rohit shetty
-
మా ప్రాంక్ వల్ల ఏకంగా విడాకులు తీసుకున్నారు: హీరో
యూట్యూబ్‌లో ప్రాంకులు బోలెడు కనిపిస్తాయి. సినిమావాళ్లు కూడా తమ ప్రాజెక్టు ప్రమోషన్స్ కోసం ఈ ప్రాంకుల్ని వాడుకున్నారు. అయితే సెట్లోనూ మేము ఫన్ కోసం ప్రాంక్ చేసేవాళ్లమంటున్నారు హీరో అజయ్ దేవ్‌గణ్, దర్శకుడు రోహిత్ శెట్టి. సింగం అగైన్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన వీరిద్దరూ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రాంతో సరదాఈ సందర్భంగా వీళ్లిద్దరూ సెట్లోని ఓ వ్యక్తి షర్ట్‌పై ఇంక్ పోసిన ప్రాంక్ వీడియోను ప్లే చేశారు. అది చూసిన రోహిత్ శెట్టి.. ఇది మేము చేసినవాటిలో చాలా చిన్న ప్రాంక్. ఒకసారైతే మా ప్రొడక్షన్ టీమ్ మెంబర్ ఇంటికి ఓ మహిళను, బాబును పంపించాం. అతడి మొదటి భార్యను నేనే అంటూ ఆమెతో నాటకం ఆడించాము. ఆ రేంజ్ వరకు వెళ్లాము అని చెప్పుకొచ్చాడు.మావల్ల విడాకులు కూడా..ఇంతలో అజయ్ దేవ్‌గణ్ మాట్లాడుతూ.. ఈ మధ్య ప్రాంక్‌స్టర్స్ ఏదైనా చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మేమైతే పెద్దగా ఆలోచించకుండానే ప్రాంక్ చేసేవాళ్లం. మావల్ల ఒకటీరెండు విడాకులు కూడా జరిగాయి అని తెలిపాడు. సినిమాఇకపోతే అజయ్, రోహిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సింగం అగైన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో దీపిక పదుకొణె, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ నవంబర్ 1న విడుదలైంది.చదవండి: ఆలియా భట్‌తో నాగ్ అశ్విన్ సినిమా.. ఆయన ఏమన్నారంటే? -
అజయ్ దేవగన్– రోహిత్ శెట్టి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన
బాలీవుడ్లో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా విడుదలైన వారి కాంబో నుంచి విడుదలైన సింగమ్ అగైన్ యాక్షన్ హంగామాతో థియేటర్స్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే సింగమ్ ప్రాంఛైజీలో భాగంగా 3 చిత్రాలు వచ్చాయి. అయితే, వారిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. గోల్మాల్ ప్రాంఛైజీ నుంచి మరో ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా అధికారికంగా ప్రకటించారు.'సింగమ్' వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం గోల్మాల్ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వారిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన గోల్మాల్ రిటర్న్స్ (2008) సూపర్ హిట్ అయింది. ఈ ఫ్రాంచైజీలో గోల్మాల్ 3 (2010), గోల్మాల్ 4 (2017) కూడా వచ్చాయి. గోల్మాల్ 5 2025లో రానుందని ఆయన ఆయన ప్రకటించారు.బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల లిస్ట్‌లో 'గోల్మాల్' కూడా తప్పకుండా ఉంటుంది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగు భాగాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు పార్ట్5 ప్రకటన రావడంతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. 'సింగమ్ అగైన్‌తో సినీ అభిమానులకు ఓ యాక్షన్ చిత్రాన్ని అందించాను. త్వరలో వారిని అన్‌లిమిటెడ్‌గా నవ్వించడానికి 'గోల్మాల్ 5' కోసం ప్లాన్ చేస్తున్నట్లు' అయన ప్రకటించారు. -
బిగ్‌బాస్ హోస్టింగ్‌కు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో
బిగ్‌బాస్ షోలో వారం రోజులు కంటెస్టెంట పర్ఫామెన్స్ చూస్తే వీకెండ్లో హోస్ట్ వారికి ఎలా కోటింగ్ ఇస్తారు? ఎవరిని మెచ్చుకుంటారు? అని ఎదురుచూస్తుంటారు ఆడియన్స్. అందుకే వీకెండ్లో రేటింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. కొందరు హీరోలు బిగ్‌బాస్ బాధ్యతను ఏళ్ల తరబడి భుజాలపై మోస్తున్నారు. బిగ్‌బాస్ షోకు డుమ్మావారిలో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపు 15 ఏళ్లుగా ఆయన హిందీ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 18వ సీజన్‌కు హోస్టింగ్ చేస్తున్నాడు. అయితే ఈ వారం అతడు షూటింగ్‌కు డుమ్మా కొట్టనున్నాడట! ప్రస్తుతం అతడు సికిందర్ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్‌లో సినిమా షెడ్యూల్ ఉండటంతో బిగ్‌బాస్ షో నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. సల్మాన్ స్థానంలో ఆ సెలబ్రిటీలుదీంతో ఈ వారం వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో సల్మాన్ స్థానంలో సెలబ్రిటీలు ఏక్తా కపూర్, రోహిత్ శెట్టి రానున్నారు. వీళ్ల స్పెషల్ ఎంట్రీ గురించి షో నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇక సికిందర్ సినిమా విషయానికి వస్తే.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: నన్ను క్షమించండి.. తప్పు చేయలేదు: కస్తూరి -
భారీ యాక్షన్ సీన్స్‌తో 'సింగం ఎగైన్' ట్రైలర్
బాలీవుడ్లో అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె నటించిన 'సింగం అగైన్' విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఉన్న ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన భారీ తారాగణమే ఉంది. ఇప్పటికే విడుదలైన 'సింగం' ఫ్రాంఛైజీలోని చిత్రాలను ప్రేక్షకులు భారీగానే ఆదరించారు.కాప్ యూనివర్స్ సినిమాగా రోహిత్ శెట్టి తెరకెక్కించారు. ఇందులో రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 4.58 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ మెప్పించేలా ఉంది. దీపావళి సందర్భంగా నవంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది -
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్‌గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్‌గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్‌సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్‌గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్‌కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. -
ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ కావాలంటూ డిమాండ్
బాలీవుడ్లో పోలీస్ కథలతో సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు రోహిత్ శెట్టికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ క్రమంలో వచ్చినవే సింగం సీరిస్, సింబా, సూర్యవంశీ ఈ మూడు సినిమాలో బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి అవన్నీ మంచి వినోదాన్ని పంచాయి. తాజాగా ఇదే కాన్సెప్ట్‌తో ఆయన తొలిసారిగా 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా సిద్ధమైన ఈ సిరీస్ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుందని వారు ప్రకటించారు. దేశ ప్రజలను సంరక్షించడం కోసం నిరంతరం శ్రమిస్తున్న భారతీయ పోలీసు అధికారుల నిస్వార్థ సేవలకు అద్దం పట్టేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. 'ఈ పోరాటం ప్రాణాలు కోల్పోయిన భారతీయులందరి కోసం.. ఈ వార్‌లో మన కుటుంబ సభ్యుల రక్తం చిందినా యుద్ధం ఆగదు' అంటూ కబీర్ పాత్రలో సిద్ధార్థ్ చెప్పిన డైలాగులు హైలెట్‌గా నిలుస్తున్నాయి. దాదాపు ఏడు ఎపిపోడ్స్‌తో సిద్ధమైన ఈ సిరీస్‌కు రోహిత్‌శెట్టితోపాటు సుశ్వంత్ ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరించారు. కానీ ఈ సిరీస్ హీందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది. దీంతో రీజనల్ లాగ్వేజ్ల నుంచి కూడా మేకర్స్‌కు ఒత్తిడి పెరుగుతుంది. అన్నీ భాషల్లో విడుదల చేయాలంటూ పలువురు నెటిజన్లు ఇప్పటికే పోస్ట్‌లు చేయడం గమనర్హం. హిందీలో అయితే జనవరి 19 నుంచి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్‌ను అమెజాన్‌లో చూడొచ్చు. -
ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ రిలీజ్.. బిగ్ అప్డేట్
బాలీవుడ్లో పలు పోలీస్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. ఈసారి తెలుగుతో సహా పలు భాషల్లో 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రకటన తర్వాత ఎలాంటి అప్డేట్లు ఇవ్వని మేకర్స్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 జనవరి 19న అమెజాన్ ప్రైమ్ వేదికగా పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ వెబ్ సిరీస్‌పై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. సిద్దార్త్ మల్హోత్రా, శిల్పాశెట్టిలతో పాటు వివేక్ ఒబెరాయ్, శ్వేతా తివారీ, నికితిన్ ధీర్, రితురాజ్ సింగ్, లలిత్‌లు పోలీసు అధికారులుగా ఈ సిరీస్‌లో కనిపించనున్నారు. భారత పోలీసుల నిబద్ధతను, పరాక్రమాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. 7భాగాలుగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను ముందుగా దీపావళి 8న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో జనవరికి పోస్ట్ పోన్ చేశారు. Lights, Siren, Action!🚨 Amazon Original Indian Police Force, a larger than life series to release Worldwide on Jan 19, 2024! Thrilled to be bringing this high-octane action entertainer from the incredible Rohit Shetty to audiences. Paying an ode to our Indian Police on… pic.twitter.com/vIbFKqQzL4 — prime video IN (@PrimeVideoIN) October 21, 2023 -
శక్తీ శెట్టి.. లేడీ సింగమ్
లేడీ సింగమ్ శక్తీ శెట్టిగా మారారు దీపికా పదుకోన్. ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ చిత్రాల తర్వాత బాలీవుడ్ ‘సింగమ్’ ఫ్రాంచైజీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. అజయ్ దేవగన్ మెయిన్ లీడ్ హీరోగా, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘సింగమ్ ఎగైన్’ చిత్రంలో లేడీ సింగమ్ పోలీసాఫీసర్ శక్తీ శెట్టి పాత్రలో దీపికా నటిస్తున్నారని, కథ రీత్యా క్రూరమైన, హింసాత్మక ధోరణిలో శక్తీ శెట్టి పాత్ర ఉంటుందని రోహిత్ శెట్టి పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!
ఒక సినిమా వందకోట్లు కలెక్షన్స్ రావడమంటే అంతా ఈజీ కాదు. స్టార్ హీరోల సినిమాలకైతే వాళ్ల క్రేజ్‌ను బట్టి వసూళ్లు రాబట్టడం జరుగుతూ ఉంటోంది. ఇక హీరోల సంగతి పక్కన పెడితే.. దర్శకుడే సినిమాకు ప్రధాన బలం. వారి కథ, స్క్రీన్ ప్లేను బట్టి సినిమా హిట్టా, ఫ్లాపా అనే టాక్ తెచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద వందకోట్లు కొల్లగొట్టడం చూస్తుంటాం. కానీ ఓకే దర్శకుడి తెరకెక్కించిన తొమ్మిదికి పైగా చిత్రాలు వంద కోట్లు రాబట్టమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత సాధించిన దర్శకధీరుడి గురించి తెలుసుకుందాం. తొమ్మిది చిత్రాల దర్శకుడు 2000ల మధ్యకాలంలో భారతీయ సినిమాలు.. దేశీయ కలెక్షన్లతో వందకోట్ల మార్కు చేరుకున్న సినిమాలుగా గుర్తించారు. ఆ తర్వాత దేశవ్యాప్తం కలెక్షన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు దాటిన సినిమాలను వంద కోట్ల క్లబ్లో చేర్చారు. చాలా మంది హీరోల సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. కానీ వందకోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు నిర్మించిన దర్శకుల సంఖ్య మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఇలాంటి అరుదైన మైలురాయిని అందుకున్న దర్శకుల్లో రోహిత్ శెట్టి ఒకరు. ఆయన నిర్మించిన తొమ్మిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు సాధించాయి. అత్యధికంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు తీసిన భారతీయ దర్శకుడిగా పేరు సంపాదించారు. గోల్మాల్ 3తో మొదలై.. గోల్మాల్ 3 చిత్రంతో మొదలైన రోహిత్ ప్రభంజనం సూర్యవంశీ వరకు కొనసాగింది. అతను నిర్మించిన చిత్రాల్లో రూ. 423 కోట్ల కలెక్షన్స్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఆ తర్వాత సింగం (రూ. 157 కోట్లు), బోల్ బచ్చన్ (రూ. 165 కోట్లు), సింగం రిటర్న్స్ (రూ. 219 కోట్లు), దిల్వాలే (రూ. 377 కోట్లు), గోల్మాల్ ఎగైన్ (రూ. 311 కోట్లు), సింబా (రూ. 400 కోట్లు) ఉన్నాయి. అయితే అయితే రోహిత్ శెట్టి తెరకెక్కించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచనవి కూడా ఉన్నాయి. వాటిలో జమీన్ (రూ. 18 కోట్లు), సండే (రూ. 32 కోట్లు), సర్కస్ (రూ. 62 కోట్లు)తో రూ. 100 కోట్లు రాబట్టని లిస్ట్‌లో ఆరు సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా 100 కోట్లే.. తన ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన ఘనత కరణ్ జోహార్ సొంతం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో ఆదిత్య చోప్రాకు అసిస్టెంట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చిత్రనిర్మాత, 1998లో కుచ్ కుచ్ హోతా హైతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 107 కోట్లను రాబట్టి.. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ రూ.100 కోట్లు దాటాయి. ఇటీవల విడుదలైన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఏడో చిత్రం కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది.. రూ.100 కోట్ల చిత్రాల దర్శకులు వీళ్లే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు సాధించిన దర్శకులు కూడా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఐదు చిత్రాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఆ తర్వాత కబీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ ఒక్కొక్కరు నాలుగు సినిమాలు ఉన్నాయి. దర్శకు ధీరుడి నాలుగు చిత్రాలు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. వాటిలో మగధీర, బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. అయితే రాజమౌళి తెరకెక్కించిన రెండు సినిమాలు మాత్రం రూ.1000 కోట్ల వసూళ్లను దాటేశాయి. ఈ ఘనత సాధించిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి మాత్రమే నిలిచారు . -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్‌లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్‌పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్‌కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్‌కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
షూటింగ్లో రోహిత్ శెట్టికి గాయాలు.. ఎల్బీ నగర్ ఆస్పత్రికి తరలింపు
బాలీవుడ్ దర్శక-నిర్మాత, స్టంట్ మాస్టర్ రోహిత్ శెట్టికి గాయాలయ్యాయి. హైదరాబాద్ శివారులో జరుతున్న షూటింగ్లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మూవీ షూటింగ్, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. కాగా, బాలీవుడ్లో రోహిత్ శెట్టి యాక్షన్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ అనే విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాలే ఉంటాయి. చదవండి: విక్రమార్కుడు తర్వాత ఇంట్లో నన్ను దారుణంగా చూశారు: అజయ్ -
అఫీషియల్: సింగమ్-3లో హీరోయిన్గా దీపికా పదుకొణె..
బాలీవుడ్లో పోలీస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలకు రోహిత్ శెట్టి పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా ‘సింగమ్’ (2001), ‘సింగమ్ రిటర్న్స్’ (2014)), ‘సింబ’ (2018),‘సూర్యవన్షీ’(2021) వంటి పోలీస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు వచ్చాయి. ఇక అజయ్ దేవగన్తోనే రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో లేడీ పోలీసాఫీసర్ పాత్రకు దీపికా పదుకోన్‌ను తీసుకున్నట్లు గురువారం ప్రకటించారు రోహిత్. ‘‘సింగమ్ ఎగైన్’లో దీపిక లేడీ సింగమ్’’ అని ‘సర్కస్’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో పేర్కొన్నారు రోహిత్ శెట్టి. రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సర్కస్’ ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఇందులో ప్రత్యేక పాటకు భర్త రణ్వీర్తో కలిసి స్టెప్స్ వేశారు దీపిక. ఈ పాట విడుదల వేదికపై సింగమ్ సిరీస్‌లో అజయ్ దేవగన్ ఎలా నడిచేవారో అనుకరిస్తూ దీపికా నడిచి, అలరించారు. -
ఓటీటీకే మొగ్గు చూపుతున్న బాలీవుడ్ అగ్ర దర్శకులు
టెక్నాలజీ పెరిగిన తర్వాత డిజిటల్ ఎంటర్టైన్మెంట్ విస్తృతి పెరిగింది. దీంతో అగ్ర నటీనటులు ఓటీటీ ప్రాజెక్ట్స్‌పై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దర్శకులు కూడా ఓటీటీకి ఓకే చెబుతున్నారు. అలా హిందీ చిత్రసీమలో కొందరు దర్శకులు చేస్తున్న వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్స్ గురించి తెలుసుకుందాం. ⇔ ‘దేవదాస్’, ‘బ్లాక్’, ‘రామ్‌లీల’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన అగ్రదర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్‌లో సోనాక్షీ సిన్హా, అదితీరావ్ హైదరీ, మనీషా కొయిరాల తదితరులు ⇔ ‘గోల్మాల్’, ‘సింగమ్’ ఫ్రాంచైజీలతో పాటు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘సింబ’ వంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు రోహిత్ శెట్టి. ఇదే కమర్షియల్ క్రేజ్‌ను డిజిటల్ వరల్డ్‌లో కూడా రిపీట్ చేయాలను కుంటున్నారాయన. ఇందులో భాగంగానే ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ పోలీసుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన తారాగణం. ⇔ వెబ్ వరల్డ్‌లో ‘లస్ట్ స్టోరీస్’, ‘ఘోస్ట్ స్టోరీస్’ ఆంథాలజీకి మంచి వ్యూయర్షిప్ లభించింది. ఈ ఆంథాలజీలోని ఓ భాగానికి దర్శకత్వం వహించారు జోయా అక్తర్. ఇప్పుడు సోలోగా ఓ వెబ్‌ఫిల్మ్ చేస్తున్నారామె. అమెరికన్ కామిక్ బుక్ ‘ది అరీ్చస్’ ఆధారంగా ఈ వెబ్ ఫిల్మ్ తీస్తున్నారు. ఈ వెబ్ ఫిల్మ్‌తోనే అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద, షారుక్ ఖాన్ కుమార్తె సుహానా, బోనీకపూర్–దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ యాక్టర్స్‌గా ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఇక ‘జిందగీ నా మిలేగీ దోబారా’, ‘గల్లీ బాయ్’ వంటి చిత్రాలతో జోయా అక్తర్ దర్శకురాలిగా సుపరిచితురాలే. ⇔ ‘బరేలీ కీ బర్ఫీ’, ‘పంగా’ వంటి చిత్రాలతో మంచి దర్శకురాలిగా పేరు సంపాదించుకున్నారు అశ్వనీ అయ్యర్ తివారి (ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి భార్య). ఇప్పటికే భర్త నితీష్‌తో కలిసి ‘బ్రేక్ పాయింట్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో భాగస్వామ్యులయ్యారు అశ్వని. ఇప్పుడు సోలోగా ‘ఫాదు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో పావైల్ గులాటి, సయామీ ఖేర్ ముఖ్య తారలుగా ఈ సిరీస్ తీస్తున్నారు అశ్వనీ. రెండో సిరీస్‌తో... కొందరు దర్శకులు రెండో వెబ్ సిరీస్‌కి రెడీ అయ్యారు. ఆ వివరాల్లోకి వస్తే... ⇔ సల్మాన్ ఖాన్‌తో ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాలను తీసిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తొలిసారిగా ‘తాండవ్’ అనే వెబ్ సిరీస్ చేశారు. తాజాగా షాహిద్ కపూర్ లీడ్ రోల్లో ‘బ్లడీ డాడీ’ అనేæసిరీస్ తీశారు. ఇక ‘స్కామ్ 1992’తో ఓటీటీలో సంచలనం సృష్టించిన దర్శకుడు హన్సల్ మెహతా తాజాగా భారత జాతిపిత మహాత్మాగాంధీ జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తీస్తున్నారు. ఇందులో ప్రతీక్ గాంధీ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘కహానీ’, ‘బద్లా’ వంటి హిట్ సినిమాలు చేసిన సుజోయ్ ఘోష్ ఇప్పటికే ‘టైప్ రైటర్’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ దర్శకుడు ప్రస్తుతం కరీనా కపూర్‌తో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి వెళ్లిన అనురాగ్ కశ్యప్ మరో వెబ్ సిరీస్‌కు కథ రెడీ చేశారట. ఇక హిట్ చిత్రాలు ‘క్వీన్’, ‘సూపర్ 30’ ఫేమ్ దర్శకుడు వికాశ్ బాల్ రెండో వెబ్ సిరీస్‌గా ‘ది క్యాన్సర్ బిట్చ్ చేస్తున్నారు. ‘సన్ ఫ్లవర్’ అనే సిరీస్‌తో వికాశ్ వెబ్ ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు దర్శకులు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్‌లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్
Sathyaraj About His Role In Chennai Express Movie: దక్షిణాది ప్రముఖ నటుల్లో సత్యరాజ్ ఒకరు. దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన బాహుబాలితో కట్టప్పగా వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయ్యారు. కథ, పాత్ర నచ్చితే చాలు అందులో ఇమిడిపోతారు. ఎలాంటి సన్నివేశాలకైన వెనుకాడరు. అలాంటి ఆయన పాత్ర నచ్చకపోయిన ఓ మూవీ ఒప్పుకున్నారట. కేవలం అందులోని హీరో కోసమే ఆ పాత్ర చేశానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కట్టప్ప. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పాత్ర కోసం చిత్రబృందం నన్ను సంప్రదించింది. కానీ నాకు ఆ పాత్ర గొప్పదిగా అనిపించలేదు. ఇదే విషయాన్ని షారుక్, డైరెక్టర్ రోహిత్ శెట్టికి చెప్పాను. కానీ ఫైనల్‌గా షారుక్ ఖాన్‌పై అభిమానంతో ఆ మూవీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే షారుక్ అంటే నాకెప్పటి నుంచో అభిమానం. ఆయన నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే ఎన్నోసార్లు చూశా. అందులో షారుక్ నటన నాకెంతో నచ్చింది. అందుకే ఆయనతో నటించాలన్న ఉద్దేశంతో ఆ సినిమా ఒప్పుకున్నా.' అని సత్యరాజ్ తెలిపారు. కాగా యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో హీరోయిన్ దీపిక పదుకొణె తండ్రి పాత్రలో లోకల్ మాఫియా నాయకుడిగా సత్యరాజ్ నటించారు. -
తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్..
Mumbai Former Police Commissioner Rakesh Maria Biopic By Rohit Shetty: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి యాక్షన్ అండ్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల అక్షయ్ కుమార్‌తో సూర్యవంశీ తెరకెక్కించి హిట్ కొట్టాడు. అమెజాన్ ఓటీటీ కోసం ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనె వెబ్ సిరీస్‌ను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శెట్టి మరో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అది కూడా ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ రాకేష్ మారియా బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు రోహిత్. రాకేష్ మారియా తన కెరీర్లో సాధించిన విజయం ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు రోహిత్ శెట్టి అధికారికికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ 'రాకేష్ మారియా తన 36 ఏళ్ల అద్భుతమైన ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆయన 1993 ముంబైలో జరిగిన పేలుళ్ల నుంచి అండర్ వరల్డ్ ముప్పు, 2008లోని 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు ఎన్నో చూశారు. నిజ జీవితంలోని ఈ సూపర్ కాప్ ధైర్య, సాహసాల ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.' అని తెలిపారు. కాగా ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ మారియా 1981వ బ్యాచ్ నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1993లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా (ట్రాఫిక్) ఉన్న రాకేష్ మారియా ముంబై వరుస పేలుళ్ల కేసును ఛేదించారు. తర్వాత ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు డీసీపీగా, ఆ తర్వాత జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అధికారిగా మారారు. 2008లో 26/11 ముంబై దాడులను పరిశోధించే బాధ్యతను కూడా మారియాకు అప్పగించారు. చదవండి: ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం ! అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
ఓటీటీలో ఎంట్రి ఇస్తున్న శిల్పాశెట్టి.. పోస్టర్ విడుదల
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై సందడి చేస్తోంది. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌తో కలసి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్‌సిరీస్ ద్వారా శిల్పా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీనికి సంబంధించి అఫీషియల్ పోస్టర్ని శిల్పా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పోలీస్ డ్రెస్‌లో గన్ పట్టుకొని ఉన్న శిల్పాశెట్టి పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్లో స్పెషల్ సెల్ ఆఫీసర్‌గా సిద్ధార్థ్ మల్హోత్ర కనిపించనుండగా, అదే టీమ్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా శిల్పా శెట్టి నటిస్తోంది. కాగా ఈ వెబ్‌సిరీస్ 8భాగాలుగా తెరకెక్కనుంది. Ready to set the OTT platform on fire for the first time🔥Superrr Thrilled to join The Action King #RohitShetty in his Cop Universe! #IndianPoliceForceOnPrime, now filming!🇮🇳👮♀️🚔💪 @SidMalhotra @PrimeVideoIN @RSPicturez #ShilpaShettyJoinsIndianPoliceForce #IndianPoliceForce pic.twitter.com/1JwOODKFZb — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) April 23, 2022 -
నాన్న పెద్ద నటుడు.. నా తొలి సంపాదన రూ. 35 మాత్రమే: స్టార్ దర్శకుడు
Rohit Shetty Real Life Story In Telugu: Unknown Facts About Him: రోహిత్ శెట్టి.. బాలీవుడ్ కమర్షియల్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. తాజాగా థియేటర్లలో విడుదలైన రోహిత్ శెట్టి సినిమా.. సూర్యవంశీ... వసూళ్లలో దూసుకుపోతుంది. లాక్డౌన్ అనంతరం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ సూపర్‌హిట్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడిగా కోట్లలో పారితోషికం తీసుకుంటున్న రోహిత్‌శెట్టి తొలి సంపాదన ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. బాలీవుడ్లో పని చేస్తున్న తొలి రోజుల్లో అతడి సంపాదన కేవలం 35 రూపాయలు మాత్రమేనట. సామాన్యులకయితే అనుకోవచ్చు.. కానీ అప్పటికే రోహిత్ శెట్టి తండ్రి పెద్ద నటుడు, స్టంట్‌మ్యాన్, కొరియోగ్రాఫర్ కూడా. అలాంటి రోహిత్‌శెట్టి కేవలం 35 రూపాయల వేతనం పొందడం ఆశ్చర్యం అనిపిస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శెట్టి తన బాలీవుడ్ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు.. (చదవండి: ఆల్రెడీ పెళ్లైన దర్శకుడిని ప్రేమించిన హీరోయిన్!) రోహిత్ శెట్టి తండ్రి ఎంబీ శెట్టి ప్రముఖ నటుడు, కొరియాగ్రాఫర్, స్టంట్‌మ్యాన్ కూడా. అప్పటికే ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఇక తన 16వ ఏట నుంచి పని చేయడం ప్రారంభించానన్నాడు రోహిత్‌శెట్టి. కర్లీ టేల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ 16 ఏట నుంచే పని చేయడం ప్రారంభించాను. చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేవాడిని. అప్పటికే మా నాన్న గారు బాలీవుడ్లో ప్రముఖ నటుడు. అయినప్పటికి కూడా నా ప్రయాణం అంత సజావుగా సాగలేదు’’ అని తెలిపాడు. ‘‘బాలీవుడ్లో నా తొలి సంపాదన 35 రూపాయలు. ప్రతిరోజు రెండు గంటలపాటు నడిచి.. సినిమా సెట్‌కు చేరుకునేవాడిని. ఒక్కోసారి చేతిలో చాలా తక్కువ మొత్తం ఉండేది. ఆ డబ్బు ఖర్చు పెట్టి.. భోజనం చేస్తే.. ఇంటికి వెళ్లడానికి చార్జీలకు డబ్బులుండేవి కాదు. చార్జీలకు దాచుకుంటే.. తినడానికి ఉండేది కాదు. ఇక ముంబైలో ఉన్న రోడ్లన్ని నాకు కొట్టిన పిండి. షార్ట్‌కట్స్ అని నాకు తెలుసు. ప్రస్తుతం కారులో వెళ్తున్నప్పుడు షార్ట్‌కట్ గురించి చెప్తే నా డ్రైవర్ నావైపు ఈయన గతంలో దొంగతనాలు చేసేవాడా ఏంటి అన్నట్లు అనుమానంగా చూస్తాడు’’ అని తెలిపాడు. మా నాన్నగారి స్టార్డం నాకు ఏవిధంగాను ఉపయోగపడలేదు. నా సొంతంగా ఎదిగి.. ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలిపాడు. (చదవండి: 100 కోట్ల మార్క్‌ను దాటిన సూర్యవంశీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే..?) ప్రస్తుతం రోహిత్ శెట్టి రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రోహిత్ శెట్టి సర్కస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే రోహిత్ శెట్టి తనకు మాత్రమే ప్రత్యేకమైన పోలీసు చిత్రంలో మహిళ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఫీమేల్ పోలీస్ ఆఫిసర్ లీడ్‌లో రోహిత్ శెట్టి చిత్రం.. -
ఫీమేల్ పోలీస్ ఆఫిసర్ లీడ్‌లో రోహిత్ శెట్టి చిత్రం..
Rohith Shetty's Cop Universe Movie With A Female Officer: బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల విడుదలైన ఆయన తాజా చిత్రం 'సూర్యవంశీ' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అందులో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌ను ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫిసర్‌గా చూపించారో తెలిసిందే. మరీ అలాంటి పాత్రలో హీరోయిన్ను చూపిస్తే. అవును, అలాంటి రోల్లో హీరోయిన్ పెట్టి సినిమా తీయాలనుంది అంటున్నారు డైరెక్టర్ రోహిత్ శెట్టి. దర్శకుడు రోహిత్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో తాను తీయబోయే కొత్త చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఇంతకుముందు అతని సినిమాల్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్‌తో ప్రధాన పాత్రలో చేయించలేదని, తన విధానంలో స్త్రీ ప్రధాన పాత్రలో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించానని తెలిపారు. అయితే భవిష్యత్తులో అలాంటి సినిమా ఒకటి ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసుకు భార్య, గర్ల్‌ఫ్రెండ్ కంటే ఎక్కువగా మహిళా పోలీసు పాత్ర ఉంటుందన్నారు. అంటే తాను తీసే తర్వాతి కాప్ యూనివర్స్ చిత్రం పవర్ఫుల్ ఫీమేల్ పోలీసు అధికారి పాత్రలో ఉండవచ్చని ఊహించవచ్చు. ఒకవేళ అదే జరిగితే రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో చేసే హీరోయిన్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేస్తుందన్నమాట. రొమాన్స్‌కు బదులు భారీ ఫైటింగ్‌లు, చేజింగ్‌లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ కాప్ యూనివర్స్ నాలుగో సినిమాలో చేసే హీరోయిన్ ఎవరో వేచి చూడాలి. మరోవైపు సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్ ప్రధానపాత్రలో నటించిన సూర్యవంశీ ఆదివారం వరకు రూ. 151.23 కోట్లను వసూలు చేసింది. అయితే 'సూర్యవంశీ' బ్లాక్‌బస్టర్ విజయం ఇంకా ముగిసిపోలేదని డైరెక్టర్ రోహిత్ శెట్టి అన్నారు. ఈ సినిమా విడుదల 19 నెలల కఠినమైన యుద్ధం అని, తాను అతని బృందం కరోనా, దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో సాగిన పోరాట ఫలితమన్నారు. -
అల్లు అర్జున్‌పై బాలీవుడ్ డైరెక్టర్ల ప్రశంసలు, ఎందుకంటే..
Director Rohit Shetty And Karan Johar Reacts On Allu Arjun Comments Over Indian Movie Industries: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత ప్రశంసలు కురిపించారు. బుధవారం జరిగిన వరుడు కావలెను ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బన్నీ ముఖ్య అతిథీగా హజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, ఇప్పుడిప్పుడే మహమ్మారి ప్రభావం తగ్గడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు థియేటర్లోకి వస్తున్నారని పేర్కొన్నాడు. ఇప్పటి నుంచి భారత సినీ పరిశ్రమలో అన్ని పెద్ద పెద్ద సినిమాలే రాబోతున్నాయన్నాడు. అన్ని ఇండస్ట్రీల వారు బాగుండాలని ఆశించాడు. చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు భారత సినీ పరిశ్రమలను ఉద్దేశించి బన్నీ వ్యాఖ్యలపై హందీ సూర్యవంశీ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టి, నిర్మాత కరణ్ జోహార్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ట్వీట్ చేస్తూ బన్నీకి ధన్యవాదాలు తెలిపారు. ‘‘సినిమా అనేది నా ఒక్కడిదే కాదు. మనందరిదీ’ ఈ మాటనే నేను ఎక్కువగా నమ్ముతాను. మా చిత్రానికి విషెస్ తెలిపినందుకు థాంక్యూ బ్రదర్. మీరు నిజంగా రాక్‌స్టార్’ అలాగే మీరు నటించిన ‘పుష్ప’ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని రోహిత్ ట్వీట్ చేయగా దీనికే ‘థ్యాంక్యూ బన్నీ.. నువ్వు నిజంగానే సూపర్‌స్టార్’ అని కరణ్ జోహార్ రీట్వీట్ చేశాడు. చదవండి: Allu Arjun : ఇండస్ట్రీలో అన్ని విభాగాల్లోకి మహిళలు రావాలి.. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో తెలుగులో ‘‘వరుడు కావలెను, రొమాంటిక్’, తమిళ్లో రజనీకాంత్‌గారి ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగీ 2’, హిందీలో ‘సూర్య వంశీ’.. సినిమాలు విడుదలవుతున్నాయి.. అన్ని సినిమాలూ హిట్ అవ్వాలి’’ అని హీరో అల్లు అర్జున్ ఆశించాడు. అలాగే ఈ డిసెంబరు 17న ‘పుష్ప’ తో తాము వస్తున్నామని, ఈ మూవీ అందరికి నచ్చాలని కోరుకుంటున్నాన్నాడు. ఇక ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బన్నీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ దీపావళికి భారతీయ సినిమా మునుపటిలా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్ చేస్తుందనే నమ్మకం ఉందని అల్లు అర్జున్ ధీమా వ్యక్తం చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్ "As I said earlier, it’s not my film, it’s OUR film…Thank you for the love and support my brother. Wish you ALL THE BEST FOR PUSHPA 🤗@alluarjun you are a ROCKSTAR🔥🔥🔥" - Rohit Shetty Come #BackToCinemas and witness the world of #Sooryavanshi on 5th November. pic.twitter.com/MMke5RV1tl — Dharma Productions (@DharmaMovies) October 27, 2021 -
వీడియోలో అడ్డంగా దొరికిపోయిన అక్షయ్.. అయినా వదలని కత్రీనా
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్ జంట నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అజయ్‌దేవ్‌గణ్, రణ్వీర్ సింగ్ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పారంభించింది ఈ చిత్రబృందం. ఆ సమయంలో తీసిన ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది క్యాట్. మా బోయ్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండంటూ అక్షయ్, రోహిత్‌ను చూపించింది ఈ బ్యూటీ. అందులో అక్షయ్ కళ్లు మూసుకొని, రోహిత్ కాళ్లపై తలపెట్టి పడుకొని ఉన్నాడు. కత్రీనా వీడియో తీయడం చూసిన రోహిత్, అక్షయ్ రికార్డు చేయొద్దు అంటూ పరుగు లంకించుకున్నారు. ‘ఇప్పుడు మేము అంతా బాగా కనిపించడం లేదు. మాకు ఫేమ్ ఉంది. రికార్డు చేయొద్దు’ అంటు పరిగెత్తుతున్న అక్షయ్ కిందపడ్డాడు. అది చూసిన పట్టువదలని ఈ భామ గొల్లున నవ్వుతూనే వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో మూవీ ప్రమోషన్స్ గురించి వారు ఎంత ఎక్సయిట్మెంట్తో ఉన్నారో చూడండి అంటూ వెటకారమాడింది ఈ బ్యూటీ. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: OMG 2: శివుడిగా అక్షయ్ కుమార్.. లుక్ అదిరిందిగా! View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
రాంగ్ స్టెప్ వేశారో.. మీ ఫ్యూచర్‌కు దెబ్బే.. అక్షయ్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: ఈ దీపావళికి ఎట్టకేలకు బిగ్ స్క్రీన్‌ను పలకరించనున్న బాలీవుడ్ మూవీ సూర్యవంశీ టీమ్ ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. రణవీర్‌తో కలిసి స్పెప్పులతో ఇరగదీసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. (Prabhas: క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. సూర్యవంశీ మూవీలోని లేటెస్ట్ ట్రాక్ ‘ఐలారే అల్లా’ పాటకు రణవీర్‌తో కలిసి స్టెప్పులేశాడు అక్షయ్. ఈ క్రేజీ డాన్స్‌కు మీరు అడుగులు రోపండి అని పోస్ట్ చేశారు. అంతేకాదు.. జాగ్రత్త.. ఎక్కడైనా పొరపాటు జరిగిందో, మీ ఫ్యూచర్‌కు దెబ్బే అంటే స్వీట్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. ఈ మూవీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఐలారే పాటను గురువారం ట్విటర్లో షేర్ చేశారు.(Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్’కు హ్యాపీ బర్త్‌డే) రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సూర్యవంశీ. అజయ్ దేవగన్‌ని ‘సింగం’గా, రణ్‌వీర్‌ని ‘సింబా’గా చూపించిన రోహిత్ తాజాగా అక్షయ్‌ని ‘సూర్యవంశీ’ గా చూపించబోతున్నాడు. అంటే సింగిల్ ఫ్రేమ్‌లో ‘సింగం’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ అన్నమాట. వీరితోపాటు కత్రినా కైఫ్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. (Freida Pinto: అవును..నా డ్రీమ్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నా!) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నవంబర్ 5న దీపావళికి విడుదల కానుంది. తమ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి ఆదరించాలంటూ దర్శకుడు రోహిత్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఈ మూవీ ప్రమోషన్లో ప్రస్తుతం అంతా బిజీబిజీగా ఉన్నారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నాయి. ఓటీటీలో కంటే థియేటర్లో రిలీజ్ కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్న కొన్ని సినిమాలలో సూర్యవంశీ కూడా ఒకటి. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) The celebrations have begun & here is your party starter pack!!#AilaReAillaa song out now - https://t.co/mLu67F7jTr#Sooryavanshi releases this Diwali, 5th November in cinemas. #BackToCinemas pic.twitter.com/R3HJwOzFT4 — Karan Johar (@karanjohar) October 21, 2021 -
ఆల్రెడీ పెళ్లైన దర్శకుడిని ప్రేమించిన హీరోయిన్!
రోహిత్ శెట్టి.. మోడర్న్ బాలీవుడ్లో కమర్షియల్లీ ఎంటర్టైనింగ్ సినిమా ఫార్ములాను కనిపెట్టిన దర్శకుడు! హీరో వర్షిప్‌ను డైరెక్టర్ వర్షిప్‌గా బదలాయించిన వాడు.. టెక్నీషియన్స్ ఇమేజ్ను ఇనుమడింప చేసినవాడు! కెరీర్ గ్రాఫ్‌లో ఆకాశంతో పోటీపడ్తున్న ఈ ఫిల్మ్ మేకర్ ప్రేమ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్‌గానే ఉండిపోయాడు! అతని ప్రేమిక పేరు ప్రాచీ దేశాయ్. ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’లో వన్ ఆఫ్ ది హీరోయిన్స్. ఈ ప్రేమ కథా సాదాసీదాగానే ప్రారంభమైంది. ఆ సంగతి చెప్పుకునే ముందు రోహిత్ శెట్టి పెళ్లి జీవితం గురించి తెలుసుకోవాలి. అతనిది పెద్దలు కుదిర్చిన వివాహం. భార్య పేరు మాయా. ఒక కొడుకు కూడా. ఇషాన్ శెట్టి. బాలీవుడ్‌లోని రోహిత్ శెట్టి పరిచయస్తుల ప్రకారం.. మరీ అన్యోన్య దాంపత్యం కాకపోయినా పొరపొచ్చాలతో సతమతమవుతున్న సంసారమేం కాదు. ప్రాచీతో ప్రేమలో పడ్డాడు రోహిత్. ‘బోల్ బచ్చన్’ సమయంలో. ఆ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌కు చెల్లెలుగా నటించింది ప్రాచీ దేశాయ్. నిజానికి ఆ పాత్ర కోసం ముందుగా జెనీలియా డిసూజాను అనుకున్నారు. ఆమె సైన్ కూడా చేసింది. ఎందుకనో సినిమా మొదలయ్యే టైమ్‌కి జెనీలియా తప్పుకుంది. ప్రాచీ చేరింది. రోహిత్ ప్రేమ మొదలైంది. ఫిదాకాక తప్పలేదు ‘బోల్ బచ్చన్’ చిత్రీకరణ జైపూర్‌లో జరుగుతోంది. సీన్స్ వివరిస్తున్నప్పుడు ప్రాచీని చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం వచ్చింది రోహిత్‌కు. వృత్తిపట్ల ఆమె నిబద్ధత.. పాపులారిటీ మాయని పట్టించుకోని ఆమె స్థితప్రజ్ఞత అతనికి బాగా నచ్చాయి. ఆకర్షణకులోను చేసే అందమెలాగూ ఉండనే ఉంది. ప్రేమ పెంచుకోవడానికి ఈ కారణాలు చాలు కదా! ప్రాచీని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమెను ప్రత్యేకంగా ట్రీట్ చేయసాగాడు. షూటింగ్ ప్యాకప్ అవగానే డిన్నర్ డేట్స్, రొమాంటిక్ ఈవెనింగ్స్‌ను ఆస్వాదించసాగాడు ప్రాచీతో. రోహిత్‌కు పెళ్లయిన విషయం తెలిసున్న ఆమె తొలుత అతనితో ముభావంగానే ఉంది. కానీ హాస్య చతురతతో అతను ఇంప్రెస్ చేసిన తీరుకు ఫిదాకాక తప్పలేదు ఆమెకు. విడాకులకూ సిద్ధం ప్రాచీ ప్రాణమైపోయింది రోహిత్‌కు. సినిమా వర్క్ పూర్తయినా ఆమె చేయి వదల్లేదు. ఇంటికి వెళ్లడమే మానేశాడు. వాళ్లిద్దరూ సహజీవనం చేశారని చెప్తాయి బాలీవుడ్ వర్గాలు. వదంతులుగానూ ప్రచారం అయింది. అయితే ఆ విషయం మాయాకూ తెలిసింది రోహిత్ సన్నిహితుల ద్వారా. భార్యకు ప్రశ్నించే అవకాశమూ ఇవ్వలేదు.. ఎదురుగా వచ్చి తనూ వివరణ ఇవ్వలేదు. కుమిలిపోయింది మాయా. విడాకులకు సిద్ధమయ్యాడు రోహిత్. సంబంధించిన కాగితాలూ పంపాడు భార్యకు సంతకం చేయమని. ‘చస్తే చేయను’ అని భీష్మించుకుంది మాయా. ప్రాచీ ప్రేమను కలకాలం నిలుపుకోవడానికి మాయాతో తెగతెంపులు చేసుకోవాలని చాలా ప్రయత్నించాడు. అయినా మాయా తగ్గలేదు. ఆమె వల్లే.. ప్రాచీ వల్ల బంగారం లాంటి కాపురం కూలిందనే కామెంట్లూ మొదలయ్యాయి. అవి ప్రాచీ చెవిన పడ్డాయి. కలత చెందింది. ‘నా వల్ల మీ ఇల్లు నాశనమవడం నాకిష్టం లేదు. ఏవేవో కామెంట్లు వింటున్నా. సారీ .. రోహిత్’ అని చెప్పింది ప్రాచీ. ‘అయ్యో.. మాకు ముందునుంచే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నేను విడిగానే ఉండాలనుకున్నా.. లక్కీగా నా లైఫ్‌లోకి నువ్ వచ్చావ్’ అంటూ ఆమెను ఒప్పించజూశాడు. వినలేదు ప్రాచీ. ఇంటికి వెళ్లిపొమ్మని కోరింది. వెళ్లిపోయాడు. నేరుగా మాయా దగ్గరికే. మళ్లీ ప్రాచీ, అతను కలుసుకోలేదు. అలా ఆ ప్రేమ కథ ముగిసిపోయింది. భార్యా, కొడుకుతో సంతోషంగానే ఉన్నాడు రోహిత్. ఒంటరిగానే మిగిలిపోయింది ప్రాచీ. ఏ రిపోర్టర్ అయినా ‘పెళ్లి ఎప్పుడు?’ అని అతి చనువుగా అడిగితే ‘పెళ్లి గురించి నాకు గొప్ప అభిప్రాయమేం లేదు. అదొక భద్రమైన వ్యవస్థగా కూడా ఫీలవట్లేదు. అలాగని పెళ్లి చేసుకోననీ అనట్లేదు. చేసుకుంటాను నాకు నచ్చిన మనిషి తారసపడ్డప్పుడు’ అని చెబుతుంది ప్రాచీ దేశాయ్. ‘ప్రాచీ వల్లే మీ పెళ్లి డిస్టర్బ్ అయిందా?’ అని మీడియా రోహిత్‌నూ ఎన్కౌంటర్ చేసినప్పుడు.. ‘లేదు. నా భార్యతో అంతకుముందు నుంచే నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ఫేస్ చేశాను’ అని ప్రాచీకి చెప్పిన మాటనే మీడియాకూ చెప్పాడు రోహిత్. - ఎస్సార్ చదవండి: నా డిజిటల్ ఎంట్రీ గురించి భయంగా ఉంది: షాహిద్ కపూర్ -
అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' రిలీజ్ డేట్ వచ్చేసింది..
అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సూర్యవంశీ’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మార్చి 14 (ఆదివారం)న రోహిత్‌శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అజయ్ దేవగన్ అతిథి పాత్రలు పోషించారు. ‘‘సూర్యవంశీ సినిమా ట్రైలర్ ఏడాది కిత్రం విడుదలైంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల సినిమాను విడుదల చేయలేకపోయాం. కానీ మా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని చెప్పాం. ప్రామిస్ ఈజ్ ఈ ప్రామిస్. ‘సూర్యవంశీ’ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నాం. థియేటర్స్‌లో సినిమాను చూసినప్పుడు కలిగే అనుభూతి వేరు. ఆ రహీ హై పోలీస్ (పోలీస్ వస్తున్నాడు)’’ అని పేర్కొన్నారు అక్షయ్ కుమార్. చదవండి: చెర్రీతో జతకట్టే ఆ అమ్మాయి ఎవరంటే! -
ఆయనకు నేనో పెద్ద ఫ్యాన్: థ్రిల్ అవుతున్న పూజా
బుట్టబొమ్మ పూజాహెగ్డే చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ప్రభాస్‌తో కలిసి ఫిక్షనల్ రొమాంటిక్ రాధేశ్యామ్ చేస్తుండగా, అఖిల్‌తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నారు. అటు బాలీవుడ్‌లోనూ హీరో రణవీర్ సింగ్‌తో కలిసి సర్కస్ అనే కామెడీ చిత్రంలో నటించనున్నారు. ఇది ‘అంగూర్’ (1982) చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. దీనికి ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. సర్కస్ చిత్రంలో భాగస్వామ్యం అవుతున్నందుకు పూజా హెగ్డే ఎప్పటి నుంచో తెగ ఎక్జైట్ అవుతోంది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్టు పెట్టింది. (చదవండి: నాకు కాబోయేవాడు నా షూతో సమానం) "నేను రోహిత్ సర్‌కు వీరాభిమానిని. ఆయన తన సినిమాల ద్వారా ప్రపంచానికి వినోదాన్ని అందిస్తున్నారు. సింగమ్, సింబా, మరేదైనా కానీ, ఆయన సినిమాలు చూస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అలాంటిది రోహిత్‌తో కలిసి పని చేస్తున్నానంటే సంతోషం పట్టలేకున్నాను. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నాను" అని పూజా రాసుకొచ్చారు. ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్ కామెడీ ఉంటుందంటున్నారు. రణ్వీర్ కూడా డబుల్ యాక్షన్ చేస్తున్నారట. కాగా పూజా బాలీవుడ్లో మరో చిత్రంలో కూడా మెరవనున్నాను. "కబీ ఈద్ కబీ దివాళి"లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో జోడీ కట్టనున్నారు. (చదవండి: సోనూ సూద్, ప్లీజ్ మోనాల్‌ను కాపాడండి) -
మరోసారి క్రేజీ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన స్టార్ హీరో
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ మరోసారి క్రేజీ డైరెక్టర్ రోహిత్ శెట్టితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2018లో రోహిత్ శెట్టి, రణ్వీర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘సింబా’ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా వీరిద్దరి కలయికలో కామెడీ ఎంటర్టైనర్ ‘సర్కస్’ సినిమా రూపొందబోతుంది. ఈ చిత్రం షేక్స్పియర్ నవల ‘ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ ఆధారంగా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. సర్కస్ సినిమాలో రణ్‌వీర్‌కు జంటగా పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కథనాయికలుగా నటిస్తున్నారు. అలాగే వరుణ్ శర్మ, సిద్ధార్ధ జాదవ్, జానీ లీవర్, సంజయ్ మిశ్రా, వర్జేష్ హిర్జీ, విజయ్ పట్కర్, సుల్బ ఆర్య, ముఖేష్ తివారి, అనిల్ చరణ్‌జీత్, అశ్విని కలేస్కర్, మురళీ శర్మ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. చదవండి: నవ్వించడానికి రెడీ వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రం ముంబై, ఊటీ, గోవా ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోనుంది. భూషన్ కుమార్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తోపాటు ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. 2021 చివరలో మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కాగా, రణ్వీర్, రోహిత్ శెట్టి కలయికలో సింబా సినిమా రూపొందడంతోపాటు రోహీత్ శెట్టి డైరెక్ట్ చేసిన సూర్యవంశీ చిత్రంలో రణ్వీర్ గెస్ట్ రోల్లో కనిపించారు. మరో వైపు రణ్వీర్ నటించిన రెండు చిత్రాలు (83, జయేశ్‌భాయ్ జోర్దార్) షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ‘83’ చిత్రం ఏప్రిల్ విడుదలవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. అదే విధంగా జయేశ్‌భాయ్ జోర్దార్ వచ్చే విడుదల కానుంది. చదవండి: రణ్వీర్ కారుకు ప్రమాదం BIGGG NEWS... #RanveerSingh and director #RohitShetty team up once again... Film titled #Cirkus... #Rohit's take on #TheComedyOfErrors... Costars #PoojaHegde, #JacquelineFernandez and #VarunSharma... Produced-directed by #RohitShetty... Bhushan Kumar and Reliance Ent present. pic.twitter.com/EodlosSard — taran adarsh (@taran_adarsh) October 19, 2020 -
నవ్వించడానికి రెడీ
రణ్వీర్ సింగ్ ప్రేక్షకులను నవ్వించాలనుకున్నారు. అందుకే దర్శకుడు రోహిత్ శెట్టితో కలిశారు. ఇప్పుడు రణ్వీర్తో కలసి ప్రేక్షకులను నవ్వించడానికి పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా రెడీ అయ్యారని సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. ‘అంగూర్’ (1982) చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు రోహిత్ శెట్టి. హీరోగా రణ్వీర్ సింగ్‌ని ఎంపిక చేసి, అధికారికంగా ప్రకటించారు కూడా. రణ్‌వీర్‌ది డబుల్ రోల్. తన సరసన ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఆ పాత్రలను పూజా హెగ్డే, జాక్వెలిన్ చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. ఇది వినోద ప్రధానంగా సాగే సినిమా. ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్ కామెడీ ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. -
కామెడీకి రెడీ
‘సూపర్ 30, వార్’ చిత్రాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్నారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. ఆయన తదుపరి సినిమా ఏంటనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఫరాఖాన్‌తో ఓ సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. తర్వాత ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. తాజాగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్, సింగం, గోల్మాల్’ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారట హృతిక్. ఇదో కామెడీ ఎంటర్టైనర్ అని, హృతిక్ పాత్ర ఆద్యంతం వినోదం పంచేలా ఉంటుందని బాలీవుడ్ టాక్. -
ట్రోఫీ కైవసం: నటి భావోద్వేగం
ముంబై: ప్రముఖ హిందీ రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్ ఇండియా’ స్పెషల్ ఎడిషన్ బహుమతుల ప్రదానోత్సవం ఆదివారం ముగిసింది. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తూనే.. ఒకింత భయానికి గురిచేసే ఈ అడ్వెంచరస్ షో ట్రోఫీని టీవీ నటి నియా శర్మ సొంతం చేసుకున్నారు. సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శిన కనబరిచిన ఆమె.. ఫైనల్లో మరోసారి తనదైన ధైర్యసాహసాలు ప్రదర్శించి విజేతగా నిలిచారు. నటీనటులు జాస్మిన్ భాసిన్, కరణ్ వాహిని వెనక్కి నెట్టి ట్రోఫీని ముద్దాడారు. ఈ సందర్భంగా నియా శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ స్పెషల్ ఎడిషన్‌ను తొలుత చాలా సరదాగా ప్రారంభించాను. అయితే కొద్ది రోజుల్లోనే నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. టైటిల్‌ను గెలవాలనే ఆశయంతో స్టంట్లు పూర్తి చేయడం మొదలుపెట్టాను. ఇందుకోసం నేను వందకు వంద శాతం కష్టపడ్డాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు. షో నిర్వాహకులు తన పట్ల పూర్తి నమ్మకం ఉంచి, ప్రోత్సహించడంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పుకొచ్చారు. (చదవండి: బిగ్‌బాస్ ఎంట్రీ: కొట్టిపారేసిన నటి) అదే విధంగా.. ‘‘కలర్స్(టీవీ చానెల్) నాకు రెండోసారి అవకాశం కల్పించింది. నన్ను నేను నిరూపించుకోవడానికి దోహదపడింది. నియా శర్మ అంటే కేవలం మేకప్, స్టైలింగ్ అని విమర్శించే వాళ్లకు ఈ విధంగా సమాధానం ఇచ్చాను. నియా ఒక విజేత. తనను తాను నిరూపించుకున్న ధీశాలి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి హోస్ట్‌గా వ్యవహరించిన ఖత్రోంకీ ఖిలాడీ షోలో నియా, జాస్మిన్ భాసిన్, కరణ్ వాహితో పాటుగా జై భన్షాలీ, రిత్విక్ ధంజని, భారతీ సింగ్, హర్ష్ లింబోచియా, అలీ గొని, కరణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. వీరిలో రిత్విక్ మాత్రం వ్యక్తిగత కారణాలతో షో మధ్యలోనే వైదొలిగాడు. సీజన్ 10 ముగిసిన తర్వాత నిర్వహించిన స్పెషల్ ఎడిషన్‌లో రోహిత్ శెట్టి టీం కఠిన టాస్కులతో కంటెస్టంట్ల ధైర్యసాహసాలను పరీక్షించారు. (చదవండి: బాడీషేమింగ్ అనేది మార్కెట్ గిమ్మిక్) నీటితో నింపి లాక్ చేసిన పేటికలో గడపడం, బాంబులను దాటుకుంటూ ముందుకు సాగడం, బురదలో ఈత కొట్టడం వంటి స్టంట్లు ఇచ్చారు. ఇక ఫైనల్లో కొండచిలువలను తప్పించుకుంటూ, పైకి ఎగబాకుతూ, గ్లాసు పగులకొట్టి నెక్లెస్‌ను తీసుకురావాల్సిందిగా టాస్క్ ఇచ్చారు. మధ్య మధ్యలో బాంబులు పేలుస్తూ, ఎలక్ట్రిక్ షాకులకు గురిచేశారు. వీటన్నింటినీ సమర్థవంతంగా పూర్తి చేసిన నియా శర్మ.. టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఇక జమాయి రాజా, ఏక్ హజారోం మే మేరీ బహన్ హై వంటి హిట్ సీరియళ్లతో బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ‘ఖత్రోంకీ ఖిలాడీ’గా నిలిచారు. -
రోహిత్ శెట్టిపై ట్రోలింగ్.. కత్రినా స్పందన
బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి తనకు మంచి స్నేహితుడని.. దయచేసి ఆయనను విమర్శించవద్దని స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకుని.. నిందించడం సరికాదని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్, కత్రినా కైఫ్ తదితరులు కీలక పాత్రల్లో రోహిత్ శెట్టి.. ‘‘సూర్యవంశీ’’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్లో భాగంగా రోహిత్.. కత్రినాను తక్కువ చేసి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో #ShameOnYouRohitShetty అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ విషయంపై స్పందించిన కత్రినా రోహిత్ శెట్టి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.(దర్శకుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్) ‘‘ప్రియమైన స్నేహితులు, శ్రేయోభిలాషులు... నేను సాధారణంగా ఇలాంటి వార్తలపై స్పందించను. కానీ రోహిత్ సర్ విషయంలో నేను మాట్లాడక తప్పని పరిస్థితి. ఎందుకంటే మీరంతా ఆయనను అపార్థం చేసుకున్నారు. ‘ ‘ బ్లాస్ట్ జరుగుతున్న సమయంలో ముగ్గురు హీరోలు ఉన్నపుడు నువ్వు ఫ్రేంలో కనిపించవు’’ అని రోహిత్ శెట్టి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజం కాదు. ఆ సీన్లో నేను కళ్లు మూసినట్లుగా కనిపించడంతో మళ్లీ టేక్ చేద్దాం అన్నాను. అయితే రోహిత్ సర్ మాత్రం.. ‘‘ అది బ్లాస్ట్ సీన్ కాబట్టి ఎవరూ అంతగా ఈ విషయాన్ని పట్టించుకోరు’’ అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయనే మళ్లీ మరో టేక్ చేద్దామని నాతో అన్నారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన సినిమాల్లో నటించడం ఎంతో ఎంజాయ్ చేస్తాను. ఆయన ఎల్లప్పుడూ నాకు స్నేహితుడే’’అని కత్రినా తన సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొచ్చారు. కాగా రోహిత్ శెట్టి సైతం ఈ వార్తలపై స్పందించిన సంగతి తెలిసిందే. -
కత్రినా.. నిన్నెవరూ చూడరు: దర్శకుడు
ముంబై: బాలీవుడ్ అగ్ర దర్శకుడు, ‘సూర్యవంశీ’ డైరెక్టర్ రోహిత్ శెట్టి స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా కత్రినా కైఫ్ క్లైమాక్స్ సన్నివేశంలో రీటేక్ కావాలని రోహిత్‌ను కోరింది. అప్పటికే ఒకే సన్నివేశాన్ని నాలుగుసార్లు చిత్రీకరించటంతో రోహిత్ దానికి అంగీకరించలేదు. అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ లాంటి సూపర్ స్టార్లు నటిస్తున్న ఈ సన్నివేశంలో నిన్ను ఎవరూ పట్టించుకోరని సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నటిని కించపరిచావని విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై దర్శకుడు రోహిత్ స్పందిస్తూ.. క్లైమాక్స్ సన్నివేశంలో నటించడానికి కత్రినా అప్పటికే నాలుగు టేకులు తీసుకుంది. అయినప్పటికీ సన్నివేశం బాగా రాలేదంటూ మరోసారి నటిస్తానని కోరింది. అయితే అది బాంబు పేలుళ్ల సన్నివేశం కావడంతో అందులో నీ నటనను అంతగా ప్రజలు గమనించరని చెప్పానన్నారు. కానీ ఆమె నటించిన సన్నివేశాన్ని ప్రోమోలో పెడతానని చెప్పినట్లు పేర్కొన్నారు. అతని సమాధానంపై సంతృప్తి చెందని ఓ నెటిజన్.. ‘ కత్రినా కైఫ్ ఈ దశాబ్దపు అత్యుత్తమ హీరోయిన్ అని, ఆమెతో పాటు మహిళలను గౌరవించడం నేర్చుకోండి’ అని ఘాటుగానే కామెంట్ చేశాడు. చదవండి: ఆటలో పోరాడి గెలిచిన కత్రినా -
డైరెక్టర్‌తో పోట్లాడిన అక్షయ్ కుమార్
-
డైరెక్టర్‌తో పోట్లాడిన అక్షయ్ కుమార్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సూర్యవంశీ’. అజయ్‌దేవగన్ ‘సింగం’, ‘సింగం రీటన్స్’, ‘సింబా’ చిత్రాల దర్శకుడైన రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దర్శకుడికి, హీరోకి మధ్య సెట్లో వివాదం చోటుచేసుకున్నట్లు బాలీవుడ్ టాక్. అంతేకాకుండా వీరిద్దరి వివాదం కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని సోషల్‌మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలపై కిలాడీ అక్షయ్ స్పందిస్తూ.. అదే పంథాలో చమత్కారమైన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో ‘దర్శకుడు రోహిత్ శెట్టి, అక్షయ్‌లు ఇద్దరు ఒకరినోకరు పిడిగుద్దులు గద్దుకుంటూ, తోసుకుంటూ కొట్టుకుంటున్న వీరిని కొంత మంది వచ్చి అడ్డుకుంటారు. దీంతో అక్షయ్ నన్ను ఆపకండి మేము కొట్టుకోవాల్సిందే.. అంటూ గట్టిగా ఆరుస్తూ.. అలసిపోయి వారిద్దరు కింద పడిపోతారు’. అంతేకాకుండా కత్రీనా కైఫ్ న్యూస్ రిపోర్టర్‌గా వ్యవహరించిన 30 సెకన్ల ఈ వీడియోకి ‘బిగ్ బ్రేకింగ్ న్యూస్: సూర్యవంశీ సినిమా షూటింగ్లో హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు రోహిత్ శెట్టిలకు మధ్య తలెత్తిన వివాదం, మధ్యవర్తిగా వ్యవహరించిన నిర్మాత కరణ్ జోహార్’ అనే టైటిల్‌తో వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఫన్నీ మీమ్స్‌తో పాటు ఎమోజీలను కామెంట్ రూపంలో తెలుపుతున్నారు. అంతేకాకుండా మరికొంతమంది నెటిజన్లు అక్షయ్ ఫన్నీ ఆలోచనకు ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా గతంలో అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్‌లు జంటగా వచ్చిన నమస్తే లండన్, సింగ్ ఈజ్ కింగ్, హమ్కో దీవానా ఖర్ గాయో, వెల్కమ్, తీస్మార్ ఖాన్ వంటి సినిమాలలో హీరో,హీరోయిన్లుగా కనిపించారు. ఆ తర్వాత దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వీళ్లు ఇద్దరూ మళ్లీ ‘సూర్యవంశీ’తో ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను అలరించనున్నారు. -
మూడు సింహాలు
‘కనిపించే మూడు సింహాలు నీతికీ, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ ‘పోలీస్ స్టోరీ’ చిత్రంలో సాయికుమార్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటి పవర్ఫుల్ పోలీస్ పాత్రలతో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు తెరకెక్కిస్తుంటారు బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సింగం (అజయ్ దేవగణ్), సిం» (రణ్వీర్ సింగ్) సినిమాలు బాక్స్‌ఫీస్ దగ్గర స్ట్రిక్ట్ డ్యూటీ చేశాయి. ఇప్పుడు అక్షయ్‌కుమార్‌ను ‘సూర్యవన్షీ’ అనే సినిమాతో సూపర్ పోలీస్‌గా మార్చారు రోహిత్. అంతేకాదు.. సంఘ విద్రోహక శక్తులను మట్టి కరిపించడానికి ఈ మూడు సింహాలను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చారాయన. ‘సూర్యవన్షీ’ సినిమా క్లైమాక్స్‌లో అక్షయ్, అజయ్, రణ్వీర్ కలిసి పోరాడనున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది. -
‘రీమేక్ కాదు.. స్ట్రయిట్ సినిమానే’
కార్తీ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఖాకీ (తమిళ్లో ధీరన్ అధిగరం ఒండ్రు) సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి ఈ రీమేక్ ప్లాన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నట్టుగా, నార్త్ నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాకు సూర్యవంశీ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన దర్శక నిర్మాత రోహిత్ శెట్టి అవన్ని రూమర్స్ అంటూ కొట్టి పారేశారు. తాను అక్షయ్ కుమార్ హీరోగా చేయబోయే సూర్య వంశీ స్ట్రయిట్ సినిమా అని రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చారు. -
‘నీ ఆశీర్వాదం వల్లే సినిమా హిట్టయ్యింది’
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘సింబా’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం 200 కోట్ల రూపాయల క్లబ్ వైపు దూసుకుపోతుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో రూ. 200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాల్లో ‘సింబా’ మూడవదిగా నిలిచింది. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్మాత కరణ్ జోహర్ ముంబైలోని తన ఇంటిలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి రణ్వీర్ సింగ్, దర్శకుడు రోహిత్ శెట్టి, నటి దీపికా పదుకోణ్‌తో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, సారా అలీ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను కరణ్ జోహర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో దీపికా కరణ్ జోహర్, రోహిత్ శెట్టి, తన భర్త రణ్వీర్ సింగ్‌ను ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్నారు. దీనికి కరణ్ జోహర్ ‘రాణి పద్మావతి ఆశీర్వాదంతో మా సినిమా సూపర్‌హిట్ అయ్యింద’నే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోని అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. #Simmba refuses to slow down... Packs a solid punch in Weekend 2... Nears ₹ 200 cr mark... Emerges THIRD HIGHEST GROSSER of 2018, after #Sanju and #Padmaavat... [Week 2] Fri 9.02 cr, Sat 13.32 cr, Sun 17.49 cr. Total: ₹ 190.64 cr. India biz. — taran adarsh (@taran_adarsh) January 7, 2019 -
‘నా జీవితంలో అజయ్ స్థానం ప్రత్యేకం’
అజయ్ దేవగణ్‌కు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉందంటున్నాడు దర్శకుడు రోహిత్ శెట్టి. పక్కా ఎంటర్టైన్మెంట్ చిత్రాలు తెరకెక్కించడంలో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రోహిత్ శెట్టి. ఈ మధ్యే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందిన ‘సింబా’ చిత్రం విడుదలై విజయవంతంగా దూసుకుపోతుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.100 కోట్లు రాబట్టిన ఈ సినిమా రూ.200 కోట్ల వసూళ్లవైపు పరుగుతీస్తోంది. బాలీవుడ్లో వరుసగా రూ.100 కోట్లు రాబట్టిన ఎనిమిది సినిమాలు తీసిన దర్శకుడిగా రోహిత్ చరిత్ర సృష్టించారు. అయితే సింబా సినిమాలో హీరో అజయ్ దేవగణ్ అతిథి పాత్రలో కనిపించారు. ఈ విషయం గురించి రోహిత్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో అజయ్‌కు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆయన నాకు చాలా సాయం చేశారు. ఈ రోజు నేనిలా ఉన్ననాంటే అదంతా అజయ్ వల్లనే’ అంటూ చెప్పుకొచ్చారు. అలానే ‘ప్రస్తుతం పరిశ్రమలో నేను చాలామందితో కలిసి పని చేశాను. వారంతా నాకు స్నేహితులు. కానీ అజయ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. ఆయన మంచి నటుడు, స్టార్ అని ఇలా చెప్పడం లేదు. అజయ్ నాకు అన్నయ్యలాంటి వారు.. దాన్ని ఎవరూ మార్చలేరు’ అన్నారు. అలానే రణ్వీర్ తనకు తమ్ముడులాంటి వారంటూ చెప్పుకొచ్చారు రోహిత్ శెట్టి. -
‘అవకాశం కోసం.. ఆమె నా వెంటపడింది’
రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘సింబా’. తెలుగులో హిట్ సినిమాగా నిలిచిన ‘టెంపర్’ కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ శుక్రవారం విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక ‘సింబా’ ప్రమోషన్లలో భాగంగా రోహిత్ శెట్టి కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సారాను హీరోయిన్గా ఎంపిక చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘ సారా నా దగ్గరికి వచ్చి హీరోయిన్ పాత్ర పోషించే అవకాశం తనకే ఇవ్వాలంటూ నా వెంటపడింది. బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ దంపతుల ముద్దుల తనయ నా దగ్గరికి వచ్చి అలా అడిగే సరికి నా కళ్లు చెమర్చాయి. సింబాలో సారాను తీసుకోవాలని సైఫ్ నన్ను ఒక్కసారి సంప్రదించలేదు. సారాపై నమ్మకంతో తనను హీరోయిన్గా ఫైనల్ చేశాను’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా సామాజిక సందేశం మిళితమైన ‘సింబా’ వంటి సినిమాలో భాగమయ్యేందుకు తానే డైరెక్టర్ రోహిత్ శెట్టిని బతిమిలాడానంటూ సారా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మొదట తన రిక్వెస్ట్‌ను రోహిత్ పట్టించుకోలేదని... కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ చేస్తున్నట్లు తనకు ఫోన్ చేశాడని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ‘సింబా’ సారాకు రెండో సినిమా. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కిన కేదార్నాథ్ సినిమాతో సారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కన్ను కొట్టలేక...
‘సింబా’ సినిమా షూటింగ్ లొకేషన్ అది. కెమెరా లెన్స్‌ను అటూ ఇటూ మారుస్తున్నారు కెమెరామేన్. ఓ షాట్ కోసం టీమ్ అంతా కష్టపడుతున్నారు. ఎందుకంటే సారా అలీఖాన్ మాత్రం టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్నారు. ‘సింబా’ టీమ్ ఇంతలా ట్రై చేస్తున్న ఆ సీన్ ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ బాబు. సారా అలీఖాన్ కన్ను కొట్టే సీన్. ఈ సినిమాలో ‘ఆంఖే మారే’ అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్‌లో హీరోయిన్ కుడికన్ను కొట్టే ఓ సీన్ ఉందట. ఈ సీన్ కోసం సారా కష్టపడ్డారట. కానీ ఏం లాభం ఎడిట్‌లో అది పోయిందట. సారాకు కన్ను కొట్టడం రాదని ‘సింబా’ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టి ఓ సందర్భంలో పేర్కొన్నారు. రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా నటించిన ‘సింబా’ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. తెలుగు హిట్ ‘టెంపర్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. -
‘ఈ పాత్రలో నిన్ను తప్ప ఎవరిని ఊహించలేం’
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. ప్రస్తుతం రణ్వీర్ సింగ్, సారా అలీ ఖాన్ హీరో, హీరోయిన్లుగా రోహిత్ శెట్టి ‘సింబా’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న లవ్లీకపుల్ దీపికా పదుకోన్ - రణ్వీర్ సింగ్‌లను ఉద్దేశిస్తూ రోహిత్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ షేర్ చేశారు. ‘2018, జూన్ 6 ‘సింబా’ ప్రయాణం ప్రారంభమయి నిన్నటికి సరిగా ఐదు నెలలు. 5 నెలల పాటు సాహసోపేతంగా సాగిన మా ప్రయాణం నేటితో ముగియనుంది. ఈ సమయంలో వేల భావాలన్ని కలిసి ఒకేసారి నా మనసులోకి ప్రవేశించినట్లైంది. మా ఇద్దరికి ఇదే తొలి చిత్రం. మా ప్రయాణం చాలా ఫన్నీగా, సంతోషంగా, ముగింపు లేని జ్ఞాపకాల సమాహరంగా సాగింది’ అన్నారు. రోహిత్ కొనసాగిస్తూ.. ‘నాకు తెలిసిన ఈ వ్యక్తి, నటుడు చాలా నిజాయితీపరుడు.. పని కోసం ప్రాణం పెడతాడు. ఈ రోజు నేను.. నా టీమ్ అంతా ముక్త కంఠంతో చెప్తున్నాం.. రణ్వీర్ సింగ్ కన్నా బాగా ఈ పాత్రను మరోకరు పోషించలేరు. ఈ సినిమా ప్రారంభమయినప్పుడు ఇతడు చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఈ రోజు సినిమాలోని ఆఖరి సన్నివేశాన్ని షూట్ చేస్తున్నప్పుడు.. ఇతనిలో నాకొక చిన్న సోదరుడు కనిపించాడు’ అన్నాడు. ‘త్వరలోనే ఈ వ్యక్తి తనతో సమానమైన.. అందమైన.. అద్భుతమైన మరో వ్యక్తితో కలిసి ఇంకో అందమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. నా ‘సింబా ’త్వరలోనే ‘మీనమ్మ’ని వివాహం చేసుకోబోతున్నాడని గర్వంగా ప్రకటిస్తున్నాను. వారిద్దరికి చాలా అందమైన, ఆశీర్వాదాలతో కూడిన మంచి భవిషత్ లభించాలిన మనస్ఫూరిగా కోరుకుంటున్నాను’ అంటూ దీపికా - రణ్వీర్లకు అభినందనలు తెలియజేశారు. ఈ నెల 14, 15న రణ్వీర్, దీపికలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. -
హైదరాబాద్‌లో టెంపర్ రీమేక్ షురు
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన చిత్రం టెంపర్.. ఈ సినిమా నటుడిగా ఎన్టీఆర్ కు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సింబా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో రణ్వీర్ సింగ్‌కు జోడిగా సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ నటిస్తున్నారు. సారా ఈ చిత్రం ద్వారానే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఎప్పుడో రూపకల్పన చేసినప్పటికీ.. పట్టాలెక్కెందుకు చాలా సమయమే తీసుకుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముందుగా అనుకున్నట్టే డిసెంబర్ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ స్పాట్లో రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్, రోహిత్ శెట్టి, కరణ్ జోహర్ కలసి దిగిన ఫొటోను కరణ్ అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా సింబా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ROHIT SHETTY is back!!!! @RanveerOfficial as #SIMMBA with #SaraAliKhan produced by @RSPicturez @DharmaMovies @RelianceEnt @apoorvamehta18 releasing 28th DEC 2018 pic.twitter.com/sDSi7eqom9 — Karan Johar (@karanjohar) June 6, 2018 -
బాలీవుడ్‌కు సోషల్ మీడియా స్టార్!
సాక్షి, ముంబయి : ఆమె ఒక్కసారి కన్నుకొట్టి కుర్రకారు గుండెల్ని పిండేసింది. ‘ముద్దు’ గన్నుతో కాల్చి హృదయాలను పేల్చేసింది. ఆమె ఎవరు? అని మాత్రం చెప్పనక్కర్లేదు. రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుని సోషల్ మీడియా మొత్తం తన చుట్టూ తిరిగేలా చేసుకున్న మళయాల ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ సినిమా కూడా విడుదల కాకుండానే అటు మళయాళం మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా యువహృదయాలను కొల్లగొట్టిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ ఇంట అడుగుపెడుతోందట. పూరీ, ఎన్టీఆర్ కాంబీనేషన్‌లో వచ్చి బంపర్ హిట్‌గా నిలిచిన టెంపర్ సినిమాను బాలీవుడ్లో రీమేక్ అవబోతుందన్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో, కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో రణ్వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాకు ప్రియాను కూడా తీసుకోవాలని కరణ్ జోహర్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఆ సినిమాలో ఆమెకు హీరోయిన్ పాత్ర ఇస్తారా?, లేక తెలుగులో మధురిమ చేసిన పాత్ర కోసమా? అనేది వేచి చూడాలి. -
ఆ దర్శకుడు నన్ను మోసం చేశాడు : హీరోయిన్
గోల్ మాల్ ఎగైన సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యూనిట్ సభ్యులు సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ కాళీ సమయాల్లో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా హ్యాపీగా ఆడుకుంటున్న సమయంలో జరిగిన ఓ సరదా సంఘటన వీడియోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన హీరోయిన్ పరిణితీ చోప్రా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. క్రికెట్ ఆడుతుండగా దర్శకుడు రోహిత్ శెట్టి తనను మోసం చేసి అవుట్ చేశాడని కామెంట్ చేసిన పరిణితీ చీటర్ చీటర్ చీటర్ అంటూ స్మైలీస్ ను జత చేసి ట్వీట్ చేసింది. నిజానికి ఆ సమయంలో రోహిత్ అవుట్ అయినా.. పరిణితీ అవుటైనట్టుగా చెప్పటంతో ఆమె సరదాగా ఈ కామెంట్స్ చేసింది. రోహిత్ శెట్టి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన గోల్ మాల్ ఎగైన అక్టోబర్ 20న రిలీజ్ అయి ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. When Rohit sir cheated and got me out!!!! Cheater cheater cheaterr 😍🤣😍 #RohitShetty pic.twitter.com/jPGkA1IyOX — Parineeti Chopra (@ParineetiChopra) 18 November 2017 -
ఛాన్స్ దొరికితే ఆయన అన్ని సినిమాల్లో నటిస్తా!
ముంబయి : ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన పరిణీత చోప్రా కొన్ని సినిమాలతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె లేటెస్ట్ గోల్మాల్ అగెయిన్. ఆ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టిపై ఆమె తన అభిమానం చాటుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. రోహిత్ ఛాన్సిస్తే ఆయన ప్రతి సినిమాలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నటీనటులతో పాటు సిబ్బందిని రోహిత్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారని, అందుకే రోహిత్ అంటే తనకెంతో గౌరవమని పరిణీతి చోప్రా అన్నట్లు సమాచారం. అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, కరీనా కపూర్లు గోల్మాల్ ఫ్రాంచైజీలతో సందడి చేశారు. ప్రస్తుతం తనకు గోల్మాల్ లేటెస్ట్ మూవీలో నటించే అవకాశం కారణంగా సంబరాలు చేసుకుంటున్నట్లు బాలీవుడ్ టాక్. రోహిత్ తెరకెక్కించే సినిమాల్లో పనిచేయాలన్నది పరిణీతి కోరిక. అలాంటిది రోహిత్ 'గోల్మాల్ అగెయిన్'లో ప్రధానపాత్ర ఇవ్వడం తనకు దక్కిన గౌరవంగా పరిణీతి భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గోల్మాల్ తాజా సిరీస్ షూటింగ్ ముగియడంతో పరిణీతి ఏదో కోల్పోయినట్లుగా కాస్త దిగాలుగా కనిపిస్తున్నారని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. -
గోల్ మాల్ సెట్లో అల్లు అర్జున్
దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో పాటు ఫిజికల్ గా కూడా వేరియేషన్ చూపించేందుకు కసరత్తులు చేస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చేయనున్నాడు బన్నీ. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి మరికాస్త సమయం పట్టనుండటంతో ఓ యాడ్ షూటింగ్ కోసం ముంబై వెళ్లాడు బన్నీ. అక్కడ గోల్ మాల్ ఎగైన్ సెట్స్ ని విజిట్ చేశాడు. గోల్ మాల్ టీం సభ్యులతో కలిసి కాసేపు సరదాగా గడిపాడు. అల్లు అర్జున్ కి ప్రస్తుతం సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా, బన్నీ సినిమాలు హిందీలోకి డబ్ అయి మంచి విజయం సాధిస్తున్నాయి. పలువురు హిందీ దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోల్ మాల్ ఎగైన్ చిత్రం రోహిత్ శెట్టి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, పరిణితో చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, కునాల్ కేము, నీల్ నితిన్ ముకేశ్, టబు మరియు ప్రకాశ్ రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
బాలీవుడ్ హీరోతో ప్రభాస్ మల్టీ స్టారర్.. నిజమేనా..?
బాహుబలి సినిమాతో నేషలన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్. బాహుబలి రెండు భాగాలు బాలీవుడ్లో కూడా ఘన విజయం సాధించటంతో ప్రభాస్‌తో స్ట్రయిట్ హిందీ సినిమా చేసేందుకు అక్కడి స్టార్ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కరణ్ జోహార్ లాంటి నిర్మాతలు ప్రభాస్‌తో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా... ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. తాజాగా బాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, ప్రభాస్‌తో ఓ భారీ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మాస్ మసాలా ఎంటర్టైనర్లు, యాక్షన్ కామెడీలు రూపొందించే రోహిత్ శెట్టి.. సల్మాన్ ఖాన్, ప్రభాస్‌లు హీరోలుగా భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉండటంతో బడ్జెట్ సమస్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఈ మెగా మూవీని నిర్మించడానికి ఏ నిర్మాతైన ముందుకొస్తాడేమో చూడాలి. -
బాహుబలి సక్సెస్‌కి కారణం ప్రభాస్ కాదట..!
బాహుబలి సక్సెస్‌తో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ముఖ్యంగా ఒక్క ప్రాజెక్ట్ కోసం ఐదేళ్ల సమయం కేటాయించిన డార్లింగ్ కమిట్మెంట్కు ఇండియన్ ఇండస్ట్రీ అంతా సాహో అంటుంది. అదే సమయంలో బాహుబలి సక్సెస్‌లో రాజమౌళితో పాటు ప్రభాస్‌కు అదే స్థాయిలో క్రెడిట్ ఇచ్చారు క్రిటిక్స్. కానీ ఓ బాలీవుడ్ దర్శకుడు మాత్రం బాహుబలి సక్సెస్‌లో ప్రభాస్ క్రెడిట్ ఏం లేదంటూ తేల్చేశాడు. బాలీవుడ్ మాస్ మసాల ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే రోహిత్ శెట్టి బాహుబలి సక్సెస్‌లో ప్రభాస్ కెడ్రిట్ ఏం లేదంటున్నాడు. కేవలం కథ, దర్శకత్వం వల్లనే బాహుబలి అంతటి ఘన విజయం సాధించిందన్న రోహిత్, నటీనటులు సక్సెస్ హెల్ప్ అయ్యారేగాని వారి గొప్పతనం ఏమి లేదన్నట్టుగా మాట్లాడాడు. అంతేకాదు బాలీవుడ్ జనాలు సినిమా ప్రమోషన్ ఎలా చేయాలో బాహుబలి టీం నుంచి నేర్చుకోవాలని తెలిపాడు. అయితే బాహుబలి సక్సెస్ ప్రభాస్ క్రెడిట్ ఏం లేదంటూనే అవకాశం వస్తే ప్రభాస్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తానని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. -
బన్నీ సినిమాపై బాలీవుడ్ కన్ను
సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒకటి మాస్ క్యారెక్టర్ కాగా రెండవది బ్రాహ్మణుడి పాత్ర, ఈ సినిమా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అదుర్స్‌కు సీక్వల్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌పై ఇప్పటి నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల బాలీవుడ్ మాస్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి, డీజే సెట్లో సందడి చేశాడు. సింగం సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయటంతో పాటు తన సినిమాల్లో సౌత్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించేలా ప్లాన్ చేసుకునే రోహిత్ శెట్టి, డీజే సెట్లో కనిపించటంతో ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే రూమర్ల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. Pleasant Surprise to DJ sets from my Favt Director Rohit Shetty https://t.co/CPVJssfEos — Harish Shankar .S (@harish2you) 1 February 2017 -
టబు కన్ఫర్మ్ చేసిందోచ్!
ముంబై: మంచి అభినేత్రిగా టబుకు బాలీవుడ్లో చక్కని పేరుంది. 'చాందినీ బార్', 'హైదర్' లాంటి విమర్శకుల ప్రశంసలందుకున్న సినిమాల్లో నటించిన ఈ భామ.. సినీవర్గాలను విస్మయపరుస్తూ.. తాజాగా కామెడీ జానర్ సినిమాకు సై అంటూ పచ్చజెండా ఊపింది. రోహిత్ శెట్టీ పాపులర్ కామెడీ ఫ్రాంచెజీ 'గోల్మాల్'లో నటించేందుకు ఓకే చెప్పింది. 'గోల్మాల్' లెటెస్ట్ వెర్షన్లో ఎప్పటిలాగే అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తుండగా అతని సరసన పరిణీతి చోప్రా నటించబోతున్నది. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర పోషించబోతున్నది. 'గోల్మాల్' సిరీస్‌కు తాను పెద్ద అభిమానిని కావడంతో ఈ ఆఫర్ తనకు ముందుకు వచ్చినప్పుడు కాదనలేకపోయానని టబు తెలిపింది. 'ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను షాక్ తినలేదు. సర్ప్రైజ్ కాలేదు. 'గోల్మాల్' సిరీస్‌ను నేను బాగా ఇష్టపడతాను. ఇందులో భాగం కానుండటంతో ఎంతో ఆనందం కలిగిస్తోంది. అజయ్ (దేవగణ్) నా స్నేహితుడు. మిగతా చిత్రయూనిట్ కూడా నాకు తెలుసు. స్నేహితులతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందమే కదా' అంటూ ఆమె ఓ దినపత్రికతో పేర్కొంది. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యభరితమైన సీరియస్ పాత్రలు పోషించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టబు.. తనలో కామెడీ యాంగిల్ కూడా ఉందని, తనకు చాలా తొందరగా నవ్వు వస్తుందని పేర్కొంది. -
మన చేతుల్లో ఏం లేదు
‘ఈయాల రైట్ అనుకున్నది రేపు తప్పు అవుతుంది. ఈయాల తప్పు అనుకున్నది రేపు రైట్ అవుతుంది’ అని ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో ఓ డైలాగ్. రియల్ లైఫ్‌లో ఇలాంటి డైలాగులే తమన్నా చెప్తున్నారు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సౌత్‌లో తమన్నా ఎప్పుడూ స్టార్ హీరోయినే. హిందీలో మాత్రం ఒక్క హిట్టు లభిస్తే ఒట్టు. చేసిన మూడు సినిమాలూ ఫట్‌మన్నాయి. అందుకే అక్కడ స్టార్ లిస్ట్‌లో చేరలేకపోతున్నారు. ఇదే విషయాన్ని తమన్నా దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘హిందీలో మీకు హిట్ ఎందుకు రాలేదు? అనే ప్రశ్న నన్నెప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ‘హిమ్మత్వాలా’, ‘హమ్‌షకల్స్’ సక్సెస్ అవుతాయనుకున్నాను. కానీ, నా నమ్మకం నిజం కాలేదు. ఒక్కోసారి మన నిర్ణయం రైట్ అనుకుని సినిమాకి సంతకం చేస్తాం. అది కాస్తా తప్పవుతుంది. మన చేతుల్లో ఏం లేదు. అంతమాత్రాన హిందీలో నాకు దారులు మూసుకు పోయాయ్ అని కాదు’’ అని తమన్నా పేర్కొన్నారు. ఇటీవల ఆమె ఓ హిందీ సినిమా అంగీకరించారు. రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో తమన్నా హీరోయిన్గా ఎంపికయ్యారు. ఆ సినిమా హిట్ తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారామె. మరి.. తమన్నా నమ్మకం నిజమవుతుందా? -
ప్రెగ్నెంట్ అయితే..భయపడాలా?
‘ఐయామ్ ప్రెగ్నెంట్, నాట్ ఎ కార్ప్స్ (శవాన్ని కాదు). దర్శక- నిర్మాతలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించమంటూ నన్ను సంప్రదించవచ్చు. ప్రెగ్నెన్సీ నటనకు అడ్డు కాదు’’ అన్నారు కరీనా కపూర్. సైఫ్ ముద్దుల సతీమణి ఇంత ఘాటుగా స్పందించడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ‘గోల్మాల్ 4’లో కథానాయికగా కరీనా నటిస్తారా? మరొకర్ని తీసుకుంటారా? అని దర్శకుడు రోహిత్ శెట్టిని ప్రశ్నించగా, ‘‘కరీనాని అడిగితే ఓకే అంటుంది. కానీ, నేనా పని చేయలేను. (గర్భవతి అనే అంశం గుర్తు చేస్తూ) ‘గోల్మాల్ 4’ గురించి తనతో మాట్లాడాలంటే భయంగా ఉంది’’ అన్నారు. రోహిత్ వ్యాఖ్యలను ఉద్దేశించేనా.. మీరు పై వ్యాఖ్యలు చేసారనే ప్రశ్న కరీనా ముందుంచితే, ‘‘ప్రెగ్నెంట్ ఆర్ నాట్, నా కోసం ఓ పాత్ర ఉంటే నా దగ్గరకు వస్తారు. అందులో తప్పేముంది? అతనెందుకు భయపడడం? నేనే అతణ్ణి చూసి భయపడాలి’’ అని కరీనా వ్యాఖ్యానించారు. ‘గోల్మాల్ 4’లో కరీనా కపూర్ ప్రత్యేక గీతంలో నటించే అవకాశం ఉందని రోహిత్ శెట్టి అంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తే, అది జరగదని కరీనా కపూర్ స్పష్టం చేశారు. ఐటమ్ సాంగ్‌కి శ్రమ ఎక్కువ కాబట్టి అలా అని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
ఆ డైరెక్టర్ సెట్లో నేను చాలా సేఫ్
ముంబై: బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తీసే మూవీల్లో సెట్ తనకు చాలా సురక్షితమని నటి కాజోల్ అంటోంది. చిత్ర యూనిట్... అందరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారని తెలిపింది. చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఏమైనా జరిగే అవకాశం ఉందని, అయితే రోహిత్ సెట్ చాలా సేఫ్ అంటూ పేర్కొంది. యాక్షన్ సన్నివేశాలు చేయడం అంత సులువు కాదని బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి అభిప్రాయపడ్డాడు. అభిమానుల ఆనందం కోసం చేసే స్టంట్స్ రిస్క్‌తో కూడుకున్నవని అన్నాడు. సోమవారం నాడు దిల్వాలే ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఏదైనా యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు గుండె నోటిలోకి వచ్చినట్లుగా అనిపిస్తుందని, అంతా సరిగా జరగాలని ప్రార్థిస్తానని చెప్పాడు. ఈ మూవీలో నటిస్తున్న వరుణ్ వర్మ తనను బాగున్నానా అని అడిగగా, అందుకు తన వద్ద సమాధానం లేదన్నాడు. డిసెంబర్ 18న 'దిల్ వాలే' ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు తెలిపాడు. హాస్యాన్ని పండించడం చాలా సులువు. కానీ స్టంట్స్ చేయడం ఇండస్ట్రీలోని అందరికి కాస్త ఇబ్బందికరమన్నాడు. ఈ మూవీ కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు దర్శకుడు రోహిత్ చెప్పాడు. బ్లాక్ బాస్టర్ సినిమాలు సింగమ్, సింగమ్ రిటర్న్స్, 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లు స్టార్ డైరెక్టర్ రోహిత్ తీసిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. షారుక్ మాట్లాడుతూ.. యూనిట్ సభ్యులను అందర్నీ ఆయన ప్రోత్సహిస్తాడన్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న 'దిల్ వాలే'లో బాలీవుడ్ హిట్ పెయిర్ షారుక్ ఖాన్, కాజోల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. వరుణ్‌ధావన్‌కు జోడీగా కృతీ సనన్ కనిపించనుంది. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ వర్మ, దర్శకుడు రోహిత్ శెట్టి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
రిపీట్... హిట్‌కు సానపెట్ట...రా!
కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ క్రేజీనే. సెంటిమెంట్ మీద నడిచే సినీసీమలో అయితే మరీనూ! ఒక డెరైక్టర్, ఒక హీరో కలసి గతంలో ఒక సూపర్‌హిట్ ఇచ్చారంటే చాలు... వాళ్ళ కాంబినేషన్లో తాజా సినిమా మీద అనేక అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం హిందీలో అలాంటి క్రేజీ హిట్ కాంబినేషన్ల సినిమాలు కొన్ని ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. సినీ వ్యాపార వర్గాలనూ, ప్రేక్షకులనూ ఏకకాలంలో ఆకర్షిస్తున్న అలాంటి క్రేజీ ‘రిపీట్’ కాంబినేషన్లు... పాత బాక్సాఫీస్ సక్సెస్‌ను కూడా రిపీట్ చేస్తాయా? రోహిత్‌శెట్టి - షారూక్‌ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లా...దూసుకెళ్ళేందుకు... అయిదేళ్ల క్రితం మాట ఇది. అప్పుడు అజయ్ దేవగన్‌తో ‘సింగం’ సినిమా రూపొందిస్తున్నారు రోహిత్ శెట్టి. అప్పుడో ఆలోచన వచ్చిందాయనకు. ప్రముఖ నటుడు సంజీవ్‌కుమార్ కథానాయకునిగా నటించిన ‘అంగూర్’ చిత్రం రీమేక్ చేయాలన్నదే ఆ ఆలోచన. సంజీవ్‌కుమార్ పాత్రకు షారూక్ ఖాన్‌ను అనుకున్నారు. ఆ విషయం షారూక్‌తో కూడా చెప్పారు. కానీ, ఎందుకో ఆ ఆలోచన ఆచరణలోకి రాలేదు. కట్ చేస్తే... ముంబై నుంచి రామేశ్వరం వరకూ సాగే ఓ ప్రేమకథకు వాణిజ్య హంగులు జోడించి, షారూక్‌కు ఓ కథ చెప్పారు రోహిత్. ఆ కథ షారూక్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అదే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’. షారూక్, దీపికా పదుకొనే జంటగా నటి ంచిన ఈ చిత్రం మంచి విజయం సాధించి, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు కొద్ది విరామం తరువాత మళ్ళీ రోహిత్‌శెట్టి, షారూక్ల కాంబినేషన్ రిపీట్ అవుతోంది. తాజాగా ఈ దర్శక, హీరోల కలయికలో వస్తున్న చిత్రం ‘దిల్వాలే’. ఈ చిత్రంలో వరుణ్‌ధావన్, కృతీసనన్ మరో జోడీ. రోహిత్, షారుక్‌ఖాన్‌ల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం కావడం, పైగా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’తో హిట్ జోడీ అనిపించుకున్న షారూక్, కాజోల్ చాలా విరామం తరువాత ఈ చిత్రంలో జంటగా నటిస్తుండడంతో ఈ ‘దిల్వాలే’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి... ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా? ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో కొత్త రికార్డులు సృష్టించిన షారూక్, రోహిత్ వాటిని బద్దలు కొడతారా? ఆ సంగతి తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకూ ఆగాల్సిందే. బడ్జెట్: 75 కోటు్లూ వసూళ్లు: 400 కోట్లు హృతిక్ రోషన్ - ఆశుతోష్ గోవారీకర్ చరిత్రను తిరగదోడదాం! ‘జోథా అక్బర్’... హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్ జంటగా ఆశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో రూపొందిన చారిత్రక చిత్రం ఇది. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికో హైలైట్. ఆ సూపర్‌హిట్ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ హృతిక్ హీరోగా ఆశుతోష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మొహెన్జొదారో’. చరిత్ర నేపథ్యంలో ప్రేమ, సాహసం ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘జోథా అక్బర్’ వంటి విజయాన్ని ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ‘మొహెన్జొ దారో’పై భారీ అంచనాలు ఉన్నాయి. వైవిధ్యమైన కథాంశాలను అద్భుతంగా తెరకెక్కించే నైపుణ్యం ఉన్న దర్శకునిగా ఆశుతోష్కీ, దర్శకుడు అనుకున్న పాత్రలో ఒదిగిపోయే ప్రతిభ ఉన్న హీరోగా హృతిక్కీ పేరుంది. కాబట్టి, ఈ దర్శక, హీరోలు మరో ఘనవిజయం సాధిస్తారని బాలీవుడ్ జనం బలంగా నమ్ముతున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. బడ్జెట్:40 కోటు్లూ వసూళ్లు:115 కోట్లు అక్షయ్‌కుమార్ - ప్రభుదేవా ఈ సింగ్...బాక్సాఫీస్ కింగ్? ‘వాంటెడ్’ చిత్రం ద్వారా హిందీ రంగానికి దర్శకునిగా పరిచయమయ్యారు ప్రభుదేవా. తెలుగు సూపర్‌హిట్ మహేశ్‌బాబు ‘పోకిరి’కి రీమేకైన ఆ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడంతో దక్షిణాది చిత్రాలవైపు కన్నెత్తి చూసే తీరిక లేనంతగా అక్కడే బిజీ అయ్యారు ప్రభుదేవా. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘రౌడీ రాథోడ్’ ఒకటి. తెలుగు ‘విక్రమార్కుడు’కి ఇది రీమేక్. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ తరువాత ‘రాంబో... రాజ్‌కుమార్’, ‘యాక్షన్ జాక్సన్’ లాంటి సినిమాలు చేసిన ప్రభుదేవా ఇప్పుడు మళ్లీ అక్షయ్‌కుమార్‌తో సినిమా చేస్తున్నారు. వీరిద్ధరి కాంబినేషన్లో వస్తున్న ఈ తాజా చిత్రం - ‘సింగ్ ఈజ్ బ్లింగ్’. అక్షయ్‌కుమార్‌కి హిందీ రంగంలో కలక్షన్ కింగ్ అనే పేరుంది. మరి.. ఈ సింగ్ ఆ పేరు నిలబెడతాడా? బాలీవుడ్లో దర్శకునిగా ప్రభుదేవా ఖాతాలో మరో విజయం పడుతుందా? మరో మూడు నెలల్లో తెలిసిపోతుంది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. బడ్జెట్:45 కోటు్లూ వసూళ్లు:200 కోట్లు సల్మాన్ ఖాన్ - కబీర్‌ఖాన్ నో డౌట్... బ్లాక్‌బస్టర్ హిట్! హిందీ చిత్రరంగంలోని ప్రసిద్ధ సంస్థల్లో ‘యశ్‌రాజ్ ఫిలిమ్స్’ ఒకటి. అలాంటి సంస్థలో వరుసగా మూడు సినిమాల్లో అవకాశం రావడమంటే మరీ గొప్ప విషయం. ఆ అదృష్టం దక్కిన దర్శకుడు కబీర్‌ఖాన్. ‘కాబూల్ ఎక్స్‌ప్రెస్’తో కబీర్‌ను దర్శకునిగా పరిచయం చేసింది యశ్‌రాజ్ సంస్థ. ఆ తర్వాత అదే సంస్థలో ‘న్యూయార్క్’ చిత్రం చేశారు కబీర్ ఖాన్. మూడో సినిమా కూడా ఆ సంస్థలోనే! సల్మాన్‌ఖాన్ హీరోగా ‘ఏక్‌థా టైగర్’. ఆ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. వాస్తవానికి ఆ చిత్రం షారూక్ ఖాన్ చేయాల్సి ఉంది. కానీ, ఆయనకు ఖాళీ లేకపోవడంతో సల్మాన్ చేశారు. హిట్ హీరో సల్మాన్, ఈసారి మరో నిర్మాత ‘రాక్‌లైన్’ వెంకటేశ్‌తో కలిసి సినిమా నిర్మించారు. కబీర్ఖాన్ను డెరైక్టర్‌గా పెట్టుకున్నారు. అదే ‘బజరంగీ భాయ్‌జాన్’. నిన్న శుక్రవారం ప్రపంచమంతటా విడుదలైంది. ‘ఏక్ థా టైగర్’ తరువాత కబీర్, సల్మాన్ ఖాన్ల కాంబినేషన్ ఇందులో రిపీటైంది. మన దేశంలో తప్పిపోయిన ఓ చిన్నారిని పాకిస్తాన్‌లోని ఆమె స్వస్థలానికి భద్రంగా చేర్చే హనుమద్భక్తుడు బజరంగీ పాత్రను సల్మాన్ పోషించారు. ‘ఏక్ థా టైగర్’తో మామూలు హిట్ ఇచ్చిన సల్మాన్-కబీర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తారో అనే చర్చ జరిగిన నేపథ్యంలో మొదటి ఆటకే ‘సూపర్ హిట్’ టాక్ తెచ్చుకుందీ చిత్రం. ప్రతి ఒక్కర్నీ ఉద్వేగానికి గురి చేసే చిత్రం ఇదని చూసినవాళ్లు అంటున్నారు. సో.. రెండోసారి కూడా కబీర్-సల్మాన్ ‘హిట్ కాంబినేషన్’ అని నిరూపించుకున్నారు. ఇటీవల హిందీలో విడుదలైన చిత్రాల రికార్డ్లను ఈ చిత్రం బద్దలు కొట్టడం ఖాయమట. బడ్జెట్:75 కోటు్లూ వసూళ్లు:320 కోట్లు -
అమ్మో... కోటి రూపాయలా!
కృతీసనన్ ఇప్పటివరకూ తెలుగులో రెండు సినిమాలు చేస్తే, హిందీలో చేసింది కేవలం ఒకటే. ఆమె తాజాగా హిందీలో నటిస్తున్న చిత్రం ‘దిల్వాలే’. రోహిత్ శెట్టి దర్శకత్వంలో షారుక్ ఖాన్, కాజోల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌ధావన్‌కు జోడీ కృతీ సనన్. చిత్రం ఏమిటంటే, ఈ భారీ ప్రాజెక్టుతో కృతీకి క్రేజ్ అమాంతం పెరిగిపోయి ఓ జాక్‌పాట్ తగిలింది. సౌందర్య సాధనాల ఉత్పత్తుల కంపెనీ ఒకటి తమ వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఆమెకు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేసిందట. దీంతో కృతి ఆనందానికి అవధులు లేవు. బాలీవుడ్లో ఒక్క సినిమాతోనే ఇంత బంపర్ ఆఫర్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. -
'నా విజయాల్లో గోవాకు భాగముంది'
పనాజీ: తన సినిమా విజయాల్లో గోవాకు చాలా భాగం ఉందని బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి అన్నారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ను గురువారమిక్కడ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'నా విజయాల్లో గోవాకు భాగముంది. గోవాను నా రెండో మాతృభూమిగా భావిస్తా. ముంబై నా జన్మస్థలం. గోవా నా కర్మభూమి' అని రోహిత్ శెట్టి పేర్కొన్నారు. ఆయన తీసిన పలు సినిమాలు గోవాలో షూటింగ్ జరుపుకున్నాయి. గోవా అంటే తనకెంతో ఇష్టమని, లోకల్ టాలెంట్ ప్రోత్సహిస్తానని ఆయన హామీయిచ్చారు. -
ఆశలపై నీళ్లు!
అభిమానుల ఆశలపై కూల్‌గా నీళ్లు చల్లింది కాజోల్. షారూఖ్‌ఖాన్‌తో ఈ అమ్మడు కలసి రోహిత్ శెట్టి సినిమాలో చేస్తుందన్న వార్తలను రూమర్లుగా కొట్టేసింది. ఇప్పటి వరకు ఈ సూపర్ హిట్ పెయిర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారి ఉత్సాహాన్ని నీరుగార్చింది. ‘ఈ సినిమా గురించి నాకేమీ తెలియదు. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు కూడా లేవు’ అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది కాజోల్. ఇదిలావుంటే... కాజోల్, షారుఖ్‌లతో పాటు వరుణ్‌ధావన్, కృతి సానన్ కూడా నటిస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదంటూ ఇంకా ఆశలు వదులుకోని అభిమానులూ ఉన్నారు! -
షారుక్‌ఖాన్, ఐశ్వర్యారాయ్ మళ్లీ కలిసి నటించనున్నారా?
షారుక్‌ఖాన్, ఐశ్వర్యారాయ్ మళ్లీ కలిసి నటించనున్నారా? బాలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ‘దేవదాసు’ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతేకాక షారుక్, ఐశ్వర్యల కెమిస్ట్రీ యువతరాన్ని సైతం ఉర్రూతలూగించింది. మళ్లీ వీరు కలిసి నటించడమంటే... సినీ ప్రియులకు అది నిజంగా శుభవార్తే. ఇంతకీ వీరిద్దరూ కలిసి చేయబోతున్న సినిమా ఏంటి? అనే వివరాల్లోకెళ్తే- షారుక్‌తో బ్లాక్‌బస్టర్ ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ని రూపొందించిన రోహిత్ శెట్టి, మళ్లీ ఆయనతోనే తన తదుపరి ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేశారు. కథ రీత్యా ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకం. ఆ పాత్రను ఐశ్వర్యారాయ్ చేత చేయిస్తే కరెక్ట్‌గా ఉంటుందని రోహిత్ భావించారట. ఒక వేళ ఆ పాత్రకు ఐశ్వర్య ‘ఓకే’ చెప్పని పక్షాన, ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ కథానాయిక దీపిక పదుకొనేతో ఆ పాత్ర చేయించాలని ఆయన అనుకున్నారట. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇందులో కథానాయికగా ఐశ్వర్య ఖరారైనట్లు తెలుస్తోంది. పన్నెండేళ్ల తర్వాత షారుక్‌తో ఐష్ కలిసి చేయబోయే సినిమా ఇదే అవుతుంది. కూతురు ఆరాధ్య పుట్టాక దాదాపు సినిమాలకు దూరంగా ఉన్న ఐష్ ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం సంజయ్ గుప్తా దర్శకత్వంలో ‘జజ్బా’ చిత్రంలో ఇర్ఫాన్ఖాన్కి జోడీగా ఆమె నటిస్తున్నారు. -
నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్నారు!
‘రాజ్ మల్హోత్రా, సిమ్రన్’.. పంతొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న యువతరాన్ని ఓ స్థాయిలో ప్రభావితం చేసిన జంట ఇది. ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉండేదంటే.. అబ్బాయిలంతా రాజ్‌గా, అమ్మాయిలంతా సిమ్రన్లా ఫీలైపోయేవారు. ఎటు విన్నా ఈ జంట పాడుకున్న యుగళగీతాలే. ఎక్కడ చూసినా... వీరి ప్రేమ ముచ్చట్లే. ఇంతకీ ఎవరీ రాజ్, సిమ్రన్? అనుకుంటున్నారా! వారెవరో కాదు. షారుక్‌ఖాన్, కాజోల్. ‘దిల్వాలే దుల్హనియా లేజాయింగే’ చిత్రంలో వారు నటించిన పాత్రల పేర్లు అవి. ఈ పాత్రలతో భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించారు షారుక్, కాజోల్. బాజీగర్, దిల్వాలే..., కుచ్ కుచ్ హోతాహై తదితర చిత్రాలతో భారతీయ ప్రేక్షకులకు ఇష్టమైన జంటగా పేరెన్నికగన్న ఈ జంటకు ప్రత్యేకంగా అభిమానులున్నారంటే... అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. త్వరలో వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు బాలీవుడ్ టాక్. ‘సింగమ్ రిటర్న్స్’ చిత్రం విజయంతో జోరుమీదున్న ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ దర్శకుడు రోహిత్ శెట్టి ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే షారుక్, కాజోల్ ఈ కథ విన్నారని, నటించడానికి పచ్చజెండా ఊపేశారని తెలిసింది. మళ్లీ వీరిద్దరూ కలిసి నటించే ఆ సినిమా... ప్రేక్షకులకు నిజంగా కనుల పండుగే అని చెప్పక తప్పదు. -
రూ.100 కోట్ల క్లబ్ లో సింగమ్ రిటర్న్స్!
ముంబై: అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటించిన 'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం వసూళ్లలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. తొలి రోజే రూ.30 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సింగమ్ రిటర్న్స్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రూ. 92 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 2014లో విడుదలై అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన జాబితాలో చోటు సంపాదించింది. తమిళ నటుడు సూర్య చేసిన సింగం 2 కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంటపండిస్తోంది. ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఆది నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. -
కన్నీళ్లు పెట్టుకున్నహీరో!
ముంబై:ప్రతీ ఒక్కరి జీవితంలో కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు రావంటే అది అతిశయోక్తే అవుతుంది. కన్నీళ్లు పెట్టుకోవడానికి రియల్ హీరో-రీల్ హీరో అనే తారతమ్యం కూడా ఏమీ ఉండదు. అటువంటి సందర్భమే ఒకటి బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ జీవితంలో కూడా తాజాగా చోటు చేసుకుంది. సింగమ్ రిటర్న్స్ విజయాన్ని ఆకాంక్షిస్తూ తన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాసిన లెటర్ చూసి అజయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ప్రస్తుతం పుణేలోని యర్రవాడ సెంట్రల్ జైల్లో ఉంటున్న సంజయ్ దత్ రాసిన ఉత్తరం అజయ్ ను మనసును కదిలించిందట. ఒక తెల్లటి రూల్ పేపర్ మీద బ్లూ -ఇంక్ తో సంజయ్ రాసిన లెటర్ లో సింగమ్ రిటర్న్స్ సందర్భంగా అజయ్ దేవగన్ కు అభినందనలు తెలియజేస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నాడు. ఇదే సందర్భంలో 2008లో వీరిద్దరూ కలిసి నటించిన 'మెహ్ బూబా' సినిమా సందర్భంలో వారు కలిసి డ్యాన్స్ చేసిన సన్నివేశాలను నెమరవేసుకున్నాడు. 'రాజు(అజయ్ ను సంజయ్ పిలుచుకునే పేరు) మనం తిరిగి కలిసినప్పుడు మన చేతి రాతతో రాసుకున్న పుస్తకాలను మార్చుకుందాం. ముందుగా ఈ లెటర్ రాస్తున్నాను. నువ్వు హీరోగా చేసిన సింగమ్ రిటర్న్స్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని లెటర్ లో తెలిపాడు. ఇక్కడ నువ్వు సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. నేను 11 కిలోల బరువు తగ్గాను. జైల్లో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నాను.నేను చొక్కా వేసుకోకుండా ఉన్నప్పుడు 8 ప్యాక్స్ కనిపిస్తుందని' సంజయ్ తెలిపాడు. ఈ లెటర్ చూసిన అనంతరం తనకు కన్నీళ్లు ఆగలేదని స్వయంగా అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. అంతకుముందు ఆ హీరోల తండ్రులు సునీల్ దత్, వీరూ దేవగన్ లు మధ్య ఉండే సాన్నిహిత్యాన్నే ఈ ఇద్దరూ కంటిన్యూ చేస్తుండటం నిజంగా గర్వించదగ్గ విషయమే. తమిళ హీరో సూర్య నటించిన సింగం-2 రీమేక్ గా వస్తున్న సింగమ్ రిటర్న్స్ లో అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
రోహిత్ శెట్టి మన్మోహన్ అంతటివాడు..
ముంబై: రోహిత్ శెట్టి తాజా సినిమా సింగమ్ రిటర్న్స్‌లో నటిస్తున్న కరీనా కపూర్ అతడిపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన నిన్నటితరం దర్శకుడు మన్మోహన్ దేశాయ్‌తో రోహిత్ పోటీపడగలడని కితాబిచ్చింది. ‘రోహిత్.. నేటితరం మన్మోహన్ దేశాయ్ వంటివాడు. అతణ్ని నేను ఇదే పేరుతో పిలుస్తాను. ప్రతి ఒక్క హీరోయిన్ ఇతని దగ్గర పనిచేయాలని కోరుకుంటుంది. నాకు గతంలోనూ మంచి అవకాశాలు ఇచ్చాడు’ అని వివరించింది. సింగమ్‌లో కాజల్ హీరోయిన్గా నటించినా, దీని సీక్వెల్లో మాత్రం బెబోకు అవకాశం వచ్చింది. రోహిత్‌కు తాను పెద్ద అభిమానిని కాబట్టే ఈ రెండో భాగంలో నటించేందుకు సంతోషంగా ఒప్పుకున్నానని వివరించింది. ‘ఇంతకుముందు కూడా అజయ్ దేవ్‌గణ్‌తోపాటు నటించాను కాబట్టి షూటింగ్ సెట్లు మా ఇల్లులాగే అనిపించాయి. ఇందులో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది’ అని కరీనా వివరించింది. సింగమ్ రిటర్న్స్ వచ్చే నెల 15న విడుదలవుతోంది. -
అనారోగ్యంలోనూ అదే అంకితభావం
ఇల్లే కదా స్వర్గసీమ అంటారు. అందరి ఇళ్ల గురించి పక్కన పెడితే ప్రముఖుల ఇళ్లు మాత్రం అలానే ఉంటాయి. అలాంటి ఓ పెద్ద భవంతి... అన్ని గదులకూ అందేలా సెంట్రలైజ్డ్ ఏసీ, పడవలాంటి కారు, పని చేసిపెట్టడానికి చిటికేస్తే వాలిపోయే మనుషులు.. క్రేజీ తారల జీవితం చాలా పసందుగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్లో మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కరీనా కపూర్ లాంటి తారలదైతే... రాణీవాసం అనే చెప్పాలి. కష్టం అనేది తెలియకుండా పెరిగిన ఈ సుకుమారి సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ఎర్రటి ఎండలను, ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా షూటింగ్స్‌లో పాల్గొంటారు కరీనా. అందుకే ‘అంకితభావానికి చిరునామా కరీనా’ అని హిందీ చిత్రసీమలో అంటూ ఉంటారు. ఆమె అంకితభావానికి తాజాగా ఓ ఉదాహరణ చెప్పాలి. ఇటీవల కరీనా కపూర్‌కు వైరల్ ఫీవర్ వచ్చింది. షూటింగ్లో హుషారుగా పాల్గొనే స్థాయిలో ఆమె ఆరోగ్యం లేదు. ఆ విషయం తెలియకుండా ‘సింగమ్ 2’ షెడ్యూల్‌ను ఆ చిత్రదర్శకుడు రోహిత్‌శెట్టి గోవాలో ప్లాన్ చేశారు. ఇందులో అజయ్ దేవగణ్ సరసన కరీనా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ దేవగణ్ నిర్మాత కూడా. రోహిత్‌శెట్టి, అజయ్ తదితర చిత్రబృందం గోవా చేరుకున్నారు. ఊరు కాని ఊరులో షూటింగ్ అంటే ఖర్చు బోలెడు అవుతుంది. పైగా షూటింగ్ రద్దయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల డేట్స్ వృథా అవుతాయి. ఫలితంగా నిర్మాత నష్టపోతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జ్వరాన్ని సైతం లెక్క చేయకుండా కరీనా ముంబయ్ నుంచి గోవా వెళ్లారు. మందులు తీసుకుంటూ, ఈ షూటింగ్లో పాల్గొన్నారు. ఆమె అంకితభావాన్ని చిత్రబృందం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. -
సరదాగా ఉంటుంది
కరీనా కపూర్, అజయ్ దేవ్గన్తో షూటింగ్ బాగా సరదాగా ఉంటుందని దర్శకుడు రోహిత్‌శెట్టి పేర్కొన్నాడు. ఈ జంటతో కలిసి సింగం-2 తీస్తున్న 41 ఏళ్ల రోహి త్... గతంలో అజయ్‌తో గోల్మాల్, గోల్మాల్ రిటర్న్స్-3 తదితర అనేక సినిమాలు తీశాడు. సింగం-2 తీస్తున్న సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ అజయ్ దేవ్గన్, కరీనా కపూ ర్ జంటగా మరోసారి సినిమా తీయడం ఆనందం కలిగి స్తోందన్నాడు. కరీనాకపూర్ మా కుటుం బ సభ్యురాలుగా, అజయ్ నాకు సోదరుడి మాదిరిగా అనిపిస్తుందన్నాడు. అందువల్లనే సెట్ వద్ద ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందన్నాడు. అసలు తనకు సినిమా షూటింగ్ చేస్తున్నట్టే ఉండదన్నాడు. కాగా కరీనా, అజయ్ జంటగా సింగంకు సీక్వెల్‌గా వస్తు న్న సింగం 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ‘ఈ సినిమాలో అజయ్ పోలీసు అధికారి బాజీరావ్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో కరీనాకపూర్ ప్రేయసి పాత్రలో కనిపిస్తుంది. గోవాలో 20 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మిగతా భాగమంతా ముంబైలో తీస్తాం. గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే భాగాన్ని గోవా పరిసరాల్లో తీస్తున్నాం’ అని అన్నాడు. కాగా 2003లో జమీన్ సినిమాతో రోహిత్... బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. 11 ఏళ్ల తన కెరీర్లో రోహిత్ తీసిన అనేక సినిమాలు బాగా ఆడాయి. దీంతో అతడిని హిట్ మిషన్ అంటూ అంతా ప్రశంసిం చారు. ‘ఇలాంటి పొగడ్తలు బాగానే అనిపించినప్పటికీ అదే సమయంలో ఒత్తిడి కూడా బాగానే ఉంటుంది. నేను హిట్ సినిమాలు తీయాలని అంతా ఆకాంక్షిస్తారు. అయితే ఇందుకోసం ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది’అని అన్నాడు. సింగం 2 తర్వాత షారుఖ్ కథానాయకుడిగా రోహిత్ మరో సినిమా తీసే అవకాశముంది. -
'కరీనా, అజయ్లతో షూటింగ్ సరదాగా ఉంటుంది'
న్యూఢిల్లీ: కరీనా కపూర్, అజయ్ దేవ్గణ్లతో షూటింగ్ బాగా సరదాగా ఉంటుందని దర్శకుడు రోహిత్‌శెట్టి పేర్కొన్నాడు. ఈ జంటతో కలిసి సింఘం-2 తీస్తున్న 41 ఏళ్ల రోహిత్... గతంలో అజయ్‌తో గోల్మాల్, గోల్మాల్ రిటర్న్స్-3 తదితర అనేక సినిమాలు తీశాడు. సింఘం-2 తీస్తున్న సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ అజయ్ దేవ్‌గణ్, కరీనా కపూర్ జంటగా మరోసారి సినిమా తీయడం ఆనందం కలిగిస్తోందన్నాడు. కరీనాకపూర్ మా కుటుంబ సభ్యురాలుగా, అజయ్ నాకు సోదరుడి మాదిరిగా అనిపిస్తుందన్నాడు. అందువల్లనే సెట్వద్ద ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందన్నాడు. అసలు తనకు సినిమా షూటింగ్ చేస్తున్నట్టే ఉండదన్నాడు. కాగా కరీనా, అజయ్ జంటగా సింఘంకు సీక్వెల్‌గా వస్తున్న సింఘం 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ‘ఈ సినిమాలో అజయ్ పోలీసు అధికారి బాజీరావ్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో కరీనాకపూర్ ప్రేయసి పాత్రలో కనిపిస్తుంది. గోవాలో 20 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మిగతా భాగమంతా ముంబైలో తీస్తాం. గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే భాగాన్ని గోవా పరిసరాల్లో తీస్తున్నాం’ అని అన్నాడు. 2003లో జమీన్ సినిమాతో రోహిత్... బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. -
అపార ప్రతిభాశాలి
భర్త సైఫ్ అలీఖాన్‌పై కరీనాకపూర్ ప్రశంసల జల్లు కురిపించింది. ప్రతి సినిమాలోనూ సైఫ్ ప్రతిభ తాలూకు మెరుపులు కనిపిస్తాయంది. ‘నేను బుల్లెట్ రాజా సినిమా చూశా. ఎంతో నచ్చింది. సైఫ్ ఎంతో ప్రతిభాశాలి. సినిమాల్లో ఆయన నటనను బాగా ఇష్టపడతాను. అటువంటి గొప్ప నటుడతను. విజయవంతమైనా లేదా కాకపోయినా ప్రతి సినిమాలోనూ సైఫ్ ప్రతిభ తాలూకూ మెరుపులు కనిపిస్తాయి’ అంటూ ప్రశంసించింది. సైఫ్ వ్యక్తిత్వం గొప్పదని, తెరపై ఆయన పర్సనాలిటీని ప్రేక్షకులు ఇష్టపడతారనేది తన భావన అని తెలిపింది. కాగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో త్వరలో రూపొందనున్న సింగం 2లో అజయ్ దేవ్‌గణ్ సరసన కరీనాకపూర్ నటించింది. కరీనాకపూర్ అనేక సినిమాల్లో అజయ్ దేవ్గణతో కలిసి నటించింది. సింగం-2 సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని కరీనా తెలిపింది. కాగా హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ‘శుద్ధి’ సిని మాలో కరీనా నటించకపోవచ్చని, ఆమెకు బదులు దీపికా పదుకొణేకి అవకాశం లభించొచ్చంటూ బాలీవుడ్లో వదంతులు వెల్లువెత్తాయి. అయితే దీనిని నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు కరణ్ మల్హోత్రాలు కొట్టిపారేశారు. అయితే ఈ వదంతులను కరీనాకూడా కొట్టిపారేసింది. ఇదంతా మీడియా సృష్టేనంది. వీటన్నింటికీ దూరంగా ఉంటానంది. -
ప్రశంసలకు పొంగిపోను:రోహిత్ శెట్టి
న్యూఢిల్లీ: గోల్మాల్ 1, 2, 3..., సింగం.. చెన్నై ఎక్స్‌ప్రెస్.. ఈ సినిమాల పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు రోహిత్ శెట్టి. వరుసగా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు సాధిస్తూ దర్శకుడిగా బాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ప్రత్యేకించి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత ఈ దర్శకుడికి ఉన్న పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. ఇలా వరుసగా హిట్ చిత్రాలను ఎలా అందించగలుగుతున్నారు? సినిమాలను ఎలా ప్లాన్ చేస్తున్నారు? అని రోహిత్‌ను అడిగితే... ‘హిట్లు... ఫ్లాప్‌లు.. మన చేతుల్లో లేవు. అలా వస్తుంటాయంతే. ఓ సినిమాను హిట్ చేయాలని ఎన్నో ప్లాన్‌ను వేసుకొని తెరకెక్కించినా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. ప్రేక్షకులు దానిని స్వీకరించడాన్నిబట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే హిట్లు సాధిస్తున్నానని, వందకోట్ల సినిమాల దర్శకుడినంటూ వినిపిస్తున్న ప్రశంసలతో పొంగిపోను. ఇదంతా నేను చేసిందేనని ఎప్పుడూ అనుకోను. ప్రేక్షకులు ఆదరించడం వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయి. ప్రతి సినిమాకు వందశాతం కష్టపడడం మాత్రమే నాకు తెలిసింది. అదే నేను చేస్తుంటా. ప్రస్తుతం సింగం-2 ప్రాజెక్టులో బిజీగా ఉన్నాను. స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పని కొనసాగుతోంది. ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశించడం కూడా సరికాదు. అందుకే ప్రతి చిన్న విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అని రోహిత్ శెట్టి తెలిపారు. -
200 కోట్ల మార్కును దాటిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండవ వారం పూర్తయ్యే సరికి చెన్నై ఎక్స్ ప్రెస్ 200 కోట్ల మార్కును దాటేసింది. మూడవ వారంలో కూడా కలెక్షన్లు భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో 75 కోట్ల వ్యయంతో యాక్షన్, కామెడి చిత్రంగా రూపొందింది. విదేశాల్లో కూడా ఈ చిత్ర కలెక్షన్లు భారీగానే ఉన్నయని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. తొలివారంలోనే ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు ఇంత భారీ వసూళ్లు ఏ సినిమాకీ లేవు. అది అద్భుతమైన వారాంతమని ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పారు. రంజాన్ సందర్భంగా ఆగస్టు తొమ్మిదో తేదీ శుక్రవారం నాడు విడుదలైన చెన్నై ఎక్స్‌ప్రెస్ కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్లు సంపాదించింది. -
పాక్‌లో దూసుకెళ్తున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్'
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా పాకిస్థాన్‌లో విడుదలై విజయఢంకా మోగిస్తుందని స్థానిక పత్రిక డాన్ గురువారం వెల్లడించింది. ఇద్ పండగ సందర్భంగా విడుదలైన ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందని పేర్కొంది. చెన్నై ఎక్స్‌ప్రెస్ విడుదలైన మొదటి రోజు మొదటి సినిమాకే పాక్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని తెలిపింది. బాక్స్ ఆఫిస్ వద్ద ఆ కనకవర్షం కరుస్తుందని విశ్లేషకులు అంచనాలను నిలబెట్టిందని చెప్పింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఈద్ పండగ రోజును విడుదలైంది. అయితే అదే రోజున విడుదలైన ఇష్క్ కుదా సినిమా ప్రజలను అంతగా ఆకట్టుకోలేదని కాప్రి సినిమా జనరల్ మేనేజర్ అజీజ్ ఖాన్ తెలిపారని డాన్ పేర్కొంది. అలాగే దేశంలో ఇటీవల విడుదలైన ఇతర చిత్రాలను కూడా వెనక్కి నెట్టి 'చెన్నై ఎక్స్‌ప్రెస్' పాక్‌లో దూసుకెళ్తుందని డాన్ తెలిపింది. -
చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా రివ్యూ!
బాద్షా, డూప్లికేట్, ఫిర్‌బీ దిల్ హై హిందుస్థానీ చిత్రాల తర్వాత కామెడీ, యాక్షన్ చిత్రాల్లో తరహా చిత్రాల్లో షారుక్‌ను చూడక బాలీవుడ్ అభిమానులు చాలా రోజులైంది. తొలినాళ్లలో షారుక్ యాక్షన్, కామెడి నేపథ్యం ఉన్న చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ మధ్యలో దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే లాంటి ప్రేమ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా ముద్ర వేసుకున్నాడు షారుక్. లవ్, రొమాన్స్ కథాంశాలతో మొన్నటి ‘జబ్ తక్ హై జాన్’ ఘోర పరాజయం వరకు అదే పంథాను కొనసాగించాడు. ‘జబ్ తక్ హై జాన్’ చిత్రం ఫ్లాప్ తర్వాత యాక్షన్, కామెడి అంశాల మేలవింపుతో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ద్వారా షారుక్ ముందుకు వచ్చాడు. తొమ్మిది నెలల గ్యాప్ తర్వాత దీపికా పదుకోనె,దర్శకుడు రోహిత్ శెట్టి, షారుక్ కాంబినేషనలో వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ కథ.. గొప్పగా చెప్పుకునేంత సీన్ ఉన్న కథ కాదు. ఉత్తర భారత దేశానికి చెందిన యువకుడు, దక్షిణాది అమ్మాయితో ప్రేమలో పడటం సింగిల్ లైన్ స్టోరి. రాహుల్ అనే యువకుడు తన తాత అస్థికలను రామేశ్వరంలో కలిపేందుకు బయలుదేరుతాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నిరాకరించి ఇంటి నుంచి పారిపోయిన మీనా చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో రాహుల్‌ని కలుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మీనా స్వంత గ్రామానికి రాహుల్ వెళ్లాల్సి వస్తుంది. అయితే మీనా స్వంత గ్రామంలో ఏమి జరిగింది. రాహుల్, మీనాల మధ్య ఎలా ప్రేమ చిగురించింది. రాహుల్, మీనాలు పెద్దవారిని ఎలా ఒప్పించారనే అంశాలతో తెరకెక్కిన సాదాసీదా ప్రేమకథ చెన్నై ఎక్స్‌ప్రెస్. అయితే దక్షిణాది కామెడీ ట్రాక్‌కు షారుక్ రొమాంటిక్ ఇమేజిని కలిపి దర్శకుడు రోహిత్ శెట్టి, యూనస్ సజావాల్ అందించిన స్క్రీన్ ప్లే, కేరళ అందాలు, అద్బుతమైన దూద్లే ఫోటోగ్రఫీలు సినిమాపై ప్రేక్షకుడు పట్టు సాధించేలా చేశాయి. మున్నార్, దేవికులమ్ లేక్, మీసాపులిమాలా, వాగవారా, కన్నిమాలా ప్రాంతాలు, దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అందాలను అద్బుతంగా తెరకెక్కిచడంలో కెమెరామెన్ దూద్దే సఫలీకృతమయ్యాడు. విశాల్, శేఖర్లు తమ సత్తాకు తగినంతగా సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. అయితే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నేపథ్యంగా తైలవర్ (లుంగీ డ్యాన్స్) పాట, కాశ్మీర్ మే తూ కన్యాకుమారి, ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ టైటిల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. షారుక్ ఖాన్‌కు రాహుల్ లాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రలో నటించడం కొట్టిన పిండే. రొమాంటిక్ టచ్‌తో యాక్షన్ హీరోగా షారుక్ చార్మింగ్‌గా కనిపించాడు. రొమాంటిక్ లవర్ బాయ్ పాత్రలో షారుక్ తప్ప మరొకర్ని ఊహించుకోవడం కష్టమనే రీతిలో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటనను ప్రదర్శించాడు. క్లైమాక్స్‌లో షారుక్ అదరగొట్టేశాడు. షారుక్ తన మార్క్ కామెడీ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక మీనా(మీనమ్మ)పాత్రలో దీపిక పదుకొనే అమాయకత్వంతోపాటు, చెలాకీతనంతో అద్బుతంగా ప్రదర్శించింది. తమిళ సాంప్రదాయ నేపథ్యం ఎక్కువగా ఉన్న ఈ చిత్రంలో దీపికా కట్టు,బొట్టు, క్యాస్టూమ్స్ ఓహో అనిపించేలా ఉన్నాయి. గ్లామర్‌గా కనిపించాలంటే అర్ధనగ్నంగా కనిపించాల్సిందే అనే ఫీలింగ్ ఉన్న ఈ రోజుల్లో.. కంచిపట్టు చీరలో మీనమ్మాగా దీపికా గతంలో ఎన్నడూ లేనంత అందంగా తెరమీద మెరిసింది. మీనా తండ్రిగా దుగేశ్వర పాత్రలో సత్యరాజ్ గంభీరంగా కనిపించాడు. ఇక విలన్ పాత్ర తంగబలీ పాత్రలో నికితిన్ ధీర్ పర్వాలేదనిపించాడు. అయితే కామెడీయే ప్రధాన నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం ఆ రేంజ్ లో లేకపోవడం ప్రేక్షకుడిని నిరాశపరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా షారుక్, దీపికా కెమిస్ట్రీని ఎంజాయ్ చేయాలనే టేస్ట్ ఉన్న అభిమానులకు, రిలాక్స్ కోసం ధియేటర్‌కు వెళ్లాలనుకునే ఫ్యామిలీ కేటగిరి ప్రేక్షకులకు చెన్నై ఎక్స్‌ప్రెస్ నచ్చడం ఖాయం. ఇక ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తే ఆ ఘనత షారుక్, దీపికాలకే దక్కుతుంది. షారుక్, దీపికలకు తగ్గట్టుగా కథను సిద్ధం చేసుకోకపోవడం దర్శకుడి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కథను పక్కన పెట్టి కథనంతోనే ప్రయోగం చేసేందుకు దర్శకుడు రోహిత్ శెట్టి సిద్ధమైనట్టు స్పష్టంగా కనిపించింది. విశేషాలు: దేశవ్యాప్తంగా 3500, విదేశాల్లో 700 థియేటర్లలో విడుదలైంది. భారతీయ సినిమాలకు పెద్దగా మార్కెట్‌లేని పెరూ, ఇజ్రాయిల్ దేశాతొలిసారి విడుదలైన బాలీవుడ్ చిత్రంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ రికార్డుల్లోకెక్కింది. అంతేకాకుండా నార్త్ అమెరికాలో 195 స్క్రీన్లలో, బ్రిటన్ 175 స్క్రీన్లతోపాటు మొరాకో, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాల్లో ప్రద ర్శనకు సిద్ధమవుతోంది. -
అలా ఎందుకు ఫిక్స్ అవుతారో - దీపికా పదుకోనె
ఎందుకు జనం అంత తొందరగా ఓ నిర్ణయానికి ఫిక్స్ అవుతారో నాకు అర్ధం కావడం లేదు అని అంటోంది దక్షిణాదికి చెందిన బాలీవుడ్ తార దీపికా పదుకోనె. మన సంస్కృతిని మనం ఎందుకు కించ పరుచుకుంటాం. నేను, దర్శకుడు రోహిత్ శెట్టి దక్షిణాది ప్రాంతానికి చెందిన వాళ్లమే. చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో షారుక్ ఖాన్ తప్ప మిగితా నటులంతా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందినవారేనని స్పష్టం చేసింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో తమిళ భాషను కించపరిచేలా చిత్రీకరించారని వస్తున్న ఆరోపణలను దీపిక ఖండించింది. గతంలో పంజాబ్ ఆధారంగా చేసుకుని చిత్రాలు రూపొందాయని.. ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమపైనే ఆధారపడి చిత్రాలు నిర్మిస్తున్న తరుణంలో తాము దక్షిణాది భాషను కించపరుస్తామని ఎలా భావిస్తారన్నారు. తమిళ భాషను హాస్యం కోసమే వాడుకున్నామని.. ఆ భాషను అపహాస్యం చేసే విధంగా ఎక్కడ ప్రయత్నించలేదని దీపిక తెలిపింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో ఉత్తర భారతీయుడ్ని ప్రేమించిన తమిళ అమ్మాయిగా దీపిక పదుకోనె నటిస్తోంది. -
చెన్నై ఎక్స్ ప్రెస్ ప్రమోషన్ స్టిల్స్
చెన్నై ఎక్స్ ప్రెస్ ఇంటిల్లిపాది కలిసి చూసే చిత్రం అని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్య పరిస్థితి సహకరించకున్నా.. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో బిజిబిజీగా ఉన్నారు. ఓం శాంతి ఓం చిత్రం తర్వాత దీపికా పదుకోనే, షారుఖ్ లను కలిపి దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించిన చిత్రం ఆగస్టు 9 తేదిన విడుదలయ్యేందుకు సిద్ధమైంది. దీవానా, డర్, బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రాల్లాగే అటు ఫ్యామిలీ, ఇటు మాస్ అభిమానులను చెన్నై ఎక్స్ ప్రెస్ ఆకట్టుకుంటుందని షారుఖ్ ధీమా వ్యక్తం చేశాడు. -
'ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ కోసమే చెన్నై ఎక్స్ ప్రెస్'
'చెన్నై ఎక్స్ ప్రెస్' ఇంటిల్లిపాది కలిసి చూసే చిత్రం అని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్య పరిస్థితి సహకరించకున్నా.. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో బిజిబిజీగా ఉన్నారు. ఓం శాంతి ఓం చిత్రం తర్వాత దీపికా పదుకోనే, షారుఖ్ లను కలిపి దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించిన చిత్రం ఆగస్టు 9 తేదిన విడుదలయ్యేందుకు సిద్ధమైంది. దీవానా, డర్, బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రాల్లాగే అటు ఫ్యామిలీ, ఇటు మాస్ అభిమానులను చెన్నై ఎక్స్ ప్రెస్ ఆకట్టుకుంటుందని షారుఖ్ ధీమా వ్యక్తం చేశాడు. గత పదేళ్లుగా రోహిత్ శెట్టి చిత్రాలను నిర్మించడంతోపాటు గోల్ మాల్ చిత్రంతో విజయాన్ని సాధించాడని.. ఇక చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం తర్వాత సూపర్ హిట్ అందించిన దర్శకుల జాబితాలో ఆయన చేరడం ఖాయమన్నారు. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో కామెడీ, డ్రామా, రొమాన్స్ , యాక్షన్ తోపాటు అన్ని రకాల వెరైటీలతో రోహిత్ చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని అందించాడని షారుఖ్ అభినందించాడు. ఇటీవల భుజానికి గాయం కారణంగా చేయించుకున్న సర్జరీని లెక్క చేయకుండా షారుఖ్... శెట్టి, దీపికా పదుకోనెలతో కలిసి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.