ఓబీసీ సాధన కోసం ఆరె కులస్తులు ఉద్యమించాలి
ఖిలా వరంగల్ : ఆరె కులస్తులను ఓ బీసీల్లో చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమించాలని ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు సోమిడి అంజన్‌రావు పిలుపునిచ్చారు. వరంగల్ శివనగర్‌లోని ఫెర్టిలైజర్ అసోసియేషన్ భవనంలో జిల్లా ఆధ్యక్షుడు హింగ్లీ శివాజీ ఆధ్యక్షతన ఆరె సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో అంజన్‌రావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రాష్ట్రంలో నివస్తున్న ఆరె కులస్తులు ఓబీసీ జాబితాలో లేకపోవడంతో యువత విద్య, ఉ ద్యోగ, ఉపాధి రంగాలతో పాటు నష్టపోవడమే కాకుండా సంక్షేమ పథకాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 86 కులాలను ఓబీసీల్లో చేర్చినా ఆరె కులస్తులకు చోటు దక్కడం గర్హనీయమన్నారు. ఈ మేరకు ఆరె కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో బలేరావు మనోహర్‌రావు, డాక్టర్ సిందె రాంనర్స య్య, ఓండా రాజేష్, గుండెకారి రంగారావు, మాసంపెల్లి లింగాజీ, గుండెకారి రవికుమారి, రఘుపతి, సోమిడి శ్రీనివాస్, జులమేటి రాజు, దామెరగిద్ద ప్రభాకర్, పగిడే సాంబరావు, వీర న్న, దౌలత్‌బాజీ యుగేందర్ పాల్గొన్నారు.