బన్నీ సినిమాపై బాలీవుడ్ కన్ను | Rohit Shetty Visits Allu Arjun DJ film Sets | Sakshi
Sakshi News home page

బన్నీ సినిమాపై బాలీవుడ్ కన్ను

Published Wed, Feb 1 2017 3:36 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

బన్నీ సినిమాపై బాలీవుడ్ కన్ను

బన్నీ సినిమాపై బాలీవుడ్ కన్ను

సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒకటి మాస్ క్యారెక్టర్ కాగా రెండవది బ్రాహ్మణుడి పాత్ర, ఈ సినిమా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అదుర్స్కు సీక్వల్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా బాలీవుడ్ రీమేక్పై ఇప్పటి నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల బాలీవుడ్ మాస్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి, డీజే సెట్లో సందడి చేశాడు. సింగం సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయటంతో పాటు తన సినిమాల్లో సౌత్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించేలా ప్లాన్ చేసుకునే రోహిత్ శెట్టి, డీజే సెట్లో కనిపించటంతో ఈ సినిమా బాలీవుడ్ రీమేక్పై ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే రూమర్ల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement