రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమంలో పాల్గొనాలి
రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమంలో పాల్గొనాలి
Published Thu, Sep 29 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
హుజూర్‌నగర్ : రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పాలక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొబ్బా భాగ్యరెడ్డి అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆ«ధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 16వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా దీక్షలలో కూర్చున్న వారికి ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చాజిల్లా కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి,పట్టణ అధ్యక్షుడు తూముల శ్రీను, శీలంనాగరాజు, కస్తాలరామకృష్ణ, ప్రతాప్, రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల మానవహారం...
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ గురువారం రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో స్థానిక పలు విద్యాసంస్థల విద్యార్థులు మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులుఎండి.అజీజ్‌పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతిర్యాల నాగయ్య, బాచిమంచి గిరిబాబు, కస్తాలముత్తయ్య, కస్తాలశ్రావ ణ్‌కుమార్, ఇట్టిమళ్లబెంజిమన్, మందావెంకటేశ్వర్లు, బరిగెలచంద్రశేఖర్, నందిగామ ముక్కంటి, రెడపంగు వెంకటేశ్వర్లు, దాసరి పున్నయ్య,దేవభిక్షం, నరేందర్, సైదులు, మట్టయ్య, దావీద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement