అల్లు అర్జున్‌పై బాలీవుడ్‌ డైరెక్టర్ల ప్రశంసలు, ఎందుకంటే.. | Rohit Shetty And Karan Johar Thanks To Allu Arjun Over His Comments On Movie Industry | Sakshi
Sakshi News home page

Allu Arjun: భారత సినీ పరిశ్రమపై బన్నీ కామెంట్స్‌, బాలీవుడ్‌ డైరెక్టర్ల హర్షం..

Published Thu, Oct 28 2021 6:35 PM | Last Updated on Thu, Oct 28 2021 7:19 PM

Rohit Shetty And Karan Johar Thanks To Allu Arjun Over His Comments On Movie Industry - Sakshi

Director Rohit Shetty And Karan Johar Reacts On Allu Arjun Comments Over Indian Movie Industries: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత ప్రశంసలు కురిపించారు. బుధవారం జరిగిన వరుడు కావలెను ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు బన్నీ ముఖ్య అతిథీగా హజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ కరోనా కారణంగా సినీ ప​రిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, ఇప్పుడిప్పుడే మహమ్మారి ప్రభావం తగ్గడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు థియేటర్లోకి వస్తున్నారని పేర్కొన్నాడు. ఇప్పటి నుంచి భారత సినీ పరిశ్రమలో అన్ని పెద్ద పెద్ద సినిమాలే రాబోతున్నాయన్నాడు. అన్ని ఇండస్ట్రీల వారు బాగుండాలని ఆశించాడు.

చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్‌ చెఫ్‌ నిర్వాహకులు

భారత సినీ పరిశ్రమలను ఉద్దేశించి బన్నీ వ్యాఖ్యలపై హందీ సూర్యవంశీ మూవీ దర్శకుడు రోహిత్‌ శెట్టి, నిర్మాత కరణ్‌ జోహార్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ట్వీట్‌ చేస్తూ బన్నీకి ధన్యవాదాలు తెలిపారు. ‘‘సినిమా అనేది నా ఒక్కడిదే కాదు. మనందరిదీ’ ఈ మాటనే నేను ఎక్కువగా నమ్ముతాను. మా చిత్రానికి విషెస్‌ తెలిపినందుకు థాంక్యూ బ్రదర్‌. మీరు నిజంగా రాక్‌స్టార్‌’ అలాగే మీరు నటించిన ‘పుష్ప’ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని రోహిత్‌ ట్వీట్‌ చేయగా  దీనికే ‘థ్యాంక్యూ బన్నీ.. నువ్వు నిజంగానే సూపర్‌స్టార్‌’ అని కరణ్‌ జోహార్‌ రీట్వీట్‌ చేశాడు. 

చదవండి: Allu Arjun : ఇండస్ట్రీలో అన్ని విభాగాల్లోకి మహిళలు రావాలి..

ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తెలుగులో ‘‘వరుడు కావలెను, రొమాంటిక్‌’, తమిళ్‌లో రజనీకాంత్‌గారి ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగీ 2’, హిందీలో ‘సూర్య వంశీ’.. సినిమాలు విడుదలవుతున్నాయి.. అన్ని సినిమాలూ హిట్‌ అవ్వాలి’’ అని హీరో అల్లు అర్జున్‌ ఆశించాడు. అలాగే ఈ డిసెంబరు 17న ‘పుష్ప’ తో తాము వస్తున్నామని, ఈ మూవీ అందరికి నచ్చాలని కోరుకుంటున్నాన్నాడు. ఇక ఎంటైర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి బన్నీ ఈ సందర్భంగా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ఈ దీపావళికి భారతీయ సినిమా మునుపటిలా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్‌ చేస్తుందనే నమ్మకం ఉందని అల్లు అర్జున్‌ ధీమా వ్యక్తం చేశాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ‘రొమాంటిక్‌’ ప్రీమియర్‌ షోలో స్టార్స్‌ సందడి, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement