restrictions
-
క్యాష్ విత్‌డ్రాకూ వీల్లేదు.. బ్యాంక్‌పై ఆర్బీఐ కఠిన చర్యలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై (New India Co operative Bank) కఠిన ఆంక్షలు విధించింది. ఆరు నెలల పాటు కొత్త రుణాలు మంజూరు చేయకుండా, కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా నిరోధించింది. అలాగే క్యాష్ విత్‌డ్రాకు కూడా వీలు లేకుండా చేసింది.బ్యాంకు ఆర్థిక ఆరోగ్యం, ద్రవ్యత స్థితి గురించి ఆందోళనల కారణంగా ఈ పరిమితులు అవసరమని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. డిపాజిటర్ల ఆర్థిక భద్రత దృష్ట్యా ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక నష్టాలతో సతమతమవుతోంది. దాని వార్షిక నివేదిక ప్రకారం మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.22.78 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం రూ.30.75 కోట్ల నష్టం వాటిల్లింది.ఆర్బీఐ ఆదేశాల్లో ఏముందంటే.. 2025 ఫిబ్రవరి 13న వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, నిధులను తీసుకోవడం లేదా కొత్త డిపాజిట్లను అంగీకరించడం, అప్పుల కోసం చెల్లింపులు చేయడం, ఆస్తులను విక్రయించడం, బదిలీ చేయడం వంటివి చేయకూడదని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌ను ఆర్బీఐ ఆదేశించింది.ఖాతాదారులలో ఆందోళనఆంక్షల్లో భాగంగా బ్యాంకు ద్రవ్యత సమస్యల కారణంగా డిపాజిటర్లు తమ పొదుపు, కరెంట్ లేదా ఇతర ఖాతాల నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి వేలు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బిఐ నిర్ణయం కస్టమర్లలో ఆందోళనను సృష్టించింది. దీంతో ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ శాఖల వద్దకు కస్టమర్లు పెద్ద ఎత్తున వచ్చారు. ఈఎంఐలు, అద్దెల చెల్లింపులు, రోజువారీ ఖర్చుల నిర్వహణ కోసం క్యాష్ విత్‌డ్రా లేకపోతే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కస్టమర్ల డబ్బులు వెనక్కి వస్తాయా?న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, దాని బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీని అర్థం బ్యాంకు ఇప్పటికీ పరిమితుల కింద పనిచేయడానికి అనుమతి ఉంటుంది. అంత వరకూ పరిస్థితిని కేంద్ర బ్యాంకు పర్యవేక్షిస్తుంది. అవసరమైన విధంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటుంది.ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అర్హత కలిగిన డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుండి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే రూ. 5 లక్షల వరకు పొందవచ్చు. ఇది బ్యాంకులో డిపాజిట్లు కలిగి ఉన్న కస్టమర్లకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. -
ప్రముఖ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై విధించిన పర్యవేక్షక ఆంక్షలను ఎత్తివేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏ కింద 2024 ఏప్రిల్ 24న విధించిన ఆంక్షలను తొలగించింది. బ్యాంక్ తన ఆన్లైన్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి, తిరిగి కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు అనుమతించింది.ఐటీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ప్యాచ్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీతో సహా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ మౌలిక వసతుల్లో లోపాలను గతంలో ఆర్బీఐ గమనించింది. దాంతో నిబంధనలు పాటించకపోవడం వల్ల బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. ఫలితంగా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్) కార్యకలాపాలు, ఆన్లైన్, డిజిటల్ బ్యాంకింగ్ ఛానళ్లు కొంతకాలంగా అంతరాయాలు ఎందుర్కొంటున్నాయి.నివారణ చర్యలుఆర్బీఐ ఆందోళనలకు ప్రతిస్పందనగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నివారణ చర్యలను ప్రారంభించింది. లోపాలు సవరించుకునేందుకు బ్యాంకు అనుసరిస్తున్న విధానాలను నిత్యం ఆర్బీఐకు నివేదికల రూపంలో సమర్పించింది. ఈ కాంప్లయన్స్ను ధ్రువీకరించడానికి ఆర్బీఐ ఆమోదించిన ఎక్స్టర్నల్ ఆడిట్‌ను బ్యాంక్ పూర్తి చేసింది. బ్యాంకు తీసుకున్న పరిష్కార చర్యలతో సంతృప్తి చెందిన ఆర్బీఐ గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: స్టార్‌లింక్ సేవలను ధ్రువీకరించిన మస్క్ఆంక్షలు ఎత్తివేయడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు మార్గం లభించింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు లైన్‌క్లియర్ అయింది. ఈ చర్య వల్ల సమర్థవంతమైన కస్టమర్ సేవలను అందించడానికి వీలవుతుంది. బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ ఆంక్షలు ఎత్తివేయడం కీలకంగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. -
స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో స్పెషల్ షోల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11గం. తర్వాత వేసే షోలకు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను అనుమతించొద్దని ఆంక్షలు విధించింది.సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా.. థియేటర్లలో పదహారేళ్లలోపు పిల్లల అనుమతిపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకు చిన్నారులను థియేటర్లలోకి అనుమతించవద్దని పేర్కొంది.వేళాపాళా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని పిటిషన్ తరపు న్యాయవాది ాదించగా.. ఆ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడంతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేసింది. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే దాకా పిల్లలను స్పెషల్ షోలకు అనుమతించొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. -
ఏఐ చిప్‌లపై అమెరికా ఆంక్షల ప్రభావం
అమెరికా ఇటీవల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. భారత్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఎగుమతికి సంబంధించి అమెరికా ఆంక్షలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల ప్రారంభంలో దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు చైనా, రష్యా వంటి దేశాల్లో సాంకేతిక పురోగతిని నిరోధించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇతర దేశాలపైనా వీటి ప్రభావంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏఐ చిప్ ఎగుమతుల పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.అమెరికా ఆంక్షల పరిధిఅమెరికా ఎగుమతులపై విధించిన ఆంక్షలకు సంబంధించి వివిధ దేశాలను భద్రత, మానవ హక్కుల ప్రమాణాల ఆధారంగా మూడు అంచెలుగా వర్గీకరించింది. టైర్ 1లో యూకే, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలు ఉన్నాయి. ఇవి ఎటువంటి ఆంక్షలను ఎదుర్కోవు. భారతదేశం, సింగపూర్, ఇజ్రాయెల్ టైర్ 2 దిగుమతులపై కొన్ని పరిమితులను ఎదుర్కొంటాయి. ఇందులో భాగంగా అధునాతన ఏఐ చిప్‌లకు లైసెన్సింగ్ అవసరం. టైర్ 3లో చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు తయారు చేసిన చిప్‌లను కొనుగోలు చేయకుండా పూర్తిగా నిషేధించాయి.ఇదీ చదవండి: మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరంభారత్ ఏఐ మౌలిక సదుపాయాలపై ప్రభావంసమీప భవిష్యత్తులో 10,000 జీపీయూ(Graphics Processing Unit)లతో ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిష్టాత్మక జాతీయ ఏఐ మిషన్ ఈ ఆంక్షల కారణంగా అడ్డంకులను ఎదుర్కొనుంది. 2027 వరకు 50,000 జీపీయూలను సిద్ధం చేయాలనే భారత ప్రణాళికలు ఈ ఆంక్షల వల్ల ప్రభావితం చెందే అవకాశం ఉంది. అయితే భారత్ యూఎస్ ఆంక్షల పరంగా టైర్2 విభాగంలో ఉండడంతో ఏఐ చిప్‌ల లైసెన్సింగ్ సదుపాయాలు మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆంక్షల వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లకు కీలకమైన జీపీయూలకు మార్కెట్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన మార్గాలను అన్వేషించాలని కోరింది. -
Delhi Pollution: ఢిల్లీలో వరస్ట్ మార్నింగ్
దేశ రాజధానిలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ.. డేంజర్ లెవల్‌ను దాటిపోయింది. ఈ ఉదయం నగరంలో వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) 450 severe-plus దాటింది. దీంతో ఈ సీజన్‌కే వరెస్ట్ పరిస్థితి నెలకొంది. మరోవైపు పొగమంచు కమ్మేయడం అన్నీ రవాణా వ్యవస్థలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. ఈ ఉదయం నుంచి మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఈ ఉదయం నుంచి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)- 4’ కింద మరిన్ని నిబంధనలను అమల్లోకిచ్చాయి. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిత్యావసరాలు అందించే ట్రక్కులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే.. ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులనే తిరగనిస్తారు.మరోవైపు కాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. విమాన ప్రయాణాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం ఐదు గంటలకు విజిబిలిటీ 150 మీటర్ల దూరానికి పడిపోయింది. ఈ ఉదయం ఏడుగంటలకు.. ఏక్యూఐ 481గా నమోదైంది. 👉ఏక్యూఐ 0-50 మద్య ఉంటే గుడ్, 👉51-100 ఉంటే సంతృప్తికరం, 👉101-200 మధ్య ఉంటే ఓ మోస్తరు కాలుష్యం, 👉201-300 నుంచి పూర్, 👉301 నుంచి 400 మధ్య ఉంటే వెరీ పూర్, 👉401 నుంచి 450 ఉంటే సివియర్, 👉450 పైనే ఉంటే వెరీ సివియర్ ఈ స్థాయిలో ఢిల్లీ కాలుష్యం పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్నిరకాల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్లు, పైపులైన్లు.. ఇలా ఎలాంటి నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులైనా సరే ఆపేయాలని స్పష్టం చేసింది. అలాగే.. సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది.కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచు పేరుకుపోయి కనీసం వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఆదివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.సీఏక్యూఎం సూచన మేరకు.. ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖను ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదేశించారు.ప్రైవేట్ ఆఫీసులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చర్యలు చేపట్టాలని, మిగతావాళ్లను వర్క్‌ఫ్రమ్ హోం ద్వారా పని చేయించుకోవాలని అధికార యంత్రాగానికి సీఏక్యూఎం సిఫారసు చేసింది.ఇదీ చదవండి: మందు పార్టీ లేదా సీఎం సాబ్? -
ఊపిరాడని రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ: అత్యల్ప ఉష్ణోగ్రతలకు దట్టంగా కమ్ముకున్న వాయుకాలుష్యం తోడవడంతో న్యూఢిల్లీలో గాలి గరళంగా మారుతోంది. రోజు రోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. కేంద్ర వాతావరణ కాలుష్యనియంత్రణ మండలి గణాంకాల ప్రకారం విపరీతమైన వాయుకాలుష్యాన్ని సూచించే వాయునాణ్యతా సూచీ(ఏక్యూఐ) ఢిల్లీలో ఏకంగా 500 దాటింది. గురువారం ఢిల్లీలో 32 ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గురువారం ఢిల్లీవ్యాప్తంగా సగటున ఏక్యూఐ 428 కాగా జహంగీర్‌పురీలో 567, ఆనంద్‌విహార్, పంజాబీ బాగ్‌ల్లో 465గా నమోదైంది. ఢిల్లీలో గురువారం ఉష్ణోగ్రత కేవలం 16.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. శీతాకాలం కావడంతో జనాలకు రోడ్లపై వెళ్తుంటే ముందు ఏముందో కనిపించనంతగా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. దట్టమైన పొగ కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 300లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 10 విమానాలను దారిమళ్లించారు. రన్‌వేపై 400 మీటర్ల తర్వాత ఏముందో కనిపించనంతగా దృశ్యగోచరత(విజిబిలిటీ) తగ్గిపోయింది. దీనికారణంగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ చాలా కష్టంగా మారింది. దీంతో మీరు ప్రయాణించబోయే విమానాల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారాన్ని సంబంధిత ఎయిర్‌లైన్స్ నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ప్రయాణికులకు సూచించింది. పలు రైళ్ల రాకపోకలపైనా పొగమంచు, వాయుకాలుష్యం ప్రభావం పడింది. వాయునాణ్యత దారుణంగా పడిపోవడంతో ఢిల్లీవ్యాప్తంగా ఏక్యూఐను ఇంకా మూడో ‘తీవ్రం’ కేటగిరీలోనూ కొనసాగిస్తున్నారు. గ్రాప్–3 నిబంధనలు అమల్లోకి వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో కట్టడి చర్యల్లో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 నియమనిబంధనలను కాలుష్య నియంత్రణ మండలి అమల్లోకి తెచి్చంది. శుక్రవారం నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో వీటిని కఠినంగా అమలుచేస్తామని వాయునాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) గురువారం తెలిపింది. విద్యుత్, సీఎన్జీ, భారత్–6 ప్రమాణాల డీజిల్ బస్సులు మినహా ఇతర అంతర్రాష్ట బస్సులను ఎన్సీఆర్ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి అనుమతించబోరు.చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమానాల రాకపోకలపై ప్రభావం నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది. గనుల తవ్వకాన్నీ ఆపేస్తారు. ఢిల్లీసహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లాల్లో భారత్–3, భారత్–4 ప్రమాణాల డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యధిక రద్దీ సమయాల్లో రోడ్లపై నీటిని చిలకరించనున్నారు. ఎవరికి వారు బైకులు, సొంత కార్లలో కాకుండా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని సీఏక్యూఎం సూచించింది. ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంతోపాటు తరగతులను కోల్పోకూడదనే ఉద్దేశంతో ఐదోతరగతి వరకు ప్రైమరీ పాఠశాల క్లాసులను ఆన్లైన్లో చేపట్టాల్సి ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి చెప్పారు. -
అమెరికా కొత్త ఆంక్షలు!
అనుకున్నది సాధించటం కోసం, మాట వినని దేశాలను దారికి తెచ్చుకోవటం కోసం ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించటం అమెరికాకు అలవాటైన విద్య. దాన్ని సహేతుకంగా వినియోగిస్తున్నామా... ఆశించిన ఫలితాలు వస్తున్నాయా దుష్పరిణామాలు పుట్టుకొస్తున్నాయా అనే ఆలోచన దానికి ఎప్పుడూ రాలేదు. ‘ప్రపంచంలో అగ్రజులం, మన మాట చెల్లుబాటు కావాలంతే...’ అన్న పట్టింపే అధికం. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి తోడ్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలపైనా, వ్యక్తులపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఇందులో మన దేశానికి సంబంధించి 19 ప్రైవేటు సంస్థలున్నాయి. ఇంకా ఈ జాబితాలో చైనా, మలేసియా, థాయ్‌లాండ్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితరాలున్నాయి. ఈ దేశాలన్నీ రష్యాకు ఉపకరణాలు, విడిభాగాలు పంపుతున్నాయనీ, వీటితో ఆయుధాలకు పదునుపెట్టుకుని రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తోందనీ అమెరికా ఆరోపణ. వీటిల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విమాన విడిభాగాలూ ఉన్నాయంటున్నది. పరాయి దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఏ దేశానికైనా హక్కుంటుంది. కానీ ఆ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలూ, ద్వైపాక్షిక ఒప్పందాలూ వగైరా చూసుకోవటం, అంతకుముందు సంబంధిత దేశాలతో చర్చించటం కనీస మర్యాద. అమెరికా ఎప్పుడూ ఈ మర్యాద పాటించిన దాఖలా లేదు.ఎప్పుడూ స్వీయప్రయోజనాలే పరమావధిగా భావించే అమెరికా తన విదేశాంగ విధాన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి ఆంక్షల్ని ఆయుధంగా మలుచుకోవటం పాత కథే. అయితే ఈమధ్యకాలంలో ఇది బాగా ముదిరిందని ఒక అధ్యయనం చెబుతోంది. దాని ప్రకారం మొదటి ప్రపంచయుద్ధానికీ (1914–18), 2000 సంవత్సరానికీ మధ్య అమెరికా 200కు పైగా ఆంక్షలు విధించిందని తేలింది. చిత్రంగా అటు తర్వాత ఈ రెండు దశాబ్దాలపైగా కాలంలో ఈ ఆంక్షలు తొమ్మిదిరెట్లు పెరిగాయని ఆ అధ్యయనం వివరిస్తోంది. అంటే ఎనిమిది దశాబ్దాల కాలంలో అమెరికా విధించిన ఆంక్షల సంఖ్య చాలా స్వల్పం. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థికాంశాలు... ఒకటేమిటి అనేకానేక అంశాల విషయంలో ఈ ఆంక్షల జడి పెరిగిపోయింది. క్యూబా, వెనెజులా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాలు ఈ ఆంక్షల పర్యవసానాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. అసలు అవతలి దేశంనుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పకుండానే వీటిని వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాఫల్య వైఫల్యాలను అమెరికా గమనంలోకి తీసుకుంటున్నదా లేదా అనే సంశయం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ మొత్తం ఆంక్షలవల్ల నెరవేరిన ప్రయోజనాలు ఆశించిన లక్ష్యాల్లో 34 శాతం దాటవన్నది ఆ అధ్యయన సారాంశం. ఈ ఆంక్షలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయని ప్రపంచాన్ని నమ్మించి ఆ దేశంపై దండెత్తిన అమెరికా అంతకుముందూ ఆ తర్వాత దాన్ని ఆంక్షల చక్రబంధంలో బంధించింది. అందువల్ల పసిపిల్లలకు పాలడబ్బాలు మొదలుకొని ప్రాణావసరమైన ఔషధాల వరకూ ఎన్నో నిత్యావసరాలు కరువై లక్షలమంది మృత్యువాత పడ్డారు. తాను ఆంక్షలు విధించటంతో సరిపెట్టక మిత్రులైన పాశ్చాత్య దేశాలను కలుపుకోవటం అమెరికా విధానం. అంతా అయినాక, ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ ఉసురు తీశాక అక్కడ రసాయన ఆయుధాలున్నాయనటం పచ్చి అబద్ధమని తేలింది. మరి లక్షలమంది జనం ఉసురు తీసిన పాపం ఎవరిది? ఇరాన్లో సరేసరి... అక్కడ తన అనుకూలుడైన ఇరాన్ షా పదవీ భ్రష్టుడైంది మొదలుకొని ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఇందువల్ల మన దేశం సైతం ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఈ అర్థరహిత ఆంక్షల్ని దాటుకుని, నష్టం కనిష్ట స్థాయిలో ఉండేలా తెలివిగా వ్యవహరించే దేశాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2017–2021 మధ్య యూరప్ దేశాలకు రష్యాతో ఉన్న వాణిజ్యం ఉక్రెయిన్ యుద్ధం తర్వాత 5 శాతం తగ్గింది. అదే సమయంలో రష్యాకు ఆర్మేనియా, యూఏఈ, కజఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, హాంకాంగ్‌లతో వాణిజ్యం పెరిగింది. మరోపక్క ఈ దేశాలన్నిటితో యూరప్ దేశాల వాణిజ్యం ఎన్నో రెట్లు పెరిగింది. అంటే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న సరుకంతా ఈ దేశాలు యూరప్ దేశాలకు తరలిస్తున్నాయి. ఇక ఆంక్షల ప్రయోజనం ఏం నెరవేరినట్టు? రష్యా నుంచి మన ముడి చమురు దిగుమతులు భారీగా పెరగటం, యూరప్ దేశాలకు శుద్ధిచేసిన చమురునూ, గ్యాస్‌నూ మన దేశం విక్రయించటం ఇటీవలి ముచ్చట.అసలు ఆంక్షల వల్ల ఒరిగేది లేకపోగా నష్టం ఉంటుందని అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్ మిత్రదేశం. అసలే అమెరికాలో స్థిరపడిన ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర విషయంలో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. అవి మరింత దిగజారేలా ఆంక్షలకు దిగటం నిజంగా ప్రయోజనాన్ని ఆశించా లేక నాలుగురోజుల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో గొప్పలు చాటుకోవటానికా అన్నది అర్థంకాని విషయం. ఒకపక్క ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిలువరించటం కోసమని తనకు తోచినట్టు చేసుకుపోతున్న అమెరికా... గాజా, వెస్ట్‌బ్యాంక్, లెబనాన్లలో రోజూ వందలమందిని హతమారుస్తున్న ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు నోరెత్తటం లేదు? తనవరకూ అమలు చేసుకుంటూ పోతానంటే అమెరికా విధించిన ఆంక్షలపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ అదే పని అందరూ చేయాలని శాసించటం తెలివితక్కువతనం. ఈ ఇంగితజ్ఞానం అమెరికాకు ఎప్పటికి అలవడుతుందో?! -
HYD: నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు..కారణమిదే..
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు,పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉన్నందునే ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల దాకా నెల రోజులు సభలు,సమావేశాలు,ధర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163(పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించినట్లు ఆదేశాల్లో తెలిపారు.కాగా, ఇటీవల సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడిపై దాడి ఘటన తర్వాత అల్లర్లు జరగడం తెలిసిందే. దీనికి తోడు గ్రూప్-1 విద్యార్థులు, మూసీ నిర్వాసితులు, బెటాలియన్ పోలీసుల వరుస ఆందోళనలతో హైదరాబాద్‌లో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజా ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: జన్వాడ రేవ్‌పార్టీ సంచలనం.. అర్ధరాత్రి పోలీసులకు ఆదేశాలు -
గగనతలం మూసి మళ్లీ తెరిచిన ఇరాన్
టెహ్రాన్:ఇరాన్‌పై దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్ అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం(అక్టోబర్7) ఉదయం 6 గంటల దాకా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాలను ఇరాన్ రద్దు చేసింది .అయితే విమానాల భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత విమాన సర్వీసులన్నింటినీ పునరుద్ధరించినట్లు సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు.అక్టోబర్ 7 సందర్భంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందేమోనన్న అనుమానంతోనే ఇరాన్ తన గగనతలంలో విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.గతేడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి వేల మందిని చంపేశారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ అటు హమాస్ ఇటు హెజ్బొల్లా గ్రూపులపై దాడులు చేస్తూనే ఉంది. ఈ తీవ్రవాద గ్రూపులన్నీ ఇరాన్ స్నేహితులే కావడం గమనార్హం. ఇదీ చదవండి: ఏడువైపులా శత్రువులతో పోరాడుతున్నాం: ఇజ్రాయెల్ -
వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. పోలీసుల ఆంక్షలు
సాక్షి,తిరుపతి జిల్లా : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో వచ్చే నెల 24 తేదీ వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని అన్నారు.ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు. తిరుమల పర్యటనలో వైఎస్ జగన్శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ఈ శనివారం(సెప్టెంబర్ 28) ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. వైఎస్ జగన్ సైతం తిరుమలలో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రే ఆయన తిరుమల చేరుకోనున్నారు. శనివారం ఉదయమే వైఎస్ జగన్ స్వామివారిని దర్శించుకుంటారు. -
నమాజ్ వేళ దుర్గా పూజ మైకులు ఆపండి
ఢాకా: షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు, ఆంక్షలు పెరిగాయన్న వార్తల నడుమ దుర్గాపూజకూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోంది. ముస్లింలు నమాజ్, అజాన్ వేళల్లో దుర్గామాత మండపాల వద్ద పూజా కార్యక్రమాలు నిశ్శబ్దంగా జరగాలని, ఎలాంటి సంగీత వాయిదాల శబ్దాలు వినిపించడానికి వీల్లేదని తాత్కాలిక సర్కార్ గురువారం హుకుం జారీచేసింది. దేశంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నమాజ్, అజాన్ సమయాల్లో దుర్గాపూజ మండపాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టమ్‌లను వాడకూడదని, సంగీత పరికరాలను వాయించకూడదని బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి చెప్పారు. -
అణచివేతపై భగ్గుమన్న స్టీల్‌ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ఉద్యమంపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై కార్మిక లోకం భగ్గుమంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనకు కార్మికులు పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు చూస్తున్నాం. పోలీసులు అనుమతి తీసుకున్న తర్వాత ధర్నా చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఉద్యమకారులకు దువ్వాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నడు నోటీసులు ఇవ్వలేదన్న కార్మికులు.. ప్రభుత్వం మారితే రూల్స్ మారుతాయా అంటూ పోలీసులను కార్మికులను ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యమానికి పూర్తిగా సహకరించింది. స్టీల్ ప్లాంట్స్‌ను కాపాడుతామన్న చంద్రబాబు పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకోవాలన్నారు.రాస్తారోకోకు అనుమతి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన కార్మికులు.. అవసరమైతే అరెస్టు చేసుకోవాలన్నారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. పోలీసుల నోటీసులు లెక్కచేయకుండా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలు అరెస్ట్ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పెద్దల సూచనతో కార్మికుల రాస్తారోకోను పోలీసులు నిరీర్వర్యం చేశారు. కార్మికులను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున సీఐఎస్ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు పవన్ కల్యాణ్ నిలబెట్టుకోలేదని కార్మికులు మండిపడుతున్నారు. 3 నెలలు సమయం ఇచ్చిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారి కృషి చేయలేదు. అమరావతిపై చూపిస్తున్న శ్రద్ధను స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చూపించలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రుణమాఫీకి ఆంక్షలేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలుకోసం విడుదల చేసిన మార్గదర్శకాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అందరికీ రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు ఇప్పుడిలా కొర్రీలు పెట్టడం ఏమిటని.. ఇలాగైతే లక్షలాది మంది రైతులకు రుణమాఫీ అందకుండా పోతుందని రైతులు, రైతు సంఘాల నేతలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆచరణలోకి వచ్చేసరికి ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కొర్రీలు పెడుతోందని మండిపడుతున్నారు. చాలా మందికి రేషన్‌కార్డులు లేవంటూ..ప్రధానంగా రేషన్‌కార్డు ద్వారానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొనడంపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. లక్షలాది మంది రైతులకు రేషన్‌కార్డులు లేవని.. వేర్వేరు కుటుంబాలుగా విడిపోయి పంట రుణాలు తీసుకున్న వారికి విడిగా రేషన్‌కార్డులు రాలేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. రేషన్‌కార్డు లేనివారికి రుణమాఫీ వర్తించకపోవడం, పాత రేషన్‌కార్డుల్లో ఒకే కుటుంబంగా ఉన్నవారందరికీ కలిపి రూ.2లక్షలలోపే రుణమాఫీ చేయడం వల్ల లక్షల మందికి తీవ్రంగా అన్యాయం జరుగుతోందని పేర్కొంటున్నారు.ఆధార్ లింకేజీ సమస్యతోనూ..బ్యాంకు రుణఖాతా, పాస్‌బుక్ డేటా, రేషన్‌కార్డు డేటాలను లింక్ చేసి.. ఆధార్ ఒకటిగా ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొనడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవన్నీ సరిగా లేని, ఆధార్ లింక్ కాని రైతులు లక్షల మంది ఉన్నారని.. వారికి రుణమాఫీ వర్తించకపోతే ఎలాగనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం 12 లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. అలాగే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని, ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. మరి వీరి పరిస్థితి ఏమిటని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.పీఎం కిసాన్ నిబంధనలతో కష్టమే!ఇక పీఎం కిసాన్ నిబంధనలనూ పరిగణనలోకి తీసుకుంటే.. మరికొన్ని లక్షల మంది రుణమాఫీకి అర్హత కోల్పోతారని రైతులు అంటున్నారు. పీఎం కిసాన్ పథకంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆదాయపన్ను చెల్లించేవారిని మినహాయించారు. ఇందులో ఆదాయ పన్ను చెల్లించేవారిలో అనేక మంది ప్రైవేటు ఉద్యోగులు, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అలాంటి వారు గ్రామాల్లో తీసుకున్న పంట రుణాలు కూడా మాఫీ కాని పరిస్థితి ఉంటుందని రైతు సంఘాల నేతలు అంటున్నారు.ఆర్థిక భారం తగ్గించుకునే దుష్ట ప్రయత్నంరుణమాఫీ కోసం ప్రభుత్వం పెట్టిన కొర్రీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే దుష్ట ప్రయత్నం. రేషన్‌కార్డులు, పాస్ పుస్తకాలు లేని రైతులు లక్షల్లో ఉన్నారు. ధరణి సమస్యల వల్ల 15 లక్షల మందికి పాస్ పుస్తకాలు రాలేదు. పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఉంటేనే రుణమాఫీ అనడం సరికాదు. రుణాలు రెండు లక్షలకుపైగా ఉంటే.. ఆ అదనపు మొత్తాన్ని రైతులు చెల్లించాకే రుణమాఫీ చేస్తామనడం తప్పు. రీషెడ్యూల్ చేసిన రుణాలను మినహాయించడం సరికాదు. కటాఫ్ తేదీల మధ్య ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేయాలి. కౌలుదారులకు, జేఎల్జే, ఎస్ హెచ్‌జీ గ్రూపులకు రుణమాఫీ వర్తింప చేయ కపోవడంతో వారికి నష్టం జరుగుతుంది. – సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ నాయకులుపీఎం కిసాన్ నిబంధనలతో పెరగనున్న రుణమాఫీ అనర్హులుపీఎం కిసాన్ డేటాకు జోడించడం వలన చాలా మంది రైతులు రుణమాఫీ అర్హత కోల్పోతారు. రేషన్‌కార్డులను బట్టి కుటుంబాన్ని నిర్ణయించడం వల్ల లక్షల మందికి నష్టం జరుగుతుంది. కరువులు, వరదల వల్ల నష్టపోయిన రైతులు రుణాలను రీషెడ్యూల్ చేసుకుంటే వారికి రుణమాఫీ వర్తించని పరిస్థితి. రెండు లక్షలకు మించి రుణం ఉంటే.. ఆపైన ఉన్న మేర అప్పు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందనే కూడా దారుణం. ప్రభుత్వం వెంటనే ఈ మార్గదర్శకాలను సవరించాలి. – పోతినేని సుదర్శన్‌రావు, తీగల సాగర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులురైతుల్లో అసంతృప్తి రగులుతుందిరుణమాఫీ అమలుకు కొత్తగా షరతులు, నిబంధనలు విధించడం భావ్యం కాదు. రేషన్‌కార్డులతో ముడిపెట్టడం, స్వల్పకాలిక పంట రుణాలకే ఇస్తామనడం వంటివి పొరపాటు. దీనివల్ల రుణమాఫీ కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతుంది. ఇప్పటికే విద్యార్థులు, నిరుద్యోగ యువతలో అసంతృప్తి పెరుగుతుండగా.. ప్రభుత్వ తీరుతో ఇప్పుడు రైతుల్లో అసంతృప్తి రగిలే అవకాశాలు ఉన్నాయి. – డి.పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకుడు -
ఎంపీ మిథున్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలపై ఆంక్షలు
సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతి భద్రతల పేరుతో వారి పర్యటనలకు అడ్డు చెబుతున్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు కూటమి నేతల దాడుల్లో నష్టపోయిన వారిని పరామర్శించి, భరోసా కల్పించాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిర్ణయించారు.ఆదివారం పార్లమెంట్ సమావేశాలు ఉండవు కాబట్టి ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఇక్కడి నుంచి పుంగనూరుకు వెళ్లే సమయంలో పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకుని అక్కడికి వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఎంపీకి నోటీసులు ఇచ్చేందుకు గోడలు దూకి హడావుడి చేశారు. తిరుపతిలోని వకుళామాత ఆలయానికి కూడా వెళ్లడానికి వీలు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.పర్యటిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని సాకు చెప్పారు. అంతటితో ఆగని పోలీసులు.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసేందుకు వచ్చిన నియోజకవర్గ ప్రజలను సైతం లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. వంద మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, పెద్దిరెడ్డి నివాసంలోకి ఎవరూ వెళ్లేందుకు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. ఇదే సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. తమ ఆదేశాలను పాటించకపోతే కేసులు పెడతామని బెదిరించారు. నా నియోజకవర్గానికి నేను వెళ్లకూడదా?ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, గతంలో ఎన్నడూ లేని సంస్కృతికి తెరలేపారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు. నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ బస్సు కంపెనీ రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పుంగనూరుకు ఏ పరిశ్రమలు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజక వర్గంలో పర్యటించకుండా, ప్రజల్ని కలవకుండా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేసీబీలు తీసుకొచ్చి వైఎస్సార్సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలను ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.నియోజకవర్గంలో పేదల ఆవులు కూడా ఎత్తుకెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం. కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం. మా వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? నా నియోజకవర్గంలో నేను పర్యటించకూడదా? ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీకి 40 శాతం మంది ఓటేశారని, వారందరినీ రాష్ట్రం నుంచి తరిమేస్తారా?’ అని నిప్పులు చెరిగారు. అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నప్పటికీ, ఇలాంటివి ఎప్పుడూ లేవని, బాబు ట్రాప్‌లో పడొద్దని హితవు పలికారు. గతంలో పోలీసులపై దాడి చేసిన చల్లా బాబు జైలుకు వెళ్లారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం తాను అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికే రాంప్రసాద్ తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు.పుంగనూరులో ఉద్రిక్తత పుంగనూరు: ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు తమ సొంత నియోజకవర్గాలలో తిరగరాదని హెచ్చరికలు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న ఘటనలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆదివారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో ధర్నా చేపట్టి, నల్లజెండాలతో నిరసనకు దిగారు.ఎమ్మెల్యే, ఎంపీలు రాకూడదంటూ దూషణల పర్వం కొనసాగించారు. సుమారు రెండు గంటల సేపు హైడ్రామా సాగింది. ఈ నెల15న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటన సమయంలో కూడా కూటమి నేతలు ఇలాగే అడ్డుకున్నారు. కూటమి నేతల తీరుతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ఎంపీ మిథున్‌రెడ్డిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశామని తెలపడంతో కూటమి శ్రేణులు శాంతించారు. -
సాక్షి వద్దు..మీడియాపై ఆంక్షలు
-
పల్నాడులో 144 సెక్షన్ ముగిసింది
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో విధించిన 144 సెక్షన్ అమలు ముగిసిందని కలెక్టర్ శ్రీకేశ్ బి. లత్కర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నరసరావుపేటలోని కలెక్టరేట్లో ఎస్పీ మలికా గార్గ్, జేసీ శ్యాంప్రసాద్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో 28 రోజులు 144 సెక్షన్ అమలు చేశామని, శాంతి భద్రతలు అదుపులోకి రావడంతో ఆ నిబంధన ఎత్తేశామని చెప్పారు. ర్యాలీలు, సమావేశాలకు మాత్రం పోలీసుల అనుమతి తప్పనిసరి అని అన్నారు. కౌంటింగ్ తరువాత జిల్లాలో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా మళ్లీ ఆంక్షలు విధిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ సమయంలో గొడవలతో జిల్లాకు మచ్చ పడినప్పటికి, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగి జిల్లాకు తిరిగి మంచిపేరు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా కౌంటింగ్ ముగిసిన జిల్లాల్లో పల్నాడు ముందుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో 13,739 మంది సిబ్బంది, కౌంటింగ్‌లో 2,136 మంది పాల్గొన్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో 86.5 శాతం ఓటింగ్ నమోదు చేసిన ఓటర్లను ప్రత్యేకంగా అభినందించారు.దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ మలికా గార్గ్ కౌంటింగ్ ముగిసిన తరువాత జిల్లాలో అక్కడక్కడా గొడవలు జరుగుతున్నాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ హెచ్చరించారు. గత రెండు రోజుల్లో గొడవలకు దిగిన వారిపై 46 కేసులు నమోదు చేసి, 140 మందిని అరెస్ట్ చేశామన్నారు. ప్రభుత్వ భవానాలపై రంగులు, విగ్రహాలు నచ్చకపోతే స్థానిక సంస్థలలో తీర్మానాలు చేసి అధికారికంగా మార్చాలని, చట్టాలను చేతుల్లోకి తీసుకోరాదన్నారు. సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. గ్రామాలలో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి గొడవలు జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలింగ్ సమయంలో జిల్లాలో 168 కేసులు నమోదు చేసి 1,338 మందిని అరెస్ట్ చేశామని, త్వరలో ఛార్జిïÙట్లు వేసి తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు. -
ఇక ఆ బ్యాంక్ యాప్ వాడుకోవచ్చు.. ఆర్బీఐ ఊరట
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ఆర్బీఐ ఊరట కలిగించింది. బీవోబీ వరల్డ్ మొబైల్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు తాజాగా బీవోబీకు అనుమతినిచ్చింది.బీవోబీ వరల్డ్ యాప్ ద్వారా వినియోగదార్లను చేర్చుకోరాదంటూ 2023 అక్టోబర్ 10న ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వర్తించే మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా వినియోగదార్లను చేర్చుకుంటామని బీవోబీ తెలిపింది.'బీవోబీ వరల్డ్' యాప్ అనేది పెద్ద సంఖ్యలో కస్టమర్ల కోసం ఒక ప్రాథమిక ఛానెల్, వీడియో కేవైసీ ద్వారా ఖాతా తెరవడాన్ని సులభతరం చేస్తుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఓ మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ని ఆర్బీఐ నిషేధించడం ఇదే తొలిసారిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో, కొత్త కస్టమర్లను డిజిటల్‌గా ఆన్‌బోర్డ్ చేయకుండా కోటక్ బ్యాంక్‌ను కూడా ఆర్బీఐ నిషేధించింది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ ఉల్లిపాయల ఎగుమతి విధానాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తక్షణమే అమలులోకి వచ్చేలా కనీస ఎగుమతి ధరను మెట్రిక్ టన్నుకు 550 డాలర్లు (రూ.45,860)గా నిర్ణయించింది.ఈమేరకు విదేశీ వాణిజ్య విధానంలో సవరణలు చేస్తున్నట్లు మే 4 నాటి నోటిఫికేషన్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) పేర్కొంది. మే 3 నుంచి ఉల్లిపై ప్రభుత్వం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. దీంతో 40 శాతం సుంకంతో ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది.ప్రస్తుతం ఉల్లి ఎగుమతిపై నిషేధం ఉంది. అయితే మిత్ర దేశాలైన యూఏఈ, బంగ్లాదేశ్‌లకు మాత్రం నిర్దిష్ట పరిమాణంలో ఉల్లి ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది ఆగస్టులో ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. 2023 డిసెంబర్లో ఎగుమతి నిషేధం విధించిన దాదాపు ఐదు నెలల తర్వాత ఏప్రిల్ 26న, మహారాష్ట్ర నుంచి ప్రధానంగా ఆరు పొరుగు దేశాలకు 99,150 మిలియన్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. -
USA: రష్యాపై భారీ ఆంక్షలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డ రష్యా మీద అమెరికా, యూరోపియన్ యూనియన్ శుక్రవారం మరిన్ని ఆంక్షలకు తెర తీశాయి. ఈసారి కూడా ప్రధానంగా ఆ దేశ ఆర్థిక, రక్షణ, పారిశ్రామిక నెట్వర్కులను లక్ష్యం చేసుకున్నాయి. రష్యా, దాని సన్నిహితులపై ఏకంగా 500పై చిలుకు ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు! మతిలేని హత్యాకాండకు, వినాశనానికి పుతిన్ మూల్యం చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు భారీ ఆయుధాల తయారీ తదితరాలకు ఉపయోగపడే నిషేధిత వస్తువులను రష్యాకు ఎగుమతి చేసిన ఆరోపణలపై పలు విదేశీ కంపెనీలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ఈయూ సమాఖ్య ప్రకటించింది. నవాల్నీ కుటుంబంతో బైడెన్ భేటీ: అంతకుముందు రష్యా విపక్ష నేత దివంగత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా, కూతురు దషాతో బైడెన్ భేటీ అయ్యారు. నవాల్నీ మృతి పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘నవాల్నీ సాటిలేని ధైర్యశాలి. ఆయన పోరాటాన్ని యూలియా, దషా ముందుకు తీసుకెళ్తారని పూర్తి విశ్వాసముంది’’ అన్నారు. నవాల్నీ మృతదేహానికి గోప్యంగా తక్షణ అంత్యక్రియలు జరిపేందుకు అంగీకరించేలా జైలు అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తల్లి లుడ్మిలా ఆరోపించారు. ఆలస్యమైతే శవం కుళ్లిపోతుందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గురువారం కుమారుని మృతదేహాన్ని చూసిన అనంతరం ఆమె ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
లాభాలపై రూ. 500 కోట్ల ప్రభావం
న్యూఢిల్లీ: పేటీఎం పేమెట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల వల్ల తమ వార్షిక నిర్వహణ లాభాలపై రూ. 300–500 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చని ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం అంచనా వేసింది. పీపీబీఎల్ డిపాజిట్లను స్వీకరించకుండా విధించిన ఆంక్షలతో, కస్టమర్లు తమ వాలెట్లలో డబ్బును డిపాజిట్ చేసే అవకాశం లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. అయితే, లాభదాయకతను మెరుగుపర్చుకునే దిశగా తమ ప్రయాణం ముందుకు కొనసాగుతుందని వివరించింది. డిసెంబర్లో పీపీబీఎల్ ద్వారా 41 కోట్ల యూపీఐ రెమిటెన్సుల లావాదేవీలు జరిగాయి. పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌కి (ఓసీఎల్) పీపీబీఎల్‌లో 49 శాతం వాటాలు ఉన్నాయి. 50 శాతం లోపు మైనారిటీ వాటాలే ఉన్నందున దాన్ని అనుబంధ సంస్థగా కాకుండా అసోసియేట్ సంస్థగా పరిగణిస్తోంది. ఒక పేమెంట్స్ కంపెనీగా పీపీబీఎల్‌తో పాటు వివిధ బ్యాంకులతో ఓసీఎల్ కలిసి పని చేస్తోందని పేటీఎం తెలిపింది. తాజా పరిణామం కారణంగా ఇకపై పీపీబీఎల్‌తో కాకుండా ఇతర బ్యాంకులతో మాత్రమే ఓసీఎల్ పని చేస్తుందని వివరించింది. పదే పదే నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఫిబ్రవరి 29 నుంచి కస్టమర్ల ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లు మొదలైన వాటిల్లో డిపాజిట్లు, టాప్‌అప్‌లను స్వీకరించరాదంటూ పీపీబీఎల్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఈ ఫ్లైఓవర్లపై నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్ వేను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని శిల్పా లే అవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట, మైండ్‌స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైతలాపూర్, బాలానగర్ ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు వంతెనలను 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేస్తామని వెల్లడించారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా క్యాబ్, ఆటో డ్రైవర్లకు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతోపాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను వాట్సప్ నెంబర్ 94906-17346కు ఫిర్యాదు చేయవచ్చనని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్‌లలో మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో తాగి రోడ్డు ప్రమాద మరణానికి కారణం అయితే వారిపై మర్డర్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. . చదవండి: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు -
డిసెంబర్ 31 సెలబ్రేషన్స్.. హద్దు మీరొద్దు
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల బందోబస్తుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. త్రీస్టార్, అంతకు మించి స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, బార్లు న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహణకు ముందస్తు పోలీసు అనుమతులు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకే కార్యక్రమాలు నిర్వహించాలని, సమయం దాటితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలివీ.. ►ప్రతి ఈవెంట్ నిర్వహణ, భద్రత, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. వేదిక ప్రవేశం, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్లేస్ వద్ద సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఈవెంట్లో అశ్లీల నృత్యాలు, సంజ్ఙలు ఇ తరత్రా చర్యలకు పాల్పడకూడదు. 45 డెసిబుల్స్‌కు మించి శబ్దాలు చేయకూడదు. ఈవెంట్లోకి ఎలాంటి తుపాకులు, ఆయుధాలను అనుమతించకూడదు. టపాసులు పేల్చకూడదు. సామర్థ్యానికి మించి పాస్‌లు, టికెట్లు, కూపన్లు జారీ చేయకూడదు. ►జంటల కోసం నిర్వహించే ఈవెంట్లలో మైనర్లను అనుమతించకూడదు. ఈవెంట్లలో ఎలాంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగించకూడదు. నియంత్రించడంలో విఫలమైన యాజమాన్యంపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయి. ఎక్సైజ్ విభాగం అనుమతించని సమయానికి మించి మద్యాన్ని విక్రయించకూడదు. మద్యం మత్తులో ఉన్న కస్టమర్లు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునేందుకు ఈవెంట్ నిర్వాహకులు డ్రైవర్లు, క్యాబ్‌లను ఏర్పాటు చేయాలి. డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన వాహనదారుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గరిష్టంగా 6 నెలల పాటు జైలు శిక్ష ఉంటుంది. -
HYD: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. ఇది తెలుసుకోండి..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి ఒంటి గంట వరకే కొత్త ఏడాది వేడుకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వవద్దని ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ఇక, తాజాగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు పది రోజుల మందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. కొత్త ఏడాది సందర్భంగా వేడుకలను రాత్రి ఒంటి గంట వరకే ముగించాలి. ప్రతీ ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరి. ఈవెంట్స్‌లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే. పార్టీల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు. అలాగే, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ధం ఉండకూడదు. ఈవెంట్స్‌లో కెపాసిటీకి మించి పాసులు ఇవ్వకూడదు. పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించవద్దు. లిక్కర్ సంబంధిత ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయి. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయవద్దు. -
ల్యాప్‌టాప్‌ల దిగుమతికి లైసెన్స్ అవసరం లేదు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ల్యాప్టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్య లు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దిగుమతిదారులను నిశితంగా గమనిస్తామని, తద్వారా దిగుమతులను పర్యవేక్షించవచ్చన్నారు. -
డిస్నీ+ హాట్‌స్టార్ యూజర్లకు షాక్! నవంబర్ 1 నుంచే..
నెట్‌ఫ్లిక్స్ బాటలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) కూడా తమ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పాస్వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పాస్వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలియజేస్తూ సబ్‌స్క్రైబర్ ఒప్పందానికి సంబంధించిన అప్డేట్లను కెనడాలోని సబ్స్క్రైబర్లకు ఈ-మెయిల్ చేసింది. ది వెర్జ్ కథనం ప్రకారం.. అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్‌పై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కఠిన ఆంక్షలను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి దాని వెబ్‌సైట్‌లోని హెల్ప్ సెంటర్‌ను కూడా అప్డేట్ చేసింది. యూజర్లు నిబంధనలను ఉల్లంఘించి పాస్వర్డ్ షేర్ చేయకుండా వారి అకౌంట్లను పర్యవేక్షించనుంది. కెనడియన్ సబ్‌స్క్రైబర్ ఒప్పందంలో "అకౌంట్ షేరింగ్"పై కొత్త నిబంధనను చేసింది. అందులో సబ్స్క్రయిబ్ అయిన యూజర్ల ఖాతాలను పర్యవేక్షిస్తామని కంపెనీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, సబ్‌స్క్రిప్షన్‌ను శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పాస్వర్డ్ షేరింగ్ ఆంక్షలు కెనడాలో 2023 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. భారత్‌తో సహా ఇతర దేశాల్లో కూడా ఈ ఆంక్షలను అమలు చేయాలని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భావిస్తోంది. -
తిరుమల ఘాట్ రోడ్లలో ఆంక్షల సడలింపు
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో 6 చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్థారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు. అక్టోబర్ 14న అంకురార్పణ, అక్టోబర్ 15–23 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సంసిద్ధతపై శాఖల వారీగా అధికారులతో ఈవో సమీక్షించారు. వైభవంగా పౌర్ణమి గరుడసేవ తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం కింద స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారిఆలయ సమీపంలో విమానాలు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో పైనుంచి విమానం మరోమారి వెళ్లిన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఉదయం 6.30, 8.15 గంటల సమయంలో విమానాలు ఆలయం పైభాగాన సమీపంలో వెళ్లాయి. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు. అయితే తరచూ తిరుమల పైభాగంలో పలు విమానాలు వెళుతున్నాయి. ప్రస్తుతం విమానాలు తిరుమలపై వెళ్లడంపై టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు. -
అనధికారిక లాక్ డౌన్లోకి సెంట్రల్ ఢిల్లీ!
ఢిల్లీ: జీ-20 సదస్సుకు రంగం సిద్ధమైంది. అధికారులు భారీ ఏర్పాటు చేశారు. దేశ రాజధానికి రానున్న ప్రతినిధులకు ప్రధాని మోదీ ఫొటోలతో స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. ఆంక్షలతో సెంట్రల్ ఢిల్లీలో అనధికార లాక్డౌన్ కొనసాగుతోంది. లక్షమంది భద్రతా సిబ్భందితో సెంట్రల్ ఢిల్లీ పరిసరాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. నేటి సాయంత్రం నుంచి సెప్టెంబర్ 10 వరకు సెంట్రల్ ఢిల్లీలోకి ఇతర వాహనాలు రాకుండా అనుమతిని నిషేధించారు అధికారులు. ఆంక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. అనుమతి ఉన్న వాహనాలు మినహా మిగిలిన వాటికి ఎంట్రీ ఉండదని అధికారులు తెలిపారు. जी-20 समिट ( दिनांक 9 व 10 सितंबर ) के दौरान, सुगम आवाजाही के लिए यातायात निर्देशिका। Traffic advisory in view of #G20Summit on Sept 9 & 10, 2023, to facilitate hassle free movement of vehicles. यातायात निर्देशिका/Traffic Advisory: https://t.co/fFgh2gcsAK pic.twitter.com/nEO09PFpf9 — Delhi Traffic Police (@dtptraffic) August 31, 2023 సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉండేవారు మినహా మిగిలిన వారికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లపై వారం రోజుల నుంచి ఢిల్లీ పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా భద్రత సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. భారత్ వేదికగా జీ-20 సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు దేశ రాజధానికి హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలు ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇదీ చదవండి: మరో వివాదం: ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
ఆ రెండు బ్యాంకులకు కొత్త ఆంక్షలు - కస్టమర్లు తప్పక తెలుసుకోవాల్సిందే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత కొంత కాలంలో విధులను సరిగ్గా నిర్వర్తించని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేయడం లేదా జరిమానాలు విధించడం వంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో భాగంగానే మరో రెండు బ్యాంకులకు గట్టి షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2023 ఆగష్టు 29న 'అజంతా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ & పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంక్'లపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలు ఆరు నెలల పాటు అమల్లో ఉండనున్నట్లు సమాచారం. బ్యాంకుల పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు బ్యాంకులు వాటి పనులను అవి స్వేచ్ఛగా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలని తలపెట్టినప్పుడు తప్పకుండా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంతే కాకుండా ఈ బ్యాంకులు తమ వెబ్సైట్లు లేదా ప్రాంగణాల్లో ప్రజల పరిశీలన కోసం RBI ఆదేశాల కాపీని ప్రదర్శించాల్సి ఉంది. ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ 'నిషా జగ్తియాని'? ఈ బ్యాంకులలో అకౌంట్ ఉన్నవారు ఎలాంటి రెన్యూవల్ చేసుకోకూడదు, కొత్త లోన్స్ కూడా మంజూరు చేసే అవకాశం లేదు. అంతే కాకుండా కస్టమర్ల నుంచి ఎలాంటి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్బీఐ ఆదేశించింది. అయితే ప్రాపర్టీలను విక్రయించడం లేదా ట్రాన్స్ఫర్ వంటివి చేయాలంటే ఆర్బీఐ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. బ్యాంకుల డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కింద రూ. 5 లక్షల వరకు బీమా క్లెయిమ్ స్వీకరించే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకులు పరిస్థితి మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు ఇలాగే ఉంటాయి, ఆ తరువాత పరిస్థిని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. -
టీటీడీ కీలక నిర్ణయం.. నడక మార్గంలో ఆంక్షలు ఇవే..
సాక్షి, తిరుమల: చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు నడక మార్గాల్లో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు టీటీడీ అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. ఇటీవల తిరుమలకు నడకదారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్లమార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. రేపటి(సోమవారం) నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్ని తర్వాతే చిన్నారులను పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతించనున్నట్టు టీటీడీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండవ ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్‌లకు నో ఎంట్రీ అని స్పష్టం చేసింది. మరోవైపు.. తిరుమలలో చిరుత కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి లక్షిత పై దాడిచేసిన చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు ప్రాంతాలలో బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. చిరుత సంచారంపై నిఘా వేశారు. ఇందుకోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. చిరుత జాడను కనిపెట్టడానికి దాదాపు 500 కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత భయంతో నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతోంది టీటీడీ అధికారులు. ఇది కూడా చదవండి: తిరుమల నడకమార్గంలో హైఅలర్ట్ జోన్ ప్రకటన -
ల్యాప్‌ట్యాప్‌లపై కేంద్రం ఆంక్షలు.. భారత ఐటీ హార్డ్ వేర్ రంగానికి మంచి రోజులు!
ఆధునిక భారతంలో నేడు ప్రతి చోటా అవసరమైన ల్యాప్‌ట్యాప్‌లు,ట్యాబ్లెట్ పీసీలు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల హఠాత్తుగా ఆంక్షలు విధించడం చాలా మందికి దిగ్భ్రాంతి కలిగించింది. అంతేకాదు, ఇంటర్నెట్ ఆధారిత లోకంలో ఇలాంటి కొత్త ‘నిత్యావసరాల’ దిగుమతులు సాఫీగా జరిగేలా చూడకుండా వాటి నిరంతర సరఫరాను ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అడ్డుకోవడం ఎంత వరకు సబబు? ఇలాంటి ఆంక్షలు దేశంలో ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు , పీసీల ఉత్పత్తి అవసరమైనంతగా పెరిగి, నాణ్యత గల కంప్యూటర్లు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయా? లేక ఈ దిగుమతుల పరోక్ష ‘నిషేధం ఉత్తర్వులు’ అనుకున్న లక్ష్యాలు సాధించకపోతే చివరికి పాత మార్గంలోనే పయనించాల్సి వస్తుందా? ఇలాంటి కీలక వినియోగ వస్తువుల దిగుమతిపై ఆంక్షలు పెట్టడానికి దేశ భద్రత ప్రధాన కారణమని ప్రకటించారు. దీంతో ఈ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్ సెట్లను స్థానికంగా తయారుచేసుకోవడంలో ఇండియా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. కాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హార్డ్ వేర్ రంగంలో (ల్యాప్‌ట్యాప్‌లు, పీసీలు,ట్యాబ్లెట్లు) ఆశించినంత అభివృద్ధి ఇంకా సాధించలేదు. భారతదేశంలో వినియోగించే దాదాపు 65 శాతం ల్యాప్ ట్యాప్‌లు, పీసీలను దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులపై ఆంక్షలతో దేశీయంగా ఈ ఐటీ హార్డ్ వేర్ ఉత్పత్తుల తయారీ గణనీయంగా పెంచాలనుకునే ఆశయం మంచిదే. మరి ఈ పని ఎప్పుడో చేసి ఉంటే ల్యాప్‌ట్యాప్‌లు, పీసీల తయారీ రంగం ఎంతో ముందుకు సాగేదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. దిగుమతులకు తగినంతగా అడ్డుకట్ట వేయడంలో జరిగిన విపరీత జాప్యం వల్ల సింగపూర్, హాంకాంగ్, వియత్నాం వంటి తోటి ఆసియా దేశాలు ఈ రంగంలో తిరుగులేని అభివృద్ధి సాధించాయి. మరోపక్క కంప్యూటర్ సాధనాల తయారీ, ఎగుమతిలో చైనా ఎదురులేని అగ్రశేణి దేశంగా తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. చైనా విషయంలో జాగరూకతే ఆంక్షలకు కారణమా? పైన చెప్పిన కంప్యూటర్ సాధనాల విషయంలో చైనాపై ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదని, అందుకే వాటి దిగుమతిపై ఆంక్షలు విధించడం తప్పనిసరి అని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా చర్యను వారు సమర్ధిస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ హఠాత్ నిర్ణయం వల్ల కంపెనీలు ఇబ్బంది పడకుండా మరి కొన్ని నెలలపాటు అవి లాప్టాప్ లు, పీసీలను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం కొత్త దిగుమతి లైసెన్సింగ్ విధానం ద్వారా వాటికి మార్గం చూపిస్తోంది. దీని వల్ల ఇప్పటికిప్పుడు ఈ కంప్యూటర్ సాధనాలకు కొరత ఏర్పడి, వాటి ధరలు పెరిగే ప్రమాదం ఉండకపోవచ్చని కూడా ఐటీ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈలోగా ఈ కీలక వినియోగ వస్తువుల ఉత్పత్తి దేశీయంగా తగినంతగా పెరిగే పరిస్థితులను సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పీసీలు, లాప్టాప్ లు వంటి ఐటీ హార్డ్ వేర్ రంగం కోసం ఈ ఏడాది మొదట్లోనే ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని కోసం బడ్జెట్లో రూ.17,000 కోట్లు కేటాయించింది. ఈ రంగంలోకి భారీ పెట్టుబడులను, బడా కంపెనీలను ఆకర్షించడానికి వీలుగా ఈ కొత్త పథకం కోసం దరఖాస్తు చేసుకునే గడువును కూడా పొడిగించింది. విద్య, వ్యాపారం, వినోద రంగాల్లో రోజురోజుకూ వినియోగం పెరుగుతున్న లాప్టాప్ లు, టాబ్లెట్లు, పీసీలు తయారీ దేశంలో శరవేగంతో పెరిగితేనే ఇండియా అవసరాలు తీరతాయి. ఈ రంగంలో అమలులోకి వచ్చే దిగుమతి ఆంక్షలకు తోడు కంప్యూటర్ సాధనాల అరకొర ఉత్పత్తి వల్ల దేశం ఐటీ హార్డ్ వేర్ రంగంలో ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి రాకుండా భారత ప్రభుత్వం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన సంఖ్యలో కంప్యూటర్లు, లాప్టాప్ ల తయారీతోపాటు ఈ ఐటీ ఉత్పత్తుల నాణ్యత, ధరలు అత్యంత కీలకమౌతాయి. ఈ రెండు అంశాలే దేశంలో ఐటీ హార్డ్ వేర్ ఉత్పత్తుల రంగం అభివృద్ధిని నిర్ణయిస్తాయి. అంతా అనుకున్నట్టు జరిగితే ప్రపంచస్థాయి ఐటీ కంప్యూటింగ్ సాధనాలకు ఇండియాయే ఓ పెద్ద సరఫరాదారు అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటి చైనా మాదిరిగానే ల్యాప్‌ట్యాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల ఎగుమతి కేంద్రంగా అవతరిస్తుంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
గద్దర్‌కు ఎన్నో ఆహ్వానాలు.. అయినా విమానం ఎక్కలేదు, విదేశాలకు పోలేదు
మంచిర్యాలఅర్బన్: గద్దర్ గళం..దేశవిదేశాల్లో ఎందరో అభిమానాన్ని చూరగొన్నది. ఆయన పాట వినేందుకు విదేశాల నుంచి అభ్యుదయ, సాంస్కృతిక సంఘాల నుంచి ఆహ్వానం వచ్చినా విమానం ఎక్కి వెళ్లలేకపోయారు. 1997, ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులు జరగ్గా, ఆరు బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. ఐదు బుల్లెట్లను తొలగించిన వైద్యులు, వెన్నుపూసలో ఉన్న మరో బుల్లెట్ తొలగిస్తే ప్రాణానికే హాని ఉంటుందని చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఆ బుల్లెట్ శరీరంలోనే ఉండిపోయింది. దేశంలో ఇతర రాష్ట్రాల పర్యటనకు ఎయిర్‌పోర్ట్‌కు గద్దర్ వెళ్లినా, తనిఖీల్లో స్కానర్‌లో బుల్లెట్ చూపడం, అధికారులకు సమాధానం చెప్పడంలో అనేకసార్లు ఇబ్బంది పడినట్టు తెలిసింది. శరీరంలో బుల్లెట్, కేసులు పాస్‌పోర్టు జారీకి అడ్డంకిగా మారాయి. దీంతో ఎన్ని ఆహా్వనాలు వచ్చినా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లలేకపోయారు. ► 1980 సమయంలో నక్సల్స్‌తో కలసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ► పీపుల్స్‌వార్ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలపు జననాట్యమండలి సభ్యుడిగా పనిచేశారు. ► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు. ► 1995లో పీపుల్స్‌వార్ పార్టీ గద్దర్‌ను బహిష్కరించింది. ఆయన తీవ్రంగా ఆవేదనకు గురవడంతో తిరిగి పార్టీలోకి ఆహా్వనించింది. 25 ఏళ్లుగా వెన్నులో బుల్లెట్‌తో గద్దర్‌పై చాలా సార్లు హత్యాయత్నాలు జరిగాయి. నల్లదండు ముఠా, బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ ముఠాలు ఆయనను చంపడానికి ప్రయత్నించాయి. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. గ్రీన్‌టైగర్స్ పేరుతో కొందరు ఆగంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన ప్రాణాలకు ప్రమాదమని ఒక బుల్లెట్‌ను వదిలేశారు. దీనితో దాదాపు 25 ఏళ్లుగా ఆ బుల్లెట్ గద్దర్ ఒంట్లోనే ఉండిపోయింది. ‘‘రాష్ట్ర అణచివేతకు చిహ్నంగా నా వెన్నెముకలో బుల్లెట్ అలాగే ఉంది. దానితో నాకు భయమేమీ లేదు, ఏ ప్రభావమూ పడలేదు. నా లక్ష్యాలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నా..పనిచేస్తూనే ఉంటా..’’ అని గద్దర్ తరచూ గుర్తు చేసుకునేవారు. -
ఆకస్మిక ఆంక్షలు: షాక్‌లో దిగ్గజ కంపెనీలు, దిగుమతులకు బ్రేక్!
ల్యాప్‌టాప్‌లు,కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం నిర్ణయం చైనా కంపెనీలతో సహా ,ఆపిల్, శాంసంగ్,హెచ్‌పీ లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో చైనా లైసెన్సు లేకుండానే చిన్న టాబ్లెట్ల నుంచి ఆల్ ఇన్ వన్ పీసీల దిగుమతులపై ఆంక్షలు ఆయా కంపెనీల ఆదాయంపై భారీగా ప్రభావం చూపనుంది. ల్యాప్‌టాప్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, మేకిన్‌ఇండియా, స్థానిక ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) లైసెన్స్‌లను తప్పనిసరి చేయడంతో ప్రపంచంలోని అతిపెద్ద పీసీ మేకర్స్, ఇతర కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. భారతదేశానికి ల్యాప్‌టాప్‌లు టాబ్లెట్ల కొత్త దిగుమతులను నిలిపివేశాయి. అయితే ఆకస్మిక లైసెన్సింగ్ ప్రకటించడం పరిశ్రమను అతలాకుతలం చేసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ సంస్థల బహుళ-బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఇది భారీ గండి కొడుతుందని అంచనా. రానున్న దీపావళి షాపింగ్ సీజన్,బ్యాక్-టు-స్కూల్ కాలం సమీపిస్తున్నందున డిమాండ్ పుంజుకోనున్న టైంలో లైసెన్సులను ఎలా త్వరగా పొందాలనే దానిపై సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) గ్లోబల్ ఇన్వెంటరీ, అమ్మకాల వృద్ధిని పునఃప్రారంభించడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న తయారీదారులకు ఈ అవసరం అదనపు తలనొప్పిని సృష్టిస్తుందనీ, ఫలితంగా దేశీయ లాంచ్‌లు ఆలస్యం కావడానికి లేదా విదేశీ సరుకులపై ఇప్పటికీ ఎక్కువగా ఆధారపడే కంపెనీల్లో ఉత్పత్తి కొరతకు దారితీయవచ్చనేది ప్రధాన ఆందోళన. కాగా దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ముఖ్యంగా చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో తీసుకున్న ఈ నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. మరోవైపు దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు ఇతర హార్డ్‌వేర్ తయారీదారులను ఆకర్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం 170 బిలియన్ రూపాయల ($2.1 బిలియన్) ఆర్థిక ప్రోత్సాహక ప్రణాళిక కోసం దరఖాస్తులను కోరుతున్న సంగతి తెలిసిందే. -
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులు: సంచలన నిర్ణయం
Restrictions on Imports కేంద్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు కంప్యూటర్ల దిగుమతిపై తక్షణమే ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి నేడు (ఆగస్ట్ 3 న) వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. పరిమితులు విధించిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో దిగుమతికి అనుమతి ఉంటుందని పేర్కొంది.బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై పరిమితులు వర్తించవు ఈ దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే అమలయ్యేలా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్లు ,అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై హెచ్ఎస్ఎన్ 8741 కింద ఈ పరిమితులు విధిస్తున్నట్టు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై ఆంక్షలు వర్తించవని మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాగేజీ నియమాలు భారత సరిహద్దులోకి ప్రవేశించే లేదా బయటికి వచ్చే ప్రతి ప్రయాణీకుడు కస్టమ్స్ నిబంధనలు పాటించాలి. అలాగే పోస్ట్ లేదా కొరియర్. దిగుమతులు వర్తించే విధంగా సుంకం చెల్లింపునకు లోబడి ఉంటాయి. అలాగే విదేశాల్లో రిపేర్ అయిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు సంబంధించి, వాటి రిపేర్‌కి ఇవ్వడానికి, తిరిగి తీసుకోవడానికి సంబంధించిన దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) సెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, బెంచ్‌మార్కింగ్ ఇతర సమయాల్లో దిగుమతిదారులు దిగుమతి లైసెన్స్ అవసరం లేకుండా సరుకుకు 20 వస్తువులను తీసుకురావచ్చు. అయితే, ఈ ఐటెమ్‌లు తప్పనిసరిగా నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగింలాలి. తిరిగి విక్రయించడానికి లేదు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరిన తర్వాత, ఉత్పత్తులను నాశనం చేయాలి లేదా తిరిగి ఎగుమతి చేయాలి. -
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్: లైసెన్స్ ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: కొన్ని రకాల బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతులపై కేంద్ర సర్కారు ఆంక్షలు విధించింది. అత్యవసరం కాని దిగుమతులను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్పత్తుల దిగుమతి విధానం తక్షణమే అమలులోకి వచ్చేలా ఉచిత నుంచి పరిమితంగా సవరించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక ప్రకటనలో పేర్కొంది. బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతి కోసం దిగుమతిదారు ఇకపై లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉండగా, దీన్ని ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. అయితే భారత్-యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పరిధిలో చేసుకునే దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించవని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే మధ్య కాలంలో ముత్యాలు, విలువైన, పాక్షిక విలువైన రాళ్ల దిగుమతులు 25.36 శాతం తగ్గి 4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో బంగారం దిగుమతులు కూడా దాదాపు 40 శాతం తగ్గి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. -
గోధుమ నిల్వలపై పరిమితులు
న్యూఢిల్లీ: పెరుగుతున్న గోధుమ ధరలను కట్టడి చేసేందుకు నిల్వలపై పరిమితులు విధించినట్లు కేంద్రం తెలిపింది. తక్షణమే అమల్లోకి రానున్న ఈ పరిమితులు 2024 మార్చి వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్ విక్రయ పథకం(వోఎంఎస్‌ఎస్) విధానం కింద సెంట్రల్ పూల్ నుంచి 15 లక్షల టన్నుల గోధుమలను ఈ నెలాఖరులోగా టోకు వినియోగదారులకు, వ్యాపారులకు అందజేయనున్నట్లు వివరించింది. నిల్వలు సరిపోను ఉన్నందున గోధుమల దిగుమతి విధానాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని తెలిపింది. గోధుమల ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పంచదార ఎగుమతులకు అనుమతి లేదని వెల్లడించింది. గోధుమల నిల్వలపై కేంద్రం చివరిసారిగా 2008లో పరిమితులు విధించింది. గత నెలతో పోలిస్తే గోధుమల మార్కెట్ ధరల్లో 8% పెరుగుదల నమోదు కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. గోధుమ వ్యాపారులు/హోల్ సేలర్లు 3 వేల టన్నుల వరకు, రిటైలర్లు 10 టన్నులు, మిల్లర్లయితే స్థాపిత సామర్థ్యంలో 75% వరకు గోధుమలను నిల్వ ఉంచుకోవచ్చని ఆయన చెప్పారు. వీరు ఎప్పటికప్పుడు నిల్వ సమాచారాన్ని ఆహారం, ప్రజాపంపిణీ శాఖ పోర్టల్‌లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. -
రాజు చుట్టూ ని‘బంధనాలు’.. ప్రతి రోజూ రాజభోగాలే అనుకుంటే పొరపాటే!
బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషిక్తుడయ్యాడు. ఒక దేశానికి రాజుగా కిరీటధారణ జరిగితే ఇక ప్రతి రోజూ రాజభోగాలు అనుభవించడమే అనుకుంటే పొరపాటే. విందు వినోదాలు, చుట్టూ వందిమాగధులు, ఏ చిన్న పనికైనా జీ హుజూర్ అనే సేవకులు ఇవన్నీ ఉన్నప్పటికీ మరిన్ని ఆంక్షల చట్రంలో బతకాల్సి ఉంటుంది. రాజు ప్రాణం ప్రజలకు ఎంతో విలువైనది. అందుకే భద్రతా కారణాలు, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలతో కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పా టించాలి. ఒక రకంగా బంగారు పంజరంలో బంధించినట్టుగా స్వేచ్ఛను కోల్పోవలసి ఉంటుంది. 70 ఏళ్ల క్రితం రాణి ఎలిజæబెత్ నాటి నిబంధనలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కింగ్ చార్లెస్ అవి ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించి తీరవలసిందే. కానుకల స్వీకరణ తప్పనిసరి బ్రిటన్ రాజ సంప్రదాయం ప్రకారం వారికొచ్చే కానుకల్ని తప్పనిసరిగా స్వీకరించాలి. దేశంలో వివిధ ప్రాంతాలు సందర్శించినప్పుడు ఇతర దేశాల పర్యటనలకి వెళ్లినప్పుడు రాజుపై గౌరవంతో చాలా మంది రకరకాల కానుకలు ఇస్తారు. వాటిని రాజు తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ ఆ కానుకలు ఏదైనా ప్రత్యుపకారం పొందడం కోసం ఇస్తూ ఉంటే మాత్రం రాజకుటుంబం వారు కానుకల్ని తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో వారి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. విలియంతో ప్రయాణించలేరు బ్రిటన్ రాజుతో పాటు వారసుడు కూడా ము ఖ్యమే. కింగ్ చార్లెస్ తర్వాత సింçహాసనం అధిష్టించే వారసత్వపు హక్కు కలిగిన ప్రిన్స్ విలి యమ్‌తో కలిసి ఆయన ఎక్కడికీ ప్రయాణించకూడదు. ఇద్దరూ వేర్వేరు విమానాలు, వాహనాల్లోనే వెళ్లాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉండకూడదన్న భావనతో ఈ నిబంధన తీసుకువచ్చారు. వస్త్రధారణ రాజు ధరించే వస్త్రధారణకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దౌత్యపరంగా అనుకూలంగా ఉండే డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. రాజు ఏ దేశానికి వెళితే ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే దుస్తులే ధరిస్తారు. ఇక రాజు తనతో పాటు ఎప్పుడూ నలుపు రంగు వస్త్రాలు తీసుకువెళతారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అనుకోని పరిస్థితుల్లో అంత్యక్రియలకి హాజరుకావాల్సి వస్తే అప్పుడు వేసుకోవడం కోసం నల్ల బట్టలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. షెల్ ఫిష్ తినలేరు రాజుతో సహా బ్రిటన్ రాచకుటుంబీలు అందరూ షెల్ఫిష్కు దూరంగా ఉండాలి. ఫుడ్ పాయిజనింగ్‌కి అవకాశం ఉన్న తినకూడదన్న నిబంధనలైతే ఉన్నాయి. ఇక రాజు భద్రతే అత్యంత కీలకం కాబట్టి అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఓటుకి దూరం బ్రిటన్ రాజు ఎప్పుడూ రాజకీయాల్లో తటస్థ వైఖరి అవలంబించాలి. ఏ పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడకూడదు. అయితే పలు సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉన్నప్పటికీ రాచ కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఓటింగ్‌కి కూడా దూరంగా ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు ఎన్ని రకాల ఆంక్షలున్నా బ్రిటన్ రాజు ఒక్కరికే ఉన్న సదుపాయం ఒకటుంది. అదే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం. కారు డ్రైవ్ చేయాలని అనుకుంటే ఆయనకు లైసెన్స్ అక్కర్లేదు. పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా ప్రయాణించవచ్చు. సెల్ఫీలు ఆటోగ్రాఫ్‌లు ఉండవు ప్రజలెవరైనా రాజుతో కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చట పడితే అది కుదిరేపని కాదు. ఎవరికీ ఆటోగ్రాఫ్‌లు ఇవ్వకూడదు. అలా ఇస్తే రాజు సంతకం ఫోర్జరీ చేస్తారన్న భయం ఉంది. సెల్ఫీలు దిగకూడదు. రాజు కుటుంబ సభ్యులందరికీ ఇదే వర్తిస్తుంది. అయితే ప్రోటోకాల్స్‌లో ఈ నిబంధనని అధికారికంగా ఇంకా చేర్చలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సుప్రీం కోర్టులో కరోనా కలకలం
సాక్షి, ఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేగింది. పలువురు న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులకు వైరస్ సోకింది. దీంతో ఇవాళ్టి(సోమవారం) నుంచి కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా బారినపడ్డ న్యాయమూర్తుల్లో స్వలింగ వివాహల చట్టబద్ధతపై పిటిషన్లపై విచారణ చేపట్టిన ఐదుగురు సభ్యుల బెంచ్‌లోని ఓ న్యాయమూర్తికి సైతం కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ్టి విచారణపై అనుమానాలు నెలకొన్నాయి. -
ట్విటర్ కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి ట్వీట్లు కనిపించవు..
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా ఉండే ట్వీట్లకు పరిమితులు వర్తింపచేయనున్నట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్ వెల్లడించింది. ఇకపై రూల్స్‌ను అతిక్రమించే ట్వీట్లను చూపడంపై (విజిబిలిటీ) ఆంక్షలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాలసీని అప్డేట్ చేసినట్లు వివరించింది. దీని ప్రకారం ముందుగా, విద్వేషపూరిత ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయనిపించే ట్వీట్లను వడగట్టేందుకు ట్విటర్ విజిబిలిటీ ఫిల్టర్‌ను ఉపయోగించనుంది. ఆ తర్వాత ఇతరత్రా విభాగాలకు కూడా దీన్ని విస్తరించనుంది. అభ్యంతరకరమైన ట్వీట్లపై, వాటి విజిబిలిటీ మీద ఆంక్షలు విధించినట్లుగా అందరికీ కనిపించేలా ముద్ర వేస్తారు. అయితే, ఆయా ట్వీట్లను ట్విటర్ తప్పుగా వర్గీకరించిందని వాటిని పోస్ట్ చేసిన యూజర్లు గానీ సంప్రదించిన పక్షంలో పునఃసమీక్షిస్తామని ట్విటర్ పేర్కొంది. అయితే, ట్వీట్ విజిబిలిటీని పునరుద్ధరించేందుకు గ్యారంటీ అంటూ ఉండదని స్పష్టం చేసింది. సాధారణంగా తాము వాక్స్వాతంత్య్రానికి పెద్ద పీట వేస్తామని, సెన్సార్షిప్ భయం లేకుండా తమ అభిప్రాయాలు, ఐడియాలను చెప్పేందుకు యూజర్లందరికీ హక్కులు ఉంటాయని ట్విటర్ తెలిపింది. అదే సమయంలో వారందరికీ కూడా తమ ప్లాట్‌ఫామ్ సురక్షితమైనదిగా ఉండేలా తీర్చిదిద్దేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. -
సూపర్మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే!
లండన్: బ్రిటన్‌లోని ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థలు కొన్ని పండ్లు, కూరగాయల కొనుగోళ్లపై పరిమితులు విధించాయి. అననుకూల వాతావరణ పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా కొరత తలెత్తింది. నెల రోజుల వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయంటూ ప్రభుత్వం హెచ్చరించడంతో సూపర్ మార్కెట్ యాజమాన్యాలు ఈ చర్యను ప్రకటించాయి. టమాటాలు, క్యాప్సికం, దోసకాయలు, బ్రకోలి, క్యాలిఫ్లవర్ తదితరాల సరఫరా తక్కువగా ఉండటంతో వీటిని ఒక్కో వినియోగదారుకు మూడు వరకే విక్రయిస్తామని టెస్కో, అస్డా, మోరిసన్స్, ఆల్డి సంస్థలు తెలిపాయి. ఆఫ్రికా, యూరప్‌ల్లో ప్రతికూల వాతావరణం, ఇంధన ధరలు పెరగడం, బ్రిటన్, నెదర్లాండ్స్‌లో గ్రీన్హౌస్ వ్యవసాయంపై ఆంక్షలు కారణంగా పండ్లు, కూరగాయల దిగుబడి, రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను -
నేను కూడా బీఫ్ తింటా.. దానిపై ఆంక్షలేవు: బీజేపీ అధ్యక్షుడి సంచలన ప్రకటన
మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మౌరీ సంచలన ప్రకటన చేశారు. మేఘాలయాలో దాదాపు ప్రతిఒక్కరూ గొడ్డు (బీఫ్) మాంసం తింటారని వెల్లడించారు. బీఫ్ తినడంపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఇది తమ ఆహార అలవాటు, సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ విషయంలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై తనేం మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘మేఘాలయలో ఉన్న వారందరూ బీఫ్ తింటారు. దానిపై ఎలాంటి నియంత్రణ లేదు. నేను కూడా తింటాను. మేఘాలయాలో బీఫ్‌పై నిషేధం లేదు. ఇది ప్రజల జీవనశైలి, దీనిని ఎవరూ ఆపలేరు. భారతదేశంలో కూడా అలాంటి నియమం లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు కొన్ని చట్టాలను ఆమోదించాయి. మేఘాలయలో, మాకు కబేళా ఉంది. ప్రతి ఒక్కరూ ఆవు లేదా పందిని తీసుకొని మార్కెట్‌కు తీసుకువస్తారు. వీటిని పరిశుభ్రంగా ఉంచుతారు. అందుకే ఇక్కడి వారికి తినే అలవాటు ఉంది’ అని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి తొమ్మిదేళ్లు అవుతోందని.. ఈ కాలంలో దేశంలో ఏ చర్చిపై కూడా దాడులు జరగలేదని ప్రస్తావించారు. అలాగే బీజేపీ అధికారంలోఉన్న గోవా, నాగాలాండ్‌లో కూడా చర్చిలపై అలాంటి ఘటనలేవి చోటుచేసుకోలేదని గుర్తు చేశారు. బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, టీఎంసీ చేస్తున్న ఆరోపణలు కేవలం ఎన్నికల ప్రచారం కోసమేనని మండిపడ్డారు.. మేఘాలయలో క్రిస్టియన్లే అధికంగా ఉంటారని అందరూ చర్చికి వెళ్తారని ఎర్నెస్ట్ తెలిపారు. ఈసారి తప్పకుండా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ సాధిస్తుందన్నారు. కాగా మేఘాలయలో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: బిగుస్తున్న ఉచ్చు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం -
నా కూతురి పేరు మరెవరికీ ఉండొద్దు.. కిమ్ హుకుం..
ప్యాంగాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంటే ప్రపంచ దేశాలే కాదు సొంత ప్రజలు కూడా భయపడుతారు. ఆయన నిర్ణయాలు అలా ఉంటాయి మరి. తాజాగా కిమ్ ప్రభుత్వం విధించిన కొత్త ఆంక్షలు ఉత్తరకొరియాలో కొంతమంది అమ్మాయిలు, మహిళలకు ఇబ్బందికరంగా మారాయి. కిమ్ కూతురు 'జు ఏ' పేరు దేశంలో మరెవరికీ ఉండొందట. అలాంటి పేరు ఎవరికి ఉన్నా.. వారు వెంటనే మార్చుకుని వేరే పేరు పెట్టుకోవాలట. 'జు ఏ' అనే పేరుతో ఉన్న మహిళతో పాటు, అదే పేరు పెట్టుకున్న 12 ఏళ్ల చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం నోటీసులు పంపింది. వెంటనే పేర్లు మార్చుకోవాలని సూచించింది. జనన ధ్రువీకరణ పత్రం కూడా మార్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో జు ఏ పేరు ఉన్న వారు మాకేంటీ బాధ.. అనుకుంటున్నారు. గత్యంతరం లేక పేరు మార్చుకుంటున్నారు. కిమ్ కూతురు జు ఏ కొద్ది రోజులగా తండ్రితో పాటు ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో కిమ్ తర్వాత ఉత్తరకొరియాను పాలించబోయేది ఆమే అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఉత్తరకొరియాలో ప్రజలు పేర్లు మార్చుకోవాలని అధినేతలు హుకుం జారీ చేయడం ఇది తొలిసారేం కాదు. కిమ్ II- సంగ్ పాలనలో కూడా ప్రజలు ఆయన పేరును పెట్టుకోకూడదనే రూల్ ఉండేది. కిమ్ జోంగ్ ఉన్ అధికారం చేపట్టాక కూడా తన పేరుతో పాటు, తన భార్య పేరు సోల్-జు పేరు ఎవరికీ ఉండొద్దని నిబంధన తీసుకొచ్చారు. అప్పటికే ఆ పేరు ఉన్నవారు మార్చుకోవాలని తేల్చిచెప్పారు. చదవండి: బైడెన్ ఆర్థిక బృందంలో భారతీయుడు.. -
31st నైట్.. మందుబాబులూ జాగ్రత్త..!
-
విజయవాడ, తిరుపతిలో న్యూ ఇయర్ ఆంక్షలు
-
విజయవాడ: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
సాక్షి, విజయవాడ: నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ప్రకటించింది పోలీస్ శాఖ. ఈ మేరకు వేడుకలకు సంబంధించి ఆంక్షలను శుక్రవారం నగర సీపీ కాంతిరానా టాటా ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కేకులు కట్ చేస్తూ హడావిడి చేయడం లాంటి చర్యలు కుదరవని హెచ్చరించారు ఆయన. బార్ అండ్ రెస్టారెంట్లు అనుమతి ఇచ్చిన సమయానికి మించి తెరవకూడడదు. అలాగే డీజేలకు అనుమతి తీసుకోవాలి. ఈవెంట్స్ ఆర్గనైజర్లు, క్లబ్ లు, పబ్ ల నిర్వాహకులు పోలీసు అనుమతి తీసుకోవాలని, అర్ధరాత్రి 12 గంటల వరకు వేడుకలు నిర్వహించినా.. జనం మాత్రం ఒంటిగంటకల్లా ఇళ్లకు చేరుకోవాలని ముందస్తు సూచన చేశారు సీపీ. అలాగే.. ఫ్లై ఓవర్లు మూసేస్తామని, రాత్రిళ్లు రోడ్లపై తిరగడం కుదరదని ప్రజలకు తెలిపారు. విజయవాడలో 31 రాత్రి తర్వాత.. 144 సెక్షన్, సెక్షన్ 30 అమలులో అవుతుందని ప్రజలకు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర సీపీ స్పష్టం చేశారు. -
ఆ దేశాల కరోనా ఆంక్షలపై చైనా సీరియస్.. ఇదేం తీరు..?
బీజింగ్: చైనాలో కరోనా కేసులు ఆందోళనకరస్థాయిలో పెరిగిన కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. చైనా నుంచి వచ్చే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి నిబంధన తీసుకొచ్చాయి. అయితే ఈ విషయంపై చైనా తీవ్రంగా స్పందించింది. తమ దేశం నుంచి వచ్చినవారికే పరీక్షలు నిర్వహించడం వివక్షపూరితమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్లుగా కరోనా నియంత్రణకు తాము చేపట్టిన చర్యలను నిర్వీర్యం చేసినట్లేనని వ్యాఖ్యానించింది. అమెరికా, దక్షిణ కొరియా, ఇటలీ, జపాన్, తైవాన్ సహా భారత్ కూడా చైనా ప్రయాణికులపై ఇటీవలే ఆంక్షలు విధించింది. చైనా నుంచి వచ్చేవారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రభుత్వ మీడియా స్పందించింది. అయితే చైనా వ్యాఖ్యలు చూస్తుంటే వింతగా అన్పిస్తోంది. మొన్నటివరకు ప్రపంచంలో ఏ దేశమూ చేయని విధంగా మూడేళ్లపాటు కఠిన కరోనా ఆంక్షలు అమలు చేసింది. విదేశాల నుంచి వెళ్లేవారు కచ్చితంగా క్వారంటైన్లో ఉండి, కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే అనుమతించింది. ఈనెల మొదట్లోనే ఆంక్షలు సడలించింది. జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధన ఎత్తివేస్తున్నట్లు చెప్పింది. కానీ.. కరోనా పరీక్షమాత్రం తప్పనిసరి చేసింది. అలాంటి చైనా ఇప్పుడు వేరే దేశాలు ఆంక్షలు అమలు చేస్తే మాత్రం వివక్షపూరితం అనడం హాస్యాస్పదంగా ఉంది. డిసెంబర్ 7 నుంచి చైనాలో జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేశారు. ఆ తర్వాత నుంచి కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. చైనా మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తోంది. చదవండి: సమాచారం దాచి.. సంక్షోభం పెంచి -
కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనాలో తొలిసారి మరణాలు!
బీజింగ్: కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి జీరో కోవిడ్ పాలసీ పేరుతో చైనా ప్రభుత్వం అత్యంత కఠినతరమైన ఆంక్షలు అమలు చేసింది. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిబంధనలను డిసెంబర్ 7న ఎత్తివేసింది. ఆంక్షలు సడలించిన తర్వాత చైనాలో తొలి కరోనా మరణాలు నమోదైనట్లు సింగపూర్ డైలీ వెల్లడించింది. చైనా ప్రభుత్వ మీడియాలో పనిచేసిన మాజీ జర్నలిస్టులు ఇద్దరు కోవిడ్ కారణంగా చనిపోయినట్లు తెలిపింది. డిసెంబర్ 8న ఒకరు, డిసెంబర్ 15న మరొకరు వైరస్‌కు బలైనట్లు చెప్పింది. అయితే చైనా ఆరోగ్య శాఖ మాత్రం ఈ మరణాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఆంక్షలు సడలించిన తర్వాత ఎవరైనా వైరస్ కారణంగా చనిపోయారా? అనే విషయాలను ప్రభుత్వం వెల్లడించడం లేదు. జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేశాక కరోనా కేసులను ట్రాక్ చేయడం సాధ్యం కావట్లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ చేతులెత్తేసింది. చదవండి: రెండేళ్ల బాలుడ్ని అమాంతం మింగేసిన నీటిగుర్రం.. చివరకు ఏమైందంటే? -
చైనాకు ఎదురు తిరిగితే అంతే...ఆ యువతి ఇంకా నిర్బంధంలోనే..
చైనా అనుసరిస్తున్న కఠినమైన జీరో కోవిడ్ పాలసీని ప్రజలు వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున బహిరంగంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నిరసకారులను అరెస్టు చేసి నిసనలను కట్టడి చేసేలా ఉక్కుపాదం మోపాలనుకుంది. సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత ఎక్కువ అవ్వడంతో చైనా ప్రభుత్వం ఇక గత్యంతరం లేని స్థితిలో వెనక్కి తగ్గి ఆంక్షలు సడలించింది. ఆ తర్వాత నాటి నిరసనలు కారణంగా అరెస్టు అయినా ఆందోళకారులను ఒక్కోక్కరిని నెమ్మదిగా విడుదల చేసింది. ఐతే యాంగ్ జింగ్ అనే 25 ఏళ్ల మహిళ డిసెంబర్ 4న నిరసనల్లో పాల్గొనడంతో అరెస్టయ్యింది. కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఆమె నిర్బంధించబడి సుమారు 9 రోజుల అయ్యిందని ఆమె తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. ఆ యువతి జైలులో ఎలా ఉందోనని ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అంతేగాదు సదరు యువతి రూమ్మేట్ని ఆమె మాత్రమే ఎందుకు నిర్బంధంలో ఉందని యువతి తల్లి ప్రశ్నించగా...ఆమె నిరసనలో పాల్గొన్నప్పుడూ తన ఐడింటిటీని చూపించలేదని తెలిపింది. దీంతో పోలీసుల బృందం తన రూమ్ వద్దకు వచ్చి ఫోన్, ల్యాప్‌టాప్‌ని తీసుకువెళ్లారని ఆ యువతి స్నేహితురాలు ఆమె తల్లితో చెప్పింది. ఆ యువతి తల్లి ఆమె కూతురు కోసం డిసెంబర్ 8న ఒక లాయర్ వెంట బెట్టుకుని ఆమె కేసును టేకప్ చేసిన పోలీస్ అధికారిని కలిసేందుకు అవకాశం లేదని ఆమె వాపోయింది. కనీసం ఆమె గురించి సమాచారం కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతమైంది. (చదవండి: ఆంక్షలను ఎత్తివేశాక..చైనాలో ఘోరంగా పెరుగుతున్న కరోనా కేసులు) -
బ్యారెల్ @ 60 డాలర్లు.. రష్యా తిరస్కరణ.. ఎగుమతులు నిలిపేస్తామని హెచ్చరిక
బ్రసెల్స్: ఉక్రెయిన్‌పై 9 నెలలుగా రష్యా చేస్తున్న యుద్ధానికి నిధుల లభ్యతను వీలైనంత తగ్గించడం. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలకు అడ్డుకట్ట వేయడం. ఈ రెండు లక్ష్యాల సాధనకు యూరోపియన్ యూనియన్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ధరకు బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితి విధించింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఈయూ సభ్య దేశాల మధ్య చివరి నిమిషంలో ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ఇందుకు అంగీకారం కుదిరింది. అమెరికా, జపాన్, కెనడా తదితర జీ 7 దేశాలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఇది సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఈయూ, జీ 7 దేశాలకు చమురును బ్యారెల్ 60 డాలర్లు, అంతకంటే తక్కువకు మాత్రమే రష్యా విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని రష్యా తిరస్కరించింది. ఈయూ తదితర దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది. ‘‘ఈ ఏడాది నుంచి యూరప్ రష్యా చమురు లేకుండా మనుగడ సాగించాల్సి వస్తుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్, అంతర్జాతీయ సంస్థల్లో రష్యా శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉల్యనోవ్ హెచ్చరించారు. ఈయూ పరిమితితో పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదంటూ నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. ‘‘రష్యా ఇప్పటికే భారత్, చైనా తదితర ఆసియా దేశాలకు అంతకంటే తక్కువకే చమురు విక్రయిస్తోంది. రష్యాను నిజంగా బలహీన పరచాలనుకుంటే బ్యారెల్‌కు 50 డాలర్లు, వీలైతే 40 డాలర్ల పరిమితి విధించాల్సింది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఈయూ నిర్ణయం ప్రభావం రానున్న రోజుల్లో యూరప్ దేశాలపై, రష్యాపై, మిగతా ప్రపంచంపై ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. రూటు మార్చిన రష్యా రష్యా ప్రపంచంలో రెండో అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు. సగటున రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యేదాకా యూరప్ దేశాలే దానికి అతి పెద్ద చమురు మార్కెట్. వాటి కఠిన ఆంక్షల నేపథ్యంలో కథ మారింది. యూరప్ ఎగుమతుల్లో చాలావరకు భారత్, చైనాలకు మళ్లించింది. అయితే కరోనా కల్లోలం నేపథ్యంలో చైనా చమురు దిగుమతులను బాగా తగ్గించుకుంటోంది. ఇదిలాగే కొనసాగితే రష్యా తన చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి రావచ్చు. లభ్యత తగ్గి ధరలకు మళ్లీ రెక్కలు రావచ్చు. చలికాలం కావడంతో చమురు, సహజవాయువు వినియోగం భారీగా పెరిగే ఈయూ దేశాలను ఈ పరిణామం మరింతగా కలవరపెడుతోంది. ‘‘చమురు ధరలు ఏ 120 డాలర్లో ఉంటే 60 డాలర్ల పరిమితి రష్యాకు దెబ్బగా మారేది. కానీ ఇప్పుడున్నది 87 డాలర్లే. రష్యాకు ఉత్పాదక వ్యయం బ్యారెల్‌కు కేవలం 30 డాలర్లే! ’’ అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నల్ల మార్కెట్‌కూ తరలించొచ్చు... ఆర్థిక మందగమనం దెబ్బకు ఒకవేళ సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా చమురు వాడకం తగ్గినా ఆ మేరకు ఉత్పత్తిని తగ్గించడం రష్యాకు సమస్యే అవుతుంది. ఎందుకంటే ఒకసారి చము రు ఉత్పత్తి ఆపితే పునఃప్రారంభించడం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. కాబట్టి మధ్యేమార్గంగా ఇరాన్, వెనెజువెలా దారిలోనే రష్యా కూడా బ్లాక్ మార్కెట్లో చమురును అమ్ముకునే అవకాశాలూ లేకపోలేదని భావిస్తున్నారు. పైగా దీనిద్వారా హెచ్చు ఆదాయం కూడా సమకూరుతుంది. ఈ కోణంలో చూసినా ఈయూ పరిమితి వాటికే బెడిసికొట్టేలా కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023 తొలి త్రైమాసికాంతం నాటికి చమురు ధరలు ఒకవేళ బాగా పెరిగితే పరిమితి రష్యాపై ఎంతోకొంత ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. -
చైనాలో ‘జీరో కోవిడ్’ ఎత్తివేస్తే ఏం జరుగుతుంది?
బీజింగ్: కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకుంటున్నప్పటికీ.. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో వైరస్ కట్టడికి ‘జీరో కోవిడ్’ ఆంక్షలు అమలు చేస్తోంది చైనా. అయితే, రోజుల తరబడి ఇంట్లోనే నిర్భందించటంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని ప్రజలు రోడ్లపైకి వస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో జీరో కోవిడ్ ఆంక్షలను సడలిస్తోంది డ్రాగన్. ఓవైపు కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఆంక్షలను సడలిస్తే పెను విపత్తు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో పాటు వైద్య వ్యవస్థపై పెను భారం పడుతుందంటున్నారు. చైనాలో ఇప్పటికీ చాలా మందికి వ్యాక్సిన్ అందలేదు. హెర్డ్ ఇమ్యూనిటీ సైతం లేని తరుణంలో కోవిడ్ ఆంక్షలను సడలించి పూర్తి స్వేచ్ఛ ఇస్తే దేశంలో ఎన్ని మరణాలు సంభవిస్తాయనే అంశంపై పరిశోధకులు అంచనా వేశారు. శుక్రవారం నాటికి చైనాలో 5,233 మరణాలు, 331,952కేసులు నమోదయ్యాయి. పరిశోధకుల అంచనా ప్రకారం.. ► 20లక్షలకుపైగా మరణాలు.. హాంకాంగ్ తరహాలో పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు సడలిస్తే మెయిన్‌ల్యాండ్ చైనాలో 20 లక్షలలకుపైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని గ్వాంగ్జీ ప్రాంతంలో ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ జౌ జియాటంగ్ అంచనా వేశారు. గత నెలలో షాంఘై జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో ఈ విషయాలను పేర్కొన్నారు. మరోవైపు.. కరోనా కేసులు సైతం 23 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ► దేశంలో టీకాల పంపిణీని వేగవంతం చేయకుండా, ఆరోగ్య సదుపాయలు మెరుగుపరచకుండా జీరో కోవిడ్ పాలసీని చైనా ఎత్తివేస్తే దాదాపు 15 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని చైనా, అమెరికాకు చెందిన పలువురు పరిశోధకులు గత మే నెలలోనే అంచనా వేశారు. కరోనా పీక్ దశకు చేరిన సమయంలో ఐసీయూలకు 15 రెట్ల డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సినేషన్‌పై దృష్టి పెడితే మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ► జీరో కోవిడ్ ఆంక్షలను పూర్తిగా తొలగిస్తే 13 నుంచి 21 లక్షల మంది మరణించే అవకాశం ఉందని బ్రిటిష్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ కంపెనీ ఎయిర్ఫినిటీ పేర్కొంది. టీకాలు, బూస్టర్ రేటు, హైబ్రిడ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండటమే అందుకు కారణంగా తెలిపింది. ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి జాంబీ వైరస్!.. పెను విపత్తుకు దారి తీయొచ్చా? -
లాక్డౌన్ ఇంకా ఎన్నాళ్లు? చైనాలో వెల్లువెత్తిన నిరసనలు..
బీజింగ్: అత్యంత అరుదుగా నిరసనలు చేపట్టే చైనీయుులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. జిన్జియాంగ్ ప్రావిన్స్ ఉరుమ్కిలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. జీరో కోవిడ్ పాలసీ పేరుతో చాలా రోజులుగా అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఎత్తివేయాలని భారీ ర్యాలీ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గురువారం రాత్రి ఉరుమ్కిలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ నిబంధనల కారణంగా అందులోని నివసించేవారు బయటకు వెళ్ల పరిస్థితి లేదు. దీంతో 10 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై చైనా అధికారి ఒకరు నిర్లక్ష్యంగా మాట్లాడారు. వీళ్లు తమను తాము కాపాడుకోలేని రీతిలో చాలా బలహీనంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. శుక్రవారం రాత్రి భారీ నిరసనలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారుు. చైనా జాతీయ గీతం ఆలపిస్తూ నినాదాలు చేశారు. 100 రోజులకుపైగా అమలు చేస్తున్న కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే అగ్నిప్రమాదంలో చనిపోయిన వారికి పూలు, క్యాండిల్స్‌తో నివాళులు అర్పించారు. Rare protests broke out in China's Xinjiang region opposing prolonged COVID-19 lockdowns, according to footage seen on social media https://t.co/tHXkz5lRon pic.twitter.com/0phutiecBX — Reuters (@Reuters) November 26, 2022 Thread/1 Massive protest happened in Ulumuqi,Xinjiang,China after more than 100 days zero-covid city lockdown. People are chanting ‘stop lockdown’ ‘we are human being’ pic.twitter.com/trQhDSZLXr — 巴丢草 Bad ї ucao (@badiucao) November 25, 2022 చైనాలో మైనారిటీలైన వీగర్లు ఎక్కువగా ఉండే జిన్జియాంగ్లో కోటి మంది నివసిస్తున్నారు. ఉరుమ్కి నగరంలో 40 లక్షల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో 100 రోజులకుపైగా కఠిన కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఈ క్రమంలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది చనిపోయారు. BREAKING: A large crowd has surrounded the Municipal Government building in Urumqi (Xinjang’s largest city). It’s a rare case of a joint Uyghur & Han protest against the authorities. It comes after 10 people died in fire in a high-rise under lockdown.pic.twitter.com/lmXcHQ5Ggp — Visegrád 24 (@visegrad24) November 25, 2022 ఉరుమ్కిలో చేపట్టిన నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. చైనా రాజధాని బీజింగ్ సరిహద్దు ప్రాంతంలోనూ జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. చదవండి: బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్! -
బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్!
లండన్: బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల రూపంలో పోటెత్తుతున్న వలసల కట్టడికి ప్రధాని రిషి సునాక్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిగువ శ్రేణి డిగ్రీ చదివేందుకు, డిపెండెంట్లుగా ఉండేందుకు వస్తున్న వారందరినీ నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని కార్యాలయ ఉన్నతాధికారి వెల్లడించారని బీబీసీ పేర్కొంది. ‘‘వలసలు బ్రిటన్ను వేధిస్తున్నాయి. 2021లో 1,73,000గా ఉన్న వలసలు ఈ ఏడాది 5,04,000కు పెరిగాయి. విదేశీ విద్యార్థుల్లో చైనాను భారతీయులు వెనక్కినెట్టారు. కానీ వీరిని తగ్గిస్తే ఆ సీట్లను బ్రిటన్ వర్సిటీలు స్థానిక విద్యార్థులకు తక్కువ ఫీజుకే ఇవ్వాల్సి ఉంటుంది. అవి భారీ ఆదాయాన్ని కోల్పోతాయి. ఆదాయం కాపాడుకుంటూ, అంతర్జాతీయ విద్యార్థుల్ని తగ్గించుకోవడం సంక్షిష్టమైన అంశం’’ అని సునాక్ అధికార ప్రతినిధి శుక్రవారం అన్నారు. భారత విద్యార్థులు వీసా ముగిసినా బ్రిటన్‌లో తిష్ట వేస్తున్నారన్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ వ్యాఖ్యలు దీనికి నేపథ్యంగా భావిస్తున్నారు. -
కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి
సాక్షి, హైదరాబాద్: అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో తీవ్ర నష్టం కలుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ.40 వేల కోట్లకుపైగా గండిపడిందని, ఈ రాజకీయ ప్రేరేపిత, కక్షపూరిత విధానాలు సరికాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డిలను ఆదేశించారు. ఈ మేరకు వివరాలతో సీఎం కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలోని అంశాలివీ.. అకస్మాత్తుగా పరిమితులు మార్చి.. ‘‘ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ బడ్జెట్ అంచనాలను రూపొందించుకుంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్ఆర్బీఎం పరిమితులను ముందస్తుగా కేంద్రం విధిస్తోంది. 2022–23 ప్రారంభంలోనే తెలంగాణ ఎఫ్ఆర్బీఎం రుణాల పరిమితిని రూ.54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దానికి అనుగుణంగా రాష్ట్రం బడ్జెట్ అంచనాలను రూపొందించుకుంది. కానీ కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని రూ.39 వేల కోట్లకు కుదించడంతో రాష్ట్రానికి అందాల్సిన రూ.15వేల కోట్లు తగ్గాయి. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితికి అదనంగా 0.5 శాతం రుణాలు సేకరించుకునేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణకు మాత్రం ఈ అవకాశాన్ని ఇవ్వలేదు. వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక విద్యుత్ సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తామంటేనే 0.5 శాతం అదనపు రుణ పరిమితికి అనుమతిస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టింది. దీనితో మరో రూ.6 వేల కోట్ల రుణాలను సమీకరించుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది. ఎన్ని కష్టాలనైనా భరిస్తామని.. కానీ తెలంగాణ రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోబోమని సీఎం కేసీఆర్ కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.21 వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వ సంకుచిత విధానాల వల్ల నిలిచిపోయి రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది. అక్కడితో ఆగకుండా రాష్ట్రానికి రావాల్సిన రూ.20 వేల కోట్ల బడ్జెటేతర రుణాలను కూడా కేంద్రం నిలిపివేయించింది. ఈ అనాలోచిత విధానాలు, పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన నిర్ణయాలతో రాష్ట్రానికి రావాల్సిన రూ.40వేల కోట్లకుపైగా నిధులకు గండిపడింది. ఒప్పంద రుణాలూ నిలిపివేసి.. ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పలు ఆర్థిక సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నిధులు (రుణాలు) సమీకరిస్తోంది. కానీ కేంద్రం ఆ నిధులను కూడా కక్షసాధింపు నిబంధనలతో రాకుండా నిలిపివేయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ఆయా సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రగతి కోసం వారిచ్చే రుణాలను తిరిగి చెల్లించే ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నామని స్పష్టంగా వివరించారు. దీనిని అర్థం చేసుకున్న ఆర్థిక సంస్థలు రాష్ట్రం మీద భరోసాతో గత ఒప్పందాల మేరకు నిధులను విడుదల చేస్తున్నాయి. దేశ అభివృద్ధికి గొడ్డలిపెట్టు కేంద్రం అడుగడుగునా రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్భంధం చేసి ప్రగతికి అడ్డుపుల్లలు వేస్తోంది. కేంద్ర అసమర్థ, అనుచిత నిర్ణయాలతో సకాలంలో నిధులు అందక అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రాల ప్రగతి కుంటుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కేంద్ర తప్పుడు విధానాలు దేశాభివృద్ధికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం పొంచి ఉంది. పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన, అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలతో ఒక్క తెలంగాణ ప్రగతిని మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా కేంద్రం దిగజారుస్తోంది. రాజకీయ ప్రేరేపితమైన కక్షపూరిత దిగజారుడు విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల గొంతు కోస్తూ, నష్టపరుస్తూ, కేంద్రం సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తోంది..’’ అని సీఎంఓ ప్రకటనలో పేర్కొంది. కక్షసాధింపు చర్యలపైనా నిలదీసేలా.. కేంద్ర ఆంక్షలతో నిధులు అందకపోవడాన్ని ప్రజలకు వివరించడం కోసం అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయించినా.. ఇతర కీలక అంశాలు కూడా ఎజెండాలో ఉండనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం తెరమీదికి రాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. మరోవైపు మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొన్నిరోజులుగా ఆదాయపన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. దీనితో కేంద్రం సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోళ్లతోపాటు ఐటీ, ఈడీ సంస్థల ద్వారా దాడులకు పాల్పడుతోందనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వివరించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నాలు, తాము అడ్డుకున్న తీరును కూడా ప్రజలకు వివరించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ తేదీలు ఖరారు సీఎం కేసీఆర్ చెప్పిన మేరకు అసెంబ్లీ సమావేశాల తేదీలు ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ 2018లో రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇప్పటివరకు 11 సార్లు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించగా.. తొలిసారిగా శీతాకాలంలో సమావేశాలను నిర్వహిస్తోంది. -
COVID-19: చైనా సంచలన నిర్ణయం
బీజింగ్: కరోనా వైరస్ కట్టడి విషయంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కఠిన ఆంక్షలతో అక్కడి జనాలు చుక్కలు చూస్తున్నారు. అయితే ఏం జరిగినా సరే.. లాక్డౌన్, కఠిన ఆంక్షలపై వెనక్కి తగ్గేది లేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అక్కడి అధికారిక మీడియా ఈ విషయాన్ని ధృవీకరించింది. గత నెలలో జరిగిన అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం సైతం ఇదే నిర్ణయానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. చైనాలో గత రెండున్నరేళ్లుగా ప్రజలు కరోనా కట్టడి చర్యలతో అల్లలాడిపోతున్న సంగతి తెలిసిందే. ఆకలి బాధలతో పాటు మానసిక సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నారు. అయినాసరే కరోనా వైరస్ టెస్టులు, లాక్డౌన్ పేరిట అత్యంత కఠిన నిబంధనలను అమలు చేస్తోంది ఆ దేశం. అయితే.. ఎప్పటికప్పుడు వైరస్ రూపాంతరం చెందడం, కొత్త మ్యూటేషన్‌తో విజృంభిస్తుండడంతో ఆంక్షల సడలింపులను రద్దు చేస్తూ వస్తోంది అక్కడి ప్రభుత్వం. అయితే.. కరోనా ఆంక్షలను ప్రభుత్వం ఇప్పట్లో ఎత్తేసే ఆలోచనలో లేదని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకుడు వాంగ్ లిపింగ్ స్పష్టం చేశారు. ఆంక్షలను సడలించకపోగా.. మరింత కఠినతరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ ఆంక్షల విధింపు అనేది శాస్త్రీయబద్ధంగా ఉండబోతున్నట్లు తెలిపారాయన. ఈ మేరకు గత నెలలో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ భేటీలో.. పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. ఇదీ చదవండి: అన్నంత పనిచేస్తున్న పుతిన్ -
కరగాట్టంలో అశ్లీలత ఉండకూడదు: హైకోర్టు ఆంక్షలు
సాక్షి, చెన్నై: కరగాట్టంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. తమిళ సంప్రదాయ నృత్యాల్లో ప్రముఖమైనది కరగాట్టం. మదురై జిల్లా మేలపట్టి గ్రామానికి చెందిన మారిచ్చామి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో తమ గ్రామంలో మారియమ్మన్ ఆలయంలో ఈనెల 8న ఉత్సవాలు నిర్వహించడానికి నిశ్చయించామన్నారు. ఈ సందర్భంగా కరగాట్టం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను కోరామన్నారు. పోలీసులు భద్రత ఇవ్వడానికి ముందుకు రావడం లేదని, సంప్రదాయ కళల్లో ప్రధాన మైన కరగాట్టం అంతరించి పోకుండా ఉండేందుకే ఈ వేడుకలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి సుకుమార కురూప్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఆలయ ఉత్సవాలలో కరగాట్టం నిర్వహించడంపై కొన్ని నిబంధనలను న్యాయమూర్తి తెలియజేశారు. ఈ రకం నృత్యాలు చేసే సమయంలో అసభ్యకరమైన దుస్తులు, ద్వంద్వ అర్థాల మాటలు, అనాగరిక ప్రవర్తన ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: గంగ మీద ప్రమాణం చేద్దామని చెరువుకెళ్లి.. నీటిలో మునిగి.. -
బీజింగ్‌లో జిన్‌పింగ్ వ్యతిరేక బ్యానర్లు
బీజింగ్: చైనాలో మునుపెన్నడూ కనిపించని దృశ్యాలు.. సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అవుతున్నాయి. కరోనా కఠిన ఆంక్షలతో జనాలు తీవ్ర అసంతృప్తి.. అసహనంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌పై వ్యతిరేకత తారాస్థాయికి చేరుతోంది. తాజాగా ఏకంగా రాజధాని బీజింగ్ మహానగరంలో జిన్‌పింగ్ వ్యతిరేక బ్యానర్లు వెలిశాయి. అయితే.. అప్రమత్తమైన అధికారులు తొలగించినప్పటికీ అప్పటికే వాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. జిన్‌పింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, కొవిడ్-19 కఠిన ఆంక్షల్ని తొలగించాలని ఆ బ్యానర్లను ఓ ఫ్లై ఓవర్‌పై, మరికొన్ని కూడళ్లలో ఉంచారు. పైగా ఫ్లై ఓవర్‌పై వేలాడదీసిన బ్యానర్లకు కాస్త దూరంలో ఆకర్షణ కోసం మంటలు రాజేశారు. ‘‘కరోనా పరీక్షలు మాకొద్దు. మా ఆకలి తీరితే చాలు. లాక్డౌన్లు అక్కర్లేదు.. స్వేచ్ఛ కావాలి.. అందుకు జిన్‌పింగ్‌కు ఉద్వాసన పలకాలి’’ అంటూ బ్యానర్లను కట్టారు. జిన్‌పింగ్ వ్యతిరేక బ్యానర్లు తొలగిస్తున్న సిబ్బంది బీజింగ్‌తో పాటు హయిదియాన్లో, మరికొన్ని చోట్ల ఆ బ్యానర్లు వెలిశాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులను సైతం ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోతున్నారు అధికారులు. వీటిని ఏర్పాటు చేసిన వాళ్లను సాహసవీరులుగా పొగుడుతూ చైనా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ వెబ్‌లో పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని ఏర్పాటు చేసిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు అక్కడి అధికారులు. కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తైన దరిమిలా, జింగ్‌పిన్ మూడో దఫా అధ్యక్ష పగ్గాలు చేపడతాడనే ఊహాగానాల నడుమ.. ఈ వ్యతిరేక పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది. తాజాగా కొత్త వేరియెంట్ల కేసులతో మరోసారి లాక్డౌన్ విధిస్తోంది చైనా. ఇదీ చదవండి: అప్పుడే అయిపోలేదు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
దీపావళి బాణసంచా మోతపై షరతులు.. కేవలం ఆ 2 గంటలే!
సాక్షి, చెన్నై: దీపావళి రోజున కేవలం 2 గంటల మాత్రమే బాణసంచా కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగను ఈనెల 24న జరుపుకోనున్న విషయం తెలిసిందే. పండుగ వేళ బాణసంచా ఏఏ సమయాల్లో పేల్చాలో అనే వివరాలను అందులో వెల్లడించారు. ఈ మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే టపాకాయలు కాల్చాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు ఈ విషయంపై అవగాహన కలిగించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అలాగే, భారీ శబ్దంతో కూడిన బాణసంచా ఉపయోగించవద్దని, గ్రీన్ టపాసులనే పేల్చాలని సూచించారు. -
Iran anti-hijab protest: హిజాబ్ అల్లర్లతో...అట్టుడుకుతున్న ఇరాన్
దుబాయ్: ఇరాన్లో హిజాబ్ కల్లోలం చినికిచినికి గాలివానగా మారుతోంది. నిర్బంధ హిజాబ్ ధారణ నిబంధనను వ్యతిరేకిస్తూ వారం రోజులుగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు నానాటికీ మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు హిజాబ్‌లను చేబూని జెండాల మాదిరిగా ఊపుతూ భారీ సంఖ్యలో నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటంటూ నిరసిస్తున్నారు. ‘మాకు స్వేచ్ఛ కావాల్సిందే’ అంటూ వీధుల్లోకి వస్తున్నారు. ‘నియంత ఖొమేనీకి మరణమే’, ‘ముల్లాల పీడ వదలాల్సిందే’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బహిరంగంగా జుత్తు కత్తిరించుకోవడంతో పాటు హిజాబ్‌లను తగలబెడుతున్నారు. ఈ క్రమంలో రాజధాని టెహ్రాన్‌లో ఆందోళనకారులు ఓ పోలీసు వాహనానికి నిప్పు పెడుతున్న వీడియోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. పలుచోట్ల ఇరు వర్గాలు బాహాబాహికి దిగుతూ కన్పించారు. పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు కూడా రంగంలోకి దిగి నిరసనకారులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోయాయి. ‘ఓ దేవుడా! వాళ్లు విచక్షణారహితంగా కాల్చి పారేస్తున్నారు’ అని ఆక్రోశిస్తూ జనం చెల్లాచెదురుగా పారిపోతున్న దృశ్యాలు కొన్ని వీడియోల్లో కన్పిస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటిదాకా 26 మంది దాకా మరణించారని దేశ అధికారిక మీడియా సంస్థ చెబుతున్నా శుక్రవారమే ఏకంగా 30 మందికి పైగా బలైనట్టు తెలుస్తోంది. ఆందోళనకారుల పట్ల పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వెలిబుచ్చింది. అతి సమీపం నుంచి కాల్పులకు పాల్పడుతున్నారని ఆక్షేపించింది. ఇరాన్‌పై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. మరోవైపు అల్లర్లను నిరసిస్తూ ప్రభుత్వ అనుకూల ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. సర్కారు ఉక్కుపాదం నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ర్యాలీలు, ఆందోళనల పిలుపుకు ఆందోళనకారులు ప్రధానంగా ఆధారపడుతున్న ఇన్స్టాగ్రాం, వాట్సాప్ వంటివాటిపై ఆంక్షలను తీవ్రతరం చేసింది. అనుమానితుల కోసం పోలీసులు ఇంటింటి సోదాలకు దిగుతున్నారు! వందలాది మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమీనీ అనే 22 ఏళ్ల యువతిని మోరల్ పోలీసులు అరెస్టు చేయడం, ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించడం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ గత శనివారం నుంచి దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు రోడ్లెక్కుతున్నారు. హిజాబ్ ధరిస్తేనే ఇంటర్వ్యూ! ఇరాన్ పాలకవర్గంలో గూడుకట్టుకుపోయిన సంప్రదాయవాదానికి తార్కాణమీ ఫొటో. కుర్చీలో కూర్చున్నది సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియాన్ అమన్‌పోర్ (64). ఆమె ఎదురు చూస్తున్నది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కోసం. ఐరాస సర్వసభ్య ప్రతినిధి సభలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన రైసీ ఇరాన్లో చెలరేగుతున్న హిజాబ్ హింసాకాండపై ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తీరా సమయానికి ఆమె హిజాబ్ ధరించాలంటూ పట్టుబట్టారు. అందుకు క్రిస్టియాన్ ససేమిరా అన్నారు. 1995 నుంచీ ఇరాన్ అధ్యక్షులందరినీ హిజాబ్ ధరించకుండానే ఇంటర్వ్యూ చేశానని గుర్తు చేశారు. ‘‘ఇంటర్వ్యూ కోసం వారాల ముందునుంచీ ఏర్పాట్లు చేసుకున్నాం. నేను షెడ్యూల్ ప్రకారం సిద్ధమై అధ్యక్షుని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ ఆయన జాడే లేదు. 40 నిమిషాల తర్వాత సహాయకుడొచ్చి నేను హిజాబ్ ధరించి తీరాల్సిందేనని ఆయన కోరుతున్నట్టు తెగేసి చెప్పాడు. అందుకు నిరాకరించి ఇంటర్వ్యూనే రద్దు చేసుకున్నా’’ అంటూ ఈ అనుభవాన్ని ఆమె ట్విట్టర్లో పంచుకున్నారు. ఇరాన్లో పుట్టిన క్రిస్టియానా 11 ఏళ్లొచ్చేదాకా టెహ్రాన్‌లోనే పెరిగారు. -
Russia-Ukraine War: పుతిన్ ‘తప్పు’టడుగులు
ఉక్రెయిన్‌పై దండయాత్ర రష్యా అధ్యక్షుడు పుతిన్ చారిత్రక తప్పిదమా ? ముందు వెనుక ఆలోచించకుండా యుద్ధానికి దిగి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారా? రష్యా సైన్యానికి వరస ఎదురు దెబ్బలు దేనికి సంకేతం ? 200 రోజులు దాటినా ఉక్రెయిన్‌పై పట్టు కోసం ఇంకా ఆపసోపాలు పడటానికి కారణాలేంటి ? ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడు నెలలు కావస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్ తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం మరింత పట్టుదలగా ముందుకు సాగుతూ ఉంటే, అపారమైన నష్టాన్ని చవి చూసిన రష్యా ఒకరకమైన గందరగోళంలో ఉంది. ఇటీవల ఖర్కీవ్‌లో ఉక్రెయిన్ సేన చేతిలో రష్యా ఓటమి ఆ దేశానికి గట్టి ఎదురు దెబ్బగా మారింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నా రష్యా ఇప్పట్లో యుద్ధానికి ముగింపు పలుకుందని భావించలేం. ఉక్రెయిన్‌లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుందని పుతిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ ఇటీవలే స్పష్టం చేశారు. తూర్పు డోన్బాస్ స్వాధీనమే తమ ముందున్న లక్ష్యమని, దాని సాధనకు తొందరేమీ లేదని తాజాగా షాంఘై సహకార సదస్సు సందర్భంగా పుతిన్ కూడా అన్నారు. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు. కానీ యుద్ధంలో రష్యా ఆత్మరక్షణలో పడిపోవడానికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాల అండ అమెరికా సహా నాటో దేశాలన్నీ కలసికట్టుగా ఉక్రెయిన్‌కు ఇంతగా అండగా ఉంటాయని పుతిన్ ఊహించలేకపోయారు. యుద్ధం ఎన్నాళ్లు సాగినా సాయం కొనసాగించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తోంది. హిమార్స్ రాకెట్ వ్యవస్థతోనే ఉక్రెయిన్ సేనలు వందలాది రష్యన్ స్థావరాలను ధ్వంసం చేశారు. హౌటైజర్స్, స్విచ్‌బ్లేడ్ డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ఆర్మర్ సిస్టమ్స్ ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి. అమెరికా తాజాగా 1500 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. దీంతో రష్యా పరోక్షంగా పశ్చిమ దేశాలతోనే యుద్ధం చేయాల్సి వస్తోంది. ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి ఉక్రెయిన్‌పై దాడులకి దిగితే అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా చమురు, గ్యాస్ కోసం తమపై ఆధారపడతాయని త్వరలోనే ఆంక్షలకి ముగింపు పలుకుతాయని పుతిన్ తప్పుగా అంచనా వేశారు. ఫిబ్రవరి నుంచి రష్యాపై 9,200కిపైగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వెయ్యికి పైగా మల్టీ నేషనల్ కంపెనీలు రష్యాను వీడాయి. ఆయుధాల ఉత్పత్తీ మందగించింది. దాంతో ఉత్తర కొరియా నుంచి కూడా ఆయుధాలు కొనుగోలుకు సిద్ధపడాల్సి వచ్చింది! రష్యాను ఆర్థికంగా చమురు, గ్యాస్ ఎగుమతులు మాత్రమే ఆదుకుంటున్నాయి. పుతిన్ మితిమీరిన ఆత్మవిశ్వాసం యుద్ధం చిటికెలో ముగుస్తుందనే భావనతో రంగంలోకి దిగిన పుతిన్‌కు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుద్ధాన్ని ముగిస్తే మంచిదన్న భావన రష్యాలో వివిధ వర్గాల్లో పెరుగుతోంది. ఆత్మవిశ్వాసం, అసహనం ఒకే నాణేనికి చెరోవైపు ఉంటాయన్న వాస్తవాన్ని పుతిన్ గ్రహించుకోలేకపోయారని బ్లూమ్‌బర్గ్ కాలమిస్ట్ లియోనిడ్ బెర్షిడ్స్కీ అన్నారు. కదనరంగంలో కిరాయి సైనికులు ఉక్రెయిన్‌లో కిరాయి సైనికుల్ని దింపడం పుతిన్ చేసిన మరో పెద్ద తప్పిదమంటున్నారు. వాగ్నర్ సంస్థతో పాటు పశ్చిమాసియా దేశాలకు చెందిన వారిని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌పై నియమించుకున్నారు. రష్యా ఇలాంటివారిపై ఆధారపడగా, ఉక్రెయిన్ సైనికులు మాత్రం తమ దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో స్వచ్ఛందంగా యుద్ధరంగంలోకి దిగారు. కాంట్రాక్ట్ సైనికులకి తక్కువ జీతాలు ఇస్తూ ఉండడంతో వారు పూర్తి స్థాయిలో పోరాటపటిమను ప్రదర్శించడం లేదు. తమకు పరిచయం లేని భూభాగంలోకి వచ్చి పోరాడుతున్న రష్యా సైనికులు త్వరగా నిస్సత్తువకి లోనవుతూ ఉంటే, సొంతగడ్డపై స్థానికబలంతో పోరాడే ఉక్రెయిన్ సేనలు నిత్యం ఉత్సాహంగా ఉంటున్నాయి. దీంతో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి వెనక్కి తీసుకుంది. వ్యూహాత్మక తప్పిదాలు యుద్ధంలో రష్యా పలు వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేసింది. ఏప్రిల్‌లో కీవ్, ఉత్తర ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రతిఘటన ధాటికి రష్యా సేనలు వెనుదిరిగాయి. ఆ సమయంలో బలగాలను డోన్బాస్పైకి పంపడం వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయం వినబడుతోంది. ఇలా చేయడం వల్ల చిత్తశుద్ధితో రష్యా తరఫున పోరాడే సైనికుల్ని త్వరితగతిన దేశం కోల్పోయింది. ప్రస్తుతం కదనరంగంలో ఉన్న రష్యా సైనికుల్లో అంకితభావం కనిపించడం లేదు. ఎంత త్వరగా వెనక్కి వెళ్లి కుటుంబాలతో కలిసి గడుపుతామని వారు ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆంక్షల ఎత్తివేత: అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్పందన
ముంబై: అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలను ఎత్తి వేయడంపై సంతోషం ప్రకటించింది. కొత్త దేశీయ కస్టమర్లను ఆన్‌బోర్డ్‌లో చేరేలా తక్షణమే వీలు కల్పించడం తమకు గణనీయమైన లాభాన్ని చేకూరుస్తుందని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. కీలకమార్కెట్లో పరిమితులను ఎత్తివేయడాన్ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్వాగతించింది తమకు ఇండియా కీలకమైన వ్యూహాత్మక మార్కెట్ అనీ, సాంకేతికత, మౌలిక సదుపాయాలలో తమ స్థానిక ప్రధాన పెట్టుబడుల ఫలితమే ఆర్బీఐ నిర్ణయమని సంస్థ తాత్కాలిక సీఈఓ, సీఓఓ సంజయ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ప్రీమియం ఉత్పత్తులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్ తీర్చేందుకు అత్యుత్తమ సామర్థ్యంతో ఉన్నామనీ, ఆర్బీఐ నిర్ణయం దేశంలో తమ వ్యాపార వృద్ధికి తోడ్పడు తుందన్నారు. కాగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై ఆంక్షలను ఆర్బీఐ బుధవారం ఎత్తివేసింది. కొత్తగా దేశీయ కస్టమర్లను చేర్చుకోవడానికి అనుమతించింది. చెల్లింపుల సమాచారాన్ని నిక్షిప్తం చేసే అంశానికి సంబంధించిన ఆదేశాలను పాటించనందుకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై ఆర్బీఐ గతంలో ఆంక్షలు విధించింది. పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు చెల్లింపుల పూర్తి సమాచారాన్ని 2018 ఏప్రిల్ నుంచి భారత్‌లోనే నిక్షిప్తం చేయాలన్న నిబంధన ఉంది. -
రుణ చెల్లింపులో రష్యా విఫలం
మాస్కో/కీవ్: అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం రష్యాపై తీవ్రంగానే పడుతోంది. దాంతో విదేశీ రుణాల చెల్లింపులో విఫలమైంది. గత 104 ఏళ్లలో రష్యాకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన నేపత్యంలో స్విఫ్ట్‌తో పాటు పలు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థల నుంచి రష్యాను అంతర్జాతీయ సమాజం దూరం పెట్టిన విషయం తెలిసిందే. దాంతో నిధులున్నా కూడా పలు విదేశీ రుణాలపై 10 కోట్ల డాలర్ల మేర వడ్డీలను నిర్ణీత తేదీలోపు రష్యా చెల్లించలేకపోయింది. ఈ మొత్తాన్ని యూరోక్లియర్ బ్యాంకుకు పంపినా అక్కడే నిలిచిపోయింది. చెల్లింపులు ఆగిపోవడం నిజమేనని రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ సిల్యానోవ్ అంగీకరించారు. అయితే ఇది అంతర్జాతీయ సహాయ నిరాకరణ ఫలితమే తప్ప ఎగవేత కాదని వివరించారు. ఈ నేపథ్యంలో విదేశీ చెల్లింపులను రష్యన్ బ్యాంకు ద్వారా రూబుల్స్‌లో చెల్లించాలని అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు. లీసిచాన్‌స్క్‌పై నిప్పుల వర్షం డోన్బాస్లోలో ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న చివరి నగరం లీసిచాన్‌స్క్‌పై రష్యా సేనలు సోమవారం నిప్పుల వర్షం కురిపించాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నాటో దేశాధినేతల భేటీ కొనసాగుతుండగానే రష్యా దాడులను ఉధృతం చేయడం గమనార్హం. గత 24 గంటల్లో రష్యా సాగించిన క్షిపణి దాడుల్లో కనీసం ఆరుగురు పౌరులు మృతిచెందారని, మరో 31 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం ప్రకటించింది. ఖర్కీవ్, ఒడెసా, మైకోలైవ్ తదితర నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక స్లొవియాన్స్క్పైనా రష్యా క్లస్టర్ బాంబు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. స్లొవియాన్స్క్లో ఉక్రెయిన్ మిలటరీ బేస్ ఉంది. 1,000 మంది ఉన్న మాల్‌పై... రష్యా క్షిపణి దాడి ఉక్రెయిన్‌లో సామాన్య పౌరులపైనా రష్యా సేనలు క్షిపణి దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం మధ్యాహ్నం క్రెమెన్‌చుక్‌లో 1,000 మందికిపైగా జనంతో కిక్కిరిసి ఉన్న ఓ భారీ షాపింగ్ మాల్‌పై రష్యా భీకర దాడికి దిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా మరణించారని, 40కి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందన్నారు. దాడి తర్వాత షాపింగ్ మాల్ మంటల్లో చిక్కుకుంది. జనం హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్రెమెన్‌చుక్‌లో రష్యా క్షిపణి దాడి పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. బాధితుల సంఖ్యను ఊహించడం సాధ్యం కాదని చెప్పారు. రష్యా నుంచి మర్యాద, మానవత్వాన్ని ఆశించడం అత్యాశే అవుతుందన్నారు. సాధారణ జనజీవితాలను రష్యా అస్తవ్యస్తం చేస్తోందని మండిపడ్డారు. సెంట్రల్ ఉక్రెయిన్‌లో ఉన్న క్రెమెన్‌చుక్ ప్రముఖ పారిశ్రామికకేంద్రంగా అభివృద్ధి చెందింది. -
మరింత కఠిన ఆంక్షలు.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ కవర్ల తయారీ, అమ్మకం, వినియోగంపై కేంద్రం మరింత కఠిన ఆంక్షలు విధిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో 50 మైక్రాన్ల మందం గల కవర్లను బ్యాన్ చేసినప్పటికీ మార్కెట్లో వినియోగం తగ్గలేదు. 75 మైక్రాన్ల మందం గల కవర్ల వినియోగానికి అనుమతినిచ్చారు. తక్కువ మందం గల కవర్లు పునర్ వినియోగానికి ఉపయోగపడకపోగా, పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయని భావించిన కేంద్రం వాటి స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లు, అంతకంటే ఎక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలకు జారీ చేసింది. చదవండి: ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే? మన రాష్ట్రంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు తయారు చేస్తున్న, అమ్ముతున్న కేంద్రాలపై మున్సిపల్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల సరుకును సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివరికి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులను బ్యాన్ చేస్తున్న నేపథ్యంలో తయారీ పరిశ్రమల యజమానులు, హోల్‌సేల్ వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు.. ఒక్కసారి వినియోగించి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్.. ముఖ్యంగా హోటళ్లు, శుభకార్యాల్లో వినియోగించే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, టేబుల్‌పై పరిచే షీట్లు వంటి వాటి వినియోగాన్ని జూలై 1 నుంచి పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులతో పాటు, ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి వద్ద నమోదు చేసుకున్న 139 ప్లాస్టిక్ పరిశ్రమలు తక్కువ మందంగల క్యారీబ్యాగులను తయారు చేస్తుండటంతో వాటి లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. జూలై 1 నాటికి తమ వద్దనున్న సరుకును రీసైక్లింగ్‌కు పంపించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో గతేడాది సెప్టెంబర్ నుంచి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ తయారు చేస్తున్నవారిపైనా, స్టాకిస్టులపైన, ప్లాస్టిక్ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతున్నవారిపైనా దాడులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీఎత్తున ప్లాస్టిక్ కవర్లు, వినియోగ సరుకును సీజ్ చేయడమే కాకుండా రూ.1.54 కోట్ల పెనాల్టీ సైతం విధించారు. -
AP: పరిశ్రమలకు భారీ ఊరట.. ఆంక్షలు ఎత్తివేత
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ ఆంక్షల నుంచి భారీ ఊరట లభించింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 235 మిలియన్ యూనిట్ల నుండి 161 మిలియన్ యూనిట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ముందుగా చెప్పినట్టుగానే పరిశ్రమలకు ఆంక్షల నుంచి ప్రభుత్వం వెసులుబాటు కల్పించి మాట నిలుపుకుంది. చదవండి: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్ హైవే.. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అభ్యర్థన మేరకు పరిశ్రమలపై ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏపీఈఆర్సీ ఆంక్షలు విధించింది. తొలుత వారంలో ఒక రోజు పవర్ హాలిడేతో పాటు, విద్యుత్ వినియోగంలో 50 శాతానికే అనుమతించింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆంక్షలను సడలించింది. తాజా ఆదేశాల ప్రకారం.. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజువారీ డిమాండ్‌లో 70 శాతం వినియోగించుకోవచ్చు. మిగతా సమయంలో 60 శాతం వాడుకోవాలి. పగటిపూట పనిచేసే పరిశ్రమలకు వారంలో ఒక రోజు ఉన్న పవర్‌హాలిడేను మూడు రోజుల క్రితమే తొలగించగా, రోజుకి ఒక షిఫ్టు మాత్రమే నడపాలని, సాయంత్రం 6 గంటల తరువాత ఎటువంటి షిఫ్టులకు అనుమతిలేదని నిబంధనలు విధించింది. తాజాగా వాటిని కూడా తొలగించి, పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగించుకొనే అవకాశం కల్పించింది. -
ఇదేం న్యాయం.. మా ఆడబిడ్డల సంగతి ఏంటి?
తాలిబన్ల బుద్ధి.. వంకర బుద్ధి. ఏం జరిగినా.. అది మారదు. ఈ మాట అంటోంది అఫ్గన్ పౌరులే. తాలిబన్ల పాలనలో గతంలో కంటే పరిస్థితి ఇంకా దిగజారుతోందనేది వాళ్ల ఆవేదన. ఇందుకు ఉదాహరణగా బాలికల విద్యను హరిస్తూ.. వాళ్ల హక్కులను కాలరాయడం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నా.. తాలిబన్లు మాత్రం వెనక్కి తగ్గట్లేదు!. ఇస్లామిక్ ఎమిరేట్ అలియాస్ తాలిబన్ సర్కార్.. అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అది దొరికితేనే.. నిలిచిపోయిన నిధులు అఫ్గన్ గడ్డకు చేరేది, సంక్షోభం నుంచి తేరుకునేది. అయితే హేయనీయమైన తాలిబన్ల తీరు వల్లే అది జాప్యం అవుతోంది. మహిళలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యయుతమైన విధానాలతో తమ పాలనలో కొత్త అఫ్గనిస్థాన్‌ను చూస్తారంటూ హామీలు ఇచ్చిన తాలిబన్లు.. నీటి మీద రాతల్లాగే ఉన్నాయి. తీరు మార్చుకోకుండానే ముందుకు పోతున్నట్లు తాలిబన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గనిస్థాన్‌లో అమ్మాయిలు.. విద్యాఉద్యోగాలు, క్రీడారంగానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. అదే సమయంలో తాలిబన్ నేతలు మాత్రం వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివిస్తూ.. స్వేచ్ఛగా బతకనిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబన్ కేబినెట్లో పాతిక మంది దాకా తమ పిల్లలను పొరుగున ఉన్న పాక్‌లోని పెషావర్, కరాచీలో.. ఇంకొందరు దోహాలోని స్కూల్స్‌లో పిల్లలను చదివించుకుంటున్నారు. వాళ్లలో ఆరోగ్య మంత్రి ఖ్వాలందర్ ఎబాద్, విదేశాంగ ఉపముఖ్యమంత్రి షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్, తాలిబన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షాహీన్‌లు ఉన్నారు. సుహెయిల్ షాహీన్ పిల్లలు ఏకంగా దోహాలోని ఇస్లామిక్ ఎమిరేట్స్ అధికారిక కార్యాలయంలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయనగారి పెద్ద కూతురు ఏకంగా ఫుట్‌బాల్ టీంలో సభ్యురాలిగా ఉందట. ఖ్వాలందర్ కూతురు ఇస్లామాబాద్‌లో మెడిసిన్ చదువుతోంది. ఆమె టెన్నిస్ ఛాంపియన్. మరో ఇద్దరు కీలక నేతల కూతుళ్లు సైతం దోహాలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్నారట. ఈ అంశాలనే ప్రస్తావిస్తూ.. తమకూ స్వేచ్చను ఇవ్వాలని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు మహిళలు. అయితే.. ఈ అంశంపై నిర్ణయం తమ చేతుల్లో లేదని, త్వరలో భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకుంటామని తాలిబన్ ప్రతినిధులు చెప్తున్నారు. మార్చిలో బడులు తెరిచారని ఆనంద పడ్డ బాలికలకు.. ప్రవేశం లేదంటూ పిల్లలను వెనక్కి పంపి గట్టి షాకే ఇచ్చారు అక్కడి విద్యాశాఖ అధికారులు. మళ్లీ పెళ్లిళ్లు! ఇదిలా ఉంటే తాలిబన్ నేతలు ఓ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. చదువుకున్న మహిళలను రెండో వివాహం చేసుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉన్నంత కాలం తాము నాగరికతలో వెనుకబడిపోయామన్న భావనలో ఉన్న వాళ్లు.. మొదటి భార్యలకూ లోక జ్ఞానం లేదనే నిర్ణయానికి వచ్చేసి.. చదువుకున్నవాళ్లను మళ్లీ పెళ్లి చేసుకుని పట్టణాలు, నగరాల్లో కాపురాలు పెడుతున్నారు. రాజకీయ నాయకులే కాదు.. సివిల్ సర్వెంట్లు, ఇతర అధికారులు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుత్నున్నారు.. -
Russia-Ukraine war: పుతిన్ కుమార్తెలపై ఈయూ ఆంక్షలు
బ్రసెల్స్: పుతిన్ కుమార్తెలిద్దరిపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. రష్యాను నిలవరించేందుకు పలు కంపెనీలపై, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ఈయూ తాజాగా మరి కొందరితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో పుతిన్ కుమార్తెలు మారియా, కేటరీనా ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరి ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు వీరి ప్రయాణాలపై నిషేధాన్ని విధించారని ఈయూ అధికారులు తెలిపారు. ఇప్పటికే పుతిన్ కూతుర్లపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! ఉక్రెయిన్‌లో రష్యా క్రూర చర్యలకు పాల్పడిందన్న వార్తలకు సాక్ష్యాలున్నాయంటూ ఈయూ తాజా ఆం క్షల జాబితాను విడుదల చేసింది. రష్యాలో రిజిస్టరైన నౌకల ను ఈయూ రేవుల్లోకి అనుమతించకూడదని నిర్ణయించారు. కోల్ బ్యాన్ రష్యా బొగ్గు దిగుమతులను నిషేధించాలని కూటమి దేశాలు నిర్ణయించుకున్నాయి. దీంతో తొలిసారి రష్యా ఇంధన ఉత్పత్తులు ఆంక్షల జాబితాలోకి చేరినట్లయింది. ఆగస్టు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే చమురు, సహజవాయు దిగుమతులపై మాత్రం సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం రాలేదు. ఏటా దాదాపు 440 కోట్ల డాలర్ల బొగ్గును రష్యా నుంచి ఈయూ దిగుమతి చేసుకుంటోంది. యూఎస్ తదితర దేశాల నుంచి బొగ్గు దిగుమతులు పెంచుకోవడం ద్వారా రష్యా దిగుమతుల నిషేధ లోటును ఎదుర్కోవాలని ఈయూ నిర్ణయించింది. రష్యా బొగ్గుదిగుమతులపై నిషేధంతో ఈయూలోని కొన్ని దేశాల్లో కరెంటు చార్జీలు విపరీతంగా పెరగనున్నాయని రైస్టాడ్ ఎనర్జీ అంచనా వేసింది. చమురు, సహజవాయువుల విషయంలో మాత్రం ఈయూలోని చాలా దేశాలు అత్యధికంగా రష్యాపై ఆధారపడినందున నిషేధంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఒకవేళ వీటిపై నిషేధం విధించినా రష్యాకు పెద్దగా సమస్య ఉండదని, తక్కువ ధరకు ఇండియా, చైనాకు రష్యా అమ్ముకోగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలు భారీ రేట్లకు ఈయూ దేశాలకు వీటిని ఎగుమతి చేస్తాయని, దీనివల్ల ఆయా దేశాలపై పెను భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
మాస్క్ ఇక తప్పనిసరి కాదు.. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
ముంబై: కొవిడ్ నిబంధన విషయంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి ఏం కాదని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 1, శుక్రవారం నుంచి సడలింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాస్క్ ధరించకపోతే.. పెనాల్డీ విధించబోమని పేర్కొంది. మరోవైపు కరోనా వైరస్ నియంత్రణంలో ఉందని, కాబట్టి, ఆంక్షల సడలింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 యాక్ట్ ప్రకారం ఇంతకాలం అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తేసినట్లు పేర్కొంది. అయితే కరోనా ముప్పు ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోలేదు కాబట్టి ప్రజలంతా స్వచ్చందంగా మాస్క్‌లు ధరించాలని మాత్రం మహా సర్కార్ సూచించింది. బీఎంసీ కూడా మాస్క్ తప్పనిసరి కాదని, ఫైన్ విధించబోమని చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి శనివారం నుంచి ఇది అమలులోకి రావాల్సి ఉంది. అయితే.. ఒకరోజు ముందస్తుగానే ఈ ఆదేశాలను విడుదల చేసింది ప్రభుత్వం. Maharashtra Government issues order withdrawing all COVID19 restrictions. pic.twitter.com/wTaKCPUa7G — ANI (@ANI) April 1, 2022 కరోనా వైరస్ 2020లో ప్రపంచాన్ని కుదిపేయగా.. డబ్ల్యూహెచ్‌వో తో పాటు వైద్య నిపుణులంతా ముఖానికి మాస్క్ ధరించడం వల్లనే వైరస్ కట్టడి అవుతుందని సూచించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర, ప్రత్యేకించి ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించని వాళ్ల నుంచి కనిష్టంగా 200రూ. నుంచి.. గరిష్టంగా బాగానే ఫైన్ వసూల్ చేశారు అక్కడి అధికారులు. -
హిజాబ్ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కోర్టు మధ్యంతర ఆదేశాలతో రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నప్పటికీ పలు చోట్ల హిజాబ్ తీసేందుకు విద్యార్థినులు నిరాకరిస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో నిషేధాజ్ఞలను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. హిజాబ్ వివాదం కారణంగా ప్రభుత్వం నగరంలోని అన్ని పాఠశాలల వద్ద 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అనేక పట్టణాలు, విద్యాసంస్థల వద్ద పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా హిజాబ్ వివాదం నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలను నిషేధించారు. ఫంక్షన్ హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో జరిగే వివాహాల్లో 200-300 మంది హాజరయ్యేందుకే అనుమతించారు. మరోవైపు క్రీడా మైదానాల్లో వాటి సామర్థ్యంలో 50 శాతానికి మించి ప్రేక్షకులు హాజరు కాకుడదని పేర్కొన్నారు. -
కెనడాలో ఎమర్జెన్సీ.. వారిపై కఠిన చర్యలు..
ఒట్టావా: కరోనా నిబంధనలకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడాలో ఎమర్జెన్సీ విధించారు. అత్యవసర అధికారాల చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం ప్రకటించారు. దీనిప్రకారం నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. అయితే దీన్ని పరిమిత కాలం పాటు, కొద్ది ప్రాంతాల్లో, అవసరం మేరకే ఉపయోగిస్తామని ట్రూడో చెప్పారు. సైన్యాన్ని ప్రయోగించబోవడం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ నిబంధనలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ట్రక్ డ్రైవర్లు రెండు వారాలకు పైగా సరిహద్దులను, ఒట్టావా వీధులను వాహనాలతో దిగ్బంధించారు. చదవండి: (ఉక్రెయిన్ వివాదంపై చర్చలకు సిద్ధం: రష్యా) -
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేతకి నో!
ఆప్ సర్కార్ వర్సెస్ ఎల్జీ మరోసారి తెర మీదకు వచ్చింది. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఒక ప్రతిపాదనతో పాటు కొవిడ్ ఆంక్షల్ని సవరించాలన్న విజ్ఞప్తిని సైతం ఆయన తోసిపుచ్చారు. కేసుల సంఖ్య ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని లెఫ్టినెంట్ గవర్నర్ తేల్చేశారు. అయితే 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి మాత్రం ఎల్జీ అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఎల్జీ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారంగా పాజిటివిటీ రేట్‌తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని రీజియన్‌లో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్, సదర్ బజార్ ట్రేడర్స్, ఇతర మార్కెట్ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతూ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది. ఇదిలా ఉంటే కర్ణాకటలో ఓపక్క వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయగా.. తమిళనాడులో వీకెండ్లో పూర్తిగా లాక్డౌన్, మిగతా రోజుల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈసీ ఆంక్షల పొడగింపు
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. శనివారం ఐదు రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని కీలక సమావేశంలో సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిజికల్ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఇక 300 మందితో ఇండోర్(క్లోజ్డ్) సభలకు అనుమతి ఇస్తూ.. హాల్ కెపాసిటీ లో 50% మందితో సభ నిర్వహించుకోవచ్చని పార్టీలకు అనుమతి ఇచ్చింది ఈసీ. రాజకీయ పార్టీలన్నీ కరోనా ప్రోటోకాల్, ఎన్నికల కోడ్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఎన్నికలు జరగాల్సిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మఇిపూర్, గోవాలో కరోనా కల్లోలం కలకలం రేపుతోంది. భారీ ఎత్తున నమోదవుతున్న కేసులు ఆయా రాష్ట్రాల్లో. దీంతో ఎన్నికల సంఘం తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే క్రమంలో ఆయా చోట్ల ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలపై జనవరి 15 వరకూ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత పరిస్దితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ఇవాళ నిషేధంపై సమీక్ష నిర్వహించి.. పొడగింపు నిర్ణయం వెల్లడించింది. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్‌లో మాత్రం ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, మార్చి 7 మధ్య ఉత్తరప్రదేశ్ ఏడు దశల్లో 403 ఎమ్మెల్యేలను ఎన్నుకోనుంది. ఓట్ల లెక్కింపు మొత్తంగా మార్చి 10న జరగనుంది. -
Telangana: ట్రాఫిక్ ఆంక్షలు: అలా చేస్తే 10వేలు ఫైన్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు తప్ప మిగితా వాహనాలకు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి1 ఉదయం 5గంటల వరకు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ రూట్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇక రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు.. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్లు(1, 2), మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్టీయూ ఫ్లైఓవర్, రోడ్డు నెం. 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు వంతెన, బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ (బాలానగర్) మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. డిసెంబర్ 31న విధుల్లో ఉండే క్యాబ్, ఆటో డ్రైవర్లకు పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్, ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు విధుల్లో యూనిఫామ్‌లో ఉండి అన్ని వాహన డాక్యుమెంట్లు కలిగి ఉండాలన్నారు. క్యాబ్ డ్రైవర్లు రైడ్‌కు అనుమతి నిరాకరిస్తే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే క్యాబ్ ఆటో ఓనర్లపై మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 కింద రూ.500 పెనాల్టీ విధిస్తామని చెప్పారు. పబ్లిక్ వద్ద అధిక డబ్బు డిమాండ్ చేస్తూ మిస్‌బిహేవ్ చేయవద్దని అన్నారు. పబ్‌లో తాగి బయటకి వెళ్లే కస్టమర్ తాగి వాహనం నడపకుండా పబ్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. అడుగడుగున డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోతే వాహనాలు జప్తు కూడా చేస్తామని తెలిపారు. మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనం నడిపితే డ్రైవర్, వాహన యజమాని ఇద్దరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. వాహన నంబర్ ప్లేటులు లేకుండా, వాహనంలో అధిక శబ్ధాలతో ప్రయాణిస్తే బండి సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో అధిక జనాభా, వాహనం మీద కూర్చోని ప్రయాణించడం, పబ్లిక్ స్థలంలో న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగి వాహనం నడిపితే మొదటిసారి దొరికితే రూ.10వేల జరిమాన లేదా ఆరు నెలల జైలు శిక్ష, రెండో సారి పట్టుబడితే రూ.15 ఫైన్ లేదా రెండేళ్ల జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు. -
TS: పబ్స్, హోటళ్లు, క్లబ్‌లు ఇయర్ గైడ్ లైన్స్ పాటించాలి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2 వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియతో మాట్లాడుతూ.. తెలంగాణలో పబ్స్, హోటళ్లు, క్లబ్‌లకు న్యూఇయర్ గైడ్ లైన్స్ పాటించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో న్యూ ఇయర్ ఆంక్షలు అమలు అవుతాయని పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలను అమలుచేయాలని పోలీసులుకు సూచించారు. న్యూఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని తెలిపారు. కోవిడ్ నిబంధనల్లో ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని డీజీపీ చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో కరోనా టెస్టులు చేసి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, ఎక్కడైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. విధుల్లో ఉన్న పోలీసులు మాస్కులు ధరించి డ్యూటీ చేయాలని తెలిపారు. పబ్బులు, ఈవెంట్లపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాలని డీజీపీ తెలిపారు. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆ మూడు గంటలు లిక్కర్ సేల్స్‌పై బ్యాన్
సాక్షి, చెన్నై(తమిళనాడు): దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌వో ఒమిక్రాన్‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ విధించడంతోపాటు కోవిడ్ ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. తాజాగా, మద్రాసు హైకోర్టు ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా నూతన సంవత్సర వేడుకలపై పలు ఆంక్షలను విధించాలంటూ సూచించింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబరు 31 రాత్రి 10 గంటల.. అర్ధరాత్రి 1 గంట దాకా.. మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని ఆదేశించింది. ఆ మూడు గంటల పాటు బార్లు, హోటళ్లు ఎక్కడా కూడా మద్యం విక్రయించకుండా చర్యలు చేపట్టాలని బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక రెండు డోసుల టీకా ధృవీకరణ పత్రం లేకుండా డిసెంబరు 31 న రాత్రి 7గం. తర్వాత బహిరంగ ప్రదేశాలలో ఎవరిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. పుదుచ్చేరిలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై.. వేడుకల సమయంలో ప్రజలు ఆంక్షలను కఠినంగా పాటించాలని కోరారు.ప్రజలంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని ఆమె కోరారు. పర్యాటకులు, రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరి పాటించాలని సూచించారు. వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్యను కూడా పరిమితంగా ఉండేలా చూడాలన్న ఆదేశాలు ఇదివరకే జారీ అయ్యాయి. -
హైదరాబాద్ కొత్త సంవత్సర వేడుకలు.. కండిషన్స్ అప్లై
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో జంట నగరాల్లో న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ పేరిట మార్గదర్శకాలు జారీ అయ్యాయి. పబ్‌లు, రెస్టారెంట్లతో పాటు నగర వాసులు వీటిని తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసారి నగర న్యూ ఇయర్‌పార్టీల్లో డీజేలకు అనుమతి ఉండదు. పబ్‌లు, రెస్టారెంట్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ ఈవెంట్లు నిర్వహించాలి. పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటారు. అలాగే కొవిడ్ రూల్స్‌ను అతిక్రమించినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. రెండూ డోసులు తీసుకున్న వారికే మాత్రమే ఈవెంట్లకు అనుమతి ఇవ్వాలని, కొవిడ్ పరీక్షలు నిర్వహించాకే వాళ్లను అనుమతించాలని ఈవెంట్ నిర్వాహకులకు తెలిపారు. ఇక రెండు రోజుల ముందే ఈవెంట్లకు అనుమతి తీసుకోవాలని, పరిమితికి మించి పాసులను అమ్మొద్దని హెచ్చరించారు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈవెంట్లలో జనాలలోకి సింగర్స్ వెళ్లొద్దు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, మహిళల భద్రతకు షీ టీం పహారా కొనసాగుతుందని తెలిపారు. సంబంధిత వార్త: ఒమిక్రాన్ అలర్ట్: మాస్క్ పెట్టుకోకుంటే కఠిన చర్యలే! 31న రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు తెలిపిన సీపీ.. తాగి రోడ్లపై హంగామ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్ధరాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, పట్టుబడితే శిక్ష కఠినంగానే ఉంటుందని తెలిపారు. ఇక మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని కమిషనర్ ఆనంద్ ఆ ప్రెస్‌నోట్‌లో తెలిపారు. సంబంధిత వార్త: హైకోర్టు ఏం చెప్పింది? కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోంది?.. -
పీఎంసీ బ్యాంక్‌పై మరో మూడు నెలలు ఆంక్షలు
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్‌పై ఆంక్షలను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. దీనితో పీఎంసీపై మరో మూడు నెలలు అంటే 2022 మార్చి వరకూ ఆంక్షలు కొనసాగుతాయి. సంక్షోభంలో ఉన్న పీఎంసీ బ్యాంకును ఢిల్లీకి చెందిన యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (యూఎస్‌బీఐ ) స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన డ్రాఫ్ట్ స్కీమ్ పక్రియ ఇంకా పూర్తి కానుందున ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. పీఎంసీ బ్యాంక్ విలీన పక్రియకు సెంట్రల్ బ్యాంక్ ముసాయిదా స్కీమ్‌ను సిద్ధం చేసింది. దీనిపై సూచనలను, అభ్యంతరాలను కోరుతూ నవంబర్ 22న ప్రజా బాహుళ్యంలో ఉంచింది. దీనికి సంబంధించిన గడువు డిసెంబర్10వ తేదీన ముగిసింది. తదుపరి చర్యల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆర్బీఐ తన తాజా ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే పలు సార్లు... రియల్ ఎస్టేట్ డెవలపర్ హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాలను దాచిపెట్టడం, తప్పుగా నివేదించడం వంటి కొన్ని ఆర్థిక అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో పీఎంసీ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ రద్దు చేసింది. ఆ బ్యాంక్ ఖాతాదారుల ఉపసంహరణలపై పరిమితులుసహా పలు నియంత్రణలు విధించింది. ఆ తర్వాత పలుమార్లు ఆంక్షలు పొడిగించింది. సంబంధిత ఆదేశాలను చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో పొడిగించడం జరిగింది. డిసెంబర్ 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ తాజా ఆంక్షల పొడిగింపు నిర్ణయం తీసుకుంది. విలీనం ముసాయిదా పథకం ప్రకారం, యూఎస్‌ఎఫ్‌బీ ద్వారా డిపాజిట్లతో సహా పీఎంసీ బ్యాంక్ ఆస్తులు, రుణాలు స్వాధీనం అవుతాయి. తద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలకు కూడా అధిక రక్షణ కలుగుతుందని గత నెల్లో ఆర్బీఐ తెలిపింది. యూఎస్ఎఫ్బీని ‘జాయింట్ ఇన్వెస్టర్’గా సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రెసైలెంట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తున్నాయి. దీనికి 2021 అక్టోబర్‌లో బ్యాంకింగ్ లైసెన్స్ కూడా లభించింది. నవంబర్ 1 నుంచీ యూఎస్‌ఎఫ్‌బీ కార్కకలాపాలు ప్రారంభమయ్యాయి. చదవండి: బ్యాంకుల్లో పాలన మెరుగుపడాలి -
న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు.. కేరళలో నైట్ కర్ఫ్యూ
కొత్త ఏడాది వేడుకలు దగ్గరపడుతున్న సమయంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేడుకల కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూకి సిద్ధమైంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని స్టేట్స్ అప్రమత్తం అయ్యి నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కేరళ చేరింది. అయితే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 2, 2022 దాకా.. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా ఈ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. కొవిడ్-19 పరిస్థితిపై సోమవారం నిర్వహించిన సమీక్ష అనంతరం పినరయి విజయన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జనసందోహం గుమిగూడే అవకాశం ఉన్నందున, వైరస్ విజృంభించొచ్చని కేబినెట్ అభిప్రాయపడింది. అనవసరంగా గుమిగూడడం, ప్రయాణాలు నైట్ కర్ఫ్యూ టైంలో నిషేధం. ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఇక 31వ తేదీ రాత్రి పబ్‌లు, బార్లు, హోటళ్లు సైతం 10గం.కే మూతపడాల్సిందే. బీచ్‌లు, రోడ్లు అన్నీ పోలీసుల నజర్లో ఉంటాయి. అంటే.. 31తేదీ నాడు రాత్రి పది తర్వాత వేడుకలు ఉండయన్నమాట! -
న్యూ ఇయర్ జోష్ కు సిద్ధమవుతున్న యూత్
-
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
-
ఒమిక్రాన్ అలర్ట్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కట్టడిలో భాగంగా జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒమిక్రాన్ నియంత్రణకు ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీ/పోలీసు కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఆంక్షలు ఇవీ... ► కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తూ ఇతర జన సామూహిక కార్యక్రమాలు జరుపుకోవాలి. ► ఈ కార్యక్రమాల్లో భౌతికదూరం నిబంధన పాటించడం తప్పనిసరి. ► మాస్క్ లేకుండా ఏ వ్యక్తినీ సామూహిక కార్యక్రమాలకు అనుమతించరాదు. ► ప్రవేశద్వారం వద్ద ఐఆర్ థర్మామీటర్లు/థర్మల్ స్కానర్లతో లోపలికి వచ్చే వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించాలి. ► బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వ్యక్తులపై జరిమానాలను విధించాలన్న గత ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలి. మరో ముగ్గురికి ఒమిక్రాన్ రాష్ట్రంలో కొత్తగా మూడు కోవిడ్–19 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారే. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 30కి చేరింది. వీరిలో పది మంది రికవరీ అయ్యారు. శనివారం విదేశాల నుంచి 333 మంది వచ్చారు. వీరిలో 8 మందికి కోవిడ్–19 పాజిటివ్‌గా తేలగా, ఈ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబ్‌కు తరలించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. జీనోమ్ సీక్వెన్స్‌కు సంబంధించి మొత్తం 20 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇదిలావుండగా, రాష్ట్రంలో కొత్తగా 140 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఇప్పటివరకు 6,80,553 మంది కరోనా బారిన పడగా, 6,73,033 మంది కోలుకున్నారు. మరో 3,499 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 26,947 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 4,267 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది. -
న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్..
-
కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు
బెంగళూరు: నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఉవ్విళ్లూరతున్న కర్ణాటక వాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడాన్ని నియంత్రిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం తెలిపారు. డీజేలు లేకుండా క్లబ్‌లు, రెస్టారెంట్లలో 50 శాతం కెపాసిటీతో మాత్రమే వేడుకలకు అనుమతిస్తామన్నారు. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. కోవిడ్ -19 టీకాలు వేసుకున్న వారిని మాత్రమే వేడుకలకు అనుమతిస్తామన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక సర్కారు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. మరో 5 ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలో తాజాగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరింది. ధార్వాడలో 54 ఏళ్ల వ్యక్తి, తీర్థహళ్లిలో 20 ఏళ్ల యువతి, ఉడుపిలో 82 ఏళ్ల వృద్దుడు, మంగళూరులో 19 ఏళ్ల యువకుడు ఒమిక్రాన్ బారిన పడ్డారు. (చదవండి: నాకు జీవం లేదు.. 4 రోజుల క్రితమే చనిపోయాను) మరోవైపు బెంగళూరులో ఒమిక్రాన్ ప్రబలకుండా రద్దీ ప్రాంతాలైన కేఆర్ మార్కెట్లో మార్షల్స్‌ను పెంచారు. మాస్క్ ధరించకపోతే తక్షణమే జరిమానా విధిస్తున్నారు. బెళ్లందూరు, దొడ్డనెక్కుంది, బేగూరు, హగదూరు, హెచ్ఎస్ఆర్ లేఔట్ వార్డుల్లో నిత్యం 7కు పైగా కోవిడ్ కేసులు వస్తుండడంతో రెడ్ జోన్‌గా ప్రకటించారు. (చదవండి: వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా మూడోవేవ్..)