాశారు. జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాలు, మెట్రో నగరాల్లో మరింత ప్రమాదం.. జీవనశైలి వ్యాధులకు గురవుతున్నవారిలో పట్టణాలు, మెట్రో ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరుకు చెందిన మాక్స్ హెల్త్‌కేర్ చైర్మన్, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అంబరీస్ మిట్టల్ పరిశీలనలో 1970లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 శాతం మందికి షుగర్ ఉండేది. 2020లో ఇది 15–20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అది 27 శాతానికి చేరింది. అలాగే మెట్రో నగరాల్లో 35–40 శాతం మందికి షుగర్ జబ్బు ఉంది. ఇదే క్రమంలో నరాల సంబంధిత వ్యాధులు గత 30 ఏళ్లతో పోలి్చతే నాలుగురెట్లు పెరిగాయని న్యూఢిల్లీలోని లేడీ హోర్డింగ్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ రాజీందర్కే ధనుంజయ పరిశీలనలో తేలింది. అధిక బరువు (ఒబేసిటీ) 2005తో పోలి్చతే 2015లో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపయింది. ఇందులో 20.7 శాతం మంది పురుషులు, 18.6 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే 2023కు ఈ సంఖ్య మళ్లీ రెట్టింపయింది. శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువుకు ప్రధాన కారణం. మానసిక సమస్యలు దేశం మొత్తం జనాభాలో 10 శాతం మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఏటా 13 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో కనీసం 15 కోట్ల మంది పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తమకు మానసిక సమస్య ఉంది అని గుర్తించలేని స్థితిలో మరో 5 కోట్లమంది దాకా ఉన్నారు. వీరందరికీ సైకియాట్రిస్టుల అవసరం ఉంది. క్యాన్సర్ ప్రమాదకర రసాయనాలు ఉన్న కాస్మోటిక్స్, రసాయనాలతో మిళితమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వాయు, వాతావరణ కాలుష్యం, మద్యం, పొగాకు, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 5–8 శాతం పెరుగుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన విధానంలోని మార్పులు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో 26 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారని ‘టారీ’ సర్వే తేల్చింది. పాశ్చాత్య సంస్కృతితో ముప్పు.. మనదేశంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి రాత్రిళ్లు మరీ ఎక్కువసేపు మెలకువతో ఉంటున్నారు. ఆహార అలవాట్లు, జీవన విధానం కూడా మారిపోయాయి. దీంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఉదయమే నిద్రలేస్తే ‘కార్టీజాల్’ హార్మోన్ ఉత్పత్తితో బాడీ రిథమ్‌లో పనిచేస్తుంది. ఆలస్యంగా నిద్రలేస్తే దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. రాత్రిళ్లు పనిచేసేవారు పగలు నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. కచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలి. దీంతో ఎండార్ఫిన్ ఉత్పత్తి అయి మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, హెచ్‌వోడీ, ఎండోక్రైనాలజీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్‌కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్‌లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్‌గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్‌రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్‌లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్‌లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్‌తో ఫ్లూయిడ్‌ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
పెరుగుతున్న నాన్ కమ్యునికబుల్ జబ్బులు.. 63 శాతం మరణాలకు ఇవే కారణం!
సాక్షి, అమరావతి: ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకొనే వరక మీ దినచర్య, ఆహారాన్ని జాగ్రత్తగా గమనించండి. అవసరమైన మార్పులు చేసుకోండి... మీ జీవిత కాలాన్ని పెంచుకోండి.. అంటోంది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. జీవన శైలి, ఆహార అలవాట్ల వల్లే దేశంలో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని, 63 శాతం మరణాలు వీటి వల్లే కలుగుతున్నాయని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా గుండె పోటుతో పాటు బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధులకు ప్రధాన కారణం ప్రజల జీవన శైలేనని ఈ మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో పేర్కొంది. నాన్ కమ్యునికబుల్ జబ్బులతో పాటు గుండెపోటుతో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజలు కూడా జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించింది. ఈ వ్యాధుల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం స్క్రీనింగ్ చేస్తున్నాయి. అయినా ప్రతి సంవత్సరం బీపీ, సుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ జబ్బుల రోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ప్రజలు కూడా ఈ జబ్బులకు కారకాలైన వాటికి దూరంగా ఉండాలని, దిన చర్యలో మార్పులు చేసుకొని, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. నాన్ కమ్యునికబుల్ వ్యాధులు 21వ శతాబ్దంలో కొత్త సవాళ్లను విసురుతున్నాయని పేర్కొంది. పట్టణీకరణతో పాటు జీవనశైలిలో మార్పులకు దారి తీసిందని, కొత్త కొత్త ఆహారపు మార్కెట్లు రావడం, వాటికి ప్రజలు ఆకర్షితులు కావడం, వాటికి తోడు పొగాకు, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి నాన్ కమ్యునికబుల్ వ్యాధులతో పాటు, గుండెపోటుతో అకాల మరణాలకు దారితీస్తున్నాయని నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 3.53 కోట్ల మందికి స్క్రీనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలకు పైబడిన జనాభాలో 92 శాతం మందికి నాన్ కమ్యునికబుల్ వ్యాధుల స్క్రీనింగ్‌ను పూర్తి చేశారు. ఇప్పటివరకు 3,53,44,041 మంది జనాభాకు పరీక్షలు చేశారు. గుండె జబ్బులు, రక్తపోటు, సుగర్, శ్వాస సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి జబ్బులున్నట్లు పరీక్షల్లో తేలిన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. వ్యాధుల నివారణోపాయాలు ♦ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి ♦ శారీరక శ్రమను పెంచాలి ♦ మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి ♦ పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ♦ ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఆహారంలో రోజుకు 5 గ్రాములకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి ♦ ఏరేటెడ్ డ్రింక్స్, వేయించిన ఆహారాన్ని తీసుకోకూడదు ♦ పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమలో పాల్గొనాలి ♦ 5 ఏళ్ల నుంచి ఏడేళ్ల లోపు పిల్లలకు ప్రతిరోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ అవసరం. దేశంలో 2020–21లో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు స్క్రీనింగ్, చికిత్స వివరాలు -
వద్దు‘లే..జీ’ నడవటం ఈజీ.. మరణాలకు నాలుగో ప్రధాన కారణం ఏంటో తెలుసా?
తాగి డ్రైవింగ్ చేయడం.. అతి వేగంతో వాహనాలు నడపటం.. సిగరెట్లు తాగడం వంటివి ఎలా ప్రాణాంతకమవుతాయో.. రోజంతా మంచంపై కూర్చోవడం.. ఎలాంటి కదలికలు లేకుండా ఉండటం కూడా అంతే ప్రాణాంతకమని మీకు తెలుసా. సోమరితనం మీ విలువైన కాలంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోతే అకాల మరణాలు సంభవించే అవకాశాలు 500 రెట్లు అధికమని ‘ది లాన్సెట్’లో ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నడక లేదా పరుగు వంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా తీరిక లేని వ్యక్తి వ్యాధులను ఆహ్వానిస్తాడని వెల్లడించింది. సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏ వయసు వారైనా తగినంత శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే బైక్ లేదా కారెక్కి తుర్రుమని గమ్యస్థానానికి చేరుతున్న వారెందరో ఉన్నారు. ఒక్క క్లిక్‌తో గుమ్మం వద్దకే అగ్గిపెట్టె నుంచి అన్నిరకాల వస్తువులు వచ్చి చేరుతున్నాయి. దీంతో బద్ధకస్తులు పెరిగిపోతున్నారు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ చేయడం లాంటి ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలని వైద్యులు సూచిస్తున్నారు. భారం పెరిగిపోతోంది ప్రజలు బద్ధకిస్టులుగా మారడం.. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ (ఎన్సీడీ) వ్యాధులు దేశంలోను, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 63 శాతం, రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ వ్యాధులకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్సీడీ నివారణ, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30 ఏళ్ల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి.. వారి ఆరోగ్యంపై నిరంతర ఫాలో అప్ను వైద్య శాఖ చేపడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.80 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా.. 55.41 లక్షల మందిలో రక్తపోటు లక్షణాలు వెలుగు చూశాయి. వీరిలో 16.28 లక్షల మందిలో సమస్య నిర్ధారణ అయింది. 5.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉండగా.. 5.14 లక్షల మందిలో సమస్య అదుపులోనే ఉంది. అదేవిధంగా 53.92 లక్షల మందిలో మధుమేహం సమస్య వెలుగు చూడగా.. 12.29 లక్షల మందికి సమస్య నిర్ధారణ అయింది. వీరిలో 4.17 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 3.65 లక్షల మందిలో సమస్య అదుపులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఎన్సీడీ బాధితులపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా.. దీర్ఘకాలిక జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలకు శారీరక శ్రమ ఆవశ్యకతను తెలియజేసి.. వారిని నడక, వ్యాయామం ఇతర కార్యకలాపాల వైపు మళ్లించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, ఎన్జీవోల సహకారాన్ని తీసుకుని వాకింగ్ ట్రాక్‌లు, గ్రౌండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల దశలోనే పిల్లల్లో వ్యాయామం, నడక రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరణాలకు నాలుగో ప్రధాన కారణం బద్ధకమే ప్రజలు తగినంత శారీరక శ్రమ చేయకపోవడం మరణాలకు నాలుగో ప్రధాన కారణంగా ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు నాలుగు ప్రధాన కారణాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో పొగాకు వినియోగం, మధుమేహం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి ఉంటున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రజలు దీర్ఘకాలిక జబ్బులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని నయం చేసుకోవడానికి ఏటా రూ.25 వేల కోట్ల మేర ఖర్చవుతోందని, పదేళ్లలో ఈ ఖర్చు రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గత ఏడాది ఓ నివేదికలో డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. పట్టణీకరణ పెరుగుదల, రవాణా సౌకర్యంలో మార్పులు, అవుట్డోర్ పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు అందుబాటులో లేకపోవడం, శారీరక శ్రమ ఆవశ్య కతపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రజలను బద్ధకిస్టులుగా మార్చుతున్నాయి. ఇప్పటికే సమావేశం నిర్వహించాం ప్రజలకు వాకింగ్ చేయడానికి వీలుగా మైదానాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. తమ గ్రౌండ్లను ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరాం. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల రోజువారి దినచర్యలో వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమ కార్య కలాపాలను భాగం చేసేలా కార్యక్రమాలు చేపడతాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మార్పు రావాలి పాశ్చాత్య జీవన విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అలవాట్లలో మార్పు రావాలి. మన పూర్వీకుల జీవన విధానాల్లోకి మనం వెళ్లాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం, ఈత ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుప డుతుంది. ఊబకాయం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్