Published
Fri, Jul 22 2016 6:35 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:51 AM
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
హుజూర్‌నగర్ : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు సూచించారు. శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల మందును స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమకాటు వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. కౌన్సిలర్ తన్నీరు మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ వార్డు పరిస్థితులను ‘సాక్షి’ దినపత్రిక ఇటీవల నిర్వహించిన ఫోన్ ఇన్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి భానుప్రసాద్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది వార్డును సందర్శించి దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధుల బారినపడకుండా ప్రజలకు అవగాహన కల్పించేలా చేసిన ‘సాక్షి’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ జాన్‌పాషా,హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ, ఆశా కార్యకర్తలు మాధవి, మంగమ్మ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.