హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల బందోబస్తుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. త్రీస్టార్, అంతకు మించి స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, బార్‌లు న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహణకు ముందస్తు పోలీసు అనుమతులు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకే కార్యక్రమాలు నిర్వహించాలని, సమయం దాటితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నిబంధనలివీ..
►ప్రతి ఈవెంట్ నిర్వహణ, భద్రత, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. వేదిక ప్రవేశం, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్లేస్ వద్ద సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఈవెంట్‌లో అశ్లీల నృత్యాలు, సంజ్ఙలు ఇ తరత్రా చర్యలకు పాల్పడకూడదు. 45 డెసిబుల్స్‌కు మించి శబ్దాలు చేయకూడదు. ఈవెంట్‌లోకి ఎలాంటి తుపాకులు, ఆయుధాలను అనుమతించకూడదు. టపాసులు పేల్చకూడదు. సామర్థ్యానికి మించి పాస్‌లు, టికెట్‌లు, కూపన్లు జారీ చేయకూడదు.
►జంటల కోసం నిర్వహించే ఈవెంట్‌లలో మైనర్లను అనుమతించకూడదు. ఈవెంట్‌లలో ఎలాంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగించకూడదు. నియంత్రించడంలో విఫలమైన యాజమాన్యంపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయి. ఎక్సైజ్ విభాగం అనుమతించని సమయానికి మించి మద్యాన్ని విక్రయించకూడదు. మద్యం మత్తులో ఉన్న కస్టమర్లు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునేందుకు ఈవెంట్ నిర్వాహకులు డ్రైవర్లు, క్యాబ్‌లను ఏర్పాటు చేయాలి. డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన వాహనదారుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గరిష్టంగా 6 నెలల పాటు జైలు శిక్ష ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment