సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ఉద్యమంపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై కార్మిక లోకం భగ్గుమంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనకు కార్మికులు పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు చూస్తున్నాం.
పోలీసులు అనుమతి తీసుకున్న తర్వాత ధర్నా చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఉద్యమకారులకు దువ్వాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నడు నోటీసులు ఇవ్వలేదన్న కార్మికులు.. ప్రభుత్వం మారితే రూల్స్ మారుతాయా అంటూ పోలీసులను కార్మికులను ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యమానికి పూర్తిగా సహకరించింది. స్టీల్ ప్లాంట్స్‌ను కాపాడుతామన్న చంద్రబాబు పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకోవాలన్నారు.
రాస్తారోకోకు అనుమతి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన కార్మికులు.. అవసరమైతే అరెస్టు చేసుకోవాలన్నారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. పోలీసుల నోటీసులు లెక్కచేయకుండా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలు అరెస్ట్
ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పెద్దల సూచనతో కార్మికుల రాస్తారోకోను పోలీసులు నిరీర్వర్యం చేశారు. కార్మికులను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున సీఐఎస్‌ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు పవన్ కల్యాణ్ నిలబెట్టుకోలేదని కార్మికులు మండిపడుతున్నారు. 3 నెలలు సమయం ఇచ్చిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారి కృషి చేయలేదు. అమరావతిపై చూపిస్తున్న శ్రద్ధను స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చూపించలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment