movement
-
19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు
న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబరు 29) దేశ చరిత్రలో ఒక విషాద సంఘటన నమోదైంది. 19 ఏళ్ల క్రితం ఇదేరోజున ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లు దీపావళి ఆనందాన్ని హరింపజేశాయి. అక్టోబర్ సాధారణంగా ఢిల్లీలో పండుగల సీజన్. మొదట రామలీల ప్రదర్శనలు తరువాత దసరా కోలాహలం ఇది ముగిసిన వెంటనే ధన్తేరస్ షాపింగ్, దీపావళి, చివరిగా గోవర్ధన పూజ, భయ్యా దూజ్... ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పండుగలు వస్తూనే ఉంటాయి. ఈ నేపధ్యంలో మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి నెలకొంటుంది.2005 అక్టోబరు 29న ధన్‌తేరాస్ నాడు ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉండే మార్కెట్లలో జరిగిన ఈ పేలుళ్లలో 60 మంది మరణించగా, 200 మందికి పైగా జనం గాయపడ్డారు. నాడు ఢిల్లీలోని సరోజినీ నగర్, పహర్‌గంజ్, కల్కాజీ ప్రాంతాల్లోని మూడు చోట్ల డీటీసీ బస్సుల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో చాలా మంది అయినవారిని కోల్పోయారు. నేటికీ సరోజినీ నగర్ మార్కెట్లోని దుకాణదారుల నాటి ఘటనను గుర్తుకు తెచ్చుకుని భయపడుతుంటారు.30 ఏళ్లుగా సరోజినీ నగర్ మార్కెట్లో దీపావళి వస్తువులు విక్రయిస్తున్న ఓ దుకాణదారుడు నాటి రోజును గుర్తు చేసుకుంటూ మీడియాతో మాట్లాడారు. నేటికీ నాటి భయానక దృశ్యం కళ్ల ముందు మెదులుతోందని, ఆరోజు ధన్తేరస్ రోజు కావడంతో మార్కెట్ అంతా కొనుగోలుదారులతో నిండివుందన్నారు. పేలుడు సంభవించినప్పుడు తాను ఘటనా స్థలానికి సమీపంలోని తన కొవ్వొత్తుల దుకాణంలో ఉన్నానని, అకస్మాత్తుగా భారీ పేలుగు శబ్ధం వచ్చి, అంతటా చీకటి అలుముకుందన్నారు. తొలుత తాను దుకాణంలో అమర్చిన బల్బు పేలివుంటుందని భావించానని తెలిపారు. అయితే ఆ పేలుడులో తన తలకు బలమైన గాయమైందని, స్పృహలోకి వచ్చేసరికి అక్కడ కుప్పలుగా పడి ఉన్న మృతదేహాలను చూసి భయపడ్డానన్నారు. బాంబు పేలుడు సంభవించిన దుకాణం యజమాని మృతదేహం రెండు భాగాలుగా విడిపోయి కనిపించిందన్నారు. నాటి ఘటనతో పలువురు సజీవదహనమయ్యారని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
అణచివేతపై భగ్గుమన్న స్టీల్‌ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ఉద్యమంపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై కార్మిక లోకం భగ్గుమంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనకు కార్మికులు పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు చూస్తున్నాం. పోలీసులు అనుమతి తీసుకున్న తర్వాత ధర్నా చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఉద్యమకారులకు దువ్వాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నడు నోటీసులు ఇవ్వలేదన్న కార్మికులు.. ప్రభుత్వం మారితే రూల్స్ మారుతాయా అంటూ పోలీసులను కార్మికులను ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యమానికి పూర్తిగా సహకరించింది. స్టీల్ ప్లాంట్స్‌ను కాపాడుతామన్న చంద్రబాబు పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకోవాలన్నారు.రాస్తారోకోకు అనుమతి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన కార్మికులు.. అవసరమైతే అరెస్టు చేసుకోవాలన్నారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. పోలీసుల నోటీసులు లెక్కచేయకుండా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలు అరెస్ట్ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పెద్దల సూచనతో కార్మికుల రాస్తారోకోను పోలీసులు నిరీర్వర్యం చేశారు. కార్మికులను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున సీఐఎస్ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు పవన్ కల్యాణ్ నిలబెట్టుకోలేదని కార్మికులు మండిపడుతున్నారు. 3 నెలలు సమయం ఇచ్చిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారి కృషి చేయలేదు. అమరావతిపై చూపిస్తున్న శ్రద్ధను స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చూపించలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రగులుతున్న క్యాంపస్‌లు!
గాజాలో ఇజ్రాయెల్ అమానుష హత్యాకాండ మొదలైనప్పటినుంచీ అమెరికన్ విద్యాసంస్థల్లో అలుముకున్న అశాంతి ఈ వారం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. వియత్నాంను వల్లకాడు చేస్తున్న అమెరికా సైనిక దురాక్రమణకు వ్యతిరేకంగా 1968లో తిరుగుబాటు జెండా ఎగరేసిన విద్యార్థుల పోరాటాన్నీ, 1980ల్లో దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం నెల్సన్ మండేలాను దీర్ఘకాలం చెరసాలలో బంధించటాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమాలనూ గుర్తుచేస్తున్నాయి. అప్పటిమాదిరే ఈ ఉద్యమాలు అట్లాంటిక్ మహా సముద్రం ఆవలితీరాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లకు సైతం విస్తరించాయి.ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రమేకాదు... పశ్చిమాసియాలోని బీరూట్, కువైట్, లెబనాన్, ట్యునీ సియా యూనివర్సిటీలు కూడా రగులుతున్నాయి. లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు ఎవరినీ భయపెట్టడం లేదు. వేలాదిమంది విద్యార్థులను అరెస్టుచేస్తూ ఉద్యమాలను చల్లార్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా సాగటం లేదు. వీటి తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా తన క్యాంపస్‌లను ప్రస్తుతం పోలీసు శిబిరాలుగా మార్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200మంది పౌరులను కాల్చిచంపి, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉదంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర పాలస్తీనా కోసం సాగుతున్న ఉద్యమాలను ఇలాంటి దుందుడుకు చర్యలు బలహీనపరుస్తాయని హెచ్చరించారు. దాన్ని సాకుగా తీసుకుని ఇజ్రాయెల్ గత ఆర్నెల్లుగా సాగిస్తున్న మారణహోమం తక్కువేమీ కాదు. ఇంతవరకూ 35,000మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల్లో మరణించారని చెబుతున్నారు.ఇందులో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. చివరికి బాంబుదాడుల్లో శిథిలమైన జనావా సాల్లో బాధితులకు అండగా నిలబడుతున్న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చిచంపుతూ పాలస్తీనా పౌరులకు బాసటగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చేవారిని భయభ్రాంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క అనేకమంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టా మని చెప్పుకుంటోంది. ఇజ్రాయెల్‌కు ఎడాపెడా మారణాయుధాలు సరఫరా చేస్తూ, భద్రతామండలి వంటి అంతర్జా తీయ వేదికలపై అది సాగిస్తున్న నరమేథాన్ని నిలువరించే అన్ని రకాల ప్రయత్నాలకూ మోకా లడ్డుతూ మద్దతుగా నిలబడుతున్న అమెరికా అప్పుడప్పుడు కోమానుంచి నిద్రలేచిన రోగి మాదిరిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇది సబబేనా? నిరాయుధ సాధారణ పౌరులను కాల్చిచంపటం ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తూ ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలే విశ్వవిద్యాలయాల విద్యా ర్థులను కలవరపరిచాయి. తాము మూగసాక్షులుగా మిగిలిపోలేమంటూ ఆ విద్యార్థులు గొంతెత్తటం వెనకున్న నేపథ్యం ఇదే. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెలస్ (యూసీఎల్ఏ), కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వగైరా ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు నినాదాలతో మార్మోగుతున్నాయి. పేరెన్నికగన్న హార్వర్డ్, బర్క్లీ, యేల్ వర్సిటీలు సైతం రణక్షేత్రాలయ్యాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాల యాలు సాధారణమైనవి కాదు. పేరెన్నికగన్న ప్రపంచశ్రేణి సంస్థలు. ఉదాహరణకు యూసీఎల్ఏ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలను తయారుచేసింది. ఆ సంస్థనుంచి ఇంతవరకూ 15 మంది మెక్ఆర్థర్ ఫెలోషిప్లను అందుకున్నారు. అసాధారణ ప్రతిభాపాటవాలున్నవారికి ఈ ఫెలోషిప్‌లు ఇస్తారు. ఇక్కడి పట్టభద్రుల్లో క్రీడల్లో రాణించి ఒలింపిక్స్‌లో పతకాలు అందుకున్నవారెందరో! ఎన్నో దేశాలు అందుకునే పతకాల సంఖ్యతో పోలిస్తే ఈ యూనివర్సిటీ పట్టభద్రులు సాధించే పతకాలే ఎక్కువంటారు. ఇలాంటిచోట చదువుకునే పిల్లలు సమాజ పరిణామాలపట్ల ఇంతగా కలవరపడటం బహుశా మన దేశంలో చాలామందిని ఆశ్చర్యపరిచి వుండొచ్చు. విద్యార్థి ఉద్యమ కేంద్రాలుగా ముద్రపడిన ఢిల్లీలోని జేఎన్‌యూ, జమియా మిలియా, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సి టీలను ఛీత్కరించటం అలవాటు చేసుకున్న మర్యాదస్తులకు ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాల వర్త మాన పోకడలు మింగుడుపడకపోవచ్చు. అయోమయానికి గురిచేయవచ్చు. కానీ అమెరికా తదితర దేశాల విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఎప్పుడూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇప్పుడు సాగుతున్న విద్యార్థి ఉద్యమాలతో ప్రొఫెసర్లు సైతం గొంతు కలపటం, అరెస్టుకావటం యాదృచ్ఛికం కాదు. ఈ నిరసనలను యూదు వ్యతిరేక ఆందోళనలుగా చిత్రించి అధికారుల, రిపబ్లి కన్ పార్టీ శ్రేణుల ప్రాపకంతో పోటీ ఉద్యమాలను నిర్వహిస్తున్న విద్యార్థులు లేక పోలేదు. పాలస్తీనా సంఘీభావ ఉద్యమకారులపై వారు దాడులకు కూడా వెనకాడటం లేదు. ఇది విచారకరం.పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని భ్రమపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ధోరణిని విరమించుకోవాలి. తన ఆయుధ పరిశ్రమ లాభార్జనకు తోడ్పడుతున్నా యన్న ఏకైక కారణంతో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తదితర దేశాలకు అమెరికా భారీగా సైనిక సాయం అందించటం అనైతికం, అమానుషం. విద్యార్థి ఉద్యమాలు పంపుతున్న సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ప్రపంచశాంతికి దోహదపడటం అగ్రరాజ్యంగా తన బాధ్యతని ఇప్పటికైనా ఆ దేశం గుర్తించాలి. లేకుంటే మున్ముందు ఈ ఉద్యమాలు మరింత విస్తరిస్తాయి. -
ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు
ఆఖరుకు రాజకీయాలు అలా తయారయ్యాయి.. ప్రజలు.. కార్మికులు.. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాల్సిన ఉద్యమ పార్టీలు డబ్బుకు అమ్ముడుపోయాయి. రాష్ట్రంలో లేని కారణాలు సృష్టించి.. ఉద్యోగుల్లోనూ, అంగన్ వాడీల్లోనూ లేని అసంతృప్తిని రేకెత్తించి వాళ్లను ఉద్యమాలవైపు నడిపిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో కార్మిక.. ఉద్యోగ.. విద్యార్ధివర్గాల్లో అసంతృప్తి ఉందన్న భావనను విస్తృతం చేయడం.. ప్రభుత్వ వ్యతిరేకతను మరింత రాజేయడం వారి లక్ష్యం. అయితే ఇదంతా ఊరకనే చేయరు.. అటు ప్రతిపక్ష తెలుగుదేశానికి లబ్ది చేకూర్చడానికి వారు ఎన్నికల్లో గెలవడానికి తమవంతు పాత్ర పోషించే క్రమంలో ఫీజు తీసుకుని ఇలా ఉద్యమాలు చేస్తుంటారు అన్నమాట. అన్ని వర్గాల ప్రజలకు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందుతుండడంతో వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. వారినుంచి ఎలాంటి అసంతృప్తి లేదు. ఉద్యోగుల్లో అంగన్ వాడీలు.. ఇంకా ప్రభుత్వ సిబ్బందికి సైతం ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. మరి అలాంటపుడు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం తెలుగుదేశం వల్లకాదని అర్థం చేసుకున్న ఆ పార్టీ పెద్దలు.. నేరుగా ఉద్యమపార్టీలను లైన్లో పెట్టారని విశ్వసనీయ సమాచారం. ఇందుకుగాను వారికి కోట్లకు కోట్లు ప్రతిపక్ష టీడీపీ ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ డబ్బును జిల్లాల యూనిట్ల బాధ్యులకు కాస్త పంపించి ఉద్యమాలకు ఉసిగొల్పుతున్నట్లు తెలిసింది. అందుకే కారణం లేకుండానే అంగన్ వాడీలు సైతం ఆందోళనలకు దిగారు. వారికి గతంలో ఎన్నడూ లేనంత ప్రోత్సాహాన్ని సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న జీతాలను జగన్మోహన్రెడ్డి పెంచి.. వారికి ఉద్యోగభద్రత కల్పించడమే కాకుండా పదోన్నతుల్లో వారికి మరిన్ని వెసులుబాట్లు ఇచ్చారు. అయినా సరే అకస్మాత్తుగా వారు సమ్మెకు దిగారు. గతంలో జగన్‌కు క్షీరాభిషేకాలు చేసినవాళ్లే ఇప్పుడు ఇలా ప్రవర్తించడాన్ని సందేహిస్తున్న వారికి అసలు కారణం తెలుస్తోంది. వాస్తవానికి 2014-19 మధ్య అంగన్ వాడీలు.. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు పెద్దగా చేసిందేమి లేదు కానీ ఆనాడు ఉద్యమాలు పెద్దగా చేసింది లేదు. అంటే అప్పుడు మిన్నకుండడానికి సైతం పేమెంట్ ముట్టిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇన్నేళ్లు ఊరుకున్న ఉద్యోగులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోడ్లెక్కడం వెనుక ఆ పార్టీల పెద్దల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయన్నది అవగతం అవుతున్నది. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు ఏమీ చేయకపోయినా పల్లెత్తుమాట అనలేదు కదా చంద్రబాబుని.. పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు మాత్రం.. ఉపాధ్యాయ.. విద్యార్ధి.. ఇతర ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి వారి ఖర్చులు.. ధర్నాల టెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ ఆందోళనలు చేయిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. -- సిమ్మాదిరప్పన్న చదవండి: ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు -
బీఆర్ఎస్లోకి గాయకుడు ఏపూరి సోమన్న
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ గాయకుడు, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రగతిభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలిశారు. ఉద్యమంలో కలసి పనిచేసిన రీతిలోనే బీఆర్ఎస్ వెంట నిలిచేందుకు సోమన్న సుముఖత వ్యక్తం చేయగా.. కేటీఆర్ స్వాగతించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో సోమన్న గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. కేటీఆర్ తనను పార్టీలోకి స్వాగతించారని, కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని హామీ ఇచ్చారని ఏపూరి సోమన్న ‘సాక్షి’కి వెల్లడించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ఉద్యమంలో భాగమైన తరహాలోనే అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సాయిచంద్ లేని లోటు పూడ్చేందుకే? బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగానికి వెన్నెముకగా పనిచేసిన కవి, గాయకుడు సాయిచంద్ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సభలు, సమావేశాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలను సాయిచంద్ ముందుండి నడిపించేవారు. ఆయన లేని లోటును పూడ్చేందుకు.. జనాలను ఆకట్టుకునే శక్తి ఉన్నందుకే సోమన్నను చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మొగ్గు చూపినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార సభల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు సోమన్న నేతృత్వం వహించే అవకాశం ఉందని అంటున్నాయి. బీఆర్ఎస్లోకి బీజేపీ హైదరాబాద్ నేతలు బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, కార్పొ రేటర్‌గా పనిచేసిన వెంకట్‌రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్ పద్మ శుక్రవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు హామీలు గుర్తొస్తాయి: బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/తొర్రూరు: ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీలు గుర్తుకొస్తాయని, మోసాలు చేయడంలో ఆయన పీహెచ్డీ పూర్తయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘రైతుగోస– బీజేపీ భరోసా’సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఉద్యమాల గడ్డ మాత్రమే కాక కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ పాస్‌పోర్టులు చేసిన దుబాయ్ శేఖర్ అని, ఆయన కొడుకు పేరు అజయ్‌రావు అయితే టికెట్ కోసం ఎన్టీఆర్ మెప్పు పొందడానికి తారక రామారావు అనే పేరు పెట్టాడని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ముందుకొస్తున్నాయన్నారు. అప్పుల రాష్ట్రం ధనిక రాష్ట్రం కావాలన్నా, ప్రజల బాధలు పోవాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పారు. కాగా ఖమ్మం వెళుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సంజయ్ కొద్దిసేపు ఆగారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ నాయకుడు అలిసేరి రవిబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ కంటే కేసీఆరే డేంజర్ అని వ్యాఖ్యానించారు. హామీలను విస్మరిస్తూ ప్రజలను నట్టేట ముంచిన బీఆర్ఎస్కు ఓటేయవద్దని, సామాన్యుల కోసం కొట్లాడుతున్న బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ చేతల ప్రభుత్వం కాదు: ఈటల బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుంది తప్ప చేతల ప్రభుత్వం కాదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికలు వస్తుండడంతో రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కొత్త మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తరుగు లేకుండా ధాన్యం కొంటామని, రైతుల హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
ప్రిగోజిన్ మృతిపై క్రెమ్లిన్ రియాక్షన్..
వాగ్నర్ చీఫ్, తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్‌ను రష్యానే హతమార్చిందని పశ్చిన దేశాల నాయకుల ఆరోపణలపై తాజాగా క్రెమ్లిన్ స్పందించింది. అదంతా పచ్చి అబద్దం అని తెలిపింది. ప్రిగోజిన్ ఖచ్చితంగా చనిపోయాడనే విషయాన్ని తెలపడానికి నిరాకరిచింది. దర్యాప్తు పరీక్షల ఫలితాలు రావాలని స్పష్టం చేసింది. అటు.. ప్రైవేటు విమానం ప్రమాదానికి గురైన సమయంలో వాగ్నర్ చీఫ్ అందులోనే ఉన్నారని రష్యా విమానయాన అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొంది. విమాన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుభూతి తెలిపారు. ప్రిగోజిన్, ఆయన సహచరులను పొగుడుతూనే.. కొన్ని తప్పులు కూడా చేశారని అన్నారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మరణంపై పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసినందుకు ప్రతీకారంతోనే అతన్ని అంతం చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని అన్నారు. దర్యాప్తులోనే అసలైన నిజాలు బయటకొస్తాయని చెప్పారు. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలి
గచ్చిబౌలి: తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో 82వ వర్ధంతిని పురస్కరించుకొని కేంద్ర మాజీ మంత్రి డాక్డర్ మల్లిఖార్జున్ గౌడ్ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ సేఫ్ గార్డ్స్ అనే నినాదంతో మల్లిఖార్జున్ గౌడ్ విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడని గుర్తు చేశారు. ఆ ఉద్యమమే తెలంగాణ ఉద్యమంగా మారిందని మర్రి చెన్నారెడ్డి, వెంకట స్వామి, మదన్ మోహన్, మల్లిఖార్జున్ గౌడ్లు తొలిదశ ఉద్యమకారులని ఆయన పేర్కొన్నారు. వారి పేర్లను తెలంగాణ చరిత్రలో ఎక్కించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్ర అంటె ఉద్యమాలు, ఉద్యోగులు, బలిదానాలని తెలంగాణ చరిత్ర దాన్ని ప్రతిభింభించే విధంగా ఉండాలన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణరావాలని ఉద్రేకంగా మాట్లాడిన వారిలో వెంకట స్వామితో పాటు మల్లిఖార్జున్ గౌడ్ ఉన్నారని తెలిపారు. రక్షణ, రైల్వే మంత్రిగా పని చేసిన ఆయన మంచికి మారు పేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ప్రోత్సహించిన నేతగా అయన అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
''మాకు పెళ్లి అవసరం లేదు'' అనుకునేవారు ఇది చదవాల్సిందే..
దమ్మారో ధం... జీనత్ అమన్ నటించిన హరే రామ హరే కృష్ణ సినిమా లోని పాట. హిప్పీలు గంజాయి కొడుతూ ఎంజాయ్ చేసే సీన్ ఇది. వాసిరెడ్డి సీత రచించిన మారీచిక నవలను, కొంతకాలం ఆనాటి ప్రభుత్వం నిషేధించింది.ఇందులో ఒక అమ్మాయి హిప్పీగా మారిపోతుంది.. మరో అమ్మాయి నక్సల్స్‌లో చేరిపోతుంది. కోర్టు ఆదేశాల మేర ఆ నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. అప్పుడు ఆ నవలను చదివాను. అసలే చిన్న వయసు. రెండు రోజులు పిచ్చెక్కిపోయింది.హిప్పీ ఉద్యమం..1965లో అమెరికాలో మొదలయ్యింది. 1970 కల్లా ప్రపంచంలోని అనేక దేశాలకు పాకింది. సమాజం ధోరణి నచ్చని యువత చేసిన ఒక రకమయిన తిరుగుబాటు ఇది. తిరుగుబాటు అనడం కన్నా దారి తప్పిన పెడధోరణి అనడం సబబు. పొడవాటి చింపిరి జుట్టు .. బెల్ బాటమ్ పాంట్స్ .. ఇల్లు వదలి పెట్టి తనలాంటి తిక్క సన్నాసులతో చేరి గ్రూప్ లు గ్రూప్ లుగా దిమ్మరిలా ఊరూరా తిరగడం. నీది నాది అనేది లేదు. అంతా మనదే అనే ఫిలాసఫీ. సామూహిక జీవనం, నచ్చిన వారితో సెక్స్, మాదక ద్రవ్యాలు... 1970లలో తెగ నడిచింది. అప్పట్లో ఓ ట్రెండ్ అయ్యింది. గోవాలో అయితే ఆరంభోల్ బీచ్ అంతా వీరే ఉండేవారట. వీరు తయారు చేసిన వస్తువుల అమ్మకం కోసం అంజునా మార్కెట్ ఉండేది. ఇక భవిషత్తు అంతా ఇలాగే ఉంటుంది అని అప్పట్లో మేధావుల అంచనా. ఏమయ్యింది? 1980 వచ్చేటప్పటికి హిప్పీ ఉద్యమం మాయమయింది. ఆ నాటి హిప్పీ హీరోలు హీరోయిన్లు మాయమయిపోయారు. మాదక ద్రవ్యాలు తిని అప్పుడే ఎంతో మంది పోయారు. ఎవరైనా బతికున్నా వృద్ధాప్యంతో పోయుంటారు. యాభై ఏళ్ళ నాడు వారు 25 ప్లస్ వయసు వారు.. అంటే ఇప్పుడు 75 ప్లస్. ఏ వెర్రి అయినా కొంత కాలం ట్రెండింగ్ కావొచ్చు. కానీ అదే భవిషత్తు కాదు. ఇక పై పెళ్లిళ్లు వుండవు .. కుటుంబాలు ఉండవు అనుకొనే వారు ఈ నిజాన్ని గమనించాలి.ఆ నాటి హిప్పీలు శారీరక సమస్యలు, వివిధ రోగాలతో పోయారు. నేటి వివాహ కుటుంబ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన కొత్త తరం హిప్పీలు మానసిక రోగాలతో పోతారు. ప్రకృతి అనేది ఒకటుంటుంది. అన్ని విషయాలను అది చూసుకొంటుంది. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. సొంత అనుభవంతో ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనుకునే వాడు వెబ్ పేజీలలో కేసు స్టడీ కీర్తి శేషుడిగా మిగిలిపోతాడు. మిగతా వారి అనుభవం నుంచి నేర్చుకొనేవాడు తెలివయినవాడు. బతకడం తెలిచినవాడు. మీరు కేస్ స్టడీ అవుతారా? తెలివిగా బతుకుతారా? తేల్చుకోండివాసిరెడ్డి అమర్ నాథ్మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
దిద్దుబాటు కొనసాగొచ్చు.. మార్కెట్ గమనంపై నిపుణుల అంచనాలు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరెక్షన్ పరిమితంగా ఉంటూ.., తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందంటున్నారు. బక్రిద్ సందర్భంగా బుధవారం సెలవు కావడంతో నాలుగురోజులే ట్రేడింగ్ జరుగుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు ముగింపు గురువారం ఉంది. గతవారం(జూన్ 22న) మొదలైన విప్రో రూ.12,000 బైబ్యాక్ ఇష్యూ గురువారమే ముగియనుంది. ఇదే వారంలో చిన్న, మధ్య తరహా కంపెనీలతో మొత్తం ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అంతర్జాతీయంగా రష్యాలో అంతర్యుద్ధ పరిణామాలు, ఈసీబీ ఫోరమ్ నిర్వహించే సమావేశంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. వీటితో పాటు రుతుపవనాల వార్తలు, ఎఫ్ఐఐల పెట్టుబడులు, రూపాయి విలువ కీలకం కానున్నాయి. ‘‘మార్కెట్ స్థిరీకరణలో భాగంగా అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చు. దేశీయంగా బలమైన స్థూల ఆర్థిక డేటా నమోదు, కమోడిటీ ధరలు దిగిరావడం తదితర సానుకూలాంశాల ప్రభావంతో దిద్దుబాటు పెద్దగా ఉండకపోవచ్చు. దిద్దుబాటు కొనసాగితే నిఫ్టీకి దిగువున 18,600–18,650 శ్రేణిలో తక్షణ మద్దతు స్థాయి కలిగి ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 18,750 స్థాయిని చేధించాల్సి ఉంటుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్రితం వారం సెన్సెక్స్ 405 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ప్రపంచ పరిణామాలు... రష్యాలో తిరుగుబాటు పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పోర్చుగల్‌లోని సింట్రాలో కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ(2023)పై ఈసీబీ ఫోరం నిర్వహించే పాలసీ చర్చలో పాల్గొనున్నారు. అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ1 జీడీపీ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. అదే రోజున మే జపాన్ రిటైల్, వినిమయ విశ్వాస డేటా వెల్లడికానున్నాయి. ఈ వారంలో 7 ఐపీఓలు.. ఈ వారంలో ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. ఇడియాఫోర్జ్, సియెంట్ డీఎల్ఎమ్, పీకేహెచ్ వెంచర్స్‌తో మరో నాలుగు చిన్న, మధ్య తరహా కంపెనీలు మొత్తం రూ.1600 కోట్లు సమీకరించనున్నాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం(నేడు) ప్రారంభమై జూన్ 29(గురువారం) ముగుయనుంది. ధరల శ్రేణిని రూ.632–672గా ఉంది. మొత్తం రూ.576 కోట్లు సమీకరించనుంది. సైయంట్ డీఎల్ఎం ఐపీఓ మంగవారం(రేపు) ప్రారంభం కానుంది. శుక్రవారం(జూన్ 30న) ముగుస్తుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలైన కన్వేయర్ బెల్ట్ తయారీ సంస్థ పెంటగాన్ రబ్బర్(జూన్ 26 – 30), సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ సంస్థ(జూన్ 30 – జూలై 5), త్రివిద్య టెక్, సినోఫిట్స్ టెక్నాలజీ ఐపీఓలు రెండూ జూన్ 30న మొదలై.., జూలై అయిదున ముగియనున్నాయి. మూడు వారాల్లో రూ.30,600 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐటు) భారత ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఈ జూన్‌లో ఇప్పటివరకు వారు రూ. 36,600 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ఆర్థికవ్యవస్థ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, కార్పొరేట్ రంగం ఆదాయం పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ‘‘ఎఫ్ఐఐల పెట్టుడబడులు రానున్న రోజుల్లో నెమ్మదించవచ్చు. అమెరికా ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం కంటే దిగువకు చేర్చేందుకు మరింత వడ్డీ పెంపు అవసరమని భావిస్తుంది. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా వహించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. -
International Yoga Day: భారతీయులకు ప్రధాని వీడియో సందేశం
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ సందేశంలో భారతీయులు కొత్తదనాన్ని స్వాగతించడంలోనూ, సాంప్రదాయాలను కాపాడుకోవటంలోనూ గొప్ప స్ఫూర్తిని కనబరిచారని అన్నారు. ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి ఆహ్వానం మేరకు అమెరికా పయనమైన భారత ప్రధాని ప్రపంచ యోగా దినోత్సవం రోజును పురస్కరించుకుని భారత ప్రజానీకానికి ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మానవ సంబంధాలను మెరుగుపరచి ఐక్యతను పెంపొందించే యోగా వంటి సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం. యోగా మనలోని అంతర్గత ద్దృష్టిని మెరుగుపరచి మనలోని ఐక్యత పెరిగే లా చేస్తుందని దీని ద్వారా వైరుధ్యాలను చెరిపేసి, అడ్డులన్నిటినీ అధిగమించి, ఆటంకాలను తొలగించుకోవచ్చని, మనమంతా కలిసి "ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్" స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని ఆయన అన్నారు. ఆర్కటిక్, అంటార్కటిక్ ప్రాంతాల్లోని పరిశోధకులు కూడా యోగా దినోత్సవాల్లో పాల్గొంటున్నారని, "మహాసముద్రాల వలయంగా యోగా" నిర్వహిస్తున్నందున ఈ ఏడాది యోగా దినోత్సవం చాలా ప్రత్యేకమైనదిగా వర్ణించారు. భారత దేశంలోని కోట్లాది ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేకమంది యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవడంతో యోగా కీర్తి దశదిశలూ వ్యాప్తి చెందుతోందని ఆయనన్నారు. #WATCH | At around 5:30 pm IST, I will participate in the Yoga program which is being organised at the headquarters of the United Nations. The coming together of more than 180 countries on India's call is historic. When the proposal for Yoga Day came to the United Nations General… pic.twitter.com/oHeehPkuZe — ANI (@ANI) June 21, 2023 అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: నేను మోదీ అభిమానిని: ఎలన్ మస్క్ -
రుతుపవనాల్లో కదలిక
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల్లో ఎట్టకేలకు కదలిక వస్తోంది. వారం రోజుల కిందట ఈ రుతుపవనాలు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి సకాలంలోనే ప్రవేశించాయి. తర్వాత అవి ఊహించిన దానికంటే నెమ్మదిగా కదులుతున్నాయి. గురువారం నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. ఒకటి, రెండురోజుల్లో ఈ రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతాల్లోని కొన్ని ప్రాంతాలకు, అనంతరం మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి వెల్లడించింది. ఐఎండీ ముందుగా అంచనా వేసినట్టుగా జూన్ 4వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు మెరుగుపడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న మూడురోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బుధవారం కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. రానున్న మూడురోజులు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి, రెండుచోట్ల పిడుగులు పడొచ్చని వివరించింది. -
జీవన చలనం
చలనం ఉండాలి; మనకు చలనం అన్నది కావాలి. చలనంతో మనం సాగుతూ ఉండాలి. మనలోని రక్తంలో చలనం లేకపోతే మనం ఉండం. మన రక్తంలో ఉన్న చలనం మన తీరులోనూ ఉండాలి. చలనం లేకుండా ఆగిపోయిన నీరు బురద అయిపోతుంది. చలనం లేకపోతే ఎవరి జీవనం అయినా ఎందుకూ పనికి రాకుండా పోవడమే కాదు హానికరం అయిపోతుంది కూడా. చలనం పరంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మనకు తొలిపాఠాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల చలనం లేకపోతే మనం మనకే చెందం కదా? శ్వాసకు చలనం ఉండడంవల్లే మనం బతుకుతూ ఉన్నాం; మనకు ఉన్నవి ఉండడానికి కారణం శ్వాసకు చలనం ఉండడమే. మనం చలనంతో ఉండాలి అన్న ఆలోచన శ్వాసలాగా మనకు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. మనిషికి ప్రధానమైన వ్యాధి స్తబ్దత. ఈ స్తబ్దతకు వైద్యం, విరుగుడు చలనం. అడుగు వేస్తే పడిపోతాం అనుకుని స్తబ్దతలో ఉండిపోవడం సరికాదు. భద్రత కోసం అనో, జరిగిపోతోంది కదా అనో స్తబ్దతలో, స్తబ్దతతో ఉండిపోవడం పెనుదోషం. ఆ దోషం ముదిరితే అది పాపంగా కూడా పరిణమిస్తుంది. ‘జీవితం వెనక్కు వెళ్లదు; అది నిన్నటితో ఉండిపోదు’ అని కవి–తాత్త్వికుడు ఖలీల్ జిబ్రాన్ ఒక సందర్భంలో అంటారు. చలనం అన్నది ఉంటుంది, ఉండాలి కాబట్టి ఆయన అలా అన్నారు. చలనం లేకుండా స్తబ్దతలో ఉండిపోతే జీవితం వెనక్కు, ఆ వెనక్కు పడిపోతుంది, జీవితం నిన్నటితో ఉండిపోవడం కాదు మొన్నటికీ, అటు మొన్నటికీ జారిపోతుంది. జీవితం నుంచి జీవనం జారిపోకూడదు; జీవనానికి జీవితం లేకుండా పోకూడదు. అందుకు స్తబ్దత కాదు చలనం కావాలి; చలనం ఉండాలి. సేద తీరచ్చు కానీ స్తబ్దతలో ఉండిపోకూడదు. అలిసిపోవడం సహజమైందే కానీ బిగుసుకుపోవడం అసహజమైంది. స్తబ్దతకు మలిదశ బిగుసుకుపోవడం. స్తబ్దత, బిగుసుకుపోవడం మనుగడలో ఉన్న మనిషి లక్షణాలు కావు, కాకూడదు. మరణించిన వ్యక్తి లక్షణాలు స్తబ్దత, బిగుసుకుపోవడం. మరణించాక తప్పనిసరిగా వచ్చేవి అవి. కాబట్టి మరణం రానంత వరకూ అవి మన దగ్గరకు రాకూడదు. మనుగడ ఉన్నంతవరకూ మనం వాటిని రానివ్వకూడదు. స్తబ్దత కారణంగా మనుగడలో ఉన్న మనం మరణించిన వ్యక్తులంలాగా మారిపోకూడదు. మరణించాక కూడా జీవించి ఉండేందుకు మనం చలనాన్ని ఒంటపట్టించుకోవాలి. మెరుపు మెరుపయింది చలనం వల్లే. గాలికి చలనం లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మేఘాలకు, భూమికి చలనం అన్నది లేకపోతే మనకు ఉండేది ఏమిటి? మనకు మనగడే ఉండదు. చలనం అన్నది లేకపోతే మనం ప్రపంచానికి ఉండం; మనకు ప్రపంచం ఉండదు. చలనం లేకపోతే గమనం ఉంటుందా? ఉండదు. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. జీవితానికి జీవనం ఉన్నప్పుడు జీవనానికి చలనం ఉండాలి. స్తబ్దతలో మనల్ని మనం మోసుకుంటూ ఉండిపోవడం జీవనం కాదు; స్తబ్దతతో మనం మనకే బరువైపోవడం జీవితం కాదు. చలనం ఇంధనం కాగా జీవితం పండాలి. జీవితానికి జ్వలనం కావాలంటే జీవనానికి చలనం కావాలి. నది నది అయ్యేది చలనం వల్లే. చలనమే లేకపోతే నది అన్నదే లేదు; నది లేకపోతే జరగాల్సిన మేలు జరగదు. చలనం వల్ల ఏం మేలు జరుగుతుందో, ఎంత మేలు జరుగుతుందో నది మనకు తెలియజెబుతునే ఉంది. నదిని మనం స్ఫుర్తిగానూ, ఆదర్శంగానూ తీసుకోవాలి. మనం చలనంతో నదిలాగా బతకాలి; బతుకే గెలుపై మనం మునుముందుకు నడుస్తూ ఉండాలి. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. – రోచిష్మాన్ -
త్రిపుర ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి కొత్త సవాల్!
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గ్రేటర్ టిప్రాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం వేడెక్కుతోంది. ఒకప్పుడు త్రిపురని ఏలిన మాణిక్య వంశానికి చెందిన ప్రద్యోత్ మాణిక్య డెబ్బార్మాన్కు చెందిన టిప్రా మోతా పార్టీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తున్న సంస్థలన్నీ కలిసి టిప్రా ఇండీజెనస్ ప్రోగ్రసివ్ రీజనల్ అలయెన్స్ (టిప్రా మోతా)గా ఏకతాటిపైకి వచ్చారు. ఇన్నాళ్లూ సామాజిక సంస్థగా ఉన్న ఈ కూటమి, రాజకీయ పార్టీగా రూపొంతరం చెందింది. అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన వారితోనే తాము పొత్తు పెట్టుకుంటామని ప్రద్యోత్ తేల్చి చెబుతూ అధికార బీజేపీకి సవాల్ విసురుతున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న గిరిజనులు, స్థానిక తెగల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకి మద్దతుగా ఉంటూ గత రెండేళ్లలోనే ఢిల్లీ వేదికగా ప్రద్యోత్ ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేశారు. గత వారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షాతో ప్రద్యోత్ నేతృత్వంలోని టిప్రా మోతా ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి చేసిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రద్యోత్ తాము ఒంటరిపోరాటానికి సిద్ధమై 35 నుంచి 40 సీట్లలో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం అంశం అత్యంత ప్రభావం చూపించబోతోంది. ఏమిటీ గ్రేటర్ టిప్రాల్యాండ్ ? 1949లో త్రిపురభారత దేశంలో విలీనం అవడానికి అంగీకరించింది. అప్పటికే తూర్పు బంగ్లాదేశ్ నుంచి త్రిపురలోకి భారీగా బెంగాలీల తాకిడి మొదలైంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధం సమయంలో కూడా బెంగాలీ శరణార్థులు భారీగా వచ్చి చేరారు. ఫలితంగా స్థానికంగా నివసించే గిరిజనులు మైనార్టీలో పడిపోయారు. 1881లో 63.77శాతం ఉండే గిరిజనుల జనాభా 2011 నాటికి 31.80శాతానికి పడిపోయింది. 2011 నాటి భాషాపరమైన జనాభా లెక్కల ప్రకారం త్రిపుర మొత్తం జనాభా 36.74 లక్షలైతే, వారిలో బెంగాలీ మాతృభాష కలిగిన వారి సంఖ్య ఏకంగా 24.14 లక్షలు. స్థానిక ఆదివాసీల మాతృభాష కొక్»ొరాక్ మాట్లాడేవారు 8.87 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే బయట నుంచి వలస వచి్చన బెంగాలీలే వీరి కంటే మూడు రెట్లు ఎక్కువ. దాంతో స్థానికంగా ఉండేవారి హక్కులు, సంస్కృతి సంప్రదాయాలు, భూమిపై హక్కులు ప్రమాదంలో పడ్డాయి. దాంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పుట్టింది. ఏయే ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం త్రిపురలో గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలన్నింటితో 1985లో త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డి్రస్టిక్ట్ కౌన్సిల్ (టీటీఏఏడీసీ) ఏర్పాటైంది. రాష్ట్ర వైశాల్యంలో మూడింట రెండువంతుల్లో విస్తరించింది. గిరిజన తెగల హక్కులు, సంస్కృతి కాపాడడం కోసం ఏర్పాటైన టీటీఏడీసీకి శాసన, కార్యనిర్వాహక అధికారాలున్నాయి. టీటీఏఏడీసీ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ ఉంది. ఎప్పట్నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్? 2000 సంవత్సరంలో ఏర్పాటైన ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) పార్టీ తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై గళమెత్తింది. రెండేళ్ల తర్వాత ఐపీఎఫ్టీ గిరిజనుల మరో పార్టీ త్రిపుర ఉపజాతి జ్యూబా సమితి(టీయూజేఎస్)లో విలీనమై నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా (ఐఎన్పీటీ)గా ఆవిర్భవించింది. వేర్పాటు వాద నాయకుడు బిజోయ్ కుమార్ హరంగ్ఖ్వల్ నేతృత్వం వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెద్దగా ముందుకు వెళ్లకపోవడంతో 2009లో ఎన్సీ డెబ్రామా ఆధ్వర్యంలో మళ్లీ ఐపీఎఫ్టీను పునరుద్ధరించారు. ˘ ఎన్నికల్లో ప్రభావం ఎంత? మొత్తం 60 శాసనసభ స్థానాలున్న రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఆశిస్తున్న ఆదివాసీలు 20 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలరు. ఇప్పటివరకు ఐపీఎఫ్టీయే ఈ నియోజకవర్గాల్లో అత్యంత కీలకంగా ఉంది. త్రిపురలో అద్భుతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వివిధ స్థానిక పార్టీలతో జత కలిసింది. దీంతో ఈ ప్రాంతంలోని 20 స్థానాలకు గాను బీజేపీ 10సీట్లు, ఐపీటీఎఫ్ 8 ,, సీపీఐ(ఎం) రెండు స్థానాల్లోనూ గెలుపొందింది. మాణిక్ సర్కార్ ఓటమికి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణంగా మారింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక రాష్ట్రం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన ఐపీటీఎఫ్ ఎన్నికల తర్వాత అధికార బీజేపీలో చేరింది. ఆ పార్టీ నాయకుడు ఎన్సీ డెబర్మా మంత్రిగా కూడా పని చేసి 2022 జనవరి 1న కన్నుమూశారు. గిరిజన హక్కుల మండలి (టీటీఏఏడీసీ)కి 2021 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టిప్రా మోతా పార్టీ 28 స్థానాల్లో పోటీ చేస్తే 18 నెగ్గింది. ప్రస్తుత అసెంబ్లీలో 36 స్థానాలతో ఉన్న అధికార బీజేపీ, 16 స్థానాలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్న సీపీఐ(ఎం) ఉంటే, ఐపీటీఎఫ్ ఎనిమిది స్థానాలను నెగ్గింది. టిప్రా మోతా ఒంటరిపోరాటానికి సిద్ధమై అధికార బీజేపీకి వణుకు పుట్టిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణకు మద్దతుగా గిరిజనుల ఉద్యమాలు...
-
మహోజ్వల భారతి ఉద్యమ రత్నం రాజాజీ
రాజాజీగా ప్రఖ్యాతి గాంచిన చక్రవర్తి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశ తొలి, చివరి గవర్నర్ జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు ఇది. ఆయన 1948 జూన్ 21న ఆ పదవిని చేపట్టి, 1950 జనవరి 26 వరకు కొనసాగారు. అక్కడితో గవర్నర్ జనరల్ పదవి రద్దయి, రాష్ట్రపతి హోదా మొదలైంది. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం కొన్ని దశాబ్దాల పాటు రాజాజీ భారత దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించారు. ప్రాథమికంగా ఆయన కాంగ్రెసువాది. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సోషలిస్టు విధానాల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజాజీ రాజకీయ ప్రస్థానం సేలం పట్టణం నుంచి ప్రారంభమైంది. 22 ఏళ్ల వయసులో జాతీయవాది బాలగంగాధర తిలక్ పట్ల ఆకర్షితుడయ్యారు. అప్పుడే సేలం పట్టణ మునిసిపాలిటీకి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. లాయర్ కూడా అయిన రాజాజీ 1908 లో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్య్ర పోరాట యోధుడి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించారు. జాతీయవాది వీఓ చిదంబరం పిళ్ళై, రాజాజీ మంచి స్నేహితులు. అనిబిసెంట్ కూడా రాజాజీని అభిమానించేవారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రోద్యమంలోకి ప్రవేశించినపుడు రాజాజీ ఆయన్ని అనుసరించారు. ఉద్యమం కోసం న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేశారు. 1921 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యారు. ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా కూడా వ్యవహరించాడు. 1930 లో తమిళనాడు కాంగ్రెస్‌లో నాయకుడయ్యారు. అదే సమయంలో మహాత్మాగాంధీ దండియాత్ర నిర్వహించినపుడు రాజాజీ నాగపట్టణం దగ్గర్లోని వేదారణ్యం అనే ప్రాంతంలో ఉప్పు పన్నును వ్యతిరేకించి జైలుకి వెళ్లారు. తరువాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో రాజాజీ ఒకరు. సేలం జిల్లా, తోరపల్లి గ్రామంలో 1878 డిసెంబరు 10 న జన్మించిన రాజాజీ, 1972 డిసెంబర్ 25న తన 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. (చదవండి: చైతన్య భారతి నెహ్రూ యోగా గురువు) -
జైహింద్ స్పెషల్: తెల్లవారిని తుపాకులతో కాల్చుట
జాతీయతా భావాలనే మనసావాచా నమ్మిన మేధోవర్గాన్నీ, ఉద్యమ సారథ్యాన్నీ ఇచ్చిన పరిణామం వందేమాతరం ఉద్యమం. ఆ ఉద్యమం తెలుగువారికి అందించిన మేధో సంపన్నుడు, పత్రికా రచయిత ముట్నూరి కృష్ణారావు. ఆయన సంపాదకీయాల సంకలనం ‘లోవెలుగులు’ ఆధునిక జాతీయతా చైతన్యానికి గీత వంటిది. జాతిలో ఆ పెను నిద్రను వదిలించడానికి ఆయన ‘కృష్ణాపత్రిక’ను సాధనంగా చేసుకున్నారు. 1902 ఫిబ్రవరి 1న మచిలీపట్నంలో ప్రారంభమైన ‘కృష్ణాపత్రిక’కు 1907లో బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం నుంచి తిరిగి వచ్చిన తరువాత ముట్నూరివారు సంపాదకులయ్యారు. కృష్ణాపత్రికలో ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న వ్యాసం ప్రచురించినందుకు నాలుగేళ్ల పాటు సంపాదకత్వానికి దూరంగా ఉన్నా, మళ్లీ వచ్చి కొన ఊపిరి వరకు పత్రికను నడిపించారు. చదవండి: జైహింద్ స్పెషల్: పెన్నులతో గన్నుల పైకి కాశీనాథుని నాగేశ్వరరావు 1908లో ఆంధ్రపత్రిక వారపత్రిక, 1914లో ఆంధ్రపత్రిక దినపత్రిక స్థాపించిన స్వాతంత్య్ర సమరయోధుడు. భారతీయ పత్రికా రంగ చరిత్రను చేర్చకుండా ఎలాగైతే భారత స్వాతంత్య్ర సమర చరిత్ర సంపూర్ణం కాదో, తెలుగుప్రాంతాలలో జరిగిన ఉద్యమ చరిత్ర పరిపూర్ణం కావాలంటే ఆంధ్రపత్రిక చరిత్రను అలాగ అధ్యయనం చేయాల్సిందే. స్వాతంత్య్ర పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన పత్రిక ఇది. స్వాతంత్య్ర సమరయోధులను ఎన్నో విధాలుగా ఆదుకున్న సంస్థ కూడా. గాడిచర్ల హరిసర్వోత్తమరావు బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో లాల్, పాల్, బాల్ ఇచ్చిన సందేశాలతో ఉత్తేజితుడైన గాడిచర్ల విద్యార్థి దశలోనే నేరుగా ఉద్యమంలో చేరారు. 1907లోనే బెజవాడ నుంచి ‘స్వరాజ్య’ వారపత్రికను ఆరంభించారు. పింగళి లక్ష్మీనారాయణ, బోడి నారాయణరావు ఆయనకు సహకరించారు. 1908లో గాడిచర్ల ‘విపరీత బుద్ధి’ పేరుతో సంపాదకీయం రాశారు. దానితో మూడేళ్లు కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో అరెస్టు చేసినప్పుడు ఆయనకు సంకెళ్లు వేసి బెజవాడ వీధుల నుంచి తీసుకువెళ్లారని చెబుతారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో జాతీయ భావాల వ్యాప్తికి శ్రమించిన ‘ఆంధ్రపత్రిక’ తొలి సంపాదకుడు గాడిచర్ల వారే. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీలో జైలుకు వెళ్లిన తొలి స్వాత్రంత్య సమరయోధుడూ ఆయనేనని కూడా అంటారు. వెల్లూరు కారాగారంలో ఆయన కఠోర అనుభవాలు చవిచూశారు. దత్తమండలాలుగా పేరొందిన ప్రాంతానికి రాయలసీమ పేరు ఇచ్చినది, ఎడిటర్ అన్న ఇంగ్లిష్ పదానికి సంపాదకుడు అన్న అనువాదాన్ని ఇచ్చిందీ గాడిచర్ల వారే. చిలకమర్తి లక్ష్మీనరసింహం బిపిన్ చంద్ర పాల్ 1907లో రాజమండ్రి వచ్చినప్పుడు వారి ఉపన్యాసాన్ని అనువదించినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం. గొప్ప కవి, నాటకకర్త, జాతీయవాది. ఆనాటి సభలో ఆశువుగా వినిపించినదే, ‘భరతఖండంబు చక్కని పాడియావు..’ పద్యం. 1906లో ఆయన రాజమండ్రిలో ‘మనోరమ’ పేరుతో పత్రిక స్థాపించారు. 1909లో ‘దేశమాత’ పత్రికను నెలకొల్పారు. మనోరమ సాహిత్యానికి పరిమితమైనా, దేశమాతను పేరుకు తగ్గట్టే వెలువరించారు. చిలకమర్తి బెంగాల్ సంఘ సంస్కర్తల జీవితాలను తన పత్రికల ద్వారా తెలుగువారికి పరిచయం చేశారు. దేశమాత పత్రిక ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ సంపాదక వర్గం గాంధీజీ పిలుపుతో స్వరాజ్య సమరంలోకి వచ్చినా, తన వార్తాపత్రిక ‘కాంగ్రేసు’ను మాత్రం తీవ్ర జాతీయవాదుల భావాలకు వేదికగా చేశారు మద్దూరి అన్నపూర్ణయ్య. 1921 మే మాసంలో, మద్దూరి సంపాదకునిగా మొదట సైక్లోస్టయిల్డ్ పత్రికగా అది ఆరంభమైంది. రాజమహేంద్రవరం నుంచి ప్రచురణ ప్రారంభించి, తరువాత సుబ్రహ్మణ్యం ప్రారంభించిన సీతానగరం గౌతమీ సత్యాగ్రహాశ్రమానికి తరలింది. రాజమండ్రికి 23 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆశ్రమానికి దక్షిణాది సబర్మతి అని పేరు. ఇంకా క్రొవ్విడి లింగరాజు, శ్రీరామచంద్రుని వెంకటప్ప, చండ్రుపట్ల హనుమంతరావు సంపాదక మండలిలో ఉన్నారు. కానీ పత్రిక వెలువడిన ఒక దశాబ్దకాలంలో (1921–1932) వీరిలో ఎవరో ఒకరు కారాగారంలో ఉంటూ వచ్చారు. 1929 మే నెల కాంగ్రేసు 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సంస్మరణ సంచికగా వెలువడింది. ఇందులోనే అచ్చయిన ‘చిచ్చుర పిడుగు’ అన్న నాటిక అప్పుడే ఆ ఆశ్రమాన్ని సందర్శించిన గాంధీజీని కలవరపరచడమే కాదు, మద్దూరిని రెండున్నరేళ్లు కారాగారంలో ఉంచింది. నిజానికి అది రామచంద్రుని వెంకటప్ప రచన. రచయిత పేరు వేయలేదు. కానీ పోలీసులు కేసు పెట్టడంతో సంపాదకుడు కాబట్టి మద్దూరి బాధ్యత వహించి జైలుకు వెళ్లారు. భగత్‌సింగ్ బలిదానాన్ని శ్లాఘిస్తూ ‘వీరబలి’ పేరుతో సంపాదకీయం రాసినందుకు, వాడపల్లి (తూర్పు గోదావరి జిల్లాలో ఊరు. వెంకటేశ్వరస్వామి ఉత్సవంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఏడుగురు చనిపోయారు) కాల్పుల వార్తలు ఇచ్చినందుకు ప్రభుత్వం ఈ పత్రిక మీద నిఘా ఉంచింది. చివరికి 1932 జనవరిలో మద్రాస్ గెజెట్ ‘కాంగ్రేసు’ చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. జనవరి 12న పోలీసులు ఆశ్రమం మీద దాడి చేసి పత్రిక ఆస్తులన్నీ ధ్వంసం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి మే 10, 1926న ప్రతాపరెడ్డి సారథ్యంలో ప్రారంభమైన ‘గోలకొండ పత్రిక’ సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని భయపెట్టేవి. రాజ్యంలో వాస్తవాలను తెలియచేసేందుకు సురవరం ప్రతాపరెడ్డి ఈ పత్రిక స్థాపించారు. సంపాదకునిగా మొదట్లో ఆయన పేరు లేకున్నా, అన్నీ ఆయనే. సురవరం బహుభాషావేత్త, సాహిత్యవేత్త. నిజాం సంస్థానంలో నవాబు నడిపిన ‘మీజాన్’ తెలుగు వెర్షన్‌కు అడవి బాపిరాజు సంపాదకులు. అందులో నవాబు వ్యతిరేకోద్యమ వార్తలకూ ఆయన చోటిచ్చారు. మందుముల నరసింగరావు ‘రయ్యత్’ పత్రిక పూర్తిగా నిజాం వ్యతిరేక పత్రిక. ఇక ‘ఇమ్రోజ్’ ఉర్దూ పత్రిక నిర్వాహకుడు, రచయిత షోయబుల్లా ఖాన్‌ను రజాకార్లు హైదరాబాద్‌లో హత్యచేశారు. ఇక్కడ ప్రస్తావించిన పత్రికలు, పత్రికా రచయితల పేర్లు చరిత్ర అనే సాగరం నుంచి తీసిన ఒక్క బొట్టులో భాగం మాత్రమే. స్వాతంత్య్ర సమరం, పత్రికలు సాగించిన ఉద్యమం వేరు చేసి చూడడం సాధ్యం కాదన్నది చారిత్రక వాస్తవం. వందలాది పత్రికలు, వందలాది మంది పత్రికా రచయితలు స్వాతంత్య్రోద్యమానికి అంకితం కావడం తిరుగులేని వాస్తవం. 1947 వరకు ఏ పత్రిక ఆశయమైనా దేశ స్వాతంత్య్ర సాధనే. దీనికి భూమికను అందించిన నిన్నటి సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో పత్రికలు నిశ్శబ్ద కర్తవ్యాన్ని నిర్వహించాయి. స్వాతంత్య్రోద్యమానికి గళం ఇచ్చాయి. పత్రికా రచన ఇంకొక మహత్కార్యం కూడా నెరవేరుస్తూ ఉంటుంది. చరిత్ర రచనకు ఆలంబన నిన్నటి వార్తాపత్రికలే. జాఫ్రీ సి వార్డ్ అన్నట్లు... ‘జర్నలిజం ఈజ్ మియర్లీ హిస్టరీస్ ఫస్ట్ డ్రాఫ్ట్’ . – డా. గోపరాజు నారాయణరావు, ఎడిటర్, ‘జాగృతి -
చైనా పౌరుల ప్రతి కదలికపై గట్టి నిఘా! ఎక్కడికి వెళ్లినా..చెప్పాల్సిందే!
increasing attacks targeting Chinese citizens in Pakistan: పాకిస్తాన్‌లోని చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పౌరులు తమ భద్రతకై వారి కదలికలను ముందుగా ఇస్లామాబాద్ పోలీసులకు తెలియజేయలాని కోరినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు విదేశీయుల భద్రత కోసం ఇస్లామాబాద్ పోలీసుల ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ ఫారిన్ సెక్యూరిటీ సెల్ పనితీరును సమీక్షించేందుకే నిర్ణయించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో సుమారు వెయ్యి మంది చైనా పౌరులు ఉన్నారు. అంతేకాదు వీళ్లంతా వివిధ కంపెనీలు, వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 36 ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని సర్వే తెలిపింది. బహుళ మిలియన్ డాలర్ల చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టులకు సంబంధించిన చైనీయులకు పారామెలటరీ దళాలు, భద్రతా దళాలు రక్షణ కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు. పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సెక్యూరిటీ డివిజన్ లేదా పెట్రోలింగ్ యూనిట్ సుమారు వెయ్యి మందికి పైగా చైనా పౌరుల కదలిక సమయంలో భద్రత కల్పించాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. వారి కదలికల వివరాలను సేకరించే బాధ్యత కూడా ఎస్హెచ్ఓలకు అప్పగించామని అధికారులు తెలిపారు. చైనా పౌరుల నివాసాలతో పాటు వారి ఇళ్లకు వెళ్లే మార్గాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సేఫ్ సిటీ పోలీస్ ఫెసిలిటేషన్లో ఒక డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ అధికారులు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదీగాక ఈ ఏడాది ఏప్రిల్ 26న కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ షటిల్ వ్యాన్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)కి చెందిన మహిళ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో ముగ్గురు చైనా టీచర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. పైగా వేర్పాటువాద పాకిస్తాన్‌లోని బులిచిస్తాన్ ప్రావిన్స్‌లో స్థానికులు చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: అదానీని ఆపండి...మళ్లీ శ్రీలంకలో మొదలైన నిరసన సెగ) -
విరాటపర్వం నాకో చాలెంజ్
‘‘విరాటపర్వం’ చిత్రంలో ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమకథ ఉంది. వేణు ఊడుగులగారు అద్భుతంగా రాశారు.. తీశారు. ఇలాంటి బలమైన కథలో నాకు మంచి పాత్ర దక్కింది’’ అని నవీన్ చంద్ర అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘విరాటపర్వం’లో సీనియర్ ఉద్యమకారుడు రఘన్న పాత్రలో కనిపిస్తా. కథను తలకిందులు చేసే పాత్ర నాది. నాతో మొదటిసారి తెలంగాణ యాసని అద్భుతంగా చెప్పించారు వేణుగారు. ఈ సినిమా చేయడం ఒక చాలెంజ్. రానాగారి వ్యక్తిత్వం గొప్పది. ఓ రకంగా ఆయన బిగ్ ఇన్ఫర్మేషన్ బాక్స్’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నన్ను చాలా మంది హీరోగా ఫిక్స్ అయిపోయారు. హీరోగా చేయాల్సిన సినిమాలు వస్తే చేస్తున్నాను. సినిమా ఆడినా ఆడకపోయినా నేను చక్కగా చేశాననే గుర్తింపు వస్తోంది. నాపై నమ్మకంతో మంచి పాత్రలు ఇస్తున్న దర్శకులకు కృతజ్ఞతలు. హీరోగా చేయడం సెపరేటు. నాలుగు నెలలు ఒకే కథపై ఉంటాం.. దానికి వచ్చే పేరు, రెమ్యూనరేషన్ వేరుగా ఉంటాయి. కానీ మంచి కథ ఉన్న సినిమాల్లో పాత్రలు చేయడం కూడా నటుడిగా తృప్తి ఇస్తోంది. నేను చేసిన కొన్ని ఓటీటీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యూవీ కాన్సెప్ట్స్‌లో హీరోగా ఒక సినిమా చేశాను. రామ్‌చరణ్–శంకర్‌గారి సినిమా, బాలకృష్ణ– గోపీచంద్ మలినేనిగారి సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
సీఎం మమతా బెనర్జీ విమానానికి కుదుపులు
కోల్‌కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడంపై నివేదిక ఇవ్వాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన సీఎం మమత శుక్రవారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో తిరిగి వస్తున్నారు. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీయడంతో ఆ విమానం తీవ్ర కుదుపులకు లోనయింది. దీంతో పైలట్ అప్రమత్తమై సుభా‹ష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అకస్మాత్తుగా విమానం పైకి, కిందికి ఊగిసలాడటంతో మమతా బెనర్జీ వెన్నెముకకు గాయమైంది. ఈ ఘటనను బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని డీజీసీఏను కోరింది. ఈ మేరకు రిపోర్టు సిద్ధం చేస్తున్నట్లు డీజీసీఏ అధికారి ఒకరు వెల్లడించారు. సీఎం మమత భద్రతపై అధికార టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె ప్రయాణిస్తున్న విమానాలు గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాయని, దర్యాప్తు చేపట్టాలంది. -
ఆ మాత్రం ఎవరైనా చేస్తారు.. రాబియా వేరే పని కూడా చేసింది!
ఆమె క్లాస్‌లో ఆమె అమ్మ, అమ్మమ్మ విద్యార్థుల్లా పాఠాలు విన్నారు. అమ్మమ్మ తన మనవరాలిని ‘టీచర్’ అంటూ పిలిచేది. ఆ పల్లెటూళ్లో చదువురాని గృహిణులందరూ ఆమె స్కూల్లో బుద్ధిగా చదువుకునేవారు. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె కూడా స్ఫూర్తి. జీవితం ఆమెను చిన్నప్పుడే చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. కాని చదువే మనిషికి చలనం ఇస్తుందని అందరికీ చదువు అందే పనిని చూసింది. కె.వి.రాబియా కేరళలో ఎందరికో స్ఫూర్తి. నేడు పద్మశ్రీ ప్రకటనతో దేశానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. 56 ఏళ్ల రాబియా జీవితం కేరళలో స్కూలు పిల్లల టెక్ట్స్‌బుక్స్‌లో పాఠ్యాంశంగా ఉంది. కేరళ అనే ఏముంది... దేశంలో ఏ భాషలోని పిల్లలలైనా ఆమె జీవితాన్ని పాఠంగా చదువుకోవాలి. స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే అలాంటి పోరాటం చేసిన వారు చాలా తక్కువ ఉంటారు. స్త్రీలలో మరీ తక్కువగా ఉంటారు. అందుకే ప్రతి చిన్నారి, యువతి, గృహిణి, ఉద్యోగిని రాబియాను చూసి జీవితంలో అలుపెరగని పోరాటం ఎలా చేయవచ్చో నేర్చుకోవచ్చు. ఎందుచేత ఆమె స్ఫూర్తి? ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రికి రేషన్‌షాప్ ఉండేది. రాబియాకు చదువుకోవాలని బాగా కోరిక. కాని 9వ క్లాసుకు రాగానే ఆమెకు రెండు కాళ్లకూ పోలియో వచ్చింది. అయినా సరే ఇంటర్ వరకూ మేనమామ సహాయంతో కాలేజీకి వెళ్లింది. కాని ఇంటర్లో నడుము కింద నుంచి పూర్తిగా చచ్చుబడి వీల్‌చైర్‌కు పరిమితం అవ్వాల్సి వచ్చేసరికి ఇక కాలేజీ మానుకుంది. కాని చదువంటే ఇష్టం. ఎలా? ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ ఆ తర్వాత పిజి చదవడం మొదలెట్టింది. ఆ మాత్రం ఎవరైనా చేస్తారు? రాబియా వేరే పని కూడా చేసింది. ఆడవాళ్ల స్కూలు రాబియా ఉన్న పల్లెటూళ్లో అందరూ పేదవాళ్లు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఆ ఇళ్ల ఆడవాళ్లకు అక్షరం ముక్క చదువు లేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నా కదా వీరికి ఎందుకు చదువు చెప్పకూడదు అని డిగ్రీలోనే రాబియాకు అనిపించింది. వెంటనే ఆమె తన ఇంటిలోనే స్కూల్ ప్రారంభించింది. కేవలం ఆడవాళ్లకే ఆ స్కూలు. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఆమె ఇల్లు ‘కడలుండి’ అనే నది ఒడ్డున ఉంటుంది. మెల్లగా అదొక గురుకులంలాగా తయారైంది. రాబియా టీచర్ అసలు ఏమాత్రం రాజీ పడకుండా ఆడవాళ్లకు చదువు చెప్పడం, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపాధి అవకాశాలు అందుతాయో తెలియచేసి, ప్రతి ఇంటికి ఏదో ఒక దారి చూపడం మొదలెట్టింది. రాబియా తల్లి, అమ్మమ్మ ఇది గమనించి ఆఖరుకు వారు కూడా ఆమె స్టూడెంట్స్‌గా మారక తప్పలేదు. తనను ఎత్తుకుని ఆడించినవారు తన దగ్గర బుద్ధిగా పాఠాలు వినడం రాబియాకు చాలా సంతోషం కలిగించింది. ఈ వార్త అటూ ఇటూ వెళ్లి ప్రభుత్వానికి చేరింది. ఒకరోజు అధికారులు వచ్చేసరికి రాబియా క్లాసులో 80 ఏళ్ల పెద్దామె నుంచి 8 ఏళ్ల పాపాయి వరకూ చదువుకుంటూ కనిపించారు. అధికారులు చాలా సంతోషించి ఏం కావాలి అని అడిగితే మా ఊరికి రోడ్ వేయండి అంది రాబియా. వెంటనే రోడ్ వేసిన అధికారులు దానికి ‘అక్షర రోడ్’ అని పేరు పెట్టారు. అంతే కాదు లైట్లు, నీటి వసతి ఇలాంటివన్నీ రాబియా వల్ల ఆ ఊరికి వచ్చాయి. ‘చలనం’ సంస్థ రాబియాకు తెలుసు... తాను తన కాళ్ల మీద నడవలేనని. కాని తన చదువు సమాజాన్ని నడిపించగలదు... తాను చెప్పే చదువు నలుగురికీ చలనం ఇవ్వగలదు... అందుకే ఆమె ‘చలనం’ అనే సంస్థను స్థాపించి ముఖ్యంగా దివ్యాంగులకు, మానసిక అవస్థలు ఉన్న పిల్లలకు స్కూళ్లు తెరిచింది. అంతే కాదు... తన ఇంటిని ఒక నాలెడ్జ్ సెంటర్‌గా మార్చింది. లైబ్రరీ, కౌన్సెలింగ్... అన్నీ అక్కడే. తన్నుకొని తనదగ్గరకు వచ్చిన భార్యాభర్తలకు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చేది. అయితే ఆమె జీవితానికి ఇంకా పరీక్షలు ఎదురయ్యాయి. కేన్సర్ సర్వయివర్ 32 ఏళ్ల వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది. దానిని ఆమె విజయవంతంగా ఎదుర్కొంది. శరీర బలం కంటే మనోబలంతోనే ఆమె దానిని జయించింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో ఆమె బాత్రూమ్లో పడటంతో వెన్నుపూస ఆమె శరీరాన్ని మరింత చలనం లేకుండా చేసింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా మంచం మీద ఉండి ‘మౌన రోంబనంగల్’ (నిశ్శబ్ద కన్నీరు) అనే తన జ్ఞాపకాల గ్రంథాన్ని రాసింది. అది హిట్ అయ్యి వచ్చిన డబ్బుతో ఆమె వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత ‘స్వప్నాలకు రెక్కలుంటాయి’ అనే పేరుతో ఆత్మకథను రాసింది. మనిషి ఎంత వీలుంటే అంత చదువుకోవాలని జ్ఞానమే సమాజాన్ని మరింత వికాసంలోకి తీసుకెళుతుందని రాబియా గట్టిగా నమ్ముతుంది. ప్రచారం చేస్తుంది. ఆమె కృషి వల్ల ఆమె ఊరి చుట్టుపక్కల 8 గ్రామాలు పూర్తిగా అక్షరాస్యతలోకి ప్రయాణించాయి. ప్రజలు రాబియాను ఎంతో అభిమానిస్తారు. ఏ కృషీ వృధా పోదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గొప్పవాళ్లు కొందరు చక్రాల కుర్చీకి పరిమితం కావచ్చు. కాని వారి సంకల్పం ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది. ఆ సంకల్పం అందరికీ దక్కాలి. రాబియాను అభినందిస్తున్న పలువురు ప్రముఖులు -
బీజేపీ కుట్రలను తిప్పి కొడదాం: తమ్మినేని వీరభద్రం
సాక్షి, సూర్యాపేట(నల్లగొండ): వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డ మీద హిందూమతం పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సీసీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని హాజరై తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, నాగార్జునరెడ్డి, ఎం.రాములు, కె.యాదగిరిరావు, ధీరావత్ రవినాయక్, బి.శ్రీరాములు, కోట గోపి, గోవిందు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సెప్టెంబరు 17: సాయుధ చరిత్రకు సాక్ష్యాలు -
సెప్టెంబరు 17: సాయుధ చరిత్రకు సాక్ష్యాలు
ఓ వైపు దేశం మొత్తం స్వాతంత్య్ర సంబురాలు చేసుకుంటుంటే తెలంగాణ మాత్రం నిజాం కబంధ హస్తాల్లోనే మగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో సామంతరాజులు స్థానికంగా గడులు నిర్మించుకుని గడ్చిరోలి జిల్లా సిరొంచా, ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, వేములవాడ తదితర ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసేవారు. నాడు చెన్నూర్, ఆసిఫాబాద్, ఇందారం, తాండూర్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు, గడులు, చెరువులు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తాండూర్‌లో ఠాణా భవనం తాండూర్(ఆదిలాబాద్): నిజాం పాలనలో తాండూర్ ఓ ముఖ్య పట్టణంగా ఉండేది. ఆసిఫాబాద్–చెన్నూర్ ప్రాంతాలకు మధ్యలో, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు సమీపంలో ఉండటంతో తాండూర్‌లో పోలీస్ ఠాణాను ఏర్పాటు చేశారు. 1912–1920 మధ్యకాలంలో అక్కడ ఓ భవనాన్ని నిర్మించారు. రెండేళ్ల క్రితం వరకు భవనాన్ని మాదారం పోలీసుస్టేషన్‌గా వినియోగించగా.. ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అదేవిధంగా తాండూర్‌లో పోస్టాఫీసు నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిజాం ప్రభుత్వం 1912 సంవత్సరంలో భవనం నిర్మించారు. ఇప్పడు కూడా ఈ భవనాన్ని పోస్టాఫీసుగా వినియోగిస్తుండటం విశేషం. రెండేళ్లు అజ్ఞాతంలో.. పట్టణానికి చెందిన సాయుధ పోరాట యోధుడు సుడిగాల విశ్వనాథ సూరి రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. పోరాటయోధులను రజాకార్లు అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న అధిష్టానం విశ్వనాథ సూరిని అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ఆయన రెండేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని గడిపాడు. 1946లో సుభాశ్ చంద్రబోస్ అధ్వర్యంలో మహారాష్ట్రలోని సిరొంచా గ్రామంలో ఏర్పాటు చేసిన రహస్య శిబిరానికి హాజరయ్యారు. అక్కడే ఏడాదిపాటు శిక్షణ పొందారు. బల్లార్ష శిబిరంలో కూడా పాల్గొన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనజీవనంలోకి వచ్చారు. 1952లో చెన్నూర్, లక్సెట్టిపేట ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1952 నుంచి 1957 వరకు పదవిలో ఉన్నాడు. ఆ తర్వాత చెన్నూర్ నియోజకవర్గాన్ని 1957లో ఎస్సీ రిజర్వు చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు చెన్నూర్‌కు ప్రతినిధ్యం వహించిన స్థానికుడు కేవలం విశ్వనాథ సూరి మాత్రమే. నస్పూర్‌లో దొరల గడి పట్టణ పరిధిలోని ఊరు నస్పూర్‌లో సుమారు 1927–30 మధ్య కాలంలో నస్పూర్ దొరలు నిర్మించిన గడి నాటి చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యంగా మిగిలింది. నస్పూర్‌కి చెందిన గోనె రాజ వెంకట ముత్యంరావు దీనిని నిర్మించారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ముత్యంరావు నాటి నిజాం ప్రభుత్వానికి నమ్మకమైన బంటుగా ఉంటూ ప్రభుత్వానికి సంబంధించి కార్యకలాపాలను ఈ గడి నుంచే పర్యవేక్షించేవారు. జన్నారం, తపాలాపూర్, నస్పూర్, ఇందారం, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరొంచా గడులను కలుపుతూ ప్రత్యేక దారి ఉండేదని చెప్పుకుంటారు. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ముత్యంరావు కుటుంబం గడిని వదిలి హైదారాబాద్‌లో స్థిరపడ్డారు. కాగా.. ఈ కుటుంబంలో నుంచి జీవీ సుధాకర్‌రావు అప్పటి లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. సాయుధ పోరులో ఆసిఫాబాద్ యోధులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆసిఫాబాద్ సమరయోధుల పాత్ర కీలకం. ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూర్, లక్సెట్టిపేట, పెద్దపల్లి ప్రాంతాలకు చెందిన వేలాది మంది యువకులు కాంగ్రెస్ అతివాద నాయకులతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి వెంకటేశం, చీల శంకర్, చీల విఠల్, ఖాడ్రే శంకర్, రాంసింగ్, రేవయ్య, తాటిపెల్లి తిరుపతి, ఏకబిల్వం శంకరయ్య, చందావార్ విఠల్, జగన్నాథ్ మహారాష్ట్రలోని చాందా సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొందారు. వీరికి ఆసిఫాబాద్‌కు చెందిన రాంచందర్ రావు పైకాజీ, సుబ్బబాబురావు, దండనాయకుల గోపాల్ కిషన్‌రావు, వామన్‌రావు వైరాగరే, ప్రభాకర్ రావు మసాదే సహకరిస్తూ వచ్చారు. క్యాంపు ఇన్‌చార్జీలుగా కేవీ నర్సింగరావు, కేవీ కేశవులు, వి.రాజేశ్వరరావు ఉండేవారు. మహారాష్ట్ర నుంచి సైనిక బలగాలు పది యుద్ధ ట్యాంకులు, పది ట్రక్కులు, 20 ఠానే గాఢ్లు, వందలాది మంది సైనికులతో చాందా, బల్లార్షా క్యాంపుల్లో సుశిక్షితులైన పౌరులు ఆసిఫాబాద్ వైపు ముందుకు కదిలారు. నాటి పోరాటంలో పాల్గొన్న యోధులను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించింది. కీలక సంఘటనలు.. ► 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టిన భారత సైన్యం పోలీస్ యాక్షన్ ప్రకటించింది. ►సెప్టెంబర్ 13 పొద్దుపోయాక చంద్రాపూర్, బల్లార్షా, దాభా (ఉపక్యాంపు, సిరొంచా క్యాంపుల నుంచి సాయుధ సమరయోధులు భారత సైన్యం బాటలో నిజాం పోలీసులు రజాకార్లపై విరుచుకు పడేందుకు చర్యలు ప్రారంభించారు. ► రాత్రి భారత సైన్యం హైదరాబాద్ సంస్థాన హద్దులో ప్రవేశించకుండా రాజూరా సమీపంలోని రైల్వే వంతెనకు బాంబులు అమర్చారు. ► 14న రాత్రి 11 గంటలకు రైల్వే వంతెన పేల్చివేతకు రజాకార్లు చేపట్టిన ప్రయత్నాలను సమరయోధులు గుర్తించారు. రాత్రి 12 గంటలకు ఈ విషయం కొరియర్ వ్యవస్థ ద్వారా మిలటరీకి సమాచారం అందించారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విద్రోహులపై మిలటరీ దాడి, రజాకార్ల హతం, బాంబుల తొలగింపు. 3 గంటలకు మహారాష్ట్రలోని విరూర్ రైల్వేస్టేషన్‌పై ఆసిఫాబాద్‌కు సాయుధ యోధుల దాడి, ఈ ఘటనలో వెంకటేశం కాలికి గాయమైంది. ► 15 తెల్లవారుజామున 4 గంటలకు దాబా మీదుగా వచ్చిన మరో మిలటరీ క్యాంపు, సాయుధ పోరాట వీరులు పెన్‌గంగా సరిహద్దులోని లోన్వెల్లినాకాపై దాడితో మిలటరీ మార్గం సుగమం. రాత్రి 10 గంటలకు ఆసిఫాబాద్ సమీపంలోని బుజల్ఘాట్ వంతెనను రజాకార్లు పేల్చివేశారు. మరునాడు స్థానికులు ఈ వంతెనపై తాత్కాలిక మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ► 16న అర్ధరాత్రి దాటాక సిరొంచా నుంచి వచ్చిన మిలటరీ, స్థానిక సమరయోధులు బెజ్జూర్ ఔట్‌పోస్టుపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున సాయుధ పోరాటయోధులు దహెగాం సమీపంలో పెసరకుంట వద్ద రజాకార్లపై దాడి చేశారు. ఈ సంఘటనలో 19 మంది మృతి చెందారు. అనంతరం బీబ్రా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ► ఇదేరోజు ఆసిఫాబాద్ జిల్లా జైలులో పదుల సంఖ్యలో సమరయోధులను నిర్భందించారు. 17న నిజాం లొంగుబాటు వార్తతో ఆసిఫాబాద్ జైళ్లోని సమరయోధులు ఇతర ఖైదీలతోపాటు బయటికి వచ్చారు. చదవండి: నేడు జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సబ్ కమిటీ సమావేశం -
పది నెలలుగా సాగుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ ఉద్యమం
-
ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు
మార్చి 8 శ్రామిక మహిళల పోరాటానికి సంకేతం. 19వ శతాబ్దంలో న్యూయార్క్ నగరంలో సమాన వేతనానికి, పది గంటల పనికోసం మహిళల పోరాటాలు, త్యాగాల ఫలితంగా 1910లో మార్చి 8కి అంతర్జాతీయ మహిళా దినంగా గుర్తింపు వచ్చింది. వివిధ సందర్భాల్లో మహిళలు తమ హక్కుల కోసం, ఉనికి కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. రష్యాలో జార్ చక్రవర్తి ఆగడాలకు వ్యతిరేకంగా రొట్టె కోసం 1917 విప్లవ కాలంలో మార్చి 8న పెట్రోగార్డ్లో వేలాది మహిళలు బ్యానర్లతో ప్రదర్శన చేశారు. మహిళలు బుర్ఖా వేసుకోకుండా బయటకు రాకూడదని 1970లో ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖోమేని మార్చి 7న ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వేలాది మహిళలు ప్రదర్శనలు జరిపారు. 2018 మార్చి 8న 170 దేశాల సమన్వయంతో అంతర్జాతీయంగా మహిళల సమ్మె జరిగింది. హింసకు, ఇంకా అనేక రకాల అణచివేతలకు వ్యతిరేకంగా ఎనిమిది రకాల డిమాండ్లతో రోడ్లన్నీ నిండిపోయాయి. మన దేశంలో 2012లో ఢిల్లీ రాజధాని నడిబొడ్డున నిర్భయపై అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా పోరాటంలో మహిళలు, పురుషులతో సమానంగా భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడి అమరులైనారు. 1970లో నాటి ఉత్తరప్రదేశ్‌లోని అడవులను పారిశ్రామికవేత్తల నుంచి రక్షించడానికి దశౌలీ గ్రామ స్వరాజ్య సంఘం ఆధ్వర్యంలో 2,500 చెట్లను నరకడాన్ని అడ్డుకున్నారు. మహిళలు చెట్లను హత్తుకొని కాపాడటం వల్ల దీనికి ‘చిప్కో’ ఉద్యమమనే పేరు వచ్చింది. 1995లో హరియాణాలోని ఖాప్ పంచాయతీ ఒక కుటుంబానికి శిక్ష వేసే క్రమంలో పన్నెండేళ్ల బాలికను అత్యాచారం చేయాలనే తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా గ్రామంలోని వెయ్యి మంది మహిళలు సంఘటితంగా ఉద్యమించారు. మణిపూర్‌లో 2004లో సాయుధ బలగాల చట్టానికి వ్యతిరేకంగా ముప్పైమంది మహిళలు నగ్నంగా ఇంఫాల్‌లో నిరసన ప్రదర్శన చేశారు.1992లో సారా వ్యతిరేక ఉద్యమం చరిత్ర సృష్టించింది. 1991లో నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావం వల్ల మహిళలపై మరింత భారం పడింది. సామ్రాజ్యవాద సంస్కృతి కొత్త రూపాలలో మహిళలపై హింసను పెంచింది. రోజూ 88 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 2019లో రాజస్తాన్‌లో 6,000, యూపీలో 3,165 అత్యాచార సంఘటనలు జరిగితే, రికార్డు కెక్కనివి ఎన్నో. 2019లో నమోదైన 32,033 అత్యాచార కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లోనే 18 శాతం నమోదైనాయి. బాధితుల్లో 11 శాతం దళిత మహిళలే. 2017 డిసెంబర్లో భీమా కోరేగావ్ దళితుల ఆత్మగౌరవ పోరాటం, పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని వేలాది ముస్లిం మహిళల షాహిన్‌బాగ్ పోరాటం, నేటి కోట్లాది రైతుల పోరాటం దేశ చరిత్రలో 3 ప్రధాన పోరాటాలు. 40 సంవత్సరాల్లో అత్యధిక స్థాయికి నిరుద్యోగిత చేరింది. డీమానిటైజేషన్, జీఎస్టీ అసంఘటిత రంగాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మాత్రమే కాదు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. దీనికితోడు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. కుటుంబ భారాన్ని మోయలేక మహిళలు ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారు. భరించినంత కాలం మహిళలపై భారం పడుతూనే ఉంటుంది. మన ముందున్నది రైతాంగ వ్యవసాయ కార్మిక మహిళా ఉద్యమం. కార్పొరేట్ హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా అన్ని రంగాల మహిళలు మార్చి 8 స్ఫూర్తితో చేయి చేయి కలిపి అడుగులు వేయడమే కర్తవ్యం. – అనిత, చైతన్య మహిళా సంఘం -
వికేంద్రీకరణకు మద్దతుగా విద్యార్థుల పోస్టు కార్డు ఉద్యమం
సాక్షి, తిరుపతి: మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. తిరుపతిలో ఎస్వీయులో గురువారం చేపట్టిన ఈ ఉద్యమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా నినాదాలు చేస్తూ రాష్ట్రపతికి వినతి చేసుకున్నారు. -
హాంకాంగ్ ఉద్యమం.. చైనా కలవరం
20 ఏళ్ల క్రితం వరకూ బ్రిటిష్ వలస దేశంగా ఉన్న హాంకాంగ్‌ని చైనా మెయిన్‌ల్యాండ్‌లో కలపవటాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విద్యార్థులు ఈ పోరు ప్రారంభించారు. ఉద్యమాన్ని అణచివేయాలని చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. అంతర్జాతీయంగా గతవారం హాంకాంగే హాట్ టాపిక్. స్వయం పరిపాలన కోసం అక్కడ జరుగుతున్న ఉద్యమం తీవ్రమవుతోంది. 20 ఏళ్ల క్రితం వరకూ బ్రిటిష్ వలస దేశంగా ఉన్న హాంకాంగ్‌ని చైనా మెయిన్‌ల్యాండ్‌లో కలపటాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విద్యార్థులు ఈ పోరు ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించినా ఉద్యమం చల్లారకపోగా తిరిగిపుంజుకుంది. ఇది మరింత విస్తృతమై పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజలు వీధుల్లోకొచ్చారు. దేశం ఒక్కటే, వ్యవస్థలు రెండు.. 1997 జూలై 1న బ్రిటన్ హాంకాంగ్‌పై ఆధిపత్యాన్ని చైనాకు అప్పగించింది. హాంకాంగ్ చైనాలో భాగమైనప్పటికీ హాంకాంగ్‌కి పాలనాంశాల్లో, కొన్ని ఇతర విషయాల్లో స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానాలు మాత్రం చైనా ప్రభుత్వ అ«ధీనంలోనే ఉంటాయి. చైనా అధ్యక్షుడి పాలనలోనే ఉన్నప్పటికీ.. పరిపాలనలోనూ, ఇతర విధానాల రూపకల్పనలోనూ హాంకాంగ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఈ స్వతంత్రత ప్రధాన భూభాగమైన చైనాకన్నా అధికంగా ఉన్నదనీ, చైనా ప్రజలకన్నా హాంకాంగ్ ప్రజలు ఎక్కువ హక్కులు అనుభవిస్తున్నారనీ చైనా ఆరోపిస్తోంది. అందుకే ఇక్కడి నేరస్తులను చైనా మెయిన్‌ల్యాండ్‌కు అప్పగించేందుకు చట్టసవరణకు చైనా సిద్ధమైంది. హాంకాంగ్ ప్రజలను ఈ చర్య మరింత రెచ్చగొట్టింది. తక్షణమే చట్టసవరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు మొదలయ్యాయి. పార్లమెంటు ముట్టడి.. జూలైలో ఆందోళనకారులు పార్లమెంటును చుట్టుముట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఎట్టకేలకు చట్టసవరణ బిల్లుని చైనా ప్రభుత్వం విరమించుకుంది. ఇంకా... ఈ ఉద్యమాన్ని దొమ్మీలుగా, అల్లర్లుగా భావించొద్దని, అరెస్టు చేసిన ఉద్యమకారులను విడుదల చేయాలని, పోలీసుల హింసాకాండపై స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని, సార్వత్రిక ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్లు నెరవేరలేదు. -
అవిగో టాయ్‌లెట్స్.. అందులో కూర్చొని ఇవ్వొచ్చు!
గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పల్లెజనం పట్టణాల నుంచి ఏం నేర్చుకుంటున్నారో తెలియదు కానీ చాలా విషయాల్లో గ్రామీణ ప్రజల్లోని మానవత్వం, అమాయకత్వం, ప్రేమా మన మనసుల్ని పల్లెలవైపు పరుగులు తీయిస్తుంటుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా మననుంచి దూరమైనవేవో మనసుని నొప్పిస్తుంటాయి. ఇటీవల ఆగస్టు తొలివారంలో తల్లిపాల ప్రాధాన్యతను చాటిచెప్పే వారోత్సవాలను గురించి చదివినప్పుడు గుండెల్లో అలాంటిదే ఏదో నొప్పి బయలుదేరింది. కొద్దినెలల క్రితం చదివిన ఓ విషయం గుర్తొచ్చింది. బహుశా అలాంటి నొప్పినే, అలాంటి బరువునే గుండెల్లో నింపుకొని భారంగా, బాధగా బతుకులీడుస్తోన్న లక్షలాది మంది పట్టణాల్లోని పసిబిడ్డల తల్లులు గుర్తొచ్చి నాగరికత పేరుతో, అభివృద్ధి పేరుతో కుప్పలు తెప్పలుగా నిర్మితమౌతోన్న అమానవీయ, అనాగరిక కట్టడాలపై ఏహ్యభావం ఏర్పడింది. బహుళంతస్తుల సెంట్రలైజ్డ్ ఏసీ భవనాల్లో ఆరోగ్యం కోసం కూడా నాలుగు మెట్లు ఎక్కే బాధే లేకుండా ఎస్కులేటర్లు చాలా సుఖవంతమైనవే. అలాంటి చాలా సౌకర్యవంతమైన ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్‌లూ, మల్టీప్లెక్స్‌లూ నగరం నిండా జనానికి చోటే లేకుండా అవే భవనాలు. అలా సకల సౌకర్యాలతో విలసిల్లుతోన్న షాపింగ్ ‘పెద్ద’ బజారుల్లో ఓ తల్లి కళ్లు దేనికోసమో వెతుకుతూనే ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లోని ట్రయల్ రూం ముందున్న సింగిల్ స్టూల్‌పై కూర్చొని జీన్స్ పైన సౌలభ్యం కోసం వేసుకున్న లూజ్ టీషర్టుని ఓ వారగా గబగబా పైకి లాగి చిన్నారి నోటికి స్థనాన్ని అందించిందో చిన్నపిల్ల తల్లి. అంతే! అంతలోనే అక్కడికొచ్చిన ఓ వ్యక్తి అది పిల్లలకు పాలివ్వడం కోసం ఏర్పాటుచేసిన స్థలం కాదనీ, తక్షణమే ఖాళీ చేయాలనీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడు. మరి ఏడుస్తున్న బిడ్డకి పాలెక్కడివ్వాలి? ఆమె ప్రశ్నకి సమాధానంగా ప్రతీకాత్మక చిత్రం : ‘పాలిచ్చే తల్లులకుకాస్త చోటు చూపించండి’ అంటూ ఇటీవలేఆన్లైన్ వేదికగా ఒక ఉద్యమం మొదలైంది. ‘అదిగో అక్కడుంటాయి టాయ్‌లెట్స్.. అందులో కూర్చొని ఇవ్వొచ్చు’ అని ఉచిత సలహా ఒకటి పారేసి వెళ్లాడు. తల్లిపాలు కల్తీ లేనివి. కల్తీ చేయలేనివి. గుండెల్నిండుగా హత్తుకుని ఇచ్చే తల్లిపాలు బిడ్డ ఆకలి మాత్రమే తీర్చవు. ప్రేమతో నిండిన పాలిండ్ల స్పర్శ బిడ్డకూ, తల్లికీ కూడా ఆరోగ్యాన్నిస్తాయి. అలాంటిది అపరిశుభ్రమైన ప్రాంతంలో, దుర్గంధంతో నిండిన విసర్జిత ప్రాంతంలో బిడ్డకు పాలివ్వమని చెప్పే పరిస్థితి ఈ పట్టణాల్లో మనం మిస్సవుతోన్నదేమిటో మనకు గుర్తు చేస్తోంది. అంతెందుకు చాలా రోజుల క్రితం రోడ్డుపక్కగా (మిగిలిన వాహనదారులకు ఏ ఆటంకం లేకుండా) కారు ఆపుకుని బిడ్డకు పాలిస్తోన్న తల్లిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన రుబాబూ, రాద్ధాంతం టీవీ చూసినవారందరికీ గుర్తుండే ఉంటుంది. రోడ్డుపైన అడ్డదిడ్డంగా కార్లు పార్కుచేసినా కిమ్మనకుండా వెళ్లిపోయే వాళ్లు కూడా పసిబిడ్డకు పాలిచ్చేప్పుడు ఆటంక పరచకూడదనే ఇంగితం లేకుండా పోయింది. అయితే ఆ ఇంగితం ఉండాల్సిందెవరికి? నిజానికి నగరాలకే. పర్యావరణాన్ని గాలికి వదిలేసి, అనుమతులకు చెల్లుచీటీ ఇచ్చేసి, కుప్పలుతెప్పలుగా కట్టేసోన్న బహుళంతస్థుల భవనాల్లో మహిళలకు కావాల్సిందేమిటో ఎవ్వరైనా ఆలోచించారా? పసిబిడ్డలకు పాలిచ్చే ఓ రెండడుగుల ప్రైవసీ స్థలం. ఓ చిన్ని కుర్చీ. ఇంత చిన్న విషయం కొన్ని వేల మంది సమస్య అయినప్పుడు ఇదెందుకు తట్టదు ఎవరికీ? అంటే అది స్త్రీల సమస్య మాత్రమే కాబట్టి. ఆడపిల్లలకి ఏరకంగానూ అక్కరకు రాని నగరాలను నాగరికంగా మార్చగలమా? – అరుణ అత్తలూరి -
హక్కెక్కడిది?!
‘నాక్కూడా ఇలా జరిగింది’ అని చెప్పుకోవడం ‘మీటూ’.‘మగజాతికి కూడా ఇలా జరుగుతోంది’ అని ప్రతిధ్వనిగా నినదించడం ‘మెన్‌టూ’. ‘నాక్కూడా’ అని ఒక్కరే ధైర్యం చేసి బయటికి రావడం, ‘మేము కూడా’ అని నలుగుర్ని పోగేసుకుని రావడం ఒకటే అవుతుందా?! మాధవ్ శింగరాజు బాలీవుడ్ పూర్వపు నటి పూజాబేడీ బర్త్‌డే ఇవాళ. అయితే పూజ గురించి అకస్మాత్తుగా మనమి ప్పుడు మాట్లాడుకోడానికి కారణం ఆమె బర్త్‌డే కాదు. పూజ త్వరలో ‘మెన్ టూ’ అనే ఉద్యమాన్ని లాంచ్ చెయ్యబోతున్నారు! ‘మీటూ’ వంటిదే ‘మెన్‌టూ’. మీటూలో బాధిత మహిళలు ఉంటారు. ‘మెన్‌టూ’ లో బాధిత పురుషులు ఉంటారు. రెండూ భిన్నమైన ఉద్యమాలు. ఈ ‘వార్ ఆఫ్ సెక్సెస్’ ఎప్పుడూ ఉన్నదే. అయితే పురుషుల తరఫున ఒక మహిళ.. మహిళలపై ఇలా యుద్ధ శంఖారావం పూరించడం మునుపెన్నడూ లేనిది! తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ ఒబెరాయ్‌పై అన్యాయంగా అత్యాచారం కేసు పెట్టి, జైలు పాలు చేశారని పూజ ఆవేదన. ఆ ఆవేదనలోంచి ఆవిర్భవించినదే ‘మెన్‌టూ’ అనే ఆలోచన. కరణ్ ఒబెరాయ్ టీవీ యాక్టర్. యాంకర్, సింగర్. ‘ఇండీపాప్ బాయ్ బ్యాండ్’, ‘ఎ బ్యాండ్ ఆఫ్ బాయ్స్’ బృందంలో సభ్యుడు. నలభై ఏళ్లుంటాయి. ముంబైలోని అంథేరీ కోర్టు గురువారం నాడు అతడిని పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఫ్యాషన్ డిజైనర్–కమ్– హీలర్ అయిన ఒక యువతి.. కరణ్ తనపై అత్యాచారం చేశాడని, లక్షల్లో డబ్బును దోచుకున్నాడని ఫిర్యాదు చేయడంతో మే 6న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరణ్‌కి అండగా పూజాబేడీ నిలబడ్డారు. అతడు అలాంటి వాడు కాదని, ఆ అమ్మాయే అతడి వెంట పడిందని ఆమె వాదన. అందుకు సాక్ష్యంగా పూజ.. వాళ్లిద్దరి మధ్య (కరణ్, యువతి) సాగిన మెసేజ్ సంభాషణల్లో ఒకదానిని సాక్ష్యంగా చూపిస్తున్నారు. అదే సాక్ష్యాన్ని చూపించి కరణ్‌కు బెయిల్ తెప్పించడం కోసం అతడి న్యాయవాది దినేష్ తివారి ప్రయత్నిస్తున్నారు.ఒక డేటింగ్ యాప్ ద్వారా 2016 చివర్లో కరణ్, ఆ యువతి ఒకరికొకరు పరిచయం అయ్యారు. గత ఏడాది డిసెంబరులో ఆ యువతి మీద కరణ్ లైంగిక వేధింపుల కేసు పెట్టాడు. ఈ నెల మొదటి వారంలో ఆమె అతడి మీద కేసు పెట్టింది. మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేశాడని, దానిని కెమెరాలో చిత్రీకరించాడని ఆమె ఫిర్యాదు. ఆ ఫిర్యాదులో 2017లో అత్యాచారం జరిగినట్లుగా ఉంది. మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, అప్పుడే ఆమె ఎందుకు బయటపడలేదు అని పూజ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రశ్నించారు. 2017 జనవరి 13న కరణ్‌కి ఆ యువతి పంపిన మెసేజ్‌ని, దానికి కరణ్ ఇచ్చిన సమాధానాన్ని పైకి చదివి వినిపించారు. ‘ఏ బంధాన్నీ, అనుబంధాన్ని ఏర్పడనివ్వకుండా మన రెండు దేహాలను.. కొంత సమయం స్వేచ్ఛగా మాట్లాడుకోనిద్దామా? అందుకు నా దేహం సిద్ధంగా ఉంది. ఏమంటావ్?’ అని యువతి పంపినట్లుగా పూజ చూపించిన మెసేజ్‌లో ఉంది. అందుకు కరణ్ ఇచ్చిన సమాధానం.. తనకు కెరీర్ పట్ల తప్ప ఇక దేనిపైనా ఆసక్తి లేదని. ఆ తర్వాతనైనా ఒకవేళ ఆ ఇద్దరిదేహాలు మాట్లాడుకున్నా.. అది ఆమె తరఫు నుంచి వచ్చిన ప్రేరేపణ అవుతుంది తప్ప, రేప్ ఎలా అవుతుందని పూజ పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ‘మెన్‌టూ’ అనే కొత్త ఉద్యమ కాన్సెప్ట్‌ని పైకి తెచ్చారు. పూజ కూడా ఒకప్పుడు స్త్రీల హక్కుల కోసం పోరాడినవారే. స్త్రీ స్వేచ్ఛను, స్త్రీ విముక్తిని ఆకాంక్షిస్తూ పూజ మంచి మంచి ఆర్టికల్స్ రాశారు. మరి ఇప్పుడేమిటి ఇలా?! పైగా.. ‘మనమిలా వీకర్ సెక్షన్ అంటూ స్త్రీలను సమర్థించుకుంటూ పోతే సమసమాజం ఏనాటికీ సిద్ధించదు. అందుకనే ‘మెన్‌టూ’ ఉద్యమం ప్రారంభించి అమాయకులైన పురుషుల వైపు నిలబడతాను’ అని ప్రతిన పూనారు! మెన్‌టూ అనే ఆలోచనకు పూజాబేడీని పురికొల్పిన కారణాలు ఏవైనా కానివ్వండి. పూజ అనే ఏముంది.. మగవాళ్లలోనే చాలామందికి ఈ ఆలోచన ఇప్పటికే వచ్చి ఉంటుంది. అయితే ‘మీటూ’లా.. ‘మెన్‌టూ’ నిలబడుతుందా? మీటూ సబ్జెక్టివ్. ‘నాక్కూడా ఇలా జరిగింది’ అని చెప్పుకోవడం. ‘మెన్‌టూ’ ఆబ్జెక్టివ్. ‘మగజాతికి కూడా ఇలా జరుగుతోంది’ అని ప్రతిధ్వనిగా నినదిం చడం. ‘నాక్కూడా’ అని ఒక్కరే బయటికి రావడం, ‘మేము కూడా’ అని నలుగుర్ని పోగేసుకుని రావడం ఒకటే అవుతుందా? కరణ్ గుడ్ బాయ్ అనుకున్నా.. అతడు చేసిన బ్యాడ్ థింగ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. కెరీర్ తప్ప ఏమీ ఇంట్రెస్ట్ లేనివాడు ఆ అమ్మాయిని అన్నాళ్లు ఎందుకు ‘భరించినట్లు’? కెరీర్ తప్ప అసలేమీ ఇంట్రెస్ట్ లేనివాడు మొదట్లోనే ఆ అమ్మాయి స్నేహాన్ని ఎందుకు తుంచేయనట్లు? కెరీరే సర్వస్వం అనుకున్నవాడు ఎప్పటివో మెసేజ్‌లను తనకు తను ఇచ్చుకున్న సర్టిఫికెట్లలా ఎందుకు భద్రంగా ఉంచుకున్నట్లు?‘పాపం.. కొంతమంది మగాళ్లు’ అని పూజాబేడీ అంటున్నవాళ్లలో కరణ్ కూడా ఒకడని అనుకున్నా.. ఆ కొంతమంది కోసం కాదు కదా ఉద్యమాలు నడవాల్సింది, అసలు ఉద్యమాన్ని ఒకరెక్కడి నుంచో వచ్చి నడిపించడం ఏంటి? ఉద్యమమే నడిపిస్తుంది బాధితుల్నంతా ఒక చోటకు రప్పించి! అలాంటి ఉద్యమమే ‘మీటూ’. కరణ్ నిజంగా ఇన్నోసెంట్ అయుండీ, ఆ అమ్మాయి నాట్ ఇన్నోసెంట్ అయి ఉన్నా కూడా.. ‘మెన్‌టూ’ అని పిడికిలి బిగించే హక్కు మగాళ్లకేం వచ్చేయదు.. బాధింపును ఒక హక్కుగా వినియోగించుకుంటున్నవాళ్లే ఎక్కువమంది ఉన్నప్పుడు. -
మాటల పాట.. కొండల్ ఆట
పోరాటాల పురిటిగడ్డ మన నల్లగొండ ..ఎంతో మంది కవులు, కళాకారులకు పుట్టినిళ్లుగా తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిపోసింది. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని కలిగించిన ఘనత కళాకారులదే. గజ్జెకట్టి తెలంగాణ ధూంధాంతో హోరెత్తించి ప్రజా చైతన్యంతో పాలకులను మేలుకొల్పింది కళాకారులే. రేయింబవళ్లు పాటే ప్రాణంగా బతికిన ముద్దు బిడ్డ ఈ నాగిళ్ల కొండల్. సాక్షి, మిర్యాలగూడ టౌన్ : నిరుపేద కుటుంబంలో నాగిళ్ల కొండలు జన్మించాడు. చిన్నప్పటి నుంచి పల్లె పాటలు.. జానపదాలు అంటే.. ఆ యువకుడికి ప్రాణం. తన మాటలే పాటలుగా వినిపిస్తాయి. ‘పల్లెకు వందనం.. కన్నతల్లికి వందనం... పాట నేర్పిన పల్లెకు వందనం...’ అంటూ పుట్టిన పల్లెకు ..కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. రచయితగా.. గాయకుడిగా తెలంగాణ ఉద్యమంలోని అన్ని జిల్లాల్లో సుమారు 800 వరకు ప్రదర్శనలు ఇచ్చాడు. కాలుకు గజ్జకట్టి భూజాన గొంగడి వేసుకొని రాత్రనక, పగలనక తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలు, వెనుకబాటు తనం, తెలంగాణ యాస, భాష, గోసలపై తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపాడు త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల అన్నరావు క్యాంపుకు చెందిన నాగిళ్ల బక్కయ్య–బుచ్చమ్మల దంపతులు నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వారు. వీరికి రెండవ సంతానం అయిన నాగిళ్ల కొండలుకు చిన్నప్పటి నుంచి పాఠశాలల్లో పాటలను పాడుతూ ఆకట్టుకునే వాడు. నల్లగొండతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ‘తల్లి నీ ఒడినిండా .. త్యాగాల మూట... పల్లె నీ బతుకంతా...ఉద్యమాల బాట...గాయాలు గుండెనిండా..ఎత్తేను పోరాట జెండా...అలుపన్నది ఎరుగకుండా కదిలేను నా.. నల్లగొండా...’ అనే జిల్లా చరిత్ర పాటలను వరంగల్‌లో జరిగిన ధూం ధాంలో పాడితే ప్రజలు జేజేలు పలికారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగక కాలుకు గజ్జెకట్టి..భుజాన గొంగడి వేసి తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ వెనుకబాటుపై గళమెత్తి దగాపడ్డా తెలంగాణపై దండు కదలాలని తమ వంతుగా పాత్రను పోషించి.. పాటమ్మ..నాకు ప్రాణా మా.. అంటూ ఉర్రూతలూగించాడు. ఇతను పాటగాడే కా దు.. రాతగాడు కూడా... ప్రజల మాటలను పాట లు గా అల్లి.. పాడే ప్రజా కళా కారుడు నిరుపేద కుటుం బం నుంచి..వచ్చి... పాటే తన ప్రాణంగా.. నేటి వరకు ఎన్నో గీతాలు, పాటలను రచించి పాడాడు. చిన్నతనం నుంచే పాటలు పాడటంతో పాటు పల్లెల్లో దండోరాను మోగించేవాడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలపై పల్లెల్లో ప్రజలకు పాటలను వినిపించేవాడు. 800 వరకు ప్రదర్శనలు ప్రజా యుద్ధనౌక గద్దర్ పాడిన పాటలకు అడుగులు కలిపినా... విమలక్క ధూంధాం జాతరలో దుముకులాడిన... ఫైలం సంతోష్, గిద్దె రామనర్సయ్య పాటలతో గొంతు కలిపినా...అన్నీ తెలంగాణ జన సైన్యం కోసమే. ప్రజా కళాకారుడిగా గత 10 ఏళ్లుగా సుమారు 800 వరకు ప్రదర్శనలను ఇచ్చి ప్రజలందరి మన్ననలను పొందాడు. తెలం గాణ ఉద్యమంలో విస్తృతంగా పనిచేసిన ఇతను పలు జిల్లాలతో పాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ పట్ట ణాల్లో తన ఆట పాటలను ప్రదర్శించారు. మిత్ర రాసే పాటలను మితిమీరంగా అభిమానించే కొండలు విమలక్క ఆటా పాటలకు జతకట్టాడు. ఉద్యమాలకు పుట్టినిళ్లు నల్లగొండ వెలుగొందుతున్న నాగిళ్ల కొండలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాంçస్కృతిక కళా వేదిక రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశాడు. కలంనుంచి జాలు వారిన పాటల ఒరవడి తన కలం ..గళం నుంచి వెలువడిన పాటలు పేదోళ్ల బతుకు చిద్రంను చూపించేవి. పేదోళ్ల వెతలపై అతని కలం కవాతు చేసేది. ‘పల్లె యాడికొస్తుందంటూ’ చిన్నతనంలో తన గ్రామంలో పద్దులు, ఉయ్యాల పాటలను పాడి అమ్మలక్కలను. బాగోతం చెప్పే పెద్దమనుషులను, సారా తాగి ఊగోళ్ల తంతును నమ్మకాలు, జానపదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలతో పాటు అనేక అంశాలపై పాటలను రాసి ఆల్బం తయారు చేశాడు. తెలంగాణ సాంస్కృతిక సారధిగా పని చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పతకాలపై పాటలను రాసి బంగారు తెలంగాణ కోసం పల్లెపల్లెల్లో ప్రజలను చైతన్యం చేశాడు. ఈ సంక్షేమ పథకాలపై ఆల్భంను తయారు చేసి మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతే కాకుండా హరితహారం వంటి కార్యక్రమాలకు కలెక్టర్ల చేతుల మీదుగా ప్రశంసలు పొందాడు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం ప్రస్తుతం కనుమరుగు అవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సి ఉంది. నాడు జనపదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కానీ నేటి కాలానికి అనుగుణంగా సంస్కృతి, సంప్రదాయాలను కూడా మారుస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉంది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయిన ప్రతి కళాకారుడిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. – నాగిళ్ల కొండల్ -
‘అయోధ్య’ కోసం ఉద్యమానికి సిద్ధం
ఉత్తాన్(మహారాష్ట్ర): అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అవసరమైతే ఉద్యమ బాటపడతామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) హెచ్చరించింది. అయోధ్య కేసు కన్నా తమకు ఇతర ప్రాధమ్యాలున్నాయన్న సుప్రీంకోర్టు ప్రకటనను హిందువులు అవమానంగా భావించారని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందిర నిర్మాణానికి అన్ని మార్గాలు మూసుకుపోతే ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో కేంద్రంపై తాము ఒత్తిడి పెంచడంలేదని, రాజ్యాంగం, చట్టాలను గౌరవిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు అంటే తమకు గౌరవం ఉందని, హిందువుల సెంటిమెంట్లను కూడా కోర్టు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. ‘అయోద్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ సాగుతోంది. అక్టోబర్ 29న జరిగిన విచారణలో హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడుతుందని భావించారు. కానీ సుప్రీం తీర్పు అందుకు విరుద్ధంగా ఉండటంతో వారు ఆవేదన చెందుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. శబరిమల వివాదంపై స్పందిస్తూ.. మహిళల పట్ల తమకెలాంటి వివక్ష లేదని, కానీ ఆలయ నియమాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శబరిమల ఆలయంలోనికి మహిళల ప్రవేశానికి తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ అభిప్రాయపడ్డారు. మరి ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు కదా.. రామ మందిరం కోసం ఉద్యమిస్తామన్న ఆరెస్సెస్ వ్యాఖ్యలను శివసేన ఎద్దేవా చేసింది. ఇప్పుడు కేంద్రం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందని, ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు కదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయోధ్య తీర్పుపై నిరసన మాత్రమే వ్యక్తం చేస్తామని చెప్పిన ఆరెస్సెస్ ఇప్పుడు హడావుడిగా ఉద్యమం చేస్తామని ప్రకటిస్తోందని హేళన చేసింది. -
అణచివేత నుంచే ఉద్యమాలు: విమలక్క
తొగుట (దుబ్బాక): పాలకుల అణచివేత నుంచే ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు. సిద్దిపేట జిల్లా వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన సంవిధాన్ సమ్మాన్ యాత్ర (రాజ్యాంగ గౌరవయాత్ర)కు శనివారం ఆమె సంఘీభావం ప్రకటిం చారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ మైదాన ప్రాంతంలో 50 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించడం సాధ్యంకాదని నిపుణులు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మల్లన్న సాగర్ విషయంలో మొండిగా వ్యవహరిస్తోందన్నారు. మహిళలు ముందుండి పోరాడితే విజయం మనదేనన్నారు. వేములఘాట్ ను రక్షించుకునేందుకు గ్రామస్తులు 875 రోజులుగా దీక్షలు చేయడం అభినందనీయమన్నారు. -
కేరళ కుట్టికి అత్యున్నత పురస్కారం
‘ఇది ప్రతి స్త్రీ జీవితంలో అనుభవమయ్యే పునరుత్పత్తి పునాది ప్రక్రియ. కానీ ఏ దేశంలోనైనా చర్చించేందుకు ససేమిరా ఇష్టపడని విషయం కూడా ఇదే. రక్తస్రావమనే అత్యంత సహజ ప్రక్రియకి స్త్రీలంతా శిక్షకు గురవుతున్నారు’ అంటూ పట్టుమని 18 ఏళ్లు కూడా లేని కేరళ కుట్టి అమికా జార్జ్ బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ‘ఫ్రీ పీరియడ్స్’ ఉద్యమం ఆమెకు గోల్‌కీపర్స్ గ్లోబల్ అవార్డు దక్కేలా చేసింది. సామాజిక అభివృద్ధి రంగంలో ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రగతిని పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా బిల్, మెలిండా ఫౌండేషన్ 2017లో గోల్‌కీపర్స్ అనే సామాజిక చైతన్య ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏళ్ల అమికా జార్జ్ పేద బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్కిన్స్ కోసం బ్రిటన్ వీధుల్లో పూరించిన శంఖారావం ఆమెకు ఈ అవార్డు దక్కేలా చేసింది. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం చివరకు బ్రిటన్ వీధుల్లో స్త్రీ, పురుష భేదం లేకుండా సాగింది. దాదాపు 2 వేల మంది యువతీయువకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు బ్రిటన్ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమ అవసరాలను తీర్చేందుకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ కోసం 1.5 మిలియన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అభివృద్ధి చెందిన బ్రిటన్‌లాంటి దేశాల్లోనే ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు శానిటరీ ప్యాడ్స్‌ని కొనుగోలు చేయలేని పేదరికంలో మగ్గుతున్నారని ప్లాన్ ఇంటర్నేషనల్ సర్వేలో చదివిన అమికా జార్జ్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమ క్రమంలో బ్రిటన్ పేద బాలికలు శానిటరీ న్యాప్కిన్స్ కొనుక్కోలేని స్థితిలో ఆ అవసరానికి కాగితాలనూ, పాత న్యూస్ పేపర్స్‌నీ, సాక్స్‌నూ వాడుతుండటం తన హృదయాన్ని కలిచివేసిందంటోంది అమికా జార్జ్. ఇదే ఆమె చేపట్టిన ‘ఫ్రీ పీరియడ్’ ఉద్యమానికి పునాది అంటోంది. కేంబ్రిడ్జి వర్సిటీలో చదువుకు నేందుకు వెళ్లిన అమికా ఈ ఉద్యమంతో చరిత్రే సృష్టించింది. 2017 డిసెంబర్లో జరిగిన ఈ ఉద్యమం ఫలితంగా అక్కడి పేద బాలికలకు దక్కిన ఫలితాన్ని గుర్తించిన గోల్‌కీపర్స్ సోషల్ ప్రోగ్రెస్ ఆస్కార్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు మహిళలను ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, మహిళల పిల్లల హక్కుల కార్యకర్త గ్రేస్ తదితర ప్రముఖులు అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూయార్క్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇరాక్‌కు చెందిన 24 ఏళ్ల నదియా మురద్, కెన్యాకు చెందిన 28 ఏళ్ల డిస్మస్ కిసీలు ఈ అవార్డులు అందుకున్నారు. -
ఉదృతమవుతున్న వెలిగోండ ప్రాజెక్ట్ ఉద్యమం
-
పెంకా.. బతుకుతుంది ఇంకా..
పెంకా బతకనుంది.. మరికొన్ని రోజుల్లో మరో బుల్లి పెంకాకు బతుకునివ్వనుంది. అక్రమంగా దేశ సరిహద్దును దాటినందుకు పెంకా అనే ఆవుకు బల్గేరియా ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, పెంకాను రక్షించాలంటూ అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి ఆ దేశ సర్కారు తలొగ్గింది. గర్భంతో ఉన్న పెంకాకు ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లోనూ దానికి ఏ విధమైన వ్యాధులు సోకలేదని నిర్ధారణ అయింది. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతోపాటు పెంకాను రక్షించాలంటూ పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమమూ మొదలైంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పెంకాకు విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తోడేళ్లు వెంటబడటంతో పెంకా సరిహద్దును దాటి సెర్బియాలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న దాని యజమాని తిరిగి తెస్తున్నప్పుడు సరిహద్దు భద్రతాధికారులు అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా యూరోపియన్ యూనియన్‌లో సభ్యదేశం కాని సెర్బియాకు వెళ్లడం.. తిరిగి రావడం సహించరాని నేరమంటూ పెంకాకు మరణశిక్ష విధించారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
తమిళనాట మరో ఉద్యమం
చెన్నై: తమిళనాట మరో ఉద్యమం మొదలైందంది. తీత్తుకుడిలోని స్టెరిలైట్ కాఫర్ ప్లాంట్‌ను మూసివేయాలని వేలాది మంది నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. ప్లాంట్ నుంచి విడుదలయ్యే కలుషిత నీటి ద్వారా పంటలు, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నాయని ఆందోళనకు దిగారు. ఎండీఎంకే అధ్యక్షుడు వైగో, మక్కల్ నీది మయ్యం అధినేత, సినీ నటుడు కమల్‌హాసన్ ఈ దీక్షలకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిసింది. -
ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి ఉద్యమం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. దీని కోసం యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలతోపాటు సామాజిక అం శాలపై పోరాడుతున్న సంఘాలతో కలసి పనిచేస్తామన్నారు. ఆదివారం బీసీ భవన్లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నా యని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 4 లక్షలకుపైగా ఖాళీలున్నాయని, అలాగే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లోనూ ఖాళీల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ఉమ్మడి ఉద్యమం ద్వారానే ఖాళీలు భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని తెలిపారు. యూనివర్సిటీలు, జిల్లాల వారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలకు సూచించారు. క్షేత్రస్థాయి నిరసనలు ముగిసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
లంబాడాలను తొలగించేదాకా.. లడాయే
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు లడాయి ఆగదని పలువురు ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గుడిహత్నూర్‌లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో గురువారం ఆదివాసీ మహిళా పోరుగర్జన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీ మహిళలు భారీగా తరలివచ్చారు. అలాగే ఆదివాసీ ప్రొఫెసర్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరై తమ గొంతుక వినిపించారు. మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే మా పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల ఆదివాసీ నాయకుల రాక ఆదివాసీ మహిళా పోరు గర్జన సభకు ఇతర రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. వీరిలో ప్రొఫెసర్ ఉయిక అమ్రాజ్, దుర్వ సుశీల, ప్రొఫెసర్ సువ ర్ణ వార్కెడె, అసిస్టెంట్ ప్రొఫెసర్ కంచర్ల వాలంటిన ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా ఆది వాసీ మహిళా నాయకులు కుమ్ర ఈశ్వరీబాయి, దుర్వ చిల్కుబాయి, మర్సకోల కమల, మ డావి కన్నీబాయి, సోందేవ్‌బాయి, లక్ష్మీబాయి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ జెడ్పీ చైర్మన్ సిడం గణపతి, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాక కా ర్యదర్శి ఉయిక సంజీవ్, ఆదివాసీ విధ్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాక కార్యదర్శి వెడ్మబొజ్జు, కార్యదర్శి కొడప నగేష్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొడప జాలంజాకు, కార్యదర్శి బాపురావు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, ఉమ్మడి జిల్లా ఆది వాసీ నాయకులు విజయ్, గోపిచంద్, కుడ్మెత తిరుపతి, భూమయ్య, పాండురంగ్, మారుతి, జలపతి,ఖమ్ము, భాస్కర్, అశోక్, వెంకటేశ్ హైమన్‌డార్ఫ్ యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. అస్తిత్వం కోసమే పోరాటం మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే పోరాడుతున్నామని ప్రొఫెసర్ ఉయిక అమ్రాజ్ అన్నారు. ప్రకృతి ఒడిలో స్వచ్ఛంగా బతికే మా అమాయకత్వాన్ని చేతకాని తనంగా తీసుకుని ప్రభుత్వాలు తమతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజుల వంశం మాది. అలాంటి మాకు సమాజంలో మనుషులుగా కూడా పరిగణించడం లేదు. ఉద్యమించక పోతే మనల్ని క్షమించరు ఆదివాసీల హక్కులను హరిస్తూ విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో పెత్తనాన్ని అనుభవిస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమిద్దామని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు పిలుపు నిచ్చారు. ఉద్యమంలో కలిసిరావాలని కోరారు. రాష్ట్ర సాధనలో ఆదివాసీ త్యాగాలను మరిచారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదివాసీలు తమదైన శైలిలో ఉద్యమించి చేసిన త్యాగాలు ముఖ్యమంత్రి మరిచారని ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సాధించాక పోలవరం ప్రాజెక్టులో లక్షల మంది ఆదివాసీలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాన్ని చట్ట విరుద్ధంగా లంబాడాలు ఎస్టీలో కొనసాగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వారికి ఉన్న హోదా, రాజ్యాంగ అధికారాలు తదితర అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిద్దామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ దిశగా అందరం సామరస్యంగా కృషి చేద్దామని ఆమె కోరారు. – ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
ధరలపైనే జనాగ్రహం! ఇరాన్‌ను కుదిపేస్తున్న ఉద్యమం
‘‘గాజా కాదు, లెబనాన్ కాదు. ఇరాన్ కోసం నేను ప్రాణం ఇస్తా!’’ అనే నినాదంతో జనం ఇరాన్ అంతటా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. నిరసన ర్యాలీలతో తిరగబడిన ప్రజలపై ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది. మంగళవారం వరకూ జరిగిన హింసలో దాదాపు 22 మంది మరణించారు. కిందటి గురువారం ఇరాన్లో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు సవాలుగా మంగళవారం నుంచి సర్కారుకు అనుకూలంగా ర్యాలీలు మొదలయ్యాయి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడిన ప్రజాస్వామ్యం కోసం టునీసియా మొదలు ఈజిప్ట్ వరకూ అరబ్ దేశాల్లో ‘అరబ్ వసంతం’ వంటిదే ఇరానీల ఆందోళన అని పాశ్చాత్య మీడియా ప్రచారం చేస్తోంది. అయితే, దాదాపు ఎనిమిది కోట్లకు పైగా జనాభా ఉన్న ఇరాన్లో ప్రస్తుత అశాంతికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులే కారణమన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. ప్రాచీన నాగరికతకు ప్రసిద్ధిగాంచిన ఇరాన్లో ప్రభుత్వంపై ఆగ్రహించిన జనం వీధుల్లోకి రావడం ఇది మొదటిసారి కాదు. 2009 అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని నిరసిస్తూ సాగిన ఉద్యమంలో దాదాపు 34 మంది మరణించారు. ప్రజాగ్రహానికి ఆజ్యం పోసిన డిసెంబర్10 బడ్జెట్! అధ్యక్షుడు హసన్ రూహానీ కిందటి డిసెంబర్10న ప్రవేశపెట్టిన బడ్జ్ట్ ప్రతిపాదనలు నిత్యావసరాలతోపాటు అనేక వస్తువుల ధరలు బాగా పెంచేలా ఉండడంతో ప్రజల్లో అసంతృప్తి లేచింది. ఓ పక్క జనంపై ధరల భారం పెంచుతూనే మరో పక్క మత సంస్థలకు ఇతోదికంగా నిధుల కేటాయింపులకు బడ్జెట్ వీలు కల్పించింది. ముడి చమురు అమ్మకాల విషయంలోనేగాక, పశ్చిమాసియా రాజకీయాల్లో ఆధిపత్యానికి అరబ్ దిగ్గజం సౌదీఅరేబియాతో పోటీపడడం వల్ల కూడా ఇరాన్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. ‘ప్రాంతీయ పెద్దన్న’ హోదా కోసం షియా ముస్లింల జనాభా ఉన్న దేశాలు, షియా పాలకులున్న రాజ్యాలకు శక్తికి మించి సాయపడడం కూడా ఇరాన్‌ను సంక్షోభంలోకి నెట్టింది. దేశంలో పెట్రోలు వంటి నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం పెరుగుతుండగా ఇరాన్ విదేశాంగ విధానం ప్రజల్లో అసంతృప్తి జ్వాలలను ఎగదోస్తోంది. పాలస్తీనా గెరిల్లా రాజకీయ సంస్థ హమస్, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా, సిరియా అసద్ ప్రభుత్వం, యెమెన్ హౌతీలకు ఇరాన్ సర్కారు అడిగినంత నిధులు సమకూర్చడం ఇరానియన్లకు నచ్చడంలేదు. ఆంక్షలు, ఇతర కారణాలతో అంతర్గత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇలాంటి సాయం చేయడం అనవసరమనీ, ఓ రకంగా చూస్తే ఇది దేశద్రోహంతో సమానమని ప్రజలు భావిస్తున్నారు. నాయకుడు లేని ప్రజా ఉద్యమం! ఇరాన్లో రాజధాని టెహరాన్ తర్వాత రెండో పెద్ద నగరం మాషాద్లో డిసెంబర్28న మొదలైన సర్కారు వ్యతిరేక నిరసన ప్రదర్శనలు దేశంలోని 27 నగరాలు, పట్టణాలకు వారంలోపే వ్యాపించాయి. ఈసారి జనాందోళన ప్రత్యేకత ఏమంటే ప్రజలు ఏ నాయకుడి పేరు ప్రస్తావించడం లేదు. ఏ సంస్థ గొడుగు కింద పోగవడం లేదు. అధ్యక్షుడు రూహానీ, అగ్ర(మత)నాయకుడు అలీ హొసేన్ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
నీకూడా నేనున్నట్లే
గాయాన్ని దాచిపెట్టమని చెబితే గాయం మానదు. రేగుతుంది! గాయం పెడుతున్న బాధను పంచుకుంటే... అదే గాయం.. ఉద్యమానికి ఓ గేయం అవుతుంది. హ్యాష్‌టాగ్ ‘మీటూ’ ప్రపంచంలో ఉన్న గాయాలను ఇప్పుడు యుద్ధభేరిగా వినిపిస్తోంది. ‘నేను సైతం’ అనేది ఒక యజ్ఞంలో సమిధ అవడం అయితే.. ‘నేను కూడా’ అనేది.. నీకూడా నేనున్నానని చెప్పడం. పద్నాలుగేళ్ల అమ్మాయి, ఇరవై నాలుగేళ్ల యువతి ఒకేలా ఉండరు. వేధింపులను భయపడడంలో మాత్రం ఇద్దరూ ఒకేలా ఉంటారు! ‘అక్కా.. వాడు ఏదోలా చూస్తున్నాడు’. అవునా! వాడి వైపు చూడకు. ‘అక్కా.. వాడు నన్ను కామెంట్ చేశాడు’. ‘తిరిగి కామెంట్ చేయలేదు కదా’ ‘అక్కా.. వాడు నన్ను టచ్ చేశాడు’. నాతో చెప్తే చెప్పావ్.. ఎక్కడా అనకు. ‘అక్కా.. వాడు గెస్ట్‌హౌస్‌కి రమ్మన్నాడు’ ‘మానేయ్.. ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం’ 1996. బ్రూక్లిన్, న్యూయార్క్. తరానా బర్క్ (24) తన ఆఫీస్ నుంచి బయటికి వచ్చింది. ఎవడో విజిల్ వేసుకుంటూ, ఆమెను రాసుకుని పోయాడు. కెవ్వుమంది. ‘స్టుపిడ్’ అని తిట్టుకుంది. ‘గర్ల్స్ ఫర్ జెండర్ ఈక్విటీ’ అనే సంస్థలో ఆమె ప్రోగ్రామ్ డైరెక్టర్. భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం ఆమె ప్రొఫెషన్‌కే తలవంపు. కానీ డైరెక్టర్ కన్నా ముందు.. ఆమె ఒక ఆడపిల్ల. ఆడపిల్లకన్నా ముందు.. ఆమె ఒక నల్లవాళ్ల పిల్ల. ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ల అమ్మాయి. అయితే మాత్రం? అమెరికాలోనే పుట్టింది కాబట్టి అమెరికా ఆమెది కూడా అవదా? అవుతుంది. అమెరికాలో ఉన్నవాళ్లందరికీ ఉన్న స్వేచ్ఛ ఆమెకూ ఉండాలి కదా! ఉంటుంది. మరెందుకంత భయం? స్త్రీ ధైర్యంగా బయటికి వచ్చి ఏ స్వేచ్ఛనైనా సాధించగలదు. మగవాడి వేధింపుల నుంచి స్వేచ్ఛ కోసం మాత్రం అంత తేలిగ్గా బయటికి రాలేదు. బయటికి రావడం అంటే పరువును బజారుకు ఈడ్చుకోవడం మరి! రెండో రోజు.. డ్యూటీలో ఉంది బర్క్. ‘‘నీ కోసం ఎవరో వచ్చారు బర్క్. నీతో మాట్లాడాలట!’’ గుండె ఝల్లుమంది అంత పెద్ద అమ్మాయికి! ‘‘ఎవరు వాడు?’’ అంది. ‘‘వాడు కాదు. అమ్మాయి. హెవన్ అట పేరు. నీతో పర్సనల్‌గా ఏదో చెప్పుకోవాలట’’. బర్క్ అంతకు ముందు రోజు ‘ఆల్–గర్ల్’ బాండింగ్ సెషన్లో అమ్మాయిలకు ధైర్యం నూరిపోయింది. అబ్బాయిల కన్నా మనం ఎందులోనూ తక్కువకాదు అని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ సెషన్‌కు వచ్చిన అమ్మాయిలలో ఒక అమ్మాయి హెవెన్. పద్నాలుగేళ్లుంటాయి. బ్లాక్ హెయిర్. బ్లాక్ ఐస్. సన్నగా అందంగా ఉంది. కానీ ‘బ్లాక్’. అమెరికాలో బ్లాక్ అంటే చిన్నచూపు. హెవెన్ది కూడా అలాంటి ప్రాబ్లమే అయివుంటుంది అనుకుంది బర్క్. ‘‘అక్కా.. నేను చెప్పేది వినే టైమ్ ఉందా నీకు’’ అంది హెవెన్ నేరుగా. బర్క్ అప్పటికే పని ఒత్తిడిలో బాగా అలసిపోయి ఉంది. ఏముంటుంది ఆ పిల్ల కొత్తగా చెప్పుకునేది? నిన్న వాడెవడో తనని రాసుకుంటూ వెళ్లినట్లే.. ఇంకొకడెవరో ఈ అమ్మాయిని హెరాస్ చేసి ఉంటాడు అనుకుంది. ‘‘అక్కా నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంది హెవన్. బర్క్ అలసట ఒక్కసారిగా ఎగిరిపోయింది. హెవెన్ని దగ్గరకు లాక్కుని గట్టిగా తన గుండెలకు అదుముకుంది. తల నిమిరింది. ‘‘వాట్ హ్యాపెండ్ బేబీ’’ అని అడిగింది బర్క్. ‘‘అక్కా.. ఇక్కడ కాదు. నీ గదిలోకి వెళ్దాం’’ అంది హెవెన్. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ‘‘తలుపెయ్ అక్కా..’’ అంది హెవన్. బర్క్ తలుపు వేసింది. ఒంటి మీద ఉన్న బట్టలు తీసి బర్క్ ఎదురుగా నిలబడింది హెవెన్. బర్క్ అదిరిపడింది. హెవెన్ శరీరంలో ఎదుగుతున్న సున్నిత భాగాలు కమిలిపోయి ఉన్నాయి! హెవెన్ తల్లికి ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆ వ్యక్తి తనకెంత నరకం చూపిస్తున్నదీ, తన దేహంపై ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నదీ ఒకటొకటిగా చెప్పడం మొదలు పెట్టింది హెవెన్. బర్క్ వినలేకపోతోంది. ఆమెకు కళ్లు తిరుగుతున్నట్లుగా, కడుపులో దేవినట్లుగా అనిపిస్తోంది. ‘‘హెవెన్.. నేను అర్థం చేసుకోగలను.. అయితే నాకు కాదు.. ఇంకొక ఫిమేల్ కౌన్సెలర్ ఉంది. ఆమెకు చెప్పు. ముందు బట్టలు వేసుకో’’ అని చెప్పింది. ఇంకే ఘోరాలు వినవలసి వస్తుందో అని ఆమె అలా చెప్పింది. బర్క్ సున్నిత మనస్కురాలు. హెవెన్ హర్ట్ అయింది. ‘అక్కా.. నేనింత బాధపడుతున్నాను కదా.. నువ్వు కనీసం నా బాధను వినలేవా?’’ అన్నట్లు చూసింది. గాయాన్ని విప్పి చూపిస్తున్నప్పుడు.. విప్పకు కట్టేయ్ అనడం అంటే.. గాయాన్ని మరింత రేపడమే. బర్క్ చేసింది అదే పని! హెవెన్ వెళ్లిపోతుంటే.. ఆమెను వెనకనుంచి చూస్తూ ఉండిపోయింది బర్క్. ‘మీటూ’ అని ఆ అమ్మాయికి చెప్పాలనుకుంది కానీ.. చెప్పలేకపోయింది. 2006. హార్లెమ్, న్యూయార్క్. పదేళ్లు నలిగిపోయింది బర్క్. కౌన్సెలింగ్ డైరెక్టర్‌గా బాధితురాళ్లైన యంగ్ గర్ల్స్‌ని చాలామందినే చూసింది, మాట్లాడింది బర్క్. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు హెవనే గుర్తుకొచ్చేది. చిన్న పిల్ల! ఇప్పుడెలా ఉందో? ఇరవై నాలుగేళ్లు వచ్చి ఉంటాయి తనకు. అంటే పదేళ్ల క్రితం తన వయసెంతో ఇప్పుడు హెవెన్ వయసు అంత. ఆ పిల్లే నయం! బాధను చెప్పుకునే ధైర్యం ఉంది. ఆ బాధను వినడానికి తను భయపడింది. మనసును ముల్లులా గుచ్చుతోంది బర్క్‌ను ఆ ఆలోచన. బర్క్ ఆలోచిస్తూనే ఉంది. ఆడపిల్లలకు అండగా ఉండాలనుకున్న వాళ్లెవరైనా.. ముందు, వాళ్లు ధైర్యంగా ఉండాలి. దేనికీ అవమానంగా ఫీల్ అవకూడదు. నేను ఒంటరిదాన్ని అనుకోకూడదు. ఆ తర్వాత, సహాయం కోరి వచ్చినవారిని ఆదుకోవాలి. ‘నిన్ను చూడ్డానికే, నువ్వు చెప్పింది వినడానికే, నిన్ను అర్థం చేసుకోడానికే నేనిక్కడ ఉన్నాను. నీ కోసం ఉన్నాను’ అని చెప్పగలగాలి. ఒకే బాధను అనుభవిస్తున్న వాళ్ల మధ్య బంధం ఏర్పడుతుంది. ఆ విధంగా చూస్తే ఈ లోకంలో వివక్షకు, లైంగిక వేధింపులకు గురవుతున్న అమ్మాయిలంతా ఒకరికొకరు రక్తసంబంధీకులే. అప్పుడు ఒకరి బాధ.. ఆ ఒక్కరి బాధే కాదు. ఒకరి ఆలోచన ఆ ఒక్కరి కోసమే ఆలోచన కాదు. ఒక నిర్ణయానికి వచ్చింది బర్క్. ఒక ఉద్యమంలా బాధితులందరినీ ఒక చోటికి తేవాలనుకుంది. ‘మీటూ’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. ‘అయ్యో.. నీకలా జరిగిందా?’ అని బాధపడడానికీ, ‘నాక్కూడా అలా జరిగింది’ అని బాధను పంచుకోడానికి మధ్య చాలా తేడా ఉంది. టీనేజర్ల నుంచి అరవైకి చేరువవుతున్న వాళ్ల వరకు ఆడవాళ్లంతా ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తన అనుభవాన్ని మిగతావారితో షేర్ చేసుకోవడంతో ‘మీటూ’ ఉద్యమానికి ఊపు వచ్చింది. ఆ రోజు ఆ పద్నాలుగేళ్ల అమ్మాయితో అనలేకపోయిన ‘మీటూ’ అనే మాటనే తన తన కాంపెయిన్‌కి పేరుగా పెట్టుకున్నారు బర్క్. ‘మైస్పేస్’ అనే వెబ్సైట్లో మీటూ అనే స్లాట్ తీసుకుంది. మరి.. ‘మీటూ’ అని ఆ పద్నాలుగేళ్ల అమ్మాయి హెవెన్‌తో ఆ రోజున ఆమె చెప్పుకోలేకపోయిన ఆ అనుభవం ఏమిటి? రేప్ అండ్ సెక్సువల్ హెరాస్మెంట్. పదమూడేళ్ల వయసులో దగ్గరి బంధువు ఒకరు బర్క్‌ను రేప్ చేశాడు. బయటికి చెప్తే చంపేస్తానని అతడు అనలేదు. ‘‘చెప్పుకో.. నీ ఇష్టం. నీ పరువే పోతుంది’’ అన్నాడు. ‘పరువు పోయిన ఆడపిల్లను ఈ లోకం బతకనివ్వదు’ అని అన్నాడు. ‘ఒకసారి పరువు పోయాక మగవాళ్లంతా ఇప్పుడు నేను ఏదైతే చేశానో అదే చేయడానికి నిన్ను వెంటాడతారు’ అని కూడా అన్నాడు. బర్క్ భయపడింది. ఆ మాటలు ఆమెలో నాటుకుపోయాయి. బయటికి చెప్పలేదు. అలా చెప్పకపోవడంతో ఆ బంధువుకి అనుమతి పత్రం లభించినట్లయింది. తర్వాత మరో రెండుసార్లు ఆమెను రేప్ చేశాడు. ఎప్పటికో కానీ అతడి పీడ వదల్లేదు బర్క్‌కి.ఇదైనా బర్క్ చెప్పుకుంటే బయట పడిన విషయం కాదు! ‘మీటూ’ కథల్లో ఓ అజ్ఞాత కథ ఆమెను పట్టించింది. నిజానికి ఆమె ‘మీటూ’ కూడా సోషల్ మీడియాలో అజ్ఞాతంగానే కొనసాగుతోంది. మొన్న అక్టోబర్ 15 వరకు కూడా బర్క్ గురించీ, బర్క్ మీటూ గురించి ఎవరికీ తెలీదు. 2017 అదే హార్లెమ్. అదే న్యూయార్క్. బర్క్ మాత్రం ఇప్పుడు కొత్త మనిషి! నలభై నాలుగేళ్ల బర్క్‌కు అక్టోబరు నెలలో ఓ ఉదయం ప్రముఖ హాలీవుడ్ నటి అలిస్సా మిలానో నుంచి ఫోన్ వెళ్లింది. ఆమె వయసు కూడా నలభై నాలుగేళ్లే. ఆ ఇద్దరు సమవయస్కుల మధ్య సంభాషణ ఇది. ‘‘గుడ్ మార్నింగ్ తరానా బర్క్. ఐ యామ్ అలిస్సా మిలానో’’. ‘‘వావ్.. చెప్పండి అలిస్సా’’. ‘‘కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో నేను పెట్టిన హ్యాష్‌ట్యాగ్.. ‘మీటూ’ పేరుతోనే పదేళ్ల క్రితమే మీరు కాంపెయిన్ నడిపారని తెలిసి ఎగై్జట్‌మెంట్‌తో ఫోన్ చేస్తున్నాను’’. ‘‘యా చూశాను మిస్ అలిస్సా. దటీజ్ గుడ్. మీటూ అన్న కాన్సెప్ట్ నా ఒక్కరిదే కాదు. మనందరిదీ. ఒకే బాధ.. ఒకే భావం.. (నవ్వుతూ). ‘‘ధన్యవాదాలు మిస్ బర్క్’’ ‘‘ధన్యవాదాలు మిస్ అలిస్సా’’. సంభాషణ పూర్తయింది. దీనిని అలిస్సా ఇంటర్నెట్లో షేర్ చెయ్యడంతో.. మీటూ అనే ఒక మహోద్యమానికి, మహిళా ఉద్యమానికి ఆద్యురాలిగా బర్క్ వెలుగులోకి వచ్చారు. అయితే ఆ వెలుగులో తను కాకుండా.. బాలికలు, యువతులు పడుతున్న లైంగిక వేధింపులు ఈ లోకానికి కనిపించాలని, ఆ పాడు లోకం కళ్లు తెరుచుకోవాలని ఆమె కోరుకుంటున్నారు. ఏంటీ.. ‘మీటూ’? ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరినీ ఏకం చేస్తున్న సోషల్ మీడియా ఉద్యమం. హార్వీ వైన్‌స్టీన్ అనే 65 ఏళ్ల హాలీవుడ్ నిర్మాత సినిమా చాన్సులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను కొన్నేళ్లుగా లైంగికంగా వేధించుకుని తింటూ, వారిపై అత్యాచారాలు జరుపుతున్నాడని పన్నెండు మంది మహిళలు గత అక్టోబర్‌లో బయటికి వచ్చి బాహాటంగా చెప్పడంతో.. ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయోనన్న చర్చ మొదలైంది. అలాంటి వాళ్లెవరైనా ఉంటే తమ అనుభవాలను పంచుకోవడం కోసం అలిస్సా మిలానో అనే హాలీవుడ్ నటి సోషల్ మీడియాలో ఏర్పాటు చేసిన హ్యాష్ ట్యాగే.. ‘మీటూ’. తొలి గంటలోనే..! ‘మీటూ’ హ్యాష్ ట్యాగ్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం అయిన తొలిగంటలోనే ఫేస్ బుక్‌లో 40 లక్షల 70 వేల మంది దీనిని ఉపయోగించారు! కోటీ 20 లక్షల పోస్టులు వెల్లువెత్తాయి. ఇండియా, పాకిస్థాన్, బ్రిటన్లతో పాటు మొత్తం 85 దేశాలలో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఐరోపా పార్లమెంట్ అయితే ‘మీటూ’ పై ఒక ప్రత్యేక సమావేశాన్నే నిర్వహించింది! మన వాళ్లు ‘మీటూ’ అంటూ మన సెలబ్రిటీలు ఇంతవరకు లోపలికి రాలేదు. కానీ బయటి నుంచి సపోర్ట్ చేశారు. రాధికా ఆప్టే, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా.. ‘మీటూ’ ఉద్యమానికి మద్దుతు పలికారు. -
రోడ్డు కోసం.. రోడ్డెక్కారు !
♦ వైవీయూ మార్గంలో రోడ్డు పనులు త్వరగా చేయాలంటూ విద్యార్థుల బైఠాయింపు ♦ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం మార్గంలో రోడ్డును త్వరితగతిన పూర్తిచేయాలంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వైవీయూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నాయకులు, పరిశోధక విద్యార్థులు బాలా జీ నాయక్, శ్రీనివాసులు మాట్లాడుతూ కడప–పులివెందుల మార్గంలో వైవీయూకు వెళ్లే రహదారిని తవ్విన ఆర్అండ్బీ అధి కారులు పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. రోడ్డు సరిగా లేక ఇటువైపు వాహనాలు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పదిరోజులుగా బ స్సులు, ఆటోలు విశ్వవిద్యాలయంవైపుగా రావడం లేదని.. దీంతో కిలోమీటర్‌పైగా రోజు నడిచిరావాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి వాహనాలను పునరుద్ధరించాల ని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వైవీయూ ప్రిన్సిపల్ ఆచార్య కె.సత్యనారాయణరెడ్డి, పెండ్లిమర్రి ఎస్ఐ ఎస్.కె. రోషన్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. దీంతో విద్యార్థులు ఆందోళన వీడారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కాకినాడ సిటీ : భూసేకరణ చట్టం-2013 బిల్లును అసెంబ్లీలో పెట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు రావుల వెంకయ్య వెల్లడించారు. కాకినాడ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లా పార్టీ కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ-2 ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టంలో రైతులకు మేలు చేసే అంశాలను తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టç సవరణ చేయడానికి ప్రయత్నించి విఫలమైందన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా బిల్లుకు సవరణలో చేసుకోవచ్చంటూ ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. ఈ బిల్లును యధాతథంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో రైతుల నుంచి సంతకాలు సేకరించి, వాటిని రాష్ట్రపతికి అందజేస్తామన్నారు. అలాగే మంత్రి వర్గ విస్తరణలో కమ్మ, రెడ్డి వర్గీయులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగాయని, కాగ్ నివేదిక ప్రభుత్వానికి మొట్టికాయ వేసినా చీమకుట్టినట్లు లేదని విమర్శించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నం ప్రాజెక్టుల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే..
► ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ జెడ్పీసెంటర్: లారీ యాజమాన్యాల డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగిల్ పర్మిట్ విధానం లేకపోవడం వల్ల లారీ యజమాన్యం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. లారీలు నడిచే ఆయా రాష్ట్రాల్లో పన్నులు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. సింగిల్ పర్మింట్ విదానాన్ని అమలుచేయాలని కోరారు. ప్రైవేట్ బీమా సంస్థల ఒత్తిడి మేరకు థర్డ్‌పార్టీ బీమాను ఏప్రిల్ నుంచి 50 శాతం పెంపు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఏకీకృతంగా ఉండేలా చూడాలని కోరారు. 15ఏళ్లు నిండిన లారీల పర్మిట్ల రద్దుపై పునరాలోచించాలని కోరారు. తెలుగు రాష్ట్రల్లో అమలయ్యేలా సింగిల్ పర్మిట్‌కు అవకాశం కల్పించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రానికి చెల్లుబాటయ్యేలా చెల్లించిన క్వార్టర్లీ ట్యాక్స్‌ను తగ్గించి తెలంగాణ పరిధికి అనుగుణంగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలన్నారు. అనంతరం సమ్మె పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బేగ్, ఆర్టీఏ మెంబర్ జావిద్‌బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటుకు కోట్లు కేసుపై ఆన్లైన్ ఉద్యమం
-
చర్చలు విఫలం
♦ కమిటీ సమావేశం రద్దు ♦ కొనసాగుతున్న ఉద్యమం ♦ సంతకాల సేకరణ ♦ రాజ్ భవన్ ముట్టడి యత్నం – అరెస్టు ♦ కమలనాథులపై గరం గరం నెడువాసల్ ఉద్యమకారుల్ని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో సాగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. సోమవారం కూడా ఉద్యమాన్ని ఆ పరిసర గ్రామాల ప్రజలు కొనసాగించారు. రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి, చెన్నై: హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పుదుకోట్టై జిల్లా నెడు వాసల్‌లో 20 రోజులుగా ఉద్యమం సాగుతోంది. ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు సాగినా, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి, యువ సమూహం మద్దతుతో ఉప్పెనలా ఎగసి పడుతున్నది. ఉద్యమకారుల్ని బుజ్జగించేందుకు ఆ జిల్లా కలెక్టర్ రాజేష్, ఎస్పీ లోకనాథన్ నేతృత్వంలో అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఆదివారం రాత్రంతా ఈ బృందం ఉద్యమ కమిటీతో సమావేశమైంది. ఉద్యమకారులు ఉంచిన అనేక డిమాండ్లకు, సంధించిన ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానాలు కరువైనట్టు సమాచారం. పలు రకాలుగా హామీలు గుప్పించినా, ఏ మాత్రం ఉద్యమకారులు వెనక్కు తగ్గలేదు. ఉద్యమ కమిటీ సమావేశానంతరం సోమవారం మధ్యాహ్నం నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఉద్యమకారులు అధికారులకు హామీ ఇచ్చారు. అయితే ఉద్యమ కమిటీ సమావేశం రద్దు కావడం, ఉద్యమం కొనసాగడం గమనార్హం. ఆ పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్యమ వేదిక వద్ద బైఠాయించారు. దీక్ష ఉప సంహరించుకుంటారని అధికారులు భావించినా, ఉద్యమకారులు ఏ మాత్రం తగ్గని దృష్ట్యా, మళ్లీ చర్చల కసరత్తుల్లో పడ్డారు. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు నెడువాసల్ నుంచి తమిళనాడు సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ సంఘం శ్రీకారం చుట్టింది. తమ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, తమకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ వర్గాలు గళాన్ని వినిపిస్తుండడం ఉద్యమకారుల్లో ఆక్రోశాన్ని రగుల్చుతోం. బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా తాము స్పందించాల్సి ఉంటుందన్న హెచ్చరికల్ని నెడువాసల్ వేదికగా ఉద్యమకారులు చేశారు. తాత్కాలిక హామీలు కాదు అని, తమకు భవిష్యత్తు ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బీజేపీ నేత హెచ్ రాజా అక్కడికి రాగా, ఆయన్ను అడ్డుకునే విధంగా యువత వ్యవహరించడం గమనార్హం. రాజ్‌భవన్ ముట్టడి: నెడువాసల్ ఉద్యమానికి మద్దతుగా చెన్నైలో పురట్చి కరై ఇలైంజర్ ఇయక్కం కదిలింది. ఆ ఇయక్కంకు చెందిన వారు రాజ్‌భవన్ ముట్టడి నినాదంతో ఉదయం దూసుకెళ్లారు. హైడ్రో కార్బన్ ప్రాజెక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను డిమాండ్ చేస్తూ చలో రాజ్ భవన్ తో ముందుకు సాగారు. వీరిని మార్గమధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారిని బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. -
ఉద్యమ బాట
► తగ్గేది లేదన్నఉద్యమ నేతలు ► బెడిసి కొట్టిన సీఎం ప్రయత్నాలు ► ఇక మరింత ఉధృతం ► అణగదొక్కేందుకు కసరత్తులు ► బలగాల మోహరింపు ► ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఉద్యమాన్ని కొనసాగించేందుకు నెడువాసల్ ఉద్యమకారులు నిర్ణయించారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్టు రద్దు ప్రకటన వెలువడే వరకు ఉద్యమం కొనసాగుతుందని, మరింత ఉధృతం చేయనున్నట్టు ఉద్యమ నేతలు ప్రకటించారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాలుసాగుతున్నాయి. నెడువాసల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షి, చెన్నై:పుదుకోట్టై జిల్లా నెడువాసల్ వేదికగా హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఉద్యమకారులతో బుధవారం సీఎం ఎడపాటి కే పళనిస్వామి భేటీ అయ్యారు. అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదన్న భరోసా ఇచ్చారు. అయితే సీఎం ప్రయత్నాలు బెడిసి కొ ట్టాయి. ఆయన హామీలు సంతృప్తికరంగా లేని దృష్ట్యా, ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్లేందుకు ఉద్యమకారులు నిర్ణయించారు. కేంద్రం దిగి వచ్చి ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించేవరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తీరుతామన్న ప్రతిజ్ఞను గురువారం నెడువాసల్ పరిసర గ్రామాల్లోని ప్రజలు చేశారు. పాఠశాల స్థాయి పిల్లలు, యువత సైతం తరలి వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, వివిధ రూపాల్లో నిరసనలు, పరిస్థితిని బట్టి ఆమరణ దీక్ష సైతం చేపట్టేందుకు తగ్గ కసరత్తులతో ఉద్యమకారులు ముందుకు సాగుతుండడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఈ ఉద్యమానికి మద్దతుగా చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద సినీనటుడు లారెన్స్ నేతృత్వంలో నిరసనకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు చివరి క్షణంలో అనుమతి నిరాకరించారు. ముందుగానే అక్కడకు చేరుకున్న యువతను పోలీసులు బలవంతంగా తొలగించారు. బలగాల మోహరింపు: నెడువాసల్ ఉద్యమాన్ని అణగొక్కేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టుంది. సీఎం హామీ ఇచ్చినా ఉద్యమకారులు వెనక్కు తగ్గక పోవడంపై కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో నెడువాసల్ పరిసరాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా అడ్డుకునే విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు అయ్యాయి. బలగాల్ని మరింత కట్టుదిట్టం చేయడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ: హైడ్రో ప్రాజెక్టు నిమిత్తం చాప కింద నీరులా తవ్విన బోరు బావుల రూపంలో ముప్పు ఇప్పటికే బయల్దేరినట్టు అనేక గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ వేదికపై ప్రసంగించే ఆయా గ్రామాల ప్రజలు తమ తమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలను వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్టైకాడు పరిసరాలను ‘సిటిజన్’ సినిమా తరహాలో కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు, ఇక్కడ జరిగిన తవ్వకాల పరిశోధనల కారణంగా పిల్లలు మానసిక వికలాంగులుగా, అంతు చిక్కని వ్యాధులతో బాధ పడాల్సి ఉందని కన్నీటి పర్యంతం కావడం అక్కడి వారిని కలచి వేసింది. వనక్కాడులో గతంలో పదిహేను వందల అడుగుల లోతులో ఏర్పాటు చేసిన బోరు బావి కారణంగా, క్యాన్సర్ బారిన పడి పది మంది మరణించి ఉన్నట్టు, మరో 25 మంది ఆ వ్యాధితో బాధ పడుతున్నట్టు అక్కడి ప్రజలు పూర్తి వివరాలను ఉద్యమ వేదిక ముందుకు తీసుకురావడం గమనించాలి్సన విషయం. -
ఉపాధ్యాయ ఉద్యమ పితామహుడు ’చెన్నుపాటి’
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ ఉద్యమ పితామహుడు చెన్నుపాటి లక్ష్మ య్య అని యూటీఎఫ్ నాయకులు కొని యాడారు. ఆదివారం స్థానం యూ టీఎఫ్ జిల్లా కార్యాలయంలో చెన్ను పాటి లక్ష్మయ్య 18వ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎం. సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిలాన్ తదితరులు మాట్లాడారు. బ్రిటీష్ పాలకుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉపా« ద్యాయుల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ హక్కుల సాధనకు లక్ష్మయ్య పోరాడారని గుర్తు చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వీవీ రమణయ్య మాట్లాడుతూ చెన్నుపాటి లాంటి వారి త్యాగాల ఫలితంగానే నేడు ఉపాధ్యాయులు మెరుగైన వేతనాలు పొందుతున్నారన్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడు సీకే నాగేంద్రబాబు జిల్లా కార్యదర్శి కోటేశ్వరప్ప యూటీఎఫ్ నాయకులు సురేష్, సలావుద్దీన్, గోపాల్, రూత్, నల్లప్ప, పాల్గొన్నారు. -
ఉద్యమ పాదంపై పుట్టుమచ్చ
...థర్టీ ఇయర్స్ రివల్యూషన్! ఉద్యమం చేయడం ఎంత నిజమో... నిజం చెప్పడం అంతే ఉద్యమం! నారాయణమూర్తికి... నిజం అంటే ఏంటి? ఉద్యమం అంటే ఏంటి? మనసులో మాట... పెదాల మీద ఉంటే అదే నిజం! అదే ఉద్యమం అంటాడు. సత్యవాక్కు పలికేవాడు... సత్యపథం పట్టక మానడు కదా! సిల్వర్ జూబ్లీ సినిమాలిచ్చినా, కోట్ల కలెక్షన్లు కొట్టినా ఇప్పటికీ... షేర్ ఆటోలో తిరుగుతాడు. కాలిబాట పడతాడు. మరి అదే కదా.. సత్యపథం! గాంధీ ఉద్యమంలో... ‘అహింస’ సత్యాగ్రహం అయితే... ఆర్. నారాయణమూర్తి గుండెల్లో... ‘విప్లవం’ సత్య ఆగ్రహం. నిప్పులా రగిలే సత్యం... జ్వాలలా ఎగసిపడే ఆగ్రహం. తెర మీద బొమ్మ పడింది! అదిగో... నారాయణమూర్తి నడుచుకుంటూ వస్తున్నాడు.ఆ ఉద్యమపాదంపై ప్రజలు పెట్టిన కాటుక చుక్కే ఈ పుట్టుమచ్చ. ఆడియన్స్... ఈలలు, చప్పట్లు, కేరింతలు... ఎర్రటి విప్లవంలా తెర మీద భగభగమండుతున్నాడు. ఇదిగో... ఈ ఇంటర్వ్యూలో... అలాగే మాట్లాడుతున్నాడు.భగ భగ ఎంజాయ్ చేయండి. హ్యాపీ సండే. ‘అర్ధరాత్రి స్వతంత్రం’తో హీరోగా మొదలై, ఇప్పటికి 30 ఏళ్లయింది. సంపాదించింది ఎంత? పోగొట్టుకున్నది ఎంత? ఆర్. నారాయణమూర్తి: 30 ఏళ్లుగా దేశంలో జరుగుతున్న సమస్యలే నా సినిమాలు. కార్మిక, ఆదివాసీ, దళితుల, స్త్రీ, రైతు, భూ పోరాటం.. ఇలా ఎన్నో విషయాలపై సినిమాలు తీస్తున్నా. పోగొట్టుకున్నది ఏం ఉంటుంది? ప్రజా సమస్యల్ని చర్చిస్తున్నా కాబట్టి, అభిమానం సంపాదించుకున్నా. 30 ఏళ్లయ్యాయని గుర్తు పెట్టుకుని, ఇంటర్వ్యూ కోసం ‘సాక్షి’ వచ్చిందంటే, అది నేను సంపాదించుకున్నదే. సమస్యల్ని చూపిస్తే మార్పొస్తుందా? మార్పు అనేది వస్తుంది. సమాజం గ్యారంటీగా మారుతుంది. మార్పు కోసం డాక్టర్, సైంటిస్ట్, కార్టూనిస్ట్, పొలిటిషీయన్, మీ జర్నలిస్టులు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో పోరు చేస్తారు. కళాకారుడిగా నేను నా సినిమాల ద్వారా మార్పు కోసం ఫైట్ చేస్తున్నా. నా ‘అర్ధరాత్రి స్వతంత్రం’ చూసి ఎందరో ఉద్యమబాట పట్టారు. ‘ఎర్రసైన్యం’ చూసి భూపోరాటం చేశారు. ‘దండోరా’ చూసి సారాకొట్లు బద్దలు కొట్టారు. అది మంచి మార్పేగా. గాంధీ ‘శాంతి’ అంటే మీవి పోరాటం వైపు మళ్లిస్తున్నాయి... మళ్లిస్తున్నాయంటే పొరపాటు. ఒక్క గాంధీ వల్లే మనకు స్వాతంత్య్రం రాలేదుగా? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ పోరాటం చేయమన్నారు కదా. ఎందరో వీరుల త్యాగఫలితమే ఈ స్వాతంత్య్రం. ఓ విషయం చెబుతాను. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అభివృద్ధి పేరు చెప్పి, ఇండస్ట్రియలైజేషన్ చేసేస్తున్నారు. అంతా మలినం. రొయ్యల వ్యాపారానికి గండిపడింది. పర్యావరణం నాశనం. భూములు లేకుండా పోయాయి. రైతుల పరిస్థితేంటి? ఉద్యమాలు చెయ్యాలా? వద్దా? చేసినా పోలీసులు కొడుతుంటే తిరుగుబాటు చేయరా? చేయకపోతే ఆ వాయిస్ ఎలా తెలుస్తుంది? మీ ఆర్థిక లావాదేవీలన్నీ వైట్‌లోనే ఉంటాయా? సీ మై ఫ్రెండ్... ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ‘వేగు చుక్కలు’ వరకూ 20 ఏళ్లపాటు నేను తీసిన సినిమాలన్నీ బ్రహ్మాండంగా ఆడాయి. అది చూసి కొంతమంది ఇలాం టివి తీశారు. ఒకటీ రెండు తీశాక మొనాటనీ వచ్చిందని మానేశారు. నేను మాత్రం తీస్తూనే ఉన్నా. సముద్రాన్ని ఈదుతూనే ఉన్నా. జనం దయ నాపై ఉంది కాబట్టి సక్సెసవుతున్నా. మొదట్నుంచీ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్, డెరైక్షన్, మ్యూజిక్ - అంతా నేనే కాబట్టి, బడ్జెట్ అక్కడే తగ్గిపోతుంది. సినిమా మొదలుపెట్టే ముందు ఫ్రెండ్స్ దగ్గర్నుంచి అప్పు తెచ్చుకుంటా. సినిమా రిలీజయ్యాక తిరిగిచ్చేస్తా. ‘ఆల్ వైట్.. నో బ్లాక్’. మొనాటనీ అని కొంతమంది మానేశారన్నారు. మరి ఎప్పుడూ ఒకే టైప్ సినిమాలు తీస్తే.. మీకు విసుగు రాలేదా? నా బతుకు ఇంతేనా? మార్పు లేదా? అనే ఆలోచన ఏ మనిషి మనసులోనైనా వస్తే, అతడికి విసుగొస్తుంది. అప్పుడు ముందుకు సాగలేడు. ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, సినిమా తల్లిపై ఉన్న అభిమానం, ఆరాధన, ఇష్టం, గౌరవం తగ్గలేదు. సినిమాలపై అయిష్టం రాలేదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువా? ఆటోల్లో తిరుగుతుంటారు. కారుల్లో తిరిగినా మిమ్మల్ని అడిగేవాళ్లు ఎవరుంటారు? అవును. ఎందుకు అడుగుతారు? సిల్వర్, డైమండ్ జూబ్లీ సినిమాలు తీసి, కోట్లు గడించినవాణ్ణి. నా దగ్గర బ్యాలెన్స్ ఎందుకుండదు? అది తీసిపారేయండి. చిన్నప్పటి నుంచి నాకిలా ఉండడం అలవాటు. ఏదో పోజు కొట్టడం కోసం ఇలా ఉంటాననుకుంటున్నారేమో? నేనలా ఆత్మవంచన చేసుకోను. నాకిప్పుడు 62 ఏళ్లు. కాలేజీ డేస్‌లో కూడా నాకు రెండు జతల బట్టలే. వాచీలు, గొలుసులు ఎప్పుడూ పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి నాది ఉద్యమ బాటే. ప్రజల పక్షానే. నా లైఫ్ స్టైల్ ఇది. ఎవరి మెప్పుకోలు కోసమో ఉండట్లేదు. ఇలా ఉండటమే నాకు ఆనందం. నా సినిమా కోట్లు తెచ్చినప్పుడు నాకు బీరువా లేదు. డాక్యుమెంట్లు లేవు. చాప, దిండు మాత్రమే. డబ్బులు తేనప్పుడూ నా దగ్గర ఉండేది చాపా, దిండూనే. ఊళ్లో బంగ్లా, స్థలాలు కొన్నారని విమర్శ. దానికేమంటారు? ఓసారి మా ఊరు వెళ్లండి. నేను చేసిన మంచి పనులు కనిపిస్తాయి. ఆస్పత్రి కట్టించా. విద్యాలయాలకు డొనేట్ చేశా. పీపుల్స్ కమిటీ హాల్స్ కట్టించా. ఆంధ్ర, తెలంగా ణాల్లో బోర్లు వేయించా. కానీ ఎక్కడా చెప్పుకోను. మీర న్నట్లు మా ఊళ్లో నా సంపాదన ఉందనుకుంటే.. బంగ్లా కట్టించానేమో చూడండి. మా అమ్మా నాన్న ఏ ఇంట్లో ఉన్నారో చూడండి. రీసెంట్గా మా నాన్న చనిపోయాడు. అమ్మ ఒకతే ఉంది. ఊళ్లో నాకు ఎకరం స్థలం లేదు. థియేటర్లు లేవు. దొంగచాటు వ్యాపారాలేవీ చేయట్లేదు. ఒకవేళ మీరన్నది నిజమైతే ఇక ‘సాక్షి’ నన్ను ఇంటర్వ్యూ చేయొద్దు. ‘ప్రజల్ని మోసగిస్తూ, పేదోడిలా నటిస్తున్న నారాయణమూర్తి’ అని హెడ్‌లైన్స్ పెట్టి రాయండి. నేను చెప్పినది కరెక్టని భావిస్తే, ‘ఎలా చెబుతున్నాడో అలానే బతుకు తున్న ఆర్. నారాయణమూర్తికి సెల్యూట్’ అని రాయండి. మీ సినిమాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కానీ... సమాజం అందుకు దాదాపు విరుద్ధంగా ఉంటోంది. యస్.. ఇవాళ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా పెరుగుతోంది. యువత ఆ సంస్కృతికి అలవాటు పడడం, ఆకర్షితులు కావడం సహజం. అంతెందుకు? విశాఖ బీచ్‌లో లవర్స్‌ను ఆహ్వానిస్తున్నారంట. దేశ, విదేశీ ప్రేమికుల ముద్దులాట, కౌగిలింతలను చూసి, ఎంజాయ్ చేయమంటారా? ఎంత దుర్మార్గమైన చర్య. మనకి ఆ సంస్కృతిని అలవాటు చేయడమే కదా! ఓసారి హైదరాబాద్‌లో బ్రహ్మానందరెడ్డి పార్క్‌లో నడుస్తుంటే.. ఓ అమ్మాయి కౌగిలించుకోబోయింది. ఏంటని అడిగితే, ‘హగ్ కల్చర్’ అట. ‘నీది ఏ దేశం?’ అనడిగా. హైదరాబాదే అని చెప్పింది. ఈ హగ్ కల్చర్, ముద్దులు, ఇవన్నీ మనకు కాదు, యూరోపియన్లకు అనే విషయం ప్రజలు తెలుసుకోవాలి. శీతల మండలాల్లో సంస్కృతిని మనకు అలవాటు చేస్తే ఎంత భ్రష్టు పడుతుంది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన బీచ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తున్నా. అందాల పోటీలూ డబ్బు కోసమే. ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న పరిస్థితుల్లో ఎలాగైతే మానవ సంబంధాల్ని కోల్పోతున్నామో, అలాగే వెస్ట్రన్ కల్చర్‌తో మన సంస్కృతి, భాషలను విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. రేపులు, గట్రా పెరగడానికి యూరోపియన్ కల్చర్ ప్రభావమే కారణం. చిన్నపిల్లలతో టీవీల్లో డ్యాన్సులు ఏంటమ్మా? పసిపిల్లలకేం తెలుసు? చివరికి వాళ్లు ఈ సంస్కృతికి అలవాటు పడతారు. మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది కదా? కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు మూడుసార్లు అవకాశమిచ్చారు. తుని నియోజకవర్గంలో ప్రజలు నా పేరు సూచించారని జక్కంపూడి రామ్మోహనరావు గారు చెప్పడంతో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ఎమ్మెల్యేగా పోటీ చేయమని స్వయంగా పిలిచారు. 2009లో పీఆర్పీ పిలిచింది. అందరికీ దండాలు పెట్టా. ఎందుకంటే, నేను సినిమా పిచ్చోణ్ణి. రాజకీయాల్లోకి వెళితే.. సినిమాల్లో ఉండకూడదు. ప్రజాసేవ అంటే దేవుడు మనకిచ్చిన వరంగా ఫీలవ్వాలి. నిద్ర, తిండి మినహాయిస్తే మిగతా టైమంతా జనం కోసమే ఆలోచించాలి. ఓ కాలు సినిమా పడవపై, మరో కాలు రాజకీయమనే పడవపై వేసి ప్రయాణించలేను. నేను ఏ రాజకీయ పార్టీ వ్యక్తినీ కాను. ‘అయామ్ ఎ కామన్ మ్యాన్’. ప్రజల పార్టీ వ్యక్తిని. రాజకీయాల్లోకెళ్తే పొల్యూట్ అవుతామేమోనని భయమా? మీరు మీరుగా ఉన్నప్పుడు ఎవరూ మార్చలేరు. మరోలా ఉండాలనుకున్నప్పుడు మారిపోతారు. అది వాళ్ల వీక్నెస్. సినిమాల్లోకి, పాలిటిక్స్లోకెళితే నాశనమవుతారనేది కరెక్ట్ కాదు. ఓ కమిట్మెంట్తో నిజాయతీగా ఉన్నవాణ్ణి, ఉండాలనుకునేవాణ్ణి ఏదీ ప్రభావితం చేయలేదు. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. నేనేమైనా మారానా? తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చారు. మరి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై మీ అభిప్రాయం? 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎన్టీఆర్‌గారు ధైర్యంగా ‘నేను సమైక్యాంధ్రా’ అన్నారు. అది ఆయన క్యారెక్టర్. 1972లో ‘జై ఆంధ్రా’ ఉద్యమ సమయంలో ఇండస్ట్రీ అంతా సెలైంట్‌గా ఉంటే.. కృష్ణగారు ధైర్యంగా ముందుకొచ్చి ‘జై ఆంధ్రా’ అన్నారు. అది కృష్ణగారి క్యారెక్టర్. ఇప్పుడు నేను ‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్రా’ అన్నాను. ఇది నా క్యారెక్టర్. తెలంగాణ అనేది ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన ఉద్యమం అని నమ్మినవాణ్ణి. అందుకే, మద్దతుగా నిలిచా. విడిపోతే, అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందుతాయని ఉద్యమానికి మద్దతిచ్చా. అన్నదమ్ముల్లా రెండు రాష్ట్రాలు విడిపోయినందుకు హ్యాపీ. అయితే... ఈ రెండు రాష్ట్రాలను విభజించిన యూపీఏ ప్రభుత్వం ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మొదట్నుంచి తెలంగాణ కోరుకుంటున్న బీజేపీ, వెంకయ్య నాయుడు కూడా ప్రతేక హోదా తప్పకుండా ఇచ్చి తీరాలన్నారు. ఎన్నికల ముందు తిరుపతి సభలో మోదీగారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఎన్నికల్లో మోదీ నెగ్గారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? రాజ్యాంగం ప్రకారం, గత ప్రభుత్వం (యూపీఏ) ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ‘ప్రత్యేక హోదా వస్తే మీకు లాస్. ప్యాకేజీ ఇంపార్టెంట్’ అంటూ మీడియా సహాయంతో ఊదరగొడుతున్నారు. మాట తప్పడం మహా దుర్మార్గం. పాలకులకు ప్రజలంటే భయం, భక్తులు ఉండాలి. లేనప్పుడు మోనార్కిజం వస్తుంది. ఇప్పుడు మోనార్కల్లా ప్రవర్తిస్తున్నారు. వెంకయ్యనాయుడి మాటలు, చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఫైట్ చేయకపోవడం కరెక్ట్ కాదు. పలు మీటింగుల్లో ప్రత్యేక హోదా కావాలని నేనూ చెప్పా. ఈరోజు ముఖ్యంగా వై.ఎస్. జగన్మోహన్రెడ్డిగారు బీభత్సంగా ఫైట్ చేస్తున్నారు. హోదా కోసం ఫైట్ చేస్తున్నవాళ్లందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ఇప్పుడు బయటి బేనర్లో ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమా చేస్తున్నారు. సడన్‌గా బయట సినిమా చేయడానికి కారణం? యాక్టర్‌గా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనుంది. యాక్టింగ్ పిచ్చితో మద్రాస్ వెళ్లినోణ్ణి. గతంలో పలువురు మిత్రులు మంచి వేషాలు ఆఫర్ చేశారు. కానీ, మొనాటనీ ఉంటే జనాలు సినిమా చూడడం మానేస్తారు. అది బ్రేక్ చేస్తూ డిఫరెంట్ వేషాలు వేయాలనుంది. ఇప్పటి వరకూ ఉద్యమకారుడు, రైతు, కార్మికుడు, నిరుద్యోగి, రిక్షావోడు, దళితుడు - ఇలా అనేక వేషాలు వేశా. ఇప్పుడు కానిస్టేబుల్, ప్యూన్, జవాను, గుమస్తా, బక్కరైతు, కులవృత్తులకు సంబంధించిన హీరో పాత్రలు చేయాలనుంది. దేవుడి దయ వల్ల ఆర్.నారాయణ మూర్తి అనే మార్క్ వచ్చింది. ముసలోణ్ణి అయినా ‘త్రిశూల్’లో దిలీప్‌కుమార్, ‘శంకరాభరణం’లో సోమయాజులుగారి తరహాలో నటిస్తా. ఏ మనిషికైనా తన అర్హత, అనర్హతలు ఏంటో ఇతరుల కంటే తనకే బాగా తెలుస్తుంది. ఇండస్ట్రీలో మహా అయితే మరో నాలుగైదేళ్లు ఉంటా. అప్పటివరకూ నటిస్తా. ‘నా రాజ్యానికి నేనే రాజు’ అనేది నా పాలసీ. హ్యాపీగా ఉండాలంటే... అమ్మానాన్నలను మించిన దైవం లేదు. పిల్లలకు వాళ్ల తల్లితండ్రులు, తల్లితండ్రులకు వాళ్ల పిల్లలు గొప్పోళ్లు. మా అమ్మానాన్నలు పాజిటివ్‌గా ఆలోచించేవాళ్లు. చిన్నప్పటి నుంచి కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే వెళ్లడం, దెబ్బలు తినడమే నా పని. మళ్లీ ఉద్యమాల్లోకి వెళ్లేవాణ్ణి. వాళ్ల జీన్స్ నాలో ఉండడమే ఈ ప్రవర్తనకు కారణం అనుకుంటున్నా. నేను నా యాంగిల్లో వెళ్తున్నాను. మా అమ్మా నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. మన అంతరాత్మ ప్రకారం నడుచుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాం. ఓకే సార్... మోదీగారు పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో కొంతమంది సినీ పెద్దలు ‘బ్లాక్’ని వైట్ చేసుకోవడానికి ఇబ్బందులపాలవుతున్నారట. మీ సంగతేంటి? (గట్టిగా నవ్వుతూ)... నాకు బ్లాక్ అండ్ వైట్ తేడా తెలియదు. నల్లధనం ఉండకూడదనే ఆశయంతో మోదీగారు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గది. కానీ, మోదీగారిని నేనేం ప్రశ్నిస్తున్నానంటే... ఎన్నికలకు ముందు విదేశీ బాం్యకుల్లో ఉన్న నల్ల డబ్బుని జనానికి పంచేస్తానన్నారు కదా. ముందా పని చేయమంటున్నా. ఎందుకు చేయలేకపోయారు? 500, 1000 రూపాయిల నోటుని రద్దు చేసినప్పుడు 2000 రూపాయి నోటు ఎందుకు? మోదీ హఠాత్ నిర్ణయం సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులపాలు చేస్తోంది. లోయర్, మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ల పరిస్థితి అంతకన్నా దయనీయంగా ఉంది. అంటే.. పెద్ద నోట్ల రద్దు తప్పంటారా? ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మధ్యతరగతి వాళ్ల ఇబ్బందుల గురించి ఆలోచించాలి. దీన్నే అదనుగా తీసుకుని పెట్రోల్ బంకుల్లో, కొన్ని కిరాణా కొట్లలో 500 నోటిస్తే.. నోటుకు సరిపడా కొనాల్సిందేనంటున్నారు. మోదీగారు వాగ్దానం చేసినట్లుగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బు తెచ్చి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. అది ఎందుకు చేయలేకపోతున్నారని ఆయనను ప్రశ్నిస్తున్నా. గెలవడానికి ఎన్నికల ముందు ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ప్రజలు ‘తాత్కాలిక’ అవసరాల కోసం ఓటేసి నంతవరకూ సమాజం బాగుపడదు. అందుకే ఓటేసే ముందు ‘శాశ్వతాన్ని’ దృష్టి పెట్టుకోవాలి. వారసులేనా వచ్చేది? వ్యాపారస్థుడి కొడుకు వ్యాపారస్థుడు.. డాక్టర్ కొడుకు డాక్టర్.. అవుతున్నప్పుడు హీరో కొడుకు హీరో కావడంలో తప్పేంటి? రాజకీయ నేత కొడుకు రాజకీయ నేత అయితే తప్పేంటి? అనే చర్చ ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతోంది. ఎవరి అభిరుచి, ఆసక్తి ప్రకారం వాళ్లు నడుచుకోవచ్చనేది నా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. అయితే సినిమాల్లో నటించాలని, రాజకీయాల్లో రాణించాలని, అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని 90 శాతం మందికి ఉంది. వారసత్వం సరైనదని మీరే వస్తుంటే.. బయటవాళ్లెప్పుడు హీరోలవుతారు? మంత్రులవుతారు? జనాభా దామాషాలో అట్టడుగు వర్గాలూ అందలం ఎక్కాలి. - డి.జి. భవాని -
జిల్లా కోసం ఉద్యమం ఉధృతం
నేడు హైదరాబాద్‌కు వెళ్లనున్న బృందం జాతీయ రహదారిపై బతుకమ్మ ఆటలు l 5న డివిజ¯ŒS వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు జనగామ : జనగామ జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు జేఏసీ చైర్మ¯ŒS ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. స్థానిక జూబ్లీ ఫంక్ష¯ŒS హాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. ముసాయిదా ప్రకటన నేపథ్యంలో శనివారం జేఏసీలోని ఓ బృందం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కలిసేందుకు హైదరబాద్‌కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు జాతీయ రహదారి ఆర్టీసీ చౌరస్తాలో మహిళల బతుకమ్మ ఆ టలతో నిరసన తెలుపుతామన్నారు. 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహిం చి, మొమోరాండం ఇస్తామన్నారు. 5న డివిజన్ లోని మండలాలు, గ్రామాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలిపాలన్నారు. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి బాలలకీ‡్ష్మ మాట్లాడుతూ చేర్యాల ను రెవెన్యూ డివిజ¯ŒSగా చేసి, జనగామను జిల్లా చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజరెడ్డి, డాక్టర్ లకావత్ లక్షి్మనారాయణ నాయక్, లింగయ్య, సతీష్, శ్రీరాములు, శశిధర్, కైలాసం, రాజు, సురేష్, వి జయ్, ప్రకాష్, సోమేశ్వరాచారి, రమేష్, ఎల్లయ్య, శ్రీను, కిరణ్, శేఖర్ పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య ఉద్యమాలకు విశేష కృషి
నల్లగొండ టౌన్ : దళితులు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య ఉద్యమాల కోసం బొజ్జా తారకం విశేషంగా కృషి చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్ అన్నారు. శుక్రవారం స్థానికంగా దళిత విద్యావంతుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బొజ్జా తారకం సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. చుండూరు దళితుల కోసం న్యాయస్థానంలో రాజీలేని పోరాటం నిర్వహించారన్నారు. ఫోరం కన్వీనర్ దర్శనం నర్సింహ అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జి.మోహన్, టీడీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బండి దుర్గాప్రసాద్, చింత సుధాకర్, రవినాయక్, కొండమడుగు నర్సింహ, అనుదీప్, రంజిత్, సత్యనారాయణ, కామేష్, రాజశేఖర్‌రెడ్డి, వెంకన్న, ప్రభాకర్, పాలడుగు నాగార్జున, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య ఉద్యమాలకు విశేష కృషి
నల్లగొండ టౌన్ : దళితులు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య ఉద్యమాల కోసం బొజ్జా తారకం విశేషంగా కృషి చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్ అన్నారు. శుక్రవారం స్థానికంగా దళిత విద్యావంతుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బొజ్జా తారకం సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. చుండూరు దళితుల కోసం న్యాయస్థానంలో రాజీలేని పోరాటం నిర్వహించారన్నారు. ఫోరం కన్వీనర్ దర్శనం నర్సింహ అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జి.మోహన్, టీడీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బండి దుర్గాప్రసాద్, చింత సుధాకర్, రవినాయక్, కొండమడుగు నర్సింహ, అనుదీప్, రంజిత్, సత్యనారాయణ, కామేష్, రాజశేఖర్‌రెడ్డి, వెంకన్న, ప్రభాకర్, పాలడుగు నాగార్జున, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమంలో పాల్గొనాలి
హుజూర్నగర్ : రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పాలక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బా భాగ్యరెడ్డి అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆ«ధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 16వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా దీక్షలలో కూర్చున్న వారికి ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చాజిల్లా కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి,పట్టణ అధ్యక్షుడు తూముల శ్రీను, శీలంనాగరాజు, కస్తాలరామకృష్ణ, ప్రతాప్, రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల మానవహారం... హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ గురువారం రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో స్థానిక పలు విద్యాసంస్థల విద్యార్థులు మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులుఎండి.అజీజ్‌పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతిర్యాల నాగయ్య, బాచిమంచి గిరిబాబు, కస్తాలముత్తయ్య, కస్తాలశ్రావ ణ్‌కుమార్, ఇట్టిమళ్లబెంజిమన్, మందావెంకటేశ్వర్లు, బరిగెలచంద్రశేఖర్, నందిగామ ముక్కంటి, రెడపంగు వెంకటేశ్వర్లు, దాసరి పున్నయ్య,దేవభిక్షం, నరేందర్, సైదులు, మట్టయ్య, దావీద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో అలజడి
రేపు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకలు ∙సరిహద్దు ప్రాంతాలకు తరలిన పోలీసు బలగాలు చర్ల: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తామని ఆ పార్టీ బాధ్యులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెంకటాపురం సర్కిల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చర్ల మండలంలోని పలు ప్రాంతాల్లో మావోల పోస్టర్లు వెలవడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలను రంగంలోకి దించుతున్నారు. గ్రామాల్లో పోలీసు బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో ప్రత్యేక నిఘాను పెంచారు. సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి వెళ్లే మార్గాల్లో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలు గుర్తిస్తున్నారు. మాజీ మిలిటెంట్లు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకుంటున్నారు. మావోయిస్టుల కదలికలను పోలీసులు తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేష¯ŒS చేపట్టేందుకు సంసిద్ధులవుతున్నారు. మావోయిస్టులు విధ్వంసకర ఘటనలకు పాల్పడకుండా గట్టి భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే..అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల మధ్య అడవిబిడ్డలైన ఆదివాసీలు వణికిపోతున్నారు. ఉనికిని చాటుకునేందుకు చేసే చర్యలతో ఎలాంటి ఆపదను ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. -
రైల్వేగేట్‌ను తెరిచేవరకూ ఉద్యమం
ఆలేరు : ఆలేరులోని రైల్వేగేట్‌ను తెరిచేవరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆలేరులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గేట్ మూసివేతతో ఆలేరు రెండు భాగాలుగా విడిపోయిందన్నారు. గేట్ అవతల వైపు ఉన్న ప్రజలకు ఇబ్బందులు కల్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిర్మించిన ఆర్వోబీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని.. ఆర్యూబీ నిర్మించే వరకూ రైల్వేగేట్‌ను తెరిపించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను భువనగిరిలోనే యథావిధిగా కొనసాగించాలన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం పద్మ, పులిపలుపుల మహేష్, జెట్ట సిద్దులు, కందగట్ల నరేందర్, ఎనగందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమాలకు సిద్ధం కావాలి
సూర్యాపేట : సీపీఐ బలోపేతానికి బలమైన ఉద్యమాలను నిర్వహించేందుకు శాఖ స్థాయి నుంచే పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ధర్మబిక్షం భవన్లో పార్టీ నిర్మాణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొమ్మగాని ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు కేవీఎల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అసహనం పెరిగిపోయిందన్నారు. భావప్రకటన స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులపై ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను, సంక్షేమాన్ని కాపాడుకోవడానికి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కమ్యునిస్టు పార్టీ కార్యకర్తలు బలపడాలని కోరారు. దోరెపల్లి శంకర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బొమ్మగాని శ్రీనివాస్, బొమ్మగాని వెంకటయ్య, అనంతుల మల్లీశ్వరి, ఖమ్మంపాటి అంతయ్య, జానిమియా, పొలగాని వీరభద్రం, పాషా, రాము, సత్యనారాయణ, మురళి, పద్మరేఖ, రాములు, విద్యాసాగర్, బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి
సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డిలు అన్నారు. సీపీఐ మండల నిర్మాణ సభ మంగళవారం సంస్థాన్ నారాయణపురంలో జరిగింది. పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలతో ఎన్నికైన టీఆర్ఎస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సాగిందన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాలు జిల్లాలో ఇప్పటి వరకు మొదలు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మండల కార్యదర్శి బచ్చనగోని గాలయ్య, నెల్లికంటి సత్యం, కె.లింగయ్య, వీరమళ్ల యాదయ్య, దుబ్బాక భాస్కర్, ఎర్ర మల్లేష్, సుజాత, ఎంఏ.హమీద్, మంచాల సైదులు, లోడె యాదయ్య, కలకొండ సంజీవ తదితరులున్నారు. -
ఓబీసీ సాధన కోసం ఆరె కులస్తులు ఉద్యమించాలి
ఖిలా వరంగల్ : ఆరె కులస్తులను ఓ బీసీల్లో చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమించాలని ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు సోమిడి అంజన్‌రావు పిలుపునిచ్చారు. వరంగల్ శివనగర్‌లోని ఫెర్టిలైజర్ అసోసియేషన్ భవనంలో జిల్లా ఆధ్యక్షుడు హింగ్లీ శివాజీ ఆధ్యక్షతన ఆరె సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో అంజన్‌రావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రాష్ట్రంలో నివస్తున్న ఆరె కులస్తులు ఓబీసీ జాబితాలో లేకపోవడంతో యువత విద్య, ఉ ద్యోగ, ఉపాధి రంగాలతో పాటు నష్టపోవడమే కాకుండా సంక్షేమ పథకాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 86 కులాలను ఓబీసీల్లో చేర్చినా ఆరె కులస్తులకు చోటు దక్కడం గర్హనీయమన్నారు. ఈ మేరకు ఆరె కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో బలేరావు మనోహర్‌రావు, డాక్టర్ సిందె రాంనర్స య్య, ఓండా రాజేష్, గుండెకారి రంగారావు, మాసంపెల్లి లింగాజీ, గుండెకారి రవికుమారి, రఘుపతి, సోమిడి శ్రీనివాస్, జులమేటి రాజు, దామెరగిద్ద ప్రభాకర్, పగిడే సాంబరావు, వీర న్న, దౌలత్బాజీ యుగేందర్ పాల్గొన్నారు. -
లోక్‌సత్తా పార్టీ రద్దు కాలేదు
దేవీచౌక్ (రాజమహేంద్రవరం) : రానున్న ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని మాత్రమే లోక్‌సత్తా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందని, దీని అర్ధం పార్టీ రద్దయినట్టు కాదని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కన్వీనర్ బండారులంక రామ్మోహనరావు తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని పేర్కొన్నారు. పార్టీ అంశాలపై వివిధ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎంవీ రాజగోపాల్, ఎన్ఎస్ రామచంద్రమూర్తి, బి.శ్రీనివాస్, సీఎస్ కామేశ్వరరావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి జిల్లా సాధించే వరకు ఉద్యమం
యాదగిరిగుట్ట : భువనగిరి కేంద్రంగా యాదాద్రిని జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం చేస్తామని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. జిల్లా సాధన కోసం సీపీఐ, బీజేపీలతో కలిసి చేపట్టిన ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం ముగింపు సందర్భంగా యాదగిరిగుట్టలోని శ్రీనృసింహుడి వైకుంఠద్వారం వద్ద పోస్టుకార్టులకు పూజలు చేసి, తపాల కార్యాలయం ద్వారా సీఎం క్యాంప్ కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని జిల్లాగా ప్రకటించనుండడం హర్షణీయమన్నారు. ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలంటే గోదావరి జలాలే శరణ్యమని, ఈ జలాలు ఈ ప్రాంతానికి ఇవ్వాలనే రెండవ డిమాండ్‌తో సైతం పోస్టుకార్డుల్లో రాసినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, తెలుగు మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, ముంకుదరెడ్డి, పల్లెపాటి బాలయ్య, దడిగె ఇస్తారి, ఆకుల రాజేష్, బొలగాని సత్యనారాయణ, గుంటి మధుసూదన్‌రెడ్డి, జిల్లా భిక్షపతి, ఆరె రాములు, అమరేందర్‌రెడ్డి, గొట్టిపర్తి శ్రీనివాస్‌గౌడ్, అమరేందర్, సీత నారాయణ, మోత్కుపల్లి రఘు, ఆంజనేయులు, పోశంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, పద్మనాభం, పూర్ణచందర్ రాజు తదితరులున్నారు. -
తొలిదశ ఉద్యమమే కీలకం
నల్లగొండ కల్చరల్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో 1969లో నిర్వహించిన ఉద్యమమే కీలకమైందని 69 తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చక్రహరి రామరాజు, మారం సంతోష్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2004 నుంచి మొదలైన తెలంగాణ మలి విడత ఉద్యమానికి 69 ఉద్యమమే స్ఫూర్తిదాయకమన్నారు. అప్పటి ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం సముచితంగా గౌరవించడం లేదని, వారందరిని గుర్తించి వెంటనే వారికి గుర్తింపు కార్డులను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుల మల్లయ్య అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి నీలకంఠం చలమంద, ఏళ్ల చంద్రారెడ్డి, కంది సూర్యనారాయణ, లక్ష్మారెడ్డి, మనోహర్‌రావు, టి.సుజాత, ఎ.జయమ్మ, సీతారాంరెడ్డి, వెంకటయ్య, కాశయ్య, హమీద్‌ఖాన్, సురేష్, లక్ష్మయ్య, ముస్తఫా, రాములు, సత్యనారాయణ, సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి పాల్గొన్నారు. -
బీసీ బిల్లు కోసం దశలవారీ ఉద్యమం
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి బీసీ, కులసంఘాల విస్తృతస్థాయి సమావేశం డిమాండ్ ఈ నెల మూడోవారంలో ఇందిరాపార్కు వద్ద మహాభేరి హైదరాబాద్: బీసీ బిల్లు కోసం బీసీ, కుల సంఘాలు ఏకమయ్యాయి. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, రాష్ట్రంలో బీసీ కులాల ఫెడరేషన్లకు నిధులు కేటాయించాలని, దశలవారీగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఇక్కడ జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, బీసీ, కుల సంఘాలు పాల్గొన్నాయి. బీసీల్లోని కులానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయాలని, ర్యాంకులతో నిమిత్తం లేకుండా బీసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని, అత్యంత వెనుకబడిన, సంచారజాతులకు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మాదిరిగా బీసీలకు పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా పార్లమెంట్లో బీసీ బిల్లు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.50 వేల కోట్ల కేటాయింపు, జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత తదితర డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తె చ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ అఖిలపక్ష బృందాన్ని, బీసీ సంఘాల ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, సీపీఐ నేత టి.వెంకట్రాములు, టీటీడీపీ నేత బుచ్చిలింగం, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, గంగపుత్ర సంఘం నేత ఏఎల్ మల్లయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం నేత గణేష్చారితోపాటు 70 కుల సంఘాలు, 30 బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డిమాండ ్ల సాధనకు ఈ నెల మూడోవారంలో ఇందిరాపార్కు వద్ద బీసీల మహాభేరి నిర్వహించాలని, వచ్చే నెలలో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించాలని తీర్మానించారు. పోరాడే సమయం: కృష్ణయ్య బీసీలుగా వాటాల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని ఆర్.కృష్ణయ్య అన్నారు. డిమాండ్ల సాధనకు దశలవారీగా ఉద్యమించాలని, అంతిమంగా రాష్ర్టబంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీసీ ఫెడరేషన్లవారీగా కాకుండా 80 శాతం సబ్సిడీతో వ్యక్తిగత రుణాలివ్వాలని, బీసీలకు 500 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
ఉద్యమంలా హరితహారం
♦ నాటిన మొక్కలకు రక్షణగా ముళ్ల కంప నాటండి ♦ మానవాళికి చెట్లు ఎంతో అవసరం ♦ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ధారూరు: రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని, నాటిన ప్రతి మొక్కకు రక్షణగా ముళ్ల కంపను ఏర్పాటు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. ధారూరు మండలంలోని జైదుపల్లి అడవిలో జిల్లా అటవీశాఖ అధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చెట్లు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం జైదుపల్లి సర్పంచు తాళ్లపల్లి సంతోష అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానవత్వం లేకుండా చెట్లను నరికివేస్తున్నారని, ఒక చెట్టు నరికితే 10 చెట్లను నాటి పెంచాలని సూచించారు. చెట్ల తరుగుదల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు చెట్లు లేక వాతావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాలు కురువకపోవడంతో వ్యవసాయం కుంటుపడుతుందని జెడ్పీ చైర్పర్సన్ అన్నారు. వర్షాలు లేక జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండక రైతులతో పాటు ప్రజలు, పశువులు, జంతువులు నీటి కోసం అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతగిరిగుట్ట అడవులు అందంగా ఉన్నాయని, ఇక్కడ సినిమా షూటింగ్‌లు నిరంతరం జరుగుతున్నాయంటే చెట్లు ఉండటమే కారణమని అన్నారు. ఇక్కడి అడవుల్లో వివిధ రకాల పూలమొక్కలను నాటాలని పర్యాటక ప్రాంతంగా ఆకర్షించబడుతుందని సునీతారెడ్డి అన్నారు. అడవుల్లో పండ్ల మొక్కలు కూడా నాటించాలని ఆమె హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డివిజన్ ఫారెస్టు అధికారి శ్రీనివాస్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే బి. సంజీవరావు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డివిజన్ ఫారెస్టు అధికారి శ్రీనివాస్, జిల్లా సోషల్ ఫారెస్టు అధికారి నాగభూషణం, సబ్ డీఎఫ్ఓ రేఖాభాను, ఫారెస్టు రేంజర్ నర్సింగ్‌రావు, డిప్యూటీ ఫారెస్టు రేంజర్ యూసూఫ్పాష, జైదేపల్లి, తరిగోపుల గ్రామాల సర్పంచులు టి.సంతోష, రవికుమార్, ఎంపీపీ ఉమాపార్వతి, ధారూరు పీఏసీఎస్, మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు హన్మంత్‌రెడ్డి, రాజునాయక్, వేణుగోపాల్‌రెడ్డి, సంతోష్‌కుమార్, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, జైదుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మమ్మ, మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు హఫీజ్, టీఆర్ఎస్ నాయకులు శుభప్రదపటేల్, భీంసేన్చారి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమానికి తాత్కాలిక విరామం
-
ఉద్యమానికి తాత్కాలిక విరామం
29 నుంచి విధుల్లో చేరతామని తెలంగాణ న్యాయవాదుల ప్రకటన హైకోర్టు ఏర్పాటుపై ప్రధాని, సీజేఐ హామీని విశ్వసిస్తున్నట్టు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. హైకోర్టు ఏర్పాటు చేయడంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన హామీని, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని విశ్వసించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నెల 29న విధుల్లో చేరుతున్నామని తెలంగాణ న్యాయవాదులు మంగళవారం ఏపీ భవన్లో మీడియాకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల ముగింపులోపు హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. అప్పటికీ కాకుంటే మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు. హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు, టీఆర్ఎస్ ఎంపీలతో చర్చించిన తరువాత ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్టు న్యాయవాదులు ప్రకటించారు. హైకోర్టు తప్పక ఏర్పాటవుతుంది: ఎంపీ సీతారాం నాయక్ ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమించిన తెలంగాణ న్యాయవాదులు ప్రధాని మోదీ, సీజేఐ హామీలతో ఉద్యమాన్ని విరమించడం అభినందనీయమని ఎంపీ సీతారాం నాయక్ కొనియాడారు. హైకోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, తెలంగాణ హైకోర్టు కచ్చితంగా ఏర్పాటవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తోందన్నారు. బంజారాల పెద్ద పండుగైన తీజ్‌ను ఢిల్లీలో జరపడానికి స్థానికంగా ఉంటున్న బంజారా సోదరులు డా.రవి, డా.ఆర్య ముందుకు రావడం ఆహ్వానించదగిందన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, వరంగల్ జిల్లా పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీధర్‌రావ్ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల కోసం ఉద్యమం
ఆదిలాబాద్ రిమ్స్ : రిజనులకు పది శాతం నిరజ్వేషన్లు కల్పించాలని ఉద్యమాలకు సిద్ధం కావాలని గిరిజన రిజర్వేషన్ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పెందూర్ ప్రబాకర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రింట్మీడియ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. కనీసం గిరజన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతం రిజ్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కోసం ఈనెల 25న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ధర్నాకు 12 తెగలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సమితి జిల్లా చెర్మైన్ మడావిరాజు, ప్రధాన కార్యదర్శి బానోవత్ రామరావు, ఉపాధ్యక్షుడు కడిమెతతిరుపతి, సభ్యులు కుర్సెంగ సూర్యబాను, జోడిదివాకర్, తుకారం, తానాజీలు ఉన్నారు. -
కల్లుతాగి వ్యక్తి మృతి
♦ కల్తీ కల్లే కారణమని బంధువుల ఆందోళన ♦ కల్లు కంపౌండ్ ధ్వంసం, మృతదేహంతో రాస్తారోకో ♦ పోలీసుల జోక్యంతో శాంతించిన కుటుంబసభ్యులు వికారాబాద్ రూరల్ : కల్లుతాగి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు ఆగ్రహంతో కల్లు కంపౌండ్ ధ్వంసం చేసి మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. మున్సిపల్ పరిధిలోని కొత్తగడి గ్రామానికి చెందిన నూరోద్దీన్(30) శుక్రవారం ఉదయం సమీపంలోని కంపౌండ్‌లో కల్లు తాగి బయటకు వచ్చి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా అంతలోనే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి కుటుంబీకులు, స్థానికులు కల్లు కంపౌండ్‌ను ధ్వంసం చేశారు. కల్లు సీసాలు పగులగొట్టారు. కల్తీకల్లుతోనే నూరోద్దీన్ మృతిచెందాడని మండిపడ్డారు. మృతదేహంతో వికారాబాద్-సదాశివపేట రో డ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ రవి వారికి సర్దిచెప్పారు. దీంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు రాస్తారోకోతో దాదాపు రెండు గంటల పాటు వాహనాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సుమారు 2 కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ రహదారి వికారాబాద్, సదాశివపేటకు ప్రధాన రహదారి కావడం మరో దారి వెళ్లడానికి లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
అన్నదాత కన్నెర్ర
♦ రుణమాఫీ కావడం లేదంటూ తాండూరులో ఆందోళన ♦ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన రైతులు ♦ బ్యాంకు భవనంపై నుంచి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు ♦ రాస్తారోకోతో తీవ్ర ఉద్రిక్తత, భారీగా స్తంభించిన ట్రాఫిక్ తాండూరు: పంట రుణమాఫీ వర్తించడంలేదని, కొత్తగా బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని ఆగ్రహించిన రైతులు మంగళవారం తాండూరులో ఆందోళనకు దిగారు. పంటల సాగుకు ప్రైవేట్‌గా అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీఓలకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తాండూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదురుగా తాండూరు -కోడంగల్ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో తాండూరు -కోడంగల్ మార్గంలో ఐదు కి.మీ. మేరకు వాహనాలు నిలిచిపోయాయి. సీఐతో వాగ్వాదం రాస్తారోకో విరమించాలని తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య ఆందోళనకారులను కోరినా ససేమిరా అన్నారు. సబ్ కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే విరమిస్తామని తేల్చిచెప్పారు. నాయకులను అక్కడి నుంచి బలవంతంగా తరలించేందుకు సీఐ సిబ్బందితో ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం జరిగింది. డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి రోడ్డుమీద పడుకున్నారు. పోలీసులు డౌన్ డౌన్, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పుల్‌స్టాప్‌కు బదులు కామతో సమస్య కంప్యూటర్లో లక్ష తరువాత పుల్‌స్టాప్‌కు బదులు కామ పెట్టడం రుణమాఫీ వర్తించకపోవడానికి కారణమని బ్యాంకు అధికారులు చెబుతున్నారని రైతులు వివరించారు. ఈ సాంకేతిక కారణం వల్లే విడతలవారీగా రుణం అందలేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఫైల్ పరిశీలనతో ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు రమేష్, లక్ష్మారెడ్డి, నరేష్, ధారాసింగ్, అపూ, సీసీఐ రాములు, పట్లోళ్ల నర్సింహులు, సునీత, శ్రీనివాసాచారి, హేమంత్, రాజారత్నం, రాజ్‌కుమార్, ఎం.శ్రీనివాస్, సీ.మల్లికార్జున్, లింగదళ్లి రవి, సంతోష్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. రైతు ఆత్మహత్యాయత్నం.. పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామానికి చెందిన రైతు సాయప్ప ఆందోళన చేస్తున్న ప్రాంతం నుంచి సమీపంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు భవనం మీదకు వెళ్లి దూకే ప్రయత్నం చేశాడు. రైతులు, నాయకులు సర్ధిచెప్పి కిందకు దించారు. స్థానిక సీఐ సూచన మేరకు తాండూరు తహసీల్దార్ రవీందర్‌తో రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ సబ్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. చివరకు 15 రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో నాయకులు రాస్తారోకో విరమించారు. -
ఉద్యమంలా హరితం
♦ 11న పెద్దఎత్తున మొక్కలు నాటాలని ♦ కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశం ♦ 11న పెద్దఎత్తున మొక్కలు నాటాలని ఆదేశం ♦ మండలాల్లో హరితహారం బాధ్యత ఎంపీడీఓలకు అప్పగింత ♦ ప్రత్యేకాధికారుల సమావేశంలో కలెక్టర్ రఘునందన్‌రావు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో హరితహారం ఉద్యమంలా నిర్వహించాలని కలెక్టర్ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. ఈ నెల 11న పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టరేట్లో మండలాల ప్రత్యేకాధికారులతో ‘హరితహారం’ కా ర్యక్రమంపై చర్చించారు.మహోద్యమంలా సాగే ఈ కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలను భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పారిశ్రామిక వాడలు, రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో.. మిషన్ కాకతీయ చెరువుగట్లపైనా మొక్కలు నాటడానికి వీలుగా ముందుగానే గుంతలు తీసి సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో హరితహారం కొనసాగాలని చెప్పారు. గుంతలు తీయడం మొద లు, మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు బా ధ్యులను నియమించాలని ఆదేశించారు. మం డల స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి స్థానిక ఎంపీడీఓలను బాధ్యులను చేయాలని జెడ్పీ సీఈఓ రమణారెడ్డికి స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో మొ క్కలు నాటే బాధ్యత డీ ఈఓకు అప్పగించారు. రైతులకు సంబంధించి ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగిరం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కాట ఆమ్రపాలి, సబ్‌కలెక్టర్ శ్రుతి ఓజా, అసిస్టెంట్ కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు. -
సర్కారుపై సమరం
♦ టీపీసీసీ సమన్వయ కమిటీ, విస్తృతస్థాయి భేటీలో నిర్ణయం ♦ హామీల అమలు కోసం క్షేత్ర స్థాయిలో ఉద్యమం ♦ టీపీసీసీ నేతలకు పని విభజన.. శిక్షణా శిబిరాలు ♦ మరింత క్రియాశీలకంగా క్రమశిక్షణా సంఘం సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నిర్ణయించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే దాకా గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం, సమన్వయ కమిటీ భేటీ జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, కార్యదర్శి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లాల వారీగా పని విభజన, ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, హామీల అమలు కోసం క్షేత్రస్థాయిలో చేయాల్సి పోరాటాలు వంటి వాటిపై సమావేశంలో సుదీర్ఘం గా చర్చించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వివరించారు. జిల్లాకు ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారని చెప్పా రు. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, టీఆర్ఎస్ హామీల అమలుపై పోరాటాల పర్యవేక్షణ, పార్టీ వ్యవహారాలకు వీరు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారన్నారు. పార్టీ శ్రేణులకు శిక్షణా శిబిరాలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ శ్రేణులకు శిక్షణ శిబిరాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగాా ఉత్తమ్ వెల్లడించారు. కాంగ్రెస్ చరిత్ర, దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర, వర్తమాన రాజకీయ పరిణామాలు, పార్టీ వైఖరి వంటి వాటిపై ఈ శిక్షణ శిబిరాల్లో అవగాహన కల్పిస్తామని వివరించారు. టీపీసీసీ క్రమశిక్షణా సంఘం పాత్రను మరింత క్రియాశీలకంగా, కఠినంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ైరె తుల సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికార టీఆర్ఎస్కు అనుకూలంగా, కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న నమస్తే తెలంగాణ, టీ న్యూస్ చానెల్‌ను బహిష్కరించాలని నిర్ణయించినట్టుగా ఉత్తమ్ తెలిపారు. ఇకపై వాటిలో వచ్చే కథనాలను కాంగ్రెస్ శ్రేణులు పట్టించుకోవద్దని సూచిం చారు. ఆ వార్తాసంస్థలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని పేర్కొన్నారు. ఎంత పెద్దవారైనా రీఎంట్రీకి నో అధికారం ఉన్నంతకాలం పెద్దపెద్ద పదవులను అనుభవించి, అధికారం పోగానే కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోయిన నాయకులను తిరిగి రానివ్వొద్దని పలువురు నాయకులు ఈ సమావేశంలో సూచించారు. పార్టీని వీడిన వారు ఎంత పెద్దవారైనా పార్టీలోకి తిరిగి తీసుకోవద్దని కోరారు. పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిపై వెంటనే క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలన్నారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పోరాటం చేయాలని, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, కరువు విషయంలో ప్రజల కష్టాలపైనా నిలదీయాలని పలువురు నేతలు సూచించారు. -
తెలంగాణ లాయర్ల ‘ఉద్యమ’ బాట!
చిచ్చు రేపిన న్యాయాధికారుల కేటాయింపులు సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల విభజనపై మరో ఉద్యమానికి తెలంగాణ న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ న్యాయాధికారులు ఇందుకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. భావి కార్యాచరణ కోసం తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం గురువారం జరగనుంది. జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కూడా శనివారం భేటీ జరపనుంది. తెలంగాణ న్యాయాధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. న్యాయాధికారుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించిన హైకోర్టు, కేటాయింపులను మాత్రం వాటికి విరుద్ధంగా చేసిందంటూ లాయర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన వారిలో 141 మంది ఏపీ చెందిన న్యాయాధికారులున్నారని తెలిసి కూడా హైకోర్టు ప్రాథమిక జాబితాను విడుదల చేసిందని, ఇది సరికాదన్నారు. కేటాయింపుల్లో అన్యాయంపై అంతా కలిసి తమ వాదనలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ‘‘ఈ కేటాయింపులను ఆమోదిస్తే వచ్చే రెండేళ్లల్లో ఏపీలో భారీగా ఖాళీలు ఏర్పడతాయి గానీ తెలంగాణలో మాత్రం అందుకు ఆస్కారముండదు. తెలంగాణ న్యాయాధికారులకు పదోన్నతుల్లోనూ తీరని అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదాకా దీనిపై పోరాటం చేస్తాం’’ అని వారంటున్నారు. -
మరో ఉద్యమం చేపడుతాం..
హన్మకొండ : సీమాంధ్ర ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ల జేఏసీ ఎన్పీడీసీఎల్ కంపెనీ పరిధి కన్వీనర్ బి.సామ్యానాయక్ హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవద్దని, వారిని ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి పంపాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో సామ్యానాయక్ మాట్లాడుతూ సీమాధ్ర ఉద్యోగులు ఇక్కడ విధుల్లో చేరితే ఎలా అడ్డుకోవాలో తెలుసునన్నారు. ధర్నాలో ఎన్పీడీసీఎల్ సీఈలు సదర్లాల్, వేణుగోపాలచారి, మోహన్‌రావు, రామకృష్ణ, అశోక్‌కుమార్, ఎస్ఈలు మధుసూదన్, రాజేష్‌చౌహాన్, నారాయణ, ఇంజనీర్ల జేఏసీ నా యకులు సుభ్రమణ్యేశ్వర్‌రావు, తిరుమల్‌రావు, మల్లయ్య, రణధీర్‌రెడ్డి, బి. కిశోర్, సురేష్, ప్రభావతి, జమున, రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు. -
కేసీఆర్ ‘ఉద్యమం’పై పుస్తకం
సీఎంకు బహూకరించిన రచయిత రాంజీ సింహ సాక్షి, హైదరాబాద్: తెలుగులోకి అనువదించిన హిందీ రచన ‘తెలంగాణ ఆందోళన-గాంధీవాదం పునఃస్థాపన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆ పుస్తక రచయిత రాంజీ సింహ ఉదయన్ గురువారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. వారణాసికి చెందిన రాంజీ తెలంగాణ ఉద్యమం సమయంలో హిందీ మిలాప్ దినపత్రికకు హైదరాబాద్ చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించిన తీరు, కేసీఆర్ ఆమరణ దీక్ష, తదనంతర పరిణామాలు, రాష్ట్ర ఏర్పాట్లను సునిశితంగా పరిశీలించాక ఈ పుస్తకాన్ని రచించినట్లు రాంజీ తెలిపారు. గాంధేయమార్గంలో శాంతియుతంగా నడిచిన తెలంగాణ ఉద్యమం దేశంలో గాంధీవాదాన్ని తిరిగి స్థాపించిందని పేర్కొన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించగా కేసీఆర్ అంగీకరించారు. -
తెరిపించాలి
♦ నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవాలి ♦ వేతన బకాయిలు చెల్లించాలి ♦ లేకపోతే ఉద్యమం ఉధృతం ♦ కార్మిక కుటుంబాల ఆందోళన బాట ♦ నేడు రోడ్డు దిగ్బంధం ఎన్డీఎస్ఎల్ లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేర్చాలన్న ప్రధాన డిమాండ్లతో నిజాంషుగర్స్ రక్షణ కమిటీ చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. తొమ్మిది నెలల క్రితం తెలంగాణ ప్రజాఫ్రంట్, తొమ్మిది వామపక్ష పార్టీలు కలిసి నిజాంషుగర్స్ రక్షణ కమిటీని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, టీడీపీలు మద్దతు పలికాయి. ఫ్యాక్టరీ రక్షణ కోసం కొన్ని నెలల నుంచి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అఖిల పక్షం అధ్వర్యంలో శనివారం బోధన్ మండలం సాలూర వద్ద అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేయనున్నారు. బోధన్ : 2015-16 క్రషింగ్ సీజన్‌ను నవంబర్, డిసెంబర్ మాసాల్లో ప్రారంభించాల్సి ఉండగా ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం చేతులెత్తేసింది, ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు వెనుకంజ వేసింది. బోధన్‌లోని శక్కర్‌నగర్, ముత్యంపేట (కరీంనగర్) ముంజోజిపల్లి (మెదక్) ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు మళించారు. ముడిసరుకు కొరత సాకు చూపి ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం 2015 డిసెంబర్ 23న లేఆఫ్ నోటీసు జారీ చేసి ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేసింది. దీంతో మూడు యూనిట్ల పరిధిలోని కార్మికులు ఉపాధి కోల్పో యి రోడ్డున పడ్డారు. అప్పటి నుంచి కార్మికులు ఆందోళన బాటపట్టారు. కార్మికుల ఆందోళనకు నిజాంషుగర్స్ రక్షణ కమిటీ అండగా నిలిచింది. నిజాంషుగర్స్ రక్షణ కమిటీ, ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాలు ఐక్యతతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్డీఎస్ఎల్ లేఆఫ్ ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంలో జాప్యం చేస్తోంది. దీంతో కార్మికులు, రైతుల్లో ప్రభుత్వం పై అసహనం, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ.. ఫ్యాక్టరీ భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి కావస్తున్నా నిజాంషుగర్స్ స్వాధీనం పై ప్రభుత్వం విధాన పరమైన సానుకూల నిర్ణయం తీసుకోకుండా కమిటీల అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తోందని అఖిల పక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. 129 రోజులుగా రిలే నిరహార దీక్షలు నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడుపాలని ప్రధాన డిమాండ్‌తో ఏర్పడిన నిజాంషుగర్స్ రక్షణ కమిటీ ఒక వైపు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తునే, మరో వైపు రిలే నిరహార దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తోంది. 2015 నవంబర్ 18 పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరహార దీక్షను ప్రారంభించా రు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు, వామపక్ష పార్టీలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు వంతుల వారీగా రిలే నిరహార దీక్షలో కూర్చుంటున్నారు. శుక్రవారం నాటికి రిలే నిరహార దీక్షలు 129 రోజులు పూర్తికాగా.. కార్మికుల కుటుంబాలు పిల్లాపాపలతో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని రక్షణ కమిటీ సంకల్పంతో ముందుకెళ్తోంది. సాలూర వద్ద అంతర్రాష్ట్ర రోడ్డు దిగ్బంధం కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని నిజాంషుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు కోరారు. -
సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం
♦ ఈ నెల 13న హైదరాబాద్‌లో సదస్సు ♦ ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్ తెయూ(డిచ్పల్లి): సామాజిక తెలంగాణ కోసం బహుజనులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సామాజిక తెలంగాణ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్ పిలుపునిచ్చారు. గురువా రం తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం లో కూడా బహుజనులకు సమన్యాయం దక్కడం లేదన్నా రు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో త్యాగాలు బహుజను లు చేస్తే, బహుకొద్ది మంది మాత్రమే దాని ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అధికారంలోని ఉన్నవాళ్లు వ్యవహరిస్తు న్నారని అన్నారు. తెలంగాణలో 60 శాతం ఉన్న బీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. ఒకటి, రెండు అగ్ర కులాలే లెక్కకు మించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నారని అన్నారు. ఇతర నామినేటెడ్ పోస్టులు, అధికారిక పదవుల్లో సైతం అగ్ర కులాల వారినే నియమిస్తున్నారని ఆరోపించారు. నిజానికి బహుజనులు లేని ఊరు, ఉద్యమం లేదన్నా రు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నత పదవులన్నీ అగ్రకులాల వారికే అంటగడుతున్నారని అన్నారు. 1600లకు పైగా బహుజన విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తే, మిలియన్ మార్చ్‌లు, సాగర హారాలు, సకల జనుల సమ్మె చేస్తే స్వరాష్ట్రంలో అధికార బోగాలన్నీ రెండున్నర కులాల వారే అనుభవిస్తున్నారని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేక పోవడాన్ని ఆయన తప్పు బట్టారు. ఈ నెల 13న హైదరాబాద్‌లోని బీసీ సెం టర్లో ‘సామాజిక తెలంగాణ సాధించుకోవడం ఎలా’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభంజన్‌యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి బహుజన మేథావులు, ఉద్యమకారులు హాజరై ఐక్య కార్యాచరణ రూపొందించాలన్నారు. అనంతరం సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో అధ్యాపకులు దామెర జాన్సన్, ప్రవీణాబాయి, పున్నయ్య, రమణచారి, వెంకటేశ్వర్లు, రాజారాం, విజయలక్ష్మి, దత్తహరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మాతృబాష ఉద్యమానికి YSRCP అండగా ఉంటుంది
-
ఆ మహిళలు.. అసమానతను గెలిచారు..!
వీపుపై వెదురు బుట్టలు కట్టుకొని పచ్చని ప్రకృతి మధ్య టీతోటల్లో ఆకులు తుంచుతూ కనిపించే ఆ మహిళలను చూస్తే మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ.. కానీ వారి జీవితాల్లో బాధలు ఆగాధాల్లా పేరుకొన్నాయి. వారికి అంతులేని వేదనలు మిగులుస్తున్నాయి. అయితే ఏళ్ళదరబడి జీవన పోరాటంలో గెలిచేందుకు వారు చేసిన ప్రయత్నం ఇప్పుడు విజయవంతమైంది. టీ తోటల్లో కనిపించని కష్టాలను గట్టెక్కేందుకు నెరపిన ఉద్యమం ఎందరో మహిళలకు స్ఫూర్తి దాయకంగా మారింది. రాజకీయాలకు అతీతంగా, పురుషుల అండదండలు అవసరం లేకుండా యాజమాన్యాలపై పోరాడి అనుకున్నది సాధించారు. కన్నన్ దేవన్ హిల్స్ టీ తోటల్లోని మహిళలు తమ సత్తా చాటుకున్నారు. కేరళరాష్ట్రం మున్నార్ కొండప్రాంతం టీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేసే మహిళా కూలీల శ్రమను మాత్రం దశాబ్దాలు గడుస్తున్నా గుర్తించేవారే లేకుండా పోయారు. దీంతో మహిళలంతా ఒక్కటయ్యారు. మేం బుట్టలను వీపుపై కట్టుకొని టీ ఆకులు కోస్తాం.. మీరు ఆ బుట్టల్లోంచి డబ్బు దండుకుంటున్నారు.... అంటూ టీ తోటల్లో మొదలైన మహిళల ఉద్యమం రోడ్డుపైకి చేరింది. కనీసం తమ నిరసనల్లో రాజకీయ నాయకులను, పురుషులను అనుమతించలేదు. ఎటువంటి సంఘాలను జోక్యం చేసుకోనివ్వలేదు. యూనియన్ నాయకులు యాజమాన్యాలతో కుమ్మక్కై వారి బోనస్ ను తగ్గించడాన్ని నిరసించారు. నాలుగు నుంచి ఆరువేల మంది మహిళలు తొమ్మిది రోజులపాటు.. యాజమాన్యాలతో అధిక బోనస్ కోసం పోరాడి చివరికి కేవలం మహిళా శక్తితో గెలుపు సాధించారు. పార్టీలకు ప్రభావితమైన యూనియన్ లీడర్లు, ఆధిక్యం ప్రదర్శించే పురుషులకు దీటుగా... ఉద్యమించిన మహిళా శక్తి నేడు ఈ ప్రాంతంలోని పలు ఎస్టేట్స్ లోని మహిళా కూలీలకు, ఉద్యోగినులకు స్ఫూర్తిగా మారింది. దీంతో వీరంతా ఇప్పుడు వేతనాలకోసం పోరాటాన్ని ప్రారంభించారు. ఒక్క టీ తోటల్లోనే కాదు వరి చేలల్లోనూ, అగరబత్తి, బీడీ రోలింగ్, రొయ్య పొట్టు, పట్టు పురుగు పెంపకం, జీడి గింజల ఫ్యాక్టరీల్లోనూ ఈ మహిళా గళం ప్రతిధ్వనించింది. ఉద్యోగాల్లోనూ, వృత్తుల్లోనూ మహిళలు సమానంగా పనిచేస్తున్నా పురుషులకంటే తక్కువ వేతనాలు ఇవ్వడం, పురుష ఆధిక్యతతో ఉండటం ఎందుకు జరుగుతోందంటూ వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత మున్నార్ మహిళల తిరుగుబాటు ఒక్క వారి సమస్యలు సాధించేందుకే కాదు... ఏకంగా భారత ఆర్థిక వ్యవస్థ పైనే పడనుంది. కులం, రంగు, రాజకీయాలు మొదలైన అనేక వివక్షల్లో మార్పును తెచ్చేందుకు, అందరికీ సమన్యాయం జరిగేందుకు ఉపయోగ పడనుంది. ఇటువంటి స్త్రీ వాద ఉద్యమాలు సమన్యాయం జరిగేందుకు దోహదపడనున్నాయి. ఆర్థిక అసమానతలను తొలగించేందుకూ సహాయపడే అవకాశం ఉంది. ప్రస్తుత మున్నార్ ఉద్యమం ఓ చిన్న నిప్పు రవ్వ అగ్గిని రాజేసినట్లుగా ఇంతింతై.. మొత్తం ప్రపంచాన్ని తాకనుంది. అసురక్షిత కార్మికులు, శ్రామిక ఒప్పందాలు, యజమానుల ద్రోహం, వంటి అనేకమైన ఆర్థిక అంశాలను విమర్శించేందుకు తావునిచ్చింది. అనేక సమస్యలు స్త్రీలు పురుషులకంటే సమర్థవంతంగా నిర్వర్తించగలరని నిరూపించింది. ఇండియా రాజధాని ఢిల్లీలో జరిగిన అభయ అత్యాచార ఘటనలోనూ మహిళా ఉద్యమం తారాస్థాయికి చేరి, ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపింది. అప్పట్లో జరిపిన అతి పెద్ద ఉద్యమం ఏకంగా చట్టాల్లోనే కీలకమైన మార్పును తెచ్చాయి. అనంతర పరిణామంలో ఇటీవల లైంగిక హింసలపై మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. లైంగిక హింస కేసులు నమోదు చేసేందుకు ధైర్యం చేస్తున్నారు. అదే రీతిన మున్నార్ ఉద్యమం.. ప్రపంచంలోనే మహిళా వివక్షను ప్రశ్నించేందుకు ఓ స్ఫూర్తిగా మారనుంది. -
హోదా కోసం వైఎస్ఆర్సిపి ఉద్యమం ఉధృతం
-
రైవాడ నీటి కోసం మరో ఉద్యమం
శృంగవరపుకోట: రైవాడ నీటి కోసం రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైవాడ నీటిని తమకివ్వాలంటూ 18 ఏళ్ల కిందట రైతులు నిర్వహించిన పోరాటం రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృషించింది. అయితే ఇప్పుడు అదే రైవాడ నీటి కోసం మరో ఉద్యమం ఊరికిపోసుకుంది. 1975లో అప్పటి సీఎం జలగం వె ంగళరావు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, జీఓ నంబర్ 417తో పాత శృంగవరపుకోట తాలూకాకు రెండువేల ఎకరాలు, విశాఖ జిల్లా చోడవరం, వియ్యంపేట తాలూకాలకు నాలుగువేల ఎకరాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 14 ఎంజీడీ నీటిని విశాఖపట్నం తరలించాలని ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వంతుంగలో తొక్కేసింది. జీఓనెం.160తో 27ఎంజీడీ నీటిని ఓపెన్ కెనాల్ ద్వారా విశాఖ పట్టుకుపోతున్నారు. మళ్లీ చంద్రబాబు హాయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.216 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులో ఓపెన్ కెనాల్ స్థానంలో పైప్‌లైన్‌వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. భగ్గుమంటున్న రైతాంగం రైతుల నోట్లో మట్టికొట్టి రిజర్వాయర్ల నీటి ని దోచుకెళ్లి ప్రభుత్వం యధేచ్ఛగా వ్యాపారం చేసుకుంటోందని వేపాడ, కోటపాడు , దేవరాపల్లి, సబ్బవరం మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోంచి రైవాడ నీరు వెళ్తున్నా, కాలువ పక్క పొలాలు బీటలు వారి వ్యవసాయంలేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ కెనాల్ స్థానంలో పైప్‌లైన్ ఏర్పాటు చేసే యోచనను వారు వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీ స్థాయి నుంచి మండల, జిల్లా సమావేశాల్లో ప్రబుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేలా తీర్మానించేందుకు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యలో పైపు లైన్ నిర్మాణం ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం వేపాడ మండలం నీలకంఠరాజపురం గ్రామసమీపంలో రైవాడ కాలువ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. -
రాజ్యాధికారం కోసం ఐక్య ఉద్యమం: ఆర్. కృష్ణయ్య
నల్లగొండ టౌన్: రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా బీసీ కులాలన్నీ ఐక్యం గా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన బీసీ సమరభేరి మహాసభలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలు బీసీలను జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీలకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకుంటే మనమే ఒక పార్టీని పెట్టుకొని, వచ్చే ఎన్నికల్లో బీసీలను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకోవాలని కోరారు. పార్లమెంట్లో బీసీ బిల్లును పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలకు బీసీలు కేవలం 12 మంది మాత్రమే ఉండడం దారుణమన్నారు. 107 కులాలు నేటికీ అసెంబ్లీ గేటును దాటకపోవడం శోచనీయన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ కృష్ణమోహన్, నీలం వెంకటేశ్ మాట్లాడారు. -
జీవో 59పై కదలిక ఏదీ..?
- భూముల క్రమబద్ధీకరణ మార్గదర్శకాల్లో కొరవడిన స్పష్టత - లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌పై గందరగోళం - రెవెన్యూ కార్యాలయాల్లో అటకెక్కిన 46 వేల దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ విషయమై సర్కారు తీసుకున్న నిర్ణయం పూర్తిస్థాయిలో అమలు కావట్లేదు. ప్రత్యేకించి జీవో నంబర్ 59 ప్రకారం ప్రభుత్వం స్వీకరించిన క్రమబద్ధీకరణ దరఖాస్తులు కనీస పరిశీల నకూ నోచుకోవట్లేదు. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టత కొరవడటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారికి ఆయా భూములను క్రమబద్ధీకరించేందుకు గతేడాది డిసెం బర్ 30న ప్రభుత్వం జీవో 58, 59లను జారీచేసింది. జీవో 58 మేరకు ఆయా భూములను పేదవర్గాలకు ఉచిత కేటగిరీలోనూ, ధనికులకు చెల్లింపు కేటగిరీలోనూ క్రమబద్ధీకరించాలి. రెండు కేటగిరీల్లోనూ కలిపి మొత్తం 3,66,150 దరఖాస్తులు ప్రభుత్వానికి అందగా ఇందులో 3,36,869 లక్షల దరఖాస్తులు ఉచిత కేటగిరీకి చెందినవికాగా, మరో 29,281 దరఖాస్తులు చెల్లింపు కేటగిరీలో వచ్చాయి. ఉచిత కేటగిరీలో అందిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వీటిలో 1.30 లక్షల మంది అర్హులని తేల్చారు. అలాగే 16,915 దరఖాస్తులను చెల్లింపు కేటగిరీకి (కన్వర్షన్) మార్చారు. దీంతో చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల సంఖ్య 46,196కు చేరింది. స్పష్టత ఇవ్వని సర్కారు క్రమబద్ధీకరణ కోసం చెల్లింపు కేటగిరీలో వచ్చిన దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ప్రభుత్వ మార్గదర్శకాల్లో స్పష్టత కొరవడిందని అధికారులంటున్నారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ ధర ప్రకారం ఒకేసారి సొమ్ము చెల్లించిన వారికిగానీ, వాయిదాల పద్ధతిలో చెల్లించిన వారికిగానీ, ఆ స్థలాన్ని ఎవరు (ఆర్డీవో/తహశీల్దారు) రిజిస్ట్రేషన్ చేయాలో సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొనలేదంటున్నారు. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మార్చిన దరఖాస్తుల విషయంలోనూ స్పష్టత లేదంటున్నారు. చెల్లింపు కేటగిరీలో ప్రస్తుతం 3వ వాయిదా చెల్లించాల్సిన సమయం కనుక, కన్వర్షన్ దరఖాస్తుదారుల నుంచి ఒకేసారి 3 వాయిదాల సొమ్ము వసూలు చేయాలా లేక వారు సొమ్ము చెల్లిం చేందుకు గడువు ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నారు. ఉచిత క్రమబద్ధీకరణ గురించి పట్టించుకున్నంతగా చెల్లిం పు కేటగిరీ గురించి అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ మండల స్థాయి అధికారులు జీవో 59 దరఖాస్తులను అటకెక్కించేశారు. మార్గదర్శకాలపై స్పష్టత వస్తే తప్ప, క్రమబద్ధీకరణ ముందుకు కదిలే పరిస్థితి కనిపించట్లేదు. -
టార్గెట్ స్టూడెంట్స్!
వర్సిటీ విద్యార్థులపై మావోయిస్టుల కన్ను ఉద్యమంలోకి ఆక ర్షించే యత్నాలు చాపకింద నీరులా పార్టీ సంస్థాగత నిర్మాణం విద్యావంతులను చేర్చుకుంటున్నట్లు నిఘా వర్గాల హెచ్చరిక అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం కరీంనగర్: మావోయిస్టులు చాపకింద నీరులా ఉద్యమాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఏ మాత్రం లేని ప్రాంతాల్లో యువకులను ఉద్యమంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిఘా వర్గాల వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత కూడా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపు లేనేలేవు. కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతంలో నామమాత్రంగా, ఖమ్మం జిల్లా చింతూరు ప్రాంతంలో (ఛత్తీస్‌గఢ్ సరిహద్దు) తప్ప ఎక్కడా వారి కదలికలు లేవు. అయితే పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉద్యమంలోకి విద్యావంతులను ఆకర్షించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన ఉత్తర తెలంగాణ పోలీసులు కాలేజీల్లో చదువుకుంటూ అదృశ్యమైన యువకుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచిఇప్పటికే కొందరు విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వారి విచారణలో వెల్లడైంది. ‘విశ్వవిద్యాలయాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై మనం నిఘా వేయాలి. ఇప్పటికే కొందరు విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి’ అని ఇటీవల శాంతిభద్రతలపై సమీక్షలో ఓ ఎస్పీ పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యమంలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులతోపాటు, పరిస్థితుల ప్రభావంతో లొంగిపోయిన మాజీలను కూడా తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. హరిభూషణ్ రాకతో... మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఎన్నికైనప్పటి నుంచి సంస్థాగత నిర్మాణం జోరందుకున్నట్లు తెలుస్తోంది. దళిత, గిరిజన, బలహీన వర్గాలనే కాకుండా మేధావులు, విద్యావంతులను ఆకర్షించాలని భావిస్తున్న మావోయిస్టు అగ్రనేతలు ఆ దిశగా ప్రయత్నాలను తీవ్రం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వర్షాకాలంలో దట్టంగా మారే అడవులను అనుకూలంగా మార్చుకుని ప్రజా దర్బారులు నిర్వహించాలని, పలు సంచనాలతో తమ ఉనికి చాటుకోవాలని మావోయిస్టులు ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటి నుంచే రాజకీయ నేతలు, పోలీసు అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన సమగ్ర వివరాలను ఇప్పటినుంచే సేకరిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లోని అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బందిని సర్కారు అప్రమత్తం చేసింది. రాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌ను కూడా పోలీసులు విస్తృతం చేశారు. మావోయిస్టుల దాడులను ఎదుర్కొనడం, ఆయుధాల వినియోగంపైనా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. -
మాదిగలపై వ్యతిరేకతను విడనాడాలి
తొర్రూరు : తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు మాదిగలు అండగా ఉన్నారని, వారిపట్ల వ్యతిరేకతను వీడనాడి... ఎస్సీ వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే తేదీని ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కోరారు. తొర్రూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాడం కొత్తదేమీ కాదని, నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హమీకి కట్టుబడి వర్గీకరణ సాధనకు సీఎం కృషి చేయాలన్నారు. ఈ బాధ్యత ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్ధిపేట సంఘటన, కేసీఆర్ ఆమరణ దీక్షకు అం డగా ఉన్నది ఎమ్మార్పీఎస్, మాదిగలు మాత్రమేనన్నారు. జీవితాంతం మాదిగలకు రుణపడి ఉండాల్సిన కేసీఆర్ మాదిగల సంక్షేమం, వర్గీకరణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్పష్టత ఇవ్వకపోవడం సరికాదన్నారు. తమ సహకారంతో తెలం గాణలో పాదయాత్ర చేసిన, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి న టీడీపీ ఇచ్చిన మాట ను నిలబెట్టుకోకుంటే రెండు ప్రాంతాల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ టీడీపీ నేతలైన ఎర్రబెల్లి, రమణ.. మాదిగలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబును ఒప్పించకుండా.. ఇతరులపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. వర్గీకరణపై ఏపీలో తీర్మానం చేయకుంటే భవిష్యత్‌లో టీడీపీ, చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకుం టామన్నారు. సమావేశంలో నకిరకంటి యాక య్య, మంద కుమార్, తిప్పారపు లక్ష్మణ్, తీగల ప్రదీప్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
శివయ్య సాక్షిగా బీసీల ఉద్యమం
శ్రీకాళహస్తి: బీసీలకు మంచి జరగాలని శ్రీకాళహస్తి శివయ్య చెంతతొలిసారిగా ఉద్యమం చేపట్టినట్లు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉదయకిరణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని స్కిట్ కళాశాల సమీపంలో బీసీ సంఘం నాయకులు హక్కుల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టారు. వారికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డే రంగుల ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ శివయ్య స్వామి చంద్రబాబు బుద్ధిని మార్పు చేసి బీసీల అభ్యున్నతికి దోహదపడేలా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు. బీసీలు అన్ని పార్టీల్లో ఉ న్నారని, అయితే బాబు సర్కార్ తమకు ఓట్లు వేయలేదంటూ బీసీ వృద్ధులకు పెన్షన్లు తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిం చడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో బీసీలకు ఎక్కడ అ న్యాయం జరిగితే అక్కడ పోరాటాలు చేయడానికి సంఘాన్ని పటిష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ బీసీలకు బడ్జెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 993 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ బీసీల పిల్లలు ఈ రోజు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని గుర్తుచేశారు. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎందరో వెనుకబడిన తరగతులతోపాటు ఎస్సీ, ఎస్టీలు, పేదలైన ఓసీలు కూడా ఉన్నత చదువులు చదువుకునే భాగ్యం లభిస్తోందన్నారు. రైతు రుణ మాఫీపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారంటూ వృద్ధులకు పెన్షన్లు తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం టీడీపీ అరాచకాలకు నిదర్శనమన్నారు. బీసీలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి బీసీల పక్షాన నిలుస్తారని తెలిపారు. వైఎస్సార్సీపీ బీసీ జిల్లా అధ్యక్షుడు మిద్దెల హరి మాట్లాడుతూ హక్కుల సాధనకోసం బీసీలు ఐక్యంగా పోరా టం చేయాలని పిలుపునిచ్చారు. వడ్డెర, రజక, వాల్మీకి, బెస్త కులాలను ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుమ్మడి బాలకృష్ణయ్య మాట్లాడుతూ స్థానికంగా బీసీలకు తమ పార్టీ నుంచి పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని...ఐక్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. వారితోపాటు వైఎస్సార్సీపీ నాయకులు అంజూరు శ్రీనివాసులు, కొట్టెడి మధుశేఖర్, వయ్యాల కృష్ణారెడ్డి, సిరాజ్‌బాషా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చిలకా గోపి, పాపిరెడ్డి, శివ, శ్రీనివాసులు కూడా మద్దతు పలికారు. -
విద్యాబాలన్ ఫటాఫట్ చెప్పిన చిత్రేతర విషయాలు..
ఎప్పుడూ చిత్రాల గురించేనా? ఈసారి విద్యాబాలన్ ఫటాఫట్ చెప్పిన చిత్రేతర విషయాలు చదువుదాం... 1. కష్టం-తేలిక ఒత్తిడికి గురవుతున్నాను...అని చెప్పడం తేలికే. ‘ఒత్తిడిని దూరంగా పెడతాను’ అని చెప్పడమే కష్టం. సాధన చేస్తే ఈ కష్టం తేలికవుతుంది. 2. నా శక్తి ‘వాళ్లు చేసారు కాబట్టి నేను చేస్తాను’ అనుకోను. ‘నేను ఇది చేయగలను. ఇది నా శక్తి’ అనుకుంటాను. 3. మన సైన్యం కుటుంబమే మన సైన్యం. ఒంటరిగా ఉన్నప్పుడో, దూరంగా ఉన్నప్పుడో వారిని తలుచుకుంటే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. 4. ఆత్మవిమర్శ పనికిమాలిన విమర్శకు దూరంగా ఉండడం ఎంత అవసరమో, ఆత్మవిమర్శకు అతి సమీపంగా ఉండడం కూడా అంతే అవసరం. 5. భయం భవంతి! భయం అనే భవంతిలో నివసించకూడదు. అలా చేస్తే ఆరోగ్యానికి, ఆనందానికి దూరమవుతాం. 6. స్ట్రగుల్ తరువాతే... శారీరక సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు...దేనికీ నిమిషాల్లో రెడిమెడ్ సమాధానాలు ఉండవు. కొంత స్ట్రగుల్ తరువాతే జవాబు దొరుకుతుంది. 7. బాడీ చెబుతుంది మనం ఏం తినాలో, తినకూడదో ఎవరో వచ్చి చెప్పనక్కర్లేదు. మన శరీరమే చెప్పగలదు. దాన్ని అనుసరిస్తే సరిపోతుంది. 8. నిద్రా నీళ్లు! నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే... ఇప్పటికైనా ఇవ్వండి. నీళ్లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇవ్వండి. నేను రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగుతాను. 9. రూపమే నీ అందం వేరే వ్యక్తితో పోల్చుకొని ‘నేను అందంగా లేను’ అనుకోవద్దు, ప్రతి వ్యక్తికి భిన్నమైన రూపం ఉంటుంది. అదే ఆ వ్యక్తికి అందం! 10. ఉద్యమం ‘నేను నల్లగా ఉన్నాను’ ‘నేను నలుపు కాబట్టి నన్ను చిన్న చూపుచూస్తున్నారు’ అని బాధ పడేవాళ్లను చూస్తే జాలేస్తుంది. ఇలాంటి వారి కోసం ‘మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అనే ఉద్యమం ఒకటి మొదలు పెట్టాలనిపిస్తుంది. -
బీసీ రిజర్వేషన్ కల్పించకుంటే ఉద్యమిస్తాం
తెలగ, బలిజ, కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 30 మేరకు కాపులను వెంటనే బీసీ జాబితాలో చేర్చి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని టీబీకే (తెలగ, బలిజ, కాపు) జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము డిమాండ్ చేశారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మంది రంలో బుధవారం తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యాచరణ వేదిక, కాపు రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర స్థాయి 4వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ టీడీపీ గత ప్రభుత్వాల్లాగా కాపులను వాడుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఐక్యత ద్వారానే రిజర్వేషన్ సాధ్యం: అంబటి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ కాపుల బీసీ రిజర్వేషన్ జీవో ఎడారిలో ఒయాసిస్ లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల ఐక్యత ద్వారానే రిజర్వేషన్ సాధ్యమవుతుందని చెప్పారు. కాపులకు రెండు వాగ్దానాలు చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిందని, రెండవ వాగ్దానమైన బీసీ రిజర్వేషన్ కోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డితో మాట్లాడి కాపుల బీసీ రిజర్వేషన్‌కు మద్దతు తెలియ చేస్తామన్నారు. మాజీ మంత్రి శాసన మండలిలో విపక్షనేత సీ రామచంద్రయ్య మాట్లాడుతూ కాపు కుల సంఘాలు ఎక్కువయ్యాయని అనేక మంది తమ స్వార్థం కోసం కులాన్ని వాడుకుంటున్నారని, దీన్ని అందరూ ఖండించాలన్నారు. టీడీపీ ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి దాకా ఉద్యమాలు నిర్వహించిన టీబీకే-జేఏసీని వ్యవస్థాపక సంఘంగా స్థాపించి కార్యవర్గాన్ని నియమించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో జీడీఎం ఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీఎల్వీ ప్రసాదరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎస్.ఎల్.వి.నారాయణ, తులసీ గ్రూప్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు, వివిధ జిల్లాలకు చెందిన జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నాడూ నేడూ పోరాటమే!
జ్ఞాపకం కె.బాలకుమార్ తెలంగాణ ఉద్యమకారుడు యవ్వనం ఉద్యమంతో రగిలింది. తెలంగాణ సాధనే ధ్యేయంగా కదిలింది. పోలీసులు గ్యాస్ బాంబులు విసురుతున్నా, బుల్లెట్లు వర్షంలా కురుస్తున్నా.. ఉడుకెత్తే రక్తంతో ఎదురొడ్డి నిలిచిన సాహసం.. కె.బాలకుమార్. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఊపిరిలూదిన 1969 నాటి ఉద్యమం నుంచి... స్వర్ణకాంతులు అద్దుకున్న నేటి తెలంగాణ వరకు నిలువెత్తు సాక్ష్యమై నగరంతో మమేకమై సాగుతున్న ప్రయాణం. పోరుబాటలో తూటా తాకి కాలు పోయినా.. చిన్న బడ్డీ కొట్టు నడుపుకొంటూ హుందాగా జీవిస్తున్న ఈ అరవై ఆరేళ్ల పోరాట యోధుడి ‘జ్ఞాపకాలు’.. ..:: హనుమా అది 1969 జూన్ 27. సీఎం బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేశారు. నగరమంతా బంద్. తెలంగాణ కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. రోడ్లపై వేలాదిమంది ఉద్యమకారులు. వారిని చెదరగొట్టేందుకు పోలీసుల లాఠీచార్జీ.. ఆపై గ్యాస్ బాంబులు. ఆ బాంబులు పట్టి తిరిగి వారిపైకే వేశాం. పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. బుల్లెట్ల వర్షం.. అంతా చెల్లాచెదురు. నా కాలికీ ఓ తూటా తగిలింది. సమయం సాయంత్రం మూడు గంటలు. పరుగెత్తలేక అక్కడే పడిపోయా. రెండు గంటలపాటు నరకయాతన. ఐదింటప్పుడు పోలీసులే తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలో పడేశారు. అందులో ప్రాణాలు కోల్పోయిన వారు, నాలా గాయపడిన వారెందరో!. ఐదొందలడిగారు... ఉద్యమం కోసం మేం ప్రాణాలకు తెగిస్తే..దవాఖానాలో మాత్రం నిర్లజ్జగా లంచం అడిగారు. నాకు చికిత్స చేయడానికి ఐదొందల రూపాయలిమ్మన్నారు. ఇవ్వలేనన్నందుకు.. వదిలేశారు. తరువాత ఇన్ఫెక్షన్ సోకి కాలు తీసేయాల్సి వచ్చింది. ఇదిగో ఇలా ఒంటికాలితో బతుకీడుస్తున్నా. సికింద్రాబాద్ టు మల్కాజిగిరి మాది సికింద్రాబాద్. చదివింది ఐఐటీ. అప్పట్లో సికింద్రాబాద్ గణేష్ కట్‌పీస్ సెంటర్లో సేల్స్‌మాన్‌గా చేసేవాడిని. కాలు పోయిన తరువాత ఉద్యోగం పోయింది. ఇంటి ముందే స్కూల్ పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మేవాడిని. 1981లో సిటీ అమ్మాయితోనే పెళ్లయింది. ముగ్గురు సంతానం. 1983లో మల్కాజిగిరికి మారాం. ఇక్కడ చిన్న బడ్డీ పెట్టుకున్నాను. నాడు.. నేడు ఇదే జీవనాధారం. 1972లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఎన్నికలప్పుడు.. ఉద్యమంలో కాలు పోయిందంటూ నన్ను చూపించి ప్రచారం చేసుకున్నారు. అక్కడి నుంచి గెలిచారు గానీ.. ఎవరూ నన్ను ఆదుకుంది లేదు. నాటి ఉద్యమంలో 350 మంది మరణించారు. నాకు తెలిసి ప్రస్తుతం గౌతమ్‌నగర్‌లో ఒకరు, ఇక్కడి దయానంద్‌నగర్‌లో ఒకాయన ఆనాటి ఉద్యమంలో బుల్లెట్ గాయాలు తిన్నవారే. వీరిద్దరూ ఇప్పుడు దోభీతో జీవనం సాగిస్తున్నారు. అంతా పంటపొలాలు నేను మల్కాజిగిరికి వచ్చిన ఏడాదికి రామచంద్ర థియేటర్ కట్టారు. ఇది పంటపొలాలున్న ప్రాంతం. 1983లో సఫిల్‌గూడ చెరువుండేది. అందులో అన్నం ఉడికినట్టు నీళ్లు ఊరుతుండేవి. రామకృష్ణాపురం నుంచి నీళ్లు ఇందులోకి వచ్చేవి. ఇప్పుడా చెరువులో అన్నీ ఇళ్లే. హుస్సేన్‌సాగర్‌లో జలకాలు చిన్నప్పుడు ఫ్రెండ్సందరం కలసి తరచూ ట్యాంక్‌బండ్‌కు వెళ్లేవాళ్లం. హుస్సేన్‌సాగర్‌లో జలకాలాడేవాళ్లం. అంత స్వచ్ఛం నీళ్లు. సాగరం ఎంతో విశాలంగా, నిండుగా ఉండేది. నల్లగుట్ట, సింధికాలనీ వెనుక భాగం వరకు నీళ్లు. ఇప్పుడు... చుట్టూ నివాసాలొచ్చి కుంచించుకుపోయింది. నాడూ బడా సెంటర్లే.. సికింద్రాబాద్, మొజంజాహీ మార్కెట్, చార్మినార్, సుల్తాన్‌బజార్ వంటివి నాడూ బిజీ సెంటర్లే. ఇక ప్రతి వీధిలో బ్రిటిష్ జమానా నల్లాలు... అందులో 24 గంటలూ మంజీర నీళ్లు. ఇళ్లలో నల్లాలు లేవు. బావులు అక్కడక్కడా కనిపించేవి. ఇప్పుడవన్నీ పోయి ఎక్కడపడితే అక్కడ బోరింగులైపోయాయి. కార్లు, బస్సులు అరుదుగా కనిపించేవి. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిళ్లే. డబుల్ డక్కర్ బస్సు ఓ వింత. వాహ్.. మూసీ చాదర్‌ఘాట్‌లో మూసీ నది ప్రవాహం.. ఓహ్ ఎంత సొగసు! ఆ నీళ్లు తాగేవాళ్లం కూడా. చుట్టుపక్కల పొలాలకు ఈ నీటిని వాడేవాళ్లు. ఇప్పుడా ఆహ్లాదం ఏది?. నాడు వాతావరణం కూడా ఎంతో కూల్. ఈ సీజన్లో మధ్యాహ్నం కూడా స్వెట్టర్, మఫ్లర్ లేకుండా బయటకెవరూ వచ్చేవారు కాదు. సమయానికి వర్షాలు, చలి, ఎండలు.. ఏ కాలంలో అవి. ఒకటా రెండా.. ఈ మహానగరంతో అరవై ఆరేళ్ల అనుబంధం. ప్రతిదీ ఓ జ్ఞాపకం. -
ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉద్యమం
అనంతపురం టౌన్ : ప్రజాబాహుళ్యాన్ని మరచి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పాలన సాగిస్తున్నాయని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ధ్వజమెత్తారు. ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించి వారి తరఫున ఉద్యమిస్తుందన్నారు. చిల్లర వ్యాపారులను ప్రోత్సహిస్తున్నామంటూ షావుకార్లకు మద్దతు పలికే విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిల్లర వ్యాపారులంటే విదే శీ పెట్టుబడులతో వచ్చే కార్పొరేట్ సంస్థల రిటైల్ షాపులు కాదన్నారు. కార్పొరేట్ రిటైల్ షాపింగ్‌ని ప్రోత్సహిస్తూ, దేశ ఆర్థిక మూలాలుగా ఉన్న రైతులు, చిరు వ్యాపారులను రోడ్డున పడేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయన్నారు. ఇది పూర్తిగా ప్రజా బాహుళ్యాన్ని మరిచి ప్రవర్తించడమేనన్నారు. స్థానిక వ్యాపారులను బలోపేతం చేసే దిశగా విధానాలు చేపట్టకుండా విదేశీ శక్తులను, బడా వ్యాపారులను ప్రోత్సహించడం సరికాదన్నారు. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తామని చెప్పిన బీజేపీ.. అధికారంలోకి రాగానే తమ పంథాని మార్చుకుందన్నారు. చివరికి అంత్యంత కీలకమైన రక్షణ రంగంలోనూ విదేశీ పెట్టుబడలను ఆహ్వానించేందుకు సిద్ధపడిందన్నారు. దీన్ని బట్టి చూస్తే కార్పొరేట్ శక్తుల చేతుల్లో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయనేది స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పాటైన కొత్త ప్రభుత్వాలు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన మేలు ఇసుమంతైనా లేదన్నారు. ప్రతీదానికి సింగపూర్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం పాట మొదలెట్టిందని ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో మూడు పంటలు పండే వ్యవసాయ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం చూస్తే వ్యవసాయం చేయడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుందన్నారు. వ్యవసాయ భూములు పోగొట్టి బియ్యం, బేడలు బయటి నుంచి తెచ్చుకునేందుకు అగ్రిమెంట్ ఏమైనా చేసుకున్నారా? అని అనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కాకుండా ప్రజల పక్షాన ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శులు సోమర జయచంద్రనాయుడు, నాగరాజు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ, పీసీసీ కార్యదర్శి వశికేరి శివ పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ సాధనకు కదలండి
తెయూ(డిచ్పల్లి): బంగారు తెలంగాణ సాధనలో దళిత మేధావులు, విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ‘బంగారు తెలంగాణ- ద ళితుల భవిష్యత్తు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన స దస్సులో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ దళి తుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఉద్యమంలో క్రీయాశీలకంగా పని చేసిన విద్యార్థి జేఏసీ సేవలను గుర్తించి తనకు ఎస్సీ కార్పొరే షన్ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయన్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రా కుంటే ఉండే బాధలు ఏమిటో తనకు తెలుసునన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ గల విద్యార్థులకు, ముఖ్యంగా దళిత విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయన్నరు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష, రూ. రెండు లక్షల రుణాలు తీసుకుని బ తుకు వెళ్లదీస్తామనే చిన్న ఆలోచనలను పక్కన పెట్టేయాలన్నారు. చదువులో నైపుణ్యాలు పెంచుకుని ఉ న్నత ఉద్యోగావకాశాలు సాధించి, ఇతరులకూ ఉ పాధి కల్పించేలా కృషి చేయాలని సూచించారు. వి ద్యార్థి దశలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమా లు చేసి కేసులు ఎదుర్కొన్నామని, ఎందరో విద్యార్థులు అమరులయ్యారని గుర్తు చేశారు. ప్రత్యేక రా ష్ట్రం వచ్చిన తర్వాత ప్రస్తుతం సామాజిక ఉద్యమా లు ఊపందుకుంటున్నాయన్నారు. సదస్సులో వర్సి టీ క ళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య, ఎస్సీ, ఎస్టీ సె ల్ డైరక్టర్ ప్రవీణ్, అకడమిక్ ఆడిట్ సెల్ డైరక్టర్ ధర్మరాజు, డాక్టర్ ప్రభంజన్‌కుమార్ యాదవ్, ఎం ఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు నాంపల్లి, టీఆర్ఎస్ యూత్ నాయకులు బాజిరెడ్డి జగన్, మాలమహానా డు జిల్లా కార్యదర్శి నాయుడు రాజు, విద్యార్థి సం ఘాల నాయకులు యెండల ప్రదీప్, పులి జైపాల్, మర్రికిరణ్, ప్రగతికుమార్, రంజిత్, శరత్, శ్రీనివా స్, బాలాజీ, రాజ్‌కుమార్, సంతోశ్, టీఆర్ఎస్ నా యకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గజ్వేల్.. భిన్నత్వం జిగేల్
గజ్వేల్ అంటే ఓ ఉద్యమం, ఓ కళ, ఓ సంస్కృతి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం. రాజధానికి సమీపంలోని పట్టణం. సర్వజనుల సమ్మేళనంతో సరికొత్త హంగులు సంతరించుకుంటోంది. వెనుకబడిన ప్రాంతమన్న ఒకనాటి మాటను పక్కనపెట్టి అభివృద్ధిలో దూసుకుపోతోంది. కళ, సంస్కృతుల కలబోతగా ప్రజా ఉద్యమాల ఊపిరిగా వైవిధ్య ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. భిన్న సంస్కృతులకు నెలవై, వైవిధ్యభరిత ప్రాంతంగా గజ్వేల్ వర్ధిల్లుతోంది. ఆది నుంచి ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తోంది. ప్రత్యేకించి కళలకు కోటగా వెలుగొందుతోంది. ఈ రంగంలో ప్రపంచస్థాయి ఖ్యాతి గడించిన వారు ఈ ప్రాంతీయులే కావడం విశేషం. ఈ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్ మండలాలను తన ఒడిలో ఇముడ్చుకోనుంది. ఇప్పటికే ఇక్కడ నగర వాతావరణం విస్తరిస్తోంది. దేశంలో ఉన్న అన్ని రకాల మతాలు, విభిన్న సంస్కృతులు కలిగిన వారు ఇక్కడ నివసించడం మరో విశేషం.ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న గజ్వేల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఇలాకా’గా అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ కొత్త హంగులను సంతరించుకోబోతోంది. ఈ ప్రాంత విశేషాలపై ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం. - గజ్వేల్ * కళలు, సంస్కృతుల సమ్మేళనం * ప్రజా ఉద్యమాలకు ఊపిరి * వైవిధ్య ప్రాంతంగా గుర్తింపు గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజవర్గం వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దున ఉంది. అందువల్ల ఈ మూడు జిల్లాల సంస్కృతి ఈ ప్రాంతంలో విస్తరించింది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండడం వల్ల ఇక్కడ కూడా నగర వాతావరణం కనిపిస్తుంది. దశాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తుంది. ప్రత్యేకించి ప్రత్యేక రాష్ట్ర ప్రజాస్వామిక ఆకాంక్షతో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం పోషించిన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. 1969లో జరిగిన కాల్పుల్లో పట్టణానికి చెందిన అయిల నర్సింలు ఆసువులు బాశాడు. ఉద్యమంలో భాగంగా గజ్వేల్‌లోని చౌరస్తా వద్ద విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో కాల్పులు జరిగాయి. ఇందులో పన్నెండేళ్ల వయసున్న ఆ బాలుడు తూటాలకు బలైపోయాడు. ఈ సందర్భంగా మరో విద్యార్థి సైతం గాయపడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘అయిల నర్సింలు’ రక్తంతో తడిసిన ఈ నేల ప్రతి దఫా పోరాటంలోనూ అదే స్ఫూర్తిని కనబరిచింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనచేసిన కేంద్రం వెనక్కి తగ్గిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఉద్యమాలు జరిగాయి. ఇందులో భాగంగానే 2010 జనవరిలో అప్పటి ఎమ్మెల్యే నర్సారెడ్డి కేంద్రం తీరును నిరసిస్తూ ఆమరణ దీక్షను చేపట్టారు. ఈ దీక్ష ముగిసిన తర్వాత టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి సైతం ఆమరణ దీక్షకు పూనుకున్నారు. అంతేకాకుండా ప్రజా, ఉద్యోగ సంఘాలు పోరాటంలో తలమునకలయ్యాయి. ప్రతి నిరసనలోనూ భాగస్వాములై ప్రజాస్వామిక ఆకాంక్షను చాటాయి. తెలంగాణే కాదు ఇతర ప్రజా ఉద్యమాలు సైతం ఇక్కడ ఉవ్వెత్తున సాగాయి. కేసీఆర్ ‘ఇలాకా’గా ఆవిర్భావం అణువణువునా తెలంగాణ స్ఫూర్తిని నింపుకున్న గజ్వేల్ చివరకు కేసీఆర్ సొంత నియోజకవర్గంగా మారటం యాదృశ్చికంగా జరిగిపోయింది. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకున్న కేసీఆర్ ఊహించిన విధంగానే తెలంగాణవాదాన్ని మరింతగా చాటిచెప్పి ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ఈ ప్రాంతాన్ని తన సొంత ‘ఇలాకా’గా మార్చుకున్నారు. నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులో ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే దిశలో టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలకు సంబంధించి ఇక్కడి నుంచే వ్యూహ రచన చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పునర్నిర్మాణం పేరిట చేపట్టబోతున్న కొత్త తరహా అభివృద్ధికి కూడా గజ్వేల్ కేంద్ర బిందువుగా మారడం విశేషం. కేసీఆర్ ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే బంగారు తునకగా మారుస్తానని ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టి ఈ ప్రాంతంపైనే కేంద్రీకృతమై ఉంది. కళలకు నెలవు ప్రజాగాయకునిగా ప్రపంచస్థాయి గుర్తింపును పొందిన గద్దర్‌కు జన్మనిచ్చింది ఈ ప్రాంతమే. నియోజకవర్గంలోని తూప్రాన్‌లో జన్మించిన ఆయన పీడితుల గొంతుకగా మారి ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచారు. తన అసమాన ప్రతిభతో సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన బి. నర్సింగరావుది గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామం. ‘మా భూమి, దాసి, రంగుల కల’ వంటి చిత్రాలతో ఆయన సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. వీరిద్దరే కాకుండా ఈ ప్రాంతానికి చెందిన పలువురు వర్ధమాన కవులు, కళకారులు తమదైన ప్రతిభను చాటుతున్నారు. భిన్న సంస్కృతుల నిలయం గజ్వేల్ నియోజకవర్గం భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. నియోజకవర్గంలోని కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలో దేశంలో ఉన్న వివిధ మతస్తులు, సంప్రదాయాలు కలిగిన వారు నివాసముంటున్నారు. ఇక్కడ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ములుగు మండలంలోని గంగాపూర్‌కు ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో సుమారు 60కిపైగా సిక్కుల కుటుంబాలున్నాయి. వీరి కుటుంబాల్లో ఎక్కువమంది దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరి సేవలందించడం విశేషం. ఇదిలా ఉంటే గజ్వేల్ పట్టణంలో గుజరాతీలు, కేరళవాసులు పెద్ద ఎత్తున స్థిర పడ్డారు. కేరళ వాసులు జరుపుకునే ‘ఓనమ్ ఉత్సవాలు’ ఇక్కడ ప్రతిఏటా ఘనంగా జరుగుతాయి. గుజరాతీలు సైతం తమ సంప్రదాయ పండుగలను జరుపుకుంటారు. వీరంతా ఇక్కడి ప్రజలతో ఆత్మీయుల్లా కలిసిపోయారు. పర్యాటక ప్రదేశంగా గుర్తింపు గజ్వేల్ పర్యాటక ప్రదేశంగానూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. వర్గల్‌లోని విద్యాసరస్వతి ఆలయం తెలంగాణలో బాసర తర్వాత రెండో ఆలయంగా, ఇదే మండలంలోని నాచారంగుట్ట రెండో యాదగిరి గుట్టగా బాసిల్లుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రాలకు జంటనగరాలే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్లది జంట గ్రామాల బంధం భౌగోళికంగా కలిసిపోయిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ గ్రామాలు ‘హైదరాబాద్-సికింద్రాబాద్’ మాదిరిగా విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నాయి. మూడేళ్ల క్రితం ఆవిర్భవించిన గజ్వేల్ నగర పంచాయతీకి గజ్వేల్-ప్రజ్ఞాపూర్గా నామకరణం చేయడం ఈ రెండు గ్రామాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. గజ్వేల్‌ను నగర పంచాయతీగా మార్చిన నేపథ్యంలో చరిత్ర కలిగిన తమ గ్రామం పేరును సైతం నగర పంచాయతీలో చేర్చాలని ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు 2012 ఫిబ్రవరి నెలలో దీక్షలు చేపట్టగా ప్రభుత్వం వారి దీక్షల ఫలితంగా నగర పంచాయతీని గజ్వేల్-ప్రజ్ఞాపూర్గా నామకరణం చేసింది. 19 ఏళ్ల క్రితం బస్సుడిపో విషయంలోనూ ఇదే రకమైనా ఆందోళనలు జరగడంతో డిపోను అప్పట్లో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి రాష్ట్ర మంత్రి గీతారెడ్డి దీనిని గజ్వేల్-ప్రజ్ఞాపూర్గా నామకరణం చేయించారు. అదే ఆనవాయితీ నేడు నగర పంచాయతీ విషయంలో ఉత్పన్నమైంది. ‘వెజిటెబుల్ హబ్’గా అవతరణ గణనీయమైన కూరగాయల సాగుతో గజ్వేల్ నియోజకవర్గం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. ఇక్కడి పండించిన కూరగాయలే జంటనగరాలకు ఆధారం. ఇక్కడ పండించిన కూరగాయలు సేకరించడానికి ఇక్కడ వివిధ మల్టినేషనల్ కంపెనీల కలెక్షన్ సెంటర్లు వెలిశాయి. ప్రభుత్వ పరంగా ములుగు మండలం వంటిమామిడిలో కూరగాయాల మార్కెట్ ఏర్పాటైంది. ఇక్కడి నుంచి జంట నగరాలకే కాకుండా ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై లాంటి ప్రధాన నగరాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఈ ప్రాంత ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు మండల కేంద్రంలోని అటవీ పరిశోధనా కేంద్రంలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. దీంతోపాటు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఫారేస్ట్రీ కళాశాలను సైతం ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు సంస్థల ఏర్పాటుతో ఈ ప్రాంత స్వరూపమే మారనుంది. -
ఉద్యమం ఆగదు
బాపట్లటౌన్ : నిత్యం ప్రశాంతంగా ఉండే వ్యవసాయ కళాశాల ప్రస్తుతం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. అసోసియేట్ డీన్ ప్రసాద్ అక్రమ నియామకం చెల్లదంటూ తొమ్మిది రోజులుగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు తరగతులు బాయ్‌కాట్ చేశారు. డీన్‌గా విష్ణుశంకరరావునే నియమించాలంటూ ఆయనకు మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఇటీవల పరిశీలనకు వచ్చిన యూనివర్సిటీ కమిటీ బృందం నుంచి కూడా విద్యార్థులకు సరైన సమాధానం రాలేదు. దీంతో యూనివర్శిటీ అధికారుల తీరుపై విద్యార్థిలోకం తీవ్రస్థాయిలో మండిపడింది. విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ పద్మరాజు, రిజిస్ట్రార్ సత్యనారాయణ, కార్యాలయ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ల దిష్టిబొమ్మలకు శనివారం కళాశాల ప్రాంగణంలో శవయాత్ర నిర్వహించారు. స్థానిక కళాశాల ఎదుట దహన సంస్కారాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. డీన్‌ను తిరిగి నియమించేంత వరకు ఉద్యమం ఆగదు .. డీన్‌గా విష్ణుశంకరరావునే నియమించేంత వరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు తేల్చిచెప్పారు. శవయాత్రలో భాగంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ డీన్‌గా బాధ్యతలు చేపట్టాలంటే కనీసం మారుమూల ప్రాంతాల్లో రెండేళ్లు, కళాశాలలో ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పనిచేసి ఉండాలి. డీన్ అయ్యేనాటికి 15 ఏళ్ల సర్వీస్ ఉండాలి. అసోసియేట్ డీన్‌గా పనిచేసిన డాక్టర్ దర్శి విష్ణుశంకరరావు నిబంధనల ప్రకారమే ఆశ్వారావుపేట, అనకాపల్లి, గుంటూరు లాంఫామ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 11 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. వ్యవసాయ ఎకనామిక్స్ విభాగానికి విశ్వవిద్యాలయం హెడ్‌గా, కళాశాల వార్డెన్‌గా, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్, విద్యార్థి కార్యకలాపాల అధికారిగా వివిధ విద్యార్థుల కార్యక్రమాల్లో విధులు నిర్వహించిన అనుభవం ఉంది. ప్రస్తుతం అసోసియేట్ డీన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన పీఆర్‌కె ప్రసాద్ కేవలం బాపట్ల వ్యవసాయ కళాశాలలో అది కూడా మూడేళ్లు మాత్రమే ప్రొఫెసర్‌గా పనిచేశారని, మిగిలిన సర్వీస్ అంతా కూడా రిసెర్చ్ విభాగంలో ఉన్నారన్నారు. గతంలో రెండేళ్ల పాటు వసతిగృహం వార్డెన్‌గా నిర్వహించినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విద్యార్థులు ముక్తకంఠంతో చెబుతున్నారు. కళాశాల ప్రగతికి సహకరించాలి.. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న వ్యవసాయశాఖా మంత్రి, విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు వాళ్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కళాశాల ప్రగతికి సహకరించాలి. అనుభవం లేని వ్యక్తిని డీన్‌గా నియమించడం కేవలం రాజకీయ కారణమే. ఇలాంటి నిర్ణయాలు వెంటనే ఉపసంహరించుకోవాలి. - విద్యార్థులు వెంకటే ష్, సన్యాసినాయుడు నియామకం నిలిపివేయాలి... కళాశాల అభ్యున్నతికి ఆహర్నిశలు కృషిచేసే అసోసియేట్ డీన్‌ను కాదని, కళాశాలపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తిని డీన్‌గా నియమిస్తే విలువైన మా జీవితాలు అంధకారమవుతాయి. ఈ విషయాన్ని విద్యార్ధిలోకమంతా ముక్తకంఠంతో చెబుతున్నా యూనివర్శిటీ అధికారులు కనీసం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు. - విద్యార్థినులు పద్మజ, వేదశ్రీ, ప్రశాంతి నా సామర్థ్యాన్ని గుర్తించే నియమించారు.. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఉప్పునీటి పరిశోధనస్థానంలో, వాటర్ మేనేజ్మెంట్, మట్టి నమూనా కేంద్రాల్లో శాస్త్రవేత్తగా, సీనియర్ శాస్త్రవేత్తగా, విభాగాధిపతిగా పనిచేశాను. గతంలో రెండేళ్లు వసతిగృహ వార్డెన్‌గా విధులు నిర్వహించా. నా సామర్థ్యాన్ని గుర్తించి నన్ను అసోసియేట్ డీన్‌గా నియమించారు. - పి.ఆర్.కె.ప్రసాద్, ప్రస్తుత డీన్ న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించా.. వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ డీన్‌గా నియమించాలంటే ఉండాల్సిన అర్హతలు అన్నీ ఉన్నా నన్ను కాదని, ఎలాంటి అనుభవం లేని వ్యక్తి, జూనియర్‌ను అసోసియేట్ డీన్‌గా నియమిస్తూ యూనివర్శిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని యూనివర్శిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. నా విషయంలో జరిగిన అన్యాయాన్ని అరికట్టి న్యాయం జరిగేలా చూడాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. - డి. విష్ణుశంకరరావు, తొలగించిన డీన్ -
ఎస్సీ వర్గీకరణకు మరో ఉద్యమం
మార్కాపురం: ఏబీసీడీ వర్గీకరణ కోసం మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో గురువారం రాత్రి నిర్వహించిన మార్కాపురం డివిజన్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశానికి వీ జాని అధ్యక్షత వహించగా..ముఖ్య అతిథిగా కృష్ణమాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తాము గెలిస్తే ఏబీసీడీ వర్గీకరణ కోసం కృషి చేస్తామని హామీలు ఇచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రాలో టీడీపీ, కేంద్రంలో బీజేపీలకు తాము ఆర్నెల్ల గడువు ఇచ్చామని.. వచ్చే నెల 8వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. అప్పట్లోపు రెండు రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబరు 14, 15 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగే ఎమ్మార్పీస్ రాష్ట్ర సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఉద్యమాన్ని చేపడతామని కృష్ణ మాదిగ ప్రకటించారు. తనపై కొందరు ఉద్యమ సోదరులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన జీవిత లక్ష్యం ఏబీసీడీ వర్గీకరణే అన్నారు. అతిథులుగా హాజరైన యర్రగొండపాలెం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు డేవిడ్‌రాజు, ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కృష్ణ మాదిగ చేపట్టబోయే ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ఉద్యమాలు చీల్చేందుకు పలువురు కుట్రలు పన్నుతున్నారని వారు విమర్శించారు. మాదిగల ఆత్మ గౌరవానికి గుర్తింపు తెచ్చిన ఘనత కృష్ణ మాదిగకే దక్కుతుందని చెప్పారు. గతంలో వర్గీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని వారు గుర్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు ఉసురుపాటి బ్రహ్మయ్య, పందిటి కాశీరావు, బలుసుపాటి గాలెయ్య, షాలెం, నర్శింహ, నగేశ్, విజయకుమార్, ఫ్రాంక్లీన్, దోర్నాల, పుల్లలచెరువు ఎంపీపీలు ప్రభాకర్, సుందరరావు, బీజేపీ నేత కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. -
వర్గీకరణ కోసం మరో ఉద్యమం : మంద కృష్ణ
నల్లగొండ రూరల్ : ఎస్సీ వర్గీకరణ కోసం డిసెంబర్ 2వ వారం నుంచి మరో ఉద్యమం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. గురువారం స్థానిక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు ఉన్నప్పటికీ చట్టసభల్లో నాలుగు నిమిషాల మాట్లాడని దద్దమ్మలన్నారు. పోరాటం చేసేవారిని వదిలి అసమర్థ మాదిగ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు, కేసీఆర్, ఎల్‌కె.అద్వాని, వెంకయ్యనాయుడులు వర్గీకరణకు మద్దతు పలికారని, దివంగత వైఎస్ఆర్ ఢిల్లీకి తీసుకెళ్లి సోనియాగాంధీని కలిపిం చారని తెలిపారు. వర్గీకరణ ద్వారా మాదిగలకు 12శాతం రిజర్వేషన్ లభిస్తుందని, తద్వార మాదిగ జాతి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను కావాలనుకుంటే ఎమ్మెల్యేనో, ఎంపీనో అయ్యేవాడినని, కానీ జాతి ఆత్మగౌరవం కోసమే పోరాటం నిర్వహిస్తున్నానని తెలిపారు. ఉద్యమ పోరాటానికి మహాజన సోషలిస్టు పార్టీకి సంబంధం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇందుకు మాయావతి, కాన్షిరాం పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లింగస్వామి, నరేష్, కోళ్ల శివ, సోమయ్య, చేకూరు గణేష్, రవి, కె.మోహన్, అధ్యాపకులు ఉన్నారు. -
అభివృద్ధిపై మరో ఉద్యమం
వనపర్తి టౌన్ : తెలంగాణ వచ్చిందని సంతోషించడం సరిపోదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం త్వరలో నల్లమల ప్రాంతం చెంచు పెంటలనుంచి అభివృద్ధి ఉద్యమం నిర్వహిద్దామని, ఇందుకు స్వచ్ఛంద సంఘాలు, ఉద్యోగ సంఘా లు, ప్రజలు ముందుకు రావాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తూర్పు జిల్లా ప్రథమ మహాసభను శనివారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మొదటగా తెలంగాణ విద్యావంతుల వేదిక జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. విజయ్‌కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్యలు పూమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల ఆత్మకు శాం తి కలగాలని కాసేపు మౌనం పాటించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో సమానత్వం అవసరమని, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి తమవంతుగా కృషి చేస్తామన్నారు. ప్రజల పక్షాన ఉంటూ తెలంగాణ అభివృద్ధికి రాజీ పడకుండా పోరాటం చేస్తామని చెప్పారు. రాజకీయ పెట్టుబడులతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండటం లేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల విభజన ఇంకా జరగకపోవడం దురదృష్ణకరమన్నారు. ప్రభుత్వానికి ప్రజలు కడుతున్న పరోక్ష పన్నులే 80 కోట్లు ఉంటుందని, తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా ప్రభుత్వాలు సహకరించడంలేదని, వారు గాడిలో పడాలంటే ప్రజల్లో ప్రశ్నించే నైజం రావాలని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, జైల్‌భరో తదితర రూపాల్లో ఉద్యమాలు చేశామని, అదే ఉద్యమ స్ఫూర్తితో సంపూర్ణ తెలంగాణ నిర్మాణానికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సంపూర్ణ రాజ ధానికిగా ఏర్పాటయ్యేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం పలు తీర్మాణాలు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలని, కొల్లాపూర్‌లో కాగితపు పరిశ్రమ, సిమెంట్ తయారీ పరిశ్రను నెలకోల్పాలని, ఐటీడీఏను బలోపేతం చేసి విద్యను, వైద్యాన్ని ఇతర మౌళిక సదుపాయాలను చెంచులకు అందించేందుకు కృషి చేయాలని, రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, గద్వాల- మాచర్ల రైల్వే పనులు మొదలుపపెట్టాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రజాకవి వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న తన ఆట పాటలతో అలరించారు. కార్యక్రమంలో టీవీవీ తూర్పు, పడమ జిల్లాల అధ్యక్షులు రాజు, రవీందర్‌గౌడ్, ప్రతినిధులు సతీష్‌రెడ్డి, వేణుగోపాల్, పాలిటెక్నిక్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మురళీధర్‌గుప్తా, బి. కుమార్, జి. రంగస్వామి, రవిశాస్త్రి, జి. ప్రసాద్, వేణుగోపాల్, నిరంజన్వ లి పాల్గొన్నారు. -
రాజ్యాధికార సాధనకు మరో ఉద్యమం
బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని అన్నారు. గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలోనూ అగ్రకులాలే పెత్తనం చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాధికార సాధనతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్లో బడుగు, బలహీన వర్గాలను పూర్తిగా విస్మరించిందని, ఉచిత అమలుకు రూ. 25 కోట్లు కేటాయించి నిరుపేద లను అన్యాయం చేశారన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామన్న హామీల అమలుకు చర్యలు చేపట్టలేదన్నా రు. ఈ నెల 9న సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో నిర్వహ/ంచను న్న తెలంగాణ రాష్ట్ర స్థారుు ప్రతినిధుల సభకు ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిష్టియన్లు అ దిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమితి జిల్లా ఉపాధ్యక్షుడిగా దుర్గప్రసాద్ స్థానిక హనుమాన్‌పురకు చెందిన కావలి దుర్గా ప్రసాద్ బీసీ సంఘర్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు సమితి జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని గురువారం ఆయనకు నియామకపత్రం అందజేశా రు. బీసీల సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రోనార్డ్జాన్, కుర్మయ్య, రాజశేఖర్ గౌడ్, సత్యంయాదవ్, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఏవోబీలో సంచలనం
సాగుల సంఘటనకు భిన్నంగా నిలిచిన వీరవరం వర్గపోరుగా చీలిపోతున్న మావోయిస్టుల ఉద్యమం ఇన్ఫార్మర్ల హత్యలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు కేంద్ర కమిటీకి గతంలో లేఖ రాసినట్టుగా వార్తలు కొయ్యూరు : కిందటేడాది సాగులలో మావోయిస్టులు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేస్తూ ముగ్గురిని చంపడం నాడు పెద్ద సంచలనమైంది. ఇప్పుడు మావోయిస్టులు కోరుకొండ సమీపంలో వీరవరం వద్ద గిరిజనులు చేతిలో మరణించడం వర్గ చీలికను నిర్ధారిస్తోంది. వ్యక్తిగత కారణాలు, కుటుంబ కలహాలతోనే కొందరిని ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు చంపేస్తున్నారన్న ఆరోపణలు బాధిత కుటుంబాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక మావోయిస్టు నేత ఇన్ఫార్మర్ల హత్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర కమిటీకి లేఖ రాసినట్టుగా వార్తలు వచ్చాయి. 2007లో గూడెం మండలంలో అప్పటి కేంద్ర కమిటీ సభ్యులు వక్కాపూడి చంద్రమౌళి అలియాస్ దేవన్నను చంపేసినప్పుడు విశాఖ మన్యంలో గిరిజనులు అతనిపై అభిమానంతో వారం పాటు తిండితిప్పలు మానేసి విషాదంలో మునిగిపోయారు. ఇప్పుడు అలా గిరిజనుల గుండెల్లో నిలిచిపోయే నేతలు ఎందరు ఉన్నారో చెప్పడం కష్టం. గిరిజనుల నుంచి వ్యతిరేకత వస్తే మావోయిస్టులు ఈస్టు డివిజన్లో మనుగడ సాగించడం కష్టమే. ఒకే సామాజికవర్గంపై దాడులు? 1983లో ఈస్టు డివిజన్ ఏర్పడినప్పుడు ఏ సామాజిక వర్గాలు ఉద్యమాన్ని ముందుకు నడిపించాయో అవి నేడు పూర్తిగా అభివృద్ధి చెంది మరోవైపు పయనిస్తున్నాయి. దీంతో మావోయిస్టులలో దశాబ్దం నుంచి మరో సామాజిక వర్గం చేరింది. ఎక్కువ మంది సభ్యులు దానికి చెందినవారే ఉన్నారు. ఆ సామాజిక వర్గం రాక తో మన్యంలో రెండు సామాజిక వర్గాల మధ్య వైరం పెరిగింది. మావోయిస్టులు కరువుదాడుల పేరిట ఒకే సామాజిక వర్గం ఇళ్లను దోచుకోవడం ఆగ్రహాన్ని కలిగించింది. వారి భూములను కూడా పంచేయడంతో వలసలు పోయారు. దీనిపై లోలోపల రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ ఉన్న వారిపై ఆజమాయిషీ చే యడం మరింత అసంతృప్తిని రగిలించింది. ఇదిలా ఉంటే మిలీషియా సభ్యులుగా చేరుతున్న సామాజికవర్గంపై వేరే సామాజిక వర్గం గుర్రుగా ఉంది. వారి మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీని మూలంగా మావోయిస్టులకు గిరిజనులకు మధ్య దూరం పెరిగింది. 2013 ఫిబ్రవరి సాగుల ఘటన రెండు వర్గాల మధ్య చోటు చేసుకుంది. గొడవను పరిష్కారం చేసేందుకు వచ్చిన మావోయిస్టుల తీరు నచ్చక ఒక వర్గం మావోయిస్టులపై దాడికి దిగింది. మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉండడంతో దాడికి దిగిన వర్గానికి చెందిన గిరిజనులను చంపేశారు. ఈ ఘటనలో అంతా మావోయిస్టులను వేలెత్తి చూపించారు. తాజాగా చింతపల్లి మండలం బలపంకు సమీపంలో వీరవ రంలో జరిగిన సంఘటనలో మావోయిస్టులపై ఉన్న ఆగ్రహాన్ని గిరిజనులు చూపించారు. మావోయిస్టులపై తిరగబడ్డారు. వారిలో మిలీషియా కమాండర్‌గా వ్యవహరిస్తున్న సీందరి చిన రంగారావు అలియాస్ శరత్‌ను, మరో ఇద్దరిని చంపేశారు. బూదరాళ్ల పంచాయతీ కన్నవరానికి చెందిన శరత్‌ను గాలికొండ ఏరియా కార్యదర్శిగా చేయాలని ఇటీవలే మావోయిస్టు ఈస్టు డివిజన్ నిర్ణయించినట్టుగా తెలిసింది. -
పాలమూరు పరవశించాలె
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘తెలంగాణ ఉద్యమంలో జిల్లాకు చెందిన బిడ్డ సువర్ణతో పాటు అనేక మంది బలిదానాలు చేశారు. లాఠీదెబ్బలు తిని జైళ్లకు వెళ్లారు. ఎంతో ఆదరణతో నన్ను ఇక్కడ నుంచి ఎంపీగా గెలిపించారు. మహబూబ్‌నగర్ ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించా. మహబూబ్‌నగర్ నా గుండెల్లో ఉంది, చెరువులు, కుంటలు, పచ్చదనం, పారిశ్రామిక విధానంతో జిల్లా అద్భుత ప్రగతి సాధించాలి. నిరుద్యోగ భూతం పారిపోయి జిల్లా ముఖ చిత్రం మారిపోవాలి. పాలమూరు గడ్డమీద నిలబడి చెప్తున్నా, నాలుగైదు ఏళ్లలో పాలమూరు పరవశించి పులకించి పోతుంది. పచ్చని పంటలతో తులతూగుతుంది’ అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. అడ్డాకుల మండలం వేముల, కొత్తూరు మండలం పెంజర్ల శివారులో గురువారం జరిగిన మూడు ప్రైవేటు పరిశ్రమల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మహబూబ్‌నగర్ జిల్లాలో 34,184 ఎకరాలు భూమి పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉంది. ఇందులో సుమారు 13,500 ఎకరాలు ఇప్పటికిప్పుడు పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉంది. ప్రయత్నం చేస్తే జిల్లాకు రూ.50వేల కోట్ల నుంచి రూ.80వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది’ అని సీఎం వెల్లడించారు. ‘నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల ప థకాలకు వచ్చే బడ్జెట్లో రూ.800 కోట్లు కేటాయిస్తే వచ్చే యేడాది జూన్ నాటికి ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. రూ.1100 కోట్లు ఇచ్చేందుకైనా సిద్ధం. జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తే కర్నాటక కూలీలు పాలమూరు వరి పొ లాల్లో కోతలకు వస్తారు’ అంటూ సీఎం తన స్వప్నాన్ని ఆవి ష్కరించారు. ‘జూరాల- పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకాల సర్వే కోసం సుమారు రూ.11కోట్లు విడుదల చే శాం. త్వరలో నివేదికలు రానున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద 10 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించే రిజర్వాయర్ నుం చి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తాం. జిల్లాలో దెబ్బతిన్న 6100 చెరువులు, కుంటలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తాం. నిరుద్యోగ భూతాన్ని తరిమేద్దాం ‘జిల్లాలో రూ.200కోట్లతో కోజెంట్ గ్లాస్, రూ.450 కోట్లతో జాన్సన్ అండ్ జాన్సన్, రూ.900కోట్లతో ప్రాక్టర్ అండ్ గాంబుల్ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిశ్రమలు విస్తరించే అవకాశముంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే పెంజర్లలో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధంగా ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు స్థానికులు, అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలి. పరిశ్రమల నిర్వాహకులు కూడా తప్పనిసరిగా అర్హత ఉన్న స్థానికులకు నిబంధనల మేరకు ఉద్యోగాలు కల్పించాలని’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు, కలెక్టర్ ప్రియదర్శిని, జేసీ శర్మన్ తదితరులు పాల్గొన్నారు. అతిథుల ఆకలి కేకలు..! కేసీఆర్ సమావేశానికి వచ్చిన అతిథులు ఆకలితో అలమటించారు. సమావేశం అనంతరం భోజనాల కోసం వెళ్లగా అక్కడ భోజనం అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల నాయకులు, కార్యకర్తలు ఆకలితో తిరుగు ముఖం పట్టారు. విధుల్లో ఉన్న పోలీసులు కూడా భోజనాలు లేక ఇబ్బంది పడ్డారు. . పాసుల కోసం పడిగాపులు పాసుల కోసం వీఐపీలు కూడా పడిగాపులు పడ్డారు. పరిశ్రమ లోపలికి కొద్దిమందికే వెళ్లే అవకాశం రావడంతో చాలామంది గేటు వద్దకు వచ్చి నిరాశగా వెనుదిరిగారు. సీఎం కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన విలేకరులను పాసులు లేవని గంటల తరబడి పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి చొరవ తీసుకుని పాసులను పంపడంతో లోపలికి వెళ్లగలిగారు. జర్నలిస్టులకు పాసులు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. -
నవ తెలంగాణలోనూ.. నయవంచనేనా!
మెదక్: నిజాం నవాబుల ఖిల్లాగా.. కాకతీయుల దుర్గంగా.. చారిత్రక రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచిన మెతుకుసీమ.. వర్తమాన కాలంలో తన రాజసాన్ని కోల్పోతోంది. మెదక్ పేరును తనలో ఇముడ్చుకుని.. జిల్లా కేంద్రాన్ని కోల్పోయిన పట్టణానికి.. కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా న్యాయం జరుగుతుందనుకుంటే నయవంచనే మిగిలిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను త ప్పుతూ పాలకులు తీసుకున్న నిర్ణయంతో మెదక్ ప్రజలు భగ్గుమన్నారు. కాగా సుమారు ఆరు దశాబ్దాల పోరాటం.. లక్షలాది జనాల ఆరాటంగానే మిగిలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాకు నడిబొడ్డున ఉంది మెదక్ పట్టణం. మంజీరా నది ఒడ్డున..ప్రపంచ ప్రసిద్ధి పొందిన కరణామయుని కోవెలకు నిలయంగా.. శత్రుదుర్భేద్యమైన ఖిల్లాకు నిదర్శనంగా.. సుమారు 70 వేల జనాభాతో విరాజిల్లుతోంది పట్టణం. నిజాంకాలంలో నాలుగు జిల్లాలకు సుభాగా ఉండేది. ప్రస్తుతం మెదక్ పేరుతో జిల్లా ఉన్నప్పటికీ సంగారెడ్డి కేంద్రం గా పాలన కొనసాగుతోంది. కేవలం పాలకుల సౌకర్యం కోసమే ఈ మార్పు జరిగిందన్న ఆరోపణలున్నాయి. సుమారు ఆరు దశాబ్దాలుగా జిల్లా కేంద్రం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. అప్పట్లో సామాజిక ఉద్యమకారుడు రాందాస్ మెదక్ జిల్లా కేంద్రం కోసం 40 రోజుల ఆమరణ దీక్ష చేశారు. మెదక్ జిల్లా కేంద్ర సాధన సమితి, రిటైర్డు ఉద్యోగులు, యువకులు, న్యాయవాదులు ఉద్యమానికి ఊపిరి పోస్తూనే ఉన్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాం.. గత ఏప్రిల్ 24 న మెదక్ పట్టణానికి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూటికి నూరు పాళ్లు మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నవ తెలంగాణలో తమకు భవిష్యత్తు ఉందని పట్టణ ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ మేరకు గతంలో కూడా మెదక్ కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి తదితర ప్రాంతాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చాయి. సిద్దిపేటలోకి రామాయంపేట, చిన్నశంకరంపేట! కాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రస్తుతమున్న 10 జిల్లాలకు తోడు మరో 7 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాల్సిందిగా సీఎం కేసీఆర్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ను ఆదేశించారు. ఇందులో మెదక్ జిల్లా నుంచి సిద్దిపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు కోసం నిర్ణయించినట్లు తెలిసింది. కాగా మెదక్ సమీపంలో ఉన్న రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాలను సైతం సిద్దిపేట జిల్లాలోకే వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. భగ్గుమన్న మెదక్ ఎన్నోయేళ్లుగా తాము కన్న కలలను కల్లలు చేస్తూ సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై శుక్రవారం సర్వత్రా నిరసనలు పెల్లుబికాయి. ఈ క్రమంలో మెదక్ పట్టణ బంద్‌తోపాటు నిరసన ర్యాలీలు, న్యాయవాదుల విధుల బహిష్కరణ, చిన్నశంకరంపేటలో నల్లగుడ్డలు కట్టుకుని నిరసనలు తెలిపారు. మెదక్‌ను ప్రత్యేక జిల్లాగా, లేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకుంటే నిరవధిక ఆందోళనలు చేపడతామని జిల్లా కేంద్ర సాధన సమితి హెచ్చరించింది. -
రాజధానిగా కర్నూలే అనుకూలం
సాక్షి, కర్నూలు: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును ప్రకటించకపోతే మరోసారి ఉద్యమం తప్పదని రాజధాని సాధన కమిటీ హెచ్చరించింది. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేసేలా వ్యవహరిస్తే ఊరుకోబోమని వక్తలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కమిటీ ఆధ్వర్యంలో పొలికేక పేరిట నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, విద్యా సంస్థల అధినేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థినీ విద్యార్థులు, కుల సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు రాజధానికి మద్దతుగా పెద్ద ఎత్తున నినదించారు. రాజధాని సాధన కమిటీ కన్వీనర్ వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రముఖులు తమ గళం వినిపిం చారు. రాజధాని రాయలసీమ హక్కు అని స్పష్టం చేశారు. ర్యాలీలో మైనార్టీ సంఘం నాయకులు అబ్దుల్ మజీద్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ కల్కూర, రైతు సంఘం నాయకుడు బొజ్జా దశరథ రామిరెడ్డి, లీసా చైర్మన్ సంపత్, జనతాదల్ నాయకుడు పెద్దయ్య, విద్యార్థి సంఘం నాయకుడు శ్రీరాములు, న్యాయవాది తెర్నేటి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీమ హక్కులు కాపాడకుంటే మరో ఉద్యమం
{పభుత్వానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల హెచ్చరిక శ్రీశైలం డ్యాంను ముట్టడించిన ప్రజా, రైతు సంఘాలు కర్నూలు: రాయలసీమ హక్కులను కాపాడకపోతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో ఉద్యమం తప్పదని ఆ ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీశైలం డ్యాంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉంచాలని డిమాండ్ చేస్తూ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ రైతు సంఘాల నేతలతో గురువారం శ్రీశైలం రిజర్వాయర్‌ను ముట్టడించారు. అంతకుముందు సున్నిపెంటలోని నీటిపారుదలశాఖ అతిథిగృహం నుంచి సుమారు 8 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. శ్రీశైలం జలాశయం వద్ద ఉన్న ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాయలసీమకు సాగు, తాగునీటి సౌకర్యం కోసం చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని భూమా విమర్శించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నీటికి, ఉద్యోగుల జీతాలకే దిక్కులేకుంటే రాష్ట్రాన్ని సింగపూర్ ఎలా చేస్తారని చంద్రబాబును ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు. శ్రీశైలం డ్యామ్ ముట్టడి కార్యక్రమంలో కర్నూలు, పాణ్యం, నందికొట్కూరు, కోడుమూరు, డోన్, కదిరి ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, ఐజయ్య, మణిగాంధీ, బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు దశరథరామిరెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, కృష్ణారెడ్డి, బీజేపీ నాయకుడు నిమ్మకాయల సుధాకర్ తదతరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకుడు బుడ్డా శేషారెడ్డి అధ్యక్షత వహించారు. -
అతనొక పాదరసం!
గ్రంథపు చెక్క చిన్నతనంలో... ఆజాద్‌కు మందుకూరి కాల్చే బొమ్మ తుపాకులాట మహా ఇష్టం. ఆ ఆట ఆడుకోవడానికి పటాసు కావాలి. కానీ డబ్బులు ఉండేవి కావు. ఒకరోజు తోట తమ సొంతమే అనుకొని కొన్ని పళ్లను అమ్మి బెల్లమూ, పటాసు కొనుక్కున్నాడు. తండ్రి దృష్టిలో అది క్షమించరాని అపరాధం అయింది. విపరీతంగా కొట్టాడు. స్వాభిమాని అయిన ఆజాద్ ఇక ఇంట్లో ఉండలేక పోయాడు. తల్లి అతి కష్టం మీద కూడబెట్టిన పదకొండు రూపాయలూ కొడుక్కి ఇచ్చింది. తండ్రికి చెప్పకుండా, విద్యలకు కేంద్రమైన కాశీకి వెళ్లిపోయాడు ఆజాద్. అక్కడ అతనొక సత్రంలో ఉండి లఘు కౌముది, అమరకోశం చదువుకున్నాడు. శాసనోల్లంఘన ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నరోజులవి. ఆ ఉద్యమం ఆజాద్‌ని బాగా ఆకర్షించింది. అప్పుడు ఆజాద్‌కు పదమూడు లేదా పద్నాలుగు ఏళ్ళుంటాయి. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు ఆజాద్. అరెస్ట్ చేసి మెజిస్ట్రేటు ముందు నిలబెట్టారు. ‘‘వేలెడు లేవు. పెద్ద ఉద్యమాన్ని నడపడానికి వచ్చావా? ఫో అవతలకి!’’ అన్నాడు మెజిస్ట్రేటు. ఆజాద్ కూడా మెజిస్ట్రేటును ఉద్దేశించి తిరస్కార భావంతో మాట్లాడాడు. మెజిస్ట్రేటు, ఆజాద్‌కు 12 పేము బెత్తపు దెబ్బల శిక్షను విధించాడు. ప్రతి దెబ్బకూ ‘వందేమాతరం’, ‘మహాత్మాగాంధీకీ జై’ అంటూ నినాదాలు ఇచ్చాడు ఆజాద్. పేము బెత్తపు దెబ్బల శిక్షను అనుభవించి విడుదలయ్యాక, ఆజాద్ మరికొంచెం ఉత్సాహంతో ఉద్యమంలోకి దూకాడు. చిన్నతనంలో ఆజాద్ చురుగ్గా ఉండేవాడు. అతని చురుకుదనాన్ని చూసి మిత్రులు క్విక్ సిల్వర్ (పాదరసం) అని పేరు పెట్టారు! - యశ్పాల్ ‘సింహావలోకన’ నుంచి (అనువాదం: ఆలూరి భుజంగరావు) (రేపు స్వాతంత్య్రసమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి) -
ఉద్యమ కేసులనుంచి విముక్తి
వికారాబాద్: తెలంగాణ ఉద్యమ సంకెళ్లు తెగిపోనున్నాయి. 2001 నుంచి ఇప్పటివరకూ తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని హోం శాఖను ఆదేశించినట్లు సీఎం కేసీఆర్ బుధవారం కేబినేట్ భేటీలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమకారులకు విముక్తి కలగనుంది. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురు తెలంగాణవాదులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కేసులను మోపిన సంగతి విధితమే. అయితే కేసులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యమకారులపై పెట్టిన అన్ని కేసులను ఎత్తివేయించే బాధ్యత తనదేనని కేసీఆర్ అప్పట్లోనే అనేక సమావేశాల్లో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. సంతోషంగా ఉంది కేసుల ఎత్తివేత సంతోషకరం. ఉద్యమకారులకు కూడా స్వాతంత్య్ర సమరయోధుల్లాగా ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థి నాయకుల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం విషయంలో వయోపరిమితి మించి ఉంటే, వారికి వయసు మినహాయింపు ఇవ్వాలి. కేసుల కారణంగా విద్యకు దూరమైనవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి. కేసీఆర్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం. - మహేందర్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి త్యాగానికి ఫలితం దక్కింది. తెలంగాణ చిరకాల వాంఛ నెరవేరింది. ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపునివ్వాలి. రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాల్లో అవకాశాలివ్వాలి. -బాల్‌రాజ్‌నాయక్, విద్యార్థి జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఆమె జీవితం...ఓ పెద్దబాలశిక్ష!!
‘నాన్నా! ఈ ఫ్రాక్ నచ్చలేదు... నేను వేసుకోను’ అంటూ విసిరేసిన బాల్యం ఆమెది ఇంటి బయట కాలు పెట్టేది బాటా చెప్పులతోనే... పదవ తరగతికి వచ్చేసరికి జడగంటలు కట్టిన పొడవాటి జడ... ఆ జడను వయ్యారంగా తిప్పుకుంటూ నడిచే ఆత్మవిశ్వాసం ఆమె సొంతమైంది. ఆ జీవితం ఒక్కసారిగా దూరమైంది... దూరంగా జరిగిపోయింది. స్నేహితులిచ్చిన దుస్తులతో రోజులు వెళ్లదీయాల్సి వచ్చింది. చీరకు కుచ్చిళ్లు పోసేది చిరుగులను కప్పుకోవడానికే అన్నట్లు మారిపోయింది. రెండు రూపాయల పాకీజా చెప్పులతో రోడ్డు మీద మొదలైంది ఆమె ప్రయాణం. పాతికేళ్లకే వందేళ్ల జీవితానుభవాన్ని చూసింది. బాధ్యతల బరువు మోసిన ఆ అనుభవమే... ఇప్పుడు మూడు వందల మందికి ఉపాధినిస్తోంది!! విమల తండ్రి ఎల్ఐసి ఆఫీసర్... రక్షణ వ్యవస్థ మాజీ ఉద్యోగి. మిలటరీ క్రమశిక్షణలో పెరగడంతో ఇల్లు బందిఖానాగా అనిపించి బయటి ప్రపంచం అందమైన హరివిల్లులా కనిపించసాగిందామెకు. పదహారేళ్ల వయసులో ఇల్లు దాటి ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమవివాహంలో తియ్యదనం నాలుగేళ్లు కూడా లేకపోయింది. ఇరవై ఏళ్లకే ఇద్దరు అమ్మాయిలకు తల్లైంది. ఆ తర్వాత ఇద్దరు మగపిల్లలు. జీవితం తక్కెడలో సమతుల్యం లోపించింది. ప్రేమ పెళ్లిలో తీపికంటే వైవాహిక జీవితంలో బాధ్యతలే బరువని తెలిసి వచ్చిందామెకు. దురదృష్టం ఏమిటంటే... ఇవేవీ ఆమె భర్త కొండయ్యకు పట్టలేదు. నలుగురు పిల్లల ఆకలి తీర్చడం తల్లిగా తన ధర్మం అనుకున్నారామె. భర్త బాధ్యతరాహిత్యం, నలుగురు పిల్లల పోషణ బాధ్యత ఆమెను సేల్స్‌గర్ల్‌గా మార్చాయి. హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్‌లో సేల్స్‌గర్ల్‌గా చేరిన విమలానాయుడు అనేక కంపెనీలు మారి చివరికి సొంత ఏజెన్సీ ప్రారంభించారు. ‘‘1982లో పాతికమంది ప్రమోటర్స్‌తో ప్రారంభించి ఇప్పుడు మూడు వందల మందితో జాన్సన్స్ అండ్ జాన్సన్స్ వంటి బహుళజాతి కంపెనీలకు సేవలందిస్తున్నాం. ఈ ఏజెన్సీతోనే పిల్లలను చదివించి పెళ్లి చేశాను’’ అన్నారామె. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదివే రోజుల్లో పడిన తప్పటడుగు ఆమె జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పింది. ప్రమోటర్‌గా ఎండలో నడుస్తూ ఉంటే ఒకరోజు రోడ్డు మీద ఆమె అన్నయ్య ఎదురుపడ్డారు. అంతకాలం తర్వాత కనిపించిన చెల్లిని ఆత్మీయంగా పలకరించక పోగా... ‘నీ జీవితం రోడ్డుపాలే’ అనేసి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా జీవితం తలక్రిందులైన వైనాన్ని తలుచుకుంటూ ‘‘నాలాగ ఎవరూ జీవితంలో తప్పటడుగు వేయకూడదు. ప్రేమ, ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమించడానికి టీనేజ్ సరైన వయసు కాదని ఈ తరానికి తెలియాలి’’ అంటారామె. పిల్లల జీవితం తనలా కాకూడదని... తాను చేసిన పొరపాటే చేస్తుందేమోననే భయంతో పెద్దమ్మాయికి పదో తరగతి పూర్తవగానే పెళ్లిచేశారు విమల. రెండో అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి కొంత భరోసా వచ్చిందంటారామె. ‘‘మోసానికీ బలి కాదనే ధైర్యంతో కాలేజ్‌లో చేర్పించాను. ఇప్పుడు ఎంబిఎ గోల్డ్ మెడలిస్ట్. పెద్దబ్బాయి డిగ్రీ సగంలోనే మానేసి నాతోపాటు ఏజెన్సీ చూసుకుంటున్నాడు. రెండో అబ్బాయి ఎం.ఎ చేశాడు. ఉద్యోగం, పిల్లల బాధ్యతలన్నీ ఒక ఎత్తయితే నాకు రోజూ సాయంత్రం ఏడయ్యేసరికి ఆందోళనతో మనసంతా కకావికలమయ్యేది. తాగి ఫలానా చోట పడి ఉన్నాడని ఎక్కడి నుంచి కబురు వస్తుందో, ఎక్కడికెళ్లి ఆ మనిషిని ఇంటికి తీసుకురావాల్సి వస్తుందోనని గుండె దడదడలాడేది’’ అన్నారామె దుంఖాన్ని దిగమింగుకుంటూ. చిలకలగూడలో మహిళలకు ఇప్పుడు విమలానాయుడు ఓ పెద్దదిక్కు. వారి కష్టాలను పంచుకునే పెద్దక్క. మైత్రి బృందాలతో వారికి ఉపాధి మార్గాలను చూపిస్తున్నారామె. ప్రభుత్వ పథకాలను తమ వాకిళ్లకు తెచ్చుకుంటున్నారు. వీటన్నింటికీ సారా ఉద్యమంలో పాల్గొనడమే కారణం అంటారామె. తనకు చేతనైన సాయం! రంజాన్ మాసంలో గురువారాలు మసీదులో లుంగీలు, పండ్లు పంచుతూ కనిపిస్తారు విమల. చర్చ్‌లో మేరీమాతకు కిరీటం పెట్టి సంతోషిస్తారు. సాయిబాబాకి ఊయల ఊపుతూ ఆనందిస్తారు. తన ప్రమోటర్స్ పెళ్లికి మట్టెలు, తాళిబొట్టు ఇస్తారు. ‘‘అమ్మానాన్నల మనసు కష్టపెట్టిన పాపం నాది. నేను చేసిన తప్పులను పరిహరించమని అందరు దేవుళ్లనూ ఇలా వేడుకుంటున్నా’’ అంటారు. విమలానాయుడు జీవితం తెరిచిన పుస్తకం. అందులోని ప్రతి అక్షరం మరొకరికి హెచ్చరిక కావాలనేది ఆమె కోరిక. జీవితంలో ఎలాంటి పొరపాటు చేయకూడదో తనను చూసి తెలుసుకోమంటారు. జీవితానికి ఎదురు నిలబడి గెలవవచ్చు అనడానికి కూడా పాఠం తన జీవితమే- అంటారామె. - వాకా మంజులారెడ్డి, ఫొటోలు: జి. రాజేశ్ మద్యం మహమ్మారి చేసే వినాశం ఏంటో నేను అనుభవించాను. ఆ గుండెమంట నన్ను సారా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేలా చేసింది. మా స్థానిక మహిళలను సమీకరించి ఉద్యమం చేశాం. అందరికంటే పెద్ద బాధితురాలిని కాబట్టి సారా ఉద్యమంలో మా కాలనీ వాళ్లకు నేనే పెద్ద దిక్కయ్యాను. ఇప్పటికీ వాళ్లకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అవసరం వచ్చినా తమతో రమ్మని అడుగుతుంటారు. కుట్టుశిక్షణ తరగతులు, మగ్గం వర్క్‌లో శిక్షణ అలా ప్రారంభించినవే. - విమలానాయుడు -
నాలుగేళ్ల కోర్సుపై నిరసన వ్యతిరేకోద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: ఒకవైపు నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)కు ప్రవేశ ప్రక్రియ జరుతుండగా, మరోవైపు ఈ కోర్సు ఉపసంహరణకోసం చేపట్టిన ఉద్యమం మరింత ఊపందుకుంది.ఈ కోర్సు విషయంలో గత సంవత్సరం తటస్థంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూ) ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రాంగణంలో శుక్రవారం నుంచి నిరాహార దీక్షకు దిగింది. ఈ విషయమై ఎన్ఎస్యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే దీక్షా శిబిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ ‘గత ఏడాది కొత్తగా ఈ కోర్సును ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ప్రవేశపెట్టింది. అది ఏవిధంగా ఉంటుందనే విషయం సరిగా అర్ధం కాకపోవడంతో మేము నిరసించడంగానీ మద్దతు పలకడం చేయకుండా ఉండిపోయాం. అయితే ఈ కోర్సును ప్రవేశపెట్టి ఏడాది కాలం గడిచిపోయింది. దీనిపై ఓ అధ్యయనం చేశాం. ఇది విద్యార్థులకు అంత ఉపయుక్తం కాదనే విషయం ఆ అధ్యయనంలో తేలింది. మరోవైపు విద్యార్థులు కూడా ఈ విషయంలో సంతృప్తి చెందడం లేదు’ అని అన్నారు. ఇదిలాఉంచితే ఈ కోర్సుకు వ్యతిరేకంగా కొంతకాలంగా ప్రతిరోజూ ఆందోళనకు దిగుతున్న ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) శుక్రవారం ఉదయం కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ విషయమై ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సాకేత్ బహుగుణ మీడియాతో మాట్లాడుతూ ‘డీయూ కోర్సును ప్రారంభించిననాటినుంచీ తాము ఆందోళన చేస్తూనే ఉన్నాం. యూజీసీ అత్యున్నత ప్రాధికార సంస్థ. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మేము కోరుతున్నాం’ అని అన్నారు. మరోవైపు ఈ కోర్సుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా), ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) సైతం ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి విదతమే. ఇదిలాఉంచితే ‘సేవ్ డీయూ’ పేరిట ఏడాదికాలంగా మరికొంతమంది ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్న అభయ్ దేవ్ అనే విద్యార్థి మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన మరోసారి ఆందోళనకు దిగనున్నామన్నారు. ఇటువంటి సత్తాలేని కోర్సుల వల్ల విద్యార్థులు మున్ముందు జీవితంలో బాధితులు కాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆందోళన చేస్తున్నామన్నారు. కాగా ఈ కోర్సు రద్దుపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తి చూపుతున్నట్టు వచ్చిన వార్తలు కూడా ఉద్యమ ఉధృతికి దోహదం చేస్తున్నాయి. -
నేటి నుంచి ‘అంగన్వాడీ’ సేవలు బంద్
ఇందూరు, న్యూస్‌లైన్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మె చేపట్టనున్నారు. దీంతో జిల్లాలోని 2,410 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు,బాలింతలకు, పిల్లలకు అందించాలిన పౌష్టికాహారంతోపాటు, సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వారం రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధుల్లోకి వెళ్లకుండా కేంద్రాలన్నింటికి తాళాలు వేసి ఆందోళనలో పాల్గొననున్నారు. అంగన్వాడీ ఉద్యోగులు తీర్మానం చేసిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం మొదటి దశగా సోమవారం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట, అన్ని సీడీపీఓ ప్రాజెక్టు కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలుపనున్నారు. జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులందరు ఈ ఆందోళన కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. -
ఉద్యమం ఉధృతం
సాక్షి, కాకినాడ:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకపక్ష నిరంకుశ వైఖరిపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఏపీఎన్జీఓల ఉద్యమం రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా రహదారులను దిగ్బంధించారు. మరొక పక్క గురువారం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వేదిక పిలుపుమేరకు రాష్ర్ట బంద్‌ను జిల్లాలో విజయవంతం చేసేందుకు ఏపీ ఎన్జీఒలతో సహా అన్ని రాజకీయపార్టీలు సిద్ధమయ్యాయి. ఏపీ ఎన్జీఓల నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. కాగా బుధవారం నుంచి కార్పొరేషన్, మున్సిపల్, సహకార ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. గురువారం నుంచి ఎంపీడీఓలు మూడు రోజుల సామూహిక సెలవు ప్రకటించి ఉద్యమంలో పాల్గోనున్నారు. ఏపీఎన్జీఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వివిధ శాఖల ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. కలెక్టరేట్ వద్ద చిదంబరం, జైరాంరమేష్‌ల ఫ్లెక్సీలను దహనం చేసి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలుచేశారు. అనంతరం కలెక్టర్ట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి ఇంద్రపాలెం వంతెనపై రాస్తారోకో చేశారు. దాంతో కాకినాడ -సామర్లకోటల మధ్య ట్రాఫిక్ నిలిచిపోయింది. రావులపాలెం వద్ద జాతీయరహదారి-16పై కళా వెంకట్రావ్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్భందించడంతోట్రాఫిక్నిలిచిపోయింది. రాజమండ్రి లాలాచెరువుసెంటర్‌లో జాతీయ రహదారిపై నగర అధ్యక్షుడు గెద్దాడ హరిబాబు ఆధ్వర్యంలో ఏపీఎన్జీఓలు రాస్తారోకో చేశారు. కోనసీమ జేఏసీ అధ్యక్షుడు వీఎస్ దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావు ఆధ్వర్యంలో అమలాపురం ఈదరపల్లి వంతెన వద్ద జాతీయ రహదారి-216పై ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఏలేశ్వరం బాలాజీచౌక్ సెంటర్లో వందలాది మంది విద్యార్థులు రాస్తారోకో చేశారు. రాజోలులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంక టేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో చేశారు. కాకినాడ, రాజమండ్రిలలో ఆర్టీసీ డీపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ఏపీ ఎన్జీఓల సమ్మెకు మద్దతుగా భోజన విరామ ప్రదర్శనలు నిర్వహించారు. కాకినాడ జీజీహెచ్‌తో పాటు రాజమండ్రి వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. రెండో రోజు కూడా ఆయా ఆస్పత్రి గేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాకినాడ జీజీహెచ్ శాఖ ఏపీజీడీఎ అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, కోశాధికారి డాక్టర్ లకో్ష్మజీనాయుడుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బంద్‌ను విజయవంతం చేయండి తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుండడాన్ని నిరసిస్తూ గురువారం తలపెట్టిన రాష్ర్ట బంద్‌ను విజయవంతం చేయాలని ఏపీ ఎన్జీఒ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం పిలుపు నిచ్చారు. వాణిజ్య వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
వర్గ దృష్టితో కుల నిర్మూలన
సమీక్షణం వర్గ దృష్టితో కుల నిర్మూలన పుస్తకం : పల్లవి లేని పాట రచన : రంగనాయకమ్మ విషయం : ‘ఎక్కడ ఏ ఉద్యమం, ఏ విప్లవం, అపజయం పాలైనా దానికి కారణం ప్రజలు అవరు. నాయకులే అవుతారు. ప్రజలకు ఏ నూతన చైతన్యాలూ, ఏ నూతన నియమాలూ నేర్పని, నేర్పే అర్హతలు లేని నాయకులే స్వప్పాల్ని నవ్వుల పాలు చేస్తారు.’ : రంగనాయకమ్మ కొండపల్లి కోటేశ్వరమ్మ రాసిన ‘నిర్జన వారధి’ చదివాక చెరుకూరి సత్యనారాయణ రాసిన ‘తొణికిన స్వప్నం’ అనే వ్యాసానికి సమాధానంగా ‘విరిగిన స్వప్నం’ పేరుతో రంగనాయకమ్మ రాసిన వాక్యాలు పైవి. అన్ని కమ్యూనిస్టు పార్టీలకు, విప్లవ పార్టీలకు ఉపకరించే మాటలవి. ‘పల్లవి లేని పాట’ పేరుతో ఒక నవలికా, కుల విధానం, దెయ్యాల శాస్త్రం, మార్క్సిజం గురించిన కొన్ని వ్యాసాలూ కలిపి వేసిన ఈ పుస్తకం ఓ వంద పుస్తకాలు చదివిన అనుభవాన్ని కలిగిస్తుంది. ఉన్నవి 18 వ్యాసాలే అయినప్పటికీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక అంశాలపై పాఠకుడికి విస్తృత అవగాహన కలిగిస్తాయి. కొడవటిగంటి కుటుంబరావు తాత్విక వ్యాసాలలో ఉన్న ‘బుద్ధికొలత వాదం’పై చేసిన విమర్శకు స్పందించిన విరసం నాయకులకు జవాబుగా మరో మూడు వ్యాసాలు రాసి, మార్క్సిస్టుకు ఉండాల్సిన జాగ్రత్తలు చెప్పారు. లక్ష్మింపేట మారణకాండకు ముందునించీ అటు దళిత ఉద్యమకారులకీ, ఇటు విప్లవోద్యమకారులకీ మధ్య కుల నిర్మూలనపై ఉన్న బేధాభిప్రాయాల నేపథ్యంలో.... ప్రజాపంథా, జనశక్తి వంటి పార్టీల ధృక్పథాలనూ, వేములపల్లి వెంకటరామయ్య, చంద్రంల ఆలోచనలనూ వివరిస్తూనే, ‘దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్సు మాత్రమే అవసరం’ అనే తన అవగాహనపై ఉసా, బిఎస్ రాములు, ఎంఎఫ్.గోపీనాథ్, పండ్ల గోపీకృష్ణ, తంగిరాల చక్రవర్తి, వైవి రమణరావులకు జవాబులు ఇచ్చారు. మానవ హక్కుల కార్యకర్త ఎన్.జీవన్‌కుమార్ పాకీపని కార్మికుల విషాద జీవనంపై రాసిన వ్యాసానికి సహానుభూతి చెందారు. చివరగా స్కైబాబా అధూరె కథలపై రాసిన ఏడు ఉత్తరాలను పొందుపర్చారు. - డా. నూకతోటి రవికుమార్ పేజీలు: 222 వెల: 100 ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2; ఫోన్: 0866- 2431181 చావుమీద బతికేవాళ్లు... పుస్తకం : మరణానంతర జీవితం (నవల) రచన : నందిగం కృష్ణారావు విషయం : మరణానంతర జీవితం.. ఇది ఎవరూ చూడలేనిది. అయితే ఎవరైనా మరణిస్తే మూఢాచారాల పేరుతో కలచివేసే సంఘటనలు చాలామందికి ఎదురుపడే ఉంటాయి. పుట్టుక నుంచి గిట్టుక వరకు, అందులోనూ ప్రధానంగా అంత్యక్రియల మూఢాచారాల పేరుతో జరిగే దోపిడీ... ఆ తంతు చేయకపోతే బతికున్నవాడి పుట్టి కూడా మునిగిపోతుందనే పెద్దలు... గ్రామాల్ని గడగడలాడించిన దొరలు సైతం బ్రాహ్మణ్యం ముందు బానిసే అవుతారంటూ రచయిత నందిగం కృష్ణారావు రాసిన ‘మరణానంతర జీవితం’ నవల వాస్తవాల్ని కళ్ల ముందుంచింది. అయినవాడు పోయాడన్న బాధ ఒక పక్క... పంతులు చెప్పినట్టు పాడె కట్టకపోతే దెయ్యాలు, భూతాలవుతారనే భయం మరోపక్క... ఈ రెండింటి మధ్య నలిగిపోయే మనిషి చివరికి కర్మకాండలు పూర్తి కావడమంటే చావు మీద బతికే వాళ్లని వదిలించుకోవడమనే నిజాన్ని లైవ్లీగా రాశారు రచయిత. - పెమ్మరాజు పేజీలు: 192; వెల: 120; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 040-27678430 కొత్త పుస్తకాలు వాయుగానం (కావ్యం) రచన: తాళ్లూరి లాబన్‌బాబు పేజీలు: 152; వెల: 100 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 403, విజయసాయి రెసిడెన్సీ, 16-11-20/7/1/1, సలీంనగర్ కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 9848787284 పావని (దీర్ఘకవిత) రచన: బి.హనుమారెడ్డి పేజీలు: 94; వెల: 50 ప్రతులకు: అధ్యక్షులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలు-523002. ఫోన్: 9440288080 ఝాన్సీ హెచ్.ఎం. (కథలు) రచన: చెన్నూరి సుదర్శన్ పేజీలు: 128; వెల: 100 ప్రతులకు: రచయిత, 1-1-21/19, ప్లాట్ నం.5, రోడ్ నం.1, శ్రీ సాయి లక్ష్మి శోభా నిలయం, రామ్ నరేష్ నగర్, హైదర్‌నగర్, హైదరాబాద్-85. ఫోన్: 9440558748 పొందూరు మరో పోర్బందర్ రచన: వాండ్రంగి కొండల్రావు పేజీలు: 108; వెల: 20 ప్రతులకు: వాసవి ప్రింటర్స్, మార్కెట్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా-532168. ఫోన్: 9573577898 కలరవాలు (కవిత్వం) రచన: ఆత్మకూరు రామకృష్ణ పేజీలు: 168; వెల: 100 ప్రతులకు: రచయిత, 8-8-01, ప్రణీత రెసిడెన్సీ, గుంటుపల్లి, విజయవాడ-521241. ఫోన్: 9493405152 మనిషిలోకి ప్రవహించాలి (కవిత్వం) రచన: ద్వానా శాస్త్రి పేజీలు: 62; వెల: 50 ప్రతులకు: రచయిత, 1-1-428, ఆర్చీస్ నెస్ట్, గాంధీనగర్, హైదరాబాద్-80. ఫోన్: 9849293376 -
ఇక ప్రజా సమస్యలపై ఉద్యమం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు ఖాళీగా ఉన్న కమిటీలను త్వరితగతిన భర్తీ చే యాలని నిర్ణయించింది. అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించడం ద్వారా ప్రజాభిమానాన్ని పొందాలని నిర్ణయించింది. సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ కమిటీల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ఇకపై సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి ఆందోళనలు చేపట్టాలని, ప్రజల పక్షాన నిలిచి పోరాడాలని నేతలు నిర్ణయించారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి: ఈసీ శేఖర్‌గౌడ్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై పదవులకోసం పాకులాడుతూ ప్రజావసరాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అనుబంధ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు సాధించాలంటే జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. ప్రజలసమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందుబాటులో ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి సమన్వయకర్తలు కష్టపడాలన్నారు. పార్టీతరఫున పదవులు పొందిన నేతలంతా అనుక్షణం ప్రజల్లోనే ఉండాలన్నారు. త్వరలో జిల్లాలో పార్టీ అధ్వర్యంలో బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పార్లమెంటు పరిశీలకులు జంపన ప్రతాప్, సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం కన్వీనర్ జి.సురేష్‌రెడ్డి, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, పోచంపల్లి కొండల్‌రెడ్డి, రాచమళ్ల సిద్ధేశ్వర్, కొలను శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రావు, సూర్యనారాయణరెడ్డి, మహిళావిభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, దశరథగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వేతనాలు చెల్లించకుంటే ఉద్యమం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: వయోజనుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సాక్షరభారత్ కో ఆర్డినేటర్లకు ఏడాది నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని కో ఆర్డినేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇనపకుర్తి పోతన్నదొర ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం సంవత్సరం నుంచి వేతనాలు ఇవ్వక పోవడం విచారకరమన్నారు. సంక్రాంతి పండుగకైనా జీతాలు చెల్లించాలని కోరారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం పండగపూట పస్తులు లేకుండా చూడాలన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి దుబ్బ కోటేశ్వరరావు మాట్లాడుతూ వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలవవ్వడంతో 2,202 మంది కోఆర్డినేటర్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. అప్పులు చేసి కేంద్రాలకు వార్తపత్రికలు వేస్తున్నామన్నారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు కొన్ని శ్రీనివాసరావు, అప్పలనాయుడు, కె. చిరంజీవి పాల్గొన్నారు. -
ఆడపిల్లకోసం ఆశ
ఆమె పేరు ఆశాసింగ్. వయసు నలభై. ఆమె నివసించేది మధ్య ప్రదేశ్‌లోని మోరెనా జిల్లా. టీ షర్టు జీన్స్ పాంటు వేసుకుని ఆమె బైక్ నడుపుతుంటే పల్లెల్లో మహిళలతో పాటు మగవారు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. సంప్రదాయ తెరల వెనకున్న మహిళలను ఇళ్ల అరుగులపై కూర్చోబెట్టి వారికి మంచీ చెడ్డా చెప్పడం ఆశాసింగ్ పని. గర్భిణులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేస్తుంది. ఆడపిల్ల ఇంటికి భారమనే దురభిప్రాయం నుంచి వారిని బయటపడేయడానికి కావాల్సిన కబుర్లన్నీ చెబుతుంది ఆశాసింగ్. ‘‘నా ప్రయాణంలో ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్లు చేయించుకున్న మహిళలను కలిశాను. వారు చెప్పిన కారణం ఒకటే... ఆడపిల్లలకు బోలెడు ఖర్చులుంటాయి. పెళ్లి తర్వాత కూడా మన బాధ్యతలు తీరడం లేదు. ఇన్ని ఇబ్బందులకు బదులు మగపిల్లాడైతే ఏ గొడవా ఉండదు. వృద్ధాప్యంలో మనల్ని పోషిస్తాడు కూడా....అంటూ ఏవో కబుర్లు చెప్పుకొచ్చారు. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆడపిల్లగా పుట్టి పేరు, డబ్బు, పదవులు, ఉద్యోగాలు సంపాదించినవారి గురించి, పల్లెల్లో పుట్టి పెరిగి ఉన్నతస్థితిలో ఉన్నవారి గురించి చెప్పేదాన్ని. కొందరు నా మాటలు నమ్మేవారు, కొందరు నమ్మేవారు కాదు. మొత్తానికి అందరూ ఆడపిల్లల అవసరం గురించి చర్చించుకునేవారు’’ అని చెప్పారు ఆశాసింగ్. ఎవరీ ఆశాసింగ్, ఎందుకీ పనిచేస్తోంది అంటారా! మధ్యప్రదేశ్‌లో రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించిన ఆశాసింగ్కి చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. తల్లి పెంపకంలో తన ఇష్టాలకు తగ్గట్టు గా జీవితాన్ని మలుచుకుంది. లా చదువుతున్న రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రోజురోజుకీ పడిపోతున్న ఆడపిల్లల సంఖ్య గురించి తెలుసుకుని, కొన్ని స్వచ్ఛంద సంస్థలతో చేయికలిపి ప్రచారపనుల్లో పాల్గొంటోంది. అందులో భాగంగానే పల్లెలకు వెళుతోంది. ‘‘నేను ప్రయాణం చేసే కొన్ని గ్రామాల్లో దొంగల భయం ఉందని చెప్పారు. అయినా నేను లెక్కచేయకుండా నా ప్రయాణాలు కొనసాగించాను. నన్ను చూసి భయపడి జాగ్రత్తలు చెప్పేవారు. విద్యార్థులు మాత్రం ‘మేం కూడా మీలాగ ధైర్యంగా ఉంటాం మేడమ్... అని చెప్పేవారు. మహిళకు భయం ఎక్కువ, మగవారికి ధైర్యం ఎక్కువ అనే అపోహని పోగొట్టాలి. ఆడపిల్లయినా, మగపిల్లాడైనా ఒకటే అనే భావం రావాలి’’ అని ముగించారు ఆశాసింగ్. -
రాష్ట్ర విభజనపై ఉద్యమం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:ఆంధ్రప్రదేశ్ విభజనపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఏపీ ఎన్జీవో సంఘ సహాధ్యక్షుడు చౌదరి పురుషొత్తమనాయుడు హెచ్చరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద గురువారం దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీమాంధ్రలోని అన్ని ప్రాంతాల్లో జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్టు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం గతంలో 66 రోజులు సమ్మె చేసి న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. డిసెంబర్ 9న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు తెలుగుజాతి విద్రోహదినంగా భావించి జిల్లాలోని ఉద్యోగులు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. కేంద్రప్రభుత్వ కార్యాకలాపాలు స్తంభింపచేస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ కేవలం ఓటుబ్యాంకు రాజకీయా ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రజల మనోభావాలకు అనుగుణం గా నడుచుకోవాలన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తూ టీ నోట్ పెట్టిన వెంటనే సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామన్నారు. విభజన జరిగితే ఎక్కువగా నష్టపోయేది విద్యార్థులేనన్నారు. కార్యక్రమంలోవేదిక కో-కన్వీనర్ కొంక్యాన వేణు, ప్రతినిధులు కిలారి నారాయణరావు, ఎస్.వి.ఎస్.ప్రకాష్ ప్రసంగించారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధు లు దుప్పల వెంకటరావు, కె. దిలీప్, పూజారి జానకిరాం, పి.జయరాం, ఆర్.వేణుగోపాలరావు, వై.ఉమామహేశ్వరరావు, బమ్మిడి నర్సింగరావు, శోభారామకృష్ణ, ఎం.ఆర్.కె.దాస్, అధిక సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి జేఏసీ పిలుపు శ్రీకాకుళం : రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల బంద్‌కు సీమాంధ్ర విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. నేటినుంచి విద్యుత్ జేఏసీ నిరసన రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం నుంచి ఆదివారం వరకూ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రతినిధులు నిర్ణయించారు. అలాగే ఏడో తేదీన జేఏసీ ప్రతినిధులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లో 13 జిల్లాల నాయకులు సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. చరిత్రలో చీకటి రోజు రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం ఘోరం. ఈ రోజు చరిత్రలో చీకటి రోజు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు చివరివరకు పోరాడాలి. - ధర్మాన కృష్ణదాస్, నరసన్నపేట ఎమ్మెల్యే వ్యక్తుల నిర్ణయం వల్లే ఈ దుస్థితి ఎస్ఆర్సీ వంటి వ్యవస్థలు చేయాల్సిన నిర్ణయాల ను వ్యక్తులు తీసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వ్యక్తులు తీసుకున్న నిర్ణయం వల్లే ఒకేరోజున సీడబ్ల్యూసీ, యూపీఏ మిత్రపక్షాలు, కోర్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఇలాంటివన్నీ జరుగుతాయని ముందుగానే ఊహిం చాం. అందుకనే తొలినుంచి ప్రజలను మభ్యపెట్టే ప్రకటన చేయలేదు. ఈ నిర్ణయానికి పర్యవసానాన్ని ఆ వ్యక్తులు తర్వాత అనుభవిస్తారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా సీమాంధ్ర వాసులు, తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న వారు అత్యంత దురదృష్టవంతులు. - ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజకీయ నాయకులదే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం దారుణం. దీనికి సీమాంధ్ర రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి. ఆరుకోట్ల సీమాంధ్రుల మనోభావాలను కాదని, కేవలం మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోరిక మేరకు విభజన చేయడం సరికాదు. సీమాంధ్రలో సరైన నేత లేకపోవడం మన దురదృష్టం. రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకు రాకుండా ఎవరి ఎజెండాతో వారే వెళ్లినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. -హనుమంతు సాయిరాం, ఏపీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు -
హోరెత్తిన భద్రాద్రి
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్ పరీరక్షణ ఉద్యమం కొనసాగుతోంది. టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 19వ రోజు గురువారం నాటి దీక్షల్లో వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఆసీనులయ్యారు. తెలంగాణ కుమ్మరి హక్కుల పోరాట సమితి సభ్యులు దీక్షా శిబిరం వద్ద చక్రం సహాయంతో కుండలు తయారు చేశారు. దీక్షలను టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే గౌసుద్దీన్ ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపితే సహించేది లేదన్నారు. భద్రాచలం డివిజన్లోని ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదులుకునేది లేదన్నారు. చేతివృత్తిదారులు మనుగడ సాధించాలంటే తెలంగాణలోనే భద్రాచలం ఉండాలని తెలంగాణ కుమ్మరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం ప్రాంతం విషయంలో తేడావస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు మల్లెల రామనాథం, కుమ్మరి సంఘం నాయకులు రవికుమార్, నవీన్, గంగాధర్, సతీష్, మణుగూరు మండల అధ్యక్షులు సిరికొండ వెంకట్రావు, చంద్రయ్య, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు కె. సీతారాములు, కెచ్చెల కల్పన, ఏపీటీఎఫ్ మహిళా విభాగం అధ్యక్షులు పి.రవికుమారి, దాసరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెండోరోజుకు సీపీఎం ప్రజాసంఘాల దీక్షలు భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్‌తో సీపీఎం అనుబంధ ప్రజాసంఘాలు చేపట్టిన దీక్షలు రెండోరోజుకు చేరాయి. ఈ దీక్షలకు వివిధ ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. గురువారం నాటి దీక్షలను బార్ అసోసియేషన్ స్థానిక అధ్యక్షులు కృష్ణమాచారి ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసమే భద్రాచలం ప్రాంతాన్ని ఆంధ్రలో కలపాలనే కుట్రలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో గడ్డం స్వామి, లక్ష్మి, సక్కుబాయి, రాజ, బ్రహ్మచారి, శేషావతారం, పద్మ, లీలావతి, జీఎస్ శంకర్రావు, బండారు శరత్, రఘుపతి పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలి భద్రాచలం ప్రాంత గిరిజనులను ముంచే పోలవరం ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని పొలిటికల్ జేఏసీ డివిజన్ కన్వీనర్ పూనెం వీరభద్రం కోరారు. ఆదివాసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నాల్గో రోజు దీక్షలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణలోనే కొనసాగిస్తూ ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్త రాష్ట్రంలో కూడా ఆదివాసీల హక్కుల పరిరక్షణ, గిరిజన చట్టాల అమలకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీక్షల్లో ఉపాధ్యాయులు ఉమాకిషోర్, కాక రామకృష్ణ, సోడె మల్లేష్, మచ్చ రమేష్, రాజేష్, పర్శిక రాజు, చంటి కూర్చొన్నారు. దీక్షలకు పలు సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. -
ఉద్యమం.. నిర్విరామం
ఏలూరు, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ ధ్యేయంగా చేపట్టిన ఉద్యమం జిల్లాలో నిర్విరామంగా సాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం 102వ రోజు నిరసనలు కొనసాగాయి. ఏలూరు జెడ్పీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. పాలకొల్లులో నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఛాంబర్స్ కామర్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు 20 మంది దీక్షలో కూర్చున్నారు. వీరికి జేఏసీ నాయకులు ముచ్చెర్ల శ్రీరామ్, చీకట్ల వరహాలు సంఘీభావం తెలిపారు. తణుకులో మహిళా ఉద్యోగినులు ఎన్జీవో హోం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి దీక్ష చేపట్టారు. దువ్వలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలో రైతుమిత్ర సంఘాల నాయకులు కూర్చున్నారు. వీరికి ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు సంఘీభావం తెలిపారు. భీమడోలులో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టి 101 రోజులైన సందర్భంగా విద్యార్థులు సేవ్ ఏపీ 101 ఆకృతిలో ఒదిగి నిరసన తెలిపారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో దీక్షలు కొనసాగుతున్నాయి. ఆకివీడులో వర్తక సంఘాల నాయకులు దీక్షలో కూర్చున్నారు. -
ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు
కాకినాడ లీగల్, న్యూస్‌లైన్ :రాష్ర్ట విభజన ప్రక్రియను కేంద్రం ఆపే వరకు న్యాయవాదులు పోరాటాన్ని కొనసాగించాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ ఎం.జయకర్ పిలుపునిచ్చారు. వంద రోజులుగా కష్టనష్టాలను ఎదుర్కొంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో శనివారం జరిగిన సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ల స్టీరింగ్ కమిటీ ప్రతినిధుల సదస్సుకు కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జవహర్ అలీ అధ్యక్షత వహించారు. జయకర్ మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణపై రెండు గంటల పాటు చర్చించారు. సమైక్యాంధ్ర కోసం తాము ఉద్యమ బాట పట్టిన తర్వాత ఏపీఎన్జీఓలు, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఒత్తిళ్లకు తలొగ్గి సమ్మెను విరమించారని, దీనివల్ల ఉద్యమ తీవ్రత తగ్గిన మాట వాస్తవమేనన్నారు. న్యాయవాదులు, గుమస్తాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ, సమైక్యాంధ్ర సాధించాలన్న బలమైన కాంక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తు న్నారని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ఈ నెల 23 వరకు జేఏసీ కార్యాచరణను అమలు చేసి, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎ.రామిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులు చేసే ఉద్యమానికి అనుకున్న స్థాయిలో ప్రచారం లభించడం లేదన్నారు. అందువల్ల ఇది గ్రామ స్థాయికి వెళ్లడం లేదన్నారు. జేఏసీ కోఆర్డినేటర్ వి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న జేఏసీలో కొందరి నిర్లిప్తత వల్ల ఉద్యమం అనుకున్న స్థాయిలో వేగం పుంజుకోవడం లేదన్నారు. పూర్తి స్థాయిలో పనిచేసే వారితో కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జవహర్ అలీ మాట్లాడుతూ కేంద్రం విభజన వైపు అడుగులు వేస్తున్నందున, ఏపీఎన్జీఓలతో పాటు మిగిలిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తిరిగి సమ్మెబాట పట్టాలన్నారు. స్టీరింగ్ కమిటీ సమావేశం రహస్యంగా నిర్వహించడం సరికాదని, బహిరంగ సదస్సు ఏర్పాటు చేసి పరిణామాలపై విస్తృత చర్చ జరగాలంటూ గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన న్యాయవాదులు సమావేశం వద్ద కొద్దిసేపు గలాటా సృష్టించారు. సమావేశంలో జేఏసీ రాష్ర్ట కోకన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు, బార్ కౌన్సిల్ సభ్యులు బొగ్గవరపు గోకులకృష్ణ, కలగట్ల తమ్మనశెట్టి ఎస్.కృష్ణమోహన్, ఎస్.మాధవీలత, కె.చిదంబరం, ఎస్.రాజేంద్రప్రసాద్, ఎన్.ద్వారకానాథ్ రెడ్డి, వి.బ్రహ్మారెడ్డి, గంటా రామారావు, గువేరా రవి, బార్ సంఘ అధ్యక్షులు జి.రామ్మోహన్, బద్రినాథ్, పీఎల్ఎన్ ప్రసాద్, రామకృష్ణ, ఎన్వీఎస్ మూర్తి, కృష్ణారావు, ఈవీ రామిరెడ్డి, విశ్వనాథరెడ్డి, రాజేష్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు కుట్రలను తిప్పికొట్టిన ప్రజా పోరాటం
-
అదే పట్టు
సమైక్య ఉద్యమం నేటితో 80వ రోజుకు చేరుకుంది. జిల్లాలో సమైక్య ఉద్యమహోరు జోరుగా సాగుతోంది. ర్యాలీలు, మానవ హారాలతో నిరసన తెలియజేస్తున్నారు. రిలేదీక్షలతో సమైక్యకాంక్షను ఢిల్లీకి తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్రను సాధించి తీరుతామని నినదిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాక్షి, కడప: జిల్లాలో కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం గురువారంతో 79రోజులు పూర్తి చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు అలుపెరుగని పోరు సాగిస్తున్నారు. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు 66వ రోజుకు చేరాయి. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షాశిబిరాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కే సురేష్‌బాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. న్యాయవాదులు, వాణిజ్యపన్నులశాఖ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో రెవెన్యూ ఉద్యోగులు, గ్రామనౌకర్లు, వీఆర్వోలు రిలేదీక్షలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పీ రామసుబ్బారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పులివెందులలో ఏపీ ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, పూల అంగళ్ల మీదుగా ర్యాలీ చేపట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దీక్షాశిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. రాజంపేటలో బార్అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు శరత్‌కుమార్‌రాజు ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎన్జీవోలు చేపట్టిన రిలేదీక్షలు గురువారంతో 60రోజులు పూర్తి చేసుకున్నాయి. రైల్వేకోడూరులో జేఏసీ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీతో కలిసి ధర్నా నిర్వహించారు. బద్వేలులో వైద్య, ఆరోగ్య సిబ్బంది జేఏసీ నేతలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నర్సులు, ఏఎన్ఎంలు రిలేదీక్షలకు కూర్చున్నారు. మైదుకూరులో పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. రిలేదీక్షలకు కూర్చున్నారు. ప్రొద్దుటూరులో మునిసిపల్ ఉద్యోగుల దీక్షలు గురువారంతో 60వ రోజుకు చేరాయి. ప్రొద్దుటూరులో చేపట్టదలిచిన విద్యార్థి సింహగర్జన ఏర్పాట్లపై మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సమావేశం నిర్వహించారు. రాయచోటిలో ఏపీ ఎన్జీవోలు, జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. -
సమైక్యాంధ్ర ఉద్యమం శనివారం 74వ రోజుకు చేరింది
గుంటూరు, న్యూస్‌లైన్: పండగ రోజుల్లోనూ సమైక్యాంధ్ర పోరు ఆగలేదు. దసరా వచ్చినా ఉద్యమ బాట వీడలేదు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ జిల్లాలో చేపట్టిన ఉద్యమం శనివారం 74వ రోజుకు చేరింది. ఉపాధ్యాయ, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు. రోడ్లపై రాస్తారోకోలు, ప్రదర్శనలు చేస్తూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. సమైక్య నినాదాన్ని వినిపిస్తున్నారు. గుంటూరులో ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో వినూత్నంగా గొడుగులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రేపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 51వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహం వద్ద రైతు గర్జన మహాసభను ఏర్పాటు చేశారు. రైతులు భారీగా పాల్గొని విభజన జరిగితే రాష్ట్రం ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ప్రత్తిపాడులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల,పొన్నూరులో ఏపీ ఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తెనాలిలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు శనివారం నాటికి 48రోజుకు, టీడీపీ రిలేదీక్షలు 46వ రోజుకు చేరాయి. గుంటూరులో విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. వారి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆ సంస్థ అధినేత రత్తయ్య వారిని ఒప్పించి దీక్ష విరమింపచేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వట్టిచెరుకూరు మండలానికి చెందిన 50 మంది రైతులు గుంటూరు హిందూ కళాశాల సెంటర్లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. -
సమైక్య శంఖారాం
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లాలోని పది నియోజక వర్గాల పరిధిలో పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు బుధవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగారు. విభజనకు అంగీకరించేది లేదంటూ గళమెత్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నినదించారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధమంటూ వెలుగెత్తి చాటారు. నిరాహార దీక్ష చేపట్టిన నేతలకు వైఎస్సార్సీపీ ముఖ్యనేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ సంఘీభావం ప్రకటించారు. ఎంపీ మేకపాటి నెల్లూరు సిటీ, రూరల్ నియోజక వర్గాలతో పాటు ఆత్మకూరు, ఉదయగిరిలకు వెళ్లి దీక్షలకు సంఘీభావం తెలిపారు. జిల్లా కన్వీనర్ మేరిగ మురళీ గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు నియోజక వర్గాల పరిధిలో పర్యటించి దీక్షలకు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన దీక్షలకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం జిల్లాలో పార్టీ నేతలందరూ ఒక్కసారిగా ఆమరణ దీక్షలకు దిగడం సమైక్యవాదుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. వైఎస్సార్సీపీ నిర్ణయాన్ని జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు.సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీకే తమ మద్దతు ఉంటుందని పేర్కొంటున్నారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ సిటీ నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష , ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి ఎంపీ మేకపాటి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తోపాటు సిటీ,రూరల్ నియోజక వర్గ పరిధిలోని కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వారిద్దరికి సంఘీభావం ప్రకటించారు. వెంకటగిరిలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నియోజక వర్గ కన్వీనర్ కొమ్మి లక్ష్మయ్యనాయుడు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తొలిరోజు దీక్షలో 300 మంది నాయకులు పాల్గొన్నారు. నియోజక వర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరు పట్టణం బస్టాండ్ సెంటర్లో తొలిరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రిలేనిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూర్చొని సంఘీభావం ప్రకటించారు. సూళ్లూరుపేటలో బస్టాండ్ సెంటర్లో పార్టీ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రమణ్యం, కిలివేటి సంజీవయ్య ఒకే వేదికపై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ హాజరై సంఘీభావం తెలిపారు. నియోజకవర్గంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఆరు మండలాల కన్వీనర్లు, సర్పంచ్‌లు, అభిమానులు దీక్షలో కూర్చుని సమన్వయకర్తలకు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ట్రంకురోడ్డులోని గాంధీ బొమ్మ సెంటర్లో ఆమరణ నిరాహారదీక్షను బుధవారం ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరానికి కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్సీపీ సేవాదళం రాష్ర్ట కన్వీనర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమన్వయకర్త కోటింరెడ్డి వినయ్‌రెడ్డి దీక్ష శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. వెంకటాచలంలో పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధనరెడ్డి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, టీపీగూడూరు, పొదలకూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కాకాణికి సంఘీభావం తెలిపారు. ఉదయగిరి బస్టాండ్‌లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యేకు సంఘీభావం ప్రకటించారు. నియోజకవర్గంలోని పార్టీ మండల కన్వీనర్లు, సర్పంచ్‌లు, వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున వెళ్లి సంఘీభావం తెలిపారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, పార్టీ నాయకుడు బత్తిన విజయ్‌కుమార్ దీక్ష చేపట్టారు. వీరికి జిల్లా పార్టీ కన్వీనర్ మేరిగ మురళీధర్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి సంఘీభావం తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు కొడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట మండల కన్వీనర్లతో పాటు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రసన్న దీక్షకు నియోజక వర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు. -
60వ రోజైన ‘పశ్చిమ’జనోద్యమం
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నిత్యనూతనమై ప్రజ్వరిల్లుతోంది. 60వ రోజైన శనివారం కూడా ‘పశ్చిమ’ వాసులు గర్జనలు, వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి విభజన నిర్ణయంపై కన్నెర్ర చేశారు. వినూత్న ఆందోళనలు, కేంద్ర పాలకులు మనసులు మార్చాలంటూ గర్జనలు, పాదయాత్రలు, జన జాగారం వంటి కార్యక్రమాలతో ఉద్యమస్ఫూర్తిని ఉరకలెత్తించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరు ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర కార్యాల యాల ముట్టడిలో భాగంగా రెండో రోజు టెలికం, బ్యాం కులు, పోస్టల్ శాఖ కార్యకలాపాలను ఎన్జీవోలు స్తంభింప చేశారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో పశు సంవర్థకశాఖ, ఏపీఎస్ఐడీసీ ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గురుశిష్య సమైక్య భేరి నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమంలో మమేకమయ్యారు. గజల్ శ్రీనివాస్ ‘ఓయి తెలుగువాడా...మనకి దే వెలుగువాడ...’ అంటూ ఉద్యమ స్ఫూర్తిని రగలించేలా గజల్స్‌ను ఆలపించారు. చిన్నారులు దేశభక్తి గీతాలకు అనుగుణంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. భీమవరంలో ఉపాధ్యాయులు వెనక్కినడిచి నిరసన తెలిపారు. జీవీఐటీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ రహదారిని దిగ్భందించి సమైక్యనాదం చేశారు. ఉద్యమం 60 రోజులు నిండిన సందర్భంగా 60 అంకె ఆకారం లో నిలబడి విద్యార్థులు, అధ్యాపకులు తమ దీక్షను ఎవరూ భగ్నం చేయాలేరని చాటిచెప్పారు. ఉండిలో గొడుగులతో ఉపాధ్యాయులు, ఎన్జీవోలు నిరసన తెలిపారు. యండగండిలో రాస్తారోకో చేశారు. కాళ్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సర్రాజు పాదయాత్ర నిర్వహించారు. బొండాడ గ్రామం నుంచి కాళ్లకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్లు పాదయాత్రలో వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. కేంద్రంలోని పెద్దల మనస్సులను మార్చాలని వెంకన్నకు నాయకులు పూజలు నిర్వహించి వేడుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా జన జాగారాన్ని తాడేపల్లిగూడెంలో శని వారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకూ సమైక్యాంధ్ర ఆవశ్యకత తెలిపే కళారూపాలను ప్రదర్శించారు. పాలకొల్లు రైతు వేదిక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ నిమ్మల రామానాయుడు నేతృత్వంలో రాష్ట్రం విడిపోతే అందరికి అన్నం పెట్టే అన్నదాతకూ అన్నం కరువే అంటూ ఏర్పాటు చేసిన ప్రదర్శన పలువురిని ఆలోచింపజేసింది. ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నరసాపురం ఆర్డీవో వసంతరావు తహసిల్దార్ కార్యాలయం వద్ద గ్రామ సహయకులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఉద్యమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుదిరగవద్దని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేశారు. పోడూరు మండలంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ చేశారు. చాగల్లులో రిలే దీక్షలో ఫొటోగ్రాఫర్లు పాల్గొని మద్దతు తెలిపారు. ఆర్అండ్ బీ రోడ్డుపై తెలంగాణ- సీమాంధ్ర జట్లుగా ఏర్పడి కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సీమాంధ్ర జట్టు గెలిచింది. తెలంగాణ నాయకుల ఆటలు ఎంతోకాలం సాగవని ఆటగాళ్లు సమైక్య శపథం చేశారు. తాళ్లపూడి బజారు సెంటరులో ఎన్జీవో లు రోడ్లను ఊడ్చి తెలంగాణ నాయకులకు పట్టిన దుమ్ము వదలగొడతామని ప్రతిజ్ఞ చేశారు. బుట్టాయగూడెంలో బూసరాజు పల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. అధ్యాపకులు, సిబ్బంది కబడ్డీ ఆడి ఢిల్లీ పెద్దలకు దిమ్మతిరిగేలా ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సమైక్యాంధ్రకు మద్దతుగా కావలిపురానికి చెందిన 100 మంది రైతులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నిడదవోలులో ఉపాధ్యా య జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో ముస్లిం ఉపాధ్యాయులు 12 మంది పాల్గొన్నారు. గణపతి సెంటర్లో రోడ్డుపైన నమాజ్ చేసి నిరసన తెలిపారు. పెరవలి మండలం తీపర్రులో వ్యవసాయ పనులు పక్కన పెట్టి రైతులు రిలే నిరాహారదీక్షలు చేశారు. నర్సాపురం బస్టాం డ్ సెంటర్లో 20 మంది కరాటే విద్యార్థులు విన్యాసాలు చేశా రు. అంబేద్కర్ సెంటర్లో సాయిబాబా గుడిలోని ఉత్సవమూర్తిని సమైక్యాంధ్రకు మద్దతుగా ఊరేగించారు. స్వామికి పాలాభిషేకం చేశారు. -
అరవయ్యో రోజునా.. అదే ఆగ్రహజ్వాల
జనాభిమతాన్ని పరిగణించకుండా, ఏకపక్షంగా తీసుకున్న విభజన నిర్ణయంపై సీమాంధ్ర జనం ఆగ్రహం జ్వాలాతోరణమై అరవై రోజులైంది. ఢిల్లీ పెద్దల దాష్టీకంపై ఊరూవాడా రణరంగమై అరవై రోజులైంది. అయితేనేం- తెలుగుజాతిని నిలువునా చీల్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ తమ సమరం ఆగబోదని అన్ని వర్గాలూ ఒకే గొంతుగా నినదిస్తున్నాయి. క్యాలెండర్లో మరో పేజీ తిరగబోతున్నా, జీతభత్యాలు లేక యాతనలు ఎదురవుతున్నా.. సమైక్యాంధ్రను పరిరక్షించాలన్న తమ సంకల్పం సడలబోదని ఉద్యోగవర్గాలు పోరుబాటలో సాగుతూనే ఉన్నాయి. సాక్షి, రాజమండ్రి : మరో రెండురోజుల్లో మరో నెల గతించనుంది. అయితేనేం.. రెండు నెలల క్రితం జూలై 31న రగులుకున్న ధర్మాగ్రహజ్వాల రోజురోజుకూ జ్వాజ్వల్యమానమవుతూనే ఉంది. ‘తారీఖులు, తరలే నెలలు.. కావేవీ మా పోరుకు అడ్డం- తెలుగుజాతి సమైక్యతా పరిరక్షణే మా అంతిమ లక్ష్యం’ అంటూ సీమాంధ్ర ప్రాంతంలో ఊరూరా, వాడవాడనా ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమిస్తూనే ఉన్నారు. సమైక్య సమరంలో భాగంగా 60వ రోజైన శనివారం జిల్లాలో సమైక్యవాదులు విభజన నిర్ణయం పట్ల తమ నిరసనను వివిధ రూపాల్లో చాటారు. సమైక్య ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో గ్రామంలో సమైక్య ప్రార్థనలు చేస్తున్న రావులపాలెంకు చెందిన షకీనా మినిస్ట్రీస్ బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సోనియాకు సైతాన్ పట్టినందునే రాష్ట్రాన్ని ముక్కలు చేయజూస్తున్నారని, ఆ సైతాన్ వదిలి పోవాలని ప్రార్థనలు జరిపారు. ఉద్యమం 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద దీక్షల్లో 60 మంది పాల్గొన్నారు. హరికథా కాలక్షే పంతో పాటు అల్లూరి సీతారామరాజు వేషధారణతో ప్రదర్శన చేశారు. ఏలేశ్వరంలో సమైక్యవాదులు 60 ఆకృతిలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. రాజానగరం పాతబస్టాండ్ సెంటర్ వద్ద దీక్షాశిబిరంలో ‘హ్యూమన్ హెల్పింగ్ హ్యాండ్స్’ అనే సేవా సంస్థ 60 ఏళ్ల వృద్ధుడిని సన్మానించింది. బజ్జీలు, టీలు విక్రయించిన ఉపాధ్యాయులు రాజమండ్రి మోరంపూడి జంక్షన్, కడియం మండలం వేమగిరి సెంటర్లలో 16వ నంబరు జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు మంత్రి పితాని సత్యనారాయణ కాన్వాయ్‌ను అడ్డుకుని ఘెరావ్ చేశారు. తక్షణం రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని మంత్రి చెప్పడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయులు ‘రాజీనామా చేశానని మీకు మీరు అనుకుంటే సరిపోదు, దాన్ని ఆమోదింప చేసుకోవా’లని డిమాండ్ చేశారు. దానికి మంత్రి ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బజ్టీలు, టీలు విక్రయించారు. రాష్ట్రం విడిపోతే తమకు ఇదే గతి అంటూ సందేశం ఇచ్చారు. హర్షవర్థన పాఠశాల విద్యార్థులు రైల్వే స్టేషన్ రోడ్డులో రాస్తారోకో చేశారు. కాకినాడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి కలెక్టరేట్ ఎదుట దహనం చేశారు. గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు గిరిజనులతో సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శింపజేశారు. 300 అడుగుల పొడవున ఉన్న జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. కాపు సద్భావనా సంఘం ఆధ్వర్యంలో నాగమల్లితోటలో వంటా వార్పు చేశారు. ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఉద్యోగులు దస్తావేజు పేపర్లపై సమైక్య నినాదాలు రాసి ప్రదర్శించారు. కోనసీమలో.. అమలాపురంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు డప్పు వాయిద్యాలతో ర్యాలీగా వెళ్లి ఇళ్లు, దుకాణాల వద్ద జోలె పట్టి భిక్షాటన చేశారు. కార్లు, మోటారు సైకిళ్లు తుడిచి నిరసన తెలిపారు. కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. సిద్ధి వినాయక మోటార్ మెకానిక్స్ అసోసియేషన్ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించింది. అల్లవరంలో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. కోనసీమ రైతు జేఏసీ ఆధ్వర్యంలో మండల సమైక్యాంధ్ర రైతు జేఏసీని ఏర్పాటు చేశారు. ముమ్మిడివరంలో తహశీల్దారు కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పువ్వులు పంచి సమ్మెలోకి ఆహ్వానించారు. కొత్తపేట పాతబస్టాండ్ సెంటర్లో జేఏసీ నేత లు విద్యార్థులకు సమైక్యాంధ్ర ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు అందచేశారు. అంబాజీపేటలో రాట్నాలతో దేవాంగులు రోడ్డుపైనే నేత నేశారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఉద్యోగుల జేఏసీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసింది. పి.గన్నవరంలో నిరవధిక దీక్షల్ల్లో భాగంగా ఉద్యోగులు, రాజకీయ జేఏసీ సభ్యులు పోరు నిద్ర చేపట్టారు. అయినవిల్లి మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ముక్తేశ్వరం సెంటర్ వరకూ దింపు కార్మికులు మోకులు కట్టుకుని ర్యాలీ చేశారు. మామిడికుదురులో ఉద్యోగులు జాతీయ రహదారిపై దుస్తులు ఉతుకుతూ నిరసన తెలిపారు. చెవిలో పువ్వులు పెట్టుకుని దీక్షలు చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసరు డాక్టర్ సీవీ కృష్ణారావు ఆర్ఆర్జీహెచ్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిలబడి నిరసన తెలిపారు. తాండవ నదిలో జలదీక్ష సామర్లకోటలో మహిళలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ స్థానికులకు మెహెందీ పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కూడా మెహెందీ పెట్టించుకున్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తుని వద్ద తాండవ నదిలో జలదీక్ష చేశారు. ఉదయం 11.00 గంటల నుంచి 12.00 గంటల వరకూ నదిలో నిలుచుని సమైక్య నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఏలేశ్వరంలో సత్యదేవా టెంట్ హౌస్ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో 50 వాహనాల్లో భారీ ర్యాలీ చేశారు. బాలాజీచౌక్ వద్ద వలయంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. మలికిపురంలో మండలం తూర్పుపాలెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. జగ్గంపేటలో సమైక్యవాది ఒమ్మి రఘురాం చేపట్టిన 48 గంటల దీక్షను పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ విరమింప చేశారు. ద్రాక్షారామలో జేఏసీ దీక్షలకు పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ సంఘీభావం తెలిపారు. మామిడికుదురులో పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 42వ రోజుకు చేరాయి. పార్టీ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు లింగంపర్తిలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. డప్పుకొడుతూ సమైక్య నినాదాలు చేశారు. కోరుకొండ మండలం నిడిగట్లలో పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. ఆ సంప్రదాయాలు మనవి కూడా.. గండేపల్లిలో జాతీయ రహదారిపై మహిళలు రాస్తారోకో చేశారు. చిన్నారులకు సమ్మక్క, సారక్క వేషాలు వేసి ఆ దేవతలు సమైక్యాంధ్రులు ఆరాధించే మాత ప్రతిరూపాలేనని చాటి చెప్పారు. రోడ్డుపై ఆటపాటలతో నిరసన తెలిపారు. రామచంద్రపురం ప్రధాన రహదారిలో మహిళలు బతుకమ్మ పండగ జరిపి, ఆ సంప్రదాయం కేవలం తెలంగాణదే కాదు రాష్ట్రం మొత్తానికి చెందినదని చాటి చెప్పారు. రాజానగరం మండలం రాధేయపాలెం, పాతతుంగపాడు గ్రామాల్లో జేఏసీ ఆధ్వర్యలో ఇంటింటా సమైక్య జెండాలను ఆవిష్కరించారు. రామచంద్రపురంలో అంగన్వాడీ ఉద్యోగుల పిల్లలతో సమైక్య చిన్నారి గర్జన నిర్వహించారు. చిన్నారులు దేశ నాయకుల వేషాలు వేసి సమైక్యంగా ఉండాలంటూ ఉద్బోధించారు. పట్టణ ప్రధాన రహదారిలో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. కె.గంగవరం, ద్రాక్షారామల్లో ఉపాధ్యాయలు అర్ధనగ్నంగా మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. -
రగులుతున్న ఉద్యమం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : సమైక్య ఉద్యమం రోజురోజుకు మరింత ఉద్ధృతమవుతూ ఉప్పెనను తలపిస్తోంది. విభజనపై కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ సమైక్యాగ్నికి ఆజ్యం పోస్తుండడంతో సమైక్యవాదులు మరింతగా రగిలిపోతున్నారు. జూలై 30వ తేదీ నుంచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా విభజన ప్రక్రియను వేగవంతం చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు నిరసనగా ఉద్యమాన్ని మరింత తీవ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థి, ప్రజాసంఘాలు చర్యలు చేపట్టాయి. ట్రెజరీకి సంబంధించి అటెం డర్ మొదలు సబ్‌ట్రెజరీ అధికారుల వరకు సమ్మె లో ఉన్నారు. ఇంతవరకు ఏటీఓలు, ఉపసంచాల కులు విధుల్లో ఉండటం వల్ల ఆగస్టు నెలకు సం బంధించి పోలీసు, న్యాయశాఖ యంత్రాంగానికి జీతాలు అందించగలిగారు. సోమవారం నుంచి వీరు కూడా సమ్మెలోకి వెళ్లి అత్యవసర బిల్లులను సైతం నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా పోలీసు, న్యాయ శాఖ సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు అందే పరిస్థితి దాదాపు లేదు. అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర బిల్లులు కూడా చేసే ప్రసక్తే లేదని జిల్లా ట్రెజరీ డీడీ సుధాకర్ తెలిపారు. రైతుల పాత్ర పెరిగింది.. : మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల సమ్మె వల్ల ఉద్యమ తీవ్రత మరింత పెరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు గత నెల 13 నుంచి సమ్మె చేస్తున్నా ఇబ్బంది పడని రైతులు మార్కెటింగ్ ఉద్యోగుల సమ్మెతో రోడ్డుపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. మార్కెట్బంద్ కావడంతో కూరగాయలు హోల్‌సేల్, రీటైల్ అమ్మకాలు రోడ్డుపైనే జరుగుతుండటంతో ప్రతిరోజూ ఆరేడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఈ నెల 20వ తేదీ రాత్రి సి.బెళగల్ మండలం పులకుర్తి, బోదెపాడు గ్రామాలకు చెందిన రైతులు ఐదారు లారీల ఉల్లిని తీసుకువచ్చి బలవంతంగా మార్కెట్లోకి వెళ్లి జంబోషెడ్‌లో పోసుకున్నారు. సమ్మె కారణంగా కొనడానికి ఎవ్వరూ సహకరించకపోవడంతో రైతు లు మార్కెట్లోనే ఉండిపోయారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి జోక్యం చేసుకుని రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉల్లిని కొనాలని సూచించినా ఫలితం లేకపోవడంతో రైతులు ఉల్లిని బయటకు తీసుకెళ్లి అమ్ముకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ ఒంటరి పోరాటం
సాక్షి, తిరుపతి:సమైక్య ఉద్యమంలో కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తోంది. జిల్లాలో చిత్తూరు మినహా మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ సమైక్య ఉద్యమంలో ఇతర సంఘాలు, యూనియన్లతో కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకే.బాబు ఆధ్వర్యంలో సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇతర నియోజకవర్గాల్లో విభజన ప్రకటన మీ పార్టీ వల్లే వచ్చిందని అంటే ఏం స మాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సంకటస్థితిలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి కూడా శిబిరాల వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా మాట్లాడి రావడం మినహా సొంతంగా ఆందోళన కా ర్యక్రమాలు నిర్వహించడం లేదు. జిల్లాలో సమైక్య ఉద్యమం ప్రారంభమై 50 రోజులు దాటినా కాంగ్రెస్ అంటరాని పార్టీలాగా మారింది. ఏ ఉద్యమ శిబిరం వద్దకూ కాంగ్రెస్ నాయకులను ప్రజలు రానివ్వడం లేదు. తిరుపతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ తన అనుచరులను కొందరిని వెంటేసుకుని టౌన్‌బ్యాంక్ అధ్యక్షుడు పులుగోరు మురళి ఆధ్వర్యంలో రెం డు రోజులుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయిస్తూ హడావుడి చేస్తున్నారు. సొంతంగా టెంట్ వేసి దీక్ష శిబిరం నిర్వహించేందుకు జనం రాకపోవడంతో నగరంలో ఇప్పటికే వెలసిన దీక్షా శిబిరాల వద్దకు వెళ్లి కాలక్షేపం చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ తొలి రోజు నుంచి నగరంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి రోజూ ఆందోళనలు సాగిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గల్లా అరుణకుమారి ప్రారంభం లో ఆర్భాటంగా తిరుపతిలో అమరరాజా ఫ్యాక్టరీ ఉద్యోగులతో ర్యాలీ చేయించి, ఆ తర్వాత చేతులేత్తేశారు. ఇప్పటివరకు జిల్లా ఉద్యమాల్లో ఎక్కడా ఆమె ప్రత్యక్షంగా పాల్గొనలేదు. నియోజకవర్గంలో ప్రజలు, ప్రజాసంఘాలు స్వచ్ఛందంగా ఉద్యమాలు నడుపుకుంటున్నారు. పీలేరు నియోజకవర్గంలో సీఎం తమ్ముడు గా నీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ ఉద్యమాలు నిర్వహించే ప రిస్థితి లేదు. మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొదట్లో హడావుడి చేసినా ప్రజల చీత్కారంతో పక్కకు తప్పుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నాయకులు సొంతంగా ఉద్యమం చేయలేని పరిస్థితి నెలకొంది. పుంగనూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఇద్దరు ఇన్‌చార్జ్‌లు కావడం, వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని స్థితి ఉండడంతో పార్టీ కార్యకర్తలు ఉద్యమం చేయడం లేదు. పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి హడావుడి చేయాలని చూసినా ప్రజల మద్దతు లేకపోవడంతో కొద్దికాలానికే కాంగ్రెస్ శిబిరం చల్లబడింది. నగరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. మాజీ మం త్రి చెంగారెడ్డి, అయన అనుచరులు ప్రత్యక్ష ఉద్యమాల్లో ఎక్కడా తిరగడం లేదు. పుత్తూరులోనూ ఇతర పార్టీలు చేసినంత జో రుగా కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్చార్జి ఊసేలేదు. ఇక్కడ నాయకులు ఎవరికి వారు తమకెందుకులే అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ జయచంద్రనాయుడు ఉన్నా ఆయన ఏనాడు ఉద్యమాల కోసం రోడ్డెక్కలేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. -
విరామం లేని ఉద్యమం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యంధ్ర ఉద్యమం విరామం లేకుండా ముందుకుసాగుతోంది. శనివా రం కూడా వివిధ రూపాల్లో సమైక్యవాదులు నిరసన తెలిపారు. హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణవాదులు చేసిన దాడులను జిల్లాకు చెందిన న్యాయవాదులు, ప్రజలు ఖం డించారు. సాగర మత్యకారుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. 13 మండలాల నుంచి మత్స్యకార సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు చేసిన దాడులను ఖండిస్తూ పట్టణంలోని న్యాయవాదులు ర్యాలీ, దీక్షలు చేపట్టారు. న్యాయవాదులపై దాడికి నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణ ముఖద్వారం వద్ద జాతీయ రహదారిని స్తంభింపజేశారు. రాజాంలో ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో కళాసాగర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులంతా వివిధ వే షధారణలో దీక్షా శిబిరంలో కూర్చొని ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ నిర్వీరామంగా సమైక్య గీతాలు ఆలపిస్తూ అలరించారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, రాజాం క్లస్టర్ పరిధిలోని పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో రెండో రోజు దీక్షా శిబిరాన్ని మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి ప్రారంభించారు. వంగరలో ఆటో యూనియన్ బంద్ పాటించారు. పాలకొండ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రిలే నిరాహారదీక్షా శిబిరంలో పాలకొండ బార్ అసోసియేషన్ పరిధిలోని న్యాయవాదులు నిరాహారదీక్ష చేపట్టారు. వీరికి వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం, పాలకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సామంతుల దామోదరరావు సంఘీభావం తెలిపారు. పాలకొండ-విశాఖ రహదారిని మంగళాపురం జంక్షన్ వద్ద సమైక్యవాదులు దిగ్భంధించారు. నరసన్నపేట జేఏసీ సమైక్యాంధ్ర దీక్షా శిబిరంలో సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి, చెప్పులు కుట్టి నిరసన తెలియజేశారు. పోలాకిలో మండల పరిషత్ ఉద్యోగులు, న్యాయవాదులు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. జలుమూరు మండలంలో తహశీల్దార్, మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు దీక్షలో పాల్గొని మానవహారం నిర్వహించారు. సారవకోటలో మండల ప్రత్యేక అధికారి ఇతర ఉద్యోగులతో భారీ ర్యాలీ చేశారు. టెక్కలిలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఉపాధ్యాయులంతా అంబేద్కర్ కూడలిలో రిలే దీక్షలో పాల్గొన్నారు. సీమాంధ్ర మంత్రుల ముఖాలతో రావణాసురుని వేషధారణతో నిరసన తెలిపారు. ఆమదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో నిరసలు ఉద్ధృతమయ్యాయి. ఆమదాలవలసలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఎన్జీవోలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమావేశం విజయవంతం కావాలని వేంకటేశ్వరాలయంలో పూజలు చేసి ర్యాలీ నిర్వహించారు. పలాస, కాశీబుగ్గ పట్టణాల్లో వెశ్యసంఘాలు, సెల్‌ఫోన్ దుకాణ యాజమానులు ర్యాలీలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం సంఘీభావం తెలిపారు. ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యార్థులు వీసీ కార్యాలయం మేడ పైకి ఎక్కి నిరసన తెలియజేశారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. పాతపట్నంలో ఏపీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ఆంధ్రప్రదేశ్కు మద్దతుగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పెద్దసీధి జంక్షన్ వరకు వేలాది మంది విద్యార్థులు, స్థానికులు, జేఏసీ నాయకులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ నాయకులు మహామానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. -
ఉద్యోగులతో ఉద్యమమా..
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఉద్యోగులతో ఉద్యమాలు నడిపిస్తారా అంటూ సీమాంధ్ర నేతలపై టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ మండిపడ్డారు. సంగారెడ్డిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు తమ ఉద్యమాన్ని కేవలం ఉద్యోగుల చుట్టూనే తిప్పుతున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణవాదుల న్యాయమైన డిమాండ్ అన్న ఏపీఎన్జీఓలే ఇపుడు అన్యాయమనడం దారుణంగా ఉందన్నారు. ఏపీఎన్జీఓలు తమ కార్యాచరణపై కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభను రోజుకో సభగా చెబుతున్నారన్నారు. ఒకసారి భారీ బహిరంగ సభ అనీ, మరోసారి అవగాహన సభ అంటూ మాటలు మారుస్తున్నారన్నారు. ఢిల్లీ కేంద్రంగా మూడు రోజులుగా ఎపీఎన్జీఓ నేతలు అసత్యప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుతో ఇరు ప్రాంతాలకు లాభం జరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగులకు సమస్యలు ఏర్పడతాయన్న సీమాంధ్రుల ఆపోహలను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో ఏర్పాటయ్యే కొత్త సచివాలయంలో 200 హెచ్ఓడీ పోస్టులతోపాటు అనే ఉద్యోగాలు వస్తాయన్నారు. విభజనతో ఏర్పడే పింఛన్, జోనల్, సీనియారిటీ సమస్యలను పరిష్కరించుకునేందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలి పారు. ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు జరగటం దేనికి ప్రతీక అని ప్రశ్నించారు. తెలంగాణవాదులపై దాడులు కొనసాగితే తదనంతరం చోటు చేసుకునే పరి ణామాలకు సీమాంధ్రులు బాధ్యత వహిం చాలని హెచ్చరించారు. విభజన అనంతరం జల వివాదాలు తలెత్తవని, కృష్ణా, గోదావరి నదుల్లోని జలాలను కేటాయించిన కోటా మేర కే తెలంగాణ వాడుకుంటుందని స్పష్టం చేశారు. పోలీసులు సమ్మెలో ఉన్నారా? సకల జనుల సమ్మెలో తెలంగాణ ఉద్యోగులను నిర్బంధించటంతోపాటు లాఠీచార్జీలు, అరెస్టులు చేసిన పోలీసులు ఇపుడు సమ్మెలో ఉన్నారా అని దేవీప్రసాద్ ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెతోపాటు అక్కడక్కడా దాడులు చేస్తున్నా పోలీసులు స్పందించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకటించిన తేదీ వరకు సద్భావన ర్యాలీలు కొససాగుతాయన్నారు. విలేకరుల సమావేశంలో టీఎన్జీఓ జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్యాంరావు, టీఎన్జీఓ జిల్లా నాయకులు రాఘవేందర్రావు, శ్రీనివాస్‌రెడ్డి, సుశీల్‌బాబు, సిద్దు, రవి, జావేద్, శ్రీనివాస్, రేచల్, మంజుల,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బాబు అసమర్థత వల్లే ఈ దుస్థితి
సాక్షి, అనంతపురం : మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణవాదాన్ని తీసుకువచ్చారని, చంద్రబాబు అసమర్థతవల్లే వేర్పాటువాదం ఉద్యమం తీవ్రమైందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సాక్షి పత్రిక, టీవీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలోని రెవెన్యూ కమ్యూనిటీ హాలులో ‘ఎవరెటు?’ పేరుతో చైతన్యపథం సదస్సు నిర్వహించారు. విద్యార్థులు, మేధావులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజ్ మాట్లాడుతూ సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, స్వార్థ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందన్నారు. జేఏన్టీయూ రిజిస్ట్రార్ ప్రొ. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే అనంతపురం జిల్లా ఎడారిగా మారుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విభజనలో హైదరాబాద్‌ను కోల్పోతే ఆస్తులు తెలంగాణ వారికి, అప్పులు సీమాంధ్రులకు మిగులుతాయని వివరించారు. 60 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ శ్రమను హైదరాబాద్ అభివ ృద్ధికి వెచ్చించారని న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ విశ్వనాథరెడ్డి, సెంటిమెంటు పేరిట రాష్ట్రాన్ని విడగొట్టడం దుర దృష్టకరమని ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ నరసింహులు పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేకపోవడంవల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన పాలన
ఏలూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండటం.. ఉద్యోగులు, అధికారులు సైతం ప్రజలతో కలిసి ఉద్యమంలో మమేకం కావడంతో జిల్లాలో పాలన పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై కలెక్టర్ సిద్ధార్థజైన్, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు దృష్టి సారించారు. ఈ నెలాఖరు వరకూ వేచిచూసే ధోరణిని అవలంబించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈలోగా ప్రజలకు అందించాల్సిన సేవలపై పలు కీలక నిర్ణయూలు తీసుకున్నారు. ఉద్యమం నేపథ్యంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడంతోపాటు, ధరలు పెరగకుండా చూడటం వంటి చర్యలు చేపట్టారు. ఇప్పటికే హోల్‌సేల్ వ్యాపారులతో సంప్రదింపులు జరిపిన ఉన్నతాధికారులు కిలో కందిపప్పును రూ.67కు, ఉల్లిని రూ.35కు అందించేందుకు చర్యలు చేపట్టారు. అయితే, పాలనాపరమైన, ప్రజాపరమైన సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. వ్యవసాయ శాఖ జేడీ వీడీవీ కృపాదాస్ మినహా వ్యవసాయ అధికారులంతా నిరవధిక సమ్మెలో ఉన్నారు. దీంతో గతేడాది ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహా రం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రూ.30 కోట్లు రైతుల ఖాతాల్లో జమకాలేదు. వ్యవసాయ అధికారులు విధుల్లోకి వస్తే గాని వీటిని సరి చేసే పరిస్థితి లేదు. ఈలోగా 46 మండలాల్లో నష్టపోయిన రైతుల జాబితా ఆధారంగా వారి అకౌంట్లను సరిచూసే పనిని జేడీ చేపట్టారు. ఇందుకు ఇతర జిల్లాలకు చెందిన అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారానికి కొలిక్కి తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. రేషన్ పంపిణీకి ప్రత్యేక చర్యలు.. ఉద్యమం నేపథ్యంలో పేదలకు రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అవసరమైతే పోలీసు బలగాలను రంగంలోకి దింపి సరుకులను పంపిణీ చేయూలనే యోచనకు ఉన్నతాధికారులు వచ్చారు. కౌలు రైతులకు రుణాలందించే విషయంలో ఇబ్బందులను పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ జేడీ, ఎల్డీఎం, జేసీ రంగంలోకి దిగారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కుంటుపడకుండా చూసే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించారు. -
వెనక్కు తగ్గేదే లేదు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఢిల్లీ పాలకులు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆపేదే లేదని జిల్లా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర నినాదాలను మార్మోగిస్తున్నారు. ఉద్యమం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నప్పటికీ ఏమాత్రం జోరు తగ్గలేదు. పైగా రోజుకో రకంగా హోరెత్తిపోతోంది. అన్నిరంగాల ప్రజలు వినూత్న కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో మంగళవారం భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించారు. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న ఉద్యోగుల దీక్షలు... సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన సామూహిక రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. వైద్యారోగ్యశాఖకు చెందిన సుమారు 500 మంది ఉద్యోగులు మంగళవారం దీక్షలో పాల్గొన్నారు. జిల్లా అధికారులు, ఎన్జీఓలు వారికి సంఘీభావం తెలిపారు. సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు ఆందోళనలు కొనసాగించాలని, ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలని తీర్మానించారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రకు చెందిన ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు శరత్‌బాబు, సీవీ ప్రసాద్, ఎన్.శ్రీనివాసరావు, డి.నాగేశ్వరరావు, ఎస్.ఓంకార్, సంతోషమ్మ, కేఎస్ ప్రకాశరావు, సరోజినీదేవి, ఆనందబాబు, బాలకోటయ్య పాల్గొన్నారు. టైలర్ల భారీ ర్యాలీ... రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని దర్జీలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టైలర్స్ చెట్టు వద్ద నుంచి గాంధీరోడ్డు, పొట్టిశ్రీరాములు విగ్రహం మీదుగా చర్చిసెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం చర్చి సెంటర్లో కుట్టుమిషన్లతో మానవహారం నిర్వహించారు. రోడ్డుపైనే దుస్తులు కుట్టి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వీఎం రావు, కె.నాగేశ్వరరావు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో రాస్తారోకో... సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులతో స్థానిక రాంనగర్ ఒకటో లైన్ వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డుపై ఆటలాడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్రంట్ నాయకులు నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు... ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్ ఒంగోలు ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం ఎదుట ఏర్పాటు చేసిన రిలే దీక్షలను జేఏసీ నాయకుడు అబ్దుల్‌బషీర్ మంగళవారం ప్రారంభించారు. సమైక్యాంధ్ర కోసం యూటీఎఫ్ నిర్వహిస్తున్న దశలవారీ పోరాటాల్లో రెండోదైన రిలే దీక్షలను స్వాగతిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర కోసం తెలంగాణలో యూటీఎఫ్ నిర్వహించిన ఉద్యమాన్ని కొనియాడారు. అదేవిధంగా సీమాంధ్రలో కూడా సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఢిల్లీ పాలకులు ఉపసంహరించుకునేలా చేయాలని పిలుపునిచ్చారు. జై సమైక్యాంధ్ర నినాదాన్ని మారుమూల పల్లెల్లో సైతం మార్మోగించాలని సూచించారు. సాయంత్రం 5 గంటలకు సీనియర్ నాయకుడు ఎస్కే షంషుద్దీన్ శిబిరంలో కూర్చున్నవారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రిలే దీక్ష శిబిరానికి యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు డి.వీరాంజనేయులు అధ్యక్షత వహించగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంపీ రత్నకుమార్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఎస్.రవి, కార్యవర్గ సభ్యుడు కె.ప్రసాద్, మహిళా విభాగం కన్వీనర్ ఝాన్సీలక్ష్మీభాయి, ఎన్.రమేష్, చెంచుపున్నయ్య, సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎం.హనుమంతరావు, ఎస్.శ్రీనివాసరావు, ఇ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇతర మండలాల్లో.... సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాలోని చినగంజాం, చీరాల, మార్టూరు, అద్దంకి, దర్శి, పొదిలి, ఒంగోలు, సింగరాయకొండ, కందుకూరు, బి.పేట, గిద్దలూరు, మార్కాపురంలో మంగళవారం మొదటిరోజు రిలే దీక్షలు నిర్వహించారు. ఆయా మండలాల్లోని సుమారు 400 మంది యూటీఎఫ్ కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. 300 మంది ఉపాధ్యాయులు హాజరై వారికి మద్దతు ప్రకటించారు. మొత్తం మూడు రోజుల పాటు (29వ తేదీ వరకు) దీక్షలు నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. -
ప్రాణాలు తీస్తున్న ఇసుక రవాణా
ఇందూరు,న్యూస్‌లైన్:దశాబ్ధాల తెలంగాణ కలకు అడ్డుపడుతూ సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించింది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డేనని జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ ఆరోపించారు. ఎవరెంత రెచ్చగొట్టినా శాంతియుతంగా తెలంగాణను సాధించుకుంటామని, ఇందులో భాగంగా వచ్చే నెల 3న జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శాంతిదీక్ష చేపడుతున్నామన్నారు. స్థానిక టీఎన్జీవోస్ భవన్లో మంగళవారం జేఏసీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతి దీక్ష, బహిరంగ సభకు రాష్ట్ర రాజకీయ జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులు హాజరవుతారన్నారు. జిల్లాలోని తెలంగాణవాదులందరూ ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాంధించుకుందామన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో తాము సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులపై, ప్రజాప్రతి నిధులపై ఎలాంటి దాడులకు పూనుకోలేదని, కానీ నిన్నగాక మొన్న పుట్టిన సీమాంధ్ర కృత్రిమ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతం వారిపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. సీపీఎం,టీడీపీ,కాంగ్రెస్ పార్టీలు సీమాంధ్రుల్లో భావోద్వేగాలు సృష్టించి రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నారని ఆరోపించారు. సీఏం కిరణ్ సీమాంధ్ర ఉద్యమానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన వల్లే విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని, శాంతియుతంగా సాధించుకుంటామని స్పష్టంచేశారు. సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ గైని గంగారాం, నాయకులు విఠల్, భూమయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
బషీర్‌బాగ్ పోరుకు 13 ఏళ్లు!
వామపక్షాల నివాళి నేడు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ రక్తసిక్తమై నేటికి 13ఏళ్లు. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా 2000 ఆగస్టు 28వ తేదీన జరిగిన ఉద్యమంపై జరిపిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తొమ్మిది వామపక్ష పార్టీలు బుధవారం ఉదయం 11 గంటలకు మృతవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తాయి. బీవీ రాఘవులు, కె.నారాయణ, సూర్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్ చార్జీలు పెంచిన నాటి చంద్రబాబు ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు వామపక్షాల పిలుపు మేరకు ఆనాడు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 25వేల మంది ఉద్యమకారులు రాజధానికి తరలివచ్చారు. ఉద్యమకారులపై స్త్రీ, పురుష విచక్షణ లేకుండా పోలీసులు లాఠీలు ఝళిపించారు. బాష్పవాయువు, నీటి ఫిరంగులు ప్రయోగించారు. సాయుధులయిన పోలీసులు గుర్రాలతో తొక్కించారు. ఉద్యమకారులపై విచక్షణా రహితంగా జరిపిన పోలీసు కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్దన్‌రెడ్డి మరణించారు. ఈ అమానవీయ ఘటనపై హక్కుల సంఘాలు దుమ్మెత్తిపోసినా చంద్రబాబు ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తంచేయకపోగా విద్యుత్ చార్జీల పెంపు సబబేనని వాదించారు. ఈ ఘటనపై కేసు నమోదయిన 12 తర్వాత 2012లో హైకోర్టు ఈ కేసును హైదరాబాద్ పోలీసు నుంచి సీఐడీకి బదిలీ చేసింది. గత ఏడాది నవంబర్ 7న సీఐడీ విభాగం తిరిగి సీపీఐ, సీపీఎం నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, బీవీ రాఘవులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిపై కేసులు పెడతామని ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో వెనకడుగు వేసింది. కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రజా స్పందనపై నారాయణ నిర్వేదం.. ప్రతి ఇంట్లో కరెంటు మంట మండుతున్నా ఎవరికి వారు తిట్టుకుంటూ బిల్లులు కడుతున్నారే తప్ప ఉద్యమంలోకి రావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నిర్వేదం వ్యక్తంచేశారు. మీరు ఉద్యమం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పడమే తప్ప ప్రజలు ఉద్యమించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని వాపోయారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన చేశారు. -
ఐఏఎస్‌లే దిక్కు
రాజంపేట, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో జిల్లాలో ఐఎఎస్‌ల పాలనే దిక్కైంది. ఐఏఎస్ హోదా కలిగిన కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ నిర్మల, రాజంపేట జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తమ కార్యాలయాలకు పరిమితం అయ్యారు. 72 శాఖలకు చెందిన సుమారు 4 వేల మంది అధికారులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దీంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే నిలబడిపోగా, పాలన స్తంభించింది. పరిపాలనలో కీలక భూమిక పోషించే డిప్యూటీ కలెక్టర్లు శుక్రవారం రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లిపోయారు. అదనపు జాయింట్ కలెక్టరు మొదలుకుని ఆర్డీఓలు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు విధులను బహిష్కరించి సమ్మెలో అగ్రభాగాన నిలిచారు. దీంతో వారి కింద పని చేసే ఉద్యోగులు, సిబ్బంది సైతం అదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఐఏఎస్‌ల వద్ద పని చేసే డ్రైవర్లు, ధపేదార్లు, క్యాంపు క్లర్కులకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఐఏఎస్‌ల వరకు ఇబ్బంది లేకుండా పోయింది. లేకుంటే వారు కూడా సమ్మె సెగతో సేవలకు దూరమైయ్యే వారు. కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్ తర్వాతి క్యాడర్లోని కడప, జమ్మలమడుగు ఆర్డీఓలు సమ్మెకు మద్దతు తెలిపారు. చౌక డిపోల్లో రేషన్ సరఫరాపై ప్రభావం జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు సమైక్యాంధ్ర సమ్మెలోకి వెళ్లడంతో దీని ప్రభావం రేషన్ పంపిణీపై పడనుంది. వచ్చే నెల నుంచి స్టోర్లతో నిత్యావసర సరుకులు అందడం అనుమానమే. ఇప్పటి వరకు చౌక డిపో డీలర్లు డీడీలు కట్టకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రతి నెలా 18 నుంచి డీడీలు చెల్లించిన తర్వాత స్టోర్లలో 30లోగా నిత్యాసర సరుకులను పంపిణీ చేసేవారు. జిల్లాలో 19 స్టాక్ పాయింట్లు ఉండగా, ఇప్పటి వరకు డీలర్లకు సరుకులు సరఫరా చేసే వారే కరువయ్యారు. సమైక్య గర్జనకు సన్నాహాలు సమైక్యాంధ్రకు మద్దత్తుగా సమైక్య గర్జనకు జిల్లా కేంద్రంలో సన్నహాలు చేస్తున్నాం. అది కూడా వచ్చే శనివారం నిర్వహించేందుకు యోచిస్తున్నాం. ఈ మేరకు సోమవారం సమావేశం జరగనుంది. సమైక్యాంధ్ర కొనసాగిస్తున్నట్లు ప్రకటన వెలువడేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. - ఈశ్వరయ్య, అధ్యక్షుడు, జిల్లా అధికారుల సంఘం, -
పాలమూరు మావోయిస్టు మృతి
పాన్‌గల్, న్యూస్‌లైన్: ఒడిశా రాష్ట్రంలో శుక్రవారం జరిగి న పోలీసుల ఎన్కౌంటర్లో మావోయిస్టు ఉద్యమంలో ఉన్న జిల్లా వాసి మృతి చెం దాడు. పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌కి చెందిన మధు అలియాస్ గొల్లరాములు (35) పోలీసు తూటాలకు బలయ్యాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... గోప్లాపూర్‌కి చెందిన గొల్లగౌరమ్మ, పెంటయ్య దంపతుల కుమారుడు గొల్లరాములు ఐదో తరగతి వరకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే చదువుకున్నాడు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాన్‌గల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, తొమ్మిది, పదో తరగతి వనపర్తిలో పూర్తి చేశాడు. 1996-97లో వనపర్తి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో చేరిన రాములు ఎస్ఎఫ్ఐ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అదే సమయంలో ప్రజా నాట్య మండలిలో పనిచేస్తూ నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతను ఎక్కడున్నాడో తెలియదని, ఇన్నేళ్ల తర్వాత టీవీల్లో ఆయన మరణ వార్త వింటున్నామని గ్రామస్తులు తెలిపారు. రాములు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోప్లాపూర్‌లో విషాదం అలుముకుంది. రాములు తల్లి గౌరమ్మకు అనారోగ్యంతో బాధపడుతోంది. పక్షపాతంతో మంచం పట్టిన తండ్రి పెంటయ్యకు కుమారుడి మరణవార్త చెప్పలేదు. కుటుంబ నేపథ్యం... నిరుపేద కుటుంబానికి చెందిన గొల్ల పెంటమ్మ, గౌరమ్మలకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. గొల్ల రాములు కుటుంబంలో మూడో కుమారుడు. పెద్ద కొడుకు పెద్ద బిచ్చన్న గ్రామంలో వ్యవసాయం చేసుకుంటుండగా, రెండో కుమారుడు చిన్న బిచ్చన్న రేషన్ డీలరుగా పని చేస్తున్నారు. ముగ్గురు కూమార్తెల్లో ఒక్క కూతురు చనిపోయింది. -
ప్రజలే నాయకులై..
సాక్షి, ఏలూరు :ప్రజలే నాయకులై.. ప్రజల కోసం.. ప్రజలు చేస్తున్న సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం అంతకంతకు ఉధృతమవుతోంది. జిల్లాలో 22వ రోజు బుధవారం ఉద్యమం ఉధృతంగా సాగింది. ప్రాణాలు అర్పించైనా రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడుకుంటామని సమైక్యవాదులు నినదించారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఆదివిష్ణు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. చింతలపూడిలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్ బుధవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్ ఆమరణ దీక్షకు కూర్చున్నారు. కొయ్యలగూడెం మండలంలో తెలంగాణవారికి సమైక్యవాదులు రాఖీలు కట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. దీక్షా శిబిరాలను మహిళలు, విద్యార్థులు సందర్శించి దీక్షల్లో ఉన్న వారికి రాఖీలు కట్టారు. రాష్ట్ర విభజనకు నిరసనగా, విజయమ్మ దీక్షకు మద్దతుగా గురువారం బుట్టాయగూడెంలో ఒకరోజు నీరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ప్రకటించారు. ఆయనతోపాటు సర్పంచ్‌లు కూడా దీక్షలో పాల్గొంటారు. ఏలూరు ఆశ్రం, కలపర్రు టోల్గేట్ వద్ద ఎన్జీవోలు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి సమైక్యగళం వినిపించారు. తాడేపల్లిగూడెంలో తూర్పు కాపు సంఘం, వాసవీ క్లబ్, ఆర్యవైశ్య సంఘం, మెప్మా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం నాయకులు పోలీసులకు రాఖీలు కట్టి నిరసన తెలిపారు. కృష్ణ దేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వంటా వార్పు కార్యక్రమం సాగింది. పట్టణంలో బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల బంద్‌కు నాన్ పొలిటికల్, ఎన్జీఓ జేఏసీలు పిలుపునిచ్చాయి. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్, తహసిల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షా శిబిరాలు కొనసాగుతుండగా బుధవారం పట్టణంలో బంద్ పాటించారు. పోడూరు మండలం గుమ్మలూరులో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఆందోళనల్లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు బంగారు ఉషారాణి, కలవపూడి శివ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఆచంట మండలం వల్లూరులో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. పెనుగొండలో ఐదో రోజు బంద్ విజయవంతమైంది. మార్టేరులో సమైక్యాంధ్ర కోరుతూ దీక్షలు కొనసాగతున్నాయి.కొవ్వూరులో 19రోజులుగా చేస్తున్న రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. దొమ్మేరులోని పింగాణీ కంపెనీ ఉద్యోగులు బుధవారం నిరాహారదీక్షలో కూర్చున్నారు. న్యాయశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో రిలే నిరాహార దీక్ష చేపట్టి, మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు పట్టణ వీధుల్లో భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దేచర్లలో క్వారీ అండ్ క్రషర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కరిబండి విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు దీక్షలో కూర్చున్నారు. సుమారు 500 మంది విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రక్కిలంక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి వేషధారణలు, రోడ్డుపైనే నృత్యాలు చేశారు. భీమవరంలో సమైక్య దీక్షలు కొనసాగాయి. బంద్‌కు మినహాయింపునివ్వడంతో దుకాణాలు తెరచుకున్నాయి. ఆర్టీసీ బస్సులు మాత్రం రోడ్డెక్కలేదు. చింతలపూడిలో కర్రా రాజారావు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తెల్లం బాలరాజు, మద్దాల రాజేష్‌కుమార్ ప్రారంభించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన జరిగింది. జంగారెడ్డిగూడెంలోని బోసుబొమ్మ సెంటర్లో క్రైస్తవ సంఘాల వారు మోకాళ్లపై కూర్చొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తణుకు బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండోరోజుకు చేరాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త రాధయ్య, పార్టీ ముఖ్యనాయకులు మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలంలో గొర్రెల పెంపకందారుల ఆధ్వర్యంలో గొర్రెల మందతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. -
తీరు మారని యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు బీ-కేటగిరీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు మార్గద ర్శకాలను పాటించడం లేదు. ఈ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు ఫారాలను కళాశాల వెబ్సైట్లో, నోటీసుబోర్డులో అందుబాటులో ఉంచడంతో పాటు ఉన్నత విద్యామండలి, అఫ్లియేషన్ ఉన్న యూనివర్సిటీకి పంపించాలని హైకోర్టు ఆదేశించింది. ఆన్లైన్లో కూడా దరఖాస్తులు స్వీకరించే వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఆన్లైన్లో స్వీకరణ అంశం పక్కనబెడితే అసలు దరఖాస్తులు అందుబాటులో ఉంచుతున్న కళాశాలలే తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 224 కళాశాలలు మాత్రమే ఉన్నత విద్యామండలికి దరఖాస్తు ఫారాలను పంపించాయి. కన్వీనర్ కోటా అడ్మిషన్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే యాజమాన్య కోటా భర్తీకి పేరున్న కళాశాలలతో పాటు వందలాది కళాశాలలు పత్రికల్లో ప్రకటనలు జారీచేసినప్పటికీ.. దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచిన కళాశాలలు కేవలం 224 మాత్రమే కావడం విస్మయం కలిగిస్తోంది. పైగా వీటిలో పేరున్న పెద్ద కళాశాల ఒక్కటీ లేదు. ఈ 224లో ఫార్మసీ కళాశాలలు కూడా ఉన్నాయి. దాదాపు 673 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నా.. నామమాత్రంగా కొన్ని కళాశాలలు మాత్రమే బీ-కేటగిరీ దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చిన్న కళాశాలలు విధిగా దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంచడంతో పాటు రుసుం కూడా కేవలం రూ.200గా ఖరారు చేశాయి. అయితే కొన్ని కళాశాలలు మాత్రం రూ.2 వేల వరకు ఖరారు చేశాయి. అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం కారణంగా ఇప్పటికే రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారని, డీమ్డ్ వర్సిటీల్లో ప్రవేశాలు పొందారని, ఈ ఏడాది యాజమాన్య కోటా సీట్లకు అసలు డిమాండే లేదని హోలీ మేరీ గ్రూప్ సంస్థల చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ‘దాదాపు 20 వేల మంది విద్యార్థులు వలస వెళ్లినట్టు అంచనా. హైదరాబాద్‌లో అగ్రశ్రేణిలో ఉన్న దాదాపు 25 కళాశాలలకు యాజమాన్య కోటా పూర్తిగా భర్తీ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన వాటి పరిస్థితి కష్టంగా కనిపిస్తోంది. సీట్ల భర్తీ ఎలా ఉన్నా అన్ని కళాశాలలు దరఖాస్తులు అందుబాటులో ఉంచి పారదర్శకంగా భర్తీ చేయడం కళాశాలలకే మేలు చేస్తుంది’ అని అనురాగ్ గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకటిరెండు ప్రధాన కళాశాలలు తమ వెబ్సైట్లలో దరఖాస్తు ఫారాలను పొందుపరిచినప్పటికీ ఇంతవరకు ఉన్నత విద్యామండలికి పంపలేదు. అవి పంపేలోగా.. దరఖాస్తులు పంపేందుకు వారిచ్చిన గడువు ముగిసిపోతోందని అభ్యర్థులు వాపోతున్నారు. డ్యూ అక్నాలెడ్జిమెంట్ మరచిపోకండి.. యాజమాన్య కోటా సీటు కోసం దరఖాస్తు ఫారాలను ఉన్నత విద్యామండలి వెబ్సైట్ ఠీఠీఠీ.్చఞటఛిజ్ఛి.ౌటజ నుంచి డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు ఫారం నింపి, నిర్దేశిత రుసుం డీడీ ద్వారా చెల్లించి, ధ్రువపత్రాలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తు ముట్టినట్టుగా ఆధారం ఉండాలంటే రిజిస్టర్డ్ పోస్టు చేసేటప్పుడు అక్నాలెడ్జిమెంట్ కార్డును కూడా తప్పనిసరిగా జతపరచాలి. పోస్టాఫీస్‌లో నామమాత్రపు రుసుం ద్వారా ఈ అక్నాలెడ్జిమెంట్ కార్డు అందుబాటులో ఉంటుంది. -
సమైక్య జోరు
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో జరుగుతున్న ఉద్యమం శనివారం 18వ రోజూ ఉధృతంగా సాగింది. నెల్లూరు నగరంలో ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్సీ వరకు ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష, వీఎస్‌యూ ఆధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలిలో నిరాహారదీక్ష చేపట్టారు. గూడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు మోటార్‌బైక్ ర్యాలీ, అల్లూరులో వైఎస్సార్సీపీ నేతలు 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. నగరంలో ములుమూడి బస్టాండ్ సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానికులు రిలేదీక్ష చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలో కూర్చున్న ఎన్జీఓ సంఘం నాయకులకు జిల్లా అధికారులు, వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు. గూడూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, నాయకులు బత్తిని విజయకుమార్ సమైక్యాంధ్ర ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు బత్తిని విజయకుమార్ ఆధ్వర్యలో గూడూరులో భారీ మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పొదలకూరులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. కావలిలో శ్రీపొట్టిశ్రీరాములు సెంటర్ వద్ద సైమైక్యాంధ్ర జేఏసీ శిబిరంలో తుమ్మలపెంట, సర్వాయిపాలెం, జలదంకి పీహెచ్‌సీల వైద్య సిబ్బంది రిలేనిరాహార దీక్షకు దిగారు. స్థానిక ఆర్టీసీ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యాన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కావలి ఆర్టీసీ డిపో నుంచి వెళ్తున్న బస్సులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్లూరులో 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్‌లో నీటిపారుదల శాఖ సిబ్బంది, అధికారులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. నెల్లూరు పాళెం వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు ముందు టైర్లలో గాలి తీశారు. దీంతో నెల్లూరు- ముంబయి రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయగిరిలో ఆర్టీసీ కార్మికులు, వివిధ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. వైఎస్సార్సీపీ పట్టణ యూత్ ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్ వద్ద యువకులు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై వాలీబాల్ ఆడారు. కొండాపురం మండ లం సత్యవోలులో గ్రామస్తులు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేసి రోడ్డుపై నిరసన తెలిపారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో విభజనకు వ్యతిరేకంగా సుమారు 300 మంది మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరో సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం, పార్లమెంట్ ఇన్చార్జి వెలగపల్లి వరప్రసాద్ పాల్గొన్నారు. కోవూరు ఎన్జీఓ హోంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ నాయకుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇందుకూరుపేటలో వైఎస్సార్సీపీ నాయకుడు గునపాటి సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. -
ఎన్జీఓ జేఏసీకి అధికారుల సంఘం మద్దతు
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఎన్జీఓ జేఏసీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో శనివారం నుంచి జిల్లా అధికారులు పాల్గొని సంఘీభావం తెలుపుతారని జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్వో రామిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నల్లబ్యాడ్జీలు ధరించి ఎన్జీవోల నిరాహారదీక్ష శిబిరంలో కూర్చుంటామని పేర్కొన్నారు. 19వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా అధికారులు, గెజిటెడ్ అధికారులు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద సమావేశమవుతామని తెలిపారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. 20న మధ్యాహ్న సమయంలో ప్రదర్శన, 21న జిల్లా అధికారుల పెన్‌డౌన్, 22న జిల్లా అధికారులంతా మాస్ క్యాజువల్ లీవ్‌లో వెళ్లనున్నట్టు ప్రకటించారు. దశలవారీగా జిల్లా అధికారులు జేఏసీకి కార్యాచరణ ప్రణాళికతో మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. -
స్తంభించిన జనజీవనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. సకలజనుల సమ్మెగా రూపాంతరం చెందిన తర్వాత ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ నగరం నుంచి పల్లె వరకూ అన్నివర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఉద్యోగ, విద్యార్థి, వ్యాపార, కార్మిక సంఘాలు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. బస్సులు తిరగక పోవడం, వ్యాపార సంస్థలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. అయినా భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఉద్యమానికి సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడిన జూలై 30వ తేదీ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఉన్నతాధికారులు మినహాయిస్తే ఉద్యోగులు, సిబ్బంది అందరూ ఆందోళనబాట పట్టారు. ఈనెల 12న అర్ధ రాత్రి నుంచి ఉద్యోగులు, కార్మికులు, ఎన్జీఓలు సకలజనుల సమ్మె చేపట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులెవరూ రాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. చేసేదేమి లేక ఉన్నతాధికారులు సైతం కార్యాలయాలకు రావడం మానేశారు. మరోవైపు ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీమాంధ్రలోని 13 జిల్లాలో ఎన్జీఓ ప్రతినిధులు శుక్రవారం గుంటూరులో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఉద్యమాన్ని మరింత హోరెత్తించాలని తీర్మానించారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై ప్రభావం ఈనెల 19వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. రెవెన్యూ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోయింది. ఈ క్రమంలో కౌన్సెలింగ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు సోమవారం నుంచి జిల్లాలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకుని ఉద్యమం నుంచి స్కూళ్లకు మినహాయింపు ఇస్తూ జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు తెరిచినా ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తామని ప్రైవేటు స్కూళ్ల యజమానులు ప్రకటించారు. బస్సులు తిరగకపోవడంతో ఆర్టీసీపై ప్రభావం చూపుతోంది. రోజూ రూ.90 లక్షల వరకు నష్టం వాటిల్లుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
సమైక్యం ఉధృతం
సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 17వ రోజు మరింత ఉధృతంగా సాగింది. శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఉద్యమకారులు మొక్కవోని దీక్షతో ఆందోళనలు కొనసాగించారు. నగరంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అధ్యాపకుల బృందం వీఆర్ హైస్కూల్ గ్రౌండ్లో, సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి వీఆర్సీ కూడలిలో రిలే దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు వరుసగా మూడో రోజూ బస్టాండ్ ఎదుట వంటావార్పు నిర్వహించారు. విద్యుత్‌శాఖ మహిళా ఉద్యోగులు కార్యాలయం ఎదుట సోనియా మనసు మారాలని వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. నగరంలో వాణిజ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. గూడూరులో హిజ్రాలు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్ సీపీ నేతలు బస్టాండ్ సెంటర్ నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని అడ్డరోడ్డు సెంటర్లో వంటావార్పు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాల ల బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సు లు కూడా పూర్తిస్థాయిలో తిరగడం లేదు. సమైక్య ఉద్యమంతో జిల్లాలో జన జీవనం స్తంభించింది. నగరంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యం లో ఆత్మకూరు బస్టాండు కూడలిలో మానవహారం నిర్వహించారు. ఎన్జీఓ హోమ్‌లో అటవీశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు చేపట్టారు. సమైక్యాం ధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్‌స్టేషన్ ప్రాంగణంలో కార్మికు లు వంటావార్పు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ అసోసియేషన్ సమైక్య నినాదంతో ఆందోళన నిర్వహించారు. వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు ఆ కార్యాలయం నుంచి వీఆర్సీ, చిన్నబజారు, పెద్దబజారు, సంతపేట ల మీదుగా తిరిగి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. గూడూరు డివిజన్ హిజ్రాల సం ఘం ఆధ్వర్యంలో పట్టణంలో సోని యా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. రోడ్డుపై కబడ్డీ ఆడారు. అనంతరం శాపనార్థాలు పెడు తూ సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీలోని ఎన్ఎం యూ, ఈయూ సంఘాల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు బత్తిని విజయ్‌కుమార్, కార్మికులతో కలిసి బస్సుల టాపుపై కూర్చొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైవేని దిగ్బంధించారు. దీంతో సుమారు గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోట పట్టణంలో ఐసీడీఎస్ ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ర్యాలీ నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకుల రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు బ్యాంకు ఎదుట సమైక్యాంధ్ర మండల జేఏసీ నాయకుల రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సూళ్లూరుపేట జేఏసీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. నాయుడుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. గాంధీ మం దిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. పెళ్లకూరు మండలంలోని అక్కగారిపేట వద్ద హైవేపై రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్‌లో ఆపస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల రెవెన్యూ ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయ సం ఘం నేతలకు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు నడవలేదు. పట్టణంలోని బాలికల గురుకుల కళాశాల నుంచి పట్టణ పురవీధుల్లో జేఏసీ ఆధ్వర్యంలో గురుకుల కళాశాల విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. వింజమూరులోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు పదో రోజుకు చేరుకున్నాయి. పొదలకూరులో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వికలాంగ సేవాసంఘం ఆధ్వర్యంలో స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద వికలాంగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారి దీక్షకు కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు మద్దతు తెలిపారు. కావలి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి, అల్లూరి సీతారామరాజు, పొట్టిశ్రీరాములు, వీరపాండ్యఖడ్గబ్రహ్మన వేషాలతో ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు శుక్రవారం కూడా మూతపడ్డాయి. -
సీమాంధ్రలో ఏపీఎన్జీఓల సమ్మె ప్రారంభం!
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతాల్లో ఏపీఎన్జీఓల సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు సోమవారం అర్థరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఏపీఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెలో 4 లక్షలమంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ఏపీ ఎన్జీవోలతోపాటు పలు కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొననున్నాయి. సమ్మె వాయిదా వేయడం తమ చేతుల్లో లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఆశోక్ పేర్కొన్నారు. ఆంటోనీ కమిటీ పరిధి స్పష్టంగా లేదంటూ ఏపీఎన్జీవోలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు దిగితే సమ్మె ఉధృతమవుతుంటూ హెచ్చరిస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగా హైదరాబాద్ లో హెచ్‌వోడీ కార్యాలయాలు బంద్ కు పిలుపునిచ్చాయి. రేపు అత్సవసర సేవలు మినహా వైద్యసేవలు బంద్ కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పలు జిల్లాల విద్యార్థి జేఏసీ బంద్ కు పిలుపునిచ్చాయి. వెల్పేర్‌లో కమిషనరేట్‌లో సేవలు బంద్ కానున్నాయి. సీమాంధ్రలో పెట్రోల్ బంక్ లు బంద్ కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా బంద్ కు పిలుపునిచ్చాయి. -
సమైక్యాంధ్ర ఉద్యమానికి హెచ్ఎంల అసోసియేషన్ మద్దతు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఈనెల 12 అర్ధరాత్రి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లాశాఖ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్థానిక ప్రధానోపాధ్యాయుల సంఘ భవనంలో శనివారం ఉదయం నిర్వహించిన అసోసియేషన్ సమావేశానికి సంఘ జిల్లా అధ్యక్షుడు వై.వెంకట్రావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకట్రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను వెంటనే ప్రకటించాలని, స్కూలు అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా వెంటనే పదోన్నతులివ్వాలని, ప్రధానోపాధ్యాయుల జిల్లా వార్షిక సమావేశం త్వరలో ఏర్పాటు చేయాలని, ప్రతి పాఠశాలకు వాచ్మెన్, స్వీపర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. వేసవిలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన ప్రధానోపాధ్యాయులందరికీ సంపాదిత సెలవును వారి సేవా పుస్తకాల్లో నమోదు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీ రమణ, కోశాధికారి కె.దయానందం, రాష్ట్ర కార్యదర్శి జయరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.పెద్దిరాజు, నాలుగు విద్యా డివిజన్ల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో తీవ్రమవుతున్న ఉద్యమం
జిల్లాలో సమైక్య ఉద్యమం అప్రతిహతంగా సాగుతోంది. జేఏపీ నేతలు ఉద్యమానికి శ్రీకారం చుడితే...ఉపాధ్యాయులు ఊతమయ్యారు...అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు చేయి కలిపారు.. ప్రజా సంఘాలు, న్యాయవాదులు ఉద్యమ ఉధృతికి తోడ్పాటునందిస్తున్నారు...తెలుగుతల్లి కోసం వ్యాపారులూ సమైక్య గళం వినిపిస్తున్నారు. అంధవిద్యార్థులు అండగా నిలిచారు. ఓ వర్గం కాదు...ఓ మతం కాదు..అందరూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సమైక్యవాణి ఢిల్లీకి వినిపించేలా పోరాటం సాగిస్తున్నారు. సాక్షి, కడప: సమైక్య ఉద్యమం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. కుల,మతాలతో సంబంధం లేకుండా, తెలుగువారంతా కలిసి ఉండాలనే ఏకైక లక్ష్యంతో జిల్లాప్రజలంతా ఏకమై సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నారు. గత నెల 31న ప్రారంభమైన ఉద్యమం శనివారం పదకొండోరోజుకు చేరింది. జిల్లా అంతటా రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకూ ఉద్యమాన్ని తీసుకెళ్లి కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ట్రాక్టర్లు, ఎద్దులబండ్లతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపేలా ప్రణాళిక రచించారు. 20వ తేదీ నుంచి గ్రామస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. కడపలో న్యాయవాదులు, ఉపాధ్యాయల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు సీ రామచంద్రయ్య, అహ్మదుల్లా ఇళ్లను ముట్టడించారు. సీఆర్సీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పూలు, గాజులు వేసుకోవాలని కోరుతూ వాటిని ఇంటికి తగిలించి వెళ్లారు. మంత్రి అహ్మదుల్లా ర్యాలీలో పాల్గొని సమైక్య నినాదం చేశారు. బ్రెయిలీ స్కూలు విద్యార్థులు ‘అంధుల సంయుక్త కార్యాచరణ సమితి’ పేరుతో అంధుల పాఠశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. కృష్ణా సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేపట్టిన ఆమరణనిరాహారదీక్ష ఆరోరోజుకు చేరింది. దీక్షాశిబిరం వద్ద కళాకారులు ఆడిపాడారు. మెడికల్, ఫార్మామెడికల్ జే ఏసీ నేతలు ర్యాలీ నిర్వహించారు. పశుసంవర్ధకశాఖ అధికారులు నోటికి నల్లరిబ్బన్ ధరించి మౌనర్యాలీ చేపట్టారు. ఎన్ఆర్ఐ ట్రస్టు అధ్యక్షుడు తోటకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. ఆంటోని కమిటీ రద్దు చేయాలని ఎమ్మెల్యే వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్తు కార్మికుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కడప ప్రెస్‌క్లబ్‌లో మంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, లింగారెడ్డి, వీరశివారెడ్డి, ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడి,్డ మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డితో పాటు పలువురు రాజకీయానేతలు సమావేశం నిర్వహించారు. సమైక్య ప్రకటన వెలువడేదాకా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని కార్యాచరణ రూపొందించారు. ప్రొద్దుటూరులో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకులు భారీ ర్యాలీ నిర్వహించారు. చెక్కభజన, డప్పులు, వాయిద్యాలతో హోరెత్తించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిజ్రాలు కూడా ర్యాలీ నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మకు శవయాత్రను చేపట్టారు. ఏడుస్తూ, కేంద్ర నేతలను తిడుతూ వినూత్న నిరసన తెలిపారు. సున్నంబట్టి యువకులు కూడా శవయాత్ర చేపట్టారు. న్యాయవాదులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. దువ్వూరు మండల ఉపాధ్యాయులు శనివారం దీక్షలో పాల్గొన్నారు. రాయచోటిలో జేఏసీ, న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పులివెందులలో భవననిర్మాణ కార్మికులు, ప్రైవేటు డాక్టర్లు ర్యాలీ నిర్వహించి, రిలేదీక్షలకు కూర్చున్నారు. ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. జమ్మలమడుగులో ఉపాధ్యాయసంఘాలు, ప్రజాసంఘాల వారు ర్యాలీ నిర్వహించారు. వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. చిన్నపిల్లలు స్వచ్ఛందంగా ర్యాలీ చేపట్టి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజంపేటలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి జేఏసీ నాయకులు పాలాభిషేకం చేశారు. సుండుపల్లి, వీరబల్లిలో దీక్షలు కొనసాగుతున్నాయి. రైల్వేకోడూరులో బ్రాహ్మణులు వైఎస్సార్ సర్కిల్లో హోమం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మైదుకూరులో ఉపాధ్యాయ సంఘాలు, బీటెక్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రిలేదీక్షలకు కూర్చున్నారు. టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎర్రగుంట్లలో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. -
12న కేంద్ర కార్యాలయాల దిగ్బంధనం: చంద్రశేఖర్‌రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా: రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై తమ నిర్ణయాన్ని సీడబ్య్లూసీ సమావేశంలో తీర్మానం చేసినా నాటినుంచి దాదాపు 10రోజులుగా సమైక్యంధ్ర రగలిపోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లాలో సమైక్య జేవేసీ సమావేశమైంది. ఈ సమావేశంలో తమ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయాన్ని ప్రకటించినట్టు జేఏసీ నాయకులు గౌరవ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన కేంద్ర కార్యాలయాల దిగ్బంధనం చేయనున్నట్టు చెప్పారు. 16వ తేదీన నియోజకవర్గాల కేంద్రాల్లో రహదారుల దిగ్బంధం చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా 18న కూడా కడప, రాజంపేటలలో రైల్‌రోకో, జైలు భరో వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనం: జైపాల్‌రెడ్డి
పాలమూరు (మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానం శిలా శాసనం లాంటిదని, ఎన్ని ఉద్యమాలు పుట్టుకొచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేవని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. తాను ప్రాంతాల పేరుతో ప్రజలను నిందించబోనని, సీమాంధ్ర నాయకుల వైఖరి కారణంగానే తెలంగాణలో సమస్య తలెత్తిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు జాతీయ స్థాయిలో బీజేపీ, సీపీఐ, బీఎస్పీ, ఇతర పార్టీలు అనుకూలంగా ఉన్నాయన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక రాష్ట్రం ఏర్పాటు విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సునిశితంగా చర్చలు, సమీక్షలు, పరిశీలనల అనంతరమే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పెద్ద పదవిలో ఉన్న ఒక వ్యక్తి అధిష్టానం ముందు వారు చెప్పిన మాట విని, ఆ తర్వాత ఒక ప్రాంతం వారిని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేయడం తగదంటూ పరోక్షంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని విమర్శించారు. విభజనపై కేంద్రం తన నిర్ణయాన్ని పక్కన పెట్టాలన్న కుతంత్రంతోనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రరాష్ట్రంలో కలిసి ఉండటం కుదరదనే ఉద్దేశంతో.. 2004లోనే టీఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించినట్లు వెల్లడించారు. అప్పుడే సోనియాగాంధీకి ఈ ప్రాంతంపై అవగాహన కలిగి, అభిమానం ఏర్పడిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు 2004లోనే ప్రధాని మన్మోహన్సింగ్ చెప్పారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ఫిబ్రవరి 12న తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించారన్నారు. సీమాంధ్రులను అమాంతంగా హైదరాబాద్ వదిలి వెళ్లమని ఎవరూ చెప్పడం లేదంటూ.. ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల వరకు ఇక్కడే ఉండేందుకు అవకాశం కల్పించిన విషయం గుర్తు చేశారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్నందునే హైదరాబాద్ తమకు కావాలంటున్నామని చెప్పారు. -
ఊరూరా సమైక్యాంధ్ర ఉద్యమం
సాక్షి నెట్వర్క్: ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం.. సమైక్యాంధ్ర కొనసాగించడం.. ఇదే శ్వాసగా, ఆశగా సీమాంధ్రలో ఊరూవాడా ఉప్పెనలా ఉద్యమం ఉరకలేస్తోంది. సమైక్యాంధ్ర సాధనలో కదం తొక్కుతున్న కోస్తా, రాయలసీమ ప్రజ పండుగరోజు కూడా విశ్రమించలేదు. రంజాన్ పర్వదినం సందర్భంగా నిరసనలకు సడలింపు ఇవ్వాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చినప్పటికీ అన్నిచోట్లా ఆందోళనలు మిన్నంటాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసనప్రదర్శనలతో సీమాంధ్ర ఊళ్లు దద్దరిల్లాయి. కాంగ్రెస్ నేతలపై జనాగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. సోనియాగాంధీ, రాహుల్, దిగ్విజయ్, బొత్సలతో పాటు కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు, వినూత్ననిరసనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల కూడలిలో నిర్వహించిన నమూనా ప్రజాకోర్టులో కేసీఆర్‌కు ఉరిశిక్ష విధించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పీసీసీ చీఫ్ బొత్స దిష్టిబొమ్మకు చెప్పులు వేసి ఊరేగించారు. కర్రలతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏకలవ్య అసోసియేషన్ సభ్యులు సీమ పందిపై కేసీఆర్ పేరు రాసి పట్టణంలో డప్పుల విన్యాసాలతో ఊరేగించారు. విశాఖ జిల్లా అరకులో మార్కెట్ వ్యాపారులు కేసీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ, పెద్ద కర్మ నిర్వహించారు. తిరుపతిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మహిళలు, యువకులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను తాళ్లతో బంధించి లాక్కుంటూ వెళ్లి వినూత్నంగా నిరసన తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో గంగిరెద్దుకు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పేర్లతో ప్లకార్డులు కట్టి ఊరేగించారు. రోడ్డుపైనే ముస్లింల నమాజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగింపే లక్ష్యంగా ముస్లింలు రంజాన్రోజు కూడా ఆందోళనలు హోరెత్తించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కర్బలా మైదానంలో రంజాన్ నమాజ్‌లను ముగించుకున్న అనంతరం ముస్లింలంతా పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ప్రత్యేక నమాజ్‌లు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో సుమారు 10వేల మందికిపైగా ముస్లింలు మదనపల్లె రోడ్డు నుంచి ఈద్గా మైదానం వరకు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనంతరం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ అల్లాను ప్రార్థించారు. సత్యవేడులో ముస్లింలు ర్యాలీ నిర్వహించి అనంతరం పండుగలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో శివయ్యస్థూపం సెంటర్లో ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఈద్గాలలో ప్రార్థనల అనంతరం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ శాంతి ర్యాలీలు చేపట్టారు. ఎస్కేయూలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రార్థనల అనంతరం భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ పక్కన ఉన్న మసీదులో ప్రార్ధనలు ముగించుకున్న ముస్లింలు హైవేపై రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగుల నిరసన విశాఖలో విద్యుత్ ఉద్యోగులు సీతమ్మధారలోని ఈపీడీసీఎల్ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయలుదేరి మద్దిలపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. అక్కడి నుంచి ఎన్ఏడీ కూడలికి బయలుదేరి అక్కడా రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రదర్శన ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు విద్యార్థి జేఏసీతో కలిసి మద్దిలపాలెం జాతీయరహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి, బహిరంగ స్నానాలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, విద్యార్థి, ప్రజా సంఘాల నేతృత్వంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ కర్మాగారాన్ని ముట్టడించారు. గాజువాకలోని లంకెలపాలెం వద్ద వైఎస్సార్ సీపీ పెందుర్తి సమన్వయకర్త గండి బాబ్జీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వైద్య, ఉపాధ్యాయ, న్యాయవాదుల నిరశన కడపలో జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరాహార దీక్షలు, కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల, రిమ్స్‌లో డాక్టర్ల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేస్తున్న ఆమరణనిరాహారదీక్ష ఐదోరోజుకు చేరింది. రాయచోటిలో జేఏసీ నేతలు చేస్తున్న దీక్షాశిబిరాన్ని ఎమ్మెల్యేల గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల రిలేదీక్షలు గుంటూరు జిల్లా చిలకలూరిపేట, తెనాలి, రేపల్లె, వినుకొండల్లో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మున్సిపల్ టీచర్ల సమైక్య జేఏసీ అన్నిచోట్లా ర్యాలీలు నిర్వహించింది. రిక్షావాలాల రాస్తారోకో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద 216 జాతీయ రహదారిపై 250 మంది రిక్షా కార్మికులు డప్పులు వాయిస్తూ రిక్షాతో భారీ ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. తన భార్య సరస్వతి(వాణి) శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్టు మంత్రి తోట నరసింహం ప్రకటించారు. అంధుల నిరాహారదీక్ష తిరుపతి ఎస్వీయు వద్ద అంధ విద్యార్థులు ఒకరోజు రిలే నిరాహారదీక్ష చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల రిలేదీక్షలకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మద్దతు పలికారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి తన కుమారుడు పీసీసీ కార్యదర్శి గల్లా జయదేవ్‌తో కలిసి తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగే ఉద్యమాల్లో పాల్గొంటానని మంత్రి గల్లా ప్రకటించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు అంధకూపం శిక్ష విజయనగరం సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు నేతృత్వంలో సోనియా, రాహుల్‌గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దున్నపోతుతో తొక్కిస్తూ అంధకూపం శిక్ష విధించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన కత్తి, కర్రసాము చేసే కళాకారులంతా కత్తులు, కర్రలతో యుద్ధ విన్యాసాలు చేస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్లలో 200 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి విజయనగరం - పాలకొండ రహదారిని దిగ్బంధించారు. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమ్మెను ప్రారంభిస్తామని, రాష్టాన్ని విభజిస్తున్నట్టు ప్రకటించిన ఏఐసీసీ అధిష్టానం సమైక్యంగా ఉంచుతున్నట్టు ప్రకటించే వరకూ కొనసాగిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఏలూరులో స్పష్టం చేశారు. కావూరి, కనుమూరిలను పట్టుకుంటే రూ.లక్ష ఎంపీ కనుమూరి బాపిరాజు, మంత్రి కావూరి సాంబశివరావు కనిపించడం లేదని, వారిని పట్టుకుని అప్పగిస్తే సమైక్య జేఏసీకి రూ.లక్ష ఇస్తానని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు భీమవరంలో ప్రకటించారు. శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పలాస-కాశీబుగ్గలో ‘సిక్కోలు ధూమ్‌ధామ్’ కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఒంగోలులో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రభుత్వ వైద్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పర్చూరులో న్యాయవాదులు చేపట్టిన 5వ రోజు దీక్షాశిబిరాన్ని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఒంగోలులో శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలతో అభిషేకం చేసి అమరజీవి ఆశయం కొనసాగాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పాల్గొని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. కేంద్రాన్ని ఎదిరిస్తాం: మంత్రి సారథి సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఉయ్యూరులో చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి పార్ధసారథి మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉండేలా కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎదిరించి కేంద్ర మంత్రులను నిలదీస్తామన్నారు. బెజవాడలో స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్రోడ్డుపై ప్రదర్శనలు చేశారు. వన్‌టౌన్‌లో మార్వాడీ మహిళలు ర్యాలీ నిర్వహించారు. కృష్ణాజిల్లా జి కొండూరు మండలం కట్టుబడిపాలెంలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. వైఎస్సార్సీపీ నేత సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. సమ్మెకు టీటీడీ ఉద్యోగుల మద్దతు ఈవోకు నోటీసులు అందజేత సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగనున్నారు. ఈమేరకు టీటీడీ ఈవోకు నోటీసులు అందజేసిన అనంతరం ఉద్యోగుల సమాఖ్య నాయకులు విజయకుమార్, ఆంజనేయులు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులంతా ఒక తాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడినట్టు తెలిపారు. స్వామి వారి దర్శనార్థం వచ్చే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలుగజేయబోమని హామీ ఇచ్చారు. తిరుమలలో ఉద్యోగులు యథావిధిగా విధుల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారన్నారు. 12 నుంచి సమ్మెలో 630 మంది ఎంపీడీవోలు విజయవాడ, న్యూస్‌లైన్ : 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మెలో 13 జిల్లాలకు చెందిన 630 మంది ఎంపీడీవోలు పాల్గొంటారని రాష్ట్ర ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.హరిహరనాథ్ చెప్పారు. విజయవాడలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్‌శాఖ ద్వారా అందిస్తున్న సేవలను నిలిపేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. విభజన ప్రక్రియను నిలిపేసి రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటించేవరకు కార్యాలయాలు మూసేసి నిరసన తెలియజేస్తామన్నారు. -
సీమాంధ్రుల ప్రజల ప్రయోజనాలకు ఏం చేస్తారో చెప్పాలి: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ధర్మాలతో అట్టుడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించడంతో సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. సీమాంధ్ర సెగ కేంద్రాన్ని తాకింది. సీమాంధ్ర ఉద్యమం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. సమైక్యాంధ్రులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంతవరకూ నోరు మెదపకుండా మౌనంగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 10రోజుల తరువాత మౌనం వీడారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలంటూ ఆయన శుక్రవారం ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. రాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ అంతర్గత అంశంగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. -
11న హైదరాబాద్‌లో సమైక్య సదస్సు
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్ర పరిరక్షణకై ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో సదస్సు నిర్వహించనున్నట్టు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రకటించింది. సమైక్యవాదులంతా సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. వేదిక ప్రతినిధులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12న ఏపీఎన్జీవోస్ నిర్వహించ తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ తోడ్పాటు అందిస్తామన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులందరూ వెంటనే రాజీనామా చేసి, ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయని మంత్రుల ఇళ్ల వద్ద 13న ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక వివిధ రంగాల వారితో జాయింట్ యాక్షన్ కమిటీలను నిర్మించి హైదరాబాద్‌లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని చెప్పారు. ఏకే ఆంటోనీ కమిటీ తన నివేదికను ఇచ్చేవరకూ రాష్ట్ర విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవోస్ హైదరాబాద్‌లో చేపట్టదలచిన సమ్మెను భగ్నం చెయ్యడానికి విభజనవాదులు ప్రయత్నించడం అప్రజాస్వామికమన్నారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు పి.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా లేకపోతే హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారని, విద్యార్థులు ఉపాధి సౌకర్యాలను కోల్పోతారని చెప్పారు. త్వరలో రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదాన్ని వినిపించడానికి భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో సమితి నేతలు కుమార్‌చౌదరియాదవ్, రాజేంద్రప్రసాద్‌రెడ్డి, న్యాయవాదులు వి.రామకృష్ణ, పీఏ మెల్చిసెడక్, కృష్ణమోహన్, ఉద్యోగ సంఘాల నేతలు ఇ. శివకుమారి, కె. రమాదేవి, ఎం. శ్రీరామమూర్తి, బి. హైమ, కె. సుధాకర్‌రెడ్డి, పి.జి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లిళ్లకు ఉద్యమ ఎఫెక్ట్ ?
అన్నవరం, న్యూస్‌లైన్ :ఈ నెల పదోతేదీ నుంచి శ్రావణ మాసం పెళ్లిళ్ల ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. రత్నగిరి, సత్యదేవుని సన్నిధి పెళ్లిళ్లకు సిద్ధమవుతోంది. ఏటా శ్రావణమాసంలో రత్నగిరిపై సుమారు 300 వివాహాలు జరుగుతాయనేది ఓ అంచనా. ఈనెల పదో తేదీ నుంచి వివాహాలు ప్రారంభం కానున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో రత్నగిరికి వచ్చే భక్తుల రాక తగ్గింది. ఆలయంలో వివాహాలు కూడా తక్కువ జరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంటున్నాయి. రెండు నెలల విరామం అనంతరం మరలా ఈనెల పదో తేదీ శ్రావణ శుద్ధ చవితి ఉత్తర నక్షత్రం, వృషభ లగ్నంలో వివాహ ముహూర్తంతో ఈ వివాహాల సీజన్ ప్రారంభం కానుంది. వరుసగా 11,12,15,16,17,21,23,25,29 తేదీల్లో వివాహాలు జరగనున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, బంద్ ప్రభావంతో ఈ ముహూర్తాల్లో జరిగే వివాహాలను వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ముహూర్తాలలో పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నట్టు వివాహ బృందాలు సమాచారం అందించాయని క్యాటరింగ్, డెకరేషన్ కార్మికులు తెలిపారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో వివాహాలు నిర్వహిస్తామని వారు చెప్పినట్టు సమాచారం. సత్యదేవుని ఆలయానికి ఏటా కార్తీక, వైశాఖం తర్వాత శ్రావణమాసంలోనే భక్తులు ఎక్కువగా వస్తారు. సుమారు 5 లక్షల మంది భక్తులు రత్నగిరికి వచ్చే అవకాశం ఉందని అంచనాతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేసారు. ఆదాయం శ్రావణ మాసంలో రూ.మూడు కోట్లు వరకూ రాగలదని అంచనా వేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఈ అంచనాలు నిజమవుతాయా అనేది ఆలయ వర్గాల్లో సందేహం నెలకొని ఉంది. ఏర్పాట్లపై ఈఓ సమీక్ష ఈఓ పి. వేంకటేశ్వర్లు, దేవస్థానం అధికార్లతో బుధవారం ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రావణ శుక్రవారం, శని, ఆది వారాల్లోనూ, దశమి, ఏకాదశి, పౌర్ణమి వంటి తిథుల్లో సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశారు. సత్యగిరిపై గల హరిహర సదన్, విష్ణు సదన్ సత్రాల్లో బస చేసే భక్తుల కొరకు దేవస్థానం బస్‌ను సత్రం గదుల రిజర్వేషన్ కార్యాలయం నుంచి సత్యగిరికి ఉచితంగా నడుపనున్నారు.పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఈఓ ఆదేశించారు. -
ఊరు వాడ ఉద్యమం
-
ఆర్టీసీలో సమ్మె సైరన్
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులకు బుధవారం మధ్యాహ్నం సమ్మె నోటీసు ఇస్తామని ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి వైవీరావు ‘సాక్షి’కి తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆర్టీసీలోని ఇతర కార్మిక సంఘాలతో కూడా సమావేశం నిర్వహించి వారి సహకారం తీసుకుని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర పోరాట కమిటీని మంగళవారం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా, టీవీ భవాని కోశాధికారిగా వ్యవహరిస్తారని, నాలుగు జోన్ల ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారని వివరించారు. 8వ తేదీ నుంచి అన్ని డిపోల్లో నిరహారదీక్షలు, 10న డిపోల ఎదురుగా మానవహారాలు, అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీఏన్జీవో జేఏసీలతో కలిసి సమ్మెకు దిగుతామని తెలిపారు. అప్పటినుంచి ఒక్క బస్సు కూడా రోడ్డుపై తిరగనీయబోమని హెచ్చరించారు. -
ఉప్పెనలా ఉద్యమం
రాష్ట్ర విభజన సెగలు రగులుతున్నాయి. సమైక్యాంధ్రోద్యమం మహోధృతంగా సాగుతోంది. వివిధ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు, విద్యార్థుల నేతత్వంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. భీమిలిలో ఆందోళనకారులు వంటావార్పు చేపట్టారు. తగరపువలసలో ఆటో కార్మికులు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. నాయుడుతోటలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. జాతీయ రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. ఏయూలో విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపించింది. సీలేరులో బంద్ నిర్వహించి ఉద్యమానికి ఊపుతెచ్చారు. అనకాపల్లిలో మున్సిపల్ ఉద్యోగులు రోడ్డెక్కారు. వాయిద్య కళాకారులు, సెల్ దుకాణ నిర్వాహకులు, ఆటో కార్మికులు, వికలాంగుల జేఏసీ నేతలు ఆందోళనను ఉధృతం చేశారు. నర్సీపట్నం పరిధిలో వైద్యులు, విశ్వబ్రాహ్మణులు ప్రదర్శనలతో హోరెత్తించారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగిస్తున్నారు. అట్టుడికిన జగదాంబ జంక్షన్ : జగదాంబ జంక్షన్ మంగళవారం అట్టుడికిపోయింది. న్యాయవాదుల ర్యాలీ, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. జిల్లా చౌకధరల దుకాణ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. సెవెన్త్‌డే విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సాలిపేటలో రజకసంఘం ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. ప్రభ చారిటబుల్ ట్రస్ట్, క్లినికల్ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. టీడీపీ బీచ్‌రోడ్డులో కాంగ్రెస్ అగ్రనేతలకు పిండ ప్రదానం చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేసి, వంటావార్పు చేపట్టారు. జీవీఎంసీ ప్రధాన అధికారులు దీక్షలకు దిగారు. వైశాఖి మహా నగర మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈపీడీసీఎల్ ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. క్రికెట్ ఆడి నిరసన వ్యక్తం చేశారు. 28వ వార్డులో కోలాగురువులు ఆధ్వర్యంలో ఆందోళన జరి గింది. పైడా నర్సింగ్ కళాశాల విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేశారు. మద్దిలపాలెంలో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో రెండోరోజూ దీక్షలు కొనసాగాయి. మధురవాడ పరిధిలో తాతబ్బాయి (62) అనే వృద్ధుడు తనువు చాలించాడు. తాటిచెట్లపాలెం జాతీయ రహదారిపై ఉద్యమకారులు నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా టీవీల్లో ఎంటర్టైన్మెంట్ చానళ్లను నిలిపివేశారు.