HUZURNAGAR
-
హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
-
పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యపేట: తెలంగాణలో ప్రజల హక్కులు కాపాడుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ నేతలు ఏనాడు పోరాడలేదని విమర్శించారు. కాంగ్రెస్‌లో డజను మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇస్తామని నమ్మబలికి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో నేడు సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రపంచంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. రైతు బంధు మంచిదని యూఎన్వో, ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసిస్తుంటే.. దాన్ని తీసేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధును తీసేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని తెలిపారు. నవంబర్ 30న ఓట్లు వేస్తే పోలింగ్ బాక్సులు పగిలిపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు వద్దనే నాయకుడు కావాలా..? రైతు బంధు ఇచ్చే సైదిరెడ్డి కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. కరెంట్ మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. అసలు వ్యవసాయం చేస్తే కదా ఎన్ని గంటలు కరెంట్ ఉండాలో తెలిసేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ధరణి తీసేస్తా అని రాహుల్, రేవంత్, భట్టి విక్రమార్క అంటున్నారు.. ధరణి తీసేస్తే వీఆర్వో లాంటి వ్యవస్థలు మళ్లీ వస్తాయని అన్నారు. రైతుబంధు పదహారు వేలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పింఛన్లు ఐదు వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం అందిస్తామని వెల్లడించారు. ప్రతీ ఇంటికి బీఆర్ఎస్ మేనిఫేస్టో తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆనాడు నోరు మెదపలేదు.. 'పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలని సీఎం కేసీఆర్ అన్నారు. దళితులు అనేక సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే కాంగ్రెస్ దళితుల అభ్యున్నతి గురించి ఆలోచిస్తే ఇవాళ పరిస్థితి వేరే ఉండేది. తండాల్లో మా పాలనే ఉండాలని గిరిజనులు కోరుకున్నారు. ఓటు అనేది భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చరిత్రను కూడా వక్రీకరిస్తారు నాయకులు. నాగార్జున సాగర్ నిర్మించాల్సిన ప్రాంతంలో నిర్మిస్తే నల్లగొండ అన్ని ప్రాంతాలకు నీరు అందేది. 1956 లో తెలంగాణను ఆంధ్రాలో కలపిన సమయంలో అందరూ వ్యతికించారు. ఆనాడు కాల్పులు జరిపినా కాంగ్రెస్ నేతలు నోరుమూసుకున్నారు. తొమ్మిదేళ్లలో నాగార్జున సాగర్ నుంచి పద్దెనిమిది పంటలు పండించుకున్నాం. టెయిల్ ఎండ్ కు నీళ్లు రాకపోతే కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదు. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగిరెగిరి పడుతున్నారు. పదవులు, కాంట్రాక్టులు ముఖ్యమనే రీతిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.' అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు పైసా కూడా ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం మాట్లాడలేదని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఓట్లు కావాలి కానీ తెలంగాణ ప్రజల బాగోగులు వద్దా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ కాదా?అని మండిపడ్డారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్షకు కూర్చుంటే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డి -
అసలు కట్టప్పలు వేరే ఉన్నారు: ఉత్తమ్
సాక్షి, సూర్యాపేట: సామాజిక మాధ్యమాల్లో తనతో పాటు తన సతీమణి పద్మావతిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దీని వెనుక పార్టీకి చెందిన ముఖ్యుల హస్తం ఉందని అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌లలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఫిర్యాదుతో అరెస్టయిన వారు చిన్న వారని, వారి వెనుక ఉన్న అసలు కట్టప్పలు త్వరలో బయటకు వస్తారన్నారు. తన సతీమణి పద్మావతి ఎయిర్‌పోర్టులో యాధృచ్చికంగా కొంత మంది బీఆర్ఎస్ మహిళా నేతలను కలుసుకుంటే.. ఆమె బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీలో వసతి కల్పించారంటూ ఎయిర్‌పోర్టు ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఉత్తమ్ అన్నారు. కొంత కాలంగా తమను కావాలనే బదనాం చేస్తున్నారని, వారిని వదిలేది లేదని స్పష్టంచేశారు. తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదన్నారు. ‘మీ అందరికీ తెలుసు. మాకు పిల్లలు లేరు. మీరే మా కుటుంబం అని రాజకీయం చేస్తున్నాం. మాకు వేరే వ్యాపకం, వ్యాపారం లేదు. 24 గంటలూ ప్రజా జీవితం, రాజకీయమే’అని ఆయన తెలిపారు. కోదాడలో 50 వేల మెజారిటీ రావాలి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి అధికార పార్టీని చిత్తుగా ఒడిద్దామని ఉత్తమ్ పిలుపునిచ్చారు. కోదాడలో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని, 50 వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ సమావేశాలలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఢిల్లీకి నేతల క్యూ -
హుజుర్నగర్లో పొలిటికల్ హీట్.. బీజేపీకి బలమైన నేత దొరికాడా?
తెలంగాణలో రాజకీయ వేడి అంతకంతకు పెరిగిపోతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. కాషాయ పార్టీకి అనేక చోట్ల కేడర్ ఉన్నా సరైన నాయకత్వం లేదు. దీంతో ఆపరేషన్ ఆకర్షతో సీనియర్ నాయకులకు గాలం వేస్తోంది. ఇప్పటికే అనేక మందికి కాషాయ తీర్థం ఇచ్చింది. ఇంకా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత బీజేపీనీ వేధిస్తోంది. అయితే నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్లో కూడా అక్కడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సరితూగే అభ్యర్థిని రెడీ చేసుకుంటోంది. క్రమంగా జిల్లాలో పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొంతమేర పట్టు బిగించింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కీలకంగా ఉన్న నేతలకు పార్టీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. గత ఉప ఎన్నికల్లో పోయిన పరువును రాబట్టుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పక్కా ప్రణాళికతో నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేత గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. కమలం ఎందుకు తలకిందులయింది? హుజూర్ నగర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సైదిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే వారికి పోటీనిచ్చే స్థాయి నేత లేక ఇన్నాళ్లు బీజేపీ తల పట్టుకుంది. గత ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే అక్కడ బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే హుజూర్ నగర్లో పట్టు సాధించేందుకు శ్రీకాంత్ రెడ్డి రూపంలో కాషాయ పార్టీకి బలమైన నేత దొరికినట్లు అయింది. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అనుచరవర్గం ఉండటంతో పాటు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతను ధీటుగా ఎదుర్కొన్న అనుభవం కూడా శ్రీకాంత్‌రెడ్డికి ఉంది. ఇది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే నియోజవర్గంలో పట్టు సాధించేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటూ.. అక్కడ కార్యక్రమాలు సాగిస్తూ వస్తోంది. మఠంపల్లి మండలం గుర్రంబోడు గిరిజన తండా భూముల విషయం రాష్ట్ర స్థాయిలో పెద్ద చర్చను తీసుకురావడంతో పాటు... దాని వెనుక ఎవరి పాత్ర ఉందో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఉద్యమించింది. ఇది గిరిజన రైతుల్లో ఆ పార్టీ పట్ల సానుభూతిని పొందేందుకు ఉపయోగపడిందని భావిస్తున్నారు. బండి సంజయ్ ధాన్యపు రాశుల పరిశీలన పేరుతో చేసిన హంగామా కూడా ప్రజల్లోకి బాగానే వెళ్లింది. అయితే ఎటొచ్చి దీన్ని కొనసాగించేందుకు ఇన్నాళ్లు ఆ పార్టీకి బలమైన నేత లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. సవాల్ ప్రతి సవాల్ ఇన్నాళ్లు అక్కడ ద్విముఖ పోరు మాత్రమే సాగింది. ఇప్పుడు ఒక్కసారిగా ముక్కోణపు పోరుగా మారింది. ఇప్పటికే మరోసారి గెలవాలని సైదిరెడ్డి, ఎలా అయినా గెలవాలని ఉత్తమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే శ్రీకాంత్ రెడ్డి మాత్రం సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల 30 వేల ఓట్లలో 55 నుంచి 60 వేలు ఓట్లు తెచ్చుకుంటే చాలు అన్నట్లు ఆయన ప్లాన్ చేసుకుని చాపకింద నీరులా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనూ యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలనే ప్లాన్‌లో శ్రీకాంత్ రెడ్డి ఉన్నారట. అయితే శ్రీకాంత్ రెడ్డికి బొబ్బా భాగ్యారెడ్డి అనే నేత రూపంలో తలనొప్పులు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా టికెట్ ఆశిస్తుండటంతో తనకు సహకరిస్తారో లేదో అని శ్రీకాంత్ రెడ్డి అనుమానపడుతున్నారని సమాచారం. మొత్తానికి కాంగ్రెస్, కారు పార్టీలకు గట్టి పట్టున్న హుజూర్ నగర్లో ఎలక్షన్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి. ఆ రెండు పార్టీలకు బీజేపీ పోటీ ఏ రేంజ్లో ఉంటుంది? ముక్కోణపు పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
తల్లిదండ్రులను వేధించిన కొడుకు.. రూ.8 లక్షల సుపారీతో ఖతం చేయించిన ఫ్యామిలీ
సాక్షి, హుజూర్నగర్/ఖమ్మం: సూర్యాపేట జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియని యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులే సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు తేలింది. కేసు వివరాలను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సోమవారం సీఐ రామలింగారెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన క్షత్రియ రామ్‌సింగ్, రాణిబాయి దంపతులు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నారు. వీరి కుమారుడు సాయినాథ్ (26) మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటు పడి తల్లిదండ్రులను వేధిస్తుండగా, ఆయనను తుదముట్టించాలని నిర్ణయించుకున్నారు. రాణిబాయి తమ్ముడైన మిర్యాలగూడకు చెందిన సహదేవుల సత్యనారాయణను సంప్రదించడంతో ఆయన మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన రమావత్ రవి, పానుగోతు నాగరాజు, బురుగు రాంబాబు, ధరావత్ సాయికి రూ.8లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో రూ.1.5లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈక్రమంలో రెండు సార్లు సాయినాథ్‌పై హత్యాయత్నం చేసినా విఫలమయ్యారు. మూడోసారి.. సాయినాథ్ మేనమామ సత్యనారాయణ సహకారంతో సుపారీ గ్యాంగ్ సభ్యులు ఆయనను అక్టోబర్ 17న రాత్రి ఖమ్మం నుంచి మిరాల్యగూడకు తీసుకొచ్చారు. మరుసటి రోజు కల్లేపల్లి శివారు మైసమ్మ గుడి వద్ద మద్యం తాగించి ప్లాస్టిక్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. అదేరోజు రాత్రి మృతుడి కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి పాలకవీడు మండలంశూన్యంపహాడ్ శివారు మూసీ నదిలో వేసి వెళ్లిపోయారు. కాగా, 19వ తేదీన మృతదేహం తేలడంతో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎస్సై సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహనం నంబర్ ఆధారంగా... ఘటనాస్థలం సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఓ కారు వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వాహనం నంబర్ ఆధారంగా పరిశీలించి సాయినాథ్ కారుగా తేలడంతో ఆచూకీ కోసం ఆరా తీస్తుండగానే, ఆయన తల్లిదండ్రులు అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చారు. దీంతో అనుమానించిన పోలీసులు రామ్‌సింగ్ – రాణిబాయిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. సాయి తల్లిదండ్రులతో పాటు పాత్రధారులైన ఐదుగురిని అరెస్ట్ చేసి, నాలుగు కార్లు, రూ.23,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై సైదులు, సిబ్బంది అంజయ్య, వెంకటేశ్వర్లు, ఉపేందర్, జానీ పాషాను సీఐ అభినందించారు. -
తాగేనీళ్లు లేకున్నా..మద్యం ఏరులై పారుతోంది
హుజూర్నగర్ రూరల్/గరిడేపల్లి: గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు లేకున్నా.. మద్యం ఏరులై పారుతోందని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మిషన్ భగీరథ ట్యాంకులున్నా చుక్క నీరు రావడం లేదని, ప్రజలు మంచినీళ్లకు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని నిప్పులు చెరిగారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అమరవరం, గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలో నిర్వహించిన మాట–ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో జరుగుతున్న భూ కబ్జాలు, రేషన్, మద్యం మాఫియా గురించి మాట్లాడితే తమ పార్టీ నాయకులపై, మహిళలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దాడులను నిరసిస్తూ తాను మూడు గంటలు వర్షంలో కూర్చొని ధర్నా చేస్తే గానీ సర్కార్ లొంగలేదన్నారు. రేపు ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తాం అంటూ పోలీసులు బెదిరించారని, అయితే బుధవారం ఎలా చేయనివ్వరో చూద్దాం అని తాను పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల పేర్కొన్నార -
మొన్న పిల్లి.. నేడు ఆబోతు..
చిలుకూరు: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీసులు కొద్దిరోజుల క్రితం పిల్లిపోరును తీర్చగా, తాజాగా సోమవారం చిలుకూరు పోలీసులు ఓ ఆబోతు పంచాయితీని పరిష్కరించారు. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామస్తులు ఆరేళ్ల క్రితం రామాలయం నిర్మించి గుడిపేరిట ఓ ఆబోతును వదిలేశారు. నెల రోజులుగా అది కనిపించకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల చిలుకూరులో ఆ ఆబోతును గంగిరెద్దు మాదిరిగా ఆడిస్తుండటంతో గమనించిన గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. రెండు గ్రామాల పెద్దల సమక్షంలో పోలీసులు పంచాయితీ నిర్వహించారు. గంగిరెద్దులవారు రూ. 30 వేల జరిమానా చెల్లించి ఆబోతును అప్పగించారు. -
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
హుజూర్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నా కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.36 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపడితే గ్రామాలకు తాగునీరు అందడంలేదు కానీ కేసీఆర్ కుటుంబం దాహార్తి తీరడానికి ఉపయోగపడిందని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీని ప్రశ్నించడానికి బీఎస్పీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల సంపద కేసీఆర్ కుటుంబం గుప్పెట్లో బందీ అయిందని, బీఎస్పీ అధికారంలోకి వస్తే వారు దోచుకున్నదంతా పేదలకు పంచుతామని, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పెద్దసారు పాడుబుద్ధి.. విద్యార్థినులు బడికి వెళ్లకపోవడంతో..
సాక్షి, హుజూర్నగర్ (నల్గొండ): గురుశిష్యుల సంబంధానికి మచ్చతెచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బంధువులు సదరు హెచ్ఎంను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బడితపూజ చేశారు. ఈ ఘటన చింతలపాలెం మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపాలెం మండలం అడ్లూరుకు చెందిన కొందరు విద్యార్థులు పక్క గ్రామమైన తమ్మారం ప్రాథమిక పాఠశాలకు కాలినడకన వెళ్లి చదువుకుంటున్నారు. చదవండి: ఫేస్బుక్ స్నేహం.. అశ్లీల వీడియోలతో మోడల్‌కు బెదిరింపులు రెండు రోజులుగా ఇద్దరు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లకపోవడంతో కుటంబ సభ్యులు ఆ అమ్మాయిలను నిలదీశారు. దీంతో వారు హెచ్ఎం అనిల్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. దీంతో వారు హెచ్ఎంను నిలదీయండంతో నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు ఆయనపై దాడిచేశారు. హెచ్ఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హెచ్ఎంపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. చదవండడి: వీడియో వైరల్: మైనర్ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని.. -
రైతు బిడ్డకు నాలుగు గోల్డ్ మెడల్స్
చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే చక్కని వ్యవసాయ పరికరాలను రూపొందించి శభాష్ అనిపించుకున్న యువకుడు గొర్రె అశోక్‌కు ‘ఇ–న్నోవేట్’ ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఇన్నొవేషన్ షో లో ఇటీవల నాలుగు బంగారు పతకాలు దక్కాయి. పోలెండ్‌లోని జకపొనె నగరంలో ప్రతి ఏటా ఈ పోటీ జరుగుతుంది. ఈ ఏడాది పోటీకి ప్రపంచ దేశాల నుంచి 2 వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. ఈ పోటీలో రెండుకు మించి బంగారు పతకాలు గెల్చుకున్న ఇన్నోవేటర్ అశోక్ ఒక్కరే కావటం విశేషం. వ్యవసాయం, ఆక్వాకల్చర్ విభాగంలో 12 ఆవిష్కరణలకు బంగారు పతకాలు దక్కగా.. అందులో తొలి 4 అశోక్‌వి కావటం మరో విశేషం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలీపురంలో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన అశోక్.. దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వ్యవసాయ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేశారు. చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ఆయనకు ఇష్టం. కేవలం రూ. 250 ఖర్చుతో వరి పొలంలో కలుపు తీతకు ఉపయోగపడే చేతి పరికరాన్ని రూపొందించి ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో ప్రథమ బహుమతి పొందారు. ఈ నేపథ్యంలో వరి పొలంలో కలుపు తీత పరికరంతో పాటు తాను రూపొందించిన మరో మూడు పరికరాలను అశోక్ ఈ ఏడాది ‘ఈ–న్నోవేట్’ పోటీకి పంపారు. ఏకంగా నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్నారు. విత్తనం వేసుకునే చేతి పరికరం: పత్తి, కంది, పెసర వంటి పంటల విత్తనాలను నడుము వంచే పని లేకుండా నిలబడే వేసుకునే ఒక చిన్న పరికరాన్ని అశోక్ రూపొందించారు. 3 అడుగుల ఎత్తున ఉండే ఈ పరికరంతో వేగంగా, సులువుగా, పురుషులు /మహిళలు /పెద్దలు / పిన్నలు ఎవరైనా సమాన దూరంలో విత్తనాలు వేసుకోవచ్చు. 4 రకాలుగా ఉపయోగపడే పరికరం అశోక్ తయారు చేసిన మరో పరికరం చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది. పత్తి, మిరప పొలాల్లో సాళ్ల మధ్య దున్నుతూ కలుపు తొలగించడానికి, విత్తనాలు వేసుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి చిన్న మార్పులతో ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. బహుళ ప్రయోజనకర యంత్రం అశోక్ మొట్టమొదటిసారిగా పెట్రోలుతో నడిచే పెద్ద వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఏ పంటలోనైనా ఎకరంలో 15 నిమిషాల్లో పిచికారీని పూర్తి చేయడం, ఎరువు వంటి బరువులను ఇంటి నుంచి పొలానికి రవాణా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే మల్టీపర్సస్ యుటిలిటీ వెహికల్ అని దీనికి పేరు పెట్టారు. ‘ఈ–న్నోవేట్’ పోటీలో దీనికి కూడా బంగారు పతకం వచ్చింది. ప్రభుత్వం లేదా దాతలు ఆర్థిక సాయం చేస్తే పేటెంట్ పొంది, ఆ తర్వాత ఈ యంత్రాన్ని రైతులకు అందిస్తానని కొండంత ఆశతో చెబుతున్న అశోక్‌కు ఆల్ ద బెస్ట్ చెబుదామా! ashokgorre17@gmail.com -
నిరుద్యోగంపై వైఎస్ షర్మిలకు తొలి విజయం
నేరేడుచర్ల / హుజూర్నగర్/ మిర్యాలగూడ: రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఆమె ఇక్కడికి వచ్చారు. నిరుద్యోగులతో ముఖాముఖి మాట్లాడారు. ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆమె అన్నారు. తాము వస్తున్నామనే భయంతో ప్రభుత్వం నీలకంఠం సాయికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమైన విషయమని, తాము చేస్తున్న పోరాటంలో ఇది తొలి విజయమని చెప్పారు. కాగా, ఇటీవల మృతిచెందిన ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) స్టేట్ కో ఆర్డినేటర్ గున్నం నాగిరెడ్డి కుటుంబసభ్యులను చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో వారి ఇంటికి వెళ్లి షర్మిల పలకరించారు. అలాగే, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన తన మద్దతుదారుడు సలీం కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఆమె వెంట నాయకులు కొండా రాఘవారెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఇందిరశోభన్, ఆదర్ల శ్రీనివాస్‌రెడ్డి, కర్రి సతీష్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు. చదవండి: ‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు -
కిడ్నాప్ తరహాలో జర్నలిస్ట్ అరెస్టా?: సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ లోపాలను ఎండగడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. హుజూర్నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండాలోని గిరిజన భూముల కబ్జా బాగోతాన్ని మీడియాలో కవర్ చేసినందుకు జర్నలిస్ట్ రఘుపై కేసు పెట్టారని తెలిసిందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక జర్నలిస్ట్‌ను కిడ్నాప్ తరహాలో అరెస్టు చేస్తారా అని నిలదీశారు. జర్నలిస్ట్ రఘు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తడమే మీడియా బాధ్యత అని, అక్రమ కేసులతో మీడియా గొంతును మూయించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉందన్న విషయాన్ని మరిచిపోవద్దని సంజయ్ హితవు పలికారు. హుజూర్నగర్ జైలుకు జర్నలిస్ట్ రఘు.. 14 రోజుల రిమాండ్ హుజూర్నగర్: హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ రఘును సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు సబ్‌జైలుకు తరలించారు. హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా 540 సర్వే నంబర్లో ఫిబ్రవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో గిరిజన భరోసా యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఆరోజు చోటుచేసుకున్న ఘటనలపై నమోదైన కేసులో జర్నలిస్ట్ రఘు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మఠంపల్లి పోలీసులు అతడిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని హుజూర్నగర్ కోర్టులో జడ్జి ముందు హాజరు పరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో వెంటనే హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించారు. -
కాంగ్రెస్ ఎంపీలను అవమానిస్తున్నారు
మఠంపల్లి (హుజూర్నగర్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రొటోకాల్ నిబంధనల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు, సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తానని నల్లగొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానదిపై ఇటీవల ప్రారంభమైన వంతెనను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ 2013లో రూ.50 కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయించానని తెలిపారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అప్రోచ్‌రోడ్డు పనులు మాత్రమే చేసి కనీస ఆహ్వానం కూడా లేకుండా తనను అవమానపరచిందన్నారు. అదే విధంగా పార్లమెంట్ సభ్యులకు కొన్ని హక్కులు, ప్రొటోకాల్ మర్యాదలు ఉంటాయని, కానీ ఉన్నతాధికారులు వాటిని పాటించకుండా కేవలం ఏఈ, డీఈ స్థాయి అధికారులతో నామమాత్రపు సమాచారమిచ్చి శిలాఫలకం కిందిభాగంలో పేరు పెట్టారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బ్రిడ్జికి సంబంధించి పూర్తిస్థాయి నిధులను తానే మంజూరు చేయించి, పనులను కూడా పూర్తిచేయించానని వెల్లడించారు. అంతేగాకుండా ప్రధాన మంత్రి సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పార్లమెంట్ సభ్యుల ప్రతిపాదనలతోనే రాష్ట్రాలకు మంజూరవుతాయన్నారు. ఈ నిధులతో చేపట్టిన పథకాల ప్రారంభ కార్యక్రమాలకు ఎంపీలను పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమను అవమానపరుస్తున్నారన్నారు. ఈ ఉల్లంఘనలు క్రోడీకరించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని, అలాగే హక్కుల కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. (చదవండి: ఖమ్మంలో బండి సంజయ్ వ్యాక్సిన్లు పనిచేయవు) -
నకిలీ హిజ్రా జుట్టు కత్తిరించారు..
-
నకిలీ హిజ్రా జుట్టు కత్తిరించారు..
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్ నగర్లో హిజ్రా వేషంలో తిరుగుతున్న ఓ వ్యక్తికి స్థానిక హిజ్రాలు దేహశుద్ది చేశారు. హుజుర్ నగర్ పట్టణంలో పొట్టి శ్రీరాములు సెంటర్ సమీపంలో అతని జుట్టు కత్తిరించి ఊరేగింపు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. బిహార్ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు మహిళా వేషం వేసుకొని స్థానికంగా ఉన్న తమను కత్తులతో చంపుతామని బెదిరిస్తున్నారని హిజ్రాలు పోలీసులకు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఇక్కడ హిజ్రాల వేషం వేసుకొని తిరుగుతున్నారని, అలాంటి వారు ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడితే ఆ నింద తమ సమాజంపై పడే అవకాశం ఉందని హిజ్రాలు వాపోయారు. అందుకే ఆ వ్యక్తిని దేహశుద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
హుజూర్‌నగర్‌లో హరితహారం కార్యక్రమం
-
సూర్యాపేటలో పర్యటించిన మంత్రి కేటీఆర్
సాక్షి, సూర్యాపేట: సంక్షోభ సమయంలో కూడా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు సూర్యాపేటలో పర్యటించి హుజూర్నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో హరితహారం మొక్కలు నాటి, నూతనంగా ఏర్పాటైన హుజూర్నగర్ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను సుందరీకరణ చేస్తున్నామన్నారు. ప్రతి నెల మున్సిపాలిటీలకు, పంచాయతీలకు నిధులు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంత దెబ్బతిన్నప్పటికీ వేగంగా పుంజుకుందన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా రైతు బంధు పథకం రైతులకు ఆసరాగా నిలిచిందన్నారు. అర్హులైన వారందరికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పనులను త్వరలోనే పూర్తి చేసిన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ దీపికా, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడ కన్నీళ్లు ఉంటే అక్కడ నేనుంటా: ఈటల
సాక్షి, హుజురాబాద్‌రూరల్: ఎక్కడ కన్నీళ్లు ఉంటే అక్కడ నేనుంటానని, నేనున్నంత వరకు ఎంత గొప్ప వైద్యమైనా అందించే ప్రయత్నం చేస్తాన ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పురపాలక సంఘం తొలి సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ర్యాలీగా కార్యాలయానికి వెళ్లారు. మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్ తదితరులు మంత్రిని గజమాలతో సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేగా గెలవడం సు లువని, కౌన్సిలర్‌గా గెలవడం తేలికకాదన్నారు. వార్డు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. పట్టణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి చే యించానని తెలిపారు. పట్టణంలో రూ.50 కో ట్ల నిధులతో భగీరథ పనులు మరోమూడునెలల్లో పూర్తవుతాయని తెలిపారు. నిరుపేదలకు చిరకాల ఆకాంక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గణేశ్‌నగర్‌లో, బోర్నపల్లిలో నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, త్వరలో ప్రజలకు అందిస్తామని తెలి పారు. శివారు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని తెలిపారు. హుజురాబాద్‌లో వందపడకల ఆసుపత్రితో మినీ ఎంజీఎంలా నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తుందని తెలిపారు. రూ.12 వేల కోట్లతో ఆసరా పింఛన్లకోసం ప్ర భుత్వం ఖర్చు చేస్తోందని తెలి పా రు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జెడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర సహా య కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఈసంపల్లి జోనా, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. -
టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటా: ఉత్తమ్
హుజురాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి త్వరలో తప్పుకోనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న వరుస ఓటముల కారణంగానే టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడానికి ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక తాను ఆ పదవిలో కొనసాగలేనని పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేసినట్టు వార్తలు వినిపించాయి. చదవండి: రాజకీయాలకు పనికిరానంటూ ఎమ్మెల్యే రాజీనామా! అయితే ఇప్పటికిప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయననే టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరినట్టు తెలుస్తోంది. రాజీనామా తర్వాత హుజూర్ నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరికొన్నిరోజుల్లో అధ్యక్ష పదవిని త్యజిస్తున్నానని కార్యకర్తలతో చెప్పారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలను సమాయత్తం చేశారు. కాగా, ఉత్తమ్ కుమార్ ప్రకటనపై కాంగ్రెస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తున్నది ఆసక్తి కలిగిస్తోంది. చదవండి: 'పౌరసత్వ చట్టం నచ్చని వారు సముద్రంలోకి దూకండి' -
ఎగిరిపడే వాళ్లకు ఎన్నికలతోనే సమాధానం
సాక్షి, హైదరాబాద్: ‘మున్సిపల్ ఎన్నికలు ఈ నెలలో లేదా.. కోర్టు తీర్పు కొంత ఆలస్యమైతే వచ్చే నెలలో జరిగే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఇతర ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వైవిధ్యంగా, భిన్నంగా ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అవతలి పార్టీ అభ్యర్థుల బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఒక్క ఓటుతోనూ ఓడిన సందర్భాలున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి..’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఇన్‌చార్జీలుగా పనిచేసిన పార్టీ రాష్ట్ర నేతలు, నల్లగొండ జిల్లా, హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ సోమవారం తెలంగాణభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించే దుర్మార్గులు పక్క పార్టీల్లో ఉన్నారు. విపక్ష పార్టీల నేతల తరహాలో బజారు భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల దుష్ప్రచారానికి ప్రజలే సమాధానం చెప్తారు. ఎగిరిపడే వారికి ఎన్నికల ద్వారా సమాధానం చెప్పాలి’అని అన్నారు. బీజేపీది ఓవరాక్షన్.. ‘హుజూర్నగర్ ఎన్నికల్లో బీజేపీ ఓవరాక్షన్ చేసి.. నిన్న మొన్నటిదాకా బిల్డప్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల తర్వా తే హుజూర్‌నగర్‌లో ఎన్నికలు జరగాలని కోరుకుంది. హుజూర్నగర్ ఎన్నిక జరగకుండా బీజేపీ అడ్డుకునే ప్రయ త్నం చేసిందనే సమాచారం ఉంది. హుజూర్నగర్ ఉపఎన్నికతో బీజేపీ ప్రచార పటాటోపం బయటపడింది.’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాలు గాలివాటమే అని తేలిపోవడంతో పాటు, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన బలమేమిటో ప్రజలు ఓట్లు వేసి మరీ తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థి సాధించిన ఓట్ల కంటే బీజేపీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. హుజూర్నగర్ ఎన్నిక ద్వారా ఏ పార్టీ బలమేంటో తేలిపోయింది. స్వయానా టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. ప్రజాభిమానం ముందు ప్రతిపక్షాల ప్రచార ఆర్భాటం చిన్నబోయింది’అని వ్యాఖ్యానించారు. కారు గుర్తును పోలిన చిహ్నాలతో నష్టం ‘హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డికి 50వేలకు పైచిలుకు మెజారిటీ వచ్చేది. పార్టీ చిహ్నం కారు గుర్తును పోలిన ఇతర చిహ్నాలతో నష్టం జరిగింది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాం టి తప్పులు జరగకుండా పరిష్కారం చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెప్తున్నాం. హుజూర్నగర్ ప్రజల రుణం తీర్చుకునేందుకు, ఇచ్చిన హామీల అమలుపై ఎమ్మెల్యే సైదిరెడ్డిపై స్థానిక నేతలు ఒత్తిడి తేవాలి. అధికారం, దుర్వినియోగం కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా, ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్లోకి వస్తే తీసుకుని పార్టీని బలోపేతం చేయాలి’ అని కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్.. సంస్థాగత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు కృషి చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు. కంచుకోట కాదు.. కరుగుతున్న మంచుకొండ హుజూర్‌నగర్‌ను కాంగ్రెస్ కంచుకోట అంటూ మీడియా ప్రచారం చేసిందని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట.. అక్కడ కరుగుతున్న మంచుకొండ అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల విజయం సీఎం కేసీఆర్ నాయకత్వానికి, కేటీఆర్ వ్యూహానికి దక్కిన ఫలితంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అభివర్ణించారు. ‘కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి లాభం, టీఆర్ఎస్ గెలిస్తే హుజూ ర్‌నగర్ ప్రజలకు లాభం అని కేటీఆర్ ఇచ్చిన నినాదానికి అక్కడి ప్రజలు ఓట్లేశారన్నారు. పార్టీ నేతలతో సమావేశం తర్వాత తెలంగాణభవన్‌లో కేటీఆర్ ఇచ్చిన విందు లో నల్లగొండ జిల్లా, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు, పార్టీ ఉప ఎన్నిక ఇన్చార్జీలు.. మొత్తం 300 మంది పాల్గొన్నారు. -
నీళ్లేవో.. పాలేవో తేల్చారు
సాక్షి, సూర్యాపేట: ‘హుజూర్నగర్ ముద్దుబిడ్డలకు రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, టీఆర్ఎస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు అందిం చిన విజయం తప్పకుండా మాలో ఉత్సాహాన్ని, సేవా భావాన్ని పెంచడంతోపాటు మరింత అంకితభావంతో పనిచేసే స్ఫూర్తి కలిగించింది. ఇది మామూలు విజయం కాదు. ఎన్నో అపోహలు, అనుమానాలు, అపవాదులు, ఎన్నో నీలాపనిందలు అన్నింటినీ విశ్లేషణ చేసి మీరు నీళ్లేవో.. పాలేవో తేల్చిచెప్పారు. బల్లగుద్ది మరీ హుజూర్ నగర్ తీర్పు చెప్పింది. అందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా’అని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహిం చిన ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్యఅతిథిగా హాజరై కార్య కర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రోడ్డు మార్గం ద్వారా హుజూర్నగర్ చేరుకున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెంట వెయ్యికిపైగా వాహనాలు వచ్చాయి. ఈ సభలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. మీరిచ్చిన ఫలితానికి సరిసమానంగా అభివృద్ధి.. హుజూర్‌నగర్‌లో 141 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఏడు మండల కేంద్రాలను తీసేస్తే 134 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మీరు ఎలా అయితే ఉవ్వెత్తున ఉత్సాహపరిచే ఫలితం ఇచ్చారో దానికి సరిసమానంగా సైదిరెడ్డి నాయకత్వంలో హుజూర్నగర్ అద్భుతమైన నియోజకవర్గం అనే పరిస్థితి రావాలి. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధుల నుంచి మంజూరు చేస్తున్నా. రేపో, ఎల్లుండో జీఓ విడుదల చేస్తాం. అలాగే ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు మంజూరు చేస్తున్నాం. హుజూర్నగర్ మున్సి పాలిటీకి సీఎంగా నా నిధుల నుంచి రూ. 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నా. హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో కొంత పోడుభూముల సమస్య ఉంది. దీనిపై అన్ని జిల్లాలకు నేనే వెళ్తున్నా. మొత్తం మంత్రివర్గం వచ్చి ప్రజాదర్బార్ పెట్టి కొద్దిరోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తుంది. 3 ఫీట్లు జగదీశ్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు.. హుజూర్‌నగర్‌ను అభివృద్ధి బాటలో పెట్టడానికి వచ్చా. మాటలు మాట్లేడేవారు దుర్మార్గంగా ఆరోపణలు చేశారు. జగదీశ్‌రెడ్డి మూడు ఫీట్లు లేడని మాట్లాడారు. ఆయన ఎంత ఉన్నాడో అంతే ఉన్నడు. కానీ ఇక్కడ ఏడు ఫీట్లు ఉన్న మంత్రులు చాలా మంది చేసింది చెబితే మీరు (ప్రజలు) నవ్వుతారు. కానీ ఇవ్వాళ మూడు ఫీట్లు ఉన్న మంత్రి 300 కి.మీ. దూరాన ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి పెన్‌పహాడ్ మండలంలోని చివరి గ్రామాలు, తుంగతుర్తి వరకు, నడిగూడెం, కోదాడ వరకు జిల్లా భూములను పునీతం చేస్తుండు. రూ. 30 వేల కోట్లతో నిర్మాణమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా విద్యుత్ ప్లాంట్‌ను దామరచర్ల మండలానికి తెచ్చాడు. ఇది పూర్తయితే ఈ జిల్లా ఆర్థిక ముఖచిత్రమే మారుతుంది. సాగర్ ఆయకట్టును కాపాడుకుంటాం.. నాగార్జునసాగర్ ఆయకట్టును నల్లగొండ జిల్లాలో కాపాడుకోవాలి. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును తీసుకున్నాం. దీని ద్వారా ఖమ్మం జిల్లా ఆయకట్టు బాధలు తొలగుతాయి. నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు బాధలు శాశ్వతంగా పోవాలి. దీనికోసం గోదావరి నీళ్లు సాగర్ ఎడమ కాలువలో పడాలి. ఈ నీళ్లతో రెండు పంటలు ఏటా పండాలి. ఇందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. నాలుగేళ్లు అహోరాత్రాలు పనిచేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమైంది. ఇప్పుడు కేసీఆర్ దెబ్బ సాగర్ ఆయకట్టుపై పడుతుంది. కచ్చితంగా తిరుగుతా. ఎమ్మెల్యేలను వెంటవేసుకొని వచ్చే 15–20 రోజుల్లో నేనే స్వయంగా వచ్చి కోదాడ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరకు పర్యటన చేస్తా. ప్రజలను, రైతులను కలుస్తా. ఈ బడ్జెట్లో, వచ్చే బడ్జెట్లో కొన్ని నిధులు మంజూరు చేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తాం. ఏ ఎత్తిపోతలు కావాలో అన్నీ మంజూరు చేస్తాం. కాలువల లైనింగ్‌లు చేస్తాం. ఈ పనుల్నీ త్వరలో జరుగుతాయి. నవంబర్ మొదటి వారంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్ నిపుణులు, నాగార్జునసాగర్ సీఈ నర్సింహతో తిరిగి పరిశీలించాలి. ఎత్తిపోతల రైతాంగానికి శుభవార్త.. ఐడీసీ, నీటిపారుదలశాఖ కింద ఎత్తిపోతల బాధ్యతలు సొసైటీలు, ఎన్జీఓల పరిధిలో ఉన్నాయి. రైతులపై పైసా భారం లేకుండా వాటన్నింటినీ ప్రభుత్వమే టేకోవర్ చేస్తుంది. అందులోని సిబ్బందినీ ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి జీతభత్యాలూ ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలోని 600 ఎత్తిపోతలకు ఈ ఉపశమనం ఉంటుంది. రైతాంగమంతా సంతోషిస్తుంది. హుజూర్నగర్ ప్రజా కృతజ్ఞత సభ వేదికగా తెలంగాణ రైతాంగానికి ఈ శుభవార్త చెబుతున్నా. కర్రు కాల్చి వాత పెట్టారు.. సైదిరెడ్డికి మీరు (ప్రజలు0 40 వేలకుపైగా మెజారిటీ ఇచ్చారు. కొందరు దుర్మార్గులు ఆయనది గుంటూరు జిల్లా అన్నారు. ఆయనది గుంటూరు జిల్లా కాదు కాబట్టే మీరు కర్రు కాల్చి వాత పెట్టారు. మీ అందరి దీవెనలు ఇలానే ఉంటే ఎవరు ఏమన్నా భయపడకుండా, వెరవకుండా ఇంకా మరిన్ని సేవలు చేస్తాం. మళ్లీ వచ్చినప్పుడు జానపహాడ్ దర్గా, మట్టపల్లి ఆలయం దర్శనం చేసుకుంటా. ఈ రెండు పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తాం. కులాలు, మతాలు లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తూ ముందుకు పోతున్న రాష్ట్రాన్ని చూసి కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నరు. ఓర్వలేక అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నరు. వారందరికీ దీటైన సమాధానం చెప్పి అద్భుతమైన మెజారిటీతో మా అభ్యర్థి సైదిరెడ్డికి విజయం చేకూర్చి కేసీఆర్ రైట్.. కేసీఆర్ గో ఎహెడ్ అని చెప్పిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల సేవలో తరిస్తాం. -
ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు
-
హుజూర్‌నగర్‌కు కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌లో జరిగిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద హుజూర్‌నగర్‌కు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇస్తామని అన్నారు. ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. (చదవండి : కారుకే జై హుజూర్!) సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేస్తాం. హుజూర్‌నగర్‌లో బంజారా భవన్ మంజూరు చేస్తున్నా. ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తాం. హుజూర్‌నగర్‌లో కోర్టు కూడా ఏర్పాటు చేసేలా చూస్తాం. ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తాం, ప్రజా దర్బార్లు పెట్టి పోడుభూముల సమస్య పరిష్కరిస్తాం’ అన్నారు. కాగా, హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొందిన సంగతి తెలిసిందే. -
టీఆర్ఎస్లో హుజూర్ జోష్
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో 43వేల పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి, నియోజకవర్గ కేంద్రంలో శనివారం ‘కృతజ్ఞత సభ’పేరిట బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొనాల్సిన బహిరంగ సభ వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. సుమారు పది రోజులక్రితం నిర్మించిన సభా వేదికను తొలగించక పోవడంతో శనివారం జరిగే బహిరంగ సభను అదే ప్రదేశంలో నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ఎన్నిక ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌కు చేరుకుని, సాయంత్రం ఐదు గంటలకు జరిగే ‘కృతజ్ఞత సభ’లో ప్రసంగిస్తారు. హుజూర్నగర్ విజయంపై ఎమ్మెల్యే సైదిరెడ్డి, పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఫోన్లో అభినందించిన కేసీఆర్, తనను కలిసేందుకు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, శనివారం జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ పర్యటనకు వస్తున్న కేసీఆర్‌కు భారీ స్వాగతం చెప్పేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సమన్వయ కమిటీలు..సామాజిక కోణాలు హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి వరుసగా మూడు పర్యాయాలు టీఆర్ఎస్ పోటీ చేసినా.. పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహం రూపొందించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెప్టెంబర్ చివరివారంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కొందరు ఎంపిక చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రచార వ్యూహం అమలు, సమన్వయ బాధ్యతలను అప్పగిస్తూ సుమారు 70 మంది ఇన్‌చార్జీలకు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలతో పాటు కొన్ని ప్రధాన సామాజిక వర్గాల ఓట్లను రాబట్టేందుకు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో తొమ్మిది మందితో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు కమిటీల ఏర్పాటు వ్యూహం టీఆర్ఎస్కు కలిసి వచ్చింది. పార్టీ వ్యూహం ఫలితాన్ని ఇవ్వడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ అభినందించగా, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులను శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. మున్సిపోల్స్‌లోనూ ఇదే తరహా వ్యూహం క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల సమన్వయం, ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలతో భారీ మెజారిటీ సాధించిన టీఆర్ఎస్, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తమ నియోజకవర్గాల పరిధిలో మున్సిపాలిటీలు లేని ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం, సమన్వయం బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. మున్సిపాలిటీలు, వార్డుల వారీగా ఇతర పార్టీల్లో క్రియాశీలంగా ఉండే కార్యకర్తలు, నాయకులను గుర్తించి.. వారిని పార్టీ గూటికి చేర్చే బాధ్యతను కూడా ఇన్‌చార్జీలకు అప్పగిస్తారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై కేటీఆర్ పార్టీ మున్సిపల్ ఇన్‌చార్జీలతో త్వరలో సమావేశం కానున్నారు. -
కారుకే జై హుజూర్!
సాక్షి, హైదరాబాద్ /సూర్యాపేట: విపక్షాల మాటలను హుజూర్నగర్ ప్రజలు విశ్వసించలేదు.. కాంగ్రెస్ నేతలు కలిసి కట్టుగా నియోజకవర్గాన్ని చుట్టేసినా పట్టించుకోలేదు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావమూ కని పించలేదు.. రాష్ట్ర స్థాయి రాజకీయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నియోజ కవర్గ అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తక్కువ మెజార్టీతో గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్ సర్వే లను తలకిందులు చేస్తూ.. అధికార పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ తొలిసారిగా కాంగ్రెస్ కంచు కోటను బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొంది రికార్డు సృష్టించారు. సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా పద్మావతిరెడ్డికి 69,737 ఓట్లు వచ్చా యి. ఇండిపెండెంట్ సపావత్ సుమన్ 2,697 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోటా రామారావుకు 2,639 ఓట్లు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయికి 1,827 ఓట్లు, సీపీఎం మద్దతు ఇచ్చిన దేశగాని సాంబశివ గౌడ్‌కు 885 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 894 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,00,754 ఓట్లలో 28 మంది అభ్యర్థులకు 2,00,248 ఓట్లు పడగా, నోటాకు 506 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ సహా 24 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అన్ని రౌండ్లలో గులాబీ హవా... కౌంటింగ్ మొదలైన తర్వాత ఒకటో రౌండ్ నుంచి చివరిదైన 22వ రౌండ్ వరకు అన్నింటా గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 15వ రౌండ్లో అత్యధికంగా 3,014 ఓట్ల మెజార్టీ రాగా, అత్యల్పంగా 22వ రౌండ్లో 748 ఓట్ల మెజార్టీని దక్కించుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండ లాలు, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలి టీల్లోనూ కారు జోరు కొనసాగింది. రెండు, మూడు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది. బీజేపీ, టీడీపీ సర్వశక్తులొడ్డినా ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి కేవలం 1,084 ఓట్లు మాత్రమే పెరిగాయి. గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 92,996 ఓట్లు, సైదిరెడ్డికి 85,530 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బొబ్బా భాగ్యారెడ్డికి 1,555 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావుకు 2,121 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 7,466 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో దెబ్బతిన్నామని భావించిన టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో జాగ్రత్తపడింది. దీంతో భారీ మెజార్టీ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్లో జోష్.. రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్‌పై హుజూర్నగర్ ప్రజలు చూపిన విశ్వాసం టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే, ఈ విజయం అంత సునాయాసంగా వచ్చిందేమీ కాదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అధికారంలో ఉన్న పార్టీనే గెలిపించడం ద్వారా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించాలనే కోణంలోనే అక్కడి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేశారని వారంటున్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి సైదిరెడ్డిపై కూడా కొంత సానుభూతి వచ్చిందని, అనేకసార్లు ఉత్తమ్‌కు ఓటు వేసిన వారు కూడా ఈ ఒక్కసారి స్థానికుడైన సైదిరెడ్డికి వేద్దామనే ఆలోచనతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ‘చే’జారిన కీలక స్థానం హుజూర్నగర్ ఫలితం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఏర్పాటైన నాటి నుంచి తమకు అండగా నిలుస్తూ వచ్చిన కీలక స్థానం చేజారిపోవడం ఆ పార్టీ శ్రేణులకు రుచించడంలేదు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం వంటి అంశాలు తమకు కలిసివస్తాయని, సాంప్రదాయ బద్ధంగా ఉన్న పార్టీ బలం తమను విజయతీరాలకు చేరుస్తుందని ఆశించినా ఊహించని పరాభవం ఎదురుకావడం వారికి మింగుడు పడడంలేదు. కౌంటింగ్ ప్రారంభమై తొలి రౌండ్ ఫలితం వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది. మంచి పట్టున్న నేరేడుచర్ల, పాలకవీడు, మేళ్లచెరువు, మఠంపల్లి వంటి మండలాల్లో కూడా భారీ నష్టం జరగడం, పార్టీ తరఫున ప్రచారం సరిగా నిర్వహించకలేపోవడంతో కాంగ్రెస్ పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో కూడా ఓటు బ్యాంకు చెదరలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత అతి తక్కువగా తమకు 2014 ఎన్నికల్లో 69, 879 ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో 69,737 ఓట్లు వచ్చాయని, అంటే తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయని, బీజేపీకి ఎక్కడా బలం లేదని నిరూపించగలిగామని అంటున్నారు. ధ్రువీకరణ పత్రం అందుకున్న సైదిరెడ్డి.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎన్నికల పరిశీలకులు సచింద్ర ప్రతాప్‌సింగ్, జేసీ సంజీవరెడ్డి, రిటర్నింగ్ అధికారి చంద్రయ్యల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం సైదిరెడ్డిని విజేతగా ప్రకటిస్తూ ఆయనకు ధ్రువీకరణపత్రం అందజేశారు. సైదిరెడ్డి వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌లు ఉన్నారు. ఇది హుజూర్నగర్ ప్రజల విజయం అరాచకవాదాన్ని తీసేసి అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి గెలిపించారు. ముందే ఊహించినట్టు భారీ మెజార్టీ వచ్చింది. ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో వారే గెలిచారు. నేను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా. అందరినీ కలుపుకొని ముందుకెళ్తా. హుజూర్నగర్ అభివృద్ధి కోసం కలిసొస్తానంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలుపుకొని పోతాం. రైతులు, మహిళల అభివృద్ధే ఎజెండాగా ముందుకెళ్తాం. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళా సాధికారత, లిఫ్ట్‌లు, రోడ్లు, డ్రెయినేజి వ్యవస్థ తదితర పనులు చేయిస్తా. నా గెలుపు కోసం కృషి చేసిన ఓటర్లు, ప్రజలు, పార్టీ కేడర్‌కు, నేతలకు అభినందనలు తెలుపుతున్నా.– శానంపూడి సైదిరెడ్డి రీపోలింగ్ నిర్వహించాలి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంతో టీఆర్ఎస్ గెలిచింది. ఉత్తమ్ చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేసినా ట్యాంపరింగ్‌తో మాయ చేశారు. మా పార్టీ, బీజేపీకి రావాల్సిన ఓట్లు రాలేదు. స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి వారి కుటుంబాల ఓట్లు కూడా వారికి పడలేదు. అందుకే ఆ అభ్యర్థులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఓటర్లను టీఆర్ఎస్ భయబ్రాంతులకు గురిచేసింది. రీపోలింగ్‌ను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో పెట్టాలి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. న్యాయపోరాటానికైనా సిద్ధం. – నలమాద పద్మావతిరెడ్డి -
84.75 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 84.45 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2,36,842 ఓట్లు ఉండగా.. 2,00,726 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషుల ఓట్లు 99,023, మహిళల ఓట్లు 1,01,703 ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 81.18%, 2018 ఎన్నికల్లో 86.38% పోలింగ్ నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 78.85% పోలింగ్ నమోదైంది. 50 శాతం పైగా నమోదు.. ఉప ఎన్నిక జరిగిన సోమవారం ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం, 11 గంటల వరకు 31.34 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 52.89 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 69.95 శాతం, సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 84.75 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నానికే 50 శాతం పైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం లోపలికి వచి్చన వారంతా ఓటేశారు. గరిడేపల్లి మండలం కల్మల చెరువలో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. హుజూర్నగర్ అంబేడ్కర్‌నగర్ పోలింగ్ కేంద్రంలో, మేళ్లచెరువు మండలం కప్పలకుంట తండా, గరిడేపల్లి మండలం వెల్దండలో సాయంత్రం 6 గంటల వరకు ఓటేశారు. గరిడేపల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలోని 252 పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో 40 నిమిషాల పాటు పోలింగ్ నిలిచింది. ఆ తర్వాత సాంకేతిక నిపుణులు దాన్ని సరిచేయడంతో మళ్లీ యథావిధిగా ఓట్లు వేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు జీకే.గొక్లానీ, సచింద్రప్రతాప్‌సింగ్, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎస్పీ ఆర్.భాస్కరన్, జేసీ సంజీవరెడ్డిలు పరిశీలించారు. నియోజకవర్గంలోని 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. కృష్ణపట్టె ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ భాస్కరన్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఓటేసిన అభ్యర్థులు.. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.. మఠంపల్లి మండలం గుండ్లపల్లి, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి హుజూర్‌నగర్‌లోని ఎన్ఎస్పీ క్యాంపు పాఠశాలలో, బీఎల్ఎఫ్ అభ్యర్థి మేడి రమణ హుజూర్నగర్ మండలంలోని లింగగిరి గ్రామంలో, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి దేశగాని సాంబశివగౌడ్ హుజూర్నగర్ మండ లం బూరుగడ్డలోని పోలింగ్ కేంద్రంలో ఓటే శారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓటు నియోజకవర్గంలో లేకపోవడంతో ఆమె ఓటేయలేదు. 24న ఓట్ల లెక్కింపు.. ఈ నెల 24న సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ గోదాం నుంచి ఈవీఎంలను సూర్యాపేట మార్కెట్ గోదాంలోకి చేర్చి స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. మెజారిటీతో గెలుస్తున్నాం: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గౌరవప్రదమైన మెజారిటీతో వి జయం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత సామాజిక మాధ్యమం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. -
ముగిసిన హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్
-
మైకులు కట్.. ప్రచార బృందాల తిరుగుముఖం
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం గడువు శనివారం సాయంత్రం ముగిసింది. సుమారు 20 రోజులుగా నియోజకవర్గంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయా పార్టీల నేతలు తిరుగుముఖం పట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ నడుమ ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ, టీడీపీతో పాటు పలు పార్టీలు, స్వతంత్రులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తుండటంతో.. ప్రచార పర్వంలో ఆయనే అంతా తానై వ్యవహరించారు. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక టీఆర్ఎస్ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని 70 మంది ఇన్చార్జీలు శానంపూడి సైదిరెడ్డి పక్షాన ప్రచార, సమన్వయ బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కూడా ఉప ఎన్నిక ప్రచార బాధ్యత అప్పగించినా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న హుజూర్నగర్ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా, వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ నెల 4న నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ తరఫున కిషన్‌రెడ్డి, లక్ష్మణ్.. రాష్ట్రంలో బలోపేతమయ్యేందుకు శ్రమిస్తున్న బీజేపీ కూడా హుజూర్నగర్ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అభ్యర్థి కోట రామారావు తరఫున కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రచారం నిర్వహించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు మూలంగా పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం కూడా ప్రస్తుత ఉప ఎన్నికలో పోటీ చేస్తుండగా,నందమూరి హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని ప్రచారంలో పాల్గొన్నారు.28 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో..ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. ఇదిలాఉంటే సోమవారం జరిగే ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో సోమవారం హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. -
కారుకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే!
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి మోదీ దోస్తులని, టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డితో కలసి నియోజవర్గంలోని పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్ మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, కేసీఆర్ ముస్లింల వ్యతిరేకి అని, వారికి వ్యతిరేకంగా బీజేపీ పార్లమెంట్లో పెట్టే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఈనెల 21న జరిగే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ను ఓడించాలన్నారు. హుజూర్‌నగర్‌లో చిన్న తుంపర వర్షానికే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాలేదని, ఇక్కడి ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక, మొఖం చూపించలేక సభకు రాలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్ హుజూర్నగర్ సభ రద్దు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా, ఏవియేషన్ అనుమతి లేకపోవడంతో చివరి నిమిషంలో రద్దయింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేయగా, పార్టీ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ హాజరయ్యేలా షెడ్యూలు సిద్ధం చేశారు. అయితే గురువారం హుజూర్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో..హెలిక్యాప్టర్‌కు ఏవియేషన్ విభాగం అనుమతివ్వలేదు. సీఎం భద్రతను దృష్టిలో పెట్టుకుని హెలిక్యాప్టర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని ఏవియేషన్ విభాగం డైరెక్టర్ వీఎన్ భరత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. హెలిక్యాప్టర్‌కు అనుమతి లేకపోవడంతో సీఎం పర్యటన రద్దయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ నెల 19తో హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండటంతో.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉండే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
కేసీఆర్ సభ రద్దు.. నేతల ప్రత్యేక సమావేశం
సాక్షి, హుజూర్నగర్: రాష్ట్ర రాజకీయాల్లో హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారం అధికార, ప్రతిపక్ష పార్టీలకు మధ్య హోరాహోరీగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలు ప్రచార జోరును పెంచాయి. అయితే భారీ వర్షం కారణంగా సీఎం కేసీఆర్ బహిరంగసభ రద్దు కావటంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది. కేసీఆర్ సభతో హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లలో కొత్త జోష్ తేవాలని భావించిన టీఆర్ఎస్ నేతలు సభ రద్దుతో నిరుత్సహపడ్డారు. ముఖ్యమంత్రి సభ రద్దైనప్పటికీ ప్రచార జోరును ప్రతి పక్షాలకు దీటుగా కొనసాగించాలనే వ్యూహంతో టీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. సభ రద్దు అయిందని ప్రకటించిన వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి, జిల్లా ఎమ్యెల్యేలంతా ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ రద్దు కావటంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది. సీఎం సభ అనగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకింత కలవరపాటు నెలకొంది. నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ ఎలాంటి హామీలు ఇస్తారో.. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఎటువంటి ప్రకటన చేసి ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపుతారోనని అనుకున్నారు. కానీ, సభ రద్దు కావటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎంసభ రద్దు కావటం టీఆర్ఎస్ పార్టీకి, శ్రేణులకు ఎదురుదెబ్బ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
హుజూర్‌నగర్‌లో నేడు కేసీఆర్ బహిరంగ సభ
-
హుజూర్‌నగర్‌పై బులెటిన్ విడుదల చేసిన ఈసీ
సాక్షి, సూర్యాపేట : హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు, కేసులు, నగదు, పట్టుబడిన మద్యం వంటి వివరాలతో కూడిన బులిటెన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య ఆదివారం విడుదల చేశారు. మొత్తం ప్రచార వాహనాల సంఖ్య - 104 ఇప్పటి వరకు పట్టుకున్న నగదు : రూ.72,29,500 సీజ్ చేసిన మద్యం : 7000లీటర్ల కోడ్ ఉల్లంఘన కేసులు: 10 సి విజిల్ యాప్ ద్వారా నమోదైన కేసులు సంఖ్య: 15 కాగా, కేవలం మఠంపల్లి మండలంలోనే రూ. 1,25,200 మద్యం పట్టుబడడం గమనార్హం. అభ్యర్థులు ప్రచారం కోసం చేసిన ఖర్చు: టిఆర్ఎస్ - శానంపూడి సైదిరెడ్డి - రూ.8,65,112 కాంగ్రెస్ - పద్మావతి రెడ్డి - రూ.5,27,621 బీజేపీ - కోట రామారావు - రూ.4,22,258 స్వతంత్ర అభ్యర్థి - తీన్మార్ మల్లన్న - రూ.3,73,945. టిడిపి - చావా కిరన్మయి - రూ.3,46,968 స్వతంత్ర అభ్యర్థి దేశగాని సాంబశివ గౌడ్ - రూ. 10360 -
‘హుజూర్’లో ముందంజ
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల ప్రకారం కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ ఎంతో ముందంజలో ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక ప్రచారం తీరుతెన్నులపై పార్టీ ఇన్చార్జిలు, సీనియర్ నేతలతో శనివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇన్చార్జిలతో పాటు, ఇతర నేతల నుంచి ప్రచారం జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇంటింటికీ పార్టీ ప్రచారం చేరాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. ప్రజల నుంచి టీఆర్ఎస్కు అనూహ్య మద్దతు లభిస్తోందని, పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో కనీసం 50 శాతం ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా పోలవుతాయని కేటీఆర్ వెల్లడించారు. గత ఎన్నికల్లో పార్టీ ఎన్నికల చిహ్నం కారును పోలివున్న ట్రక్కు గుర్తుతో టీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ కొన్ని వాహనాలకు సంబంధించిన ఇతర గుర్తులు ఉన్నందున.. పార్టీ చిహ్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డమ్మీ ఈవీఎంలు ఉపయోగించాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్‌కు ప్రచారాంశాలు కరువు.. ‘టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభం’ నినాదంతో చేస్తున్న ప్రచారానికి ప్రజల మద్దతు లభిస్తోందని, అదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రచారాంశాలు లేకుండా పోయాయని పార్టీ నేతలతో కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో లేకున్నా.. కేంద్ర నిధులతో హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేస్తున్న ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత లేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుత ఉప ఎన్నికతో బీజేపీ బలం తేలిపోతుందని, డిపాజిట్ దక్కితే అదే వారికి అతిపెద్ద ఉపశమనమన్నారు. ప్రజాభిమానం పొందలేని బీజేపీ.. కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరిస్తూ దొంగ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. హుజూర్నగర్ ప్రచారానికి కేటీఆర్ దూరం..? దసరా తర్వాత హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తొలుత వెల్లడించాయి. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఈ నెల 4న హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొన్నారు. తిరిగి ఈ నెల 10 నుంచి నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్‌షోలలో పాల్గొంటారని ప్రచారం జరగ్గా.. చివరి నిమిషంలో పర్యటన షెడ్యూల్ రద్దయింది. కాగా, హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ పాల్గొనే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడిం చాయి. ఈ నెల 19న ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండగా.. సీఎం కేసీఆర్ ఈ నెల 18న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. అయితే సీఎం కేసీఆర్ ప్రచారానికి సంబంధించి ఇప్పటివరకు షెడ్యూల్ ఖరారు కాలేదు. -
హోరాహోరీగా హూజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం
-
హుజూర్‌నగర్‌కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 18న పాల్గొంటారు. ఈ నెల 21న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, 19న సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో 18న హుజూర్నగర్ నియోజకవర్గం కేంద్రంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ సభకు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దసరా తర్వాత పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపొందిస్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 4న హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ షో నిర్వహించారు. తిరిగి ఈ నెల 10 నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో రోడ్ షోలు, సభలు నిర్వహించేలా పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రణాళిక సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లోనూ కేటీఆర్ రోడ్ షోలుంటాయని పార్టీ నేతలు వెల్లడించారు. ప్రస్తుతం మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పువ్వాడ అజయ్ అడపాదడపా ప్రచారానికి వస్తున్నారు. నియోజకవర్గంలో అత్యంత ప్రభావం చూపే ఎస్టీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని.. మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన తండాలను చుట్టి వస్తున్నారు. సామాజికవర్గాల మద్దతు కోసం.. ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్.. ప్రచార వ్యూహం అమలు, సమన్వయ బాధ్యతలను అప్పగిస్తూ సుమారు 70 మంది ఇన్చార్జిలను నియమించిన విషయం తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హుజూర్నగర్ ఉప ఎన్నిక ఇన్చార్జిగా వ్యవహరిస్తుండగా.. 9 మందితో కూడిన కోర్ కమిటీ ప్రచార వ్యూహం అమలును పర్యవేక్షిస్తోంది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, తేరా చిన్నపరెడ్డి, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, రాంబాబుయాదవ్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ సామాజిక వర్గాల ఓట్లను దృష్టిలో పెట్టుకుని, వారి మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఎస్టీ, కమ్మ, యాదవ, వైశ్య, ముస్లిం మైనార్టి, బ్రాహ్మణ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు రంగంలోకి దిగిన కమిటీలు చాపకింద నీరులా పనిచేస్తున్నాయి. ఎస్టీ, కమ్మ సామాజికవర్గం మద్దతు కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో ఆయా సామాజికవర్గాలకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. సర్వేల ద్వారా పార్టీ పరిస్థితిపై విశ్లేషణ ఓ వైపు హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భారీగా పార్టీ ఇన్చార్జిలను మోహరించిన టీఆర్ఎస్.. దసరా తర్వాత మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రచా రంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రచారానికి దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల జాడ లేకపోవడంతో మరింత మంది ఎమ్మెల్యేలు ప్రచార బరిలోకి దిగనున్నారు. నామినేషన్ల దాఖలు సమయంలోనే ప్రైవేటు సంస్థ ద్వారా హుజూర్‌నగర్‌లో పార్టీల బలాబలాలపై టీఆర్ఎస్ అంతర్గత సర్వే నిర్వహించింది. సర్వేలో 54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. పోలింగ్ తేదీలోగా మరిన్ని సర్వేలు నిర్వహించే ఉద్దేశంతో ఉన్న టీఆర్ఎస్ తాజాగా మరో సర్వే ఫలితాన్ని విశ్లేషిస్తున్నది. ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులుండగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థుల వారీగా సర్వే ద్వారా టీఆర్ఎస్ సమాచారాన్ని సేకరిస్తోంది. -
ఒక్క ఓటుతో ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తాం
చింతలపాలెం (హుజూర్నగర్) : హుజూర్‌నగర్‌లో ఒక ఓటుతో ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తామని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ క్యాంప్ కార్యాలయంలో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ఒక ఓటు వేసి పద్మావతిని గెలిపిస్తే తనతో పాటు పద్మావతి పని చేస్తారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ప్రజను ఎలా ఓటు అడుతున్నారని ప్రశ్నించారు. మాదిగ సామాజిక వర్గానికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించలేదని, అందుకు మాదిగలు టీఆర్ఎస్ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి బెదిరింపు మాటలకు ఎవరూ భయపడవద్దని అన్నారు. ఆర్టీసీని లాభాపేక్షతో చూడొద్దని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో రింగ్ రోడ్డు, కోర్టు బిల్డింగ్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ తదితర అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. పాలకీడు మండలంలో కాల్వ చివరి భూములకు నీరు రాకపోవడంతో కొత్తలిఫ్ట్ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. మిర్యాలగూడ, జగ్గయ్యపేట రైల్వే మార్గంలో ప్యాసింజర్ రైలు నడిపిస్తానని అన్నారు. హుజూర్నగర్ ప్రాంతలో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయిస్తానని చెప్పారు. మిర్యాలగూడెం – ఖమ్మం రోడ్డును విస్తరింపచేయిస్తానని, కేంద్ర ప్రభుత్వ నిధులతో అంతర్జాతీయ స్థాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం చేయిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కైలాష్ కుమార్, యరగాని నాగన్న గౌడ్, తన్నీరు మల్లిఖార్జున్ పాల్గొన్నారు. -
జీ హుజూరా? గులాబీ జెండానా?
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ‘ఈరోజు హుజూర్నగర్ ప్రజల ముందు స్పష్టమైన అవకాశం.. మార్గం ఉంది. ప్రత్యామ్నాయం ఉంది. మళ్లీ వాళ్లకే ఓటేసి జీ హుజూర్ అందామా.. లేదా గులాబీ జెండాను గుండెకు హత్తుకొని జై హుజూర్నగర్ అందామా? ఏ విషయం ఆలోచించుకోవాలి’అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తమ్ మోసకారి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన ఉత్తమ్, అప్పుడు సీఎంని అవుతానంటూ ఓట్లు వేయించుకున్నారని, మళ్లీ 2019లో కేంద్ర మంత్రిని అవుతానని చెప్పి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని, ప్రజలను ఇలా మభ్య పెట్టిన ఉత్తమ్ మోసకారి అని కేటీఆర్ విమర్శించారు. రూ.2 వేల కోట్లు ఇచ్చాం.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు మొత్తం రూ.2 వేల కోట్లపైచిలుకు వివిధ కార్యక్రమాల ద్వారా హుజూర్నగర్ ప్రజలకు అందించినట్లు కేటీఆర్ చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తట్ట, పార పారేసి ఎప్పుడో చెక్కేశారన్నారు. ఆయన దేశంలోనే లేడన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు.. పేరుకే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని, ఆయన వెనక 12 మంది ‘నేను సీఎం, నేను సీఎం’ అంటూ ఎన్నికలు కాకముందే అన్నారన్నారు. అందులో నల్లగొండలో నలుగురు ఉన్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఎలాగైనా సైదిరెడ్డిని ఓడించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే సంక్షేమం, పల్లెపల్లెలో అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తనదని మంత్రి కేటీఆర్ అన్నారు. రోడ్‌షోలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఏనాడూ ప్రజలకోసం అడగలేదు.. గతంలో ఉత్తమ్ ఎమ్మెల్యేగా ఉన్నా .. ఐదేళ్లలో ఏనాడూ మా ప్రజలకు ఇది కావాలంటూ ఒక్క దరఖాస్తు కూడా చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘నేను సీఎం స్థాయి వ్యక్తిని నేను వెళ్లి, జగదీశ్, కేటీఆర్‌ను అడుగుతానా..?’అన్న అహంకారం ఉత్తమ్‌కు ఉందన్నారు. -
మునుగుతున్న పడవకు ఓటేస్తారా?
సాక్షి, హైదరాబాద్: మునిగిపోతున్న పడవ లాంటి కాంగ్రెస్‌కు హుజూర్నగర్ ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయరని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి హుజూర్‌నగర్‌లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం, ఎన్నికల వ్యూహం అమలు, పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయం తదితర అంశాలపై కేటీఆర్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఎన్నికల ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఇతర ఇన్చార్జులు క్షేత్ర స్థాయి పరిస్థితిని మంగళవారం కేటీఆర్‌కు వివరించారు. మండలాలు, మున్సిపాలిటీలు, వివిధ సామాజికవర్గాలు, పార్టీల వారీగా క్షేత్రస్థాయిలోని పరిస్థితిపై వారు సేకరించిన వివరాలను నివేదించారు. ఈ సందర్భంగా ఇన్చార్జులకు పలు అంశాలపై కేటీఆర్ దిశా నిర్దేశం చేయడంతో పాటు, ప్రచార సరళిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని, ఈ నెల 4తో పాటు, దసరా తర్వాత ఒకట్రెండు రోజులు హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటానని కేటీఆర్ వెల్లడించారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు వెయ్యి శాతం సంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని, క్షేత్ర స్థాయి రిపోర్టుల ప్రకారం టీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. దేశం, బీజేపీకి స్పందన ఉండదు.. అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విపక్షాలు.. ప్రస్తుతం ఎవరికి వారుగా విడివిడిగా పోటీ చేస్తున్న తీరు.. ఆయా పక్షాల అనైక్యతకు అద్దం పడుతోందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ గెలుపొందడం ద్వారా హుజూర్నగర్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వంలో లేని వారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదనే అంశాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఖాయమని, బరిలో ఉన్న టీడీపీ, బీజేపీకి కూడా ప్రజల నుంచి పెద్దగా ఆదరణ ఉండకపోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని, ఉప ఎన్నికలో విజయం సాధించడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తమ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌పై ఎలాంటి వివక్ష చూపకుండా, రాష్ట్రంలోని అన్ని ఇతర నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్.. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదని కేటీఆర్ తెలిపారు. -
ఎన్నికల ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తాం
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు నేటి నుంచి వారి ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ అమయ్‌కుమార్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 18004252838, 1950కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. సీ–విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సాక్షి, హుజూర్నగర్: హుజూర్నగర్ ఉప ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు నేటి నుంచి వారి ఖాతాలలో జమ చేస్తామని కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రతి రోజూ జరిగిన ర్యాలీలను వీడియో తీయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 14 ఫ్లయింగ్‌స్క్వాడ్ టీమ్స్, 14 స్టాటిక్ సర్వే చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో 2 వీడియో సర్వేలైన్ టీమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.46 లక్షల 75 వేలను సీజ్ చేసినట్లు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా ఎన్నికల సందర్భంగా టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 18004252838, 1950కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. సి–విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 24 గంటల పాటు జిల్లా కలెక్టరేట్, హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన టీంలు ఫిర్యాదు సెంటర్లలో పనిచేస్తున్నారని తెలిపారు. -
హుజూర్ బరిలో భారీగా నామినేషన్లు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 76 మంది అభ్యర్థులు 119 నామినేషన్లు వేశారు. చివరి రోజైన సోమవారం ఒక్క రోజే 67 మంది అభ్యర్థులు 106 నామినేషన్లు వేశారు. ఈ నెల 3న నామినేషన్ల ఉప సంహరణలతో ఎంత మంది బరిలో ఉంటారో తేలనుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సర్పంచ్ల ఫోరం నుంచి కొం దరు నామినేషన్లు వేశారు. ఇద్దరు సర్పంచ్ల నామినేషన్లు మాత్రమే తీసుకున్నారని, తమను నామినేషన్ వేయనివ్వలేదని కొందరు సర్పంచ్‌లు మీడి యాకు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు సచింద్ర ప్రతాప్‌సింగ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అమయ్‌కుమార్ పరిశీలించారు. ఉదయం 11 గంటల నుంచే హుజూర్‌నగర్‌లోని నామినేషన్ కేంద్రం వద్ద కోలాహలం కనిపించింది. ప్రధాన పారీ్టల అభ్యర్థులు మధ్యాహా్ననికే నామినేషన్లు వేయడం పూర్తి అయింది. తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిరెడ్డి స్థానిక నాయకులతో కలసి వెళ్లి నామినేషన్ వేశారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావుతో కలసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోటా రామారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో వెళ్లి నామినేషన్ వేశారు. సీపీఎం నుంచి పారేపల్లి శేఖర్‌రావు, టీడీపీ అభ్యరి్థగా చావా కిరణ్మయి నామినేషన్ వేశారు. బీఎల్ఎఫ్ అభ్యరి్థగా మేడి రమణ, తెలంగాణ ఇంటి పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యరి్థగా తీన్మార్ మల్లన్నలు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. నామినేషన్ వేయనివ్వలేదు.. సర్పంచ్ల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు «జూలూరి ధనలక్ష్మి ఆధ్వర్యంలో 30 మంది సర్పంచ్‌లు నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. అయితే తమకు టోకెన్లు ఇచ్చినా నామినేషన్లు వేయనివ్వలేదని వారు మీడియా ముందు అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. ఆరుగురు నామినేషన్లు వేస్తే అందులో నలుగురివి తిరస్కరించి, ఇద్దరివి తీసుకున్నారని సంఘం నేత ధనలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. అధికారుల తీరుపై సర్పంచ్ల సంఘం నేతలు నామినేషన్ కేంద్రం బయట నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయారు. -
అభివృద్ధి చేసిందే కాంగ్రెస్
హుజూర్నగర్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హుజూర్‌నగర్‌లో అభివృద్ధి జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. సోమవారం హుజూర్నగర్ పబ్లిక్ క్లబ్లో నిర్వహించిన కాంగ్రెస్ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన తాను రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు చేయించానని చెప్పారు. మట్టపల్లిలో హై లెవెల్ వంతెనను రూ.50 కోట్లతో కట్టిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రూ.50 లక్షలతో అప్రోచ్ రోడ్డు వేయకుండా, బ్రిడ్జిని ప్రారంభించకుండా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాంటి వారు మేమే అభివృద్ధి పనులు చేశామంటూ ప్రజల్లోకి వెళితే ఛీ కొడుతున్నారని చెప్పారు. హుజూర్‌నగర్‌లో రూ.200 కోట్లతో 4వేల ఇళ్లు 80 శాతం పూర్తి చేస్తే, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లయినా 20 శాతం పనులు పూర్తి చేయలేదని, నిరుపేదలకు ఇళ్లు పంపిణీ చేయలేదన్నారు. కాంగ్రెస్‌దే గెలుపు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు 700 మంది వచ్చి టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసినా గెలుపు కాంగ్రెస్‌దేనని ఉత్తమ్ అన్నారు. అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీనే ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్నారు. అధికార పార్టీ వారు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానని చెప్పి పది నెలలు దాటినా ఇంత వరకు అతీగతి లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులను కుక్క తోకతో పోలి్చన కేసీఆర్‌కు ప్రజలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అప్పులతో తాకట్టు..: కోమటిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టే దుస్థితి తెచి్చందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైరల్ ఫీవర్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తన కుక్క చనిపోయిం దని డాక్టర్ రంజిత్కుమార్పై కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన కేసీఆర్‌కు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధం గా ఉన్నారన్నారు. తామిద్దరం ఎంపీలం కలసి హుజూర్‌నగర్‌కు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపిస్తే నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అసెంబ్లీలో కేసీఆర్‌ను నిలదీస్తామన్నారు. 52 ఏళ్ల క్రితమే 50 లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత కాంగ్రెస్‌దేనని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, జాతీయ ఉపాధి హామీ పథకం లాంటివి కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ సలీం అహ్మద్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్క, హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నేతలు భయంతో వణికిపోతున్నారు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచి్చన ఆరేళ్లలో హుజూర్నగర్ నియోజకవర్గంలో చేసిన ఒక్క అభివృద్ధి పనిని చూపించినా పోటీ నుంచి కాంగ్రెస్ తప్పుకుంటుందని ఉత్తమ్ చెప్పారు. హుజూర్నగర్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సోమవారం ఆయన ఫేస్బుక్లో కాంగ్రెస్ కేడర్‌నుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009లో తాను తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో విద్యుత్ సమస్య నుంచి బయటపడేశామని, నియోజకవర్గ వ్యాప్తంగా 130 కేవీ, 13/11 కేవీ ఉప సబ్స్టేషన్లు 12 ఏర్పాటు చేయించామన్నారు. తన హయాంలోనే నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల వచి్చందని, 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని చెప్పారు. నేరేడుచర్ల–కోదాడ–ఖమ్మం రోడ్డును ఫోర్‌లైన్‌గా విస్తరించామన్నారు. టీఆర్ఎస్ హయాం లో నియోజకవర్గంలో చెప్పుకోదగిన ఒక్క అభివృద్ధి పని జరగలేదని, అందుకే ఓటమి భయంతో టీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. శాంతియుత ప్రాం తంగా పేరొందిన నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు భయోత్పాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాపాడేందుకు సీపీఐ తమకు మద్దతు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఎం, టీడీపీలు కూడా పోటీ నుంచి వైదొలగి కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఉత్తమ్ కోరారు. -
హుజూర్నగర్ నుంచే టీఆర్ఎస్ పతనం
గరిడేపల్లి: హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఓటమితోనే టీఆర్ఎస్ పతనం ప్రారంభం కానుందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేట, అబ్బిరెడ్డిగూడెం, లక్ష్మీపురం, సర్వారం గ్రామాల్లో జరిగిన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఒక్క ఆడ మనిషిని ఓడించడానికి 700 మంది టీఆర్ఎస్ నాయకులు హుజూర్‌నగర్‌లో మోహరించారంటే ఆ పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవాలన్నారు. గలీజు రాజకీయాలకు మారు పేరుగా టీఆర్ఎస్ మారిందని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని, ప్రలోభాలకు తెరదించుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ మంత్రులు, నాయకులకు హుజూర్నగర్ ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ‘నా సతీమణి పోటీ చేస్తున్న ఈ ఎన్నిక హుజూర్నగర్ ఆత్మ గౌరవ ఎన్నిక’అని ఉత్తమ్ అన్నారు. ఈ ఎన్నికల్లో 40 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందన్నారు. హుజూర్నగర్.. కాంగ్రెస్‌కు అడ్డ అని పేర్కొన్నారు. ఆరేళ్ల పాలనలో ఒక్క పనిచేయని టీఆర్ఎస్ నాయకులు.. ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతున్నారని ప్రశ్నించారు. -
హుజూర్‌నగర్‌లో ఇక లాభ నష్టాల ‘గణితం’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే అయినా బీజేపీ, టీటీడీపీ, సీపీఎం అభ్యర్థులతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి కూడా బరిలోకి దిగుతున్నారు. ఆయా అభ్యర్థులకు పడే ఓట్లు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో ఎవరికి నష్టం చేస్తాయన్న దానిపై అప్పుడే లెక్కలు మొదలయ్యాయి. మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్‌కు అండగా నిలుస్తుందని భావించిన సీపీఐ కూడా ఇప్పుడు ఊగిసలాటలో పడటం, టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి మద్దతు అభ్యర్థించడం హుజూర్నగర్ రాజకీయాన్ని మరింత రక్తికట్టిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలు, సామాజిక వర్గాల వారీగా ఓట్లను ప్రోది చేసుకునే పనిలో రెండు ప్రధాన పక్షాలు ఇప్పటికే బిజీ అయిపోయాయి. ఇక, ప్రచార పర్వంలో రెండు పార్టీలు పోటాపోటీగా ముందుకెళుతుండగా, అధికార పార్టీ తన బలగాన్ని పూర్తిగా అక్కడే మోహరించింది. కాంగ్రెస్ ప్రస్తుతానికి ఉత్తమ్ చరిష్మాతోనే ప్రచారంలోకి వెళుతున్నా.. ఈ 20 రోజుల పాటు పెద్దెత్తున పార్టీ కీలక నేతలను రంగంలోకి దింపనుంది. సామాజిక వర్గాలవారీగా లెక్కలు... హుజూర్‌నగర్‌లో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే రెడ్డి, లంబాడీ, ఎస్సీ (మాదిగ), గౌడ్, యాదవ, మున్నూరు కాపు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల ఓట్లు అన్నీ కలిపి 1.25 లక్షల వరకు ఉంటాయని అంచనా. దీంతో ఆయా సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. పెరిక, కమ్మ, వెలమ సామాజిక వర్గాలకు కలిపి 20వేల ఓట్ల వరకు ఉంటాయనే అంచనా నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఆ ఓట్లు ఏమవుతాయి? అందులో కాంగ్రెస్, టీఆర్ఎస్లలో ఎవరికి నష్టం జరుగుతుందన్నది గెలుపోటములపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. బీసీల ఓట్లు 80వేలకు పైగా ఉన్న ఈ నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల ప్రజలు ఎటు మొగ్గుచూపితే అటు విజయావకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు రెండు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికలో ప్రతి ఓటూ కీలకమే కావడంతో ఆ రెండు పార్టీలు ఇతర అభ్యర్థులతో తమకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తేలిన అభ్యర్థులు.. ఈ ఎన్నికల్లో పలు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే నిర్ణయించగా, బీజేపీ, సీపీఎం, టీటీడీపీ తమ అభ్యర్థులను ఆదివారం అధికారికంగా ప్రకటించాయి. బీజేపీ నుంచి డాక్టర్ కోట రామారావు, సీపీఎం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పారేపల్లి శేఖర్‌రావు, టీటీడీపీ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్చార్జి చావా కిరణ్మయిలను ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరంతా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీజేఎస్, సీపీఐ ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించాయి. సీపీఐ మద్దతు కోరుతూ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆదివారం మఖ్దూం భవన్‌కు వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీపీఐ నేతలను కలిసి మద్దతు అభ్యర్థించిన నేపథ్యంలో రేపు ఆ పార్టీ తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక, టీజేఎస్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే, ఈ ఎన్నికల్లో తాము క్రియాశీల పాత్ర పోషిస్తామని, ఎవరికి మద్దతిస్తామన్నది నేడో, రేపో ప్రకటిస్తామని కోదండరాం వెల్లడించారు. అభ్యర్థులు తేలడంతో సోమవారమంతా హుజూర్‌నగర్‌లో నామినేషన్ల కోలాహలం నెలకొననుంది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి ఇప్పటికే ఓ సెట్ నామినేషన్ దాఖలు చేసినా నేడు పెద్దెత్తున కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆమె మరో సెట్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. బీజేపీ, టీటీడీపీ, సీపీఎంలు కూడా సోమవారమే నామినేషన్లు దాఖలు చేయనున్నాయి. నేనే చేశా... లేదు మేమే చేశాం నియోజకవర్గ అభివృద్ధి కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశమవుతోంది. ముఖ్యంగా హుజూర్‌నగర్‌లో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందన్న దానిపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఉత్తమ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో రోడ్లు, విద్యుత్, ఇళ్లు, ఎత్తిపోతల పథకాల విషయంలో మంచి అభివృద్ధి జరిగిందనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. దీంతో తానే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, టీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదని ఆయన చెప్పుకుంటున్నారు. రైతుబంధు లాంటి బృహత్తర సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అధికారంలో ఉన్నది తామే కనుక తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని టీఆర్ఎస్ చెబుతోంది. దీనికి తోడు రెండు పార్టీల మధ్య వ్యక్తిగత విమర్శలు కూడా తీవ్రతరమవుతున్నాయి. టీఆర్ఎస్ నేతల ఆగడాలపై ఆరోపణలు, పేకాట క్లబ్బులు, బలవంతంగా పార్టీల్లోకి మార్పు లాంటి అంశాలు కూడా ఈ ఎన్నికలను రక్తికట్టిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లోకి వలసలు కూడా పెరగడంతో కాంగ్రెస్‌లో కొంత గుబులు మొదలైంది. అయితే, టీఆర్ఎస్లోకి వెళ్లిన వారు కొందరు మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తుండటంతో ఉత్తమ్ శిబిరం కొంత ఊపిరి పీల్చుకుంటోంది. -
ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు!
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికను తెలంగాణ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉన్నప్పటికీ బరిలో నిలిచేందుకు అన్ని రాజకీయ పక్షాలు పోటీపడుతున్నాయి. అయితే గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పదునైన వ్యూహాలను రచిస్తోంది. దీనిలో భాగంగానే సీపీఐ మద్దతును కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, వినోద్ కుమార్‌లు ఆదివారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో చాడా వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాము ఇక్కడి వచ్చినట్లు టీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు. వారి రాకను స్వాగతించిన చాడ వెంకట్‌రెడ్డి.. మంగళవారం జరిగే సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన అనంతరం తమ నిర్ణయం తెలుపతామని ప్రకటించారు. యూరేనియం విషయంలో సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర అభివృద్ధే తమ లక్క్ష్యమని చాడా అభిప్రాయపడ్డారు. కాగా ప్రధాన పోటీదారులపై కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ, టీడీపీ కూడా అభ్యర్థులను బరిలో నిలిపాయి. సీపీఎం కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. దీంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. -
‘కాంగ్రెస్, టీఆర్ఎస్ మిలాఖత్’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీఆర్ఎస్ మిలాఖత్ రాజకీయాలకు హుజూర్నగర్ ఉపఎన్నిక తెరలేపినట్లుగా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీ చివరి మూడు రోజులు సభను రాజకీయ సభగా మార్చారని విమర్శించారు. ఒక దశలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి బీజేపీని ఎదుర్కోవాలని చేసిన ప్రకటన గమనిస్తే మిలాఖత్ రాజకీయాలు అర్ధం అవుతున్నాయని పేర్కొన్నారు. హుజూర్ నగర్ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు సులువు కాదని ముఖ్యమంత్రికి అర్ధం అయ్యిందని, అందుకే పరోక్షంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా హుజూర్ నగర్ ఎన్నికలలో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
పద్మావతి రెడ్డి పేరు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు సోనియా గాంధీ ఆమోదముద్ర వేయడంతో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 21న జరగనుంది. 24వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. సెప్టెంబర్ 23 నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. హుజూర్నగర్ నియోజకవర్గానికి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో ఏకైక స్థానం హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కు బుద్ధి చెప్పాలి : కేటీఆర్
సాక్షి, నల్గొండ : హుజూర్నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరబోతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేది టీఆరెస్సేనని వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంత ఓటర్లు విలక్షణ తీర్పు ఇవ్వాలని కోరారు. హుజూర్నగర్ అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలంటే టీఆర్ఎస్ గెలవాలన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. (చదవండి : హుజూర్నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల) ‘మెట్ట ప్రాంతాలకు కూడా సాగు నీరు అందిస్తున్నాం. ఫ్లోరైడ్ బాధితులకు స్వచ్ఛమైన నదీ జలాలను భగీరథ ద్వారా అందిస్తున్నాం. హుజూర్నగర్ ప్రజలు ఆలోచన చేయాలి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. ప్రజా క్షేత్రంలో వారికి తగిన సమాధానం ఇవ్వాలి. ఎన్నికల్లో పంచడానికి కారులో డబ్బులు తరలిస్తూ తగుల బెట్టిన నీచ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఈ సారి బుద్ధి చెప్పాలి. సైదిరెడ్డి స్థానికుడు. అందరిలో కలిసి పోయాడు. ఈ సారి సైదిరెడ్డి గెలుపు ఖాయం’అని కేటీఆర్ అన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. -
హుజూర్నగర్ ఉప ఎన్నిక : నోటిఫికేషన్ విడుదల
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. నేటి(సెప్టెంబర్ 23) నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు అధికారులు హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. హుజూర్ నగర్ కు పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో కాంగ్రెస్ ,టీఆర్ఎస్ ఇరు పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. నల్గొండ ఎంపీ స్థానం పోగొట్టుకున్న టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు బరిలోకి ఉత్తమ్ సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతిని దింపనుంది. ఇక రాష్ట్రంలో పట్టుసాదించడం కోసం తహ తహలాడుతున్న బీజేపీ గట్టి అభ్యర్థిని వెతికే పనిలో పడింది. -
ఎన్ని పీతలు ఏకమైనా మమ్మల్నేమీ చేయలేవు
సాక్షి, హైదరాబాద్: నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు ఏకతాటి మీదకు రావడం పీతల కలయిక వంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానా సైదిరెడ్డితో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్లో కూడా మీడియాతో ముచ్చటించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఎన్ని పీతలు ఏకమైనా తమను ఏమీ చేయలేవని.. గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ప్రస్తుత ఉప ఎన్నికను ముడిపెట్టొద్దని, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల తరహాలో ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉంటారన్నారు. ‘హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. ఎంత మెజార్టీ సాధిస్తామని పోలింగ్ తేదీ సమీపించినపుడు వెల్లడిస్తాం. కాంగ్రెస్‌తోనే మాకు అక్కడ పోటీ.. బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనుభవంతో తగు జాగ్రత్తలు తీసుకుంటాం.మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు’అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గెలుపు మాకు బూస్టప్.. హుజూర్నగర్ నియోజవర్గాన్ని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని, స్థానిక శాసనసభ్యుడి కృషి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో తమ కార్యకర్తలను టీఆర్ఎస్ బెదిరింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలన్నారు. టీఆర్ఎస్ రాజకీయ గొడవలకు పూర్తి దూరంగా ఉంటుందని, 2014 తర్వాత హుజూర్నగర్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు లేదన్నారు. హుజూర్‌నగర్‌లో గెలుపుతో తమకు బూస్టప్ వస్తుందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ అంశంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. సీఎంను కలిసిన సైదిరెడ్డి హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానా సైదిరెడ్డి శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయం తెలుసుకున్న సైదిరెడ్డి మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. అనంతరం మంత్రితో పాటు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారం, సమన్వయంలో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవడంతో పాటు, అందరినీ కలుపుకొనివెళ్లి విజయం సాధించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. -
‘కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరం’
సాక్షి, హైదరాబాద్ : హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. హుజూర్నగర్ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థినే పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రజలకు ప్రతిపక్షం చాలా అవసరమని, కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. (చదవండి : మహారాష్ట్ర, హర్యానాలో మోగిన ఎన్నికల నగారా) -
సైదిరెడ్డికి మరో చాన్స్ ఇచ్చిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి హుజుర్నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకే మరోసారి సీఎం అవకాశమిచ్చారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అక్టోబరు 21న పోలింగ్ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి. హుజూర్ నగర్ కు పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో కాంగ్రెస్ ,టీఆర్ఎస్ ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. నల్గొండ ఎంపీ స్థానం పోగొట్టుకున్న టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు బరిలోకి ఉత్తమ్ సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతిని దింపనుంది. ఇక రాష్ట్రంలో పట్టుసాదించడం కోసం తహ తహలాడుతున్న బీజేపీ గట్టి అభ్యర్థిని వెతికే పనిలో పడింది. (చదవండి : మోగిన ఎన్నికల నగారా) టీఆర్ఎస్కు అగ్ని పరీక్షే హుజూర్ నగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు అగ్ని పరీక్ష అని చెప్పాలి. హుజూర్ నగర్ నియోజక వర్గము ఏర్పాటు అయిన తరువాత ఒక్కసారి కూడా టీఆర్ఎస్ విజయం సాధించలేదు. 2009 నుంచి హుజూర్ నగర్ లో జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు చేదు ఫలితమే ఎదురైంది. మంత్రి జగదీశ్ రెడ్డి 2009 లో తొలిసారి ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాసోజు శంకరమ్మకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఫలితం దక్కలేదు. తర్వా త జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డిని పోటీకి దింపింది. కానీ భంగపాటు మాత్రం తప్పలేదు. నల్గొండ ఎంపీ సీటు కోల్పోయిన పరాభావంలోఉన్న టీఆర్ఎస్ హుజూర్నగర్ సీటును దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. మండలానికి ఒక మంత్రిని పెట్టి గెలిచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
జగదీష్‌రెడ్డి మానసిక పరిస్థితి బాలేదు: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ : మూడు సంవత్సరాలుగా ఆగిపోయిన చత్తీస్ఘడ్-సిరోంచ రోడ్డు పనుల గురించి కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చి మూడు నెలల్లో సాధించానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. నెల రోజుల్లో రోడ్డు పనులు ప్రాంరంభం కానున్నాయన్నారు. సూర్యాపేట 7 స్టార్ హోటల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి దేశం కోసం పనిచేసిన వ్యక్తి అని, ఆయనను విమర్శించే అర్హత మంత్రి జగదీష్‌రెడ్డికి లేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలలో ఓడిపోయినప్పటి నుంచి మంత్రి జగదీష్ మానసిక పరిస్థితి బాలేదని, హుజూర్‌నగర్‌లో గెలుపు కాంగ్రెస్‌దేనని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలిసికట్టుగా పనిచేసి హుజుర్‌నగర్‌ల్‌లో విజయం సాధిస్తామని వెంకట్‌రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, టీఆర్ఎస్ ఉద్యమ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. దీనికి ఈటెల రాజేందర్, రసమయి బాలకిషన్, నాయిని నర్సింహరెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీళ్లు వంద గ్రామాలకు కూడా అందడం లేదని, కేవలం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ మొత్తం దోపిడీ పథకాలేనని, శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చే వరకు పోరాటం చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని, ఓ వైపు రాష్ట్రం అప్పుల్లో ఉంటే మరోవైపు నూతన భవనాలు ఎందుకు కడుతున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు ఇసుక మాఫియా నడిపిస్తున్నారని, వందల కొద్ది లారీల ఇసుకను ఆక్రమంగా తరలిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. -
టికెట్ వార్: ఉత్తమ్ వర్సెస్ రేవంత్
సాక్షి, హైదరాబాద్: వరుస ఎన్నికల్లో ఘోర పరాజయంలో ఉన్న టీకాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు పార్టీని పతనావస్థకు చేరుస్తున్నాయి. నేతలు, కార్యకర్తల మధ్య అవగహనలేమితో గత అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న హస్తం పార్టీ.. ఫలితాల అనంతరం కూడా పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించట్లేదు. ఈ కారణం చేతనే ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే తాజాగా హుజూర్నగర్ ఉపఎన్నిక ఆ పార్టీకి కఠిన పరీక్షగా మారింది. గత ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచి.. ఆ తరువాత ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానానికి జరిగే ఉపఎన్నికకు తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని బరిలో నిలుపుతున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. దీంతో రేవంత్‌రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: హుజూర్నగర్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ తమను సంప్రదించకుండానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ఊగిపోతోంది. ఈ విషయాన్ని స్థానిక నేతలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. టికెట్ తమకు దక్కెవిధంగా చూడాలని ఆయన్ని అభ్యర్థించారు. దీంతో రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టికెట్‌ను శ్యామల కిరణ్‌రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉత్తమ్- రేవంత్ వర్గాల మధ్య టికెట్ వార్ మొదలైంది. కాగా పద్మవతిని గెలిపించుకునేందుకు ఉత్తమ్ ఇదివరకే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్థానిక నేతలను కలుస్తూ.. మద్దతును కూడగట్టుకుంటున్నారు. మరోవైపు రేవంత్ తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో పదవులు ఎప్పుడు ఎవరిని వరిస్తాయో ఊహించలేం అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాను ఎవరితోనైనా కలుస్తాన్నారు. -
బెదిరించి టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు
సాక్షి, హుజూర్నగర్: కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమకేసులు బనాయించి, కొట్టించి, బెదిరించి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం చింతలపాలెంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, పోలీస్ స్టేషన్లను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ వారు గలీజు రాజకీయాలు పాల్పడుతున్నారన్నారు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిస్పందిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ ముంపు బాధితులకు మెరుగైన జీవితం అందించాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో ఆర్అండ్ఆర్ సెంటర్లను కట్టిచినం. దే«శంలో ఏరాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలాంటి పునరావాస కేంద్రాలు కట్టలేదని స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా పులిచింతల బాదితులకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక్క రూపాయి మంజూరు చేశాడా అని ప్రశ్నించారు. అటువంటి వారు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దుయ్యబట్టారు. ఉప ఎన్నికలు.. మన ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికలన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు హుజూర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతి పోటీ చేస్తుందని. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తొలుత ఉత్తమ్‌ను పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, నాయకులు చిలకల శ్రీనివాసరెడ్డి, మోర్తాల సీతారెడ్డి, కొట్టే సైదేశ్వరరావు, శాగంరెడ్డి గోవిందరెడ్డి, అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, అల్లం ప్రభాకర్‌రెడ్డి, నర్సింహమూర్తి, తోట శేషు, ఇంద్రారెడ్డి, మంజూ నాయక్ నవీన్ నాయక్, మోతీలాల్, రామిరెడ్డి, పుల్లారెడ్డి, వీరారెడ్డి, కాశయ్య వివిద గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
హుజూర్నగర్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
చింతలపాలెం(హుజూర్నగర్): సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నలమాద పద్మావతి పోటీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నక్కగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయం ప్రకారం పద్మావతి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిందని చెప్పారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఉత్తమ్ గెలవడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో పాటు అధికార టీఆర్ఎస్ కూడా హుజూర్నగర్ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. -
తన్నుకున్న టీడీపీ తమ్ముళ్లు..
సాక్షి, నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా టీడీపీ పార్లమెంటు సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హుజూర్ నగర్ నియోజక వర్గ ఇంచార్జ్ కిరణ్మయి ఎన్నికల సమయంలో బీజేపీకి సహకరించిందని ఆరోపణలతో గొడవ మొదలైంది. తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన నేతలు ఆ సమావేశానికి రావడంపై అక్కడున్న కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణాలో దాదాపుగా టీడీపీ ఖాళీ అయిపోవడంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన విషయం తెలిసిందే. కీలక నేతలందరూ వివిధ పార్టీల్లోకి వలస వెళ్ళిపోయారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
సాక్షి, నల్గొండ : గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని బెట్టెగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ అచ్చయ్య తనకున్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటికి తాళంవేసి పొలానికి వెళ్లారు. తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు యజమానికి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించగా బీరువాలో ఉన్న రూ. 3వేలు తులంన్నర బంగారు మాటీలు, చెవి దిద్దులు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా క్లూస్‌టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. బాధితుడు కొండ అచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రమేష్ తెలిపారు. -
చెరువులో చేపలు లూటీ చేశారని..
మేళ్లచెరువు (హుజూర్నగర్) : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని కంది బండ గ్రామ పరిధిలోని ఊరచెరువులో చేపలు గురువారం లూటీకి గురయ్యాయి. వివరాలు.. మండలంలోని కందిబడం గ్రామం పరిధిలోని ఊరచెరువు స్థానిక మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఉండగా దాన్ని కొంతమంది గ్రామస్తులు రూ.30లక్షల లీజుకు తీసుకుని చేప పిల్లలు పోసి పెంచారు. కాగా రెండురోజులుగా చేపలు పడుతున్నారు. గురువారం కూడా చేపలు పట్టే సమాయానికి మండలంలోని పలు గ్రామాలతో పాటు కోదాడ, హుజూర్నగర్, మఠంపల్లి, గరిడేపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు వందల మంది చెరువులోకి దిగి ఇష్టం వచ్చనట్లు చేపలు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన లీజు దారులు చేపలు పట్టె వారికి చెందిన సుమారు 20బైక్‌లకు నిప్పంటించారు. దీంతో బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో హుజూర్నగర్ ఫైర్ స్టేషన్ వారు వచ్చి మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కాలిపోయిన సుమారు 8 బైక్‌లను స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వారు తెలిపారు. దగ్ధమవుతున్న లూటీదారుల బైక్‌లు -
హుజూర్‌నగర్‌లో రాహుల్‌గాంధీ ఎన్నికల బహిరంగ సభ
సాక్షి, నల్లగొండ : తమ సిట్టింగ్ స్థానమైన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాన్ని ఆశిస్తోంది. అభ్యర్థి ఎంపిక సందర్భంలోనే ఆ పార్టీ అగ్రనాయకత్వం సకల జాగ్రత్తలు తీసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు, హుజూర్నగర్ ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ స్థానంలో విజయం సాధించి సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజూర్‌నగర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించనున్నారు. ఈ బహిరంగ సభకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆనవాయితీని కొనసాగించేలా..! నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక పర్యాయాలు గెలిచిన రికార్డు కాంగ్రెస్‌కు ఉంది. 1952 నుంచి 2014వరకు 1960లో జరిగిన ఉప ఎన్నిక సహా ఈ నియోజకవర్గానికి పదిహేడు పర్యాయాలు ఎన్నికలు జరిగితే..కాంగ్రెస్ ఏకంగా ఎనిమిది సార్లు వి జయం సాధించింది. పీడీఎఫ్, టీపీఎస్, సీపీఐ, టీడీపీ.. నాలుగు పార్టీలు కలిసి తొమ్మిది సార్లు గెలిచాయి. గత రెండు 2009, 2014 ఎన్నికల్లో వరసగా కాంగ్రెస్ గెలిచింది. ఈసారి గెలవడం ద్వారా పార్టీ హ్యాట్రిక్ సాధించాలని ఈ ఎన్నికను సవాలుగా తీసుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గుత్తా సుఖేందర్‌రెడ్డి 1.93లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో(2014) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలవగా, అందులో ఒకటి నల్లగొండ లోక్‌సభా స్థానం కావడం గమనార్హం. కానీ, పార్టీ నుంచి గెలిచిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఆ పార్టీకి నల్లగొండ లోక్‌సభ స్థానంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. గతేడాది డిసెంబర్లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోకవర్గం పరిధిలో కాంగ్రెస్ చేతిలో ఉండిన నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ స్థానాలను కోల్పోయింది. పార్టీని నిలబెట్టుకోవడానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం అనివార్యంగా మారింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే టీపీసీసీ చీఫ్‌ను నల్లగొండ నుంచి, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భువనగిరి స్థానం నుంచి బరిలోకి దింపార ని చెబుతున్నారు. కాగా, సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీకి పట్టున్న ప్రాంతంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని కాంగ్రెస్ గెలిచిన ఒకేఒక్క అసెంబ్లీ స్థానం హుజూర్నగర్. ఇక్కడి ఎమ్మెల్యేనే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తుండడంతో సభను సక్సెస్ చేసేందుకు హుజూర్‌నగర్‌ను ఎంపిక చేశారని అంటున్నారు. రాహుల్‌గాంధీ పాల్గొనే సభకు పార్టీ నాయకత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. -
మున్సిపాలిటీలో వార్డులను పెంచాలని నిరసన
సాక్షి, చింతలపాలెం (హుజూర్నగర్) : హుజూర్నగర్ మున్సిపాలిటీలో వార్డులను పెంచాలని కోరుతూ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్క్ర్ వ్రిగహానికి పూలమాలలు వేసి, విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మేజర్‌గ్రామ పంచాయతీని నగరపంచాయతీగా, ఆ తర్వాత గ్రేడ్3 మున్సిపాలిటీగా ఏర్పడినప్పటికీ 20 వార్డులుగానే ఉండటం శోఛనీయమన్నారు. నూతన ఓటర్లతో కలుపుకుని సుమారు 29వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారని, ప్రస్తుతం ఉన్న వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయని, వాటిని సరిచేసి వార్డులు సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేశారు. గతంలో డీలిమిటేషన్లో వార్డుల పునర్విభజన చేయలేదన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జనాభా సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారం కొత్తగా మరో 6 వార్డులను పెంచేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండీ అజీజ్ పాషా, వార్డు కౌన్సిలర్ మన్నీరు మల్లిఖార్జున్‌రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ, నాయకులు చిట్యాల అమర్నాధ్రెడ్డి, యరగాని గురవయ్య, ఎంఏ మజీద్, బాచిమంచి గిరిబాబు, పులిచింతల వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, బిక్కన్సాబ్, కోలమట్టయ్య, రామిశెట్టి మురళిప్రసాద్, మహేష్ గౌడ్, పెద్దబ్బాయి, ముత్తయ్య, రాములు, జగన్, నర్సింహారావు, మల్లయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సత్తా చాటేందుకే రాజకీయాల్లోకి..
చింతలపాలెం (హుజూర్నగర్) : గ్రామీణ యువతుల సత్తా చాటేందుకే రాజకీయాల్లో వచ్చా. యువతులు వంటింటికి, ఒక రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలి. ముఖ్యంగా గ్రామీణ యువతుల్లోని చైతన్యాన్ని నింపాలి. అందుకే రాజకీయ రంగాన్ని ఎంచుకున్నా. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నాలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటా. ప్రభుత్వ పథకాలు గ్రామీణులకు సకాలంలో చేరేవిధంగా యువత నడుం బిగించి రాజకీయాల్లో రాణించాలి. అందుకు గ్రామీణ రాజకీయాల్లో కూడా యువత ఆదర్శంగా ఎదగాలి. – అన్నెం శిరీష, వేపలసింగారం, హుజూర్నగర్ -
కాంగ్రెస్ నేతల బుర్రలు పాడయ్యాయి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతల బుర్రలు పాడయ్యాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రక్కు గుర్తుతో కలిపి టీఆర్ఎస్కు 50 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంతటి అహంకారి మరొకరు లేరని వ్యాఖ్యానించారు. హుజూర్‌నగర్‌లో ట్రక్కు గుర్తు, టక్కు టమార విద్యతో ఉత్తమ్ గెలిచారన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన చొప్పదండి, హుజూర్నగర్ నియోజకవర్గాల కార్యకర్తల భేటీలో కేటీఆర్ ప్రసంగించారు. ‘2014 శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని ఆరు సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంది. ఉద్యమ రోజుల నుంచి టీఆర్ఎస్ నేతలు కష్టపడి పని చేయడంతో తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ మహామహులు మట్టికరిచారు. హుజూర్‌నగర్‌లో ట్రక్కు గుర్తు, టక్కు టమార విద్యతో ఉత్తమ్ గెలిచారు. మోదీ, రాహుల్, చంద్రబాబు చివరికి ఆరోగ్యం బాగా లేకున్నా సోనియాగాంధీ వచ్చి మరీ ప్రచారం చేసినా ప్రజలు టీఆర్ఎస్ను బ్రహ్మాండంగా ఆదరించారు. చంద్రబాబు ఇచ్చిన రూ.500 కోట్లకు ఆశపడి టీడీపీకి కాంగ్రెస్ దాసోహమైంది. బీజేపీ వందకుపైగా సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. సింహం సింగిల్‌గా వస్తుందన్నట్లు కేసీఆర్ గెలిచారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతల బుర్రలు పాడయ్యాయి. పొన్నాల లక్ష్మయ్య మళ్లీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కొంత మంది కాంగ్రెస్ నేతలు రిటైర్మెంట్ తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఇప్పట్లో లేచే పరిస్థితి లేదు. ఓడిన చోటనే వెతుక్కోవాలన్నట్లుగా హుజూర్నగర్ నియోజకవర్గ కార్యకర్తలు పనిచేయాలి. ఉత్తమ్ అంతటి అహంకారి మరొకరు లేరు. ట్రక్కు గుర్తుతో కలిపి టీఆర్ఎస్కు 50 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల కోసం బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేసుకోవాలి. పది ఇళ్లకో కార్యకర్తను నియమించుకోవాలి. వందమందికో కార్యకర్త ఉండాలి. సిరిసిల్లలో పటిష్టమైన బూత్ కమిటీలతోనే నా మెజారిటీ పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే పరిస్థితి లేదు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సమష్టిగా పనిచేసి వీలయినన్ని ఏకగ్రీవం చేయాలి. 3,400కుపైగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దే. తండాల్లో చాలాచోట్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ఉండే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ను పటిష్టంగా మార్చి లోక్‌సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలి. కేసీఆర్ చొప్పదండి అల్లుడు. ఆ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. కాంగ్రెస్ నేతలు అధికారం వస్తుందని కలలుగని మంత్రిపదవులు సైతం పంచు కున్నరు. ఉత్తమ్ నిశ్శబ్ద విప్లవం అంటే నేను శబ్ద విప్లవం అని చెప్పా. ప్రజలు శబ్ద విప్లవమంటే ఏంటో చూపించారు. అధికారం వచ్చిందనే గర్వం కార్యకర్తలకు పనికి రాదు. ప్రజలతో మమేకం కావాలి’ అని పిలుపునిచ్చారు. -
ఉత్తమ్ ఓటమి ఖాయం.. నల్లగొండ నుంచి పోటీ అనుకున్నా!
సాక్షి, నల్లగొండ: ఎన్నికల తేదీ సమీపిస్తుండటం.. ప్రచారం గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తుండటంతో తెలంగాణ ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం నల్లగొండ జిల్లాలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. కోదాడ, మిర్యాలగూడ, హుజుర్నగర్, నల్లగొండ తదితర కీలక నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్న ఆయన ఈసారి హుజుర్నగర్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమని అన్నారు. హుజుర్నగర్లో జరిగిన భారీ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. గత తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఈ సభకు వచ్చిన జనాలు చూస్తే.. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమని అనిపిస్తోందన్నారు. సైదిరెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత ఒకరోజు మొత్తం హుజూర్‌నగర్‌లో ఉండి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఉత్తమకుమార్ రెడ్డి మహా కూటమిని పేరిట నాలుగు పార్టీలను వేసుకొని.. గెలుపొంది సీఎం కావాలని కలలు కంటున్నారని, ఆయన కలలు కల్లలేనని పేర్కొన్నారు. హుజుర్నగర్ నియోజకవర్గాన్ని మరో గజ్వేల్‌లా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ నుంచి పోటీచేద్దామనుకున్నా.. ఈసారి ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేద్దామని అనుకున్నానని, కానీ గజ్వేల్ ప్రజలు గోల చేస్తారని, ఇక్కడ నుంచి పోటీ చేయలేకపోయనని కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన నల్లగొండ సభలో ఆయన ప్రసంగించారు. నల్లగొండ నుంచి భూపాల్‌రెడ్డి పోటీ చేయడం సంతోషంగా ఉందని, ఆయనను గెలిపించాలని ప్రజలను కోరారు. నల్లగొండ నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని తెలిపారు. -
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌నే కోరుకుంటున్నారు..
సాక్షి, మఠంపల్లి : కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు, గిరిజన తండాలు అభివృద్ధి చెందుతాయని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రజలంతా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శనివారం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్యా మంజీనాయక్, జెడ్పీటీసీ నీలామంజీనాయక్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు రాజారెడ్డి, మాజీ ఎంపీపీ టి.అప్పయ్య, నాయకులు వంటిపులి శ్రీనివాస్, స్రవంతికిషోర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సోములుగౌడ్, వెంకటేశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, అచ్చమ్మ ఉన్నారు. ఉత్తమ్ గెలుపునకు ఎమ్మార్పీఎస్ కృషి హుజూర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపునకు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ సంఘం ఇన్చార్జ్ బాలచంద్రు మాదిగ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఆ«ధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు ప్రసాద్‌మాదిగ, ప్రభు, బాబుమాదిగ తదితరులున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలి.. హుజూర్నగర్ : నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శనివారం పట్టణంలోని వివిధ వార్డులలో ప్రజాకూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాకూటమి నాయకులు పాలకూరి బా బు, రాములు, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, మల్లీశ్వరి పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపే.. పాలకవీడు : అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపును కోరుకుంటున్నారని కాంగ్రెస్ మండల సీనియర్ నాయకుడు భూక్యా గోపాల్ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాలలో తిరుగుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని నర్లంగులగూడెం, గుండ్లపహాడ్ గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది ఉత్తమ్ సమక్షంలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్. శ్రీనివాసరెడ్డి, ఎస్.నాగిరెడ్డి, వల్లబురెడ్డి, జ్యోతి, సంధ్య, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నేరేడుచర్ల : రానున్న ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం నేరేడుచర్లలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేష్, పట్టణ అధ్యక్షుడు శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. నేరేడుచర్లలో ర్యాలీ నిర్వహిస్తున్న యూత్ నాయకులు -
టీపీసీసీ నేత ఉత్తమ్‌కు ఘనస్వాగతం
సాక్షి, మునగాల : టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి శనివారం మండల కేంద్రంలో ఘనస్వాగతం లభించింది. హుజుర్నగర్లో నామినేషన్ దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి హుజుర్నగర్ వెళుతూ మార్గమధ్యలో మునగాలలో ఆగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుఢు నల్లపాటి శ్రీనివాస్ నాయకత్వంలో సుమారు రెండువేల మంది ఉత్తమ్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఉత్తమ్‌కు స్వాగతం పలికిన కోదాడ నాయకులు కోదాడరూరల్ : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ వేసేందుకు హుజూర్నగర్ వెళ్తుండగా మార్గ మధ్యలోని కొమరబండ బైపాస్‌లో ఆయనకు కోదాడ పట్ణణ, మండల నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనతో పాటుగా ర్యాలీగా హుజూర్నగర్ వెళ్లారు. స్వాగతం పలికిన వారిలో మాజీ ఎంపీపీ వంగవేటి రామారావు, సంపెట రవి, ధనమూర్తి, ప్రసాద్‌రెడ్డి, రహీం, కోటేశ్వరావు, ముస్తాఫా తదితరులున్నారు. -
రసవత్తరం
సాక్షి, హుజూర్నగర్ : నియోజకవర్గంలో 1952 నుంచి 1972 వరకు ఆరుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నియోజకవర్గం రద్దయింది. అప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 1952లో జరిగిన ద్విసభ్య నియోజకవర్గ ఎన్నికల్లో పీడీఎఫ్, అదే ఏడాది జరిగిన ఉపఎన్నికల్లో పీడీఎఫ్, రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. తిరిగి 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రామన్నపేట నియోజకవర్గం రద్దయి హుజూర్నగర్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి వరకు కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. నియోజకవర్గంలో హుజూర్నగర్ పట్టణంతోపాటు గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు, మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి మండలాలు ఉన్నాయి. పునర్విభజనకు ముందు .. 2009 నియోజకవర్గ పునర్విభజనకు ముందు హుజూర్నగర్ నియోజకవర్గం మిర్యాలగూడ అసెంబ్లీ పరిధిలో ఉంది. గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్నగర్ మండలంలోని 6 గ్రామాలు, మఠంపల్లి మండలంలోని 7 గ్రామాలు మాత్రమే మిర్యాలగూడ అసెంబ్లీ పరిధిలో ఉన్నాయి. మేళ్లచెరువు మండలంతోపాటు మఠంపల్లి, హుజూర్నగర్ మండలంలోని మిగిలిన గ్రామాలు కోదాడ అసెంబ్లీ పరిధిలో కొనసాగాయి. అయితే ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో రామన్నపేట నియోజకవర్గం రద్దు కాగా హుజూర్నగర్ నియోజకవర్గం తిరిగి 2009లో ఆవిర్బవించింది. ద్విసభ్య నియోజకవర్గంలో.. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి జయసూర్య కాంగ్రెస్ అభ్యర్థి కె.ఎల్.ఎన్.రావుపై, మరో పీడీఎఫ్ అభ్యర్థి టి.నర్సింహులు కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రాదేవిపై విజయం సాధించారు. కాగా పీడీఎఫ్ అభ్యర్థి జయసూర్య మెదక్ నుంచి లోక్‌సభకు కూడా అదే ఎన్నికల్లో గెలుపొందడంతో ఆయన రాజీనామా చేయగా తిరిగి ఉప ఎన్నికలు అనివా ర్యమయ్యాయి. అదే సంవత్సరం 1952లో జరిగిన ఉప ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా ఎం.మొహియుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థి జీఎస్.రెడ్డిపై గెలుపొందారు. అనంతరం 1957లో జరిగిన ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా దొడ్డా నర్సయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీబీ.రావుపై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి తరఫున టీఆర్ఎస్ అభ్యర్థి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డిపై, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శంకరమ్మపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఇప్పటి వరకు మొత్తంగా కాంగ్రెస్ 4సార్లు గెలుపొందింది. సిమెంట్ పరిశ్రమలకు నెలవు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో పేరుపొందిన సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి, నేరేడుచర్ల మండలాల్లోని కృష్టపట్టె ప్రాంతంలో విరివిగా సున్నపురాయి నిక్షేపాలు ఉండడంతో పరిశ్రమలు ఏర్పాటు చేశారు. మైహోం, నాగార్జున, సాగర్ సిమెంట్స్, అంజనీ, కోరమాండల్, సువర్ణ, పెన్నా, డెక్కన్, విశ్వం తదితర 16 సిమెంట్ పరిశ్రమలు ఏర్పడ్డాయి. తెలంగాణలో సిమెంట్ పరిశ్రమలకు నెలవుగా పేరొందిందిన హుజూర్నగర్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఇంకా ప్రాధాన్యం పెరిగింది. హుజూర్‌నగర్‌లో ఈ సారి జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిలవనున్నాయి. వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంపై టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. టీఆర్ఎస్ 107 నియోజకవర్గాలలో తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా ఉన్న నియోజకవర్గాల జాబితాలో హుజూర్నగర్ కూడా ఒకటి. ప్రస్తుతం హుజూర్నగర్ నియోజకవర్గం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. -
టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా : శ్రీకాంతాచారి తల్లి
-
హుజూర్నగర్ సీఐపై సస్పెన్షన్ వేటు
సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ సీఐ నరసింహా రెడ్డితో పాటు హెడ్ కానిస్టేబుల్ బలరాం రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు (1416), కమలాకర్ (1845)లను సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. హుజూర్ నగర్ పరిధిలో రేషన్ బియ్యం, గుట్కా పాకెట్ల అక్రమ రవాణా విషయంలో చిన్న వ్యాపారులపై కేసులు పెడుతూ పెద్ద వారికి సహకరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వీరిపై వచ్చాయి. దీంతో ఐజీ స్టీఫెన్ రవీంద్ర కొరడా ఝుళిపించారు. సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
వారి కంటికి కనిపించేలా..
సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వస్తే ఏమి వస్తుందన్న వారికి కంటికి కనిపించేలా ఆంధ్రా ప్రాంతానికి చుక్క నీరు కూడా పోకుండా చివరి ఆయకట్టు వరకు నీరందించడం హుజూర్నగర్ ప్రజలు చూశారని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్లో విలేకరులతో మాట్లాడుతూ..మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. పరిసరాలు బాగుంటేనే పర్యావరణం బాగుంటుందని అన్నారు. పేద ముస్లింలను దృష్టిలో పెట్టుకుని బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. హిందూ క్రిస్టియన్ అనే బేధాలు లేకుండా వారి పండుగలకు తెలంగాణ ప్రభుత్వం కానుకలు అందజేస్తోందని, అలాగే అన్ని రకాల మతాల వారిని గౌరవంగా చూసుకోవడం సీఎం కేసీఆర్ గొప్పతనమని వ్యాఖ్యానించారు. గత పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు..కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వారి అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. మైనార్టీల కోసం 200 పాఠశాలలు ప్రారంభించి వారిలో పేదవారికి మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ముస్లింల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతు బంధు పథకం కింద రైతులకి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా చెక్కులు పంపిణీ చేశారని, అలాగే 50 లక్షల మంది రైతులకు బీమా చేస్తున్నదని తెలిపారు. -
అమ్మానాన్నకు ప్రేమతో..!
హుజూర్నగర్ : అమ్మానాన్న జ్ఞాపకార్థం మసీదును నిర్మించి ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా మత పెద్దల సమక్షంలో ప్రారంభించాడు.. హుజూర్‌నగర్‌కు చెందిన మాజీ వార్డు సభ్యుడు ఎంఏ.మజీద్. ఈయన తల్లిదండ్రులు అబ్దుల్నబీ, తహెరాబేగంలు 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అమ్మానాన్నల మీద ప్రేమతో స్థానిక షాదీఖానా సమీపంలో రూ. 20 లక్షలతో మసీదును నిర్మించాడు. మసీదుకు మజీద్–ఈ–తహెరా అబ్దుల్నబీ అనే పేరు పెట్టాడు. చిరకాలంగా తల్లిదండ్రుల పేరు చరిత్రలో నిలిచిపోనున్నందున వారి కుమారుడిగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని మజీద్ తెలిపారు. తల్లిదండ్రుల పేరు మీదుగా మసీదు నిర్మాణం చేపట్టడంపై పలువురు మజీద్‌ను అభినందించారు. -
రైతులకు మేలు జరగడం ఉత్తమ్‌కు ఇష్టం లేదు
సాక్షి, హుజూర్నగర్ : రైతులకు ప్రయోజనం చేకూరడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఇష్టం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టులను అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రజలు ఊహించిన పథకాలనే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అమలు పరుస్తున్నారని.. పథకాలు అమలు కాకముందే అవినీతి జరిగిదంటూ కాంగ్రెస్ నాయకులు అభియోగాలు మోపడం దురదృష్టకరమన్నారు. సంక్షేమ పథకాల మీద అవగాహన లేకపోవడం వల్లే కాంగ్రెస్ నాయకులు నిందారోపణలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సన్నద్దమయ్యారని హెచ్చరించారు. రైతులకు పెట్టుబడి రూపంలో 4 వేల రూపాయలు అందిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యానించారు. మే 10వ తేదీ నుంచి రైతులకు పెట్టుబడి చెక్కులు అందజేస్తామని ఆయన తెలిపారు. -
ప్రేమించి మోసం చేసిన వ్యక్తిపై కేసు
నేరేడుచర్ల(హుజూర్నగర్) : ప్రేమించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ సంఘటన శుక్రవారం పాలకీడు పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకీడు మండలం కల్మెటతండాకు చెందిన భూక్యా దాస్ (లేటు) కుమార్తె రేణుకను (23) అదే గ్రామానికి చెందిన రూపావత్ చంద్రశేఖర్ ప్రేమించి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని రేణుక నిలదీయడంతో చంద్రశేఖర్ నిరాకరించాడు. ఆమె పాలకీడు పోలీస్ స్టేషన్లో చంద్రశేఖర్, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ యాదావేందర్రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్టుబడిదారీ విధానాలను ఎండగట్టాలి
► సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ► హుజూర్‌నగర్‌లో పార్టీ జిల్లా శిక్షణ తరగతులు ప్రారంభం హుజూర్నగర్ : కేంద్రం, రాష్ట్ర పాలకులు అవలంబిస్తున్న పెట్టుబడిదారీ విధానాలను ప్రజలకు వివరించి గ్రామస్థాయి నుంచి ప్రజలను చైతన్యం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్హాల్లో సీపీఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లాలోని 4 నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు, వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న అవినీతి తదితర అంశాలపై ప్రసంగించారు. భవిష్యత్‌లో పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలు, ఇతర అంశాలపై నాయకులకు వివరించారు. శిక్షణ తరగతుల ప్రారంభానికి ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు సుధాభాస్కర్, జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు ఈ శిక్షణ తరగతులలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, డి.రవినాయక్, మల్లు లక్ష్మి, మల్లునాగార్జునరెడ్డి, పారేపల్లిశేఖర్రావు, కొదమగుండ్ల నగేష్, ములకలపల్లి సీతయ్య, పల్లె వెంకటరెడ్డి, శీతల రోషపతి, దుగ్గి బ్రహ్మం, నాగారపుపాండు, వట్టెపుసైదులు, షేక్‌యాకూబ్, భూక్యాపాండునాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని జూలకంటి రంగారెడ్డి అన్నారు. శిక్షణ తరగతుల అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో అనేక వాగ్ధానాలిచ్చి అధికారంలోకి వచ్చిన పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ సామాజిక వేదిక పేరుతో వామపక్ష పార్టీలతో పాటు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని బలమైన ప్రజా ఉద్యమాన్ని రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా జూలై 4న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, పారేపల్లి శేఖర్‌రావు, వెంకటరెడ్డి, శీతల రోషపతి, వెంకటరెడ్డి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
ప్రీపెయిడ్ కరెంట్
ఎంత రీచార్జ్ కార్డు కొంటే అంతే వాడకం మొదట దఫా ప్రభుత్వ కార్యాలయాల్లో మీటర్ల ఏర్పాటు విద్యుత్దుబారాకు చెక్ పెట్టేందుకే కొత్త విధానం హుజూర్నగర్ : ఇక నుంచి కరెంట్ వినియోగించాలంటే రీచార్జ్ చేయించాల్సిందే.. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే మరీ. సెల్ఫోన్ల మాదిరిగా రీచార్జ్ కార్డులు ఎప్పటి కప్పుడు కొనుగోలు చేయాల్సిందే. కరెంట్ దుబారాను అరికట్టేందుకు పాలకులు నడుం బిగించారు. మొదటి దఫా ప్రభుత్వ కార్యాలయాల్లోనే మీటర్లు విధానం ఇదీ.. ఇవి సెల్‌ఫోన్ రీచార్జ్ విధానంలాగా ఉండడంతో ఎంత రీచార్జ్కార్డు కొంటే అంతే విద్యుత్ వినియోగించుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. ఆయా కార్యాలయాలకు ప్రతినెలా వచ్చే విద్యుత్‌బిల్లుల ఆధారంగా రూ.1000 నుంచి రూ.20 వేల వరకు రీచార్జ్ విద్యుత్ కార్డులను ప్రత్యేక కౌంటర్లలో విక్రయించనున్నారు. ఈ కార్డులను ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా కార్యాలయాలకు ఇచ్చిన ప్రీపెయిడ్ కార్డు విలువ ఆధారంగా విద్యుత్ సరఫరా జరిగి కార్డు విలువ పూర్తికాగానే ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా> నిలిచిపోతుంది. దీంతో తిరిగి రీచార్జ్ చేయించుకోగానే ఆటోమేటిక్‌గా కరెం టు సరఫరా జరుగుతుంది. ఈ వి«ధా నం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దుబారాకు నూరు శాతం అడ్డుకట్ట వేసేందుకు చక్కటి మార్గంగా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లుల బకాయిలు ఏడాదికేడాది పెరిగి పోతుండటంతో విద్యుత్ రంగసంస్థలకు నష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు మొండిబకాయిలుగా మిగిలి పోవడంతో నూతన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ దుబారాను తగ్గించి బకాయిలు పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానం ఒక్కటే మార్గమని భావించిన విద్యుత్ రంగ నిపుణుల సలహాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ముందుగా పట్టణాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల సంఖ్య ఆధారంగా వాటిని ఆయా విద్యుత్ డివి జన్లకు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జి ల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరిలలో అత్యధికంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో సర్వీస్‌లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలో 3,445 ప్రభు త్వ కార్యాలయాలు, 2214 పాఠశాల లు, 211 కేంద్ర ప్రభుత్వ కార్యాలయా లు, 1312 మున్సిపల్ కార్యాలయా లు, 8,556 గ్రామపంచాయతీల వీధిలైట్ల సర్వీస్‌లకు దఫాల వారీగా ముం దస్తుగా ఈ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పా టు చేయనున్నారు. అయితే మొదటి దఫాగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు విద్యుత్ అధికారు లు,సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మొద టి దఫాగా ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పాటు చేస్తున్న ఈ మీటర్లు విజయవంతంగా నడిచినట్లయితే రానున్న రో జుల్లో అన్ని గ్రామాల్లోని సర్వీస్‌లకు కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
కోదాడ(సూర్యాపేట): గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచిన గొడౌన్‌పై దాడి చేసిన పోలీసులు భారీగా గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ వ్యాపారి వద్ద గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. కోదాడలోని గొడౌన్లో నిల్వ ఉంచినట్లు తెలిపాడు. దీంతో బుధవారం ఉదయం గొడౌన్‌పై దాడి చేసిన పోలీసులు రూ. 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
పాఠశాలను సందర్శించిన న్యూజిలాండ్ దేశస్తులు
హుజూర్నగర్ : పట్టణ పరి«ధిలోని మఠంపల్లి రోడ్డులో గల దుర్గాభవాని పాఠశాలను మంగళవారం న్యూజిలాండ్ దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పశ్య కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ న్యూజిలాండ్ దేశానికి చెందిన ఒక బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన పలు పాఠశాలలను సందర్శిస్తున్నారన్నారు. పాఠశాలల్లో విద్యావిధానం, సిలబస్, వసతులు,ఫీజులు తదితర అంశాలను పరిశీలించి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నూతన సిలబస్ విధానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు విద్యనందించడం పట్ల యాజమాన్యాన్ని అభినందించారన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పి.కోటిరెడ్డి, ఇంఛార్జ్ పులి బాలకృష్ణ పాల్గొన్నారు. -
పులిచింతల ముంపువాసులను ఆదుకోవాలి
హుజూర్నగర్ : పులిచింతల ముంపు వాసులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి కోరారు. శుక్రవారం పట్టణ ంలోని శ్రీలక్ష్మీగార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదతో పులిచింతల ప్రాజెక్ట్‌లో 30 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం నిల్వ చేసిందన్నారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో ముంపుగ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లినప్పటికీ ఇంకా కొంత మంది ముంపువాసులకుపరిహారం, పునరావాసం కల్పించకపోవడం శోచనీయమన్నారు. మట్టపల్లి వద్ద ముంపుకు గురైన మత్స్యకార్మికులకు ఇళ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిర్చి, వరి పంటల రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తిరుందాసుగోపి, పారేపల్లి శేఖర్‌రావు, పులిచింతల వెంకటరెడ్డి, వట్టికూటి జంగమయ్య, అనంతప్రకాశ్, యాకూబ్, వట్టెపు సైదులు, పాండునాయక్, ములకలపల్లి సీతయ్య, శీలం శ్రీను, నగేష్, రోషపతి, పల్లె వెంకటరెడ్డి, వెంకటచంద్ర, వినోద పాల్గొన్నారు. -
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
హుజూర్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక రెవెన్యూ కలిగిన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 17వ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన, ఆయకట్టుగా ఉన్న హుజూర్నగర్ అన్ని విధాలుగా రెవెన్యూ డివిజన్‌కు అర్హత కలిగి ఉందన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చేపట్టిన ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. త్వరలో జరిగే అఖిలపక్ష సమావేశంలో తమపార్టీ తరపున హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరనున్నట్లు తెలిపారు. కాగా ఈదీక్షలలో మాధవరాయినిగూడెం అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు నందిగామ ముక్కంటి, శ్రీనివాస్, సైదులు, దావీద్, నాగరాజు, రాములు, వెంకటేష్, వీరబాబు, రవిలు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు వేముల శేఖర్‌రెడ్డి, కస్తాల ముత్తయ్య, మందా వెంకటేశ్వర్లు, పిల్లి మరియదాసు, పట్టణ, మండల అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, జడ రామకృష్ణ, నేరేడుచర్ల మండల అధ్యక్షులు కుందూరు మట్టారెడ్డి, పట్టణ, మండల మహిళా అధ్యక్షులు కారింగుల మంగమ్మ, పశ్య మల్లేశ్వరి, రామకృష్ణారెడ్డి, బొమ్మకంటి వెంకటేశ్వర్లు, పిల్లిమల్లయ్య, దాసరి రాములు, ముసంగి శ్రీను, మోహన్‌రెడ్డి, మహ్మద్సాబ్, పాతర్ల పాటిలక్ష్మి, విజయ, అప్పారావు, సురేందర్‌రెడ్డి, రెవెన్యూ డివిజన్ సాధనకమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణతోనే సామాజిక న్యాయం
కోదాడఅర్బన్ : ఎస్సీల వర్గీకరణతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో జరిగిన సంఘం కోదాడ–హుజూర్నగర్ నియోకవర్గాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్మయుద్ధ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతలపాటి చిన్నశ్రీరాములు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు మలñ ్లపాక వెంకన్న, నాయకులు ఏపూరి పర్వతాలు, కె.అంజయ్య, బొడ్డు హుస్సేన్, శౌరి, ఎం.వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పవన్‌కుమార్ ఈ సందర్భంగా సంఘం నియోజకరవర్గ ప్రధాన కార్యదర్శిగా మొలుగూరి పవన్‌కుమార్‌ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమంలో పాల్గొనాలి
హుజూర్నగర్ : రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పాలక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బా భాగ్యరెడ్డి అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆ«ధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 16వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా దీక్షలలో కూర్చున్న వారికి ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చాజిల్లా కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి,పట్టణ అధ్యక్షుడు తూముల శ్రీను, శీలంనాగరాజు, కస్తాలరామకృష్ణ, ప్రతాప్, రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల మానవహారం... హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ గురువారం రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో స్థానిక పలు విద్యాసంస్థల విద్యార్థులు మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులుఎండి.అజీజ్‌పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతిర్యాల నాగయ్య, బాచిమంచి గిరిబాబు, కస్తాలముత్తయ్య, కస్తాలశ్రావ ణ్‌కుమార్, ఇట్టిమళ్లబెంజిమన్, మందావెంకటేశ్వర్లు, బరిగెలచంద్రశేఖర్, నందిగామ ముక్కంటి, రెడపంగు వెంకటేశ్వర్లు, దాసరి పున్నయ్య,దేవభిక్షం, నరేందర్, సైదులు, మట్టయ్య, దావీద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన రాష్ట్ర బృందం
హుజూర్నగర్ : పట్టణంలోని సీతారాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంగళవారం రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను, రికార్డులను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని సూచించారు. ప్రహరీగోడ, మరుగుదొడ్లు, వంటగది నిర్మాణం విషయమై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలక బృందం సభ్యులు సతీష్‌బాబు,షేక్ మహæ్మద్, హెచ్ఎం విజయలక్ష్మి, ఉపాధ్యాయులు రామ్మూర్తి, రేణుక, ఎస్ఎంసీ చైర్మన్ లింగరాజు, సీఆర్పీలు సైదులు, సల్మా పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయతో నిండిన చెరువులు
హుజూర్నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేసిన మిషన్ కాకతీయ పథకం వల్లనే నేడు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు జలకళ సంతరించుకున్నాయని గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పోచమ్మ చెరువు అలుగు వద్ద అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య గంగాహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏనాడు కనీసం మరమ్మతులకు నోచుకోని చెరువులు, కుంటలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌పట్టణ అధ్యక్షుడు దొడ్డా నర్సింహారావు, అర్చకులు దామోదచార్యులు, పాస్టర్ ఇస్మాయిల్, నాయకులు శీలం వీరయ్య, ఎండి.లతీఫ్, రాయల వెంకటేశ్వర్లు, కొండేటì శ్రీను, పెదలక్ష్మీనర్సయ్య, రామలక్ష్మమ్మ, అన్నపూర్ణ, శిల్ప శ్రీను, వి.వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
హజూర్‌నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహర దీక్షలు శనివారంతో 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూలకంటి నర్సిరెడ్డి రిలే దీక్షలు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఆలోచించి అన్ని అర్హతలు కలిగిన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంకతి అప్పయ్య, ఎంబి.దేవదానం, చెన్నా సోమయ్య, హనుమంతరావు, పురుషోత్తం, రఘునాథం, రామ్మోహన్రావు, నారాయణరెడ్డి, కలకుంట్ల రామయ్య, మాణిక్యం, సత్యనారాయణ, నర్సయ్య, జాన్, వేముల వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, సుధాకర్‌రెడ్డి, lంకయ్య, కాశయ్య, ధర్మూరి, అనంతరామశర్మ, ఎన్.వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హోటళ్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు
హుజూర్నగర్ : పట్టణంలో హోటళ్ల నిర్వాహకులు శుచి, శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని నగరపంచాయితీ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు హోటళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార పదార్థాలను ఏరోజు కారోజు మాత్రమే వినియోగదారులకు సరఫరా చేయాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హోటళ్లలో వంట గదుల నుంచి పదార్థాల తయారీ, విక్రయాలన్నీ నిబంధనల మేరకు ఉండాలని, లేకపోతే సంబంధిత యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగు తుందన్నారు. పట్టణంలో నిబంధనలు పాటించని పలు హోటళ్ల యజమానులకు రూ.14,500లు జరిమానా విధించినట్లు తెలిపారు. అదే విధంగా పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషే«ధించడం జరిగిందని, అందుకు విరుద్దంగా వ్యవహరించిన వ్యాపారులకు రూ. 5 వేల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈలు టి.ప్రవీణ్, వినోద్, సిబ్బంది ఉన్నారు. -
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
హుజూర్నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 9వ వార్డులో మామిడి రాములుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.35,500ల చెక్కును ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తేజావత్ రవినాయక్, సైదులునాయక్, మామిడి వసంత్, ములకలపల్లి రాంబాబు, వెంకటరెడ్డి, మహేష్, చంటి, ఉపేందర్, సైదులు, రాజు పాల్గొన్నారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి
హుజూర్నగర్ : గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు చేయూతనందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం పట్టణానికి చెందిన హెచ్ఎస్బీసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధిర మంజీర అందజేసిన రూ. 5 వేల విలువైన పుస్తకాలను ఆమె తండ్రి మధిర ప్రతాప్‌రెడ్డి స్థానిక శాఖ గ్రంథాలయానికి అంద జేశారు. అనంతరం ప్రతాప్‌రెడ్డిని శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ చైర్మన్ కుంట సైదులు, గ్రంథాలయాధికారి మండవ వీరస్వామి, జూలకంటి వాణి, శ్రీనివాస్‌గౌడ్, ఊరె వెంకయ్య, కనకారెడ్డి, దొడ్డా నర్సింహారావు, వెంకటకృష్ణ, జాఫర్, రాజు, అబ్రహాం, రేణుక, శ్రీను, సీతారాం పాల్గొన్నారు. -
అశాస్త్రీయంగా పునర్విభజన
హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనను అశాస్త్రీయంగా చేపడుతూ ప్రతిపక్షాలను పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన ఆయన కొద్దిసేపు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల కోరికలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని హోదాలో హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీనాయకులు అజీజ్‌పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతి ర్యాలనాగయ్య, కస్తాల శ్రావణ్, రెడపంగ పెదవెంకటే శ్వర్లు, నందిగామ ముక్కంటి, ఇట్టిమళ్ల బెంజిమన్, దాసరి నరేందర్, దాసరి పున్నయ్య, మట్టయ్య, మందా వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అశాస్త్రీయంగా పునర్విభజన
హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనను అశాస్త్రీయంగా చేపడుతూ ప్రతిపక్షాలను పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన ఆయన కొద్దిసేపు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల కోరికలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని హోదాలో హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీనాయకులు అజీజ్‌పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతి ర్యాలనాగయ్య, కస్తాల శ్రావణ్, రెడపంగ పెదవెంకటే శ్వర్లు, నందిగామ ముక్కంటి, ఇట్టిమళ్ల బెంజిమన్, దాసరి నరేందర్, దాసరి పున్నయ్య, మట్టయ్య, మందా వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకరించాలి
శ్రీనివాసపురం (హుజూర్నగర్ రూరల్) : పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈఓ లక్పతినాయక్ కోరారు. మండలంలోని శ్రీనివాసపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు చెరుకు రామాంజనేయ శాస్త్రి ఇచ్చిన రూ. 5 వేల విలువైన పుస్తకాలు, ఇతర సామగ్రిని ఎంఈఓ శనివారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారంతో పాటు గ్రామస్తులూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో యూపీఎస్ హెచ్ఎం దేవరం రాంరెడ్డి, ఉపాధ్యాయులు, సీఆర్పీ చిక్కుళ్ల గోవిందు, సైదులు, విజయ్‌కుమార్, రామాంజనేయ శాస్త్రి, శ్రీను, జానీ బేగం, రవికిషోర్, అనిల్‌రెడ్డి, లావణ్య, స్పందన పాల్గొన్నారు. -
రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా పోరాటం
హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు మరింతగా ఉధృతంగా పోరాటం చేస్తామని పలువురు అఖిలపక్ష నాయకులు తెలిపారు. శనివారం స్థానిక ఇందిరా సెంటర్లో నియోజకవర్గ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గ విద్యార్థి జేఏసీ కన్వీనర్ కుక్కడపు మహేష్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్నగౌడ్, పాలకూరి బాబు, జక్కుల నాగేశ్వరరావు, చిట్యాల అమర్నాథరెడ్డి, మేకల నాగేశ్వరరావు, పీవీ.దుర్గాప్రసాద్, అట్లూరి హరిబాబు, వట్టికూటి జంగమయ్య, ములకలపల్లి సీతయ్య, జక్కుల మల్లయ్య, శివరాం యాదవ్, ఎస్కే.సైదా, విజయ్, యరగాని గురవయ్య, కోల మట్టయ్య, చిలకరాజు లింగయ్య, యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, సుతారి వేణు, బాచిమంచి గిరిబాబు, పండ్ల హుస్సేన్‌గౌడ్ పాల్గొన్నారు. -
ముగిసిన బంద్
హుజూర్నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అఖిలపక్ష నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరాసెంటర్‌లో కోదాడ– మిర్యాలగూడ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఉద్యోగ జేఏసీ నాయకులు యరగాని నాగన్నగౌడ్, తన్నీరు మల్లికార్జున్, గొట్టె రామయ్య, అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, చావా కిరణ్మయి, వేముల శేఖర్‌రెడ్డి, శీలం శ్రీను, పాలకూరి బాబు, గూడెపు శ్రీనివాస్, మేకల నాగేశ్వరరావు, చిట్యాల అమర్నాథరెడ్డి, ఎంఏ.మజీద్, బాచిమంచి గిరిబాబు, జడ రామకృష్ణ, పిల్లి మల్లయ్య, గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, రౌతు వెంకటేశ్వరరావు, శీలం¯ éగరాజు, కుక్కడపు మహేష్, కలకుంట్ల రామయ్య, పీవీ.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో... పట్టణంలోని ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలోఎస్కె.మన్సూర్‌అలీ, ఎస్కే. సైదా, షేక్ అక్బర్, ఎండి.మొయిన్, ఎండి. రహీం, రఫీ, హసన్మియా, జానీమియా, బడేమియా, బాజీ, సుభానీ, ఖాసిం పాల్గొన్నారు. -
ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి కృషి
హుజూర్నగర్ : తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శివాజీనాయక్ అన్నారు. బుధవారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఇంజనీర్లు, సబ్‌ఇంజనీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యుత్ శాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టిందన్నారు. సమావేశంలో విద్యుత్ డీఈ వెంకటేశ్వర్లు, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామేశ్వర్‌శెట్టి, ఉపాధ్యక్షులు పున్నానాయక్, రవి, వినోద్, సూర్య, మోతీరాం, అమర్, చిన్నానాయక్ పాల్గొన్నారు. -
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
హుజూర్నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ, అన్ని అర్హతలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు. ఇందుకోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డివిజన్ కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు. భారీ వర్షంలో సైతం సుమారు 2 రెండు గంటల పాడు రాస్తారోకో చేయడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఎండి.నిజాముద్దీన్, తన్నీరు మల్లికార్జున్‌రావు, గొట్టె వెంకట్రామయ్య, యరగాని నాగన్నగౌడ్, ఎంఏ.మజీద్, ఎస్కె.సైదా, అట్లూరి హరిబాబు, చావా కిరణ్మయి, రౌతు వెంకటేశ్వరరావు, ఎస్డి.రఫీ,చిలకరాజు లింగయ్య, పండ్ల హుస్సేన్‌గౌడ్, కోల శ్రీను, సామల శివారెడ్డి, గూడెపు శ్రీనివాస్, ఎం.పెదలక్ష్మీనర్సయ్య, జడ రామకృష్ణ,పోతుల జ్ఞానయ్య, పిల్లి మల్లయ్య, యల్లావుల రాములు, పాలకూరి బాబు, గుండు వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, పానుగంటి పద్మ జేఏసీ నాయకులు పీవీ.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
హుజూర్నగర్ : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1966–67లో హెచ్ఎస్సీ చదివిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు కలుసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆనాటి పాఠశాలల మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంగా గడిపారు. అనంతరం మెమెుంటోలు అందజేశారు. అదే విధంగా పూర్వ విద్యార్థి డాక్టర్ ఎన్వీ.రాఘవరావు అంద జేసిన రూ. లక్ష విరాళాన్ని ప్రతిభ గల విద్యార్థులకు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు లక్పతినాయక్కు అందజేశారు. ఇటీవల భారీ వర్షానికి కూలిపోయిన పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి సైతం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు యుగంధరశర్మ, నర్సింహారావు, పెంటయ్య, సోమయ్య, విశ్వేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలి
హుజూర్నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఏదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో చేర్చిన కోదాడ రెవెన్యూ డివిజన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. అన్ని అర్హతలున్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఎందుకు ఏర్పాటు చేయడం లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. హుజూర్నగర్ పాత తాలుకాగా ఉండటంతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన డివిజనల్ కార్యాలయాలు, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మోడల్ కోర్టు, మోడల్ సబ్ జైలు, సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయన్నారు. రెవిన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, ఎండి.అజీజ్‌పాషా, చింతిర్యాల నాగయ్య, రెడపంగు పెదవెంకటేశ్వర్లు, గొల్లగోపు వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, కస్తాల శ్రావణ్‌కుమార్, నందిగామ ముక్కంటి, బరిగెల చంద్రశేఖర్, ఎస్కె.అన్వర్‌పాషా, కుంభం శివ, జి. మట్టయ్య పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర మోసగాళ్ల ముఠా అరెస్ట్
హుజూర్నగర్ : మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు తమ లారీల ద్వారా సరుకులు, ఇతర సామగ్రిని చేరవేస్తామని నమ్మబలికి యజమానులను మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం హుజూర్నగర్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో నిందితులకు సంబంధించిన వివరాలను సీఐ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. హైదరాబాద్ కవాడీగూడకు చెందిన తుమ్మాసాయికిషోర్ ఇంటర్నెట్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ ట్రాన్స్‌పోర్ట్‌ల వివరాలను సేకరించి తమకు తరుచుగా మహారాష్ట్రకు వెళ్లే లారీలు ఉన్నాయని ఏదైనా సరుకుల రవాణా ఉన్నట్లయితే తమ లారీల ద్వారా చేరవేస్తామని ఫోన్లలో ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులతో మాట్లాడేవారు. ట్రాన్స్‌పోర్టుల నిర్వాహకులు అతని మాటలు నమ్మి ఏదైనా సరుకుల లోడింగ్ అడ్రస్ ఇచ్చినట్లయిదే సదరు చిరునామాకు లారీని పంపించి లోడింగ్ చేయించుకొని సరుకును గమ్యస్థానానికి చేరవేయకుండా విక్రయించి అడ్డదారులలో డబ్బు సంపాదనే ధ్యేయంగా తన అనుచరులతో కలిసి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 10న హుజూర్నగర్ పట్టణంలోని శ్రీసత్యనారాయణస్వామి పార్బాయిల్డ్ మిల్లు నుంచి 25 కేజీల బియ్యం గల 840 బస్తాలను మహారాష్ట్రలోని పూణెలో దిగుమతి చేసే విధంగా లోడింగ్ చేయించారు. అయితే ఆగస్టు 15 నాటికి కూడా సదరు బియ్యం పూణెలో దిగుమతి చేయకపోగా మిల్లు యజమానికి ఇచ్చిన సెల్‌ఫోన్ కూడా పనిచేయడం లేదు. దీంతో అనుమానం వచ్చిన మిల్లు యజమాని గజ్జి ప్రభాకర్‌రావు ఆగస్టు16న హుజూర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫొటో ఆధారంగా దర్యాప్తు తమ మిల్లులో లారీకి బియ్యం లోడింగ్ చేసిన సమయంలో సెల్ఫోన్లో లారీ డ్రైవర్ ఫొటో తీసినట్లు పోలీసులకు తెలిపారు. మిల్లు యజమాని ఆ ఫొటోను అందజేశాడు. ఫొటో ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిఘా పెట్టారు. కాగా ఈ నెల 2న పట్టణంలోని మిర్యాలగూడ– కోదాడ ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టణంలో బియ్యం మోసానికి పాల్పడిన లారీ డ్రైవర్ సుశీల్‌దాస్ పట్టుబడ్డాడు. ఆ డ్రైవర్‌ను విచారించగా పట్టణంలో బియ్యం చోరీకి పాల్పడిన ముఠా సభ్యుడిగా తెలిసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మోసగాళ్ల ముఠా సభ్యులైన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మహారాష్ట్ర, పూణెకు చెందిన రాజేష్వేద్, తుమ్మాసాయికిషోర్, మలక్‌పేటకు చెందిన మహ్మద్‌అబ్దుల్ సమ్మద్ లను అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో బియ్యం వ్యాపారం చేసే అజయ్ అనే రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి వద్ద ఈ నలుగురు మోసగాళ్ల ముఠా సభ్యులు కొద్ది సంవత్సరాల క్రితం పని చేశారు. కాలక్రమేణా అజయ్‌తో విభేదాలు రావడంతో ముఠా సభ్యులు ఒక లారీని కొనుగోలు చేసి అడ్డదారులలో మోసాలు చేస్తూ డబ్బులు సంపాదించడాన్ని మార్గంగా గత కొంతకాలంగా ఎంచుకున్నారు. మోసాలు ఇవే.. అయితే ఈ ఏడాది జూలైలో కాకినాడలో లోహిత్ ఇడిబుల్ ఆయిల్ ఏజెన్సీ ద్వారా రూ. 7లక్షల 85వేల విలువైన వనస్పతి గోల్డ్ వంటనూనెలను మహారాష్ట్రకు రవాణా చేసేందుకు లోడింగ్ చేయించుకొని ఏజెన్సీ వాళ్లను మోసం చేసి వంట నూనెలను రూ. 6 లక్షలకు విక్రయించారు. ఆగస్టు15న కోదాడలోని వేదాద్రి పేపర్ మిల్స్‌లో రూ. 4లక్షల 35వేల విలువైన పేపర్ లోడింగ్ చేయించుకొని నిర్దేశిత అడ్రస్‌లో దింపకుండా వారి ఆ«ధీనంలో ఉన్న హైదరాబాద్‌లోని చర్లపల్లి వద్ద గోడౌన్లో దించారు. ఆగస్టు 25న కర్నూలులో రూ. 5లక్షల 26 వేల విలువైన కాస్టిక్ సోడా బ్యాగులను లారీకి లోడింగ్ చేయించుకొని హైదరాబాద్‌లోని చర్లపల్లి గోదాంలోనే దించుకున్నారు. హుజూర్‌నగర్‌లో లోడింగ్ చేయించుకున్న బియ్యాన్ని రూ. 6లక్షల 30 వేలకు, కాకినాడలో లోడింగ్ చేసిన వంటనూనెలను రూ. 6 లక్షలకు విక్రయించగా, రూ. 12లక్షల 30 వేల నగదు వారి చేతికి వచ్చింది. అందులో కొంత నగదును ఖర్చు చేయగా పోలీసులు వారి వద్దనుంచి రూ. 10లక్షల 50 వేల సొత్తును రికవరీ చేశారు. మహారాష్ట్ర అడ్రస్‌తో లారీకి తరుచుగా మార్పిడి చేసే పలు నంబర్ పేట్ల బోర్డులను, లారీని స్వాధీనం చేసుకొని హైదరాబాద్‌లో గోదాంలోని పేపర్, సోడాను సీజ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చురుకైనపాత్ర పోషించిన గరిడేపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి, ఐడీపార్టీ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఎస్ఐ రంజిత్‌రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది పెరుమాళ్ల శ్రీనివాస్, బలరాంరెడ్డి, శ్రీనివాసాచారి, ప్రకాశ్ తదితరులున్నారు. -
గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ
హుజూర్నగర్: పోటీపరీక్షలకు చెందిన రూ. 5 వేల విలువైన పుస్తకాలను పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్య మహిళలు మంగళవారం శాఖా గ్రంథాలయానికి బహూకరించారు. ఈç Üందర్భంగా శాఖా గ్రంథాలయ చైర్మన్ కుంట సైదులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే పుస్తకాలను అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం దాతలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో దాతలు పొట్టుముత్తు సోమలక్ష్మి, తమ్మన సుజాత, కొత్త కళావతి, వంకాయల పద్మావతి, గ్రంథాలయాధికారి వీరస్వామి, ఊరె వెంకయ్య, సైదానాయక్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
శాంతి కమిటీ సమావేశం
హుజూర్నగర్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, బక్రీద్ వేడుకలను ఘనంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ రంజిత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని తెలిపారు. గణేష్ విగ్రహాల వద్ద మైక్ ఏర్పాటుకు మీ–సేవలో చలానా చెల్లించి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలన్నారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద మౌలిక వసతులు కల్పించాలని పలువురు నాయకులు నగరపంచాయతీ ౖచెర్మన్ జక్కుల వెంకయ్యను కోరగా స్పందించిన ఆయన అన్ని ఏర్పాట్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎస్ఐ రాణి, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు, ఎస్కే.మన్సూర్ అలీ,చిట్యాల అమర్నాథరెడ్డి, అట్లూరి హరిబాబు, దొడ్డా నర్సింహారావు, చిలకరాజు అజయ్‌కుమార్, తూముల శ్రీను, శీలం శ్రీను, శీతల రోషపతి, ఎస్డి.రఫీ, ఎస్కె.బాజీఉల్లా, పానుగంటి వెంకన్న, విద్యుత్ లైన్మెన్ భూతం వెంకటేశ్వర్లు, హెల్త్ అసిస్టెంట్ బత్తిని నగేష్ పాల్గొన్నారు. -
ఘనంగా ముత్యాలమ్మ జాతర
హుజూర్నగర్ : శ్రావణమాసంలో ప్రతి ఏటా పట్టణంలో రెండు రోజులపాటు నిర్వహించే ముత్యాలమ్మ జాతర సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక పీర్లకొట్టం వీధి సమీపంలోని మూడుగుళ్ల ముత్యాలమ్మ దేవాలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు అమ్మవారికి చీరెలు, గాజులు, పసుపు కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో వందలాదిగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ప్రభలు కట్టి డప్పువాయిద్యాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ వీధుల్లో ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రభ బండ్లు ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక మూడుగుళ్ల ముత్యాలమ్మ ఆలయం వద్ద భక్తులకు మంచినీరు సరఫరా చేశారు. ముత్యాలమ్మ జాతర సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూర్నగర్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ రంజిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
ఇబ్బందుల్లో పెసర రైతులు
హుజూర్నగర్ రూరల్: ఎంతో ఆశతో ఖరీఫ్‌లో పెసర సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాభం మాట అటుంచితే కనీసం విత్తనాల ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పప్పుధాన్యాలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రచారం చేయడంతో మండలంలోని పలు గ్రామాల రైతులు ఈ ఏడు ఖరీఫ్ వరి పంటకు ముందు స్వల్ప కాలిక పంటగా పెసరను సాగు చేశారు. జూన్ నెలలో కురిసిన వర్షాలకు ఆనందపడిన రైతులు దాదాపు 1400 ఎకరాల్లో పెసర సాగు చేశారు. ఒక్కో రైతు ఎకరానికి దుక్కి, విత్తనాలు, పురుగు మందులకు, కోత కూళ్లు కలిపి సుమారు రూ. 10 వేల పై చిలుకు ఖర్చు పెట్టారు. తొలకరిలో కురిసిన వర్షాలు పెసర పంటలకు ప్రాణం పోశాయి. కానీ జూలై, ఆగస్టు నెలలో వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల పంట ఎండి పోయే దశకు చేరుకుంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పూత, పిందె దశలో పంటకు తెగుళ్లు ఆశించాయి. దీనికి తోడు సరైన వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఎకరానికి 30 కిలోలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. దీంతో రైతులు పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి ప్రకోపానికి రైతులు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రెండు ఎకరాల్లో పెసర వేశా – బత్తుల నాగేశ్వరరావు, రైతు, వేపల సింగారం నాకు ఉన్న 2 ఎకరాల్లో పెసర సాగు చేశాను. మొదట్లో వర్షాలు బాగానే కురిశాయి. దీంతో దున్నడం, విత్తనాలు, పురుగు మందు మిషన్‌తో కలిపి ఎకరానికి రూ. 10 వేలు ఖర్చు చేశాను. అదునులో వర్షాలు కురవక పంట సరిగా పండలేదు. అంతా ఎండిపోయే దశకు చేరకుంది. పెసర కాయలు కోసి పంట నూర్పిడి చేశాక చూస్తే నష్టాలే మిగిలాయి. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపాం – రాజగోపాల్, మండల వ్యవసాయ అధికారి మండలంలో దాదాపు 1400 ఎకరాల్లో పెసర పంట సాగు చేశారు. వర్షాలు లేక బెట్ట వల్ల పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరానికి 25 నుంచి 30 కిలోలు మాత్రమే దిగుబడి వచ్చింది. గ్రామాల వారీగా వివరాలు సేకరించాం. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపాం. -
అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి
హుజూర్నగర్: పట్టణంలోని కోర్టులో అన్ని వసతులు ఉన్నందున అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుక్కడపు బాలకృçష్ణ కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ కోర్టుగా అత్యాధునిక హంగులతో హుజూర్నగర్ కోర్టును నిర్మించడం జరిగిందన్నారు. అంతేగాక అన్ని అవకాశాలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే విషయమై చొరవ చూపాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి జక్కుల వీరయ్య, కోశాధికారి ఉదారి యాదగిరి, క్రీడా కార్యదర్శి భూక్యా నాగేశ్వరరావు, సాంస్కృతిక కార్యదర్శి కె.ప్రదీప్తి, సీనియర్ న్యాయవాదులు కొణతం శ్రీనివాసరెడ్డి, విజయదుర్గ పాల్గొన్నారు. -
ఘనంగా ముత్యాలమ్మ జాతర
హుజూర్నగర్ : పట్టణంలో ప్రతి ఏడాది శ్రావణమాసంలో రెండు రోజుల పాటు నిర్వహించే ముత్యాలమ్మ జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక పోచమ్మ చెరువు సమీపంలోని పెద్ద ముత్యాలమ్మ దేవాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి బోనాలు సమర్పించిన అనంతరం మెుక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు అమ్మవారికి చీరెలు, గాజులు, పసుపు, కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద వాసవీ, వనితాక్లబ్‌ల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులకు మంచినీరు సరఫరా చే శారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం పట్టణంలో భారీగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ప్రభలు కట్టి, బాజాభజంత్రీలు, డప్పువాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రభ బండ్లు ప్రదక్షిణలు చేయగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య, వైస్‌చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డిలతో పాటు పాలకవర్గ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు వారిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. జాతరలో రెండోరోజైన సోమవారం చిన్న ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లిస్తారని ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. పటిష్ట బందోబస్తు ముత్యాలమ్మ జాతర సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూర్నగర్ సీఐ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి పట్టణంలోకి భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడమే గాక పెద్ద ముత్యాలమ్మ ఆలయం వద్దకు వెళ్లే రహదారులను వన్‌వేగా మార్చారు. ప్రభ బండ్ల ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
గ్రంథాలయంలో స్టేజీ షెల్టర్ ప్రారంభం
హుజూర్నగర్ : పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేజీ షెల్టర్‌ను శుక్రవారం దాత బూర్లె లక్ష్మీనారాయణ, శేషమ్మ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాఖ గ్రంథాలయ అధ్యక్షుడు కుంట సైదులు మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి దాతలు చేయూతనందించడం అభినందనీయమన్నారు. అనంతరం స్టేజీ షెల్టర్ దాతలను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వీరస్వామి, శ్రీనివాస్, వెంకయ్య, నాగేందర్, నారాయణ, సైదులునాయక్, వెంకట్రాజు, మౌలాలీ, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
ఆందోళనలో ఆయకట్టు రైతులు
హుజూర్నగర్/మేళ్లచెర్వు : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో ఆయకట్టుగా ఉన్న నియోజకవర్గంలో రోజు రోజుకు వ్యవసాయరంగ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. వరుణుడు ముఖం చాటేసినా, సాగర్ నుంచి నీరు రానప్పటికీ ప్రత్యామ్నాయంగా బోర్లు, బావులు ఏర్పాటు చేసుకొని ఎంతో కొంత వరిసాగు చేద్దామనుకున్న రైతుల ఆశలు అడియాశలుగానే మారుతున్నాయి. పడిపోయిన భూగర్భ జలాలు వేలాది రూపాయలు అప్పులు చేసి బావులు, బోర్ల ద్వారా వరిసాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. దీనికి తోడు గత నెలలో అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు కాలం కలిసి వస్తుందనే ఆశతో బోర్లు, బావుల ఆధారంగా వరినార్లు పోశారు. అయితే వరి నాట్లు పెట్టాల్సిన సమయం ఆసన్నమైనా వర్షాలు పడకపోవడం, బోర్లలో నీటి తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో పడిపోయారు. 15 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యే పరిస్థితి నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద నియోజకవర్గంలోని 5 మండలాల్లో సాగర్ నీటి ద్వారా సుమారు లక్షా 80 వేల ఎకరాలు సాగవుతుండగా ప్రస్తుతం బోర్లు, బావుల ఆధారంగా 5 మండలాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో వరిసాగు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ నీటి లభ్యత సరిగ్గా లేకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేసే అవకాశం కనిపిస్తుంది. అది కూడా బోర్లు, బావుల నీటితో ఎకరానికి మించి ఎక్కడా కూడా సాగు చేసే పరిస్థితి కనపడడం లేదు. వరినార్లకు, బోర్లు, బావుల ఏర్పాటుకు వేలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అయోమయంలో పడిపోయారు. మిగతా పంటలదీ అదే పరిస్థితి మేళ్లచెర్వు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. మండలంలో కంది వెయ్యి ఎకరాల,ఉ పెసర 2 వేలు, పత్తి 20 వేలు, మిరప 10 వేల ఎకరాల్లో సాగు చేశారు. కానీ వరుణుడు కరుణించకపోవడంతో పంట చేతికందుతుందా లేదా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా వానలు కురువక వేసిన పంటలు చేతికందక అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ నీటిని విడుదల చేయాలి – భూక్యాపాండునాయక్, మఠంపల్లి వరిసాగు చేసేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేని పరిస్థితి. అప్పులు చేసి బోర్లు, బావులు ఏర్పాటు చేసుకున్నా అప్పులే మిగిలాయి, తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశా – మొర్రిమేకల వీర య్య, రైతు, మేళ్లచెర్వు మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశా. ఎకరానికి రూ. 6 నుంచి రూ. 8 వేల వరకు పెట్టుబడి పెట్టాను. నెల రోజులుగా వానలు కురవక పోవడంతో పత్తి వాడిపోయింది. వానలు కురకవకపోతే పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. అఫ్పు తెచ్చి పంట సాగు చేపట్టా అప్పు తీరే మార్గం కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి – పొనగండ్ల సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రెండేళ్లుగా వానలు సరిపడా పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. -
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు
హుజూర్నగర్ : మట్టపల్లి కృష్ణాపుష్కరాలకు ఈనెల 20న గవర్నర్ పర్యటన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం మట్టపల్లిలోని ప్రహ్లాద ఘాట్‌ను పరిశీలించి గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ పర్యటన షెడ్యూల్ ప్రకారం భక్తుల రద్దీని గుర్తించి అందుకు తగిన విధంగా అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రహ్లాద ఘాట్‌లో వీఐపీలకు కేటాయించిన ప్రదేశంలో నూతనంగా కంచె ఏర్పాటు చేయడంతోపాటు అదే ఘాట్‌లోని మిగిలిన ప్రదేశంలో సాధారణ భక్తులను అనుమతించే విషయంపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గవర్నర్ పూజలు నిర్వహించాక స్థానికంగా గల ముక్కూరు పీఠానికి వెళ్లే దారిని పరిశీలించాల్సిందిగా సూచించారు. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నామని ఈనెల 19 నుంచి డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడనున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్పెషల్ఆఫీసర్, డీఆర్డీఏ పీడీ అంజయ్య, మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, ట్రైనీ ఎస్పీ చందనాదీప్తి, డీఎస్పీ సునితామోహన్, సీఐ నర్సింహారెడ్డి, తహసీల్దార్ యాదగిరి, ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.825 కోట్లతో సకల సౌకర్యాలు
హుజూర్నగర్/మఠంపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.825 కోట్లతో పుష్కరఘాట్లతో పాటు భక్తులకు సకల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన వారు అనంతరం మట్టపల్లికి చేరుకున్నారు. స్థానిక ప్రహ్లాద ఘాట్‌లో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కృష్ణానదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘాట్‌లో పుష్కర భక్తులతో మాట్లాడారు. వసతుల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న కృష్ణా పుష్కరాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కాగా మట్టపల్లి వద్ద కృష్ణానదిపై బల్లకట్టు నిలిపివేసినందున భక్తుల రాక తగ్గిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మంత్రుల దృష్టికి తీసుకురాగా, పరిశీలించి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. పానగల్ ఆలయాలను అభివృద్ధి చేస్తాం నల్లగొండ టూటౌన్ : పానగల్లో ఉన్న చారిత్రక ఆలయాలను రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖామంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డితో కలిసి మంగళవారం పానగల్ ఘాట్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఛాయాసోమేశ్వర ఆలయం ఎంతో విశిష్టత ఉందన్నారు. నాగార్జునసాగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో పుష్కరఘాట్ల పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగశ్రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హెలికాప్టర్లో జిల్లాలోని పుష్కరఘాట్లను ఏరియల్ సర్వే చేస్తూ నాగార్జునసాగర్‌కు వచ్చారు. బుద్ధ వనంలో హెలికాప్టర్ దిగి శివాలయం, సురికి Sవీరాంజనేయస్వామి ఘాట్లను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. వాడపల్లిలో ఘాట్ల పర్యవేక్షణ మిర్యాలగూడ : వాడపల్లి సంగమంలో ఉన్న ఘాట్లను రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి పర్యవేక్షించారు. దామరచర్ల మండలం కొండ్రపోల్ వద్ద హెలిప్యాడ్‌లో దిగిన మంత్రులు రోడ్డు మార్గం మీదుగా వాడపల్లికి చేరుకున్నారు. శివాలయం ఘాట్‌లోకి నేరుగా వెళ్లిన మంత్రులు కృష్ణమ్మ నమస్కారం చేసి చేతులతో నీళ్లు తీసుకుని నెత్తిన చల్లుకున్నారు. అనంతరం భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డిలకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఏజేసీ వెంకట్రావు అడిషనల్ ఎస్పీ గంగారామ్, ట్రైనీ ఎస్పీ చందనాదీప్తి, డీఎస్పీ సునితామోహన్, డీఆర్డీఏ పీడీ అంజయ్య, డీఎస్ఓ అమృతారెడ్డి, నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్, ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ కర్నాటì æలింగారెడ్డి, టీఆర్ఎస్ నల్లగొండ, సాగర్ నియోజకవర్గాల ఇన్చార్జిలు దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, సీఐ ఇ.రవీందర్, అధికారులు చంద్రవదన, సురేందర్, ఆలయ కమిటీ చైర్మన్ గుంట్ల అనంతరెడ్డి, ఎం.సి.కోటిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, నాయకులు బాలాజీనాయక్ తదితరులు ఉన్నారు. -
పాముకాటుతో ఎన్సీసీ విద్యార్థికి అస్వస్థత
హుజూర్నగర్ : మట్టపల్లి కృష్ణాపుష్కరాల్లో విధులు నిర్వహించే ందుకు వచ్చిన నల్లగొండ ఎన్జీ కాలేజీకి చెందిన ఎన్సీసీ విద్యార్థి ఎస్కే.మస్తాన్ ఆదివారం అర్థరాత్రి పాముకాటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే... కృష్ణాపుష్కరాల్లో ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించిన మస్తాన్ మఠంపల్లిలోని మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతి స్థలానికి చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి చేతిని శుభ్రం చేసేందుకు కుళాయి వద్దకు వెళ్లాడు. చేతిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో కట్లపాటు కాటు వేసింది. దీంతో మస్తాన్ వెంటనే తోటి విద్యార్థులకు సమాచారం తెలుపగా పాము కోసం వెతుకులాడగా అది తప్పించుకుపోయింది. పాముకాటుగా నిర్ధారించుకున్న వెంటనే పోలీసులు, అధికారుల సాయంతో హుజూర్‌నగర్‌లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థికి ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. -
సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోని ప్రభుత్వం
హుజూర్నగర్ : సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్ అన్నారు. సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన సమర భేరీ సైకిల్ యాత్ర ఆదివారం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా సైకిల్ యాత్రకు స్థానిక ఎస్ఎఫ్ఐ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎంసెట్ –2 నిర్వహణలో విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆకారపు నరేష్, కొమరాజు నరేష్, సైదా, ఆత్కూరి వెంకటేష్, సాయి, గణేష్, భాను, రాజు, మహేష్, పవన్, వెంకటేష్, శ్రీకాంత్, రవి పాల్గొన్నారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు
సందర్భంగా మట్టపల్లి వద్ద 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు హుజూర్నగర్ సీఐ వి.నర్సింహారెడ్డి తెలిపారు. ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరుగుతుండడంతో మట్టపల్లిలో ఇప్పటికే 11 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడంలో పోలీసుల పాత్ర కీలకం. జిల్లాలోని వాడపల్లి, నాగార్జునసాగర్‌తో పాటు మట్టపల్లికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోనే ప్రధాన పుష్కర ఘాట్లలో ఒకటైన మట్టపల్లిలో కీలక విధులు నిర్వహించనున్న హుజూర్నగర్ సీఐ వి.నర్సింహారెడ్డి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... బందోబస్తు పనులు పూర్తి హుజూర్నగర్ సర్కిల్ పరిధిలో మట్టపల్లి, నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్లు ముఖ్యమైనవి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐదు పుష్కర ఘాట్ల వద్ద బందోబస్తు, రూట్ మ్యాప్‌ల విషయమై సంబంధిత అధికారులు ఇప్పటికే పనులు పూర్తి చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేశాం. భారీ బందోబస్తు ఏర్పాట్లు పుష్కర ఘాట్ల నుంచి ఆయా రహదారులు, పార్కింగ్ స్థలాల వద్ద ఇద్దరు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలతో పాటు 1500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వీరితో పాటు 600 మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సైతం పుష్కర విధుల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం, సైబరాబాద్ నుంచి పోలీస్ అధికారులు, సిబ్బంది రానున్నారు. ప్రతిరోజు మూడు దఫాలుగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిబ్బంది విధి నిర్వహణలో పాల్గొంటారు. 65 సీసీ కెమెరాల ఏర్పాటు పుష్కర ఘాట్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు 65 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మట్టపల్లి పుష్కర ఘాట్లు, పరిసర ప్రాంతాల్లో 50, మహంకాళిగూడెం ఘాట్ వద్ద 15 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు మట్టపల్లికి వచ్చే వాహనాలతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం మఠంపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని బైపాస్ నుంచి రఘునాథపాలెం, గుండ్లపహాడ్, పాత సుల్తాన్పూర్ తండాల మీదుగా ఎన్సీఎల్ పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలానికి చేరుకునే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశాం. అక్కడి నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో భక్తులను ఘాట్ల వద్దకు చేరవేస్తారు. పుష్కర స్నానం ముగించుకొని ఎన్సీఎల్ పరిశ్రమ వద్ద గల పార్కింగ్ స్థలానికి చేరుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో నేరుగా ప్రధాన రహదారికి వెళ్లే అవకాశం కల్పించాం. కోదాడ రోడ్డు మీదుగా హుజూర్నగర్ వచ్చే వాహనాలు ముక్త్యాల మేజర్ వెంట గల బైపాస్ రోడ్డు మీదుగా మట్టపల్లి వెళ్లే విధంగా, మిర్యాలగూడ రోడ్డు నుంచి హుజూర్‌నగర్‌కు వచ్చే వాహనాలను పట్టణం నుంచి మట్టపల్లి వెళ్లేందుకు అనుమతిస్తున్నాం. వీఐపీ పాస్‌ల జారీ అధికారం కలెక్టర్, ఎస్పీలదే.. వీఐపీ పాస్‌ల జారీ విషయంలో తమకెలాంటి అధికారాలు లేవు. కలెక్టర్, ఎస్పీలు మాత్రమే వీఐపీ పాస్‌లను జారీ చేస్తారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
హుజూర్నగర్ : ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, కోడి మల్లయ్యయాదవ్లు అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ అనేక రకాల హామీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, కేజీ టు పీజీ విద్య, లక్ష ఉద్యోగాల వంటి పనులు కనీసం అమలుకు నోచుకోవడం లేదన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండక, రుణమాఫీ పథకం అమలు కాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. కరువు మండలాలను ప్రకటించి నిధులు విడుదల చేయకుండా ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఉపాధి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నా ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంలో, డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్రయూత్ విభాగం కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, హుజూర్నగర్, మఠంపల్లి మండల అధ్యక్షులు జడ రామకృష్ణయాదవ్, జాలకిరణ్యాదవ్, పట్టణ, మండల మహిళా అధ్యక్షురాళ్లు కారింగుల మంగమ్మ, పశ్య మల్లేశ్వరి, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు కుంభం శివ, నాయకులు వేముల శ్రీను, దాసరి రాములు, పిల్లి మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. -
వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి
హుజూర్నగర్ : పట్టణంలోని ప్రధాన రహదారి వెంట వీధి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానిక నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోశపతి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పేరుతో రహదారుల వెంట గల వీధి వ్యాపారుల దుకాణాలను, తోపుడు బండ్లను తొలగించారన్నారు. దీంతో వందలాది మంది వీధి వ్యాపారులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో స్పందించిన నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య, కమిషనర్ సత్యనారాయణరెడ్డిలు వీధి వ్యాపారులతో చర్చలు జరిపారు. రహదారి ఆక్రమణకు గురికాకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్కె.అక్బర్, చంద్రు, వెంకటేశ్వర్లు, పిచ్చమ్మ, శేఖర్, సైదులు, రామయ్య, ప్రసాద్, రాజేష్, మట్టయ్య, నాగమణి, రమణ, ఆదెమ్మ, కొండలు పాల్గొన్నారు. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
హుజూర్నగర్ : నగరపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు చైర్మన్ జక్కుల వెంకయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని 3వ వార్డులో రూ.3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్, నగరపంచాయతీ వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 20 వార్డుల పరిధిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తన్నీరు మల్లికార్జున్‌రావు, దొంతిరెడ్డి సంజీవరెడ్డి, కంకణాల పుల్లయ్య, శాఖ గ్రంథాలయ చైర్మన్ కె.సైదులు, నాయకులు కామిశెట్టి రవికుమార్, వల్లపుదాసు కృష్ణ, చింతకాయల రాము, నందిగామ శంభయ్య, యల్లావుల రాములు, కాలవపల్లి బ్రహ్మారెడ్డి, యతిపతిరావు, నర్సింహారావు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి కళాకారుల సదస్సును విజయవంతం చేయాలి
హుజూర్నగర్ : కృష్ణా పుష్కరాల కళోత్సవాలను జయప్రదం చేసేందుకు ఆగస్టు 3న పట్టణంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సదస్సును విజయవంతం చేయాలని రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు వేముల వెంకటేశ్వర్లు, ధర్మూరి వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన ఆ సంఘం సమావేశంలో మాట్లాడారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా నిర్వహించే ప్రదర్శనల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. సమావేశంలో దొంతగాని సత్యనారాయణ, ధూళిపాళ రామకృష్ణ, కె.రామయ్య, సుదర్శన్, పిచ్చయ్య, చుక్కయ్య, భద్రాచలం, జాన్‌సైదా, తేజారెడ్డి, కవిత, తాటికొండ వెంకటి, శ్రీను, నాగయ్య, మంగ, నాగమణి, ధర్మయ్యగౌడ్, రమేష్, నరేష్ పాల్గొన్నారు. -
ఆవోపా ఉపకార వేతనాల పంపిణీ
హుజూర్నగర్ : పట్టణంలోని వాసవీ భవన్లో ఆదివారం ఆవోపా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యలో రాణిస్తున్న పలువురు విద్యార్థులకు ప్రోత్సహకాలు, నోటుపుస్తకాలు, పెన్నులు, డ్రస్‌లతో పాటు నిరుపేద ఆర్యవైశ్య మహిళలకు పింఛన్లను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంది స్వరాజ్యబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆవోపా పట్టణ అధ్యక్షుడు వంగవీటి హనుమంతరావు, తహసీల్దార్ శ్రీదేవి, రాష్ట్ర ఆవోపా ఉపాధ్యక్షులు సామా నారాయణ, నాగేశ్వరరావు, కృష్ణమూర్తి, బూర్లె లక్ష్మీనారాయణ, గుండా భద్రయ్య, గెల్లి అప్పారావు, రామ్మోహన్రావు, ప్రభాకర్‌రావు, శ్రీనివాసరావు, ఆనంద్, మల్లికార్జున్‌రావు, పి.శ్రీనివాస్, కె.రామారావు, పి.వెంకటేశ్వర్లు, వి.న రేష్ పాల్గొన్నారు. -
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి
హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని రిజర్వేషన్ సబ్‌ప్లాన్ యాక్షన్ కమిటీ జిల్లా కార్యదర్శి ఎస్కె.అక్బర్ కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లింల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సబ్‌ప్లాన్‌ను కూడా అమలు చేయాలన్నారు. అనంతరం స్థానిక ఉస్మానియా మసీదులో మెుక్కలు నాటారు. కార్యక్రమంలో ఎండి.రహీం, ఖాదర్‌సాబ్, ఎస్కె.రసూల్, జానీమియా, టైలర్జానీ, మీరావలి, డీసీసీ ఉపాధ్యక్షుడు మన్సూర్‌అలీ, వక్ఫ్‌బోర్డు మాజీ డైరెక్టర్ ఎస్కె.సైదా పాల్గొన్నారు. -
పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి చేయాలి
హుజూర్నగర్ : పట్టణంలోని ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బేతవోలు నుంచి పట్టణానికి నీటి సరఫరా జరిగే పైపులైన్ లీకేజీ వల్ల రహదారి ధ్వంసమైందన్నారు. పైపులైన్ మరమ్మతుల పేరుతో ప్రతిసారీ గుంతలు తీసి రోజుల కొద్దీ ఉంచడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గుంతలు నీటితో నిండి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నగరపంచాయతీ, ఆర్అండ్బీ అధికారులు స్పందించి నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి ఎండి.అజీజ్‌పాషా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అట్లూరి హరిబాబు, సీపీఎం మండల కార్యదర్శి ములకలపల్లి సీతయ్య, చిలకరాజు లింగయ్య, అహ్మద్‌హుస్సేన్, బెల్లంకొండ గురవయ్య, కోల మట్టయ్య, ఆయూబ్, వెంకటేశ్వర్లు, వెంకన్న, వీరబాబు, శేఖర్, జాలగురవయ్య, నాగరాజు, సలీం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
హుజూర్నగర్ : ప్రస్తుత వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విజయదుర్గాచారి అన్నారు. గురువారం స్థానిక టౌన్హాల్లో జరిగిన ఆశా వర్కర్ల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ అమలుచేస్తున్న పథకాలు గ్రామస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో కలిసి పనిచేయాలన్నారు. గర్భిణులకు ఆరోగ్య సంబంధ విషయాల్లో అవగాహన కల్పించి వైద్యశాలల్లో కాన్పులు జరిగేలా చూడాలన్నారు. నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల్లో ఆశా కార్యకర్తల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జి.నిర్మల, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ రవి, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ ప్రేమ్‌సింగ్, డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ హలీం, డీపీఎంఓ సురేష్‌బాబు, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరాజు, టీబీ సూపర్వైజర్ నిమ్మల వెంకటేశ్వర్లు, శ్రీనివాసన్, కిరణ్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టులను విమర్శించడం సరికాదు
హుజూర్నగర్ : బీజేపీ, ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు కమ్యూనిస్టులను దూషించడం అప్రజాస్వామికమని అఖిలపక్ష నాయకులు అన్నారు. గురువారం స్థానికంగా జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ నెల 27న పట్టణంలో రాస్తారోకో చేపట్టిన బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు కమ్యూనిస్టులను విమర్శించడం తగదన్నారు. పట్టణంలోని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేలా ఇటువంటి చర్యలు చేపట్టడం సరికాదన్నారు. సమావేశంలో టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాలకూరి బాబు, చిలకరాజు అజయ్‌కుమార్, దొడ్డా నర్సింహారావు, అట్లూరి హరిబాబు, కోల శ్రీను, ములకలపల్లి సీతయ్య, శీలం శ్రీను, కంబాల శ్రీనివాస్, గుండు వెంకటేశ్వర్లు, కె.సూర్యనారాయణ, వెంకటరెడ్డి, రామకృష్ణ, జక్కుల మల్లయ్య, వీరయ్య పాల్గొన్నారు. -
కుట్టు మిషన్ల పంపిణీ
హుజూర్నగర్ : పట్టణంలోని సాయిబాబా కల్యాణ మండపంలో మంగళవారం స్థానిక రోటరీక్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా కీతా మల్లికార్జున్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పొలిశెట్టి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కంభంపాటి వెంకటరమణ, మందడపు నారాయణరావు, సహాయ కార్యదర్శులుగా ఏలూరు రాంబాబు, కోతి సంపత్‌రెడ్డి, కోశాధికారిగా కంచర్ల అరవిందరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఇంజనీర్ అవార్డు గ్రహీత, విద్యుత్ డీఈ ఎ.శ్రీనివాస్‌ను సన్మానించారు. అదేవిధంగా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో పలువురికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎకనామిక్స్ రీడర్ డాక్టర్ అందె సత్యం, డాక్టర్ శ్రీశరత్, కుక్కడపు అనిల్ పాల్గొన్నారు. -
దళితులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న కేంద్రం
హుజూర్నగర్ : కే ంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తుందని ఆప్ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాల వల్ల ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలోని భజరంగ్‌దళ్, గో సంరక్షణ దళ సభ్యులు దళితులను హింసిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నల్లధనాన్ని వెలికి తీస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక వారికే అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారి కుటుంబ పాలన చేస్తుందన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సరికొండ రుషికేశ్వర్‌రాజు, నాయకులు తన్నీరు ఉమేష్, ఎం.పురుషోత్తంరెడ్డి, తుల వెంకటేశ్వర్లు, మహేష్, వెంకన్నగౌడ్, మనోహర్‌గుప్త, వెంకటేశ్వర్లు, సైదులు, జగన్, విజయ్‌రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న హరితహారం
హుజూర్నగర్ : హరితహారంలో భాగంగా పట్టణంలో సోమవారం పడిగరాయిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయం సమీపంలో ఎన్ఎస్పీ కాల్వ కట్టపై అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. పట్టణంలోని 9, 11 వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ రవి, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఎన్ఎస్పీ ఏఈలు నరేష్, మౌనిక, వర్క్ ఇన్స్పెక్టర్లు కోటయ్య, వెంకటేశ్వర్లు, ఉపేందర్, కౌన్సిలర్లు రవినాయక్, పుల్లయ్య, కిరణ్‌కుమార్, నాయకులు కామిశెట్టి రవికుమార్, ఉప్పల విజయలక్ష్మి, కుక్కడపు కాశయ్య, వీరభద్రం, కృష్ణారెడ్డి, సైదులునాయక్, కృష్ణ, బాబూరావు, యోహాన్, చంటి పాల్గొన్నారు. -
నగరపంచాయతీలో ఉపాధి హామీ పనులు కల్పించాలి
హుజూర్నగర్ : నగరపంచాయతీ పరిధిలో కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి అయిలయ్య డిమాండ్ చేశారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపంచాయతీ ఏర్పడిన రెండేళ్ల నుంచి పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ఆలోచించడం సరికాదన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగారపు పాండు, కె.నగేష్, పారేపల్లి శేఖర్‌రావు, ములకలపల్లి సీతయ్య, అబ్దుల్నబీ, హుస్సేన్, రోశపతి, శీలం శ్రీను, దుగ్గి బ్రహ్మం, నాగేశ్వరరావు, వెంకన్న, భద్రమ్మ, వీరమ్మ,ఉమ, పార్వతి పాల్గొన్నారు. -
మున్సిపల్ కౌన్సిలర్లకు సదుపాయాలు కల్పించాలి
హుజూర్నగర్ : రాష్ట్రంలోని మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని తెలంగాణ మున్సిపల్, నగరపంచాయతీ కౌన్సిలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్ఎన్.ప్రసాద్ కోరారు. సోమవారం స్థానికంగా జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌన్సిలర్లకు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలన్నారు. హెల్త్‌కార్డులు అందజేయడంతో పాటు రూ.5 లక్షల వరకు ఫండ్‌ను నామినేషన్ పద్ధతి ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైలు, బస్సుల్లో ప్రయాణించేందుకు బస్‌పాస్‌లు జారీ చేయడంతో పాటు ప్రతినెల సెల్‌ఫోన్ బిల్లు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో నగరపంచాయతీ వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు జక్కుల నాగేశ్వరరావు, తేజావత్ రవినాయక్, మీసాల కిరణ్‌కుమార్, జడ శ్రీనివాస్, తన్నీరు మల్లికార్జున్, నాయకులు కామిశెట్టి రవికుమార్, వల్లపుదాసు కృష్ణ, కుక్కడపు కాశయ్య, చింతకాయల రాము పాల్గొన్నారు. -
బల్లకట్టుపై జీరో దందా..!
ఆంధ్రా నుంచి మట్టపల్లి బల్లకట్టు మీదుగా హుజూర్‌నగర్‌కు వంటనూనె ప్యాకెట్లతో ప్రయాణిస్తున్న వాహనాన్ని ఇటీవల మట్టపల్లి పోలీసులు పట్టుకుని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పజెప్పారు. సదరు వాహన డ్రైవర్‌ను ప్రశ్నించగా కొంతకాలంగా తాము అనుమతి లేకుండా నూనె ప్యాకెట్లతో పాటు తదితర వస్తువులను బల్లకట్ల మీదుగా రవాణా చేస్తున్నట్టు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇలా వంట నూనె ప్యాకెట్లతో పాటు నిషేధిత వస్తువులు, పన్నులు ఎగవేసేందకు వాహనాల తరలింపునకు సైతం బల్లకట్లు దోహదపడుతున్నాయని తెలుస్తోంది. – హుజూర్నగర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కృష్ణానదిపై నడుపుతున్న బల్లకట్లు అక్రమ రవాణాకు అడ్డాలుగా మారాయి. తెలంగాణ– ఆం«ధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గల కృష్ణానదిపై ప్రయాణికుల రాకపోకలకు నియోజకవర్గంలోని మట్టపల్లి, చింతిర్యాల, బుగ్గమాదారంల వద్ద బల్లకట్లు తిప్పుతున్నారు. అయితే ప్రయాణికులను మాత్రమే ఇరువైపులా దాటించాల్సిన బల్లకట్లు అక్రమ సరుకులు, ఇతర ట్రాన్స్‌పోర్టులకు సంబంధించిన జీరో దందాకు సహకరిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్లకట్ల మీదుగా పీడీఎస్ బియ్యం, గుట్కాలు, మద్యం, నల్లబెల్లం వంటి నిషేధిత సరుకుల రవాణా జరుగుతున్నాయని తెలిసింది. అయితే సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అంతేగాక సన్న బియ్యం, పత్తి, మిర్చి, ధాన్యం, సిమెంట్, క్లింకర్లతో పాటు పలు రసాయనాలను కూడా ఈ బల్లకట్ల మీదుగా సరిహద్దులు దాటిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పలు రకాల పన్నులను ఎగవేస్తున్నారని సమాచారం. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా సరిహద్దు ప్రాంతాలైన కృష్ణానది పరివాహక గ్రామాల ప్రధాన రహదారులపై ఎలాంటి చెక్‌పోస్టుల ఏర్పాటు లేకపోవడంతో అక్రమ రవాణాదారుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. బల్లకట్ల నిర్వాహకులు సంపాదనే ధ్యేయంగా ఎటువంటి వస్తువుల రవాణానైనా సరిహద్దులు దాటిస్తుండటంతో ఈ అక్రమవ్యాపారాలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనలకు విరుద్ధంగా బల్లకట్లు రాత్రివేళలో కూడా యథేచ్ఛగా నడుపుతూ అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బల్లకట్ల నిర్వహణ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నడపాల్సి ఉన్నప్పటికీ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కిష్ణపట్టె ప్రాంతాలైన దొండపాడు,మట్టపల్లి, చింతిర్యాల వద్ద ప్రధాన రహదారిపై మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడితే ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రా సరిహద్దులను దాటి రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు ట్రాన్స్‌పోర్టు వాహనాలకు అనుమతులు తప్పనిసరి కావడంతో సదరు అనుమతుల కోసం చెల్లించాల్సిన వేలాది రూపాయల బోర్డర్ ట్యాక్స్‌ను ఎగ్గొడుతూ బల్లకట్ల మీదుగా ప్రయాణిస్తున్నారు. అంతేగాక జాతీయ రహదారిపై గల కోదాడ మండలంలోని నల్లబండగూడెం క్రాస్‌రోడ్డు నుంచి రెడ్లకుంట, కాపుగల్లు, గుడిబండ వద్ద నుంచి జగ్గయ్యపేట, దొండపాడు, మల్లారెడ్డిగూడెం మీదుగా గల రహదారుల ద్వారా ఆంధ్రాప్రాంతానికి చెందిన అనేక ట్రాన్స్‌పోర్టులకు చెందిన ఆంధ్రా వాహనాలు ఆయా బల్లకట్లకు చేరుకొని సరిహద్దులు దాటిస్తున్నారు. ఎటువంటి పన్నులు చెల్లించకుండానే సరిహద్దులు దాటుతుండటంతో బల్లకట్లపై ట్రాన్స్‌పోర్టు వాహనాల ప్రయాణం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా బల్లకట్ల సమీపంలో గల ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారాలకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
బల్లకట్టుపై జీరో దందా..!
ఆంధ్రా నుంచి మట్టపల్లి బల్లకట్టు మీదుగా హుజూర్‌నగర్‌కు వంటనూనె ప్యాకెట్లతో ప్రయాణిస్తున్న వాహనాన్ని ఇటీవల మట్టపల్లి పోలీసులు పట్టుకుని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పజెప్పారు. సదరు వాహన డ్రైవర్‌ను ప్రశ్నించగా కొంతకాలంగా తాము అనుమతి లేకుండా నూనె ప్యాకెట్లతో పాటు తదితర వస్తువులను బల్లకట్ల మీదుగా రవాణా చేస్తున్నట్టు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇలా వంట నూనె ప్యాకెట్లతో పాటు నిషేధిత వస్తువులు, పన్నులు ఎగవేసేందకు వాహనాల తరలింపునకు సైతం బల్లకట్లు దోహదపడుతున్నాయని తెలుస్తోంది. – హుజూర్నగర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కృష్ణానదిపై నడుపుతున్న బల్లకట్లు అక్రమ రవాణాకు అడ్డాలుగా మారాయి. తెలంగాణ– ఆం«ధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గల కృష్ణానదిపై ప్రయాణికుల రాకపోకలకు నియోజకవర్గంలోని మట్టపల్లి, చింతిర్యాల, బుగ్గమాదారంల వద్ద బల్లకట్లు తిప్పుతున్నారు. అయితే ప్రయాణికులను మాత్రమే ఇరువైపులా దాటించాల్సిన బల్లకట్లు అక్రమ సరుకులు, ఇతర ట్రాన్స్‌పోర్టులకు సంబంధించిన జీరో దందాకు సహకరిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్లకట్ల మీదుగా పీడీఎస్ బియ్యం, గుట్కాలు, మద్యం, నల్లబెల్లం వంటి నిషేధిత సరుకుల రవాణా జరుగుతున్నాయని తెలిసింది. అయితే సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అంతేగాక సన్న బియ్యం, పత్తి, మిర్చి, ధాన్యం, సిమెంట్, క్లింకర్లతో పాటు పలు రసాయనాలను కూడా ఈ బల్లకట్ల మీదుగా సరిహద్దులు దాటిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పలు రకాల పన్నులను ఎగవేస్తున్నారని సమాచారం. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా సరిహద్దు ప్రాంతాలైన కృష్ణానది పరివాహక గ్రామాల ప్రధాన రహదారులపై ఎలాంటి చెక్‌పోస్టుల ఏర్పాటు లేకపోవడంతో అక్రమ రవాణాదారుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. బల్లకట్ల నిర్వాహకులు సంపాదనే ధ్యేయంగా ఎటువంటి వస్తువుల రవాణానైనా సరిహద్దులు దాటిస్తుండటంతో ఈ అక్రమవ్యాపారాలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనలకు విరుద్ధంగా బల్లకట్లు రాత్రివేళలో కూడా యథేచ్ఛగా నడుపుతూ అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బల్లకట్ల నిర్వహణ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నడపాల్సి ఉన్నప్పటికీ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కిష్ణపట్టె ప్రాంతాలైన దొండపాడు,మట్టపల్లి, చింతిర్యాల వద్ద ప్రధాన రహదారిపై మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడితే ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రా సరిహద్దులను దాటి రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు ట్రాన్స్‌పోర్టు వాహనాలకు అనుమతులు తప్పనిసరి కావడంతో సదరు అనుమతుల కోసం చెల్లించాల్సిన వేలాది రూపాయల బోర్డర్ ట్యాక్స్‌ను ఎగ్గొడుతూ బల్లకట్ల మీదుగా ప్రయాణిస్తున్నారు. అంతేగాక జాతీయ రహదారిపై గల కోదాడ మండలంలోని నల్లబండగూడెం క్రాస్‌రోడ్డు నుంచి రెడ్లకుంట, కాపుగల్లు, గుడిబండ వద్ద నుంచి జగ్గయ్యపేట, దొండపాడు, మల్లారెడ్డిగూడెం మీదుగా గల రహదారుల ద్వారా ఆంధ్రాప్రాంతానికి చెందిన అనేక ట్రాన్స్‌పోర్టులకు చెందిన ఆంధ్రా వాహనాలు ఆయా బల్లకట్లకు చేరుకొని సరిహద్దులు దాటిస్తున్నారు. ఎటువంటి పన్నులు చెల్లించకుండానే సరిహద్దులు దాటుతుండటంతో బల్లకట్లపై ట్రాన్స్‌పోర్టు వాహనాల ప్రయాణం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా బల్లకట్ల సమీపంలో గల ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారాలకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం
హుజూర్నగర్ : కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్ అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన వివిధ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను సవరణల పేరుతో కాలరాసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అందజేయకుండా వారి సంక్షేమాన్ని విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ నాయకులు శీతల రోశపతి, మేకల నాగేశ్వరరావు, చల్లా రామకృష్ణ, చిలకరాజు లింగయ్య, వంటిపులి శ్రీనివాస్, బెల్లంకొండ గురవయ్య, మేళ్లచెరువు ముక్కంటి, నర్సింహారావు, జానయ్య, ముస్తఫా, వెంకటరెడ్డి, పుల్లయ్య, సావిత్రి, రవికుమార్, కరుణాకర్‌రెడ్డి, హుస్సేన్ గౌడ వీరబాబు, లాలుగౌడ్ పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
హుజూర్నగర్ : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు సూచించారు. శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల మందును స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమకాటు వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. కౌన్సిలర్ తన్నీరు మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ వార్డు పరిస్థితులను ‘సాక్షి’ దినపత్రిక ఇటీవల నిర్వహించిన ఫోన్ ఇన్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి భానుప్రసాద్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది వార్డును సందర్శించి దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధుల బారినపడకుండా ప్రజలకు అవగాహన కల్పించేలా చేసిన ‘సాక్షి’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ జాన్పాషా,హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ, ఆశా కార్యకర్తలు మాధవి, మంగమ్మ, వార్డు ప్రజలు పాల్గొన్నారు. -
గ్రంథాలయానికి కుర్చీల బహూకరణ
హుజూర్నగర్: పట్టణంలోని శాఖా గ్రంథాలయానికి పంచాయతీ కార్యదర్శి పిడమర్తి ఇంద్రబాబు, భార్గవ్ మెడికల్స్ పాశం నాగిరెడ్డిలు 10 కుర్చీలను బహూకరించారు. గురువారం స్థానిక గ్రంథాలయంలో చైర్మన్ కుంట సైదులు, గ్రంథాలయాధికారి మండవ వీరస్వామికి వారు ఈ కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉపాధ్యక్షుడు తేజావత్ సైదానాయక్, ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీనివాస్‌గౌడ్, కోశా«ధికారి ఊరె వెంకయ్య, కనకారెడ్డి, కిరణ్, శ్రీనివాస్, సురేష్, మధు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణకు దాతలు చేయూతనందించాలి
హుజూర్నగర్ : హరితహారంలో భాగంగా నాటిన మెుక్కల సంరక్షణకై ట్రీగార్డుల ఏర్పాటుకు దాతలు చేయూతనందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి కోరారు. మంగళవారం పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన హరితహారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అదే విధంగా పట్టణంలోని 19, 20 వార్డుల్లో నిర్వహించిన హరితహారంలో నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య, వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్‌లు, స్థానిక కౌన్సిలర్ బెల్లంకొండ లలిత, నందిగామ అనితలతో కలిసి మొక్కలు నాటారు. మండలంలోని లింగగిరి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి అబ్దుల్ అలీం, సిబ్బంది మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు తేజావత్ రవినాయక్, కంకణాల పుల్లయ్య, యల్లావుల సీత, రిటైర్డ్ హెచ్ఎం ఎంఎస్ఎన్.రాజు నాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, నందిగామ శంభయ్య, సైదులునాయక్, వసంతకుమార్, యోహాన్, శోభన్ బాబు, చంటి, గురునాథం, వైద్యసిబ్బంది జాన్‌బాషా, రాజేంద్రప్రసాద్, పార్వతి, రామకృష్ణ, ఉపేందర్, జ్యోతి, నర్సింహారావు, సంతోషి, సలోమి, లక్ష్మమ్మ, శ్రీను పాల్గొన్నారు. -
విద్యార్థులకు నోటుపుస్తకాలు, స్టేషనరీ పంపిణీ
హుజూర్నగర్ : పట్టణంలోని అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం దళిత మహిళా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు చెవుల కవిత 60 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు దాతల ప్రోత్సహకాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్పతినాయక్, హెచ్ఎం భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు రామ్మూర్తి, నర్సింహారావు, సీహెచ్.రత్తయ్య, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గోపు చెలీనమ్మ, భవాని, రమ్య, చంద్రకళ, విద్యార్థులు పాల్గొన్నారు. -
రుణాలను మంజూరు చేయాలి
హుజూర్నగర్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను రుణాలు పొందేందుకు ఎంపికైన లబ్ధిదారులకు సబ్సిడీ నగదును మంజూరు చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి ఎండి.అజీజ్‌పాషా కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కోసం ఆయా వర్గాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేసి 5 నెలలు గడిచినా నేటి వరకు వారి ఖాతాల్లో నగదు జమ చేయలేదన్నారు. స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా కార్పొరేషన్లు మాత్రం నగదు మంజూరు కాలేదని చెపుతున్నాయన్నారు. ప్రతి ఏడాది రెండు సార్లు లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉనా మొదటి విడత లబ్ధిదారులకే ఇంత వరకూ రుణాలు మంజూరు కాలేదన్నారు. సమావేశంలో నాయకులు కోల మట్టయ్య, ఎస్కె.అహ్మద్‌హుస్సేన్, జాల గురవయ్య, ఎండి.జహీరాబేగం, నాగరాజు, వెంకటేశ్వర్లు, ఎల్.నాగేశ్వరరావు, యోహాన్ పాల్గొన్నారు. 17హెచ్జడ్ఆర్01 – సమావేశంలో మాట్లాడుతున్న అజీజ్‌పాషా -
రుణాలను మంజూరు చేయాలి
హుజూర్నగర్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను రుణాలు పొందేందుకు ఎంపికైన లబ్ధిదారులకు సబ్సిడీ నగదును మంజూరు చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి ఎండి.అజీజ్‌పాషా కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కోసం ఆయా వర్గాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేసి 5 నెలలు గడిచినా నేటి వరకు వారి ఖాతాల్లో నగదు జమ చేయలేదన్నారు. స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా కార్పొరేషన్లు మాత్రం నగదు మంజూరు కాలేదని చెపుతున్నాయన్నారు. ప్రతి ఏడాది రెండు సార్లు లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉనా మొదటి విడత లబ్ధిదారులకే ఇంత వరకూ రుణాలు మంజూరు కాలేదన్నారు. సమావేశంలో నాయకులు కోల మట్టయ్య, ఎస్కె.అహ్మద్‌హుస్సేన్, జాల గురవయ్య, ఎండి.జహీరాబేగం, నాగరాజు, వెంకటేశ్వర్లు, ఎల్.నాగేశ్వరరావు, యోహాన్ పాల్గొన్నారు. 17హెచ్జడ్ఆర్01 – సమావేశంలో మాట్లాడుతున్న అజీజ్‌పాషా -
విద్యార్థి అదృశ్యం
* రూ. 500 చోరీ చేశాడని తోటి విద్యార్థుల ఆరోపణ * తనకు ఏ పాపం తెలియదంటూ సూసైడ్‌నోట్ రాసి అదృశ్యమైన నాగార్జునరెడ్డి * హుజూర్‌నగర్‌లో కలకలం * పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. కేసు నమోదు హుజూర్నగర్ : విద్యార్థి అదృశ్యం హుజూర్‌నగర్‌లో తీవ్ర కలకలం రేపింది. విద్యార్థుల మధ్య రూ. 500 లకు చెలరేగిన వివాదం.. చివరకు విద్యార్థి అదృశ్యానికి దారితీసింది. పోలీసు లు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం తమ్మారం గ్రామ పంచాయతీ పరిధి కొత్తూరుకు చెందిన గాయం నాగార్జునరెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యనభ్యసిస్తూ హస్టల్లో ఉంటున్నాడు. అయితే గత ఆదివారం స్వగ్రామానికి వెళ్లిన నాగార్జునరెడ్డి సోమవారం పాఠశాలకు చేరుకున్నాడు. బుధవారం అదే తరగతి విద్యార్థి ముప్పారపు గణేష్ తన వద్దగల రూ.500లను ఎవరో చోరీ చేశారని స్నేహితులకు తెలి పాడు. అయితే అదే తరగతికి చెందిన మరో నలుగురు విద్యార్థులు ఎస్.సాయికిరణ్, పి.రమేష్, ఏ.పవన్, జి.నవీన్‌లు నీ స్కూల్ బ్యాగ్‌ను నాగార్జునరెడ్డి తెరిచాడని, సదరు నగదును అతనేచోరీ చేశాడని గణేష్‌కు చెప్పారు. దీంతో విద్యార్థులంతా కలిసి హా స్టల్లోని నాగార్జునరెడ్డి ఇనుపపెట్టెను తెరిచి వెతికారు. అయితే సదరు పెట్టెలో 500ల నోటు లభించింది. అది గణేష్‌కు చెందిన నోటుగా ఇతర విద్యార్థులు నాగార్జునరెడ్డితో వాదించారు. దీంతో నాగార్జునరెడ్డి తాను చోరీకి పాల్పడలేదని సోమవారం రోజు ఇంటి వద్ద నుంచి వచ్చే సమయంలో తల్లిదండ్రులకు చెప్పకుండా క్రీడాదుస్తులు కొనుగోలు చేసేందుకు బీరువా నుంచి *500లు తెచ్చుకున్నట్లు తెలిపాడు. అయినప్పటికీ ఇతర విద్యార్థులు ఆ నోటుపై ఆర్‌జెఎన్ అనే ఇంగ్లిష్ పదాలను గణేష్ మిత్రుడు ప్రవీణ్ రాశాడని కచ్చితంగా అది గణేష్దేనని నాగార్జునరెడ్డిని నిలదీశారు. నాగార్జునరెడ్డి చోరీ చేసినట్లు ఒప్పుకోకపోగా గురువారం సాయంత్రం పాఠశాల సమయం ముగియగానే బయటకు వెళ్లిపోయాడు. వార్డెన్ ఆరా తీయగా.. హాస్టల్ విద్యార్థులను పర్యవేక్షించే వార్డెన్ నాగార్జునరెడ్డి కనపడకపోవడంతో విద్యార్థులను ఆరా తీశాడు. అయితే విద్యార్థులు పాఠశాల సమయం ముగిశాక హాస్టల్‌కు రాలేదని తమకు తెలియదని తెలిపారు. దీంతో నాగార్జునరెడ్డి ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా నాగార్జునరెడ్డి ఇనుపపెట్టె వద్దగల పుస్తకాలలో సూసైడ్‌నోట్ లభించింది. వెంటనే హాస్టల్ వార్డెన్ పాఠశాల యాజమాన్యానికి సమాచారమందించి ఆత్మహత్యా పత్రాన్ని అప్పజెప్పాడు. పురుగులమందు తాగి చనిపోతున్నా.. స్నేహితులు అకారణంగా తనపై దొంగతనం నిందమోపారని.. నువాక్రాన్ పురుగుల మందు కొనుగోలు చేసి చనిపోతున్నానని, తన తల్లిదండ్రులకు చెప్పకుండా బీరువా నుంచి రూ.500లు తెచ్చుకున్నందుకు క్షమించాలని కోరడంతో పాటు అంతకు ముందు విద్యార్థుల మ ద్య జరిగిన ఘర్షణను నాగార్జునరెడ్డి సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. పాఠశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా గురువారం రాత్రి పట్టణానికి చేరుకున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ సత్యం,ఎస్ఐ రంజిత్‌రెడ్డిలు స్థానిక పాఠశాలకు చేరుకుని విద్యార్థులను విచారించారు. నాగార్జునరెడ్డి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
హుజూర్‌నగర్‌లో భారీగా ఎర్రచందనం స్వాధీనం
నల్గొండ : నల్గొండ జిల్లా హుజూర్నగర్ శివారు ప్రాంతంలో ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని సీజ్ చేసి ఆటోను పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆటో డ్రైవర్లను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలు 8 క్వింటాళ్ల వరకు ఉంటాయని పోలీసులు చెప్పారు. -
ఆ ఆరడుగుల జాగా కోసం..!
శవాన్ని ఖననం చేసేందుకు స్థలం చూపించాలని ధర్నా హుజూర్నగర్: శవాన్ని ఖననం చేసేందుకు స్థలం చూపాలంటూ నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వైనం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో శుక్రవారం జరిగింది. పట్టణానికి చెందిన చింతల నాగేశ్వరరావు (35) హమాలీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. వడ్డెర కులానికి చెందిన నాగేశ్వరరావు అంత్యక్రియలను ఇతర కులాల వాటికలో నిర్వహించడం నిషిద్ధం. అయితే స్థానికంగా ఆ కులస్తులకు సంబంధించి ఎటువంటి శ్మశానవాటిక లేదు. ఇటీవల అదే కులానికి చెందిన ఆర్థికంగా వెసులుబాటు కలిగిన కొన్ని కుటుంబాల వారు కొంత స్థలాన్ని కొనుగోలు చేసి శ్మశానవాటికను ఏర్పాటు చేసుకున్నారు. నాగేశ్వరరావును ఆ శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేసేందుకు అనుమతి కోరగా వారు నిరాకరించారు. స్థానిక హిందూశ్మశాన వాటికలోనైనా ఖననం చేద్దామని బంధువులు అక్కడకు వెళ్లగా దహనమే తప్ప ఖననం ఈ స్మశానవాటికలో లేదని వారు సైతం నిరాకరించారు. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచక బంధువులు ఆ మృతదేహాంతో స్థానిక నగరపంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు పట్టణంలోని అదే కులానికి చెందిన శ్మశానవాటికలో ఖననం చేసే విధంగా మాట్లాడి ఒప్పించి అంత్యక్రియలను పూర్తి చేయించారు. -
శవం ఖనానికి స్థలంలేక..
నల్లగొండ : శవాన్ని ఖననం చేయడానికి స్థలం లేకపోవడంతో ఏకంగా పంచాయతీ కార్యాలయం ఎదుటే శవంతో ధర్నాకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా హుజూరునగర్ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది. పంచాయతీ పరిధిలోని వడ్డెర కులస్థులకు శవాలను ఖననం చేయడానికి స్థలం లేదు. దీంతో గురువారం మృతి చెందిన ఒక వ్యక్తి మృతదేహంతో నగర పంచాయతీ కార్యాలయం ఎదుట అతడి బంధువులు బైఠాయించారు. దీంతో పంచాయతీ చైర్మన్ స్పందించి వడ్డెర సంఘం నాయకులతో చర్యలు జరుపుతున్నారు. ఈ సంఘటన జరిగిన హుజూరునగర్కు టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
‘పార్బాయిల్డ్’ ప్రమాదం
హుజూర్నగర్ హుజూర్నగర్ పట్టణం లింగగిరి రోడ్డులో గల శ్రీసత్యనారాయణస్వామి పార్బాయిల్డ్ మోడ్రన్ రైస్‌మిల్లులో శుక్రవారం రాత్రి బాయిలర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మిల్లు డ్రైవర్ బైరుమళ్ల రాములు (50) మృతదేహం శనివారం లభ్యమైంది. ప్ర మాదంలో ఇద్దరు మృతిచెందగా శుక్రవా రం రాత్రే దినసరి కూలీ అలివేలు మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ప్ర మాదం అనంతరం రాములు ఆచూకీ తెలి యకపోవడంతో ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేసి క్రేన్ల ద్వారా మిల్లు పరిసర ప్రాంతాలను వెతికారు. అయితే బాయిలర్ పేలిన ప్రమాదంలో రాములు మృతదేహం ముక్కలుగా ఛిద్రమై మిల్లు చుట్టుపక్కల ప్రాంతాలలో పడిపోవడంతో విడి విడిగా శరీర భాగాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం భాగాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నా రు. బాయిలర్ పేలిన తాకిడికి పార్బాయి ల్డ్ మిల్లు ఆసాంతం ధ్వంసమైంది. కాగా మిర్యాలగూడ డీఎస్పీ గోనె సందీప్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన బాయిలర్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ .. పార్బాయిల్డ్ మిల్లులో బాయిలర్ పేలిన ప్రమాద సంఘటన స్థలాన్ని శనివారం బాయిలర్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్బాయిల్డ్ మిల్లులలో ఈ తరహా ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయన్నారు. అ యితే బాయిలర్ పేలిపోవడానికి గల కారణాలు తెలియడం లేదని, పేలిపోయిన బా యిలర్ను అన్ని విధాలుగా పరిశీలించిన ట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 400ల బాయిలర్లు ఉన్నాయని, ఎక్కడా కూడా ఇంతపెద్ద పేలుడు జరగలేదన్నారు. ప్ర మాద వివరాలను ఒక నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్ శ్రీనివాసరావు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా, మండల కమిటీల నియామకం
హుజూర్నగర్ : జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో గల ఐదు మండలాల పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా, మండల కమిటీలను నియమిస్తూ మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. మునుగోడు మండలం వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడిగా బి.శంకర్, బీసీ సెల్ మండల సెక్రటరీగా దాము రామ్‌కుమార్. చండూరు మండలం వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడిగా పి.కృష్ణ, సెక్రటరీగా పి.నర్సింహ, మండల జాయింట్ సెక్రటరీగా మర్రి యాదయ్య, యువజన విభాగం అధ్యక్షుడిగా పి.భిక్షం. సంస్థాన్ నారాయణపురం మండలం వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్‌గా బి.నరేందర్, కార్యదర్శులుగా జుబీర్ఫరూక్, కె.మల్లయ్య, యూత్ జనరల్ సెక్రటరీగా పి.కృష్ణ, సెక్రటరీగా బి.శంకర్, మైనార్టీ సెక్రటరీగా ముస్తాఫాఖాన్. మర్రిగూడెం మండలం వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడిగా కె.విజయ్‌కుమార్, యూత్ అధ్యక్షుడిగా ఈదా మహేందర్. నాంపల్లి మండలం వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడిగా మేకల సతీష్, బీసీ సెల్ అధ్యక్షడుగా ఎస్.సత్తయ్య, యూత్ అధ్యక్షుడిగా ఎస్.నాగరాజు నియమితులయ్యారు. జిల్లా కార్యవర్గంలోకి.. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీనివాస్‌యాదవ్(మునుగోడు మండలం) జిల్లా మైనార్టీ సెక్రటరీగా ఎండి.రియాజ్ అహ్మద్(మునుగోడు మండలం) జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎస్.మల్లేశ్ (చండూరు మండలం) జిల్లా కార్యదర్శిగా ఎండి.రహీమ్షరీఫ్ (నారాయణపురం మండలం) జిల్లా ఎగ్జిక్యూటివ్‌గా బి.నర్సింహ(నారాయణపురం మండలం) జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీగా ఎండి.జహంగీర్ (మర్రిగూడెం మండలం) జిల్లా యూత్ కార్యదర్శిగా రమేష్ (నాంపల్లి మండలం) -
అడ్డొస్తోందని.. అంతమొందించాడు..!
హుజూర్నగర్: భర్తను కోల్పోయి తల్లిగారింటి వద్దే ఆశ్రయం పొందుతున్న మహిళతో పరిచయం పెం చుకున్నాడు.. అదికాస్త ప్రేమకు దారి తీయడం తో రెండున్నరేళ్లు కలిసి తిరిగారు..చివరకు తల్లిదండ్రు లు కుదిర్చిన యువతితో వివాహం చేసుకున్నా డు.. ఇది తెలిసి నా సంగతేంటని నిలదీసిన మహిళను దారుణంగా ఉరివేసి అంతమొందించాడు.. గరిడేపల్లి మండలం గారకుంటతండాలో ఈ నెల 20న వెలుగుచూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదిం చారు. ప్రియుడే ఈ ఘాతునికానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. శనివారం స్థా నిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో సీఐ సురేందర్‌రెడ్డి నిందితుడి వివరాలు, హత్యోదంతానికి గల కారణాలను వివరించారు. నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం గ్రామానికి చెందిన పిల్లుట్ల లక్ష్మికి 8 ఏళ్ల క్రితం త్రిపురారం మండలం బాబుసాయిపేటకు చెందిన ఉల్లెందుల నాగయ్యతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు జన్మించాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో నాగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో లక్ష్మి కు మారుడిని అత్తగారి ఇంటి వద్దే వదిలి తల్లిదండ్రుల స్వగ్రామమైన కందులవారిగూడెంలో ఉంటుంది. పరిచయం ప్రేమగా మారి.. లక్ష్మి మిర్యాలగూడలోని ఒక కళాశాలలో డిగ్రీ విద్యను కొనసాగిస్తూ సెలవు దినాలలో కూలికి వెళుతోంది. ఈ క్రమంలో నేరేడుచర్ల మండలం దిర్శించర్లకు చెందిన అవివాహితుడు షేక్ యాకూబ్‌తో పరిచయం ఏర్పడింది. సుమారు రెండున్నర సంవత్సరాల నుంచి కలిసి తిరిగారు. అయితే ఇటీవల యాకూబ్ తల్లిదండ్రులు కుదిర్చిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. బెదిరిస్తోందని.. యాకూబ్ మరో యువతిని వివాహం చేసుకుంటున్నప్పటి నుంచి లక్ష్మిని దూరంగా పెట్టాడు. ఇది జీర్ణించుకోలేని లక్ష్మి నా సంగతేంటని యాకూబ్‌ను నిలదీసింది. భార్యను వదిలి నాతో ఉండాలని.. లేకుంటూ నీ పేరు మీద ఉత్తరం రాసి చనిపోతానని బెదిరించసాగింది. అడ్డుతొలగించుకోవాలని.. తన జీవితానికి అడ్డుగా నిలిచిన లక్ష్మి అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలని యాకూబ్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 20వ తేదీన లక్ష్మికి ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి బైక్‌పై గారకుంటతండా సమీపంలో గల మామిడి చెట్టు వద్దకు చేరుకున్నారు. అక్కడే మద్యం సేవిస్తూ మాట్లాడుకున్నారు. ఆపై మామిడి చెట్టు ఎక్కి కూర్చున్నారు. కాసేపటికి కిందికి దిగేం దుకు వీలుగా ఉంటుందని లక్ష్మిచున్నీ చెట్టుకొమ్మకు కట్టాడు. అదే సమయంలో చున్నీ మరోవైపున ముడి వేసి లక్ష్మి మెడకు వేసి కిందకు తోసేసాడు. దీంతో ఊపిరి ఆడక లక్ష్మి చనిపోయింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లక్ష్మి ఫోన్‌కాల్స్ లిస్ట్ ఆధారంగా యాకూబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని సీఐ వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ తెలిపారు. సమావేశంలో గరిడేపల్లి ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
‘నా నుదుట బొట్టు పెట్టనిదే కదలను’
చేతబడి చేశాడంటూ మహిళ హల్చల్ మహిళకు అండగా నిలిచిన గ్రామస్తులు, బంధువులు పోలీసులను సైతం నిలువరించిన గ్రామస్తులు ‘‘ నాకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చేతబడి చేశాడు.. మరణించిన అతడి కూతురు ఆత్మ నాలో ప్రవేశించింది.. అతడు నాకు బొట్టుపెడితేనే నేను మీకు దక్కుతా.. అతడు వచ్చి నా నుదుట బొట్టు పెట్టేంత వరకు నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు’’ అంటూ హుజూర్నగర్ మండలం సీతారాంపురంలో బుధవారం ఓ మహిళ హల్చల్ సృష్టించింది. స్థానికుల కథనం - సీతారాంపురం (హుజూర్నగర్) హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామపంచాయతీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన తురక నరేష్, త్రివేణి దంపతులు. వీరు స్థానికంగా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవిస్తున్నారు. అంతేగాక గ్రామంలోని శ్రీలక్ష్మీతిరుపతమ్మ దేవాలయంలో అనువంశిక సేవకులుగా కొనసాగుతున్నారు. అయితే ఈ నెల 2వ తేదీ నుంచి త్రివేణి అనారోగ్యం బారిన పడింది. మానసికంగా ఇబ్బంది పడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. త్రివేణికి చేతబడి చేశారని ఆమె బంధువులు సమీప గ్రామంలోని భూతవైద్యులను సంప్రదించారు. అయినా త్రివేణి మానసిక పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ క్రమంలో ‘‘సీతారాంపురం గ్రామానికి చెందిన ఇనుగుర్తి సాంబయ్యచారి తనకు చేతబడి చేశాడని, అతడు వచ్చి నా నుదుట బొట్టు పెడితేనే నేను మీకు దక్కుతానంటూ శోకిస్తూ చెప్పడం ప్రారంభించింది.’’ వెంటనే త్రివేణి బంధువులు గ్రామ పెద్దలను సంప్రదించి సాంబయ్యచారిని బొట్టు పెట్టాలంటూ పిలిచారు. భయాందోళనకు గురైన సాంబయ్యచారి తన ఇంటి నుంచి తప్పించుకుని పక్క గ్రామానికి పారిపోయాడు. అయితే సాంబయ్యచారి ఇంటిలో లేని విషయం గ్రామపెద్దలు తెలపడంతో వెంటనే త్రివేణి పరుగున అతడి ఇంటికి వెళ్లి అక్కడే కూర్చొని సాంబయ్యచారి పేరు ఉచ్చరిస్తూ తిట్ల పురాణం మొదలు పెట్టడంతో పాటు శోకించడం ప్రారంభించింది. ఉద్రిక్త పరిస్థితి త్రివేణికి ఆమె తల్లిదండ్రులు, బంధువులు, గ్రా మస్తులు ఆసాంతం అండగా నిలిచారు. దీంతో గ్రామంలోని సాంబయ్యచారి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.సాంబయ్యాచారి కుటుంబ సభ్యులు ఇంటిలోనే మౌనంగా ఉండి తలుపులు బిగించుకుని కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న హుజూర్నగర్ ఎస్ఐ పి.వీరరాఘవులు సిబ్బందితో హుటాహుటిన సీతారాంపురం చేరుకున్నారు. అక్కడ త్రివేణి బంధువులు, గ్రామస్థులతో మాట్లాడి మూఢ నమ్మకాలను నమ్మవద్దని బాణామతి, చేతబడులు ఉండవంటూ కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ గ్రామస్తులు, త్రివేణి బంధువులు ససేమిరా అన్నారు. సాంబయ్యచారిని తీసుకువచ్చి త్రివేణికి బొట్టు పెట్టించాలని పోలీసులతో సైతం వాగ్వాదానికి దిగారు. మూడుగంటల పాటు పోలీసులు సముదాయించినా వినకపోవడంతో వెంటనే త్రివేణిని పోలీస్ వాహనంలోకి ఎక్కించుకుని బయలుదేరారు. అయితే త్రివేణిని తీసుకు వెళ్లవద్దని పొలిమేర దాటితే ఆమె చనిపోతుందంటూ కొందరు గ్రామస్తులు, మహిళలు పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వాహనానికి అడ్డుగా వచ్చిన వారిని పక్కకు నెట్టివేసి నేరుగా త్రివేణిని హుజూర్నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ప్రాణం మీదకు తెచ్చిన గచ్చకాయలాట
తొండిచేసి గెలిచావంటూ బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన మరో బాలిక హుజూర్నగర్: ఇద్దరు బాలికలు సమీప బంధువులు. గచ్చకాయల ఆట(అచ్చెన గిల్లలాట)లో నేనే గెలిచానంటే.. లేదు నేనే గెలిచా. ఇద్దరి మధ్య పట్టువిడుపు.. తగాదా.. ఆగ్రహావేశాలకు ఓ బాలిక కిరోసిన్ తెచ్చి మరో బాలికపై పోసి నిప్పంటించింది. దీంతో తీవ్రంగా కాలిన గాయాలతో ఓ బాలిక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మునగాల మండలం బరాఖత్‌గూడేనికి చెందిన 11 ఏళ్ల బాలిక వేసవి విడిదిగా అమ్మమ్మ గ్రామమైన బూరుగడ్డకు వచ్చింది. సమీప బంధువువైన ఎనిమిదేళ్ల బాలికతో స్నేహంగా ఉంటోంది. ఇంటిల్లిపాది వ్యవసాయ పనికి వెళ్తుండడంతో ఇద్దరు కలసి ఆడుకునేవారు. ఈ క్రమంలో మంగళవారం ఇరు కుటుంబాల వారు వ్యవసాయ పనులకు వెళ్లారు. అమ్మమ్మ దగ్గరికి వచ్చిన బాలిక ఇంటి దగ్గర ఇద్దరు కలసి గచ్చకాయల ఆట ఆడారు. ఓ దశలో అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక గెలిచింది. లేదు.. లేదు నేనే గెలిచా.. నువ్వు తొండి చేశావంటూ అదే గ్రామానికి చెందిన బాలిక తగాదా పెట్టుకుంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఓడిపోయిన బాలిక పక్కనే ఇంట్లో ఓ బాటిల్లో ఉన్న కిరోసిన్‌ను తెచ్చి మరో బాలికపై పోసింది. అగ్గిపెట్టె గీసి అంటించింది. వెంటనే ఇంటికి పరుగుతీసింది. మంటలకు తాళలేక ఆ బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి మంటలు ఆర్పారు. వెంటనే చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామంలో ఈ సంఘటన కలకలం సృష్టించింది. -
కళాశాల కరస్పాండెంట్‌పై విద్యార్థిని బంధువుల దాడి
ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు, కేసు నమోదు హుజూర్నగర్ పట్టణంలోని గాయత్రీ కళాశాల కరస్పాండెంట్ సుధాకర్‌రెడ్డిపై శనివారం అదే కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని బంధువులు దాడి చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరుకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఇందిరాసెంటర్‌లో గల గాయత్రీ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజులుగా కళాశాల కరస్పాండెంట్ సుధాకర్‌రెడ్డి సదరు విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో విద్యార్థిని పరీక్షల సమయం కావడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా దాచిపెట్టింది. ఈనెల 20న కరస్పాండెంట్ వికృతచేష్టలను తల్లిదండ్రులకు, బంధువులకు వివరించింది. దీంతో ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కళాశాలకు చేరుకుని అక్కడే ఉన్న సుధాకర్‌రెడ్డిపై దాడి చేశారు. కాగా సుధాకర్‌రెడ్డి వారి నుంచి తప్పించుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సుధాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సుధాకర్‌రెడ్డిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అఖిల్‌జామా తెలిపారు. -
మళ్లీ అదే గొడవ
హుజూర్నగర్ టీఆర్ఎస్లో ఒడవని పంచాయితీ దూతగా వచ్చిన గాదరి కిషోర్ సమక్షంలోనూ ఆందోళనలు అన్ని విషయాలను కేసీఆర్‌కు చెపుతానన్న పార్లమెంటరీ కార్యదర్శి హుజూర్నగర్ టీఆర్ఎస్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు ఎవరికి వారే యమునాతీరే అనే రీతిలో వెళుతున్నారు. మొన్న ఫ్లెక్సీల పంచాయితీ జరిగిన నేపథ్యంలో వాస్తవమేంటో తెలుసుకునేందుకు శుక్ర వారం పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ హుజూర్నగర్ వచ్చారు. నియోజకవర్గంలో గ్రూపులుగా వ్యవహరిస్తున్న శంకరమ్మ, సాముల శివారెడ్డి, అల్లం ప్రభాకర్రెడ్డిలను పిలిపించి ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశమయ్యారు. అదే సమయంలో కొందరు టీ ఆర్ఎస్ నాయకులు సమావేశం జరుగుతున్న అతిథిగృహం వద్ద ఆందోళనకు దిగారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమను పట్టించుకోకుండా, మధ్యలో వచ్చి పార్టీలో చేరిన వారితో సమావేశం కావడమేంటని వారు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు చిలకరాజు నర్సయ్య, కొణతం లచ్చిరెడ్డి, హుజూర్నగర్ పట్టణ, మండల అధ్యక్షులు దొడ్డా నర్సింహారావు, చిలకరాజు అజయ్‌కుమార్, మేళ్లచెరువు, గరిడేపల్లి మండల అధ్యక్షులు రెంటోజు ఉమాకాంత్, కారింగుల లింగయ్యగౌడ్ల ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలలో పాల్గొని 14 ఏళ్లపాటు పార్టీ జెండా మోసిన తెలంగాణ ఉద్యమకారులమైన తమకు టీఆర్ఎస్లో గుర్తింపు లేదా అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం గడిపిన తమను కాదని షో రాజకీయాలు చేసేవారితో చీకటి గదులలో సమావేశాలు నిర్వహించడం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ఆర్అండ్బీ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపించే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గాదరి కిషోర్ బయటకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం తాను నియోజకవర్గ నాయకులను సమన్వయం చేసేందుకు సమావేశమైనట్లు ఆందోళనకారులకు వివరించారు. పార్టీలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే... నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందజేస్తానన్నారు. ముం దుగా ముఖ్యులతో సమావేశం పూర్తి కాగానే నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలతో మాట్లాడుతానని, మీడియా ముందు హల్చల్ చేస్తూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లయితే సహించేది లేదని, అవసరమైతే సస్పెండ్ చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. దీనికి స్పందించిన ఆందోళనకారులు కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కిస్తూ పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెడితే ఊరుకునేదిలేదని ఎమ్మెల్యే కిషోర్‌కు సూచించారు. అనంతరం ఆందోళన సద్దుమనగడంతో మండలాల వారీగా ఎమ్మెల్యే కిషోర్ నాయకులతో సమీక్ష నిర్వహించి వెళ్లిపోయారు -
బల్ల‘కట్టు’తప్పితే.. ఫట్టే !
హుజూర్నగర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై నడుపుతున్న బల్లకట్టు ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బల్లకట్టుపై ప్రయాణం సాగిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకపోవడం, నిర్వహణలోపం, డ్రైవర్ల అనుభవరాహిత్యంతో బల్లకట్టు ప్రయాణం ప్రమాదాలకు నెల వైంది. కృష్ణానది ఒడ్డున ఉన్న నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం మట్టపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుం టూరు జిల్లా తంగెడ వరకు, మేళ్లచెరువు మండలం చింతిర్యాల నుంచి మోర్జంపహాడ్, బుగ్గమాదారం మీదుగా గుంటూరు జిల్లా మాదిపహాడ్కు రోడ్డు మార్గం లేకపోవడంతో బల్లకట్టు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఆయా జిలా ల జిల్లా పరిషత్‌లు బల్లకట్టులు నడిపేందుకు బహిరంగ వేలం నిర్వహిస్తాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు రేవుల ద్వారా ఏడాదికి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. నిబంధనలకు నీళ్లు.. వేలంలో బల్లకట్టు నిర్వహణ హక్కులు పొం దిన వారు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంప్రతి రేవు నుంచి రెండు బల్లకట్టులు తిప్పాల్సి ఉండగా ఇరు జిల్లాల కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఒకే బల్లకట్టును నడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గం టల వరకు మాత్రమే బల్లకట్టు తిప్పాల్సి ఉంది. సమయ పాలన లేకుండా రాత్రింబవళ్లు బల్లకట్టులు నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నారనిప్రయాణికులుఆరోపిస్తున్నారు. రేవులకు ఆదాయం ఘనం.. అభివృద్ధి శూన్యం జిల్లాలోని మూడు బల్లకట్టు రేవుల ద్వారా నిత్యం సుమారు 3వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరి నుంచి నామమాత్రంగా డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా ఒక్కొక్కరి నుంచి రూ.10 పైనే వసూలు చేస్తున్నారు. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో సిమెంట్ పరిశ్రమలు విస్తరించి ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే సిమెంట్ లారీలు, కార్లు, జీపులు, మోటార్ సైకిళ్లు ఎక్కువ భాగం ఈ బల్లకట్టుల మీదుగానే వెళుతుంటాయి. రోజుకు సుమారు 100 లారీలు వెళ్తుండగా ఒక్కో లారికి రూ.600 చొప్పున, 150 కార్లు, జీపులు వెళ్తుండగా ఒక్కో దానికి రూ.300 చొప్పున, మోటార్ బైక్‌లకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వానికి, అటూ నిర్వాహకులకు లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా ఆయా రేవుల వద్ద ప్రయాణికుల కోసం షెల్టర్కానీ, బల్లకట్టు రక్షణ పరికరాలు కానీ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తరచు ప్రమాదాలు.. బల్లకట్టు నిర్వాహకుల బాధ్యతారాహిత్యం, డ్రైవర్ల అనుభవలేమితో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాలం చెల్లిన బల్లకట్టులను నడుపుతుండడంతో అవి ఎప్పుడు మరమ్మతులకు గురవుతాయో తెలియని పరి స్థితి నెలకొంది. ఈ క్రమంలో గత ఏడాది మట్టపల్లి రేవు నుంచి బయలుదేరిన బల్లకట్టు గుంటూరు జిల్లా తంగెడ రేవు వద్ద ప్రమాదానికి గురైంది. దీంతో బల్లకట్టుపై ప్ర యాణిస్తున్న టిప్పర్ నదిలోకి పల్టీ కొట్టడంతో బల్లకట్టుపై పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 12న మధ్యాహ్న సమయంలో పెళ్లిబృందంతో పాటు సుమారు 100 మంది ప్రయాణికులతో మట్టపల్లి రేవు నుంచి తంగెడ రేవుకు బయలు దేరిన బల్లకట్టు మధ్యలో ఇం జిన్ ఆగిపోయింది. అదృష్టవశాత్తు నదిలో నీటి ప్రవాహం పెద్దగా లేకపోవడంతో ఈదురు గాలులకు బల్లకట్టు ఆవలి ఒడ్డుకు కొట్టుకొచ్చి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే విధంగా గడిచిన ఏడాది బుగ్గమాదారం వద్ద కృష్ణానదిలో ఆవలి ఒడ్డువైపు సిమెంట్ లారీ బల్లకట్టు మీద నుంచి నదిలో పడిన సంఘటన చోటుచేసుకుంది. కొరవడిన పర్యవేక్షణ.. ప్రతి రోజు నల్లగొండ, గుంటూరు జిల్లాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు, వాహనాలు ఈ బల్లకట్టులపై ప్రయాణం సాగిస్తున్నాయి. బల్లకట్టు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా సంబంధిత జిల్లా పరిషత్ అధికారులు ఏనాడూ పట్టించుకోలేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా నిబంధనల ప్రకారం బల్లకట్టులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
‘సొంతపార్టీ నేతలే గోచీ ఊడగొడతారు’
హుజూర్నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలుతున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ నేతల చేతిలోనే పరాభవం తప్పదని, వారే ఆయన గోచీ ఊడగొడతారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ టౌన్హాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ముఖ్యమంత్రి అదనంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తుంటే కాంగ్రెస్ నాయకుల కళ్లు మసకబారిపోయాయని విమర్శించారు. మెదక్ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటామని, ఓటమి చెందితే రాజీనామా చేస్తామని సవాల్ విసిరితే పొన్నాలలో వణుకుపుట్టిందన్నారు. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిందని కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడడం సరికాదని, అక్కడి ప్రజలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
సంక్షేమ ప్రదాత వైఎస్సార్
హుజూర్నగర్ :బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలనందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని నేటికీ ప్రజలు మరిచిపోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ ఐదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గట్టు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పునాదులు వేసి బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలు, రైతుల అభివృద్ధికి కృషి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి రాష్ట్రాన్ని ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చేయడమే గాక ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకున్నారన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పటికీ ప్రాంతాలకతీతంగా వెఎస్సార్ సంక్షేమ రాజ్యాన్ని ప్రజలు మరువలేకపోతున్నారన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 104, 108, పింఛన్లు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు నేటికీ ఆయనను దైవంలా కొలుస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా త్వరలోనే కమిటీల నియామకం జరగనున్నట్టు తెలిపారు. జిల్లాలో వైఎస్సార్సీపీని అభివృద్ధి చేసేం దుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోడి మల్లయ్యయాదవ్, పోతుల జ్ఞానయ్య, కౌన్సిలర్లు దొంతిరెడ్డి సంజీవరెడ్డి, కాలవపల్లి కృష్ణకుమారి, బ్రహ్మారెడ్డి, నాయకులు పులిచింతల వెంకటరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, జడ రామకృష్ణ, పేరం నర్సింహ, దాసరి రాములు, కస్తాల ము త్తయ్య, గొట్టెముక్కల రాములు, ముసంగి శ్రీను, బత్తిని సత్యనారాయణ, పెద్ది శివ, ముజీబ్, రవీందర్‌రెడ్డి, గండు శ్రీను, దేవరకొండ వెంకన్న, నర్సింహ, కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ, మంగమ్మ, సత్యవతి, మల్లీశ్వరి, శ్రీను పాల్గొన్నారు. వైఎస్‌కు నివాళి జిల్లాలోని పలుచోట్ల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదానాలు చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు, పలు వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. కోదాడలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్నేని బాబు స్థానికంగా ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి ఎస్సీసెల్ నాయకుడు ఇరుగుసునీల్కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా బీబీనగర్‌లో గూడూరు జైపాల్‌రెడ్డి, మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లిలలో పార్టీ మైనార్టీసెల్ అధ్యక్షుడు ఎండీ సలీం వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
గ్రామగ్రామాన వైఎస్ వర్ధంతి నిర్వహించాలి
హుజూర్నగర్ :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 5వ వర్ధంతిని మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలు, గ్రామాలలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చా రు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, ప్రాంతాలకతీతంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకం, పింఛన్లు, ఫీజు రీయంబర్స్మెంట్ వంటి పథకాలను అమలుచేసి బడుగు, బలహీనవర్గాల, రైతుల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. వైఎస్సార్ పాలనను స్వర్ణయుగంగా ప్రజలు కొని యాడారని, ఆయన అకాల మృతిని నేటికీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఆయన పాలనలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు నేటికీ వైఎస్సార్‌ను తమ ఇంటి దేవుడిగా కొలుస్తున్నారని తెలిపారు. వైఎ స్సార్ వర్ధంతిని పురస్కరించుకొని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీసభ్యులు పోతుల జ్ఞానయ్య, కోడి మల్లయ్యయాదవ్, నాయకులు కస్తాల ముత్తయ్య, మందా వెంకటేశ్వర్లు, పిల్లి మరియదాసు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాథమికోన్నత పాఠశాలల అప్‌గ్రేడ్‌కు బ్రేక్
హుజూర్నగర్ :ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని ప్రవే శపెడుతూ రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ నెల 5న ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశానుసారం విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలోని 288 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని ప్రారంభించి విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి చేయడంతోపాటు పాఠ్య పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. అంతేగాక ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబోధనను ప్రారంభించి సం బంధిత సబ్జెక్టులకు ఉపాధ్యాయులను కూడా సర్దుబాటు చేసుకోవడం జరిగింది. దీంతో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు 8వ తరగతి చదువుకునేందుకు ఇతర పాఠశాలలకు వెళ్లకుండా మంచి ప్రయోజనకరంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యాశాఖ అకస్మాత్తుగా జిల్లాలోని 288 పాఠశాలల్లో కేవలం 6 పాఠశాలల్లో మాత్రమే 8వ తరగతి ప్రవేశపెడుతున్నట్లుగా మిగిలిన 282 పాఠశాలల్లో 8వ తరగతి రద్దు చేస్తున్నామని, విద్యార్థులను ఇతర పాఠశాలల్లోకి పంపించాలని ఆదేశిస్తూ ఎంఈఓలకు సమాచారం చేరవేసింది. అంతేగాక సదరు విద్యార్థులు ఇతర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేరిన వారికి మాత్రమే ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం.. జిల్లాలోని త్రిపురారం మండలం కామారెడ్డిగూడెం, మునుగోడు మండలం పులిపలుపుల, మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం, అనుమల మండలం అల్వాల, పీఏపల్లి మండలం మేడవరం, కోదాడ మండలం మొగలాయికోటలలోని మొత్తం 6 ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రమే 8వ తరగతిని కొనసాగించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. అయితే గత నెల 12న పాఠశాలలను పునఃప్రారంభించి ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని ప్రవేశపెట్టిన ప్రభుత్వం కేవలం 22 రోజులలోనే తన నిర్ణయాన్ని మార్చుకుని విద్యార్థుల భవితవ్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు తమ పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్పించాలంటే ఎలా అంటూ వాపోతున్నారు. విద్యాశాఖ తన నిర్ణయాన్ని మార్చుకొని యథావిధిగా 8వ తరగతిని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొనసాగించాలని కోరుతున్నారు. -
తెలంగాణ వీరవనిత పాత్రలో నటించడం నా అదృష్టం
హుజూర్నగర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, ఆత్మ బలిదానాల ఇతివృత్తంతో నిర్మిస్తున్న జయహో తెలంగాణ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు సినీనటి ప్రీతి నిగమ్ అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లో జరిగిన ‘త్యాగాల వీణ- జయహో తెలంగాణ’ సినిమా షూటింగ్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన డీఎస్పీ నళిని పాత్రలో తాను నటించడం ఆనందంగా ఉందన్నారు. పముఖ దర్శకుడు ఎం.రవికుమార్ మొదటిసారిగా చిత్రీకరించిన ‘చాకలి అయిలమ్మ’ సినిమాలో వీరనారి అయిలమ్మ పాత్రలో తాను నటించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కవులు, కళాకారులు, నటీనటులకు కొదవ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారిని ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నటీనటులతో ఈ ప్రాంతంలోనే రూపుదిద్దుకుంటున్న సినిమాలను తెలంగాణ ప్రజలు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రస్తుత తరుణంలో భావి తరాలకు రాష్ట్ర చరిత్రను తెలియజేసేందుకు ఇటువంటి సినిమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆమె వెంట సినీ దర్శకుడు ఎం.రవికుమార్, నిర్మాత సతీష్‌బాబు, నటులు శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.