DJ
-
హైదరాబాద్ లో సన్నీ లియోన్ సందడి (ఫొటోలు)
-
క్రేజీ.. డీజే..
అర్ధరాత్రి సమయం..చిమ్మ చీకట్లని. పట్ట పగలుగా మార్చే రంగురంగుల విద్యుత్ కాంతుల్లో.. ఓ వైపు ఛీర్స్‌తో హుషారు.. మరోవైపు చిందుల జోరు.. ఆ సమయంలో తోడు లేకుండా అమ్మాయిలు బయటకు వెళ్లడమే సరికాదని నొక్కి వక్కాణించే సంప్రదాయ వాదుల చెవులకు చిల్లులు పడే సంగీతంతో కదం తొక్కుతున్నారు ఆధునిక యువతులు. డీజేలుగా.. మేల్ డామినేషన్‌కు గండికొడుతూ శరవేగంగా ముందుకు దూసుకొస్తున్నారు. ‘మనసుకు నచ్చిన సంగీతం.. వయసుకు తగ్గ వినోదం.. మంచి ఫ్రెండ్స్. ఇన్ని అందించే రంగాన్ని వదిలేసి సాదా సీదా ఉద్యోగం ఎందుకు చేయాలి?’ అని ప్రశ్నింస్తున్నారు అఖిల. ఉద్యోగం అంటే మంచి ఆదాయం వస్తుంది కదా..అంటే..! ‘నేను ఎంచుకున్న కెరీర్లో అంతకన్నా ఎక్కువ సంపాదనే ఇప్పుడు వస్తుంది’ అంటూ స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు దాకా అఖిల.. ఆరు దాటాక డీజే బ్లాక్.ఎవరూ డేర్ చేయని రోజుల్లోనే.. దాదాపు పదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చారు లీనా. నగరంలోని సికింద్రాబాద్‌లో నివసించే ఈ సింథీ యువతి.. డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేశారు. అనంతరం కొన్ని షోస్ చేశారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఫుల్‌టైమ్ డీజేయింగ్ను ఎంచుకున్నారు. ‘ఏవీ మనసుకు నచ్చలేదు. అదే నా కెరీర్‌ను ఇటు మార్చింది’ అంటూ చెప్పారు డీజే లీనా. ఫ్రీలాన్స్ డీజేగా సిటీలోని సగం పైగా క్లబ్స్‌లో ఇప్పటికే తన మ్యూజిక్ వినిపించానంటున్న లీనా.. బాలీవుడ్ అంటే తనకు ప్రేమ అనీ, అందుకే ఆ సంగీతాన్ని ప్లే చేయడానికి తాను ఇష్టపడతానని అంటున్నారు. అమ్మాయిలు ఈ రంగంలోకి ఎక్కువగా రాకపోవడానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరకకపోవడమే కారణమంటున్నారు లీనా.. తాను కూడా అతి కష్టం మీద కుటుంబ సభ్యులను ఒప్పించగలిగానని చెబుతున్నారు.ట్రెడిషనల్ ఫ్యామిలీలో.. ట్రెండీగా.. ‘నేను ఇక్ఫాయ్లో బీబీఏ పూర్తి చేశాను. సొంతంగా బిజినెస్ చేయాలనేది నా ఆలోచన. అయితే చిన్నప్పటి నుంచీ డీజేయింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో క్లబ్స్‌కి వెళ్లినప్పుడు కేవలం డీజే మ్యూజిక్ కోసమే వెళ్లేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు అఖిల. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ పూర్తి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అఖిల.. 2018లో డీజే స్కూల్లో చేరాలని నిర్ణయించున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రతిఘటననే ఎదుర్కొన్నారు. ‘ఫ్యామిలీ వద్దు అన్నప్పటికీ మనసు మాటే విన్నాను. ఒక ప్రోగ్రామ్‌కి కేవలం రూ.1000తో ప్రారంభించి.. ఇప్పుడు అంతకు పదింతలు తీసుకునే స్థాయికి చేరాను’ అంటూ సగర్వంగా చెప్పారామె. అమ్మాయిల భద్రత విషయం గురించి మాట్లాడినప్పుడు.. ‘మా చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఇప్పటిదాకా చిన్న చేదు అనుభవం కూడా నాకు ఎదురుకాలేదు’ అంటూ చెప్పారామె. భవిష్యత్తులోనూ డీజేగా కొనసాగుతానని, మరిన్ని టాప్ క్లబ్స్‌లో తన మ్యూజిక్‌ని వినిపిస్తానని బాలీవుడ్ ట్య్రాక్స్కి పేరొందిన ఈ డీజే బ్లాక్ చెబుతున్నారు.‘ఫ్లో లో.. ‘జో’రుగా.. ‘మా నాన్న వాళ్లది వరంగల్. అయితే నేను నార్త్‌లోనే పెరిగాను. ప్రస్తుతం సిటీలో సెటిలయ్యా’ అంటూ చెప్పారు ఫ్లోజో. డిగ్రీ పూర్తి చేశాక.. కొన్ని కార్పొరేట్ ఉద్యోగాలు చేశా. అయితే చిన్నప్పటి నుంచీ సంగీతం పై ఉన్న ఇష్టంతో డీజేసూ్కల్లో చేరి కోర్సు పూర్తి చేసి డీజేగా మారాను అంటూ చెప్పారు ఫ్లోజో. ప్రస్తుతం నగరంలో టాప్ డీజేల్లో ఒకరుగా ఉన్న ఈ అమ్మాయి తొలుత లిక్విడ్స్‌లో రెసిడెంట్ డీజేగా ప్లే చేశానని, కొంత కాలం తర్వాత ఫ్రీలాన్స్ డీజేగా మారి, పలు అవార్డ్స్ కూడా అందుకున్నానని వివరించారు. థాయ్‌ల్యాండ్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా, గోవా వంటి పార్టీ సిటీల్లోనూ ప్లే చేశానంటున్న ఫ్లోజోకి తన పేరు స్టైలి‹Ùగా ఉండడంతో మార్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ కెరీర్లో అటు ఆనందం, ఇటు ఆదాయం రెండూ బాగుంటాయంటున్న ఫ్లోజో.. ఆరేడేళ్లలోనే కారు, ఫ్లాట్ కొనగలిగానని సంతోషంగా చెప్పారు. ఇదీ చదవండి: గేలి చేసినచోటే గెలిచి చూపించిన మగువలు! -
పుష్పరాజ్.. తగ్గేదేలే.. అచ్చం బన్నీని తలపించావ్ భయ్యా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో పుష్ప పార్ట్-1 బన్నీ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్లో అలరించింది. తగ్గదేలే అనే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ డైలాగ్ కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చెప్పే ఉంటారు. అంతా ఫేమస్ అయిపోయాడు పుష్పరాజ్. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే ఏకంగా బన్నీ స్టైల్‌తో అభిమానలను అలరించారు.ఇకపోతే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. మరికొద్ది రోజుల్లోనే పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నారు. రిలీజ్‌కు ఇంకా కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లతో హోరెత్తించిన మేకర్స్.. మెగా ఈవెంట్ కోసం సిద్ధమయ్యారు. పుష్ప-2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను పట్నాలో భారీఎత్తున నిర్వహిస్తున్నారు. ఈనెల 17న భారీస్థాయిలో జరిగే ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.ఇకపోతే బన్నీ ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఏహీరోకు లేని ఫ్యాన్‌బేస్ ఆయనకు మాత్రమే సొంతం. తాజాగా ఓ అభిమాని చేసిన మేకప్ స్టంట్ అదిరిపోయింది. అచ్చం అల్లు అర్జున్ను తలపించేలా పుష్ప-2 గెటప్‌లో కనిపించారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన కొరియోగ్రాఫర్ డీజే మధు చేసిన ఈ వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా అల్లు అర్జున్ను చూసినంత ఫీలింగ్ వచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో బన్నీ ఫ్యాన్స్ రచ్చ అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుందని పోస్ట్ చేస్తున్నారు. కాగా.. పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ల్ బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి. View this post on Instagram A post shared by D J Madhu (@name_is_djmadhu) -
విషాదం: డీజే సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 13 ఏళ్ల బాలుడు
ఇటీవల డీజే ఓ ట్రెండ్‌గా మారింది. ప్రతి శుభకార్యంలో భారీ భారీ సౌండ్ సిస్టమ్ కామన్ అయిపోయింది. దద్దరిల్లిపోయే డీజే చప్పుళ్లకు చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. మితిమీరిన సౌండ్, అత్యుత్సాహంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఓ బాలుడు భారీ డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.భోపాల్‌లో సమర్ బిల్లోర్ అనే 13 ఏళ్ల బాలుడు స్థానిక పండుగ వేడుకలో తన వివాసం వెలుపల డీజే సౌండ్‌కు ప్రజలు డ్యాన్స్ చేస్తుండగా.. ఆ సంగీతానికి ఆకర్షితుతయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అందరితోపాటు డ్యాన్స్ చేశాడు. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పిల్లవాడని ఆరోగ్య పరిస్థితి గురించి తెలియక అతని చుట్టుపక్కల వారు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే గమనించిన తల్లి జమునా దేవి సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో అందరూ ఆగిపోయారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యు ప్రకటించారు.అయితే సమర్ తండ్రి, కైలాష్ బిల్లోర్, డీసే సౌండ్ అత్యంత ప్రమాదకరంగా ఉండటమే తన కొడుకు చావుకు కారణమని ఆరోపించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆగలేదని, తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ సందడిని ఏదీ ఆపలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇటువంటి సమస్యలను నివారించడానికి డీజేలకు ఖచ్చితమైన సమయం, వాల్యూమ్ పరిమితులు ఉండాలని కోరారు. -
Hyderabad: మేయర్ విజయలక్ష్మిపై కేసు నమోదు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేయడంతో పాటు గడువు ముగిసిన తర్వాత కూడా సౌండ్ పొల్యుషన్‌కు పాల్పడిన ఘటనలో నగర మేయర్‌తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ రాత్రి 10 గంటల çసమయంలో బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్బీటీనగర్లో అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఊరేగింపుతో పాటు మండపాలను కానిస్టేబుళ్లు ఎస్కే నజీర్ అహ్మద్, హోంగార్డు సాయి ప్రసాద్‌లు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ముందు జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భారీ సౌండ్‌తో డీజే ఏర్పాటు చేశారని, శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నజీర్ అహ్మద్, సాయిప్రసాద్‌లు అక్కడికి చేరుకుని డీజేను ఆపాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకుని పోలీసులు ఇందులో జోక్యం చేసుకోవద్దని, మ్యూజిక్‌ను కొనసాగించాలని వారికి సూచించారు. భారీ శబ్ద కాలుష్యంతో ఈవెంట్‌ను అలాగే కొనసాగించారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బతుకమ్మ వేడుకల నిర్వాహకులు కందాడి విజయ్‌కుమార్, మ్యూజిక్ ప్లే చేస్తున్న మహ్మద్ గౌస్, జోక్యం చేసుకోవద్దంటూ చెప్పిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 223, 280, 292, 49 రెడ్‌విత్ 3 (5), సెక్షన్ 21/76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డీజే, బాణాసంచా సౌండ్స్ పై కీలక నిర్ణయం
-
డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు, ప్రభుత్వానికి నివేదిక: సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనందర్ అధ్యక్షతనగురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగినఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రా పాలీ, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాలు నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇంట్లో ఉన్న వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, గుండె అదురుతుందని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. డీజే సౌండ్స్ పోనుపోనూ శ్రుతి మించుతున్నాయని, గణేష్ పండుగే కాకుండా మిలాద్ ఉన్ నబిలోనూ డీజే నృత్యాలు విపరీతం అయ్యాయని అన్నారు. పబ్‌లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని చెప్పారు.డీజే శబ్దాలపై కంట్రోల్ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బ తింటాయన్నారు సీవీ ఆనంద్ డీజే శబ్దాలు కట్టడి చేయాలని కోరుతూ తమకు అనేక సంఘాల నుంచి వినతులువచ్చాయని అన్నారు. డీజేల వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా భద్రతకు ముప్పు ఉందన్నారు. అందుకే పలు వర్గాలను పిలిచామని, అందరి అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. తమ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
అదర్‌సైడ్ .. నువ్వు విజిలేస్తే...
ప్రతి సంవత్సరం మన దేశంలో నిమజ్జనోత్సవాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల వేషాల్లో వినాయకుడు సరదాగా ఉన్నాడు. లడ్డూ వేలాలు కోట్లకు చేరుకుంటు న్నాయి. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని మారుతున్నా ఒక్కటి మాత్రం మారలేదు – నిమజ్జనం లాంటి సమయాల్లో పోగైన జనాల మధ్యనుంచి స్త్రీలని వేధించే పోకిరీ వేషాలు.నిమజ్జనాలు మొదలైన మూడో రోజు అనుకుంటా. ఒక మీటింగ్ ముగించుకుని ఊబర్ బైక్‌పై ఇంటికొస్తున్నాను. ట్రాఫిక్ మెల్లగా కదుల్తోంది. మా బైక్‌కి కొంచెం ముందు ఒక చిన్న ట్రాలీ ఆటోలో ఒక బుజ్జి వినాయకుడు. క్యూట్‌గా ఉన్నాడు. వినాయకుడి విగ్రహం కంటే చుట్టూ పెట్టిన సౌండ్ సిస్టం పెద్దదిగా ఉంది. డుబ్ డుబ్ అని డీజే సౌండ్లతో మారుమోగిపొతోంది రోడ్డంతా. ట్రాలీలో ఒక పదిమందికి పైగానే కుర్రాళ్ళు ఫుల్ డాన్స్ చేస్తున్నారు. అంతా బావుంది అనుకుంటుండగా ఆ గుంపులో ఒకడు నన్ను చూసి కన్ను కొట్టాడు. అప్పటివరకూ నేనూ సరదాగా చూస్తున్న ఆ దృశ్యం వికృతంగా మారింది.అంతటితో అయినపోలేదు. నా వైపు చూసి కన్ను కొట్టినోడు, పక్కనున్న మరొకడి చెవిలో ఏదో చెప్పడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో గట్టిగా నవ్వుకుంటూ అప్పటిదాకా నిలబడి చూస్తున్న వీళ్లిద్దరూ డాన్స్ చేస్తున్న కుర్రాళ్లతో కలిసి అదో రకంగా స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు. మామూలుగా అయితే నేను మొహం తిప్పేసుకోవడమో లేదా మొబైల్ చూసుకోవడమో చేసేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం వాళ్లవైపే గుడ్లురుమి చూస్తుండిపోయాను. ఎంత కోపంగా చూస్తే అంత రెచ్చిపోతున్నారు. ట్రాఫిక్ కదలడం లేదు. కాసేపటికి నేనే తల తిప్పుకున్నాను. ట్రాఫిక్ కొంచెం మూవ్ అయింది. మా ఊబర్ డ్రైవర్ ఒక కారు వెనక ఆగిపోయాడు. ఆ ట్రాలీ ఆటో ముందుకు వెళ్లిపోయింది. పాట మారింది. అప్పుడే మమ్మల్ని దాటుకొని ఒక స్కూటీ వెళ్లింది. ఆ స్కూటీ నడుపుతున్న అమ్మాయి మీదకి మారింది ఆ కుర్రాళ్ల చూపు. ఆ అమ్మాయిని చూసి కూడా అవే కోతలు, అవే కేకలు, అవే కుప్పి గంతులు. ఆ అమ్మాయి చున్నీ సర్దుకోవడం నాకు కనిపించింది. ఆ అమ్మాయి ఆ ట్రాలీని కూడా దాటుకొని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఓయ్ ఓయ్ అని తరిమాయి ఆ పిల్లని ఈ గాలి మాటలు.ఆ కుర్రాళ్లు ఆ రాత్రికెప్పుడో నిమజ్జనం పూర్తి చేసుకుని, ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుని హాయిగా నిద్రపోయుంటారు. కానీ వాళ్ల చేసిన అల్లరికి ఎంతమంది అమ్మాయిలకు ఆ రాత్రి నిద్రపట్టకుండా చేసుంటారో, వాళ్లలో ఎంత భయాందోళనలు కలుగచేసి ఉంటారో వాళ్లకి తెలిసుండదు.ఏదో దార్లో ఆమ్మాయి కనిపిస్తే జస్ట్ విజిలేసా, అంతే అని మగాళ్లకి అనిపించవచ్చు. అదేం పెద్ద విషయం కాదని మన సినిమాలు నార్మలైజ్ చేసుండొచ్చు. కానీ ఈ రకమైన వేధింపులు స్త్రీలకు తీవ్రమైన మానసిక, శారీరక ఇబ్బందులను కలుగచేస్తాయనేది ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సిన విషయం.ఇదో పెద్ద సమస్యా అని తీసిపారేసే విషయం కాదు. 2014లో న్యూయార్క్ లో సొషానా రాబర్ట్స్ అనే మహిళ 10 గంటల పాటు నడిచినప్పుడు దాదాపు 100 సార్లు ఇలాంటి వేధింపులకు గురైంది. ఆమె ఈ అనుభవాన్ని వీడియోగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అయి, ప్రపంచవ్యాప్తంగా క్యాట్ కాలింగ్‌పై చర్చకు తెరలేపింది.అంటే ఒకమ్మాయి రోడ్డు మీద గంటసేపు నడిస్తే కనీసం పదిసార్లు ఎవరో ఒకరు ఆమెను అదోలా చూడడమో, ఏదో ఒకటి అనడమో జరుగుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే భయంగా లేదా?సరే ఇది ఒక వైపైతే, నిమజ్జనం చివరి రోజు ఆ జనాల మధ్య ఎంతమంది మగాళ్లు ఆడవాళ్లని తాకరాని చోట తాకుతూ ఎంత హింసకు గురిచేస్తారో, ఈ దేశంలోని ప్రతి మహిళ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవానికి గురయ్యే ఉంటారు. ఇది కేవలం నిమజ్జనానికి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ ఎప్పుడు జనాలు గుమిగూడినా జరిగే విషయమే.ఒక్క ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర, కేవలం వారం రోజుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 285 మందిని అరెస్ట్ చేశారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి.లైంగిక వేధింపు అనేది కేవలం స్త్రీల సమస్య కాదు, ఇది మన సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. ఈసారి ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి ఏదైనా అనాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా అక్కడ మీ అమ్మో, అక్కో, చెల్లో ఉంటే ఏం చేస్తారు అని ఒక్కసారి ఆలోచించమని మై డియర్ మగాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు ఈ సమస్య బయట వేరేవరో కాదు మీ అక్క, మీ చెల్లి కూడా ఎదుర్కొంటున్నారని ఆలోచించమంటున్నాను. -
Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనం వేళ డీజేల హోరు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో వినాయకుడు మోత మోగించేశాడు. గణేష్ నిమజ్జనం వేళ డీజేలు, టపాసులతో హోరెత్తించారు. గ్రేటర్‌వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడింది. నివాస, సున్నితమైన ప్రాంతాలలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్దేశించిన దాని కంటే చాలా రెట్లు ధ్వని కాలుష్యం మించిపోయింది. పీసీబీ పరిమితులను గణేష్ మండప నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. రాత్రి వేళల్లో డీజేలు, టపాసుల మోతతో కాలనీలు దద్ధరిల్లిపోయాయి. సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా పీసీబీ, మున్సిపల్, పోలీసు విభాగాలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. శబ్ద కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 👉గణేష్ ఊరేగింపుల్లో డీజేల చప్పుళ్లు, లౌడ్ స్పీకర్లు, జనరేటర్ల వినియోగం, టపాసులు కాల్చడం, వాహనాల హారన్లు, యువతీయువకులు బూరలతో శబ్దాలు చేయడం తదితర కారణాలతో నిమజ్జనం వేళ పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదైంది. ప్రధానంగా హుస్సేన్‌సాగర్, అబిడ్స్, బహదూర్‌పురా, చార్మినార్, ఖైరతాబాద్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, బాలాపూర్, రామాంతాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఎక్కువగా నమోదైంది. ఆయా ప్రాంతాల్లోని నివాసితులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేరే రాష్ట్రాల్లో కేసులు.. పుణే, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి, పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించిన గణేష్ మండప నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, మన దగ్గర మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో అధిక శబ్దాలను గుర్తించేందుకు పోలీసులు ప్రధాన రహదారుల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేశారు. కానీ, వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి.వినికిడి సమస్యలు.. మితిమీరిన శబ్దాలతో చిన్న పిల్లల కర్ణభేరి సూక్ష్మ నాడులు దెబ్బతింటాయి. వృద్ధులకు వినికిడి శక్తి లోపించే ప్రమాదం ఉంది. పరిమితికి మించి శబ్ధాలతో తలనొప్పి, చికాకు, గుండె స్పందనలో వేగం, రక్త ప్రసరణ పెరగడంతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. 65 డెసిబుల్స్‌కు మించిన ధ్వనితో గుండె జబ్బులు, చెవుడు కూడా రావచ్చు. -
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు
రాజాం సిటీ: అంతవరకు అందరితో కలిసి డీజే ముందు డ్యాన్స్ చేసిన యువకుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మున్సిపాలిటీ పరిధి పొనుగుటివలస గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జనంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వావిలపల్లి వినయ్ అనే ఇరవై ఏళ్ల యువకుడు వినాయకుని నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే వద్ద డ్యాన్స్‌చేసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం గమనించిన కొంతమంది యువకులు అతనిని పరిశీలించగా అపస్మారకస్థితిలో ఉన్నట్లు గుర్తించి సపర్యలు చేపట్టి ఇంటికి చేర్చారు. అక్కడ నుంచి రాజాంలోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. గుండె సంబంధిత సమస్యగా గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిఫర్ చేశారు. అక్కడ నుంచి విశాఖపట్నం తరలించారు. డీజేల వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నా యువత పట్టించుకోకపోవడం విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రాజాం టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్‌కుమార్, హెచ్.ఉపేంద్ర వద్ద ప్రస్తావించగా.. డీజేలకు ఎటువంటి అనుమతుల్లేవన్నారు. వినాయక నిమజ్జనాల్లో డీజేలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా.. డీజే అఖిల్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : బంజారాహిల్స్ కేంద్రంగా పలు పబ్బుల్లో డీజేగా పనిచేస్తున్న అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు రెక్కీ నిర్వహించారు. అయితే ఓ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతుండగా అఖిల్‌ను హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పాటు నిందితుడు వద్ద గంజాయిని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తెచ్చి సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపాడు. ఇక డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ అఖిల్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ ఎవరికి అమ్మాడు, వారిలో సెలబ్రిటీలు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పాయింట్ బ్లాంక్‌లో డీజేపై కాల్పులు
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం(మే27) తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని ఓ బార్లో పనిచేస్తున్న డీజే సందీప్‌ను దుండగులు పాయింట్‌బ్లాక్ రేంజ్లో కాల్చి చంపారు. తొలుత ఆదివారం రాత్రి నలుగురు దుండగుల బ్యాచ్ బార్లోకి ప్రవేశించింది. బార్లో డీజే మ్యూజిక్ ప్లే చేస్తుండటంపై వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై డీజే సందీప్‌తో పాటు బార్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారు వెళ్లిపోయారు. గొడవ సద్దుమణిగిందనుకునేలోపు మళ్లీ సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో డీజే సందీప్‌ను తుపాకీతో ఛాతిపై కాల్చారు. వెంటనే సందీప్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సందీప్‌ను ఛాతిపై తుపాకీతో కాల్చే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
పెళ్లిలో భర్తతో డాన్స్.. కొన్ని గంటల్లోనే మృతి
మక్కువ: పెళ్లైన ఆనందంలో భర్తతో కలిసి డాన్స్ చేసిన నవ వధువు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగెడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దబ్బగెడ్డ గ్రామానికి చెందిన భాస్కరరావుతో పార్వతీపురం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన అఖిల(20)కు శుక్రవారం రాత్రి పెళ్లి జరిగింది. మాంగల్యధారణ అనంతరం శనివారం తెల్లవారు జామున 3 గంటల వరకు ఊరేగింపు సాగింది. డీజే పాటలకు భర్తతో కలిసి అఖిల డాన్స్ చేసింది. అనంతరం నీరసంగా ఉందంటూ నిద్రలోకి జారుకుంది. తర్వాత బంధువులు వెళ్లి లేపగా, ఎంతకూ లేవకపోవడంతో వెంటనే మక్కువ పీహెచ్‌సీకు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అందిన అనంతరం మెరుగైన చికిత్స కోసం సాలూరు సీహెచ్‌సీకు తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అఖిలకు తల్లిదండ్రులు లేరు. నానమ్మ, తాతయ్యల వద్దే పెరిగింది. ముందు రోజు ఉపవాసం ఉండటం, పెళ్లి తర్వాత డాన్స్ వేయడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై మృతి చెంది ఉండవచ్చునని గ్రామస్తులు, బంధువులు భావిస్తున్నారు. -
డీజే సౌండ్‌తో గుండెపోటుకు గురై మహిళ మృతి.. డీజే ఏర్పాటు చేసింది?
కొండమల్లేపల్లి: దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లిలో ఓ రాజకీయ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో డీజే సౌండ్ కారణంగా ఓ మహిళ గుండెపోటుకు గురై మృతి చెందింది. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన గుంటోజు అమృతమ్మ(51) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోర్ పిన్ డిజే సౌండ్స్‌తో తీవ్రమైన శబ్దాన్ని తట్టుకోలేక అమృతమ్మ గుండెపోటుకు గురై కుప్పకూలింది. దీంతో స్థానికులు ఆమెను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమృతమ్మను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు ఏమీ అందలేదని పోలీసులు తెలిపారు. కోళ్ల దాణా లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా మాడుగులపల్లి: కోళ్ల దాణా బస్తాల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన మాడుగులపల్లి మండల పరిధిలోని టోల్‌ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి కోళ్ల దాణా(సోయాపొట్టు) బస్తాల లోడ్‌తో లారీ ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు బయల్దేరింది. మార్గమధ్యలో మాడుగులపల్లి టోల్‌ప్లాజా సమీపంలో రోడ్డు దిగుడుగా ఉండడాన్ని డ్రైవర్ గుర్తించకపోవడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దాణా బస్తాలను మరో లారీలోకి లోడ్ చేసి క్రేన్ సాయంతో బోల్తా పడిన లారీని పైకెత్తారు. -
ఫస్ట్ లేడీ డీజే..ప్రపంచంలోనే టాప్-100లో చోటు
డిస్కోనైట్ అయినా, పెళ్లి బరాత్, దావత్ ఏదైనా డీజే మోత మోగి పోవాల్సిందే. నచ్చిన పాటను అడిగి మరీ పెట్టించుకుని స్టెప్పులతో ఊగిపోతుంది నేటి యువతరం. వెరైటీగా మిరుమిట్లు గొలిపే డ్రెస్ వేసుకుని, ఉత్సాహం నింపే పాటలను పెడుతూ ఊగిపోతుంటాడు డీజే. అబ్బాయిలు మాత్రమే డీజేగా కనిపిస్తుంటారు. కానీ డీజేవాలి దీది పురుషులకు ఏ మాత్రం తగ్గకుండా డీజేను దంచి కొడుతోంది. తన రీమిక్స్ బీట్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తూ, సరికొత్త బాటలో నడిచేందుకు నేటి యువతరానికి మార్గం చూపుతోంది డీజే రింక్. డీజే రింక్ మరెవరో కాదు 38 ఏళ్ల స్నేహల్ షా. గుజరాత్లో పుట్టినప్పటికీ ముంబైలో పెరిగింది. షాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తయ్యాక... కామర్స్‌లో పీజీ చేసింది. మార్కెటింగ్ కంపెనీలో చేరింది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్నేహల్ మన సంతా సంగీతంపైనే ఉండేది. దీంతో.. మంచి మంచి పాటలను వినడం, వాటన్నింటినీ తన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో భద్రపరుచుకోవడం అలవాటుగా మార్చుకుంది. ఇలా స్నేహల్ కలెక్ట్ చేసిన వాటిలో బాలీవుడ్ పాటలు కోకొల్లలు. సంగీతంపై ఉన్న మక్కువతో సౌండ్ ఇంజినీరింగ్ డిప్లొమా కూడా చేసింది. డీజే రింక్గా... ఒకసారి స్నేహల్ పార్టీకి వెళ్లింది. అక్కడ ఎంతో ఉత్సాహమైన డీజే పాటలు వస్తున్నాయి. తనకిష్టమైన పాటను ప్లేచేయమని డీజేను అడిగింది. అందుకు ఆ డీజే ప్లేచేయడం కుదరదు అన్నాడు. దీంతో తనే ప్లే చేసుకుంటాను అని అడిగి పాటను ప్లే చేసింది. అప్పటి నుంచి తను కూడా డీజేగా మారాలనుకుని.. ప్రముఖ డీజే జో అజెరెడో, డీజే సుకేతు దగ్గర డీజే శిక్షణ తీసుకుంది. నైపుణ్యాలన్నింటిని ఔపోసన పట్టాక 2015లో డీజే రింక్గా మారింది. వివిధ రకాల క్లబ్స్‌లో పనిచేస్తూ ‘డీజేయింగ్’ సంబంధించిన అప్డేటెడ్ టెక్నాలజీ గురించి తెలుసుకునేది. స్నేహల్ ఇష్టాన్ని తల్లిదండ్రులు వెన్నంటే ఉండి ప్రోత్సహించేవారు. తల్లిదండ్రులు ముద్దుగా పిలుచుకునే ‘రింకు’ పేరునే ... డీజే రింక్గా మార్చుకుని డీజే ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పదమూడులో పాపులర్... డీజే రింక్ ఈడీఎమ్ ‘‘ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్’’లో కష్టపడి నైపుణ్యం సాధించింది. ముఖ్యంగా హిప్ హాప్, బాంగ్రా పాటలను ప్లేచేయడంలో అందె వేసిన చెయ్యిగా పేరుగాంచింది. పండుగల్లో రీమిక్స్ చేసిన పాటలను కూడా ప్లే చేసేది. అవి అందరినీ ఆకర్షిస్తుండడంతో డీజే రింక్ 2013లో బాగా పాపులర్ అయ్యింది. దీంతో భారతదేశంలో బాలీవుడ్ పాటలను మిక్స్ చేసే తొలి మహిళా డేజేగాను, ఇండియాలోని టాప్ –22 డీజేలలో ఒకటిగా నిలిచింది. పురుషుల ఆధిపత్యం కొనసాగే డిజే సౌండ్స్‌లో రింక్ ఏమాత్రం భయపడలేదు. ప్రారంభంలో పురుష డీజేలతో కలిసి పనిచేయడం కష్టం అయినప్పటికీ.. తనని తాను నిరూపించుకుని తన కలను నిజం చేసుకుంది. అందర్నీ బీట్ చేస్తూ... మంచి మంచి బీట్స్‌ను అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు అనేక రికార్డులను బద్దలు కొడుతోంది స్నేహల్ షా. మల్టీటాలెంటెడ్ సింగర్, రీమిక్సర్, పెర్ఫార్మర్గా అనేక ప్రశంసలు అందుకుంటోంది. సోనీ మ్యాక్స్ ఐపీఎల్ సీజన్ –6లో పాల్గొన్న ఒక్కగానొక్క మహిళా డీజే రింక్ కావడం విశేషం. గత పదేళ్లుగా ప్రపంచంలోని డీజేలతో పోటీ పడుతూ టాప్–100 జాబితాలో ఇండియా తరపున తనకంటూ స్థానం కల్పించుకుంది. 2023 సంవత్సరానికి గాను ఏషియా టాప్–50 డిజేల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది రింక్. అంతేగాక ఇటీవల ‘బెస్ట్ వెడ్డింగ్ డీజే’ అవార్డును అందుకుంది. శ్రావ్యమైన బీట్స్‌తో సాగిపోతున్న డిజే రింక్ ఎంతోమంది మహిళలు, అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది. అనాదిగా వస్తోన్న పద్ధతులను దాటుకుని తమని తాము నిరూపించుకోవచ్చని తన బీట్స్‌తో చక్కగా వినిపిస్తోంది. ఇప్పటిదాక రెండు వేల బాలీవుడ్ పాటలను రీమిక్స్ చేసింది. డిజే స్కూల్ నడుపుతూ మరింతమంది డీజేలను తయారు చేస్తోంది. ‘‘డీజే రింక్స్ సౌండ్ ఫ్యాక్టరీ’’ పేరిట యూ ట్యూబ్ ఛానల్ నడుపుతోంది. అమృతారావ్, జాన్ అబ్రహమ్, కరణ్ గ్రోవర్, ఇలియానా డిక్రూజ్ వంటి బాలీవుడ్ సెలబ్రెటీలతో స్టేజ్ పంచుకుంది.‘‘ద వే యూ లైక్ మి’’ పేరిట రింక్ విడుదల చేసిన తొలి ఆల్బమ్‌కు మంచి ఆదరణ లభించి, బాగా పాపులర్ అయ్యింది. View this post on Instagram A post shared by DJ RINK (@djrinkindia) View this post on Instagram A post shared by DJ RINK (@djrinkindia) -
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని
కరీంనగర్: డీజే పాటలు.. స్నేహితులతో డ్యాన్సులు.. చుట్టూ కేరింతలు.. ఆనందంతో ఆడిపాడుతున్న ఓ బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. అధ్యాపకులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. గుండెపోటుతో మరణించింది. గంగాధర మండలం కొండన్నపల్లి శివారులోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో విషాదం నెలకొంది. శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ విద్యార్థిని గుండు ప్రదీప్తి(16) గుండెపోటుతో మృతి చెందింది. గంగాధర మండలంలోని వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన గుండు అంజయ్య–శారదల కూతురు ప్రదీప్తి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేస్తూ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కుప్పకూలింది. ఉపాధ్యాయులు వెంటనే సీపీఆర్ చేస్తూ.. గంగాధర ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తుండగా.. మార్గంమధ్యలో చనిపోయింది. ప్రదీప్తి చిన్నప్పుడే గుండెకు రంధ్రం ఉండగా.. మందులు వాడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
స్నేహితురాలి వివాహ రిసెప్షన్.. డాన్స్ చేస్తూ ఇంజినీర్ మృతి
తిరువొత్తియూరు: చైన్నె ముగప్పేర్‌లో తన స్నేహితురాలి వివాహ రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తున్న ఇంజినీర్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. చైన్నెలోని తాంబరం, చిట్లపాక్కానికి చెందిన ఇంజినీర్ మణిప్రసాద్ (21) సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతను తాంబరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనితో అదే సంస్థలో పని చేస్తున్న స్నేహితురాలికి ముగప్పేర్ వెస్ట్ లోని కల్యాణ మండపంలో వివాహం జరిగింది. ఇందులో మణిప్రసాద్, ఆయనతో పాటు పనిచేసే స్నేహితులు పాల్గొన్నారు. రిసెప్షన్ జరిగినప్పుడు ఓ పాటకు మణిప్రసాద్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ స్ఫృహతప్పి పడిపోయాడు. షాక్‌కు గురైన అతని స్నేహితులు శ్యామ్, భరత్ మణిప్రసాద్ను కీల్పాకం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మణిప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. నొలంబూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి భర్త అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్ మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన భార్య నేహా దేశ్‌పాండే పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. అతడు డీజే నిర్వాహకులతోపాటు ఈవెంట్లలో మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని, గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ నుంచి వీటిని ఖరీదు చేసేవాడని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన మోహిత్ 2014లో ‘ది అన్‌స్క్రిప్టెడ్’పేరుతో సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరుల్లో జరిగే అనేక ఈవెంట్లు, పబ్స్‌కు డీజేలు సరఫరా చేస్తున్నాడు. గోవాలో సన్‌బర్న్ బీచ్ క్లబ్ సహా అనేక భారీ ఈవెంట్స్ నిర్వహించాడు. ఆయా పబ్స్ నిర్వాహకులతో కలిసి వాటిలో ప్రత్యేకంగా రేవ్ పార్టీలు నిర్వహించే వాడు. దీనికోసం ఎడ్విన్‌సహా దాదాపు 50 మంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి నుంచే కొకైన్ ఖరీదు చేసి సరఫరా చేసేవాడు. ‘క్రూయిజ్’లో ఆధారాల్లేక.. గతేడాది అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు ముంబై క్రూయిజ్ డ్రగ్ పార్టీపై దాడి చేసి షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ సహా పలువురిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహిత్ కూడా అదే క్రూయిజ్‌లో ఉన్నా ఇతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోవడం, ఆర్యన్‌తో సంబంధాలపై ఆధారాలు లేకపోవడంతో అధికారులు విడిచిపెట్టారు. గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్‌ను హెచ్–న్యూ అధికారులు గతేడాది నవంబర్ 5న అరెస్టు చేసి విచారించగా మోహిత్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు గోవా, ముంబైల్లో తలదాచుకున్నాడు. హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్ నేతృత్వంలోని బృందం అతడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించింది. మోహిత్ ‘డిసెంబర్ 31’న గోవాలో రూ.2 కోట్లు వెచ్చించి భారీ ఈవెంట్ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న హెచ్–న్యూ బృందం అక్కడికి వెళ్లగా త్రుటిలో తప్పించుకుని విమానంలో హైదరాబాద్ వచ్చేశాడు. వేట కొనసాగించిన హెచ్–న్యూ ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకుంది. రామ్‌గోపాల్‌పేట ఠాణాలో ఉన్న ఎడ్విన్ కేసులోనూ రిమాండ్‌కు తరలించింది. విచారణలో నగరానికి చెందిన అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులతో అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. అయితే వారిలో ఎందరు డ్రగ్స్ ఖరీదు చేశారు? ఏఏ పబ్స్ నిర్వాహకులతో అతడికి ఒప్పందాలు ఉన్నాయనే వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ దందాలో మోహిత్ భార్య నేహా దేశ్‌పాండేకు ఏమైనా లింకు ఉందా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేహా దేశ్‌పాండే ‘ది కిల్లర్, దిల్ దివానా, బెల్స్’తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఇదీ చదవండి: సర్వం ‘త్రిమూర్తుల’ కనుసన్నల్లోనే! -
హైదరాబాద్ వాసుల్లో న్యూ ఇయర్ జోష్.. ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు బంద్..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు పూర్తిస్థాయిలో జరగనున్నాయి. యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు స్వాగతం పలు కుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. తక్కువ ధరలో ఎంట్రీ.. నగరవాసుల నుంచి స్పందన ఎలా ఉంటుందో అనే భావనతో చాలా వరకూ న్యూ ఇయర్ ఈవెంట్లకు ధరలను కొంతవరకు అందుబాటులోనే నిర్ణయించారు. సూపర్ సోనిక్ టేకోవర్ పేరుతో నోవోటెల్ నిర్వహిస్తున్న ఈవెంట్‌కి రూ.999 ఆపై ధరలోనే ఎంట్రీ ఫీజు నిర్ణయించగా... తాజ్ డెక్కన్ ఎ నైట్ ఇన్ ప్యారిస్.. థీమ్ ఈవెంట్ కు బుకింగ్ ధర రూ. 1200తో ప్రారంభించింది. పార్క్ హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పారీ్టకి రూ.2,499 ధర నిర్ణయించారు. పార్టీ యానిమల్స్‌కు కేరాఫ్ లాంటి ప్రిజ్మ్ క్లబ్ అండ్ కిచెన్‌లో ది ప్రిజ్మ్ సర్కస్ ఈవెంట్‌కు రూ.4వేల నుంచి ధర నిర్ణయించారు. ఓపెన్ ఆడిటోరియంలలో నిర్వహిస్తున్న చాలా ఈవెంట్లకు రూ.1000కు సమీపంలోనే ధరలు ఉన్నాయి. తరలివస్తున్న సంగీతం... నోవోటెల్లో ఆర్టిస్ట్ ఎమ్కెషిÙఫ్ట్... (ఎమ్కెఎస్హెచ్ఎఫ్టీ) పేరొందిన లైవ్బ్యాండ్తో కలిసి నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నో పాజ్ పారీట్ల డిజెషాన్, ఆర్యన్ గాలా, రికాయాలు పాల్గొంటున్నారు. ఓం కన్వెన్షన్ దర్శన్ రావల్‌తో వేడుక ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ తెలుగు పాప్/సినీ గాయకుడు రామ్ మిరియాల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో థండర్ స్టైక్ పార్క్ పాటలతో అలరించనున్నారు. కంట్రీక్లబ్‌లో నిర్వహిస్తున్న ఈవెంట్లో డిజె ఆసిఫ్ ఇక్బాల్, గాయని అలీషా చినాయ్, అభిజిత్ సావంత్, బాంబే వైకింగ్స్, సినీతార స్నేహగుప్తా తదితరులు పాల్గొంటున్నారు. గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ మస్కిరాడె మిస్టరీ పార్టీ, ఏషియన్ ఫీస్టా థీమ్ పార్టీని నిర్వహిస్తోంది. డిజె షరాన్, అమీర్లు అతిథులను ఉత్సాహపరచనున్నారు. వండర్లాలో.. సన్‌బర్న్.. కొన్నేళ్లుగా నగరంలో అతిపెద్ద పార్టీ ఈవెంట్‌గా పేరొందిన సన్‌బర్న్ తిరిగొచ్చింది. సన్‌బర్న్ రీలోడ్ ఈవెంట్ నగరశివార్లలోని వండర్ లా అమ్యూజ్మెంట్ పార్క్‌లో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి నిర్వహిస్తున్నామని.. ఇందులో ఇటాలియన్ సెన్సేషన్ జియాన్ నోబిలీ, డైనమిక్ డీజె ఈడీఎం సంగీతానికి పేరొందిన జెఫిర్టోన్ – టీ–మ్యాటర్స్‌తో పాటుగా డీజె వివాన్‌లు అతిధుల్ని అలరిస్తారని నిర్వాహకులు వివరించారు. మందుబాబులూ.. పారాహుషార్ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పే వేళ.. డ్రంకెన్ డ్రైవ్‌లు చేపట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టనున్నారు. బార్లు, పబ్‌లు, వినోద కేంద్రాలు ఉండే వాణిజ్య ప్రాంతాల్లోని మార్గాలలో ట్రై కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టారు. ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్ల నేతృత్వంలోని బృందాలు 31న రోజంతా విధులు నిర్వర్తిస్తారు. బ్రీత్ అనలైజర్లు, బారికేడ్లు ఇతరత్రా ఉపకరణాలను సిద్ధం చేశారు. మహిళా డ్రైవర్లు, మద్యం తాగిన మహిళలను తనిఖీలు చేస్తున్న సమయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి డీడీ చెకింగ్ కోసం ఎక్కువ సంఖ్యలో మహిళా ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు విధులు కేటాయించామని ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు బంద్.. ► 31 రాత్రి నుంచి జనవరి 1న తెల్లవారు జాము వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్ రింగ్ రోడ్డులతో పాటు ఫ్లైఓవర్లు మూసివేసే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్, సరైన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తేనే ఆయా రోడ్లలో అనుమతి ఇస్తారని పేర్కొన్నారు. ► మద్యం మత్తులో వాహనాలు నడిపినా, ర్యాష్ డ్రైవింగ్, బైక్‌లపై విన్యాసాలు చేసినా, మైనర్లు డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు మూడు నెలలు లేదా శాశ్వతంగా రద్దు చేస్తారని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
అదిరేటి స్టెప్పు మేమేస్తే (ఫొటోలు)
-
డీజే ప్రవీణ్‌తో సుజాత వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య
నల్గొండ (భువనగిరి) : వివాహేతర సంబంధం బయటపడుతుందని ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా కడతేర్చింది. ఆపై ఇద్దరూ కలిసి మృతదేహాన్ని బ్రిడ్జి పైనుంచి కిందపడేసి ప్రమాదంగా చిత్రీకించారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో ఇద్దరు నిందితులు కటకటాలపాలయ్యారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేటశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లా నర్మెట మండలం హన్మంత్‌పూర్ గ్రామానికి చెందిన లకావత్ కొంరెల్లి తన భార్య లకావత్ భారతి అలియాస్ సుజాతతో కలిసి జీహెచ్ఎంసీలో పనిచేస్తూ సికింద్రాబాద్‌లోని నామలగుండు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వివాహ వేడుకలో పరిచయమై.. రెండేళ్ల క్రితం ఓ వివాహ వేడుకలో డీజే ప్లే చేసే జనగాం జిల్లా అడవి కేశవపురం గ్రామానికి చెందిన దరావత్ ప్రవీణ్‌తో సుజాతకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంరెల్లి ఈ నెల 18న సొంతూరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. ఆ వెంటనే సుజాత ప్రియుడు ప్రవీణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. ఇంటికి చేరుకుని దారుణం చూసి.. అయితే, కొంరెల్లి అందరూ నిద్రపోయాయక అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో సుజాతతో ప్రవీణ్ సఖ్యతగా మెలుగుతుండడాన్ని చేసి హతాశుడయ్యాడు. ఇదేమిటని భార్యతో గొడవపడ్డాడు. ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని సుజాత, తన ప్రియుడు ప్రవీణ్‌తో కలిసి కొంరెల్లి మెడకు చున్నీతో ఉరి బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం అదే రోజు రాత్రి కొంరెల్లి మృతదేహాన్ని బైక్‌పై వేసుకుని వరంగల్ ప్రధాన రహదారి మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యలో భువనగిరి మండలం అనంతారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి పై నుంచి మృతదేహాన్ని కింద పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. కాగా, కొంరెల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘాతుకాన్ని అంగీకరించింది. అనంతరం ప్రవీణ్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద బైక్, చున్నీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐ వెంకటయ్య, ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌లు పాల్గొన్నారు. -
పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు కొరడా.. కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్స్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు డీజేలపై నిషేధం విధించింది. డీజేలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: నేను రాజీనామా చేస్తా..! సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉందని, రాత్రి వేళల్లో ఎటువంటి సౌండ్ సిస్టంకు అనుమతి లేదని హై కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఇళ్లు, విద్యాసంస్థల ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. పబ్‌లకు ఏ అంశాలను పరిగణించి అనుమతులు ఇచ్చారో ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల టాట్ పబ్ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ల తరపున హైకోర్టు న్యాయవాది కైలాష్ నాథ్ వాదించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
వ్యానులోని డీజేతో కరెంటు షాక్.. 10 మంది కన్వరియాలు దుర్మరణం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కూచ్బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురై అందులో ప్రయాణిస్తున్న 10 మంది కన్వరియాలు ప్రాణాలు కోల్పోయారు. వ్యాను జల్పేష్ వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వ్యానులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పది మంది అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొన్నారు. 16 మందిని జల్పాయ్ గుడి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. వ్యాను వెనుకాల ఏర్పాటు చేసిన డీజే జనరేటర్ తీగలతోనే విద్యుదాఘాతం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గంగనది పవిత్ర జలం కోసం కన్వరీలతో యాత్ర చేపట్టే శివుని భక్తులను కన్వరియాలు అంటారు. వీరు ఏటా కన్వరియాత్రలో పాల్గొంటారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి -
డీజే కమ్స్ డ్రగ్ అడిక్ట్... డ్రగ్ డీలర్
సిటీలో డిస్క్ జాకీలుగా కదం తొక్కుతున్న కుర్రాళ్లు డ్రగ్స్ కీలల్లో మాడిమసైపోతున్నారు. టీనేజ్ యువతకు క్రేజీ ప్రొఫెషన్‌గా ఇట్టే ఆకట్టుకునే ఈ వృత్తి ఇప్పుడు కొందరి పాలిట యమపాశంగా మారుతోంది. వారు నచ్చి మెచ్చిన సంగీతమే వారి చుట్టూ మరణమృదంగం మోగిస్తోంది. చుట్టూ లగ్జరీ.. వ్యసనాలపై సవారీ... సిటీ పబ్స్‌లో, క్లబ్స్‌లో ఈవెంట్లలో డీజెలుగా పనిచేసే కుర్రాళ్లలో అత్యధికులు మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవారే. అరకొరగా ఉన్న డీజె స్కూల్స్‌లో లక్షలు వెచ్చించి కోర్సు చేసే ఈ కుర్రాళ్లకు ఆ తర్వాత జీతంగా లభించేది అంతంత మాత్రం. రూ.15 నుంచి 25 వేల లోపు జీతమే అయినప్పటికీ మ్యూజిక్ మీద ఉన్న క్రేజ్‌తో వీరు ఉద్యోగాలకు సై అంటారు. తదనంతరం వీరి చుట్టూ విలాసవంతమైన సమాజమే జతవుతుంది. మద్యపానం, ధూమపానం సర్వసాధారణ వ్యసనాలుగా మారతాయి. ఖర్చులకు ఏ మాత్రం సరిపోకపోవడంతో తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుంది. డిజె ముదిరి డ్రగ్ అడిక్ట్...డ్రగ్ డీలర్‌గా కూడా మారతాడు. మరోవైపు తాజా కరోనా, లాక్డౌన్ టైమ్‌లో పూర్తి ఆదాయం కోల్పోయిన డీజెలలో కొందరు మ్యూజిక్‌ని వదిలేసి ఇతర రంగాల్లోకి వెళ్లిపోతే..మరికొందరు ఇళ్లలో కూర్చుని ఆన్లైన్ ద్వారా ప్రొఫెషనల్ డ్రగ్స్ డీలర్లుగా మారిపోయారని సమాచారం. రేర్...రేవ్ బృందాలు... పబ్స్, క్లబ్స్‌కు వచ్చే కస్టమర్లకు బాగా సన్నిహితంగా మారేవాళ్లలో డీజేలే ముందుంటారు. కాబట్టి వెర్రెత్తించే సంగీతాన్ని ఇష్టపడేవారిని గుర్తించడం వీరికి సులభం. దీంతో ఈ రకమైన సంగీతాన్ని ఇష్టపడుతున్న వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడుతున్నారు. నగరంలో ప్రత్యేక పార్టీలను డీజేలు నిర్వహిస్తున్నారు. సదరు పార్టీల్లో రాజ్యమేలేదంతా అపరిమిత మత్తు...అందులో పడి చిత్తవ్వడమే. మెట్రోలతో మ్యూజిక్ అనుసంధానం.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటీలో డీజేలే నార్కొటిక్స్ కేసుల్లో బుక్ అవుతున్నారు. గోవాలో ఇది నిత్యకృత్యం అయింది కోట్ట రూపాయల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు వీక్లీ రైడ్స్‌లో వారి నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. చెన్నైకి చెందిన సౌండ్ ఇంజనీరింగ్ విద్యార్ధిని అరెస్ట్ చేసి రూ.8లక్షలు విలువైన సెకోట్రోపిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూర్లో పనిచేసే డీజే ధీరజ్ని అరెస్ట్ చేసినప్పుడు అతను హైదరాబాద్ సహా పలు నగరాల్లో క్లయింట్స్ ఉన్నట్టు చెప్పినట్టు సమాచారం. విదేశీ రాక...డ్రగ్స్‌కు కాక... డ్రగ్స్ హబ్ లాంటి గోవా చీప్ నార్కోటిక్స్‌కు కూడా పేరొందింది. దానితో గోవా డీజేలకు నగరం నుంచి డిమాండ్ పుంజుకుంది. అయితే అక్కడ వారానికోసారి డ్రగ్ రైడ్ నిర్వహిస్తున్నారు నార్కొటిక్ యాక్టివిటీస్‌లో జోక్యం పెరిగిందనే కారణంగా 2013లో గోవా íసీఎం విదేశీ డీజేలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దాంతో హైదరాబాద్ వైపు వీరు తమ చూపు మరల్చారని తెలుస్తోంది నగరానికి విదేశీ డీజేలను రప్పించడం కూడా డ్రగ్ కల్చర్‌కి ఊపు తెస్తోంది. (చదవండి: తలొగ్గేది ప్రేమకే.. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలిని: తమిళిసై) -
గరం సత్తితో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ హిలేరియస్ ఇంటర్వ్యూ
-
డీజే కొట్టు డీజే.. కరోనా లేదు గిరోనా లేదు!
మూడో వేవ్ ఉధృతిలో కరోనా కేసులు పొటెత్తుతున్నాయి. ఒకవైపు కేసుల సంఖ్య తగ్గిపోతుండడంపై కేంద్రం అప్రమత్తం అయ్యింది. టెస్ట్‌లను పెంచాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలిస్తూ.. వ్యాప్తి విషయంలో అప్రమత్తం చేస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ప్రచారం విషయంలో ఆంక్షలతో కట్టడికి ప్రయత్నిస్తోంది. అయితే.. కొందరు మాత్రం వైరస్ విషయంలో నిర్లక్క్ష్యం వహిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా ఆంక్షలను పట్టించుకోకుండా వేల మందితో ఓ నేత.. వివాహ వేడుక నిర్వహించిన ఘటన ఇప్పుడు గుజరాత్లో వెలుగు చూసింది. థాపి జిల్లాలో ఓ బీజేపీ నేత ఈ వేడుకను నిర్వహించాడు. రంగు రంగుల లైట్ల వెలుగుల్లో వేల మంది డీజే నృత్యాల్లో మునిగిపోయిన వీడియో ఒకటి అక్కడి వాట్సాప్ అకౌంట్లలో చక్కర్లు కొడుతోంది. గుజరాత్ కొవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం.. పెళ్లికి 150మందికి మించకూడదు. కానీ, డోవ్లాన్ బ్లాక్‌లో నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నేత సునంద ఈ వేడుకను నిర్వహించాడు. వేల మంది హాజరై.. భౌతిక దూరం, మాస్క్‌లను మరిచి చిందులేశారు. మధ్యలో కానిస్టేబుల్స్ వచ్చి వారించినప్పటికీ.. వాళ్లను బెదిరించి పంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పక్ష నేత కావడంతో వైరల్ అయిన ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే.. గుజరాత్లో ప్రస్తుతం 70వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: పగలంతా బొమ్మ.. రాత్రి కాగానే దెయ్యం! -
‘ఏదో రాసి, పాడేసి.. మార్కెట్టులో వదిలాను’ అనుకోవడం సరికాదు..
Mumbai DJ Model Ambika Nayak: ముంబైకి చెందిన కయన్ డిజే, మోడల్, రైటర్, సింగర్. తల్లి దగ్గర గాత్రసంగీతాన్ని అభ్యసించింది. హిప్–హప్, గెట్టో టెక్, ఆర్ అండ్ బీ...ఇలా రకరకాల మ్యూజిక్ జానర్స్ అంటే ఇష్టం. సీబీ హోయో, జెమిమా కిర్కే. జోర్జా స్మీత్, బ్రెంట్ ఫయాజ్... మొదలైనవారి నుంచి ఇన్స్పైర్ అయింది. ‘కూల్కిడ్స్’ పాటతో బాగా పేరు తెచ్చుకుంది కయన్. ‘ఏదో రాసి, పాడేసి మార్కెట్టులో వదిలాను’ అనుకునే ధోరణి ఎప్పుడూ విజయవంతం కాదు అని నమ్ముతుంది కయన్. అందుకే తన పాట మార్కెట్ ను తాకే ముందు ఎప్పటికప్పుడు మరింత బెటర్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రచనకు అవసరమైన ముడిసరుకును తన అనుభవాల్లో నుంచి తీసుకొని రాస్తుంది. అందుకే ఆ పాటలు సహజంగా ఉంటాయి. పనిలో నుంచి సంగీతం పుట్టింది కదా! అందుకే పాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో పనికీ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడైనా ఒత్తిడికి గురైనప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తుంది. నడుము వంచి ఇల్లంతా క్లీన్ చేస్తుంది. ‘ఖాళీ సమయంలో ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు కాస్త వెరైటీగా ఇలా సమాధానం చెప్పింది.... ‘ఖాళీ సమయంలో కూడా ఏదో ఒక పని చేస్తూ ఎంజాయ్ చేస్తాను’. అదిసరే, ‘కయన్’ అనే పేరు కాస్త వెరైటీగా ఉందేమిటీ? అనుకుంటున్నారా! ఏమీలేదండీ...ఆమె అసలు పేరు అంబికా నాయక్. సర్నేమ్ ‘నాయక్’ను తిరగేసి కయన్ అయింది. అంతే!! చదవండి: Rewind 2021: సామాన్యురాలు ఫోర్బ్స్' లిస్టులో.. విశ్వకిరీటం మరోసారి View this post on Instagram A post shared by Ambika Nayak (@kayan.a) -
డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో..
You can enjoy your New Year's eve in these best possible ways కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు చివరి రోజు కూడా వచ్చేసింది. ఐతే న్యూ ఇయర్ రోజును ఎలా జరుపుకోవాలబ్బా? అని ప్రతి ఒక్కరూ బుర్రలు గోక్కుంటున్నారు కదా! మీ కోసం మా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి. అవేంటంటే.. హౌస్ పార్టీ మీ ఇంటి టెర్రస్ పై కానీ, ఇంట్లోనైనా సరే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదా సరదాగా చేసుకోవచ్చు. టెర్రస్ పై ప్లాన్ చేస్తే చలి కాలం కాబట్టి చలిమంట వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇష్టమొచ్చినంత సమయం ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేస్తారా మరి? టాప్ రేటెడ్ హోటల్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పార్టీ ఇది. ఐతే స్పెషల్ అకేషన్‌ను ఇంకా స్పెషల్‌గా జరుగుకోవాలనే వారికోసం న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. లగ్జరియస్ డ్రింక్స్, ఫుడ్స్‌తోపాటు డీజే మ్యూజిక్ కూడా ఉంటుంది. మీ నూతన సంవత్సరాన్ని రాయల్‌గా ప్రారంభించాలనుకునే వారు ముందుగా ఇటువంటి హోటల్స్‌లో టేబుల్‌ను బుక్ చేసుకుంటే సరి. పార్టీ ప్లాన్ రెడీ అయిపోయినట్టే! రెస్టారెంట్ ట్రీట్ భోజన ప్రియులకు ఇది బెస్ట్ ఐడియా. న్యూ ఇయర్ సందర్భంగా చాలా రెస్టారెంట్లు బఫే డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నాయి. బఫెట్ డిన్నర్లో రకరకాల డిసర్ట్ను మీ ప్లేట్ సర్దేసుకుని మీ నోటిని తీపి చేసుకోవడం ద్వారా నూతన సంవత్సరంలోకి తియ్యతియ్యగా అడుగుపెట్టవచ్చు. ఐతే టేబుల్ ముందే బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండే! లాంగ్ డ్రైవ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఇది కూడా మంచి ఐడియానే. సొంత వెహికల్లో, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వింటూ, మీకిష్టమైన వారితో అలా.. లాంగ్ డ్రైవ్ కెళ్లారంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా! ఐతే ఇద్దరు, ముగ్గురు సన్నిహితులతోనే ఇలా ప్లాన్ చేస్తేనే బాగుంటుంది సుమా! బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు స్నేహితులు లేదా బంధువులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలనుకునే వారు ఓపెన్ ప్లేస్ (బహిరంగ ప్రదేశాలకు)లకు వెళ్లడం ఉత్తమం. మ్యూజిక్ ఎంత సౌండ్‌తో విన్నా మిమ్మల్ని వారించేవారెవ్వరూ ఉండరు. లగ్జరీ డెకరేషన్, లైట్ల వెలుగులో సన్నిహితులతో నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఐడియా. బార్బెక్యూ డిన్నర్ కూడా మంచి ఎంపికే. పై మార్గాల్లో మీకు నచ్చిన ఐడియాని ఫాలో అవ్వండి. చెప్పనలవి కానంత ఆనందాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టండి. ఐతే గత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు! చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
హైదరాబాద్ కొత్త సంవత్సర వేడుకలు.. కండిషన్స్ అప్లై
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో జంట నగరాల్లో న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ పేరిట మార్గదర్శకాలు జారీ అయ్యాయి. పబ్‌లు, రెస్టారెంట్లతో పాటు నగర వాసులు వీటిని తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసారి నగర న్యూ ఇయర్‌పార్టీల్లో డీజేలకు అనుమతి ఉండదు. పబ్‌లు, రెస్టారెంట్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ ఈవెంట్లు నిర్వహించాలి. పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటారు. అలాగే కొవిడ్ రూల్స్‌ను అతిక్రమించినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. రెండూ డోసులు తీసుకున్న వారికే మాత్రమే ఈవెంట్లకు అనుమతి ఇవ్వాలని, కొవిడ్ పరీక్షలు నిర్వహించాకే వాళ్లను అనుమతించాలని ఈవెంట్ నిర్వాహకులకు తెలిపారు. ఇక రెండు రోజుల ముందే ఈవెంట్లకు అనుమతి తీసుకోవాలని, పరిమితికి మించి పాసులను అమ్మొద్దని హెచ్చరించారు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈవెంట్లలో జనాలలోకి సింగర్స్ వెళ్లొద్దు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, మహిళల భద్రతకు షీ టీం పహారా కొనసాగుతుందని తెలిపారు. సంబంధిత వార్త: ఒమిక్రాన్ అలర్ట్: మాస్క్ పెట్టుకోకుంటే కఠిన చర్యలే! 31న రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు తెలిపిన సీపీ.. తాగి రోడ్లపై హంగామ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్ధరాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, పట్టుబడితే శిక్ష కఠినంగానే ఉంటుందని తెలిపారు. ఇక మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని కమిషనర్ ఆనంద్ ఆ ప్రెస్‌నోట్‌లో తెలిపారు. సంబంధిత వార్త: హైకోర్టు ఏం చెప్పింది? కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోంది?.. -
భీమ్లా నాయక్‌కు డీజే మిక్స్.. న్యూ ఇయిర్కు న్యూ వెర్షన్
Bheemla Nayak Song DJ Version Released On New Year: టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ల వస్తున్న మల్టిస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో అనేది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది ఈ మూవీ కథ. అయితే ఇటీవలే ఈ సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జనవరి 12న విడుదల రావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని అభిమానులందరూ ఆశించారు. కానీ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం విడుదల తేదిని వాయిదా వేసేందుకు పవన్ కల్యాణ్ ఒప్పుకోగా పోస్ట్‌పోన్ అయింది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా పాటలు, గ్లింప్స్ సినిమా స్థాయిని మరింత పెంచేశాయి. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ తన మ్యూజిక్‌తో ప్రేక్షకులనందరిని ఉర్రూతలూగిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా పవన్ కల్యాణ్ స్టార్డమ్కు తగ్గట్లుగా మ్యూజిక్ ఇరగదీస్తున్నాడు. సినిమాలోని లాలా భీమ్లా నాయక్ పాట ఎంత హిట్ అయిందో చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో కూడా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ పాటకు తమన్ కొత్త వెర్షన్‌ను తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే అలరిస్తోన్న ఈ పాటకు డీజే సాంగ్‌గా మలిచాడు. అయితే ఇటీవల కాలంలో వస్తున్న డీజే సాంగ్స్ సంగీత ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఈ డీజే సాంగ్స్ నెట్టింట కూడా రకరకాల రీల్స్, స్పూఫ్స్తో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ డీజే మిక్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించవచ్చు. ఈ లాలా భీమ్లా నాయక్ సాంగ్ డీజే మిక్స్‌ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31న రాత్రి 7 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ డిసెంబర్ 31కు స్పీకర్స్‌ను సిద్దం చేసుకోండి అని తమన్ ట్వీట్ చేశాడు. అంటే ఈ డీజే మిక్స్డ్ సాంగ్‌తో న్యూ ఇయర్ మోత మోగిపోనుందని తెలుస్తోంది. అయితే ఈ డీజే మిక్స్ పాట సినిమాలో ఉండకపోవచ్చు. #LalabheemlaDJ !! Get Ready Speakers 🎵 Time to get them kept serviced !! Let’s get #Lalafied ON 31st NIGHT !! #LalabheemlaDjVersion 🎹🥁 pic.twitter.com/nf34xhoYoT — thaman S (@MusicThaman) December 29, 2021 -
విషాదం: పెళ్లి బారాత్‌లో ఆగిన గుండె
సాక్షి, వేములవాడ: పెళ్లి బారాత్‌లో ఏర్పాటు చేసిన డీజే పాటలతో యువకులు డ్యాన్స్‌లు, కేరింతలు, ఈలలతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో డీజే సౌండ్ కారణంగా పెళ్లి వాహనంలో ఉన్న వృద్దురాలికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సంతోష క్షణాల మధ్య గడుపుతున్న బంధువులు, కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి కోనరావుపేట గ్రామానికి చెందిన నక్క విజయ (58) అనే మహిళ హాజరైంది. అప్పగింతలు పూర్తి కాగానే పెళ్లి కుమారుని వాహనంలో అనంతపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి చేరుకుంది. చదవండి: ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య.. ‘నా భర్త సైకో..’ పెళ్లి బారత్‌లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. ఈ డీజే సౌండ్ శబ్ధానికి మహిళ చాతిలో నొప్పితో కుప్పకూలింది. అప్పటి వరకు డీజే పాటలకు స్టెప్పులు వేసిన యువకుల డ్యాన్సులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏమైందని అక్కడున్న వారందూ తెరుకునేలోపే మహిళ మృతిచెందింది. దీంతో శుభకార్యం జరిగే ఇంట్లో విషాదం అలుముకుంది. సంబరాలు జరుపుకోవాల్సిన బంధువులు మహిళ మృతదేహంతో కోనరావుపేటకు చేరుకున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ఆమె లేకపోతే బతకలేనంటూ భార్యతో చెప్పి.. -
రైతుల వెరైటీ ఆలోచన
-
పొలాల మధ్యన డీజే, లౌడ్ స్పీకర్ల హోరు..
లక్నో: పెళ్లి ఊరేగింపు, విజయోత్సవ ర్యాలీ వంటి వేడుకల్లో డీజే పెట్టడం సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ ఉత్తరప్రదేశ్ రైతులు మాత్రం మిడతల దండును తరిమి కొట్టడం కోసం డీజే, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు. అది కూడా పొలాల మధ్యన. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఓ వైపు దేశం కరోనాతో అతలాకుతలమవుతోంటే.. మరోవైపు మిడతల దండు పొలాలపై దాడి చేసి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు మిడతల రూపంలో మరో నష్టం కళ్ల ముందు కనిపిస్తుంది. (వణికిస్తున్న రాకాసి మిడతలు) గుంపులు గుంపులుగా మిడతలు పొలాల్లో స్వైర విహారం చేస్తూ.. అన్నదాతను అశాంతికి గురి చేస్తున్నాయి. ఆఫ్రికా, యెమెన్, ఇరాన్, పాకిస్తాన్ మీదుగా మిడతలు భారతదేశంలో ప్రవేశించాయి. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో మిడతల దండు వీర విహారం చేస్తుంది. ఇప్పటికే రాజస్తాన్‌లో ఈ మిడతల దండు 50,000 హెక్టార్ల పంటను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు. మిడతలను తరిమేందుకు పొలాల మధ్యలో డీజే, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు.(రాకాసి మిడతల దండుపై కెమికల్ స్ప్రే) ఇప్పుడు గనక ప్రభుత్వాలు మిడతల సమస్యపై దృష్టి సారించకపోతే.. ముందు ముందు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే రానున్నది వర్షా కాలం. వరి, గోధుమ, పత్తి, సోయాబీన్ వంటి పంటలు సాగు చేసిది ఈ కాలంలోనే. ఒక వేళ ప్రభుత్వాలు గనక ఇప్పుడు ఈ మిడతలను నివారించకపోతే.. రైతలు తీవ్రమైన పంట నష్టం చవి చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పెళ్లి విందులో డీజే.. డిష్యుం డిష్యుం
దుండిగల్: ఓ వివాహ వేడుకలో డీజే సౌండ్ విషయంలో తలెత్తిన గొడవ గురువారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సుమారు ఆరుగురు వ్యక్తులు మరో 20 మందితో కలిసి వివాహ విందులో వీరంగం సృష్టించారు. పెళ్లి కొడుకు అన్నతో సహా బంధువులపై విచక్షణా రహితంగా దాడులు చేసిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సూరారం న్యూశివాలయ నగర్‌కు చెందిన సాయిశంతిన్‌కుమార్ వివాహ విందు గురువారం రాత్రి ఏర్పాటు చేశారు. రాత్రి 11.30 సమయంలో ఒక్కసారిగా డీజే సౌండ్ విషయంలో అంతకు ముందు జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని అదే ప్రాంతానికి చెందిన మన్నె రాజు, మరో 20 మంది కలిసి ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. గతంలో మన్నెరాజుపై దుండిగల్ పీఎస్ పరిధిలో కేసులు నమోదై ఉండగా తాజాగా ఈ కేసుతో మరో వివాదంలో చిక్కుకున్నాడు. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ నుంచి సూరారం డివిజన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఇతను ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు. గొడవలో డెకరేషన్ సెట్, విందు సామగ్రి ధ్వంసమయ్యాయి. ఈ మేరకు సంతోష్, కాశీ, శ్రీకాంత్, వెంకటేశ్, ఉమామహేశ్, నర్సింగ్‌లతో పాటు ఇరవై మంది కుటుంబ సభ్యులపై అకారణంగా దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరంతా షాపూర్‌నగర్ రామ్ ఆస్పత్రి, సూరారం మల్లారెడ్డి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహిళల మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, అరతులం ఉంగరం, ఐదు తులాల బంగారు చైన్, రెండున్నర తులాల నెక్లెస్, మూడు తులాల నల్లపూసల గొలుసు ఎత్తుకెళ్లిన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దుండిగల్ పోలీసు లు 324, 384, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై, తన తమ్ముడు కాశీని చంపేందుకు కుట్ర పన్నాడని బాధితుడు సంతోష్ ఆందోళన వ్యక్తం చేశారు. వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా గొడవ జరుగుతున్న విషయంపై గాయపడిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చిన పెట్రోలింగ్ సిబ్బందిపై సైతం దాడికి దిగారు. డీజేను నిలిపి వేయడంతో తిరిగి పెట్టమని ఒత్తిడి చేసి తనపై దాడికి పాల్పడ్డారని మరో వర్గం వారు ఫిర్యాదు చేశారు. తమపై దాడి జరిగిందంటూ ఇరు వర్గాల వారుపోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. -
శబ్దాన్ని ఆపండి..
కాజీపేట: పరీక్షల కోసం విద్యార్థులు ఎంతో ఏకాగ్రతతో చదువుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఇబ్బందికలిగితే వారి ఏకాగ్రత దెబ్బతిని చదువుకోవాలనే ఆసక్తిని కోల్పోతారు. ప్రధానంగా పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల బంగారు భవితవ్యానికి మార్గం చూపే వార్షిక పరీక్షల సమయంలో ఈ పరిస్థితులు ఎక్కువగా కన్పిస్తుంటాయి. అయితే మారుతున్న కాలాన్నిబట్టి వాహనాల రణగొనధ్వనులు ఎక్కువవుతున్నాయి. ఈ ప్రభావం పరీక్షల సమయంలో విద్యార్థులపై ఎక్కువగా ఉంటోంది. కాలనీల్లో ఆగని మైక్‌ల గోల... ఉదయం 6గంటలకే ఉల్లిపాయలోయ్.. ఉల్లిపాయలంటూ ఆటోలో మైక్ సెట్‌తో ఒకరు రెఢీ. గ్యాస్ స్టవ్‌లు బాగు చేస్తామంటూ ఇంకొక్కరు సిద్దం. ఇవన్నీ వెరసి ప్రశాంత వాతావరణంలో చదువుకునే విద్యార్థుల ఏకాగ్రతను భగ్నం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న మైకులతో వచ్చే శబ్దంతో అటు విద్యార్థులు, ఇటు వృద్ధులతోపాటు సామాన్యులు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులు మానసిక ఆందోళనతో పాటు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కల్యాణ మండపాల్లో హోరు.. పెళ్లిళ్లు, చిన్న చిన్న వినోద కార్యక్రమాలు నిర్వహించే కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు ఊరికి దూరంగా విశాలమైన ప్రాంతాల్లో ఉండేవి. కాలక్రమేణా ఇవి నివాసాల మధ్యలోకి వచ్చేశాయి. పెళ్లంటే ఒకప్పుడు సన్నాయి, మేళతాళాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు సంగీత్ పేరుతో రెండు రోజుల ముందు నుంచే ఆర్కెస్ట్రా, మ్యూజిక్, తీన్మార్లతో హోరెత్తించేస్తున్నారు. రకరకాల బ్యాండ్లతో కిలో మీటర్ల మేర వినిపించే మోతకు తోడు, బాణాసంచా పేలుళ్లతో బెంబేలెత్తిస్తూ సరికొత్త సమస్యలకు కేంద్రాలుగా మారుస్తున్నారు. దీనికితోడు ఆటోలు, మోటారు సైకిళ్లు, లారీలు, బస్సుల హారన్ల మోత భరించలేనిదిగా మారింది. చిన్నచిన్న వ్యాపారులు తోపుడు బండ్లు, ఆటోల్లో మైకుల ద్వారా చేస్తున్న ప్రచారం చికాకు తెప్పించేదే. 40 డెసిబుల్స్ దాటకూడదు.. శబ్ధ తీవ్రతను డెసిబల్స్‌లో కొలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ధ్వని తీవ్రత 40 డెసిబుల్స్ లోపు ఉండాలి. అయితే వరంగల్ నగరంలోనే గాక రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో ధ్వని తీవ్రత 55 డెసిబుల్స్ వరకూ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ ఎలా.. డెసిబల్స్‌లో గ్రంథాలయాలు 45 దుకాణాలు, రెస్టారెంట్లు 65 పారిశ్రామిక ప్రాంతం 70 ఆసుపత్రులు 40 కార్యాలయాలు 50 నివాసప్రాంతాలు 55 నిశబ్ద జోన్ 10 నిబంధనలు ఏం చెబుతున్నాయి..? శబ్ద కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవాలి?, నివాసప్రాంతాలు, వ్యాపారకూడళ్లు, పారిశ్రామిక వాడల్లో ధ్వనితీవ్రత ఎలా ఉండాలి?, పరిమితికి మించి శబ్దంతో ఏమవుతుంది?, చదువు, ప్రశాంతతకు భంగం కలిగించే రణగొణ ధ్వనులు వేధిస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి లాంటి ప్రశ్నలకు సమాధానాలివే... అనుమతి తప్పనిసరి..! మన ఇంట్లో అయినా సరే పరిమితికి మించి శబ్దం బయటకు రాకూడదు. ఉదాహరణకు టీవీ, టేప్రికార్డు సౌండు, చుట్టుపక్కల వారి ప్రశాంతతకు భంగం కలిగించకూడదు. భజనల పేరిట నిర్వహించే పూజల్లో మైకులు వినియోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. రాత్రి 9గంటల తర్వాత మైకులు వినియోగిస్తే చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో పగలు, రాత్రి వేళల్లో మైకుల మోతలపై నిషేదం విధిస్తున్నారు. మైకులు వినిఝెగించాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఎక్కడ, ఏ రోజు ఎప్పటినుంచి ఎప్పటి వరకు మైకు వినియోగిస్తారో తదితర వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఇక్కడ.. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా అనుమతి కోసం దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. వాటిని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు పంపిస్తారు. అక్కడి సీఐ దాన్ని పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఏసీపీ స్థాయి అధికారికి పంపిస్తారు. ఆయన క్షుణ్నంగా పరిశీలించి అనుమతిస్తారు. ఒక్కోసారి కొంతమంది ప్రార్ధనా మందిరాలు, పాఠశాలలు, ఆసుపత్రులకు సమీపంలో మైకు పెట్టేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తారు. వీటిని ఆయా అధికారులు పరిశీలించి అనుమతిని తిరస్కరించేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతారు. ఇలా చేస్తే మేలు... నివాస ప్రాంతాల్లో మైకుల ప్రచారాన్ని కట్టడి చేయాలి. పగటి వేళల్లో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాటిని నియంత్రించాలి. పాఠశాలకు సమీపంలో ఎలాంటి ధ్వనులు, గోల లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. -
హ్యాపీ..హ్యాపీగా న్యూ ఇయర్ వేడుకలు
-
డీజే ఆరోపణలు.. ఎయిర్ ఇండియా రిప్లై
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఇటాలియన్ డీజే ఒల్లీ ఎస్సే చేసిన ఆరోపణలపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఇటాలియిన్ డీజే చేసిన ఆరోపణలు అసత్యమైనవని, తమ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించలేదని కొట్టిపారేసింది. సమయానికి పోలీసులు కూడా అందుబాటులో లేరని ఆరోపించిన ఇటాలియన్ డీజేకు విమానశ్రయ పోలీసు అధికారి బదులిచ్చారు. సంఘటన జరిగిన రోజంతా తాను పోలీస్ స్టేషన్లోనే ఉన్నానని, తమ అధికారులు చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమెకు వివరించారు. అసలేం జరిగిందంటే.. ఇటాలియన్ డీజే ఒల్లీ ఎస్సే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అనంతరం తిరుగు పయనంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఎయిర్ ఇండియా సిబ్బంది తనపై చేయి చేసుకున్నట్టు ఆరోపించారు. ఈ క్రమంలో వారిపై కేసు పెట్టేందుకు విమానశ్రయ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్తే ఎస్సై లేడని, తమకు ఏం తెలియదని అక్కడి పోలీసులు చెప్పారని.. అంతే కాకుండా అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని వివరించారు. విమానశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా విమానం 9 గంటలు ఆలస్యమైందని, అందుకే తాను ఎక్కాల్సిన విమానం ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు డిపరేచర్ గేటు వద్దనున్న అధికారుల దగ్గరికి వెళ్లినట్లు వీడియోలో పేర్కొన్నారు. కానీ, అక్కడి సిబ్బంది స్పందించకపోవడంతో పక్కనే ఎయిర్ ఇండియా కౌంటర్ వద్దకు వెళ్లి అడగగా అది తనపని కాదని బిగ్గరగా అరిచారని, మరోసారి అడిగితే చేయిచేసుకున్నారని వీడియోలో పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియాపై ఇటాలియన్ డీజే ఫిర్యాదు
-
పాట పెట్టమన్నందుకు.. ప్రాణం తీసేశాడు
సాక్షి, న్యూఢిల్లీ : అర్ధరాత్రి ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తనకు నచ్చిన పాట పెట్టమని అడిగినందుకు ఓ డీజే ఆపరేటర్ పబ్‌కు వచ్చిన వ్యక్తిని హత్యచేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ భాగ్ సమీపంలోని రఫ్తార్ పబ్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజయ్‌పాల్ సింగ్ అనే వ్యక్తి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడానికి తన మిత్రులతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా విజయ్‌పాల్ తనకు నచ్చిన పాట పెట్టాంటూ డీజే ఆపరేటర్‌ను కోరగా, కవ్వింపు చర్యలకు దిగాడు. దీంతో విజయ్‌పాల్, డీజే ఆపరేటర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ దాడిలో డీజే ఆపరేటర్ బలమైన వస్తువుతో సింగ్ తలపై బలంగా కొట్టడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి స్నేహితుల ఫిర్యాదు మేరకు పబ్ యాజమాన్యంతోపాటు, డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
అవిసీ హఠాన్మరణం.. అనుమానాలు!
స్టాక్ హోమ్: ప్రముఖ సంగీత దర్శకుడు, డీజే.. అవిసీ హఠాన్మరణం పాప్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 28 ఏళ్లకే ఈ యువ సంచలనం మృతి చెందటం అనుమానాలకు తావిస్తోంది. ఆయన మృతి వార్తను పబ్లిసిస్ట్ బరోన్ మీడియాకు వెల్లడించారు. ఒమన్‌లో అవిసీ కన్నుమూసినట్లు శుక్రవారం బరోన్ పేరు మీద ఓ ప్రకటన విడుదలయ్యింది. అవిసీ ఎవరు?.. స్వీడన్‌కు చెందిన డీజే అవిసి. అసలు పేరు టిమ్ బర్గిలింగ్. చిన్న వయసులోనే పాప్ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వేక్ మీ అప్ సాంగ్ అతని కెరీర్‌ను మలుపు తిప్పగా.. లెవల్స్ , అండ్ రీసెంట్లీ, లోన్లీ టుగెదర్ ఆల్బమ్‌లతో అవిసి పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. రెండుసార్లు అతని పేరు గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యింది కూడా. పాక్-అమెరికన్ సింగర్ నదిలా అలీతోపాటు పలువురు ప్రముఖ సింగర్లతో రాపర్‌గా కూడా ఆల్బమ్‌లను సృష్టించాడు. నిర్మాతగా కూడా అవిసీ రాణించాడు. మృతిపై అనుమానాలు... అవిసీ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే 2013లో అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నికోటిన్‌కు బానిసై అతను రోగాల బారిన పడ్డాడని పుకార్లు వినిపించాయి. అయితే అదంతా నిజం కాదని ఆ సమయంలో అవిసీ ఖండించాడు. కానీ, 2014లో అతను చాలా మట్టుకు షోలను అర్థంతరంగ రద్దు చేసుకోవటంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. చివరకు ఓ గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవిసీ తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పరోక్షంగా తెలిపాడు. అవిసీ ఎలా చనిపోయాడన్నదానిపై అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది. -
చిన్నారిని బలిగొన్న డీజే బాక్స్
పాల్వంచరూరల్ : సేవాలాల్ జాతరలో అపశృతి దొర్లింది. డీజే బాక్స్ పడడంతో బాలుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పాండురంగాపురం గ్రామంలో సేవాలాల్ ఆలయ శంకుస్థాపన తర్వాత ఆంజనేయస్వామి గుడికి భక్తులు వెళ్తున్నారు. టాటా ఏస్ వాహనంపై డీజేబాక్స్లు ఏర్పాటు చేశారు. వాహనం ముందు, పక్కన కొంద రు నృత్యాలు చేస్తున్నారు. మార్గమధ్యలో ఒకచోట, పైన విద్యుత్ సర్వీ స్ వైరు ఒకటి డీజే బాక్స్‌లకు తగిలింది. దీనిని ఎవరూ గమనించలేదు. వాహనం ముందుకెళ్లడంతో పైన బాక్స్‌లు కిందపడ్డాయి. పక్కనే నడుస్తున్న భూక్యా పృధ్వీరాజ్(7)పై ఒక బాక్స్ పడింది. తలకు బలమైన గాయమవడంతో ఆ చిన్నారి మృతి చెందాడు. ఇతని తల్లిదండ్రులైన భూక్యా బాలకృష్ణ–అనిత దంపతులది నిరుపేద కుటుంబం. వీరిది ఇల్లెందుపాడు గ్రామం. ఈ చిన్నారి రెండోతరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు, అక్క కన్నీరు మున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదుతో సేవాలాల్ ఆలయ పూజారి భూక్యా ఠాగూర్ సాధు. టాటా ఏస్ డ్రైవర్ గబ్బర్, నిర్వాహకులు జి.శ్రీనుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆహారమిచ్చి... అసభ్య ప్రవర్తన
బనశంకరి: మహిళా డీజేతో ఫుడ్ డెలివరీ బాయ్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన నగరంలో వెలుగుచూసింది. ఒక పబ్‌లో పనిచేసే మహిళా డీజే ఒంట్లో బాగా లేకపోవడంతో సోమవారం ఇంటికే భోజనం పంపాలని స్విగ్గి యాప్‌లో ఆహారం ఆర్డర్ చేసింది. కొంతసేపటికి విగ్నేష్ అనే పేరుతో డెలివరీ బాయ్ ఆమె అపార్టుమెంటు ఫ్లాట్‌కు వచ్చాడు. అయితే అతడు తలుపు కొట్టకుండా, నేరుగా ఫ్లాట్ లోపలి వరకు రావడంతో ఆమె ఎందుకు వచ్చావని ప్రశ్నించింది. భోజనం తీసుకుని బిల్లు చెల్లించి ఇంట్లోకి బయలుదేరింది. యువకుడు వెంబడించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చేసుకోగా గట్టిగా శబ్ధం రావడంతో పొరుగు ఫ్లాట్‌లోని కుక్కలు గట్టిగా మొరగడంతో డెలివరీ బాయ్ ఉడాయించాడు. ఈ ఘటనపై బాధిత మహిళ ఫేస్బుక్ ద్వారా సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
న్యూ ఇయర్ జోష్‌లో తగ్గనున్న సెలబ్రిటీలు
-
నాట్స్ తెలుగు సంబరాల్లో డీజే సందడి
బన్నీ తో పాటు దేవీ శ్రీ ప్రసాద్.. హరీష్ శంకర్ అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ తెలుగు సంబరాల్లో ఈ సారి డీజే టీమ్ సందడి చేయనుంది. చికాగో వేదికగా జరిగే సంబరాల్లో సినీ నటుడు అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, కథనాయిక పూజా హెగ్డే తదితరులు నాట్స్ తెలుగు సంబరాలకు వెళ్లనున్నారు. ఈ సంబరాలను అత్యంత ఘనంగా జరిపేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వేలమంది ఈ సంబరాల్లో పాలుపంచుకునేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు దేవీ శ్రీ ప్రసాద్ కూడా వస్తుండటంతో అమెరికాలో ఉండే తెలుగు సినీ ప్రేమికులు సంబరాలకు మేముసైతమంటూ ముందుకొస్తున్నారు. సంబరాలకు డీజే టీమ్ తో పాటు జబర్థస్త్ టీమ్ కూడా రానుంది. దీంతో సంబరాల్లో ఆట.. పాటతో పాటు కామెడీ షోలు కూడా కావాల్సినంత సంతోషాన్ని పంచనున్నాయి. -
దుమ్ము రేపుతున్న’డీజే’ లేటెస్ట్ వీడియో సాంగ్
-
ఎవరెస్టుపైన డీజే మోత!
కాట్మాండు: ఎవరెస్టు శిఖరంపైన బ్రిటీష్ గాయకుడు పౌల్ వోకెన్ ఫోల్డ్ డేజే (డిస్క్ జాకీ) సంగీత ప్రదర్శన ఇవ్వనున్నాడు. దీని కోసం పౌల్ బృందం బేస్క్యాంపుకు చేరింది. నేడు ఇవ్వనున్న ఈ ప్రదర్శనతో భూమిపై అత్యంత ఎత్తు(5,380 మీటర్ల)లో డీజే నిర్వహించిన ఘనత పౌల్ బృందానికి దక్కనుంది. ఎవరెస్టు ఎక్కే సీజన్లో ఈ ప్రదర్శన ఇవ్వడంతో ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. యాబైమూడేళ్ల పౌల్ బ్రిటన్‌లో మంచి ప్రజాదరణ ఉన్న డీజే. మూడు సార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అవడంతో పాటు మడోనా, యూ–2తో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. ‘పది రోజుల పాటు శ్రమించి అవసరమైన సంగీత సామాగ్రితో మా టీం ఇక్కడికి చేరుకుంది. ఇక్కడ గాలి తక్కువగా ఉంది. ఎత్తైన చోట ట్రెక్కింగ్ చేసి ప్రదర్శన ఇవ్వడం ఉద్వేగంగా ఉంద’ని పౌల్ అన్నాడు. -
బన్నీ సినిమాపై బాలీవుడ్ కన్ను
సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒకటి మాస్ క్యారెక్టర్ కాగా రెండవది బ్రాహ్మణుడి పాత్ర, ఈ సినిమా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అదుర్స్‌కు సీక్వల్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌పై ఇప్పటి నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల బాలీవుడ్ మాస్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి, డీజే సెట్లో సందడి చేశాడు. సింగం సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయటంతో పాటు తన సినిమాల్లో సౌత్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించేలా ప్లాన్ చేసుకునే రోహిత్ శెట్టి, డీజే సెట్లో కనిపించటంతో ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే రూమర్ల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. Pleasant Surprise to DJ sets from my Favt Director Rohit Shetty https://t.co/CPVJssfEos — Harish Shankar .S (@harish2you) 1 February 2017 -
బన్నీ 'డిజె' అదుర్స్ సీక్వలా..?
సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షార్ట్ గ్యాప్ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దువ్వాడ జగన్నాథమ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అదుర్స్ సినిమాకు సీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమాకు సీక్వల్ చేసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు వివి వినాయక్. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చకముందే హరీష్ శంకర్ బన్నీతో ఈ సినిమా మొదలెట్టేశాడు. డిజెలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపించనున్నాడట. డైలాగ్స్‌తో పాటు, బాడీలాంగ్వేజ్ కూడా అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ అదుర్స్ సినిమాకు రచనా సహకారం అందించాడు. ఆ సినిమాలో చారి, బ్రహ్మీల మధ్య కామెడీ సీన్స్‌ను రాసింది కూడా హరీషే. అందుకే ఇప్పుడు చారీ పాత్రను పూర్తి స్థాయి కథానాయకుడిగా మార్చి దువ్వాడ జగన్నాథమ్ సినిమాను తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
బన్నీ బన్‌గయా డీజే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజేగా కనిపించడానికి రెడీ అయ్యారు. డీజే అంటే పార్టీలు, పబ్బుల్లో గట్రా కనిపించే డిస్కో జాకీ (డీజే) కాదండీ. ఇప్పుడీ పదానికి బన్నీ కొత్త అర్థం చెబుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న చిత్రానికి ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సినిమాలో హీరో ఊరు దువ్వాడ, పేరు జగన్నాథమ్ కావొచ్చని ఊహించవచ్చు. హైదరాబాద్‌లో నేడు ఈ సినిమా ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న 25వ చిత్రమిది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
సర్దార్ ఓ గొప్ప ఫీలింగ్
సిటీలో చాలామంది డీజేలున్నా.. వారెవరికీ దక్కని అవకాశం పిన్న వయస్కుడైన డీజేగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పాపులరైన పృథ్వికి దక్కింది. పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా కోసం ఒక పాటను రీమిక్స్ చేయడం... పవన్ పాడిన బీట్ సాంగ్‌కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించడం... ఆ సినిమాలో డీజేగా కాసేపు కనిపించడం... లాంటి అరుదైన అవకాశాలను తన ఖాతాలో వేసుకున్నారీ కుర్ర డీజే. పృథ్వి ‘సాక్షి’తో పంచుకున్న తన సినిమా అనుభవం ఆయన మాటల్లోనే... - ఎస్.సత్యబాబు ఓ రోజు రాత్రి ఆర్టిస్ట్ మేనేజర్ అహ్మద్ నుంచి ఫోన్ కాల్.. ‘సర్దార్ గబ్బర్ సింగ్‌లో ఒక పాట మిక్సింగ్ కోసం నిన్ను కావాలనుకుంటున్నారు. పొద్దున్నే వచ్చి కలవండి’ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నా ఫేవరెట్ స్టార్‌ను కలవడమే కాదు.. ఆయనతో కలిసి పనిచేసే అవకాశమూ దక్కింది. హెల్ప్ చేస్తావా..? అంత పెద్ద స్టార్ నాకు కబురు పెట్టడమే గొప్ప. అంతేకాకుండా ‘నాకు హెల్ప్ చేస్తావా..?’ అని అడగడంతో నా ఆశ్చర్యానందాలకు అవధుల్లేవు. మహదానందంగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని స్వీకరించాను. గబ్బర్‌సింగ్ సినిమాలో అంత్యాక్షరి లాగానే ఇందులో పలు హిట్ సాంగ్స్‌ను ఏర్చి కూర్చి ఒకే పాటలా మిక్స్ చే సిన సాంగ్ చూసే ఉంటారు. ఆ మిక్సింగ్ వర్క్ నాకు అప్పగించారు. డీజేగా రెగ్యులర్‌గా చేసే పని, పైగా నా అభిమాన హీరో కోసం చేస్తున్నాననే సంతోషం.. నాతో మరింత ఉత్సాహంగా పని చేయించింది. మిక్స్డ్ ట్రాక్స్‌తో మేళవించిన పాటలో కమెడియన్స్‌తో పాటు నేనూ తెరమీద కనిపిస్తాను. పవన్ అన్నయ్యకు నా వర్క్ చాలా బాగా నచ్చింది. అందుకే అత్తారింటికి దారేదిలో కాటమరాయుడా.. తరహాలో సర్దార్లో తాను స్వయంగా పాడిన పోతురాజు బీట్ సాంగ్‌కి మ్యూజిక్ చేసే అవకాశమిచ్చారు. మరిచిపోలేని జ్ఞాపకం... సిటీలో డీజేలు ఇంత మంది ఉన్నా... అంత పెద్ద సినిమాలో పిలిచి ఛాన్స్ ఇవ్వడం నాకు మరిచిపోలేని జ్ఞాపకం. పవన్ అన్నయ్యతో దాదాపు 20 రోజులు కలిసి ఉండే గొప్ప అదృష్టం కలిగిందీ సినిమాతో. గతంలో నేను ఆయన పాటల్ని రీమిక్స్ చేసి ఆల్బమ్ కూడా రిలీజ్ చేశాను. అయితే ఇప్పుడు ఆయన నా దృష్టిలో మరింత గొప్ప స్థానం దక్కించుకున్నారు. అందుకే మరోసారి పవర్ స్టార్ పాటల రీమిక్స్ మరింత అద్భుతంగా రూపొందించాలని అనుకుంటున్నాను. -
డీజే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని..
గణేశ్ నిమజ్జనానికి డీజే పెట్టుకోవడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని గణేశ్ భక్తులు టీఆర్ఎస్ కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అధికారంలో ఉండి కనీసం పర్మిషన్ కూడా ఇప్పించలేకపోయారని భక్తులు కొంతమంది నాయకులపై కూడా దాడిచేశారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని అల్లరిమూకలను చెదరగొట్టారు. -
డీజే, జేసీజే పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగింపు
* హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు * సెప్టెంబర్ 16న తుది విచారణ సాక్షి, హైదరాబాద్: జిల్లా జడ్జీలు (డీజే), జూనియర్ సివిల్ జడ్జీలు (జేసీజే) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం నిలిచిపోయిన ప్రక్రియను కొనసాగించాల్సిందిగా ఉమ్మడి హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 12 జిల్లా జడ్జీల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి అర్హులకు నియామకపు పత్రాలు అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే ఈ నియామకాలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని వారికి స్పష్టం చేయాలని తెలిపింది. అదే విధంగా జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీ విషయంలో 2014, 2015 నోటిఫికేషన్ల ఆధారంగా జరిగిన రెండు స్క్రీనింగ్ టెస్ట్‌లకు సంబంధించిన సమాధాన పత్రాలను మూల్యాంకనం చేపట్టాలని ఆదేశించింది. అనంతరం రాతపరీక్ష, ఇంటర్వ్యూలు పూర్తి చేసి, వాటి ఫలితాలను నియామకపు అధికారుల ముందు ఉంచాలని రిజిస్ట్రీకి సూచిం చింది. అయితే నియామకపు ప్రక్రియను ఖరారు చేయవద్దని తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాస నం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది విచారణ నిమిత్తం ఈ వ్యాజ్యాలను సెప్టెంబర్ 16కి వాయిదా వేసింది. కింది స్థాయి న్యాయవ్యవస్థను విభజించేంత వరకు న్యాయాధికారుల పోస్టులను భర్తీ చేయవద్దని, అలాగే జేసీజే పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లను కొట్టేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొందరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం.. సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీజే, జేసీజే పోస్టుల భర్తీకి గతంలో విధించిన గడువును పొడిగించాలన్న హైకోర్టు అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది కాబట్టి ఆ ప్రక్రియను కొనసాగించాల్సిందేనని, లేకపోతే అది కోర్టు ధిక్కారం అవుతుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. -
సందట్లో జానపదం
వేడుకలు ఆడంబరాల వేదికలే తప్ప,సంప్రదాయానికి ఆనవాళ్లుగా లేవు అని పెదవి విరిచే వారిని పన్నీటి జల్లులా పలకరిస్తోంది జానపదం. అడుగడుగునా పాశ్చాత్య పోకడలు తొంగి చూస్తున్న సంబురాల్లో పల్లె గాలి అల్లరి లేదని నీరసపడే పట్నవాసులను తెలుగుదనంలో పరవశింపజేస్తున్నాయి పల్లెపదాలు. వివాహం, సీమంతం, బారసాల, పుట్టిన రోజు వేడుక, చీరలు కట్టించడం.. ఇలా సందడి ఏదైనా సిటీలో జానపద పాటలు వీనుల విందు చేస్తూ ఫంక్షన్‌కు లోకల్ టచ్ ఇస్తున్నాయి. ..:: నిర్మలా రెడ్డి పెద్ద పెద్ద వేదికలు, హుందాగా ఆహూతులు, వారి మధ్య వెలిగిపోతూ వధూవరులు, బాజాభజంత్రీల మోతలు.. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో వెలితి నేటి పెళ్లిళ్లలో అనుకునే వారి మదిని సంబురంలో ముంచెత్తుతూ.. ‘సువ్వి సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరు ఓలాల...’ అంటూ ఓ బృందం సుతిమెత్తగా మదిని తట్టిలేపుతుంది. నిన్నటి తరం పెళ్లి ముచ్చటను ఈ తరానికి పరిచయం చేస్తుంది. అందుకే ‘వనితలు మనసులు కుందెన చేసెటు వలపులు దంచెదరు ఓలాల.. కనుచూపులనెడు రోకండ్లతో కన్నెల దంచెదరు ఓలాల..’ అంటూ వేడుకకు సంప్రదాయపు అలంకారాలను అద్దుతున్నాయి జానపద బాణీలు. ఏ తీరుకు ఆ పాట.. డీజే హోరులో తడిసిముద్దవుతున్న నేటి వేడుకలను ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి జానపద బృందాలు. రోలు, రోకటి అచ్చట్లు, వధూవరుల ముచ్చట్లు, అత్తాకోడళ్ల సవాళ్లు, వదినామరదళ్ల ఆటపట్టింపులు.. పెళ్లి వేడుక మొదలైన క్షణం నుంచి అప్పగింతలయ్యే వరకూ ప్రతి తంతునీ విడమరచి చె ప్పే పాటలు జానపదంలో వేలాదిగా ఉన్నాయి. మరుగున పడిపోతున్న ‘లాలి’త్యాన్ని వెలికి తీసి పల్లె బాణీల్లో బారసాల బుజ్జాయికి జోలపుచ్చుతున్నారు కళాకారులు. కట్టు.. బొట్టు.. సిటీలో జరిగే పలు వేడుకల్లో ఇప్పుడు జానపదాలు పల్లవిస్తున్నాయి. ఇక్కడ పాటలు పాడేవారు పది మందికి తగ్గకుండా బృందంగా ఏర్పడతారు. వీరంతా వివిధ ఉద్యోగాల్లో ఉన్నవారూ, పాటలపై ఆసక్తి ఉన్నవారూ అయి ఉంటారు. అలాగే వారికి నాటి సంప్రదాయపు సొగసు కూడా తెలిసి ఉంటుంది. ఆ వేడుకకు తగ్గట్టు తమ ఆహార్యంతోనూ ఆకట్టుకుంటారు. పెద్దంచు పట్టుచీర , నుదుటన పెద్ద బొట్టు, తల నిండుగా పువ్వులు, చేతుల నిండుగా గాజులతో మహిళలు పెళ్లిలో హాస్యమాడే పాటలతో ఆకట్టుకుంటే.. మగవారు సంప్రదాయ పంచెకట్టుతో ఆనందాన్ని పంచుతారు. తరం మారినా.. పెళ్లి సందడిలో వయసుతో నిమిత్తం లేదు. ఇక్కడ మూడు తరాల వారూ కోరుకునేది ఆనందమే. అందుకే అందరూ ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని సౌండ్ పార్టీలు డీజేలతో సెలబ్రేట్ చేసుకుంటే, ఇంకొందరు ఆర్కెస్ట్రాలతో ఆహ్వానితులను ఎంగేజ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో వీటి స్థానంలో పాతదే అయినా ఈ తరానికి కొత్తదైన జానపద పాటలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా జానపదాలతో వేడుకలలో ఆకట్టుకుంటున్న కళాకారిణి స్నేహలతా మురళి మాట్లాడుతూ ‘నేను మొదట జానపద పాటలను పెళ్లిలో పాడటం మొదలుపెట్టినప్పుడు యువత అనాసక్తి చూపుతారేమో అని భయపడ్డాను. కానీ, వారు పెళ్లికి డీజే పెట్టించుకుని, తర్వాత ఆ విషయమే మర్చిపోయి జానపద పాటల్లో లీనమవడంతో ధైర్యం వచ్చింది. నాతో నా స్నేహితులూ, ఆసక్తి గలవారు చేరడంతో మేమంతా బృందంలా ఏర్పడ్డాం. చిన్నాపెద్ద ఏ ఫంక్షన్‌కి ఆహ్వానించినా మా పాటలతో వారి వేడుకను ఆద్యంతం సంబురంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటాం. పెళ్లిలో వియ్యాలవారి మధ్య అరమరికలు తొలగడానికి ఈ పాటలు దోహదం చేస్తుంటాయి. కొన్నిసార్లు పిల్లలు, పెద్దలు మాతో శృతి కలుపుతుంటారు. ఈ పాటలతో అప్పటి వరకూ ఉన్న స్తబ్ధత పోయిందని వేడుకకు వచ్చిన వారు చెబుతుంటే ఆనందం కలుగుతుంది. పదేళ్లుగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నటుడు మోహన్‌బాబు ఇంట పెళ్లికి, సీమంతానికి పాడాం. ఇంకా నగరంలో జరిగిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వివాహ వేడుకల్లోనూ జానపద పెళ్లి పాటలు పాడాం’ అని తెలిపారు స్నేహలత. అర్థం చెప్పే ‘పాట’వం.. పెళ్లి పాటలు పదిగురిలోకి చేరాలి. అవి కలకాలం ప్రజల నాలుకలపై ఆడాలి. సంప్రదాయపు సొబగులతో, అవి అందించే ఆశీస్సులతో వేడుకలు మరింత వేడుకగా మారాలి. ఇందుకు నగరంలోని జానపద బృందాలు ‘పాట’పడుతున్నాయి. ముహూర్తం పెట్టి పసుపు దంచింది మొదలు నలుగు పాట, విడి పాట, వియ్యపురాలి పాట, భోజనం బంతి పాట, పూల చెండ్ల పాట, అప్పగింతల పాట.. ప్రతి సందర్భానికీ పాటలే పాటలు. వీరు ఆ పాటలను పాడేసి ఊరుకోవడం లేదు. పాటల సమయ సందర్భాలను, వాటిలోని సాహిత్యాన్నీ అందాన్నీ పరిచయం చేస్తూ జనరంజకం చేస్తున్నారు. పాటకు అనుగుణంగా అప్పటికప్పుడు యువతతోనూ చిందేయిస్తూ తామూ పాదం కలిపి పదం పాడుతుంటారు. మామూలుగా ఈ కార్యక్రమం కొత్తాపాత తేడా లేకుండా కలిసిపోవడానికే! యువతరంలో జోష్‌నందించడానికే అయినా దానికి మంచి గొప్ప ప్రయోజం కూడా కల్పిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు పెళ్లి పాటలు పాడతాం అని బృందాలుగా తయారవుతున్నారు. అన్నింటికీ ఉన్నట్టే పెళ్లిపాటలు పాడే బృందాలకూ ప్యాకేజీలు ఉన్నాయి. హృద్యంగా పాటలు పాడి, కార్యక్రమాన్ని ఆద్యంతం రంజింపజేసే వారినే అవకాశాలు అధికంగా పలకరిస్తున్నాయి. -
సోనమ్.. ద హంగ్రీ యంగ్ ఉమన్
బాలీవుడ్లో యాంగ్రీ యంగ్‌మెన్ గురించి జనాలకు తెలుసు. అయితే, సోనమ్ కపూర్ తనకు తానే ‘హంగ్రీ యంగ్ ఉమన్’గా చెప్పుకుంటోంది. ఆకలి వేయనంత వరకే తాను స్థిమితంగా ఉంటానని, ‘ఆకలేస్తే నేను నాలా ఉండను’ అంటోంది. ‘స్నికర్స్’ చాక్లెట్స్కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్న సోనమ్, అపరిమితంగా చాక్లెట్లు సరఫరా చేస్తామని చెప్పడంతోనే ఈ కంపెనీ చాక్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పుకున్నానని మీడియాకు అసలు సంగతి చెప్పేసింది. రంగస్థలంపై మోనా చూపు బాలీవుడ్ భామలంతా సినీ అవకాశాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుంటే, మోనా సింగ్ మాత్రం తన రూటే సెపరేటు అంటోంది. బుల్లితెరతో ప్రారంభించి, ఇప్పుడిప్పుడే సినిమాల్లో కనిపిస్తున్న మోనా, తాజాగా ‘జెడ్ ప్లస్’లో నటిస్తోంది. ఇక రంగస్థలంపై తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నానని ఆమె చెబుతోంది. ‘జెడ్ ప్లస్’లో నటిస్తున్న ముకేశ్ తివారీ, అదిల్ హుస్సేన్, కుల్‌భూషణ్ ఖర్బందా వంటి వారంతా రంగస్థలం నుంచే వచ్చారని, వారి స్ఫూర్తితోనే ఒక నాటకంలో నటించాలనుకుంటున్నానంది. ‘విరాసత్’ నటి అమెరికాలో డీజే విరాసత్, హసీనా మాన్ జాయేగీ వంటి సినిమాల్లో నటించిన పూజా బత్రా ఇప్పుడు అమెరికాలో స్థిరపడి, అక్కడ డీజే అవతారమెత్తింది. ప్రస్తుతం ఆమె లాస్ ఏంజెల్స్‌లో ఉంటోంది. అమెరికాలో ఉంటున్న భారతీయుల కోసం సొంతంగా బాలీవుడ్ మ్యూజిక్ రేడియో స్టేషన్ ప్రారంభించి, దాని ద్వారా శ్రోతలను డీజేగా అలరిస్తోంది. ఇక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్లే బాలీవుడ్ నటీనటులను ఆహ్వానిస్తూ, వారిని డీజేలుగా పెట్టి కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. -
గణేష్ ఉత్సవాల్లో డీజే నిషేధం: ఆనంద్
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాలలో డీజే సౌండ్‌ను నిషేధించామని, ఎవరైనా పోలీసుల కళ్లుగప్పి డీజేలను ఏర్పాటు చేస్తే ఉత్సవ కమిటీతో పాటు వాటిని అద్దెకిచ్చిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు తగిన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిర్వాహకులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజున కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీలదేనని, వారు పోలీసులకు సహకరించాలని కోరారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు మాట్లాడుతూ, పోలీసు అధికారుల సూచన మేరకు డీజేలను నిషేధిస్తామన్నారు. చెరువులలో పూడిక తీయాలని, విగ్రహాల తరలింపునకు తొందర పెట్టవద్దని, ఉచిత విద్యుత్‌ను ఇవ్వాలని, క్రేన్ నిర్వహణ లోపాలు జరగకుండా చూసేందుకు ఉన్నతాధికారిని నియమించాలని ఆయన కోరారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ వై.గంగాధర్, ఆయా జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతో పాటు గణేష్ ఉత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు. -
కరో కరో..జాల్సా
పబ్ కల్చర్‌కు రెడ్ కార్పెట్ పరుస్తున్న సిటీ యుూత్.. వీకెండ్ వస్తే చాలు కరో కరో జర జల్సా అంటున్నారు. డీజే హోరు.. కుర్రకారు జోరు కలగలిసి.. శనివారం సోమాజిగూడలోని కిస్మత్ పబ్ ఊగిపోరుుంది. అదిరిపోయే ఆటపాటలతో సండే సెలబ్రేషన్స్‌కు గ్రాండ్ వెల్కం చెప్పారు. వుసక వుసక చీకటి.. యుంగ్ హైదరాబాదీస్ కేరింతలకు వేదికైంది. న్యూ ట్రెండ్స్ డిజైనింగ్స్‌లో తళుక్కువున్న యుువతులు కిర్రాక్ డ్యాన్సులతో వుతులు పోగొట్టారు.