సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో జంట నగరాల్లో న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ పేరిట మార్గదర్శకాలు జారీ అయ్యాయి. పబ్‌లు, రెస్టారెంట్‌లతో పాటు నగర వాసులు వీటిని తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈసారి నగర న్యూ ఇయర్‌పార్టీల్లో డీజేలకు అనుమతి ఉండదు. పబ్‌లు, రెస్టారెంట్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ ఈవెంట్లు నిర్వహించాలి. పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటారు. అలాగే కొవిడ్ రూల్స్‌ను అతిక్రమించినా చర్యలు తప్పవని పేర్కొన్నారు.
రెండూ డోసులు తీసుకున్న వారికే మాత్రమే ఈవెంట్లకు అనుమతి ఇవ్వాలని, కొవిడ్ పరీక్షలు నిర్వహించాకే వాళ్లను అనుమతించాలని ఈవెంట్ నిర్వాహకులకు తెలిపారు. ఇక రెండు రోజుల ముందే ఈవెంట్లకు అనుమతి తీసుకోవాలని, పరిమితికి మించి పాసులను అమ్మొద్దని హెచ్చరించారు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈవెంట్లలో జనాలలోకి సింగర్స్ వెళ్లొద్దు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, మహిళల భద్రతకు షీ టీం పహారా కొనసాగుతుందని తెలిపారు.
సంబంధిత వార్త: ఒమిక్రాన్ అలర్ట్: మాస్క్ పెట్టుకోకుంటే కఠిన చర్యలే!
31న రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు తెలిపిన సీపీ.. తాగి రోడ్లపై హంగామ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్ధరాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, పట్టుబడితే శిక్ష కఠినంగానే ఉంటుందని తెలిపారు. ఇక మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని కమిషనర్ ఆనంద్ ఆ ప్రెస్‌నోట్‌లో తెలిపారు.
సంబంధిత వార్త: హైకోర్టు ఏం చెప్పింది? కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోంది?..
Comments
Please login to add a commentAdd a comment